online marketing
-
2027 నాటికి రూ.పది వేలకోట్లకు చేరే మార్కెట్
దేశంలో 2024 చివరి నాటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రూ.5,500 కోట్లకు చేరుతుందని ‘ఇన్ఫ్లుయెన్సర్.ఇన్’ సంస్థ నివేదిక తెలిపింది. దేశీయంగా డిజిటల్ మార్కెటింగ్ ప్రభావం ఎలా ఉంది..ఇన్ఫ్లుయెన్సర్లు ఏమేరకు ప్రభావం చూపిస్తున్నారు..కంపెనీలు ఎలాంటి ప్లాట్పామ్ల ద్వారా తమ ఉత్పత్పులను ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయి..వంటి అంశాలను ఈ ‘ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రిపోర్ట్ 2024’ నివేదికలో తెలియజేశారు. ఈ నివేదిక రూపొందించేందుకు 100కు పైగా బ్రాండ్లపై సర్వే నిర్వహించారు. 500 కంటే ఎక్కువ మంది క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించినట్లు సంస్థ తెలిపింది.ఈ సందర్భంగా ఇన్ఫ్లుయెన్సర్.ఇన్ సహ వ్యవస్థాపకులు సునీల్ చావ్లా మాట్లాడుతూ..‘డిజిటల్ మార్కెట్ ఇన్ఫ్లుయెన్సర్లకు వృద్ధి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు పెరుగుతుండడంతో కంపెనీలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, లిక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్ల్లో తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. ఈ సంస్థలు ఇన్ఫ్లుయెన్సర్ అనలిటిక్ టూల్స్‌ను సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ మార్కెట్ మరింత వృద్ధి చెందుతుంది’ అని చెప్పారు.ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రిపోర్ట్ 2024లోని కొన్ని ముఖ్యాంశాలు2024 చివరి నాటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ రూ.5,500 కోట్లకు చేరుతుందని అంచనా.డిజిటల్ మీడియా మార్కెటింగ్‌లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ విలువ 11 శాతంగా ఉంది.ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్, ఆటోమొబైల్స్ వంటి విభాగాల్లో 40-57 శాతం బ్రాండ్లు 2026 నాటికి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌పై చేసే ఖర్చును 10% పెంచుతాయి.ఈ మార్కెటింగ్‌లో కంపెనీలకు కొన్ని సవాళ్లున్నాయి. అందులో ప్రధానంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్(ఆర్ఓఐ). అంటే సంస్థ ఉత్పత్తులను ఫలానా యాడ్ చూసే కొనుగోలు చేస్తున్నారనే కచ్చితమైన లెక్కలుండవు.ఇన్‌ఫ్యుయెన్సర్లు కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారు. నమ్మకమైన ప్రేక్షకులను సంపాదించడం కష్టంగా మారుతుంది.2025 నాటికి బ్రాండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ దేశీయంగా రూ.6,875 కోట్లకు చేరనుంది. ఏటా 25 శాతం వృద్ధి రేటుతో 2027 నాటికి ఇది రూ.10,750 కోట్లకు చేరుతుందని అంచనా.బ్రాండ్ ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్‌లో భాగంగా 85 శాతం కంపెనీలు ప్రత్యేకంగా ఇన్ఫ్లుయెన్సర్లను కలిగి ఉన్నాయి. 64 శాతం కంపెనీలు 5-20 శాతం ప్రత్యేకంగా ప్రచారకర్తలకు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిపాయి.గతంలో కంటే 2024లో కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం డిజిటల్ మార్కెటింగ్ ఖర్చులను దాదాపు 10 రెట్లు పెంచినట్లు తెలిపాయి.ఇన్‌స్టాగ్రామ్‌లోని చిన్న ఇన్ఫ్లుయెన్సర్లతో 58.5 శాతం కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయిస్తున్నాయి.ఇదీ చదవండి: ఏఐ ఫండ్‌కు గూగుల్ రూ.వెయ్యి కోట్లు! ఏం చేస్తారంటే..93 శాతం క్రియేటర్లు కంపెనీలతో ఎక్కువకాలం కార్యకలాపాలు సాగించాలని కోరుకుంటున్నారు. 43 శాతం మంది ప్రచారం చేస్తున్న బ్రాండ్ క్వాలిటీపై కూడా దృష్టి సారిస్తున్నారు.క్రియేటర్లు అధికంగా బ్రాండ్ ప్రమోషన్ కోసం ఎంచుకుంటున్న మాధ్యమాల్లో 93.8 శాతం ఇన్స్టాగ్రామ్, 54.4 శాతం యూట్యూబ్, 28.1 శాతం ఫేస్బుక్, మిగతా లింక్డ్ఇన్, స్నాప్‌చాట్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లను వినియోగిస్తున్నారు.కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోట్ చేయాలని ఎక్కువగా 90.2 శాతం ఇన్స్టాగ్రామ్, 51.2 శాతం యూట్యూబ్, 19.5 శాతం లింక్డ్ఇన్ను వినియోగిస్తున్నాయి. -
సేంద్రియ ఉత్పత్తులే సోపానాలు
పక్క వీధి లక్ష్మి పచ్చళ్లు, మసాలాలు, కారం, పసువు.. ఇలా మనం రోజువారీ జీవితంలో ఉపయోగించే ప్రతి ఉత్పత్తినీ వంద శాతం సహజసిద్ధంగా అందిస్తుంది. రోజంతా ఊళ్లు తిరిగి ఆమె సంపాదించేది ఇంటి ఖర్చులకే సరిపోవు. కానీ ఆమె ఉత్పత్తులు కొనుగోలు చేసి ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటుంది. వేరే పని తెలియని లక్ష్మి మాత్రం తనకు నష్టం వస్తుందని తెలిసినా తప్పక ఇదే కొనసాగిస్తోంది. ఇలాంటి వారికి అండగా నిలుస్తూ వారి ఆదాయం పెంచేలా సాయం చేసే స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయి. అలాంటి కంపెనీల్లో టెండ్రిల్స్ నేచురల్స్ ఒకటి. సేంద్రియ ఉత్పత్తుల విభాగంలో మహిళా పారిశ్రామికవేత్తలు, చేతివృత్తులవారు, చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన అజయ్ బాబు 2022లో దీన్ని ప్రారంభించారు. ఈ సంస్థ మహిళా పారిశ్రామిక వేత్తలకు అందిస్తున్న సేవలేమిటి.. కంపెనీ విధానాల వల్ల రైతులకు ఎలా మేలు జరుగుతుంది.. సంస్థ పురోగతికి ‘వాల్‌మార్ట్ వృద్ధి’ కార్యక్రమంలో ఎలా ఉపయోగపడింది..వంటి అంశాలపై సంస్థ వ్యవస్థాపకులు అజయ్‌బాబుతో సాక్షి.కామ్ బిజినెస్ ముఖాముఖి నిర్వహించింది.సేంద్రియ ఉత్పత్తులకు సంబంధించి మహిళా పారిశ్రామికవేత్తలు, రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? వాటి పరిష్కారానికి మీరు ఎలాంటి విధానాలు పాటిస్తున్నారు?మహిళా పారిశ్రామికవేత్తలకు తమ ఉత్పత్తుల మార్కెటింగ్ పెద్ద సవాలుగా మారుతుంది. వినియోగదారులకు ఎలాంటి ఉత్పత్తులు అవసరమో తెలుసుకుని వాటిని సరఫరా చేయాలి. వారికి అందిస్తున్న ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించాలి. దాంతో కస్టమర్లకు మెరుగైన సేవలందుతాయి. ఈ సవాళ్లను పరిష్కరిస్తున్న కంపెనీల్లో టెండ్రిల్స్ ఒకటి. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులు అమ్ముకునేలా రూ.8 లక్షలతో స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్(ఎస్ఐఎస్ఎఫ్ఎస్)ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా ప్రత్యేక టెస్టింగ్ విధానాన్ని రూపొందించాం. దాంతో వినియోగదారులకు నాణ్యమైన ఆర్గానిక్ ఉత్పత్తులను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. చిన్న, సన్నకారు రైతులకు ఎలాంటి పంటలు పండించాలో అవగాహన ఏర్పాటు చేస్తున్నాం. దానివల్ల రైతుల పంటకు సరైన ధర వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు సరైన రక్షణ చర్యలు పాటించకుండా, అవగాహన లేమితో సాగుచేసి నష్టపోతుంటారు. అలాంటి వారికోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎలాంటి పంటలు పండించాలో తెలియజేస్తున్నాం. దాంతో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయవచ్చు.తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఔషధ, సుగంధ మొక్కలను పండించే రైతులతో కలిసి పనిచేశాం. సరైన విధానాలతో పండించే పంటలను మంచి ధర ఇచ్చి కొనుగోలు చేశాం. అలా సేకరించిన ఔషధ, సుగంధ మొక్కల నుంచి ఉత్పత్తి చేసిన నూనె, సౌందర్య సాధనాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. దాంతో మహిళా పారిశ్రామికవేత్తల సాయంతో ఆ ఉత్పత్తులను ప్రాసెస్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నాం. ఫలితంగా రైతులు, పారిశ్రామికవేత్తలు, వినియోగదారులకు మేలు జరుగుతోంది. అరకు, పాడేరు జిల్లాల్లోని అడవి తేనె, పసుపుతో 5% కర్కుమిన్ కంటెంట్ (పసుపుకు రంగును ఇచ్చే పదార్థం)ను, పతారి అడవిలోని గిరిజన ప్రాంతాల నుంచి మిరియాలను ప్రాసెస్ చేస్తున్నాం.బిజినెస్ పరంగా మీకు ఎదురవుతున్న సమస్యలేమిటి?వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను గుర్తించడం ఈ రంగంలో పెద్ద సవాలు. అన్ని ఉత్పత్తులను పూర్తిగా పరీక్షించాకే మార్కెట్లోకి విడుదల చేయాలి. సంస్థ విక్రయించే ప్రతి వస్తువుకు పరీక్ష నివేదికలు అవసరం. టెండ్రిల్స్లో ప్రత్యేకంగా ప్రతి ఉత్పత్తికి ‘ఫూల్ప్రూఫ్ టెస్టింగ్ సిస్టమ్’ను అమలు చేస్తున్నాం. సౌందర్య సాధనాల సేకరణకు తగిన లేబులింగ్, ప్యాకేజింగ్ వంటివి సవాళ్లుగా ఉన్నాయి. వాటిని సమర్థంగా నిర్వహించాలి. ఈ-కామర్స్ విభాగంలోకి ప్రవేశించడం వల్ల ఖర్చులు, ఆన్లైన్ కార్యకలాపాల నిర్వహణ వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మార్కెట్ పరిధిని విస్తరించడానికి ఈ సవాళ్లను అధిగమించడం చాలా కీలకం. అందుకోసం విభిన్న మార్గాలు అనుసరిస్తున్నాం. ఆర్గానిక్ ఉత్పత్తులు బయట మార్కెట్లో లభించే సాధారణ ఉత్పత్తుల కంటే 10-20 శాతం ధర ఎక్కువగా ఉంటాయి. కొత్త కస్టమర్లు వీటిని భారంగా భావిస్తున్నారు. ఇప్పటికే వినియోగిస్తున్నావారికి వాటి విలువ తెలుసు కాబట్టి ధర గురించి ఆలోచించడం లేదు.ఆన్లైన్లో పోటీ అధికంగా ఉంది కదా. ధరల సమస్యను ఎలా అధిగమిస్తున్నారు?ఆన్లైన్లో నిత్యం కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వివిధ సంస్థలు విభిన్న ధరలతో తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ‘వాల్‌మార్ట్ వృద్ధి ప్రోగ్రామ్’లో చేరడం వల్ల ధరలకు సంబంధించిన సమస్యలను అధిగమించేలా సహాయపడింది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఉత్పత్తులను ఎలా విక్రయించాలో ఇందులో నేర్పించారు. వ్యాపారానికి అవసరమైన ఫైనాన్స్ సదుపాయం ఎలా పొందాలో వివరించారు. ప్రధానంగా నేను ఎంచుకున్న రంగంలో ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయాలో ఈ ప్రోగ్రామ్ ద్వారా అవగాహన ఏర్పడింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఎలా వాటి ఉత్పత్తులను ఆన్లైన్లో మరింత సమర్థవంతంగా విక్రయించుకోవచ్చో ఈ ప్రోగ్రామ్ ద్వారా తెలియజేస్తారు. ఫ్లిప్‌కార్ట్ వంటి విస్తారమైన మార్కెట్ అవకాశం ఉన్న ప్లాట్ఫామ్లో ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తారు. ఈ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను అమలు చేయడం వల్ల అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ) లాజిస్టిక్స్ విభాగంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాం. ఆఫ్‌లైన్ లాజిస్టిక్స్ ఖర్చులను 50% తగ్గించడంలో ఈ ఒప్పందం సాయపడుతుంది.భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?విభిన్న ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో సంస్థ ఉత్పత్తుల విక్రయాలను పెంచాలి. కేవలం ఫ్లిప్‌కార్ట్‌లోనే దాదాపు 200 కంటే ఎక్కువగా కంపెనీ ఉత్పత్తులను అమ్మాలని జాబితా ఏర్పాటు చేశాం. ఆ దిశగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో వరుసగా 50, 60 ఆవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్చివరగా..స్థిరంగా ఉత్పత్తుల నాణ్యతను పాటిస్తే వ్యాపారంలో తప్పకుండా విజయం సాధించవచ్చు. కొత్తగా వచ్చే కంపెనీలు కూడా ఈ నియమాన్ని పాటించాలి. యువతకు వ్యాపార రంగంలో అపార అవకాశాలున్నాయి. నచ్చిన రంగంలో ముందుగా నైపుణ్యాలు పెంచుకుని వ్యాపారంలో ప్రవేశిస్తే భవిష్యత్తులో మంచి విజయాలు పొందవచ్చు. -
రైతుకు దన్నుగా ఈ-ఫారం మార్కెట్
రైతులకు లాభాలు చేకూర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటల్లో ప్రభుత్వ రంగ సంస్థలు 30 శాతం మాత్రమే కొనుగోలు చేయగలుగుతున్నాయి. మిగతా 70 శాతం సరుకు దళారులు, కమీషన్ల ఏజెంట్ల ద్వారా వ్యాపారులకు అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతు ఉత్పత్తులు నూరు శాతం నేరుగా వ్యాపారులకే గిట్టుబాటు ధరకు విక్రయించునే విధంగా దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ–ఫారం మార్కెట్ మొబైల్ యాప్‌ను రూపొందించింది. దేశ వ్యాప్తంగా వ్యాపారులను అనుసంధానం చేసి నేరుగా రైతులు తమ ఉత్పత్తులను తాము నిర్ణయించిన ధరలకే విక్రయించుకునేట్లు మార్కెటింగ్‌శాఖ మధ్యవర్తిగా వ్యవహరించనుంది. ఉత్పత్తులు విక్రయించిన మూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేయనుంది. కందుకూరు(పీఎస్ఆర్ నెల్లూరు): రైతులు పండించిన పంట ఉత్పత్తులను సులభంగా, ఎక్కడ అధిక ధర వస్తే అక్కడ విక్రయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఆన్లైన్ మార్కెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఇందు కోసం ‘ఈ–ఫారం మార్కెట్’ పేరుతో ఓ మొబైల్ యాప్‌ను రూపొందించి దేశంలోని 20 వేల మంది వ్యాపారులతో అనుసంధానం చేసింది. ఈ యాప్‌లో రైతులే నేరుగా తమ పంట ఉత్పత్తుల వివరాలను నమోదు చేసుకుని, ధరను కూడా నిర్ణయించుకునే అవకాశం కల్పించింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ ఆన్లైన్ మార్కెటింగ్ విధానం వల్ల రైతులకు విస్తృతమైన మార్కెట్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఉత్తమ ధరను కల్పించడమే లక్ష్యం రైతులు ఆరుగాలం పండించిన పంటలకు ఉత్తమ ధరను కల్పించడమే లక్ష్యంగా ఈ–ఫారం మార్కెట్ మొబైల్ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రతి రైతు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని తన మొబైల్ నంబర్‌తో వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో రైతు తన వద్ద ఏ పంట ఉత్పత్తి ఎంత ఉంది, ఎంత ధరకు విక్రయించుకోవాలని భావిస్తున్నాడో ధరను నిర్ణయించుకోవచ్చు. ఓ రైతు వద్ద మినుములు ఉన్నాయనుకుంటే.. అవి ఎన్ని క్వింటాళ్లు ఉన్నాయి, ఏ క్వాలిటీతో ఉన్నాయి, క్వింటా ఏ ధర ఎంత అనే వివరాలు యాప్‌లో నమోదు చేస్తే సరిపోతుంది. రైతు నమోదు చేసిన ఈ వివరాలను పరిశీలించిన వ్యాపారులు తమకు కావాల్సిన వారు నేరుగా ఆ రైతు వివరాలతో అనుసంధానం అవుతాడు. ఎంత మొత్తం కొంటారు, ఏ రేటుకు కొనుగోలు చేస్తామనే వివరాలు వ్యాపారులు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇదే యాప్‌లో మధ్యవర్తులుగా అనుసంధానమై ఉన్న మార్కెటింగ్ శాఖ అధికారులు ఇటు వ్యాపారితో, అటు రైతుతో మాట్లాడి విక్రయాలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారు. రైతు, వ్యాపారి ఇద్దరి మధ్య అంగీకారం కుదిరిన తర్వాత ఉత్పత్తులను తీసుకెళ్లేందుకు మార్కెటింగ్‌శాఖ అనుమతిస్తుంది. వ్యాపారే నేరుగా రైతు వద్దకు వచ్చి ఉత్పత్తులు చెప్పిన రేటుకు కొనుగోలు చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్‌పోర్టు, హమాలీ ఖర్చులను సైతం పూర్తిగా వ్యాపారే భరించాల్సి ఉంటుంది. రైతుకు ఎటువంటి సంబంధం ఉండదు. మూడు రోజుల్లో నగదు జమ వ్యవసాయ ఉత్పత్తుల విక్రయించిన మూడు రోజుల్లో రైతు ఖాతాకు నేరుగా డబ్బులు జమ చేసే విధంగా మార్కెటింగ్‌శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారు. దీనికి పూర్తి బాధ్యత మార్కెటింగ్‌శాఖ వహిస్తోంది. ప్రస్తుతం పంట చేతికొచ్చిన తర్వాత రైతు నేరుగా కల్లాల్లోనే దళారులు, కమీషన్ ఏజెంట్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నారు. 15 నుంచి 20 రోజుల తర్వాత కానీ డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. ఇదే క్రమంలో తరుగు, తాలు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ మార్కెటింగ్ శాఖ అధికారులు సరుకు నాణ్యతను సర్టిఫై చేయడంతో పాటు వ్యాపారులతో ధరలు మాట్లాడి ఒప్పించే బాధ్యత తీసుకుంటున్నారు. అయితే రైతులు తమ ఉత్పత్తులను క్వాలిటీ ఉండేలా చూసుకోవడం ఒక్కటే చేయాలని, క్వాలిటీ ఎంత బాగుంటే అంత మంచి ధర వస్తుందని చెబుతున్నారు. రైతులు తొందరపడి తక్కువ ధరలకు దళారులకు విక్రయించుకోకుండా ఈ–ఫారం మార్కెట్ విధానంలో అత్యంత సులభంగా విక్రయించుకోవచ్చునని సూచిస్తున్నారు. జిల్లాలో ఈ ఉత్పత్తులకు అవకాశం జిల్లా నుంచి ఇప్పటికే పలు రకాల ఉత్పత్తులను ఈ విధానంలో మార్కెటింగ్ శాఖ అధికారులు విక్రయాలు చేశారు. దాదాపు రూ. 