విజయవాడ: 2015-16 విద్యా సంవత్సరంలో యూనానీ (బీయూఎంఎస్) డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 12 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలతో.. ది ప్రిన్సిపాల్, ప్రభుత్వ నిజామియా టిబ్బీ కళాశాల, చార్మినార్, హైదరాబాద్ చిరునామాకు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా స్వయంగా లేదా పోస్టుద్వారా అందేలా పంపించాలి. సెప్టెంబరు 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 6న హైదరాబాద్ నగరం కోఠిలో ఉన్న ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. మరిన్ని వివరాలకు, నోటిఫికేషన్‌కు యూనివర్సిటీ (http//ntruhs.ap.nic.in) వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
ఎంబీబీఎస్ పరీక్షలు 18కి వాయిదా
వామపక్షాలు బంద్ చేస్తున్న కారణంగా మంగళవారం జరగాల్సిన ఎంబీబీఎస్ పరీక్షలు ఈ నెల 18కి వాయిదా వేసినట్లు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ అనాటమీ పేపర్-2, ఫైనలియర్ ఓబీజీ పేపర్ పరీక్ష జరగాల్సి ఉంది.
బీయూఎంఎస్ కోర్సుకు 12 నుంచి దరఖాస్తులు
Published Mon, Aug 10 2015 5:43 PM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement
Advertisement