Online application
-
ప్రాణాలతో బెట్టింగ్.. గేమింగ్ భూతానికి బతుకులు బలి
‘ఆన్లైన్ రమ్మీ’ చంపే వరకు వదల్లేదుకరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన బూస శంకరయ్య, స్వరూప దంపతుల కుమారుడు కార్తీక్ ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడ్డాడు. సంపాదన అంతా పోగొట్టుకుని, అప్పుల పాలయ్యాడు. రైలుపట్టాలపై పడుకుని, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తల్లిదండ్రులు అప్పుడు కార్తీక్‌ను కాపాడుకోగలిగారు. రెండెకరాల భూమి అమ్మి మరీ అప్పులు తీర్చారు. అయినా కార్తీక్‌ను ఆన్లైన్ రమ్మీ భూతం వదల్లేదు. కార్తీక్ మళ్లీ అప్పులు చేసి, ఆవేదనతో గత నెలలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.సాక్షి, హైదరాబాద్: అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి. కానీ ఆ డబ్బు సంపాదించేందుకు ఎంచుకునే మార్గాలు చాలా ముఖ్యం. కష్టార్జితం కొంతే అయినా జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ కూర్చున్నచోటే శ్రమ లేకుండానే భారీగా డబ్బుకావాలని వెంపర్లాడితే జీవితం గాడి తప్పుతుంది. ఇటీవల వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు ఇదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి. సులభంగా డబ్బు వస్తుందని ఆన్లైన్ బెట్టింగ్‌లు, గేమ్‌లు, పేకాట, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌కు అలవాటు పడి.. సంపాదన అంతా పోయి, అప్పుల పాలవుతున్నవారు ఎందరో. తెలిసినవారి దగ్గరే కాకుండా.. క్రెడిట్ కార్డులు, లోన్ డబ్బు తీసుకుంటున్నారు. చివరికి అది యమపాశమై ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. కుటుంబాలను కన్నీటి సంద్రంలో ముంచేస్తోంది. జీవితాలను తలకిందులు చేస్తోంది. రోజురోజుకు జడలు విప్పి కరాళ నృత్యం చేస్తున్న ఈ జాడ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఆన్లైన్ బెట్టింగ్‌లు.. మానలేని వ్యసనం.. ఒకసారి కొంత మొత్తంలో డబ్బులు రాగానే ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ వంటి ఆటలు మంచి ఆదాయ మార్గమని యువత భావిస్తున్నారు. కూర్చున్న చోటే రోజూ వేలకువేలు సంపాదించవచ్చనుకుంటూ ఉచ్చులో పడుతున్నారు. కొద్దిపాటి లాభాలు చూసిన తర్వాత అసలు ‘ఆట’ మొదలవుతుంది. ఆన్లైన్ బెట్టింగ్‌లు, గేమ్స్ కొద్దిపాటి లాభాలు ఇస్తూ.. వీలైనంత దోచుకునేలా ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయి. దీనిపై అవగాహన లేక బానిస అవుతారు. డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ డబ్బులు వచ్చే వరకు మళ్లీ బెట్టింగ్‌లు చేద్దాం, తర్వాత మానేద్దాం అనుకుంటూ... పూర్తిగా ఈ ఊబిలో కూరుకుపోతారు. యువత మాత్రమేకాదు.. రిటైరైన ఉద్యోగులు, పెద్దవాళ్లు కూడా ఆన్లైన్ జూదం, గేమ్స్ బారినపడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయామని గుర్తించే సరికే.. అప్పులు ఇచి్చన వాళ్ల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు పెరిగి, తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వేలం వెర్రిగా పుట్టుకొస్తున్న ఆన్లైన్ లోన్ యాప్‌లతో.. మనకు అవసరమున్నా, లేకున్నా నిమిషాల్లోనే అప్పులు ఇస్తామంటూ వస్తున్న ఆన్లైన్ లోన్‌యాప్‌లతో సమస్య మరింత పెరుగుతోంది. అందులో లోన్ పేరిట మోసగించేవి కొన్నయితే.. నిజంగానే లోన్ ఇచ్చి అడ్డగోలు వడ్డీలు, జరిమానాలతో, బలవంతపు వసూళ్ల ప్రయత్నాలతో వేధించేవి మరికొన్ని. సులువుగా సొమ్ము చేతికి వస్తుండటంతో.. ఇలాంటి యాప్‌ల నుంచి అప్పులు చేసి ఆన్లైన్ జూదంలో పోగొట్టుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. నిజానికి రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం లోన్ యాప్‌లు వినియోగదారుడి ఫొటోలు, వీడియోలు, కాంటాక్ట్ నంబర్ల లిస్ట్ తీసుకోకూడదు. కేవలం రుణమిచ్చే సమయంలో కేవైసీ కోసం ఒక్కసారి మాత్రమే కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్ యాకెŠస్స్ చేయాలి. కానీ ఆన్లైన్ లోన్‌యాప్ కంపెనీలు అప్పులు తీసుకున్నవారి వ్యక్తిగత వివరాలన్నీ సేకరించి, వారి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ వెనుక భయపెట్టే నిజాలు.. ⇒ మన దేశంలో అక్రమ బెట్టింగ్ మార్కెట్ విలువ రూ.8.7 లక్షల కోట్లు అని అంచనా. ఇది ఏటా 30 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ⇒ విదేశాల్లో, ప్రధానంగా చైనా కేంద్రంగా ఉండే ఆన్లైన్ బెట్టింగ్, లోన్ యాప్ కంపెనీలు.. ఇక్కడి మనవారి కష్టార్జితాన్ని దోచుకుని దేశవ్యతిరేక కార్యకలాపాలకు ఫండింగ్ చేస్తున్నాయి. ⇒ గేమింగ్, బెట్టింగ్.. యాప్ ఏదైనా సరే. వాటి వెనుక సూత్రధారులు మాత్రం చైనీయులే ఉంటున్నారు. ⇒ మనీలాండరింగ్, ఉగ్రమూకలకు నిధులు కూడా ఈ బెట్టింగ్ యాప్‌లు సమకూర్చుతున్నట్టు దర్యాప్తు సంస్థలు వెల్లడిస్తున్నాయి. ⇒ ‘ఫైవిన్’ అనే బెట్టింగ్ యాప్ మన దేశంలో రూ.400 కోట్ల మేర దోపిడీకి పాల్పడింది. ఆ సొమ్మంతా చైనా కంపెనీలకు చేరవేసిన కేసులో నలుగురు వ్యక్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవలే అరెస్టు చేసింది. మన దగ్గర నిషేధం ఉన్నా.. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ సాధారణంగా రెండు రకాలు. మన దేశంలో ఆపరేట్ అయ్యేవి. చైనా కంపెనీలకు చెందినవి. అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్, డబ్బులు పెట్టి ఆడే గేమింగ్‌లపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో నిషేధం ఉంది. అందువల్ల మన దేశానికి చెందిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు ఈ రాష్ట్రాల్లో పనిచేయవు. ఫోన్లు ఈ రాష్ట్రాల్లోని లొకేషన్లో ఉంటే.. ఇక్కడ అందుబాటులో ఉండవని మెసేజీ చూపిస్తాయి. అందుకే ఆన్లైన్ బెట్టింగ్ చేయడం కోసం నకిలీ జీపీఎస్ యాప్‌లతో తప్పుడు లొకేషన్స్ చూపేలా చేస్తుంటారు. అదే చైనా యాప్స్ ఏ నిబంధనలు పాటించవు కాబట్టి యథేచ్ఛగా వాటిలో ఆడుతున్నారు. మీ వాళ్లను ఇలా గమనించండి! ఆన్లైన్లో బెట్టింగ్‌లు, రమ్మీ వంటి జూదానికి అలవాటుపడే వారిని జాగ్రత్తగా గమనించడం ద్వారా గుర్తించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనల మేరకు.. ఎవరైనా స్థాయికి మించి అప్పులు చేస్తున్నా, తరచూ ఏదో కారణాలతో డబ్బులు అడుగుతున్నా ఓ కన్నేసి ఉంచాలి. ఆ డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. కుటుంబ సభ్యులను, స్నేహితులను పక్కనపెట్టి అదేపనిగా మొబైల్ ఫోన్లో గడుపుతున్నా.. ఫోన్లో ఏం చేస్తున్నారన్నది ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడుతున్నా అనుమానించాలి. నష్టపోయినప్పుడు చిరాకు, ఆగ్రహం, ఆందోళన వంటివాటికి లోనవుతుంటారు. ఒంటరిగా గడుపుతుంటారు. ఇలాంటి లక్షణాలను గమనించాలి. ఆత్మహత్యలు వద్దు.. మీ బాధ పంచుకోండి.. ⇒ మీ సమస్య ఏదైనా, ఎలాంటిదైనా.. ప్రతిదానికీ పరిష్కారం ఉంటుందన్నది మర్చిపోవద్దు. ఆత్మహత్యలకు పాల్పడకుండా మీ బాధలను ఈ హెల్ప్‌లైన్ సెంటర్లతో పంచుకోవాలని, మీకు సమాధానం దొరకవచ్చని నిపుణులు చెబుతున్నారు. ⇒ రోష్నీ సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్: 040–66202000 ⇒ హైదరాబాద్‌కు చెందిన వన్‌లైఫ్ ఎన్జీఓ: 7893078930 ⇒ ఎయిమ్స్ (బీబీనగర్): 9493238208 ⇒ నేరుగా పోలీస్ సహాయం కోసం..: డయల్ 100 బెట్టింగ్, గేమింగ్ యాడ్స్‌ను పూర్తిగా నిషేధించాలి సులభంగా డబ్బు సంపాదన, అదీ పెద్ద మొత్తంలో ఆర్జించాలనే కోరిక కొందరిని ఆవహిస్తుంది. దీనిని ‘ఇన్‌పల్స్ కంట్రోల్ డిజార్డర్’అంటారు. క్రెడిట్ కార్డులు, లోన్‌యాప్‌ల ద్వారా సులభంగా డబ్బు సమకూరుతోంది. బెట్టింగ్, గేమింగ్‌లో కొంత కోల్పోయినా... మరోసారి ప్రయతి్నస్తే డబ్బు రావొచ్చన్న ఆశ వారిని నిలవనీయదు. లక్షల్లో అప్పుల్లో పడిపోతే దానిని తీర్చేయాలని మళ్లీ అప్పులు చేసి బెట్టింగ్ చేస్తున్నారు. ఈ విష వలయం నుంచి బయటికి రాలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్మోకింగ్‌కు సంబంధించిన ప్రకటనలను ఎలా నిషేధించారో అలా అన్ని ప్రచార, ప్రసార సాధనాల్లో బెట్టింగ్ కంపెనీల యాడ్లు, యాప్‌ల ప్రచారాన్ని నిషేధించాలి. వెచి్చంచే వ్యయంపై పరిమితి పెట్టడం, ఆధార్–పాన్ కార్డులతో అనుసంధానం చేయడం వంటివాటితో డబ్బు అతి వినియోగాన్ని నియంత్రించవచ్చు. ఎక్కువ మొత్తంలో అప్పులు చేయడం, రాత్రంతా ఫోన్లో గడుపుతూ ఆందోళనతో కనిపించడం వంటి వాటిని కుటుంబ సభ్యులు గుర్తించి వారిని నియంత్రించాలి. – డాక్టర్ నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, కేర్, చేతన హాస్పటల్స్ అత్యాశకు పోయి ఊబిలో చిక్కుకోవద్దు సులభంగా డబ్బు సంపాదించాలనే సంస్కృతి పెరగడంతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, గేమింగ్ వంటి వాటికి అలవాటు పడుతున్నారు. గత 15, 20 ఏళ్లలో రియల్ ఎస్టేట్‌లో భారీగా డబ్బు సంపాదించిన వారు.. డాబుగా ఖర్చుచేయడం, విలాసవంతమైన కార్లు, భవనాలు కొనడంతో సంపాదన ప్రదర్శన జరుగుతోంది. మిగతావారు సైతం దీనిని ఓ మోడల్‌గా అనుకరించడం మొదలుపెట్టారు. కష్టపడి పనిచేయాలనే తత్వం మరుగున పడి, ఏదో ఒక విధంగా లక్షలు, కోట్లు సంపాదించాలనే ఆశలు పెరిగిపోతున్నాయి. సులభంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రయత్నాలు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో మధ్య తరగతి ప్రజల ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయి. పర్సనల్ లోన్ యాప్స్ అధిక వడ్డీలతో సగటు జీవిని చిదిమేస్తున్నాయి. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తూ ఊబిలో కూరుకుపోతున్నారు. – డి.పాపారావు, ఆర్థిక రంగ విశ్లేషకుడు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లలో లాభాలు భ్రమే ఆన్లైన్ బెట్టింగ్ మన రాష్ట్రంలో నిషిద్ధం. అలాంటి ఆన్లైన్ యాప్‌లు వాడితే చట్టప్రకారం శిక్ష తప్పదు. బాధితులపైనా కేసులు తప్పవన్నది గుర్తుంచుకోవాలి. బెట్టింగ్ యాప్‌లలో లాభాలు వస్తాయన్నది భ్రమ అని గుర్తించాలి. మొదట కొద్దిపాటి లాభాలు చూపి.. తర్వాత కచి్చతంగా మోసం చేస్తారు. దీనితో అప్పుల ఊబిలో కూరుకుపోవడంతోపాటు కుటుంబాలు చిక్కుల్లో పడతాయి. ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ వంటి ఆటలకు దూరంగా ఉండడం మంచిది. – కవిత, డీసీపీ, సైబర్‌క్రైమ్స్, హైదరాబాద్ -
పిల్లలకు పాన్ కార్డ్: సింపుల్‌గా అప్లై చేయండిలా..
ప్రస్తుతం అందరికీ పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. కేవలం ఉద్యోగం చేసేవారికి మాత్రమే కాకుండా, మైనర్స్ లేదా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. ఆదాయపన్ను శాఖలోని సెక్షన్ 160 ప్రకారం, పాన్ కార్డు జారీ చేయడానికి కనీస వయసు అవసరం లేదు. కాబట్టి ఎవ్వరైనా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పిల్లలు స్వయంగా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోలేరు. కాబట్టి వారి తరపున తల్లిదండ్రులే పాన్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.పిల్లలకు పాన్ కార్డు ఎందుకంటే?తల్లిదండ్రులు పిల్లల పేరుమీద ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నప్పుడు, లేదా వారి ఆస్తులకు నామినీలుగా చేర్చినప్పుడు పాన్ కార్డు అవసరం. అంతే కాకుండా పిల్లల పేరుమీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, మైనర్ కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాల కోసం ఖాతాలను ఓపెన్ చేయడానికి కూడా పాన్ కార్డు అవసరం.పిల్లల కోసం పాన్ కార్డుకు అప్లై చేయాలనుకునేవారు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్లై చేయడానికి తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటరు ఐడీ వంటివి అవసరమవుతాయి.ఆన్లైన్లో అప్లై చేయడం.. ➤ముందుగా అధికారిక 'నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్' (NSDL) వెబ్సైట్ ఓపెన్ చేయాలి.➤అప్లికేషన్ ఫారమ్‌లో 'న్యూ పాన్ - ఇండియన్ సిటిజన్ (ఫారం 49ఏ)', 'వ్యక్తిగతం' అనే వర్గాన్ని ఎంచుకోవాలి.➤అప్లికేషన్ వివరాల విభాగంలో అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి.➤మైనర్ ఫోటో & అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి.➤డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లింపు కొనసాగించాలి. తరువాత 'సమర్పించు' బటన్‌ను క్లిక్ చేయాలి.➤పైవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక అక్నాలెజ్మెంట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తరువాత 15 నుంచి 20 రోజులలోపు మీ చిరునామాకు పాన్ కార్డు డెలివరీ అవుతుంది.ఇదీ చదవండి: కోట్లు సంపాదించే అవకాశం: నిఖిల్ కామత్ ట్వీట్ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవడం..➤అధికారిక NSDL వెబ్సైట్ నుంచి ఫారమ్ 49ఏను డౌన్లోడ్ చేసుకోవాలి.➤సూచనల ప్రకారం అన్ని వివరాలను పూరించండి. ➤సంబంధిత డాక్యుమెంట్స్ కాపీలను, పిల్లల ఫోటోలు రెండు జత చేసి, సమీపంలోని పాన్ సెంటర్లో ఫీజు చెల్లించి సమర్పించండి.➤మీ అప్లికేషన్ సమర్పించిన తరువాత మీకు అక్నాలెజ్మెంట్ నెంబర్ ఇస్తారు. దీని ద్వారా అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. ➤తరువాత మీ చిరునామాలకు 15 నుంచి 20 రోజులలోపు పాన్ కార్డు డెలివరీ అవుతుంది. -
పిల్లల దత్తతకు డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శిశువుల (పిల్లల) దత్తతకు డిమాండ్ పెరుగుతోంది. సంతాన భాగ్యంలేని వేలాది మంది దంపతులు అనాధ బిడ్డలను పెంచుకొనేందుకు పోటీ పడుతున్నారు. తమకు శిశువులను దత్తత ఇస్తే వారిని బాధ్యతగా పెంచి ప్రయోజకులను చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత ప్రక్రియను నిర్వహిస్తుంది. సమీకృత బాలల సంరక్షణ పథకం(ఐసీపీఎస్)లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని 14 ప్రత్యేక దత్తత ఏజేన్సీలు (శిశు గృహాలు) ఉన్నాయి. వాటి పరిధిలో 110 మంది పిల్లలు (శిశువులు) ఉన్నారు. కాగా, శిశువుల దత్తత కోసం ఏకంగా 1,018 మంది దంపతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దత్తత నిబంధనలకు లోబడి అధికారులు అర్హులైన దంపతులను ఆచి తూచి ఎంపిక చేస్తారు. 2020 నుంచి 2024 వరకు మొత్తం 325 మంది పిల్లలను దత్తత ఇవ్వగా వారిలో 186 ఆడ శిశువులు ఉండటం గమనార్హం.నిర్లక్ష్యానికి గురైన బిడ్డలకు వరం దత్తత..కుటుంబ నేపధ్యంలో వదిలివేసిన, నిరాశ్రయమైన, నిర్లక్ష్యానికి గురైన పిల్లల సంరక్షణ, రక్షణకు దత్తత అనేది గొప్ప వరం. అటువంటి పిల్లలకు ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణం లభిస్తుంది. అనాథ పిల్లలను దత్తత ద్వారా కుటుంబాల్లోకి తిరిగి చేర్చడమే ముఖ్య ఉద్ధేశం. దత్తత అనేది కుటుంబాల కోసం పిల్లలను ఇవ్వడం కాదు.. పిల్లల కోసం కుటుంబాలను అందించడమే ప్రధానంగా ఉంటుంది. అనాథలైన బిడ్డలకు వసతి, విద్య, వారి ప్రతిభా సామర్థ్యాలు పెంపొందించడంతోపాటు వారికి ప్రేమ, వాత్సల్యం అందించేందుకు దోహదం చేస్తుంది. పిల్లల సరైన అభివృద్ధికి అవసరమైన భావోద్వేగ, శారీరక, మానసిక భద్రతను అందిస్తుంది. పిల్లలు సామాజిక దుర్వినియోగానికి గురికాకుండా నివారిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రత్యేక ఏజెన్సీదత్తతకు సంబంధించిన అన్ని విషయాలను పర్యవేక్షించడానికి కేంద్ర ప్రభుత్వం 1990 జూలై 3న జాతీయ స్థాయిలో ‘సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్ఏ)’ ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సీఏఆర్ఏ 2011 ఫిబ్రవరిలో ‘చైల్డ్ అడాప్షన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ – గైడెన్స్ సిస్టమ్ (కేరింగ్స్)’ పేరుతో ప్రత్యేకంగా అధికారికంగా https://cara.wcd.gov.in అనే వెబ్సైట్ ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా దత్తతకు ఆన్లైన్ దరఖాస్తులు, గైడ్‌లైన్స్ వంటి అనేక అంశాలను పారదర్శకంగా పర్యవేక్షిస్తుంది. దత్తత ప్రక్రియ సులభతరం చేయడంతోపాటు వాటిలో కీలకపాత్ర పోషించే ఏజెన్సీల జవాబుదారీతనాన్ని పెంచుతుంది. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో దత్తతకు ముందు తర్వాత కూడా ఆన్లైన్ పర్యవేక్షణ చేస్తుంది. -
దోస్త్ ద్వారా 6,843 సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) ఖాళీ సీట్ల భర్తీకి చేపట్టిన ప్రత్యేక దశ కేటాయింపులో 6,843 మంది సీట్లు పొందినట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వీరిలో మొదటి ప్రాధాన్యత ద్వారా 6,061 మందికి, రెండో ప్రాధాన్యత ద్వారా 782 సీట్లు వచి్చనట్టు తెలిపారు. ఆర్ట్స్‌లో 1,026, కామర్స్‌లో 2,131, లైఫ్ సైన్స్‌లో 2,240, ఫిజికల్ సైన్స్‌లో 618, డేటాసైన్స్‌లో 61, బీఎస్సీ ఆనర్స్ (కంప్యూటర్ సైన్స్)లో 43, బీఎస్సీ (బయో–టెక్నాలజీ)లో 20, అప్రెంటిస్íÙప్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్‌లో 104, ఇతర బ్రాంచీల్లో 600 సీట్లు కేటాయించినట్టు వెల్లడించారు. సీట్టు పొందిన వారు శనివారంలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇదే రోజు నుంచి అక్టోబర్ 3 వరకూ అన్ని కాలేజీల్లో ఇంట్రా–కాలేజ్ ఫేజ్–2కి వెబ్ ఆప్షన్లు ఇచ్చే అవకాశం కలి్పస్తున్నట్లు తెలిపారు. -
ప్రాణం తీసిన ఆన్లైన్ యాప్! ఫొటో మార్ఫింగ్ బెదిరింపులతో.. తీవ్ర విషాదం!!
కరీంనగర్: ఏడాదిక్రితం సింగరేణిలో బదిలీపిల్లర్ (ఆర్జీ–ఏఎల్పీ)గా ఉద్యోగం పొంది భవిష్యత్తును ఆనందంగా గడపాల్సిన పల్లె వంశీకృష్ణ(26) ప్రాణాలను ఆన్లైన్ యాప్ బలిగొంది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన వంశీకృష్ణ తండ్రి రాయమల్లు సింగరేణి కార్మికుడిగా పనిచేస్తూ అనారోగ్యంతో మరణించగా.. ఆ ఉద్యోగాన్ని ఏడాదిక్రితం పొందిన వంశీ మకాం పెద్దపల్లికి మార్చాడు. పట్టణంలోని చీకురాయి రోడ్డులో నివాసముంటున్న సమయంలో గుర్తుతెలియని ఆన్లైన్ యాప్ నుంచి కొంత రుణం పొందాడు. ఆ తర్వాత తిరిగి చెల్లించినా ఇంకా బాకీ ఉన్నావంటూ నిర్వాహకులు వంశీకృష్ణపై ఒత్తిడి పెంచారు. ఆ తర్వాత తన ఫొటోను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో బంధు, మిత్రులందరికీ షేర్ చేసి పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారని కుటుంబీకులు ఆరోపించారు. ఆన్లైన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన వంశీకృష్ణ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వివరించారు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు సైబర్‌నేరంగా కేసు నమోదు చేసి సైబర్‌క్రైం పోలీసులకు బదిలీ చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
గుడ్‌న్యూస్! తెలంగాణలో 1,520 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు నియామక బోర్డు నోటిఫికేషన్లో పేర్కొంది. సెప్టెంబర్ 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన వివరాలు.. ► అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్, మిడ్వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. ► అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితిలో సడలింపు. ► హెల్త్ అసెస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040- 92,050 అప్లికేషన్ ఫీజు వివరాలు.. ► ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు రూ.500. దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. ► ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లతో పాటు 18-44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ► హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. -
TGUGCET 2022: జనవరి 23న టీజీయూజీసెట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో 2022–23 సంవత్సరానికి ఏడాదికి సంబంధించి మొదటి సంవత్సరం బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ ఇంగ్లీష్ మీడియం కోర్సుల్లో ప్రవేశాలకు టీజీయూజీసెట్–22 అర్హత పరీక్షను వచ్చే ఏడాది జనవరి 23న నిర్వహించనున్నట్లు కన్వీనర్ రోనాల్డ్‌రాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10 నుంచి సొసైటీ వెబ్సైట్(tswreis.in)లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. 2021–22 సంవత్సరంలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, ఇప్పటికే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 11, 12 తేదీల్లో హిస్టారికల్ రీసెర్చ్ జాతీయ సదస్సు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ జాతీయ సదస్సు ఈనెల 11, 12 తేదీల్లో నల్లగొండ జిల్లాలోని ఆమనగల్లు గ్రామంలో నిర్వహిస్తునట్లు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ వెల్లడించింది. ఈ సదస్సులో కాకతీయుల కాలం నాటి స్వతంత్ర సంస్థానాధీశుల చరిత్ర వివరిస్తారని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సదస్సులో చరిత్ర పరిశోధకులు, పురావస్తు శాస్త్రజ్ఞులు, చరిత్ర ఔత్సాహికులు, యూనివర్సిటీ ఆచార్యులు తమ పరిశోధన పత్రాలను సమర్పిస్తారని వెల్లడించింది. 13లోగా ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి ఏపీపీ రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ)ల (కేటగిరీ–7) డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాతపరీక్ష లో ఉత్తీర్ణులైన వారి తాత్కాలిక ఎంపిక వివరాలను అభ్యర్థుల సంబంధిత లాగిన్లలో అందుబాటులో ఉంచినట్లు బోర్డు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు tslprb.in సంబంధిత ఖాతాలకు లాగిన్ అయి ఎంపిక వివరాలను, ధ్రువీకరణ పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని అన్ని కాలమ్‌లను పూర్తిచేసి ఈ నెల 13 సాయంత్రం 5 గంటలలోపు అప్లోడ్ చేయాలని తెలిపింది. -
ఆవిష్కరణల ప్రదర్శనకు దరఖాస్తుల ఆహ్వానం!
సాక్షి, మెదక్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరణల ప్రదర్శనకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్ కలెక్టరెట్లో రాష్ట్ర పరిశీలకులు సిమ్రాన్ మెహదిరట్టాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ ఆదేశాల మేరకు స్వాతంత్య్ర దినోత్సవం రోజున పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిష్కరణల ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో ఒక ఇన్నోవేటర్ ఉంటారని, అలాంటి వారికి ఇదొక సువర్ణావకాశమన్నారు. పాఠశాల, కళాశాలస్థాయి విద్యార్థులు, అధ్యాపకులు, యువకులు, వ్యవసాయదారులు, ఇతర రంగాలలో పనిచేసేవారు, శాస్త్రీయ అవగాహన కలిగిన ఎవరైనా తమ ఆలోచనలను, ఆవిష్కరణలకు సంబంధించిన వీడియో, ఐదు వ్యాక్యాలు, పంపేటువంటి వ్యక్తి పేరు, ఇతర వివరాలను 9100678543 నంబర్‌కు వాట్సప్ ద్వారా పంపించాలన్నారు. అలా పంపినవారిలో తెలంగాణా రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ వారు ఎంపిక చేసినవారు ఆగస్టు 15న జరిగే ప్రదర్శనలో ప్రదర్శించవచ్చని తెలియజేశారు. ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకునేలా పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని అధికారికి సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సైన్స్ అధికారి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇతర సమాచారం కోసం 8328599157 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. -
ఆన్‌లైన్‌లోనూ నామినేషన్
సాక్షి, యాదాద్రి :కేంద్ర ఎన్నికల సంఘం నామినేషన్లను ఆన్లైన్లో స్వీకరించే ప్రక్రియను ప్రవేశపెట్టింది. సువిధ యాప్ ద్వారా నామినేషన్ ఫారం 2ఏ పూర్తి చేసి దరఖాస్తు చేయొచ్చు. అలాగే నామినేషన్ వేసే అభ్యర్థి అఫిడవిట్‌ను పీడీఎఫ్ కాపీ ఆన్లైన్లో అప్డేట్ చేయాలి. అయితే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమయ్యే ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్ధేశించిన సమయం ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లను ఆన్లైన్ సిస్టమ్ తీసుకుంటుంది. అలాగే సెలవు రోజులైన 21, 23, 24 రోజుల్లో నామినేషన్లను స్వీకరించదు. ఈఆర్ఓ, ఏఆర్‌ఓతోపాటు కంప్యూటర్ కేంద్రాల నుంచి కూడా నామినేషన్ అప్లోడ్ చేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి అభ్యర్థులకు కల్పిస్తోంది. నామినేషన్ వేయడానికి జనరల్ అభ్యర్థి రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 సెక్యూరిటీ డిపాజిట్ చలాన్‌ను యాప్‌లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. -
డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తే అంతే!
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులారా.. బీ అలర్ట్! ఏప్రిల్‌లో నిర్వహించే జేఈఈ పరీక్ష రాసేందుకు విద్యార్థి ఒకసారి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పొరపాటున రెండోసారి రిజిస్ట్రేషన్ చేస్తే అతని మొత్తం దరఖాస్తునే తిరస్కరిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త నిబంధ నను ఎన్టీఏ వెలువరించింది. ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు అవకాశం ఉంటుందని.. ఈ అవకాశాన్ని మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాల కోసం నిర్వహించే రెండో దఫా జేఈఈ మెయిన్ దరఖాస్తులను ఈనెల 8వ తేదీన ప్రారంభించిన సంగతి తెలిసిందే. వచ్చే నెల 7వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్, దరఖాస్తుల సబ్మిషన్, 8వ తేదీ వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించింది. దీంతో విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతంలో.. రిజిస్ట్రేషన్ సమయంలో ఒకసారి ఏమైనా పొరపాట్లు దొర్లితే మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఈసారి ఆ అవకాశాన్ని తొలగిస్తూ.. రెండోసారి దరఖాస్తు చేసుకుంటే ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మొత్తం దరఖాస్తునే తిరస్కరిస్తామని వెల్లడించింది. -
కస్తూర్బా బాలికలకు ట్రిపుల్ ఐటీ కలేనా?
ప్రకాశం, కందుకూరు అర్బన్:గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థినులు రాష్ట్ర విద్యాశాఖ చేస్తున్న తప్పిదాల వల్ల ఉన్నత చదువుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. నూజివీడు, బాసర, పులివెందుల ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశానికి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నా.. కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు చెందిన బాలికలు మాత్రం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎంతో మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో చదివి ఉద్యోగాల్లో స్థిరపడటంతో ఈ కాలేజీల్లో చదువుకోవాలని బాలికలు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో చదివి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో చేరి ఉజ్వల భవిష్యత్ పొందాలని కలలు కంటున్నారు. కానీ వారి కళ నేరవేరేటట్లు కనిపించడం లేదు. ప్రభుత్వం ఈ ఏడాది ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన విద్యార్థులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. అప్లికేషన్ ఆన్లైన్ చేసే సమయంలో జిల్లా, మండలం, స్కూల్ పేర్లతోపాటు 4 తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివారో వివరాలు నమోదు చేయాల్సి రావడమే ఇందుకు కారణం. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్న సమయంలో కొన్ని ప్రభుత్వ, రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో ఆన్లైన్లో పొందుపరిచిన స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ జాబితాలో ప్రభుత్వం రెసిడెన్షియల్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం పేర్లు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కనీస సమాచారం కూడా ఉన్నతాధికారులు తెలియజేయలేదు. జిల్లాలో 37 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఈ ఏడాది కస్తూర్బా విద్యాలయాల్లో 1206 మంది బాలికలు 10వ తరగతి పరీక్షలు రాయగా వారిలో 1154 మంది ఉత్తీర్ణత సాధించారు. 25 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. అనేక మంది బాలికలు 10కి10 జీపీఏ, 9.8, 9.6 జీపీఏ సాధించారు. వీరిలో కొంత మంది మధ్యలో బడిమానేసి మళ్లీ చదువు కొనసాగించాలని కొండంత ఆశతో కస్తూర్బా గాంధీ పాఠశాలల్లో చేరి మంచి మార్కులు సాధించారు. ‘లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రైవేటు కళాశాలల్లో చదువుకునే స్థోమత మాకు లేదు. ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించండి’ అని బాలికలు ప్రాధేయపడుతున్నారు. జూన్ 8వ తేదీతో ట్రిపుల్ ఐటీ కాలేజీల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ముగియనుంది. ఉన్నతాధికారులు స్పందించి ఆన్లైన్లో సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు కోరుతున్నారు. -
ఆన్లైన్లో కొత్త పాన్ కార్డును పొందండిలా
నిడమర్రు : ఆదాయపు పన్ను శాఖ అందించే శాశ్వత ఖాతా సంఖ్య కార్డు (పాన్ కార్డు) కలిగి ఉండటం నగదు లావాదేవీల విషయంలో తప్పనిసరి అవుతుంది. బ్యాంకు లావాదేవీలకు, పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల్లో పర్మినెంట్ అకౌంట్ నెంబర్(పాన్ కార్డు) అవసరమవుతుంది. సార్వత్రికమైన ఈ 10 అంకెల అల్ఫాన్యూమరిక్ పాన్ కార్డును ఆదాయపన్ను శాఖ ప్రతీ పన్ను చెల్లింపుదారుకు దీన్ని జారీ చేస్తుంది. అయితే ఈ కార్డుకోసం రాతపూరక దరఖాస్తు చేసుకుంటే 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. అయితే అత్యవసర సమయాల్లో ఈ పాన్ కార్డు(సంఖ్య) ఆన్లైన్ ద్వారా 48 గంటల్లో పొందే అవకాశం ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్ ద్వారా ఆదాయపన్ను శాఖ కల్పిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. పాన్ కార్డు జారీ ఇలా పాన్ కార్డును భారత ఆదాయపన్ను శాఖ దీన్ని జారీ చేస్తుంది. దీని కోసం www.tun-nsdl.com అనే వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. కనిపించే వెబ్సైట్ ముఖ చిత్రంలో దిగువభాగంలో ఆన్లైన్ పాన్ అప్లికేషన్ క్లిక్ చేయాలి. అక్కడ అప్లై ఆన్లైన్ వద్ద భారతీయులైతే న్యూ పాన్–ఇండియన్ సిటిజన్(ఫారం 49 ఏ)/విదేశీయులైతే న్యూ పాన్–ఫారిన్ సిటిజన్(ఫారం–49 ఏఏ) క్లిక్ చేయాలి. అక్కడ ఆన్లైన్ దరఖాస్తు విండో ఓపెన్ అవుతుంది. ఈ ఆన్లైన్ ఫారంలో చిరునామా, ఆదాయపన్ను శాఖ సర్కిల్, రేంజి, ఏరియా కోడ్, ఏవో కోడ్ వంటివన్నీ పూర్తి చేయాలి. ఆ వివరాలు అదే వెబ్సైట్లో పొందవచ్చు. గైడ్‌లైన్స్ చదవాలి : అదే విండోలో ఉన్న గైడ్‌లైన్స్ చదివి ఫారం రకాన్ని ఎంచుకోవాలి. డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ కావాలా..? డిజిటల్ సిగ్నేజర్ లేని సర్టిఫికెట్ కావాలా..? అనే ఆప్షన్ ఎంచుకుని వివరాలు మొత్తం నింపాలి. పాన్ కార్డుకు సంబంధించిన వివరాలన్నీ అదే వెబ్సైట్లో ఎప్పటికప్పుడు లభ్యమవుతాయి. అలాగే ఇదే వెబ్సైట్లో పాన్/టాన్ కార్డ్ దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, ఇ–రిటర్న్ రిజిస్ట్రేషన్ స్థితి తెలుసుకోవడం పాన్‌కు సంబంధించిన ఫిర్యాదులు చేయడం, పాన్ డేటాలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఇలా సమర్పించాలి.. : వివరాలన్నీ ఆన్లైన్ దరఖాస్తు ఫారంలో నింపి, అవసరమైన సపోర్టడ్ డాక్యుమెంట్లు జతచేసి సమర్పించాలి. దరఖాస్తు నెంబరు ప్రకారం ఎకనాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఈ నెంబర్ ప్రకారం మీ అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేసుకోవచ్చు, సాధారణంగా 15 నుంచి 29 పనిదినాల తర్వాత పాన్ కార్డు వస్తుంది. కానీ ఇలా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే కేవలం రెండు రోజుల్లో కేటాయిం చిన పాన్ కార్డు సంఖ్య తెలుసుకోవచ్చు. తర్వాత రిజిస్టర్ పోస్ట్ ద్వారా పాన్‌కార్డు అందుతుంది. పాన్ కార్డు భారతదేశం పరిధిలో పంపించడానికి రూ.110 (జీఎస్టీతో సహా), ఇతర దేశాలకు పాన్ కార్డు పంపాల్సి వస్తే అన్ని సర్వీసులు కలుపుకుని రూ.1,020 (జీఎస్టీతో సహా) ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అయితే.. ఒకవేళ ఆఫ్ లైన్లో అయితే ఇదే వెబ్సైట్ నుంచి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని సంతకంతో కూడిన కలర్ ఫొటో, వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు, చిరునామా గుర్తింపు పత్రం, రూ.110 డీడీ సమర్పించాలి. -
మరో 361 పోస్టులకు నోటిఫికేషన్
-
మరో 361 పోస్టులకు నోటిఫికేషన్
ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించిన ఏపీపీఎస్సీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మరో 361 పోస్టులకు శనివారం రాత్రి ఆరు వేర్వేరు నోటిఫికేషన్లను జారీచేసింది. వివిధ విభాగాల్లోని ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను అభ్యర్థుల నుంచి ఆహ్వానించింది. ఆన్లైన్ దరఖాస్తులు www. psc. ap. gov. in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నట్లు కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. ఈ పోస్టుల కోసం జనవరి 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆన్లైన్ దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ బయోడేటా సమాచారాన్ని వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆయా నోటిఫికేషన్లకు 25 వేలకు మించి దరఖాస్తులు వచ్చినట్లయితే.. స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. స్క్రీనింగ్ టెస్టు సమాచారాన్ని వెబ్సైట్ద్వారా అభ్యర్థులకు తెలియచేస్తారు. కంప్యూటర్ ఆధారిత మెయిన్ పరీక్ష తేదీలను వెబ్సైట్లో పేర్కొన్నారు. ఇది ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఉంటుందని తెలిపారు. అన్ని నోటిఫికేషన్ల పరీక్షలు నెగిటివ్ మార్కుల విధానంలో జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో నంబర్ 235 ప్రకారం ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు తప్పుడు సమాధానాలిస్తే ఒక్కో తప్పుడు జవాబుకు 1/3 చొప్పున మార్కుల కోత విధిస్తారన్నారు. అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేందుకు వెబ్సైట్లో మాక్టెస్టు సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. నోటిఫికేషన్ల వారీగా పోస్టుల సంఖ్య, విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, సిలబస్ తదితర వివరాలను వెబ్సైట్లో పొందుపరిచారు. -
నేటి నుంచి ఏపీ గ్రూప్-2 దరఖాస్తులు
-
నేటి నుంచి ఏపీ గ్రూప్-2 దరఖాస్తులు
డిసెంబర్ పది వరకు స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నిర్వహించనున్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ శుక్రవారం నుంచి ప్రారంభమవనుంది. కమిషన్ అధికారిక వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’లో ఆన్లైన్ దరఖాస్తును పొందుపర్చనున్నారు. దరఖాస్తులను శుక్రవారం నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు సమర్పించవచ్చు. ఇందుకు సంబంధించిన ఫీజును డిసెంబర్ 10వ తేదీ రాత్రి 11:59 నిమిషాల వరకు చెల్లించే వీలుంది. దరఖాస్తులకు సంబంధించిన సమాచారమంతటినీ సమగ్రంగా ముందే ఒన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్టట్రేషన్లో నమోదు చేసుకుని అనంతరం దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వేషన్లకు సంబంధించి బీసీలకు క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్ నిబంధనలు వర్తించనున్నాయి. బీసీ అభ్యర్థులు తమ తల్లిదండ్రుల సంవత్సరాదాయం రూ.6లక్షల లోపుంటే నాన్‌క్రీమిలేయర్ పరిధిలోకి రానున్నారు. తహసీల్దార్ జారీచేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని నిర్దేశిత సమయంలో సమర్పించనివారి అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తారు. అభ్యర్థులు సమర్పించాల్సిన ధ్రువపత్రాలివే.. ♦ కులం, నివాస, పుట్టిన తేదీ ధ్రువపత్రాల ప్రొఫార్మా ♦ డిక్లరేషన్ ఆఫ్ ది అన్‌ఎంప్లాయిడ్ ♦ స్కూల్ స్టడీ సర్టిఫికెట్ ♦ స్థానిక ధ్రువపత్రం ♦ అంధులైతే మెడికల్ సర్టిఫికెట్ ♦ చెవిటి, మూగ అభ్యర్థులైతే సంబంధిత మెడికల్ సర్టిఫికెట్లు ♦ అంగవైకల్యం కలవారైతే అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు ♦ బీసీ అభ్యర్థులు క్రీమిలేయర్ సర్టిఫికెట్ ♦ లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఆ నాలుగు పోస్టులకు ప్రొఫిషియన్సీ టెస్టు లేదు ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేసింది. ఆయా పోస్టుల వివరాల్ని అందులో పొందుపరిచింది. అయితే ఆ జాబితాలో కొన్ని ఇతర పోస్టులు పొరపాటున చేరాయి. పోస్టు కోడ్ నంబర్ 8, 13, 33, 34 పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం లేదని, వాటిని ప్రొఫిషియన్సీ టెస్టునుంచి మినహాయిస్తున్నామని కమిషన్ గురువారం ఒక సవరణ ప్రకటన జారీచేసింది. పోస్టు కోడ్ నంబర్లు 9, 10, 11, 12, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32 పోస్టులకు ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారు. -
ఏపీ.. కాపీ
- తెలంగాణ సులభ వాణిజ్య విధానం - ఆన్లైన్ దరఖాస్తు చోరీ చేసిన ఏపీ సర్కారు - ప్రపంచ బ్యాంక్ ర్యాంకు కోసం అడ్డదారులు - దీనితో 22 రోజుల్లో ఏకంగా 16 ర్యాంకులు ఎగబాకిన వైనం - ఆంధ్రప్రదేశ్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ - అధికారులతో సీఎస్ భేటీ.. సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు - కాపీరైట్స్ చట్టం సెక్షన్ 63 కింద కేసు నమోదు - ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మంత్రి కేటీఆర్ - ఏపీ నిర్వాకంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ సాక్షి, హైదరాబాద్: సులభ వాణిజ్యంలో ప్రపంచబ్యాంక్ ర్యాంకు కోసం ఏపీ అడ్డదారులు తొక్కింది.. తెలంగాణ అధికారులు కష్టపడి రూపొందించిన ఆన్లైన్ దరఖాస్తును మక్కీకి మక్కీ కాపీ చేసింది.. దానిని తమదిగా చూపిస్తూ కేంద్ర పరిశ్రమల శాఖకు సమర్పించింది.. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన తెలంగాణ అధికారులు ఏపీ ‘చోరీ’పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏడాది కాలంగా తమ అధికారులు కష్టపడి రూపొందించిన ఆన్లైన్ దరఖాస్తును ఆంధ్రప్రదేశ్ నిస్సిగ్గుగా చోరీ చేసిందని పేర్కొన్నారు. దీనిపై సీసీఎస్ పోలీసులు కాపీరైట్స్ యాక్ట్ సెక్షన్-63 ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఏపీ సర్కారు ‘కాపీ’ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. కాపీ వ్యవహారాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. ఇప్పటికే పలు అంశాలపై ఉప్పూ నిప్పుగా ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ అంశం సరికొత్త వివాదానికి తెరలేపింది. సులభ వాణిజ్యానికి ప్రోత్సాహం కోసం.. అంతర్జాతీయ పెట్టుబడులు, వ్యాపార అనుకూల వాతావరణం కోసం అమలు చేస్తున్న విధానాలను ప్రామాణికంగా తీసుకుని ప్రపంచ బ్యాంక్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ, సులభ వాణిజ్యం) ర్యాంకులను ప్రకటిస్తోంది. ఇందుకోసం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని ‘డిప్’ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ పేరిట ఓ వెబ్ పోర్టల్ రూపొందించింది. ఈవోడీబీ ర్యాంకును ఆశించే రాష్ట్రాలు డిప్ సూచించిన 340 ప్రశ్నలకు ఆన్లైన్లో సమాధానాలను సమర్పించాలి. ఆయా రాష్ట్రాలు ఇచ్చే సమాచారం, సమాధానాల పురోగతిని పర్యవేక్షించేందుకు ‘ఆన్లైన్ డ్యాష్‌బోర్డు’ను ఏర్పాటు చేశారు. రాష్ట్రాలు శాఖల వారీగా సమర్పించే సమాచారం ఆధారంగా ‘స్కోరు’ను ఇస్తూ తాత్కాలిక పద్ధతిన ర్యాంకులను ప్రకటిస్తూ వస్తోంది. అన్ని రాష్ట్రాలు జూన్ 30లోగా సులభ వాణిజ్యానికి వీలు కల్పించేలా తాము చేపట్టిన సంస్కరణలకు ఆధారాలను సమర్పించాలని డిప్ గడువు విధించింది. జూన్ 28, 29 తేదీల్లో వెబ్‌పోర్టల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆధారాల సమర్పణ గడువును జూలై ఏడో తేదీ వరకు పొడిగించింది. జూన్ 30వ తేదీ వరకు చేపట్టిన సంస్కరణలకు ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. కాపీ కొట్టిందిలా! న్యాయశాఖకు చెందిన ‘కమర్షియల్ కోర్ట్ ఫీ అండ్ ప్రాసెస్ ఫీ ఆన్లైన్ పేమెంట్’ దరఖాస్తును తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న డిప్ వెబ్‌పోర్టల్‌కు సమర్పించింది. ఏపీ సర్కారు జూన్ 30 అర్ధరాత్రి వరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి సమాచారం అప్లోడ్ చేయలేదు. గడువు పెంచిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దరఖాస్తును ఏపీ అధికారులు కాపీ కొట్టి అప్లోడ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తమ దరఖాస్తులో పొందుపరిచిన ‘సబ్మిషన్ రిఫరెన్స్ నంబర్’ అనే అంశాన్ని యథాతథంగా ఉంచేశారు. ఈ అంశం తెలంగాణకు మాత్రమే ఉన్న విశిష్ట సంఖ్యా విధానం కావడంతో ఏపీ సర్కారు కాపీ వ్యవహారం బట్టబయలైంది. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వ విధానాలను కాపీ చేయడం మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపిస్తున్నారు. ఈవోడీబీ ర్యాంకుల కోసం అడ్డదారి తొక్కిన ఏపీ వైఖరిని ఎండగట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 22 రోజుల్లో 16 ర్యాంకులు పైకి.. ఈవోడీబీలో గతేడాది ప్రపంచ బ్యాంకు ప్రకటించిన ర్యాంకుల్లో ఏపీ రెండో స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. దీన్ని సవాలుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం శాఖల వారీగా సంస్కరణలను చేపట్టింది. తాజా ర్యాంకింగ్‌లో 51.93%స్కోర్‌తో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఉత్తరాఖండ్ ప్రథమ స్థానంలో ఉండగా.. 51.76% స్కోర్‌తో ఏపీ మూడో స్థానంలో ఉంది. జూన్ 13న ప్రకటించిన తాత్కాలిక ర్యాంకుల్లో బిహార్ ప్రథమ స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉండగా ఏపీ 19వ స్థానంలో నిలిచింది. తమ సమాచారాన్ని కాపీ కొట్టడంతో ఏపీ మూడో ర్యాంకు ఎగబాకిందని తెలంగాణ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న పారిశ్రామిక ప్రణాళికలు, పరిశ్రమల వివరాలను కొందరు అధికారులు ఏపీకి చేరవేశారన్న సమాచారంతో మంత్రి కేటీఆర్ పరిశ్రమల శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, ఉద్యోగుల పనితీరును సమీక్షించారు. ఏపీ నిర్వాకంపై కేంద్రానికి లేఖ మెరుగైన ఈవోడీబీ ర్యాంకు కోసం ఏపీ సర్కారు అడ్డదారులు తొక్కిన తీరుకు సంబంధించిన ఆధారాలను అధికారులు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావుకు అందజేశారు. దీంతో ఈ వ్యవహారంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ రాశారు. ‘‘సులభ వాణిజ్యం కోసం కేంద్ర పారిశ్రామిక విధానం, ప్రోత్సాహకాల విభాగం (డిప్) చేస్తున్న ప్రయత్నాల ప్రాముఖ్యతను తెలంగాణ గుర్తించింది. రెడ్‌టేపిజాన్ని తగ్గిస్తూ, పారదర్శక తకు పెద్దపీట వేసేలా డిప్ చేస్తున్న ప్రయత్నం పెట్టుబడులకు అనువైన వాతావరణం సృష్టిస్తుందని భావిస్తున్నాం. రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణలకు సంబంధించిన ఆధారాల సమర్పణకు జూలై 7ను గడువుగా నిర్దేశించారు. కానీ కొన్ని రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల వెబ్సైట్ల సమాచారాన్ని కాపీ కొడుతూ ఈవోడీబీ ర్యాంకు స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 30వ తేదీ తర్వాత డిప్‌కు సమర్పించిన ఆధారాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తుది ర్యాంకులు కేటాయించాలి..’’ అని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఏపీ కాపీ వ్యవహారానికి సంబంధించిన ఆధారాలను లేఖతో పాటు జతచేశారు. -
ఓయూ సెట్లో సత్తా చాటిన అబ్బాయిలు
హైదరాబాద్: ఓయూసెట్-2016 ఫలితాల్లో అబ్బాయిలు సత్తా చాటారు. అమ్మాయిలతో పోల్చుకుంటే అబ్బాయిలు ఒక శాతం అధికంగా అర్హత సాధించారు. పలు పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించిన ఓయూసెట్-2016 ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మొత్తం 94.26 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. ఓయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ. సురేష్‌కుమార్, అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ డి. అశోక్‌లు కలిసి ఫలితాలను వెల్లడించారు. మొత్తం 40 పీజీ, 10 పీజీ డిప్లొమా, 3 ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పలు కోర్సుల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య కంటే.. దర ఖాస్తులు తక్కువగా అందడంతో.. ఆయా కోర్సులకు ప్రవేశ పరీక్ష నిర్వహించ లేదు. మొత్తం 45 కోర్సులకు ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 65,494 మంది పరీక్ష రాయగా.. 61,732 మంది ప్రవే శాలకు అర్హత పొందారు. అన్ని కోర్సుల్లో కలిపి దాదాపు 18,800 సీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. నెలాఖరులో వెబ్ ఆప్షన్లు.. ర్యాంకు కార్డులను ww.osmania.ac.in, www.ouadmissions.com వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. ర్యాంకు కార్డులను అభ్యర్థులకు నేరుగా చేరవేయడం లేదు. అందరూ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి ఈ నెలాఖరులో సమయమిస్తామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ వచ్చేనెల రెండో వారంలో నిర్వహిస్తామన్నారు. ఖరారు చేసిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. -
ఓయూ సెట్ దరఖాస్తు గడువు పెంపు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూసెట్-2016 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ చివరి గడువు శనివారంతో (7న)తో ముగిసినా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ చూడవచ్చు. -
బీయూఎంఎస్ కోర్సుకు 12 నుంచి దరఖాస్తులు
విజయవాడ: 2015-16 విద్యా సంవత్సరంలో యూనానీ (బీయూఎంఎస్) డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు ఈ నెల 12 నుంచి 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుతో పాటు సంబంధిత పత్రాలతో.. ది ప్రిన్సిపాల్, ప్రభుత్వ నిజామియా టిబ్బీ కళాశాల, చార్మినార్, హైదరాబాద్ చిరునామాకు ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా స్వయంగా లేదా పోస్టుద్వారా అందేలా పంపించాలి. సెప్టెంబరు 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబరు 6న హైదరాబాద్ నగరం కోఠిలో ఉన్న ఉస్మానియా మెడికల్ కళాశాలలో ప్రవేశ పరీక్ష జరుగుతుంది. మరిన్ని వివరాలకు, నోటిఫికేషన్‌కు యూనివర్సిటీ (http//ntruhs.ap.nic.in) వెబ్సైట్లో పొందవచ్చు. ఎంబీబీఎస్ పరీక్షలు 18కి వాయిదా వామపక్షాలు బంద్ చేస్తున్న కారణంగా మంగళవారం జరగాల్సిన ఎంబీబీఎస్ పరీక్షలు ఈ నెల 18కి వాయిదా వేసినట్లు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ అనాటమీ పేపర్-2, ఫైనలియర్ ఓబీజీ పేపర్ పరీక్ష జరగాల్సి ఉంది. -
ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ఎలా?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)లో అసిస్టెంట్ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు ఎలా చేయాలో తెలపండి. - పి.సుమ, సంతోష్‌నగర్ ఆర్బీఐ 506 అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రకటన విడుదల చేసింది. ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ www.rbi.org.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చెల్లించవచ్చు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.50 ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ ద్వారా పరీక్ష ఫీజుకు చివరి తేదీ ఆగస్టు 6 కాగా, ఆఫ్‌లైన్‌లో చివరి తేదీ ఆగస్టు 11. రాత పరీక్షను ఆన్లైన్ విధానంలో సెప్టెంబర్ నాలుగో వారంలో నిర్వహించనున్నారు. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రారంభించడానికి ముందు అభ్యర్థి తన ఫొటోగ్రాఫ్, సంతకాన్ని స్కాన్ చేయించుకోవాలి. ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఈ-మెయిల్ ఐడీ ఉండాలి. పరీక్షకు సంబంధించిన వివరాలు, కాల్ లెటర్ తదితరాలను ఆర్బీఐ ఈ-మెయిల్ ద్వారానే అభ్యర్థులకు పంపుతుంది. ఆర్బీఐ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత‘రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్’ లింక్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ‘క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్’ లింక్‌పై క్లిక్ చేసి అభ్యర్థి తనకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అందులో పొందుపరచాలి. అభ్యర్థి పేరు, తండ్రి/ భర్త పేరు, పుట్టినతేదీ, చిరునామా, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, పరీక్ష కేంద్రం, విద్యార్హతలు లాంటి వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాలి. స్పెల్లింగ్ ఏ మాత్రం తేడా ఉన్నా అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించే ప్రమాదం ఉంటుంది. అన్ని వివరాలు పొందుపరిచాక, ఒకసారి పూర్తిగా పరిశీలించుకొని ‘ఫైనల్ సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఈ బటన్‌పై క్లిక్ చేశాక ఎలాంటి మార్పులు చేయడానికి ఆస్కారం ఉండదు. ఆ తర్వాత స్క్రీన్‌పై రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ కనిపిస్తాయి. వాటిని రాసి పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌లను అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ల రూపంలోనూ తెలియజేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు ప్రతిని ప్రింటవుట్ తీసుకొని భద్రపరుచుకోవాలి. ఫీజుల చెల్లింపు: మాస్టర్/ వీసా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత ఒక ఇ-రిసీప్ట్ జనరేట్ అవుతుంది. అభ్యర్థులు దీన్ని ప్రింటవుట్ తీసుకోవాలి. పరీక్ష ఫీజును ఆఫ్‌లైన్ విధానంలో ఏడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా చెల్లించవచ్చు. అవి: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసంపూర్తిగా నింపిన దరఖాస్తులు, ఫొటో, సంతకం సరిగాలేని దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే దరఖాస్తు చేసుకోవడం శ్రేయస్కరం. ఇన్పుట్స్: ఎన్.విజయేందర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ జనరల్ నాల్డెజ్ -
ఉచిత ఇంటర్‌కు నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోండి
విద్యార్థులకు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎంఎస్ శోభారాణి సూచన కర్నూలు(అర్బన్): కార్పొరేట్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించేందుకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువును పొడిగించినట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు ఎంఎస్ శోభారాణి తెలిపారు. సోమవారం సాయంత్రం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీడీ మాట్లాడుతూ జిల్లాలోని జిల్లాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పూర్తి చేసిన అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీఏఎస్ పాఠశాలల్లో ఎస్సీ విద్యార్థులకు ప్రవేశం: జిల్లాలో ప్రభుత్వం ఎంపిక చేసిన 11 బెస్ట్ అవేలబుల్ స్కూల్స్‌లో 100 మంది ఎస్సీ బాల బాలికలకు 1వ తరగతి ఇంగ్లిషు మీడియంలో ప్రవేశం కల్పిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ డీడీ శోభారాణి తెలిపారు. ఇందులో 33 సీట్లను బాలికలకు, 67 సీట్లను బాలురకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఒక్కో విద్యార్థికి స్కూల్ ఫీజులు, పుస్తకాలు ఇతరత్రా ఖర్చుల కింద ఎంపికైన పాఠశాలలకు ఏడాదికి రూ.20 వేలను ప్రభుత్వం మంజూరు చేయనుందని తెలిపారు. 1వ తరగతిలో తమ చిన్నారులకు చేర్చబోయే తల్లిదండ్రుల నివాసం ఆయా పాఠశాలలకు సమీపంలో ఉండాలన్నారు. ఈ పాఠశాలలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు నివాస, కుల, తల్లిదండ్రుల ఆదాయ, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు జీరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలను దరఖాస్తుకు జతపరచాలన్నారు. ఈ పాఠశాలల్లో చేరే విద్యార్థులు 01-06-2008 నుంచి 01-06-2009 సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలని, అలాగే పుట్టిన తేదీ సర్టిఫికెట్లు సంబంధిత మునిసిపల్‌కమిషనర్, తహశీల్దార్లు జారీ చేసినవై ఉండాలన్నారు. దరఖాస్తు ఫారాలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో, జిల్లాలోని ఏడు సహాయ సంక్షేమాధికారుల కార్యాలయాల్లో లభ్యమవుతున్నట్లు ఆమె తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 28లోగా తమ కార్యాలయంలో అందించాలని పేర్కొన్నారు. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు స్థానిక అంబేద్కర్ భవన్లో లాటరీ పద్ధతిన విద్యార్థులకు ఎంపిక చేస్తారని ఆమె తెలిపారు. బీఏఎస్గా ఎంపికైన పాఠశాలలు: జిల్లా కేంద్రంలోని సర్వేపల్లి విద్యాలయం క్రిష్ణానగర్, జీసస్ మేరీ జోసఫ్ ఇంగిషు మీడియం స్కూల్ చిల్డ్రన్స్ పార్కు సమీపంలో, కాకతీయ పబ్లిక్ స్కూల్ మద్దూర్‌నగర్, నందికొట్కూరు నవనంది హైస్కూల్, నంద్యాల సమతా విద్యానికేతన్, కాల్వబుగ్గ బుగ్గరామేశ్వర హైస్కూల్, డోన్ సుధ హైస్కూల్, ఎమ్మిగనూరు ఆదర్శ విద్యా పీఠం, నలంద హైస్కూల్, ఆళ్లగడ్డ శ్రీ రాఘవేంధ్ర పబ్లిక్ స్కూల్, కోవెలకుంట్ల సెయింట్ జోసఫ్ ఇంగ్లిషు మీడియం స్కూల్స్ ఎంపికైనట్లు డీడీ శోభారాణి తెలిపారు. -
22న ఎంసెట్-2014
- పరీక్ష రాయనున్న 14,186 మంది విద్యార్థులు - గంట ముందుగానే పరీక్ష కేంద్రంలోకి అనుమతి - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్-2014 పరీక్ష జిల్లాలో ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 14,186 మంది పరీక్ష రాస్తుండగా.. వీరిలో 8,775 మంది ఇంజనీరింగ్, 5,411 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇంజనీరింగ్ విభాగంలో 150 మంది తగ్గగా, మెడికల్‌లో 700 మంది విద్యార్థులు పెరిగారు. కర్నూలు నగరంలో 20 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుంది. పరీక్షల నిర్వహణ రీజనల్ కో ఆర్డినేటర్‌గా జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాసరెడ్డిని నియమించారు. మెడికల్,అగ్రికల్చర్ పరీక్ష కేంద్రాలు 1. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 2. సెయింట్ జోసఫ్స్ డిగ్రీ కళాశాల 3. సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ ఇంగ్లిష్ కళాశాల 4. సెయింట్ జోసఫ్స్ స్కూల్ 5. మాంటిస్సోరి హైస్కూల్ 6. బృందావన్ కాలేజ్ ఇంజనీరింగ్ 1. జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల 2. సెయింట్ జోసఫ్ డిగ్రీ కళాశాల(సుంకేసుల రోడ్డు) 3. వాసవీ మహిళా కళాశాల(పెద్దమార్కెట్ వద్ద) 4. జి.పులయ్య ఇంజనీరింగ్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు 5. కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల 6. సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ ఇంగ్లిష్ స్కూల్, సుంకేసుల రోడ్డు 7. శ్రీ శంకరాస్ డిగ్రీ కళాశాల 8. సెయింట్ జోసఫ్స్ జూనియర్ కళాశాల, నందికొట్కూరు రోడ్డు 9. ఉస్మానియ కళాశాల 10. సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల 11. సెయింట్ జోసఫ్స్ ఇంగ్లిష్ స్కూల్, ఎన్ఆర్ పేట 12. మాంటిస్సోరి హైస్కూల్, ఎ.క్యాంప్ 13. బృందావన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి అండ్ సెన్సైస్(బిట్స్), చిన్నటేకూరు 14. ప్రభుత్వ డిగ్రీ కళాశాల(మెన్), బి.క్యాంపు విద్యార్థులకు సూచనలు, సలహాలు 1. హాల్‌టికెట్లను విద్యార్థులు ఎంసెట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. 2. విద్యార్థులు భర్తీ చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారంపై ఫొటో అతికించి గజిటెడ్ ఆఫీసర్‌చే అటెస్టేషన్ చేయించాలి. 3. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి బ్లాక్ /బ్లూ బాల్‌పాయింట్ పెన్, భర్తీ చేసిన ఆన్లైన్ దరఖాస్తు ఫారం.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులైతే కుల ధ్రువీకరణ పత్రాలు(జిరాక్స్ కాపీలు గజిటెడ్ ఆఫీసర్‌చే సంతకం తప్పనిసరి), ఎంసెట్-2014 హాల్‌టికెట్ తీసుకురావాలి. 4. విద్యార్థులకు పరీక్ష హాలులోకి గంట ముందుగానే అనుమతిస్తారు. 5. సెల్‌ఫోన్, బ్లూటూత్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులతో వస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. 6. విద్యార్థులు తమ పేరు, తండ్రి పేరు, కేటగిరీలలో తప్పులు ఉంటే ముందుగానే నామినల్ రోల్స్‌లో సరిచేయించుకోవాలి. 7. పరీక్ష ముగిసిన తర్వాత ఆన్లైన్ దరఖాస్తు, ఓఎంఆర్ షీటును ఇన్విజిలేటర్‌కు అప్పగించాలి. పరీక్ష పత్రాన్ని వెంట తీసుకెళ్లొచ్చు. -
సెలవు రోజుల్లోనూ ఓయూసెట్‌కు దరఖాస్తు
హైదరాబాద్, ఓయూసెట్-2014కు సెలవురోజుల్లో (12, 13, 14లతో పాటు ఇతర తేదీలలోని సెలవులు) కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పీజీ అడ్మిషన్స్ జాయింట్ డెరైక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఉస్మానియాతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో 2014-15 విద్యాసంవత్సరానికి వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశానికి డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా రెండు రోజుల్లో 1500 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతున్నట్లు తెలిపారు -
ఉద్యోగశ్రీకి ఆన్లైన్ అస్వస్థత
పొందూరు, న్యూస్‌లైన్: సంతకవిటి మండలంలో గణిత ఉపాధ్యాయునిగా పని చేస్తున్న పూజారి హరిప్రసన్న(ట్రెజరీ ఐడి 0123396) ఇటీవల ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన హెల్త్ స్కీంలో తన పేరు నమోదుకు ఆన్లైన్లో ప్రయత్నించారు. ఈ పథకానికి సంబంధించిన ఈహెచ్ఎఫ్ వెబ్సైట్లో ఉన్న దరఖాస్తు నింపి సబ్మిట్ చేశారు. వెబ్సైట్ దరఖాస్తును తీసుకోకపోగా.. తెరపై ఒక వింత సమాధానం ప్రత్యక్షమైంది. ‘మీ యొక్క డీడీఓ కోడ్‌లో మీకు నిర్దేశించిన ఉపాధ్యాయుల సంఖ్య పూర్తి అయిందన్నది’ దాని సారాంశం. అది చూసి ఆయన అవాక్కయ్యారు. గత నెల రోజులుగా ఎన్నిసార్లు ప్రయత్నించినా దరఖాస్తు నమోదు కాలేదు. అధికారులెందరిని ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదు. ఇది ఈ ఒక్క ఉపాధ్యాయుడి సమస్య కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలామంది ఇటువంటి సమస్యలతోనే సతమతమవుతున్నారు. ఉద్యోగులు, వారి కుటుంబీకులకు ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం ఉద్యోగశ్రీ పథకం ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ పథకంలో చేరి హెల్త్ కార్డులు పొందేందుకు సంబంధిత వెబ్‌సైట్‌కు లాగిన్ అయ్యి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేసినప్పుడు వింత సందేశాలు దర్శనమిస్తున్నాయి. మీ మండలంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇదివరకే నమోదు చేసుకొన్నారని, మీ డిపార్ట్మెంట్లో హెల్త్ కార్డుల నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయ్యిందని.. ఇలా రకరకాల సందేశాలు వస్తున్నాయి. దీనిపై ఆన్లైన్లోనే ఫిర్యాదు చేస్తే 15 రోజుల తర్వాత మీ హెచ్ఓడీని గానీ, ఎస్టీవోను గానీ కలిసి సమస్య పరిష్కరించుకోవాలని మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. ఆ ప్రకారం హెచ్ఓడీ, ఎస్టీవోల వద్దకు వెళితే.. ఆ సమస్యలతో తమకు సంబంధం లేదని, నెట్లోనే దానికి పరిష్కారం వెతుక్కోవాలని చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని వాపోతున్నారు. మరోవైపు ఆరోగ్య కార్డులకు త్వరగా నమోదు చేసుకోవాలని కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. కాగా అష్టకష్టాలు పడి ఎలాగోలా ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామందికి ఇప్పటికీ హెల్త్ కార్డులు అందలేదు. కొందరికి తాత్కాలిక కార్డులు జారీ చేశారు. ఇటువంటి సమస్యలను పరిష్కరించకుండా దరఖాస్తుకు గడువు విధించడం సబబు కాదని, ముందు ఆన్లైన్ సమస్యలు పరిష్కరించాలని టీచర్లు, ఉద్యోగులు కోరుతున్నారు. -
మే 17న ఎంసెట్
హైదరాబాద్: ఈ ఏడాది ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించారు. మే 17న ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 20న ఆన్లైన్లో అప్లికేషన్లు తీసుకోవడం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 4 ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేది. జూన్ 2న ఎంసెట్ ర్యాంకులను ప్రకటిస్తారు. -
ఆన్లైన్లోనే ఎంసెట్ దరఖాస్తుల సవరణ
కన్వీనర్ డాక్టర్ రమణ రావు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఎంసెట్ కమిటీ ఈ సారి పలు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. దరఖాస్తుల్లో తప్పులు దొర్లినా.. ఆన్లైన్లోనే సులభంగా వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తోంది. ఇప్పటి వరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన సమయంలో తప్పులు దొర్లితే వాటిని సవరించుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇందుకోసం ఎంసెట్ కార్యాలయానికి రావాల్సి వస్తోంది. అయితే, ఇకపై ఆ అవసరం లేదని, దరఖాస్తుల్లో తప్పులను ఆన్లైన్లోనే సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నామని ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ రమణరావు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. - మే 17న నిర్వహించే ఎంసెట్ కోసం వచ్చే నెల 10 నోటిఫికేషన్ జారీ కానుంది. - 4.20 లక్షల మంది విద్యార్థులు ఈ సారి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా. - ఈ నేపథ్యంలో నకిలీ దరఖాస్తులు, నకిలీ హాల్టికెట్లకు చెక్ పెట్టేందుకు బార్కోడ్, వాటర్ మార్క్‌ను ప్రవేశపెట్టనున్నారు. - ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పులు దొర్లితే.. నిర్ణీత తేదీల్లో ఆన్లైన్లోనే సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. - పరీక్ష ఏర్పాట్లపై ఫిబ్రవరి 4న జరిగే సమావేశంలో మరిన్ని అంశాలపై చర్చించనున్నారు. - ఇంటర్మీడియెట్ సిలబస్ మారినందున.. మారిన సిలబస్ ప్రకారమే ఎంసెట్ పరీక్ష ఉంటుందని కన్వీనర్ రమణరావు తెలిపారు. నోటిఫికేషన్ సందర్భంగా ప్రకటించే సిలబస్ ప్రకారం విద్యార్థులు సన్నద్ధులు కావాలని సూచించారు. -
ఉపకారం లేదు!
జి.సిగడాం, న్యూస్‌లైన్:ఉపకార వేతనాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులు అదే పనిలో పడ్డారు. ఇందుకు కావాల్సిన ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారి ఆశలపై నిబంధనలు నీళ్లు చల్లాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారంతా పేదల జాబితాలో చేరుతారు. స్కాలర్షిప్ పొందాలంటే తహశీల్దార్ కార్యలయం నుంచి ఆదాయ, కుల ధ్రువ పత్రాలు పొందాలి. అంతవరకూ బాగానే ఉన్నా నిబంధనలు మాత్రం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. స్కాలర్షిప్ పొందడానికి సంవత్సర ఆదాయం 44,500 రూపాయలలోపు ఉండాలని విద్యాశాఖ స్పష్టం చేస్తుంది. అంతకంటే ఎక్కువ ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ఆమోదించడం లేదు. రెవెన్యూ అధికారులు మాత్రం 55,000 నుంచి 75,000 వరకు ఆదాయ ధ్రువపత్రాన్ని జారీ చేస్తున్నారు. దీంతో ఇటు రెవెన్యూ, అటు స్కాలర్షిప్ మంజూరు చేసే అధికారుల మధ్య విద్యార్థులు నలిగిపోతున్నారు. ఇప్పటికీ ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోని పరిస్థితి ఏర్పడింది. సొమ్ము ఖర్చు! మీసేవా ద్వారా ఆదాయ, కులధ్రువపత్రాల కోసం వెళ్తున్న విద్యార్థుల నుంచి ఒకసారికి సుమారు 70 రూపాయలు నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఒక్కో విద్యార్థి రెండు మూడుసార్లు దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుండడంతో రవాణా ఖర్చులతో సహా వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతున్నప్పటికీ విద్యార్థులకు మాత్రం స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు కానరాలేదు. రెవెన్యూ యంత్రాంగం మాత్రం సంవత్సర ఆదాయం 50 వేల రూపాయలకు పైగానే జారీ చేస్తామని వెల్లడిస్తున్నారు. జిల్లాలోని చాలా మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో సుమారు 10 వేల మంది విద్యార్థులు స్కాలర్షిప్కు నోచుకోనే అవకాశాన్ని కోల్పోయినట్టు తెలిసింది. జిల్లాలో అన్ని పాఠశాలల్లో చదువుతున్న 9, 10, ఇంటర్ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం మీసేవా, రెవెన్యూ కార్యాలయాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. చదువుకు దూరం! ఆదాయ ధ్రువపత్రాల కోసం 9, 10 తరగతుల విద్యార్థులు రోజుల తరబడి కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే ఒక పక్క మీ సేవా ఆన్లైన్ పనిచేయకపోవడం, ఆదాయం ధ్రువీకరణ సర్టిఫికెట్ 50 వేల రూపాయల కంటే తక్కువ ఇవ్వకపోవడంతో తరచూ దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు పాఠశాలకు డుమ్మా కొట్టి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గతంలో మూడు నెలలు సమైక్యాంధ్ర కోసం పాఠశాలలు మూతపడ్డాయి. ఇప్పుడు ధ్రువపత్రాల కోసం తిరుగుతుండడంతో చదువులు సాగని పరిస్థితి నెలకొంది. పదో తరగతి ఫీజుకు రాయితీ లేనట్టే! ఆదాయ ధ్రువీకరణ పత్రం ప్రభావం స్కాలర్‌షిప్‌తోపాటు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపింది. పరీక్ష ఫీజుగా 125 రూపాయలు చెల్లించాలి. సంవత్సరాదాయం 23 వేల రూపాయలలోపు ఉంటే ఫీజులో రాయితీ ఉంటుంది. కానీ రెవెన్యూ అధికారులు రూ. 50 వేల రూపాయలకంటే ఎక్కువగానే ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుండడంతో ఫీజులో రాయితీ వర్తించడం లేదు. దీంతో పూర్తిగా సొమ్ము చెల్లిస్తున్నట్టు పలువురు విద్యార్థులు వాపోతున్నారు. -
10,12 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్లో దరఖాస్తు సౌకర్యం
సాక్షి ముంబై: రాష్టవ్య్రాప్తంగా 10, 12వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు తమ పరీక్షా ఫామ్‌ను ఆన్లైన్లో నింపే సౌకర్యం కల్పించాలని మహారాష్ట్ర స్టేట్ బోర్ట ఆఫ్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఎంఎస్బీఎస్హెచ్ఎస్ఈ) నిర్ణయించింది. 12వ తరగతికి ఫిబ్రవరి-మార్చి 2014 లో, టెన్తకు గాను సెప్టెంబర్-అక్టోబర్ 2014లో ఈ ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని పుణే, ముంబై, నాసిక్, అమరావతి, నాగ్‌పూర్, సంభాజీనగర్, కొల్హా„పూర్, కొంకణ్, లాతూర్ విభాగాల్లోని 10, 12 తరగతుల విద్యార్థులు పరీక్షా ఫామ్ నింపుతారు. ఆన్లైన్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు ప్రతి విభాగంలో బోర్డుకు వేర్వేరు సర్వర్లు అందజేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేని పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ఆన్లైన్లో ఫామ్ నింపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బోర్డు ముంబై విభాగం అధ్యక్షుడు లకీష్మకాంత్ పాండే మాట్లాడుతూ... ఆన్లైన్లో పరీక్షా ఫామ్ నింపడంలో పొరపాటు జరిగితే దరఖాస్తు చేయడం కుదరదని స్పష్టం చేశారు. 12వ తరగతి పరీక్షల కోసం అక్టోబర్ 20 నుంచి ఆన్లైన్ సేవలు ప్రారంభిస్తారని తెలిపారు. నగరంలో సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు ఉన్నారన్నారు. గడువులోపే ఫామ్ నింపడం ప్రారంభించాలని, దీంతో సర్వర్‌పై భారం పడబోదని ఆయన సూచించారు. ఇంటర్నెట్లో ఝ్చజ్చిజిటటఛిఛౌ్చటఛీ.జౌఠి.జీ వెబ్‌సైట్‌కు వెళ్లి తమ పరీక్షా ఫామ్‌ను నింపవచ్చు. కాగా దరఖాస్తును కేవలం పాఠశాల, జూనియర్ కళాశాలలోనే నింపాలి. పాఠశాల, జూనియర్ కళాశాలలకు వేర్వేరు లాగ్ ఇన్ ఐడీ, పాస్వర్డ ఇచ్చారు. హాల్ టికెట్ కూడా ఆన్లైన్లోనే జారీ చేయాలని బోర్టు యోచిస్తోంది. ప్రైవేట్‌గా పరీక్ష రాయాలనుకున్న విద్యార్థులకు ఆన్లైన్లో ఫామ్ నింపడానికి ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేస్తారు. పరీక్షా ఫామ్‌పై విద్యార్థి ఫొటో, సంతకం స్కాన్ చేసి ఇస్తారు. ఆఫ్‌లైన్ దరఖాస్తు... ఇంటర్నెట్ సౌకర్యం లేనివారి కోసం ఒక సీడీ అందజేస్తారు. ఈ సీడీలోని సాఫ్టవేర్ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకొని, ఆ తర్వాత విద్యార్థుల పరీక్షా ఫారాలను ఆఫ్‌లైన్‌లో భర్తీ చేసి, ఆ తర్వాత వాటిని ఆన్లైన్లో నింపవచ్చు.