E-marketing
-
Fact Check: ‘పట్టు’ తప్పిన రాతలు
సాక్షి, అమరావతి: ముడిపట్టు ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రోత్సాహంతో గడచిన నాలుగేళ్లుగా పట్టుసాగు విస్తరిస్తుండడమే కాదు.. ఆ రైతులు గతంలో ఎన్నడూలేని రీతిలో లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా నాలుగేళ్లలో కొత్తగా 39,640 ఎకరాల్లో పట్టుసాగు విస్తరించగా, బైవోల్టిన్ రకం పట్టుగూళ్ల ఉత్పత్తి మరో 13,905 టన్నులు పెరిగింది. 2018–19లో పట్టుగూళ్ల ధర (కకూన్స్) కిలో రూ.380 రావడం గగనంగా ఉండేది. కానీ, నేడు సగటున రూ.470 నుంచి రూ.620 వరకు లభిస్తోంది. అయినా, ప్రభుత్వంపై బురద జల్లడమే ఈనాడు లక్ష్యంగా పెట్టుకుంది. ‘పట్టు రైతుకు కుచ్చుటోపీ’ అంటూ నిసిగ్గుగా అబద్ధాలు అచ్చేసింది. ఈనాడు కథనంలో వాస్తవాలు ఏమిటో ఒక్కసారి చూద్దాం.. రాష్ట్రంలో 76,395 మంది 1,37,420 ఎకరాల్లో మల్బరీ సాగుచేస్తున్నారు. 600 సిల్క్ రీలర్ కుటుంబాలు ముడిపట్టును ఉత్పత్తి చేస్తుంటే ఈ రంగంపై ఆధారపడి 14లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. పట్టు రైతులకు మెరుగైన ఆదాయకల్పన లక్ష్యంతో పట్టుగూళ్ల మార్కెట్లలో ఈ–మార్కెటింగ్ వ్యవస్థను తీసుకురావడమే కాదు.. పట్టుసాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తోంది. రైతులు, రీలర్లకు ఏటా ప్రోత్సాహకాలు.. ఇలా నాలుగేళ్లలో పట్టు రైతులకు రూ.19.41 కోట్ల బైవోలి్టన్ కకున్ ఇన్సెంటివ్ను అందజేసింది. ఈ ఏడాది మరో రూ.7.12 కోట్లు విడుదల చేసింది. అలాగే, పట్టు రీలర్లకు నాలుగేళ్లలో రూ.8.20 కోట్ల ఇన్సెంటివ్ ఇచ్చారు. ఈ ఏడాది మరో రూ.6 కోట్లు విడుదల చేశారు. మరోవైపు.. పట్టు రైతులు నిర్మించుకున్న 1,186 షెడ్లకు ప్రభుత్వం ఇప్పటికే రూ.37.88 కోట్ల రాయితీనందించగా, మరో రూ.11.97 కోట్ల రాయితీని విడుదల చేసేందుకు ఏర్పాట్లుచేసింది. పట్టు పురుగుల పెంపకపు షెడ్ల నిర్మాణానికి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన బకాయిలన్నీ రైతుల ఖాతాలో జమచేశారు. అలాగే, పట్టుసాగులో అవసరమైన క్రిమిసంహార మందుల కొనుగోలు కోసం నాలుగేళ్లలో రూ.1.46 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశారు. మరోవైపు.. కొత్తగా ఐదు ఆటోమేటిక్ రీలింగ్ మెషినరీ యూనిట్లు ఏర్పాటుచేస్తున్నారు. పట్టు సాగుబడుల ద్వారా శిక్షణ.. చౌకీ పురుగులు నూరు శాతం సరఫరా చేయడం, రీరింగ్ షెడ్లలో టర్బో వెంటిలేటర్లు, కూలింగ్ సిస్టమ్స్ ఏర్పాటుచేయడం, షూట్ రీరింగ్ పద్ధతులపై ఆర్బీకేల ద్వారా నిర్వహిస్తున్న పట్టుసాగు బడుల ద్వారా అవగాహన కల్పించడం వలన సమయంతో పాటు కూలీల ఖర్చు 40 శాతం వరకు తగ్గింది. పైగా 15–20 శాతం మేర మల్బరీ ఆదా అవుతోంది. ఫలితంగా ఈ రైతులు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇలా ప్రభుత్వ చర్యల ఫలితంగా 2019–23 మధ్యలో కొత్తగా 39,640 ఎకరాల మేర సాగులోకి వచి్చంది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.4,075 కోట్ల విలువైన 55,363 టన్నుల క్రాస్‌బ్రీడ్ పట్టుగూళ్లు, 12,542 టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు ఉత్పత్తి కాగా, రూ.3,687.15 కోట్ల విలువైన 9,311 టన్నుల నాణ్యమైన ముడిపట్టును సిల్్కరీలర్లు ఉత్పత్తి చేశారు. 2021–22లో స్థూలాదాయం (జీవీఏ) రూ.11,638 కోట్లు సాధించగా, 2022–23లో రూ.12,098 కోట్లు సాధించి పట్టు పరిశ్రమ కొత్త రికార్డు నెలకొల్పింది. ఏటా రికార్డు స్థాయి ధరలు.. గడిచిన నాలుగేళ్లలో గరిష్టంగా బైవోల్టిన్ రకం పట్టుగూళ్లకు కిలోకి రూ.881 లభించింది. నాలుగేళ్లలో రైతులు పొందిన సగటు ధరను పరిశీలిస్తే కిలో రూ.470 నుంచి రూ.620 మధ్య పలికింది. ఈ ఏడాది గడిచిన మూడునెలల్లో సగటు ధర కిలో రూ.400 నుంచి రూ.480 మధ్య ఉంది. సాధారణంగా ఏటా సెపె్టంబరు నుంచి ఫిబ్రవరి వరకు పట్టుగూళ్లకు మంచి ధర లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న ధరలు వచ్చే మూడునెలల్లో గరిష్ట స్థాయికి చేరే అవకాశముంది. ఇక ఈ ఏడాది (2023–24) 12వేల ఎకరాల్లో మల్బరీ విస్తరణ ద్వారా 15వేల టన్నుల బైవోల్టెన్ పట్టుగూళ్లు, 65వేల టన్నుల క్రాస్‌బ్రీడ్ పట్టుగూళ్ల ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, ఇతర పట్టు రైతులకు ఈ ఏడాది రాయితీలిచ్చేందుకు రూ.25 కోట్ల వరకు ఖర్చుచేయడానికి కార్యాచరణను సిద్ధంచేసింది. ఈనాడు ఆరోపణల్లో నిజంలేదు.. పట్టు రైతులకు కుచ్చుటోపీ అంటూ ఈనాడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ధరలు పడిపోయాయని, రైతులకు, రీలర్లకు ప్రోత్సాహకాలు, క్రిమిసంహాకర మందులకయ్యే వ్యయాన్ని నిలిపి వేసిందనడంలో ఎలాంటి వాస్తవంలేదు. నిజాలు తెలుసుకోకుండా బురద జల్లడం ఈనాడుకు సరికాదు. – డాక్టర్ ఎస్ఎస్ శ్రీధర్, కమిషనర్, పట్టు శాఖ -
మద్దతు ధర ఇవ్వాల్సిందే
ఈ ఖరీఫ్‌లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరత లేకపోవడంతో, వ్యవసాయ ఉత్పత్తులు కూడా గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో ఏ ఒక్క రైతు నష్ట పోకుండా చూడాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో రైతులు పండించే పంటలకు కనీస గిట్టుబాటు ధర తప్పకుండా కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న తరహా ఘటనలు ఎక్కడా పునరావృతం కాకూడదని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఏ సమస్యలు రాకూడదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సన్నద్ధతపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌లో దాదాపు 93.61 లక్షల టన్నుల ఉత్పత్తి (వివిధ పంటలు) జరుగుతుందని అంచనా కాగా, 62 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ సమీక్షలో సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ సన్నద్ధతపై శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ అన్ని విధాలా సహాయకారిగా ఆర్బీకేలు ► పంటల ఈ–క్రాపింగ్‌తో పాటు, రైతుల పేర్లు నమోదు, ధాన్యం సేకరణపై సమాచారం.. ఇతరత్రా ఏదైనా సరే, ఆర్బీకేల (రైతు భరోసా కేంద్రాలు) స్థాయిలోనే జరగాలి. ప్రతి ఆర్బీకే వద్ద పంటల కనీస గిట్టుబాటు ధరల (ఎమ్మెస్పీ) పట్టికను ఒక పెద్ద ఫ్లెక్సీ ద్వారా ప్రదర్శించాలి. గ్రామాల్లో రైతులకు ఆర్బీకేలు అన్ని విధాలుగా పూర్తి సహాయకారిగా ఉండాలి. ► ఏ పంట వేస్తే బాగుంటుంది? ఎంత ఆదాయం వస్తుంది? ఆర్బీకేల ద్వారా ఏ పంటలు సేకరిస్తామన్నది రైతులకు ముందుగానే చెప్పాలి. ఆ తర్వాత కచ్చితంగా ధరలు వచ్చేలా చూడాలి. సాగు నీటి సరఫరాను దృష్టిలో ఉంచుకుని, రైతులకు అవగాహన కల్పించాలి. ఇది జరగకపోతే జేసీలదే బాధ్యత. ► స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలను ఇందులో భాగస్వామ్యులను చేయాలి. ఈ దిశగా ఇప్పటికే సలహా కమిటీలు కూడా ఏర్పాటయ్యాయి. ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ► ప్రతి పంట ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం కావాలి. అప్పుడే ఆ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. బయటి మార్కెటింగ్‌లోనూ అవకాశం కల్పించాలి. ► బహిరంగ మార్కెట్లో పంటల కొనుగోలుదారుల (వ్యాపారుల) వివరాల డేటాను ఈ మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆర్బీకేకు అనుసంధానం చేయాలి. ► ఎఫ్ఏక్యూ (ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ) కంటే తక్కువ నాణ్యతతో సేకరించే బియ్యాన్ని (నూకలు) రవ్వ, పిండి తదితర అవసరాలకు వినియోగించుకునే విషయం పరిశీలించాలి. పంటల ఉత్పత్తి సేకరణకు సంబంధించి ఎస్ఓపీ ఖరారు చేయాలి. పత్తి కొనుగోళ్లు.. మార్కెటింగ్ ► వీలైనంత వరకు ఎక్కువగా పత్తి కొనుగోలు చేయాలి. గత ప్రభుత్వ హయాంలో పత్తి కొనుగోళ్లలో అవినీతి చోటు చేసుకుంది. ఇప్పుడు ఎక్కడా అలాంటి వాటికి తావుండకూడదు. ► మార్కెటింగ్ విభాగం (మార్క్‌ఫెడ్) గ్రామాల్లో రైతుల నుంచి 30 శాతం ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో పాటు, మిగిలిన 70 శాతం ఉత్పత్తులు కూడా అమ్ముడుపోయేలా చూడాలి. పది రకాల పంటల సేకరణ ► ధాన్యం సేకరణకు సంబంధించి రైతుల రిజిస్ట్రేషన్, సేకరణ, పేమెంట్లు మొత్తం ప్రక్రియ “సీఎం యాప్’ (కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైజ్ అండ్ ప్రొక్యూర్మెంట్–సీఎం ఏపీపీ) ద్వారా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ► ఆర్బీకేల వద్ద ముందుగానే రైతుల పేర్లు నమోదు చేసుకుని.. మొక్కజొన్న, సజ్జలు, జొన్నలు, రాగులు, చిరు ధాన్యాలు, వేరుశనగ, పత్తి, కందులు, పెసర్లు, మినుముల వంటి మొత్తం 10 రకా«ల పంటల సేకరణకు సిద్దమవుతున్నామని చెప్పారు. మొత్తం 3 వేల కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. ► ఈ సమీక్షలో మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న, పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ ఖరీఫ్‌లో దాదాపు రూ.3,300 కోట్ల మేర వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ మేరకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు (వాల్యూ యాడెడ్), ఫుడ్ ప్రాసెసింగ్ వంటి చర్యల ద్వారా రైతులకు మరింత మేలు చేయాలి. 2019–20 రబీ సీజన్లో కందులు, శనగలు, మొక్కజొన్న, జొన్న, పసుపు, ఉల్లిపాయలు, అరటి పండ్లు, బత్తాయిలు, టమాటా, పొగాకు తదితర వ్యవసాయ ఉత్పత్తులను దాదాపు రూ.3,200 కోట్లతో కొనుగోలు చేశాం. రైతులకు అన్ని విధాలా అండగా నిలిచాం. -
రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం
రైతుల ఆదాయం రెట్టింపవ్వాలంటే ముందుగా వారు పంటపై చేస్తున్న వ్యయం తగ్గాలి. దాంతో పాటు వారికి లభిస్తున్న గిట్టుబాటు ధర పెరగాలి. అలా జరగాలంటే వీరికి జాతీయ స్థాయి మార్కెట్ అందుబాటులోకి రావాలి. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా ఇది సాధ్యం కావాలి. ఆర్బీకేలను ఈ– మార్కెట్ సెంటర్లుగా ఉపయోగించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతుల ఆదాయం రెట్టింపు కావడమే లక్ష్యంగా వీలైనంత వరకు లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఈ–మార్కెట్ ప్లాట్ ఫామ్స్‌ను వచ్చే ఖరీఫ్ నాటికి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. ప్రతి అంశం ఒకదానికొకటి కనెక్ట్ కావాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్బీకేల్లో మౌలిక సదుపాయాల కల్పనపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ► రైతు భరోసా కేంద్రాల పక్కన దాదాపు రూ.6 వేల కోట్లతో మల్టీపర్పస్ ఫెసిలిటీస్‌లో భాగంగా మొత్తం 13 రకాల సదుపాయాలు కల్పించాలి. ► గోదాములు, డ్రైయింగ్ ప్లాట్‌ఫామ్, కలెక్షన్ సెంటర్స్, కోల్డ్ రూమ్‌లు – స్టోరేజీలు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, అసేయింగ్ ఎక్విప్మెంట్, జనతా బజార్లు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, సెలెక్టెడ్ గ్రామాల్లో ఆక్వా ఇన్ఫ్రా, సెలెక్టెడ్ గ్రామాల్లో క్యాటిల్ షెడ్స్, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ఈ –మార్కెటింగ్ మల్టీపర్పస్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు ఆప్కాబ్ ద్వారా నాబార్డ్‌కు పంపించి చర్యలు తీసుకోవాలి. ► గోదాముల వద్దే జనతా బజార్లు ఏర్పాటు చేయడంపై అనుకూలతలు, ప్రతికూలతలపై అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేయాలి. ఆర్బీకేల్లో మౌలిక సదుపాయాలు ► ఆర్బీకేలను బలోపేతం చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉండాలి. క్వాలిటీ మెటీరియల్, క్వాలిటీ సీడ్స్, క్వాలిటీ ఫెర్టిలైజర్స్ ఉండాలి. ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ వల్ల రైతులు తమ ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ► రైతు తన పంటను అమ్ముకోవాలంటే జనతా బజార్లు అందుబాటులోకి రావాలి. ఆర్బీకేలు అన్నీ ఫంక్షనింగ్‌లోకి రావాలి. పంటల ఈ–క్రాపింగ్ వల్ల వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదవుతుంది. దాని వల్ల పంటలకు బీమా ప్రీమియమ్ చెల్లింపుతో పాటు, వాటికి గిట్టుబాటు ధర కల్పన, పంట నష్టం జరిగితే పరిహారం చెల్లింపు వంటివి ఎంతో సులభం అవుతాయి. ► గోదాముల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? ఎప్పుడు పూర్తి చేయాలి? బడ్జెట్ నిధులు వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలి. ఆ ప్రణాళికలో జనతా బజార్లను, ఆక్వా రంగాన్ని కూడా కలపాలి. ► జనతా బజార్లు, షెడ్యూలింగ్, సెకండరీ ప్రాసెసింగ్‌కు సంబంధించి వెంటనే తగిన ప్రణాళిక సిద్ధం చేయాలి. ఆ తర్వాత పంటలకు కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై కసరత్తు చేయాలి. పీఏసీఎస్‌లను బలోపేతం చేయాలి ► ప్రాథమిక వ్యవసాయ పరపతి సం«ఘాల (పీఏసీఎస్)ను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలి. పీఏసీఎస్‌ల ముందున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై దృష్టి పెట్టాలి. ► దీనిపై ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలించి, ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. మహిళా సాధికారతకు పెద్దపీట ► ఆసరా, చేయూత పథకాలు మెజార్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం. కేవలం పాల ధర పెంచినంత మాత్రాన రైతులకు పూర్తి ప్రయోజనం కలగదు. ► జనతా బజార్లలో మత్స్య సంపద విక్రయ కేంద్రాలను కూడా అందుబాటులోకి తెస్తారు. ఇదంతా ఎందుకంటే సాధ్యమైనన్ని అనుబంధ కార్యకలాపాలను రైతులకు, మహిళలకు అందుబాటులోకి తేవటానికే. వారి ఆదాయం పెంచడానికే. అమూల్, ఇతర సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటం కూడా ఇందులో భాగమే. ఉపాధి అవకాశాలు కోరుతూ ఇప్పటికే మహిళల నుంచి లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గతంలో రికార్డులు తారుమారు ► 2016లో గత ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ (ఆన్లైన్ రికార్డులు) పేరుతో ప్రక్షాళన అంటూ రికార్డులను తారు మారు చేసిందని, ఇష్టానుసారం పేర్లు మార్చేశారని సమావేశంలో అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఈ అంశాన్ని రానున్న స్పందన సమీక్ష అజెండాలో చేర్చి, కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ► సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ స్పెషల్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, అగ్రికల్చర్ కమిషనర్ అరుణŠ కుమార్, నాబార్డు సీజీఎం ఎస్కే జన్నావర్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 30 ఏళ్ల దాకా ఉచిత విద్యుత్‌కు ఢోకా ఉండదు ► పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఓ 30 ఏళ్ల పాటు శాశ్వతంగా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌కు ప్రణాళికలు వేసింది. దీంతో పాటు యూనిట్ రూ.2.50కే లభ్యమయ్యేలా తగు ప్రయత్నాలు చేస్తోంది. ఈ చర్యలన్నీ రైతుకు నాణ్యమైన విద్యుత్ అందేలా చూస్తాయి. చివరికి పంటకయ్యే ఖర్చు తగ్గటానికి ఇవి కూడా ఉపకరిస్తాయి. ► విజన్‌తో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ తీసుకొస్తున్నాం. ఇందువల్ల రైతులపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. ► క్వాలిటీ పవర్ ఇవ్వాలంటే మీటర్లు ఉండాలి. అప్పుడే ఫీడర్లపై భారం ఎంతో కూడా తెలుస్తుంది. ప్రభుత్వమే నేరుగా రైతులకు ప్రత్యేక అకౌంట్లలో డబ్బు జమ చేస్తుంది. అందువల్ల ఎక్కడా రైతులకు విద్యుత్ బిల్లుల సమస్య ఉండదు. ► నాడు శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులను కొన్ని వేల కోట్ల రూపాయలతోనే కట్టారు. అదే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.55 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. ఇదే ప్రాజెక్టు మరో 10 సంవత్సరాలు ఆలస్యం అయితే ఖర్చు రెండింతలు పెరుగుతుంది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్నాం. -
ఇక ఈ-మార్కెటింగ్
వ్యవసాయ మార్కెటింగ్‌లో సంస్కరణలు ఆన్లైన్లో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు ఎలక్ట్రానిక్ కాంటాల ఏర్పాటుకు చర్యలు ధరల నియంత్రణ, అక్రమాలకు అడ్డుకట్ట రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాలో చెల్లింపులు జిల్లాలో ఎనిమిది మార్కెట్ యార్డులలో అమలు పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు, ధరల నిర్ణయం లో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖలో సంస్కరణల కు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వ్యవసాయ మా ర్కెట్ యార్డుల్లో సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించింది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిం చేందుకు నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్(నామ్) విధానాన్ని ప్రవేశపెట్టి ఇంటర్నెట్ అనుసంధానంతో ఆన్లైన్ కొనుగోళ్లకు రూపకల్పన చేసింది. కరీంనగర్ అగ్రికల్చర్ : మార్కెట్ యూర్డుల్లో ప్రధానంగా వరి, పత్తి, మక్కలు, కందులు, పెసర్లు తదితర పంటల ఉత్పత్తులు మాత్రమే అమ్మకానికి వస్తున్నాయి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని తమ ఉత్పత్తులు తీసుకువచ్చిన అన్నదాతలకు మార్కెట్‌యార్డులో చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. దళారుల బెడద, ఇష్టారీతిగా ధరల నిర్ణయం, తూకంలో మోసాలతో రైతులు దగాపడుతూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మార్కెట్‌యార్డులు, సబ్‌మార్కెట్ యార్డులతో పాటు కొత్తగా మంజూరైన వాటితో కలిపి 35 మార్కెట్ యార్డులున్నాయి. ఇందులోని ప్రధాన మార్కెట్లలో వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తూ రైతులను మోసం చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నారుు. మార్కెట్ యార్డులలో క్రయవిక్రయాలు జరపడానికి అవకాశాలున్నప్పటికీ వ్యాపారులకు, కమీషన్‌దారులకు పాలకవర్గం అండదండలు ఉండటం, నేతల ఒత్తిళ్ల కారణంగా మార్కెట్ పరిధిలో అమ్మకాలు తగ్గిస్తూ రైతుల ఇళ్ల వద్దే దోపిడీ సాగిస్తున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న సర్కారు మార్కెట్‌యార్డులలో సాంకేతిక సంస్కరణలకు తెరతీసింది. తొలిదశలో ఎనిమిది మార్కెట్లు నామ్ కింద తొలిదశలో జిల్లాలోని ఎనిమిది వ్యవసాయ మార్కెట్లు ఎంపికయ్యూరుు. అందులో కరీంనగర్, జమ్మికుంట, జగిత్యాల, పెద్దపల్లి, చొప్పదండి, గంగాధర, మెట్పల్లి, గొల్లపల్లి మార్కెట్లున్నాయి. ఆయా మార్కెట్లలో ఆన్లైన్ కొనుగోళ్లకు వసతుల కోసం ప్రభుత్వం ఒక్కో మార్కెట్‌కు రూ.30 లక్షల నిధులు కేటాయించింది. కంప్యూటర్లు, ఎల్ఈడీ మానిటర్లు, ఇతర సామగ్రిని సమకూర్చే పనిలో మార్కెటింగ్‌శాఖ నిమగ్నమయ్యింది. ఇందులో భాగంగా వ్యవసాయ మార్కెట్ యార్డులకు ఎలక్ట్రానిక్ కాంటాలు అందించనున్నారు. తూకం, తక్‌పట్టీలు (ఈ-బిల్లింగ్) ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధానం వచ్చే రబీ సీజన్లో అమలు చేసే అవకాశాలున్నాయి. దశలవారీగా జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో ఎలక్ట్రానిక్ కాంటాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్కెట్‌యార్డుల్లో ఎలక్ట్రానిక్ కాంటాల ద్వారా జరిగే క్రయవిక్రయాలు ఇంటర్నెట్తో అనుసంధానం చేస్తారు. రైతులు మార్కెట్‌కు ఉత్పత్తులు తీసుకురాగానే చీటి ఇచ్చి వాటి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. రైతులు విక్రయించిన ఉత్పత్తులను ఆన్లైన్లో గ్రేడ్లవారీగా నమోదు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా లెసైన్స్ ఉన్న వ్యాపారులు ఉత్పత్తులు కొనుగోలు చేసుకునే అవకాశాలున్నాయి. మార్కెట్ నుంచి అనుమతి పొందాల్సిన అవసరం లేదు. నామ్ నుంచి అనుమతి తీసుకుంటే దాని పరిధిలోని మార్కెట్లలో ఎక్కడైనా కొనే అవకాశం కల్పించనున్నారు. ఆన్లైన్లో చెల్లింపులు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పంట ఉత్పత్తులు అమ్ముకునే రైతులకు ఆన్లైన్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకానున్నాయి. ఇప్పటికే సీసీఐ ఆద్వర్యంలో పత్తి కొనుగోళ్లకు ఆన్లైన్ విధానం అమలు చేశారు. గత సీజన్లో వరి ధాన్యానికి ఇదే పద్ధతిలో చెల్లింపులు చేశారు. కొంతమందికి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో చెక్కుల ద్వారా చెల్లింపులు జరిపారు. ఇలా చెక్కుల కోసం మార్కెట్‌యార్డుల చుట్టూ అన్నదాతలు తిరగాల్సిన అవసరం రాదు. ఉత్పత్తులు కొనుగోలు చేయగానే రైతులకు సమాచారం అందుతుంది. సంబంధిత అధికారులు డబ్బులు జమ చేయగానే వారి ఫోన్లో మెసేజ్ వస్తుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసే నేపథ్యంలో మార్కెట్‌రంగంలో సాంకేతిక పద్ధతులు రావడం రైతులకు కొంత మేలు జరగనుంది. ఆన్లైన్ వ్యవస్థతో వ్యాపారులు ఎక్కువ మంది పోటీలో ఉంటారు కాబట్టి ధర నిర్ణయంలో గతంలో కంటే మెరుగుదల ఉండే అవకాశముంది. పంట ఉత్పత్తుల వివరాలన్నీ కంప్యూటర్లో నిక్షిప్తం చేస్తుండడంతో మోసాలకు ఆస్కారం లేకుండా ఉంటుంది. అక్రమ నిల్వలకు అడ్డుకట్ట పడుతుంది. -
‘ఈ-మార్కెటింగ్’ పరిశీలన
అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ క్రయవిక్రయూలు ప్రారంభించాలి జేసీ ప్రశాంత్‌జీవన్ పాటిల్ వరంగల్సిటి : ఈ-మార్కెటింగ్ పనులను జిల్లా జారుుంట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ శనివారం పరిశీలించారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈ సీజన్ నుంచే ఎన్‌సీడీఎక్స్ ప్రాజెక్టు పర్యవేక్షణలో ఈ-మార్కెటింగ్ అమలుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జేసీ మార్కెట్‌ను సందర్శించి పనులను పరిశీలించారు. ప్రధాన గేటు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక క్యాబిన్ల(టోల్ గేట్ లాగా)ను, నూతన గోదాంలను, చెక్ పోస్టులను పరిశీలించారు. ఇప్పటికే మూడు క్యాబిన్లు నిర్మించారు. క్యాబిన్లు ఎత్తుగా నిర్మించాలని, రైతు వాహనం దిగకుండా స్లిప్ అందించే విధంగా ఏర్పాట్లు చేయూలని మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజుకు సూచించారు. మార్కెట్లోని వేబ్రిడ్జిలలోనే తూకాలు వేయాలని, ప్రైవేటు వేబ్రిడ్జిల తూకాలను పరిగణలోకి తీసుకోవద్దని చెప్పారు. ఈ నెల 25వ తేదీలోగా ఈ-మార్కెటింగ్ పనులు పూర్తి కావాలన్నారు. అక్టోబర్ 1వ నుంచి ఈ-మార్కెటింగ్, ఆన్లైన్ క్రయవిక్రయాలు ప్రారంభం కావాలన్నారు. రేపు సమావేశం కలెక్టరేట్లో సోమవారం మార్కెట్ ఉద్యోగులు, అడ్తి, వ్యాపారులు, ఇంజనీరింగ్, తూనికలు-కొలతల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశామని, అన్ని విభాగాల అధికారులు విధిగా హాజరుకావాలని చెప్పారు. మార్కెట్ ప్రధాన గేటు వద్ద కొనసాగుతున్న రోడ్డు పనులు, కంప్యూటర్ల ఏర్పాట్లు, చిట్టాపద్దు బుక్కులు, దడువాయిలపైన నిఘా, ఎలక్ట్రానిక్ కాంటాల తనిఖీ, పత్తి యార్డులో ధరల డిస్ప్లే స్క్రీన్ ఏర్పాటు, అడ్తి, వ్యాపారులు రైతులకు డబ్బుల చెల్లింపులు, కమిషన్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని మార్కెట్ అధికారవర్గాలు తెలిపారుు. జేసీ వెంట ఆర్డీవో వెంకటమాధవరావు, హన్మకొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, గ్రేడ్-2కార్యదర్శి పి.జగన్మోహన్, రమేష్, బియాబాని, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, మార్కెట్ ఉద్యోగులు వేముల వెంకటేశ్వర్లు, పి.అశోక్, ఓని కుమారస్వామి, మంద సంజీవ,అంజిత్‌రావు, సృజన్,డీఈ ఎల్లేష్, అడ్తి వ్యాపారులు ఉన్నారు. -
'స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కొత్త విషయం కాదు'
హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ యాంత్రీకరణ, పంటల మార్పిడి విధానాలను ప్రోత్సహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గిట్టుబాటు ధర కోసం ఈ-మార్కెటింగ్ విధానం తీసుకొస్తామన్నారు. మార్కెటింగ్ కోసం నిపుణులతో కన్సల్టెన్సీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ ఉద్యోగుల కేలండర్ ను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నట్టు చెప్పారు. రుణమాఫీలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నది కొత్త విషయం కాదని, 1973 నుంచి ఆర్ బీఐ అమలు చేస్తోందన్నారు. -
ఇక ఈ-మార్కెటింగ్!
సాక్షి, కర్నూలు: కర్నూలు వ్యవసాయ మార్కెట్ ప్రస్తుతం ఆధునిక హంగులు సంతరించుకోబోతోంది. త్వరలో జిల్లాలో ‘ఈ-మార్కెట్’ వ్యవస్థ రైతులకు కొంతమేర అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో ‘ఈ-మార్కెటింగ్’ వ్యవస్థ విజయవంతమైన తర్వాత ప్రభుత్వం ఏపీలో కూడా ఈ విధానం అమలు చేయాలని భావించింది. రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఇప్పటికే రాష్ట్రంలోని గుంటూరు, ఖమ్మం, వరంగల్ నిజామాబాద్, కేసముద్రం, మిర్యాలగూడెం వ్యవసాయ మార్కెట్లలో నవంబరు 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.ఈ నేపథ్యంలో రెండో విడతలో భాగంగా కర్నూలులో ‘ఈ-మార్కెట్’ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్నతాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కర్ణాటకలో దిగ్విజయంగా ఈ వ్యవస్థను అమలు చేసిన సంస్థ ప్రతినిధులతో జిల్లా అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలో జిల్లావ్యాప్తంగా ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. రైతులకెన్నో ప్రయోజనాలు.. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే అధికారులు ఆన్‌లైన్‌కు అనుసంధిస్తారు. సరుకు లోపలికి తెచ్చేడానికి బయటకు పంపేదానికి ఎలాంటి తేడాల్లేకుండా ఉండటానికి ప్రత్యేకంగా గేట్లు ఏర్పాటు చేస్తారు. సంబంధిత రైతు సరుకును ఆన్లైన్లో నమోదు చేస్తారు. సీసీ కెమోరాలను కూడా ఉంచుతారు. ప్రతి రైతు పేరు ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌లో నమోదవుతుంది. సరుకు ఎంట్రీగేటు దగ్గర కంప్యూటర్లో నమోదు కాగానే లాట్ నంబరు కేటాయిస్తారు. అదే నంబరును సరుకు దగ్గర ఉంచుతారు. కమీషన్ ఏజెంట్లకు, కొనుగోలుదారులకు ఐటీ నంబరు ఇస్తారు. ప్రతిరోజు వీలైనంత త్వరగా ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారు. బహిరంగ వేలం కాకుండా కొనుగోలుదారులు చెల్లించే ధరను సరుకు దగ్గర నమోదు చేస్తారు. ఈ ధర మరో కొనుగోలుదారుడికి తెలియదు. సరుకు ఎంత ధర పలికింది. సంక్షిప్త సమాచారం ద్వారా రైతుకు తెలియజేస్తారు. గిట్టుబాటు అయితే విక్రయించుకోవచ్చు. లేదా మరుసటి రోజు అమ్ముకోవచ్చు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి రైతుకు గిట్టుబాట ధర లభించే అవకాశం ఉంది. దేశంలోని ఏ మార్కెట్లో అయినా సరే ఏ పంటకు ఎంత ఉందనే విషయం గురించి కూడా ఇక్కడ రైతులు తెలుసుకోవచ్చు. మార్కెట్లోకి వచ్చి ధర విషయంలో దగాపడకుండా ఇంటి దగ్గర సంక్షిప్త సమాచారం ద్వారా ధర తెలుసుకున్న తర్వాతనే గిట్టుబాటు అవుతుందనుకుంటేనే మార్కెట్‌కు విక్రయానికి తెచ్చుకోవచ్చు. మార్కెట్లో గతంలో అక్రమాలకు ఇలాంటి విధానం ద్వారా తావుండదని అధికారులు భావిస్తున్నారు. రైతులు వెంటనే తక్‌పట్టీలు తీసుకునేందుకు ప్రత్యేక కేంద్రాలుంటాయి ఇక్కడ. ప్రతిరోజు ఎంత సరుకు వచ్చింది, ఎంత బయటకు పోయింది కశ్చితంగా నమోదవుతుంది. మార్కెట్‌కు వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది.