విజయవాడ: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన పీజీమెట్ ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సోమవారం వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 13,252 మంది పరీక్ష రాయగా 8658 మంది అర్హత సాధించారు. మొదటి ర్యాంకును సీహెచ్ వెంకటరమణ, రెండో ర్యాంకు సుమంత్ అనే విద్యార్థులు సాధించారు. మొత్తం 2533 సీట్లకు గాను 1873 కన్వీనర్ కోటా, 673 మేనేజ్‌మెంట్ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ మెట్ ఫలితాలు
Published Mon, Mar 7 2016 5:33 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM
Advertisement
Advertisement