Kamineni Srinivas
-
ప్రమాణస్వీకారానికి రాలేకపోతున్నా
-
కామినేని కట్టుకథలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఒట్టు వేసి ఒక మాట.. వేయకుండా ఒక మాట చెప్పను.. ఇది పాపులర్ సినిమా డైలాగ్. అయితే ఈ నేత మాత్రం ఒట్టు వేసి మరీ చెప్పిన మాటలను అధికారంలోకి రాగానే కొల్లేటిలో కలిపేస్తారు. మళ్లీ ఎన్నికలు రాగానే అవే హామీలు, మాటలను మళ్లీమళ్లీ చెబుతూ ప్రజలను మభ్యపెట్టడం పరిపాటిగా మార్చుకున్నారు. ఆయనే కైకలూరు బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్. తనకు విస్తృత పరిచయాలు ఉన్నాయని.. కొల్లేరు సమస్యలు నరేంద్ర మోదీతో మాట్లాడి సెటిల్ చేస్తానని.. జలజీవన్ మిషన్ మనదేనని.. ఇంటింటికీ మంచినీరు ఇస్తానని ఇలా బిల్డప్ బాబాయ్ మాదిరిగా అడ్డగోలుగా మాటలు చెబుతూ రాజకీయం చేస్తుంటారు. కేవలం మూడు పారీ్టలు ఉంటేనే కూటమి బీజేపీ అభ్యరి్థగా బరిలో నిలవడం, మూడు పారీ్టలు లేకపోతే బీజేపీని స్థానికంగా గాలికి వదిలేసి విదేశాల్లో ఉండటం ఆయనకు సర్వసాధారణం. ప్రస్తుత ఎన్నికల్లోనూ ఇలాంటి మోసపూరిత హామీలు, ఒట్లతో కామినేని కైకలూరులో ప్రచారం చేస్తున్నారు. జెండాలు జతకడితేనే.. కామినేని శ్రీనివాస్ తనని తాను బీజేపీ నేతగా అభివరి్ణంచుకుంటారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యరి్థగా కైకలూరు నుంచి పోటీ చేసి ఓడిపోయా రు. అయితే బడా వ్యక్తులతో ఆర్థిక సంబంధాలు, బంధుత్వాలతో బీజేపీ పెద్దాయన సూచనలతో 2014లో బీజేపీలో చేరి కైకలూరు నుంచి కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. మొదటిసారి గెలిచిన వెంటనే చంద్రబాబు కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా కొనసాగారు. కట్ చేస్తే.. 2019లో జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు లేకపోవడంతో హైదరాబాద్, అమెరికాకు పరిమితమై స్థానిక బీజేపీని పూర్తిగా నిరీ్వర్యం చేసి టీడీపీ నేతలకు సహకారం అందించారు. ఫలితంగా టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఐదేళ్ల పాటు కైకలూరు వైపు కన్నెత్తి చూడలేదు. తాజాగా పొత్తు ఆశలు చిగురించడం, మూడు పార్టీల చర్చలు మొదలు కావడంతో మళ్లీ కైకలూరు తనదేనంటూ హడావుడి మొదలుపెట్టి జెండా.. అజెండా లేకుండా నియోజకవర్గంలో కొద్దిరోజులు తిరిగారు. టికెట్ ఖరారు కావడంతో బీజేపీ అభ్యరి్థగా మళ్లీ తిరుగుతున్నారు. పెద్దింట్లమ్మపై ఒట్టు కామినేని శ్రీనివాస్‌కు ఒట్లు వేయడం బాగా అలవాటు. ఒక్కోసారి ఒక్కో దేవుడిని వాడుకుంటారు. ఒకసారి కాణిపాకం వినాయకుడు, మరో సారి కైకలూరు శ్యామలాంబ, కొల్లేటికోట పెద్దింట్లమ్మ, ఆయన స్వగ్రామంలో లక్ష్మీనృసింహస్వామి ఇలా అందరిపైనా ఒక రౌండ్ ఒట్లు వేసేశారు. 2014లో కాంటూరు కుదింపు, పెద్దింట్లమ్మ వారధి నిర్మిస్తానని కొల్లేటికోట పెద్దింట్లమ్మపై ఒట్టు వేసి నెరవేర్చని కామినేని తిరిగి మళ్లీ ఇటీవల అమ్మవారిపై కొల్లేరు సమస్యలు పరిష్కరిస్తానని ఒట్టు వేశారు. చనిపోయిన తన అమ్మ చివరి కోరిక ఎమ్మెల్యే కావడం.. భవిష్యత్తులో ఇక పోటీ చేయనని, ఈసారి కొత్తగా అమ్మ సెంటిమెంట్‌తో జనాల్లోకి వెళుతున్నారు. -
‘పవన్ నాకు సీటు లేదనలేదు.. నామినేషన్ వేస్తా’
కైకలూరు: పొత్తుల కుంపటి ఏలూరు జిల్లా కైకలూరులోనూ రాజుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా కై కలూరు సీటును బీజేపీ నుంచి కా మినేని శ్రీనివాస్‌కు కేటాయించారు. ఇప్పటికే ఆ యన గ్రామాల పర్యటనలు సైతం చేస్తున్నారు. అయితే జనసేన సీటును బీవీ రావు ఆశిస్తున్నారు. 2019లో జనసేన తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి జనసేన ఇన్చార్జిగా జెండాను మోస్తూ గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేశారు. పొత్తుల్లో భాగంగా కామినేనికి సీటు కేటాయించడంపై భైరవపట్నం శుభం ఫంక్షన్ హాలులో ఆదివారం సాయంత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి జనసేన నాయకులు, అభిమానులు, బీవీ రావు సామాజికవర్గమైన యాదవ సామాజిక వర్గం వారు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జెండాలు మో సి, పార్టీ కోసం కష్టపడితే పవన్ కల్యాణ్ సీటును త్యాగం చేయడం ఏమిటని నాయకులు ప్రశ్నించారు. కై కలూరు సీటు విషయంలో పునరాలోచన చేయాలని స్పష్టం చేశారు. పొత్తు ధర్మం పాటించాలి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, కోరుకొల్లు సర్పంచ్ బి.లీలా కనకదుర్గ, బీజేపీ నేత కీర్తి వెంకట రామప్రసాద్ మరికొందరు మాట్లాడుతూ.. పొత్తు ధర్మం పాటించాలని, పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా ప్రసంగించారు. కై కలూరు సీటు బీవీ రావుకే కేటాయించాలని బీజేపీ అభ్యర్థి కామినేనికి సహకరించబోమని ఓ వ్యక్తి బహిరంగంగా గొడవకు ది గాడు. ఏలూరు జిల్లా యాదవ సంఘ అధ్యక్షుడు చిదరబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ యాదవ సామాజిక వర్గానికి సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. కొల్లేరు అభివృద్ధి సంఘ అధ్యక్షుడు మోరు విజయరామరాజు మాట్లాడుతూ జనసేన కోసం కష్టపడితే చివరకు సీటు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ జనసేన మీడియా ఇన్చార్జి నాగనబోయిన విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లావేటి వీరశివాజీ, కోట విప్లవ వరప్రసాద్, దేవేంద్రగుప్తా, వెంకన్నబాబు, గణేష్, వీరాంజనేయులు, ప్రభు ఏసు, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 19న నామినేషన్ కై కలూరు సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి గాని, కామినేని శ్రీనివాస్‌కు గాని ఇస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనతో చెప్పలేదని బీవీ రావు ఈ సందర్భంగా తెలిపారు. కనీసం సమాచా రం కూడా ఇవ్వలేదని చెప్పారు. కాబట్టి కై కలూరు జనసేన సీటు తనదేనని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 19న జనసేన పార్టీ తరఫున నామినేషన్ వే స్తున్నానని బీవీ రావు ప్రకటించారు. ఆయన్ని బుజ్జగించడానికి వచ్చిన టీడీపీ, బీజేపీ నేతలు బీవీ రావు ప్రకటనతో కంగుతిన్నారు. రానున్న రోజుల్లో జనసేన నుంచి బీజేపీకి మరింత వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఈ సమావేశంతో తేటతెల్లమయ్యాయి. -
ఆ సీటు నాదే అంటున్న మాజీ మంత్రి..!
కైకలూరు సీటు కోసం టీడీపీ -జనసేన నేతల మధ్య పోరు జరుగుతోంటే పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చబోతోందా? కైకలూరు సీటు నాదే అంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు? టీడీపీ ఆవిర్భవించాక కైకలూరు ప్రజలు ఒక్కసారే ఆ పార్టీని గెలిపించారు. అయినా కైకలూరు కోసం ఎందుకు పోటీ పడుతున్నారు? టీడీపీ, జనసేన మధ్యలోకి వచ్చిన ఆ నేత ఎవరు? ఆ మాజీ మంత్రి ప్రయత్నాలు ఫలిస్తాయా? కైకలూరు నియోజక వర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో పది సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులే విజయం సాధించారు. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు. టిడిపి, బిజెపి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు ప్రభంజనం వీచినా కైకలూరులోటీడీపీ ఓటమి చెందింది. 1994లో మరోసారి ఎన్టీయార్ ప్రభంజనం వీచిన సందర్భంలో కూడా కైకలూరులో టిడిపి గెలవలేకపోయింది. ఎన్టీయార్ తర్వాతటీడీపీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడికి కూడా కైకలూరు నియోజక వర్గం కొరుకుడు పడలేదు. ఇక్కడి ప్రజల నాడి పట్టుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ టిడిపికి కైకలూరు పై పెద్దగా ఆశలు లేవంటున్నారు. కాకపోతే ఎన్నికల నగారా మోగితే మొక్కుబడిగానైనా పోటీ చేయాలి కాబట్టిటీడీపీ పోటీ చేయాలంతే. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావుటీడీపీ అభ్యర్ధి జయమంగళ వెంకటరమణపై విజయం సాధించారు.టీడీపీ ఆవిర్భవించాక ఒకే ఒక్కసారి కైకలూరులో 2009లో విజయం సాధించింది. అపుడు టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ పై గెలిచారు. 2014 లో ఇదే కామినేని శ్రీనివాస్ బిజెపి అభ్యర్ధిగా బరిలో దిగి గెలవడమే కాకుండా చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జయమంగళ వెంకటరమణను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం మానేసింది. దాంతో ఏడాది క్రితమే ఆయనటీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. చంద్రబాబు నాయుడి వైఖరి,టీడీపీ సిద్ధాంతాలు నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు జయమంగళ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. 2009లోటీడీపీ జెండా ఎగరేసిన జయమంగళ వెంకటరమణ పార్టీని వీడ్డంతోటీడీపీకి బలమైన అభ్యర్ధే లేకుండా పోయారు. ఫలితంగా కొత్తగా ఇన్ ఛార్జ్ ని పెడదామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. కైకలూరు నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ఉండండయ్యా అని చంద్రబాబు నాయుడు అదే పనిగా పిలుస్తోన్నా ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ప్రస్తుతం కొత్త అభ్యర్ధి వేటలో పడ్డారు చంద్రబాబు నాయుడు. జయమంగళ నిష్క్రమణతోటీడీపీకి బలమైన అభ్యర్ధులు లేని నేపథ్యంలో కైకలూరును తమ ఖాతాలో రాసేసుకోవాలని జనసేన భావిస్తోంది. పొత్తులో భాగంగా కైకలూరు నియోజక వర్గాన్ని తమకి కేటాయించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కోసమే కైకలూరు నియోజక వర్గంలో బలోపేతానికి జనసేన రక రకాల ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు పై ఒత్తిడి పెంచడానికి జనసైనికులు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో కైకలూరు నియోజక వర్గం నుండి జనసేన తరపున పోటీ చేసిన బి.వి.రావు ఓటమి చెందినప్పటికీ పదివేల పై చిలుకు ఓట్లు సంపాదించుకోగలిగారు. ఈ తర్వాత నియోజక వర్గంలో తన గ్రాఫ్ మరింతగా పెరిగిందని.. తాను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నానని బి.వి.రావు చెప్పుకుంటున్నారు. తనకు కైకలూరు సీటు ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.టీడీపీ జనసేనల మధ్య సీట్ల సద్దుబాటు ఇంత వరకు కొలిక్కి రాలేదు. ఈ సీటు కోసం జనసేన విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే సందట్లో సడేమియాలా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అమాంతం నిద్రలేచి రంగంలో దూకేశారు. చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ ఇద్దరూ తనకు బాగా క్లోజ్ అంటోన్న కామినేని ఈ సీటు నాదే అని టీడీపీ-జనసేన క్యాడర్ తోనే అంటున్నారట. జయమంగళ వెంకటరమణ పార్టీని వీడ్డంతో సీటు తమకి వస్తుందని స్థానిక టీడీపీ నేతలు ఆశలు పెట్టుకుంటే జనసేన , బిజెపి నేతలు ఇదే సీటుపై కర్చీఫ్ వేసుకోవడం తెలుగు తమ్ముళ్లకు కునుకులేకుండా చేస్తోంది. అయినా ఓడిపోయే సీటుకోసం ఇంత పోటీ అవసరమా అని రాజకీయ పండితులు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇంత వరకు కైకలూరు సీటు వైపు చూడలేదు. ఈ సీటును జనసేనకు కేటాయించాలా వద్దా అన్నది కూడా ఆయన నిర్ణయం తీసుకోలేదు. చివరి నిముషంలో కామినేని శ్రీనివాసే టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దూకినా ఆశ్యర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటువంటి చిత్ర విచిత్ర రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని వారంటున్నారు. -
భయపెట్టడానికి ట్రై చేశా.. ఇదో అద్భుతమైన సినిమా: అనసూయ
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో అనసూయ మాట్లాడుతూ– ‘‘దర్జా’లో కనకం పాత్రలో భయపెట్టడానికి ప్రయత్నించాను. ఇది అద్భుతమైన సినిమా’’ అన్నారు. ‘‘ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇది.. స్క్రీన్‌ప్లే బేస్డ్ స్టోరీ’’ అన్నారు సలీమ్ మాలిక్. ‘‘దర్జా’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కామినేని శ్రీనివాస్. ‘‘మా అన్నయ్య శివశంకర్‌గారు సినిమా నిర్మించాలనుకున్నప్పుడు భయపడ్డాం. కానీ ఆయన క్రమశిక్షణ, పట్టుదల చూసి ఈ సినిమా నిర్మించాం’’ అన్నారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి పైడిపాటి. ఈ వేడుకలో నిర్మాత నవీన్ ఎర్నేని, కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ, సంగీత దర్శకుడు ర్యాప్ రాప్ షకీల్, హీరో సందీప్ మాధవ్, దర్శకులు వీర శంకర్, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయాల్లో విలువలు, నైతికత ముఖ్యం
సాక్షి, మచిలీపట్నం: ‘పార్టీలు మారే రాజకీయ నాయకుల పదవుల విషయంలో మార్పురావాలి. విలువలు పాటించిన నాయకులనే జాతి కలకాలం గుర్తుంచుకుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో దిగజారుడుతనం, వ్యక్తిగత విమర్శలు ఆందోళనకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో విలువలు, నైతికత అత్యంత ఆవశ్యకం’ అని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కృష్ణాజిల్లా మాజీ జెడ్పీ చైర్మెన్ పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల నడవడిక, ప్రవర్తన, వ్యవహార శైలి ప్రజలను ప్రభావితం చేస్తాయన్నారు. వారసత్వంతో కాదు... జవసత్వంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శల విషయంలో దిగజారుడుతనం, ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళనకరమైన పరిస్థితికి దారి తీస్తోందన్నారు. జాతీయ రాజకీయాలతోపాటు ప్రాంతీయ రాజకీయాల్లోనూ ఈ పరిస్థితి స్థాయి దాటుతోందని తెలిపారు. పార్టీలు మారే రాజకీయ నాయకుల విషయంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ఉప రాష్ట్రపతి.. పార్టీ మారడంతో పాటు పదవిని త్యజించే విధంగా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయపార్టీల ఎన్నికల హామీలకు నిధులు ఎలా వస్తాయనే అంశాన్ని పార్టీలన్నీ ప్రణాళికతో పాటు వివరించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ప్రచార, ప్రసార సాధనాలు, పత్రికలు అందించే సమాచారం సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలని తెలిపారు అసాధారణ నాయకుడు పిన్నమనేని.. ఇరవై ఏడు సంవత్సరాల పాటు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన పేదల పక్షపాతి పిన్నమనేని కోటేశ్వరరావు అసాధారణ నాయకుడన్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులకు సన్మానాలు, పారితోషికాలు అందించేందుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, దూలం నాగేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, మాజీ మంత్రులు వసంత నాగేశ్వరరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
'తండ్రి చనిపోయిన బాధలోనూ అనసూయ షూటింగ్‌కు వచ్చింది'
కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పీఎస్ఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శనివారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత కేఎల్ నారాయణ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘ఈ ఫస్ట్ లుక్ దర్జాగా ఉంది. సినిమా కూడా దర్జాగా ఆడి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సునీల్‌గారు, అనసూయగారు, ఇతర నటీనటులు ఎంతగానో సహకరిస్తున్నారు. ముఖ్యంగా అనసూయగారు తన తండ్రి చనిపోయిన బాధలోనూ షూటింగ్‌కి వచ్చి, మాకు సహకరించారు. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నంలో షూటింగ్ చేశాం. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
వైద్య సేవల్లోనూ రూ.కోట్లు మింగిన అవినీతి రాబందులు
సాక్షి, అమరావతి: వైద్య సేవల్లోనూ కోట్లు తినేసిన అవినీతి రాబందుల రెక్కలు విరిగే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాల నిర్వహణ పేరుతో మొత్తం రూ.200 కోట్లు కొల్లగొట్టడానికి జరిగిన భారీ స్కామ్ వెనుక సూత్రధారులుగా ఉన్న గత ప్రభుత్వ పెద్దల అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం బెంగళూరుకు చెందిన ఒక సంస్థను తెర మీదకు తెచ్చి టెండర్లు కట్టబెట్టిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల అక్రమాలు ఆధారాలతో సహా బట్టబయలు కానున్నాయి. ఈ స్కామ్‌పై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇందుకూరి వెంకట రామరాజు ఫిర్యాదు మేరకు సెక్షన్–420, 406, 477 కింద 07/2021 నంబర్‌తో సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, కామినేని శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ కీలక అధికారుల డైరెక్షన్లోనే ఈ మొత్తం అవినీతి వ్యవహారం సాగినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అవినీతి కథ ఇలా.. 41–11–2015 ► టీబీఎస్ ఇండియా టెలిమాటిక్ బయోమెడికల్ సర్వీసెస్ సంస్థకు ఏడాది కాలానికి టెండర్ ఖరారు చేస్తూ గత ప్రభుత్వం జీవో నంబర్ 660 ఇచ్చింది. దీనిలో భాగంగా 13 జిల్లాల పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లోని పరికరాల నిర్వహణ సేవల బాధ్యతలను చంద్రబాబు సర్కార్ ఆ సంస్థకు అప్పగించింది. 27–11–2017 ► ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వైద్య ఆరోగ్యశాఖ కీలక అధికారులతోపాటు వైద్య ఆరోగ్య శాఖ సలహాదారుగా ఉన్న జితేంద్రశర్మతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 703 జారీ చేసింది. అధికారులను సంప్రదించకుండా బయటి వ్యక్తిగా ఉన్న జితేంద్రశర్మ ద్వారా బెంగళూరు సంస్థకు కాంట్రాక్టు అప్పగించడం వెనుక చంద్రబాబు, కామినేని ప్రయోజనాలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. 18–12–2017 ► ఈ వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇందుకూరి వెంకట రామరాజు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎటువంటి విచారణ జరగకుండా ఏసీబీ డీజీగా ఉన్న ఆర్పీ ఠాకూర్, డైరెక్టర్‌గా ఉన్న శంకబ్రతబాగీ్చలపై చంద్రబాబు ప్రమేయంతో కొందరు ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏసీబీ ఎటువంటి చర్యలు తీసుకోకుండానే ఆ ఆరోపణలు నిజం కాదని తేల్చింది. 23–4–2018 ► దీనిపై వెంకట రామరాజు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదించాలంటూ ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 31–7–2019 ► వైద్య పరికరాల నిర్వహణ కాంట్రాక్టులో అవకతవకలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 14–10–2019 ► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం.. హైకోర్టు తీర్పు, ఏసీబీ నివేదిక ఆధారంగా కాంట్రాక్టు సంస్థ, అందుకు సహకరించినవారిపై చర్యలు తీసుకోవాలని సాధారణ పరిపాలన శాఖకు నివేదించారు. 4–3–2020 ► టీబీఎస్ ఇండియా టెలిమాటిక్ బయోమెడికల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థపైన, బాధ్యులపైన, వైద్య ఆరోగ్య శాఖ అధికారులపైన కేసు పెట్టాలంటూ సీఎస్ నీలం సాహ్ని ఆదేశించారు. సెప్టెంబర్ 2020 ► వైద్య పరికరాల నిర్వహణలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ప్రాథమిక నిర్ధారణతో కాంట్రాక్టు సంస్థ ఒప్పందాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. 12–2–021 ► కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అనిల్‌కుమార్ సింఘాల్ సీఐడీని కోరారు. దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం అవినీతి, అక్రమాలపై నిర్ధారణకు వచ్చిన సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. టెండర్ ఖరారు నుంచే అక్రమాలు.. బెంగళూరుకు చెందిన టీబీఎస్ ఇండియా టెలిమాటిక్ బయోమెడికల్ సర్వీసెస్ సంస్థకు టెండర్ ఖరారు కట్టబెట్టడం నుంచే అక్రమాలు కొనసాగాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాల నిర్వహణకు ఆ సంస్థకు ఏడాదిపాటు కాంట్రాక్టును అప్పగిస్తూ 2015లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా దాన్ని ఐదేళ్లపాటు కొనసాగించారు. టెండరు దక్కించుకున్న సంస్థ.. ఉపకరణాల విలువను మార్కెట్ ధరల కంటే ఎన్నో రెట్లు అమాంతంగా పెంచేసి మోసానికి పాల్పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న పరికరాల మొత్తం విలువ రూ.300 కోట్లు లోపే ఉంటుంది. అయితే దాన్ని ఏకంగా రూ.508 కోట్లుగా చూపించి.. ఆ మొత్తానికి 7.45 శాతం చొప్పున నిర్వహణ సేవల పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టారు. ఇందుకోసం ఆ సంస్థకు ఏడాదికి రూ.38.22 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగించిన ఐదేళ్ల కాంట్రాక్టులో భాగంగా తొలి ఏడాదిలో చెల్లించిన రూ.38.22 కోట్లకు అదనంగా ఏటా పది శాతం చొప్పున పెంచి నిర్వహణ సేవల మొత్తాన్ని చెల్లించారు. ఇలా ఐదేళ్లలో రూ.200 కోట్లకుపైగా ఆ సంస్థ బిల్లులు పెట్టగా.. గత సర్కారు రూ.100 కోట్లకుపైగా చెల్లించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. -
అందుకు ఈ రహస్య భేటీ నిదర్శనం: ఉదయభాను
సాక్షి, కృష్ణా: ముగ్గురు చౌదరీల రహస్య భేటీకి చంద్రబాబు నాయుడే సూత్రధారి అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్, బీజేపీ నేతలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరిల రహస్య భేటీ వెనక కుట్రకోణం ఉందన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ బయటపడటంతో నిమ్మగడ్డ బండారం బట్టబయలైందన్నారు. చంద్రబాబు చేతుల్లో నిమ్మగడ్డ కీలుబొమ్మగా మారాడన్న అనుమానం నిజమని తేలిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేస్తున్న నిమ్మగడ్డ రమేష్‌పై తక్షణమే విచారణ జరిపించాలన్నారు. (నిమ్మగడ్డతో భేటీ: బీజేపీ నేతలపై అధిష్టానం ఫైర్) ఇక సుజనా, కామినేని బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు నిపుణుడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మనుషులను వాడుకొని వదిలేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం చేశారనేందుకు రహస్య భేటీ ఓ నిదర్శనమని స్పష్టం చేశారు. చంద్రబాబు మాటలు వినే నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను అనైతికంగా వాయిదా వేశారని మరోసారి ప్రస్తావించారు. (వారితో మాట్లాడిన నాలుగో వ్యక్తి ఎవరు?) -
బీజేపీ మంత్రుల రాజీనామా
సాక్షి, అమరావతి: బీజేపీకి చెందిన మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీని వాస్‌లు గురువారం మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఉదయం అసెంబ్లీలో సీఎంను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించేందుకు భేటీ అయిన మంత్రివర్గ సమావేశానికి ఇరువురు మంత్రు లు హాజరు కాలేదు. తర్వాత సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విష్ణుకుమార్‌రాజు, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, పీవీఎన్ మాధవ్‌లతో కలిసి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఇరువురు నేతలు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. వీరి రాజీనామాలను ఆమోదించాలని సీఎం చేసిన సిఫార్సును గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. కొంత మంది రాజకీయాల్లో ఎంట్రీ చాలా బాగుంటుంది కానీ ఎగ్జిట్ బాధగా ఉంటుందని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మంత్రి పదవికి రాజీనామా సమర్పించిన అనంతరం కామినేని అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో విధిలేని పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలోనూ, తర్వాత కూడా వెంకయ్యనాయుడును చాలామంది ద్రోహిగా చిత్రీకరించడం బాధగా ఉందని పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ఎంతో చేశారని, దేశంలోనే ఎక్కువ గ్రామాలు తిరిగిన ఘనత ఆయనదని, అలాంటి వ్యక్తిని కూడా ద్రోహిగా పేర్కొనడం దారుణమన్నారు. -
అసెంబ్లీ ప్రారంభం.. కామినేని వివరణ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టేరోజే బీజేపీకి చెందిన ఇద్దరు మంత్రులు రాజీనామాలు చేయడంతో సమావేశాలు ప్రారంభంకాగానే వారు తమ రాజీనామ లేఖలపై మాట్లాడారు. బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాస్, మంత్రి మాణిక్యాలరావు తమ రాజీనామా లేఖలను చంద్రబాబుకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామినేని మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని దోషిగా చూపే ప్రయత్నం జరుగుతోందని, ఈ నేపథ్యంలోనే తాను రాజీనామా చేస్తున్నానని అన్నారు. తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు బీజేపీనే కారణం అన్నారు. తాను బాధ్యతలు నిర్వర్తించినంత కాలం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, ఎవరి వద్ద ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. తన శాఖ విజయవంతంగా కొనసాగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని చెప్పారు. -
ఏపీ బీజేపీ మంత్రుల రాజీనామాలు ఒట్టిదే!
సాక్షి, విజయవాడ : కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధికాముకులని మంత్రి కామినేని శ్రీనివాస్ కితాబిచ్చారు. కేంద్రంలో టీడీపీ మంత్రులు, ఏపీ కేబినెట్లోని బీజేపీ మంత్రులు రాజీనామాలు చేస్తారన్న ప్రచారం ఒట్టిదేనని తేల్చిచెప్పారు. బుధవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం బీజేపీ అధిష్టానమే. మా నయకులు ఏం చెయ్యమని ఆదేశిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే, బీజేపీ మంత్రులు రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవంలేదు. అన్ని పార్టీలవారితో నేను స్నేహంగా ఉంటాను. ఆ కారణం వల్లే నాపై కొన్నిసార్లు నాపై దుష్ర్పచారం జరుగుతుంది. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉంటుందా, లేదా అన్నది అధిష్టానమే నిర్ణయిస్తుంది’ అని మంత్రి కామినేని అన్నారు. -
‘2019లోనూ టీడీపీ-బీజేపీలు కలిసే ఉంటాయి’
సాక్షి, గుంటూరు : టీడీపీ-బీజేపీల అవినాభావ అనుబంధం వల్లే కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు భారీగా నిధులు వచ్చాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధించిందని బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. అందుకే 2019 ఎన్నికల్లోనూ టీడీపీ-బీజేపీలు కలిసే పోటీచేస్తామని తెలిపారు. బుధవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీవి అబద్ధాలే అయినా : ‘‘ప్రత్యేక ప్యాకేజీ కింద ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో టీడీపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారు. ఎన్నెన్ని నిధులు ఇచ్చామో ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు చెప్పిన లెక్కలు మాత్రమే నూరుశాతం వాస్తవాలు. లెక్కల సంగతి ఎలా ఉన్నా రాజకీయంగా టీడీపీ-బీజేపీలు ఎప్పటికీ కలిసే ఉంటాయి. వైఎస్సార్సీపీతో బీజేపీ ఎన్నటికీ దోస్తీ కట్టబోదు’’ అని మంత్రి కామినేని చెప్పారు. -
మంత్రి కామినేని వివరణ
సాక్షి, విజయవాడ: తనపై సొంత పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో బీజేపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం వివరణ ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే నిన్న జరిగిన పార్టీ పదాధికారుల సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయినట్టు వెల్లడించారు. అసలేం జరిగింది..? రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షతన ఆదివారం విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కమలనాథులు కీలక విషయాలు చర్చించారు. ఏపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రులు బయటకు వచ్చి సీఎం చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేశారు. అప్పటివరకు సమావేశంలో ఉన్న మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ అంశం ప్రస్తావనకు రాగానే బయటకు వెళ్లిపోయారు. ఆయన హడావుడిగా బయటకు వెళ్లిపోవడం పట్ల పలువురు అభ్యంతరం చేశారు. దీంతో మంత్రి కామినేని ఈరోజు వివరణయిచ్చారు. ఏ నిర్ణయానికైనా కట్టుబడతా.. బీజేపీ మంత్రుల రాజీనామాలను అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీకి పంపితే బాగుంటుందని సమావేశంలో చర్చించుకున్నారు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడతానని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జవాబిచ్చినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిదని హరిబాబు సూచించడంతో ఈ అంశంపై చర్చను ముగిసించారు. -
అందులో మా తప్పేం లేదు: కామినేని
సాక్షి, విజయవాడ : గత 28 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో కడప ఫాతిమా మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి గుణదలలోని సెల్ టవర్ ఎక్కడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఆందోళన నేపథ్యంలో ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న స్టూడెంట్స్ కు గవర్నమెంట్ కళాశాలలో సీట్లు ఇవ్వడానికి అభ్యంతరం తెలిపిందన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్ధనను సుప్రీంకోర్టు కొట్టివేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫాతిమా విద్యార్ధుల విషయంపై కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లెటర్ రాసినట్లు తెలిపారు. ఫాతిమా కళాశాల విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాని, ప్రమేయం గాని లేదని.. కాలేజీ యాజమాన్యమే తప్పు చేసిందని మంత్రి కామినేని ఆరోపించారు. ఫాతిమా విద్యార్ధుల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుధాన్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు మంత్రి కామినేని శ్రీనివాస్ ఢిల్లీ వెళ్లనున్నారని సమాచారం. ఫాతిమా మెడికల్ కళాశాల సమస్యలపై ఈ నెల 29,30న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. విద్యార్ధుల అభ్యర్ధన మేరకే వారి సమస్యలపై విద్యార్ధుల ముందే ఫాతిమా కళాశాల యాజమాన్యంతో మాట్లాడాం తప్ప, అంతకు మించి యాజమాన్యంతో ఇతర విషయాలు చర్చించలేదని మంత్రి కామినేని చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలపై తమకు నమ్మకం పోయిందని బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి తమకు న్యాయం చేయాలని కోరుతూ గుణదలలో సెల్ టవర్ ఎక్కారు. -
అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మధ్య మాటల యుద్దం జరిగింది. చిత్తూరు జిల్లాలో డెంగీ, అంటువ్యాధులతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నా... జిల్లా వైద్య శాఖ సరిగా స్పందించడం లేదని గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. సరైన వైద్యం అందకపోవడంతో జిల్లా ప్రజలు... చెన్నై, బెంగళూరుకు వెళుతున్నారని అన్నారు. తొమ్మిదేళ్లుగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణిని మార్చలేదని అన్నారు. రెండు, మూడేళ్లకే ప్రభుత్వ ఉపాధ్యాయులను బదిలీలు చేస్తున్నారని, అలాంటిది ఆ అధికారిణిని తొమ్మిదేళ్లుగా అక్కడే ఎలా విధుల్లో ఉంటారని అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో రక్త పరీక్షల నిర్వహణలో అవినీతిపై మంత్రి కామినేనిని...ముద్దుకృష్ణమనాయుడు నిలదీశారు. టెండర్లను తక్కువ కోట్ చేసినవారిని వదిలేసి, ఎక్కువ కోట్ చేసినవారికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై సభా సంఘం వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే సభలో సభ్యులు అడగిన ప్రశ్నకు, మీరు అడుగుతున్న ప్రశ్నకు సంబంధం ఏంటని గాలి ముద్దుకృష్ణమనాయుడిపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశాఖపై నిన్న (మంగళవారం) సభలో రెండు గంటలు చర్చించినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. అంతేకాకుండా మెడల్ టెండర్లు విషయంలో అంతా సవ్యంగా, పారదర్శకంగానే చేశామని అన్నారు. అయితే సభ్యులు అడిగిన ప్రశ్నలకు తాను తప్పకుండా సమాధానం చెబుతానని అన్నారు. -
మంత్రి కామినేనికి అవమానం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అవమానం జరిగింది. ఉండవల్లి కరకట్ట మీదకు వెళ్లే రహదారి వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే రోడ్డులో ...సెక్యూరిటీ పేరు చెప్పి మంత్రి వాహనాన్ని మంగళవారం ఉదయం భద్రతా సిబ్బంది నిలిపివేశారు. అసెంబ్లీకి అటువైపుగా దారి లేదంటూ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లు పెట్టి మంత్రి కామినేని శ్రీనివాసరావు, నలుగురు ఎమ్మెల్యేల కార్లను ఆపారు. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా పంపేది లేదని గన్మన్లతో వాగ్వివాదానికి దిగారు. 15 నిమిషాలపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండిపోయారు. మరోవైపు సీఎం ఇంటికెళ్లే కరకట్ట మార్గంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజధాని ప్రాంత ప్రజలను కూడా అటువైపు నుంచి రాకపోకలు సాగనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా కరకట్ట రోడ్డుపై మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీరియస్ అయ్యారు. పోలీసులను వివరణ కోరారు. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. పోలీసుల తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆదేశించారు. గతంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీకి కూడా ఇటువంటి సంఘటనే ఎదురైంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన కరకట్టపై నుంచి శాసనసభకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట్ట దగ్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేశారు. -
సీఎం, మంత్రి కామినేని మాటలు నమ్మి మోసపోయాం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్) : సీఎం చంద్రబాబు, మంత్రి కామినేని శ్రీనివాస్ మాటలు నమ్మి తాము మోసపోయామని ఫాతిమా కళాశాల విద్యార్థిని కౌసర్‌ఖాన్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. ఫాతిమా కళాశాలలో 8 నెలలు చదివిన తర్వాత తమను రోడ్డున పడేశారన్నారు. మూడేళ్లుగా తమకు న్యాయం చేస్తామని ప్రభుత్వం హామీలిస్తూనే ఉందని, కానీ ఫలితం లేదన్నారు. ప్రభుత్వం ఒకే పొరపాటును వరుసగా చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం తమకెందుకు అన్యాయం చేస్తోందో అర్థం కావడం లేదని వాపోయారు. మైనార్టీ కళాశాల అయినందునే వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం సమస్యకు పరిష్కారం చూపకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోర్టు వెలుపల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ చూపి కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి జేసీ నడ్డా, ఎంసీఐ అధికారులతో చర్చించి విద్యార్థుల భవిష్యత్‌ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం మాటలు నమ్మశక్యంగా లేవన్నారు. విద్యార్థుల సమస్యపై పూనం మాలకొండయ్యను ఢిల్లీకి పంపడం సమంజసం కాదని తెలిపారు. చంద్రబాబు హామీ మేరకు విద్యార్థులను ఇతర కళాశాలల్లో సర్దుబాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ నాయకులు ధనేకుల మురళీకృష్ణ, కొలనుకొండ శివాజీ, నరహరిశెట్టి నరసింహారావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మాకు ఆత్మహత్యలే శరణ్యం
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఫాతిమా కళాశాల యాజమాన్యం విద్యార్థులను మోసగించిందని, ప్రభుత్వం చొరవ తీసుకొని న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం మాయమాటలు నమ్మి మోసపోయామంటూ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్‌లో మంగళవారం వారు నిరసన దీక్ష చేపట్టారు. దీక్షకు వైఎస్సార్సీపీతోపాటు కాంగ్రెస్, సీపీఐ, విద్యార్థి సంఘాలు వైఎస్సార్ ఎస్‌యూ, పీడీఎస్‌యూ, ఏఐఎస్ఎఫ్ మద్దతు ప్రకటించాయి. విద్యార్థులు మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నిక సమయంలో సీఎం చంద్రబాబు తమకు వేరే కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. మంత్రి కామినేని శ్రీనివాస్ ఫాతిమా కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కోర్టులో తప్పుడు అఫిడవిట్ సమర్పించినందునే తాము రోడ్డున పడాల్సి వచ్చిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్.అర్షాద్, అజ్మతుల్లా, రహీంబాషా మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం తమ వద్ద రూ.లక్షల రూపాయలు వసూలు చేసి, అనుమతుల్లేకుండా అడ్మిషన్లు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎంసీఐతో సంప్రదింపులు జరిపి పిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని వారిని శిక్షించాలని కోరారు. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో ఫాతిమా మెడికల్ కాలేజి విద్యార్థుల నిరసన కార్యక్రమంలో ప్రసంగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్తాం.. దీక్షలో వైఎస్సార్సీపీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు మాట్లాడుతూ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఈ విషయాన్ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. విద్యార్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ మంత్రి కామినేని వారానికో ప్రకటన చేస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా చొరవచూపాలన్నారు. నిరసన దీక్షలో కళాశాల విద్యార్థులు, కాంగ్రెస్ నేత ఆకుల శ్రీనివాస్, సీపీఐ నేత దోనేపూడి శంకర్, కొలనుకొండ శివాజీ, విద్యార్థి సంఘం నాయకులు రవిచంద్ర, విశ్వనాథ్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య సీట్లలో జాతీయ పూల్‌కు వెళ్తున్నాం: కామినేని సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ వైద్య సీట్ల విషయంలో జాతీయ పూల్‌లోకి వెళ్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో 27,710 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, వీటిలో 15 శాతం సీట్ల చొప్పున మనమిచ్చే సీట్లతో కలిపి 4,442 సీట్లలో పోటీపడవచ్చునన్నారు. మన రాష్ట్రం నుంచి కేవలం 285 సీట్లు మాత్రమే జాతీయ పూల్‌లోకి వెళ్తాయన్నారు. పీజీ సీట్ల విషయంలో మన రాష్ట్రం 415 సీట్లు ఇస్తే మన విద్యార్థులు దేశ వ్యాప్తంగా 6,665 సీట్లలో పోటీ పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఫాతిమా కాలేజీ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడం సరైంది కాదని, ప్రభుత్వ పరంగా వారికి చేయాల్సిందంతా చేశామని చెప్పారు. వచ్చే ఏడాది ఫాతిమా కాలేజీలో మొత్తం సీట్లను రద్దు చేసి, 2015–16 బ్యాచ్‌లో మోసపోయిన విద్యార్థులను చేర్చుకునే ప్రతిపాదన చేసినప్పటికీ భారతీయ వైద్యమండలి అంగీకరించలేదన్నారు. -
మనసు విప్పి మాట్లాడేందుకు వచ్చా.
గుంటూరు వైద్య కళాశాలలో మంత్రి కామినేనికి సన్మానం గుంటూరుమెడికల్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు ఆదివారం రాత్రి గుంటూరు వైద్య కళాశాలలో ఘన సన్మానం జరిగింది. ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని మాట్లాడుతూ తాను సన్మానం కోసం రాలేదని, వైద్యులతో మనస్సు విప్పి మాట్లాడేందుకు వచ్చానని తెలిపారు. వైద్య వ్యవస్థ ఉంది రోగి కోసమేనని, రోగికి నమ్మకం కల్పించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. వైద్యులు సమాజానికి, వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. మనం నిజాయితీగా ఉండి ఏది చెప్పినా సిబ్బంది వింటారన్నారు. ప్రభుత్వ వైద్యులు సాయంత్రం వేళల్లో ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకోవటాన్ని తాను సమర్థిస్తున్నట్లు చెప్పారు. హెల్త్ యూనివర్శిటీలో పరిశోధనలు జరగాలని, అందుకోసం వైజాగ్ విమ్స్‌ను యూనివర్శిటికి అనుబంధం చేస్తున్నామని వెల్లడించారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలకు త్వరలోనే బస్సులను కొనుగోలు చేసి పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ సుబ్బారావు, అకడమిక్ డీఎంఈ డాక్టర్ బాబ్జి, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రాజారావు, ఎన్టిఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ అప్పలనాయుడు, వైద్యుల సంఘం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ డీఎస్ఎస్ శ్రీనివాసప్రసాద్, కన్వీనర్ డాక్టర్ జయధీర్‌బాబు, హంస సంఘం అధ్యక్షుడు యోగీశ్వరరెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ లక్ష్మీపతి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్బారావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నర్సుల సమస్యలు పరిష్కరించాలి... ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు వేతనాలు పెంచాలని, నిబంధనల ప్రకారం సెలవులు మంజూరు చేయాలని తదితర సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి కామినేనికి నర్సుల సంఘం నేతలు అందజేశారు. నర్సుల సమస్యలపై చర్చించేందకు 19న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఉపాధ్యక్షురాలు విజయ, జిల్లా అధ్యక్షురాలు తిరుపతమ్మ, సెక్రటరీ ఆశాలత తదితరులు ఉన్నారు. -
‘టీడీపీలో చేరను, ఆ ప్రచారంలో వాస్తవం లేదు’
విజయవాడ: తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన బుధవారమిక్కడ తోసిపుచ్చారు. ఆ ప్రచారంలో వాస్తవం లేదని, ప్రాణం ఉన్నంత వరకూ బీజేపీలోనే కొనసాగుతానని కామినేని స్పష్టం చేశారు. కాగా మంత్రి కామినేని బీజేపీని వీడి టీడీపీలో చేరుతారనే వార్తలు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ వార్తలపై కామినేని స్పందిస్తూ తన మంత్రిగా తాను ఎదగడానికి, బీజేపీతో పాటు వెంకయ్య నాయుడి ప్రోత్సహం కూడా ఉందన్నారు. పొత్తుల నేపథ్యంలో బీజేపీ నుంచి గెలుపొందిన ఆయన చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే సొంత పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి మరీ మిత్రపక్షానికి లబ్ధి చేకూరేలా చేస్తున్నారని కామినేనిపై బీజేపీ నేతలే పలుమార్లు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
మాతా శిశుసంరక్షణ భవనం ప్రారంభం
హిందూపురం అర్బన్ : ‘పురం’లో రూ.20.15 కోట్లతో నిర్మించిన మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి కమిటీ అధ్యక్షుడు వెంకటస్వామి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తల్లీబిడ్డలను రక్షించుకోవడం అందరి బాధ్యతన్నారు. తాను మూడు నెలలుగా షూటింగ్లో ఉన్నప్పటికీ ఫోన్లో నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటున్నానన్నారు. మంత్రి కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్పొరేట్‌కు దీటుగా ఏర్పాటైన ఈ ఆసుపత్రికి వైద్యసిబ్బందిని త్వరలోనే నియమిస్తామన్నారు. ఎమ్మెల్యే, తాను హిందూపురం ఆసుపత్రిలో ఒకరోజు రాత్రి బస చేస్తామన్నారు. మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ హిందూపురంలో వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో జేసీ ఖాజామొహిద్దీన్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీసీహెచ్ రమేష్‌నాథ్, సూపరింటెండెంట్ కేశవులు, ఆర్ఓఎం రుక్మిణమ్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ పిల్లలకు పుస్తకాలు, బొమ్మలు పంపిణీ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో స్థానిక మోడల్‌కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రీ క్వానెంట్‌ను ఎమ్మెల్యే బాలకృష్ణ, మంత్రి సునీత ప్రారంభించారు. చిన్నారులకు పుస్తకాలు, బొమ్మలు పంపిణీ చేశారు. -
మంత్రి ఇంట బదిలీలలు!
అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నాయి. ఆన్లైన్లో అత్యంత పారదర్శకంగా జరగాల్సిన బదిలీల ప్రక్రియ మంత్రి కామినేని ఇంటికి చేరింది. విదేశాలకు వెళ్లిన మంత్రి బదిలీల గడువు సమీపించడంతో నిర్ణయించుకున్న తేదీ కంటే మూడు రోజులు ముందే రాష్ట్రానికి వచ్చారు. వచ్చీ రావడంతోనే రిక్వెస్ట్ బదిలీల పేరిట తన పేషీకి వచ్చిన 300కు పైగా దరఖాస్తులను తన ఇంటికి తీసుకురావాలని ఆదేశించారు. గురువారం సాయంత్రం వరకూ కసరత్తు చేసి అనుకూలమైన వారితో జాబితా తయారు చేశారు. ఈ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ జాబితాను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆమోదించి ఈ నెల 4వ తేదీన ఆన్లైన్లో పెట్టనున్నట్టు తెలిసింది. సీనియారిటి, ఒకే చోట ఎక్కువ కాలం పని చేస్తున్న ప్రాతిపదికన ఆన్లైన్లో కావాల్సిన బదిలీలు మంత్రి ఇంట్లో నిర్ణయం జరగడం బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు ఒకే చోట పని చేస్తుంటే రిక్వెస్టు బదిలీలు చేసుకోవచ్చు. 20 ఏళ్ల వరకూ ఒకే చోట ఉంటే ప్రభుత్వమే చేస్తుంది. ఒకే చోట ఐదేళ్లకు మించి పని చేస్తున్న వారు ఆన్లైన్ లాగిన్ కాలేకపోయారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కింది స్థాయి ఉద్యోగులు బదిలీలు కావేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పదేళ్లుగా పనిచేస్తున్న వారి వివరాలు కంప్యూటర్లో కనిపించడం లేదు. కౌన్సెలింగ్ అస్తవ్యస్తం గొల్లపూడిలోని ప్రజారోగ్య కార్యాలయం ఎదుట గురువారం వైద్యులు నిరసనలు చేపట్టారు. బదిలీల్లో భాగంగా ప్రజారోగ్య కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. కౌన్సెలింగ్ అస్తవ్యస్తంగా ఉందని, తమకు నచ్చిన వారికి పోస్టులు దక్కేలా చేశారని ఈ సందర్భంగా పలువురు వైద్యులు నినాదాలు చేశారు. ఇవి సాధారణ బదిలీలు కావని, అవినీతి బదిలీలంటూ నిరసన చేపట్టారు. సుమారు గంట సేపు కౌన్సెలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది. 20 ఏళ్లుగా పట్టణాల్లో పని చేస్తున్న వారికి మళ్లీ పట్టణాల్లోనే వేశారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారిని మళ్లీ అక్కడికే వేశారని ఆరోపించారు. ఈ బదిలీల్లో భారీగా నగదు చేతులు మారినట్టు వైద్యులు ఆరోపించారు. -
పొత్తుపై అధిష్టానానిదే తుది నిర్ణయం: కామినేని
హైదరాబాద్: టీడీపీ, బీజేపీ పొత్తుపై కిందిస్థాయి నేతల్లో ఎవరు ఎన్ని మాట్లాడినా.. అధిష్టానానిదే తుది నిర్ణయమని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. పొత్తుపై రెండు పార్టీల అధ్యక్షులు స్పష్టతతో ఉన్నారని చెప్పారు. 2019 వరకు బీజేపీ, టీడీపీ కలిసే ఉంటాయని అమిత్ షా స్పష్టం చేశారని తెలిపారు. పొత్తు విషయాలు పార్టీ అద్యక్షులు చూసుకుంటారని స్పష్టం చేశారు. రేపు హైదరాబాద్ నుంచి అమిత్ షా, చంద్రబాబు కలిసి విజయవాడ చేరుకుంటారని తెలిపారు. సురేష్ ప్రభు ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఏర్పాటు చేసిన 13 అంబులెన్స్‌లను గురువారం అమిత్ షా ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని తెలిపారు. ఉద్యోగుల బదిలీల్లో ఎటువంటి అవినీతి జరగలేదన్నారు. -
నేడు మంత్రి కామినేని రాక
అనంతపురం అర్బన్ : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ శుక్రవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు అనంతపురం ఆర్అండ్బీ అతిథిగృహానికి చేరుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం స్థానికంగా జరిగే ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆతర్వాత మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు. -
త్వరలో నెఫ్రాలజిస్టుల నియామకం: కామినేని
శ్రీకాకుళం: త్వరలో నెఫ్రాలజిస్టులను నియమిస్తామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం జిల్లాలోని శ్రీకాకుళం జిల్లా పలాసలో డయాలసిస్ సెంటర్‌ను మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్దానం ప్రాంతంలో మూడు డయాలసిస్ సెంటర్లు ప్రారంభించామన్నారు. మరో 15 రోజుల్లో కిడ్నీ బాధిత ప్రాంతాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. -
కామ్నేని!
► ఆరోగ్యశాఖ మంత్రి వస్తారు... వెళ్తారు! ► సిక్కోలులో మెరుగుపడని వైద్య సౌకర్యాలు ► ఆచరణకు నోచుకోని కామినేని హామీలు ► ఉద్దానం యేతర ప్రాంతాల్లోనూ విస్తరిస్తున్న కిడ్నీ వ్యాధులు సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ప్రాణాలు పోతున్నా.. ఉద్దానంపై మొద్దునిద్ర శీర్షికతో ఈనెల 11న సాక్షి ప్రచురించిన కథనంతో రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది! రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు! వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు! అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం ఇది తొలిసారి కాదు! శ్రీకాకుళం జిల్లా పర్యటనకొచ్చినప్పుడల్లా వైద్య సౌకర్యాలపై దృష్టి పెడతామని చెబుతున్నారు! ఇలా ఆయన ఎన్నిసార్లు పర్యటించి వెళ్లినా పరిస్థితిలో మాత్రం మార్పు రావట్లేదు. పలాస ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ ప్రారంభించేందుకు మంత్రి కామినేని శ్రీకాకుళం జిల్లాకు శనివారం మరోసారి వస్తున్నారు. వాస్తవానికి మంత్రి స్థాయిలో ప్రారంభించాల్సిన కార్యక్రమం కాకపోయినా ఆయన వస్తే వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితి మారుతుందేమోనన్న ఆశలు జిల్లా ప్రజల్లో అలాగే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాను కిడ్నీ వ్యాధులు వణికిస్తున్నాయి. ఒక్క ఉద్దానం ప్రాంతంలోని ఎనిమిది మండలాల్లోనే 28 శాతం మంది వాటిని బారినపడ్డారు. ప్రపంచంలో అంత ప్రమాదకరస్థాయిలో కిడ్నీ వ్యాధి ప్రబలిన మూడు ప్రాంతాల్లో ఉద్దానం ఒకటని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక ఎప్పుడో హెచ్చరించింది. ఇప్పుడు జిల్లాలో ఉద్దానం ఒక్కటే కాదు ఆమదాలవలస, ఫరీదుపేట, చిలకపాలెం, పాలకొండ తదితర ప్రాంతాల్లోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ఉద్దానంలోనైనా నిపుణులు ఎవ్వరికి వారు పరిశోధనలు చేసి వెళ్లిపోవడమే తప్ప వాటినన్నింటినీ క్రోడీకరించి, తదుపరి పరిశోధనలను కొనసాగించే, సమన్వయం చేసే వ్యవస్థే లేకుండా పోయింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు అనుబంధంగా పరిశోధన కేంద్రాన్ని శ్రీకాకుళంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందనే వాదనలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించట్లేదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన కూడా రాలేదని ఇటీవలే కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రి కామినేని దీనిపై ఏదొక ప్రకటన చేస్తారని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ఉద్దానంలో ఇప్పటివరకు 39 వేల మందికి రక్తం, యూరియా, సీరం క్రియేటినిన్ పరీక్షలు నిర్వహించగా వారిలో 12 వేల మందికి సీరం క్రియేటినిన్ 1.2 శాతం కంటే ఎక్కువుగా ఉన్నట్లు వెల్లడైంది. కిడ్నీ వ్యాధి బారిన పడిన వీరికి తక్షణమే వైద్య సహాయం అందించాల్సి ఉంది. మిగతావారికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. గత జనవరి 19న సోంపేటలో జరిగిన సమావేశంలో పలాస, సోంపేట ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కామినేని హామీ ఇచ్చినప్పటికీ కేవలం పలాసలో మాత్రమే శనివారం ప్రారంభిస్తున్నారు. నిర్లక్ష్యం నీడలో రిమ్స్.. వెనుకబడిన సిక్కోలు జిల్లాకు ఆరోగ్య ప్రదాయినిలా ఉంటుందనే ఆశయంతో 2008లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రిమ్స్‌ను టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఛాయల్లోకి నెట్టేసింది. దీన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌గా చూడాలన్న వైఎస్ ఆశయాన్ని నీరుగార్చేస్తోంది. మొత్తం 13 బ్లాక్‌ల్లో ఇప్పటికీ ఏడు బ్లాకులు అందుబాటులోకి రాలేదు. పీజీ మెడికల్ సీటు ఒక్కటే రిమ్స్ బోధనాసుపత్రిలో ఉందంటే ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పరిపాలన తూతూమంత్రంగా మారిపోయింది. కీలకమైన పోస్టులన్నింటిలోనూ ఇన్చార్జి్జలతోనే నెట్టుకొస్తున్నారు. ఎంతో కీలకమైన డైరెక్టర్, మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, డీన్ (ప్రిన్సిపాల్) వంటి పోస్టుల్లోనూ రెండేళ్లుగా ఇన్చార్జి్జలే కొనసాగుతున్నారు. ఇలా ముఖ్యమైన వైద్యసిబ్బంది కొరత ఉన్నా ఆ ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. దీని పర్యవసానంగా వైద్య కళాశాల, ఆస్పత్రిలో ప్రొఫెసర్లు, ట్యూటర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల, అసోసియేట్ ప్రొఫెసర్లు తీవ్రమైన పనిఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రిమ్స్ ఫ్యాకల్టీ విభాగాల్లో 30 శాతం, వైద్యుల విభాగంలో 20 శాతం, దిగువ స్థాయి సిబ్బందిలో 20 శాతం మేర ఖాళీలు ఇప్పటికీ ఉన్నాయి. దీంతో రిమ్స్‌కు వచ్చే రోగులకు తగినవిధంగా వైద్యసేవలు అందట్లేదు. వారంతా మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ ఆసుపత్రులకో, లేదంటే విశాఖపట్నంలోని కేజీహెచ్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకో పరుగులు తీస్తున్నారు. మరోవైపు వైద్య విద్యార్థులకు బోధనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. -
‘నీట్’ రాయాలంటే ఇక్కడికి వెళ్లాల్సిందే
చిత్తూరు ఎడ్యుకేషన్ : రాయలసీమ పరిధిలోని చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో బైపీసీ చదువుతున్న విద్యార్థులకు తిరుపతిలో నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న హామీ ఇచ్చారు. ఈ హామీతో రాయలసీమలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తిరుపతికి పరీక్ష కేంద్రం వస్తుందని ఆశించారు. అయితే ప్రస్తుతం పరీక్షలు సమీపిస్తున్నా తిరుపతిలో పరీక్ష కేంద్రం ఏర్పాటుపై మంత్రి కామినేని నుంచి ఎటువంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘నీట్’కు విద్యార్థులు నమోదు చేసుకున్న వివరాల్లో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 7న నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో తిరుపతి పరీక్ష కేంద్రాన్ని చూపకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎయిమ్స్, ఏపీపీఎస్సీ, జిప్మర్ తదితర పోటీ పరీక్షలు తిరుపతిలో కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. నీట్ పరీక్షను మాత్రం తిరుపతిలో నిర్వహించడంలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ‘నీట్’ కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నంలలో నిర్వహిస్తే తమ పిల్లలు అంత దూరం వెళ్లి పరీక్షలు ఎలా రాయగలరని తలలు పట్టుకుంటున్నారు. పరీక్ష కేంద్రం మార్పులు, విద్యార్థుల వివరాల పొరపాట్లను వెబ్సైట్లో సరిదిద్దుకునేందుకు ఈ నెల 12వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉందని ‘నీట్’ జాయింట్ సెక్రటరీ నోటిఫికేషన్లో తెలియజేశారు. ఆ గడువు ముగిసేలోగా ఉన్నతాధికారులు స్పందించి తిరుపతిలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రైలు ప్రమాదంపై సురేష్ ప్రభు ఆరా
విజయనగరం : హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద ఘటనలో సహాయకచర్యలు ముమ్మరం చేయాలని రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఆయన ఆరా తీశారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం, విశాఖ పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని విజయనగరం, విశాఖ జిల్లా కలెక్టర్లకు బాబు ఆదేశించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉత్తరాంధ్ర మంత్రులు ఘటనాస్థలానికి వెళ్లి పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రమాద ఘటనపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ప్రమాద ఘటనపై రైల్వే మంత్రి సురేష్ ప్రభుతో మాట్లాడామని.. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి మెడికల్ టీమ్స్‌ను రంగంలోకి దించామన్నారు. పార్వతీపురం నుంచి 30, విజయనగరం నుంచి 7 వైద్య బృందాలతో సహా మొత్తం 37 వైద్య బృందాలు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యల్లో పాల్గొన్నాయన్నారు. విశాఖ కేజీహెచ్‌లో క్షతగాత్రులకు జాప్యం లేకుండా వైద్యం అందిస్తున్నామని కామినేని చెప్పారు. -
ఇక ప్రభుత్వ ఆస్పత్రులుగా రిమ్స్!
మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో సెమీ అటానమస్ సంస్థలుగా కొనసాగుతున్న రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సైస్ (రిమ్స్) మూడు ఆసుపత్రులను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం శ్రీకాకుళంలో రిమ్స్‌లో మంత్రి సమీక్ష జరిపారు. అనంతరం మంత్రి కామినేని విలేకరులతో మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులు ఆసుపత్రికి వెళ్లేందుకు మండలానికి ఒక ప్రత్యేక వాహనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస, సోంపేట సహా రాష్ట్రంలో ఆరు చోట్ల కొత్తగా డయాలసిస్ యూనిట్లు ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా ఆయన విజయనగరం జిల్లా పార్వతీపురంలోనూ విలేకరులతో మాట్లాడుతూ ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల స్థితిపై ప్రత్యేక వైద్య బృందంతో అధ్యయనం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన అల్టిమేటం ఇచ్చాక తామేం చెబుతామన్నారు. -
'ఉద్దానం కిడ్నీ సమస్య దీర్ఘకాలికమైనది'
శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య దీర్ఘకాలికమైందని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో గురువారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ రోజురోజుకు రిమ్స్ అధ్వాన్నంగా తయారవుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు పనితీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్దానం కిడ్నీ రోగుల సమస్య పరిష్కారం పట్ల ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ( చదవండి : 15 రోజుల్లోగా స్పందించకుంటే ఉద్యమమే ) ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే ప్రజా ఉద్యమాన్ని లేవదీస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ‘కిడ్నీ రోగుల కోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుచేశాం’ అంటూ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు గతంలో చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రస్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. -
‘మంత్రి కామినేని సిగ్గుతో తల దించుకోవాలి’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ అమలు తీరుపై చర్చించేందుకు సిద్ధమని, మంత్రి కామినేని శ్రీనివాస్ సవాల్ ను స్వీకరిస్తున్నామని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చర్చకు తేదీ, సమయం, వేదిక రేపు సాయంత్రంలోగా మంత్రి చెప్పాలని సూచించారు. కామినేని బీజేపీ నాయకుడని మర్చిపోయారని, తమ చంద్రబాబు అని సంబోధిస్తూ టీడీపీ నేతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీలో కమీషన్లు రావు కాబట్టే చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వైద్యం అందక పేదలు అల్లాడుతున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రేపు(శుక్రవారం) రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయనున్నట్టు అంబటి ప్రకటించారు. తాము ధర్నా చేస్తామని ప్రకటించిన తర్వాతే అరకొరగా నిధులు విడుదల చేశారన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆస్పత్రిలో ఎలుకలు, చీమలు కొరకడంతో పసిపిల్లలు చనిపోయారని.. దీనికి మంత్రి కామినేని సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. -
‘మంత్రి కామినేని సిగ్గుతో తల దించుకోవాలి’
-
నేడు మంత్రి కామినేని రాక
అనంతపురం అర్బన్ : వైద్య, ఆరోగ్య శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న నగదు రహిత లావాదేవీల అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళతారు. -
వాళ్లిద్దరూ బహిరంగ చర్చకు సిద్ధమా?
విజయవాడ: రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాల యాజమాన్యాలకు అనుకూలంగా మంత్రి కామినేని శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. విజయవాడలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడుతూ మెడికల్ కౌన్సిలింగ్ లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. మెడికల్ కౌన్సిలింగ్ పై ఈనెల 26న హెల్త్ యూనివర్శిటీకి వెళతామని, ఆరోజు మంత్రి కామినేని కూడా యునివర్శిటికి వస్తే వాస్తవాలను వెల్లడిస్తామని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని రామకృష్ణ సవాల్ చేశారు. చట్టం గురించి పార్లమెంటు లో ఎవరికి తెలియదని అంటున్న వెంకయ్య నాయుడుకి చట్టం తెలిస్తే ఎందుకు మోసం చేస్తున్నాడని ప్రశ్నించారు. ప్యాకేజికి చట్టబద్దత ఉందా అనే విషయంలో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
'మంత్రి కామినేని రాజీనామా చేయాలి'
అనంతపురం: అనంతపురం జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. విష జ్వరాల బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా.. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు చేపట్టారు. మంగళవారం అనంతపురంలో డీఎం అండ్ హెచ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మంత్రి కామినేని శ్రీనివాస్‌ను రాజీనామా చేయాలంటూ సీపీఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దాంతో డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయం వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. -
హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి: మేరుగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా విషజ్వరాలతో జనం పిట్టల్లా రాలిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్ర పోతోందని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. ప్రజలను ఆదుకోవడానికి తక్షణం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేసింది. పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు మేరుగ నాగార్జున సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు కూడా తెలియని వ్యక్తి కామినేని శ్రీనివాస్ ఆరోగ్య మంత్రిగా ఉండటం దారుణమన్నారు. విధి నిర్వహణలో విఫలమైన మంత్రి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి విషజ్వరాలపై తక్షణ చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలని కోరారు. -
కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం మొత్తానికి జ్వరం వచ్చినా, కామినేని మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు చేతగాని దద్దమ్మలా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆరోగ్య శాఖమంత్రి కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో అని, ఆయనకు బీపీ చూడటం కూడా రాదని మేరుగ నాగార్జున మండిపడ్డారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనంతా కమీషన్లు, వాటాలు, కేసులేనని ఆయన ఎద్దేవా చేశారు. వస్తువులకు లోకల్ ట్యాక్స్ల్లా, ఏపీలో లోకేశ్ ట్యాక్స్‌ల పేరుతో వసూలు చేస్తున్నారంటూ మేరుగ మండిపడ్డారు. -
కామినేనికి ఎంబీబీఎస్ పట్టా ఎలా వచ్చిందో!
-
మంత్రి సీరియస్: నలుగురు వైద్యులపై వేటు
-
మంత్రి సీరియస్: నలుగురు వైద్యులపై వేటు
గుంటూరు : గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి... పసికందు మృతి చెందడం పట్ల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు బాధ్యులైన నలుగురు వైద్యులను సస్పెండ్ చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు రూరల్ మండల పరిధిలోని దాసరిపాలెంకి చెందిన జగన్నాథం నాగబాబు ఆటోడ్రైవర్. అతని భార్య భవానికి పురుటి నొప్పులు రావడంతో మంగళవారం ఉదయం జీజీహెచ్‌కు తీసుకొచ్చారు. వైద్యులు సాధారణ కాన్పు చేయగా ఉదయం 7.20 గంటలకు మగబిడ్డ పుట్టాడు. అరగంట తర్వాత బిడ్డ చనిపోయాడంటూ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. అంతేకాకుండా డెత్ సర్టిఫికేట్‌తో సహా వారి చేతిలో పెట్టారు. దీంతో వారు కన్నీరుమున్నీరు అవుతూ బిడ్డ మృతదేహాన్ని తీసుకుని... ఆటోలో ఇంటికి పయనమైయ్యారు. ఇంతలో పసికందులో కదలిక వచ్చింది. ఆ విషయాన్ని గుర్తించి... మళ్లీ ఆసుపత్రికి తీసుకుచ్చారు. దీంతో నాలుక్కరుచుకున్న వైద్యులు హడావుడిగా శిశువును ఐసీయూకు తరలించి చికిత్స ప్రారంభించారు.అయితే ఆ పసికందు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించింది. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని పసికందు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రూ.3వేల కోట్ల గ్రాంట్లు నిలిపివేత
- రావాల్సిన నిధులను విడుదల చేయని కేంద్రం - సంక్షోభంలో వైద్య ఆరోగ్యశాఖ పథకాలు - కొన్ని విభాగాల్లో జీతాలకూ కటకట సాక్షి, హైదరాబాద్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సుమారు రూ.3 వేల కోట్లపైనే నిలిపివేశారు. దీంతో రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో అమలవుతున్న పలు పథకాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. కొన్ని విభాగాల్లో జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల కావాల్సిన ప్రధానమంత్రి స్వాస్థీయ సురక్ష యోజన (పీఎంఎస్ఎస్వై) పథకానికి చెందిన సుమారు రూ.400 కోట్లు పైనే ఇప్పటివరకూ రాలేదు. విశాఖపట్నంలో మెడ్‌టెక్ పార్క్ జోన్ ఏర్పాటుకు రూ.92 కోట్లు రాష్ట్రమిస్తే, మరో రూ.92 కోట్లు కేంద్రం ఇవ్వాల్సి ఉంది. అయితే నేటికీ కేంద్రం రావాల్సిన నిధులివ్వలేదు. ఇక జాతీయ ఆరోగ్యమిషన్ నిధులు కూడా సకాలంలో రాలేదు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి నుంచి వచ్చే నిధులు రాకపోవడంతో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. నిధులివ్వాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గత మూడు మాసాల్లో నాలుగు లేఖలిచ్చినా కేంద్రం వీటిని చెత్తబుట్టలో వేసినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పథకాల అమలు తీరు, నిధుల వ్యయంపై ఇప్పటికే కేంద్రం పలుసార్లు హెచ్చరించింది. ఇటీవల కేంద్రం నుంచి రూ.56 కోట్లు పట్టణ ఆరోగ్యం మెరుగు పర్చండి అని నిధులిస్తే.. ఏకంగా ఈ - యూపీహెచ్సీల పేరుతో ప్రైవేటుకు అప్పజెప్పారు. అలాగే పథకాల నిర్వహణను ఆఫ్‌లైన్ టెండర్ల ద్వారా పిలిచి అప్పగించడం, జాతీయ ఆరోగ్యమిషన్ నిధుల వ్యయంపై రసీదులు, వోచర్లు ఇవ్వకపోవడం వంటివాటిపై కేంద్రం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆరోగ్యశాఖలో పథకాలన్నీ కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అమలవుతున్న 95 శాతం ఆరోగ్య పథకాలన్నీ కేంద్రం ఇచ్చే నిధులతోనే నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పథకాలకు చేస్తున్న వ్యయం, దానికి సంబంధించిన లెక్కల్లో పారదర్శకత లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి. జిల్లాల నుంచి గత మూడేళ్లలో ఖర్చు చేసిన వ్యయాలకు సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు కూడా ఇప్పటికీ సరిగా లేవు. ఇలా ప్రతి పథకంలోనూ ఏదో ఒక అవకతవకలు జరగడం, లేదా సరిగా అమలు చెయ్యకపోవడం వల్లే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకనే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
విడిపోదామన్న విషయం నాకు తెలియదు: కామినేని
బీజేపీతో స్నేహపూర్వకరంగా విడిపోదామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న విషయం తనకు తెలియదని ఆ పార్టీ నేత, ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. గురువారం ఆయన తన నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూస్తారని చెప్పారు. తిరుపతి సభలో పవన్ ప్రత్యేక హోదాపై ప్రజల అభిప్రాయాన్ని వెల్లడించారన్నారు. మూడవ విడత కౌన్సిలింగ్ మూడో విడత మెడికల్ కౌన్సిలింగ్ని ఈ నెల 25,26 తేదీల్లో నిర్వహిస్తామని మంత్రి కామినేని ప్రకటించారు. కౌన్సిలింగ్ సందర్భంగా చివరి నిమిషంలో అభ్యర్ధులు విత్‌డ్రా అయితే ధ్రువీకరణ పత్రాలను వెనకకు ఇవ్వబోమని చెప్పారు. అభ్యర్ధుల చర్య వల్ల వంద సీట్లను నష్టపోతున్నామన్నారు. బీ కేటగిరిలో డబ్బులు కట్టిన విద్యార్ధులకు గవర్నమెంట్ కోటాలో ఎ కేటగిరి క్రింద సీటు వస్తే ఎటువంటి మినహాయింపు లేకుండా సీటు ఇవ్వాలని మంత్రి కామినేని అధికారులను ఆదేశించారు. కౌన్సిలింగ్లో దళారులను నమ్మవద్దని అభ్యర్ధులకు సూచించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ క్రింద పీజీకి గ్రేస్ మార్కులను ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. -
19న మెడిటెక్‌కు భూమి పూజ
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో ఈ నెల 19న మెడికల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్(మెడిటెక్)కు భూమి పూజ చేయనున్నట్టు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దేశంలో ఇలాంటి పార్క్‌ను ఏర్పాటు చేయనుండడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులను ఆహ్వానించడానికి కామినేని బుధవారం ఢిల్లీ వచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనాచౌదరి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూమి పూజకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంత్ కుమార్, సురేష్‌ప్రభు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరీ తదితరులను ఆహ్వానించినట్టు తెలిపారు. పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఫార్మా, కెమికల్ అండ్ ఫర్టిలైజర్ శాఖ రూ. 75 కోట్లు, వాణిజ్య మంత్రిత్వ శాఖ రూ. 50 కోట్లు, ఎలక్ట్రానిక్ అండ్ టెలీ కమ్యూనికేషన్ శాఖ రూ. 50 కోట్ల సాయం అందించనున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 275 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, రూ. 50 కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ పార్క్ పూర్తయితే 25 వేల మంది ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. మొదటి విడతగా ఏడాదిలోపు 38 సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి నీట్ కౌన్సెలింగ్‌ను కూడా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. సీట్లు విత్‌డ్రా చేసుకోవడానికి ఒక తేదీని ప్రకటిస్తామని, ఆ తరువాత విత్‌డ్రాకు అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. -
యథావిధిగా ఎంబీబీఎస్ పరీక్షలు
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఎంబీబీఎస్ పరీక్షలను వాయిదావేసే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఆంధ్రాహార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. పుష్కరాల ప్రభావం సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థులపైనే ఉంటుందని, వారు సమీప కళాశాలకు సెంటర్‌కు మార్పుచేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లోని నిరుపేద రోగులకు సేవ చేసేలా ఒక విధానాన్ని అమలుచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
నిధులిస్తున్నా రాద్ధాంతం చేస్తున్నారు
- రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మంత్రి కామినేని చిల్లకూరు(నెల్లూరు జిల్లా) రాష్ట్రానికి అవసరమైన నిధులను కేంద్రం మంజూరు చేస్తున్నా, కొందరు ప్రత్యేక హోదా అవసరమంటూ రాద్ధాంతం చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని వరగలి, వల్లిపేడు ఆరోగ్య కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వరగలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా విషయంపైనే చర్చిస్తున్నారని, నిధులనిస్తున్నా రాద్ధాంతం చేయడం తగదని పేర్కొన్నారు. హోదా విషయం కేంద్రం తేల్చాల్సిందేనని ముక్తాయించారు. కాగా, వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి ప్రతి ఆస్పత్రిలో స్పెషలిస్టులు ఉండేలా చూస్తామన్నారు. క్లస్టర్ వ్యవస్థ రద్దుతో డివిజన్ స్థాయిలో అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓలను నియమించి వైద్య సేవలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. -
ఏపీ ఎంసెట్‌లో అక్రమాల్లేవు: కామినేని
-
ఏపీ ఎంసెట్‌లో అక్రమాల్లేవు: కామినేని
ఏపీలో నిర్వహించిన ఎంసెట్ మెడికల్ పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. 15 శాతం ఓపెన్ కోటాలో తెలంగాణ విద్యార్థులు చేరితే ఏపీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఆప్షన్ల ఎంట్రీని వాయిదా వేసినట్లు తెలిపారు. వచ్చే నెల 6, 7 తేదీలలో ఆప్షన్ల ఎంట్రీకి అవకాశం కల్పిస్తామన్నారు. తెలంగాణ ఎంసెట్ ఆలస్యమైతే... ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇక ఏపీలో పీజీ మెడికల్ సీట్లు తీసుకున్నవాళ్లు కచ్చితంగా చేరాలని కామినేని శ్రీనివాస్ తెలిపారు. వాళ్లు సీట్లు తీసుకునేటప్పుడు కచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. సీట్లు రద్దు చేసుకుంటే రూ. 2 లక్షలు కట్టాలని, అలా కట్టనివాళ్లకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేది లేదని తెలిపారు. కొంతమంది కౌన్సెలింగ్‌లో సీట్లు తీసుకుని, కోర్సులలో చేరకపోవడంతో చాలా సీట్లు మిగిలిపోయి ఎంతోమందికి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. -
36 గంటల్లో కిడ్నాప్‌ను ఛేదించారు
-
మైక్ పడేసి సమావేశం నుంచి వెళ్లిపోయిన మంత్రి
-
మైక్ పడేసి సమావేశం నుంచి వెళ్లిపోయిన మంత్రి
తిరుపతి: చిత్తూరు జిల్లా రేణుగుంటలో మంత్రి కామినేని శ్రీనివాస్ మంగళవారం నిర్వహించిన సభ రసాభాసగా మారింది. ఈ సమావేశం ప్రారంభం కాగానే ప్రభుత్వాసుపత్రికి వైద్యులు సకాలంలో రావడం లేదని.. మంత్రి కామినేని శ్రీనివాస్‌ను టీడీపీ జెడ్పీటీసీ లీలావతమ్మ నిలదీసింది. దాంతో కామినేని శ్రీనివాస్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. లీలావతమ్మ తీరుపరై కామినేని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మైక్ పడేసి సమావేశం నుంచి మంత్రి కామినేని వెళ్లిపోయారు. -
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు!
-
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు!
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండు విడతలుగా భేటీ అయ్యారు. కోర్ కమిటీ భేటీ తర్వాత అమిత్ షా తన ఛాంబర్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ స్థాయి నేతలు మురళీధర్ రావు, రాం మాధవ్, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. వీరితో పాటు ఏపీకి చెందిన నేతలు పురందేశ్వరి, మంత్రి మాణిక్యాలరావు, ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. సమావేశం తర్వాత ఓ సీనియర్ నేత అసంతృప్తితో వెళ్లిపోయారని సమాచారం. ఈ కీలక సమావేశానికి మంత్రి కామినేని శ్రీనివాస్ ను పార్టీ హైకమాండ్ ఆహ్వానించకుండా దూరంగా ఉంచింది. దీంతో ఏపీ బీజేపీలో అసంతృప్తి రాగం అందుకున్నట్లు పరిస్థితి తయారయింది. -
కామినేనీ.. నోరు అదుపులో పెట్టుకో
కొలుసు పార్థసారథి, కొడాలి నాని కైకలూరు : ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) సూచించారు. చంద్రబాబు మెప్పు కోసం తమ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డిని ఇష్టానుసారం విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గడప గడపకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం సమాయత్తం కోసం సారథి, కొడాలి నాని బుధవారం కైకలూరు వచ్చారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డిపై నోరు పారేసుకుంటే మంత్రి కామినేని కంటే వయసులో చిన్నవాడినైన తాను కైకలూరు నడిరోడ్డుపై నిలబడి ఆయన్ను తిడతానని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో కామినేని మళ్లీ సీటు తెచ్చుకుంటారని, అయితే కైకలూరులో గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టంచేశారు. కొలుసు పార్థసారథి మాట్లాడుతూ దేశంలో ఎక్కడైనా అనారోగ్యంతో మరణించే శిశువులను చూశామని, ఈ రాష్ట్రంలో మాత్రం చీమలు, ఎలుకలు కరిచి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇంతకన్న దౌర్భాగ్యం ఎక్కడైన ఉందా? అని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి కామినేని పాలన తీరే కారణమన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉదయభాను మాట్లాడుతూ గత ఎన్నికల్లో గాలివాటున కామినేని గెలిచారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) మాట్లాడుతూ స్థానిక ప్రజలు తాగునీటి కోసం అల్లాడటానికి మంత్రి కామినేని శ్రీనివాస్ కారణమని విమర్శించారు. ముదినేపల్లిలో ఆయన అనుచరుల చేపల చెరువులకు నీటిని మళ్లించడం వల్లే తాగునీటి ఇబ్బందులు దాపురించాయని వివరించారు. అధికారంతో ప్రశ్నించే వారిని అణగదొక్కలని చూస్తే కార్యకర్తలందరం ఒక్కటై పోరాడతామని హెచ్చరించారు. -
ధార్మిక సభలో ఉద్రిక్తత.. మధ్యలో వెళ్లిపోయిన మంత్రి
హిందూ ధార్మిక సభలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. అడ్డదిడ్డంగా విగ్రహాలు కూల్చేసిన చంద్రబాబు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలంటూ భక్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆలయాలు, విగ్రహాల కూల్చివేతపై విజయవాడలో సోమవారం సాయంత్రం భారీ నిరసన సభ నిర్వహించారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు పలు పీఠాల అధిపతులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. నిరసన సభకు విజయవాడ నగరవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సభలో ముందుగా మంత్రి కామినేని శ్రీనివాస్ నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడిన కాసేపటికే భక్తులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కలెక్టర్, కమిషనర్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దాంతో సభ మధ్యలోనే కామినేని శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ, సోము వీర్రాజులతో పాటు దేవాదయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు కూడా పాల్గొన్నారు. -
వైద్యశాఖలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్
► బదిలీలు పారదర్శకంగా జరుగుతాయి ► 422 వైద్య పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ ► ప్రతి జిల్లా ఆసుపత్రిలో 10 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు ► జిల్లాకు 2 చొప్పున 13 జిల్లాలలో హెల్త్ ఏటీయమ్స్ ఏర్పాటు ► మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడి ఏపీ ముఖ్యమంత్రి ఆదేశానుసారం శుక్రవారం నుంచి 10 రోజుల పాటు వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ చేపడుతున్నట్లు ఆ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ గురువారం తెలిపారు. బదిలీలు పారదర్శకంగా ఉంటాయన్నారు. డాక్టర్ల పనితీరు, పరస్పర అంగీకారం, భార్య, భర్తలను ఒకే చోట లేదా వీలైనంత దగ్గరగా పనిచేసేలా, ఎంసీఐ నిబంధనలకు లోబడి ఈ బదిలీలు చేస్తామని మంత్రి కామినేని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఉచిత సీటీ స్కాన్ పరీక్షలు, తల్లి, బిడ్డ ఎక్స్ ప్రెస్, 108 సేవలు, 102 కాల్ సెంటర్, ఆసుపత్రులలో పరికరాల ఏర్పాటు మొదలైన పథకాల పనితీరు బాగుందని ముఖ్యమంత్రి చెప్పినట్లు మంత్రి కామినేని పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 35 సంవత్సరాల వయస్సు నిండిన మహిళలకు అన్ని రకాల క్యాన్సర్, థైరాయిడ్, డయాబెటిస్, హర్మోన్, స్త్రీ వ్యాధులకు ఉచిత వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇప్పటికే 13 వేల మంది ఎఎన్ఎమ్ లకు దీనిపై శిక్షణతో పాటు ట్యాబ్స్ ఇచ్చామని మంత్రి తెలిపారు. ఏపీ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో అత్యాధునిక నేత్ర పరీక్ష కోసం యంత్ర పరికరాల ఏర్పాటు చేశామని, అన్ని జిల్లా ఏరియా ఆస్పత్రులలో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుచేసిన తర్వాత హాజరుశాతం పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఆసుపత్రులల్లో ప్రసవించిన మహిళలకు త్వరలో "బేబీ కిట్స్" ఇవ్వబోతున్నామని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి త్వరలో ప్రారంబిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక్కొక్క ఆసుపత్రిలో 10 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. జిల్లాకు 2 చొప్పున 13 జిల్లాలలో హెల్త్ ఏటీయమ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్బన్ హెల్త్ సెంటర్స్ పనితీరు బాగోలేదని వీటిని ఈయుపీహెచ్సీలుగా మార్చి ఆధునీకరిస్తున్నామన్నారు. 422 వైద్య పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని, త్వరలో ప్రభుత్వ వైద్యకళాశాలలో చదివే విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించినప్పుడు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాననడం సరికాదని బీజేపీ సభ్యుడిగా పార్టీలోని కార్యకర్తలు, నాయకులను కలుపుకొని వెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మంత్రిగా తన శాఖను, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పనిచేసే బాధ్యత తనపై ఉందన్నారు. కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, స్మృతి ఇరానీల విజ్ఞప్తి మేరకే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశానని, అదికూడా ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబును సంప్రదించాకేనని చెప్పారు. ప్రత్యేక హోదాపై బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. -
'సక్రమంగా పనిచేయని డాక్టర్లను తొలగిస్తాం'
హైదరాబాద్: సక్రమంగా విధులు నిర్వహించని డాక్టర్లను తొలగిస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం ఆయన వైద్య ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. వైద్యులు సక్రమంగా విధులు నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వ వైద్యల పదవీ విరమణ 65 ఏళ్లకు పెంచాలని యోచిస్తున్నట్టు తెలిపారు. జూన్ 8 నుంచి 15 వరకు వైద్య శాఖలో బదిలీలు నిర్వహిస్తామని మంత్రి కామినేని వెల్లడించారు. -
వ్యవస్థను బాగుచేసేందుకే ‘ఆస్పత్రి నిద్ర’
► మంత్రి కామినేని శ్రీనివాస్ అనంతపురం: వైద్య వ్యవస్థను బాగు చేయడం కోసమే ‘ఆస్పత్రి నిద్ర’ చేపట్టినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. సోమవారం రాత్రి అనంతపురం సర్వజనాస్పత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్లో ఆయనతో పాటు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ‘ఆస్పత్రి నిద్ర’ చేపట్టారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ వైద్య రంగంలో చిన్నచిన్న లోపాలున్న మాట వాస్తవమేనన్నారు. ప్రభుత్వం వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మంగళవారం ఉదయం సర్వజనాస్పత్రిని తనిఖీ చేస్తానని, మధ్యాహ్నం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. ఇక్కడి సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. నీట్లో సీబీఎస్ఈ సిలబస్ ఉండడంతో తెలుగు విద్యార్థులకు కష్టంగా మారే అవకాశం ఉందన్నారు. ఎంసెట్‌లో వెయిటేజీ మార్కులుంటాయని, కానీ నీట్లో ఆ పరిస్థితి ఉండదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత, కలెక్టర్ కోన శశిధర్, మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ గంపన్న, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నీరజ, సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, ఆర్ఎంఓ వైవీ రావు, అడిషనల్ డీఎంఈ బాబ్జి తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ మల్లికార్జున వర్మ ఆధ్వర్యంలో బందోబస్తు చర్యలు చేపట్టారు. పోస్టులు భర్తీ చేయాలి ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో 124 జీవో ప్రకారం 510 పోస్టులను భర్తీ చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు మంత్రి కామినేనికి వినతిపత్రం అందజేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు రాలేదని, తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. మెడికల్ కళాశాలకు పీజీ సీట్లు వచ్చేలా చూడాలన్నారు. అర్బన్ హెల్త్సెంటర్లను ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవలో ఆరోగ్యమిత్రలను తొలగించకుండా పాతవాళ్లనే కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బండి పరశురాం, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌మోహన్, అధికార ప్రతినిధులు చింతకుంట మధు, శ్రీకాంత్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, యువజన విభాగం నగర అధ్యక్షుడు మారుతినాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఐ సౌకర్యం కల్పించండి సర్వజనాస్పత్రిలో ఎంఆర్ఐ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మంత్రికి వినతిపత్రం అందజేశారు. సర్వజనాస్పత్రి, మెడికల్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని విన్నవించారు. మంత్రి కోసం ఇన్ని ఆర్భాటాలా? వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పర్యటన సందర్భంగా సర్వజనాస్పత్రిలో ఆర్భాటాలు చేయడమేంటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సోమవారం రాత్రి ఆయన సర్వజనాస్పత్రిని పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల కొరతతో రోగులకు సక్రమంగా సేవలు అందించలేకపోతున్నట్లు కొందరు ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రోగులకు మెరుగైన వైద్యం అందించడంలో అధికారులు తీవ్రంగా విఫలమయ్యారని ఆగ్రహించారు. కార్యక్రమంలో రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య, జిల్లా కార్యదర్శి జగదీష్, జిల్లా సహాయ కార్యదర్శులు జాఫర్ తదితరులు పాల్గొన్నారు. -
విచారణకు ఆదేశించని.. కామినేని
విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చీమలు కోరికి నవజాత శిశువు మృతి చెందిన ఘటన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఈ ఘటనపై విచారణకు సర్కార్ ముందుకు రాలేదు. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ నుంచి ఈ ఘటనపై ఇంకా విచారణకు ఆదేశాలు వెలువడలేదు. కాగా ఈ ఘటనపై విచారణ జరపాలన్న తమ డిమాండ్‌ను ఏపీ సర్కార్ పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే సదరు శిశువు సహజ మరణంగానే భావిస్తున్నట్లు వైద్యుల అభిప్రాయాన్ని మంత్రి పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అందువల్లే ఈ ఘటనపై విచారణకు ఇంకా ఆదేశాలు రాలేదని తెలిసింది. -
పార్టీ ఫిరాయింపుల్లో మంత్రి కామినేని పాత్ర?
హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపుల వెనుక బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్ హస్తం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా పార్టీ మారటం వెనుక ఆయన పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. చాంద్ బాషా టీడీపీలో చేరేంతవరకూ మంత్రి కామినేని...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వద్దే ఉన్నారు. చాంద్ బాషా పార్టీ మారే విషయంలో కామినేనే స్వయంగా పావులు కదిపినట్లు సమాచారం. కాగా కామినేని శ్రీనివాస్ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మరోవైపు పార్టీ ఫిరాయింపుల్లో కామినేని పాత్ర ఉండటంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ఆయన వ్యవహార శైలి వల్ల పార్టీకి మచ్చ వస్తోందని వారు మండిపడుతున్నారు. విపక్ష ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభపెడుతుంటే బీజేపీ చెందిన మంత్రికి ఏం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ఆయన బీజేపీ నేతగా కాకుండా టీడీపీ వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని గతంలోనూ ఆరోపణలు ఉన్నాయి. -
విశాఖ, నెల్లూరు, కర్నూలుల్లో కేన్సర్ ఆసుపత్రులు
గుంటూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్సీ) బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం గుంటూరులో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 84 పీహెచ్‌సీలకు రూ. 101 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. అలాగే ఇప్పటి వరకు 800 వైద్యుల పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. త్వరలో మరో 500 వైద్యుల పోస్టులు భర్తీకి చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. అలాగే రాష్ట్రంలో తల్లీబిడ్డల మరణాలను గణనీయంగా తగ్గించామని కామినేని పేర్కొన్నారు. రూ. 225 కోట్లతో వైద్య పరికరాల తయారీ కోసం విశాఖలో మెడ్‌టెక్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాట్కో సాయంతో రూ. 10 కోట్లతో గుంటూరులో కేన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని... ఈ నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. విశాఖ, నెల్లూరు, కర్నూలు నగరాల్లో కేన్సర్ ఆసుపత్రులు నిర్మించనున్నట్లు కామినేని తెలిపారు. ఈ నెల 11వ తేదీన విశాఖలో విమ్స్ ప్రారంభిస్తామన్నారు. -
కామినేనీ.. ఇదేమి..!
శిశు మరణాల రేటును 28కి తగ్గించామన్న మంత్రి ఏపీలో శిశు మరణాల రేటు 35గా పేర్కొన్న కేంద్రం సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అవాస్తవాలు వల్లించారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు టీడీపీ సభ్యులు వేసిన ప్రశ్నలకు సమాధానమిస్తూ... వంద సంవత్సరాలు జీవించాల్సినవారు పుట్టిన వారానికే చనిపోతున్నారు.. గత ప్రభుత్వాల తప్పిదాలే ఇందుకు కారణమని విమర్శించారు. గతంలో ప్రతి 1,000 మంది శిశువుల్లో 41 మంది మృతి చెందేవారని (శిశు మరణాల రేటు), ఇప్పుడు ఆ రేటును 28కి తగ్గించామని చెప్పారు. అయితే నెల రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఆర్ఎస్ (శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే) బులెటిన్‌లో పేర్కొన్న వివరాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ బులెటిన్ ఏపీలో శిశు మరణాల రేటును ప్రతి వెయ్యికీ 35గా పేర్కొనడం గమనార్హం. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి గత పదేళ్లలో ఒక్క నియామకమూ జరగలేదని కామినేని చెప్పారు. కానీ ఉమ్మడి ఏపీలో అంటే 2007లో అప్పటి ముఖ్యమంత్రి 4 వైద్య కళాశాలలు (రిమ్స్‌లు) ఏర్పాటు చేశారు. ఈ కళాశాలల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కలిపి సుమారు 3 వేల మంది నియమితులు కావడం గమనార్హం. వాస్తవానికి ఇప్పుడు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రులను ప్రైవేటుకు లీజుకు ఇస్తున్నారు. రక్తపరీక్షల నిర్వహణను సైతం ప్రైవేటుకు అప్పగించారు. దీనికి సంబంధించిన రూ.120 కోట్ల కాంట్రాక్టును ‘మెడాల్’ సంస్థకు కట్టబెట్టారు. మెడాల్ సంస్థ అద్భుతంగా పనిచేస్తోందని కామినేని కితాబిచ్చారు. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ మెట్ ఫలితాలు
విజయవాడ: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన పీజీమెట్ ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సోమవారం వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 13,252 మంది పరీక్ష రాయగా 8658 మంది అర్హత సాధించారు. మొదటి ర్యాంకును సీహెచ్ వెంకటరమణ, రెండో ర్యాంకు సుమంత్ అనే విద్యార్థులు సాధించారు. మొత్తం 2533 సీట్లకు గాను 1873 కన్వీనర్ కోటా, 673 మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైద్య విద్య బలోపేతానికి కృషి
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గుంటూరు మెడికల్ : రాష్ట్రంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చాం..గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా రూ.7 కోట్లతో నిర్మించిన హౌస్సర్జన్లు, పీజీ వైద్య విద్యార్థుల మహిళా వసతి గృహాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గుంటూరు జీజీహెచ్‌కు మంచి పేరు ఉందని, ప్రైవేటు ఆస్పత్రులు పెరగడం వల్ల కొంత ఆదరణ తగ్గిందని తెలిపారు. ఆస్పత్రికి పూర్వ వైభవ తెస్తామన్నారు. జీజీహెచ్‌లో రూ.4 కోట్లతో అభివృద్ధి పనులు, రూ. 10 కోట్లతో సర్వీస్ బ్లాక్, రూ. 7.6 కోట్లతో సీనియర్ రెసిడెంట్ల క్వార్టర్, రూ. 20 కోట్లతో నర్సింగ్ కళాశాల, రూ. 20 కోట్లతో మాతాశిశు సంరక్షణ కేంద్రాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో రూ.30 కోట్లతో వీడియో క్లాస్‌రూమ్‌లు, స్కీల్ ల్యాబ్ స్టిమ్యూలేషన్ సెంటర్ నిర్మాణాలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను ప్రైవేటు పరం చేయడం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రసంగించారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుంటుపల్లి సుబ్బారావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, డీఎంవోహెచ్వో పద్మజారాణి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీని బలోపేతం చేయాలి
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ రైలుపేట (గుంటూరు): బీజేపీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం గుంటూరు హౌసింగ్ బోర్డు మామిడి గార్డెన్స్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ నలబోతు వెంకటరావుకు అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కామినేని మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పదవీ బాధ్యతలు చేపట్టాక ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైన నాయకుడిగా నెంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నట్లు వెల్లడించారు. అమిత్‌షా సారథ్యంలో పది కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలో అత్యధిక సభ్యులు కలిగిన ఏకైక పార్టీగా బీజేపీ అవతరించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడ్డాక చిన్న అవినీతి మరక కూడా లేకుండా పరిపాలన సాగిస్తోందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం బాధ్యత అందరిపై ఉందని, బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్రం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందరికి వివరించి పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్‌కిషోర్ మాట్లాడుతూ సీనియర్ నాయకులను కలుపుకుని అందరూ కలిసి పార్టీ బలోపేతానికి కషి చేయాలని కోరారు. సభకు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పొట్రు పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించారు. పార్టీ నేతలు ఆర్.లక్ష్మీపతి, యడ్లపాటి రఘునాధబాబ, యడ్లపాటి స్వరూపరాణి, కొత్తూరి వెంకటసుబ్బారావు, గౌస్‌మొహిద్దీన్, అమ్మిశెట్టి ఆంజనేయులు, తదితరులు అభినందన సభలో మాట్లాడారు. జిల్లాలో నూతనంగా ఎంపికైన 54 మంది మండల అధ్యక్షులు, పలువురు పార్టీ నేతలు కార్యక్రమానికి హాజరయ్యారు. -
'వైద్యులు నైతిక విలువలకు కట్టుబడాలి'
విజయవాడ: ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యాలయాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకు సమగ్ర వైద్యం అందించడంతో పాటు వైద్యులు నైతిక విలువలకు కట్టుబడి ఉండటమే ప్రధాన ఉద్దేశ్యంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆర్హతలు, మెరిట్ ప్రతిపాదికన 1000 నర్సులు,501 డాక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. వైద్య ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు దళారులు చెబుతున్నట్లు సమాచారం తమ వద్ద ఉన్నదని వీరిపట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 'ప్రస్తుత పరిస్ధితులలో సిఫార్సుల ద్వారా నా కొడుకు, కూతురుకు కూడ ఉద్యోగం ఇప్పించుకోలేనని.. అంత పారదర్శకంగా కాంట్రాక్ట్ ఉద్యోగ నియమకాలు చేపడుతున్నాం' అని మంత్రి కామినేని వెల్లడించారు. ఇప్పటివరకు ఉచిత రోగ నిర్ధారణ పరీక్షల క్రింద లక్ష మందికి రోగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా మంత్రి వెల్లడించారు. గర్భిణీలకు మార్చి 8 వ తేది నుండి అల్ట్రా సౌండ్ పరీక్షలను ఉచితంగా చేస్తామని తెలిపారు. త్వరలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కౌన్సిల్ సభ్యులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. -
వివాదాస్పదంగా మారిన మంత్రిగారి ఆర్భాటం
-
'మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేది'
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రికి 'ప్రైవేటు' చికిత్సపై ఆయన మండిపడ్డారు. మంత్రిగారు మోచిప్ప మార్పిడి కన్నా మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేదని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. శనివారం అంబటి రాంబాబు ఇక్కడ మాట్లాడుతూ 'మంత్రిగారు జీజీహెచ్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన బయట నుంచి ప్రయివేట్ వైద్యుల్ని తెప్పించుకుని ఆపరేషన్ చేయించుకున్నారు. రోగులకు, ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల మీద విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించడం కోసం సాక్షాత్తూ మంత్రిగారే ఆపరేషన్ చేయించుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే మంత్రిగారి నిర్వాకం వల్ల జీజీహెచ్ ప్రతిష్ట మరింత దిగజారిపోయింది. ఆయన బయట నుంచి డాక్టర్లను తెప్పించుకుని ఆపరేషన్ చేయించుకుంటున్నారు. డాక్టర్లేమో బయటవారు, బెడ్స్ మాత్రం గవర్నమెంట్వా? ఇలా చేస్తే ప్రభుత్వ ఆస్పత్రి పరువు ప్రతిష్టలు పెరుగుతాయా? గవర్నమెంట్ ఆస్పత్రుల పరువు ప్రతిష్టలు దిగజార్చేలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రవర్తించారు. జీజీహెచ్ ప్రతిష్ట ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతగా దిగజారిపోయిందో మనం చూశాం. పసిపిల్లల్ని ఎలుకలు కొరుక్కు తిన్నాయి. ఆ ఎలుకల్ని తినడానికి పాములు వచ్చాయి. ఒక జూ పార్కులా గవర్నమెంట్ ఆస్పత్రి దిగజారిపోయింది. మంత్రిగారి చర్యలో అది మరింత పడిపోయిందని' మండిపడ్డారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. పోలీసులు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేసి రకరకాల వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పనిగట్టుకుని విచ్చలవిడిగా అక్రమ కేసులు పెట్టి, ప్రధాన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని, చంద్రబాబు, ఆయన ప్రభుత్వం పని చేస్తున్నట్లు తేటతెల్లం అవుతోందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలీసులకు వైఎస్ఆర్ సీపీ నాయకుల మీద కేసులు పెట్టడం తప్ప మరే పనేమీ కనిపించడం లేదని అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకుల్ని అణచాలని, కేడర్‌ను భయపెట్టాలని చూస్తున్నారని, ఇది ఎక్కువ కాలం సాగదన్నారు. రేణిగుంట విమానాశ్రయం ఘటనలో ఆధారాలు ఉంటే బయటపెట్టాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన సవాల్ చేస్తే ఏవో రెండు క్లిప్పింగ్స్ బయటపెట్టి, ఆధారాలు విడుదల చేశామని టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని అంబటి విమర్శించారు. వాటిలో మిథున్ రెడ్డి కానీ, చెవిరెడ్డి కానీ లేరనే విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. -
'మెదడుకు ఆపరేషన్ చేయించుకుంటే బాగుండేది'
-
జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదా?
-
'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి'
గుంటూరు మెడికల్: సామాన్యులకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకు వీలుగా ప్రజా ప్రతినిధులు అందరూ సర్కారు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకుంటే బాగుంటుందని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. శనివారం గుంటూరు జిల్లా ఆస్పత్రిలో మంత్రి కామినేని శ్రీనివాస్‌ను మంత్రి పల్లె, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పరామర్శించారు. అనంతరం మంత్రి ఓపీలో బీపీ, ఇతర పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకే మంత్రి కామినేని ఇక్కడ మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారని, తాను పరీక్షలు చేయించుకున్నానని వివరించారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. కాగా మంత్రి కామినేని మోకాలి ఆపరేషన్ వివాదంగా మారుతోంది. జీజీహెచ్‌పై నమ్మకం కలిగించేందుకే ఇక్కడ ఆపరేషన్ అన్న ఆయనకు జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదు. అందుకే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వైద్యులను పిలిపించుకుని మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య పరికరాలు సైతం కార్పొరేట్ వైద్యశాలల నుంచి తెప్పించుకుని ఆపరేషన్ అయిపోగానే తిరిగి పంపించేశారు. మంత్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారో అది తీవ్ర విమర్శల పాలవుతోంది. -
మంత్రిగారికి జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదా?
మంత్రి కామినేని శ్రీనివాస్ కీళ్ల మార్పిడి ఆపరేషన్ తీరిది కార్పొరేట్ వైద్యులతో శస్త్రచికిత్స ఆపరేషన్ అయ్యాక వైద్య పరికరాలు మాయం మండిపడుతున్న వైద్యులు, రోగులు ‘జీజీహెచ్‌పై నమ్మకం కలిగించేందుకే మంత్రిఆపరేషన్ ఇక్కడ చేయించుకున్నారట. అయితే, ఆయనకు జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదు. అందుకే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వైద్యులను పిలిపించుకుని మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య పరికరాలు సైతం కార్పొరేట్ వైద్యశాలల నుంచి తెప్పించుకుని ఆపరేషన్ అయిపోగానే తిరిగి పంపించేశారు. ఆర్ధోపెడిక్ విభాగంలో ఆపరేషన్ థియేటర్‌ను సిద్ధం చేయకుండా గుండె జబ్బుల విభాగంలోని సీటీఎస్ శస్త్రచికిత్స విభాగంలో మంత్రికి ఆపరేషన్ నిర్వహించారు.’ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కీళ్లమార్పిడి శస్త్రచికిత్స అనంతరం శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో వినిపించిన గుసగుసలివీ.. గుంటూరు : గత ఏడాది జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగంలో ఓ పసికందు ఎలుకల దాడిలో మృతిచెందిన సంఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇక్కడి వైద్యుల పనితీరు మెరుగుపరిచి, కనీసం వైద్య పరికరాలు, వసతులు కల్పించి జీజీహెచ్‌కు వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాత్రి నిద్రలు, ఆసుపత్రిలో స్వయంగా శస్త్రచికిత్స చేయించుకోవడం వంటి వాటితో ప్రజల్లో నమ్మకం కలిగిస్తానంటూ ప్రకటనలు చేశారు. అయితే, శుక్రవారం మంత్రి కామినేని కుడికాలుకు జీజీహెచ్‌లో కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ ఆపరేషన్‌ను కేర్ ఆస్పత్రి వైద్యుడు బీఎన్ ప్రసాద్, గుంటూరు సాయిభాస్కర్ ఆసుపత్రి వైద్యుడు బూసిరెడ్డి నరేంద్రరెడ్డి నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మంత్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారో అది తీవ్ర విమర్శల పాలవుతోంది. మంత్రి మెప్పు కోసమే.. మంత్రికి ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసి జీజీహెచ్‌కు కీళ్ల మార్పిడి ఆపరేషన్ కోసం ఎవరైనా వస్తే చేసేందుకు వైద్యులు లేరు. ఆపరేషన్ థియేటర్ లేదు. వైద్య పరికరాలు, సరైన వసతులు ఇక్కడ కనిపించవు. కానీ, మంత్రిగారి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి సున్నాలు, మరమ్మతులు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా ఐసీయూ బెడ్ కొనుగోలు చేశారు. ప్రైవేటు వైద్యశాలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద వేలకొద్దీ కీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నప్పటికీ జీజీహెచ్‌లో ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు కనీస ప్రయత్నం జరగకపోవడం శోచనీయం. అంతా ఆర్భాటమే.. 2002లోనే జీజీహెచ్‌లో అప్పటి వైద్యులు మోకాళ్లచిప్ప మార్పిడి ఆపరేషన్ కంటే కష్టమైన తొంటి మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పద్నాలుగేళ్లుగా ఆపరేషన్లు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు సరైన వైద్య సేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రే ఆర్భాటాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై జీజీహెచ్ వైద్యులు, ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి ఆపరేషన్ చేయించుకున్న తీరు చూస్తుంటే ఆసుపత్రి కేవలం గదులు అద్దెకు ఇచ్చేందుకు మాత్రమే పనికొస్తుందనే అపోహ కలుగుతోందని వైద్య నిపుణులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రిలో మహిళపై కీచకపర్వం
-
ఆసుపత్రిలో కీచకపర్వం : కామినేని ఆగ్రహం
విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకున్న కీచకపర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన మహిళపై ఆసుపత్రి వైద్యుడు, రేడియాలజిస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆసుపత్రికి వచ్చే మహిళలపై వారు తరచుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ విషయం తెలియడంతో ఆసుపత్రి వర్గాలు రంగంలోకి దిగి... ఆ అంశం బయటకు రాకుండా బాధితురాలతో రాజీ కుదిర్చారు. అయితే ఆ విషయం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కి తెలిసింది. దీంతో ఆయన ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కామినేని ఆదేశించారు. నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కామినేని గురువారం స్పష్టం చేశారు. -
ఎలుక నా కష్టాన్ని భగ్నం చేసింది: కామినేని
సాంబమూర్తినగర్ (కాకినాడ): ఒక్క ఎలుక తన కష్టాన్ని భగ్నం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. గుంటూరు ఆస్పత్రిలో ఎలుకల దాడిలో పసికందు మృతిచెందిన విషాదాన్ని గుర్తు చేస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. శనివారం తూర్పు గోదావరి కాకినాడలో జిల్లా రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (రామ్‌కోసా) సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మోకాలి ఆపరేషన్ కాకినాడలో చేయించుకోవాలని అనుకున్నానని, తనపై పడ్డ మచ్చను తొలగించుకునేందుకు గుంటూరు ఆస్పత్రిలోనే చేయించుకుంటానని చెప్పారు. -
ఈ పాపం ఎవరిది?
-
'త్వరలో ఎయిమ్స్‌కు శంకుస్థాపన'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్‌ను గుంటూరులో ఏర్పటు చేయనన్నట్లు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలో మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు నెల్లూరులో ట్రామా కేర్ సెంటర్, అరకులో నేచర్ క్యూర్ ఆసుపత్రులను నిర్మంచనున్నట్లు తెలిపారు. వైరస్ వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, కాకినాడ ప్రభుత్వాసుపత్రుల్లో వైరాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. -
'ఉత్తరాంధ్రలో విమ్స్‌లో ట్రామా కేర్ సెంటర్'
విశాఖ: ట్రామా బృందంతో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రలో అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు విమ్స్‌లో ట్రామా కేర్ సెంటర్‌ను అందుబాటులోకి తేస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. కేన్సర్ పేషంట్ల కోసం ప్రభుత్వాస్పత్రుల్లో ఆధునిక వైద్యం అందిస్తామన్నారు. ట్రామా లెవల్ త్రి, ట్రామా కేర్ పైలట్ సెంటర్ ఏర్పాటుకు జీవీకే ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. వైద్య సేవల్లో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. -
మాజీ సీఎంతో ఇలాగేనా...!
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. ఆ దర్పం, దర్జా అన్నీ అనుభవించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని శంకుస్థాపన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన పూర్తిగా చిన్నబుచ్చుకునేలా చేసిందట. శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించేందుకు రాష్ట్ర మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్‌లు మాజీ ముఖ్యమంత్రిని సమయం ఇవ్వాలని కోరారు. చెప్పిన సమయానికి తీరా మంత్రులు కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్సీ ఒకరు, ఆయనతో మరో ఇద్దరు చోటా టీడీపీ నేతలు ఆహ్వానపత్రం తీసుకెళ్లడంతో కిరణ్‌కుమార్‌రెడ్డికి కోపం వచ్చిందట. దాంతో ఆహ్వాన పత్రం అందజేసే సమయంలో ఫొటోలు తీయడంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కోసం కొంతమంది మీడియా ప్రతినిధులను వెంట తీసుకెళ్లిన టీడీపీ నేతలపై రుసరుసలాడారు. మంత్రులు వస్తున్నారు కదా అని ఆహ్వానపత్రం తీసుకోవడానికి సరేనని అన్నాననీ, చోటామోటా లీడర్లతో ఫొటోలు దిగాలా...! అని చిన్నబుచ్చుకున్న ఆ మాజీ సీఎంగారు ఆహ్వానపత్రం అందజేసే సమయంలో ఫొటోగ్రాఫర్లు, వీడియో కెమెరామెన్లను లోపలికి అనుమతించలేదట. అధికారం లేకపోతే అంతే మరి. -
మెడికల్ షాపులు తెరిచి ఉంచాలని కోరాం
హైదరాబాద్ : మెడికల్ షాపులు బంద్ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పలు చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో కామినేని మాట్లాడుతూ.. బంద్ సందర్భంగా అన్ని ఆసుపత్రులకు అటాచ్మెంట్గా ఉన్న మెడికల్ షాపులు తెరిచి ఉంచాలని కోరామని చెప్పారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్ని జిల్లాల డ్రగ్ ఉన్నతాధికారులను ఆదేశించామని కామినేని శ్రీనివాస్ వెల్లడించారు.