అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్ క్రయవిక్రయూలు ప్రారంభించాలి
జేసీ ప్రశాంత్‌జీవన్ పాటిల్
వరంగల్‌సిటి : ఈ-మార్కెటింగ్ పనులను జిల్లా జారుుంట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ శనివారం పరిశీలించారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో ఈ సీజన్ నుంచే ఎన్‌సీడీఎక్స్ ప్రాజెక్టు పర్యవేక్షణలో ఈ-మార్కెటింగ్ అమలుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జేసీ మార్కెట్‌ను సందర్శించి పనులను పరిశీలించారు. ప్రధాన గేటు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక క్యాబిన్ల(టోల్ గేట్ లాగా)ను, నూతన గోదాంలను, చెక్ పోస్టులను పరిశీలించారు. ఇప్పటికే మూడు క్యాబిన్లు నిర్మించారు. క్యాబిన్లు ఎత్తుగా నిర్మించాలని, రైతు వాహనం దిగకుండా స్లిప్ అందించే విధంగా ఏర్పాట్లు చేయూలని మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజుకు సూచించారు. మార్కెట్‌లోని వేబ్రిడ్జిలలోనే తూకాలు వేయాలని, ప్రైవేటు వేబ్రిడ్జిల తూకాలను పరిగణలోకి తీసుకోవద్దని చెప్పారు. ఈ నెల 25వ తేదీలోగా ఈ-మార్కెటింగ్ పనులు పూర్తి కావాలన్నారు. అక్టోబర్ 1వ నుంచి ఈ-మార్కెటింగ్, ఆన్‌లైన్ క్రయవిక్రయాలు ప్రారంభం కావాలన్నారు.
రేపు సమావేశం
కలెక్టరేట్‌లో సోమవారం మార్కెట్ ఉద్యోగులు, అడ్తి, వ్యాపారులు, ఇంజనీరింగ్, తూనికలు-కొలతల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశామని, అన్ని విభాగాల అధికారులు విధిగా హాజరుకావాలని చెప్పారు. మార్కెట్ ప్రధాన గేటు వద్ద కొనసాగుతున్న రోడ్డు పనులు, కంప్యూటర్ల ఏర్పాట్లు, చిట్టాపద్దు బుక్కులు, దడువాయిలపైన నిఘా, ఎలక్ట్రానిక్ కాంటాల తనిఖీ, పత్తి యార్డులో ధరల డిస్‌ప్లే స్క్రీన్ ఏర్పాటు, అడ్తి, వ్యాపారులు రైతులకు డబ్బుల చెల్లింపులు, కమిషన్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని మార్కెట్ అధికారవర్గాలు తెలిపారుు. జేసీ వెంట ఆర్డీవో వెంకటమాధవరావు, హన్మకొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, గ్రేడ్-2కార్యదర్శి పి.జగన్‌మోహన్, రమేష్, బియాబాని, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, మార్కెట్ ఉద్యోగులు వేముల వెంకటేశ్వర్లు, పి.అశోక్, ఓని కుమారస్వామి, మంద సంజీవ,అంజిత్‌రావు, సృజన్,డీఈ ఎల్లేష్, అడ్తి వ్యాపారులు ఉన్నారు.
‘ఈ-మార్కెటింగ్’ పరిశీలన
Published Sun, Sep 13 2015 4:19 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
Advertisement
Advertisement