
ద్వారకాతిరుమల: సైకిల్ పోవాలి.. సైకిల్ పోవాలి.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, జోన్–2 ఇన్‌చార్జి ప్రత్తిపాటి పుల్లారావు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మద్దిపాటి వెంకట్రాజు మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని హంగు చేయాలని, జన సమీకరణ భారీ ఎత్తున జరపాలని అనుకున్నారు.
గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు తారాస్థాయికి చేరడంతో మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు అనుచర గణం ఈ కార్యక్రమానికి దూరంగా ఉంది. జనసమీకరణ లేక ఫ్లాప్ షోగా మారింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సైకిల్ పోవాలి.. సైకిల్ పోవాలని నినాదాలు చేశారు. దాంతో అక్కడున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా షాకయ్యారు. అంతలోనే తేరుకున్న ప్రత్తిపాటి సారీ.. సారీ.. అంటూ తన ప్రసంగాన్ని ముందుకు సాగించారు.
Comments
Please login to add a commentAdd a comment