breaking news
West Godavari District Latest News
-
తప్ప తాగించేందుకు పర్మిట్
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, భీమవరం: మద్యం నుంచి సంపద సృష్టి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే బెల్టులు, సమయ పాలన లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ మద్యాన్ని ఏరులై పారి స్తోంది. మందుబాబుల్ని మరింత తప్పతాగించి ఆదాయాన్ని పెంచుకునే పనిలో ఉంది. షాపులకు అనుబంధంగా పర్మిట్ రూంల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. గీత కార్మికులకు చెందిన 18 షాపులతో కలిపి జిల్లాలో 193 మద్యం షాపులు ఉన్నాయి. నెలకు రూ.120 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. మునుపటి ఏడాది ప్రామాణికంగా 20 శాతం అమ్మకాలు పెంచాలంటూ మొదట్లో ఎకై ్సజ్ అధికారులకు టార్గెట్లు విధించేవారు. ప్రైవేట్ పాలసీ తెచ్చిన గత ఏడాది అక్టోబరు 16 నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి లిక్కర్, బీర్లు అమ్మకాల్లో 30 శాతం నుంచి 80 శాతం పెరుగుదలను గుర్తించింది. మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు నెలవారీ టార్గెట్ మొత్తాన్ని రూ. 175 కోట్లకు పెంచేసినట్టు సమాచారం. లక్ష్యాన్ని చేరేందుకు ఉన్నతస్థాయి నుంచి రోజువారీ సమీక్షలతో ఎకై ్సజ్ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చూసీచూడనట్టుగా.. షాపుల వద్దనే మద్యం సేవించేందుకు వీలుగా టేబుళ్లు, కుర్చీలతో సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, సోడాలు, కూల్‌డ్రింక్స్, లూజ్ సేల్స్‌తో మద్యం దుకాణాలను ‘బార్’ల మాదిరి నిర్వహిస్తున్నారు. నైట్పాయింట్లు పేరిట తెల్లవార్లూ అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో పది వరకు బెల్టు విక్రయాలు షరామామూలే. నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు చేస్తున్నా కూటమి నేతల ఒత్తిళ్లు, టార్గెట్ల కోసం అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. బెల్టుషాపులు లేవని ప్రభుత్వం చెబుతుండగా జిల్లాలో ఇప్పటి వరకు 370 మంది బెల్టుషాపుల నిర్వాహకులను అరెస్టుచేసి 800 లీటర్ల మద్యాన్ని ఎకై ్సజ్ అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. పర్మిట్‌కు పచ్చజెండా సిండికేట్‌కు మేలుచేస్తూ 2014–19 మధ్య కాలంలో లిక్కర్ విధానాన్ని చంద్రబాబు సర్కారు మళ్లీ ఆచరణలో పెడుతోంది. అందులో భాగంగా మద్యాన్ని ప్రైవేట్ పరం చేసింది. షాపులకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు తెరిచే పనిలో ఉంది. సెప్టెంబరు 1 నుంచి కొత్త బార్లకు లైసెన్సులు అమలుల్లోకి వచ్చాక పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. జిల్లాలోని దాదాపు అన్ని షాపులకు పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకానున్నట్టు ఎకై ్సజ్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించడం నిబంధనలకు విరుద్ధం. అయినప్పటికి సిండికేట్లు పర్మిట్ రూంల మాదిరి ఏర్పాట్లతో మద్యం, గ్లాసులు, వాటర్ బాటిల్స్, ఫాస్ట్ఫుడ్స్ తదితర అన్నిటి ధరలను పెంచేసి మందబాబులను దోచేస్తున్నారు. వీటిని అధికారికం చేయడం ద్వారా సిండికేట్ దోపిడీకి అడ్డుండదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం చాలావరకు దుకాణాలు జనావాసాల మధ్యలో ఉండగా మందుబాబుల ఆగడాలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. పర్మిట్ రూమ్‌తో వారు మరింత రెచ్చిపోయి స్థానికంగా ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తమవుతోంది. న్యూస్‌రీల్ మద్యం నుంచి సంపద సృష్టిలో చంద్రబాబు సర్కారు షాపుల వద్ద పర్మిట్ రూంలకు గ్రీన్‌సిగ్నల్ త్వరలో వెలువడనున్న ఆదేశాలు ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు నాడు వైఎస్సార్సీపీ హయాంలో మద్యం దుకాణాలు ఊరికి దూరంగా ఉండేవి. ప్రభుత్వమే నిర్వహించడం వలన నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేవి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి తీసుకుపోవడమే తప్ప అక్కడే కూర్చుని తాగే వీలుండేది కాదు. బెల్టుషాపులు, పర్మిట్ రూమ్‌లకు ఆస్కారమే లేదు. ఎమ్మార్పీకి మించి అధిక ధరల ఊసే లేదు. మద్యంపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరేది. నేడు కూటమి తెచ్చిన పైవేట్ పాలసీతో మద్యం దుకాణాలు జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లోకి వచ్చేశాయి. ఊరురా బెల్టుషాపులు వెలిశాయి. క్వార్టర్ బాటిల్‌కు ఎమ్మార్పీపై మద్యం దుకాణాల్లో రూ.10, బెల్టుషాపుల్లో రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుండటంతో మందుబాబులు మత్తులో ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఒక్కోసారి హత్యలకు సైతం దారితీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. -
నేత్రపర్వం.. పవిత్రాదివాసం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నార. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పవిత్రాదివాసాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం విశ్వక్సేనపూజ, పుణ్యహవాచనం, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలను అర్చకులు, రుత్వికులు అట్టహాసంగా చేశారు. అనంతరం పవిత్రాలకు పంచగవ్య ప్రోక్షణ, అభిమంత్రణలను నిర్వహించారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల వద్ద పవిత్రాలను ఉంచి పంచ శయనాదివాసాన్ని వేద మంత్రోచ్ఛరణతో అర్చక స్వాములు నిర్వహించారు. ఆ తర్వాత మహాశాంతి హోమాలు, చతుర్వేద పారాయణ చేశారు. -
పాములదిబ్బలో ఉద్రిక్తత
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక పాములదిబ్బలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం పాములదిబ్బకు చెందిన ముంగి యర్రబాబు ఏలూరు జాతీయ రహదారిపై హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పాములదిబ్బ ప్రాంతానికి చెందిన కొందరు నిందితులుగా ఉండటంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. హత్యకు గురైన వ్యక్తిని దహన సంస్కారానికి తీసుకువెళ్లే సమయంలోనే హతుడి కుటుంబ సభ్యులు నిందితుల ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు. అప్పట్లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ప్రత్యేక నిఘా, పోలీసు పికెట్ ఏర్పాటు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టారు. ఈ విషయం సద్దుమణిగినా నివురుగప్పిన నిప్పులా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున హత్య కేసులో నిందితుడిగా ఉన్న దాసరి కుమార్ రాజా ప్రత్యర్థులు ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పాములదిబ్బలో మళ్లీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇంటికి నిప్పు పెట్టిన ఘటనకు సంబందించి హత్యకు గురైన యర్రబాబు తల్లి పెద్దింట్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
ఉండి: మండలంలోని పాములపర్రు దళిత శ్మశాన వాటికలో ఆక్వా రైతుల కోసం రోడ్డు వేయాలనే నిర్ణయంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. శుక్రవారం మాల మహానాడు సంఘాలు, కేవీపీఎస్, సీపీఎం, అంబేడ్కర్ ఎంప్లాయిస్ యూనియన్, అంబేడ్కర్ మిషన్ వంటి సంఘాల నాయకులు పాములపర్రు దళితులను పరామర్శించి శ్మశాన వాటికను పరిశీలించారు. పాములపర్రు ఘటనపై పోలీసుల దౌర్జన్యాన్ని వారు తీవ్రంగా ఖండించారు. శ్మశానం జోలికి ఎవరు వచ్చినా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఎమ్మెల్యేకు ఎందుకింత కక్ష?: దళిత సంఘాల నేతలు స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు దళితులపై ఎందుకంత కక్ష అని వారు ప్రశ్నించారు. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలివ్వడం కాదని శ్మశాన వాటికకు వచ్చి చూస్తే రోడ్డు ఎవరికోసం వేస్తున్నారో అర్థమవుతుందని అన్నారు.ఎవరో ఇద్దరు ఆక్వారైతుల కోసం రోడ్డు వేయిస్తూ వందల మంది దళితులను ఎందుకు బాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 150 ఏళ్ల నుంచి గ్రామంలో దళితుల శ్మశాన వాటిక భూమిని ఇప్పుడు కాదంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతి దళిత పేటకు రెండెకరాల వరకు భూమి ఇవ్వాలని ప్రభుత్వ జీవో చెబుతుంటే ఇప్పుడు ఆ భూమిలో రోడు వేస్తామనడంపై మండిపడ్డారు. ప్రభుత్వ రికార్డులను మాలమహానాడు నాయకులు అడుగుతుంటే సర్వే, రెవెన్యూ శాఖాధికారులు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే ఉద్యమం తీవ్రతరం కాక తప్పదని వివిధ సంఘాల నాయకులు హెచ్చరించారు. సామరస్యంగా సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా 144 సెక్షన్ ఎత్తేసి పోలీసులు వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, జిల్లా అధ్యక్షుడు గుండు నగేష్, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్‌కుమార్, దానం విద్యాసాగర్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే క్రాంతిబాబు, జిల్లా అధ్యక్షుడు విజయ్, సీపీఎం జిల్లా నాయకుడు ధనికొండ శ్రీనివాస్, అంబేడ్కర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధు, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, అంబేడ్కర్ మిషన్ నియోజవకర్గ నాయకులు ఉన్నారు. మండల వ్యాప్తంగా 144 సెక్షన్ దళితులపై దాడులే జరగలేదంటూ స్థానిక ఎమ్మెల్యే బుకాయిస్తున్నా ఉద్యమ తీవ్రతను ముందుగానే పసిగట్టిన పోలీసు ఉన్నతాధికారులు పాములపర్రు గ్రామంలోనే కాకుండా మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు మండలంలో ప్రచారం చేయించారు. పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను కూటమి నాయకులు చేస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. దళితులకు వేధింపులు 144 సెక్షన్ సాకుతో ఇతర గ్రామాల నుంచి దళితులు పాములపర్రు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై పోలీసులు, కూటమి నాయకులు దృష్టి సారించారు. పాములపర్రు దళితుల ఫోన్ నెంబర్లు సంపాదించి వారికి ఫోన్లు చేస్తూ మీ మీద ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు.. ఇక మీ పని అయిపోయిందని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా కొందరు దళితులకు ఫోన్ చేసి ఎవరివైనా పది పేర్లు చెప్పాలని.. లేదంటే ఏ1గా నీ పేరు పెట్టాల్సి ఉంటుందని ఇబ్బందిపెడుతున్నారంటూ గ్రామానికి చెందిన కొందర దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత శ్మశాన వాటికలో రోడ్డు వేస్తారా? పాములపర్రులో దళిత సంఘాల నేతల ఆగ్రహం కూటమి నాయకులు, పోలీసుల మైండ్‌గేమ్ -
12న వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ సమావేశం
కై కలూరు: వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశ పోస్టర్‌ను పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) శుక్రవారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తేర ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 12న కండ్రికగూడెం సుఖీభవ కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్.సుధాకర్‌బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మరి కనకారావు, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు విచ్చేస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథం, దేవదాసు ప్రేమబాబు, యూత్ నాయకులు కోడిచుక్కల నాగశేషు తదితరులు పాల్గొన్నారు. విద్యాశక్తిపై నిర్బంధం తగదు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధం చేయడం తగదని స్కూల్ టీచర్స్ అసోసియేషన్(ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్‌తో కలిసి ఏలూరులోని జీజె రెసిడెన్సీలో జరిగిన ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికంగా నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తెలిపారని, కొన్ని జిల్లాల్లో విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధంగా నిర్వహించమనడం సబబు కాదన్నారు. విద్యార్థులు సాయంత్రం నాలుగు గంటలకు అలసిపోతారని, ఆ సమయంలో విద్యాశక్తి అని చెప్పి అదనంగా తరగతులు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విద్యాశక్తిపై ఎవరినీ నిర్బంధం చేయవద్దన్నారు. చాలామంది ఉపాధ్యాయులు అదనపు తరగతులు నిర్వహించి వారి సిలబస్‌ను పూర్తి చేసి వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటినా పీఆర్సీ, డీఏల ఊసెత్తకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బిల్లులు పెట్టి సంవత్సరాలు గడుస్తున్నా చెల్లింపులు చేయకపోవడం సమంజసం కాదన్నారు. కార్యక్రమానికి ఏలూరు జిల్లా అధ్యక్షుడు కాటి వెంకటరమణ అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు ఉర్ల గంధర్వరావు, అసోసియేట్ అధ్యక్షుడు పిట్ట ఫెడ్రిక్ బాబు, మహిళా అధ్యక్షురాలు జీ సంధ్యారాణి, సీనియర్ నాయకులు కే బాలరాజు, టీ అంజిబాబు, దాసరి యేసు పాదం, కే జేమ్స్, డీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన ఓ ఇంటిపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. దాడిలో రూ. 1.50 లక్షలు విలువైన 3,750 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మాటూరి దుర్గారావు జి.కొత్తపల్లి గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. బియ్యాన్ని జి.కొత్తపల్లిలోని ఉపాధిహామీ కూలి దాసరి రాజు ఇంట్లో నిల్వ చేస్తున్నాడు. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఆ బియ్యాన్ని బయటకు తరలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం సివిల్ సప్లై డిప్యుటీ తహసీల్దార్లు నాగరాజు, వెంకటేశ్వరరావు, వీఆర్ఏ బ్రహ్మయ్యలు ఆ ఇంటిపై దాడి చేశారు. అనంతరం పోలీసుల సమక్షంలో గది తలుపులు తెరచి 75 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. -
టేబుల్ టెన్నిస్‌లో విద్యార్థి ప్రతిభ
ఆగిరిపల్లి : రాష్ట్ర స్థాయిలో జరిగిన టేబు ల్ టెన్నిస్ పోటీల్లో ఆగిరిపల్లి మండల విద్యార్థి కాంస్య పతకం సాధించాడు. చొప్పరమెట్లలోని కేకేఆర్ హ్యాపీ వ్యాలీ పాఠశాల విద్యార్థి గోపాలకృష్ణ అండర్ 19 సింగిల్ విభాగంలో పాల్గొని ప్రతిభ చాటాడు. ఈ విజయం ద్వారా సీబీఎస్ఈ నేషనల్ లెవెల్ టేబుల్ టెన్నిస్ పోటీలకు అర్హత సాధించాడు. విద్యాసంస్థల చైర్మన్ కొసరాజు కోటేశ్వరరావు, సిబ్బంది విద్యార్థిని అభినందించారు. వరకట్నం వేధింపులపై కేసు నమోదు భీమవరం: అదనపు కట్నం కోసం వేదిస్తున్నారంటూ భీమవరం పట్టణానికి చెందిన గోడి అనిత శుక్రవారం పోలీసులను ఆశ్రయించింది. వివరాల ప్రకారం అనితకు రాజమహేంద్రవరం మండలం మారంపూడికి చెందిన కోడి జాషువాజైకుమార్తో సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, బంగారం కట్నంగా ఇచ్చారు. కొంతకాలం తరువాత భర్త కోడి జాషువాజైకుమార్ అతని కుటుంబ సభ్యులు రూ.10 లక్షలు అదనపు కట్నం తీసుకొని రావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ మేరకు అనిత ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ చెప్పారు. బావిలో పడిన ఎద్దు కై కలూరు: ప్రమాదవశాస్తూ బావిలో పడిన ఎద్దును స్థానిక అగ్రిమాపక సిబ్బంది చాకచక్యంగా రక్షించిన ఘటన కై కలూరు రైతు బజారు ఎదురుగా శుక్రవారం జరిగింది. ఉదయం ఓ బలమైన ఎద్దు పాడుబడిన నూతిలో పడింది. భారీ శబ్ధం రావడంతో ఓ వ్యక్తి గమనించి సమీపంలోని ఫైర్ ఆఫీస్‌లో సమాచారం అందించారు. హుటాహుటీన వచ్చిన సిబ్బంది శ్రీనివాసరావు, రాజేష్‌బాబు, రవీంద్రబాబు మరో కొందరి స్థానికుల సాయంతో తాళ్లు కట్టి ఎద్దును రక్షించారు. ఇదే నూతిలో కొద్ది రోజుల క్రితం దూడ పడితే రక్షించామని స్థానికులు చెప్పారు. బావిపై మూత ఏర్పాటు చేయాలని యజమానికి సూచించారు. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు కై కలూరు: క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుంటానని బంధువులకు సెల్ ఫోన్ మెసేజ్ పెట్టిన యువకుడిని కై కలూరు టౌన్ ఎస్సై ఆర్.శ్రీనివాస్ చాకచక్యంగా శుక్రవారం పట్టుకుని తండ్రికి అప్పిగించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఏలూరు జిల్లా తడికలపూడి గ్రామానికి చెందిన అందుగుల థామస్(20) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 4న కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏలూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మ దేవాలయం వరకు కారుకు ఆప్టింగ్ డ్రైవర్‌గా వెళ్ళాడు. అక్కడ నుంచి సమీప సోదరుడు రత్నారావుకు తాను ఇటీవల జరిగిన గొడవకు మనస్థాపం చెందానని తనువు చాలిస్తోన్నానని మెసేజ్ పెట్టాడు. దీంతో వెంకటరత్నం టోల్‌ఫ్రీ నంబర్ 112కు పోన్ చేసి పోలీసులకు వివరాలు చెప్పాడు. సెల్ సిగ్నిల్ ఆధారంగా ఆకివీడు నుంచి కై కలూరు మీదుగా ఏలూరు వెళ్లడానికి ఆర్టీసీ బస్సు ఎక్కిన థామస్‌ను కై కలూరులో టౌన్ ఎస్సై శ్రీనివాస్ గుర్తించి స్టేషన్‌కు తీసుకొచ్చారు. యువకుడి తండ్రి లక్ష్మణరావును పిలిపించి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం యువకుడిని గుర్తించడంలో చొరవ చూపిన హెడ్‌కానిస్టేబుల్ నాగరాజును అభినందించారు. -
గతంలో ఇక్కడే పరీక్ష రాశాను
నేను తితిదే వేదపాఠశాల ప్రధానాచార్యుడిగా పదవీ విరమణ చేశాను. 35 ఏళ్లుగా ఇక్కడ వేద పరీక్షలకు పరీక్షాధికారిగా వస్తున్నాను. వేదాల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి. ప్రస్తుతం 30 మంది వేద విద్యార్థులను కృష్ణ యజుర్వేదంలో పరీక్షించాను. –గుళ్లపల్లి విశ్వనాధ ఘనాపాఠీ, హైదరాబాద్ శుక్ల యజుర్వేద ప్రొఫెసర్‌గా.. మాది నేపాల్. చిన్నతనంలోనే అస్సాం వచ్చి వేద పాఠశాలలో వేద విద్యనభ్యసించాను. ప్రస్తుతం తిరుపతిలోని వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శుక్లయజుర్వేదంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. పది మంది వేద విద్యార్థులకు పరీక్ష నిర్వహించాను. – గోవిందప్రసాద్ అధికారి, శుక్ల యజుర్వేద పరీక్షాధికారి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను వేదపరీక్షలకు దశాబ్దకాలంగా పరీక్షాధికారిగా వస్తున్నాను. విశాఖపట్నంలో శుక్ల యజుర్వేదంలో శిక్షణ ఇస్తున్నాను. ఏటా ఒక బ్యాచ్ చొప్పున ఎంపిక చేసుకుంటాను. ఒక్కో బ్యాచ్‌కు పదకొండు సంవత్సరాలు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. – రాపర్తి నరేంద్రకుమార్ ఘనాపాఠీ, విశాఖపట్నం ఇక్కడి సర్టిఫికెట్లకు ప్రాధాన్యత మాది రాజస్థాన్. అక్కడ రెండేళ్లు వేద విద్య, హైదరాబాద్‌లో రెండేళ్లు, కుంభకోణంలో ఏడాది, విశాఖపట్నం వేదపాఠశాలలో మూడేళ్లు సామవేదం అభ్యసించాను. ఇక్కడ ఉత్తీర్ణత సాఽధిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంతో పరీక్ష రాయడానికి వచ్చాను. – రోహిత్‌శర్మ, రాజస్తాన్ ● -
ఇంటింటా శ్రావణ శోభ
●శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం పూజలు వైభవంగా, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పూజ అనంతరం మహిళలు చేతికి తోరణాలు కట్టుకుని ముత్తైదువులకు తోరణాలు కట్టి వాయినాలు, తాంబూళాలు అందజేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. సాయంత్రం సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. భీమవరంలో మావుళ్లమ్మ వారికి 9 లక్షల గాజులతో అలంకరణ చేశారు. మావుళ్లమ్మకు అజ్ఞాత భక్తులు సుమారు రూ. 11 లక్షల విలువ చేసే 108 బంగారు పుష్పాలను సమర్పించారు. – సాక్షి నెట్వర్క్ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన డీఆర్, పీఆర్సీ బకాయిలు తక్షణమే చెల్లించాలని, తాత్కాలిక భృతి 30 శాతం వెంటనే ప్రకటించాలని గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన సలహాదారు వీకే వీరారావు, ప్రధాన కార్యదర్శి వైవీఎస్ మూర్తి, జిల్లా కోశాధికారి వి.రామ్మోహన్‌లు డిమాండ్ చేశారు. పెన్షనర్ల జిల్లా కార్యవర్గ సమావేశం తాడేపల్లిగూడెం పట్టణంలో బ్రాంచ్ అధ్యక్షుడు బి.హరికుమార్ అధ్యక్షతన జరిగింది. వక్తలు మాట్లాడుతూ మూడు డీఆర్ బకాయిలతో సహ అన్ని బకాయిలు ప్రకటించాలని, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఆర్థిక నివేదిక, కార్యదర్శి నివేదికలను సభలో ఏకగ్రీవంగా అమోదించారు. నరసాపురం యూనిట్ కోశాధికారి స్వామి నాయుడు, తాలూకా యూనిట్ అధ్యక్షుడు ఎం.మార్కండేయులు, ఆర్.రామకృష్ణరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.హరనాథ కృష్ణ, పెన్షనర్లు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఆయిల్‌పామ్ కార్మికుడి మృతి
జంగారెడ్డిగూడెం: విద్యుదాఘాతానికి గురై ఆయిల్ పామ్ కార్మికుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం మండలంలోని తాడువాయి పరిధిలో గొల్లగూడెంలో చెరుకు ఫ్యాక్టరీ సమీపంలో రైతు కొప్పుల నాగేశ్వరరావు ఆయిల్ పామ్ తోటను లీజుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ తోటలోని ఆయిల్ పామ్ గెలలు నరికేందుకు జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంకు చెందిన తడికమళ్ల రమేష్ (35) శుక్రవారం పనికి వచ్చాడు. అక్కడ ఆయిల్ పామ్ గెలలు కోస్తుండగా, సమీపంలో ఉన్న విద్యుత్ లైన్‌కు గెలులు నరికే గెడ తగలడంతో విద్యుత్ ప్రవహించి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య చుక్కమ్మ, ఒక పాప ఉన్నారు. దీనిపై భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. ఆయిల్ పామ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఆయిల్ పామ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయిల్ పామ్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.జీవరత్నం తెలిపారు. శుక్రవారం ఆయిల్ పామ్ కార్మికుడు తడికమళ్ల రమేష్ మృతిచెందడంతో ఘటనా స్థలానికి వెళ్లి కుటంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్మికుల కుటుంబాలను ఆదుకునేవిధంగా ఆయిల్ పామ్ కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి, రూ.10 లక్షలు వ్యక్తిగత భీమా ఇవ్వాలన్నారు. అలాగే ఆయిల్ పామ్ గెలలు సురక్షితంగా కోసే విధంగా కార్మికులకు శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వేదంతో పులకించిన సరిపల్లె
గణపవరం: గణపవరం మండలం సరిపల్లె గ్రామం వేదపండితులు, ఘనాపాఠీలు, వేద విద్యార్థుల పాదస్పర్శతో పులకరించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వేదవిద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇక్కడ నిర్వహించే వేద పరీక్షలకు హాజరయ్యారు. వీరిని పరీక్షించడానికి వేదపారాయణం, పాండిత్యంలో ఆరితేరిన వేదపండితులు, ఘనపాఠీలు పరీక్షాధికారులుగా విచ్చేశారు. సరిపల్లెలోని సఖ్యాభివర్ధక నిలయంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 105వ వేదశాస్త్ర పరిషత్ మహా సభలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. గణపవరానికి చెందిన సాగిరాజు సుబ్బరాజు ఆర్థిక సహకారంతో గత మూడు దశాబ్దాలుగా సరిపల్లె టీటీడీ కల్యాణమండపంలోని ఈ వేదశాస్త్ర పరిషత్ మహాసభలు నిర్వహిస్తున్నారు. వేదవిద్యార్ధులకు ఇక్కడ రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలో పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందచేస్తారు. ఏటా శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజును నిర్వహించే వేదపరిషత్ సభలో ఉత్తీర్ణులైన వేద విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. గురు, శుక్రవారాలలో నాలుగు వేదాలలో నిర్వహించిన పరీక్షలకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, బిహార్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర తదితర 10 రాష్ట్రాల నుంచి 130 మంది వేద విద్యార్థులు హాజరయ్యారు. -
వరలక్ష్మీ వ్రతం పేరిట ధరల దోపిడీ
భీమవరం(ప్రకాశం చౌక్): వరలక్ష్మీ వ్రతం అంటేనే ఏడాదిలో తొలి పండగా భావించి ఏంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. భక్తుల సెంటిమెంట్‌ను ఆసరాగా తీసుకొని పూజకు అవసరమైనన పండ్లు, పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయల ధరలను పెంచి వ్యాపారస్తులు దోపిడీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పూజా సామగ్రి ధరలు గురువారం మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో డజను అరటి పండ్లు రూ.50 నుంచి రూ.60 ఉంటే రూ.100 రూపాయలకు విక్రయించారు. లక్ష్మీదేవి అమ్మవారికి పూజకు ఎక్కువగా చామంతి పూలు వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో చామంతి పూల రేటు పెంచి కేజీ చామంతులు రూ.600 వరకు విక్రయించారు. కనకాంబరాలను కూడా మర రూ.150 నుంచి రూ.200, మల్లెపూలు రూ.100 నుంచి రూ.150 వరకు అమ్మకాలు చేశారు. తమలపాకులు మోద రూ.50 నుంచి 70 రూపాయలు, కొబ్బరి కాయలు చిన్నవి రూ.30, పెద్దవి రూ.40 రూపాయలు చొప్పున అమ్మకాలు చేశారు. వరలక్ష్మీ వ్రతం పండుగ పేరట ధరల బాగా పెంచడంతో సామాన్యుల వరలక్ష్మీ పూజ ఖర్చుకు ఇబ్బందులు పడ్డారు. -
●రాఖీ.. సందడి
సోదర, సోదరీమణుల ఆప్యాయతానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి శనివారం కావడంతో తాడేపల్లిగూడెం పట్టణ, రూరల్ మండలంలో రాఖీల కొనుగోలులో యువతులు నిమగ్నమయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారికిరువైపులా ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు యువతులు, మహిళలు చేరుకుని రాఖీలను కొనుగోలు చేశారు. రూ.20 నుంచి రూ.280 వరకు విలువైన రాఖీలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. అయితే స్టాల్స్ విరివిగా పెరగడంతో కొనుగోళ్ళు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు పేర్కొన్నారు. – తాడేపల్లిగూడెం రూరల్ -
అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన తెగల్లో కొండరెడ్డి గిరిజనుల తెగ ఒకటి. వీరు నేటికీ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వారి సాంప్రదాయ పంటలైన జొన్న, సామలు, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాగే పలు గ్రామాల్లో వెదురు అల్లికలు, తేనె, చింతపండు, ఇప్ప పువ్వు వంటి అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. వారాంతపు సంత, ఇతర ప్రభుత్వ కార్యాలయ పనుల మీద మాత్రమే కొండ దిగి కిందకు వస్తుంటారు. వీరికి ప్రధానంగా పోడు వ్యవసాయమే జీవనాధారం. సాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు కావొస్తున్నా నేటికీ కొండరెడ్డి గిరిజనులు కొండ ప్రాంతంలోనే జీవనం సాగిస్తూ వస్తున్నారు. ప్రకృతి మాత వడిలోనే జీవిస్తున్నారు. నేటికీ చెక్కుచెదరని సాంప్రదాయం నేటి ఆధునిక ప్రపంచంలో ఎవరి బ్రతుకులు వారివే, ఎవరి పనులు వారివే. అయితే కొండరెడ్డి గిరిజనులు నేటికీ నాటి సాంప్రదాయాలు, ఆచారాలకు కట్టుబడి ఉన్నారు. వ్యవసాయమే కాదు పెళ్లిళ్లు, పేరంటాలు ప్రతిదీ సమష్టిగా చేసుకునే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. శుభకార్యాల్లో ఒకరికి ఒకరు సహకరించుకోవడం వంటివి నేటికీ చేస్తుంటారు. ప్రకృతే గిరిజనుల ఆరాధ్య దైవం ఆదివాసీ గిరిజనులు ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రావి, వేప చెట్లను ముత్యాలమ్మగా భావిస్తారు. ముఖ్యంగా బాట పండుగ, పప్పుల పండుగ, మామిడికాయ పండుగ వంటి పండుగలను ఎంతో వైభవంగా చేస్తారు. అయితే గిరిజనుల్లోనే కోయ తెగ వారు భూదేవి పండుగను తొలకరి సమయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నేటికీ ఈ పండుగ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వ పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పెద్దపీట వేశారు. సుమారు 3,220 మంది గిరిజనులకు 69814.72 ఎకరాల్లో పోడు భూములకు పట్టాలిచ్చారు. అదేవిధంగా రైతు భరోసా పథకంలో రైతులకు ప్రతీ ఏటా రూ. 15000 పెట్టుబడి సాయం అందేలా కృషి చేశారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు సైతం మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా కృషి చేశారు. అలాగే వలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు కూడా కొండపైన ఉన్నవారికి కూడా ఇంటికే అందే విధంగా చర్యలు తీసుకున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందేలా సుమారు రూ. 50 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అలాగే మారుమూల గ్రామాల నుంచి డోలి కష్టాలు కూడా లేకుండా బైక్ అంబులెన్స్ సేవలను అందించారు. ప్రకృతే వారి ఆరాధ్య దైవం నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గిరిజనులకు మళ్లీ కష్టాలు మొదలు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పథకాలకు ఒక్కొక్కటిగా మంగళం పలకుతుంది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అందించేవారు. అయితే ప్రస్తుతం దానిని తొలగించడంతో మళ్లీ గిరిజనులకు వాగులు దాటుతూ తలపై బియ్యం పెట్టుకుని మైళ్ల దూరం నడిచే పరిస్థితులు వచ్చాయి. గతంలో వలంటరీ వ్యవప్థ ద్వారా కోడి కూయక ముందే మారుమూల కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం అన్ని రకాల పింఛన్లు అందేవి. ప్రస్తుతం ఆ పింఛన్లు వారం రోజులు దాటితేకానీ అందే పరిస్థితి లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వైద్యసేవలపై కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ పాలకులు తమకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పాలన సాగించాలని గిరిజనులు కోరుతున్నారు. -
యాసిడ్ మీద పడి మహిళ మృతి
పెదపాడు: రోడ్డు ప్రమాదంలో యాసిడ్ మీద పడి ఓ మహిళ మృతి చెందగా భర్తకు గాయాలైన సంఘటన పెదపాడు మండలంలోని తాళ్లమూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు నుంచి ఏలూరుకు యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్రక్కు ఆటోలో అల్లాబక్సు అనే వ్యక్తి తన భార్య షంషేర్తో కలిసి వెళ్తున్నారు. జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వారు మార్గమధ్యలో పెదపాడు మండలంలోని తాళ్లమూడి వద్దకు వచ్చేసరికి టైర్ పంక్చర్ కావడంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న యాసిడ్ మీదపడి భార్య షంషేర్(46) అక్కడికక్కడే చనిపోయింది. యాసిడ్ గాయలైన భర్తను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ వద్ద బాధితుడి వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు. బాధితులు నెలకు రెండు సార్లు ఈ విధంగా యాసిడ్ తీసుకువచ్చి ఏలూరులో దుకాణాలకు సరఫరా చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారని చెప్పారు. ఈ మేరకు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తృటిలో తప్పిన పెనుప్రమాదం కై కలూరు: కేవలం 10 నిమషాలు అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా వస్తే భారీ ప్రమాదం జరిగేది. కై కలూరు వెలంపేట మరిపి నాగేశ్వరరావు ఇంటి వద్ద వంట చేస్తున్న సమయంలో ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ పైప్‌ను నుంచి ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. మంటలను అదుపు చేసినా ప్రయోజనం లేకపోవడంతో సమీప నివాసితులు భయంతో అరుస్తూ పరుగులు తీశారు. కొంతమంది ఫైర్ ఆఫీస్‌కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి సిలిండరు నుంచి వచ్చే మంటలను అదుపు చేశారు. అప్పటికే సిలిండర్ పేలడానికి సిద్ధంగా ఉంది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు. -
ఎఫెక్ట్
జాతీయ రహదారి మరమ్మతులు ప్రారంభంకొయ్యలగూడెం: స్థానిక జాతీయ ప్రధాన రహదారి అభివృద్ధికి నేషనల్ హైవే అధికారులు శుక్రవారం పనులను ప్రారంభించారు. జూలై 26న సాక్షిలో ‘అధ్వాన రహదారులతో ఇక్కట్లు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు ఇటీవల చెక్ పోస్ట్ సెంటర్ నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు వరకు ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మార్జిన్‌ను పరిశీలించారు. అనంతరం పొక్లెయిన్‌తో రహదారిపై ఏర్పడిన మార్జిన్‌ను క్రమబద్ధీకరించే పనులను ప్రారంభించారు. రెండు రోజులలో పనులను పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అప్పటివరకు డివైడర్‌కి ఒక పక్కనే రాకపోకలను సాగించడానికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు చర్యలు తాడేపల్లిగూడెం రూరల్: భారీ వర్షాలు కురిస్తే రహదారులపై నీళ్లు నిలిచిపోతుండటం, పారిశుద్ధ్యం లోపిస్తుండటంపై ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. మండలంలోని మోదుగ గుంట, ఉప్పరగూడెం గ్రామాల్లో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని మోటార్లు ఏర్పాటు చేసి, బయటకు పంపించే ఏర్పాటు చేశారు. ఇన్చార్జ్ ఎంపీడీఓ ఎం.వెంకటేష్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం రహదారులపై బ్లీచింగ్, ముగ్గు చల్లించారు. -
ఓటరు జాబితా సవరణ ఆపాలి
సాక్షి కథనాలకు స్పందన తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెంలో పారిశుద్ధ్య లోపం, రహదారుల మరమ్మతులపై ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. 8లో uభీమవరం: ప్రత్యేక సమగ్ర సర్వే (ఎస్ఐఆర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్న ఓటర్ల జాబితా సవరణను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉన్న రాష్ట్రాలలో తన పెత్తనం కోసం ప్రతిపక్షాల ఓటు బ్యాంక్‌ను తొలగించడానికే సవరణను ఆయుధంగా చేసుకుందని, దానికి ఎన్నికల సంఘం వత్తాసు పలుకుతుందని విమర్శించారు. గతంలో ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులను కూడా ఈ సవరణలో పరిగణనలోకి తీసుకోకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ సర్వేను దేశమంతా అమలు చేయాలని చూస్తుందని ఒక పక్క ఎన్నికల ప్రక్రియలో ఉన్న లోపాలపై చర్చ జరుగుతుండగా మరోపక్క సర్వే పేరుతో ఓటర్లను గందరగోళపర్చడం, తొలగించడం అన్యాయమన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని స్వతంత్ర సంస్థగా కాకుండా కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థగా మార్చేసిందని గోపాలన్ దుయ్యబట్టారు. తక్షణమే ఎస్ఐఆర్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా నాయకులు జక్కంశెట్టి సత్యనారాయణ, ఇంజేటి శ్రీనివాస్, ఎం.ఆంజనేయులు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణంరాజు, త్రిమూర్తులు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయం.. సేవలు నిర్వీర్యం
శురకవారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, భీమవరం: ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేసింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, బ్యాటరీలు తదితర వాటికి నిర్వహణ కరువైంది. మరమ్మతులతో కొన్ని షట్‌డౌన్ కాగా.. మిగిలినవి తరచూ మొరాయిస్తుండటంతో సచివాలయ సేవల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మకంగా.. గత ప్రభుత్వం జిల్లాలో 398 గ్రామ, 137 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. ఒక్కో సచివాలయానికి సచివాలయ సెక్రటరీ, ఇంజినీరింగ్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, హార్టీకల్చర్, వెటర్నరీ, డిజిటల్ అసిస్టెంట్లు, ఏఎన్ఎం, విలేజ్ సర్వేయర్ తదితర 10 నుంచి 11 పోస్టులను నియమించింది. రేషన్ కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు, ఆరోగ్యశ్రీ, భూరికార్డులు తదితర 500లకు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆయా సేవలను బట్టి తక్షణ పరిష్కారం, కొన్ని 72 గంటలు, మరికొన్ని వారం నుంచి రెండు వారాల వ్యవధిలో పరిష్కరించేలా టైం బాండ్ సైతం పెట్టింది. సేవలు సక్రమంగా అందేలా.. సేవల్లో పారదర్శకత, సమయ పాలన, వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఒక్కో సచివాలయానికి రెండు నుంచి మూడు వరకు కంప్యూటర్లు, ప్రింటర్లు, బ్యాటరీలు తదితర సామగ్రిని అందజేశారు. అప్పటికే పంచాయతీల్లో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రిని మినహాయించి మిగిలిన పరికరాలను ఇచ్చారు. మొత్తం 535 సచివాలయాలకు గా ను గత ప్రభుత్వంలో కొత్తగా 1,070 సీపీయూలు, 1,070 మోనిటర్లు, 535 ప్రింటర్లు, 535 యూపీఎస్ లు, 1,605 బ్యాటరీలు కలిపి మొత్తం 4,815 పరికరాలను అందజేశారు. పంచాయతీలు, పురపాలక సంస్థలు వీటి నిర్వహణను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆయా పరికరాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే సేవలకు ఆటంకం కలగకుండా వెంటనే మరమ్మతులు చేయించే పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉండేది. న్యూస్రీల్కూటమి శీతకన్ను నిర్వహణ లేక మూలన పడుతున్న కంప్యూటర్లు, సామగ్రి జిల్లాలో 535 సచివాలయాలు అందించిన పరికరాలు 4,815 పనిచేస్తున్నవి 2,088 మాత్రమే ప్రజలు, ఉద్యోగుల అవస్థలు పరికరాలు మొత్తం పని పని చేస్తున్నవి చేయనివి సీపీయూలు 1,070 749 321 మోనిటర్లు 1,070 857 213 ప్రింటర్లు 535 284 251 యూపీఎస్‌లు 535 69 466 బ్యాటరీలు 1,605 129 1,476 -
వేధింపులు ఆపాలి
పనిచేయని ఫోన్లను తిరిగి అప్పగించిన అంగన్వాడీలపై అధికారుల వేధింపులు మానాలి. టార్గెట్ల పేరుతో అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తాం. – డీఎన్‌వీడీ ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఏలూరు వెసులుబాటు కల్పించాలి ఫేస్ క్యాప్చర్‌తో నిమిత్తం లేకుండా మాన్యువల్‌గా రేషన్ ఇచ్చే వెసులుబాటు కల్పించాలి. యాప్‌ల వల్ల మాతో పాటు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారులు ఓటీపీ చెప్పేందుకు సంబంధిత ఫోన్లు అందుబాటులో ఉండటం లేదు. – పి.సుజాత, జిల్లా అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏలూరు జిల్లా అప్లోడ్ కావడం లేదు మాకిచ్చిన ఫోన్లలో యాప్‌లు అప్లోడ్ అవడం లేదు. పీడీఎఫ్ ఫైల్స్ ఓపెన్ కావడం లేదు. దీనికితోడు స్వర్ణాంధ్ర యాప్ పనులు చేయమంటున్నారు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినా అధికారులు టార్గెట్లు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. – పి.భారతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏలూరు జిల్లా 5జీ ఫోన్లు ఇవ్వాలి తక్షణమే అంగన్వాడీలకు 5జీ ర్యామ్ ఉన్న ఫోన్లను ఇవ్వాలి. పాత ఫోన్లలో న్యూవెర్షన్ యాప్‌లను అప్లోడ్ చేయమంటే ఎలా. ఐసీడీఎస్ అధికారులు అర్థం చేసుకోవాలే తప్ప మాపై కక్ష సాధింపులకు దిగడం సరికాదు. అన్ని యాప్‌లను కలిపి ఒకే యాప్‌గా మార్చాలి. – టి.మాణిక్యం, జిల్లా కోశాధికారి,ఏపీ అంగన్వాఢీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏలూరు జిల్లా ● -
కూటమి పాలనలో రక్షణ కరువు
భీమవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నివర్గాల ప్రజలకు రక్షణ లేదని, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్ గౌడ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, పార్టీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా గురువారం భీమవరం ప్రకాశం చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని వస్తున్న నాయకులపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేని కూటమి ప్రభుత్వం, అడ్డదారిలో గెలవడానికి ఓటర్లను భయాందోళనకు గురిచేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ అ రాచకాలను వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రజల ముందుంచడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ప్రభుత్వం పద్ధతి మార్చుకుని సూ పర్‌సిక్స్ హామీలను తక్షణం అమలుచేయాలని లే కుంటే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్సీపీ ఎంబీసీ విభాగ అధ్యక్షుడు పెండ్ర వీరన్న, యూత్వింగ్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేదన్నారు. బలహీన వర్గాల ప్రజాప్రతినిధులపై వరుస దాడులతో వైఎస్సార్సీపీని బలహీనపర్చలేరన్నారు. పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్య క్షుడు జహంగీర్, పట్టణ శాఖ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, పార్టీ నాయకులు బాలాజీ, గంటా సుందరకుమార్, కమతం మహేష్, పాలా లక్ష్మీచక్రధర్, గేదెల నర్సింహరావు, పతివాడ మార్కండేయులు, ఈద జాషువ, రుద్రాక్షల శ్రీను, తుంపాల శ్రీను, షేక్ రబ్బాని, రాయవరపు శ్రీనివాసరావు, పాలా నాగరాజు, వీరవల్లి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
రాజ్యాంగానికి రఘురామ వరకభాష్యం
ఉండి: రాజ్యాంగం కల్పించిన హక్కులకు వక్రభా ష్యం చెబుతూ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఏపీ బహుజన జేఏసీ రాష్ట్ర నా యకులు అన్నారు. పాములపర్రులో జరిగిన ఘటనపై వివరణ ఇస్తూ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పాములపర్రు దళితులు, జేఏసీ రాష్ట్ర నాయకులు గురువారం నిరసన తెలిపారు. ఏపీ బహుజన జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ మత స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, దీనిని కాదని క్రైస్తవ మతానికి చెందిన వారు దళితులు కారని ఎమ్మెల్యే ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. రాష్ట్రంలో వివిఽ ద కులాలకు చెందిన వారు క్రీస్తును నమ్ముకున్నారు వారిని క్రైస్తవులుగా మార్చేస్తారా? వారి కులాన్ని కాదంటారా? అంటూ ప్రశ్నించారు. కూటమి నాయకుల తప్పుడు సమాచారంతోనే ఎమ్మెల్యే రఘురామ మాట్లాడుతున్నారన్నారు. గతంలో అధికారులు ఇచ్చిన శ్శశాన భూమి రికార్డులు పరిశీలించడంతో పాటు 150 ఏళ్ల నుంచి ఇక్కడ సమాధులున్నాయని గమనించాలన్నారు. స్థానికంగా వరి చేలు లేవని, ఉన్నవి రొయ్యల చెరువులేనన్నారు. నలుగురు రైతుల సంక్షేమం కోసం వందల మంది మనోభావాలు దెబ్బతినేలా దళితులకు ప్రత్యేకమైన శ్శశాన భూమిని పాడుచేసేలా రోడ్డు నిర్మాణం చేస్తారా అని మండిపడ్డారు. పాములపర్రులో దళితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని చెప్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మాజీ సీఎం జగన్, జాతీయ మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఉండిలో ఓ కూటమి నేత ఇంటికి రాత్రి వేళలో ఓ పోలీస్ అధికారి వెళ్లడం, వారితోపాటు శ్శశానంలో రోడ్డు కావాలంటూ ప్రేరేపించిన కూటమి నాయకులు ఉండటం అనుమానాలకు తావిస్తోందని దళితులు చెబుతున్నారు. ఏపీ బహుజన జేఏసీ -
ఇసుక దందా
స్నాతకోత్సవానికి నిట్ సిద్ధం తాడేపల్లిగూడెంలోని ఏపీ నిట్ 7వ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. శనివారం ఉదయం వేడుకలు ప్రారంభం కానున్నాయని ఇన్చార్జి డైరెక్టర్ తెలిపారు. 8లో uపెనుగొండ: ఇసుక అక్రమ నిల్వలు కాసులు కురిపిస్తున్నాయి. ఆచంట మండలంలో కూటమి నాయకులు భారీ ఎత్తున ఇసుకను అక్రమంగా నిల్వ చే శారు. గోదావరికి వరద నీరు రావడంతో నెమ్మదిగా అమ్మకాలకు తెరలేపారు. ఇసుక అమ్మకాలు జో రుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు రోజులుగా ఆచంట మండలంలో ఇసుక అమ్మకాలు వి చ్చలవిడిగా సాగుతున్నాయి. ఐదు యూనిట్ల ఇసుక రూ.9 వేలకు విక్రయిస్తున్నారు. సిద్ధాంతం నుంచి నరసాపురం వరకూ ఇసుక తవ్వకాలకు గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరంతో ర్యాంపు తెరుచుకోలేదు. అయినా పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా నిర్వహించి మండలంలో పలుచోట్ల నిల్వ ఉంచారు. వైఎస్సార్సీపీ సర్పంచ్ల ఫిర్యాదు ఆచంట మండలంలో ఇసుక అక్రమల నిల్వలపై వైఎస్సార్ సీపీ సర్పంచ్‌లు కొందరు ఇటీవల అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణం ఇసుకను స్వాధీ నం చేసుకోవాలని డిమాండ్ చేసినా అధికారుల నుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఇసుక నిల్వ చేసిన కూటమి నేతలు అమ్మకాలు ప్రారంభించా రు. గుట్టలు త్వరగా ఖాళీ చేసి ఎలాంటి నిల్వలు లే వని నమ్మించాలని చూస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకులు అంటున్నారు. అక్రమార్కులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
షోకాజ్ నోటీసుల ఉపసంహరణ
భీమవరం(ప్రకాశం చౌక్): పీ4 సర్వేకు సంబంధించి భీమవరంలో 26 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై ఇటీవల ‘సాక్షి’లో ప్రచురించిన కథనంపై అధికారులు స్పందించారు. విషయాన్ని ఉద్యోగుల సంఘ నాయకులు రాష్ట్రస్థాయి అధికారులు దృష్టికి తీసుకువెళ్లడంతో వారు స్పందించారు. 26 మంది సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు విత్‌డ్రా చేసుకోవాలని ఆదేశించడంతో మున్సిపల్ కమిషనర్ ఈ దిశగా చర్యలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. మందకొడి సర్వేతోనే.. పట్టణంలో పీ4 సర్వే మందకొడిగా జరగడంతో కొందరు సచివాలయ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చామని మున్సిపల్ కమిషన్ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలో కేవలం 12 శాతం మాత్రమే సర్వే జరిగిందని, 12 సచివాలయాల్లో సర్వే కనీసం మొదలు కాలేదన్నారు. ఈ క్రమంలోనే నోటీసులు ఇచ్చామని, ఉద్యోగులపై ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం భీమవరం: గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులకు అవార్డులు అందించనున్నామని, ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఈ.నారాయణ గురు వారం ఓ ప్రకటనలో తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారు అర్హులన్నారు. 16న తుది జాబితా రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని, 21 నుంచి మూడు రోజులపాటు రాష్ట్రస్థాయిలో ఎంపికై న ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 25న ఎంపికై న వారి తుది జాబితాను విడుదల చేస్తారని డీఈఓ నారాయణ తెలిపారు. చేనేత వస్త్రాలను ఆదరించాలి భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో చేనేత వస్త్రాలకు విస్తృత ప్రచారం కల్పించి, మార్కెటింగ్‌ను పెంపొందించాలని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి సూచించారు. గురు వారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో ప్రకా శం చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వర కు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకం ప్రారంభం, నేత కార్మికులకు సత్కారం కార్యక్రమాల్లో ఇన్చార్జి కలెక్టర్, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ పీతల సుజాత పాల్గొన్నారు. ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారి కె.అప్పారావు, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, నేత కార్మికులు పాల్గొన్నారు. మార్గదర్శిగా నమోదు స్వచ్ఛందమే.. పీ4పై అవగాహన లేకుండా ప్రజలకు వక్రభాష్యం చెప్పే ప్రచారాన్ని ఉపేక్షించేది లేదని ఇన్చార్జి కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. బంగారు కుటుంబాలను ఆదుకోవడంలో మార్గద ర్శుల ఎంపిక పూర్తిగా స్వచ్ఛందంగానే జరుగుతోందన్నారు. మార్గదర్శుల నమోదుకు ఒత్తిడి లేదన్నారు. బంగారు కుటుంబాలను మార్గదర్శులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లకు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భీమవరం కలెక్టరేట్ నుంచి ఇన్చార్జి కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. బ్యాంకు ఏజెంట్ల పేరుతో మోసం భీమవరం: బ్యాంకు రికవరీ ఏజెంట్లుమంటూ ఇద్దరు వ్యక్తులు భీమవరం ఏడో వార్డుకు చెందిన కె.రామలక్ష్మి నుంచి రూ.2 లక్షలు తీసు కుని మోసగించినట్టు పోలీసులు తెలిపారు. పట్టణంలోని మారుతీనగర్‌లో భవనానికి మార్టిగేజ్ రుణం తీసుకున్నారు. వాయిదా చెల్లించాల్సి ఉండగా హైకోర్టులో స్టే వేద్దామని చెప్పి నగదు తీసుకుని ఇప్పటివరకు సమాధానం చెప్పడం లేదని రామలక్ష్మి ఫిర్యాదులో పేర్కొనగా ఎస్సై బీవై కిరణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుండీ ఆదాయం లెక్కింపు భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామ క్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.10,50,655 లభించిన్నట్లు ఈఓ డి.రామకృష్ణంరాజు తెలిపారు.. స్వామి వారి నిత్యాన్నదానానికి రూ.18,886 లభించిందన్నారు. కార్యనిర్వహణాధికారి కర్రి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అంగన్వాడీలతో సెల్‌గాటం
ఏలూరు (టూటౌన్): ‘సిగ్నల్స్ పని చేయవు.. యాప్స్ సపోర్టు చేయవు.. గతంలో 2జీ ఫోన్లు ఇచ్చారు.. ప్రస్తుతం 5జీ యాప్స్ అప్లోడ్ చేయమంటున్నారు.. యాప్‌ల సాకుతో ఫేస్ రికగ్నైజ్ కాకపోతే రేషన్ కట్ చేస్తామంటున్నారు.. ఇలాగైతే అంగన్ వాడీ కేంద్రాలను నడిపేది ఎలా.. తాము విధులు నిర్వర్తించేది ఎలా..’ అంటూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫోన్లు అయినా ఇవ్వండి లేదా యాప్‌లను రద్దయినా చేయండి అంటూ అంగన్వాడీలు అధికారులను వేడుకుంటున్నారు. యాప్‌లపై కనీస శిక్షణ ఇవ్వకుండా, యాప్‌లను సపోర్టు చేసే ఫోన్లను అందించకుండా మెడపై కత్తి పెట్టి మరీ పనిచేయంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర మంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా అంగన్వాడీలు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సెల్ఫోన్లను అప్పగిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఐసీడీఎస్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో 3,851 మంది అంగన్వాడీ కార్యకర్తలు, అదే సంఖ్యలో సహాయకులు పనిచేస్తున్నారు. యాప్‌లలో అప్లోడ్ తిప్పలు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కార్యకలాపాలను బాల సంజీవని, పోషణ ట్రాకర్ యాప్‌ల ద్వారా నిర్వహించాలి. ఫేస్ యాప్, ఫేస్ క్యాప్చర్, కేవైసీ, ఓటీపీ వంటి పనులు చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఫోన్లు సహకరించడం లేదు. ఫేస్ క్యాప్చర్ అయితేనే.. యాప్‌లలో ఫేస్ క్యాప్చర్ అయితేనే అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహారం ఇవ్వాలి. దీంతో లబ్ధిదారులకు ముఖ ఆధారిత గుర్తింపుతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో కుటుంబంలో ఎవ రూ వచ్చినా రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు లబ్ధిదారుడు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్‌కు నిధులు తగ్గిస్తోంది. దీంతో అరకొర సౌకర్యాలతో సెంటర్లు నడుస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు యాప్‌లతో ఇబ్బంది పడుతున్నామని, సిగ్నల్స్ సరిగా లేక, సర్వర్ పనిచేయక తిప్పలు పడుతుంటే.. అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని అంగన్వాడీలు అంటున్నారు. పదో తరగతి చదివిన తమను యాప్‌లలో పనిచేయాలంటే ఎలా అని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నా రు. ఒక లబ్ధిదారుడి ఫేస్ క్యాప్చర్ చేయాలంటే రెండు, మూడు గంటల సమయం పడుతుందంటున్నారు. ఒక్కో కేంద్రంలో సగటున మూడేళ్లలోపు పిల్లలు 50 నుంచి 60 మంది, గర్భిణులు, బాలింతలు 10 నుంచి 15 మంది వరకు, ప్రీ స్కూల్ పిల్లలు 10 నుంచి 20 మంది, కిశోర బాలికలు 10 నుంచి 50 మందిలోపు ఉంటారని అంటున్నారు. వీరందరికీ ప్రతినెలా ఈకేవైసీ, ఓటీపీ, ఫేస్ క్యాప్చర్ చేయాలంటే సమయం సరిపోవడం లేదని అంగన్వాడీలు ఆవేదన చెందుతున్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా జిల్లా మెయిన్ కేంద్రాలు 1,959 1,556 మినీ కేంద్రాలు 206 70 మొత్తం 2,165 1,626 అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులు పశ్చిమగోదావరి ఏలూరు ఆరేళ్లలోపు పిల్లలు 43,783 41,116 మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 19,672 19,909 గర్భిణులు 8,596 7,889 బాలింతలు 6,170 5,606 మొత్తం 78,221 74,520 యాప్‌ల కత్తి సపోర్టు చేయని ఫోన్లతో ఇబ్బందులు ముఖ ఆధారిత గుర్తింపుతోనే రేషన్ పనిచేయని యాప్‌లు.. అధికారుల ఒత్తిళ్లు ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఫోన్ల అప్పగింత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు -
జోరుగా చేపనారు ఉత్పత్తి
ఉంగుటూరు: రాష్ట్రంలోనే పేరుగాంచిన బాదంపూడి ప్రభుత్వ మత్స్య కేంద్రంలో చేపనారు ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇక్కడ చేపనారు ఉత్పత్తి జూలై నుంచి ప్రారంభించి నవంబరు వరకు కొనసాగిస్తారు. ఈ ఏడాది చేపనారు ఉత్పత్తి లక్ష్యం 24 కోట్లుగా ప్రభుత్వం నిర్ధేశించగా జూలైలో 4 కోట్ల 40 లక్షలు చేపనారు ఉత్పత్తి పూర్తి చేశారు. రాహు, కట్ల, మ్రిగాలా, కామన్ రకాలు పిల్లలు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసిన చేపనారు పిల్లలను కొవ్వలి, ఏలూరు, తణకు, కర్నూలు, గాజుల దిన్నె, మోటూరు, తదితర ప్రభుత్వ ఫారాలకు సరఫరా చేశారు. ఫారంలో ఒక ఫీల్ట్మేన్, ఒక ఫిషర్‌మేన్, ఇద్దరు కూలీలు పనిచేస్తున్నారు. రెండు అంగుళాలు ఉన్న చేపపిల్లలు ఫింగర్ లింగ్సు టార్గెట్ ఒక కోటిగా ఉంది. 90 లక్షలు ఇప్పటికే నిల్వ చేసి ఉంచారు. చైనీస్ విధానంలోనే ఉత్పత్తి చేపనారు ఉత్పత్తి చైనీస్ హేచరీస్లోనే ఉత్పత్తి చేయడం జరుగుతోంది. మేలుజాతి తల్లిచేపలను ముందుగానే సేకరించి చెరువుల్లో పెంచుతారు. వాటిలో ముందురోజు సాయంత్రం తల్లి చేపలు మగ, ఆడకు ఓవ సీస్ (తల్లి చేపలకు హర్మోన్) ఇంజక్షన్ ఇస్తారు. ఆ రెండు చేపలు సంయోగ పక్రియ ద్వారా గుడ్లును విడుదల చేస్తాయి. ఈరెండు బాహ్యఫలదీకరణ చెందిన గుడ్డు ఏర్పడుతాయి. ఇవి నీటిని షోచించుకుని ఉబ్బి ఉదయానికి గుడ్లు మధ్యలో స్పష్టమైన కేంద్రకుము ఏర్పడుతుంది. ఈ గుడ్లు తరువాత సమవిభజనతో అబివృద్ధి చెంది వివిధ దశలగా రూపాంతరం చెందుతూ స్పాన్‌గా తయారవుతుంది. బ్రీడింగును సాయంత్రం వేళలో నిర్వహిస్తారు. తరువాత రోజు ఉదయానికి గుడ్లు ఏర్పడతాయి. ఈ గుడ్లు మరుసటి రోజు సాయంత్రానికి ఒక వయస్సు కలిగిన స్పాన్‌గా ఉత్పత్తి అవుతాయి. ఇలా అభివృద్ధి చెందిన స్పాన్ మరో రెండురోజులు హేచరీ నందు ఉంచడం జరుగుతుంది. మెత్తంగా మూడురోజులు కలిగిన స్పాన్‌ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 6 గంటల సమయంలో చైనీస్ హేచరీలో వేస్తారు. ఇలాచేపనారు ఉత్పత్తిచేసి ప్రభుత్వ ఫారాలకు సరఫరా చేస్తారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచింది రాష్ట్రంలోనే పేరు గాంచిన ఈ చేపల ఉత్పత్తి కేంద్రానికి అనుబంధంగా శిక్షణా కళాశాల నడుస్తోంది. ఇందులో మూడు నెలలు కోర్సు ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ చదువుకున్న వారికి ఫిషర్‌మేన్ ఇతర ప్రభుత్వ ప్రైవేట్ ఫారాల్లో పోస్టులు కూడా చేస్తున్నారు. అందువల్ల ఈశిక్షణా కేంద్రానికి ఉమ్మడి రాష్ట్రంలోనే పేరుంది. కాగా బాదంపూడి మత్య్స కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ క్షేత్రంలో నూతన భవనాలు లేకపోవడంతో తల్లి చేపలు పెంచడంలేదు. సమయానికి కొనుగోలు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. తగినంతమంది సిబ్బంది లేకపోవడం, జిల్లా, రాష్ట్ర స్థాయి మత్స్య శాఖ అధికారుల పర్యవేక్షణా లోపం కూడా ఇక్కడ ఉంది. ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యం 24 కోట్లు ఇప్పటివరకు 4.40 కోట్ల ఉత్పత్తి పూర్తి ఉత్పత్తి చేసిన చేపనారు ప్రభుత్వ ఫారాలకు సరఫరా -
కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం
జంగారెడ్డిగూడెం : కూటమి ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్సార్సీపీ బీసీ నాయకులు, బీసీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పీపీఎన్ చంద్రరావు స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, పట్టణ వైఎస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు పీపీఎన్చంద్రరావు, చిటికెల అచ్చిరాజు, చనమాల శ్రీనివాస్, బత్తిన చిన్న, భావన రుషి తదితరులు మాట్లాడారు. 50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం అందరికీ ఇవ్వలేదన్నారు. బీసీలను ఆకాశానికెత్తేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి చంద్రబాబు మరోసారి మోసం చేశారన్నారు. 2014లో కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదని, ప్రాధాన్యత సీట్లు కూడా ఇవ్వలేదన్నారు. బీసీ మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, బీసీల్లో చేతివృత్తులకు రుణం ఇస్తామని మొండి చేయి చూపించారన్నారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా నిలకడలేని మనస్తత్వం అని, పొంతనలేని మాటలు మాట్లడతారని విమర్శించారు. ఈవీఎంల అక్రమాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 53 శాతం ఉన్న బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ అంటే హత్యలు, అత్యాచారాలు, అవినీతి, అరాచకాలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు కేసులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. లోకేష్ మంగళగిరిలో చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. పథకాల అమలు జగన్‌కే సాధ్యం మాటిస్తే మడమ తిప్పని వైఎస్ జగన్మోహన్రెడ్డికే పథకాలు అమలు సాధ్యమని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో బీసీలకు పట్టం కట్టారని, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు ఆరుగురు, రాజ్యసభ సభ్యుల నలుగురికి పదవులు కల్పించారన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో జగన్మోహన్రెడ్డి బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. ఒక్క జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. చేనేత సొసైటీలకు నూలు, రంగులు సబ్సిడీపై ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎల్.వెంకటేశ్వరరావు, కేమిశెట్టి మల్లిబాబు, చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్, పెసరగంటి త్రిమూర్తులు, పెప్సీ శ్రీను, చిటికెల అచ్చిరాజు, ఆదినారాయణ, మాధవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి నిట్ సిద్ధం
తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్) ఏడవ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీ ఉదయం నిట్‌లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుకలో 2021–25 బ్యాచ్ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. ముఖ్యఅతిథిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రెసిడెంటు వి.రాజన్న హాజరవుతున్నారని ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ.రమణరావు తెలిపారు. రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. 2015లో ఏపీ నిట్ ఏర్పాటుకాగా, ఇప్పటి వరకు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సును ఏడు బ్యాచ్‌ల విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. ఏడో స్నాతకోత్సవంలో 506 మంది బాలురు, 161 మంది బాలికలకు డిగ్రీలు పట్టాలు ప్రదానం చేస్తారు. వీరితో పాటు పీహెచ్డీ పూర్తి చేసిన 29 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను అందచేయనున్నారు. సంస్థలో మొత్తం ఎనిమిది కోర్సులను నిర్వహిస్తుండగా ఆయా కోర్సుల్లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొత్తం ఎనిమిది మంది విద్యార్థులకు బంగారు పతకం అందిస్తారు. స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిట్ అకడమిక్ డీన్ డాక్టర్ ఎన్.జయరామ్ తెలియచేశారు. బంగారు పతకాలు అందుకొనేది వీరే బయో టెక్నాలజీ – శశాంక్, కెమికల్ ఇంజనీరింగ్ –సంగెపు అభినవ్, సివిల్ ఇంజనీరింగ్ – తమ్ము హరిత, సీఎస్ఇ– కలిదిండి పవన్ తేజ సత్యవర్మ, ఈఈఈ– ఆదిత్య ప్రతాప్ సింగ్, ఈసీఇ– చిత్తిడి ధనుషాలక్ష్మి దుర్గ, మెకానికల్ ఇంజనీరింగ్ – వుడుమూడి ప్రియాంక, ఎంఎంఇ– జయస్మిత కే ప్రధాన్ బంగారు పతకాలు అందుకుంటారు. బ్యాచ్‌లో అత్యధిక గ్రేడ్‌పాయింట్లు సాధించిన కలిదిండి పవన్ తేజ సత్యవర్మ ఇనిస్టిట్యూట్ తరపున కోర్సు వారీగానే రెండు బంగారు పతకాలను అందుకోనున్నారు. -
బూజు పట్టిన పరోటాల విక్రయంపై కేసు నమోదు
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం విజేత స్టోర్‌ను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఆర్ రెడ్డి తనిఖీ చేసి బూజు పట్టిన పరోటాలను విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరానికి చెందిన పడమటి దిలీప్‌కుమార్ ఈనెల 5వ తేదీన విజేత స్టోర్‌లో ప్రెస్ బెల్ కంపెనీ మలబార్ పరోటాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకువెళ్లి చూడగా బూజు పట్టి ఉన్నాయి. దీంతో ఆయన వాటిని స్టోర్‌కు తీసుకువచ్చి అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌కు చూపించారు. అదే బ్యాచ్‌లో ఉన్న మరో ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి చూడగా ఆ ప్యాకెట్లోని పరోటాలూ బూజు పట్టి ఉండడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఆర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఆయన స్టోర్‌ను తనిఖీ చేసి పరోటాలు బూజు పట్టి ఉండడాన్ని గుర్తించి జేసీ కోర్టుకు కేసు నమోదు చేశారు. రాజమండ్రికి చెందిన ప్రెస్ బెల్ కంపెనీ నుంచి పరోటాలు సరఫరా అవుతున్నాయని, మిగిలిన వాటిని కూడా పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తామని ఏఎస్ఆర్ రెడ్డి చెప్పారు. -
ఆంధ్రా చేపల సాగు అదుర్స్
జార్ఖండ్ ఆక్వా రైతుల కితాబు కై కలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొల్లేరు ప్రాంతంలో ఆక్వా సాగు ఆచరణాత్మకంగా ఉందని జార్ఖండ్ రాష్ట్ర ఔత్సాహిక చేపల రైతులు కితాబిచ్చారు. మూడు రోజుల క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా కై కలూరు పరిసర ప్రాంతాల్లో రైతుల బృందం గురువారం పర్యటించింది. కై కలూరు మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి.రాజ్‌కుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్.గణపతి ఆక్వా సాగు మెలకువలను రైతులకు వివరించారు. ఆటపాక గ్రామంలో ముదునూరి సీతారామరాజు చేపల చెరువును పరిశీలించి సాగు విధానాలను రైతుల నుంచి సేకరించారు. కై కలూరులో పలు ఆక్వా మందుల దుకాణాలను సందర్శించి చేపల సాగులో ఎదురవుతున్నా వ్యాధులు, ఎటువంటి మందులు వినియోగిస్తారు అనే విషయాలు నమోదు చేసుకున్నారు. అక్కడ నుంచి ఆచవరంలో చేపల ప్యాకింగ్ చేసే విధానాన్ని పరిశీలించారు. చివరిగా మండవల్లి మండలం కొర్లపాడులో కొరమేను చేపల సాగును పరిశీలించి రైతు నుంచి సాగు పద్ధతులు, పెట్టుబడి, కొరమేను విత్తనం, మార్కెట్లో రేటు, నీటి వనరులు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. బృందానికి నాయకత్వం వహించిన జార్ఖండ్ ఫిషరీష్ ఫిల్డ్ ఆఫీసర్ ప్రశాంత్‌కుమార్ దీపక్ మాట్లాడుతూ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు(ఎన్‌ఎఫ్‌డీఏ), హైదరాబాదు సౌజన్యంతో జార్ఖండ్ ప్రభుత్వ మత్స్య, పశుసంవర్థక, కోఆపరేటివ్‌శాఖ ఆధ్వర్యంలో 15 మంది రైతులు బృందం వచ్చామన్నారు. ఇక్కడ సేకరించిన ఆక్వా సాగు పద్ధతులను జార్ఖండ్ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. శుక్రవారం కొల్లేరు ప్రాంతంలో మరింతగా చేపల సాగు పద్ధతులను తెలుసుకుని, శనివారం మచిలీపట్నం వెళతామన్నారు. కార్యక్రమంలో గ్రామ మత్స్యశాఖ సహాయకుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
వారం రోజుల తర్వాత ఇంటికి మృతదేహం
కై కలూరు: చేపల లోడ్‌తో వెళుతూ మధ్యప్రదేశ్ రాష్ట్ర జబ్బల్పూర్ వద్ద వ్యాన్ బోల్తా పడటంతో పందిరిపల్లిగూడెంకు చెందిన వ్యాన్ డ్రైవర్ కర్ణం చిరంజీవి చంద్రమౌళి (27) జూలై 31న మరణించాడు. ఇదే ప్రమాదంలో నత్తగుళ్ళపాడుకు చెందిన క్లీనర్ దావీదుకు తీవ్ర గాయాలయ్యాయి. ఫంగస్ చేపల లోడుతో వెళుతున్నా వ్యాన్ అక్కడ డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు వెళ్లగా పోస్టుమార్టం అనంతరం చిరంజీవి మృతదేహాన్ని బుధవారం గ్రామానికి తీసుకొచ్చారు. చిరంజీవికి భార్య, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. రాష్ట్ర వడ్డీ సాధికారిత కమిటీ చైర్మన్ బలే ఏసురాజు, పలువురు కొల్లేరు పెద్దలు చిరంజీవి భౌతికకాయానికి నివాళి అర్పించారు. చిరంజీవి మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
రైతుల భూములతో ‘కూటమి’ వ్యాపారం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ విమర్శించారు. గురువారం ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా 70 వేల ఎకరాలు తీసుకుందని మండిపడ్డారు. రైతుల భూములతో, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని, ఒకాయన బయట రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులకు ఫోన్లు చేస్తూ మీకు 100 ఎకరాలు ఇస్తాం.. మాకేం ఇస్తారు అని అడుగుతున్నారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదని, రైతులను దగా చేశారని, ఒక రైతు 90 ఎకరాలు ఇచ్చాడని, ఎందుకిచ్చావయ్యా అని అడిగితే, మా ఖర్మకొద్దీ ఇచ్చామని బాధతో వాపోయాడని తెలిపారు. అభివృద్ధి కుంటుపడింది రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని చింతా మోహన్ అన్నారు. గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయని, వీధిలైట్లు, రోడ్లు వేసుకునేందుకు డబ్బులేక, సర్పంచ్‌లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. లిక్కర్ అమ్మకాల వల్ల కుటుంబాల్లో విభేదాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందా, ఈ చర్యతో ఓబీసీలకు పెద్దపీట వేసినట్టేనా అని చింతా మోహన్ ప్రశ్నించారు. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శలు -
ఇంటికి వెళ్లే దారేది!
ఏజెన్సీప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దొరమామిడి, అలివేరు, లంకపాకల, ఎర్రాయిగూడెం, అంతర్వేదిగూడెం, కామవరం, తదితర గ్రామాల్లో భారీగా వర్షం కురవడంతో కొండవాగులు పొంగిపొర్లాయి. చింతకొండ వాగుతోపాటు రెడ్డిగణపవరం సమీపంలో ఉన్న జల్లేరువాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం సమయానికి పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, కూలీలు, రైతులు ఇంటికి చేరే మార్గం లేక జల్లేరు వాగుకు ఇరువైపులా నిలబడిపోయారు. రాత్రి వరకూ వాగులు పొంగుతూనే ఉన్నాయి. – బుట్టాయగూడెం -
ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ
ఒకరి మృతి, బస్సు డ్రైవర్‌కు గాయాలు భీమడోలు: పొలసానిపల్లి ఫ్లై ఓవర్ వంతెనపై బుధవారం ఆర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన కె.గణేష్ (28) కుటుంబ పోషణ నిమిత్తం నెల్లూరులోని ఓ రైస్ మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో స్వగ్రామంలోని కుటుంబ సభ్యులను చూసేందుకు గణేష్, తులసి ప్రైవేటు ట్రావెల్ బస్సు టికెట్‌ను రిజర్వేషన్ చేయించుకున్నాడు. బుధవారం రాత్రి నెల్లూరు నుంచి అనకాపల్లికి బస్‌లో వెళ్తుండగా మార్గమధ్యమైన పొలసానిపల్లి ఫ్లై ఓవర్ వంతెన వద్దకు వచ్చేసరికి ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని నడుపుతూ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెనుక సీటులో కూర్చుని నిద్రిస్తున్న కె.గణేష్ రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కె.గణేష్ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం దెబ్బతింది. ఈ బస్సులో 30 మంది ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిన వెంటనే వారంతా బెంబేలెత్తిపోయారు. అదృష్టవశాత్తూ వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా భీమవరం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులకు కోర్టు జరిమానా విధించినట్లు సీఐ జి కాళీచరణ్ చెప్పారు. భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, పద్మాలయ థియేటర్, బీవీ రాజు విగ్రహం ఏరియాల్లో మద్యం సేవించి వాహనాలు నడుతున్న ఆరుగుర్ని అరెస్ట్ చేసి భీమవరం, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న ముగ్గురికి రూ.500 చొప్పున జరిమానా విధించారని చెప్పారు. -
రేషన్ బియ్యం పట్టివేత
ముసునూరు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకుని సీజ్ చేసినట్లు నూజివీడు సివిల్ సప్లయి స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ గుండుబోయిన వెంకటేశ్వరరావు తెలిపారు. బాపులపాడు మండలం కాకులపాడు ప్రాంతం నుంచి వాహనంలో మండలంలోని గుళ్ళపూడి మీదుగా అక్రమంగా తరలిస్తున్న 41 క్వింటాళ్ల రేషన్ బియ్యంను ఏలూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున దాడి చేసి పట్టుకున్నామన్నారు. బియ్యాన్ని తరలిస్తున్న కడలి లక్ష్మణరావు, ధనికొండ గోపిరాజు, బండారు నాగబాబు, కొల్లి కాసులు, షేక్ ఖాసింబాబులపై ముసునూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.నేడు ఏలూరులో కోకో రైతుల రాష్ట్ర సమావేశంఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం ఏలూరు పవర్‌పేటలోని అన్నే భవనంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోకో గింజల ధర కిలోకు రూ. 500 నుంచి రూ. 350కు క్రమంగా తగ్గించివేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. కోకో రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని శ్రీనివాస్ తెలిపారు.బైక్ దొంగల అరెస్టుఆకివీడు: ఇద్దరు దొంగలను పట్టుకుని వారి నుంచి తొమ్మిది మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆకివీడు రూరల్ సీఐ జగదీశ్వరరావు, ఎస్సై హనుమంతు నాగరాజు తెలిపారు. నిందితులు కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన కూనసాని నాగాంజనేయులు, ఆకివీడు మండలం చినకాపవరం గ్రామానికి చెందిన కుప్పల రమేష్‌లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. డీఎస్పీ జయ సూర్య పర్యవేక్షణలో ఉండి ఎస్సై నజీరుల్లా, విజయ్, శివ, శంకర్, రత్నంల సహకారంతో కేసును ఛేదిచామన్నారు.22న సీజీఆర్ఎఫ్ క్యాంపు కోర్టుసీజీఆర్ఎఫ్ చైర్పర్సన్ సత్యనారాయణసాక్షి, విశాఖపట్నం: ఏపీఈపీడీసీఎల్ శ్రీకాకుళం, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, పాడేరు సర్కిళ్ల విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11 నుంచి క్యాంపు కోర్టులు నిర్వహించనున్నట్లు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ విశ్రాంతి జడ్జి బి.సత్యనారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా ఈనెల 22న భీమవరం డివిజన్ ఉండి సెక్షన్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే క్యాంపు కోర్టులో వినియోగదారులు పాల్గొనవచ్చని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, హెచ్చుతగ్గులు, బిల్లుల సమస్యలు, కొత్త సర్వీసుల జారీలో జాప్యం తదితర సమస్యలపై వినియోగదారులు నేరుగా సీజీఆర్ఎఫ్ కమిటీకి తెలియజేయవచ్చన్నారు. సదస్సుల్లో చైర్పర్సన్ బి.సత్యనారాయణతో పాటు సీజీఆర్ఎఫ్ కమిటీ సభ్యులు ఎస్.రాజబాబు, ఎస్.సుబ్బారావు, ఎన్.మురళీకృష్ణ పాల్గొననున్నారు. -
మధ్యాహ్నం.. అందని వైద్యం
ప్రైవేటుయాజమాన్యాలే టార్గెట్..? సర్కారు దవాఖానాలకు వచ్చే పేదలకు వైద్యసేవలు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షణ చేయాల్సిన ఉన్నతాధికారులు ఇటీవల కేవలం ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు మాత్రమే తనిఖీలు చేయడం వెనుక గూడార్ధం ఏంటా అనేది వైద్యవర్గాల్లోను చర్చనీయాంశమైంది. తరచూ వైద్యశాఖ ఉన్నతాధికారులు కేవలం ప్రైవేటు యాజమాన్యాలనే కలుస్తుండడంపై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టరేట్ ఆప్ సెకండరీ హెల్త్‌కు సంబంధించి ఉన్నతాధికారులు సంబంధిత ఆస్పత్రుల్లో ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో కొందరు వైద్యులు తమ ఇస్టానుసారంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమస్యలపై డీఎంహెచ్‌వో డాక్టర్ గీతాబాయిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిందేనని, కొందరు వైద్యులు అదనంగా మరికొన్ని ఆస్పత్రుల్లో ఇన్చార్జులుగా ఉంటున్నారని, వైద్యుల తీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తానని చెప్పారు. తణుకు అర్బన్ : గత ఐదేళ్లపాటు పేదలపాలిట సంజీవనిలా సత్వర వైద్యసేవలందించిన ఆస్పత్రులు నేడు వేళకు రాని వైద్యులతోపాటు, ఆస్పత్రిలో కాలు నిలవక బయటకు వెళ్లే వైద్యుల కారణంగా పేదలకు వైద్యసేవలు కునారిల్లుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రుల్లో ఉండాల్సిన వైద్యులు నేడు విధులకు ఆలస్యంగా కొందరు, ఎఫ్ఆర్ఎస్ వేసేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ కోసం వెళ్లే వారు కొందరు, మధ్యాహ్నం పూర్తిగా ఇంటికో, ప్రైవేటు ఆస్పత్రులకో పరిమితమయ్యే మరి కొందరు వైద్యుల కారణంగా ప్రభుత్వ ఆసుప్రతుల్లో వైద్యసేవలు అందడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ తరహా పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగాల్లో వైద్యులు 80 శాతం మంది ఒంటిపూట వైద్యానికి అలవాటుపడ్డారని వైద్య సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి క్యారేజీలు పట్టుకుని వచ్చే వైద్యులు మాత్రమే పూర్తిస్థాయిలో ఆస్పత్రిని అంటిపెట్టుకుని ఉంటుండగా, భోజనానికి ఇంటికెళ్లి వచ్చే వైద్యులు చాలా మంది తిరిగి ఎఫ్ఆర్ఎస్ వేసేందుకు మాత్రమే వస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వైద్యులైతే ఉదయం పూట కూడా ప్రైవేటు వైద్యానికి వెళ్లే పరిస్థితులు తలెత్తాయని రోగులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణాల్లో కూడా పేదలకు వైద్యసేవలు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో అర్బన్ హెల్త్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని పేదలు సైతం దూర ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లే అవసరం లేకుండానే సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్యసేవలు పొందుతున్నారు. దూరమైన సత్వర వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా ఆస్పత్రుల్లో ఉండి రోగులకు సత్వర వైద్యం అందించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ తరహా సేవలు అందడంలేదని రోగులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉదయం ఏదోలా వైద్యం అందుతున్నా ఇక మధ్యాహ్నం 1 గంట తరువాత జిల్లా వ్యాప్తంగా వైద్యులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండడంలేదనేది వాస్తవమని రోగులు స్వయంగా చెబుతున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం నుంచి పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లకు వచ్చే రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వైద్యం అందిస్తున్నారని తెలుస్తోంది. మధ్యాహ్నం వచ్చిన రోగులను మరుసటి రోజు రావాలని, ఇబ్బంది ఎక్కువగా ఉంటే వైద్యులకు ఫోన్ చేస్తామని అప్పుడు సదరు వైద్యుడు వస్తారని వైద్యసిబ్బంది చెబుతుండడం శోచనీయం. జిల్లాలో ప్రభుత్వ ఆస్ప్రతులు ఇలా.. వైద్య ఆరోగ్య శాఖ.. పీహెచ్‌సీలు 34 యూపీహెచ్‌సీలు 18 పీపీ యూనిట్ 1 లెప్రసీ వార్డు 1 డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ జిల్లా ఆస్పత్రి 1 ఏరియా ఆస్పత్రులు 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 వైద్యులు 200లకుపైగా.. నిత్యం 16 వేలకుపైగా రోగులు.. మధ్యాహ్నం ఇళ్లు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉంటున్న వైద్యులు వైద్యులు లేకపోవడంతో సొంత వైద్యం చేస్తున్న సిబ్బంది కునారిల్లుతున్న సర్కారు దవాఖానాలు అర్బన్ హెల్త్ సెంటర్‌కు ఓ వృద్ధుడు కర్ర చేతపట్టుకుని మధ్యాహ్నం పూట వచ్చాడు. అక్కడే ఉన్న నర్సు ఆ వృద్ధుడిని చూసి.. డాక్టర్ మధ్యాహ్నం ఉండరు తాతా.. రేపు ఉదయం రా అని చెప్పింది. సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన డాక్టర్ ఉండకపోతే అడిగేవారే లేకుండా పోయారు అంటూ సణుగుతూ వెనుదిరిగాడు. జ్వరంతో వణుకుతూ ఓ పెద్దావిడ పీహెచ్‌సీకి మధ్యాహ్నం సమయంలో వచ్చింది. ఆమెను చూసిన నర్సు ఇప్పుడు వచ్చావేంటి డాక్టర్ ఉండరు కదా.. ఉదయం రాకపోయావా అన్నారు. ఉన్నట్టుండి చలిజ్వరం రావడంతో వచ్చానమ్మ అని ఆ పెద్దావిడి సమాధానమిచ్చింది. దీంతో ఆ నర్సు డాక్టర్‌కు ఫోన్ చేసి విషయం చెప్పగా.. పారాసెట్మాల్, యాంటీబయాటిక్ ఇచ్చి పంపించేయ్.. రేపు ఉదయం రమ్మని చెప్పు.. అని కటువుగా వైద్యుడు చెప్పాడు. -
సబ్ కలెక్టర్ స్మరణ్‌రాజ్‌కు సత్కారం
ఏలూరు (మెట్రో): బదిలీపై వెళుతున్న నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్‌రాజ్‌ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఘనంగా సత్కరించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం రెవెన్యూ అధికారుల సమావేశం అనంతరం నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్‌రాజ్‌ను దుశ్శాలువ, మెమొంటోతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, ఎస్డీసీ భాస్కర్, సర్వే శాఖ ఏడీ అన్సారీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు చల్లన్న దొర, విజయ్‌కుమార్‌రాజు, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
సీతంపేట వద్ద లారీ బోల్తా
కొయ్యలగూడెం : సీతంపేట సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రాజమండ్రి వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు మార్జిన్ వైపు పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రోడ్డు పక్కనే ఉన్న చెత్తకి నిప్పు పెట్టడం వల్ల రోడ్డుపై భారీగా పొగ అలుముకోవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆట్యా పాట్యా జిల్లా జట్ల ఎంపిక భీమవరం: పట్టణంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం స్కూల్లో బుధవారం ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపిక జరిగింది. క్రీడాకారులు పి గోపీకృష్ణ, డి మోహన్‌కుమార్, జి యశ్వంత్రమణ, కె సాయిధనుష్, జె అభిషేక్‌పాల్, వి జయసంతోష్, పి రోహిత్ కుమార్, వి మణికంఠ గణేష్, ఎం తేజమహిమ, ఎం అభిరామ్, బి వెంకన్న, పి ప్రేమ్‌కుమార్, పి భాస్కరతేజ జిల్లా జట్లకు ఎంపికయ్యారని ఆట్యాపాట్యా జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి కిరణ్‌వర్మ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9వ తేదీ నుంచి ఒంగోలులో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. వైభవం.. శోభనాచలుడి పవిత్రోత్సవం ఆగిరిపల్లి: స్థానిక శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి వైభవంగా పవిత్రములు సమర్పించారు ఉదయం స్వామివారికి స్నపన, ప్రత్యేక అలంకరణ, శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన మూలా మంత్ర హోమం, దిగువ సన్నిధిలో ఉన్న స్వామివారికి పవిత్రములు సమర్పణ, నవ కుంభారాధన, శాంతి హోమం ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వణాధికారి సాయి కార్యక్రమాలను పర్యవేక్షించారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారంపై విచారణ కుక్కునూరు: నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారంపై భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం సారాపాక గ్రామానికి చెందిన భూక్యా శ్రీరాములు పేరిట ఓ ఎల్ఐసీ ఏజెంట్ రూ.10 లక్షల పాలసీకి ఏడేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఆ వ్యక్తి బతికుండగానే మరణించినట్లుగా కుక్కునూరు పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ పోంది ఎల్ఐసీ నుంచి రూ.10 లక్షలు క్లయిమ్ చేశాడు. ఈ విషయాన్ని గత ఫిబ్రవరి 10వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక బహిర్గతం చేసింది. కాగా ఈ వ్యవహారంలో డబ్బును రికవరీ చేసిన ఎల్ఐసీ కార్యాలయ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. కుక్కునూరులో నకిలీ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారన్న విషయమై గత నాలుగు రోజులుగా కొందరిని స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. -
టీడీపీ గూండాల దాడి హేయం
భీమడోలు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, నాయకులపై పులివెందులలో టీడీపీ గుండాలు చేసిన దాడి అత్యంత హేయమని పార్టీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ అధ్యక్షుడు నౌడు వెంకటరమణ ఓ పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తెగబడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీలో పెదబాబు, చినబాబుకు భయం పట్టుకుందన్నారు. జగన్మోహనరెడ్డి రోడ్డుపైకి వస్తే చాలు టీడీపీకి భయమని, అందుకే పార్టీ శ్రేణులపై పచ్చ గుండాలు దాడులు చేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం తీరును మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. దాడి చేసిన గుండాలను కఠినంగా శిక్షించాలని కోరారు. దాడికి నిరసనగా నేడు బీసీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. విద్యాసంస్థల బస్సులపై కేసుల నమోదు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు బుధవారం విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 15 కేసులు నమోదు చేసి, రూ.26 వేలు జరిమానా విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. వాహనదారులు లైసెనన్స్తో పాటు సంబంధిత వాహన పత్రాలను ఉంచుకోవాలని, రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించాలన్నారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థల బస్సులను, ప్రైవేటు వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. -
విద్యా శక్తి కార్యక్రమం బహిష్కరణ
భీమవరం: పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన విద్యాశక్తి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు బహిష్కరిస్తున్నట్లు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం చెప్పారు. బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు విజయరామరాజు, ప్రకాశం మాట్లాడుతూ విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికం మాత్రమేనని నిర్బంధం కాదని ప్రభుత్వం తెలిపినా కొంతమంది అధికారులు నిర్బంధంగా చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. దీనితో విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కో చైర్మన్ సాయివర్మ, ఎన్.శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రమణ, కోశాధికారి పట్టాభిరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
తిరగని రాట్నం
మధ్యాహ్నం.. అందని వైద్యం ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన కొందరు వైద్యులు మధ్యాహ్నం ఇంటికో, ప్రైవేటు ఆస్పత్రులకో పరిమితమవడంతో వైద్యసేవలు అందడం లేదు. 8లో uకూటమి పాలనలో చేనేత రంగానికి ప్రోత్సాహం కరువైంది. ఆదరణ లేక మగ్గాలు మూలకు చేరుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చంద్రబాబు సర్కారు నేతన్నల వైపు కన్నెత్తి చూసింది లేదు. నేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూ ఇప్పుడు కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది. గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆరు వేల వరకు చేనేత కుటుంబాలున్నాయి. పాలకొల్లు, అత్తిలి, యలమంచిలి, పెంటపాడు, పోడూరు, ఆచంట మండలాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. దివంగత వైఎస్ హయాంలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. నేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్, రుణ మాఫీ, అధిక వడ్డీలతో కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా పావలా వడ్డీకే కొత్తగా రుణ సాయం, చిలపనూలుపై పదిశాతం సబ్సిడీ, ఉచిత వైద్య శిబిరాలు, ఇళ్ల నిర్మాణం తదితర ఎన్నో కార్యక్రమాల ద్వారా చేనేత రంగాన్ని ఆయన ఆదుకున్నారు. తర్వాత పట్టించుకున్న వారు లేక సంక్షోభంలో కూరుకుపోయింది. నేతన్నకు అండగా తండ్రిని మించిన తనయునిగా చేనేత రంగానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సొంత మగ్గం ఉన్న నేత కుటుంబాలకు వైఎస్సార్ నేతన్న నేస్తంగా నెలకు రూ. 2000 చొప్పున ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందించారు. గత ప్రభుత్వంలోని ఐదేళ్లలో ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో సరాసరి 1,063 కుటుంబాలకు రూ.12.76 కోట్ల లబ్ధి చేకూరింది. ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో 920 కుటుంబాలకు రూ.10.96 కోట్లు, ఏలూరు జిల్లాలో 150 కుటుంబాలకు రూ. 1.8 కోట్ల సాయం అందించారు. అమ్మఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్య శ్రీ వైద్యం తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల ప్రభుత్వ సాయం అందింది. కంటి తుడుపు చర్యలే : గురువారం జాతీయ చేనేత దినోత్సవంగా సందర్భంగా చేనేతకు వరాల జల్లంటూ కూటమి ప్రచారం విమర్శలకు తావిస్తోంది. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్టీ మినహాయింపు కంటితుడుపు చర్యలుగా కార్మికులు కొట్టిపారేస్తున్నారు. వీటివల్ల చేనేత రంగానికి ఒనగూరేదేమి లేదంటున్నారు. జిల్లాలో కేవలం 677 నేత మగ్గాలకు మాత్రమే ఈ సాయం పరిమితం కానుంది.న్యూస్‌రీల్ ఏడాదిగా నేతన్నల వైపు కన్నెత్తి చూడని కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం లేక మూలకు చేరిన మగ్గాలు గతంలోనూ చీర–ధోవతి హామీని అటకెక్కించిన చంద్రబాబు నేతన్న నేస్తంతో అండగా నిలిచిన జగన్ సర్కారు ఉమ్మడి జిల్లాలోని 1,070 కుటుంబాలకు రూ. 12.76 కోట్ల సాయం నేడు జాతీయ చేనేత దినోత్సవం చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే చేనేత అంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. చేనేత అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదు. నేత కార్మికులను నిజంగా ప్రోత్సహించింది దివంగత వైఎస్సార్. తండ్రిని మించిన తనయుడిగా నేతన్న నేస్తం, సంక్షేమ పథకాలతో మాజీ సీఎం జగన్ నేత కార్మికులను ఆదుకున్నారు. – వీరా మల్లిఖార్జునుడు, వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు, పాలకొల్లు ఎన్నికల హామీలు అమలుచేయాలి చేనేత కార్మికుల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వల్ల నేత కార్మికులకు పెద్దగా మేలు జరిగేది లేదు. చేనేతను ప్రోత్సహించే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలుచేయాలి. గత ప్రభుత్వంలో మాదిరి సంక్షేమ పథకాలను అందజేయాలి. నిల్లా బాలవీరయ్య, చేనేత కార్మికుడు, శివపురం మళ్లీ చిన్నచూపే చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తానని, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇస్తామంటూ 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. ప్రతామ్నాయ ఉపాధి చూసుకోవాలని నేతన్నలను చిన్నచూపు చూశారు. కూటమి ప్రభుత్వంలోనూ అదే తీరుగా ఉన్నారన్న విమర్శలున్నాయి. ఏడాదిగా ప్రోత్సాహం కరువై చేనేత కుటుంబాలకు పూటగడవడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మగ్గాలకు స్వస్తి చెబుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలామంది కార్మికులు నేత పని వీడి వ్యవసాయ కూలీలుగా, ఇతర పనుల్లోకి వెళ్లిపోతున్నారు. ఏడాది క్రితం ఉమ్మడి జిల్లాలో 1187 మగ్గాలు ఉండగా ప్రస్తుతం 677కు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. -
మూల్యాంకన పుస్తకాలపై వ్యతిరేకత
ఇప్పటికే విద్యాశక్తిని బహిష్కరించిన ఉపాధ్యాయులు విద్యాశక్తి నిర ్బంధంగా అమలుపై నిరసన నూజివీడు: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ ద్వారా పాఠశాలలకు పంపిన మూల్యాకంన పుస్తకాలపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇస్తున్న పనులను చేయడానికే ఎక్కువ సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో మూల్యాంకన పుస్తకం ఇచ్చింది. దీంతో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఆరు మూల్యాంకన పుస్తకాలు ఇవ్వగా, ఫార్మేటివ్ అసిస్మెంట్, సమ్మేటివ్ అసిస్మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులతో రాయించాలి. విద్యార్థులు రాసిన తరువాత పరీక్షలను దిద్ది అందులోనే ఇచ్చిన ఓఎమ్మార్ షీట్లో మార్కులు వేయడంతో పాటు వారి పరీక్ష రాసిన పేజీలను స్కాన్ చేసి విద్యాశాఖ ఇచ్చిన యాప్‌లో ఆప్‌లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు సర్వర్ బిజీగా ఉన్నా, నెట్ స్లోగా ఉన్నా అప్లోడ్ చేయడం తీవ్ర జాప్యమయ్యే అవకాశాలున్నాయి. బడిలో దిద్దడానికి సమయమేది : గతంలో విద్యార్థి రాసిన పరీక్ష పేపర్లను ఉపాధ్యాయులు వారి వెసులుబాటును బట్టి బడిలో దిద్దేవారు. సమయం సరిపోకపోతే ఇళ్లకు తీసుకెళ్లి పేపర్లు దిద్దుకొని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మూల్యాంకనం పుస్తకాలను ఇంటికి మోసుకొని వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఆరో తరగతిలో 40 మంది విద్యార్థులుంటే వారందరి మూల్యాకనం పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి దిద్దడానికి వీలవ్వదు. బడిలోనే దిద్ది ప్రతి సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒక్కొక్క విద్యార్ధి మూడు పేజీలు రాస్తే వంద నుంచి 120 పేజీలను ఒక సబ్జెక్టుకు స్కాన్ చేయాల్సి ఉంటుంది. హైస్కూల్లో ఒక ఉపాధ్యాయుడు నాలుగు తరగతులకు వెళ్లినట్లయితే వారం రోజుల పాటు ఇదే పనిని చేస్తే పూర్తవుతుంది. ఇంత చేసినా విద్యార్థికి ఒనగూడే ప్రయోజనం శూన్యం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మూల్యాంకనం పుస్తకాలను ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడు భద్రపరుచుకోవాలి. హైస్కూల్ల్లో సాయంత్రం 4 గంటల తరువాత విద్యాశక్తి కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తోంది. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా విద్యాశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇది ఉపాధ్యాయులకు కొత్త తలనొప్పిలా మారింది. ఉపాధ్యాయ సంఘాలు అడిగినప్పుడు నిర్భంధం కాదని చెబుతున్న ఉన్నతాధికారులు ఆ తరువాత ఉపాధ్యాయులపై మండల స్థాయి అధికారులతో మేం వస్తున్నాం.. తనిఖీ చేస్తాం.. అంటూ ఒత్తిడి చేస్తూ పనిచేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు గత రెండు రోజులుగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో డీఈవోలకు వినతిపత్రాలను సైతం అందజేస్తున్నారు. ప్రశాంతంగా సాగాల్సిన విద్యారంగ కార్యక్రమాలను హడావుడిగా మార్చేసి తీవ్ర ఒత్తిడికి గురయ్యేలా ప్రభుత్వం చేస్తుండటంతో ఎంతో మంది ఉపాధ్యాయులు నేడు అనారోగ్యం పాలవుతున్నారనే ఆందోళన ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
మండవల్లి : భార్యాభర్తల నడుమ చిన్నపాటి విభేదాల కారణంగా మనస్తాపంతో విషం తాగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం ప్రత్తిపాడులో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలు ప్యారా సుధారాణి(35)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఏలూరు ఆస్పత్రిలో భద్రపరిచారు. గ్యాస్ బండ మీద పడి.. డెలివరీ బాయ్ మృతి చింతలపూడి: స్థానిక బోయగూడెం గ్రామానికి చెందిన బందెల హానోక్ (30) గ్యాస్ బండ మీదపడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హానోక్ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ గ్యాస్ కంపెనీలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఊటసముద్రం గ్రామానికి గ్యాస్ బండలు డెలివరీ చేయడానికి వెళ్లి వాహనం నుంచి గ్యాస్ బండలు దించుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో వెంటనే స్థానికులు చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హానోక్ మృతి చెందడంతో బోయగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు గ్యాస్ కంపెనీ నిర్వాహకులను కోరగా నిరాకరించడంతో దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఆందోళనకు దిగుతున్నట్లు తెలిపారు. -
యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కారుమూరి సునీల్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోన్ –2 వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సునీల్ కుమార్‌ను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ఆపాలి నరసాపురం: స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వెంటనే నిలుపుదల చేయాలంటూ ప్రజా వేదిక నరసాపురం ఆధ్వర్యంలో నరసాపురం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రజా వేదిక జిల్లా కమిటీ సభ్యుడు మామిడిశెట్టి రామాంజనేయలు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక విద్యుత్ భారాలతో ప్రజల నడ్డి విరగ్గొడుతుందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 14 నెలలకే రూ.15,485 కోట్లు ప్రజల నుంచి దోపిడీ చేసిందన్నారు. అదానీ కంపెనీ లాభాల కోసం కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పి.నారాయణరావు, కె.శ్రీనివాసు, బి.జోగేశ్వరావు, జి.నాగేశ్వరరావు, ఎన్.కొండ, పి.కామేశ్వరరావు, పి.అప్పల నాయుడు, కె.రవి,లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అసమానతలు తొలగించడం పీ4 లక్ష్యం భీమవరం (ప్రకాశంచౌక్): సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించడమే పీ4 ప్రధాన లక్ష్యమని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. పీ4లో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో 10 శాతంగా ఉన్న ధనవంతులు, అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మంది నిరుపేదలకు చేయూత నివ్వడమే పి4 లక్ష్యమన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న పూర్వపు విద్యార్థులకు కూడా పీ4 పై అవగాహన కల్పించి వారు మార్గదర్శకులుగా చేరి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. ఉపాధ్యాయులు కూడా స్వచ్ఛందంగా మార్గదర్శకులు కావచ్చన్నారు. సమావేశంలో డీఈఓ ఇ.నారాయణ తదితరులు పాల్గొన్నారు. చట్టంపై విద్యార్థులకు అవగాహన ఏలూరు (టూటౌన్): నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం శ్రీజాతీయ న్యాయ సేవాధికార సంస్థ–బాలల స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం 2024పై అవగాహన కల్పించేందుకు ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూలు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదని, గుడ్ టచ్ బాడ్ టచ్ పైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. -
పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా..
చింతలపూడి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాడి పశువుల పెంపకానికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు పాడి పశువులను పెంచుకుంటూ ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అయితే వర్షాకాలంలో పశువులు రకరకాల అంటు రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్త నీరు మురుగు నీటితో కలిసి కలుషితం కావడం కారణంగా పశువులు ఆ నీటిని తాగడంతో అంటురోగాలు సోకి విలువైన పశు సంపద కోల్పోయే ముప్పు ఉంది. వర్షాకాలంలో గేదెలు, గేదె దూడలు, పడ్డలకు ఎక్కువగా వచ్చే వ్యాధి గురక వ్యాధి. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనది. గురకవ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్సను గురించి పశుసంవర్థక శాఖ ఏడీ డా కె లింగయ్య వివరించారు. ఎలా సంక్రమిస్తుంది పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియ వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థ, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను ధ్వంసం చేసి రక్తం ప్రాణవాయువు ప్రక్రియను దెబ్బ తీస్తుంది. దీంతో ప్రాణ వాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాసపడటం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 ఫారిన్ హీట్ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత నెమరు నిలిచిపోవడం, మెడ గొంతు వాయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటలకు వ్యాధి లక్షణాలు కనిపించి, సకాలంలో సరైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణిస్తుంది. గురక వ్యాధి చికిత్స వ్యాధిని గుర్తించిన మరుక్షణం రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. ప్రశాంత వాతావరణంలో పశువులకు పరీక్షలు చేయిస్తే మంచిది. ఈ పరిస్థితుల్లో పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిల్లిన్, క్లోక్సా సిలిన్, జెంటా మైసిన్, సెఫలాక్సిన్ వంటి యాంటి బయోటిక్ మందుల్ని సరైన మోతాదులో అవసరాన్ని బట్టి రక్తం లోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్ ఇంజక్షన్లు, బి–కాంప్లెక్స్ ఇంజక్షన్లు బాగా నీరశించిన పశువుకై తే డెక్ట్స్రోజ్ సైలెన్లు అవసరం కూడా ఉంటుంది. నివారణ గురకవ్యాధి సోకిన పశువులకు రోగ క్రిములను కలిగిన కలుషిత మేత, నీరు పరికరాలు, కళేబరాలను దూరంగా తరలించాలి. కళేబరాలను లోతుగా పూడ్చి వేయడం మంచిది. పరిసరాల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డిడిటి, గమాక్సిన్ ,సైపర్ మెధ్రిన్, కార్పొరిల్ వంటి క్రిమి సంహారకాలతో క్రిమి రహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను కనీసం వారం రోజులన్నా వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాక మిగిలిన పశువులతో కలవనీయ్యాలి. గురకవ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తోంది. ప్రస్తుతం గురకవ్యాధి, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పశువైద్యల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందు వేయిస్తే మంచిది. డా కె లింగయ్య, పశు సంవర్థక శాఖ ఏడీ, చింతలపూడి పాడి–పంట -
వృద్ధురాలి మృతదేహం లభ్యం
తాడేపల్లిగూడెం (టీఓసీ): స్థానిక శివాలయం వద్ద కాలువలో పడిపోయి గల్లంతైన చంద్రవతి (70) వృద్ధురాలి మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. ఈనెల 4వ తేదీన ఆమె కాలువలో పడిపోగా, అధికారులకు అందిన సమాచారం మేరకు 5వ తేదీన ఫైర్, పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక కాలువలో బోట్ సహాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. కడకట్ల సమీపంలో బుధవారం మధ్యాహ్నం చంద్రవతి మృతదేహాన్ని బయిటకు తీశారు. ఫైర్ సిబ్బందిచే మృతదేహాన్ని పోలీస్ శాఖకు అప్పగించారు. మృతురాలి బంధువులు హాజరయ్యారు. -
ఉంగుటూరు కూటమిలో కుంపట్లు
నీకు సగం.. నాకు సగం సాక్షి ప్రతినిధి, ఏలూరు: పైకి ఆప్యాయంగా పలకరించుకుని కౌగిలించుకుంటారు.. లోపల మాత్రం కత్తులు దూస్తారు. ఎమ్మెల్యే అధికారిక హోదాలో ఒక కార్యక్రమం చేస్తే.. ఆప్కాబ్ చైర్మన్ ప్రొటోకాల్ హోదాతో మరో కార్యక్రమం నిర్వహిస్తారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఉంగుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు హడావుడి చేస్తుంటే.. పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మరో కార్యక్రమానికి తెరతీసి పోటాపోటీగా హడావుడి చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సమాంతరంగా హడావుడితో పార్టీ కేడర్ మొదలుకొని అధికారుల వరకు ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్నారు. నిత్యం కూటమిలోని జనసేన, టీడీపీ నేతల మధ్య అసంతృప్తి, అసహనాలతో ఉంగుటూరు రాజకీయం వేడెక్కుతోంది. ఎమ్మెల్యేతో చనువుగా ఉంటే వేటే.. పైకి ప్రేమగా కనిపించినా.. లోపల మాత్రం ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో బలపడితే భవిష్యత్‌లో తన రాజకీయ మనుగడ కష్టమవుతుందనే రీతిలో గన్ని చెక్ పెడుతూ వస్తున్నారు. ఆప్కాబ్ చైర్మన్ పదవి రావడంతో మరింత వేగం పెంచి నియోజకవర్గంలో మండలాల్లో పెత్తనం సాగించడంతో పాటు ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగే టీడీపీ నేతలపై వేటు కొనసాగిస్తున్నారు. ఉంగుటూరు మండల అధ్యక్షుడు పాతూరి విజయ్‌కుమార్ ఎన్నికల సమయంలో ధర్మరాజుకు సహకరించారనే కారణంతో మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎన్నికల ప్రచార సమయంలోనే నారాయణపురంలో విజయ్‌కుమార్‌పై టీడీపీ వ్యక్తులే దాడి చేయడం గమనార్హం. భీమడోలు మండల అధ్యక్ష పదవిని సీనియర్లను కాదని నామినేట్ పదవి ఉన్న వ్యక్తికే కేటాయించడంపైన టీడీపీ కేడర్ రగులుతున్నారు. ఖర్చుతో కూడిన భీమడోలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని తొలుత బీసీ మహిళకు కేటాయించారు. గన్ని వీరాంజనేయులు బీసీ మహిళ నుంచి దాన్ని బీసీ జనరల్ చేసి తన వర్గానికి చెందిన శేషగిరికి దక్కేలా చేశారు. మార్కెట్ యార్డుకు స్థానిక ప్రజాప్రతినిధి గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేను పిలవకపోవడం వివాదమైంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించి గన్ని హడావిడి చేస్తున్నారు. మరోవైపు పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో అధికార యంత్రాంగాన్ని మొత్తం తీసుకుని ఎమ్మెల్యే పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపుతో టచ్‌లో ఉండే సీనియర్ నేతలను వ్యూహాత్మకంగా పక్కన పెట్టేలా గన్ని వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసే దిశగా అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. జనసేన ఎమ్మెల్యే వర్సెస్ ఆప్కాబ్ చైర్మన్ సుపరిపాలన తొలి అడుగు పేరుతో గన్ని హడావుడి పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో ఎమ్మెల్యే పోటీ కార్యక్రమం ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే టీడీపీ నేతలపై గన్ని వేటు గన్ని తీరుపై టీడీపీలో రగులుతున్న అసంతృప్తి ఉంగుటూరులో జనసేన వర్సెస్ టీడీపీ రగడ తారాస్థాయికి చేరింది. నిన్న మొన్నటి వరకు పనులు, పంపకాలు పర్సంటేజీల మధ్య చాప కింద నీరులా కొనసాగిన అంతర్యుద్ధం నేడు ప్రొటోకాల్ వ్యవహారాలకు పాకింది. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను కాదని జనసేన ఇన్చార్జి ధర్మరాజుకు టిక్కెట్ కేటాయించడం, ఎన్నికల్లో ధర్మరాజు గెలవడంతో నియోజకవర్గంలో రగడకు తెరలేచింది. టీడీపీకే ఉంగుటూరు టిక్కెట్ ఇవ్వాలని ఎన్నికలకు ముందు గన్ని వర్గం భారీ ర్యాలీతో టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద హడావుడి చేసింది. టీడీపీ అధిష్టానం గట్టిగా చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ధర్మరాజు గెలవడంతో నియోజకవర్గంలో పూర్తి స్థాయి పెత్తనం కోసం హడావుడి మొదలైంది. నీకు సగం.. నాకు సగమంటూ పంచాయితీలకు తెరతీశారు. నామినేట్ పదవులు, వర్క్‌లు, మద్యం షాపుల ఇలా అన్నింటిని పంపకాలు చేసేలా టీడీపీ కీలక నేతలు ఒత్తిడి తెచ్చి నియోజకవర్గంలో ప్రతి దాంట్లో గన్నికి వాటాలు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు నియోజకవర్గంలో 17 సొసైటీలు ఉంటే 8 జనసేన, 8 టీడీపీ, 1 బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి సొసైటీ చైర్మన్లుగా ఎంపికై న వారికి చాలా ఖర్చయిందనేది నియోజకవర్గంలో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. -
చెట్లకు చేటు
జంగారెడ్డిగూడెం: విద్యుత్ లైన్ పేరు చెప్పి భారీ వృక్షాలను అక్రమంగా నరకివేసి కలప తరలించుకుపోయారు. ఈ ఘటన జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం శివారు మార్కండేయపురంలో పంచాయతీ రాజ్ రోడ్డు వెంబడి భారీ వృక్షాలు ఉన్నాయి. వీటిని కొందరు అక్రమార్కులు బుధవారం నరికివేశారు. స్థానికులు ఇదేంటని ప్రశ్నిస్తే విద్యుత్ లైన్ల నిర్మాణం నిమిత్తం చెట్లను నరికినట్లు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి ప్రజా సంఘాల నాయకులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీఐ నాయకులు జేవీ రమణరాజు, రాధాకృష్ణ చెట్ల నరికివేతపై పంచాయతీ రాజ్ డీఈ సాజుద్దీన్కు ఫిర్యాదు చేయగా చెట్ల నరికివేతకు సంబంధించి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ డీఈ యు.సుబ్బారావును వివరణ కోరగా, తాము ఆ ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ లైన్లు వేసే పనులు నిర్వహించడం లేదని చెప్పారు. అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ శాఖల పేర్లు చెప్పి వాటిని తరలించుకుపోవడంపై ప్రజాసంఘాల నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనిపై సాజుద్దీన్ స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
పాలకొల్లు సెంట్రల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి నెలా పదిహేను రోజులుగా చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం మృతి చెందాడు. వివరాల ప్రకారం.. మండలంలోని ఉల్లంపర్రు గ్రామానికి చెందిన దోస నరసింహస్వామి (56) జూన్ 19వ తేదీన గ్రామం నుంచి పాలకొల్లు పట్టణానికి వస్తుండగా కెనాల్ రోడ్డులో వాటర్ వర్క్స్ ప్రాంతంలో వెనుక నుంచి మినీ వ్యాన్ ఢీకొట్టడంతో తలకు తీవ్రమైన గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి పట్టణ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గుంటూరు తరలించగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బ్రెయిన్‌కు చికిత్స చేశారు. అప్పటి నుంచి అపస్మారకస్థితిలోనే ఉన్న స్వామి బుధవారం ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నరసింహస్వామికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతను పట్టణంలో ఓ ఎడ్యుకేషన్ కోచింగ్ సెంటర్‌ను నడుపుతుండేవారు. పట్టణ ఎస్సై పృధ్వీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. -
నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 10 వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నాలుగు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగా 7న అంకురార్పణ, 8న పవిత్రాధివాసం, 9న పవిత్రావరోహణ, 10న మహా పూర్ణాహుతి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఉత్సవాలు జరిగే ఈ నాలుగు రోజులు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని, భక్తులు గమనించాలని ఆయన కోరారు. -
సీతారాముని ఆలయంలో చోరీ
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని శ్రీసీతారామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులోని సీతారామస్వామి ఆలయ తలుపులు తెరిచేందుకు మంగళవారం ఉదయం అర్చకులు శ్రీనివాసులు వెళ్లగా తలుపులు తాళాలు పగులగొట్టి ఉండడం, సీసీ కెమెరాలు ధ్వంసం కావడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. హుండీ కోసం వెతకగా ఆలయానికి ఆనుకుని కున్న ఎంపీయూపీ పాఠశాల ఆవరణలో లభించింది. అలాగే పాఠశాలలోని పలు గదుల తాళాలు సైతం పగులగొట్టి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని ఎస్సై జబీర్ పరిశీలించారు. ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ మంగళవారం ఫిర్యాదుచేశారు. కాగా, చోరీ చేసిన హుండీపై వేలి ముద్రలు పడకుండా దొంగలు కోడిగుడ్లు పగులగొట్టి వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయ వాచ్‌మన్‌ను ఈవో తన వాహనానికి డ్రైవర్‌గా వినియోగించుకోవడంతో సోమవారం రాత్రి అతడు విధులకు హాజరు కాలేదని తెలిసింది. ద్విచక్ర వాహనాల చోరీపై ఫిర్యాదు ఉండి: రెండు ద్విచక్ర వాహనాల చోరీపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోడూరు మండలం జగన్నాధపురానికి చెందిన కడలి బాబీ జూన్ 10వ తేదీన మహదేవపట్నలో రొయ్యల పట్టుబడికి వచ్చాడు. పని ముగించుకుని మద్యం దుకాణం వద్ద వాహనాన్ని నిలిపి లోనికి వెళ్లి బయటకు వచ్చేసరికి ద్విచక్రవాహనం కనిపించలేదు. ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై హెడ్కానిష్టేబుల్ కేసు నమోదు చేశారు. అలాగే పెదపుల్లేరులో గత నెల 19వ తేదీ రాత్రి నిచ్చెనకొలను కృష్ణ తన ఇంటివద్ద ద్విచక్రవాహాన్ని పెట్టాడు. మరోసటి రోజు ఉదయానికి వాహనం కనిపించలేదు. ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముఖం చాటేసిన పులస
పెనుగొండ: గోదావరి జిల్లాలకు సంక్రాంతి పండుగ ఎంత ప్రత్యేకమో.. వరదనీటితో ఎగురుకొంటూ వచ్చే అతిథి పులస అంతే విశిష్టతను కలిగి ఉంటుంది. ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి ఎగురుకొంటూ గోదావరిలో కలసి నామాంతరం మార్చుకొని పులసగా పిలువబడే చేపలరాజు ఈ ఏడాది చిక్కడం కష్ట సాధ్యంగా మారింది. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబరు వరకూ ఇబ్బడి ముబ్బడిగా దొరికి, దీపావళి వరకూ అరకొరగా దొరికే పులస ప్రస్తుతం దొరకడం కష్టంగా మారింది. దీంతో ఆశలు వదులుకొన్న జాలర్లకు, పులస ప్రియులకు గోదావరికి రెండు మూడు పర్యాయాలు వరద నీరు రావడంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. హిల్సా పులసగా నామాంతరం సముద్రంలో హిల్సాగా పిలవబడే చేపజాతి పసిపిక్ మహాసముద్రంలో జీవిస్తుంటుంది. ప్రతి ఏటా గోదావరికి ఎర్రనీరు వచ్చే సమయానికి ఖండాంతరాలు ఈదుకొంటూ గోదావరికి వచ్చి సంతతిని వృద్ధి చేసుకొని తిరిగి సముద్రంలోకి వెళుతుంటాయి. ఈ సమయంలో జాలర్లకు చిక్కి కాసులు కురిపిస్తాయి. పులసలు వచ్చే సమయానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి జాతీయ రహదారిలో గోదావరి జిల్లాల మీదుగా ప్రయాణించే ప్రతి ఒక్కరూ పులస రుచిని చూడడానికి మక్కువ చూపుతుంటారు. దీంతో దీని ధర ఘనంగానే ఉంటుంది. పులస విరివిగా దొరికే ప్రతి ఏటా కిలో రూ.1500 నుంచి రూ.3 వేల వరకూ పలుకుతుంది. సైజు పెరిగే కొద్దీ ఒక్కో పులసను పోటీ పడి పులస ప్రియలు రూ.25 వేలుకు కొనుగోలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాది వీటి జాడే కరువైంది. దీంతో కిలో రూ.3 వేలు నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. సముద్రపు పోటే కారణమా? పులసల జాడ తగ్గడానికి సముద్రపు పోటు ఓ కారణంగా చెబుతున్నారు. గోదావరి జలాలు సముద్రంలోకి కలిసేటప్పుడు ఉండే తీయదనం, ఎర్రదనం తగ్గడంతో పులసల జాడ తక్కువైందని భావిస్తున్నారు. ఉప్పు జలాలు ప్రస్తుతం ఇటు సిద్ధాంతం వరకూ, అటు జొన్నాడ ఆలమూరు వరకూ ప్రభావం చూపుతుండడంతో పులస మార్గానికి ఆటంకం కారణం కావచ్చునని భావిస్తున్నారు. ఇసుక తవ్వకాలు భారీగా ఉండడంతో సముద్రపు జలాలు గోదావరిలోకి నానాటికీ బాగా చొచ్చుకు వచ్చి గోదావరి ప్రవాహ ప్రాంతం కలుషితమైందని అంటున్నారు. దీంతో పులస మార్గానికి ఆటంకం కలుగుతుందంటున్నారు. ఆగస్టుపైనే ఆశలు సాధారణంగా గోదావరికి ఆగస్టు మధ్యమంలో వరద ఉధృతంగా వచ్చే అవకాశం ఉండడంతో ఇటు పులసల ప్రియులు, అటు జాలర్లు ఆశలు పెట్టుకొన్నారు. అయితే, ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఉండడంతో వారి ఆశ నిరాశగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్‌ను ముంచేస్తున్న ఇలసలు పులస జాడ అంతంతమాత్రంగానే ఉండడంతో జాతీయ రహదారిలో పులసల స్థానంలో ఒడిస్సా నుంచి వచ్చిన ఇలసలు ముంచేస్తున్నాయి. అసలైన పులస ఎర్రనీరులో ఈదుకొంటూ వచ్చినపుడు పులసపై ఎర్రటి జాడ కనిపిస్తూ ఉంటుంది. దీనిని గుర్తించి తీసుకోవలసి ఉంటుంది. పులసలు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి ప్రారంభమై ఆత్రేయపురం, విజ్జేశ్వరం, జొన్నాడ ఆలమూరు, సిద్ధాంతం, కోడేరు, యలమంచిలి వరకూ జాలర్ల వలకు చిక్కుతుంటాయి. పులసకు, ఇలసకు తేడాను గోదావరి వాసులు గుర్తించినా, ఇతర జిల్లాల నుంచి జాతీయ రహదారిలో పయనించే వాహనదారులు గుర్తించే అవకాశం లేదు. దీంతో ఇలసలనే పులసలుగా కొందరు అమ్మకాలు సాగిస్తున్నారు. వీటి ధరా అధికంగానే ఉండడంతో ధర చూసి పులసగా భావిస్తూ మోసపోతున్నారు. సిద్ధాంతం, జొన్నాడ ఆలమూరు వంటి ప్రాంతాల్లోనూ పులసలు అరకొరగా దొరుకుతుండడంతో కొందరికి మాత్రమే అసలైన పులస దక్కుతుంది. గోదావరిలో జాడలేని పులస అరకొర లభ్యతతో ఆకాశాన్నంటిన ధరలు పుస్తులమ్ముకొనైనా పులస తినాలనే నానుడు గోదావరి జిల్లాల్లో ఉంది. కానీ ఈ ఏడాది పుస్తులమ్ముకొన్నా.. చేపల రాజు పులస దొరికే పరిస్థితి లేదు. గోదావరికి వరద ఉధృతి అంతంత మాత్రంగా ఉండడంతో పులస జాడ కనిపించడం లేదు. దీంతో పులస ప్రియులు జిహ్వను చంపుకోవాల్సి వస్తోంది. ప్రత్యేక వలలు సైతం ఎంచుకొని, నలుగురైదుగురు జాలర్లు వెళ్లినా ఒకటి రెండు మాత్రమే చిక్కడంతో గిట్టుబాటు కాక జాలర్లు సైతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కూరా ప్రత్యేకమే పులస కూర తయారీ ప్రత్యేకమే. సాధారణంగా చేపల కూర ఒకటి రెండు రోజులు మించి ఉండే అవకాశాలు ఉండవు. అయితే, పులస కూర వారంకు పైగా నిలువ ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగానే తయారీ చేస్తుంటారు. పులస కూర తయారీలో వెన్నతో పాటు, ఆవకాయ ఊట, కుమ్ముడు ఆముదం వేసి వండుతారు. దీంతో పులస ముక్క కన్నా, పులుసే అమోఘమంటూ లొట్టలు వేసుకొని మరీ తింటారు పులస ప్రియులు. -
సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించాలి
భీమవరం: ప్రతి వినియోగదారుడు సూర్యఘర్ పథకంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్ డైరక్టర్ టి. సూర్యప్రకాశ్ ఆదేశించారు. ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్)గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంగళవారం భీమవరం వచ్చిన ఆయన ఎస్ఈ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు వారి ఇళ్లపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం ఉంటే నెడ్‌క్యాప్ ద్వారా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఏ సబ్ స్టేషన్ల పరిధిలో అంతరాయాలు వస్తున్నాయో అడిగి, వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్‌ను సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీవారికి ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. నేడు ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపిక భీమవరం: పట్టణంలోని ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం స్కూల్లో ఈనెల 6వ తేదీన జిల్లా స్థాయి ఆట్యా–పాట్యా జూనియర్ బాలురు, బాలికల సెలక్షన్లు నిర్వహిస్తున్నట్లు ఆట్యా–పాట్యా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి కిరణ్‌వర్మ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9, 10 తేదీల్లో ఒంగోలులో జరిగే 10వ జూనియర్ రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికకు జనవరి 1, 2008 తరువాత పుట్టినవారు అర్హులని, ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టిన తేది ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్సైజ్ ఫొటోలతో హాజరుకావాలన్నారు. -
పిల్ల జలగలతో గొర్రెలకు ప్రమాదం
జంగారెడ్డిగూడెం: గొర్రెలు, పశువుల్లో పొట్ట జలగల వలన చాలా నష్టాలు కలుగుతాయి. అందులో ముఖ్యంగా పిల్ల పొట్ట జలగల వల్ల గొర్రెల్లో విరేచనాలు కలిగి, నీరసించి మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కుంటలు, చెరువులు పక్కన తేమ గల ప్రాంతాల్లో నాట్లు ఉన్న ప్రాంతాల్లో నత్తలు ఉంటాయి. గొర్రెలను ఆ ప్రాంతాల్లో మేపడం వలన అవి అక్కడి నీరు తాగడం ద్వారా గొర్రెలకు ఈ వ్యాధి సోకుతుందని పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ తెలిపారు. ఇవి పొట్ట గోడల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని పోషక పదార్థాలను పీల్చడం ద్వారా పశువుకు నష్టాన్ని చేకూర్చుతాయని, గొర్రెల పెంపకందారులు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వ్యాధి వ్యాప్తి పొట్ట జలగల గుడ్లు పేడ ద్వారా బయటకు విసర్జించబడి, నీటిలోనికి చేరినప్పుడు గుడ్లు పగిలి అందులోని లార్వా దశ (మిరసిడియం) నత్తల శరీరంలోకి ప్రవేశించి, నత్తల్లో కొంత అభివృద్ధి చెంది సర్కేరియా దశలో బయటకు విసర్జించబడతాయి. వీటితో కలుషితమైన గడ్డి, నీటి ద్వారా గొర్రె శరీరంలోనికి ప్రవేశించి, ముందుగా చిన్న ప్రేగుల లోపల పొరలకు చేరుకుని, పోషక పదార్థాలను ఎక్కువగా పీల్చుకుని, 3 నుంచి 5 వారాల్లో పెద్ద జలగలుగా అభివృద్ధి చెందుతాయి. రూమోన్లో స్థావరం ఏర్పరుచుకుని 7 నుంచి 14 వారాల తరువాత గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పేడ ద్వారా బయటకు విసర్జింపబడి ఇతర పశువులకు వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు పిల్ల పొట్ట జలగలు చిన్న ప్రేగుల మొదటి భాగమైన డ్యుమోడినము గోడ లోపలి పొరల్లో స్థావరం ఏర్పరుచుకుని, పోషక పదార్థాలను ఎక్కువగా పీల్చుకోవడం వలన గొర్రెలు బాగా క్షీణించి, నీరసించి పోతాయి. గొర్రెల్లో ఆకలి లేమి, నీరు ఎక్కువగా తాగడం, దుర్వాసనతో కూడిన నీళ్ల విరేచనాలు, దవడ కింద భాగంలో నీరు చేరడం, శరీర కుహరంలలో నీరు చేరడం అతిసారం, రక్తహీనత లక్షణాలు కనిపిస్తాయి. దవడ కింద వాపు సాయంత్రం కనబడి ఉదయానికి తగ్గుతుంది. ఈ వ్యాధి వల్ల గొర్రెల మందల్లో 80 శాతం వరకు మరణాలు సంభవించవచ్చు. కొన్ని పర్యాయాలు పిల్ల పొట్ట జలగలు అధిక సంఖ్యలో సోకడం వల్ల నీళ్ల విరేచనాలు కలిగి అకస్మాత్తుగా చనిపోయే అవకాశం ఉంది. కంటి లోపలి మ్యూకస్ పొర రక్తహీనత వల్ల తెల్లగా పాలిపోయి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ పిల్ల పొట్ట జలగ వ్యాధి సోకినప్పుడు పేడలో జలగ గుడ్లు కనిపించవు. కాని కొన్ని సందర్భాల్లో పిల్ల పొట్ట జలగలు పేడలో కనిపిస్తాయి. కావున వ్యాధి లక్షణాలు, శవపరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. శవ పరీక్ష చేసినప్పుడు డ్యుమోడినం లోపలి మ్యూకస్ పొర పాలిపోయి, అక్కడక్కడ రక్తపు చుక్కలు కనిపిస్తాయి. డ్యుమోడినం లోపలి మ్యూస్ పొరల నుంచి సేకరించిన పదార్ధంను సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించిన కనిపిస్తాయి. చికిత్స సాధారణంగా పొట్ట జలగల నివారణకు ఉపయోగించే మందుల వలన పిల్ల పొట్ట జలగల నివారణ జరగదు. వీటి నివారణకు నిక్లజమైడు 100 మి.గ్రాలు ఒక కిలో శరీర బరువుకు చొప్పున లేదా ఆక్సిక్లోజనైడు 18.7 మి.గ్రాలు ఒక కిలో శరీర బరువుకు చొప్పున రెండు రోజుల వ్యవధిలో రెండు మోతాదులు ఇవ్వాలి. అతిసారం అధిగమించడానికి రక్తంలోనికి సైలెన్లను ఎక్కించాలి. రక్తహీనత నివారించడానికి ఇనుపధాతువుతో కూడిన మందులు ఇవ్వాలి. కాలేయం సాధారణ స్థితికి చేరుకోవడానికి మందులు ఇవ్వాలి. బాక్టీరియా క్రిములు చేరకుండా ఉండటానికి అవసరమైతే యాంటి బయోటిక్ మందులు ఇవ్వాలి. చెరువుల్లోని నత్తలను నాశనం చేయాలి వ్యాధి సోకిన ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లోని నీరు తాగనీయకూడదు. అవసరమైతే చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలి. చెరువుల్లోని నత్తలను నాశనం చేయాలి. గొర్రెలకు సమతుల్యమైన పోషకాహారం అందించాలి. పరిశుభ్ర వాతారణం కల్పించాలి. – బీఆర్ శ్రీనివాసన్, పశువైద్యాధికారి -
విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి
తణుకు అర్బన్: విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన మంగళవారం తణుకు మండలం కొమరవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన పిప్పిరిశెట్టి మణికంఠ (24) కొమరవరం గ్రామంలోని లక్ష్మీ గణేష్ నగర్లో ఒక ఇంట్లో విద్యుత్ లైన్ల పనుల్లో ఉండగా తెగిపడి ఉన్న విద్యుత్ వైరు గమనించకుండా తాకడంతో అతడికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో గాయాలపాలైన మణికంఠను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తణుకు పట్టణానికి చెందిన బిల్డర్ వాసుకూరి వెంకట సుబ్బారావు నిర్మిస్తున్న భవనానికి సంబంధించి ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ పనుల నిమిత్తం చివటం గ్రామానికి చెందిన కోలా ప్రసాద్ అనే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అతని వద్ద పనిచేస్తున్న మణికంఠ విధుల్లో ఉండగా విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం కేసులో వ్యక్తి అరెస్ట్ భీమవరం: పాతమద్యం కేసులో ఎండీపీఎల్ ముద్దాయి కాకినాడ జిల్లా తుని పట్టణం సీతారాంపురానికి చెందిన వీర్ల దుర్గా ప్రసాద్‌ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజు చెప్పారు. అతడిని ఫస్ట్ ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపర్చగా నరసా పురం సబ్‌జైల్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
ఏఆర్‌డీజీకే విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక ఆదివారపు పేటలోని ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీ. కాంతి జయకుమార్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల అభినందన కార్యక్రమం మంగళవారం పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 8వ తరగతి చెందిన కే. భార్గవి 58 కేజీల విభాగంలో తృతీయ స్థానం, కే.మేఘన 63 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, 9వ తరగతి విద్యార్థిని ఎం.పావని 44 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, సీహెచ్. కీర్తన 58 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎస్డీ మహీన్ 48 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎం.దీక్షిత 44 కేజీల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. పదో తరగతి విద్యార్థిని సీహెచ్.హారిక రెడ్డి 63 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎన్.విహారిక 77 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, జీ. పవిత్ర 58 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, పీ.ఇందు 44 కేజీల విభాగంలో తృతీయ స్థానం, ఎం.అనూష 53 కేజీల విభాగంలో తృతీయ స్థానం, షేక్. ఆశాజ్యోతి 77 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించారన్నారు. అలాగే అథ్లెటిక్స్‌లో కిలోమీటర్ విభాగంలో జే. పల్లవి ప్రథమ స్థానం సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు తోట శ్రీనివాస్ కుమార్, అబ్బ దాసరి జోజి బాబు, ఇతర ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. -
కారు ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
ద్వారకాతిరుమల: ముందు వెళుతున్న ఆటోను కారు అతి వేగంగా ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం, లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. పెదవేగి మండలం కవ్వగుంటకు చెందిన చోదిమెళ్ళ విజయరాజు(40) ఆటో నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మంగళవారం మధ్యాహ్నం జేఎంఆర్ హాస్పిటల్ గురించి మైక్ ద్వారా ప్రచారం చేస్తూ, భీమడోలు నుంచి ద్వారకాతిరుమల వైపు వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి చైన్నెకు చెందిన అయిత సురేష్ కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ విజయరాజును స్థానికులు హుటాహుటీన ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయరాజు భార్య దేవమాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
పాలకొల్లు సెంట్రల్: పూలపల్లి గ్రామంలో ఓ ఇంటిలో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించగా సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం గ్రామంలోని గంటాలమ్మ ఆలయం వద్ద నివాసం ఉంటున్న గంట సత్తిబాబు భార్య స్వరాజ్యలక్ష్మి మంగళవారం ఉదయం వంట చేస్తుండగా గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే ఆమె కేకలు వేయగా స్థానికులు పరుగున వచ్చి మంటలతో ఉన్న గ్యాస్ బండను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, హెచ్‌పీ గ్యాస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆలస్యం అయ్యి ఉంటే బండ పేలిపోయేదని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు రూ.20 వేలు ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఆటల పోటీలు వాయిదా ఏలూరు రూరల్: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టిన ఆటల పోటీలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. తదుపరి జిల్లా జట్ల ఎంపిక, పోటీల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జరిమానా భీమవరం: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్లు భీమవరం వన్‌టౌన్ సీఐ ఎం.నాగరాజు మంగళవారం చెప్పారు. వన్‌టౌన్ పరిధిలో ఈనెల 4వ తేదీ రాత్రి ఎస్సైలు బి.వై కిరణ్‌కుమార్, ఎస్వీవీఎస్ కృష్ణాజి సిబ్బందితో కలిసి కొత్త బస్టాండ్ ప్రాంతంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న కారు, ఆటో డ్రైవర్లతోపాటు 9 మంది మోటార్‌సైకిల్ వాహనదారులపై కేసులు నమోదు చేశామన్నారు. నిందితుల్లో ఏడుగురిని మంగళవారం స్పెషల్ జ్యుడిషియల్ 2వ తరగతి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఎంవీఎన్ రాజారావు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆసుపత్రి వద్ద ఆందోళన జంగారెడ్డిగూడెం: నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతోపాటు తమపై దాడికి పాడ్పడ్డారని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాధితులు మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై షేక్‌జబీర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టి.నరసాపురం మండలం గండిగూడానికి చెందిన యర్రగొర్ల రాజేష్ కుమార్తె పునర్వికశ్రీ జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం ఈనెల 3వ తేదీన వచ్చారు. ఆసుపత్రి ప్రధాన వైద్యుడు కాకుండా వేరొక వైద్యుడితో గత రెండు రోజులుగా చికిత్స అందిస్తున్నారని, బాలిక కోలుకోకపోవడంతో ప్రధాన వైద్యుడిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడంతో పాటు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి రాజేష్‌ను నిర్భంధించి కొట్టారు. బంధువుల సహాయంతో రాజేష్ బయటకు వచ్చి ఫిర్యాదు చేశాడని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీఆర్వో ఎం వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వీఎస్ సాయిబాబా, ఎలక్ట్రానిక్స్ మీడియా అధ్యక్షుడు జక్కంశెట్టి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రంశెట్టి గిరిజాపతి మాట్లాడుతూ గత ఏడాది కాలంగా జర్నలిస్టు అక్రిడిటేషన్లను మూడు నెలలకు ఒకసారి పొడిగించడంతో కొత్తగా అక్రిడిటేషన్లు తీసుకునేవారికి అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే అర్హత గల జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులందరకీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని, హెల్త్ ఇన్యూరెన్స్ స్కీమ్ అమలు వంటి డిమాండ్స్ తక్షణం అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ నాయకులు వంగల లింగమూర్తి, కేఎస్ఆర్కే గోపాలకృష్ణ, బి రామాంజనేయులు, పట్టణ కార్యదర్శి కమ్మిలి హనుమంతరావు, ఎన్ సత్యనారాయణ, విజయరాజు పాల్గొన్నారు. -
పరాకాష్టకు పీ–4
సాక్షి, భీమవరం: పేదరిక నిర్మూలన కోసమంటూ చంద్రబాబు సర్కారు చేపట్టిన పీ–4 కార్యక్రమం వేధింపులు పరాకాష్టకు చేరాయి. సర్కారు పిలుపునకు సంపన్నుల నుంచి స్పందన రాక ఉద్యోగులను బాధ్యులను చేసే పనిలో ఉంది. మార్గదర్శులుగా మ్యాపింగ్‌కు ఒత్తిడి తెస్తోంది. పీ–4 అమలులో సర్వే లక్ష్యం చేరుకోలేదంటూ సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అట్టడుగు పేద కుటుంబాలను సంపన్నుల సాయంతో అభివృద్ధి చేసేందుకు పబ్లిక్– ప్రైవేట్ – పీపుల్ పార్టనర్షిప్ (పీ–4) కార్యక్రమం తెచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 4,92,292 కుటుంబాలకు పలు వడపోతల తర్వాత 64,940 కుటుంబాలను అర్హులుగా ఎంపిక చేశారు. సంపన్నులను మార్గదర్శులుగా చేర్పించి ఆయా కుటుంబాలను వారికి అనుసంధానించాలి. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థిక చేయూత, లేదా జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి. ఉద్యోగుల పైనే భారం బంగారు కుటుంబాలు, మార్గదర్శుల గుర్తింపు, అనుసంధానం మొత్తం బాధ్యతలను ప్రభుత్వం ఉద్యోగ వర్గాలపైనే మోపింది. ఈ నెల 15 నాటికి జిల్లాలో 15 వేల మంది మార్గదర్శులను గుర్తించాలని లక్ష్యంగా నిర్ణయించారు. పీ–4లో భాగస్వాములుగా చేరి బంగారు కుటుంబాలను బాగుచేసేందుకు కూటమి పక్షాల్లోని సంపన్న నేతలు ఆసక్తి చూపడం లేదు. శనివారం నాటికి జిల్లాలో 1,700 మంది మాత్రమే మార్గదర్శులుగా రిజిస్టర్ చేసుకున్నారు. వీరికి 35 వేల కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. ఉన్నతస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడితో త్వరితగతిన మిగిలిన కుటుంబాల మ్యాపింగ్ పూర్తిచేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఉన్నతాధికారులు నిరంతర సమీక్షలు చేస్తున్నారు. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, పెద్ద రైతులు, రైస్ మిల్లర్స్, విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మద్యం, ఎరువుల షాపుల యజమానులు, డీలర్లు తదితర వర్గాల వారితో సమావేశాలు ఏర్పాటుచేసి మార్గదర్శులుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నారు. పెద్దగా ఫలితం కనిపించకపోవడంతో మార్గదర్శుల భారాన్ని ప్రభుత్వం ఉద్యోగ వర్గాలపై మోపుతోంది. ఒక్కో కుటుంబాన్ని మ్యాపింగ్ చేసుకోవాలంటూ వస్తున్న ఒత్తిళ్లతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. నైపుణ్యాలను నేర్పించే ఆప్షన్లో ఒక్కో ఉద్యోగి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోమంటున్నారని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఏడాదికి ఒక్కో ఉద్యోగి కనిష్టంగా దత్తత కుటుంబానికి రూ.5 వేలు సాయం అందించాలని, ఈ మేరకు తమ జీతం నుంచి మినహాయించుకుంటుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఆదిలోనే తిప్పికొట్టిన ఉపాధ్యాయ సంఘాలు పీ–4 అమలులో టీచర్లను భాగస్వాములను చేసే ప్రయత్నాలను ఉపాధ్యాయ సంఘాలు ఆదిలోనే తిప్పికొట్టాయి. ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్‌కు ఏలూరు విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రవ్యాప్తంగా సంఘ నాయకులు ఖండించారు. సంపన్నవర్గాలకు చెందిన పీ–4 అమలుకు మధ్య తరగతి శ్రేణిలో ఉండే ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల వారిపై భారం మోపడం సరికాదని, వేరే కుటుంబాలను దత్తత తీసుకుని సాయపడే పరిస్థితి ఉండదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలంటూ ఫ్యాప్టో చురకలంటించింది. ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనలకు సిద్ధంకావడంతో ఉత్తర్వులను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ పీ–4 సర్వే లక్ష్య సాధనలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ భీమవరం మున్సిపాల్టీకి చెందిన 26 మంది సచివాలయ అడ్మిన్, ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసుల జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. పింఛన్ల పంపిణీ, రకరకాల సర్వేల పేరిట క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటే నోటీసులు ఇవ్వడం సరికాదని ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లాలోని మిగిలిన మున్సిపాల్టీల్లోనూ ఈ తరహా ఒత్తిళ్లు అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. పేదలకు మేలు చేయాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే నేరుగా వారిని ఆదుకోవాలని, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మార్గదర్శులుగా ముందుకురాని కూటమి నేతలు ఉద్యోగులనే మార్గదర్శులుగా మ్యాపింగ్‌కు ఒత్తిళ్లు భీమవరంలో 26 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఎంపీడీవోలు, ఇతర అధికారులపైనా తీవ్ర ఒత్తిడి -
పీ4 మార్గదర్శులకు అవగాహన
భీమవరం (ప్రకాశంచౌక్): డీఆర్డిఏ, డ్వామా శాఖలతో ప్రేరేపితులై ముందుకు వచ్చిన పీ4 మార్గదర్శులతో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వివిధ మార్గాలుద్వారా సేవలందిస్తున్న సమాజ నిర్దేశకులందరినీ ఒకే తాటిపై తీసుకువచ్చి మార్గదర్శకులుగా నమోదు చేసి బంగారు కుటుంబాలకు సేవలందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. మార్గదర్శకులుగా నమోదు కావడానికి మనసున్న ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. నమోదయ్యే సందర్భంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టి తీసుకురావాలన్నారు. ప్రతి సచివాలయంలో నమోదుకు ఉచితంగా అవకాశం కల్పించామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మార్గదర్శిగా ఆర్థికంగా ఒక్కటే కాదని, సేవా తత్పరతతో చేసే ఏ కార్యక్రమం అయినా నిర్వహించవచ్చన్నారు. -
స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలి
భీమవరం: విద్యుత్ స్మార్ట్ మీటర్లు తక్షణం రద్దు చేసి ట్రూఅప్ చార్జీలు ఉపసంహరించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు చెల్లబోయిన రంగారావు డిమాండ్ చేశారు. ప్రజా వేదిక పిలుపులో భాగంగా మంగళవారం పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి దగ్గరలో విద్యుత్ సబ్స్ట్షేన్ వద్ద ప్రజావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడారు, అదానీతో విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వాడుకున్న విద్యుత్‌కు అదనపు రుసుం ఇప్పుడు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను రాష్ట్రం అమలు చేయడం దారుణమని పెంచిన విద్యుత్ భారాలు ఉపసంహరించకపోతే మరో పోరాటానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఏఐసీటియు, టీయుసీసీ నాయకులు లంక కృష్ణమూర్తి, కొల్లాబత్తుల మహంకాళి మాట్లాడుతూ.. విద్యుత్ ఒప్పందాలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎలక్ట్రికల్ జేఈకి వినతి పత్రం అందచేశారు. కార్యక్రమంలో ప్రజా వేదిక నాయకులు బి.వాసుదేవరావు, జక్కంశెట్టి సత్యనారాయణ, కె.క్రాంతిబాబు, ఇంజేటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. -
అక్రమ ఆయుధాలు స్వాధీనం
పెనుమంట్ర: ఎస్పీ ఆదేశాల మేరకు పెనుమంట్ర ఎస్సై కె స్వామి తన సిబ్బందితో పొలమూరులో ఆక్వా చెరువుల వద్ద తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 5 నాటు తుపాకులు, 10 కిలోల గన్‌పౌడర్, 3 కిలోల గోళీలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై స్వామి తెలిపారు. ఆక్వారైతులు ఎవరైనా అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే వాటిని వెంటనే పోలీసులకు అప్పగించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ ఆర్.విజయ్‌కుమార్ హెచ్చరించారు. ఆక్వా జోన్ సర్వే పూర్తి చేయాలి భీమవరం (ప్రకాశంచౌక్): ఆక్వా జోన్ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు. జాయింట్ కలెక్టర్ చాంబర్లో మంగళవారం మత్స్య, గృహ నిర్మాణ శాఖలపై సమీక్షించారు. నాచు పెంపకం (సీవీడ్) పై ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు నిపుణులతో శిక్షణ ఇప్పించి ప్రోత్సహించాలని, ఈ కార్యక్రమాన్ని రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సమృద్ధిగా పండే వ్యవసాయ భూమిని ఆక్వా జోన్లోకి ప్రతిపాదించవద్దని అధికారులకు సూచించారు. క్రమబద్ధీకరణకు గడువు పొడిగింపు ఏలూరు(మెట్రో): అనధికార లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనల ప్రకారం గడువు పొడిగించామని జేసీ పి.ధాత్రిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు జూన్ 30, 2025 లోపు దరఖాస్తుచేసి క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. సదరు క్రమబద్ధీకరణ రుసుం 45 రోజుల్లో చెల్లిస్తే 10 శాతం రాయితీ, తదుపరి 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 99668 48055 నెంబరులో సంప్రదించాలన్నారు. అంగన్వాడీలపై వేధింపులు ఆపాలి ఏలూరు (టూటౌన్): ఫోన్లను అంగన్వాడీ కార్యాలయంలో అప్పగించిన వారిపై వేధింపులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తమ ఫోన్లను ఐసీడీఎస్ కార్యాలయాల్లో అప్పగించారన్నారు. ఫోన్లు పనిచేయడం లేదని చెప్పినా వినకుండా టార్గెట్ల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్ సిగ్నల్స్ లేకపోవడం, సర్వర్ పనిచేయకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారుల బెదిరింపులకు అంగన్వాడీలు లొంగరన్నారు. సమస్య సానుకూలంగా పరిష్కరించాల్సిన అధికారులు ఇంతవరకూ స్పందించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే అంగన్వాడీలకు 5 జీ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని యాప్‌లను కలిపి ఒక యాప్‌గా మార్చాలని, ఇతర సమస్యలు పరిష్కరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పుస్తకాల కోసం ఉరుకులు పరుగులు దెందులూరు: ప్రభుత్వ తాజా ఆదేశాలపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే యాప్‌లతో ఇబ్బంది పడుతున్న తమకు బోధనకు సమయం లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం ఏలూరు సుబ్బమ్మ దేవి పాఠశాలకు వెళ్లి విద్యార్థుల పుస్తకాలు తీసుకెళ్లాలని ఫోన్లకు మెసేజ్‌లు పంపారు. పాఠశాల పనివేళల్లో పుస్తకాలు మోయడానికి ఉపాధ్యాయులను కేటాయించడం ఏంటని ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో వాహనాల ద్వారా మండలంలో ఒక సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆ సెంటరుకు పుస్తకాలను సరఫరా చేసేవారు. ఆ కేంద్రం నుంచి ఉపాధ్యాయులు వెళ్లి తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి చెప్పి జిల్లా కేంద్రానికి వెళ్లి పుస్తకాలు తెచ్చుకోమనడంపై మండిపడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో సింగిల్ టీచర్ పనిచేస్తున్నారని.. ఉన్న ఒక్క టీచరు పుస్తకాలు తేవడానికి జిల్లా కేంద్రానికి వెళ్తే విద్యార్థుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదేశాలు పాటించకపోతే మళ్లీ ఏం చేస్తారో అని తప్పని పరిస్థితుల్లో ద్విచక్ర వాహనాలపై ఏలూరు వెళ్లి పుస్తకాలు తీసుకువచ్చామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పుస్తకాలు తీసుకోవడానికి ఏలూరు రమ్మని మెసెజ్‌లు ఇచ్చిన సంగతి వాస్తవమేనని ఏలూరు రూరల్ మండలం ఎంఈఓ అరుణ్ పేర్కొన్నారు. -
పశ్చిమలో పేకాట దందా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట దందా మూడు షోలు.. ఆరు ఫుల్లులుగా సాగుతోంది. డ్రాప్‌నకు రూ.20 వేలు, మిడిల్ డ్రాప్‌నకు రూ.40 వేలు, ఫుల్ కౌంట్‌కు రూ.1.60 లక్షలు.. ఇదీ జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరంలో సాగుతున్న ప్రత్యేక పేకాట శిబిరంలోని ప్రధాన గేమ్. టీడీపీ నేతలే నిర్వాహకులు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు వారం మామూళ్లు ఫిక్స్ చేసి ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పేకాట జాతర మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు నిర్విరామంగా సాగుతోంది. భీమవరం సహా పశ్చిమ గోదావరిలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే నిర్వాహకుల స్థాయిని బట్టి సభ్యులు, ఆట స్థాయి మారుతుంది. భీమవరంలో స్పెషల్ శిబిరం భీమవరంలోని మురుగు కాల్వ గట్టు సమీపంలో ఓ శిబిరం భారీ స్థాయిలో సాగుతోంది. పట్టణంలోని ఓ ప్రముఖ క్లబ్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి నిర్వాహకుడుగా మారి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఆట సాగుతుంది. 11 మంది సభ్యులతో మూడు కట్టలతో కనష్ట బోర్డు.. ఏడుగురితో మరో బోర్డును ఏర్పాటుచేసి గంటకు 7–10 ఆటలు ఆడిస్తున్నారు. ఓకుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిగే బోర్డు అందుబాటులో పెట్టారు. ఓకుకు రూ. 20 వేలు చొప్పున.. ఫుల్ కౌంట్ పడితే రూ.1.60 లక్షలు చెల్లించే గేమ్‌కు రూ.5 లక్షలు డిపాజిట్, మరో రూ.4.80 లక్షలు అంటే మూడు ఫుల్‌గేమ్‌ల మొత్తం వెరసి రూ.9.80 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ మొత్తం కిలోమీటరు దూరంలో ఉండే మరో వ్యక్తి ప్రత్యేకంగా లాకర్లు, ఇతర జాగ్రత్తలతో నగదును సేకరించి టోకెన్లు ఇచ్చి శిబిరానికి పంపుతారు. మరో ప్రత్యేక అంశమేమిటంటే.. సదరు నిర్వాహకుడు సభ్యుడిగా ఉన్న క్లబ్లో గెస్ట్‌ల పేరుతో కొందరిని అక్కడి ఆటకు పంపించడం, గెలుపోటములు పూర్తయ్యాక వెళ్లే సమయంలో స్లిప్ ద్వారా వసూళ్లు, చెల్లింపులు చేస్తున్నారు. భీమవరంలో పేకాట నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు వ్యక్తి ఆటకు రూ.4 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు వసూలు చేస్తున్నాడు. రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు శిబిరం నిర్వాహకులకే దక్కుతోంది. వీటిల్లో పోలీసులకు, స్థానిక ప్రజాప్రతినిఽధికి వారం, నెలవారీలు మామూళ్లను ఖరారుచేసి పంపుతూ జోరుగా శిబిరం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సన్నిహితులే చూస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. స్థానిక ఎస్ఐ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఈ విషయం తెలిసినా పొలిటికల్ గేమ్ పేరుతో పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుల పెరగడంతో కొద్ది రోజులుగా శిబిరాల్ని నడపడం లేదు. మరో అనువైన ప్రదేశం కోసం వేట సాగుతున్నట్లు సమాచారంఒక్కొక్కచోట ఒక్కోలా తణుకు మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఒకరోజు పైడిపర్రులో, మరోరోజు తేతలి, ఇంకోరోజు వేల్పూరులో.. ఇలా ప్రతిరోజూ ఒక్కో ప్రాంతంలో పెట్టి ఎప్పుడూ వచ్చే వంద మంది జూదరులకు మెసేజ్‌ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఉండి, ఆకివీడు, పాలకొల్లులో ఎంపిక చేసిన రొయ్యల చెరువుల వద్ద నిత్యం పెద్దఎత్తున జూదక్రీడ కొనసాగుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెదతాడేపల్లి, పెంటపాడు, రూరల్‌లో వారానికి రెండు ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిచోటా ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో పోలీసుల దాడులు, కేసుల ఊసు లేకపోవడం గమనార్హం. టీడీపీ నేతల కన్నుసన్నల్లో శిబిరాల నిర్వాహకులు భీమవరంలో ఒక్క ఆటకు రూ.1.60 లక్షలు జిల్లాలో నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేకాటరాయుళ్లకు ప్రత్యేక ఆహ్వానాలు తణుకులో రోజూ మారుతున్న శిబిరాలు పాలకొల్లు, ఉండి, తాడేపల్లిగూడెంలోనూ ఇదే దందా టీడీపీ కూటమి సర్కారు రాగానే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలలో పదుల సంఖ్యలో అనధికారిక శిబిరాలు.. అనుమతుల పేరిట పాలకొల్లు, భీమవరంలో క్లబ్బుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపి క్లబ్‌లను మూసివేశారు. దీంతోపాటు జూద క్రీడలను పూర్తిగా నిషేధించి వందల కేసులు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలే పేకాట శిబిరాల నిర్వాహకులుగా అవతారమెత్తి మూడు ముక్కలాట మొదలుకుని కనష్ట గేమ్ వరకు భారీగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా పేకాటరాయుళ్లను పెద్దఎత్తున ఆహ్వానించి నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తూ నిర్వాహకులే నిత్యం లక్షల్లో గడిస్తున్నారు. -
కారు ఢీకొని డ్రైవర్ మృతి
ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురంలో ఆటోను కారు అతి వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 10లో uతణుకు ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య పనులుతణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో మురుగునీరు తిష్టతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని సాక్షి దినపత్రికలో ‘సర్కారు దవాఖానాలో మురుగునీరు తిష్ట’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రి సూప రింటెండెంట్ డాక్టర్ కాకర్లమూడి సాయి కిరణ్, ఆర్ఎంవో డాక్టర్ ఎ.తాతారావు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి జేసీబీ ద్వారా డ్రెయినేజీలో ఉన్న మురుగును తొలగించే చర్యలకు చేపట్టారు. మురుగునీరు ప్రవహించేలా పనులు పూర్తిచేయించడంతోపాటు ఆస్పత్రి ఆవరణలో బ్లీచింగ్ చిమ్మించారు. -
ఉద్యోగుల సమస్యలపై చర్చకు ప్రత్యేక కార్యక్రమం
భీమవరం: రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టీ తాగుతూ మాట్లాడుకుందాం రండి అనే ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సంఘం రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు రవీంద్రరాజు చెప్పారు. మంగళవారం భీమవరం పట్టణంలోని జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ భవనంలో జిల్లా అధ్యక్షుడు యాళ్ళ మెహన రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులంతా సమస్యలపై చర్చించి ప్రభుత్వం వద్ద పేరుకుపోయిన రూ.30 వేల కోట్ల బకాయిలు, పెండింగ్ డీఏలు, ఐఆర్, పీఆర్సీ కమిషన్ వంటిపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఉద్యోగులను చైతన్య పర్చడానికి టీ తాగుతూ మాట్లాడుకుందాం రండి కార్యక్రమం శ్రీకారం చుట్టామన్నారు. వారానికో సమస్యపై ఉద్యోగులంతా టీ తాగుతూ చర్చిస్తామని సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వైఖరిని తెలియచేస్తామని రవీంద్రరాజు చెప్పారు. సంఘం జిల్లా కార్యదర్శి జక్రయ్య, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు షేక్ ఉమర్ అలీషా, ఉపాధ్యక్షులు రాజేష్ కుమార్, మానస తదితరులు పాల్గొన్నారు. -
వివాదాస్పదంగా ఈవో తీరు
జంగారెడ్డిగూడెం: ఆలయాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దేవదాయ శాఖ కార్యనిర్వాహక అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్లో ఉన్న రామాలయానికి స్థానిక సుబ్బంపేటలో 33.65 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే ఆ భూమిని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో సదరు భూమిలో ఉన్న ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు సోమవారం ఈవో కలగర శ్రీనివాస్ తన సిబ్బందితో వెళ్లారు. ఆలయాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులతో ఆలయ తాళాలు ఇవ్వాలని కోరారు. దీనికి వారు ఆలయంలో తమకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని, వాటిని తీసుకున్న తరువాత మీకు అప్పగిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులతో ఈవో దురుసుగా వ్యవహరిస్తూ మాట్లాడటంతో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆలయాన్ని ఎందుకు అప్పగించరు; వ్యాపారాలు చేసుకుందామనా.. అంటూ ఈవో మాట్లాడటంతో ఆలయ నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. పారిజాతగిరి ఈవోగా వ్యవహరిస్తున్న కలగర శ్రీనివాస్ జంగారెడ్డిగూడెం మండలంలోని 25 ఆలయాలకు ఇన్చార్జిగా వ్యవమరిస్తున్నారు. పలు ఆలయాల్లో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రేడ్–1 దేవాలయాల పరిరక్షణలో గ్రేడ్–2 అధికారికి ఎలా బాధ్యతలు అప్పగించారో ఉన్నతాధికారులే చెప్పాలని పలువురు పేర్కొంటున్నారు. గ్రేడ్–1 దేవాలయాల పరిరక్షణలో గ్రేడ్–2 అధికారి ఈవోగా ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈవో శ్రీనివాస్ దేవదాయ శాఖలో చేరిన సంవత్సరం, ఎస్‌ఆర్‌లో నమోదు చేసిన సంవత్సరంలో కూడా తేడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయం స్వాధీనానికి వెళ్లగా.. దానిని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండగా అడ్డుకున్నానని, దాని వల్లే తనను అల్లరి చేస్తున్నారని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. -
క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రదక్షిణలు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సప్త సోమవార ప్రదక్షిణల్లో భాగంగా సోమవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ప్రదోషకాలంలో భక్తులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్సించుకున్నారు. రాత్రి 7.30 గంటలకు స్వామివారికి పంచహారతులు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ పసుపులేటి వాసు, ఆలయ ప్రధానార్చకులు కిష్టప్ప, అనిల్ తదితరులు పాల్గొన్నారు. క్విజ్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపిక ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రెడ్ రిబ్బన్ క్లబ్ క్విజ్ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర కృష్ణ తెలిపారు. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశానుసారం జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ హెచ్ఐవీ ఎయిడ్స్ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని జూనియర్ ఇంటర్ విద్యార్థులకు రెడ్ రిబ్బన్ క్విజ్ జిల్లా వ్యాప్తంగా ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించారు. జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పీ శేఖర్ బాబు, ఇంటర్ ఎడ్యుకేషన్ రీజనల్ ఆఫీసర్ యోహాన్, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాలు ఏలూరు రూరల్: వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మహిళలు అద్భుత ప్రతిభాపాటవాలు సాధిస్తున్నారని ఏలూరు ఖేలో ఇండియా సెంటర్ ఇన్చార్జి వి.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన అస్మిత ఖేలో ఇండియా ఉమెన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల వివరాలు వెల్లడించారు. ఏలూరు సెంటర్ బాలికలు 15 మెడల్స్ సాధిచారన్నారు. బీచ్‌లో యువకుడి గల్లంతు నరసాపురం రూరల్: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో సోమవారం సాయంత్రం యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన బి.తన్వీర్ భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తన మిత్రులతో కలిసి బీచ్‌కి వచ్చాడు. అలల ఉధృతికి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మొగల్తూరు ఎస్సై జి.వాసు సముద్రతీర ప్రాంతంలో గాలిస్తున్నారు. -
జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
కుక్కునూరు: పుట్టిన రోజు జరుపుకోవాల్సిన రోజే జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన హృదయ విదారక ఘటన సోమవారం జరిగింది. మండలంలోని చిరవెల్లి గ్రామానికి చెందిన యర్నం ప్రదీప్, కావేరి దంపతులకు సహస్ర(6), స్నేహిత (3) సంతానం. సహస్రకు గత నెల 31న తీవ్రజ్వరం రావడంతో కుటుంబసభ్యులు భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ పాపకు పరీక్షలు చేసిన వైద్యులు ప్లేట్లెట్లు తగ్గినట్టు చెప్పి చికిత్సను ప్రారంభించారు. శనివారం పాపకు జ్వరం తగ్గకపోగా ప్లేట్లెట్ల సంఖ్య 15 వేలకు పడిపోయి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు రిఫర్ చేశారు. ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం ఉదయం చిన్నారి మృతి చెందింది. -
వర్షాకాలంలో విద్యుత్‌తో అప్రమత్తం
తణుకు అర్బన్: వర్షాకాలంలో విద్యుత్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలకు వృక్షాలు కూలినప్పుడు, విద్యుత్ తీగలు తెగిపడినప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులకు తెగిపడుతున్న విద్యుత్ తీగలు తగిలి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గృహాల్లో సైతం తడిచేతులతో స్విచ్‌లు వేయడం, వర్షాలకు స్విచ్ బోర్డులు తడిసి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వంటివి చూస్తున్నాం. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. వర్షాకాలం మొదలైనా ఇంతవరకు విద్యుత్ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● భారీ వర్షాల సమయాల్లో గృహోపకరణాల స్విచ్‌లు ఆఫ్ చేసి ఉంచాలి. ● కరెంటు స్విచ్ బోర్డుల్లో స్విచ్‌లను తడి చేతులతో తాకరాదు. ● చిన్న పిల్లలను కరెంటు వస్తువులకు దూరంగా ఉంచాలి. ● ఇంటి సర్వీసు వైరు తెగినా, జాయింట్స్ కట్ అయినా తాకకుండా వెంటనే విద్యుత్ శాఖకు తెలియచేయాలి. ● విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లను తాకరాదు. ● ఇంటి పరిసరాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయిన సందర్భాల్లో దగ్గరకు వెళ్లకుండా ముందుగా విద్యుత్ శాఖకు తెలియచేయాలి. ● గృహాల ఆవరణలోని నీళ్ల మోటార్లకు ఉన్న కరెంటు వైర్లను తాకరాదు. ● గాలి, వాన సమయాల్లో కరెంటు లైన్ల కింద నిలబడడం, కూర్చోవడం చేయరాదు. ● రహదారుల్లో విద్యుత్ ప్రసారం జరిగే తీగలు తెగి పడి ఉంటే విద్యుత్ ప్రవాహం ఉన్నట్లుగా భావించి దూరంగా ఉండాలి. ● మోటార్ల స్టార్టర్లు, మోటార్లు వర్షం వలన నీటిలో మునగడం, పూర్తిగా తడవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. రైతులు జాగ్రత్తలు పాటించాలి. ● విద్యుత్ ప్రమాదానికి గురైన వారిని కానీ ఆ విద్యుత్ పరికరాన్ని కానీ నేరుగా తాకరాదు. ● వర్షాలు పడుతున్న సమయాల్లో రహదారులపై ఉన్న విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదు. ● విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్‌ప్రీ 1912 నంబరులో సంప్రదించాలి. -
యాప్‌లతో వేగలేం
పాలకోడేరు: సెల్ఫోన్లు ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలనే నిర్ణయంతో సోమవారం విస్సాకోడేరు సీడీపీఓ కార్యాలయం వద్ద సెల్ఫోన్లను అప్పగించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నాయకురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ సిగ్నల్స్ లేక ఫోన్లు పనిచేయక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామని, అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియచేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో యూనియన్ రాష్ట్ర కమిటీ సెల్ఫోన్లు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని లేదంటే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని అన్నారు. సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు పాల్గొని పోరాటానికి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరులో.. ఏలూరు(టూటౌన్): పనిచేయని స్మార్ట్ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం వెనుకవైపున ఉన్న ఐసీడీఎస్ ఏలూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పని చేయని స్మార్ట్ఫోన్ల తో డేటా వివరాలు నమోదు చేయలేకపోతున్నామన్నారు. 5జీ టెక్నాలజీ యాప్‌లతో ఓల్డ్ వెర్షన్ ఫోన్లో ఎలా అప్లోడ్ చేయాలన్నారు. ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ సమీమా, తలారి రజని మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త ఫోన్లు ఇచ్చే వరకు మాన్యూవల్ పద్ధతిలోనే పని చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కై కలూరులో.. కై కలూరు: అంగన్వాడీ టీచర్లుకు ఇచ్చిన సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. పైగా మూడు యాప్‌లలో వివరాలు నమోదు చేయడం కష్టమవుతోంది అంటూ అంగన్వాడీ కార్యకర్తలు కై కలూరులో సెక్టార్ ఆఫీసు సూపర్వైజర్ ప్రసన్న లక్ష్మీకి సోమవారం సెల్ఫోన్లు ఇచ్చేశారు. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో కలపి మొత్తం 311 సెల్ఫోన్లు వెనక్కి ఇచ్చేశారు. అంగన్వాడీ కార్యకర్తల ప్రాజెక్టు సెక్రటరీ సుజాత మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలో యాప్‌ల గొడవ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పడు మూడు యాప్‌లు కలపి ఒక యాప్‌గా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై న సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సెల్ఫోన్లు తిరిగిచ్చేసిన అంగన్వాడీ కార్యకర్తలు -
సీహెచ్‌ఓలపై చిన్నచూపు
పెంటపాడు: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్ఓ)లు నిరాదరణకు గురవుతున్నారు. గత జగనన్న ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియమితులైన వీరిని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యోగ భద్రత లేక, సకాలంలో జీతాలు అందక, సేవలు అందిస్తున్నా సరైన గౌరవం దక్కక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 368 సీహెచ్‌ఓలు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య సేవలో భాగంగా వీరికి 2019 నుంచి పోస్టులు మంజూరయ్యాయి. పీహెచ్‌సీల కన్నా మొదట వీరు ప్రాథమికంగా వైద్యనిర్ధారణ చేసి వ్యాధి తీవ్రతను బట్టి కేసులపై అధికారులకు రిఫర్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 14 రకాల సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య సర్వే, ఫ్యామిలీ హెల్త్ ఆరోగ్య సేవలు, ఇంటింటికీ సేవలతో పాటు, అంగన్వాడీ ప్రధానంగా గ్రామీణ ప్రజలకు చేరువగా ఉంటున్నారు. అయినా వారిని పాలకులు పట్టించుకోవడం లేదు. కమ్యూనిటీ హెల్త్ అధికారుల యూనియన్ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ మే నెలలో ఒక నెల పాటు పలు ప్రాంతాలోల సీహెచ్‌వోలు నిరసనలు తెలిపారు. కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అయినా వీరి సమస్యలు నేటికీ తీరలేదు. ప్రధాన డిమాండ్లు ● ఆరేళ్లు పూర్తయిన కమ్యూనిటీ హెల్త్ అధికారులు (సీహెచ్ఓ)లను తక్షణం క్రమబద్ధీకరించాలి. ● ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ● జీతాలతో పాటు, ఇన్సెంటివ్‌లు అందించాలి. ● గ్రామాల్లో ప్రభుత్వ క్లినిక్‌ల అద్దెలను సకాలంలో చెల్లించాలి. రేషనలైజేషన్ పేరుతో కుదింపు చర్యలు వీరిని రేషనలైజేషన్ పేరుతో కుదించేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సీహెచ్‌ఓలు మనోవేదనకు గురౌతున్నారు. 5 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ఒక సీహెచ్‌ఓను నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషలైజేషన్‌లో భాగంగా ఏ ప్రాతిపదికన ఈ చర్యలు చేస్తున్నారో తెలియడం లేదని చెబుతున్నారు. పేదలకు ఆరోగ్యం కోసం పాటు పడుతున్న వీరిని ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారం. పొరుగురాష్ట్రాల్లో సీహెచ్‌వోల సేవలను అక్కడి పాలకులు గుర్తించారు. మన రాష్ట్రంలో వీరిని పట్టించుకోకపోవడం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది. సమ్మె చేసినా పట్టించుకోని కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని డిమాండ్ గ్రామంలోనే సేవలందిస్తున్నాం ఎంతో దూరంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మా గ్రామంలోనే మందులు అందిస్తున్నారు. అయినా ప్రభుత్వం వారి సేవల్ని గుర్తించడం లేదు. – కె. వెంకట్రావు, అలంపురం సకాలంలో వైద్య సేవలు 108,104 సేవల కన్నా రోజు మా గ్రామంలో ఆరోగ్యసేవలు అందిస్తున్న సీహెచ్ఓ వల్ల మాకు ఎంతో మేలు కలుగుతోంది. మందులు సకాలంలో అందిస్తున్నారు. జయవరపు విజయదుర్గ, అలంపురం -
విద్యాసంస్థల్లో ఆంక్షలపై నిరసన
భీమవరం: విద్యా సంస్థల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు మినహా మరెవరికీ ప్రవేశంలేదంటూ పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల స్వేచ్చను, ప్రజాస్వామిక హక్కులను హరించేలా ఉన్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్ విమర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ సోమవారం భీమవరం పట్టణం ప్రకాశం చౌక్ సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యా కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు మూలంగా విద్యార్థులు తమ స్వేచ్ఛను కోల్పోతారని వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లే వారికి ఈ ఉత్తర్వుల ద్వారా అనుమతులుండవన్నారు. ఉత్తర్వులు ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల వ్యాపారం, అన్యాయాలను బయటకు తీసే అవకాశం లేకుండా పోతుందని గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్వులను ఉపసంహరించకపోతే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్.లక్ష్మణ్, బి.సింధు, సాయికృష్ణ, హేమంత్, భాగ్యలక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఆంక్షలు విరమించుకోవాలి పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జీవోను రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసి కమిటీ సభ్యులకు తప్ప ఇంకెవ్వరికీ అనుమతి లేదంటూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలపై, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ దశాబ్దాలుగా విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యారంగంలో గాని విద్యార్థులకు గాని సమస్యలు వస్తే తాము తప్పనిసరిగా న్యాయపోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఏ పట్టణ అధ్యక్షుడు మేడవాల రాజా, తానేటి రంజిత్ కుమార్, సిహెచ్ గణేష్, జి.భానుప్రకాష్, టి.మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు -
లైంగిక వేధింపుల నుంచి రక్షణకు కృషిచేయాలి
భీమడోలు: లైంగిక వేఽధింపుల నుంచి మహిళళల రక్షణకు ఏర్పాటు చేసిన కమిటీలు తమ వంతు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. భీమడోలు మండల సమాఖ్య కార్యాలయంలో సోమవారం జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సదస్సును నిర్వహించారు. కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఉచిత న్యాయ సహాయాన్ని, బాధితులకు తాత్కాలిక, శాశ్వత పరిహారాన్ని అందిస్తాయన్నారు. జిల్లా బాలికా సంరక్షణాధికారిణి సీహెచ్ సూర్యచక్రవేణి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయని, అలా చేసే వారిని చట్టం తీవ్రంగా శిక్షిస్తుందన్నారు. మహిళలకు అనేక చట్టాలున్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే రక్షణ పొందుతారన్నారు. పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సందర్శించి కళాశాలలోని వసతులు, పరిసరాలను పరిశీలించారు. చిన్నారులతో కలిసి భోజనం చేసారు. నాణ్యమైన, పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల అభిరుచికి అనుగుణంగా మెనూలో మార్పులు తేవాలన్నారు. -
ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు
భీమవరం(ప్రకాశం చౌక్): యలమంచిలి మండల పరిధిలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని యలమంచిలి ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి సోమవారం ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మండలంలో జరుగుతున్న శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు తనకు, వైఎస్సార్సీపీ చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు ఆహ్వానం గాని, ప్రొటోకాల్ పరంగా గౌరవం గానీ ఇవ్వడం లేదన్నారు. ఇలా అనుమానించడం సరైన పద్ధతి కాదన్నారు. మండలంలో తీర్మానాలు చేసిన వర్క్‌లకు ఆర్డర్స్ ఇవ్వకుండా, మండలాన్ని అభివృద్ధి చేయకుండా అధికారులు అలసత్వాన్ని వీడి, ప్రొటోకాల్ ద్వారా మండ ల అభివృద్ధికి తోడ్పడేలే చర్యలు తీసుకోవాలని ఫి ర్యాదు చేయడంతో పాటు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, స ర్పంచుల చాంబర్ అధ్యక్షుడు కవురు గోపి పాల్గొన్నారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
ఏలూరులో మహిళలపై దాడి ఘటనలో కేసుల నమోదు ఏలూరు టౌన్: ఏలూరులో ఆదివారం రాత్రి మహిళలపై దాడి చేసిన ఘటనపై ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ సీరియస్ అయ్యారు. శాంతిభద్రతల కు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే స హించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సోమ వారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు రూరల్ పరిధిలో మరడాని రంగారావు కాలనీ, పోణంగి రోడ్డులోని జరుగులమ్మ తల్లి గుడి ప్రాంతానికి చెందిన కాటూరి నిర్మల కుమారుడు లక్కీ అనే యువకుడు తల్లికి టిఫిన్ తెచ్చేందుకు మోటారు సైకిల్‌పై బయల్దేరాడు. అతడు వీఎస్ఆర్ గ్రాండ్ సిటీ వద్దకు చేరుకునేసరికి పల్లెపు సాయికుమార్, తురక మురళి, గుంజే జాన్ అనే ముగ్గురు వ్యక్తులు.. మోటారు సైకిల్ వేగంగా ఎందుకు నడుపుతున్నావంటూ నిలదీశారు. ఈ విషయంలో వారితో వాగ్వివాదం చోటుచేసుకోగా, లక్కీని కొట్టారని బాధితులు చెబుతున్నారు. అనంతరం మరోసారి ఈ ముగ్గురితో పాటు నిడిగట్టి నాగరాజు, బత్తుల దుర్గారావు, మరికొంతమంది కాటూరి లక్కీ ఇంటి వద్దకు వెళ్లారు. ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగగా కొట్టుకున్నారని, ఆ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ రెండు వర్గాలపై ఏలూరు రూరల్ పో లీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశా మని డీఎస్పీ వివరించారు. ఈ రెండు వర్గాల వారికీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, స్వల్ప వివాదం నేపథ్యంలోనే గొడవ జరిగిందని, పోలీసులు స్పందించి చర్యలు తీసుకోలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మహిళల దుస్తులు చించేస్తూ.. భయోత్పాతం బాధితురాలు కాటూరి నిర్మల సోమవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ తన కుమారుడు లక్కీని ముగ్గురు కలిసి కొట్టారని, లక్కీ ఇంటికి రాగా మరో 15 మంది వ్యక్తులు మహిళలని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ కొ ట్టారని, ఇదే సమయంలో మరో 50 మందిని పిలిపించుకుని తమ ఇళ్లపై దాడులు చేస్తూ భయో త్పాతం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల దుస్తులు చించేస్తూ ఇష్టారాజ్యంగా దాడి చేశారన్నారు. దీనిపై ఏలూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఫిర్యాదు చేశామని చెప్పారు. అనంతరం రక్షణ కల్పించాలంటూ ఏలూరు చిరంజీవి బస్టాండ్ వద్ద ఆందోళన చేశామని తెలిపారు. పోలీసులు తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించామన్నారు. -
స్మార్ట్ షాక్
స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో కూటమి తీరుపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ప్రజల ఆందోళనను పట్టించుకోకుండా స్మార్ట్ మీటర్ల బిగింపు పనులు చేస్తుండటాన్ని నిరసిస్తూ పోరుబాటకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ప్రజావేదిక ఆధ్వర్యంలో జిల్లా అంతటా మంగళవారం విద్యుత్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలకు నిర్ణయించాయి. అపోహలు వీడాలి స్మార్ట్ మీటర్ల వలన బిల్లులు పెరుగుతాయనేది కేవలం అపోహ మాత్రమే. పాత మీటర్లతో పోలిస్తే వీటి వలన వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. వినియోగదారులు ఎప్పటికప్పుడు ఎంత వినియోగించారో తెలుసుకోవచ్చు. మీటర్ల బిగింపునకు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. – ఎ.రఘునాథబాబు, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ.. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెస్తున్న స్మార్ట్ మీటర్లు వలన భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సామాన్యులు మోయలేనంతంగా బిల్లులు వస్తాయి. వీటి ఏర్పాటుకు వ్యతిరేకంగా తలపెట్టిన ఆందోళనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలి. –గోపాలన్, సీపీఎం జిల్లా కార్యదర్శి స్మార్ట్ మీటర్లతో దోపిడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలకొట్టండని లోకేష్ కూటమి నాయకులకు పిలపునిచ్చారు. ఏడాదిలోనే విద్యుత్ చార్జీలు గణనీయంగా పెంచిన కూటమి, మళ్లీ పెంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. స్మార్ట్ మీటర్లతో వినియోగదారులను దోచుకుంటుంది. అదనపు లోడు పేరుతో డిపాజిట్లుగా భారీ మొత్తాన్ని గుంజుతోంది. ప్రజలు కూటమి ప్రభుత్వానికి డిస్కమ్ షాకును ఇవ్వాలి. – బి.బలరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సాక్షి, భీమవరం: జిల్లాలో డొమెస్టిక్, కమర్షియల్, అగ్రికల్చర్, ఇండస్ట్రీయల్ 7,33,964 విద్యుత్ కనెక్షన్లు ఉండగా నెలకు 235.16 మి.యూ. విద్యుత్ వినియోగమవుతోంది. ఫ్యూయల్ పవర్ పర్చేజ్ కార్డు అడ్జస్ట్మెంట్ (ఎఫ్‌పీపీపీఏ) పేరిట కూటమి ప్రభుత్వం చార్జీలు పెంచేసింది. ఫిక్స్డ్, కస్టమర్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్ చార్జీలు సర్దుబాటు పేరిట వినియోగం కన్నా రెండు, మూడు రెట్లు వస్తున్న బిల్లులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లకు మినిమమ్కు బదులు రూ.600లకు పైగా బిల్లు వస్తుంటే, తాజాగా స్మార్ట్ మీటర్ల బిగింపు ఆందోళనకు గురిచేస్తోంది. స్మార్ట్ భయం : చార్జీలు పెరిగిపోతాయని వినియోగదారులు, వ్యాపార వర్గాలు, ఉపాధి కోల్పోతామని మీటర్ రీడర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. స్మార్ట్ మీటర్ల బిగింపు పనులను వేగవంతం చేస్తోంది. తొలిదశగా కమర్షియల్, ఇండస్ట్రీయల్, స్థానిక సంస్థలకు చెందిన పాత మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్లు అమర్చుతోంది. రానున్న మార్చి నాటికి జిల్లాలో 1.02 లక్షల కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగింపు విద్యుత్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 45 వేలకు పైగా మీటర్లను వేశారు. వీటిలో ప్రభుత్వ కార్యాలయాలకు చెందిన కనెక్షన్లు 34 వేలు వరకు ఉండగా ఇండస్ట్రీయల్ 225, విద్యాసంస్థలు 9400, ఆక్వా కనెక్షన్లు 300లు వరకు ఉన్నాయి. మీటర్ రీడర్ల ఉపాధికి ఎసరు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో తాము ఉపాధి కోల్పోతామన్న ఆందోళనలో మీటర్ రీడర్లు ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 200 మంది వరకు మీటర్ రీడర్లు ఉన్నారు. నెలకు సుమారు రూ.10 వేల వరకు వస్తుంది. స్మార్ట్ మీటర్లతో బిల్లు తీసే అవసరం ఉండకపోవడం వలన తాము పని కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాటకు సిద్ధమవుతున్నారు. నేడు ఆందోళనలకు పిలుపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు ఇప్పటికే ప్రజావేదికగా ఏర్పడి జిల్లాలోని పలుచోట్ల ఆందోళనలు నిర్వహించాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిచ్చాయి. అందులోభాగంగా జిల్లాలోని విద్యుత్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి అధికారులకు వినతిపత్రాలు అందజేయనున్నట్టు ప్రజాసంఘాల నాయకులు చెబుతున్నారు. అభ్యంతరాలివిగో.. స్మార్ట్ మీటర్ల బిగింపు కేవలం మీటర్లు మార్పు మాత్రమే కాదని, విధాన మార్పుగా విద్యుత్ పంపిణీ సంస్థల్ని కార్పొరేట్ చేతుల్లో పెట్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రగా ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం కమర్షియల్‌కు మాత్రమేనంటున్నా రానున్న రోజుల్లో గృహావసరాలకు అమర్చుతారన్న అనుమానాలున్నాయి. సెల్‌ఫోన్ తరహాలో ఇక ముందుగానే సొమ్ము చెల్లించి కరెంటు రీచార్జి చేయించుకోవాలి. స్మార్ట్ మీటరు ఖర్చు సింగిల్ ఫేజ్‌కు రూ.9,000, త్రీఫేజ్ కు రూ.17,000లు 93 నెలల వాయిదాల పద్ధతిలో వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. మీటరు పాడైతే కొత్త మీటరుకు అయ్యే ఖర్చు వినియోగదారులే భరించాలి. పగలు కంటే రాత్రి వినియోగానికి అధిక చార్జి వసూలు చేస్తారు. వేసవి కాలంలో చార్జీలను పెంచేస్తారు. వైర్లెస్ టెక్నాలజీ ద్వారా నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచే మీటర్లను ఆపరేట్ చేస్తారంటున్నారు. బిల్లుల్లో తప్పులకు సమాధానం చెప్పే నాథుడు ఉండడు. ఈ మీటర్లతో ప్రజల వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం వాటిల్లుతుందనే అనుమానాలు ఉన్నాయి. విద్యుత్ బాదుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్న ప్రజాసంఘాలు ఉపాధిపై ఆందోళనలో మీటర్ రీడర్లు పట్టించుకోని ఏపీఈపీడీసీఎల్ నేడు విద్యుత్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలకు ప్రజావేదిక పిలుపు జిల్లాలో మొత్తం విద్యుత్ కనెక్షన్లు 7,33,964 తొలిదశలో కేటగిరీ–2 సర్వీసులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు -
191 అర్జీల స్వీకరణ
భీమవరం (ప్రకాశంచౌక్): అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలని, అర్జీలు రీ ఓపెన్ కాకుండా చూడాలని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.శివన్నారాయణ, గ్రామ, వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావుతో కలిసి పీజీఆర్ఆర్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 191 అర్జీలను స్వీకరించినట్టు ఇన్చార్జి కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లాలో వాట్సాప్ గవర్నెన్స్ అమలు తీరుపై అధికారులతో సమీక్షించారు. శాశ్వత పరిష్కారం చూపాలి భీమవరం: పోలీసు శాఖకు వచ్చే ప్రజా ఫిర్యా దులు పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ అర్జీలు పునరావృతం కాకుండా గడువులోపు శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. సోమవారం జిల్లాపోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా 11 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు పాల్గొన్నారు. దత్తతపై అవగాహన భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన దత్తత కార్యక్రమంపై అవగాహన కల్పించారు. పిల్లలు లేని తల్లిదండ్రులు దత్తత తీసుకునేందుకు పాటించాల్సిన నియ మ, నిబంధనలను వివరించారు. నవోదయ దరఖాస్తులకు గడువు పొడిగింపు భీమవరం: జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు గడువును పొడిగించినట్టు డీఈఓ ఈ.నారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరిపాలన కారణాల వల్ల ఈనెల 13 వరకూ గడువు పొడిగించారని పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో ఈనెల 15న 79వ స్వాతంత్య్ర దినోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో పంద్రాగస్టు వేడుకలపై అధికారులతో సమీక్షించా రు. కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్‌ను సుందరంగా తీ ర్చిదిద్దాలని, సాంస్కృతిక ప్రదర్శనలు, స్టాల్స్, శకటాలు తదితర ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలన్నారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, ఆర్డీఓ కె.ప్రవీణ్ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీల్లో నిబంధనలు తప్పనిసరి భీమవరం (ప్రకాశంచౌక్): కార్మిక చట్టాలు, ఉపాధికి సంబంధించిన పలు అంశాల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ రైడింగ్ జిల్లాస్థాయి కమిటీ సభ్యులు, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమానికి నిబంధనలను విధిగా పాటించాలన్నారు. పని గంటలు, పని పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నారు. ఫ్యాక్టరీల్లో ఎక్కడ బాల కార్మికులు ఉండకూడదన్నారు. మంగళవారం నుంచి నెలాఖరు వరకు జిల్లాలోని ప్రాన్ ప్రాసింగ్ యూనిట్లను పరిశీలించి నివేదిక అందజేయాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. జిల్లా కార్మిక శాఖ అధికారి ఏ.లక్ష్మి, జిల్లా మత్స్య శాఖ అధికారి నాగలింగాచార్యులు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జి.స్వాతి, ఎంపెడా అధికారి గోపాల్ ఆనంద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎఫ్ఈఓ ఎన్.వెంకటరమణ పాల్గొన్నారు. -
రైతులను నిండా ముంచిన కూటమి సర్కారు
భీమవరం(ప్రకాశం చౌక్): రైతులను అన్ని రకా లుగా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని, ఈ పాలనలో రైతులకు నిండా కష్టాలేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అ న్నారు. రైతుల సమస్యలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం రైతులతో కలిసి జిల్లా నాయకులు భీమవరం కలెక్టరేట్‌కు వచ్చి ఇన్చార్జి కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హమీ మేరకు ఏటా కేంద్రం సాయంతో కలిపి రూ.26 వేలు ఇవ్వాల్సి ఉండగా తొలి ఏడాది ఎగ్గొట్టారని, ఈ ఏడాది కేవలం రూ.5 వేలు ఇచ్చి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రెండేళ్లకు రూ.40 వేలు బకాయి ఉంటే రూ.5 వేలు జ మచేయడం మోసం కాదా అని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు అందుబాటులో లేక బ్లాక్‌లో రైతులు కొంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఇప్పటికీ సుమారు రూ.6 వేల కోట్ల ధాన్యం బకాయిలు రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువు లు, పురుగు మందులు పుష్కలంగా ఉండేవని, విత్తు నుంచి ధాన్యం కొనుగోలు వరకూ రైతులకు అండగా నిలిచామన్నారు. నాడు ఆక్వా రైతులకు చిన్నపాటి సమస్య వస్తే జగన్‌పై నెట్టేసిన కూటమి నాయకులు నేడు ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. రొయ్యల ధరలు తగ్గుతున్నా, ఫీడ్, సీడ్ ధరలు పెరుగుతున్నా నియంత్రణ లేదన్నారు. గత ప్రభుత్వంలో ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్ అందించి అండగా నిలిచామన్నారు. ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, భీమవరం ఇన్చార్జి చినమిల్లి వెంకట్రాయు డు, ఉండి ఇన్చార్జి పీవీఎల్ నరసింహరాజు, మొగల్తూరు జెడ్పీటీసీ తిరుమాని బాపూజీ, యలమంచిలి ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి, పార్టీ నాయకులు యడ్ల తాతాజీ, కోడే యుగంధర్, నంద్యాల సీతారామయ్య, వేగేశ్న జయరామకృష్ణంరాజు, పాలపర్తి కృపానాథ్, చెన్ను విజయ్, ఉచ్ల స్టాలిన్, గణేశ్న రాంబాబు, పాలారాంబాబు, గళవెల్లి ధనుంజయ, డొక్కు సుబ్రహ్మణ్యం, గంటా సుందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా సాయంలో కోత ఆక్వా రైతులకు సహకారం కరువు రైతుల సమస్యలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో వినతిప్రతం అందజేత నారుమడులు ఎండినా పట్టదా? మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ జిల్లాలోని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారు, గానీ ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాల్లో నారుమడులకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోలేదన్నారు. దీంతో నాట్లు ఆలస్యమవుతున్నాయన్నారు. ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, పది రోజుల్లోపు ఎరువులు అందించకపోతే రైతులు నష్టపోతారన్నారు. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా చేతులు ఎత్తేసిందన్నారు. వ్యవసాయం దండగలా.. పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో వ్యవసాయం పండగా ఉండగా.. నేడు చంద్రబాబు పాలనలో దండగ అనే రీతిలో రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. సార్వా రైతులకు ఎరువులు, పురుగు మందులు అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు, అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచేందుకు రైతుల తరఫున పోరాటం చేస్తామన్నారు. -
టీడీపీ కోవర్ట్ ఆపరేషన్
ఆంక్షలపై నిరసన పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. 8లో uయాప్‌లతో వేగలేం పనిచేయని స్మార్ట్ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయాల్లో సెల్ఫోన్లను అప్పగించారు. 8లో uమంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంద కోట్ల అవినీతి దేశానికే రోల్‌మోడల్ అంటూ దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్ హాట్‌టాపిక్‌గా మారిన క్రమంలో జన సైనికులు రగిలిపోతున్నారు. టీడీపీ కోవర్ట్ ఆపరేషన్‌తోనే ఇదంతా చేసి రాజకీయంగా జనసేనను పోలవరంలో అణచివేయడానికి తెరతీసిందని, దీనికి జనసేన కీలక నేత కరాటం రాంబాబును పావుగా వాడుకున్నారనే ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ రగడ హాట్ హాట్‌గా మారింది. జనసేన భవితవ్యం గందరగోళం జనసేన, టీడీపీ ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న తరుణంలో తాజా ఎపిసోడ్‌తో జనసేన భవితవ్యం గందరగోళంలో పడింది. ఎమ్మెల్యే ఏడాదిలోనే వంద కోట్లు సంపాదించాడు.. భారీ భవనం కట్టుకున్నాడు.. దేశానికే అవినీతిలో రోల్‌మోడల్‌గా నిలిచాడంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్గం మండిపడటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. అయితే ఇదంతా అబద్ధపు ప్రచారం, తప్పుడు ఆడియో రికార్డు అని ఎవరూ ఖండించకుండా పెద్ద మనుషుల మధ్య జరిగిన సంభాషణలు టీడీపీ ఎలా బయటపెడుతుందని, దీనిపై స్పందించాలని జనసేన చోటా నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు వరకు ఎవరూ స్పందించని పరిస్థితి. మూడు రోజులుగా ఎమ్మెల్యే అవినీతి చేయలేదంటూ.. జనసేన కేడర్ చెప్పడమే కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. దేవినేని ఉమాతో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అనుచరుడు పరిమి రాంబాబు చౌదరి అతడి ఫోన్ నుంచే కరాటం రాంబాబుతో మాట్లాడించారు. ఆడియో వాయిస్ రికార్డును టీడీపీ నేత రాంబాబు చౌదరే బయటపెట్టాడని, అతడిపై టీడీపీ చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తున్నా టీడీపీ లైట్‌గా తీసుకుంది. టీడీపీ ట్రాప్‌లో కరాటం మరోవైపు టీడీపీ ట్రాప్‌లో జనసేన నేత కరాటం రాంబాబు పడటం వల్ల పార్టీకి, ఎమ్మెల్యేకు భారీ డ్యామేజ్ జరిగిందనే అంతర్గత చర్చ కొనసాగుతోంది. పార్టీపరంగా ఇబ్బందులు వస్తే ఖండించాల్సిన నాయకుడే సంభాషించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జనసేనలో నెలకొంది. ఇంకోవైపు దీనిపై కరాటం రాంబాబు స్పందిస్తూ దేవినేని ఉమానే సమాధానం చెప్పాలని ఒక్క మాటతో ముగించడంతో ఎమ్మెల్యే వర్గం మళ్లీ డైలమాలో పడింది. తాజా పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారిక కా ర్యక్రమాల్లో ఆదివారం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్, టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ అన్నదాత సుఖీభవ సభలో పాల్గొనడం మరో చర్చకు తెరతీసింది. మొత్తంగా ఆడియో టేప్ వ్యవహారంలో జనసేన నేతనే టీడీపీ పావుగా వాడుకుని జనసేన ఎమ్మెల్యేనే అప్రతిష్టపాలు చేసే లా విజయవంతంగా మైండ్ గేమ్ నడిపింది. న్యూస్‌రీల్ రగులుతున్న జన సైనికులు పోలవరం ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేసిన టీడీపీ శ్రేణులు ఉద్దేశ పూర్వకంగానే ఆడియో లీక్ చేశారని అభియోగం ముదురుతున్న జనసేన వర్సెస్ టీడీపీ రగడ -
డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు?
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల్లో సగం మందికి పైగా ఇంజనీరింగ్ వైపు దృష్టి సారించగా.. మిగిలిన సగం మందికి డిగ్రీ విద్య ప్రత్యామ్నాయం. డిగ్రీలో సైతం పలు సాంకేతిక కోర్సులతో పాటు ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 50 శాతం మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ కోర్సులు పూర్తిచేసి సివిల్స్, సర్వీస్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వేలో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉండటంతో ఈ కోర్సులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకూ డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఫలితాలు వచ్చి నాలుగు నెలలు ప్రభుత్వం ఇంటర్మీడియెట్ ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 12న విడుదల చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించి జూన్ 7న ఫలితాలు విడుదల చేసింది. ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ముగిసి విద్యార్థులు తమకు సీటు వచ్చిన కళాశాలల్లో ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకూ రిపోర్టు చేయనున్నారు. తమతో పాటు ఇంటర్మీడియెట్ రాసిన మిత్రుల్లో కొందరు ఇంజనీరింగ్ విద్యకు వెళ్లడం, వారు మరో మూడు, నాలుగు రోజుల్లో తరగతులకు హాజరయ్యే పరిస్థితి ఉంది. వారితో పాటే ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కోర్సుల్లో చేరుదామని ఎదురుచూస్తున్న విద్యార్థులకు మాత్రం ఇప్పటివరకూ నోటిఫికేషనే ఇవ్వకపోవడం చూస్తుంటే ప్రభుత్వం డిగ్రీ విద్యను ఎంతటా నిర్లక్ష్యం చేస్తోందో అర్థమవుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూపులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. 91 కాలేజీలు.. 60 వేల సీట్లు ఏలూరు జిల్లాలో 40, పశ్చిమగోదావరి జిల్లాలో 51 డిగ్రీ కళాశాలు ఉన్నాయి. వివిధ గ్రూపుల్లో సుమా రు 60 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలా.. డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వని ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు వచ్చి దాదాపు 4 నెలలు డిగ్రీ ప్రవేశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు ఏలూరు, పశ్చిమలో 91 కళాశాలలు విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ఇప్పటికే పలు అసంబద్ధ నిర్ణయాలతో పాఠశాల విద్యను అటకెక్కించారు. ఇప్పుడు డిగ్రీ విద్యను కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. ఇంటర్ ఫలితాలు వెల్లడై దాదాపు 100 రోజులు కావస్తోంది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచిపోతోంది. డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు చేపడతారు. రెండు నెలల పాటు విద్యకు దూరంగా విద్యార్థులు ఉన్నారు. వారి భవిష్యత్‌తో ఆటలాడటం ప్రభుత్వానికి తగదు. – కాకి నాని, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు ఎదురుచూపులు డిగ్రీలో ఏఏ కోర్సులతో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ కోర్సులు తేలికగా పూర్తి చేసి, పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు వచ్చే కోర్సులు ఏమిటి అనే విషయాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పటికే తమకు తెలిసిన విద్యాధికులను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఇంటర్మీడియెట్ ఫలితాలు వెలువడిన నెలలోపే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ఆరంభం నాటికి విద్యార్థులంతా కళాశాలలకు వెళ్లే ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ దిశగా ఏ చర్యా తీసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. డిగ్రీ కళాశాలలు ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి ప్రభుత్వ 7 4 ప్రభుత్వ అటానమస్ – 2 ప్రభుత్వ ఎయిడెడ్ అటానమస్ 1 4 ప్రైవేట్ అటానమస్ 1 1 ప్రైవేట్ ఎయిడెడ్ – 1 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 31 39 మొత్తం 40 51 -
ఈ శ్రావణంలోనైనా ఇచ్చేనా?
గత ప్రభుత్వంలో 2,560 మందికి ఫ్లాట్లు 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పాలకొల్లులో పేదల ఇళ్ల నిర్మాణం కోసం పెంకుళ్లపాడు, రామయ్యహాలు, పెదగరువు ప్రాంతాల్లో సుమా రు 70 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. పెంకుళ్లపాడులో 50 ఎకరాలు భూమిని కేటాయించారు. 2014లో టీడీపీ హయాంలో పెంకుళ్లపాడులో 6,144 మంది లబ్ధిదారుల కోసం (ఒక్కో బ్లాక్‌లో ఒక్కో ఫ్లోర్‌కు 8 పోర్షన్ల చొప్పున 4 ఫ్లోర్లకు 32 పోర్షన్లు) 192 బ్లాక్‌ల నిర్మాణం చేపట్టారు. 2019 ఎన్నికలకు ముందు పనులు పూర్తికాకుండానే ఎమ్మెల్యే నిమ్మల గృహప్రవేశాలు అంటూ హడావుడి చేశారు. అయితే ఫ్లాట్లను మాత్రం లబ్ధిదారులకు అప్పగించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 80 బ్లాక్‌ల పనులు పూర్తిచేసి 2,560 మంది లబ్ధిదారులకు ఫ్లాట్లను అప్పగించగా వారంతా నివాసముంటున్నారు. ఇంకా 112 బ్లాక్‌ల పనులు పూర్తికావాల్సి ఉంది. ఈ లెక్కన వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే సుమారు 42 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే ఎమ్మెల్యే నిమ్మల మాత్రం 2019 నాటికే 90 శాతం పనులు పూర్తయ్యాయంటూ చెప్పుకుంటూ వచ్చారు. పాలకొల్లు సెంట్రల్: అధికారమే పరమావధిగా కూట మి నాయకులు ఎన్ని బూటకపు హామీలైనా ఇస్తారనడానికి పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీయే నిదర్శనం. ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి తీరా గద్దెనెక్కిన తర్వాత హామీలను బుట్టదాఖలు చేయడం కూటమి నాయకులకు పరిపాటిగా మారింది. 2024 ఏప్రిల్ 6న పాలకొల్లులో జరిగిన టీడీపీ ఎన్నికల సభలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ శ్రావణమాసంలో టిడ్కో లబ్ధిదారులతో గృహప్రవే శాలు చేయిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో శ్రావణ మాసం ముగియగా ఈ ఏడాదిలో రెండో శ్రావణం కూడా వచ్చింది. అయినా టిడ్కో ఇళ్ల పనుల్లో పురోగతి లేదు. దాదాపు 30 శాతం వరకు పనులు మిగిలి ఉన్నాయి. ఇంకెన్ని శ్రావణాలు ఎదు రుచూడాలని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. 10 శాతం పనులే అంటూ.. స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి నిమ్మల 2019 ఎన్నికల్లో పెంకుళ్లపాడు టిడ్కో గృహాలు పనులు పూర్తికాకుండానే గృహ ప్రవేశాలు చేయించారు. లబ్ధిదారులకు పత్రాలు తప్ప ఎవరికీ ఇళ్లు ఇవ్వలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల వరకూ టిడ్కో గృహాల్లో పనులు టీడీపీ హయాంలోనే 90 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 10 శాతం పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేయలేదంటూ తప్పుడు ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వస్తే పనులు పూర్తిచేసి శ్రావణంలో ఫ్లాట్లు ఇస్తామంటూ వాగ్దానాలూ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది.. 10 శాతం పనులు వెంటనే పూర్తిచేసి ఫ్లాట్లు అప్పగిస్తారని లబ్ధిదారులు ఆశగా ఎదురుచూశారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. 112 బ్లాక్‌ల్లో పనులు ప్రస్తుతం టిడ్కో గృహాల్లోని 112 బ్లాక్‌ల్లో పనులు జరుగుతున్నాయి. పెయింటింగ్, ప్లంబింగ్ పనులు చేస్తున్నారు. సుమారు 70 శాతం పనులు పూర్తికాగా మిగిలిన పనులు జరుగుతున్నాయి. మొత్తం పనులన్నీ పూర్తికావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. గూడు.. గోడు టిడ్కో గృహాల పంపిణీకి కూటమి హామీలు శ్రావణమాసంలో ఇస్తామంటూ వాగ్దానాలు కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత రెండో శ్రావణం ఇంకా 30 శాతం పనుల పెండింగ్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,560 మందికి ఫ్లాట్లు అందజేత నువ్వు ఇంజనీరింగ్ ఎక్కడ చదివావయ్యా అంటూ.. టిడ్కో గృహాల లబ్ధిదారుల కోసం నరసాపురం రోడ్డును కలుపుతూ పాలకొల్లు–నరసాపురం కెనాల్‌పై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల వంతెన వద్ద బస్టాండ్ నిర్మాణ పనులపై ఓ ఇంజనీరింగ్ అధికారిని నువ్వు ఇంజనీరింగ్ ఎక్కడ చేశావయ్యా అంటూ మంత్రి నిమ్మల ప్రశ్నించారు. భీమవరంలో ఓ ప్రైవేట్ కళాశాలలో చదివానని ఆయన సమాధానం చెప్పారు. వెంటనే మంత్రి ఆ కళాశాలకు ఫోన్ చేసి చిన్నపాటి పనులు చేయడంలోనూ అధికారులు తప్పిదాలు చేస్తుంటే మీ కళాశాలలోనే చదివారా అనే అనుమానం కలుగుతుందని అడిగినట్టు సమాచారం. దీంతో సదరు అధికారి అవమానంగా ఫీల్ అయ్యారని తెలిసింది. ఇలా మంత్రి తీరుతో నియోజకవర్గంలో అధికారులు భయంతో విధులు నిర్వహిస్తుండటం గమనార్హం. ఇంకెన్ని శ్రావణాలు కావాలో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే 42 శాతం పనులు పూర్తిచేసి 2,560 మందికి టిడ్కో ఇళ్లు అప్పగించాం. మంత్రి నిమ్మల మాత్రం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 90 శాతం పనులయ్యాయని చెప్పుకున్నారు. ఆయన లెక్కల ప్రకారం పది శాతం పనులు పూర్తి చేయడానికి ఇంకా ఎన్ని శ్రావణ మాసాలు కావాలో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ శ్రావణ మాసం ముగిసేలోపు టిడ్కో గృహాలు అందిస్తే సంతోషిస్తాం. లేకుంటే 2029 ఎన్నికల వరకూ లబ్ధిదారులను మభ్యపెట్టాలనే ఆలోచనలో మంత్రి ఉన్నట్టు సందేశించాల్సి వస్తుంది. –గుడాల శ్రీహరిగోపాలరావు, వైఎస్సార్సీపీ ఇన్చార్జి, పాలకొల్లు -
22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈనెల 22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో ఉదయం 9.30 గంటల నుంచి జరిగే ఈ వేడుకలో పాల్గొనాలని ఆయన కోరారు. చిన్న తిరుపతిలో కిటకిటలాడిన భక్తులు ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో పాటు, శ్రావణమాస పర్వదినాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలో సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధికంగా మంగమ్మతల్లి దర్శనానికి రావడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేట్టారు. -
మద్యం షాపులో ఘర్షణ
ఇద్దరికి గాయాలు తణుకు అర్బన్: మద్యం దుకాణంలో ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వివాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తణుకులో జాతీయ రహ దారిలోని పాత బెల్లం మార్కెట్ ప్రాంతంలో రష్మిక మద్యం షాపు వద్ద ఆదివారం జరిగిన సంఘటనలో బీరు సీసాతో దాడికి తెగబడ్డారు. తణుకు పాతవూరుకి చెందిన సనమండ్ర రాజేష్, ముప్పిడి సత్యనారాయణ, చదలవాడ కిరణ్ మద్యం తాగుతుండగా పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ రేగింది. దీంతో రాజేష్ బీరు సీసా పగులకొట్టి సత్యనారాయణ, కిరణ్‌లపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఇద్దరిని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీరందక ఆక్వా రైతు విలవిల
భీమడోలు: ఆగడాలలంక చానల్ పరిధిలోని ఆక్వా చెరువులకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. 7 వేల ఎకరాల ఆక్వా ఆయుకట్టులోని చేపల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో నీరందించకపోవడంతో చేపలు, చేపల పిల్లలు మృత్యువాత పడి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. మురుగునీటిని చెరువుల్లో నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి కాలువలో నీటి లెవెల్స్ ఎక్కువగా ఉన్నందున రెండు అడుగుల మేర నీటిని విడుదల చేయాలని మొరపెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చానల్ పరిధిలో భోగాపురం, వడ్డిగూడెం, లక్ష్మీపురం, సీతారామనగరం, ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరంతో పాటు ఏలూరు రూరల్ మండలానికి చెందిన పలు గ్రామాలకు మంచినీరు, సాగునీరు అందిస్తారు. చానల్లో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్కతో నీరు కిందకు పారడం లేదు. ఈ సమయంలో అడుగు లోపు నీరందించడం వల్ల శివారుకు నీరు చేరడం లేదు. మోటార్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. నెలకు 10 రోజుల మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేక రైతులు కాల్వ నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నారు. నీరు లేకపోవడంతో చేప పిల్లలు బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.33 లక్షల నీటి తీరువా వసూలు చేశారు అర అడుగు నీటి వల్ల వరి రైతులు, ఆక్వా రైతులకు ప్రయోజనం లేదని చెట్టున్నపాడు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఆర్. రామకృష్ణం రాజు విమర్శించారు. గ్రామాల్లోని మంచినీటి చెరువులకు నీటిని తోడుకోవాల్సి ఉందని, ఇరిగేషన్ అధికారులు నీటిని పూర్తి స్థాయిలో అందించడం లేదన్నారు. సార్వా నాట్లు పూర్తయినా నీటి వినియోగం తగ్గినా ఆక్వా చెరువులకు నీరివ్వడం లేదని, నీటి తీరువా కింద రూ.33 లక్షలు రైతులు ప్రభుత్వానికి చెల్లించారని చెప్పారు. శివారుకు చేరని ఆగడాలలంక చానల్ నీరు నీటిని విడుదల చేస్తున్నాం గోదావరి కాల్వలో నీటి లభ్యత ఆధారంగా నీరిందిస్తున్నాం. వరి సాగు, మంచినీటి అవసరాలు తీర్చిన తర్వాతనే ఆక్వాకు నీరందిస్తాం. మంచినీటి చెరువులన్నీ నింపాం. వరి పొలాలకు నీరందించాం. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మెరక తూములకు నీరందక రైతులు, ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ నీటిని సరఫరా చేస్తున్నాం. గుండుగొలను వద్ద నీటి మట్టం 4.6 అడుగుల వరకూ ఉంది. ఆగడాలలంక చానల్‌కు రెండు అడుగుల నీటిని విడుదల చేస్తే... గోదావరి కాల్వ ఆయకట్టుపై ప్రభావం పడుతుంది. –సుబ్రహ్మణ్యం, ఏఈ, ఇరిగేషన్ సెక్షన్ -
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
ద్వారకాతిరుమల: స్థానిక వెలుగు కార్యాలయ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పింది. డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా బస్సును నిలుపుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏలూరు నుంచి ద్వా రకాతిరుమల మీదుగా జంగారెడ్డిగూడేనికి 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు ఘటనా స్థలం వద్ద ఎత్తు ఎక్కేటప్పుడు ఒక్కసారిగా టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో రోడ్డు వెనుక పల్లంగా ఉండటంతో బస్సు అదుపు తప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును గేర్‌లో నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వారిని వేరే బస్సులో ఎక్కించి పంపించారు. వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ శ్రేణుల దాడి నూజివీడు: వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొంటున్నాడనే కక్షతో నూజివీడు మండలం జంగంగూడెంలో వైఎస్సార్సీపీ నేత తొమ్మండ్రు రాజేశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఇద్దరు శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. రాజేశ్వరరావు రెండు నెలలుగా వైఎస్సార్సీపీ కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తూ విజయవంతంగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓర్వ లేని టీడీపీ కార్యకర్తలు కొలికపాం వెంకటేశ్వరరావు, తొమ్మండ్రు సింహాద్రి మాట్లాడాలని చెప్పి గ్రామంలోని చెరువు కట్ట వద్దకు రాజేశ్వరరావును తీసుకువెళ్లి రాయితో దాడి చేసి కొట్టారు. రాజేశ్వరరావు వారి నుంచి తప్పించుకుని తుక్కులూరు చేరుకుని 108 వాహనం ద్వారా నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరా రు. బాధితుడి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్షలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశల నిమిత్తం ఆదివారం నీట్ పీజీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సి ద్ధార్థ క్వెస్ట్ విద్యాసంస్థల్లో 373 మంది విద్యార్థులకు 343 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 181 మంది, సిద్ధార్థ క్వెస్ట్‌లో 173 మందికి 162 మంది హాజరయ్యారు. భీమవరంలోని ఒక కేంద్రంలో..భీమవరం: భీమవరంలో ఆదివారం నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 169 మంది విద్యార్థులకు 160 మంది హాజరయ్యారని, మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని కళాశాల పరీక్షల నిర్వాహకుడు తెలిపారు. విద్యార్థుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం వి ద్యార్థుల హక్కులను కాలరాస్తోందని ఎస్ఎఫ్ఐ ఏలూరు నగర కార్యదర్శి బి.మనోజ్ విమర్శించారు. స్థానిక ఎన్‌ఆర్‌పేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30/67 జీఓను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ జీఓ ద్వారా కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా దోచుకోవడానికి మంత్రి లోకేష్ అవకాశమిచ్చారన్నారు. చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో ఇప్పటికే పలువురు వి ద్యార్థులు ఒత్తిళ్లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ జీఓ వెనక్కి తీసుకోకుంటే రా ష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని మనోజ్ హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఎస్.శివాజీ మాట్లాడుతూ ఏలూరులోని ప్రభు త్వ హాస్టళ్లలో పలు సమస్యలు ఉన్నాయని, ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులు మత్తుపదార్థాలకు అలవాటు పడ్డారన్నారు. అమీనాపేటలోని బాలికల హాస్టల్‌కు రక్షణ కరువైందన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నగర నూతన కమిటీ ఎన్నికై ంది. బీసీ హాస్టళ్ల తనిఖీ ఏలూరు (టూటౌన్): ఏలూరులోని బీసీ సంక్షేమ హాస్టళ్లను ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు డి.చంద్రశేఖరరాజు తనిఖీ చేశారు. ఏలూరులోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు, బీసీ బాలికల వసతి గృహం నం.1, 2, కళాశాల వసతి గృహం నం. 1,2లను పరిశీలించారు. విద్యార్థుల భోజనాలు, రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం క్లీన్–గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఆర్వీ నాగరాణి, సహాయ బీసీ సంక్షేమ అధికారి టి.వెంకటేశ్వర్లు, వసతి గృహ సంక్షేమ అధికారులు ఉన్నారు. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. రాట్నాలమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మకు ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసాలు, నామకరణలు, ఇతర మొక్కుబడులు చెల్లించారు. ఈ వారం మొత్తం రూ 79,053 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి తెలిపారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని లాకు సెంటర్ వద్ద నిడదవోలు–నరసాపురం కాలువలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కొట్టుకువచ్చింది. పై నుంచి కొట్టుకొచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భీమవరం మున్సిపాలిటీలో అవినీతి భాగోతం
భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వంలో భీమవరం మున్సిపాలిటీ అవినీతి అధికారులకు అడ్డాగా మారిపోయింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థానికంగా ఉన్నా, వారి పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపల్ అధికారులు పేట్రేగి పోతున్నారు. కొందరు అధికారులు పైసా లేకపోతే పని జరగదనే స్థాయికి వెళ్లిపోయారు. టౌన్‌ప్లానింగ్ అధికారులు భీమవరంలో బిల్డింగ్ నిర్మాణ అనుమతులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నిర్మించిన భవనాలకు పన్ను వేయడానికి రెవెన్యూ అధికారులు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. సివిల్ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి 2 నుంచి 5 శాతం కమిషన్ ఇంజినీరింగ్ అధికారులు వసూలు చేస్తుండగా.. నెలనెల హోటల్స్, దుకాణాల నుంచి శానిటేషన్ అధికారులు వసూలు చేస్తున్నారు. కుళాయి కనెక్షన్లకు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు ఇవ్వాల్సిందే. బర్త్, డెత్ సర్టిఫికెట్లుకు వేలల్లో వసూలు చేస్తున్నారు. భీమవరం మున్సిపాలిటీలో ప్రతి దానిలో అవినీతి రాజ్యమేలుతుంది. ఇటీవల రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు టాన్ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఏసీబీకి పట్టిస్తానని చెప్పారు. మున్సిపాలిటిలో పనులుంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారికి పేమెంట్లు మున్సిపాలిటీలోని ఉన్నత అధికారికి అన్ని విభాగాల నుంచి నెల నెల పేమెంట్లను ఆయా విభాగాల అధికారులు అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సదరు ఉన్నత అధికారి ఇంటికి భీమవరం నుంచి కాంట్రాక్టర్లతో మెటీరియల్ సరఫరా చేయించుకున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. పేమెంట్లు అందించడం కోసం కొందరు అధికారులు రేటు పెట్టి వసూలు చేస్తున్నారని, అందులో కొంత అధికారికి, మరి కొంత వారికి అన్నట్లు వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు భీమవరం మున్సిపాలిటీపై దృష్టి సారించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ప్రతి సెక్షన్‌లోనూ వసూళ్ల దందా మున్సిపల్ ఉన్నతాధికారికి నెలనెలా పేమెంట్లు? -
మండుతున్న ఎండలు
పెంటపాడు: రోజురోజుకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నారు. వర్షాలు లేక ఎండకు నాట్లు దెబ్బతినే అవకాశం ఉంది. నాట్ల సమయంలో వర్షం వస్తే ఏపుగా ఎదుగుతాయి. ఎండల వల్ల ప్రజలు బయటకు రాక వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. స్కూలుకు వెళ్లే చిన్నారులు ఎండ దెబ్బకు అల్లాడుతున్నారు. గూడెం నియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట అయితే చెప్పక్కరలేదు. పెంటపాడు, గూడెం ప్రాంతాలలో రోజూ 10 గ్రామాల చొప్పున విద్యుత్ కోత ఉంటోంది. -
కుంగిన వంతెన.. నిలిచిన రాకపోకలు
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని దొంగపిండిలో బందాల చేడు డ్రెయిన్‌పై నిర్మించిన వంతెన ఆదివారం తెల్లవారుజామున కుంగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో సుమారు 6 వేల వరకు జనాభా ఉండగా.. గ్రామం చుట్టూ ఎటు చూసినా కాలువలు ఉన్నాయి. నిత్యం స్కూలు బస్సులు, కూలీలు, కార్మికుల వ్యాన్లు, ఆటోలపై పొరుగూరుకు వెళ్లి వస్తుంటారు. గ్రామంలో చేపలు, రొయ్యలు చెరువులు ఎక్కువగా ఉండటంతో తవుడు లోడులు, పట్టుబడులకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గ్రామం నుంచి పొరుగూళ్లు వెళ్లడానికి ఆర్ అండ్ బీ రోడ్డు ఒక్కటే కావడంతో ఆ మార్గంలో వంతెన కుంగిపోవడంతో ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. 3 దశాబ్దాల నాటి వంతెన సుమారు 3 దశాబ్దాల క్రితం బందాల చేడు డ్రెయిన్‌పై వంతెన నిర్మించారు. కొంతకాలంగా ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుని అడుగుభాగం పెచ్చులూడిపోవడంతో కొంతమంది గ్రామస్తులు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతవరకూ ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు వంతెన కూలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంగిపోయిన వంతెన స్థానంలో ఎప్పుడు కొత్త వంతెన నిర్మిస్తారని, అప్పటి వరకు తమకు కష్టాలు తప్పవా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా వంతెన నిర్మించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
పాపికొండల్లో అడవి దున్నలు
బుట్టాయగూడెం: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో అడవి దున్నల ఉనికిని గుర్తించారు. సింహాలు, పులులు, ఏనుగులను సైతం తరిమి కొట్టే సత్తా ఉన్న జంతువులు ఈ అడవిదున్నలు. అభయారణ్య పరిధిలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. సుమారు 10 నుంచి 20 వరకూ గుంపులుగా ఈ అడవి దున్నలు మేత కోసం తిరుగుతూ ఉంటాయి. వైల్డ్ లైఫ్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు ఈ అడవి దున్నలు చిక్కాయి. మొత్తం 420 పైగా అడవి దున్నలు పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అడవుల్లోని గడ్డితోపాటు లేత వెదురు చిగుళ్లను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. రాత్రి, పగలు కూడా దురుసుగా తల ఎగరేస్తూ సంచరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. అడవి దున్నల దాడుల్లో అనేక మంది మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. అడవి దున్నలు భారత ఉపఖండంలోని భారత్, బంగ్లాదేశ్, నేపాల్‌లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు చెబుతున్నారు. మన దేశంలో పశ్చిమ కనుమలు, దండకారణ్యాల్లో వీటి ఉనికి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం అటవీ ప్రాంతం, పాపికొండల అభయారణ్యంలోనూ అడవి దున్నల సంచారం అత్యధికంగా ఉంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో అడవి దున్నల సంచారం క్రమేపీ అంతరించిపోవడం వల్ల అక్కడ వీటి సంచారంలేదని అధికారులు అంటున్నారు. వన్యప్రాణుల కోసం గడ్డి పెంపకం పాపికొండల అభయారణ్యం పరిధిలో సుమారు 15 హెక్టారుల్లో వన్యప్రాణుల కోసం వైల్డ్ లైఫ్ అధికారులు గడ్డి పంటను పండిస్తున్నారు. ఈ పంట ముఖ్యంగా అడవి దున్నలు, కుందేళ్లు వంటి శాఖాహార జంతువులు తినేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. పులిని సైతం మట్టికరిపించే దున్న ఆరున్నర అడుగుల ఎత్తు.. 12 అడుగుల పొడవు, 800 నుంచి 1500 కేజీల భారీ బరువుతో అడవి దున్నలు ఉంటాయి. పెద్ద పులులను సైతం మట్టి కరిపించే వణ్యప్రాణి అడవిదున్న. దీని జీవిత కాలం 15 నుంచి 20 సంవత్సరాల వరకూ ఉంటుంది. రాత్రి, పగలు తేడా లేకుండా దురుసుగా తిరిగే జంతువు మనుషులు కనిపిస్తే దాడిచేసే ప్రమాదం -
బందా మృతి తీరని లోటు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త వీ.బందా మృతి సాహితీ లోకానికి తీరని లోటని పలువురు వక్తలు అన్నారు. బందా సంతాప సభను సాహిత్య మండలి, గరికిపాటి ఆర్ట్స్, హేలాపూరి కళా పరిషత్, జిల్లా రచయితల సంఘం తదితర సాహిత్య కళా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొప్ప స్నేహ శీలి, మంచి సాహితీవేత్త బందా అన్నారు. గరికిపాటి కాళిదాసు మాట్లాడుతూ ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావు ద్విశత అవధానం కార్యక్రమం బందా నేతృత్వంలో నిర్వహించామని గుర్తుచేసుకున్నారు. లేళ్ళ వెంకటేశ్వరావు, మహమ్మద్ ఖాజావలీ, నాగాస్త్ర పుల్లాభొట్ల పురుషోత్తం, పీ సత్యవాణి, పీ ఆంజనేయులు, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న విచారణ
ఉండి: జూనియర్ లైన్మేన్పై వచ్చిన ఆరోపణలపై శనివారం మూడోరోజు కూడా విచారణ కొనసాగింది. ఉండి మండలం చెరుకువాడ, అర్తమూరు గ్రామాలకు జూనియర్ లైన్‌మేన్‌గా విధులు నిర్వర్తిస్తున్న దాసరి రాజుపై వచ్చిన ఆరోపణలపై గత మూడు రోజులుగా అధికారులు విచారణ చేస్తున్నారు. శనివారం రెండు గ్రామాల్లోను విద్యుత్ అధికారులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆక్వా రైతులు, ప్రజల నుంచి సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఉండి ఎలక్ట్రికల్ ఏఈ పులగం శ్రీనివాసరావు తెలిపారు. దర్యాప్తును పూర్తిస్థాయిలో సోమవారం ముగిస్తామన్నారు. పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు గోవింద నామస్మరణతో పారిజాత గిరి ప్రదక్షిణ చేశారు. వారికి ప్రత్యేక దర్శనం, ప్రసాదం, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. అన్నదాతలు జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు సత్య గణేష్ చౌదరి, మంజుషలకు స్వామివారి వస్త్రాలు, ప్రసాదాలు, వేద పండితుల ఆశీస్సులతో సత్కరించారు. శనివారం ఆలయానికి వివిధ రూపాల్లో రూ.1,01,076 ఆదాయం లభించినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలి
ఏలూరు (టూటౌన్): విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఆపాలని, ఈనెల 5వ తేదీన విద్యుత్ భవనం వద్ద చేపట్టే ప్రజాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో శనివారం టూటౌన్ తంగేళ్లమూడి సెంటర్, గన్బజార్లలో సంతకాల సేకరణ కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచము అని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చి, ఇప్పుడు ప్రజలపై ఆర్థిక భారము మోపేలా స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమాన్ని చేపట్టడం దారుణమన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఉపాధి లేక,, ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇప్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి డేగ ప్రభాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, చేతివృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ పిచ్చుకల ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో..
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ జోన్–2 రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బీఆర్ క్రాంతి కుమారి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం అందజేసి సత్కరించారు. ఉద్యోగం ఇప్పిస్తానని మోసం ముదినేపల్లి రూరల్: ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.7 లక్షలు వసూలు చేసి ఆనక మోసం చేసిన వైనంపై శనివారం పోలీస్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం ముదినేపల్లికి చెందిన బూసి చిరంజీవి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి గురజకు చెందిన పి విక్రమ్ పరిచయమై తాను ప్రముఖ రాజకీయ నాయకుల వద్ద కారు డ్రైవర్‌గా చేస్తుంటానని, ఆ పలుకుబడితో చిరంజీవి కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. పలు దఫాలుగా ఫోన్‌పే, రొక్కముగా రూ.7 లక్షలు వసూలు చేశాడు. అనంతరం ఉద్యోగం గురించి చిరంజీవి ఎన్నిసార్లు విక్రమ్‌ను ప్రశ్నించినా సమాధానం దాటవేయడంతో మోసపోయానని గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
రవాణా కార్యాలయాల్లో ఎకై ్సజ్ తనిఖీలు
తణుకు అర్బన్: తణుకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం తణుకు పట్టణంలోని పలు ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, గోడౌన్లు, ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ సత్తి మణికంఠరెడ్డి మాట్లాడుతూ రవాణా కార్యాలయాల్లో సరుకులు, సామాగ్రి రవాణా చేసే క్రమంలో పూర్తిస్థాయిలో సిబ్బంది పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ చట్టం ప్రకారం ఎన్డీపీఎస్ చట్టం పరిధిలోకి వచ్చే ఆల్కహాలు, సారా, గంజాయి, ఇతర డ్రగ్స్ రవాణా చేయుటకు అనుమతిస్తే ఆ కార్యాలయాలు, సిబ్బందిపై చర్యలు తప్పవని అన్నారు. అనుమానిత సామాగ్రిని గుర్తిస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణాలు తీసిన అతివేగం
ద్వారకాతిరుమల: ఒక డ్రైవర్ అతివేగం, అజాగ్రత్త రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మృతుల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మండలంలోని లైన్ గోపాలపురం జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి ముందు వెళుతున్న ఇసుక లారీని, కోళ్లు వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు తీవ్ర గాయాలు పాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి వ్యాన్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణం. పోలీసుల కథనం ప్రకారం. గుంటూరు జిల్లా, వాడేపల్లికి చెందిన షేక్ మీరా మహబూబ్(30) గుంటూరులోని ఏకే చికెన్ పౌల్ట్రీలో గత 9 ఏళ్ల నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే పౌల్ట్రీలో సౌత్ ఢిల్లీకి చెందిన మహ్మద్ సాజాన్(27), ఎండీ కలిమ్ ఆలాం కూలీలుగా పనిచేస్తున్నారు. గత శుక్రవారం సాయంత్రం ఈ ముగ్గురు వ్యాన్‌లో జంగారెడ్డిగూడెం మండలం కొయ్యలగూడెంకు వెళ్లారు. అక్కడ కోళ్లను లోడ్ చేసుకుని, తాడేపల్లికి బయల్దేరి వెళుతున్నారు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి బ్రిడ్జి ఎక్కే సమయంలో డ్రైవర్ మీరా మహబూబ్ వ్యాన్‌ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ముందు (ఏలూరు వైపునకు) వెళుతున్న ఇసుక లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మీరా మహబూబ్, సాజాన్ అక్కడికక్కడే మృతి చెందగా, కలిమ్ ఆలాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటీన క్షతగాత్రుడిని ఆంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు మహబూబ్ సోదరుడు షేక్ ఇస్మాయేలు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
ముదురుతున్న రోడ్డు ఏర్పాటు వివాదం
ఉండి: పాములపర్రు గ్రామంలో శ్మశానవాటిక నుంచి రోడ్డు వేయాలని అధికారులు పట్టుదలకు పోవడంతో వివాదం రోజురోజుకు ముదురుతోంది. శ్మశానంలో నుంచి ఆక్వా చెరువులకు రోడ్డు వేయవద్దంటూ గత నెల 31వ తేదీన మొదటిగా దళితులు నిరసన తెలిపారు. దీంతో తహసీల్దార్ నాగార్జున తాను 2వ తేదీ వచ్చి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో దళితులు నిరసన విరమించారు. అయితే శనివారం ఆయన రాకపోగా అధికారులను పంపించి రోడ్డు నిర్మాణానికి కొలతలు వేసే కార్యక్రమం చేపట్టడంతో దళితులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీంతో గ్రామ పెద్దలు వచ్చి నచ్చజెప్పడంతో నిరసన విరమించి మాట్లాడుకునేందుకు అంగీకరించారు. కానీ గ్రామ పెద్దలు గానీ, అధికారులు గానీ రాకపోవడంతో దళిత సంఘాలను సమీకరించి భవిష్యత్ కార్యాచరణపై గ్రామంలో సమావేశమయ్యారు. దారి అడిగిన ఆక్వారైతులు వారి భూములను త్యాగం చేసి రోడ్డు వేసుకోవచ్చు కదా అంటూ దళితులు మండిపడుతున్నారు. పంచాయితీ రికార్డుల్లో కూడా శ్మశానవాటిక భూమి అని ఉందని, దళితులకు పవిత్రమైన శ్మశాన భూమిలో రోడ్డు వేసి మా మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించొద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ నాయకులు, స్థానిక దళిత నాయకులు, అధికారులు డిప్యూటీ తహసీల్దార్ సూర్యనారాయణరాజు, సీఐ జగదీశ్వర్, ఎస్సై ఎండీ నసీరుల్లా పాల్గొన్నారు. -
విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి
నూజివీడు: విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ర్యాగింగ్‌కు దూరంగా ఉండి చదువుపైనే దృష్టి సారించాలని సిఐడీ డీఎస్పీ జీ లక్ష్మయ్య పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరంగా తీసుకునే చర్యలపై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చదువు అంటే అర్థం చేసుకోవడం, అవగాహన చేసుకోవడం అనే విషయాన్ని నిజంగా గ్రహిస్తే ఇతరుల్ని మనం ర్యాగింగ్ చేయడానికి ఇష్టపడమన్నారు. ఇతరుల్ని శారీరకంగా, మానసికంగా వేధించడం మానుకోవాలని, మంచి స్నేహితుల్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించాఉ. ఇతరులతో ఎగతాళిగా మాట్లాడడం, తోటి విద్యార్థులతో నువ్వు చదవలేవు అని అనడం కూడా ర్యాగింగ్ కిందకు వస్తుందన్నారు. విద్యార్థులు ర్యాగింగ్ వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పట్టుదలతో చదువుకొని భవిష్యత్‌తో ప్రయోజకులవ్వాలని విద్యార్థులకు హితవు పలికారు. దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారినప్పుడే దేశం కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందన్నారు. అనంతరం డీఎస్పీని మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్‌డబ్ల్యూఓలు రాజేష్, దుర్గాభవాని, చీఫ్ వార్డెన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. సీఐడీ డీఎస్పీ లక్ష్మయ్య -
శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైన రోజు అయినప్పటికీ అష్టమి తిధి కావడంతో నామమాత్రంగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. దాంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, కల్యాణకట్ట తదితర విభాగాల్లో భక్తుల రద్దీ స్వల్పంగా కనిపించింది. ఆదివారం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సెప్టెంబరు 13న జాతీయ లోక్ అదాలత్ ఏలూరు (టూటౌన్): సెప్టెంబర్ 13వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసధన్ భవన్ నందు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులతో పాటు సివిల్, వాహనం ప్రమాద బీమా, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ వివాదాలు, టెలిఫోన్ బకాయిలు, చిట్ ఫండ్ కేసులు, అమలు పిటీషన్లు (ఇ.పి) రాజీ చేయడం జరుగుతుందన్నారు. కేసుల పరిష్కారంలోగానీ, మరి ఏ ఇతర సమస్యలు ఎదురైన 15100 లేదా 08812 224555ను సంప్రదించాలన్నారు. -
శ్రీవిష్ణు డెంటల్ కళాశాలలో రాష్ట్రస్థాయి సదస్సు
భీమవరం: పట్టణంలోని శ్రీవిష్ణు డెంటల్ కళాశాలలో 11వ ఐపీఎస్ రాష్ట్ర సమావేశం శనివారం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఏవీ రామరాజు చెప్పారు. ఈ సందర్భంగా ఫ్యాకల్టీ, విద్యార్థుల మార్పిడి, పరిశోధన, ప్రచురణలు, క్లినికల్ శిక్షణ వంటి కార్యకలాపాలకోసం విష్ణు డెంటల్ కళాశాల, వియత్నంలోని కాన్‌థో యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ ఫార్మసీ మధ్య అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రామరాజు చెప్పారు. సమావేశంలో రాష్ట్రంలోని వివిధ డెంటల్ కళాశాలలకు చెందిన సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొనగా పీజీ విద్యార్థులు పరిశోధన పత్రాలను సమర్పించారన్నారు. కళాశాల వైస్ చైర్మన్ రవిచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. నిందితుల అరెస్ట్ టి.నరసాపురం: పొగాకు బేళ్లు చోరీ నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై జయబాబు తెలిపారు. వివరాల ప్రకారం.. మండంలోని కృష్ణాపురం గ్రామానికి చెందిన భూక్యా భాస్కరరావుకు చెందిన 14 పొగాకు బేళ్లు చోరీపై జూలై 28న ఫిర్యాదు చేశాడు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం నలుగురిని నిందితులుగా గుర్తించి వారిని అరెస్ట్ చేసి అనంతరం రిమాండ్‌కు పంపారు. నిందితులతోపాటు పొగాకు బేళ్లు కలిగిన వాహనాన్ని సీజ్ చేశామన్నారు. -
నిమ్మల రెడ్‌బుక్ రాజ్యాంగం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన అత్యంత మంచి వ్యక్తి. బొకేలు, స్వీట్ బాక్సులు బదులు కూరగాయల కవర్లు మాత్రమే తీసుకుంటారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్పెట్లు వేయకుండా అత్యంత సాధారణంగా చేయాలని చెబుతుంటారు. రాష్ట్ర మంత్రయినా అత్యంత నిరాడంబర జీవితం. రోడ్లపైనే టిఫిను తినడం, పగలు, రాత్రి అనే తేడా లేకుండా పనిచేసే గొప్ప రాజకీయ నాయకుడు’ ఇదంతా సోషల్ మీడియాలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురించి ఆయన సొంత టీం ఊదరగొట్టే వ్యవహారం. పాలకొల్లులో మాత్రం ఆయన పొలిటికల్ రెడ్‌బుక్ పేరుతో వైఎస్సార్సీపీ లీడర్లను, కేడర్లను వేధింపులకు గురి చేస్తూ వరుస కేసులతో హడావుడి చేస్తున్నారు. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏమిటంటే దళిత హక్కులను పరిరక్షించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దళితులపైనే ప్రయోగించడం. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు రెడ్‌బుక్ హడావుడి చాపకింద నీరులా కొనసాగిస్తున్నారు. సమయం, సందర్భం చూసుకుని మరీ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని ముప్పుతిప్పలు పెట్టేలా వేధింపుల కేసులకు తెర తీశారు. పాలకొల్లు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని కొత్త సంస్కృతికి నిమ్మల బీజం వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 2022లో టిడ్కో ఇళ్ళ గృహ ప్రవేశాల సందర్భంగా జరిగిన చిన్నపాటి వాదనపై తాజాగా సీబీసీఐడీ ఎంకై ్వరీ వేయించడం, కొద్ది నెలల క్రితం జరిగిన యలమంచిలి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ముగ్గురు వ్యక్తుల ఫిర్యాదుతో 42 మందిపై ఒకేరోజు కేసు నమోదు చేయడం ఇంకొక సంచలనం. అధికారంలో ఉంటే ఒకలాగా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించే నిమ్మల మంత్రి కావడంతో రెడ్‌బుక్ పేరుతో వేధింపులను తీవ్రతరం చేస్తున్నారు. ఎంపీపీ ఎన్నికల స్పెషల్ కేసు పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి ఎంపీపీ ఎన్నిక మార్చి 26, 27 తేదీల్లో నిర్వహించారు. టీడీపీకి నామమాత్రపు బలం కూడా లేకపోవడంతో వైఎస్సార్సీపీ సభ్యులను టీడీపీలోకి తీసుకోవడానికి మంత్రి నిమ్మల రకరకాాల ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. ఈ క్రమంలో ఎన్నిక వాయిదాకు సరికొత్త ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా మార్చి 27న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కానిస్టేబుల్ ఫిర్యాదుతో 17 మందిపైన, అదేరోజు వీఆర్ఓ విధులకు ఆటంకం కలిగించారని 9 మంది పైన కేసులు నమోదు చేశారు. అదేరోజు టీడీపీ నాయకుడి ఫిర్యాదుతో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి గూడాల గోపి, కీలక నేతలు గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ సహా 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దీనిలో ప్రత్యేకత ఏమిటంటే ముగ్గురు ఎస్సీల పైన, ఒక ఎస్టీ పైన అట్రాసిటీ కేసు నమోదు చేయడం. వైఎస్సార్సీపీ నేతలపై వేధింపుల పర్వం ఎంపీపీ ఎన్నికల సమయంలో ఒకే రోజు 42 మందిపై మూడు కేసులు ఎస్సీ, ఎస్టీలపై పాలకొల్లులో అట్రాసిటీ కేసు 2022 ఘటనపై సీబీసీఐడీ ఎంకై ్వరీ ఆదర్శ ఎమ్మెల్యే, మంత్రి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం బయటికి మాత్రం రాజకీయ వేధింపుల వ్యవహారం వాదులాట ఘటనకు సీబీసీఐడీ కేసా? 2022 ఆగస్టు 5న పాలకొల్లులో టిడ్కో ఇళ్ళ లబ్ధిదారులకు గృహాల పంపిణీ జరిగింది. నిమ్మల రామానాయుడును స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రొటోకాల్ ప్రకారం కార్యక్రమానికి ఆహ్వానించారు. శిలాఫలకంలో నిమ్మల పేరు పెద్దగా లేదనే కారణంతో 50 మంది కార్యకర్తలతో ప్లకార్డులతో సభలోకి వచ్చి హడావుడి చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలకు, నిమ్మలకు మధ్య వాగ్వాదం జరిగింది. కట్ చేస్తే... 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే డిసెంబర్ 13న తాడి శశిధర్ అనే వ్యక్తితో మంత్రి ఫిర్యాదు చేయించారు. కేసులో 24 మందిపై ఫిర్యాదు అందడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. కొందరు బెయిల్ తీసుకోగా, మరికొందరు హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఈ కేసులో పోలీసులు మే నెలలో చార్జిషీట్ దాఖలు చేయడంతో ఏలూరు జిల్లా కోర్టులో 861/2025 నెంబరుతో కేసు నడుస్తోంది. గురువారం వాయిదా జరిగింది. ఇదే కేసును మంత్రి ఆదేశాలతో గత వారం సీబీసీఐడీకి అప్పగించారు. ఇలా చిన్న ఘటనలకు కూడా భూతద్దంలో చూపి వేధింపులకు తెరతీయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రజలపై విద్యుత్ భారం
భీమవరం: విద్యుత్ స్మార్ట్ మీటర్లు అమర్చడాన్ని తక్షణం ఆపాలని స్మార్ట్ మీటర్ల వ్యతిరేక ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. పట్టణంలోని చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు నమ్మకద్రోహం చేస్తుందని గత ప్రభుత్వంలో అదానీ ఒప్పందాలను వ్యతిరేకించి నేడు అదే పద్ధతి అవలంభించడం దారుణమన్నారు. ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి వాటిని విస్మరించి ప్రజలపై మరిన్ని భారాలు వేయడానికి సిద్ధపడుతుందని విమర్శించారు. రైతులకు ఇస్తామన్న భరోసా రూ.3,500 కోట్లు అయితే విద్యుత్ చార్జీల పేరుతో ప్రజలపై వేసే భారం సుమారు రూ.12 వేల కోట్లని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రూ ఆప్, సర్దుబాటు చార్జీల పేరుతో కరెంటు చార్జీలు పెంచుతున్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు కోసం అదే బిల్లును అడ్డం పెట్టుకుని సంక్షేమ పథకాలకు దూరం చేస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 5న రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన చేయాలని ఐక్యవేదిక పిలుపునిస్తున్నట్లు చెప్పారు. ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి కొనాల భీమారావు, సీఐటీయు జిల్లా నాయకుడు బి.వాసుదేవరావు, అఖిల భారత కిసాన్ సభ నాయకుడు లంక కృష్ణమూర్తి, సీఐటీయు జిల్లా అధ్యక్షుడు జేఎన్వీ గోపాలన్, చింతకాయలు బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
అమెరికా పన్నుతో ఆక్వా రైతు కుదేలు
పాలకొల్లు సెంట్రల్: అమెరికా విధించిన 25 శాతం పన్నుతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు అన్నారు. శనివారం మండలంలోని పూలపల్లిలో ఎస్ఎస్ఎస్ కల్యాణ మండపంలో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా పన్నుల భారంతో ఆక్వా కంపెనీలు కొనుగోలు ధరల్లో రూ.40 నుంచి రూ.50 ధరను తగ్గించేశారన్నారు. దీంతో ఆక్వా సాగు అంటే రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. సరుకు లేకపోవడంతో గత 20 రోజులుగా వంద కౌంట్ రూ.260 నుంచి రూ.270 వరకూ కొన్నారని.. ఆమెరికా సుంకం సాకుతో వంద కౌంట్‌కు రూ.20 తగ్గించి కొంటున్నారన్నారు. మిగిలిన కౌంట్‌కు మాత్రం రూ.50 తగ్గించి కొంటున్నారన్నారు. ఇప్పటికే ఆక్వా రైతులు చాలా నష్టపోయారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆక్వా ఫీడ్ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశం ఏర్పాటుచేసి ఆక్వా రైతులకు న్యాయం చేయాలన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో రైతులు ఆక్వాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వరి లాగా ఆక్వా రైతులకు కూడా మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని అన్నారు. ఆక్వా రైతులపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన శ్రద్ధ లేదన్నారు. ఆక్వా రైతులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ప్రభుత్వానికి మంచిదని అన్నారు. కార్యక్రమంలో బోణం చినబాబు, అంగర వరప్రసాద్, దాట్ల సోంబాబు, జగ్గురోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎఫెక్ట్
పారిశుద్ధ్య చర్యలు పెంటపాడు: గ్రామాల్లో పారిశుద్ధ్య లేమి పేరిట సాక్షిలో ఈ నెల 1న ప్రచురితమైన వార్తకు మండల అధికారులు స్పందించారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు కొండేపాడులో శనివారం గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీల్లో సిల్ట్ తీయించారు. చెత్తను జేసీబీల సాయంతో తొలగించారు. జాయింట్ పట్టా భూముల విభజనకు అవకాశం భీమవరం (ప్రకాశం చౌక్): పశ్చిమ గోదావరి జిల్లాలోని రీసర్వే పూర్తి అయిన గ్రామాలలో వెట్ ల్యాండ్ 2.0 లో జాయింట్ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు, తమ భూములను వ్యక్తిగతంగా విభజించుకొనేందుకు అవకాశం కల్పించారని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భూ విభజన కోసం సాధారణంగా వసూలు చేసే రూ.500 ప్రభుత్వ రుసుంను పూర్తిగా మాఫీ చేసినట్లు తెలిపారు. భూ యజమానులు కేవలం రూ.50 నామమాత్రపు దరఖాస్తు రుసుంను గ్రామ సచివాలయంలో చెల్లించి, వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రత్యేక అవకాశం ద్వారా జాయింట్ పట్టాదారులు తమ భూములను విభజించుకుని గ్రామ సచివాలయంలో అర్జీ దాఖలు చేసుకుని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు. అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఉండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులను ఽశనివారం ఎన్నార్పీ అగ్రహారం కేవీకేలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతులకు మూడు విడతల్లో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అనంతరం ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రతక్ష్య ప్రసారంలో నాయకులు, రైతులు వీక్షించారు. నవోదయ ప్రవేశాల దరఖాస్తుకు గడువు పొడిగింపు భీమవరం: రానున్న విద్యాసంవత్సరంలో జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోడానికి ఆగస్టు 13 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఈ.నారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులను పరిపాలన కారణాలు, తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించినందున అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధ్యాయ అవార్డుల నామినేషన్స్‌కు 8 వరకు గడువు భీమవరం: గురుపూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈనెల 8లోగా నామినేషన్స్‌ను సంబంధిత ఉప విద్యాశాఖాధికారులకు అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి నారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు నీట్ పీజీ పరీక్ష ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైద్య కళాశాలల్లో వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నీట్ పరీక్ష ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ జరగనుంది. ఏలూరులోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మంది విద్యార్థులకు, సిద్ధార్థ క్వెస్ట్ విద్యా సంస్థలో 174 మందికి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి 8.30 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డులను, ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలి. రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ ఏలూరు (టూటౌన్): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఒక్క రూపాయికే ఉచిత సిమ్ అందిస్తుందని టెలికాం జనరల్ మేనేజర్ ఎల్.శ్రీను తెలిపారు. స్థానిక జిల్లా టెలికాం జీఎం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఉచిత సిమ్‌తో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, వంద ఎస్ఎంఎస్లు, 30 రోజుల కాల వ్యవధితో అందజేస్తున్నట్లు తెలిపారు. -
ఒలుపులో వైరెటీలెన్నో !
సాక్షి, భీమవరం: కొబ్బరి కాయ ఒలవడం తేలికేనని తీసి పారేయకండి. దానికీ ఓ పద్ధతుంది. బొండాం, ముప్పేట, ముదర కాయ, కురిడీ అంటూ కాయల్లో రకాలున్నట్టే.. పిలక, బొంబాయి సీలు, కసింగలు, పోర్‌పట్టా, బోరాలు, మూడు నామాలు.. అంటూ ఒలుపుల్లోనూ పదికి పైనే వైరెటీలు ఉన్నాయి. ప్రాంతాన్ని బట్టి ఒలుపులు మారుతుంటాయి. ప్రస్తుతం రికార్డు ధరతో జిల్లా నుంచి రోజుకు దాదాపు వంద లారీల కొబ్బరి కాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. అక్కడి అవసరాలకు తగ్గట్టు ఇక్కడి ఒలుపు కార్మికులు వడివడిగా కాయలను వలుస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సుమారు 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఆచంట, పాలకొల్లు, నరసాపురంలోని వశిష్ట గోదావరి, సముద్ర తీరం వెంబడి, భీమవరం, ఉండి, ఆకివీడు ప్రాంతాల్లోని ఆక్వా చెరువు గట్లు, తాడేపల్లిగూడెం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు ప్రాంతాల్లో తోటలు సాగు చేస్తున్నారు. జిల్లా నుంచి రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, బీహార్, పంజాబ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి అవుతున్నాయి. తమిళనాడు, కేరళ తర్వాత మన కొబ్బరికి దేశ వ్యాప్తంగా గిరాకీ ఉన్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. తమిళనాడులో దిగుబడి తగ్గడంతో నెలన్నర రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులకు డిమాండ్ ఏర్పడింది. మునుపెన్నడూ లేనివిధంగా రైతు ధర కాయకు రూ.18 నుంచి రూ.20 మధ్య నిలకడగా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు వంద లారీల వరకు కాయలు ఎగుమతి అవుతున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. ఒలుపులో రకాలెన్నో.. హిందూ సంప్రదాయంలో కొబ్బరి కాయకు ఎంతో విశిష్టత ఉంది. పూజల్లో కొట్టడం నుంచి హోమాల్లో కాయ పళంగా వేయడం, దిష్టి, దిగదుడుపు తీయడం తదితర ప్రతి పనిలోనూ కొబ్బరికాయ ఉండాల్సిందే. మన ప్రాంతంలో ముచ్చిక, పిలకతో ఒలిచిన వాటిని వినియోగించినట్టే ఇతర ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఒలిచిన కాయలను వాడుతుంటారు. ఈ మేరకు జిల్లా నుంచి ఎగుమతులు జరిగే రాష్ట్రాల్లోని అవసరాలకు తగ్గట్టు కాయలను ఒలుస్తుంటారు. వీటిలో పిలక, బొంబాయి సీలు, రాయపూర్ సీలు, మూడు నామాలు, కసింగలు, బోరాలు, బెల్ట్ పోర్ పట్టా, బెల్ట్ లెస్ పోర్‌పట్టా, ఐదు పేళ్లు, ఆరు పేళ్లు, ఎనిమిది పేళ్లు తదితర పదికి పైనే ఒలుపుల్లో రకాలున్నాయి. ఎగుమతి అయ్యే ప్రాంతంలో ఆయా ఒలుపులకు ఏ పేర్లున్నా కానీ స్థానికంగా తాము ఈ విధంగా పిలుచుకుంటామని వ్యాపారులు, ఒలుపు కార్మికులు అంటున్నారు. రాయపూర్ సీలును కాయ వెనుక నుంచి మూడు పేళ్లుగా ఒలిస్తే, కసింగలను ముందు నుంచి మూడు, వెనుక నుంచి మూడు పేడులుగా కాయపైన పీచు ఉంచి డొక్కను ఒలుస్తారు. బెల్టు పోర్‌పట్టా కోసం కాయకు నాలుగు వైపులా మధ్యలో అరంగుల డొక్క ఉంచి మిగిలిన దానిని తీసివేస్తారు. బెల్టు లెస్ కోసం నాలుగు వైపులా స్క్వేర్ ఆకారంలో పీచు ఉండేలా డొక్కను ఒలుస్తారు. అదేమాదిరి ఐదు పేళ్లు, ఆరు పేళ్లు, ఎనిమిది పేళ్లు సంఖ్యను బట్టి అన్ని పేళ్లుగా పైడొక్కను తొలగిస్తారు. మూడు నామాల కోసం కాయకు మూడు వైపులా అంగుళం వెడల్పున పీచు ఉంచి మిగిలిన డొక్కను పీచు సహా తీసేస్తారు. బొంబాయి సీలు కోసం కాయకు సగభాగం పూర్తిగా పీచును ఒలిచేసి మిగిలిన సగభాగం ఉంచేస్తారు. ఇలా వివిధ రకాలుగా కాయలను ఒలుస్తుంటారు. కొబ్బరి ఒలుపులో పదికి పైగా రకాలు పిలక, బొంబాయి సీలు, మూడు నామాలు, కసింగలు, పోర్‌పట్టా, బోరాలు రాష్ట్రాన్ని బట్టి ఒలుపు మారుతుందంటున్న కార్మికులు ఉమ్మడి పశ్చిమగోదావరిలో 50 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జిల్లా నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి ఏ ఒలుపు ఎక్కడికి.. బెల్ట్‌లెస్ పోర్‌పట్టా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు ఎక్కువగా ఎగుమతి జరిగితే బోరాలు యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు, ఆరు పేళ్లు యూపీ, కర్ణాటక, రాయపూర్ సీలు, ఐదు పేళ్లు మహారాష్ట్రకు, పిలకలు ముంబయి, బిహార్‌కు, మూడు నామాలు మహారాష్ట్రకు, కసింగలు అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతుంటాయని వ్యాపారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో చాలా వరకు కొట్టకుండా వీటిని నేరుగా హోమాల్లో వేస్తారన్నారు. కాయపళంగా కన్నా ఒలిపించడం వల్ల బరువు తగ్గి ఎక్కువ కాయలు తీసుకువెళ్లే వీలుంటుందని అక్కడి అవసరాలకు తగ్గట్టు ఇక్కడే ఒలిపించుకుని తీసుకువెళతారని అంటున్నారు. కావాల్సిన ఆకారంలో వేగంగా కాయలు ఒలవడం అనుభవంతో కూడిన పని. ఒక్కో కాయ ఒలుపునకు రూ.1.50 చొప్పున ఇస్తారు. రోజుకు ఒక్కో కార్మికుడు 800 నుంచి 1000 కాయలను ఒలుస్తుంటారు. గండీర.. గటగట ఉత్తరాది రాష్ట్రాల్లో కురిడీ కొబ్బరి ఆహారంలోనూ భాగంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా రాజస్తాన్, మధ్యప్రదేశ్‌కు వెళుతుంటాయి. బాగా తయారైన కాయలను ఎంపిక చేసి ఎనిమిది పేళ్లుగా ఒలుస్తారు. గోదాముల్లో గాలి తగిలేలా అరలు కట్టి కాయలను నిల్వ చేస్తారు. ఆరు నెలలకు లోపలి నీరు పూర్తిగా ఇంకిపోయి గుడ్డు మాత్రమే ఉంటుంది. మొదట్లో 600 గ్రాముల నుంచి 700 గ్రాములు ఉన్న కాయ బరువు కురిడీ అయ్యేసరికి 80 గ్రా. నుంచి 100 గ్రా.కు తగ్గిపోతుంది. నాణ్యమైన గండీర, సెకండ్ క్వాలిటీని గటగటగా పిలుస్తుంటారు. గండీరకు రూ.30 ఉండగా గటగటకు రూ.28 ధర ఉన్నట్టు చెబుతున్నారు. నాలుగు దశాబ్దాల అనుభవం నలభై ఏళ్లుగా ఒలుపు పని చేస్తున్నాను. ఒక్కో ప్రాంతం నుంచి వచ్చిన వారు ఒక్కో విధంగా ఒలవమని చెబుతుంటారు. ఏ రకంగా ఒలవాలన్నా దాదాపు ఒకే సమయం పడుతుంటుంది. ప్రస్తుతం సీజన్ కావడం వల్ల పని ఎక్కువగా ఉంది. – కొడవటి ఎర్రియ్య, ఒలుపు కార్మికుడు, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా అవసరాన్ని బట్టి ఒలుపు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఒలిచిన కాయలను వినియోగిస్తుంటారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్డరు మేరకు వారికి అవసరమైన రీతిలో ఒలిపించి ఎగుమతి చేస్తుంటాం. తమిళనాడులో దిగుబడులు తగ్గడంతో ప్రస్తుతం జిల్లా నుంచి ఎగుమతులు బాగున్నాయి. రైతులకు రికార్డు ధర వస్తోంది. – కాసా సత్యనారాయణ, వ్యాపారి, యలమంచిలి, పశ్చిమగోదావరి జిల్లా -
రోడ్డెక్కిన ఉపాధ్యాయులు
భీమవరం: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం భీమవరం కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం మొండివైఖరి అవలంభిస్తుందని విమర్శించారు. పీఆర్సీ కమిషన్ ప్రకటించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, బకాయి పడ్డ డీఏలను విడుదల చేయాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించి బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ అధికారి పోస్టులను ఉమ్మడి సీనియార్టీ ప్రకారం జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి 2003 ముందు నియమించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని, సరెండర్ లీవ్ బకాయిలను విడుదల చేయాలన్నారు. ప్రతి హైస్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం కొనసాగించాలని, 11వ పీఆర్సీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్, వైఎస్సార్‌టీఏ జిల్లా అధ్యక్షుడు మురాల సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ఫ్యాప్టోను చర్చలకు పిలవకుంటే ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా విజయవాడలో ధర్నా చేస్తామని ప్రకటించారు. ధర్నాకు ఎమ్మెల్సీ బి.గోపీమూర్తి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఫ్యాప్టో చైర్మన్ విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. -
నిలదీద్దాం.. నిలబడదాం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి పాలకొల్లు సెంట్రల్: ఎన్నికల సమయంలో హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం స్థానిక లయన్స్ క మ్యూనిటీ హాలులో వైఎస్సార్సీపీ మండల కన్వీన ర్ పెన్మెత్స ఏసురాజు అధ్యక్షతన బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీపై పాలకొల్లు మండల విస్తృత స్థా యి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జి ల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ అధికారంలో ఉంటే కేసులతో భయపెట్టి పోలీసులతో పాలన చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అక్రమ కేసులు బనాయించి జైలు లో పెట్టినా ప్రజాపక్షాన పోరాటం చేసి విజయం సాధించిన గుండె వైఎస్ జగన్మోహన్రెడ్డిది అని అన్నారు. వైఎస్సార్సీపీ అంటే జగనన్న సైన్యం అని, కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు అగ్రపీఠం ఉంటుందని, ఇది జగన్ పంపించిన సందేశం అన్నారు. వంచనపై పోరాడుదాం కూటమి నాయకుల మోసపూరిత హామీలపై ఇంటింటా నిలదీయాలని ముదునూరి పిలుపునిచ్చా రు. కూటమి నేతలు సూపర్ సిక్స్ అని చెప్పి సూ పర్ ప్లాప్ చేశారన్నారు. రైతులకు రూ.20 వేలు, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 68.50 లక్షల మందికి సామాజిక పింఛన్లు ఇస్తే నేడు కూటమి ప్ర భుత్వంలో 60.50 లక్షల మందికే ఇస్తున్నారన్నారు. ఇంటింటికీ వచ్చే చౌక డిపోను దూరం చేశారని మండిపడ్డారు. ఏడాది కాలంలో ప్రజలపై రూ. 18,500 కోట్ల విద్యుత్ భారం మోపారన్నారు. ఆ రోగ్యశ్రీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. రైతుల కు రూ.6,500 కోట్ల బకాయిలు పడ్డారన్నారు. సు మారు 2.80 లక్షల మంది వలంటీర్లను తొలగించారని, వీటన్నింటిపై సీఎం చంద్రబాబుతో పాటు నియోజకవర్గంలోని మంత్రి సమాధానం చెప్పాల ని డిమాండ్ చేశారు. ఇప్పుడు కూటమి నేతలు తొలిఅడుగు అంటూ సిగ్గులేకుండా ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. తల్లికి వందనం ప్రచారం హోరెత్తిపోతుందని కానీ ఈ పథకం అందని ప్రజల ఫొటోలు కూడా వేస్తే వారి నిబద్ధత ఏపాటిదో అర్థమవుతుందని ముదునూరి అన్నారు. ఎమ్మెల్సీ కవు రు శ్రీనివాస్, ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు, నాయకులు గుణ్ణం నాగబాబు, చెల్లెం ఆనందప్రకాష్, కుమారదత్తాత్రేయ వర్మ, జెడ్పీటీసీ నడపన గోవిందరాజులు నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు వెన్నుపోటు
భీమవరం: రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రగల్భాలు పలికి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల సంక్షేమాన్ని విస్మరించింది కూటమి ప్రభుత్వం. రైతుల నుంచి కొను గోలు చేసి ధాన్యానికి సకాలంలో సొమ్ములు చెల్లించక తీవ్ర ఇక్కట్లు కలిగించిన సర్కారు.. తాజాగా అన్నదాత సుఖీభవ పథకంలో రైతుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన కూటమి నాయకులు తొలి ఏడాది (2024–25) సాయానికి ఎగనామం పెట్టారు. ఏడాది కాలంలో రైతులకు ఎలాంటి సాయం అందించని ప్రభుత్వం శనివారం అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అయితే జిల్లాలో గతంలో సాయం పొందిన రైతుల్లో 21 వేల మందిని అర్హుల జాబితా నుంచి కుదించింది. గత ప్రభుత్వంలో పక్కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏటా వ్యవసాయ సీజన్ ప్రారంభంలో వైఎస్సార్ రైతు భరోసా కింద సాయం అందించారు. 2023–24లో జిల్లాలో 1,24,645 మంది రైతులకు సాయం అందగా.. తాజాగా అన్నదాత సుఖీభవ పథకం కింద సుమా రు 1.03 లక్షల మంది అర్హులుగా కూటమి ప్ర భుత్వం నిర్ధారించింది. ఈ లెక్కన జిల్లాలో సు మారు 21 మందికి సాయం అందకుండా పోనుంది. జిల్లాలో 20 మండలాల్లో సుమారు 2.20 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. రైతుల అప్పులబాట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సార్వా, దాళ్వా సీజన్ల ప్రారంభంలో పెట్టుబడి సాయం కింద నగదు అందించేవారు. దీంతో రైతులు ఆనందంగా సాగు ప్రారంభించేవారు. అయితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకూ సాయం అందించికపోవడంతో రైతులు అప్పులబాట పడుతున్నారు. దళారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ నష్టపోతున్నారు. దీనికి తోడు దాళ్వా సీజన్లో రైతుల నుంచి ప్రభు త్వం కొనుగోలు చేసిన ధాన్యానికి నెలల తరబడి సొమ్ములు చెల్లించకపోవడంతో రోడ్డెక్కి ఆందోళన లు చేశారు. ఓ పక్క సాయం అందించకపోగా.. సేకరించిన ధాన్యానికి సకాలంలో సొమ్ములు చెల్లించలేదంటూ రైతులు మండిపడుతున్నారు. సార్వా నాట్ల ముగింపు దశలో.. జిల్లాలో రైతులు అవస్థల నడుమ ప్రస్తుత సార్వా సీ జన్‌లో నాట్లు పూర్తిచేస్తున్న తరుణంలో కేంద్ర ప్ర భుత్వం పీఎం కిసాన్ రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు కలిపి అన్నదాత సుఖీభవ పథకంలో జమచేస్తామని ప్రకటించింది. నారుమడులు, నాట్ల కోసం ఇప్పటికే అప్పులు చేశామని, సొమ్ములు అవ సరమైన సమయంలో ఇవ్వకుండా జాప్యం చేయడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు జాబితా నుంచి సుమారు 21 వేల మందిని కుదించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులకు అమలు చేయాలి అన్నదాత సుఖీభవ పథకంలో రైతుల సంఖ్య తగ్గించడం దారుణం. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చి ఏడాది గడిచిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుకు శ్రీకారం చుట్టడం రైతులకు అన్యాయం చేయడమే. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకూ అమలు చేసి వారిని ఆదుకోవాలి. – ఎం.రామాంజనేయులు, ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శికోతల కూటమి అన్నదాత సుఖీభవ పథకంలో 21 వేల మంది రైతులకు కోత గతేడాది లబ్ధికి ఎగనామం రైతులందరికీ రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇప్పుడు కేంద్రం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలని మెలిక కౌలు రైతులకు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ సాయంలో మెలిక టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్‌సిక్స్‌లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రూ.20 వేలు ఇస్తామంటూ మెలిక పెట్టారు. దీనిపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
మైన్స్ అధికారులంటూ వసూళ్లు
సాక్షి, భీమవరం : మైన్స్ అధికారులుగా చెప్పుకుంటూ జిల్లాలో వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరి వ్యక్తులపై గురువారం లారీ యూనియన్ నేతలు ఉన్నతా ధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రావూరి రాజా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మైన్స్ అధికారుల ముసుగులో ఇద్ద రు వ్యక్తులు రెండు రోజులుగా సిద్ధాంతం, పెరవలి, తణుకు, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కారులో సంచరిస్తున్నారు. లారీలను ఆపి రికార్డులు చూపించమని, కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పెనాల్టీల పేరిట వసూళ్లు చేసిన సొమ్ములకు రసీదులు కూడా ఇవ్వడం లేదు. గురువారం సిద్ధాంతం సమీపంలో లారీలను ఆపి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఏలూరులోని గనులు, భూగర్భశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు రాజా చెప్పారు. మైన్స్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు రెండు రోజులుగా అందుబాటులో లేకుండా తిరుగుతున్నారని, వారు అయి ఉండవచ్చునని అధికారులు అభిప్రాయపడినట్టు రాజా తెలిపారు. ఈ విషయమై మైన్స్ పశ్చిమగోదావరి జిల్లా ఇన్చార్జి ఏడీని ఫోన్లో సంప్రదించగా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భీమవరంలో అలంకారప్రాయంగా ఆఫీస్ భీమవరంలో గనులు, భూగర్భశాఖ జిల్లా కార్యా లయం అలంకారప్రాయంగా మిగిలింది. కార్యాలయ సూపరింటెండెంట్ లాంగ్ లీవ్‌పై వెళ్లిపోగా, సర్వేయర్ డిప్యూటేషన్‌పై ఏలూరులో పనిచేస్తు న్నారు. ఒక అసిస్టెంట్ జియాలజిస్ట్ (ఏజీ), ఒక రా యల్టీ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ), ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఏఓ), రెండు ఆఫీస్ సబార్డినేట్, చైన్‌మెన్, డ్రైవర్, స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలోని ఇసుక ర్యాంపులు సీఆర్‌జెడ్ పరిధిలోకి వెళ్లి మైనింగ్ నిలిచిపోవడంతో ఖాళీలను భర్తీ చేయడం లేదు. ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులు ఏలూరు నుంచి అప్పుడప్పుడూ వచ్చి వెళుతున్నారు. పర్యవేక్షణ కరువు జిల్లాలో మైనింగ్ లీజులు లేనప్పటికీ పట్టించుకునే వారు లేక ఆచంట, యలమంచిలి, పెనుగొండ మండలాల్లోని గోదావరి తీరంలో బొండు, ఇసుక, అలాగే నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సముద్ర తీరం వెంబడి ఇసుక, తాడేపల్లిగూడెం రూరల్‌లోని ఆరుగొలనులో గ్రావెల్ అక్రమ తవ్వకాలు సాగిపోతున్నాయి. వీటిపై ఫిర్యాదులు చేస్తే వెళ్లి పరిశీలించే పరిస్థితి ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లారీలు ఆపి వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నతాధికారులకు లారీ యూనియన్ నేతల ఫిర్యాదు -
జైళ్ల శాఖ పెట్రోల్ బంక్ ప్రారంభం
భీమవరం : పట్టణంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ సమీపంలో ఆధునికీకరించిన సబ్ జైలు, జైళ్ల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్‌లను శుక్రవారం జైళ్ల శాఖ డీజీపీ అంజన్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం సబ్ జైల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఎస్పీ అద్నాన్‌నయీం అస్మి, ఏఎస్పీ వి.భీమారావు, డీఎస్పీ ఆర్జీ జయసూర్య, వన్‌టౌన్ సీఐ ఎం.నాగరాజు ఉన్నారు. సర్పంచ్ వేధిస్తున్నారంటూ ఫిర్యాదు ఉండి: గ్రామ సర్పంచ్ తనను వేధిస్తున్నారంటూ ఉప్పులూరు గ్రామంలో ఓ మహిళ శుక్రవారం డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు వద్ద మొరపెట్టుకుంది. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఆయన వద్ద తన బాధ చెప్పుకుంది. గ్రామ సర్పంచ్, జనసేన నేత యర్రా దుర్గారావు చాలాకాలం నుంచి తనను బాధలు పెడుతున్నారని, న్యాయం చేయాలని ఆమె వేడుకుంది. దీంతో స్పందించిన డిప్యూటీ స్పీకర్ ఎస్సై ఎండీ నసీరుల్లాను పిలిచి ఆమెకు న్యాయం చేయాలని ఆదేశించారు. దీనిపై సర్పంచ్ దుర్గారావును వివరణ కోరగా ఆమె చెప్పేవన్నీ అబద్ధాలని, ఆమె ఆ రోపణల్లో నిజం లేదన్నారు. పోలీసుల విచారణలో నిజాలు తెలుస్తాయన్నారు. పక్కాగా భూ సర్వే భీమవరం(ప్రకాశంచౌక్): ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక్క సెంటు కూడా తగ్గకుండా సర్వే నిర్వహించాలని ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రభుత్వ భూముల రీ సర్వేపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని 293 గ్రామాలకు సంబంధించి 194 గ్రామాల్లో రీ సర్వే పనులను నెలాఖరుకు పూర్తిచేయాలన్నారు. మిగిలిన 72 గ్రామాల్లో ప్రభుత్వ భూములను సర్వే చేసి నిర్ధారణ చేయాలన్నారు. ఆ గ్రామాల్లో 24,474 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. డీఆ ర్వో ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా సర్వే అధికారి కె.జాషువా తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయుల నుంచి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్టు ఏలూరు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 5న సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా అవార్డుల వేడుక నిర్వహించనున్నారని, ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. పింఛన్ల పంపిణీలో వివాదం కొట్టుకున్న ‘తెలుగు’ తమ్ముళ్లు నూజివీడు: పింఛన్ల పంపిణీలో జరిగిన వాగ్వి వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యా దు చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నూజివీడు మండలం యనమదల శివారు రేగుంటలోని ఇద్దరికి స్పౌజ్ పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో వాటిని లబ్ధిదారులకు అందించేందుకు శుక్రవారం టీడీపీ గ్రామ అధ్యక్షుడు బొల్లిగొర్ల నాగరాజు, గ్రామ సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ షహీన, గ్రామంలోని పలువురు టీడీపీ నాయకులు వచ్చారు. అయితే.. అదే గ్రామానికి చెందిన టీడీపీ నా యకుడు సూదిలకుంట సుబ్రహ్మణ్యం అభ్యంతరం వ్యక్తం చేశాడు. గ్రామానికి చెందిన టీడీ పీ నాయకుడు జోషి లేకుండా పింఛన్లు ఎలా ఇస్తారని నిలదీశాడు. మంజూరైన రెండు పింఛన్లను దరఖాస్తు చేయించింది జోషినే కాబట్టి ఆయన అందుబాటులో లేనందున సాయంత్రం ఆయనొచ్చాక ఇవ్వాలని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగి బాహాబాహీకి దిగారు. ఈ ఘర్షణలో గాయపడిన సుబ్రహ్మణ్యం స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేరి.. కోమవరపు దేవదాసు, కోమవరపు సు రేంద్ర, కోమవరపు మనోజ్ తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోపక్క కోమవరపు దేవదాసు కూడా ఆస్పత్రిలో చేరి పింఛన్లను పంపిణీ చేస్తుంటే సూదిలకుంట సుబ్రహ్మణ్యం, ఆయన కుమారులు అజయ్‌బాబు, వరుణ్‌బాబు తనపై దాడి చేసి కొ ట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘ టన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. -
పెట్రోల్‌లో నీరు కలిసిందంటూ..
తణుకు అర్బన్ : ద్విచక్ర వాహనంలో పెట్రోలు పో యించుకుంటే ట్యాంకు నుంచి నీళ్లు బయటపడ్డా యంటూ బాఽధితులు పెట్రోలు బంక్ వద్ద ధర్నా చే శారు. తణుకుకు చెందిన ఫణి, శంకర్ అనే యు వకులు శుక్రవారం స్థానిక హెచ్‌పీసీఎల్‌కు చెందిన తుమ్మలపల్లి పాపారావు బంకు వద్ద తమ వాహనంలో రూ.60లు పెట్రోలు పోయించుకున్నారు. కొద్ది దూరం వెళ్లగానే వాహనం మోరాయించడంతో తిరి గి బంకులోకి వచ్చి యజమానితో మాట్లాడి వా హనం ట్యాంకులోని పెట్రోల్‌ను బయటకు తీయించగా పెట్రోల్‌తోపాటు నీరు బయటపడటంతో అ వాక్కయ్యారు. దీంతో పాతవూరుకు చెందిన యువకులు భారీ సంఖ్యలో బంకు వద్దకు చేరి నిరసన తెలిపారు. పట్టణ ఎస్సై శ్రీనివాస్ వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. వాహనంలోని పెట్రోల్ ట్యాంకు నుంచి పెట్రోల్ బయటకు తీయిస్తే సగానికి పైగా నీరు వచ్చిందని, దీనిపై అడిగితే బంకు యజమాని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితులు అన్నారు. దీంతో ఆందోళనకు దిగినట్టు యువకులు చెప్పారు. విషయం తెలిసి డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి బంకు వద్దకు వచ్చి పరీక్షలు జరిపారు. బంకులో నిల్వ ఉన్న పెట్రోల్‌లో ఎలాంటి నీటి ఆనవాళ్లు లేవని, డెన్సిటీ పరీక్షలతో పాటు సాంకేతిక పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. -
రుణాలు అందక ఇబ్బందులు
భీమవరం: రైతులకు ఎంతగానో ఉపయోగపడే వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు(సొసైటీ) పూర్తిస్థాయిలో త్రిసభ్య కమిటీలు, ప్రత్యేక అధికారులు లేకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. జిల్లాలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పూర్తి స్థాయిలో త్రిసభ్య కమిటీలను నియమించకపోగా ప్రత్యేక అధికారుల పాలన గడువు ముగిసిన సంఘాలకు అధికారులను నియమించకపోవడంతో సొసైటీలో రైతులు రుణం పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 122 సొసైటీలున్నాయి. రైతులు ఎక్కువ శాతం సొసైటీల్లో రుణాలు తీసుకుని పంటలకు పెట్టుబడులు పెడతారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీరో వడ్డీకే రైతులకు పంట రుణాలు ఇవ్వడంతో సొసైటీల ప్రాచుర్యం బాగా పెరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సొసైటీలకు నియమించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి ప్రత్యేక అధికారులను నియమించారు. కూటమి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇటీవల కేవలం 50 సొసైటీలకు మాత్రమే త్రిసభ్య కమిటీలు నియమించారు. కూటమిలో పదవులు పందేరంలో తమకు ఎక్కువ శాతం పదవులు కావాలంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పంతాలకు పోవడంతోపాటు ఆయా సొంత పార్టీ నాయకుల మధ్యనే విభేదాలు తలెత్తంతో నామినేటెడ్ పదవుల భర్తీ సందిగ్ధంగా మారింది. ముగిసిన ప్రత్యేక అధికారుల పాలన జిల్లాలో కేవలం 50 సొసైటీలకే త్రిసభ్య కమిటీల నియామకం, మిగిలిన సొసైటీల ప్రత్యేక అధికారుల పాలన జూలై 31తో ముగియడంతో పాలకవర్గాలు లేని దాదాపు 70 సొసైటీల్లోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొసైటీల్లో రుణాలు ఇవ్వాలంటే రుణం పొందే రైతుల జాబితాపై సంఘం చైర్మన్‌గాని ప్రత్యేక అధికారి సంతకం తప్పనిసరి. ప్రత్యేక అధికారుల పాలన గడువు ముగిసినా ప్రభుత్వం పొడిగించకపోవడంతో రైతులు రుణాలు ఎలా పొందాలో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సార్వా సీజన్ ప్రారంభం కావడంతో రైతులకు రుణాలు ఎంతో అవసరం. ఇలాంటి సమయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో కమిటీలను నియమించకపోవడం రైతులు పూర్తి స్థాయిలో రుణాలు పొందే అవకాశం లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీల్లో పూర్తి స్థాయిలో లేని త్రిసభ్య కమిటీలు ఇంత వరకు 50 సొసైటీలకే త్రిసభ్య కమిటీల నియామకం -
వర్షాకాలంలో పాముకాటుతో జాగ్రత్త
బుట్టాయగూడెం: వర్షాకాలంలో గ్రామాల్లో ఎక్కువగా ఖాళీ స్థలాలు, బీడు భూముల్లో పచ్చని గడ్డి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. పశువులు బీడు భూములు, ఇంటి వద్ద ఖాళీ స్థలాల్లో మేతకు వెళ్ళినప్పుడు పశువుల పాక చుట్టూ ఉన్న ఖాళీ స్థలాల్లో గడ్డి ఎక్కువగా పెరుగుతుంది. ఈ సమయంలో వర్షాల కారణంగా పచ్చని గడ్డిలో విషసర్పాలు ఉండి పశువులను కాటు వేసే ప్రమాదం ఉంది. పాడి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జీలుగుమిల్లి పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు డాక్టర్ మల్లంపల్లి సాయిబుచ్చారావు సూచించారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాముకాటు నుంచి పశువులను కాపాడుకోవచ్చన్నారు. రక్తపింజర పశవులను రక్తపింజర కాటువేస్తే హీమోటాక్సిన్ విడుదలై రక్త ప్రసరణపై ప్రభావం చూపుతుంది. దీంతో పశువు నోరు, ముక్కు నుంచి రక్తం కారుతుంది. పాము కాటు వేసినచోట వాపు వచ్చి చర్మం రంగు మారుతుంది. మూత్రం ఎరుపురంగులోకి వస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే 10 గంటలలోపు పశువులు మృత్యువాత పడతాయి. తాచు, కట్ల పాములు తాచు, కట్లపాములు పశువులను కాటు వేసినప్పుడు న్యూరోటాక్సిన్ వాటి శరీరంలోకి వెళ్ళి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీనితో శ్వాస వ్యవస్థ స్థంభిస్తుంది. నోటి నుంచి నురగ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్తాయి. సరైన సమయంలో చికిత్స అందించకపోతే పశువు మృతి చెందుతుంది. విషరహిత పాముల్లో కాటు లక్షణాలు విషరహిత పాములు కాటు వేసినప్పుడు రెండు వరుస పళ్లు ముద్రలు ఉంటాయి. గాయాలు చిన్నగా ఉంటాయి. ఎక్కువగా పలుచని రేఖల వంటి ముద్రలుగా ఉంటాయి. కొద్దిగా రక్తం కారవచ్చు. కానీ ఇది ప్రమాదమైన స్థాయిలో ఉండదు. విషపూరిత పాము లక్షణాలు విషపూరిత జాతి పాములు కాటు వేసిన చోట ఉబ్బినట్టు, గాయంలా కనిపిస్తుంది. పశువు తినకుండా నీరసంగా ఉంటుంది. అదుపు తప్పడం(పిచ్చెక్కినట్టుగా అటూ ఇటూ తిరగడం), నోట్లో నురగరావడం, వేగంగా గుండె చప్పుడు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది, పొట్ట ఉబ్బడం, కింద పడి కాళ్లు కొట్టుకోవడం వంటివి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో 3 నుంచి 5 గంటల్లోపు కాటుకు గురైన పశువులు మృతి చెందుతాయి. వైద్యుల సూచనలు ● పాముకాటుకు గురైన పశువులను బయటకు పంపించవద్దు. ఎక్కువగా నడిపించకూడదు. కదలకుండా ఉండాలి. ● కాటు వేసిన ప్రాంతానికి పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి. ఇది పాము విషాన్ని నరాల ద్వారా వ్యాప్తి చెందకుండా ఉపయోగపడుతుంది. 15 నిముషాలకు ఒకసారి నిమిషం పాటు విరమించాలి. లేదంటే నరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ● కాటు వేసిన చోట కడగవద్దు. కట్టు తియ్యొద్దు. ఇలా చేస్తే విషం వ్యాప్తి పెరుగుతుంది. ● పశువులను బాగా గాలి తగిలేటట్టు నీడలో ఉంచాలి. ● వెంటనే పశు వైద్యుడిని సంప్రదించి చికిత్స అందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి పశువులను కాపాడుకోవచ్చు. సకాలంలో చికిత్స అందించాలి పశువులను మేతకు తీసుకువెళ్ళినప్పుడు తరచూ గమనించాలి. పాము కాటు వేస్తే కరిచిన చోట గుడ్డతో గట్టిగా కట్టాలి. బ్లేడుతో కోసి రక్తం పిండాలి. 15 నిముషాలకు ఒకసారి కట్టును వదులు చేస్తూ ఉండాలి. స్నేక్ యాంటీ వీనమ్ ఇంజెక్షన్, ఆట్రోసిన్ సల్ఫేట్, ఏవిల్ ఇంజక్షన్‌ను పశువు రక్తంలోకి ఎక్కించాలి. నొప్పి నివారణకు స్టైరాయిడ్, యాంటీ బయోటిక్స్, అవసరాన్ని బట్టి ఇతర మందులను ఇవ్వాలి. డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు, పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు, జీలుగుమిల్లి -
ఆలస్యమైతే వెదజల్లే పద్ధతే మేలు
చింతలపూడి: ఇటీవల వరి సాగులో ఖర్చులు బాగా పెరిగాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా ఏటా సకాలంలో వరినాట్లు పడటం లేదు. పోసిన నారు ముదిరిపోవడం, లేదా నారు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాగు ఖర్చును తగ్గించుకుని, కూలీల సమస్యను అధిగమించేందుకు దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తే పద్ధతిని ఆచరించడం మేలని చింతలపూడి సహాయ వ్యవసాయ సంచాలకుడు వై సుబ్బారావు సూచిస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గ పరిధిలో 18,384 హెక్టార్లల్లో వరి సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో చింతలపూడి మండలంలో అత్యధికంగా 7,603 హెక్టార్లు, లింగపాలెం మండలంలో 3,072 హెక్టార్లు, కామవరపుకోట మండలంలో 2,457 హెక్టార్లు, జంగారెడ్డిగూడెం మండలంలో 5,252 హెక్టారుల్లో వరి పంటను సాగు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 50 శాతం నాట్లు మాత్రమే పూర్తయ్యాయి. రైతుకు లాభం దమ్ము చేసిన పొలంలో నేరుగా వరి విత్తడం వల్ల నారు పోయడం, నారు తీత, నాట్లు వేసే పని ఉండదు. ఈ విధానం వల్ల ఎకరాకు రైతులకు సుమారు రూ.3,500 రూపాయల ఖర్చు తగ్గుతుంది. ఎకరాకు 15–20 కిలోల విత్తనం ఆదా అవుతుంది. మొక్కల మధ్య సాంద్రత ఉండటంతో ఎకరాకు 15 శాతం దిగుబడి పెరుగుతుంది. ఎక్కువ విస్తీర్ణంలో నాటుకోవడం మాత్రమేకాక , వారం పది రోజుల ముందుగానే పంట కోతకు వస్తుంది. సాగులో మెలకువలు సాధారణంగా అన్ని రకాల నేలల్లో దమ్ము చేసి వరివిత్తే పద్ధతిని అవలంభించవచ్చు. చౌడు, ఆమ్ల, క్షార నేలలు మాత్రం ఈ విధానానికి అనుకూలం కావు. రకాన్ని బట్టి ఎకరాకు 10 నుండి 15 కిలోల విత్తనం అవసరం అవుతుంది. వరిసాగు ఆలస్యమయ్యే పరిస్ధితుల్లో స్వల్పకాలిక వరి విత్తనాలను ఎంచుకోవడం మేలు. విత్తనాలను 24 గంటలు నానబెట్టి, మరో 24 గంటలు మండెకట్టి దమ్ము చేసిన పొలంలో వెదజల్లడం కాని, డ్రమ్ము సీడర్‌తో కాని విత్తుకోవాలి. డ్రమ్ సీడర్‌తో డ్రమ్ సీడర్‌తో లాగితే ఒకేసారి 8 వరుసల్లో విత్తనాలు పడతాయి. సాళ్ళ మధ్య 20 సెం.మీ, మొక్కల మధ్య 5–8 సెం.మీ ఎడంగా గింజలు పడతాయి. ప్రతి 16 వరసలకు ఒక అడుగు కాలిబాట వదలాలి. ఇద్దరు కూలీలు రెండు గంటల్లో ఎకరా విత్తనాలను విత్తవచ్చు. ఎరువుల వాడకం సాధారణ వరికి సిఫార్సు చేసిన విధంగానే దీనికి కూడ ఎరువుల వాడకం చేపట్టాలి. దమ్ములో మాత్రం నత్రజని ఎరువులు వేయకూడదు. వేస్తే కలుపు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ. భాస్వరం, అర వంతు పొటాష్‌ను దమ్ములో వేసుకోవాలి. నత్రజని ఎరువులను 3 భాగాలుగా చేసుకుని విత్తిన 15–20, 40–45, 60–65 రోజులకు వేయాలి. మిగిలిన సగభాగం పొటాష్ 60–65 రోజులకు నత్రజనితో పాటు వేసుకోవచ్చు. నీటి వాడకం విత్తిన దగ్గర నుండి పొట్ట దశ వచ్చే వరకు బురదగా ఉంచి పొట్టదశ నుంచి పంట కోత పది రోజుల ముందు వరకు పొలంలో 2 సెంమీ నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల వేరు వ్యవస్ధ బాగా బలపడి పిలకలు బాగా వస్తాయి. కలుపు నివారణ కలుపు నివారణకు ఎకరాకు 35 గ్రాముల ఆక్సా డయార్జిల్ లేదా 400 మిల్లీ.లీ ప్రిటిక్లాక్లోర్ లేదా 100 గ్రా పైరజో సల్ఫ్యూరాన్ మందును 20 కిలోల పొడి ఇసుకతో కలిపి విత్తిన 3–5 రోజుల మధ్య పొలంలో పలుచగా నీరుంచి చల్లాలి. విత్తిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య అధికంగా ఉంటే ఎకరాకు 80–100 మి.లీ బిస్‌ఫైరిబాక్ సోడియం, ఊద ఎక్కువగా ఉంటే 300–400 మి.లీ సైహలోఫాప్ బ్యూలైట్ను, వెడల్పాటి ఆకు ఎక్కువగా ఉంటే 4డి సోడియం లవణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వై.సుబ్బారావు, చింతలపూడి సహాయ వ్యవసాయ సంచాలకులు -
ఎస్సీ వర్గీకరణపై మండిపాటు
భీమవరం: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ భీమవరం అంబేడ్కర్ సెంటర్లో శుక్రవారం మాల సంఘాల జేఏసీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాలలు అన్ని రంగాల్లో అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. జాతీయ కన్వీనర్ చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ మాలలకు వ్యతిరేకంగా పనిచేసే రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. మాల సంఘాల జేఏసీ కన్వీనర్ గంటా సుందరకుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 3న కుప్పం నుంచి మాల సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, దీనిని మాల సంఘాల నాయకులు, సభ్యులు విజయవంతం చేయాలని కో రారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గుండె నగేష్, సోడదాసి జయపాల్, కొండేటి లాజర్, వర్ధనపు మోషే, పెట్టెం శుభాకర్, కర్ని జోగయ్య, ఉన్నమట్ల శామ్యూల్‌రాజ్, పరువు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
గ్రావెల్ అక్రమ తవ్వకాలు ఆగేనా?
ద్వారకాతిరుమల: మండలంలోని పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై అక్రమ గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేందుకు కాలువ ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం కాలువ గట్టుపై నుంచి గ్రామంలోకి వెళ్లే పలు మార్గాల్లో ట్రంచ్ (రోడ్డుకు అడ్డంగా) తవ్వకాలు జరిపారు. వివరాల్లోకి వెళితే. కొందరు టీడీపీ నాయకులు కాలువ గట్టును ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. రాత్రి వేళల్లో దొంగతనంగా గ్రావెల్ తవ్వకాలను జరిపి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో నాయకుడు ఈ మట్టిని అమ్ముకోవడం ద్వారా నెలకు రూ. 3 లక్షల వరకు కూడబెడుతున్నట్టు సమాచారం. అయితే ఈ పచ్చ ముఠా గట్టుపై ఉన్న మట్టిని కాకుండా, ఏకంగా భూమిని తవ్వి గ్రావెల్‌ను అమ్మేస్తున్నారు. దాంతో కాలువ గట్టుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడి, అగాధాలను తలపిస్తున్నాయి. అవి ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం సంబంధిత శాఖల అధికారులకు ప్రహసనంగా మారింది. దొంగ దారుల్లో ట్రంచ్‌లు.. మట్టి దొంగలు అధికార పార్టీకి చెందినవారు కావడంతో కొందరు అధికారులు చూసిచూడనట్టు వదిలేస్తున్నారు. దాంతో వారి మట్టి దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రాత్రి అయితే చాలు.. జేసీబీలతో కాలువ గట్టుపైకి చేరి, తవ్వకాలు జరిపేస్తున్నారు. వీరి తవ్వకాలు ప్రమాదకర స్థాయికి చేరడంతో కాలువ ఇరిగేషన్ అధికారులు అక్రమ గ్రావెల్ తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రవాణా చేస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను పట్టుకునేందుకు కాలువ గట్టు చివరన కాపలా కాస్తున్నారు. అయితే తెలివిమీరిన మట్టి దొంగలు పలు దొంగ మార్గాల గుండా మట్టిని తరలించేస్తున్నారు. దాంతో కాపలా కాసినా ప్రయోజనం లేదని భావించిన అధికారులు ట్రంచ్ తవ్వకాలను చేపట్టారు. గట్టుపై నుంచి గ్రామంలోకి అక్రమ మట్టి రవాణా జరుగుతున్న పలు మార్గాలను గుర్తించి, పీఐపీఆర్‌ఎంసీ జేఈ దూర్జటి పర్యవేక్షణలో ట్రంచ్ లను తవ్వారు. ఫలితం ఉంటుందా? ట్రంచ్‌లు తవ్వడం వల్ల ఫలితం ఉంటుందా అంటే.. గ్రామస్తులు కొందరు ఉండదనే అంటున్నారు. మట్టినే ఆదాయ వనరుగా ఎంచుకున్న ముఠాకు ట్రంచ్‌లు ఒక లెక్క కాదని చెబుతున్నారు. ట్రంచ్‌లను పూడ్చి, అక్రమ రవాణాను సాగించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు. అయితే అధికారుల ప్రయత్నం ఏమేరకు ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సి ఉంది. అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తున్న ఇరిగేషన్ అధికారులు పలు మార్గాల్లో ట్రంచ్‌ల తవ్వకాలు -
గ్రంథాలయ ఉద్యోగుల జీతాలు చెల్లించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాష్ట్రంలో గ్రంథాలయ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించేలా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం ఎన్నిక నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా జీ. రాంబాబు, అసోసియేట్ అధ్యక్షుడిగా పీ రంగారావు, ఉపాధ్యక్షులుగా ఎస్.వెంకటేశ్వరరావు, ఎస్డీ.లతీఫ్, ప్రధాన కార్యదర్శిగా ఎండీ జుల్ఫికర్ అలీ, సహాయ కార్యదర్శిగా కొండే వెంకటేశులు, జిల్లా కోశాధికారి ఎన్సీహెచ్ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా ఎం.శోభ, జీ అనిత, బంగారు పాప ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు, జేఏసీ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్.హరనాథ్, ఏపీ ఎన్జీఓ ఏలూరు తాలూకా అధ్యక్షుడు జీ శ్రీధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
మావుళ్లమ్మను దర్శించుకున్న క్రికెటర్ నితీష్ కుమార్
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రముఖ ఇలవేల్పు మావుళ్ళమ్మ వారిని ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఈ నెల 8 నుంచి జరగనున్న ఆంధ్రా ప్రీమియం లీగ్ టీం లో భీమవరం బుల్స్ టీంకు నితీష్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీల్లో విజయం సాధించాలని శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు తణుకు అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు ఈనెల 3న తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. అండర్ 14, 16, 18, 20 బాలుర, బాలికల విభాగాల్లో నిర్వహించనున్నామని, ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9 నుంచి 11 వరకు బాపట్ల జిల్లా చీరాలలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారని వివరించారు. ఎంపికకు హాజరయ్యే క్రీడాకారులు తమ పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఆధార్ కార్డుతో ఉదయం 8 గంటలకు తణుకు క్రీడా ప్రాంగణంలో రిపోర్ట్ చేయాలని, ఇతర వివరాలకు 9989363978 నంబరులో సంప్రదించాలని కోరారు. చెరువులో పడి వ్యక్తి మృతి మండవల్లి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని భైరవపట్నంలో జరిగింది. గ్రామానికి చెందిన పండు జోజి పెద్ద కుమారుడు తరుణ్ అలియాస్ చందు (23) 31న ఒంటి గంట సమయంలో బయటకు వెళ్ళి తిరిగి రాలేదు. శుక్రవారం ఇంటి పక్కనే ఉన్న చేపల చెరువులో జారిపడి మృతిచెందాడు. పోలీసు సిబ్బంది కేసు నమోదు చేశారు. రోడ్ల ఆక్రమణలపై చర్యలు కొయ్యలగూడెం: పరింపూడి పంచాయతీ అంతర్గత రోడ్ల ఆక్రమణలపై చర్యలు తీసుకోనున్నట్లు కార్యదర్శి కే.సురేష్ పేర్కొన్నారు. శుక్రవారం పంచాయితీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు. జూలై 29 సాక్షిలో ప్రచురితమైన అంతర్గత రోడ్ల ఆక్రమణ విషయంపై ప్రజలతో మాట్లాడుతూ స్వమిత్వ కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదు చేసుకోవచ్చనని సూచించారు. సాక్షిలో వచ్చిన కథనంపై విచారణ చేసి ఆక్రమణలను గుర్తించామని వారికి నోటీసులు జారీ చేశామన్నారు. ఈ సందర్భంగా స్వమిత్వ ద్వారా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
ఆకివీడు: వైఎస్సార్సీపీ రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీగా కమతం మహేష్‌ను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు సూచనల మేరకు నియామకం జరిగినట్లు మహేష్ తెలిపారు. ● ఉంగుటూరు: వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎ.గోకవరానికి చెందిన మిద్దే వెంకటేశ్వరరావును నియమించారు. పార్టీ అధినేత జగన్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ● చింతలపూడి: బీసీ విభాగం ఏలూరు జిల్లా కార్యదర్శిగా చింతలపూడి మండలం, రేచర్ల గ్రామానికి చెందిన పెరుగొండ్ర శివరామకృష్ణను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ● పెనుగొండ: వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఆచంట నియోజకవర్గం మార్టేరుకు చెందిన మండ విశ్వనాథ నారాయణ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ● దెందులూరు: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా దెందులూరు నియోజవర్గం నుంచి చల్లారి హేమంత్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నియామక ఆదేశాలు జారీ చేశారు. ● బుట్టాయగూడెం: వైఎస్సార్సీపీ అనుబంధ విభాగం రాష్ట్ర కమిటీ ప్రచార వింగ్ కార్యదర్శిగా పోలవరం నియోజకవర్గం నుంచి కొయ్యలగూడెంకు చెందిన తమిర్చి బ్రహ్మయ్యను నియమిస్తూ శుక్రవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ● చింతలపూడి: చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెంకు చెందిన త్సల్లాబత్తుల శ్రీనివాసరావును వైఎస్సార్సీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
కూటమి మోసాలను ఎండగడదాం
భీమవరం అర్బన్: ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి తీరా గద్దెనెక్కిన తర్వాత మొహం చాటేస్తున్న చంద్రబాబు వంచన పాలనను తిప్పికొడదామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొత్తపూసలమర్రులో పార్టీ మండల అధ్యక్షుడు జల్లా కొండయ్య అధ్యక్షతన బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రసాదరాజు మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటేసిన ప్రతిసారీ ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారని, సూపర్‌సిక్స్ అంటూ మ రోసారి బాబు మోసం చేశాడని మండిపడ్డారు. సంపద సృష్టిస్తానని చెప్పి ఏడాది పాలనలో రూ.1.60 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో వలంటీర్లు, ఎండీఎం డ్రైవర్లు, మద్యం షాపుల్లో సిబ్బంది ఇలా సుమారు 3 లక్షల మంది ఉద్యోగాలు పీకేశారన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామని మోసం చేశారన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 8.58 లక్షల పింఛన్లను రద్దు చేసిందని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి, రైతులకు అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేయలేదన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ అందకుండా రూ.4,500 కోట్ల బకాయిలు పెట్టారన్నారు. ఇంటింటా నిలదీత నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్‌లు సంతకాలు పెట్టి బాండ్ పేపర్లు ఇచ్చారని, వీటిపై కూటమి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని, జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో వందల కోట్లు వృథా ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు ధాన్యం సొమ్ములు జమచేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్నారు. యోగాంధ్ర, పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరుతో వందల కోట్లు ఖర్చు పెట్టారని దుయ్యబట్టారు. భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ గ్రామస్థాయి వరకూ పార్టీని పటిష్టం చేస్తున్నారని, పార్టీలో కష్టపడే వారికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. చంద్రబాబు మోసపూరిత పాలనను ఇంటింటా వివరించాలన్నారు. మాజీ సీఎం జగన్ పర్యటనలతో కూటమి నాయకులు ఉలిక్కి పడుతున్నారని, అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారన్నారు. ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు, జిల్లా సోషల్ మీడియా విభాగ అధ్యక్షుడు బందన పూర్ణచంద్రరావు, జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి, జిల్లా యూత్ విభాగ అధ్యక్షుడు చిగరుపాటి సందీప్, నాయకులు మేడిది జాన్సన్, ఏఎస్ రాజు, కామన నాగేశ్వరరావు, పట్టణ కన్వీనర్ గాదిరాజు రామరాజు, ఎంపీటీసీ తిరుమాని తులసీరావు, వైస్ ఎంపీపీ తిరుమాని ధనంజయరాజు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి -
మద్యం మత్తులో ఏటీఎం ధ్వంసం
ఆకివీడు: స్థానిక గుమ్ములూరు సెంటర్లో పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఎస్ బీఐ ఏటీఎంను మద్యం మత్తులో ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో తాగిన మైకంలో ఏటీఎం గది అద్దాలను గుద్దుకుంటూ లోనికి వెళ్లాడు. గురువారం ఉదయం ఏటీఎం నగదు డ్రా చేసే కింది భాగంలో డోర్ తెరిచి ఉంది. దీంతో రూరల్ సీఐ జగదీశ్వరరావు సంఘటనా స్థలాన్ని, సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. ఏటీఎంలో డబ్బు భద్రంగా ఉందని తెలిపారు.క్లోరినేషన్ చేసి నీరు సరఫరాఆకివీడు: మండలంలోని అప్పారావుపేట గ్రామంలో క్లోరినేషన్ చేసి తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నామని గ్రా మ కార్యదర్శి బి.సతీష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘సమస్యల వలయంలో అప్పారావుపేట’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి ఆయన స్పందించారు. ప్రతినెలా రక్షిత మంచినీటి పథకాన్ని శుభ్రం చేయిస్తున్నామన్నారు. అప్పారావుపేట–గుమ్ములూరు రోడ్డు కు నాబార్డు (ఆర్ఐడీఎఫ్) నిధులు మంజూరు అయ్యాయని పనులు జరగాల్సి ఉందన్నారు. 2.50 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.1.60 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఉపాధి హామీ నిధులతో డ్రెయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల గడువు పెంపుభీమవరం: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 11 వరకు గడువు పొడిగించినట్టు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి జి.ప్రభాకరరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో గతేడాది 1,410 మంది చేరగా ఈ ఏడాదిలో 1,618 మంది ప్రవేశాలు పొందారన్నారు. ప్రభుత్వం ఇంటర్మీడియె ట్ విద్యార్థులకు తల్లికి వందనం, టెస్ట్, నోట్‌బు క్స్, మధ్యాహ్నం భోజన పథకంతోపాటు విద్యార్థులకు పోషకాహారం కోసం చిక్కీలు, రాగి జావ అందిస్తున్నట్టు చెప్పారు.ఉపాధ్యాయులకు అన్యాయంఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యారంగంలో ప్రభు త్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలతో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ గుగులోతు కృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చేరిన ఉపాధ్యాయులకు మాత్రమే ఎంఈఓ, డీవైఈఓలుగా బాధ్యతలు అప్పగిస్తామని అధికారులు ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ యాజమాన్యాల్లో పనిచేసే ఉపాధ్యాయులపై ప్రభుత్వ ఉపాధ్యాయుల పెత్త నం ఏంటని ప్రశ్నించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు సంబంధించి 72, 73, 74 జీఓల అమలులో పక్షపాత వైఖరి సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుని ఉమ్మడి సీనియార్టీ ద్వారా మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయా లని డిమాండ్ చేశారు.రిజిస్ట్రేషన్ ఆదాయంలో ఫస్ట్నూజివీడు: ఏలూరు జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా రూ.548.80 కోట్ల రెవెన్యూతో రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయాన్ని సాధించినట్టు ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కొమ్మి నేని శ్రీనివాసరావు తెలిపారు. గురువారం నూ జివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 80 శాతం వృద్ధి సాధించిందన్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణల్లో భాగంగా కార్డ్ ప్రైమ్ 2.0 విధానంలో రిజిస్ట్రేషన్ జరిగిన రోజే డాక్యుమెంట్‌ను యజమానికి అందిస్తున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి రిజిస్టర్ డాక్యుమెంట్ కాపీని యజమానికి వా ట్సాప్ ద్వారా అందిస్తామన్నారు. ఏలూరు కా ర్పొరేషన్ పరిధిలో కార్డ్ ప్రైమ్ 2.0ను మున్సి పల్ పరిపాలన విభాగంతో అనుసంధానం చే సి, అర్బన్ పరిధిలో ఉన్న ఆస్తులను మ్యూటేష న్ చేసి యజమాని మార్పిడి జరుగుతుంద న్నారు. ఏలూరు, వట్లూరు సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయాల్లో ప్రారంభిస్తామన్నారు. -
విద్యుత్ సంస్థలో పదోన్నతులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని పలువురు సీనియర్ అసిస్టెంట్లకు జూనియర్ అక్కౌంట్స్ అధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ ఎస్ఈ పి.సాల్మన్ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. పాలకొల్లు ఈఆర్‌ఓలోని ఎల్‌బీవీ సాంబశివరావును భీమవరానికి పదోన్నతిపై బదిలీ చేశారు. ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని వై.శ్రీనివాసరావును ఏలూరు సర్కిల్ కార్యాలయంలో ఎల్టీ విభాగానికి బదిలీ చేశారు. భీమవరం ఈఆర్‌ఓలోని పీఆర్‌కేవీ ప్రసాద్‌ను నరసాపురం డివిజన్ అక్కౌంట్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఏలూరు కనస్ట్రక్షన్స్ విభాగంలోని వి.రాజశేఖర్‌ను ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని సీఏఎస్ విభాగానికి బదిలీ చేశారు. తణుకు డీ1లోని కె.రవీంద్రనాథ్ను తాడేపల్లిగూడెం అక్కౌంట్స్ డివిజన్ కార్యాలయానికి, భీమవరం డివిజన్ కార్యాలయంలోని జి.రామకృష్ణ రాజును భీమవరం సర్కిల్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఏలూరు సర్కిల్ కార్యాలయంలోని కేవీఆర్‌జీ కృష్ణమూర్తిని అదే కార్యాలయానికి, నరసాపురం డివిజన్ కార్యాలయంలోని ఎస్డీ ఆశీర్వాదంను అదే కార్యాలయంలో ఏడీఎం విభాగానికి, ఏలూరు ఈఆర్‌ఓలోని ఎస్.వెంకటేశ్వరరావును ఏలూరు డివిజన్ కార్యాలయానికి, పెరవలి సెక్షన్ కార్యాలయంలోని ఎ.శ్రీనివాసరావును జంగారెడ్డిగూడెం అక్కౌంట్స్ కార్యాలయానికి బదిలీ చేశారు. నిడదవోలు ఈఆర్‌ఓలోని ఎండీ అబ్దుల్ అలీంను నిడదవోలు డివిజన్ కార్యాలయానికి, ఉండ్రాజవరం సెక్షన్ కార్యాలయంలోని కేవీపీ విజయకుమార్‌ను జంగారెడ్డిగూడెం ఈఆర్ఓకు, తంగెళ్లమూడి ఈఆర్‌ఓలోని కె.పద్మజను అదే కార్యాలయానికి జూనియర్ అక్కౌంట్స్ అధికారిగా పదోన్నతి కల్పించారు. అలాగే తణుకు ఈఆర్‌ఓలోని కె.బాలకృష్ణకు జూనియర్ అక్కౌంట్స్ అధికారిగా పదోన్నతి కల్పిస్తూ తాడేపల్లిగూడెం డివిజన్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం ఆయన్ను భీమవరం ఈఆర్ఓకు బదిలీ చేశారు. -
2న ఉపాధ్యాయుల ధర్నా
భీమవరం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం శనివారం భీమవరంలో కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాను జయప్రదం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ పెన్మెత్స విజయరామరాజు, జనరల్ సెక్రటరీ జి.ప్రకాశం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ధర్నా సన్నాహక సమావేశంలో మాట్లాడారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి, కారుణ్య నియామకాలు, సీపీఎస్ రద్దు, యాప్స్ భారం తగ్గించాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, పెండింగ్ బకాయిలతోపాటు పలు సమస్యలను పరిష్కరించాలనిఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా యూనిట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ధర్నాలో జిల్లాలోని ఉపాధ్యాయులంతా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫ్యాప్టో కో–చైర్మన్ పెన్మెత్స ఆర్వీఎస్ సాయివర్మ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ రమణారావు, కో–చైర్మన్ శ్రీనివాస్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పీ4పై సమీక్ష భీమవరం (ప్రకాశంచౌక్) : పీ4 కార్యక్రమంలో మార్గదర్శకులు స్వచ్ఛందంగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ కలెక్టర్లకు సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించగా భీమవరం కలెక్టరేట్ నుంచి ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధికారులు హాజరయ్యారు. -
అంగన్వాడీ.. సమస్యల ఒడి
సాక్షి, భీమవరం: ఆటపాటలతో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే అంగన్వాడీ కేంద్రాలు కూటమి సర్కారు నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆట పరికరాల సరఫరా లేక పిల్లలు పాడైపోయిన బొమ్మలతోనే ఆడుకోవాల్సిన దుస్థితి. సన్నబియ్యం రాక ముతక బియ్యాన్ని పంపిణీ చేయాల్సి వస్తోందని అంగన్వాడీ వర్కర్లు చెబుతున్నారు. 1,556 కేంద్రాలు.. 70 మినీ కేంద్రాలు జిల్లాలో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొత్తం 1,626 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఆయాలతో నడిచే మినీ కేంద్రాలు 70 ఉండగా, వర్కర్, ఆయాలతో నిర్వహించే కేంద్రాలు 1,556 ఉన్నాయి. వీటి పరిధిలో 7,936 మంది గర్భిణులు, 5,686 మంది బాలింతలు, ఏడు నెలల వయసు నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 40,706 మంది, మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు బాలలు 17,687 మంది ఉన్నారు. ముతక బియ్యమే సరఫరా గర్భిణులు, బాలింతలకు నెలకు మూడు కిలోల చొప్పున బియ్యం, కిలో కందిపప్పు, అర లీటరు ఆయిల్ ప్యాకెట్, ఐదు లీటర్ల పాలు, 25 గుడ్లు, కిలో అటుకులు, రెండు కిలో రాగి పిండి, పావు కిలో డ్రైఫ్రూట్స్ తదితర వాటిని అందజేయాలి. గర్భిణులు, బాలింతలకు పోర్టిఫైడ్ బియ్యం సరఫరాను గత వైఎస్సార్‌సీపీప్రభుత్వంలోనే ప్రారంభించారు. అలాగే చిన్నారులకు సోమవారం నుంచి శనివారం వరకు రోజూ అంగన్వాడీ కేంద్రాల వద్దనే ఆహారాన్ని అందించాలి. మెనూ ప్రకారం సోమ, బుధ, గురు, శుక్రవారాల్లో అన్నం, కూరలతో భోజనం, మంగళవారం పులిహోరా, శనివారం వెజిటబుల్ రైస్ వడ్డించాలి. హాస్టళ్లు, పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం పంపిణీ ప్రారంభించినట్టు చెబుతున్న కూటమి ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం రేషన్ డిపోల్లో అందజేసే బియ్యాన్నే సరఫరా చేస్తుండటం గమనార్హం. అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్టు సివిల్ సప్లయీస్ అధికారులు చెబుతుండగా తమకు రేషన్ బియ్యమే వస్తున్నాయని వర్కర్లు చెబుతున్నారు. చిన్నారులకు ఆటపరికరాలతో పాటు సన్నబియ్యం సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో.. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దపీట వేసింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా కేంద్రాల్లో వసతుల కల్పన, నూ తన భవనాల నిర్మాణం, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు తదితర వసతులు కల్పించింది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రా ధాన్యమిస్తూ పౌష్టికాహారం మెనూలోనూ మార్పులు చేసింది. చిన్నారుల వికాసానికి క్రమం తప్పకుండా ఆటపరికరాలు సరఫరా చేస్తూ వచ్చింది. పాడైపోయిన బొమ్మలే దిక్కు చిన్నారుల శారీరక, మానసిక, సామాజిక వికాసానికి, చదువుపై ఆసక్తి పెంపొందించేందుకు ఆటపరికరాలు దోహదపడతాయి. వారు ఆరోగ్యంగా ఎదగేందుకు సాయపడతాయి. పిల్లల ఊహాశక్తిని, సృజనాత్మకతను పెంచే బొమ్మలు, ఆట వస్తువులు, రంగురంగుల బ్లాక్‌లు, పజిల్స్, లెక్కలు నేర్చుకునేందుకు సంబంధించిన వస్తువులు, పిల్లలు కలిసి ఆడుకోవడానికి, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండటానికి ఉపయోగపడే ఆట వస్తువులు తదితర వాటితో కూడిన ఆట పరికరాల కిట్లను ప్రభుత్వం సరఫరా చేసేది. గతంలో రెగ్యులర్‌గా వచ్చేవని రెండేళ్లుగా ఆట పరికరాల కిట్లు సరఫరా నిలిచిపోయినట్టు అంగన్వాడీ వర్కర్లు చెబుతున్నారు. కొత్తవి రాకపోవడంతో గత ప్రభుత్వంలో అందజేసిన ప్లాస్టిక్ బొమ్మలు, పరికరాలతోనే ప్రస్తుతం చిన్నారులు ఆడుకుంటున్నారు. వీటిలో చాలా వరకు పాడైపోయి విరిగిపోయాయి. కొన్ని సెంటర్లలో ఈ బొమ్మలు సైతం లేని పరిస్థితి ఉంది. కాగా ఆట పరికరాల కోసం ప్రతిపాదనలు పంపామని, కిట్లు రావాల్సి ఉందని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు. ఆట బొమ్మలకూ దిక్కులేదు అంగన్వాడీ కేంద్రాలకు ఆట పరికరాలు సరఫరా చేయని కూటమి సర్కారు పాడైపోయిన వాటితోనే పిల్లలకు ఆటలు సన్నబియ్యం రాక చౌక బియ్యమే పంపిణీ జిల్లాలో 1,626 అంగన్వాడీ కేంద్రాలు ఐదేళ్లలోపు చిన్నారులు 58,393 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అంగన్వాడీలకు పెద్దపీట -
గీత రాత మారేనా?
గత ప్రభుత్వంలో ఆపన్న హస్తం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గీత కార్మికులకు ఆపన్న హస్తం అందించింది. నాటి సీఎం వైఎస్ జగన్ నూతన ఎకై ్సజ్ పాలసీ తీసుకువచ్చారు. గీత పన్ను రద్దు చేశారు. కల్లు గీత కార్మిక సొసైటీలు, గీత గీచే వారికి చెట్టు పథకం అమలు చేశారు. కల్లు తీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం పొందితే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పించి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపించారు. వైఎస్సార్ బీమా పథకం ద్వారా నష్టపరిహారం చెల్లించారు. ప్రమాదాల్లో మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. ఎన్ఈఆర్జీఎస్, షెల్టర్ బెడ్ అభివృద్ధి పథకాల ద్వారా తాటి, ఈత వంటి చెట్లు పెంచేలా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లు సమృద్ధిగా పెరిగేలా చర్యలు తీసుకున్నారని గీత కార్మికులు గుర్తుచేసుకుంటున్నారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కల్లు గీత కార్మికులు తమ రాత మారేనా.. కష్టాలు తీరేనా అని ఎదురుచూస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వేదనను మిగిలుస్తోందని ఆందోళన చెందుతున్నారు. ఊరూవాడా బెల్టు షాపులు, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో గీత వృత్తి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 9 వేల బెల్టుషాపులు ఉన్నాయని గీత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన కూటమి నాయకులు గద్దెనెక్కిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని అంటున్నారు. కల్లుగీత వృత్తిపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మంది కార్మికులు ఆధారపడి ఉన్నారంటున్నారు. 9 వేలకు పైగా బెల్టు షాపులు ఏలూరు జిల్లావ్యాప్తంగా సుమారు 5 వేలు, పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సుమారు 4 వేలు బెల్టుషాపులు ఉన్నాయి. కూటమి నాయకులు, వారి అనుచరులే బెల్టుషాపులను నిర్వహిస్తున్నారని, దీంతో గీత వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గీత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. బెల్టు షాపులపై కొరడా ఝుళిపిస్తామని ముఖ్యమంత్రి, ఎకై ్సజ్ మంత్రి ప్రకటనలు చేయడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం గీత కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే సర్కిల్ వారీగా సభలు, సమావేశాలు నిర్వహించిన కార్మికులు ఆందోళనను ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 18న ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కల్తీ మద్యం హల్చల్! ఉమ్మడి జిల్లాలో కల్తీ మద్యం హల్చల్ చేస్తున్నట్లు గీత కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గోవా, యానాం నుంచి అక్రమ మద్యం తీసుకు వస్తున్నారని చెబుతున్నారు. అనకాపల్లి, పరవాడ కేంద్రంగా కబళిస్తున్న కల్తీ మద్యం రాకెట్ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లును స్థావరంగా చేసుకుందని అంటున్నారు. పాలకొల్లులో కల్తీ మద్యం తయారుచేసి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలకు సరఫరా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. బెల్టు షాపుల్లో అధికంగా కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, హైదరాబాద్ నుంచి స్పిరిట్‌ను తీసుకువచ్చి రంగు నీళ్లు కలిపి మద్యంగా తయారు చేసి బ్రాండెడ్ కంపెనీల బాటిల్స్‌లో నింపి ప్రముఖ బ్రాండ్ల లేబుల్ అతికించి షాపుల్లో విక్రయిస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత అనుచరుడే కల్తీ మద్యం దందా నడుపుతున్నట్టు విస్తృత ప్రచారం జరుగుతోందని గీత కార్మికుల నాయకులు ఆరోపిస్తున్నారు. కూటమి మొండిచేయి గీత కార్మికులకు ఇచ్చిన హామీల అమలెప్పుడు? ఏడాది దాటినా పట్టించుకోని కూటమి సర్కారు వాడవాడలా బెల్టు షాపులు ఉమ్మడి జిల్లాలో కల్లుగీత ఛిన్నాభిన్నం సుమారు 25 వేల మంది కార్మికులకు కష్టం బెల్టు షాపులు తొలగించాలి గీత వృత్తిని దెబ్బ తీస్తున్న మద్యం బెల్టు షాపులను తక్షణం తొలగించాలి. ఊరూ వాడా తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ బెల్టు షాపులు వెలియడంతో కల్లు గీత వృత్తి మరుగున పడే ప్రమాదం ఉంది. గీత వృత్తిని కాపాడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. –బెజవాడ వెంకటేశ్వరరావు, గీత కార్మికుడు, చొదిమెళ్ల, ఏలూరు మండలం పట్టించుకోని అధికారులు ఉమ్మడి జిల్లాలో అక్రమ మద్యం ఏరులై పారుతున్నా ఎకై ్సజ్ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. నాటు సారా పేరుతో గీత కార్మికులపై దాడులు చేస్తూ వేధిస్తున్నారు. ఓపక్క కల్లు వ్యాపారం లేక ఉపాధి కోల్పోతున్న గీత కార్మికులు అధికారుల వేఽధింపులతో వృత్తికి దూరమవుతున్నారు. – జుత్తిగ నరసింహమూర్తి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కల్లుగీత కార్మిక సంఘం, భీమవరం -
తేనెటీగల పెంపకంతో ఆర్థిక వృద్ధి
తాడేపల్లిగూడెం: తేనె టీగల పెంపకంతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించవచ్చని సీనియర్ సైంటిస్టు డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కేవీకేలో గురువారం ప్రారంభమైన తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తేనెను శాసీ్త్రయంగా ఎలా ప్రోసెస్ చేయాలి, నాణ్యమైన తేనెను మిషనరీ ద్వారా కలుషితం లేకుండా బాట్లింగ్ వరకు ఎలా తీసుకురావాలనే విషయాలను విశదీకరిరంచారు. రూ.20 వేలతో ఒక ఎకరానికి నాలుగు బాక్సులు, రూ.5 వేలతో కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసి ఉద్యాన పంటల మధ్య ఖాళీ స్థలంలో బాక్సులు ఎలా అమర్చాలనే విషయాల గురించి చెప్పారు. తేనె ఉప ఉత్పత్తులుగా మైనం, పుప్పొడి, జెల్లీ, విషం తయారు చేసి ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందవచ్చన్నారు. గాఢమైన పురుగుమందులు కొట్టే తోటల పక్కన కాని, రైల్వే ట్రాకుల పక్కన, విద్యుత్ స్తంభాల పక్కన తేనెటీగల పెంపకం కోసం బాక్సులు ఏర్పాటు చేయకూడదన్నారు. మూడు రోజుల పాటు శిక్షణలో తేనెటీగల పెంపకం, యాజమాన్య పద్ధతులు, తెగుళ్లు, నివారణ చర్యలు గురించి వివరిస్తామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దీప్తి, దేవీవరప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతితాడేపల్లిగూడెం రూరల్: విద్యుత్ స్తంభాన్ని మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల ప్రకారం మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన దండే శ్రీను (21) గురువారం బాదంపూడి నుంచి స్వగ్రామం మోటారు సైకిల్‌పై వస్తుండగా, నవాబుపాలెం వద్దకు వచ్చే సరికి కుక్కను తప్పించబోయి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. శ్రీను సోదరుడు చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై జేవీఎన్.ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యూనియన్ బ్యాంకు పరిహారం చెల్లించాల్సిందే
చిలకలపూడి (మచిలీపట్నం): ఖాతాదారునికి యూనియన్ బ్యాంక్ పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల గురువారం తీర్పుచెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన తోట గంగరాజుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తుందుర్రు బ్రాంచ్‌లో సేవింగ్ అకౌంట్ ఉంది. 2023 సెప్టెంబరు 26వ తేదీన గంగరాజు డెబిట్‌కార్డు వివరాలు, ఓటీపీ చెప్పమని ఒక కాల్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలియజేసి అకౌంట్స్, డెబిట్ కార్డు బ్లాక్ చేయించారు. వారం రోజుల తరువాత గంగరాజు కొత్త డెబిట్‌కార్డు తీసుకున్నారు. 2023 అక్టోబరు 5వ తేదీన రూ.1,39,200 గంగరాజు అకౌంట్ నుంచి మూడు విడతలుగా నగదు కట్ అయింది. దీంతో ఆయన యూనియన్ బ్యాంక్ వారిని కలిసి ఏ విధమైన లావాదేవీలు జరగకుండానే నగదు కట్ అయిందని ఫిర్యాదు చేశారు. అపరిచిత వ్యక్తుల వల్ల నగదు కట్ అయిందని, దానికి బ్యాంకు వారే బాధ్యులని అంటూ ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ సభ్యులు పూర్వాపరాలను విచారించి తోట గంగరాజు ఖాతా నుంచి కట్ అయిన నగదు రూ.1,39,200 యూనియన్ బ్యాంకు వారు 9 శాతం వడ్డీతో కట్ అయిన తేదీ నుంచి చెల్లించాలని, మానసిక వేదన కలిగించినందుకు రూ.25 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కుక్కునూరు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన చనుబల్లి సుబ్బారావు (48) గురువారం తన బైక్‌పై తెలంగాణ రాష్ట్రం అశ్వారా వుపేట నుంచి కుక్కునూరు వస్తూ వినాయకపురం సమీపంలో అదుపు తప్పి బైక్‌పైనుంచి కిందకు పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో సుబ్బారావుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్
ద్వారకాతిరుమల: ఆగి ఉన్న ట్రాలీ లారీని వెనుక నుంచి వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్ తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన మండలంలోని ఎం.నాగులపల్లి జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా, జగ్గంపేట మండలం, కాట్రావులపల్లి గ్రామానికి చెందిన వ్యాన్ క్లీనర్ యెరిట సూర్యనారాయణ (21), డ్రైవర్ జి.సురేష్ గతనెల 29న మొక్కజొన్న పొత్తులు లోడింగ్ నిమిత్తం వినుకొండ వెళ్లారు. తిరిగి లోడుతో స్వగ్రామానికి వెళుతున్న క్రమంలో ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వ్యాన్ క్లీనర్ సూర్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ సురేష్‌ను స్థానికులు హుటాహుటీన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్లీనర్ మృతి, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు -
కొడుకుపై కన్నతల్లి దాడి
కొయ్యలగూడెం: మానసిక, శారీరక వికలాంగుడైన కుమారుడిపై ఓ తల్లి విచక్షణ కోల్పోయి దాడి చేసింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లిన ఘటన గురువారం జరిగింది. వివరాల ఇలా ఉన్నాయి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామానికి చెందిన తొంట కుమారి భర్త గతంలోనే మృతిచెందాడు. వీరికి కుమార్తె, మానసిక, శారీరక వికలాంగుడైన కుమారుడు ఉన్నారు. కుమార్తెను ఆమె భర్త విడిచిపెట్టడంతో తల్లి దగ్గరే ఉంటోంది. గురువారం తల్లికి, కుమారుడికి మధ్య ఏర్పడిన వివాదంలో తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన తల్లి కుమారుడిని తలపై కర్రతో కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతన్ని 108 అంబులెన్సులో చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన కుమారుడు -
ఆటో, వ్యాన్ ఢీకొని కూలీ మృతి
నలుగురికి గాయాలు దెందులూరు: ఆటోను వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒక కూలీ మృతి చెందగా ఇద్దరికీ తీవ్ర, మరో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఏలూరు రూరల్ మండలంలోని శ్రీపర్రులో గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు చోటుచేసుకుంది. వివరాల ప్రకారం రావులపాలెం నుంచి మండవల్లి రొయ్యల చెరువు పట్టుబడికి కూలీలు ఆటోలో వస్తున్నారు. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు పెట్రోల్ బంక్ సమీపానికి వచ్చేసరికి ఆటో, భీమవరం నుంచి వస్తున్న వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జయింది. ఆటోలో ఉన్న ఒరిస్సా రాష్ట్రం దేవిరీపల్లికి చెందిన సందీప్ కుమార్ (19) అక్కడికక్కడే మృతి చెందాడు. మిగితావారిలో ఒరిస్సాకు చెందిన రాత్‌కు, సూరజ్‌కు తీవ్రగాయాలు కాగా రాంబాబు, లక్ష్మణ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఏలూరు రూరల్ తహసీల్దార్ బి విజయకుమార్‌రాజు, శ్రీపర్రు వీఆర్ఓ సుబ్రహ్మణ్యం, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనాన్ని డెలివరీ చేసేందుకు వెళ్లి..
పాలకొల్లు సెంట్రల్: ద్విచక్ర వాహనాన్ని డెలివరీ చేసేందుకు వెళ్లిన వ్యక్తి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పాలకొల్లు నరసాపురం రహదారిలో టిడ్కో గృహాల సముదాయం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెన్నేటి ప్రసాద్ (38) నరసాపురంలోని ఓ ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. గురువారం నరసాపురం నుంచి మార్టేరు షోరూమ్‌కు వాహనాన్ని డెలివరీ చేయడానికి వెళుతున్నాడు. పాలకొల్లు దగ్గర్లో టిడ్కో గృహాల సముదాయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఓవర్టేక్ చేసే క్రమంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రసాద్ లారీ వెనుక టైర్ కింద పడడంతో తల నుజ్జయి అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో నివాసం ఉంటున్నారు. ప్రసాద్ ఉద్యోగం నిమిత్తం నరసాపురంలోనే రూము తీసుకుని ఉంటున్నాడు. అతడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పృధ్వీ తెలిపారు. -
ప్రైవేటు ఆక్వా దుకాణాలకు రెక్కలు
కై కలూరు: రాష్ట్ర తలసరి ఆదాయంలో ఏలూరు జిల్లాలో కలిదిండి, కై కలూరు రెండు మండలాలు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలుస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఆక్వా రంగం. ఆక్వా ఉత్పత్తుల రవాణాలోనూ కొల్లేరు ప్రాంతాలు సింహభాగం ఆక్రమించాయి. ఆక్వా ప్రాధాన్యతను గుర్తించి రాష్ట్ర మంచినీటి సంవర్థక రిఫరల్ ల్యాబోరేటరీను కై కలూరు మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కాకినాడ తర్వాత కై కలూరు ల్యాబ్ మాత్రమే రాష్ట్ర స్థాయిలో రిఫరల్ ల్యాబ్ కావడం విశేషం. కూటమి ప్రభుత్వంలో ఈ ల్యాబ్ పాడుపడ్డా కొంపలా మారింది. కేవలం ఒకే ఒక్క సిబ్బంది పరీక్షలు నిర్వహించడం గమనార్హం. ప్రభుత్వ ఆక్వా ల్యాబ్‌లో సేవలు సక్రమంగా అందకపోవడంతో రైతులు ప్రైవేట్ ఆక్వా దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. పరికరాలున్నా.. ప్రయోజనం శూన్యం కై కలూరులో మత్స్యశాఖ కార్యాలయంతో పాటు లాబోరేటరీని 2003లో నిర్మించారు. ఫీడ్ అనాలసీస్, మైక్రోబయోలజీ ల్యాబ్‌ను దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో అప్పటి మంత్రి ఎండీ.ఫరీదుద్దిన్ 2005లో ప్రారంభించారు. ల్యాబ్‌లో మైక్రోబయోలజీ, హిస్టోపాథాలజీ, నీటి, మట్టి, మేత పరీక్షలు, పీసీఆర్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ల్యాబ్‌లో రూ.20లక్షల విలువ చేసే ఎలిషా పరికరం, అదే విధంగా రూ.13లక్షలు విలువ చేసే పీసీఆర్ మిషన్‌తో పాటు మేత పరీక్షలకు రూ.లక్షల్లో విలువ చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేటు ల్యాబ్‌లతో పోల్చితే తక్కువ ధరకు పరీక్షలు చేస్తున్నా ఆక్వా రైతులు ఫిషరీస్ ల్యాబ్‌కు రావడం లేదు. లైసెన్సులు లేనివి ఎన్నో.. ఆక్వా దుకాణాలు ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. కోస్టల్ అథారిటీ అనుమతులు ఉండాలి. వీటితో పాటు డ్రగ్ లైసెన్స్, జీఎస్టీ, ఐటీ రిటర్న్, ఆథరైజ్డ్ డీలర్షిప్ లెటర్స్‌తో దరఖాస్తు చేసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ అనుమతులు పొందాలి. క్షేత్ర స్థాయిలో తహసీల్దార్, ఫిషరీస్, డ్రగ్ ఇన్స్పెక్టర్ పొల్యూషన్ ఇలా పలు శాఖలు నిరభ్యంతర ధ్రువపత్రం ఇవ్వాలి. ఇంత తతంగం ఉన్నప్పుటికీ కై కలూరు నియోజకవర్గంలో ఏకంగా 130 ఆక్వా దుకాణాలు ఉన్నాయి. వీటిలో కేవలం 39 దుకాణాలకు మాత్రమే లైసెన్సులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో రెక్కలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లైసెన్సులు రాకపోయినా రాజకీయ నేతల అండతో ఆక్వా దుకాణాలు తెరుస్తున్నారు. కొన్ని ప్రైవేటు ల్యాబ్‌లలో సరైన నిబంధనలు పాటించడం లేదు. ఇక పరీక్ష ధరల విషయానికి వస్తే ప్రభుత్వ ల్యాబ్‌లో నీటి పరీక్ష రూ.100 ఉంటే ప్రైవేటు ల్యాబ్‌లో రూ.200, మట్టి పరీక్ష రూ.210 ఉంటే ప్రైవేటులో రూ.300, మేతలో అన్ని పరీక్షుల కలిపి ప్రభుత్వ ల్యాబ్‌లో రూ.680 ఉంటే ప్రైవేటులో రూ.1200, పీసీఆర్ టెస్టు ప్రభుత్వ ల్యాబ్‌లో రూ.800 ఉండగా ప్రైవేటు ల్యాబ్‌లలో రూ.2,500 తీసుకుంటున్నారు. ఇక కొన్ని ఆక్వా దుకాణాల్లో మందులు కొనుగోలు చేసి చెరువులో చల్లడం వల్ల సాగు రైతులకు రూ.లక్షల్లో చేప పిల్లలు చనిపోతున్నాయి. నాసిరకం మందులపై ప్రశ్నిస్తే రాజకీయ నేతల అండతో బక్క రైతులపై దుకాణదారులు జులం ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో రూ.18.60 లక్షలు నిధుల కేటాయింపు వైఎస్సార్ సీపీ పాలనలో ల్యాబ్ ఆధునికీకరణకు రూ.18.60 లక్షలు కేటాయించారు. పరికరాలు కొనుగోలుతో పాటు ఎంజైమ్ లింక్ట్ ఇమ్యునోసోర్జెంట్ ఆస్సే(ఎలిషా) టెస్టు గదిని నిర్మించారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం సిబ్బందిని నియమించకపోవడంతో మూతపడింది. ల్యాబ్‌లో మొత్తం 6గురు సిబ్బందికి గాను కేవలం అశోక్ అనే ఎంపీఈవో సిబ్బంది ఒక్కరే పరీక్షలు చేస్తున్నాడు. ఇక్కడ ల్యాబ్ ఏడీ రాజ్‌కుమార్‌ను ఏలూరు ఏడీగా వేయడంతో అయన అక్కడ సేవలకే పరిమితమయ్యారు. గత పాలనలో సచివాలయ ఉద్యోగాల్లో భాగంగా ఇక్కడ మత్స్య సహాయకులను పరీక్షలకు నియమించారు. ఇప్పుడు వీఎఫ్‌ఏలు సచివాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నారు. కూటమి హయాంలో ప్రభుత్వ ల్యాబ్ నిర్వీర్యం పరికరాలు ఉన్నా.. సేవలు శూన్యం సచివాలయాలకే పరిమితమవుతున్న వీఎఫ్‌ఏలు పెచ్చులూడటం వాస్తవమే కై కలూరు ఆక్వా లేబోరేటరీ బయట శ్లాబ్ పెచ్చులూడడం వాస్తవమే. ఇంజనీరింగ్ అధికారులకు తెలిపాం. ఎలిషా టెస్టుకు కాకినాడలో శిక్షణ పొందిన సిబ్బంది అవసరం. ఆక్వా దుకాణాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ క్షేత స్థాయిలో అధికారుల లాగిన్‌లో నిలిచాయి. దుకాణాల్లో, లేబ్లలో ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటాం. – బి.రాజ్‌కుమార్, మత్స్యశాఖ ల్యాడ్, ఏడీ, కై కలూరు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలి ఫిషరీస్ ల్యాబ్‌ను రైతులకు అందుబాటులో ఉంచండి. సిబ్బంది లేకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ల్యాబ్ ఉన్నప్పటికీ ఆక్వా రైతుల నమ్మకాన్ని పొందలేకపోతుంది. ప్రభుత్వం ల్యాబ్‌కు మరమ్మతులతో పాటు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలి. – సమయం రామాంజనేయులు, ఆక్వా రైతు, కై కలూరు -
సేంద్రియ సాగుతో ఖర్చు ఆదా
చింతలపూడి: రైతులు సేంద్రియ ఎరువులను వాడాలని చింతలపూడి వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు వై సుబ్బారావు సూచిస్తున్నారు. ప్రస్తుత తరుణంలో రసాయన ఎరువులు అధికంగా ఉపయోగించడం వల్ల సాగు ఖర్చులు పెరిగి రైతులు నష్టాల్లో కూరుకు పోతున్నారని, సేంద్రియ సాగుతో ఖర్చులు తగ్గి లాభాలు చేకూరుతాయని తెలిపారు. సేంద్రియ ఎరువులు అంటే సేంద్రియ ఎరువుల్లో పశువుల ఎరువు, వానపాముల ఎరువు, గొర్రెలు, కోళ్ల ఎరువులు, పచ్చి రొట్ట ఎరువులు ముఖ్యమైనవి. వీటి వాడకం వల్ల భూమి సహజ స్థితిని పొందడమే కాక, పంటకు ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. నాణ్యమైన, విష రహితమైన పంటలను పండించవచ్చు. వీటితో పాటు వేరుశనగ, వేప, పొద్దు తిరుగుడు, ఆముదం చెక్కలను వాడడం వలన మొక్కలకు పోషక పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. పచ్చిరొట్ట ఎరువులు: సమగ్ర పోషక యాజమాన్యంలో పచ్చిరొట్ట ఎరువులు ప్రధానమైనవి. పచ్చి రొట్టతో వివిధ పంటల్లో దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. పచ్చిరొట్టలో జీలుగ, జనుము, పిల్లి పెసర, అలసంద, పెసర, మినుము ముఖ్యమైనవి. జీవ ఎరువులు: పంటల పెరుగుదలకు కావలసిన పోషకాలను అందించే సూక్ష్మ జీవకణాల సముదాయాలను జీవన ఎరువులు అంటారు. వీటిలో నత్రజనిని స్థిరీకరించేవి రైజోబియం, నీలి ఆకుపచ్చ ఆకు, అజిటో బ్యాక్టీరియ, అజో స్పైరిల్లం, అజొల్లా ఒక రకం కాగా, భాస్వరంను భూమిలో లభ్యమయ్యేలా చేసే ఫాస్ఫో బ్యాక్టీరియ రెండోది. నీలి ఆకుపచ్చ నాచు: ఎకరాకు 4 కిలోల నాచు పొడిని ఇసుకతో కలిపి మడి అంతా సమానంగా పడేటట్లు వేయాలి. 7–10 రోజుల మధ్య మడిలో నీరు పెట్టాలి. నాచు గాలిలోని నత్రజనిని తీసుకుని స్థిరీకరిస్తుంది. దీనివలన ఎకరాకు 8–12 కిలోల నత్రజని పంటకు అంది దిగుబడి పెరుగుతుంది. అజటో బ్యాక్టర్: ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి 200–400 గ్రాముల కల్చరును పట్టించాలి. లేదా కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలపై చల్లాలి. వరి, చెరకు, జొన్న, పత్తి, సజ్జ, మిరప పంటల్లో వేసుకుంటే మంచిది. దీని వల్ల ఎకరానికి 8–16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. అజొల్లా: దమ్ములో ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలుచగా నీరు పెట్టి 100–150 కిలోల అజొల్లా వేసి 2–3 వారాల తరువాత నేలలో కలియ దున్నాలి. ఎకరానికి 3 టన్నుల పచ్చిరొట్టతో 12 కిలోల నత్రజని అందుతుంది. భాస్వరపు జీవన ఎరువు: ఫాస్ఫో బ్యాక్టీరియ భూమిలో లభ్యంకాని స్థితిలోని భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనంలో 200–400 గ్రాముల కల్చర్‌ను పట్టించాలి. లేదా ఒక కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం నేలలో వేయాలి. ఇక రైతులు రసాయనిక ఎరువులను సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలని, అధిక మోతాదులో వాడితే పురుగులు, తెగుళ్లు అధికమై పంట దెబ్బతినే ప్రమాదం ఉందని సుబ్బారావు తెలిపారు. వై సుబ్బారావు, వ్యవసాయ సహాయ సంచాలకులు -
రైలు నుంచి జారిపడిన వ్యక్తి మృతి
భీమవరం: రైలు నుంచి జారిపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ఎం.సుబ్రహ్మణ్యం చెప్పారు. ఈనెల 16వ తేదీన ఆకివీడు – ఉండి రైల్వే స్టేషన్ మధ్య 55 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి గాయపడడంతో చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా భీమవరం ప్రభుత్వాసుపత్రికి అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు జిల్లా ఆసుపత్రికి తరలించామన్నారు. అక్కడ ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు సెల్ 99084 48729 నంబర్లో సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి దెందులూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు రూరల్ మండలంలోని జాలిపూడి గ్రామంలో కంచర్ల తంబి (40) చేపల చెరువులపై గుమస్తాగా పనిచేస్తున్నాడు. గురువారం ఇంటి వద్దనే మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగాడు. గమనించిన బంధువులు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ఎరువుల పట్టివేత లింగపాలెం: మండలంలోని యడవల్లి గ్రామ సమీపంలో 7 టన్నుల కాంప్లెక్స్ ఎరువులను వ్యాన్‌లో అక్రమంగా తరలిస్తుండగా వ్యవసాయశాఖ డీఏఓ ఎస్కే అబీబ్ బాషా, ఏడీఏ వై సుబ్బారావు, ఏవో వి ప్రదీప్ కుమార్ పరిశీలించి సీజ్ చేశారు. వీటి విలువ రూ.2 లక్షల 6 వేలు అని తెలిపారు. కృష్ణా జిల్లా మైలవరం నుంచి ఈ ఎరువులను తరలిస్తున్నట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఎరువులను మఠంగూడెం సొసైటీలో భద్రపర్చి, వ్యాన్‌ను పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఏవో ప్రదీప్ కుమార్ విలేకర్లకు తెలిపారు. గురుకుల ఉపాధ్యాయుడికి పురస్కారం నరసాపురం రూరల్: ఎల్బీచర్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల గణిత ఉపాధ్యాయుడు బేతపూడి విజయ్‌కిరణ్ కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాహుల్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంస్కృతుల ప్రోత్సాహంపై ఈ నెల 9 నుంచి 29 వరకూ హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విజయ్‌కిరణ్ ‘ఆంధ్రప్రదేశ్‌లో చేతి వృత్తుల కళాకారుల జీవన స్థితిగతులు’ అనే అంశంపై ప్రాజెక్టు సమర్పించారు. ఈ ప్రాజెక్టుకుగాను కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి. ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.శ్యాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ పి.మార్క్, నల్లి సాయిబాబు, రాజా, పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయుడు విజయ్‌కిరణ్‌ను అభినందించారు. -
సమస్యలు పరిష్కరించాలి
భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించాల్సిన సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. గతంలో ప్రభుత్వం వెల్పేర్ బోర్డు ద్వారా అమలు చేసిన సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – బండి శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు, వీరవాసరం పోరుబాట తప్పదు భవన నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన వెల్పేర్ బోర్డును పునరుద్దరించకుంటే పోరుబాట తప్పదు. చేతినిండా పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ ప్రోత్సహం కూడా కరువైతే పరిస్థితి మరింత దుర్బరంగా మారుతుంది. – మండ సూరిబాబు, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి ఆందోళనలు ఉధృతం చేస్తాం వెల్పేర్ బోర్డును పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తాం. ఇప్పటికే తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన చేసి అధికారులకు సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు అందచేశాం. – నారపల్లి రమణరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ● -
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకాల లక్ష్యసాధనకు బ్యాంకర్లు తమవంతు సహకారం అందిచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జీలకు రుణాల మంజూరు లక్ష్యంలో చాలా లోటు కనిపిస్తుందని, మైక్రో క్రెడిట్ ప్లాన్ అందిన వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.977.74 కోట్ల రుణాల మంజూరు లక్ష్యంగా కాగా.. కేవలం రూ.144.85 కోట్లు మాత్రమే మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్డీఎ ద్వారా పంపిన 9,633 ఎంసీపీలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. చేనేత కార్మికులకు ముద్ర లోన్ మంజూరులో తీవ్ర జాప్యం ఎందుకని ప్రశ్నించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎల్.వి.వి.ఆర్.కె.ఎం.ఎస్ మన్యం మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం అమలు లక్ష్యానికి కృషి చేయాలని సూచించారు. నాబార్డ్ ప్రతినిధి నిష్యంత్ చంద్ర, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్, ఆర్బీఐ ప్రతినిధి రామకృష్ణ పాల్గొన్నారు. అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి భీమవరం అర్భన్: సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, జిల్లాలోని నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ‘అక్షర ఆంధ్ర’ అక్షరాస్యత 2025–26పై శిక్షణా తరగతుల ప్రారంభ సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 2029 నాటికి నిరక్షరాస్యులు లేని జిల్లాగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేందుకు అధికారులు నిరంతరాయంగా కృషి చేయాలన్నారు. -
ఆత్మీయ కలయిక
భీమవరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త ముదు నూరి మురళీకృష్ణంరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో నిర్వహించిన పార్టీ పీఏసీ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన పార్టీ అధినేతను కలిశారు. పీ4లో భాగస్వాములవ్వాలి భీమవరం (ప్రకాశంచౌక్): పీ4లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లాలోని సంపన్న రైతులు, ఎరువులు, పురుగు మందుల షాపుల యజమానులు, డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. దోపిడీ కోసమే స్మార్ట్ మీటర్లు ఏలూరు (టూటౌన్): దోపిడీ కోసమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ నాయకులు విమర్శించారు. కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ ఆధ్వర్యంలో మంగళవారం వన్ టౌన్ బిర్లాభవన్ సెంటర్ నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సీఐటీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడి ప్రసాదు, రైతు సంఘం రాష్ట కార్యదర్శి డేగ ప్రభాకర్ మాట్లా డుతూ కుటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి అదానీ కంపెనీకి సేవకులుగా పని చేస్తున్నారని విమర్శించారు. ప్రజల డబ్బులను ఏ విధంగా దోచుకోవాలో, ఆ డబ్బులు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేలా బాబు సర్కార్ వేగంగా పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. పోలవరం నుంచి భారీగా నీటి విడుదల ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పోలవవరానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో గోదావరిలో వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజుల నుంచి రోజుకు సగటున 5 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నీటిమట్టం 31.050 మీటర్లుండగా దిగువకు 6,70,335 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్వర్ణకార సంఘ కార్యవర్గం ఎన్నిక ఆకివీడు: ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా స్వర్ణకార సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ చైర్మన్ పట్నాల శేషగిరిరావు మంగళవారం చెప్పారు. ఆరోసారి తమను ఎన్నుకోవడంతో డబుల్ హ్యాట్రిక్ సాధించామన్నారు. 25 ఏళ్లపాటు ఒక సంఘం ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే ప్రథమమన్నారు. స్వర్ణకారులకు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు సంఘం తరుఫున చేసిన సేవల్ని గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. అధ్యక్షుడిగా తనతో పాటు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ వెంకట రామకృష్ణ, కోశాధికారిగా కొమ్మోజు రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు కొనసాగుతారని చెప్పారు. -
ఉచితం పరిమితం
కౌలు రైతులందరికీ రుణాలివ్వాలి బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025కండిషన్ అంతంత మాత్రమే పల్లె వెలుగు హైర్ సర్వీసులతో పోలిస్తే మిగిలిన వాటి కండిషన్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాటిలో ప్రయాణిస్తున్నప్పుడు కుదుపులు, కిటికీల తలుపుల నుంచి వచ్చే శబ్దాలకు తీవ్ర అసౌకర్యానికి గురికావాల్సి వస్తుందని ప్రయాణికులు అంటున్నారు. సిబ్బంది కొరత అధికంగా ఉంది. అవుట్ సోర్సింగ్ ద్వారా డ్రైవర్లను భర్తీచేసే యోచనలో అధికారులు ఉన్నారు. పనిభారం పెరిగినప్పుడు కండక్టర్లను డబుల్ డ్యూటీ చేయించాలని భావిస్తున్నారు. ఈ రూట్లలో మాటేంటి ? ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయడం ద్వారా జిల్లాలోని ఆర్టీసీ రోజుకు రూ.40 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. భీమవరం–రాజమహేంద్రవరం, భీమవరం–తాడేపల్లిగూడెం, భీమవరం– తణుకు, భీమవరం–నరసాపురం, భీమవరం–ఏలూరు రూట్లు ఆర్టీసీకి ఆదాయాన్ని తెస్తున్నాయి. భీమవరం డిపోలోని గణపవరం రూట్, నరసాపురంలోని దొడ్డిపట్ల, కందరపల్లి, చినగొల్లపాలెం రూటు, తణుకులోని వరిగేడు, పసలపూడి రూటు, తాడేపల్లిగూడెంలోని అప్పారావుపేట, సింగరాజుపాలెం, పోల వరం రూట్లు ఆదాయం లేని రూట్లుగా ఉండటంతో వీటికి సర్వీసులు అంతంతమాత్రంగానే నడుస్తున్నాయి. ఆదాయం లేని రూట్లలో మహిళల ఉచిత ప్రయాణానికి అదనపు బస్సులు ఏర్పాటు చేస్తారో లేదో వేచిచూడాలి. సాక్షి, భీమవరం: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు రాష్ట్రమంతా ఉచితం ప్రయాణమని ఎన్నికల్లో ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. ఉచిత బస్సు హామీకి ఏడాది ఎగనామం పెట్టిన చంద్రబాబు సర్కారు రానున్న ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామంటోంది. ఉచిత ప్రయాణం జిల్లా వరకే పరిమితమంటూ చేతులెత్తేసింది. కూటమి సూపర్‌సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఒకటి. ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం తదితర సభల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మాట్లాడుతూ రాష్ట్రమంతటికీ వర్తింపచేస్తామంటూ హామీ ఇచ్చిన విషయం విదితమే. రానున్న ఆగస్టు 15 నుంచి ఈ హామీని అమల్లోకి తేనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోనే ఉచిత బస్సు సర్వీసులు నడిపే దిశగా ఆర్టీసీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఆంక్షల నడుమ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సర్వీసుల్లో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని మొత్తం బస్సులు రోజుకు లక్ష కిలోమీటర్లు దూరం ప్రయాణిస్తుండగా, 90 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో జిల్లా పరిధిలో ప్రయాణిస్తున్న వారు దాదాపు 70 శాతం మంది ఉంటారు. మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో ఈ ఆక్యుఫెన్సీ మరో 15 నుంచి 20 శాతం పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు, ఉద్యోగులతో రద్దీ అధికంగా ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణంతో ఈ రద్దీ మరింత పెరగనుంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో లోకల్ సర్వీస్ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న 23 స్పేర్ బస్సులు, 22 బడి బస్సుల్లో దాదాపు 30 బస్సులను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా రద్దీని అధిగమించే యోచనలో ఆర్టీసీ అధికారులు ఉన్నారు. జిల్లాలో బస్సులు ఇలా.. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం డిపోల పరిధిలో మొత్తం 295 బస్సులు ఉన్నాయి. వీటిలో దూరప్రాంతాలకు వెళ్లే వెన్నెల, స్టార్ లైనర్లు నాలుగు, ఇంద్ర బస్సులు 11, సూపర్ లగ్జరీ బస్సులు 33, అల్ట్రా డీలక్స్‌లు 26, ఎక్స్‌ప్రెస్‌లు 20 వరకు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల మధ్య సేవలందిస్తున్న అల్ట్రా పల్లె వెలుగులు 19, పల్లె వెలుగు బస్సులు 158 ఉండగా, స్పేర్ బస్సులు 23 ఉన్నాయి. జిల్లాలోని మొత్తం బస్సుల్లో వెన్నెల సర్వీస్‌తో పాటు ఒక అల్ట్రా డీలక్స్, తొమ్మిది ఎక్స్‌ప్రెస్ బస్సులు, 17 అల్ట్రా పల్లె వెలుగు, 47 పల్లె వెలుగు బస్సులను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో మహిళల జనాభా 9.23 లక్షలు. ప్రస్తుతం వీరి సంఖ్య మరింత పెరిగింది. జిల్లాలో 409 పంచాయతీలకు దాదాపు 300 గ్రామాలకు మాత్రమే ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణించాలంటే ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. వీటికి అనుమతి ఇవ్వకుండా కేవలం పల్లె వెలుగు బస్సులకు మాత్రమే అనుమతించడం సరికాదని మహిళలు మండిపడుతున్నారు. అదనపు బస్సులు లేకుండా ఉన్న వాటినే సర్దుబాటు చేయడం తూతూమంత్రంగా ఎన్నికల హామీని అమలుచేయడమేనని విమర్శిస్తున్నారు.సిద్ధంగా ఉన్నాం మహిళలు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రానప్పటికి సిద్ధంగా ఉన్నాం. బస్సులను పూర్తి కండీషన్లోకి తెచ్చాం. ప్రస్తుతం స్పేర్‌లో ఉన్న వాటిని, బడి బస్సులను వినియోగంలోకి తీసుకువచ్చి అవసరాన్ని బట్టి అదనపు బస్సుల కోసం ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నాం. సిబ్బంది కొరతను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. – ఎన్వీఆర్ వరప్రసాద్, జిల్లా ప్రజా రవాణ అధికారి, భీమవరం న్యూస్‌రీల్ రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యమంటూ హామీ ఇప్పుడు పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగులకే పరిమితం? జిల్లాలో 9.23 లక్షల మహిళలకు ఉన్న బస్సులు కేవలం 184 ఆర్టీసీ బస్సులు వెళ్లని గ్రామాలు 100 పైనే -
భవన నిర్మాణ కార్మికుల పోరుబాట
భీమవరం: పనులు లేక అవస్థలు పడుతున్న భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా కార్మికులకు చేతినిండా పనులు దొరకని దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కార్మిక, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి. వీరికి తోడు భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యమబాట పట్టారు. దీనిలో భాగంగా ఇప్పటికే భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి వినతిపత్రాలు అందచేశారు. నమోదు సులభతరం చేయాలి భవన నిర్మాణ కార్మికులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి బోర్డులో కార్మికుల నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన వెల్పేర్ బోర్డు ద్వారా నిర్మాణదారుల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వినియోగించగా నేటి ప్రభుత్వం సెస్ నిధులను దారి మళ్లించి కార్మికులకు మొండిచేయి చూపుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుండగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో సుమారు 1.70 లక్షల మంది కార్మికులు వెల్పేర్ బోర్డులో నమోదు చేసుకున్నారు. హామీని ఎప్పుడు అమలు చేస్తారు? ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కార్మికుల నమోదు వంటి ప్రక్రియను సులభతరం చేసి వార్డు, గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఐదురోజులు ఆసుపత్రిలో ఉండాలనే నిబంధనను, తొలగించాలని ప్రమాదం కారణంగా విశాంత్రి తీసుకుంటున్న కాార్మికులకు ఇచ్చే రూ.100 భృతిని రూ.500 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు, ఆనారోగ్యం కారణంగా మంచాన పడిన కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈఎస్ఐ తరహాలో ఉచిత వైద్య సాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నారు. వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని ఆందోళనలు ప్రభుత్వం స్పందించకుంటే ఉధృతం చేస్తామని హెచ్చరిక -
ఐకమత్యంతో సాగాలి
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్ ఏలూరులో రాత్రివేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న కేసులో ఇద్దరు నిందితులను, బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. 8లో uఏలూరు (ఆర్‌ఆర్‌పేట): అందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని తద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి తానేటి వనిత సూచించారు. మంగళవారం స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా పాస్టర్స్ ఫెడరేషన్ ప్రారంభోత్సవ సమావేశం జాతీయ అధ్యక్షుడు రెబ్బ ఇమ్మానుయేల్, జాతీయ కార్యదర్శి జీవన్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తానేటి వనిత మాట్లాడుతూ ప్రతి ఒక్కరు దేవుడి మనస్తత్వాన్ని కలిగి ఉండాలన్నారు. ప్రేమ, క్షమించడం, ఆదరణ లక్ష్యాలుగా జీవిస్తేనే మోక్షమార్గం లభిస్తుందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ఐకమత్యంతో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పూర్తిస్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలకు అందేలా స్వచ్ఛంద సంస్థల నాయకులు కృషి చేయాలన్నారు. ఆర్సీఎం ఏలూరు పీఠాధిపతి డాక్టర్ పొలిమేర జయరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక అభివృద్ధి ఐక్యత, సేవ, ప్రేమ గుణాలతో ప్రతి ఒక్కరు జీవించాలన్నారు. ఆలిండియా పాస్టర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి పాస్టర్ జీవన్ కుమార్ మాట్లాడుతూ దేశంలోని 28 రాష్ట్రాల పరిధిలో పాస్టర్లు అంతా కలిసి ఆలిండియా పాస్టర్స్ ఫెడరేషన్‌గా ఏర్పడినట్లు తెలిపారు. జాతీయ అధ్యక్షుడు బిషప్ ఇమ్మానియేల్ మాట్లాడుతూ క్రైస్తవులపై దాడుల నివారణ, పేదలకు సేవ లక్ష్యంగా ఫెడరేషన్ ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు జాతీయ జెండాలు ప్రదర్శించారు. -
డ్రెయిన్‌లోకి దూసుకెళ్లిన కారు
విశ్రాంత సైంటిస్ట్ మృతి ముదినేపల్లి రూరల్: పోల్‌రాజ్ డ్రెయిన్‌లో కారు దూసుకుపోయిన ఘటనలో విశ్రాంత సైంటిస్టు మరణించిన ఘటన ముదినేపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగింది. మండవల్లి మండలం లింగాలకు చెందిన చందు వెంకటేశ్వరరావు(63) నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్ఆర్ఎస్ఏ)లో శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగ విరమణ చేసి హైదరాబాదులో ఉంటున్నారు. లింగాల గ్రామంలోని బంధువుల ఇంట జరిగే వివాహం నిమిత్తం హైదరాబాదు నుంచి భార్య రాణితో కలసి వస్తున్నారు. పోల్‌రాజ్ వంతెన వద్ద డైవర్షన్ రోడ్డులో ప్రయాణించాల్సి ఉండగా, డైవర్షన్ గమనించకపోవడంతో పోల్‌రాజ్ డ్రెయిన్‌లోకి కారు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో పక్కనే చెరువులపై పనిచేసే కూలీలు ప్రమాదాన్ని గమనించి కాల్వలోకి దూకి రాణిని కాపాడారు. అప్పటికే వెంకటేశ్వరరావు మృతిచెందారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే కై కలూరు సీఐ వి.రవికుమార్, స్థానిక ఎస్ఐ వీరభద్రరావు సంఘటన స్థలానికి చేరుకుని వెంకటేశ్వరరావు మృతదేహాన్ని బయటకు తీసి, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్ డైవర్షన్ బోర్డులు పెట్టకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతుడు వెంకటేశ్వరరావుకు ముగ్గరు కుమార్తెలు కాగా.. వారంతా అమెరికాలో స్థిరపడ్డారు. -
న్యాయం చేయకపోతే పోరు ఉధృతం
జంగారెడ్డిగూడెం: గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఆగస్టు 4న గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చలో కలెక్టరేట్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మానవతా కల్యాణ మండపంలో నిర్వాసిత రైతుల సదస్సు నిర్వహించారు. సదస్సుకు వామిశెట్టి హరిబాబు అధ్యక్షత వహించారు. రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఆగస్టు చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని సదస్సులో ఏకగ్రీవంగా తీర్మానించారు. కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్వాసిత రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని, రైతులను మోసగించారని తీవ్రంగా విమర్శించారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం చేయకపోవడం వల్ల పొలాలకు వెళ్లే మార్గాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆర్బిట్రేషన్ పిటిషన్ల ద్వారా పరిహారం పెంచి ఇస్తామని హామీ ఇచ్చి కొద్దిమందికి కొద్ది పరిహారం పెంచి మిగిలిన రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. చింతలపూడి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి తదితర మండలాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల తలెత్తిని సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. సదస్సులో రైతుల పోరాట కమిటీ నాయకులు వామిశెట్టి హరిబాబు, అల్లూరి రామకృష్ణ, దేవరపల్లి సత్యనారాయణ, శీలం రామచంద్రరావు, ఎలికే తాతారావు, వందనపు సాయిబాబా, కె.నాగేశ్వరావు, కె.రంగారావు, జి.నర్సిరెడ్డి, బొడ్డు రాంబాబు, పి.శ్రీహరి తదితరులు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల గ్రామాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సదస్సుకు ముందుగా గురవాయిగూడెంలో రైతులు ధర్నా చేపట్టారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల తీర్మానం -
పెదతాడేపల్లి గురుకులం జాతికి అంకితం
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను మంగళవారం వీడియో సమావేశం ద్వారా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జాతికి అంకితం చేసినట్లు ప్రిన్సిపాల్ బి.రాజారావు తెలిపారు. ఆయనతో పాటు సహాయ మంత్రులు సుకాంత్ మజుందార్, జయంత్ చౌదరి, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారన్నారు. పాఠశాలలో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పీఎంశ్రీ పథకాన్ని భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలోని 26 పీఎంశ్రీలలో ఉత్తమ పాఠశాలగా పెదతాడేపల్లి గురుకులాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. డీఈవో నారాయణ, సమగ్ర శిక్ష ఏపీసీ శ్యామ్ సుందర్, ఏఎంవో సుబ్రహ్మణ్యం, మండల విద్యాశాఖ అధికారి వి.హనుమ, పేరెంట్స్ కమిటి వైస్ చైర్పర్సన్ ఇందిర పాల్గొన్నారు. -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరులో రాత్రివేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న కేసులో ఇద్దరు నిందితులను, బైక్‌ల చోరీలకు పాల్పడుతున్న మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.11.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 17 మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. కై కలూరు మినీబైపాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను ఏలూరు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ బృందం అదుపులోకి తీసుకుని విచారించగా పలు ఇంటి చోరీల్లో బంగారు ఆభరణాలు అపహరించినట్లు నిర్ధారించారు. వారివద్ద నుంచి రూ.11.50 లక్షల విలువైన హారం, చంద్రహారం, మురుగులు, ఉంగరాలు, చెవిమాటీలు, నవరత్నాల దిద్దులు, బేబీ రింగులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో నిందితులైన గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పిల్లి సురేష్ అలియాస్ శివ, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన నాగళ్ళ ముత్తయ్య గుప్తాలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై చోరీ, కొట్లాట, మోసం కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించిన సీఐ సత్యనారాయణ, వన్‌టౌన్ ఎస్సై ఎస్కే మదీనా బాషా, ఎస్సై నాగబాబు, వన్‌టౌన్ ఏఎస్సై అహ్మద్, హెచ్‌సీ రమేష్, కానిస్టేబుళ్లు మోహన్, నాగార్జున, నాగరాజు, శేషుకుమార్, రుహుల్లా, సీసీఎస్ ఏఎస్సై గోపి, హెచ్‌సీ రమణ, పీసీ రజని ఉన్నారు. వీరిని ఎస్పీ అభినందించారు. మోటార్‌సైకిళ్లు స్వాధీనం ఏలూరు త్రీటౌన్ సీఐ వీ.కోటేశ్వరరావు, భీమడోలు సీఐ యూజే విల్సన్ వారి పోలీస్స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా, తనిఖీలు చేపట్టి భారీగా చోరీకి గురైన మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఎస్సై రాంబాబు, సిబ్బందితో నిఘా ఉంచి ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచీ 14 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకోగా, వాటి విలువ సుమారు రూ.6.68 లక్షలుగా ఉంటుందని అంచనా. ఇక భీమడోలు సీఐ విల్సన్ ఆధ్వర్యంలో ద్వారకాతిరుమల ఎస్సై సుధీర్ తమ సిబ్బందితో తనిఖీలు చేసి 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.1.40 లక్షలు ఉంటుందని అంచనా. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన సయ్యద్ రజాక్, సయ్యద్ కరీముల్లాను అదుపులోకి తీసుకుని విచారించగా మోటారు సైకిళ్ల చోరీ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇళ్ల దొంగతనాల్లో ఇద్దరు, బైక్ చోరీల్లో మరో ఇద్దరి అరెస్ట్ రూ.11.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 17 మోటార్‌సైకిళ్లు స్వాధీనం -
కొబ్బరి ధరహాసం
● రికార్డు స్థాయిలో నీటి కొబ్బరి, కురిడీ ధరలు ● తమిళనాడు, కేరళలో పంట తగ్గడమే కారణం ● వరుస పండుగలతో పెరిగిన కొబ్బరి ధరలు ● కొబ్బరి వ్యాపారులు, రైతుల్లో హర్షం ●అవగాహన అవసరం ప్రస్తుతం మార్కెట్ ధర అత్యధికంగా ఉంది. రైతులు బాగా తయారైన కాయలను దింపు తీయించడం ద్వారా మంచి ధరను పొందవచ్చు. ప్రభుత్వం కోకోనట్ పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేసి మన ప్రాంతంలో కొబ్బరి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. – మైగాపుల రాంబాబు, కోకోనట్ సంఘ మాజీ అధ్యక్షుడు, పాలకొల్లు ప్రభుత్వం శ్రద్ధ వహించాలి ప్రస్తుతం ధరను బట్టి రైతుల్లోనూ కొబ్బరి పంటపై ఆసక్తి పెరుగుతుంది. ధరలు లేవని సరైన అవగాహన లేక కొందరు కొబ్బరి చెట్లను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ వహించి రైతుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – కఠారి నాగేంద్రకుమార్, పాలకొల్లు కోకోనట్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పాలకొల్లు పాలకొల్లు సెంట్రల్: గత రెండు నెలలుగా రికార్డు స్థాయిలో కొబ్బరి ధరలు పలుకుతుండడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పశ్చిమగోదావరి జిల్లాలో పచ్చి కొబ్బరి, కురుడి, కొత్త కొబ్బరి కాయ దొరకడమే గగనంగా మారింది. ప్రస్తుతం శ్రావణమాసం ప్రారంభం కావడంతో మార్కెట్లో కొబ్బరికి డిమాండ్ మరింత పెరగడంతో ఇక్కడ కూడా పంటకు కొరత ఏర్పడింది. ధర ఉన్నా సరుకు అందుబాటులో లేకపోవడంతో ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని రైతులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో దాదాపుగా 80 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుంది. ఉమ్మడి పశ్చిమ జిల్లాలో ఏలూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, రెడ్డిసీమ, కోరుమామిడి, చింతలపూడి, ద్వారకాతిరుమల, దేవరపల్లి, పెదవేగి, కొవ్వూరు, నల్లజర్ల, గోపాలపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, పాలకొల్లు, మొగల్తూరు, పేరుపాలెం వంటి ప్రాంతాల్లో కొబ్బరి పంట అధికంగా కొనసాగుతుంది. జోరుగా కొబ్బరి మార్కెట్ శ్రావణమాసానికి ముందుగానే జిల్లాలో కొబ్బరి మార్కెట్ జోరందుకుంది. కురుడి కొబ్బరికై తే ధర రికార్డు స్థాయిలో ఉండడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో పాత కాయల్లో పెద్ద సైజు గిలక కాయలు వెయ్యి కాయల ధర రూ.24,500, చిన్న సైజు కాయలు రూ.20 వేలు వరకూ మార్కెట్ జరిగింది. అలాగే కొత్త రకం కాయల్లో పెద్ద (అరవైబత్తి) సైజు రూ. 22,500, చిన్న సైజు కాయలు రూ.18 వేలు వరకూ ఉంది. నెంబర్ కాయ (అతి చిన్న సైజు) కొబ్బరి రూ.15 నుంచి 18 వేలు పలుకుతుంది. కురుడీ కాయలో పెద్ద సైజు ధర రూ.30 వేల గటగట సైజు రూ.27 వేల వరకూ పలుకుతోంది. పండుగల ప్రభావం మన రాష్ట్రం నుంచి గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, ఉత్తర ప్రదేశ్, డిల్లీ, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, హర్యానా వంటి అనేక రాష్ట్రాలకు ఇక్కడ నుంచి ఎక్కువగా ఎగుమతులు అవుతుంటాయి. శ్రావణమాసంలో దాదాపుగా ఈ ఒక్క నెలలోనే శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, శుక్ల ఏకాదశి, బహుళ ఏకాదశి, దూర్వాగణపతి హోమం, వరలక్ష్మీ వ్రతం, సంకట హర చతుర్థి, శ్రీకృష్ణాష్టమి, మాసశివరాత్రి రాఖీ పౌర్ణమి, పోలాల అమావాస్య, నాగ పంచమి, ఆగస్టు నెలలో వినాయకచవితి రావడంతో ఆయా రాష్ట్రాల్లో పండుగ వాతావరణం అంతా ఈ నెలలోనే ఉండడంతో కొబ్బరి మార్కెట్ నిలకడగా ఉండడానికి కూడా ఒక కారణంగా చెబుతున్నారు. కాయల్లో నాణ్యత ఉండాలి రైతులు దింపు తీసేటప్పుడు నాణ్యమైన నిక్కర్చి కాయలను మాత్రమే దింపు తీయాలి. బరువైన కాయలు దింపు తీయడం వల్ల అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేక కాయలు కుళ్లిపోతుంటాయి. నిక్కర్చి కాయలు బరువు తక్కువ ఉండే బాగా తయారైన కాయలు దింపు తీయడం వల్ల మార్కెట్ ధర కూడా ఎక్కువగా ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. దింపు తీసే కార్మికులు అందుబాటులో లేకపోవడంతో రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. కొబ్బరి విజ్ఞాన కేంద్రాలు ఉమ్మడి పశ్చిమలో పెదవేగిలో తూర్పు గోదావరిలో అంబాజీపేటలోనే ఉన్నాయి. కొబ్బరి పంటపై రైతుల్లో అవగాహన కల్పించేలా ప్రభుత్వం అవగాహనా సదస్సులు ఏర్పాటుచేయాలి. తమిళనాడు, కేరళలో దిగుబడులు లేకపోవడమే ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి ధరకు ఇంత జోష్ రావడానికి ప్రధాన కారణం తమిళనాడు, కేరళలో కొబ్బరి దిగుబడి తగ్గడమే. ఇటీవల వేసవిలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కొబ్బరి బొండాల వ్యాపారం జోరుగా కొనసాగడంతో నేడు పంట దిగుబడి తగ్గి మన రాష్ట్రంలో కొబ్బరికి డిమాండ్ పెరిగింది. అందువల్ల గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు మన ప్రాంతం నుంచే కొనుగోలు చేయాల్సి రావడంతో ధరలు ఆకాశాన్నంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీజన్లో రోజుకు సుమారు 80 నుంచి 100 లారీల వరకూ ఎగుమతులు జరుగుతుంటాయి. అన్ సీజన్లో అయితే జిల్లాలో రోజుకు సుమారు 30 నుంచి 40 లారీల వరకూ ఎగుమతులు జరుగుతుంటాయని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం సీజన్ అయి ఉండి ధర కూడా అధికంగా ఉన్నా సరుకు లేకపోవడం వల్ల రోజుకు సుమారు 60 నుంచి 80 లారీలు వరకూ ఎగుమతులు అవుతున్నాయని అంటున్నారు. -
అదృశ్యమైన యువకుడు శవమై తేలాడు
ద్వారకాతిరుమల: ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన యువకుడు పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో శవమై కనిపించాడు. వివరాల్లోకి వెళితే. మండలంలోని కొమ్మర గ్రామానికి చెందిన పొద్దుటూరి శ్యామ్(21) గత రెండేళ్లుగా ద్వారకాతిరుమలలోని ఈకామ్ ఎక్స్‌ప్రెస్ కొరియర్లో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. గత ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుంచి బైక్‌పై వెళ్లిన శ్యామ్ తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెదికినా ఫలితం లేదు. దాంతో శ్యామ్ తల్లి సంకురమ్మ సోమవారం స్థానిక పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, హెడ్ కానిస్టేబుల్ దుర్గారావు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా మంగళవారం పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో మృతదేహం లభించగా అది శ్యామ్‌గా గుర్తించారు. భీమడోలు సీఐ యుజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్, సిబ్బంది శ్యామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిస్సింగ్ కేసును అనుమానాస్పద మృతిగా మార్పుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. శ్యామ్ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అతడికి తల్లి, ఒక అన్నయ్య ఉన్నారు. పంగిడిగూడెం వద్ద పోలవరం కుడి కాలువలో యువకుడి మృతదేహం లభ్యం -
మానవ హక్కుల ఫోరం సభ్యుడిగా మంగరాజు
తాడేపల్లిగూడెం (టీఓసీ): జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ (ఎన్హెచ్ఆర్పీ ఫోరం) ఎస్సీ, ఎస్టీ వింగ్‌కు జాతీయ సభ్యునిగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు నియమితులయ్యారు. సంస్థ జాతీయ చైర్మన్ జేఎస్ఆర్ నాయుడు ఈమేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగరాజు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యునిగా రెండు సార్లు పనిచేశారు. ఫోరం సభ్యునిగా నియమితులైన మంగరాజును మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతాల శరత్ బాబు, నాయకులు నల్లి రాజేష్, తిరగటి శివ, గంటా సుందర్‌కుమార్ అభినందించారు. -
10న జిల్లా స్థాయి యోగాసన పోటీలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): యోగాసనా భారత్ సంస్థ ఆధ్వర్యంలో ఆగస్టు 10వ తేదీన ఏలూరు జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించనున్నట్టు ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు వెంకటేష్ గురూజీ తెలిపారు. మంగళవారం స్థానిక గుప్తవిద్య, దివ్యజ్ఞాన సమాజం మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక తూర్పువీధి మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయంలో యోగాసన పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పోటీల్లో 10 నుంచి 55 ఏళ్ల వయసు గల సీ్త్ర, పురుషులు పాల్గొనవచ్చునన్నారు. యోగాసన భారత్ అధ్యక్షుడు ఆలపాటి నాగేశ్వర రావు మాట్లాడుతూ పోటీదారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని, అలాగే పోటీలో పాల్గొనే ఒక్కో విభాగానికి రూ. 100 రుసుము చెల్లించాలన్నారు. వివరాలకు ఏలూరు జిల్లా యోగాసనా భారత్ కార్యదర్శి మోటమర్రి మల్లికార్జున రావు 98486 11744, కోశాధికారి సాంబశివరావు 94907 34033 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు. 3న అథ్లెటిక్స్ జిల్లా జట్టు ఎంపిక ఏలూరు రూరల్: ఆగస్టు 9, 10, 11 తేదీల్లో బాపట్లలో రాష్ట్రస్థాయిలో అంతర జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయని ఏలూరు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఏలూరు జిల్లా బాలబాలికల జట్లను ఆగస్టు 3వ తేదీన ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జట్టు ఎంపిక చేపడతామన్నారు. అండర్ 14,, 16, 18, 20 విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు పుట్టినతేదీ, ఆధార్, ఎస్ఎస్సీ మార్క్లిస్ట్తో హాజరై రూ.200 ఎంట్రీ ఫీజు చెల్లించి పోటీల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. వివరాలకు 62814 31202 నంబర్లో సంప్రదించాలని సూచించారు. డిప్లమో హార్టీకల్చర్‌లో చేరికకు నెలాఖరు వరకే అవకాశంతాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిఽధిలోని కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో డిప్లమో హార్టీకల్చర్‌లో చేరడానికి ఈనెల 31వ తేదీ ఆఖరు అని రిజిస్ట్ట్రార్ బి.శ్రీనివాసులు మంగళవారం తెలిపారు. విశ్వవిద్యాలయ పరిధిలో నాలుగు, వర్సిటీ గుర్తింపు పొందిన మూడు పాలిటెక్నికల్ కళాశాలలో డిప్లమో హార్టీకల్చర్ , ల్యాండ్‌స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరడానికి మాన్యువల్ కౌన్సిలింగ్‌కు హాజరు కావాలన్నారు. ఇంతకు మునుపు నమోదు చేసుకున్న అభ్యర్థులతో పాటు , కొత్తగా నమోదు చేసుకున్న దరఖాస్తు దారులు ఈనెల 31వ తేదీ ఉదయం 9.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తుది విడత కౌన్సిలింగ్ వెంకట్రామన్నగూడెంలో జరుగనుందన్నారు. విద్యార్థులు స్వయంగా తగిన ధ్రువపత్రాలతో వచ్చి కౌన్సిలింగ్‌కు హాజరు కావాలన్నారు. ఇతర వివరాలు, సీట్ల ఖాళీల సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. మొరాయించిన ఆర్టీసీ బస్సు ఉండి: భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై మహదేవపట్నం సత్రం వద్ద మంగళవారం మొరాయించింది. భీమవరం నుంచి గణపవరం మీదుగా తాడేపల్లిగూడెం వెళ్లే ఈ బస్సు బయలుదేరి సరిగ్గా ఐదు కిలోమీటర్లు కూడా ప్రయాణించకుండానే ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులో మహిళా ప్రయాణికులు, విద్యార్థులు ఉండడంతో గమ్యం చేరేందుకు వారు చాలా ఇబ్బందిపడ్డారు. బస్సులను పరిశీలించకుండానే డిపోనుంచి సర్వీసులకు అధికారులు పంపించేస్తున్నారంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఫసల్ బీమా.. రైతులకు ధీమా
చింతలపూడి, దెందులూరు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే వరకు అన్నదాతలకు ఆందోళన తప్పడం లేదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రైతన్నలకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతులకు ధీమానిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడలతో పంటలకు నష్టం వాటిల్లితే కర్షకులకు ఇబ్బంది లేకుండా బీమా వర్తించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు సహాయ సంచాలకులు వై సుబ్బారావు, దెందులూరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరాజు తెలిపారు. బీమా ప్రీమియం చెల్లించేందుకు వరి పంటకు ఆగస్టు 15 వరకు సమయం ఉండగా మినుముల పంటకు మాత్రం ఈనెల 31 వరకు మాత్రమే గడువు ఉందని, రైతులు త్వరపడాలని సూచించారు. రైతులకు కలిగే ప్రయోజనాలు ఖరీఫ్‌లో ఆహార ధాన్యాలు, చిరు ధాన్యాలు, నూనె గింజలు పండించే రైతులు ఎకరానికి రూ.840 చెల్లించాలి. వరి పంటకు నష్టం సంభవింస్తే ఎకరానికి రూ.42 వేల వరకు బీమా పొందే అవకాశం ఉంటుంది. మినుముల పంటకు రూ.300 చెల్లించాల్సి ఉండగా రూ.20 వేల వరకు బీమా పొందవచ్చు. రుణాలు తీసుకోని రైతులు, కౌలు రైతులు కూడా బీమా కట్టుకోవచ్చు. బీమా వర్తింపు ఇలా.. ముంపు, చీడపీడలు, తుపాన్లు, అగ్ని ప్రమాదాలు, వడగళ్లు, పెను గాలుల ధాటికి పంట నష్టపోయినప్పుడు ఫసల్ బీమా వర్తిస్తుంది. అదేవిధంగా పంట కోసి పనలపై ఉన్నప్పుడు అకాల వర్షాలు, తుపాన్లు కారణంగా పంట దెబ్బతిన్న ఘటనల్లో కూడా బీమా వర్తింపచేశారు. ఒకవేళ తుపాన్లు, వరదలు సంభవించినప్పుడు పంట ముంపుకు గురైతే 48 గంటల్లోగా సంబంధిత బ్యాంక్ వారికి, బీమా కంపెనీకి, వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించాలి. గ్రామం యూనిట్‌గా.. గ్రామంలో పండే ప్రధాన పంటను గ్రామం యూనిట్‌గా పరిగణిస్తారు. ఏలూరు జిల్లాలో వరి పంటను గ్రామం యూనిట్‌గా గుర్తించారు. పంట ముంపుకు గురైనప్పుడు, వడగళ్ల వానలకు దెబ్బ తిన్నప్పుడు బీమా వర్తిస్తుంది. 50 శాతానికి పైగా పంట దిగుబడి నష్టం జరిగితే నిబంధనల మేరకు నష్టాన్ని అంచనా వేసి 25 శాతం బీమా సొమ్మును వెంటనే చెల్లిస్తారు. రైతులు కూడా అధిక వర్షాలు, లేదా అనావృష్టి పరిస్థితులు సంభవించినప్పుడు 7 రోజుల్లోగా ప్రభుత్వ అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇదికాక వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కూడా అమల్లో ఉంది. రైతులు ఈ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అధికారులు విజ్ఞప్తి చేశారు. -
జీఐపై ఉద్యాన వర్సిటీ ఎంఓయూ
తాడేపల్లిగూడెం: భౌగోళిక గుర్తింపు సూచికల ఆవశ్యకత నానాటికి పెరుగుతుందని, ఈ మొక్క మనదే, ఈ వస్తువు భారతదేశానిదే అనే విషయాలు అధికారికంగా గుర్తింపు పొందాలంటే జీఐ సూచికల ప్రాధాన్యత అవసరం ఉందని హైదరాబాద్‌కు చెందిన రిసల్యూట్ 4ఐపీ గ్రూపు వ్యవస్థాపకుడు సుభజిత్సాహ అన్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మంగళవారం జీఐ అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. 2030 నాటికి 10వేల జీఐల నమోదు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీఐలు పొందటంలో విశ్వవిద్యాలయాల పాత్ర పెరిగిందన్నారు. ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ మాట్లాడుతూ జీఐలు పొందడంలో విశ్వవిద్యాలయాలకు ఆచరణలో ప్రతిబంధకాలు ఉన్నాయని, ఇలాంటి విషయాలపై ఆకళింపు కలిగిన రిసల్యూట్ గ్రూపు అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థతో ఉద్యానవర్సిటీ ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. దీని వల్ల యూనివర్సిటీ తయారు చేసిన వంగడాలు వంటి వాటికి జీఐ సులభతరంగా వచ్చే అవకాశం ఉందన్నారు. రీసల్యూట్ సంస్థతో ఒప్పంద పత్రాలను వీసీ గోపాల్, సుభజిత్ సాహ మార్చుకున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ కె.ధనుంజయ్ రావు పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయ అధికారులు ఎం.మాధవి, బి.శ్రీనివాసులు, బి.ప్రసన్నకుమార్, ఎస్.సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు.