ఉద్యోగులకు ఒక బకాయి డీఏ | DA is a backlog of employees | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు ఒక బకాయి డీఏ

Published Fri, Aug 4 2017 3:52 AM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

DA is a backlog of employees

సాక్షి, అమరావతి: ఉద్యోగులకు వ్యతిరేకంగా రూపొందించిన ముసాయిదా జీఓలపై వెల్లువెత్తిన నిరసనను చల్లార్చేందుకు ఏపీ ప్రభుత్వం వారికి బకాయి డీఏల్లో ఒకటి చెల్లించాలని నిర్ణయించింది. సర్వీసు నిబంధనల్లో మార్పులు చేయడం ద్వారా రిటైర్‌మెంట్‌ వయసు తగ్గించడంతో పాటు ఉద్యోగులకు వ్యతిరేకంగా రూపొందించిన ముసాయిదా జీఓలను ‘సాక్షి’ బయటపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో దాన్నుంచి తప్పించుకునేందుకు తక్షణం బకాయి పడిన రెండు డీఏల్లో ఒకటి మాత్రమే చెల్లించాలని నిర్ణయించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం సీఎం  బాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వివరాలను మంత్రులు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

ఠి ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకూ ఐదు డీఏలు ఇవ్వగా మరో రెండు డీఏలు బకాయి పడ్డాయి. వాటిలో ఒకదాన్ని చెల్లిం చేందుకు ఆమోదం. 2016 జనవరి 1 నుంచి 2017 ఆగస్టు 31 వరకూ బకాయి పడిన 20 నెలల డీఏను ఉద్యోగుల జీపీఎఫ్‌ అకౌంట్‌లో వేసేందుకు అనుమతి. సెప్టెంబర్‌ నుంచి ఉద్యోగుల జీతాలతోపాటు ఈ డీఏ చెల్లిం చేందుకు ఆమోదం. ఇందుకు నెలకు రూ. 100 కోట్లు ఖర్చవుతుంది. ఠి అభ్యంతరాలు లేని ఆక్రమణలను క్రమబద్ధీకరించాలని నిర్ణయం. ఒకటి నుంచి 100 చదరపు గజాల వరకూ బీపీఎల్‌ కుటుంబాలకు ఉచితంగా క్రమబద్ధీకరణ. ఏపీఎల్‌ కుటుంబాలకు 1–100 చదరపు గజాల వరకు 7.5 శాతం, 101–250 చదరపు గజాల వరకు 15 శాతం, 500 చదరపు గజాల వరకూ 30 శాతం ఫీజు వసూలు. 500 గజాలు దాటిన ఆక్రమణలు తొలగించాలని నిర్ణయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement