సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వంపై సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. దివంగత నేత ఇందిరాగాంధీని హిట్లర్‌తో పోలుస్తూ.. దోషిగా చిత్రీకరించే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. ఇందిరా గాంధీ ఈ దేశానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని ఆయన గుర్తు చేశారు. భారత్‌లో ఆమెది చెరగని ముద్ర అన్నారు. రాజకీయల కోసం బీజేపీ ఎమర్జెన్సీని వాడుకుంటోందని పొంగులేటి ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రంలో ఓ ఎంపీ దీక్ష చేస్తున్నారు.. కేసీఆర్ దాన్ని చూసైనా కళ్ళు తెరవాలని పొంగులేటి పేర్కొన్నారు.
‘ఇందిరా గాంధీపై జరుగుతున్న దాడి రాజకీయ కుట్రలో భాగమే. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశ సార్వభౌమాతృత్వంపై దాడి జరుగుతోంది. విభజన చట్టం అమలు కోసం మేము వేసిన పిటిషన్‌లో తెలంగాణ సర్కార్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయాలి. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తున్నాము. అఖిలపక్షంలో కలిసి సీఎం కేసీఆర్ కేంద్రంపై వత్తిడి తీసుకురావాలి. పీసీసీ ఆధ్వర్యంలో దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానికి లక్ష పోస్ట్ కార్డులతో ఉత్తారాలు రాస్తున్నాం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలపై పార్టీల కతీతంగా పోరాడాలి. కలిసిరాని పార్టీలు ద్రోహులుగా మిగిలిపోతాయి. అగ్రిగోల్డ్ తెలంగాణ బాధితులకు న్యాయం కోసం హైకోర్ట్ కమిటీ వేసింది. చీఫ్ సెక్రెటరీ దీనిపై మానిటరింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయాలని’ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment