ఏప్రిల్ 19న నామినేషన్ వేస్తాను
జనసేన నేత బీవీ రావు
జనసేన నేత ప్రకటనతో కంగుతిన్న కామినేని
పవన్‌తో సంప్రదింపులకు యత్నం
కైకలూరు: పొత్తుల కుంపటి ఏలూరు జిల్లా కైకలూరులోనూ రాజుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా కై కలూరు సీటును బీజేపీ నుంచి కా మినేని శ్రీనివాస్‌కు కేటాయించారు. ఇప్పటికే ఆ యన గ్రామాల పర్యటనలు సైతం చేస్తున్నారు. అయితే జనసేన సీటును బీవీ రావు ఆశిస్తున్నారు. 2019లో జనసేన తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి జనసేన ఇన్‌చార్జిగా జెండాను మోస్తూ గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేశారు. పొత్తుల్లో భాగంగా కామినేనికి సీటు కేటాయించడంపై భైరవపట్నం శుభం ఫంక్షన్ హాలులో ఆదివారం సాయంత్రం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి జనసేన నాయకులు, అభిమానులు, బీవీ రావు సామాజికవర్గమైన యాదవ సామాజిక వర్గం వారు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జెండాలు మో సి, పార్టీ కోసం కష్టపడితే పవన్ కల్యాణ్ సీటును త్యాగం చేయడం ఏమిటని నాయకులు ప్రశ్నించారు. కై కలూరు సీటు విషయంలో పునరాలోచన చేయాలని స్పష్టం చేశారు.
పొత్తు ధర్మం పాటించాలి
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సంయుక్త కార్యదర్శి, కోరుకొల్లు సర్పంచ్ బి.లీలా కనకదుర్గ, బీజేపీ నేత కీర్తి వెంకట రామప్రసాద్ మరికొందరు మాట్లాడుతూ.. పొత్తు ధర్మం పాటించాలని, పవన్ కల్యాణ్ నిర్ణయాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా ప్రసంగించారు. కై కలూరు సీటు బీవీ రావుకే కేటాయించాలని బీజేపీ అభ్యర్థి కామినేనికి సహకరించబోమని ఓ వ్యక్తి బహిరంగంగా గొడవకు ది గాడు. ఏలూరు జిల్లా యాదవ సంఘ అధ్యక్షుడు చిదరబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ యాదవ సామాజిక వర్గానికి సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. కొల్లేరు అభివృద్ధి సంఘ అధ్యక్షుడు మోరు విజయరామరాజు మాట్లాడుతూ జనసేన కోసం కష్టపడితే చివరకు సీటు ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ జనసేన మీడియా ఇన్‌చార్జి నాగనబోయిన విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లావేటి వీరశివాజీ, కోట విప్లవ వరప్రసాద్, దేవేంద్రగుప్తా, వెంకన్నబాబు, గణేష్, వీరాంజనేయులు, ప్రభు ఏసు, తోట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
19న నామినేషన్
కై కలూరు సీటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి గాని, కామినేని శ్రీనివాస్‌కు గాని ఇస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనతో చెప్పలేదని బీవీ రావు ఈ సందర్భంగా తెలిపారు. కనీసం సమాచా రం కూడా ఇవ్వలేదని చెప్పారు. కాబట్టి కై కలూరు జనసేన సీటు తనదేనని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 19న జనసేన పార్టీ తరఫున నామినేషన్ వే స్తున్నానని బీవీ రావు ప్రకటించారు. ఆయన్ని బుజ్జగించడానికి వచ్చిన టీడీపీ, బీజేపీ నేతలు బీవీ రావు ప్రకటనతో కంగుతిన్నారు. రానున్న రోజుల్లో జనసేన నుంచి బీజేపీకి మరింత వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఈ సమావేశంతో తేటతెల్లమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment