పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి | chevireddy bhaskar reddy takes on chandrababu govt | Sakshi
Sakshi News home page

పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి

Published Mon, Oct 12 2015 11:37 AM | Last Updated on Mon, Aug 13 2018 4:11 PM

పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి - Sakshi

పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయి

తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కొన్ని పిచ్చి కుక్కలు మొరుగుతున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. వైఎస్ జగన్ ఆరోగ్యంపై మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై చెవిరెడ్డి సోమవారం తిరుపతిలో మండిపడ్డారు.

ప్రత్యేక హోదా కోసం దమ్ముంటే రాజీనామా చేయాలని మంత్రులిద్దరికి సవాల్ విసిరారు. సదరు మంత్రులిద్దరికీ మత్రి భ్రమించిందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తమ పార్టీ మొత్తం ఎమ్మెల్యేలు 67 మంది రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నామని చెవిరెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం గుంటూరు నగర శివారులోని నల్లపాడు రోడ్డులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. సోమవారం ఆయన చేపట్టిన దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. దీంతో ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుంది. అయితే వైఎస్ జగన్ ఆరోగ్యంపై చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ సోమవారం ఆరోపణలు చేశారు. దీంతో చెవిరెడ్డి భాస్కరరెడ్డి పైవిధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement