సచివాలయం.. సేవలు నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

సచివాలయం.. సేవలు నిర్వీర్యం

Aug 8 2025 9:17 AM | Updated on Aug 8 2025 9:17 AM

సచివా

సచివాలయం.. సేవలు నిర్వీర్యం

శురకవారం శ్రీ 8 శ్రీ ఆగస్టు శ్రీ 2025

సాక్షి, భీమవరం: ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థపై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేసింది. కంప్యూటర్లు, ప్రింటర్లు, బ్యాటరీలు తదితర వాటికి నిర్వహణ కరువైంది. మరమ్మతులతో కొన్ని షట్‌డౌన్‌ కాగా.. మిగిలినవి తరచూ మొరాయిస్తుండటంతో సచివాలయ సేవల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విప్లవాత్మకంగా..

గత ప్రభుత్వం జిల్లాలో 398 గ్రామ, 137 వార్డు సచివాలయాలను ఏర్పాటుచేసింది. ఒక్కో సచివాలయానికి సచివాలయ సెక్రటరీ, ఇంజినీరింగ్‌, వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌, అగ్రికల్చర్‌, హార్టీకల్చర్‌, వెటర్నరీ, డిజిటల్‌ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎం, విలేజ్‌ సర్వేయర్‌ తదితర 10 నుంచి 11 పోస్టులను నియమించింది. రేషన్‌ కార్డులు, పింఛన్లు, సర్టిఫికెట్లు, ఆరోగ్యశ్రీ, భూరికార్డులు తదితర 500లకు పైగా సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆయా సేవలను బట్టి తక్షణ పరిష్కారం, కొన్ని 72 గంటలు, మరికొన్ని వారం నుంచి రెండు వారాల వ్యవధిలో పరిష్కరించేలా టైం బాండ్‌ సైతం పెట్టింది.

సేవలు సక్రమంగా అందేలా..

సేవల్లో పారదర్శకత, సమయ పాలన, వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు ఒక్కో సచివాలయానికి రెండు నుంచి మూడు వరకు కంప్యూటర్లు, ప్రింటర్లు, బ్యాటరీలు తదితర సామగ్రిని అందజేశారు. అప్పటికే పంచాయతీల్లో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర సామగ్రిని మినహాయించి మిగిలిన పరికరాలను ఇచ్చారు. మొత్తం 535 సచివాలయాలకు గా ను గత ప్రభుత్వంలో కొత్తగా 1,070 సీపీయూలు, 1,070 మోనిటర్లు, 535 ప్రింటర్లు, 535 యూపీఎస్‌ లు, 1,605 బ్యాటరీలు కలిపి మొత్తం 4,815 పరికరాలను అందజేశారు. పంచాయతీలు, పురపాలక సంస్థలు వీటి నిర్వహణను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ఆయా పరికరాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే సేవలకు ఆటంకం కలగకుండా వెంటనే మరమ్మతులు చేయించే పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉండేది.

న్యూస్‌రీల్‌

కూటమి శీతకన్ను

నిర్వహణ లేక మూలన పడుతున్న కంప్యూటర్లు, సామగ్రి

జిల్లాలో 535 సచివాలయాలు

అందించిన పరికరాలు 4,815

పనిచేస్తున్నవి 2,088 మాత్రమే

ప్రజలు, ఉద్యోగుల అవస్థలు

పరికరాలు మొత్తం పని పని

చేస్తున్నవి చేయనివి

సీపీయూలు 1,070 749 321

మోనిటర్లు 1,070 857 213

ప్రింటర్లు 535 284 251

యూపీఎస్‌లు 535 69 466

బ్యాటరీలు 1,605 129 1,476

సచివాలయం.. సేవలు నిర్వీర్యం 1
1/2

సచివాలయం.. సేవలు నిర్వీర్యం

సచివాలయం.. సేవలు నిర్వీర్యం 2
2/2

సచివాలయం.. సేవలు నిర్వీర్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement