'స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కొత్త విషయం కాదు'
హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ యాంత్రీకరణ, పంటల మార్పిడి విధానాలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గిట్టుబాటు ధర కోసం ఈ-మార్కెటింగ్ విధానం తీసుకొస్తామన్నారు. మార్కెటింగ్ కోసం నిపుణులతో కన్సల్టెన్సీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వ్యవసాయ శాఖ ఉద్యోగుల కేలండర్ ను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నట్టు చెప్పారు. రుణమాఫీలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నది కొత్త విషయం కాదని, 1973 నుంచి ఆర్ బీఐ అమలు చేస్తోందన్నారు.