NTR University
-
నష్టపరిహారం చెల్లించాల్సిందే!
-
జూనియర్ డాక్టర్ని చెంపపై కొట్టిన డీసీపీ
సాక్షి, విజయవాడ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఓ జూనియర్ డాక్టర్‌పై డీసీపీ చేయి చేసుకోవడంతో కలకలం రేగింది. విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్శిటి ఎదుట ఆందోళన చేస్తున్న జూడాలపై డీసీపీ హర్షవర్దన్ చేయి చేసుకున్నారు. ఒక జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని హర్షవర్దన్ చెంపపై కొట్టడంతో ఆగ్రహించిన జూడాలు డీసీపీ తీరుపై డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. -
విద్యార్థులు ఒత్తిడి చేస్తే ఎగ్జామినర్‌ను మారుస్తారా?
ఎన్టీఆర్ వర్సిటీ వీసీ, ఓయూ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తీరుపై హైకోర్టు విస్మయం సాక్షి, హైదరాబాద్: కొందరు విద్యార్థుల ఒత్తిడికి లొంగి ఇంటర్నల్ ఎగ్జామినర్‌ను మార్చిన ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఎన్టీఆర్ వైద్య వర్సిటీ వీసీ తీరును హైకోర్టు తప్పుబట్టింది. ఇంటర్నల్ ఎగ్జామినర్‌ను మారుస్తూ ఎన్టీఆర్ వర్సిటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. ఆ ఉత్తర్వుల్లో ఏ రకంగా జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఎన్టీఆర్ వర్సిటీ వీసీ, ఓయూ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు సింగిల్ జడ్జి విధించిన రూ.5 వేల చొప్పున జరిమానాను రద్దు చేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జి.శ్యాంప్రసాద్‌ల ధర్మాసనం తీర్పునిచ్చింది. ఎంఎస్ (జనరల్ సర్జరీ) పరీక్షలకు ఇంటర్నల్ ఎగ్జామినర్‌గా మొదట దీన్‌దయాళ్ భంగ్ను నియమిస్తూ ఎన్టీఆర్ వైద్య వర్సిటీ వీసీ ఉత్తర్వులిచ్చారు. అయితే భంగ్ను మార్చాల ని కొందరు విద్యార్థులు ఒత్తిడి చేయడంతో.. ఎగ్జామినర్‌ను మార్చాలని వీసీకి ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ లేఖ రాశారు. దీంతో భంగ్ను తొలగించి మరొకరిని వీసీ నియమించారు. దీన్ని సవాలు చేస్తూ భంగ్ హైకోర్టును ఆశ్రయించగా.. విచారించిన సింగిల్ జడ్జి, వీసీ చర్యను తప్పుపట్టారు. వీసీ, ప్రిన్సిపాల్‌కు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ.. పరీక్ష మళ్లీ నిర్వహించాలని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ వీసీ, ప్రిన్సిపాల్, కొందరు విద్యార్థులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన జస్టిస్ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం వీసీ, ప్రిన్సిపాల్ తీరును తప్పుపట్టింది. విద్యార్థుల ఒత్తిళ్లకు లొంగితే కాలేజీలు, వర్సిటీల్లో క్రమశిక్షణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పీజీ మెట్ ఫలితాలు
విజయవాడ: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇటీవల నిర్వహించిన పీజీమెట్ ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు సోమవారం వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 13,252 మంది పరీక్ష రాయగా 8658 మంది అర్హత సాధించారు. మొదటి ర్యాంకును సీహెచ్ వెంకటరమణ, రెండో ర్యాంకు సుమంత్ అనే విద్యార్థులు సాధించారు. మొత్తం 2533 సీట్లకు గాను 1873 కన్వీనర్ కోటా, 673 మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీయూఎంఎస్ కోర్సుకు 12 నుంచి దరఖాస్తులు
విజయవాడ: 2015-16 విద్యా సంవత్సరంలో యూనానీ (బీయూఎంఎస్) డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 12 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలతో.. ది ప్రిన్సిపాల్, ప్రభుత్వ నిజామియా టిబ్బీ కళాశాల, చార్మినార్, హైదరాబాద్ చిరునామాకు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా స్వయంగా లేదా పోస్టుద్వారా అందేలా పంపించాలి. సెప్టెంబరు 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 6న హైదరాబాద్ నగరం కోఠిలో ఉన్న ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. మరిన్ని వివరాలకు, నోటిఫికేషన్‌కు యూనివర్సిటీ (http//ntruhs.ap.nic.in) వెబ్సైట్లో పొందవచ్చు. ఎంబీబీఎస్ పరీక్షలు 18కి వాయిదా వామపక్షాలు బంద్ చేస్తున్న కారణంగా మంగళవారం జరగాల్సిన ఎంబీబీఎస్ పరీక్షలు ఈ నెల 18కి వాయిదా వేసినట్లు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ అనాటమీ పేపర్-2, ఫైనలియర్ ఓబీజీ పేపర్ పరీక్ష జరగాల్సి ఉంది. -
నేడే మెడికల్ కౌన్సెలింగ్
తెలంగాణలో మూడు, ఏపీలో ఒక కేంద్రం ఏర్పాట్లు చేసిన జేఎన్టీయూ, ఎన్టీఆర్ వర్సిటీ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ రాసిన వైద్య విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు బుధవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. ఈ కౌన్సెలింగ్ వచ్చే నెల 6 వరకు నిర్వహించేం దుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ సహకారంతో జరిగే ఈ ఆన్లైన్ కౌన్సెలింగ్‌ను తెలంగాణలో వరంగల్, హైదరాబాద్‌లోని 3 కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఏపీలోని విజయవాడలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని కళాశాలల్లో, ప్రైవేటులోని ఏ కేటగిరీలో ఉన్న మొత్తం 50 శాతం సీట్లను ఈ కౌన్సెలింగ్ కింద భర్తీ చేస్తారు. తెలంగాణలో 15 మెడికల్ కాలేజీల్లోని 1,550 ఎంబీబీఎస్, 606 దంత వైద్య సీట్లకు కౌన్సెలింగ్ ఉంటుంది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి జేఎన్టీయూ, ఉస్మానియాలోని పీజీఆర్ఆర్ దూర విద్యా కేంద్రంలో, వరంగల్‌లోని కాకతీయవర్సిటీలో, విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో ఓపెన్ కోటా కింద ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లోని అందరికీ కలిపి నిర్వహిస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో రూ.10 వేలు... ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం కన్వీనర్ కోటా సీట్లకు నిర్ణయించిన ప్రకారం ఫీజుల వసూలు చేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో ఎంబీబీ ఎస్ కోర్సుకు వర్సిటీ ఫీజు కింద రూ. 7 వేలు, ప్రైవేటు కాలేజీల్లో రూ. 11,500 ఉంటుంది. ట్యూషన్ ఫీజు ప్రభుత్వ కాలేజీల్లో ఏడాదికి రూ. 10 వేల చొప్పున, ప్రైవేటులో ఏడాదికి రూ. 60 వేల చొప్పున ఉంటుంది. బీడీఎస్ కోర్సులకు ప్రభుత్వ కాలేజీల్లో వర్సిటీ ఫీజు రూ. 6 వేలు, ప్రైవేటులో రూ. 10,500 గా ఉంది. ఇక ట్యూషన్ ఫీజు ప్రభుత్వ కాలేజీల్లో ఏడాదికి రూ. 9 వేలు, ప్రైవేటులో రూ. 45 వేల చొప్పున వసూలు చేస్తారు. కౌన్సెలింగ్ ఫీజుగా ఓసీ, బీసీలకు రూ. 1,500, ఎస్సీ, ఎస్టీలు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. -
29 నుంచి పీజీ మెడికల్ కౌన్సెలింగ్
విజయవాడ : 2015-16 విద్యా సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కలిపి పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 29 నుంచి మే 7వ తేదీ వరకు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఈ మేరకు హెల్త్ వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్-సర్వీస్ అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి మే 5 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. కౌన్సెలింగ్ తొలి మూడు రోజులు ఓపెన్ కేటగిరీ సీట్లకు, మే 2 నుంచి 5 వరకు రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు జరుగుతుంది. సర్వీస్ అభ్యర్థులకు మే 6, 7 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌లో 6వ తేదీ ఓపెన్ కాంపిటీషన్ సీట్లకు, 7న రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు జరుగుతుంది. కౌన్సెలింగ్ ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. వికలాంగుల కేటగిరీ అభ్యర్థులకు నిర్వహించే కౌన్సెలింగ్ రెండో విడత నోటిఫికేషన్‌తో పాటు తరువాత ప్రకటిస్తారు. సీట్ మ్యాట్రిక్స్ కౌన్సెలింగ్‌కు ఒక రోజు ముందు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు రూ.2 వేల డీడీని ది రిజిస్ట్రార్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో చెల్లించాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పొందే అభ్యర్థులు రూ.15,600, ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పొందే అభ్యర్థులు రూ.20,600 యూనివర్సిటీ ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మేరకు చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఫీజులు, కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు, మరిన్ని వివరాలు, యూనివర్సిటీ వెబ్సైట్ http://ntruhs.ap.nic.in లో పొందవచ్చు. -
వ్యాపారం కోసం ఎక్కడ్నుంచో రాలేదు
మంత్రి గంటాపై అయ్యన్న పరోక్ష విమర్శలు,వాగ్బాణాలు వారు పార్టీలో ఎన్నాళ్లుంటారో తెలీదు... నేను మాత్రం పార్టీలోనే ఉంటా మాడుగుల నియోజకవర్గంలో పర్యటన గంటా వర్గాన్ని నేరుగా టార్గెట్ చేసిన మంత్రి కె.కోటపాడు : ‘నేను కొందరిలా ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి రాలేదు. వ్యాపారం కోసం వచ్చినవాడిని కాను. వాటి కోసం రాజకీయాలు చేస్తున్నవాడిని కాదు. వ్యాపారాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎన్నాళ్లుంటారో...ఏ పార్టీలో ఉంటారో నాకు తెలీదు. నేను మాత్రం 34ఏళ్లుగా టీడీపీలోనే ఉంటున్నా. రాజకీయ కుటుంబంలో పుట్టాను. రాజకీయాల్లో పెరిగాను. ఎన్టీఆర్ యూనివర్సిటీలో క్రమశిక్షణ నేర్చుకున్నాను’అని మంత్రి అయ్యన్న పాత్రుడు పరోక్షంగా మంత్రి గంటా శ్రీనివాసరావుపై విమర్శలు, వాగ్బాణాలు గుప్పించారు. మంత్రి గంటా, ఎంపీ అవంతి శ్రీనివాస్‌ల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మాడుగుల నియోజకవర్గంలో శుక్రవారం పలు అధికారిక కార్యక్రమాల్లో మంత్రి అయ్యన్న పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలు కారణంగా మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్‌కు ఎంపీ శ్రీనివాస్ ఇటీవల లేఖ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీ లేకుండానే కె.కోటపాడు మండలం ఆనందపురంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అయ్యన్నను పూలమాలలతో కార్యకర్తలు సన్మానిస్తున్న సమయంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. కె.కోటపాడులో పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. దేవరాపల్లిలో స్త్రీశక్తి భవనాన్ని ప్రారంభించారు. అనంతగిరి మండలంలో మినీ జలాశయాన్ని ప్రారంభించి నీళ్లు విడిచిపెట్టారు. అనంతరం ‘నీరు-చెట్టు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చీడికాడలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించి రక్షితమంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. మాడుగులలో రూ.1.09కోట్లతో వివిధ పనులకు శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ, మాడుగులలో నిర్వహించిన సభల్లో మంత్రి అయ్యన్న మాట్లాడుతూ మంత్రి గంటా, ఆయన వర్గంపై పరోక్షంగా చేసిన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు తీవ్ర ఆసకి ్తకలిగించాయి. కె.కోటపాడులో నిర్వహించిన సమావేశంలో మంత్రి అయ్యన్న తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఇలా అన్నారు...‘ టీడీపీలో ప్రతి కార్యకర్తను పేరుపెట్టి పిలిచేంత చనువు నాకుంది. నా విషయంలో కార్యకర్తలు ఆడంబరాలకు పోవాల్సిన అవసరం లేదు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులను పూలమాలలతోనే సత్కరిస్తే వారి దృష్టిలో పడతామని కార్యకర్తలు భావిస్తారని కాని నా విషయంలో కార్యకర్తలు ఇటువంటి ఆడంబరాలు చేయాల్సిన అవసరం లేదు. పార్టీ ఓటమి చెందినా.. పదవులు లేకపోయినా టీడీపీలోనే ఉన్నాను. పదవుల కోసం పార్టీలు మారలేదు. పదవుల కోసం పార్టీలోనికి వచ్చిన వారు పార్టీలో ఉంటారోలేదో తెలియదు గాని తాను మాత్రం టీడీపీలోనే ఉంటాను. నియోజకవర్గంలో కార్యకర్తలు ఎవరి గురించి భయపడాల్సిన పని లేదు’అని అన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికలు లేవు. కాబట్టి రాజకీయాలు చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టిసారిద్దామని మంత్రి అయ్యన్న చెప్పారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు ప్రతిపక్ష పార్టీకి చెందినవారైనప్పటికీ ఆయనతో కలసి నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తాననన్నారు. నర్సీపట్నంతో సమానంగా మాడుగుల నియోజకవర్గాన్ని అభివృద్ధిపరుస్తానని ప్రకటించారు. -
బీపీటీ కౌన్సెలింగ్‌లో 498 సీట్ల భర్తీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఐదు ఆన్లైన్ కేంద్రాల్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న పారా మెడికల్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన బీపీటీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెర పీ) కౌన్సెలింగ్‌లో 498 సీట్లు భర్తీ అయినట్లు క్యాంపు అధికారి డాక్టర్ టి.మురళీమోహన్ తెలిపారు. జేఎన్టీయూ (హైదరాబాద్) కేంద్రంలో 394, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 236, ఏయూ (విశాఖపట్నం)లో 83, ఎస్వీయూ(తిరుపతి)లో 147, కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) కేంద్రంలో 93 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హెల్త్ యూనివర్సిటీలో రెండో విడత ఎంపీటీ (ఫిజియోథెరపీ) కౌన్సెలింగ్ ముగిసింది. సోమవారం బీఎస్సీ (ఎంఎల్టీ) కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. -
తెలంగాణ విద్యార్థులకు న్యాయం చేయండి
జీవో 89ను రద్దు చేయాల్సిందే.. మూడో రోజుకు చేరిన ప్రవీణ దీక్ష హైదరాబాద్ : విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్(ఎండీఎస్) పీజీ మెడికల్ అడ్మిషన్లలో తెలంగాణ ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందంటూ ప్రవీణానాయక్ చేపట్టిన నిరాహార దీక్ష సోమవారానికి మూడో రోజుకు చేరింది. దీక్షకు గిరిజన ఉద్యోగ సంఘం, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గిరిజన సంఘం, ఏఐఎస్ఎఫ్లు సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా జీవో నంబరు 89ని రద్దు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రవీణ్‌నాయక్ మాట్లాడుతూ పీజీ మెడికల్ ఎంట్రెన్స్‌లో తనకు ఎస్టీ కోటాలో రాష్ర్టంలో ప్రథమ ర్యాంకు, ఓపెన్ కేటగిరిలో 216వ ర్యాంకు వచ్చినా.. సీమాం ధ్ర అధికారులు తనకు సీటు ఇవ్వలేదని ఆరోపించారు. -
నేడే మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు విజయవాడ, మెడికల్ పోస్టుగ్రాడ్యుయేషన్, డిప్లమో కోర్సుల్లో వచ్చే విద్యా సంవత్సరం (2014-15) అడ్మిషన్లకుగాను ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 నగరాల్లోని 24 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లను వర్సిటీ నుంచి శనివారం ప్రత్యేక వాహనాల్లో కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య ఆయా నగరాలకు తరలించారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నిర్వహించే ఈ పరీక్షకు అర్ధగంట ముందుగానే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. సమయం ముగిసిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని విశ్వవిద్యాలయ అధికారులు చెప్పారు. ఈ పరీక్షకు మొత్తం 15,743 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. -
పీజీ మెడికల్ స్కాం దోషులను ప్రవేశపెట్టిన సీఐడీ
-
పీజీ మెడికల్ స్కాంను ఛేదించిన సీఐడీ
-
NTR యూనివర్సిటీలో ర్యాంకుల గోల్మాల్ ?