35 కోట్ల లావాదేవీల వరకు జరిగాయి. వేరుశనగ, బియ్యం, కూరగాయలు, పచ్చి మిర్చి, పత్తి వంటివి తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల వ్యాపారులకు విక్రయాలు చేశారు. కందుకూరు, ఉదయగిరి, రాపూరు, ఆత్మకూరు వంటి ప్రాంతాల్లో అన్ని రకాల పంటలు పండుతాయని, మిగిలిన చోట్ల ధాన్యం ఎక్కువగా పండుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు తేల్చారు. డిమాండ్ ఉన్న రాష్ట్రాల్లో జిల్లా నుంచి ఉత్పత్తులను విక్రయించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఈ–ఫారం మార్కెట్ విధానంలో ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. శనగ, వేరుశనగ, మినుము, ఉద్యాన ఉత్పత్తులు, ధాన్యం, బియ్యం ఇలా ఏ పంట ఉత్పత్తి ఉన్నా నేరుగా యాప్‌లో నమోదు చేసుకోవచ్చునని సూచిస్తున్నారు. పండిన ఉత్పత్తుల్లో ప్రభుత్వరంగ సంస్థలైన మార్క్‌ఫెడ్, నాఫెడ్, సివిల్‌సప్లయిస్ వంటి సంస్థలు కేవలం 30 శాతం ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తున్నాయని, మిగిలిన 70 శాతం ఉత్పత్తులను రైతులు దళారుల ద్వారా విక్రయిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ గుర్తించింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టిందని అధికారులు పేర్కొంటున్నారు. విస్తృత మార్కెటింగ్ సదుపాయం ఈ–ఫారం మార్కెట్ రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. నాణ్యమైన ధరలకు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకోవచ్చు. దేశంలోని వ్యాపారులంతా ఉన్న నేపథ్యంలో డిమాండ్ పెరుగుతోంది. అప్పుడు అధిక ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన విక్రయాల్లో రైతులకు చాలా మేలు జరిగింది. వేరుశనగ, కూరగాయలు వంటి తెలంగాణకు అధికంగా పంపించాం. – శ్రీనివాసులు, ఏఎంసీ కార్యదర్శి, కందుకూరు రైతు గిట్టుబాటు ధర పొందవచ్చు ఈ–ఫారం మార్కెట్ వల్ల రైతులకు వ్యాపార అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం రైతులకు బాగా ఉపయోగపడుతోంది. పండించిన పంటను నేరుగా రైతులే అమ్ముకునేందుకు అవకాశం ఉన్న ఈ విధానంపై రైతులకు పూర్తిగా అవగాహన కల్పిస్తే బాగుంటుంది. అధికారులు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. – జె.శ్రీనివాసులు, రైతు, గుడ్లూరు అన్ని రకాల పంటలు అమ్ముకోవచ్చు ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్లైన్ మార్కెట్ విధానం రైతులకు ఉపయోగపడుతుంది. రైతులు నేరుగా తమ పంటలకు ధర నిర్ణయించుకుని అమ్ముకునే అవకాశం ఉంది. అన్ని రకాల రైతులు ఈ పంటలను ఈ–యాప్‌లో నమోదు చేసుకుని అమ్ముకోవచ్చు. రైతులంతా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. – పి.మాధవ, రైతు, ఓగూరు -
సిరుల పట్టు.!
మదనపల్లె సిటీ: పట్టుసాగు రైతులకు సిరులు కురిపిస్తోంది. గత ఏడాది వైరస్‌లతో ఇబ్బందులు పడిన రైతులు ఇప్పుడు ధరల పెరుగుదలతో ఉత్సాహంగా ఉన్నారు. చైనా నుంచి ముడిపట్టు దిగుమతులు నిలిచిపోవడంతో దేశీయంగా దానికి డిమాండ్ పెరిగింది. జాతీయ స్థాయిలో ఆన్లైన్ మార్కెటింగ్‌లో బయ్యర్ల మధ్య పోటీ పెరిగింది. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనట్లు కిలో సగటున రూ.650 నుంచి రూ.700 పైగా ధర పలుకుతోంది. పట్టుగూళ్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇవే ధరలు మరికొన్ని నెలల పాటు కొనసాగవచ్చని రీలర్లు చెబుతున్నారు. గూళ్ల ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమలో రెండవ అతి పెద్ద పట్టుగూళ్ల మార్కెట్ మదనపల్లె. సాధారణ పరిస్థితుల్లో ఇక్కడికి ప్రతి రోజు 2 వేల నుంచి 1500 క్వింటాళ్లకు పైగా పట్టుగూళ్లు వస్తుంటాయి. మదనపల్లె, వాల్మీకిపురం, తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక ప్రాంతాల నుంచి కూడా రైతులు పట్టుగూళ్లను తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. ధరల పెరుగుదలతో ఖుషీ మదనపల్లె పట్టుగూళ్ల మార్కెట్లో శనివారం గరిష్టంగా కిలో రూ.700 పలికింది. ఇటీవల చైనా నుంచి సిల్కు దిగుబడి తగ్గడంతో దేశీయ సిల్కుకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో సిల్కు ధరలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అత్యధికంగా రూ.3 వేల వరకు ఉన్న దేశీయ నాణ్యమైన సిల్కు ధర ప్రస్తుతం రెండింతలు పెరిగింది. ఈ ప్రభావం పట్టుగూళ్ల ధరలపైనా పడి రైతులు లాభాలు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్ (కిలో బైవోల్టిన్ గూళ్లకు రూ.50) కూడా వారికి కలిసొస్తోంది. సంతోషంగా ఉంది ప్రస్తుతం పెరిగిన ధరలు సంతోషాన్నిస్తున్నాయి. పదేళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి ధరలు చూస్తున్నాం. గతంలో ఇలాంటి ధరలు చూడలేదు. మల్బరీ సాగు చేస్తే లాభాలు తప్పకుండా వస్తాయనేందుకు ఇప్పుడున్న ధరలే నిదర్శనం. ఏది ఏమైనా ఈ ధరలు మల్బరీ సాగు చేసిన రైతులందరికీ ఎంతో ఊరట కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. – సోమశేఖర్, రైతు, తవళం, నిమ్మనపల్లె మండలం మంచి లాభాలు చూస్తున్నా నేను రెండు ఎకరాల్లో మల్బరీ సాగు చేశాను. మార్కెట్లో మంచి ధరలు వస్తున్నాయి. ఎండల కారణంగా పురుగుల పెంపకం కొంత ఇబ్బంది అనిపించినా ధరలు మాత్రం బాగున్నాయి. –హరికుమార్‌రెడ్డి, పట్టురైతు, పేయలవారిపల్లె, తంబళ్లపల్లె మండలం జాగ్రత్తలతో మంచి దిగుబడి పట్టుగూళ్లకు మంచి ధరలు ఉండడం శుభపరిణామం. ఈ తరుణంలో రైతులు శాస్త్రీయ పద్దతులు, జాగ్రత్తలు పాటించి మంచి దిగుబడులు సాధించాలి. ముఖ్యంగా మల్బరీ కొరత రాకుండా తోటల పెంపకంపై దృష్టి పెట్టాలి. –రవి, ఇన్చార్జి ఏడీ, పట్టుపరిశ్రమశాఖ,మదనపల్లె. -
ఆన్లైన్లో ‘బందరు’ చీరలు
సాక్షి, మచిలీపట్నం: కరోనా దెబ్బకు కుదేలైన చేనేత పరిశ్రమ మళ్లీ కోలుకుంటోంది. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పేరుకుపోయిన వస్త్ర నిల్వలను ఆప్కో కొనుగోలు చేయడం, తొలిసారిగా ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంతో పరిశ్రమ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది. కృష్ణా జిల్లాలో 58 చేనేత సహకార పరపతి సంఘాలున్నాయి. వాటిలో 37 చేనేత సంఘాల పరిధిలో 7,047 మంది సుమారు 5వేల మగ్గాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతీ ఏటా రూ.45 కోట్ల విలువైన వస్త్ర ఉత్పత్తులు తయారవుతున్నాయి. రాష్ట్రంలో 9 గజాల చీరల తయారీలో కృష్ణా జిల్లా చేనేత కార్మికులు ప్రసిద్ధి. రూ.700 నుంచి రూ.2 వేల వరకు విలువైన ఈ కాటన్ చీరలకు తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారయ్యే వస్త్ర ఉత్పత్తుల్లో 60 శాతం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. ఇందులో 30 శాతం స్థానిక మార్కెట్లో విక్రయిస్తుండగా, 10 శాతం తూర్పు గోదావరి జిల్లా బండారులంక మార్కెట్‌కి తరలిస్తారు. జిల్లాలో ఒక్క పెడన మార్కెట్లోనే ఏటా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వ్యాపారం జరుగుతోంది. కరోనాతో కుదేలు... కరోనా దెబ్బకు చేనేత పరిశ్రమ ఒక్కసారిగా కుదేలైంది. లాక్డౌన్ సమయానికి రూ.6 కోట్ల వస్త్ర నిల్వలు పేరుకు పోగా ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మరో రూ.19.50 కోట్ల విలువైన వస్త్రాలు తయారయ్యాయి. వీటిని ఏ విధంగా అమ్ముకోవాలో తెలియక సొసైటీలు గగ్గోలుపెట్టాయి. ఊపిరిలూదిన ఆప్కో ప్రభుత్వాదేశాలతో సొసైటీల వద్ద పేరుకుపోయిన వస్త్ర నిల్వల్లో రూ.కోటిన్నర విలువైన వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేసింది. దసరా, దీపావళి పండుగలతో సుమారు రూ.6 కోట్లకు పైగా అమ్మకాలు జరగ్గా రూ.4 కోట్లకు పైగా విలువైన వస్త్రాలు పొరుగు రాష్ట్రాలకు ఎగుమతయ్యాయి. ఆన్లైన్లో అమ్మకాలకు శ్రీకారం చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ఈ–మార్కెటింగ్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, గోకాప్ వంటి ఆన్లైన్ కంపెనీలతో ఆప్కో ఒప్పందం చేసుకుంది. మేజర్ సొసైటీలన్నీ ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాయి. ‘బందరు చీరలు’ పేరిట ఉత్పత్తులను ఆన్లైన్లో పెడుతున్నాయి. అమ్మకాలు ఊపందుకున్నాయి మా సొసైటీలో అక్టోబర్ నాటికి రూ.78 లక్షల విలువైన వస్త్రాలున్నాయి. వాటిలో రూ.10 లక్షల వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేయగా, దసరా, దీపావళి సీజన్లలో రూ.30 లక్షల విలువచేసే చీరల అమ్మకాలు జరిగాయి. ఇప్పుడిప్పుడే మార్కెట్ మళ్లీ ఊపందుకుంటోంది. – కేఎన్ శ్రీనివాసరావు, మేనేజర్ ది పోలవరం వీవర్స్ సొసైటీ, పోలవరం చెన్నై సిల్క్స్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి ప్రభుత్వ ప్రోత్సాహంతో పరిశ్రమ గాడిలో పడుతోంది. మాకు చెన్నై సిల్క్స్ నుంచి దాదాపు రూ.34 లక్షల విలువైన చీరలకు ఆర్డర్స్ వచ్చాయి. – శ్రీనివాసరావు, అరుణశ్రీ వీవర్స్ సొసైటీ, కప్పలదొడ్డి పరిశ్రమ మళ్లీ కోలుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలి తాలనిస్తున్నాయి. ఇప్పటికే రూ.1.45 కోట్ల విలువైన వస్త్రాలను రెండు విడతల్లో ఆప్కో కొనుగోలు చేసింది. ఆన్లైన్లో ఆర్డర్స్ మొదల య్యాయి. – ఎస్.రఘునందన, ఏడీ, చేనేత జౌళి శాఖ -
డిజిటల్ వైపు.. కంపెనీల చూపు..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో కంపెనీల వ్యూహాలు గణనీయంగా మారిపోతున్నాయి. చాలా మటుకు సంస్థలు డిజిటల్ మాధ్యమం వైపు మళ్లడం లేదా ఇప్పటికే ఆన్లైన్లో ఉన్న పక్షంలో ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ స్వరూపాన్ని వేగంగా మార్చుకోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, జెన్‌ప్యాక్ట్, విప్రో, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు భారీగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు లు దక్కించుకుంటూ ఉండటమే ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్ మహమ్మారి అందరిపై ప్రభా వం చూపుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ సర్వీసులను, ఉత్పత్తుల విక్రయాలకు తక్షణం ఆన్లైన్ బాట పట్టాల్సిన అవసరాన్ని గుర్తించాయని విశ్లేషకులు తెలిపారు. చదవండి: తగ్గుతున్న కరోనా ప్రభావం వేగంగా వ్యూహాల అమలు.. ప్రస్తుత వ్యాపార కార్యకలాపాల్లో మార్పులు చేర్పులు చేసే దిశగా ఇన్ఫోసిస్‌కు అమెరికాలో రెండు భారీ డీల్స్ దక్కాయి. వీటిలో ఒకటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాన్‌గార్డ్‌ది కాగా మరొకటి ఇంధన రంగ దిగ్గజం కాన్ ఎడిసన్‌ది. కరోనా సంక్షోభం కారణంగా చాలా మటుకు క్లయింట్లు డిజిటల్ వ్యూహాలను మరింత వేగంగా అమలు చేయాలనుకుంటున్నారని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ ఇటీవల తెలిపారు. భారీ స్థాయిలో డిజిటల్ రూపాంతరం చెందేందుకు వాన్గార్డ్ అమలు చేస్తున్న ప్రణాళికలు ఇలాంటి ధోరణులకు నిదర్శనమని ఆయన చెప్పారు. అయిదేళ్ల పాటు జరగాల్సిన కొన్ని ప్రాజెక్టుల కాలవ్యవధిని కొంతమంది క్లయింట్లు ఏకంగా 18 నెలలకు కుదించేసుకున్నారని జెన్‌ప్యాక్ట్ వర్గాలు వివరించాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించి గత కొద్ది నెలలుగా ప్రస్తుత, కొత్త క్లయింట్లతో చర్చలు గణనీయ స్థాయిలో జరుగుతున్నాయని పేర్కొన్నాయి. చదవండి: అంత ‘స్పేస్’ వద్దు! వ్యయ నియంత్రణ చర్యలు... వచ్చే రెండు నుంచి నాలుగు క్వార్టర్ల పాటు వ్యాపార సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడంపైనా, డిజిటల్‌కు మారడంపైనా దృష్టి పెడతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. తదనుగుణంగానే ఐటీ బడ్జెట్లు కూడా ఉంటాయని తెలిపారు. దీంతో ఐటీ కంపెనీలకు భారీగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్స్ దక్కుతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ ఎవరెస్ట్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. ఇతరత్రా కారణాల కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలన్నదే వ్యాపార సంస్థల లక్ష్యంగా ఉంటోందని పేర్కొన్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా చూస్తే జెన్‌ప్యాక్ట్, ఇన్ఫోసిస్‌తో పాటు ఇతరత్రా టెక్ సర్వీసుల కంపెనీల క్లయింట్లలో ఎక్కువగా కన్జూమర్ గూడ్స్ తదితర రంగాల సంస్థలు త్వరితగతిన డిజిటల్ వైపు మళ్లేందుకు సేవల కోసం డీల్స్ కుదుర్చుకున్నాయి. యాక్సెంచర్, ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు 500 మిలియన్ డాలర్ల పైచిలుకు విలువ చేసే పలు ఒప్పందాలతో దూసుకెడుతున్నాయి. ఇప్పటిదాకా డిజిటలీకరణపై తగిన స్థాయిలో ఇన్వెస్ట్ చేయని సంస్థలు ప్రస్తుతం దాని ప్రాధాన్యతను గుర్తించి, ప్రధాన ఎజెండాగా మార్చుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ఇంటికే పండ్లు కార్యక్రమానికి పెరుగుతున్న జనాదరణ
సాక్షి, హైదరాబాద్ : వాక్ ఫర్ వాటర్, తెలంగాణ మార్కెటింగ్‌శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇంటికే పండ్ల కార్యక్రమానికి జనాదరణ పెరుగుతోంది. ఫోనుకాల్స్, ఆన్లైన్లో ఆర్డర్లు పోటెత్తుతున్నాయి. నాణ్యత బాగుండడం, తక్కువ ధరకావడంవల్ల పండ్లు కావాలంటూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. సంబంధిత వెబ్‌సైట్‌కి ఇప్పటికి 26 లక్షల హిట్స్ రాగా... ఇప్పటి వరకు వచ్చిన లక్షన్నర ఆర్డర్లలో... 65 వేలు సరఫరా చేశారు. డెలివరీ వేగవంతం చేసేందుకు తపాలశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నారు. లాక్డౌన్ వేళ దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రజల ఇళ్ల వద్దకే తాజా పండ్లు సరఫరా చేస్తున్నందున... ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డిని నగరవాసులు ప్రశంసిస్తున్నారు. ఇటు రైతులు అటు వినియోగదారులకి ఏకకాలంలో మంచి చేస్తున్నారంటూ కొనియాడుతున్నారు. ఈ కిట్‌లో రూ.300 కు ప్రజల ఇంటి వద్దకే మామిడి(1.5 కేజీ), బొప్పాయి (3 కేజీలు), నిమ్మ(12కాయలు), పుచ్చ(3 కేజీలు), బత్తాయి(2 కేజీలు), సపోట(1 కేజీ) పండ్ల డెలివరీ చేస్తున్నారు. 88753 51555 నంబర్‌కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే ఇంటివద్దకే పండ్లు అందిస్తున్నారు. ( ‘సరిలేరు’ తర్వాత మహేశ్ చిత్రం ఇదే! ) ప్రజాదరణ, అధికారుల సహకారంతో... ఇంటికే పండ్ల కార్యక్రమం దిగ్విజయంగా సాగుతోందని వాక్ ఫర్ వాటర్ ఛైర్మన్ ఎం. కరుణాకర్‌రెడ్డి తెలిపారు. నలుమూలల పంపిణీకోసం తపాలశాఖ రంగంలోకి దిగుతోందన్నారు. పండ్లు తీసుకున్న వారిలో 98 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని... నాణ్యత, పరిమాణం బాగున్న కారణంగా మళ్లీ మళ్లీ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రవాస తెలంగాణ పౌరులు... తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకి పండ్ల సంచి అందించాలంటూ ఆన్లైన్లో పెద్ద ఎత్తున వినతులు పంపిస్తున్నారని చెప్పారు. అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు ఫోన్లు చేసి తమకి కూడా పండ్లు కావాలని కోరుతున్నట్లు వెల్లడించారు. సర్కార్ పిలుపు మేరకు కొందరు దాతలు స్పందించి పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, అనాధలకి పండ్లు వితరణ చేస్తున్నారని చెప్పారు. కరోనాతో దేశంలోని ప్రధాన రంగాలు స్తంభించిన సమయంలో రైతులని ఆదుకునేందుకు సత్ సంకల్పంతో చేపట్టిన ప్రయోగానికి జనామోదం లభించడం సంతోషంగా ఉందన్నారు. (ఇర్ఫాన్ భార్య సుతప భావోద్వేగ పోస్టు) -
ఈ–మార్కెట్ కొనుగోళ్లు
నేటినుంచి వనపర్తి మార్కెట్‌యార్డులో ప్రారంభం ఆన్లైన్లోనే కొనుగోళ్లు - లాభపడనున్న రైతన్నలు వనపర్తి: శాస్త్రీయ పద్ధతిలో పంట ఉత్పత్తులకు నాణ్యతను బట్టి ధర నిర్ణయించాలని ప్రభుత్వం రూపొందిస్తున్న నామ్ (నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్) ఈ–కొనుగోలు విధానాన్ని గురువారం నుంచి వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో అమలు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 44మార్కెట్ యార్డుల్లో ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. గురువారం తాజాగా మరికొన్ని మార్కెట్లలో ఈ–కొనుగోలు విధానం అమలుకానుంది. ఇందుకోసం మార్కెట్‌యార్డు అధికారులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు వ్యాపారులకు, కమీషన్ ఏజెంట్లకు ఆన్లైన్ కొనుగోళ్లపై శిక్షణ ఇవ్వనున్నట్లు వనపర్తి మార్కెట్ యార్డు కార్యదర్శి నరసింహ తెలిపారు. అధికారులు బుధవారం ఆన్లైన్ కొనుగోళ్ల ప్రాక్టీస్ కోసం కమీషన్ ఏజెంట్లకు, ట్రేడర్లకు ఆన్లైన్లో టెండర్లు వేయాలని మొదటి ట్రైనింగ్ తరహాలో టెండర్లు పంపించాలని సూచించారు. గురువారం నుంచి అధికారికంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ– కొనుగోళ్ల విధానం ఇలా.. ఇదివరకు ఇబ్బడిముబ్బడిగా రైతులు మార్కెట్ యార్డుకు సరుకులు తీసుకురావటం, కమీషన్ ఏజెంట్లు సరుకును చేతిలోకి తీసుకుని పరిశీలించి ధర నిర్ణయించేవారు. మార్కెట్లో ఈ– కొనుగోలు విధానం ప్రారంభించిన తర్వాత పూర్తిగా కాగితరహిత విక్రయాలు నిర్వహించాల్సి ఉంటుంది. రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చే పంట ఉత్పత్తులను అధికారులు పంట రకం, ఎన్ని క్వింటాళ్లు తదితర వివరాలతో పాటు రైతు సెల్ నంబర్‌ను సేకరిస్తారు. సరుకు నాణ్యతను పరీక్షించి ఆన్లైన్లో వివరాలను పొందుపరుస్తారు. కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్స్ ఆయా సరుకుల వివరాలను ఆన్లైన్లో చూసి, వాటిని కొనడానికి ధరలను నిర్ణయించి ఆన్లైన్లో టెండర్లు సమర్పించాలి. వచ్చిన ధరలలో కెల్లా ఎక్కువ ధర కోడ్ చేసిన వారికి రైతులు సరుకు విక్రయించవచ్చు. ఈ–కొనుగోళ్లు ప్రారంభించగానే ధాన్యం నాణ్యత పరీక్షించించే ప్రత్యేక ల్యాబ్, కమీషన్ ఏజెంట్లు టెండర్లు వేసేందుకు కంప్యూటర్లను స్థానిక మార్కెట్ యార్డు కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆన్లైన్ మొబైల్ ఉన్నవారు ఇంటర్నెట్ సౌకర్యంతో మొబైల్ ద్వారానే టెండర్లు పంపించుకునే అవకాశం ఉంటుంది. ఈ మార్కెట్ ఉపయోగాలు.. – ఈ విధానం ద్వారా రైతులు విక్రయానికి తీసుకువచ్చిన సరుకు కొనుగోలు కోసం కమీషన్ ఏజెంట్లు, ట్రేడర్స్ సమర్పించే టెండర్ దరఖాస్తుల్లో ఎక్కువగా కనిపించే దిద్దుకాలు, కొట్టివేతలు, పరిస్థితిని బట్టి మార్చేసే పరిస్థితి ఇక నుంచి చెక్‌పడనుంది. – ఆన్లైన్ కొనుగోళ్ల వల్లlపంటల నాణ్యతను బట్టి ధర లభించే అవకాశం ఉంటుంది. స్థానికంగా ఉండే కమీషన్ ఏజెంట్లతో పాటు, ఆన్లైన్లో దేశ, విదేశాల నుంచి టెండర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దీని వలన కొనుగోలుదారుల్లో పోటీ పెరిగి అన్నదాతకు ధర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యత పేరుతో జరిగే మోసాలకు చెక్ పడే అవకాశం ఉంది. అధికారికంగా నేడు ప్రారంభం వనపర్తి మార్కెట్లో గురువారం నుంచి ఆన్లైన్ కొనుగోళ్లు ప్రారంభించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ– కొనుగోళ్లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వ్యాపారులకు అవగాహన కల్పిస్తాం. – నరసింహ, కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్‌యార్డు, వనపర్తి -
‘నామ్’కు నేడు ప్రధాని శ్రీకారం
జాతీయ మార్కెట్లతో రాష్ట్ర మార్కెట్ల అనుసంధానం సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మార్కెటింగ్ విధానం ద్వారా వ్యాపారులు దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు వీలు కల్పించే జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ (నామ్) పథకాన్ని ప్రధాని మోదీ గురువారం ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 214 వ్యవసాయ మార్కెట్లను అనుసంధానిస్తారు. అందులో రాష్ట్రం నుంచి 44 మార్కెట్లు ఉండగా.. తొలుత నిజామాబాద్ (పసుపు), తిరుమలగిరి (ధాన్యం), వరంగల్ (మొక్కజొన్న), హైదరాబాద్ (మిర్చి), బాదేపల్లి (ధాన్యం) మార్కెట్లలో ప్రారంభించేందుకు ఆశాఖ ఏర్పాట్లు పూర్తి చేిసిం ది. ఈ పథకం ప్రారంభం సందర్భంగా ప్ర ధాని మోదీ నిజామాబాద్ యార్డులోని రై తులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి జరుపుతారని అధికారులు తొలుత ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసినా.. అది రద్దయ్యే అవకాశముందని మార్కెటింగ్ శాఖ వర్గాలు వెల్లడించాయి. -
ఆన్లైన్లో లోకల్ మార్కెట్
ఇప్పుడు యువకుల నుంచి పెద్దల వరకూ నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ మార్కెటింగ్ వైపు చూస్తున్నారు. సెల్ చార్జర్ నుంచి కంప్యూటర్ వరకు ప్రతి వస్తువునూ ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. బ్రాండెడ్ వస్తువులకు ఆన్లైన్ మార్కెటింగ్ ఉండడం సహజం. అరుుతే స్థానికంగా ఉండే వ్యాపారాలను కూడా ఆన్లైన్ మార్కెటింగ్ చేయాలనే ఆలోచన నుంచి పుట్టిందే way2bazar. జిల్లాలోని ప్రధాన నగరాల్లో షాపులను కూడా ఆన్లైన్ మార్కెటింగ్ పరిధిలోకి తెస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో పందలపాకకు చెందిన పడాల మురళీవెంకటకృష్ణారెడ్డి వెబ్‌సైట్‌కు రూపకల్పన చేశారు. ఎం.ఫార్మసీ, ఎంబీఏ చదివిన వెంకటకృష్ణారెడ్డి తన మిత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఆన్లైన్ మార్కెటింగ్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. - పందలపాక (బిక్కవోలు) * ఆకట్టుకుంటున్న way2bazar వెబ్సైట్ * రూపొందించిన వెంకటకృష్ణారెడ్డి * ఆదరణ బాగుందంటున్న వ్యాపారులు స్థానిక ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేస్తారంటే.. ఆన్లైన్ మార్కెటింగ్ చేసే ప్రధాన పట్టణాల్లో షాపులను way2bazarలో నమోదు చేస్తారు. నమోదైన షాపులు స్థానికంగా మార్కెటింగ్ చేసే వస్తువులపై వారు ఇచ్చే డిస్కౌంట్లను, షాపులో లభ్యమయ్యే వస్తువుల వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఈ సైట్ చూసే వారికి ఏ షాపులో ఏ వస్తువులు లభిస్తాయి, ఎంత రిబేటు లభిస్తుంది తదితర వివరాలు తెలుస్తాయి. ఈ సైట్లో లాగిన్ అయిన వారికి ఒక కూపన్ కూడా ఇస్తారు. ఈ కూపన్ తీసుకు వెళ్తే అదనంగా షాపు వారు రిబేట్ ఇస్తారు. ఇప్పుడు జిల్లాలో ఈ వెబ్‌సైట్‌కు ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. జాతీయ, అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పోటీ కారణంగా దెబ్బతింటున్న స్థానిక వ్యాపారాలను నిలబెట్టేందుకు ఈ తరహా వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు వెంకటకృష్ణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలలో ఈ వెబ్‌సైట్‌ను విశాఖపట్నంలో కూడా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. వ్యాపారం పెరిగింది.. ఈ వెబ్సైట్ లో రిజిస్టరయ్యాను. వెబ్సైట్ చూసి షాపునకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సంక్రాంతికి వ్యాపారం బాగా సాగింది. - మహేష్, సోనా షాపింగ్‌మాల్, కాకినాడ స్థానిక వ్యాపారులకు మంచి అవకాశం.. స్థానిక వ్యాపారులకు ఈ వెబ్సైట్ చక్కటి అవకాశం. ఇప్పుడందరూ ఇంటర్నెట్ ఎక్కువగా చూస్తున్నారు. ఈ వెబ్సైట్ చూసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. - శివ, ఫ్యాషన్‌మాల్, రాజమండ్రి త్వరలో శాఖల విస్తరణ స్థానిక వ్యాపారాలకు వెబ్సైట్ ప్రారంభించాలన్న ఆలోచననే ఆచరణలో పెట్టాను. వ్యాపారులతో పాటు ప్రజల నుంచీ ఆదరణ లభిస్తోంది. త్వరలో శాఖలు విస్తరిస్తా. - పడాల మురళీవెంకటకృష్ణారెడ్డి, వెబ్సైట్ రూపకర్త -
‘ఈ-మార్కెటింగ్’ పరిశీలన
అక్టోబర్ 1 నుంచి ఆన్లైన్ క్రయవిక్రయూలు ప్రారంభించాలి జేసీ ప్రశాంత్‌జీవన్ పాటిల్ వరంగల్సిటి : ఈ-మార్కెటింగ్ పనులను జిల్లా జారుుంట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ శనివారం పరిశీలించారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఈ సీజన్ నుంచే ఎన్‌సీడీఎక్స్ ప్రాజెక్టు పర్యవేక్షణలో ఈ-మార్కెటింగ్ అమలుకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జేసీ మార్కెట్‌ను సందర్శించి పనులను పరిశీలించారు. ప్రధాన గేటు సమీపంలో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక క్యాబిన్ల(టోల్ గేట్ లాగా)ను, నూతన గోదాంలను, చెక్ పోస్టులను పరిశీలించారు. ఇప్పటికే మూడు క్యాబిన్లు నిర్మించారు. క్యాబిన్లు ఎత్తుగా నిర్మించాలని, రైతు వాహనం దిగకుండా స్లిప్ అందించే విధంగా ఏర్పాట్లు చేయూలని మార్కెట్ కార్యదర్శి అజ్మీర రాజుకు సూచించారు. మార్కెట్లోని వేబ్రిడ్జిలలోనే తూకాలు వేయాలని, ప్రైవేటు వేబ్రిడ్జిల తూకాలను పరిగణలోకి తీసుకోవద్దని చెప్పారు. ఈ నెల 25వ తేదీలోగా ఈ-మార్కెటింగ్ పనులు పూర్తి కావాలన్నారు. అక్టోబర్ 1వ నుంచి ఈ-మార్కెటింగ్, ఆన్లైన్ క్రయవిక్రయాలు ప్రారంభం కావాలన్నారు. రేపు సమావేశం కలెక్టరేట్లో సోమవారం మార్కెట్ ఉద్యోగులు, అడ్తి, వ్యాపారులు, ఇంజనీరింగ్, తూనికలు-కొలతల శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశామని, అన్ని విభాగాల అధికారులు విధిగా హాజరుకావాలని చెప్పారు. మార్కెట్ ప్రధాన గేటు వద్ద కొనసాగుతున్న రోడ్డు పనులు, కంప్యూటర్ల ఏర్పాట్లు, చిట్టాపద్దు బుక్కులు, దడువాయిలపైన నిఘా, ఎలక్ట్రానిక్ కాంటాల తనిఖీ, పత్తి యార్డులో ధరల డిస్ప్లే స్క్రీన్ ఏర్పాటు, అడ్తి, వ్యాపారులు రైతులకు డబ్బుల చెల్లింపులు, కమిషన్ తదితర అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని మార్కెట్ అధికారవర్గాలు తెలిపారుు. జేసీ వెంట ఆర్డీవో వెంకటమాధవరావు, హన్మకొండ తహసీల్దార్ రాజ్‌కుమార్, గ్రేడ్-2కార్యదర్శి పి.జగన్మోహన్, రమేష్, బియాబాని, ప్రభాకర్, లక్ష్మీనారాయణ, మార్కెట్ ఉద్యోగులు వేముల వెంకటేశ్వర్లు, పి.అశోక్, ఓని కుమారస్వామి, మంద సంజీవ,అంజిత్‌రావు, సృజన్,డీఈ ఎల్లేష్, అడ్తి వ్యాపారులు ఉన్నారు. -
దేశంలో విస్తరిస్తున్న డిజిటల్ మార్కెటింగ్
రూ.3,575 కోట్లుకు విలువ.. - బెంగళూరు, ఢిల్లీలో సేవలను - ప్రారంభించిన జెన్‌వై మీడియం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఆన్లైన్ మార్కెటింగ్ రోజురోజుకూ విస్తరిస్తోంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.2,750 కోట్లుగా ఉన్న డిజిటల్ మార్కెటింగ్ (డిజిటల్ అడ్వర్టైజింగ్ మార్కెట్).. 2015-16 నాటికి రూ.3,575 కోట్లకు చేరిందని డిజిటల్ మార్కెటింగ్ స్టార్టప్ జెన్‌వై మీడియం కో-ఫౌండర్, సీఈఓ యశ్వంత్ కుమార్ తెలిపారు. ఏటా ఈ విభాగం 30 శాతం వృద్ధి రేటును కనబరుస్తుందన్నారు. మూడేళ్ల క్రితం సోషల్ మీడియా, కంటెంట్ డెవలప్మెంట్, పే పర్ క్లిక్, ఆన్లైన్ రిప్యూటేషన్ మేనేజ్మెంట్ అనే నాలుగు కేటగిరీల్లో హైదరాబాద్‌కే పరిమితమైన జెన్‌వై సేవలు ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీలకూ విస్తరించాయి. విద్య, వైద్య రంగంలో డిజిటల్ మార్కెటింగ్ ఎంతగానో ఉపయుక్తమని అందుకే తమ కస్టమర్లలో చాలా మంది ఆ విభాగాల వారే ఉన్నారని కుమార్ ఈ సందర్భంగా విలేకరులకు చెప్పారు. ప్రస్తుతం 20 కంపెనీలు తమ సేవలను వినియోగించుకుంటున్నాయని.. ఇందులో సైమా, జనప్రియ, ఈ-కిన్‌కేర్ అనే మూడు కంపెనీలు హైదరాబాద్‌కు చెందినవి ఉన్నాయన్నారు. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 150 నగరాల్లో జెన్ వై సేవలను విస్తరించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. -
ఆన్లైన్ మార్కెటింగ్ కోర్సు
ఆన్లైన్ మార్కెటింగ్ మెళకువలను నేర్పేందుకు ఈనెల 18 నుంచి కొత్త బ్యాచ్‌ను ప్రారంభిస్తోంది మాదాపూర్‌లోని డిజిటల్ మార్కెటింగ్ సంస్థ. ఇప్పటికే బిజినెస్ రంగంలో ఉన్నవారితో పాటు గృహిణులు, స్టార్టప్ యజమానులు, ఎంటర్‌ప్రెన్యూర్స్, మేనేజ్మెంట్ స్టడీస్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌కు ఈ ఆన్లైన్ మార్కెటింగ్ లాభదాయకమని సంస్థ తెలిపింది. డిజిటల్ మార్కెటింగ్‌లో వస్తున్న నయా ట్రెండ్ విషయాలను చెప్పేందుకు ఫ్రీ డెమో క్లాస్‌లను నిర్వహిస్తోంది. ఆసక్తి గలవారు 088015 66566 నంబర్లో సంప్రదించవచ్చు. -
ఇదే లేటెస్ట్ ఫ్యాషన్!
ఏ వస్తువైనా, దుస్తులైనా కొనాలంటే మార్కెట్‌కు వెళ్లడం పాత పద్దతి. ఇంట్లో నుంచి బయటకు కదలకుండా ఆన్లైన్లో సెర్చ్ చేసి కొరుకున్న వస్తువును కొనుగోలు చేయడం లేటెస్ట్ ఫ్యాషన్ అయింది. సమయం సందర్భం లేకుండా, ఎప్పుడైనా, ఎక్కడనుంచైనా కొనుగోలు చేసే అవకాశమున్న ఆన్లైన్ మార్కెట్ రాకెట్ వేగాన్ని మించిపోతోంది. ఆన్లైన్ దెబ్బకు నిన్నటి వరకు కళకళలాడిన రిటైల్ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. దేశంలో ఆన్లైన్ మార్కెట్ బాగా విస్తరిస్తోంది. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన ఈ వ్యవహారం ఇప్పుడు ఓ మోస్తరు నగరాలు, పట్టణాలకు కూడా పాకింది. ఇంటికి చేర్చే అవకాశం ఉంటే గ్రామలకు కూడా విస్తరించడం ఖాయం. త్వరలో ఆ ముచ్చట కూడా తీరుతుంది. అందరికీ ఆన్లైన్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులతో పాటు వ్యాపారం కూడా భారీస్థాయిలో విస్తరిస్తోంది. ఈ ఏడాది ఏకంగా లక్ష కోట్ల రూపాయలకు ఆన్లైన్ మార్కెట్ చేరిందని లెక్కలు చెపుతున్నాయి. కోరుకున్న వస్తువు దగ్గరికి వెళ్లి కొనుగోలు చేయడం కాకుండా, కొరుకున్న వస్తువును అనుకున్న చోటుకు తెచ్చే ఆన్లైన్ వ్యాపారంపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. వస్తువు ఏదైనా సరే దుస్తుల నుంచి బుక్స్ వరకు, పలక నుంచి పుస్తకం వరకు, టీవీ నుంచి ఫ్రిజ్ వరకు సమస్తం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్న ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రిటైల్ వ్యాపారాన్ని 30-50 శాతం మేర ఈ కామర్స్ మార్కెట్ షేర్ చేసుకుందని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. 2016 కల్లా ఈ-కామర్స్ మార్కెట్ 93 వేల కోట్ల రూపాయలకు ఎగబాకే అవకాశముందని భావిస్తున్నారు. 2012లో ఆన్లైన్ కొనుగోలుదారుల సంఖ్య 80 లక్షల మంది కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 3 కోట్ల 50 లక్షలకు చేరింది. 2016 నాటికి ఆన్లైన్ షాపర్ల సంఖ్య 10 కోట్లకు చేరుకుంటుందని మార్కెట్ అంచనా. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ సుమారు 18,600 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఆన్ లైన్ మార్కెట్ కస్టమర్లకు అన్నిరకాలుగా సేవలను అందిస్తుండటంతో వినియోగదారులు ఆన్లైన్ వ్యాపారం పట్ల ఆసక్తి చూపుతున్నారని రిటైల్ వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కామర్స్ మార్కెట్ భవిష్యత్తులో రిటైల్ వ్యాపారం లేకుండా చేయొచ్చనే భయాందోళనలు కూడావ్యక్తం అవుతున్నాయి. ఎలక్ట్రానిక్ మార్కెట్లోనూ ఈ కామర్స్ తన సత్తా చాటుతోంది. లేటెస్ట్ టెండ్ర్కు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేయడం ద్వారా ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ను ఇప్పటికే పూర్తి స్దాయిలో తనవైపు తిప్పుకుంది. వాషింగ్‌మెషిన్, ఫ్రిజ్, ఏసీ లాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులను అన్ లైన్ మార్కెట్లో కాకుండా రిటైల్ మార్కెట్లోనే కొనడం వల్ల కస్టమర్లకు ప్రయోజకరంగా ఉంటుందని ఎలక్ట్రానిక్స్ రిటైల్ వ్యాపారస్తులు అంటున్నారు. ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం, ఆన్లైన్లో షాపింగ్‌కు మొగ్గుచూపుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణంగా కనపడుతోంది. ఎక్కడినుంచైనా, సమయంతో సంబంధంలేకుండా షాపింగ్ చెసే వెసులుబాటు ఉండటం వల్ల ప్రధానంగా యువత ఆన్ లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆఖరికి తినుబండారుల కూడా ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఈ-కామర్స్ మార్కెట్ మరింత విస్తరిస్తే మునుముందు ఒక్క ఏంటర్టైన్మెంట్ కోసం మాత్రమే నగర వాసులు బయటికి వెచ్చే అవకాశం వుంటుంది. -
‘నెట్’ ఇంటి నుంచి... నట్టింట్లోకి...
ఏటా రూ.3వేల కోట్లకు పైగా ఆన్లైన్ వ్యాపారం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ కావాలంటూ అమ్మానాన్నలకు ప్రణవ్ అప్లికేషన్... నిన్న ఓ టీవీ షోలో చూసిన న్యూ లుక్ డ్రెస్ కోసం సింధుజ తన మామయ్య రాకేష్ వద్ద గారాలు... ఓ కార్టూన్ చానెల్లోని బుజ్జిపాప పట్టుకున్న స్కూల్ బ్యాగ్ లాంటిదే తనకూ కావాలని చిన్నారి శ్రీహిత మారాం. అప్పుడెప్పుడో ఓ షాపులో చూసిన ఖరీదైన ల్యాప్‌టాప్‌కు భారీగా డి స్కౌంట్ అంటూ అదే సమయంలో రాకేష్‌కు సురేష్ ఫోన్. కొత్త డిజైన్ జ్యువెలరీ బాగుందని... అది కొంటే... రాగిణి ఇంట్లో జరిగే శుభకార్యానికి వేసుకోవచ్చని భర్త కరుణాకర్‌కు రాజేశ్వరి దరఖాస్తు...ఉన్నది ఒక్క ఆదివారమే. సమయమూ సరిపోదు. ఒకే రోజు...ఒకేసారి అందరికీ అన్ని వస్తువులూ కొనడమంటే తలకుమించిన పనే... సింధుజ సలహాతోఅంతా కలసి ఇంట్లోని కంప్యూటర్ ముందు వాలిపోయారు. ‘నెట్’ ఇంట్లోకి వెళ్లారు. నచ్చినవి ఆర్డర్ చేసుకున్నారు... అరగంటలో మొత్తం షాపింగ్ పూర్తయిపోయింది. అదీ ఆన్లైన్ మార్కెట్ మహిమ. * ఇంటి ముంగిటికే సమస్తం * ఆటవస్తువుల నుంచి స్మార్ట్ఫోన్ల వరకు ఆన్లైన్ లోనే.. * నగరంలో శరవేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ షాపింగ్ * మొబైల్ ఫోన్లు, బ్రాండెడ్ దుస్తులదే సింహభాగం * కొరియర్ సంస్థలకూ ఆదాయం * వేలాది మందికి ఉపాధి సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ మార్కెటింగ్... ఓ సరికొత్త షాపింగ్ ప్రపంచాన్ని ఆవిష్కరిస్తోంది. కాలాన్నీ... డబ్బునూ... శ్రమనూ తగ్గిస్తోంది. కావాల్సిన వస్తువులన్నీ రోజుల వ్యవధిలో మన కళ్ల ముందుకు తీసుకువస్తోంది. అది కూడా ఎలాంటి తేడా లేకుండా. ఎంతో నమ్మకంగా. మార్కెట్ ధర కంటే తక్కువగా. అందమైన దుస్తులు మొదలుకొని... స్మార్ట్ఫోన్లు, నచ్చిన పుస్తకాలు... పిల్లల ఆటవస్తువులు... ఒకటేమిటి... కోరుకున్న ఏ వస్తువైనా క్షణాల్లో కొనేసే సదుపాయం ఇప్పుడు ‘క్లిక్’ దూరంలో ఉంది. మన జీవితంలో ఓ భాగంగా మారిపోయిన ఇంటర్నెట్ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌ను సైతం మన ముంగిట్లో నిలుపుతోంది. ఉరుకులు పరుగుల జీవితంలో షాపింగ్‌కు వెళ్లే తీరిక... ఓపిక లేనివారికి ఇది ఓ వరంగా మారిందనడంలో సందేహం లేదు. నగరం దృష్టిని ఆన్లైన్ మార్కెట్ తొందరగానే తనవైపు తిప్పుకుంది. సాఫ్ట్వేర్ నిపుణులు, ఉన్నతోద్యోగులే కాదు... సగటు వేతన జీవులు... గృహిణులు... విద్యార్థులు సైతంవస్తువుల కోసం ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. నగరంలో కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇళ్ల వద్ద పెద్ద పెద్ద బ్యాగులు భుజాన వేసుకొని కోరుకున్న వస్తువులను ఇంటి ముందుకు తెచ్చిచ్చే డెలివరీబాయ్‌ల చేతుల్లో అత్యధికం ఆన్లైన్ మార్కెటింగ్ వస్తువులే. హైదరాబాద్ నగరంలో ఏటా రూ.3 వేల కోట్లకు పైగా ఆన్లైన్ వ్యాపారం జరుగుతోందని మార్కెట్ నిపుణుల అంచనా. స్మార్ట్ఫోన్లు, దుస్తులదే అగ్రస్థానం.. నగర వాసులు ఎక్కువగా ఆన్లైన్లో స్మార్ట్ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ ధరల కంటే కొంత తక్కువ ధర... నాణ్యత, సేవలు సంతృప్తికరంగా ఉండడంతో చాలామంది ఆన్లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత బ్రాండెడ్ దుస్తులది రెండో స్థానం. ఇక పర్సనల్ కంప్యూటర్లు, ట్యాబ్లెట్ పీసీలు, గృహోపకరణాలు తరువాతి స్థానాల్లో ఉం టున్నాయి. హైదరాబాద్‌లో అత్యధిక ఆన్లైన్ మార్కెట్ కలిగిన అమెజాన్, ఫ్లిప్‌కార్డ్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు తాము అందజేసే వివిధ రకాల వస్తువులపై ఎప్పటికప్పుడు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. రూ.3,500నుంచి రూ.5 వేల వరకు ఉండే బ్రాండెడ్ షూపైనా ఆన్లైన్ మార్కెట్లో 40 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. వివిధ రకాల బ్రాండెడ్ దుస్తులపై కూడా 40 నుంచి 50శాతం డిస్కౌంట్ ఉంటోంది. మార్కెట్లో రూ.800కు లభించే లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఆన్లైన్లో రూ.550 కే లభించడం విశేషం. ఎనిమిది గంటల పాటు విద్యుత్ సదుపాయం ఉండే సోలార్ లై ట్ ఆన్లైన్లో రూ. 1,400కే దొరుకుతోంది. ఇలా సగటు, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ధరల్లో వస్తువులు లభించడంతో అందరూ ఆన్లైన్ బాటలో నడుస్తున్నారు. 67 శాతం కొనుగోళ్లతో ఢిల్లీ మొదటి స్థానంలో, 60 శాతంతో ముంబయి రెండోస్థానంలో, 50శాతంతో బెంగళూర్ మూడో స్థానం లో ఉండగా, 40 శాతం ఆన్లైన్ మార్కెట్‌తో హైదరాబాద్ 4వ స్థానంలో ఉన్నట్లు అంచనా. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో తమ స్థానాన్ని పదిలపరచుకునేందుకు ఇప్పుడు ఫ్యూచర్ గ్రూప్, అరవింద్, లైఫ్ స్టైల్, వాల్‌మార్ట్, గోద్రెజ్ వంటి సంస్థలూ ఆన్లైన్ ఆర్డర్లకు శ్రీకారం చుట్టాయి. యువతకు ఉపాధి... సాఫ్ట్వేర్ నిపుణులు, మేనేజ్మెంట్ గురూలు మొదలుకొని వినియోగదారుల ఇంటి వద్దకు వచ్చి వస్తువులను అందజేసే డెలివరీ బాయ్స్ వరకు వేలాది మందికి ఆన్లైన్ మార్కెటింగ్ అద్భుతమైన ఉపాధి నిస్తోంది. ‘ఆన్లైన్ షాపింగ్ యాజమాన్యాలు, పోర్టళ్లకు యువతే మహారాజులు. వారిలోని నైపుణ్యాలను, సృజనాత్మకతను అంచనా వేసి సముచితమైన ప్రాధాన్యం ఇస్తున్నా’ మని ఈబే బిజినెస్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ హెడ్ వివేక్ ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం నగరంలో అన్ని ఆన్లైన్ షాపింగ్ పోర్టళ్ల ఉద్యోగుల సంఖ్య 20 వేలపైనే ఉంది. డెలివరీ సిబ్బంది, కస్టమర్ సర్వీస్, వెబ్ యాప్ డెవలపర్లు, క్వాలిటీ నిపుణులు, కంటెంట్ రచయితలు, గ్రాఫిక్ డి జైనర్లు వంటి విభాగాల్లో పుష్కలమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయి. ప్రవాసులు సైతం... నగరంలోని తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు బహుమతులు పంపించాలనుకునే ఎన్నారైలు సైతం ఇప్పుడు ఆన్లైన్నే ఎంచుకుంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాల్లోని తమ ఆప్తుల పుట్టిన రోజులు, పెళ్లి రోజుల వంటి శుభకార్యాలకు నగరానికి చెందిన వందలాది మంది ఉద్యోగులు, వ్యాపారులు బహుమతులు పంపించేందుకు ఆన్లైన్ మార్కెట్‌నే ఆశ్రయిస్తున్నారు. ఇలా ఆన్లైన్ బిజినెస్ ద్వారా డెలివరీ అవుతున్న వస్తువుల్లో ఎన్నారైల వాటా 25 శాతం ఉంటుందని కొరియర్ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. కొరియర్ సంస్థలకూ వరం ఆన్లైన్లో కొనుగోలు చేసే వస్తువులను కొరియర్ సర్వీస్ ద్వారా సంబంధిత సంస్థలు వినియోగదారులకు చేరవేస్తున్నాయి. కొన్ని వ్యాపార సంస్థలు సొంతంగా కొరియర్ సంస్థలను కలిగి ఉంటే... మరి కొన్ని ఇతర కొరియర్ సంస్థలపైన ఆధార పడుతున్నాయి. దీంతో కొరియర్ సంస్థల వ్యాపారాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాపార రంగంలో హైదరాబాద్ 25 శాతం వాటా కలిగి ఉన్నట్లు అంచనా. నగరంలో వెయ్యికి పైగానే కొరియర్ సంస్థలు సేవలందిస్తున్నాయి. వీటిలో అరామెక్స్ ఇండియా, బ్లూ డాట్ ఎక్స్‌ప్రెస్, కాంటినెంటల్, డీహెచ్ఎల్ ఎక్స్‌ప్రెస్, డీటీడీసీ, లాజిస్టిక్స్ వరల్డ్ వైడ్, ఫ్లయిట్ కొరియర్, ఓవర్ నైట్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు అనేకం ఉన్నాయి. వినియోగదారుల సంతృప్తే కీలకం ప్రతి రోజు 25 నుంచి 30 వస్తువులు అందజేస్తున్నాం. పండుగలు, ప్రత్యేక పర్వదినాల్లో 50 వస్తువుల వరకు డెలివరీ అవుతాయి. శని, ఆది వారాలు మినహా మిగతా రోజుల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వర్షాలు, ట్రాఫిక్ ఇబ్బందులు వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆలస్యమవుతుంది. ముఖ్యంగా బర్త్‌డే పార్టీలు, నచ్చిన వాళ్లకు బహుమతులు అందజేసే సమయాల్లో వినియోగదారుల నుంచి లభించే ప్రశంసలు మాకు కొండంత బలాన్ని ఇస్తాయి. పదోతరగతి చదువుకున్న నాలాంటి ఎంతోమందికి ఈ ఆన్లైన్ మార్కెటింగ్ ఉపాధినిస్తోంది. నెలకు రూ.10 వేల దాకా జీతం లభిస్తుంది. - సురేష్‌బాబు, అమెజాన్ డెలివరీ బాయ్ క్లిక్‌తో అన్నీ ఇంటికే... నాకు ఏది కావాలన్నా ఆన్లైన్లోనే కొనుక్కుంటున్నా. దుస్తుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇలా చాలా వస్తువులు ఆన్లైన్లోనే కొన్నా. ఇంట్లో నుంచి కదలకుండా ఒక్క మౌస్ క్లిక్‌తో ఏదైనా కొనుక్కోవచ్చు. పైగా ఏ వస్తువు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో చూసుకుని మనకు నచ్చిన వాటిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. - పి.మానస, విద్యార్థిని సమయం, డబ్బూ ఆదా ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో ఆన్లైన్ షాపింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది. షాపింగ్‌కు వెళ్లి గంటల తరబడి తిరిగి అలసిపోయే పరిస్థితి ఉండదు. దర్జాగా ఇంట్లో కూర్చుని కావాల్సిన వస్తువులకు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్ ధరల కంటే తక్కువకే లభిస్తాయి. ఎక్కువ ప్రొడక్టులు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల సమయంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. ఆన్లైన్ షాపింగ్‌లో వివిధ ఆఫర్స్‌తో పాటు క్రెడిట్ కార్డు ఉపయోగించినపుడు రాయితీలు ఇస్తున్నారు. - వై. కిరణ్, చార్టెడ్ అకౌంటెంట్ ఆకర్షణీయమైన ఆఫర్లు... ఇటీవల ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్ బాగా పెరిగింది. వీటికి సంబంధించిన వెబ్సైట్లు చాలానే ఉన్నాయి. పండుగల సందర్భంలో భారీ డిస్కౌంట్లు, ఉచిత బహుమతులు ఇవ్వడం వంటివి బాగా ఆకట్టుకుంటున్నాయి. తక్కువ ధరకే లభిస్తుందంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు? ఈఎంఐ సౌకర్యం కూడా ఉండటంతో చాలామంది ఆన్లైన్ షాపింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. - మల్లీశ్వరి, గృహిణి -
దొంగను పట్టించిన ఆన్లైన్ ప్రకటన
మలేషియా టౌన్షిప్: ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా సెల్‌ఫోన్ కొనడానికి వచ్చిన ఓ వ్యక్తి దొంగిలించిన బైకును వారి వద్ద ఉంచి ఫోన్‌తో ఉడాయించాడు. కొన్ని రోజుల తర్వాత అదే తరహాలో మోసం చేయడానికి వచ్చి అదే వ్యక్తులకు చిక్కాడు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... గోకుల్ ప్లాట్స్‌కు చెందిన సోము, చందు తమ వద్ద స్మార్ట్ ఫోన్ అమ్మకానికి ఉన్నట్టు ఆన్లైన్ నెట్‌వర్క్‌లో పెట్టారు. ఈ ప్రకటన చూసిన దీపక్ అనే వ్యక్తి ఈనెల 6న స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయడానికి సోము, చందు వద్దకు వచ్చాడు. ‘ఈ ఫోన్ మా అక్క కోసం తీసుకుంటాను. ఆమెకు చూపించి నచ్చితే కొంటాను’ అని చెప్పాడు. అందుకు బదులుగా తన బైకు ఉంచి ఫోన్ తీసుకెళ్లాడు. రోజులు గడిచినా తిరిగి రాలేదు. తాము మోసపోయిన విషయాన్ని వారు గ్రహించారు. మరో ఫోన్ అమ్మకానికి ఉన్నట్టు సృష్టించి వైబ్సైట్లో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటన చూసిన దీపక్ మంగళవారం మళ్లీ వారి వద్దకు వచ్చాడు. సోము, చందు అతణ్ణి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అతని జేబులను తనిఖీ చేయగా వివిధ రకాల పేర్లతో ద్విచక్ర వాహనాల నకిలీ ఆర్సీ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులతోపాటు బైక్‌లకు చెందిన మారు తాళాలు, పదుల సంఖ్యలో సిమ్ కార్డులు లభించాయి. దీపక్‌ను అదుపులోకి తీసుకున్న మియాపూర్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ ముఠాలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలిసింది. -
ఫ్లిప్‌కార్ట్‌లో 12,000 మందికి ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: ఆన్లైన్ మార్కెటింగ్(ఈకామర్స్) సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది 12,000 మందికి కొత్తగా ఉపాధి కల్పించనుంది. దేశంలో ఆన్లైన్ షాపింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో కార్యకలాపాలకు మద్దతుగా సిబ్బందిని పెంచుకోవాలని భావిస్తోంది. ఇంటర్నెట్ వినియోగంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్న ఇండియాలో పెరుగుతున్న బిజినెస్‌కు అనుగుణంగా సాంకేతిక పటిష్టతను మెరుగుపరచుకోవాలని చూస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 13,000 మంది సిబ్బందిని 25,000కు పెంచుకోనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్(సీపీవో) మేకిన్ మహేశ్వరి చెప్పారు. తమ అవసరాలకు అనుగుణంగా వివిధ కేటగిరీల్లో ఉద్యోగులను నియమించుకోనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఒక్క ఇంజనీరింగ్‌లోనే 1,200 మందిని నియమించుకోనున్నట్లు తెలిపారు. ఈ బాటలో అమ్మకందారుల సంఖ్యను కూడా 12,000కు పెంచుకోవడం ద్వారా 30 పట్టణాలకు విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు. కంపెనీ గత నెలలో దుస్తుల విక్రయ ఆన్లైన్ సంస్థ మింత్రాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 2,000 కోట్లను వెచ్చించింది. -
'నమో' ల్యాప్‌టాప్‌లు.. 'రాగా' ఫోన్లు.. 'ఆప్' టోపీలు..
-
‘స్పీక్ ఏసియా’ సూత్రధారి అరెస్టు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఆన్లైన్ మార్కెటింగ్ పేరుతో 24 లక్షల మంది నుంచి రూ. 2,200 కోట్లు వసూలు చేసి పరారైన ‘స్పీక్ ఏసియా’ సూత్రధారి రామ్ సుమిరన్ పాల్ (37) ఎట్టకేలకు చిక్కాడు. గత 28 నెలలుగా పరారీలో ఉన్న పాల్‌ను ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో సోమవారం రాత్రి పోలీ సులు అరెస్టు చేశారు. సోదరుడు రామ్ నివాస్ పాల్ తో కలసి సుమిరన్ పాల్ ఆన్లైన్ మార్కెటింగ్ పేరిట మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. సుమిరన్ పాల్‌పై ముంబైలో 8 కేసులతోపాటు ఆంధ్రప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో వైట్‌కాలర్ నేరాలకు సంబంధించి కేసులు నమోదైనట్లు ఢిల్లీ అదనపు పోలీసు కమిషనర్ (క్రైం) రవీంద్ర యాదవ్ తెలిపారు. సింగపూర్, ఇటలీ, బ్రెజిల్ తదితర దేశాల్లో సోదరులిద్దరూ మల్టీలెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) కంపెనీలను ఏర్పాటు చేసి చందాదారులను ఆకర్షించారని...అలా వచ్చిన నిధులతో ఆ తర్వాతి కాలంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని చెప్పారు. ఫైవ్‌స్టార్ హోటళ్లలో సెమినార్లు, ఫంక్షన్లలో బాలీవుడ్ తారల ఆటపాటలను ఏర్పాటు చేసి ఏజెంట్లు ఎక్కువ మంది ప్రజల చేత పెట్టుబడులు పెట్టించేలా ఆకర్షించారని వివరించారు. గోవాలో నిర్వహించిన ఓ ఫంక్షన్‌కు వచ్చే చందాదారుల కోసం ప్రత్యేక రైలును, రిసార్టులోని బీచ్‌ను అద్దెకు తీసుకున్నారన్నారు. వివిధ రాష్ట్రాల్లో మోసాల ద్వారా వారు రూ. 2,276 కోట్లు కొల్లగొట్టారన్నారు. సంస్థకు చెందిన 210 బ్యాంకు ఖాతాల్లోని రూ. 142 కోట్లను ముంబైలోని ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఫ్రీజ్ చేసిందని మరో 150 బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలపై దర్యాప్తు చేస్తోందన్నారు. కాగా, సుమిరన్ పాల్‌పై నమోదైన కేసుల విచారణ కోసం ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు ఆయన్ను త్వరలో పీటీ వారెంట్‌పై తీసుకెళ్లనున్నట్లు సమాచారం.