విజయవాడ : 2015-16 విద్యా సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కలిపి పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ నెల 29 నుంచి మే 7వ తేదీ వరకు విజయవాడ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు.
ఈ మేరకు హెల్త్ వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాన్-సర్వీస్ అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి మే 5 వరకు కౌన్సెలింగ్ జరుగుతుంది. కౌన్సెలింగ్ తొలి మూడు రోజులు ఓపెన్ కేటగిరీ సీట్లకు, మే 2 నుంచి 5 వరకు రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు జరుగుతుంది. సర్వీస్ అభ్యర్థులకు మే 6, 7 తేదీల్లో నిర్వహిస్తారు. ఈ కౌన్సెలింగ్‌లో 6వ తేదీ ఓపెన్ కాంపిటీషన్ సీట్లకు, 7న రిజర్వేషన్ కేటగిరీ సీట్లకు జరుగుతుంది. కౌన్సెలింగ్ ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. వికలాంగుల కేటగిరీ అభ్యర్థులకు నిర్వహించే కౌన్సెలింగ్ రెండో విడత నోటిఫికేషన్‌తో పాటు తరువాత ప్రకటిస్తారు. సీట్ మ్యాట్రిక్స్ కౌన్సెలింగ్‌కు ఒక రోజు ముందు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు రూ.2 వేల డీడీని ది రిజిస్ట్రార్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో చెల్లించాలి. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు పొందే అభ్యర్థులు రూ.15,600, ప్రైవేటు కళాశాలల్లో సీట్లు పొందే అభ్యర్థులు రూ.20,600 యూనివర్సిటీ ఫీజు చెల్లించాలి. ట్యూషన్ ఫీజులు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన మేరకు చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన ఫీజులు, కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు, మరిన్ని వివరాలు, యూనివర్సిటీ వెబ్‌సైట్ http://ntruhs.ap.nic.in లో పొందవచ్చు.