Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

HCU Land Row: BJP Visit Protests Continue At University April 1st Updates1
HCUలో భూ రగడ.. ఓయూలో ఉద్రిక్తత

హైదరాబాద్‌, సాక్షి: హెచ్‌సీయూలో ఉద్రికత్త నెలకొంది. యూనివర్సిటీ ముట్టడికి సీపీఎం, బీజేవైఎం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో హెచ్‌సీయూ భూములపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఇద్దరూ హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులే. HCU వెళ్తే ఆ ఇద్దరు మంత్రులు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? క్యాబినెన్‌లో మంత్రుల మధ్య ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా తెలుస్తుంది. రాబర్ట్ వాద్రా కోసమే భూములు అమ్మకానికి పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్.. హెచ్‌సీయూ గురించి మాట్లాడుతున్నారు. BRS, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. BRS చేసిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. భూముల వేలం ఆపడానికి ఉద్యమిస్తాం.అభివృద్ధి అంటే భూముల అమ్మకమా?’ అని ప్రశ్నించారు.పార్లమెంట్‌కు చేరిన హెచ్‌సీయూ భూముల రగడ :రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్హెచ్‌సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపివేయాలిపర్యావరణాన్ని కాపాడాలిఅరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయిఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్సీయూ భూముల్లో బుల్డోజర్లు నడిపించారుహెచ్సీయూ భూముల అమ్మకంపై పోరాడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారుభూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారుఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దు తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదురాహుల్, రేవంత్ రాజ్యాంగం నడుస్తుందిమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం:కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న 11మంది మంత్రులుసీఎం ఎందుకు మీటింగ్ పెట్టారనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్అధికారులపై విద్యార్థుల దాడి : డీసీపీ వినీత్‌హెచ్‌సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలుఇటు ఉస్మానియాలో ఆందోళన బాట పట్టిన విద్యార్థులు హెచ్‌సీయూ భూములపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ విజ్ఞప్తిప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం టీజీఐఐసీ ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు అడ్డుకున్న విద్యార్థులు అధికారులు, కార్మికులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని డీసీపీ వినీత్‌ వెల్లడిహెచ్‌సీయూ భూముల వివాదంపై హైకోర్టులో పిటిషన్‌ :కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వట ఫౌండేషన్‌కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవంగా ప్రకటించాలని పిటిషన్‌అత్యవసర పిటిషన్‌గా విచారణకు స్వీకరించాలని కోరిన వట ఫౌండేషన్‌ లాయర్‌రేపు విచారణకు స్వీకరిస్తామని తెలిపిన హైకోర్టు యూనివర్సిటీ భూముల్ని పరిశీలించేందుకు బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, ధన్‌పాల్‌ సూర్యనారయణతోపాటు ఇతర బీజేపీ నేతలు యూనివర్సిటీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. హెచ్‌సీయూ భూమల వేలం వ్యవహారంపై ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో నిరసనల్ని ఉద్ధృతం చేయాలని విద్యార్థులు నిర్ణయించారు. బీజేపీ విద్యార్థి యువజన విభాగం హెచ్‌సీయూని ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద ఉద్రికత నెలకొంది. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోనున్నారు. ఈ తరుణంలో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU) క్యాంపస్‌ అట్టుడికిపోతోంది. ఇవాళ్టి నుంచి పోరాటం ఉధృతం చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో తరగతుల్ని బహిష్కరించి ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఒకవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు HCU సందర్శన వేళ.. హైదరగూడ MLA క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వద్దకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీని సందర్శిస్తామని అంటోంది. ఇప్పటికే భూముల వేలం పై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. తద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది. ఇప్పటికే యువ మోర్చా ఆధ్వర్యంలో HCU భూముల వేలానికి వ్యతిరేకంగా పోరాటం నడుస్తోంది.మరోవైపు.. వామపక్ష పార్టీలు సైతం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆందోళనకు సిద్ధమైంది. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అమ్మకాన్ని ప్రభుత్వ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌తో సీపీఐ, సీపీఎంలు నిరసన చేపట్టబోతున్నారు. హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన అణచివేతకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం కేబీఆర్‌ పార్కు వద్ద బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది’.. ‘హెచ్‌సీయూ అడవి నరికితే.. హైదరాబాద్‌ ఊపిరి ఆగుతుంది‘ అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో బీఆర్‌ఎస్‌వీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి, పలువురు ప్రకృతి ప్రేమికులు మద్దతు తెలిపారు.కంచె గచ్చిబౌలి భూములపై ఇప్పటికే టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ వెల్లడించింది. వేడెక్కిన క్యాంపస్‌ హెచ్‌సీయూలో 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. సదరు స్థలాన్ని పొక్లెయిన్‌లతో చదును చేస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తు‍న్నారు. గత రెండురోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలతో HCU మొత్తం ఇప్పుడు పోలీసు పహారాలో ఉంది.

Ration Rice Row: Perni Nani Challange Kutami Prabhutam2
వేధింపులకు భయపడేది లేదు.. వైఎస్సార్‌సీపీని వీడేది లేదు: పేర్ని నాని

కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయకుండా.. వ్యవస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటోందని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) మండిపడ్డారు. రేషన్‌ బియ్యం వ్యవహారంలో కృష్ణా జిల్లా పోలీసులు హైకోర్టును సంప్రదించిన పరిణామంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘మేం ఏపాపం చేయలేదని పోలీసు వ్యవస్థకు తెలుసు. ప్రభుత్వానికి జరిగిన నష్టానికి రెట్టింపు జమచేశాం. అయినా నా భార్య జయసుధ పై ఏడు సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షను పెట్టి అరెస్టు చేయాలని చూశారు. ఆ సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని జిల్లా కోర్టు నా భార్యకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు నా భార్యకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.. మా కుటుంబంపై తప్ప సివిల్ సప్లై శాఖ(Civil Supply Ministry) ఇంతవరకూ ఎవరిపైనా ఒక్క క్రిమినల్ కేసు పెట్టలేదు. అసలు సివిల్‌ సప్లై శాఖ అనేది ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఎవరిపైనా క్రిమినల్‌ కేసులు లేవు. సాక్షాత్తూ సివిల్ సప్లై మంత్రి వెళ్లి 22 వేల టన్నుల బియ్యం పట్టుకున్నా కేసు లేదు. సీజ్ ద షిప్‌.. సీజ్‌ ద గోడౌన్ అన్నా.. ఎవరిపైనా క్రిమినల్ కేసు లేదు. వాళ్లపై పెట్టింది కేవలం 6A కేసు మాత్రమే. నాకు ముందు కానీ నా తర్వాత కానీ ఒక్కరి పైన కూడా క్రిమినల్ కేసులు పెట్టలేదు. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నాపై, నా భార్యపై క్రిమినల్‌ కేసులు పెట్టారు... ఎన్నో జరుగుతున్నా అన్నీ 6A కేసులే. ఈ పరిస్థితి చూస్తేనే వాళ్ల దిగజారుడుతనం తెలుస్తోంది. నన్ను, నా భార్యను, నా కొడుకును ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొంటాం. ఆఖరికి జైలుకు అయినా పోతాం. అంతేగానీ వైఎస్సార్‌సీపీ(YSRCP) నుంచి తప్పుకునేది లేదు. ఎల్లప్పుడూ జగన్ వెంటే ఉంటాం. కూటమి తప్పుల్ని ఎంగడుతూనే ఉంటాం’’ అని పేర్ని నాని అన్నారు.

Are you trying Ghibli images How safe was it Check Details Here3
Ghibli ఫొటోలు ట్రై చేస్తున్నారా?.. ఇది మీకోసమే!

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్, వాట్సాప్‌.. ఇలా ఏ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ ఓపెన్‌ చేసినా ఫీడ్‌ మొత్తం జిబ్లీ(Ghibli) ఫొటోలతో నిండిపోతోంది. సామాన్యులు, సినీ తారలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు.. ఇలా అంతా కార్టూన్‌ తరహా ఫొటోలను పంచుకుంటూ మురిసిపోతున్నారు. ఎడాపెడా ఫొటోలు అప్‌లోడ్‌ చేస్తుండడంతో.. నెట్టింట ఈ నయా ట్రెండ్ ఊపేస్తోంది. అయితే అలా అప్‌లోడ్‌ చేసే ముందు ఇది ఎంతవరకు సురక్షితం అనే ఆలోచన మీలో ఎంతమంది చేస్తున్నారు?.. ఏఐ బేస్డ్ చాట్‌బాట్‌ యూజర్లను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి‌. ఇందులో భాగంగానే.. ఓపెన్‌ ఏఐ సంస్థ ఇటీవల చాట్‌జీపీటీలో (ChatGPT) జిబ్లీ స్టూడియోను ప్రవేశపెట్టింది. తమకు కావాల్సిన ఫొటోను ఎంచుకుని.. ఫలానా స్టైల్‌లో కావాలని కోరితే చాలూ.. ఆకర్షనీయమైన యానిమేషన్‌ తరహా ఫొటోలను సృష్టించుకోవచ్చు. ఈ ట్రెండ్‌ విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావడంతో ఇతర ఏఐ ప్లాట్‌ఫామ్‌లు సైతం ఇవే సదుపాయాన్ని అందిస్తున్నాయి. అయితే ఆ వాడకం పరిధి దాటి శ్రుతిమించి పోతోంది. ఎంతవరకు సురక్షితం?ఏదైనా మనం ఉపయోగించినదాన్ని బట్టే ఉంటుంది. అది సాంకేతిక విషయంలో అయినా సరేనని నిఫుణులు తరచూ చెబుతుంటారు. అలాగే జిబ్లీ స్టైల్‌ ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. సృజనాత్మకత మరీ ఎక్కువైపోయినా.. భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. మరోవైపు వ్యక్తిగతమైన ఫొటోలను ఏఐ వ్యవస్థల్లోకి అడ్డగోలుగా అప్‌లోడ్‌ చేస్తే.. అవి ఫేషియల్‌ డాటాను సేకరించే ప్రమాదమూ లేకపోలేదని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. ఇలాగే కొన్ని కంపెనీలు వ్యక్తిగత డాటాను తమ అల్గారిథమ్‌లలో ఉపయోగించుకుంటున్న పరిస్థితులను నిపుణులు ఉదాహరిస్తున్నారు.అలాంటప్పుడు ఏం చేయాలంటే..వ్యక్తిగత ఫొటోలను అప్‌లోడ్‌ చేసేటప్పుడు.. ఆ జనరేటర్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ప్రైవసీ పాలసీల విషయంలో నమ్మదగిందేనా? కాదా? అనే విషయాన్ని నిర్ధారించుకోండి. అందుకోసం సదరు జనరేటర్‌ గురించి నెట్‌లో క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికి యూజర్లు ఇచ్చే రివ్యూలను చదవాలి. అన్నికంటే ముఖ్యమైన విషయం.. సున్నితమైన అంశాల జోలికి పోకపోవడం. చిన్నపిల్లల ఫొటోలను ప్రయత్నించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమంగా ప్రముఖుల ఫొటోలను ప్రయత్నించకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో ఇది చట్టపరమైన చర్యలకు అవకాశం కూడా ఇచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ప్రస్తుతానికి.. ఛాట్‌జీపీటీ, గూగుల్‌ జెమినీ, ఎక్స్‌ గ్రోక్, డీప్‌ఏఐ, ప్లేగ్రౌండ్‌ఏఐలు.. పరిమితిలో ఉచితంగా,అలాగే పెయిడ్‌ వెర్షన్‌లలోనూ రకరకాల ఎఫెక్ట్‌లతో ఈ తరహా ఎఫె​‍క్ట్‌లను యూజర్లకు అందిస్తున్నాయి. వీటితో పాటు జిబ్లీ ఏఐ కూడా స్టూడియో జిబ్లీస్టైల్‌ ఆర్ట్‌ వర్క్‌తో ఫొటోలను చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. నోట్‌: పర్సనల్‌ డాటా తస్కరణ.. సైబర్‌ నేరాలు పెరిగిపోతున్న రోజుల్లో ఏ టెక్నాలజీని అయినా.. అదీ సరదా కోణంలో అయినా ఆచితూచి.. అందునా పరిమితంగా వాడుకోవడం మంచిదనేది సైబర్‌ నిపుణుల సూచన.

Ksr Analysis On Pawan, Bjp Politics4
పవన్‌ను వాడుకోవడం.. ఇప్పుడు బీజేపీ వంతు!

అవసరమైతే తమిళనాడుకు కూడా పార్టీని విస్తరిస్తానంటున్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌! వినడానికి బాగానే అనిపించినా ఆయన చెప్పిందైతే వాస్తవం! ఎలాగంటారా? ఏపీలోనే సొంతబలం లేదు కదా? ఇతర రాష్ట్రాలలో ఏం చేయగలుగుతారని మీకు అనిపించవచ్చు. అదే తమాషా రాజకీయం! ఇదంతా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ అని అందులో ఈయన ఒక పావుగా మారుతున్నారని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. వామపక్షాల వారైతే బహిరంగంగానే ఈ విమర్శలకు దిగుతున్నారు.రాజకీయాలలోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలలో దేవాలయాలను సందర్శించారు. అది కూడా బీజేపీ మాట మేరకే అని ఒక విశ్లేషణ. ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది. ఇందుకోసం మళ్లీ అన్నా డీఎంకేతో జత కట్టడానికి పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా ఇందుకు దాదాపు సిద్దమవుతున్నట్లుగానే వార్తలు వస్తున్నాయి. డీఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వినతిపత్రాలు సమర్పించడానికి ఢిల్లీ వళ్లారు. గతంలో బీజేపీతో పొత్తు ఉన్నా, లోక్‌సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు. కానీ డీఎంకే మొత్తం స్వీప్ చేసింది. ఆ పార్టీ తమిళనాడులో బలంగా వేళ్లూనుకుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే బలహీనపడింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన అన్నాడీఎంకేలో ఏర్పడిందని చెబుతున్నారు.ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఈ కూటమిలో చేరతారా? లేదా? అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. తమ కూటమికి సినీ రంగు అద్దడానికి, తమిళనాడులోని తెలుగు వారిని కొంతమేర ఆకర్షించడానికి పవన్ కళ్యాణ్‌ను ప్రయోగించాలని బీజేపీ తలపెట్టిందని అంటున్నారు. ఒకప్పుడు కులం ఏమిటి? మతం ఏమిటి అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏకంగా సనాతని వేషం కట్టి దక్షిణాది రాష్ట్రాలు తిరిగి వచ్చారు. ఒక ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల క్రితం తమిళ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఏపీలో కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే వచ్చినా, టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలషిస్తున్నారు.పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా వత్తాసు పలుకుతున్నారు. పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని అంటున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ సీఎం కాకుండా అడ్డుపడడానికే ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నా, అవసరమైతే తన పదవి కోసం లోకేశ్‌కు కూడా విధేయత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కొందరి భావన.చంద్రబాబు ఎప్పుడైనా మళ్లీ బీజేపీని వ్యతిరేకించినా, లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా, పవన్ కళ్యాణ్‌ను ప్రొజెక్టు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు ఏపీలో పెద్దగా ఓట్లు రాకపోయినా లేకపోయినా, ఆయన సినిమా ఇమేజీని వాడుకుని ఇతర రాష్ట్రాలలో ప్రొజెక్టు చేస్తే దాని ప్రభావం ఏపీపై కూడా ఉండవచ్చన్నది ఒక అంచనా అట.తెలంగాణలో గతంలో బీజేపీ జనసేనతో కలిసి పోటీచేసినా ఫలితం పెద్దగా లేకుండా పోయింది. జనసేన ఒక్క చోట తప్ప పోటీ చేసిన అన్నిచోట్ల డిపాజిట్లు కోల్పోయింది. కాని సనాతని వేషం కట్టి ఇతర రాష్ట్రాలలో పర్యటించడం, ఇప్పుడు తమిళనాడుపై దృష్టి కేంద్రీకరించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు ఒక చెక్ గా పవన్ ఉండే అవకాశం ఉంటుంది. బీజేపీ వారు చెప్పినట్లు ప్రచారం చేసి వారితో ఆయన మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలిగితే సమీప భవిష్యత్తులో లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయడం, లేదా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి కుదరకపోవచ్చు. అన్నాడీఎంకే, బీజేపీ కూటమిలో చేరినా తమిళనాడులో జనసేన ఎంతవరకు సఫలం అవుతుందన్నది సందేహమే. సినీ నటుడు కూడా కనుక ప్రచారానికి ఈయనను వాడుకోవచ్చు. అందుకే యథా ప్రకారం పవన్ కళ్యాణ్ ఏపీలో ఎలాంటి అబద్దాలు ఆడారో, అదే తరహాలో తమిళనాడులో కూడా ట్రయల్ ప్రారంభించినట్లు అనిపిస్తుంది.ఉదాహరణకు ఆయనకు తమిళ కవి భారతీయార్ పై అభిమానం ఉందని చెప్పడం, శివాజీ గణేశన్‌కు అభిమానినని, 1982 నుంచి 1995 వరకు చెన్నైలో ఉన్నానని చెప్పడం, మైలాపూర్ పాఠశాలలో చదువుకున్నానని అనడం, కూరగాయల మార్కెట్ కు వెళ్లి తమిళం నేర్చుకున్నానని వెల్లడించడం చూస్తే వీటిలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎన్ని అబద్దాలు ఉన్నాయో ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పవన్ తన పుట్టిన స్థలం, చదువు గురించి మాత్రమే కాదు..అనేక అంశాలలో ఎన్ని రకాలుగా మాటలు మార్చింది ఏపీ ప్రజలకు తెలుసు. అన్నాడీఎంకే, బీజేపీ కలిస్తే తప్పులేదని, అన్నా డీఎంకేతో జనసేన పొత్తు పెట్టుకోవచ్చని ఆయన అన్నారు. ఇక పిఠాపురంలో హిందీకి అనుకూలంగా మాట్లాడి, తమిళ నేతలను పరోక్షంగా విమర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ మాత్రం మాట మార్చారు. భాషను బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. తద్వారా తమిళ సెంటిమెంట్‌కు అనుకూలంగా మాట్లాడినట్లు కనిపించే యత్నం చేశారన్న మాట.పిఠాపురంలో తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేసుకుని సొమ్ము చేసుకుంటున్నప్పుడు హిందీని వ్యతిరేకించడం ఏమిటని అన్నారు. హిందీని రుద్దవద్దన్నది మాత్రమే తమిళ పార్టీల డిమాండ్. ఇదే అంశంపై అన్నాడీఎంకే కూడా అమిత్‌షా కు విన్నవించింది. పవన్ కళ్యాణ్ మరో ఆశ్చర్యకరమైన అంశం చెప్పారు. 2014లో పార్టీని ప్రారంభించినప్పుడు కనుచూపు మేర చీకటి కనిపించిందని, ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదని, మనసులో ధైర్యం తప్ప మరేమీ లేవని ఆయన అన్నారు. ఇది సత్య దూరమైందో, కాదో ఆయనే ఆలోచించుకోవాలి. జనసేన పార్టీని స్థాపించడం, ఆ వెంటనే చంద్రబాబు కోరిక మేరకు మద్దతు ఇవ్వడం, కనీసం పోటీ కూడా చేయక పోవడం, తదుపరి టీడీసీ కూటమి ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేయడం జరిగాయి. చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా స్పెషల్ విమానాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ నుంచి తరలి వెళ్లేవారు. మరి ఇందులో ఆయనకు చీకటి కనిపించడం ఏమిటో తెలియదు. కాకపోతే 2019లో బీఎస్పీ, వామపక్షాలతో పోటీచేసి ఓటమి చెందినప్పుడు చీకటి కనిపించి ఉండవచ్చు. తన పార్టీ ఒకే సీటు గెలవడం, తనే రెండు చోట్ల ఓడిపోయారప్పుడు. 2019లో కూడా చంద్రబాబుతో పరోక్ష పొత్తు ఉందన్న ఆరోపణలు లేకపోలేదు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై మొదట పార్లమెంటులో మాట్లాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. అంతే తప్ప దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే తాను కూడా పోరాడతానని చెప్పలేక పోయారు. అదే టైమ్‌లో దక్షిణాదిలో లోక్ సభ సీట్లు తగ్గవని నమ్ముతున్నట్లు ఆయన చెబుతున్నారు.ఏపీలో పార్టీ విస్తరణకు ప్రత్యేకంగా ఎలాంటి అడుగులు వేయకపోయినా, జనసేన నేతలు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాలలో టీడీపీ వారి పెత్తనం కింద నలిగిపోతున్నా, పట్టించుకోని పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని చెబుతున్నారు. చంద్రబాబుతో కలిసి చేసిన సూపర్ సిక్స్ అనే అబద్దాల వాగ్దానాలను తమిళనాడులో కూడా చెబుతారేమో తెలియదు. ఈ ఇంటర్వ్యూలలో ఆ జర్నలిస్టులు ఏపిలో ఎన్డీయే కూటమి హామీల అమలు తీరుతెన్నుల గురించి ఒక్క ప్రశ్న కూడా వేసినట్లు కనిపించదు. ముందస్తుగా మాట్లాడుకుని ఉంటే ఇబ్బంది లేని ప్రశ్నలే వేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ విప్లవవీరుడు చెగువెరా మొదలు టిడిపి అధినేత చంద్రబాబు వరకు, ప్రధాని మోడీ వరకు ఎన్ని రంగులు మార్చారో ,ఇప్పుడు తమిళనాడులో కూడా ఎన్ని రకాల విన్యాసాలు చేస్తారో, ఆయనను తమిళ ప్రజలు ఎంతవరకు నమ్ముతారో వేచి చూడాల్సిందే. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

IPL 2025: KKR Bags Few Unwanted Records After Losing To Mumbai Indians In Wankhede5
IPL 2025: కేకేఆర్‌ చెత్త రికార్డులు

ఐపీఎల్‌ 2025లో భాగంగా నిన్న (మార్చి 31) వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కేకేఆర్‌ ముంబై ఇండియన్స్‌ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో కేకేఆర్‌ పలు చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఐపీఎల్‌లో ఓ జట్టు (ముంబై ఇండియన్స్‌) చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా తమ పేరిటే ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. తాజా ఓటమితో ముంబై ఇండియన్స్‌ చేతిలో కేకేఆర్‌ పరాజయాల సంఖ్య 24కు చేరింది. ఐపీఎల్‌లో ఏ జట్టూ ఓ జట్టు చేతిలో ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోలేదు. కేకేఆర్‌ తర్వాత ఈ చెత్త రికార్డు ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ పేరిట ఉంది. ఆర్సీబీ సీఎస్‌కే చేతిలో.. పంజాబ్‌ కేకేఆర్‌ చేతిలో తలో 21 మ్యాచ్‌లు ఓడిపోయాయి.ఐపీఎల్‌లో ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..కేకేఆర్‌- 24 ముంబై ఇండియన్స్‌ చేతిలోఆర్సీబీ- 21 సీఎస్‌కే చేతిలోపంజాబ్‌- 21 కేకేఆర్‌ చేతిలోసీఎస్‌కే- 20 ముంబై ఇండియన్స్‌ చేతిలోఆర్సీబీ- 20 కేకేఆర్‌ చేతిలోనిన్నటి ఓటమితో కేకేఆర్‌ మరో చెత్త రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా నిలిచింది. కేకేఆర్‌ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ చేతిలో అత్యధికంగా 10 పరాజయాలు ఎదుర్కొంది. ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్ల జాబితాలో పంజాబ్‌, ఆర్సీబీ, ఢిల్లీ కేకేఆర్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.ఐపీఎల్‌లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..కేకేఆర్‌- 10 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ చేతిలోపంజాబ్‌-9 ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌ చేతిలోఆర్సీబీ- 8 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ చేతిలోఆర్సీబీ- 8 చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ చేతిలోఆర్సీబీ- 8 చెపాక్‌ స్టేడియంలో సీఎస్‌కే చేతిలోఢిల్లీ- 8 ఈడెన్‌ గార్డెన్స్‌లో కేకేఆర్‌ చేతిలోమ్యాచ్‌ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్‌ చేతిలో కేకేఆర్‌ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌.. అరంగేట్రం పేసర్‌ అశ్వనీ కుమార్‌ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్‌ను మట్టికరిపించడంలో ముంబై బౌలర్లు దీపక్‌ చాహర్‌ (2-0-19-2), బౌల్ట్‌ (4-0-23-1), హార్దిక్‌ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్‌ పుతుర్‌ (2-0-21-1), సాంట్నర్‌ (3.2-0-17-1) తలో చేయి వేశారు.కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రఘువంశీ (26) టాప్‌ స్కోరర్‌ కాగా.. రమణ్‌దీప్‌ (22), మనీశ్‌ పాండే (19), రింకూ సింగ్‌ (17), రహానే (11) రెండంకెల స్కోర్లు చేశారు. డికాక్‌ (1), సునీల్‌ నరైన్‌ (0), వెంకటేశ్‌ అయ్యర్‌ (3), రసెల్‌ (5) దారుణంగా విఫలమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌.. ర్యాన్‌ రికెల్టన్‌ (41 బంతుల్లో 62 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్‌ (9 బంతుల్లో 27 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కేకేఆర్‌ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ సీజన్‌లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌కు లభించిన తొలి విజయం ఇది. కేకేఆర్‌ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ సీజన్‌లో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఈ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించి, తాజాగా ముంబై ఇండియన్స్‌ చేతిలో ఓడింది.

Rajasthan Nitrogen Gas Leak Factory Owner Dies 40 Hospitalised6
Rajasthan: లీకయిన విషవాయువు.. ఒకరు మృతి.. 40 మందికి అస్వస్థత

జైపూర్: రాజస్థాన్‌లోని బీవార్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి యాసిడ్ ఫ్యాక్టరీ గిడ్డంగి(Acid factory warehouse) లోపల ఆగి ఉన్న ఒక ట్యాంకర్ నుండి నైట్రోజన్ గ్యాస్ లీకయ్యింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 40 మంది గాయపడ్డారు. బడియా ప్రాంతంలోని సునీల్ ట్రేడింగ్ కంపెనీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పలు పెంపుడు జంతువులు(Pets), వీదుల్లో తిరిగే జంతువులు మృత్యువాత పడ్డాయి. ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీ యజమాని సునీల్ సింఘాల్ మృతి చెందారు. ఆయన గ్యాస్ లీక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో గ్యాస్‌ ప్రభావానికిలోనై అస్వస్థతకు గురయ్యారు. దీంతో అతనిని అజ్మీర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం కంపెనీ గిడ్డంగిలో ఒక ట్యాంకర్ నుండి నైట్రోజన్ గ్యాస్ లీక్(Nitrogen gas leak) అయ్యింది. సెకెన్ల వ్యవధిలోనే సమీపంలోని నివాస ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. దీంతో 60 మందికి పైగా జనం చికిత్స కోసం బీవార్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు, అగ్నిమాపక దళ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో గ్యాస్ లీకేజీని నియంత్రించగలిగారు. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు. గ్యాస్ ప్రభావం తగ్గినప్పటికీ, స్థానికులలో ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేంద్ర ఖడ్గావత్ ఫ్యాక్టరీని మూసివేయాలని ఆదేశించారు. వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. గ్యాస్‌ లీకేజీకి గల కారణాన్ని సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Switzerland: సొరంగాల స్వర్గం.. ప్రభుత్వ కృషి అమోఘం

Kalyan Ram Talk About Arjun Son Of Vyjayanthi7
వాళ్ల కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు: కల్యాణ్‌ రామ్‌

‘‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమాలోని అమ్మ పాత్రకి విజయశాంతిగారు ఒప్పుకోవడం వల్లే నేను ఈ సినిమా చేశాను. అమ్మలను గౌరవించడం మన బాధ్యత. వాళ్ల కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. మా సినిమాని అమ్మలందరికీ అంకితం ఇస్తున్నాం’’ అని హీరో కల్యాణ్‌ రామ్‌ అన్నారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో కల్యాణ్‌రామ్, సయీ మంజ్రేకర్‌ జోడీగా, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్‌ కానుంది.అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘నాయాల్ది..’ అంటూ సాగే పాట లిరికల్‌ వీడియోను సోమవారం నరసరావుపేటలో రిలీజ్‌ చేశారు మేకర్స్‌. రఘురాం సాహిత్యం అందించిన ఈ పాటని నకాష్‌ అజీజ్, సోనీ కొమాండూరి పాడారు. ఈ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ–‘‘ఈ వేడుక చూస్తుంటే పాట రిలీజ్‌లా లేదు.. ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సక్సెస్‌మీట్‌లా ఉంది’’ అన్నారు. ‘‘పల్నాటి పౌరుషం కల్యాణ్‌రామ్‌గారి క్యారెక్టర్‌లో కనిపిస్తుంది’’ అన్నారు ప్రదీప్‌ చిలుకూరి. ‘‘ఈ సాంగ్‌ను పల్నాడులో లాంచ్‌ చేయడం చాలా గర్వంగా ఉంది’’ అని అశోక్‌ వర్ధన్‌ చెప్పారు. ఎన్టీఆర్‌.. సీఎం..సీఎం ఈ పాట ఈవెంట్‌కి కల్యాణ్‌రామ్‌ వచ్చింది మొదలు ఎన్టీఆర్‌ సీఎం అంటూ అభిమానులు పెద్దగా నినాదాలు చేశారు. హీరో ఎన్టీఆర్‌ ఫ్లెక్సీని ప్రద ర్శిస్తూ సీఎం.. సీఎం.. అనే నినాదాలతో హోరెత్తించారు.

Anant Ambani spiritual walk From Jamnagar To Dwarka To Celebrate His 30th Birthday8
30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్‌ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఆధ్యాత్మికకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా తన 30వ పుట్టినరోజు సందర్భంగా మరో ఆధ్మాత్మికకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయానికి ‍ కాలినడకన వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు 141 కిలోమీటర్లమేర కాలినడకన ద్వారకకు చేరుకుని అక్కడ శ్రీ కృష్ణుడి పాదాలకు నమస్కరించనున్నారు. రోజుకు 15-20 కిలోమీటర్ల చొప్పున ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగియనుంది.జామ్‌నగర్ నుండి ద్వారకకుఎపుడూ భక్తిని చాటుకునే అనంత్ అంబానీ, జామ్‌నగర్ నుండి శ్రీకృష్ణ నగరం ద్వారకకు ఆధ్యాత్మిక యాత్ర (పాదయాత్ర)గుజరాత్‌లోని జామ్‌నగర్‌ నుంచి ద్వారక వరకు మార్చి 27న ప్రారంభించారు. ద్వారకలో ద్వారకాధీశుని దర్శనంతో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించు కున్నారు. 140 కిలోమీటర్ల ప్రయాణం ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, అనంత్ అంబానీ ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ ద్వారకాధీశుని దర్శించుకుంటాననీ, దీంతో ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు.#WATCH | Devbhumi Dwarka, Gujarat: Anant Ambani, Director, Reliance Industries Limited, is on a 'Padyatra' from Jamnagar to Dwarkadhish TempleHe says, "The padyatra is from our house in Jamnagar to Dwarka... It has been going on for the last 5 days and we will reach in another… pic.twitter.com/aujJyKYJDN— ANI (@ANI) April 1, 2025 > "జామ్‌నగర్‌లోని మా ఇంటి నుండి ద్వారక వరకు పాదయాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతోంది, మరో రెండు నాలుగు రోజుల్లో ద్వారక చేరుకుంటాము.ద్వారకాధీశుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడుపై విశ్వాసం ఉంచి, ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని నేను యువతకు చెప్పాలనుకుంటున్నాను. ఆ పని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. దేవుడు ఉన్నప్పుడు, చింతించాల్సిన పని లేదు" అని ఆయన అన్నారు.Anant Ambani’s decision to walk on foot speaks volumes about his dedication to faith. pic.twitter.com/3XHK4BWMBa— Amrish Kumar (@theamrishkumar) March 31, 2025 ఏప్రిల్ 10న పుట్టినరోజుకృష్ణ భక్తుడైన అనంత్ అంబానీ జై ద్వారకాదీష్ అంటూ నినదిస్తూ ఎంతో ఉత్సాహంగా నడుస్తున్నారు. అనేక మంది భక్తులను ఆకట్టుకుంటున్నారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తి పాదయాత్ర చేయడం ఇదే తొలిసారి. దీంతో అనంత్‌ అంబానీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ పాదయాత్ర ద్వారా ద్వారక శ్రీ కృష్ణ మందిరానికిచేరుకుంటారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 8 నాటికి అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ ద్వారక చేరుకుంటే. తరువాత, ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో భార్య రాధికతోపాటు అనంత్‌ అంబానీ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసిన సంగతి తెలిసిందే.

Gold and Silver rates today on market in Telugu states9
భగ్గుమన్న బంగారం.. ఒకేరోజు భారీగా పెరిగిన ధర

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇటీవల కొంత శాంతించినట్లు కనిపించినా తిరిగి జీవితకాల గరిష్టాలను చేరుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో మంగళవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rate) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.85,100 (22 క్యారెట్స్), రూ.92,840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. సోమవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.850, రూ.930 పెరిగింది.ఇదీ చదవండి: కొత్త ఆర్థిక సంవత్సరం.. 1,160 పాయింట్లు పడిన సెన్సెక్స్‌చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.850, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.930 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.85,100 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.92,840 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.850 పెరిగి రూ.85,250కు చేరుకోగా..24 క్యారెట్ల ధర రూ.930 పెరిగి రూ.92,990 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరలు పెరుగుతున్నట్లు వెండి ధరల్లోనూ మంగళవారం మార్పులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే ఈ రోజు వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి రేటు(Silver Price) సోమవారంతో పోలిస్తే రూ.1000 పెరిగి రూ.1,14,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

BRS KTR Criticizes Congress Government for Bulldozing Policies10
ప్రభుత్వమా? బుల్డోజర్‌ కంపెనీయా?

హైదరాబాద్‌, సాక్షి: హెచ్‌సీయూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏంటో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. తాజా హెచ్‌సీయూ ఉద్రిక్తతల పరిణామాలపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పర్యావరణ పరిరక్షణ పేరిటి పేదల ఇళ్లు కూల్చారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారు. పైగా అభివృద్ధి, ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారు. ఇది ప్రభుత్వమా? బుల్డోజర్‌ కంపెనీయా?. ఎన్నికైన ప్రజాప్రతినిధులా? రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లా?.. విధ్వంసం ఒక్కటే మీ ఎజెండా… ఖజానాకు కాసులు నింపుకోవడమే మీ లక్ష్యం. సెలవు దినాల్లో, అర్ధరాత్రి మీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి?. కోర్టులు అంటే ఎందుకు మీకు అంత భయం? అంటూ రేవంత్‌ సర్కార్‌పై కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్‌ ఇప్పటికే మద్దతు ప్రకటించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement