ఆ కుటుంబాల గుప్పిట్లోనే 'తెలుగు సినీ పరిశ్రమ' | Ponguleti Sudhakar Reddy thanks to KCR due to Land Allotted to Telugu Film industry | Sakshi
Sakshi News home page

ఆ కుటుంబాల గుప్పిట్లోనే 'తెలుగు సినీ పరిశ్రమ'

Published Sat, Aug 2 2014 10:28 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

ఆ కుటుంబాల గుప్పిట్లోనే 'తెలుగు సినీ పరిశ్రమ' - Sakshi

ఆ కుటుంబాల గుప్పిట్లోనే 'తెలుగు సినీ పరిశ్రమ'

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ కేవలం నాలుగు కుటుంబాల కబంధ హస్తాల్లో చిక్కుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్లో ఆరోపించారు. తెలంగాణ నిర్మాతలు, కళాకారులకు సీని పరిశ్రమలో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు రెండు వేల ఎకరాలు కేటాయిస్తామన్న.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటనను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఫిలింనగర్ సొసైటీలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో చిత్ర పరిశ్రమకు చెందిన వారి నిర్మాణాలపై విచారణ జరిపించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement