
కూటమి పాలనలో రక్షణ కరువు
భీమవరం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నివర్గాల ప్రజలకు రక్షణ లేదని, రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శివకుమార్ గౌడ్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, పార్టీ నేత వేల్పుల రామలింగారెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా గురువారం భీమవరం ప్రకాశం చౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని వస్తున్న నాయకులపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయలేని కూటమి ప్రభుత్వం, అడ్డదారిలో గెలవడానికి ఓటర్లను భయాందోళనకు గురిచేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వ అ రాచకాలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రజల ముందుంచడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ప్రభుత్వం పద్ధతి మార్చుకుని సూ పర్‌సిక్స్ హామీలను తక్షణం అమలుచేయాలని లే కుంటే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంబీసీ విభాగ అధ్యక్షుడు పెండ్ర వీరన్న, యూత్‌వింగ్ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేదన్నారు. బలహీన వర్గాల ప్రజాప్రతినిధులపై వరుస దాడులతో వైఎస్సార్‌సీపీని బలహీనపర్చలేరన్నారు. పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్య క్షుడు జహంగీర్, పట్టణ శాఖ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, పార్టీ నాయకులు బాలాజీ, గంటా సుందరకుమార్, కమతం మహేష్, పాలా లక్ష్మీచక్రధర్, గేదెల నర్సింహరావు, పతివాడ మార్కండేయులు, ఈద జాషువ, రుద్రాక్షల శ్రీను, తుంపాల శ్రీను, షేక్ రబ్బాని, రాయవరపు శ్రీనివాసరావు, పాలా నాగరాజు, వీరవల్లి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.