Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YSR Jayanthi 2025: YS Jagan Pays Tributes YSR at YSR Ghat Tweet Updates1
YSR Jayanthi: ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద వైఎస్‌ జగన్‌ నివాళి

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 76వ జయంతి నేడు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ తనయుడు, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో విజయమ్మ, వైఎస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు, పెద్దఎత్తున అభిమానులు పాల్గొన్నారు.వైఎస్‌ జగన్‌ రాకతో ఇడుపులపాయ కోలాహలంగా మారింది. జననేతను చూసేందుకు, కరచలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు భారీ ఎత్తున అభిమానులు ఘాట్‌ వద్దకు పోటెత్తారు.👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)మిస్‌ యూ డాడ్‌.. వైఎస్సార్‌ జయంతిని ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. మిస్‌ యూ డాడ్‌ అంటూ ఎక్స్‌ ఖాతాలో ఇవాళ ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన ఫొటోలను పంచుకున్నారు.Miss you Dad! pic.twitter.com/0jINDcR1Fj— YS Jagan Mohan Reddy (@ysjagan) July 8, 2025ఆందోళన వద్దు.. అండగా ఉంటాంకడపలోని వైఎస్‌ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విద్యార్థులు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (COA) అనుమతి లేకపోవడం, ADCET విడుదలపై వారం రోజులుగా స్టూడెంట్స్‌ ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇడుపులపాయలో వైఎస్‌ జగన్‌ను వాళ్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. సమస్య పరిష్కారానికి తాను కృషి చేస్తానని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘విద్యార్ధులకు మంచి యూనివర్సిటీ కడితే ఈ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేస్తోంది. వైఎస్సార్సీపీ విద్యార్ధులకు అన్ని విధాల అండగా ఉంటుంది వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నేతలు విద్యార్థుల వెంట ఉన్నారు.

Karnataka Congress MLAs Demanding DK Shivakumar as Chief Minister2
వందమంది ఎమ్మెల్యేల మద్దతు.. సీఎంగా డీకే శివకుమార్‌?

సాక్షి,బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ రాజకీయం రసకందాయంలో పడింది. డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌ను (D. K. Shivakumar) సీఎంను చేయాలంటూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాంబు పేల్చారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం మంది ఎమ్మెల్యేలు డీకేఎస్‌ వెంట ఉన్నారంటూ పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు చర్చాంశనీయంగా మారాయి. ఈ క్రమంలో డీకేఎస్‌ సైతం హస్తినలో పర్యటించడం.. రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం పదవుల్లో పెనుమార్పులు చోటు చేసుకోనున్నాయనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎందుకంటే? 2023లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సిద్ధరామయ్య(Siddaramaiah)కు సీఎం పదవి, డీకేఎస్‌కు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఆ సమయంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై డీకేఎస్‌ వర్గం అంతర్గతంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది. పైకి మాత్రం సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు, తర్వాత డీకే శివకుమార్ సీఎం అయ్యేలా ఒప్పందాలు జరిగాయంటూ ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ 2.5 సంవత్సరాల గడువు సెప్టెంబర్‌లో ముగియనుండటంతో, డీకే శివకుమార్ మద్దతు దారులు మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు.ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ మాట్లాడుతూ.. ‘అవును, చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌ను సీఎం చేయాలని కోరుతున్నారు. మా జిల్లా ప్రజలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు’ అని చెప్పారు. మరో ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలోని 100 మందికి పైగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతుగా ఉన్నారు అని పునరుద్ఘాటించారు. ప్రతి ఒక్కరికీ ఆశ ఉండొచ్చుకర్ణాటక రాజకీయంపై ఇప్పటికే ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Randeep Surjewala)కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆశ ఉండొచ్చు. కానీ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు . గతంలో ఇదే వివాదాన్ని పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం రణదీప్ సూర్జేవాలాను మధ్యవర్తిగా వ్యవహరించారు.అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంమరోవైపు తనని సీఎంను చేయాలంటూ పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్లపై డీకే శివకుమార్‌ స్పందించారు. నా కోసం మాట్లాడమని నేను ఎవరికీ చెప్పలేదు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అది శిరోధార్యమని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం మాత్రం సిద్ధరామయ్యను మార్చే ఉద్దేశం లేదని అధికారికంగా ఆయనను మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. సిద్ధరామయ్యను కొనసాగించాలనే వైఖరిలోనే ఉంది. కానీ డీకే శివకుమార్ వర్గం నుంచి వచ్చే ఒత్తిడి, ఎమ్మెల్యేల మద్దతు,2028 ఎన్నికల దృష్ట్యా పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమోనని డీకే వర్గం భావిస్తోంది. మరి ముందుముందు ఏమవుతుందో చూడాలి మరి

chittoor sp manikanta key comments on ys jagan Bangarupalyam tour3
వైఎస్‌ జగన్‌ పర్యటనకు జనసమీకరణ చేస్తే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తాం: చిత్తూరు ఎస్పీ

సాక్షి,చిత్తూరు జిల్లా : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. వైఎస్‌ జగన్‌ బంగారుపాళ్యం పర్యటనకు జనసమీకరణ చేస్తే రౌడీషీట్‌ ఓపెన్‌ చేస్తామని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్‌ జగన్‌ బుధవారం (జులై9) బంగారుపాళ్యంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ మీడియాతో మాట్లాడారు. ‘వైఎస్‌ జగన్ టూర్‌కు జనసమీకరణ చేస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. మాజీ సీఎం పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు 375 మందికి నోటీసులు ఇచ్చాం. ఇది కేవలం రైతులతో ముఖాముఖీ కార్యక్రమం మాత్రమే. కొంతమంది బహిరంగ సభ తరహాలో జనసమీకరణ ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిపై గట్టి నిఘా ఉంచాం. కేసు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తాంరైతుల పరిచయ కార్యక్రమానికి 500 మందిని, హెలిపాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతిస్తున్నాం. ఈ పరిధి దాటితే నిర్వాహకులు ఎవరు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Strategic Solution to Labor Shortages Italy new Work Visa Plan4
పెరుగుతున్న కార్మిక కొరత.. జనాభా సంక్షోభం

ఇటలీ ప్రస్తుతం కార్మిక కొరత, జనాభా క్షీణత సమస్యలతో సతమతమవుతోంది. వాటిని పరిష్కరించడానికి ఆ దేశం కొన్ని సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ఇటలీ ప్రభుత్వం 2026-2028 మధ్య యురోపియన్‌ యూనియన్‌యేతర పౌరులకు దాదాపు 5,00,000 వర్క్ వీసాలను జారీ చేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను ప్రకటించింది. ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశ జనాభాను స్థిరపరుస్తూ, ఆర్థిక భవిష్యత్తుకు ఊతం ఇచ్చేలా ఉంటుందని నమ్ముతుంది.వర్క్ వీసా విస్తరణకు సంబంధించిన కీలక వివరాలువచ్చే మూడేళ్లలో ఈయూయేతర పౌరులకు మొత్తం 4,97,550 వర్క్ పర్మిట్లు జారీ చేయాలని ఇటలీ యోచిస్తోంది. ఇది దేశంలోకి వచ్చే వలసదారులను గణనీయంగా పెంచుతుంది. స్థానికంగా లేబర్‌ మార్కెట్ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఇది హైలైట్‌ చేస్తుంది. ఈ విధానం ద్వారా సంవత్సరాల వారీగా కింద తెలిపినట్లు వర్క్‌ పర్మిట్లు జారీ చేయనున్నారు.2026: 164,850 వర్క్ పర్మిట్లు2027: 166,350 వర్క్ పర్మిట్లు2028: 166,350 వర్క్ పర్మిట్లుసిబ్బంది అవసరమయ్యే రంగాలు..దేశవ్యాప్తంగా క్లిష్టమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న వివిధ రంగాలకు ఈ వీసాలను పంపిణీ చేయనున్నారు. అందులోని కొన్ని పరిశ్రమలు కింద ఇస్తున్నాం.వ్యవసాయంనిర్మాణ రంగంఆరోగ్య సంరక్షణ (ముఖ్యంగా వైద్యులు, నర్సులు)టూరిజంతయారీ రంగంఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌తో సహా డిజిటల్ సేవల రంగం.పైన తెలిపిన రంగాలు దేశీయ వీసా విధానం ద్వారా ఇటలీ ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.ఎందుకు ఇలా చేస్తోందంటే..లేబర్ కొరతఇటలీ కంపెనీలు తమ సంస్థల్లో ఖాళీలు భర్తీ చేయడానికి నానా తంటాలు పడుతున్నాయి. వాస్తవానికి 70% కంటే ఎక్కువ ఇటాలియన్ కంపెనీలు కార్మికులను నియమించడంలో తీవ్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కొరత దేశీయంగా అనేక పరిశ్రమల్లో విస్తరించింది.రెస్టారెంట్లు, హోటళ్లు వంటి సర్వీసుల్లో 2,58,000 ఖాళీలు45,000 మంది వైద్యులు, 65,000 మంది నర్సులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై ఒత్తిడిని ఎత్తి చూపుతోంది.ఇంజినీరింగ్, గ్రీన్ ఎకానమీలో 2,80,000 మంది నైపుణ్యం కలిగిన కార్మికులు అవసరం. ఈ విభాగంలో ప్రతిభావంతులకు డిమాండ్ పెరుగుతోంది.డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్.జనాభా సంక్షోభంఇటలీ జననాల రేటు తగ్గుతోంది. దాంతో జనాభా కుంటుపడుతోంది. 2024లో జనాభా 37,000 తగ్గింది. జననాల కంటే 2,81,000 ఎక్కువ మరణాలు సంభవించాయి. 2050 నాటికి ఇటలీలో 34% మంది 65 ఏళ్లు పైబడి వయసు ఉంటారని అంచనా. స్థిరమైన శ్రామిక శక్తి, ఆర్థిక వ్యవస్థను కొనసాగించడానికి ఇటలీ 2050 నాటికి సుమారు 10 మిలియన్ల(ఒక కోటి) వలసదారులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా ప్రకటించిన వర్క్ వీసా ప్రోగ్రామ్ ఈ లక్ష్యసాధనలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు.భారత్‌ ఎలా అర్థం చేసుకోవాలంటే..వేగంగా పెరుగుతున్న శ్రామిక జనాభా ఉన్న భారతదేశం ఇటలీ వర్క్ వీసాలతో గణనీయంగా ప్రయోజనం పొందనుంది. భారత్‌లో ఇటలీ రాయబారి ఆంటోనియో బార్టోలి ‘ఇరు దేశాల మధ్య సమన్వయం’గా ఈ వ్యవహారాన్ని అభివర్ణించారు. ముఖ్యంగా హెల్త్ కేర్, ఇంజినీరింగ్, హాస్పిటాలిటీ, ఐటీ వంటి రంగాల్లోని వారికి ఇటలీ లేబర్ మార్కెట్లో పుష్కలమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.ఏయే రంగాల్లో ఎవరికి అవకాశం..హెల్త్‌కేర్‌: డాక్టర్లు, నర్సులు, మెడికల్ ప్రొఫెషనల్స్‌కు మంచి డిమాండ్ ఉంది.ఇంజినీరింగ్: ఇటలీ పారిశ్రామిక రంగాలకు, గ్రీన్ ఎకానమీకి నైపుణ్యం కలిగిన ఇంజినీర్లు అవసరం.హాస్పిటాలిటీ అండ్ టూరిజం: ఇటలీ గ్లోబల్ టూరిజం హబ్ కావడంతో ఆతిథ్య రంగంలోని కార్మికులకు గిరాకీ ఉంటుంది.డిజిటల్, ఐటీ: ఐటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ భారతీయ టెక్ ప్రతిభావంతులకు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో అవకాశాలను సృష్టిస్తుంది.ఇటలీ ప్రభుత్వం చట్టపరమైన వలసదారుల హక్కులను సంరక్షించేదుకు కట్టుబడి ఉందని తెలిపింది. అదేసమయంలో అక్రమవలసలకు సహించబోమని తేల్చి చెప్పింది. సురక్షితమైన, నియంత్రిత వలసలను ప్రోత్సహించే మార్గాలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. ఇటువంటి వలసలకు సహాయపడే దేశాలకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది.👉 వర్క్ వీసా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియాలంటే క్లిక్‌ చేయండివీసా అప్లికేషన్ కోసం కావాల్సిన ధ్రువపత్రాలుజాబ్ ఆఫర్ లెటర్ఆమోదం పొందిన నూలా ఓస్టా(వర్క్‌ పర్మిట్‌)వీసా దరఖాస్తు ఫారంపాస్‌పోర్ట్‌ఇటలీలో వసతి రుజువు కోసం అద్దె ఒప్పందం లేదా మీరు చేరబోయే సంస్థ లేఖలో అక్కడ ఉండటానికి వసతి ఉందని ధ్రువీకరించుకోవాలి.ఆర్థిక భరోసా: మీరు సంపాదించడం ప్రారంభించే వరకు ఇటలీలో మిమ్మల్ని మీరు పోషించుకోవడానికి తగినంత ఆర్థిక వనరులు మీకు ఉన్నాయని ధ్రువపరిచేలా పత్రాలు ఉండాలి. ఇందులో బ్యాంక్ స్టేట్‌మెంట్‌ లేదా స్పాన్సర్ లెటర్‌ ఉండవచ్చు.హెల్త్ ఇన్సూరెన్స్: ఇటలీలో దరఖాస్తుదారుకు చెల్లుబాటు అయ్యే ఆరోగ్య బీమా పాలసీ ఉండాలి.ఇటలీలో డిమాండ్‌లో ఉన్న ఉద్యోగాలుస్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉద్యోగాలు: భవన నిర్మాణ కార్మికులు (మేస్త్రీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వెల్డర్)ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లుమెకానికల్ హెల్పర్లుసేఫ్టీ ఆఫీసర్లుహెల్త్ కేర్‌: నర్సులు, వృద్ధుల సంరక్షణ సహాయకులు, మెడికల్ టెక్నీషియన్లుడిజిటల్, ఇంజినీరింగ్: సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు, డేటా సైంటిస్టులు, ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు, గ్రీన్ ఎనర్జీ టెక్నీషియన్లు.టూరిజం: హోటల్ సిబ్బంది, రెస్టారెంట్ కార్మికులు, గృహనిర్వహణ సిబ్బంది, రిటైల్ సిబ్బంది.ఇదీ చదవండి: టాటా మోటార్స్‌ నుంచి మినీ ట్రక్‌లు.. ధర ఎంతంటే..వీసా దరఖాస్తుదారులకు కొన్ని టిప్స్‌..బేసిక్ ఇటాలియన్ నేర్చుకోవాలి. అన్ని రంగాల్లో పని చేసేందుకు ఇటాలియన్ భాషలో ప్రావీణ్యం అవసరం లేనప్పటికీ, భాష ప్రాథమిక పరిజ్ఞానం అవకాశాలను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆతిథ్యం, సంరక్షణ, నిర్మాణ రంగంలో పని చేస్తున్నవారికి ఎంతో తోడ్పడుతుంది.త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఇటలీ వర్క్ వీసా ప్రోగ్రామ్ కోటా ఆధారిత వ్యవస్థ (డెక్రెటో ఫ్లూస్సీ) కింద పనిచేస్తుంది. అంటే ప్రతి సంవత్సరం పరిమిత సంఖ్యలో అనుమతులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముందే దరఖాస్తు చేసుకోవాలి.రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు లేదా ఎంప్లాయర్ టైఅప్‌లను పరిశీలించాలి. లైసెన్స్ పొందిన రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీలు లేదా ఇటలీ సంస్థలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఏజెన్సీల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

తణుకు ఆస్పత్రిలో వృద్ధుడి ుకుమారుడు సుధీన్‌రాజుకు కౌన్సిలింగ్‌ ఇస్తున్న ఆర్‌ఎంఓ, పక్క చిత్రంలో వృద్ధుడు సుబ్బారావు5
బతికుండగానే ‘చంపేశారు’. !నాన్న వద్దంటున్న కొడుకు.. నాకు భర్తే లేడంటున్న భార్య!

తణుకు అర్బన్: వివాహ బంధాన్ని భార్య వద్దంటోంది. కన్నతండ్రితో అనుబంధాన్ని కుమారుడు తెంచు కుంటున్నాడు. ఏడేళ్ల క్రితం తెగిపోయిన రక్తసంబం ధం నేడు ఎదురైనా తమకు వద్దంటే వద్దని ఆ కుటుంబం తెగేసి చెబుతోంది. దీంతో ప్రమాదవ శాత్తు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు అల్లాడుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశ రావుపాలెంకు చెందిన కలగర సుబ్బారావు ఏడేళ్ల కిత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. ఆది వారం కాల్దరి స్టేషన్లో రైలు నుంచి జారిపడగా రైల్వే పోలీసులు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడిని ఆరా తీయగా కుటుంబసభ్యుల వివరాలు తెలిపారు. రైల్వే కానిస్టేబుల్ బాల విషయాన్ని వృద్ధుడి కుమారుడు సుధీన్ రాజుకు ఫోన్ ద్వారా తెలియజేయగా తనకు నాన్న అవసరం లేదని తెగేసి చెప్పాడు.అయినా కానిస్టేబుల్ బాల ప్రకాశరావుపాలెంలోని ఇంటికి వెళ్లి వృద్ధుడి భార్యతో విషయం చెప్పగా తన భర్త ఎప్పుడో చనిపోయాడని. అతడి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని వితంతు పింఛను కూడా పొందుతున్నట్టు సమాధానం ఇవ్వ డంతో రైల్వే పోలీసులు ఆశ్చరుపోయారు.కేసు నమోదు చేసినా ఇబ్బందిలేదుసుధీన్ రాజును ఎట్టకేలకు రైల్వే పోలీసులు తణుకు ఆస్పత్రికి తీసుకురాగా సోమవారం ఆర్ఎంఓ డాక్టర్. ఏవీఆర్ఎస్ తాతారావు కౌన్సెలింగ్ ఇచ్చారు. తమకు సుబ్బారావు అవసరం లేదని, అవసరమైతే అలా రాసిస్తామని సుధీన్ రాజు సమాధానమిచ్చాడు. దీంతో సీఐ ఎన్.కొండయ్య ఆస్పత్రి వద్దకు వచ్చి కన్న తం డ్రిపై నిర్లక్ష్యం వహిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించగా.. కేసు నమోదు చేసుకోమని సుధీన్ రాజు తెగేసి చెప్పాడు. దీంతో చేసేదిలేక ఆస్పత్రి లో నే వైద్యులు సుబ్బారావుకు చికిత్స అందిస్తున్నారు.

Happy Birthday Sourav Ganguly: 10 Cricket Records That Still Remain Unbroken6
Sourav Ganguly: ఈ రికార్డులను ఇంత వరకూ ఎవరూ టచ్‌ కూడా చేయలేదు!

భారత క్రికెట్‌కు దూకుడు పరిచయం చేసిన ధీరుడు అతడు. మ్యాచ్ ఫిక్సింగ్‌ ఉదంతంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స‌మ‌యంలో జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకున్న వారియర్‌ అతడు. తన కెప్టెన్సీతో ఇంటా, బయట భారత జట్టును విజయపథంలో నడిపించిన నాయకుడు అతడు.యువ‌రాజ్ సింగ్‌, హార్భజన్ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్, జ‌హీర్ ఖాన్‌ వంటి స్టార్‌ క్రికెటర్లను పరిచయం చేసిన దాదా అతడు. అతడే టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ(Sourav Ganguly). అభిమానులు ముద్దుగా పిలుచుకునే బెంగాల్‌ టైగర్‌ పుట్టిన రోజు నేడు(జూలై 8). ఈ సందర్భంగా గంగూలీ పేరిట ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్న పది ఐకానిక్‌ రికార్డులపై ఓ లుక్కేద్దాం.ఒకే ఒక్కడు..అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో వరుసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందిన ఏకైక క్రికెటర్ గంగూలీ. ఇప్పటికి అతడి రికార్డును ఎవరూ టచ్‌ చేయలేకపోతున్నారు. 1997లో పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌లో దాదా ఈ ఘనత సాధించాడు.ఏకైక లెఫ్ట్‌ హ్యాండర్‌గా..వన్డేల్లో భారత జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్‌గా గంగూలీ కొనసాగుతున్నాడు. గంగూలీ తన కెరీర్‌లో 308 మ్యాచ్‌లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా గంగూలీ ఉన్నాడు. అగ్రస్ధానంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌(18426) ఉండగా.. రెండో స్దానంలో విరాట్ కోహ్లి(14181) కొనసాగుతున్నాడు.👉ఐసీసీ టోర్నమెంట్ ఫైన‌ల్ మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించిన ఏకైక భార‌త ఆట‌గాడు కూడా గంగూలీనే కావ‌డం గ‌మ‌నార్హం. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2000 ఫైన‌ల్లో న్యూజిలాండ్‌పై సౌర‌వ్ సెంచ‌రీ(117) సెంచ‌రీతో మెరిశాడు.👉ఐసీసీ వన్డే టోర్నీల నాకౌట్ మ్యాచ్‌ల్లో మూడు శతకాలు చేసిన ఆటగాళ్లలో గంగూలీ ఒకడు. ఆయనతోపాటు ఈ లిస్ట్ లో రికీ పాంటింగ్, సయద్ అన్వర్ లు ఉన్నారు. ఈ జాబితాలో భార‌త త‌ర‌పున‌ నుంచి గంగూలీ ఒక్క‌డే ఉన్నాడు.👉ఐసీసీ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త త‌ర‌పున అత్య‌ధిక వ్యక్తిగ‌త స్కోర్ సాధించిన ఆట‌గాడిగా ఇప్ప‌టికీ గంగూలీ కొన‌సాగుతున్నాడు. 1999 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై గంగూలీ 183 ప‌రుగులు ప‌రుగులు చేశాడు.వ‌రసుగా నాలుగు సార్లు1997 నుంచి 2000 వరకు వరుసగా నాలుగు క్యాలెండర్ ఈయ‌ర్స్‌లో 1000 కన్నా ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గంగూలీ.1997లో – 1338 పరుగులు1998లో – 1328 పరుగులు1999లో – 1767 పరుగులు2000లో – 1579 పరుగులు👉వ‌ర‌ల్డ్ క్రికెట్‌లో అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో ప‌దివేలకు పైగా ప‌రుగులు, వంద వికెట్లు సాధించిన ఆరుగురిలో ఒకడిగా గంగూలీ ఉన్నారు. భారత్‌ నుంచి మాత్రం గంగూలీ ఒక్కడే ఈ ఫీట్‌ను అందుకున్నాడు.👉టెస్టు అరంగేట్రంలో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసి, సెకెండ్ ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ అయిన ఏకైక క్రికెటర్ కూడా దాదానే కావడం విశేషం.👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా గంగూలీ నిలిచాడు. గంగూలీ 1990లో ఈ ఫీట్‌ సాధించాడు.👉 భారత జట్టుకు తొలి ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ టైటిల్‌నుని అందించిన కెప్టెన్‌ కూడా గంగూలీనే. 2000లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీని గంగూలీ సారథ్యంలోని టీమిండియా సొంతం చేసుకుంది.

Land Grabbers Attack On Bhadrachalam Temple Executive Officer L Rama Devi7
Bhadrachalam: భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవిపై భూకబ్జా దారుల దాడి

సాక్షి,భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. భద్రాచలం రామాలయంకు చెందిన భూములు పురుషోత్తపట్నంలో కబ్జాకి గురవుతున్నాయి.ఈ క్రమంలో స్వామివారి భూముల కబ్జాపై సమాచారం అందుకున్న ఈవో రమాదేవి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆక్రమణకు గురవుతున్న భూముల్ని భూకబ్జాదారుల నుంచి కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భూకబ్జా దారులు ఈవో రమాదేవిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆలయ ఈవో స్పృహ కోల్పోయారు. అప్రమత్తమైన స్థానికులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కాగా, భద్రాచలం రామాలయంకు చెందిన భూములు కబ్జా వ్యవహారంలో గత కొద్దిరోజులుగా ఆక్రమణదారులకి, దేవాదాయ శాఖ ఉద్యోగుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఆక్రమణ దారులు స్వామి వారి భూముల్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేయగా.. వాటి నిర్మాణాలు జరగకుండా దేవాదాయ శాఖ సిబ్బంది అడ్డుకుంది.

Hero Vishnu Vishal Reveals Aamir Khan hosted Jwala Gutta for 10 months8
' నా భార్యకు ఐవీఎఫ్‌ చికిత్స.. ఆశలు వదిలేసుకున్నాం.. కానీ'.. విష్ణు విశాల్

బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇటీవలే హైదరాబాద్‌లో సందడి చేశారు. ప్రముఖ కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కుమార్తె నామకరణ వేడుకకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్- గుత్తా జ్వాల బిడ్డకు అమిర్ ఖాన్ ముద్దుపేరు పెట్టారు. మైరా అంటూ అంటూ వారి పాపకు నామకరణం చేశారు. ఈ విషయాన్ని విష్ణు విశాల్ దంపతులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి.అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విష్ణు విశాల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భార్య గుత్తా జ్వాలాకు ఐవీఎఫ్‌(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) ద్వారా చాలా సార్లు ప్రయత్నించామని తెలిపారు. చాలాసార్లు విఫలం కావడంతో ఇక ఆశలు వదిలేసుకునే స్థాయికి చేరుకున్నామని వెల్లడించారు. కానీ అమిర్ ఖాన్ ముంబయిలోని అతనికి తెలిసిన వైద్యుడి వద్దకు మమ్మల్ని తీసుకెళ్లారని వివరించారు. అలా అమిర్ ఖాన్ తమకు మరిచిపోలేని సాయం చేశారని అన్నారు.విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ' జ్వాలా, నేను కొన్ని నెలల పాటు ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా బిడ్డ కోసం ప్రయత్నించాం. కానీ మా ప్రయత్నాలు ఫలించలేదు. ఇక లాభం లేదనుకుని దాదాపు ఆశలు వదిలేసుకున్నాం. అయితే చెన్నైలో వరదల సమయంలో నేను అనుకోకుండా అమీర్ సర్‌ను కలిశాను. మా గురించి తెలుసుకుని వెంటనే సాయం చేసేందుకు ముంందుకొచ్చాడు. అతను మమ్మల్ని ముంబయికి తీసుకొచ్చి వైద్యం కోసం అన్ని రకాల ఏర్పాటు చేశాడు. జ్వాలా గుత్తా తన చికిత్స కోసం ముంబయిలోనే ఉండాల్సి వచ్చింది. గుత్తా జ్వాలా తన తల్లి, సోదరీమణులతో పాటు అమీర్ ఖాన్ ఇంట్లోనే దాదాపు 10 నెలలు ఉండిపోయింది. తన ఇంట్లోనే అతిథ్యం ఇచ్చి పది నెలల పాటు మమ్మల్న ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అమీర్ సర్ తల్లి, సోదరీమణులు జ్వాలను ఎంతో బాగా చూసుకున్నారని' తెలిపారు.ఇటీవల తన కూతురికి పేరు పెట్టమని అమీర్ సర్‌ను అడిగిన క్షణాన్ని విష్ణు విశాల్ గుర్తు చేసుకున్నారు. మాకు బిడ్డ పుట్టబోతున్నప్పుడు నేను అమీర్ సార్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపాను. ఆ తర్వాత మా పాపకు పేరు పెట్టమని అడిగాను.. వెంటనే మాకోసం హైదరాబాద్‌కు విమానంలో వచ్చి మా అమ్మాయికి మైరా అని పేరు పెట్టారు. అమీర్ సర్‌కు కృతజ్ఞతలు చెప్పడానికి ఏమిచ్చినా సరిపోదు.. జ్వాలా, మైరా, నేను ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞులమై ఉంటామని విష్ణు విశాల్ భావోద్వేగానికి గురయ్యారు.కాగా.. 2023 చెన్నైలో వరదల సమయంలో అమీర్ ఖాన్ తన తల్లితో చెన్నైలో చిక్కుకున్నారు. తన తల్లికి చికిత్స కోసం కొన్ని నెలలు చెన్నైలోనే ఉన్నారు. ఆ సమయంలో విష్ణు విశాల్, అమీర్ ఖాన్ ఓల్డ్ మహాబలిపురం రోడ్ (OMR) లోని ఒకే ప్రాంతంలో నివసించారు. అప్పుడు వీరందరినీ పడవల ద్వారా రక్షించిన సంగతి తెలిసిందే.

Hyderabad City Court Mail Related Stoty Full Details9
హైదరాబాద్‌లో వరుస బాంబు బెదిరింపులు.. రాజ్‌భవన్‌, కోర్టు సహా..

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీలోని సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు పెట్టినట్టు అబీదా అబ్దుల్లా పేరుతో బెదిరింపు మెయిల్‌ వచ్చింది. దీంతో, పోలీసుల తనిఖీలు చేపట్టారు. మరోవైపు.. తాజాగా రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. వరుసు బాంబు బెదిరింపుల ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. వివరాల ప్రకారం.. సిటీ సివిల్‌ కోర్టుకు బాంబు పెట్టినట్టు అబీదా అబ్దుల్లా పేరుతో వార్నింగ్‌ మెయిల్‌ వచ్చింది. బెదిరింపు మెయిల్‌ పంపిన ఆగంతకుడు. నాలుగు ఆర్డీఎక్స్‌ బాంబులు, ఐఈడీలు పెట్టినట్టు మెయిల్‌ పంపించాడు. సిటీ సివిల్ కోర్టుతో పాటుగా నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్టు హెచ్చరిక. సిటీ సివిల్‌ కోర్టు, జడ్జి చాంబర్స్‌, జింఖానా క్లబ్‌, జడ్జి క్వార్టర్స్‌లో బాంబులు అమర్చినట్టు మెయిల్‌. కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్‌ పేలిపోతుందంటూ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో అతడి మెయిల్‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నాలుగు చోట్ల బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపు రావడంతో కోర్టు కార్యకలాపాలు నిలిపివేశారు. చీఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు మూసివేసి తనిఖీలకు అనుమతి ఇచ్చారు. కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

CM Revanth And KTR Political Challenge Security At Press Club10
సీఎం చెప్పింది ఏమిటి.. నీకు అర్ధమైంది ఏమిటి?: మల్లు

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతల సవాల్‌ అప్‌డేట్స్‌.. మహబూబాబాద్: ఒక పెద్ద మనిషి హైదరాబాదు లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కి వచ్చి సవాళ్లు చేస్తున్నారు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కముఖ్యమంత్రి చెప్పింది ఏంటి...! నీకు అర్ధం అయ్యింది ఏంటి..!ముఖ్యమంత్రి.. మాజీ ముఖ్యమంత్రిని రమ్మని సవాల్ విసిరితే ఆయన్ను రానివ్వడం లేదుCM సవాల్ ను జీర్ణించుకోలేక పోతున్నారు.ప్రజల పట్ల ఏ మాత్రం బాధ్యత.. నిబద్ధత ఉన్నా మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు రండి. మేం కూడా లెక్కలతో సహా వస్తాంశాసనసభలో తేల్చుకుందాం.కేటీఆర్‌కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ కౌంటర్‌..కేటీఆర్ నీకు దమ్ముంటే కేసీఆర్‌ను అసెంబ్లీకి తీసుకురా..దళిత ముఖ్యమంత్రి ఏమైందో ఎందుకు చెప్పడం లేదు..కేసీఆర్‌ను తొక్కి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు..రేవంత్ రెడ్డి దమ్ము ఏంటో కేసీఆర్‌ను అడుగు కేటీఆర్..కేటీఆర్ ఓక బచ్చా..వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలా ఉండాలో కనీసం అవగాహన లేని నేత కేటీఆర్.కేటీఆర్ అహాంకారం అంతా లక్ష కోట్ల దోపిడీతో వచ్చింది.సాగరహారంలో మీరెక్కడ ఉన్నారు కేటీఆర్...దోచుకుంటరు.. జై తెలంగాణ అంటరు..బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోదండరాం, మందకృష్ణ మాదిగ లాంటి ఉద్యమకారులను అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.దోపిడీ చేసిన మిమ్మల్ని అరెస్ట్ చేస్తే తప్పేంటి?.కల్వకుంట్ల కుటుంబంలో రన్నింగ్ రేస్ నడుస్తోంది.బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే కాంగ్రెస్‌కు వంద సీట్లు వచ్చేవి.రేవంత్ రెడ్డితో చర్చించే స్థాయి కేసీఆర్‌, కేటీఆర్‌ది కాదు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కేటీఆర్‌ కామెంట్స్‌..ముఖ్యమంత్రికి బేసిక్‌ నాలెడ్జ్‌ లేదు.18 నెలలుగా రైతులను మోసం చేశారు.ఒక్క హామీ కూడా నిలబెట్టుకోకుండా రంకెలేస్తున్నారు.రేవంత్‌కు రచ్చ చేయడం తప్ప.. చర్చ చేయడం రాదు.రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తే చర్చకు ఆయన రాలేదు.రేవంత్‌ మాట తప్పుతారని తెలిసినా సవాల్‌ను స్వీకరించాం.సీఎం కాకపోయినా మంత్రి అయినా వస్తారని అనుకున్నాం.తెలంగాణ నిధులు ఢిల్లీకి పారిపోతున్నాయి.రైతులపై సీఎం రేవంత్‌ రెడ్డి గౌరవం లేదు.ఢిల్లీకి సీఎం ఎందుకు వెళ్లారని అడిగితే ఎరువుల కోసం అని చెబుతున్నారు.రైతుబంధు అందరికీ ఇచ్చేశామని చెప్పుకుంటున్నారు.కొడంగల్‌లో ఎంత మంది రైతులకు రైతుబంధు పడలేదో లిస్ట్‌ రెడీగా ఉంది.రైతుల మరణాల లిస్ట్‌ కూడా తీసుకొచ్చాం.ఆనాటి ఎమర్జెన్సీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోంది. ఇప్పటికైనా మరోసారి సవాల్‌ చేస్తున్నా. రేవంత్‌తో చర్చకు సిద్ధం.. ప్లేస్‌ ఎక్కడో డిసైడ్‌ చేయాలని సవాల్‌ చేస్తున్నా. డేట్‌ కూడా మీరే ఫిక్స్‌ చేయండి.. ఎక్కడి రమ్మంటే అక్కడి వస్తాం. చర్చ కోసం రేవంత్‌ ఇంటికి రమ్మనా వెళ్తాం. రేవంత్‌ స్థాయికి కేసీఆర్‌ అవసరం లేదు.. మేము చాలు. మీకు నిజాయితీ ఉంటే చర్చకు రండి. లేదంటే క్షమాపణ చెప్పాలి. రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలీ కేటీఆర్చర్చకు వచ్చే సత్తా లేనప్పుడు.. రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ చేయొద్దురేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళింది యూరియా బస్తాల కోసం కాదుఏ బస్తాలు మోసి రేవంత్ ముఖ్యమంత్రి పదవి కాపాడుకుంటున్నారో అందరికీ తెలుసురేవంత్ రెడ్డికి రచ్చ చేయటమే తెలుసు. చర్చ చేయటం రాదుఏ బేసిన్ ఎక్కడుందో తెలియని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిరేవంత్ హాయాంలో నీళ్ళు ఆంధ్రకు.. నిధులు ఢిల్లీకి.. నియామకాలు రేవంత్ తొత్తులకుగురువు చంద్రబాబు కోసం తెలంగాణ నీళ్ళను ఆంధ్రకు పంపుతున్నారునాలుగు రోజులు మోసాలు చేసి రేవంత్ తప్పించుకోవచ్చు. ప్రజలు క్షమించరుసవాల్ విసిరి మాట తప్పటం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటు2018లో కొండగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాట తప్పాడు అసెంబ్లీకి కాంగ్రెస్‌ నేతలు..అసెంబ్లీకి చేరుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుఅసెంబ్లీ వేదికగానే సంక్షేమంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం.అసెంబ్లీకి రమ్మంటే బీఆర్‌ఎస్‌ నేతలు పారిపోతున్నారు.సభ పెట్టేందుకు కేసీఆర్‌తో లేఖ రాయించండి.9 రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం.బీఆర్‌ఎస్‌ మాటలపై చర్చ పెడదాం. ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్‌ప్రెస్‌క్లబ్‌కు చేరుకున్న కేటీఆర్‌ప్రెస్‌క్లబ్‌ వద్దకు భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు. ప్రెస్‌కబ్ల్‌లో సీఎం రేవంత్‌కు కుర్చీ వేసిన కేటీఆర్‌. తెలంగాణ భవన్‌ నుంచి ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరిన కేటీఆర్‌భారీ కాన్వాయ్‌తో ప్రెస్‌క్లబ్‌కు కేటీఆర్‌. ప్రెస్‌క్లబ్‌ వద్ద టెన్షన్‌ టెన్షన్‌.. కాంగ్రెస్‌ నేతలకు కేటీఆర్‌ సవాల్‌ సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. బహిరంగ చర్చకు రావాలంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఈరోజు ఉదయం 11 గంటలకు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌కు చేరుకోనున్నారు. ఇక, ఇప్పటికే సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌ వద్దకు బీఆర్‌ఎస్‌ నేతలు చేరుకుంటున్నారు. దీంతో, ప్రెస్‌క్లబ్‌ ఎదుట భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.మరోవైపు.. తెలంగాణ భవన్‌ వద్ద కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. రైతు సంక్షేమంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ సవాల్‌ చేశారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ నేతలు మర్చిపోయారు. హామీలు అమలు చేయాలని 18 నెలలుగా కోరుతున్నాం. అడ్డగోలు హామీలతో రైతులతో పాటు అందరినీ మోసం చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టరు.. పెట్టినా మాకు మైక్‌ ఇవ్వరు. దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్‌ సవాల్‌ విసిరారు. రేవంత్‌ సవాల్‌ను స్వీకరించి ప్రెస్‌క్లబ్‌కు వెళ్తున్నాను. రేవంత్‌ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి మంత్రులు అయిన వస్తారేమో చేస్తాం. మంత్రులతోనైనా మేం చర్చలకు సిద్దం అని అన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement