ప్రస్తుతం అందరికీ పాన్ కార్డు తప్పనిసరి అయిపోయింది. కేవలం ఉద్యోగం చేసేవారికి మాత్రమే కాకుండా, మైనర్స్ లేదా ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. ఆదాయపన్ను శాఖలోని సెక్షన్ 160 ప్రకారం, పాన్ కార్డు జారీ చేయడానికి కనీస వయసు అవసరం లేదు. కాబట్టి ఎవ్వరైనా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పిల్లలు స్వయంగా పాన్ కార్డు కోసం అప్లై చేసుకోలేరు. కాబట్టి వారి తరపున తల్లిదండ్రులే పాన్ కార్డు కోసం అప్లై చేయాల్సి ఉంటుంది.
పిల్లలకు పాన్ కార్డు ఎందుకంటే?
తల్లిదండ్రులు పిల్లల పేరుమీద ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నప్పుడు, లేదా వారి ఆస్తులకు నామినీలుగా చేర్చినప్పుడు పాన్ కార్డు అవసరం. అంతే కాకుండా పిల్లల పేరుమీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, మైనర్ కుమార్తె కోసం సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాల కోసం ఖాతాలను ఓపెన్ చేయడానికి కూడా పాన్ కార్డు అవసరం.
పిల్లల కోసం పాన్ కార్డుకు అప్లై చేయాలనుకునేవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అప్లై చేయడానికి తల్లిదండ్రుల చిరునామా, గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటరు ఐడీ వంటివి అవసరమవుతాయి.
ఆన్‌లైన్‌లో అప్లై చేయడం..
➤ముందుగా అధికారిక 'నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ లిమిటెడ్' (NSDL) వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
➤అప్లికేషన్ ఫారమ్‌లో 'న్యూ పాన్ - ఇండియన్ సిటిజన్ (ఫారం 49ఏ)', 'వ్యక్తిగతం' అనే వర్గాన్ని ఎంచుకోవాలి.
➤అప్లికేషన్ వివరాల విభాగంలో అవసరమైన వివరాలను ఫిల్ చేయాలి.
➤మైనర్ ఫోటో & అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
➤డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసిన తరువాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లింపు కొనసాగించాలి. తరువాత 'సమర్పించు' బటన్‌ను క్లిక్ చేయాలి.
➤పైవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక అక్నాలెజ్‌మెంట్ నెంబర్ వస్తుంది. దీని ద్వారా మీ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ధ్రువీకరణ పూర్తయిన తరువాత 15 నుంచి 20 రోజులలోపు మీ చిరునామాకు పాన్ కార్డు డెలివరీ అవుతుంది.
ఇదీ చదవండి: కోట్లు సంపాదించే అవకాశం: నిఖిల్ కామత్ ట్వీట్
ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవడం..
➤అధికారిక NSDL వెబ్‌సైట్ నుంచి ఫారమ్ 49ఏను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
➤సూచనల ప్రకారం అన్ని వివరాలను పూరించండి.
➤సంబంధిత డాక్యుమెంట్స్ కాపీలను, పిల్లల ఫోటోలు రెండు జత చేసి, సమీపంలోని పాన్ సెంటర్‌లో ఫీజు చెల్లించి సమర్పించండి.
➤మీ అప్లికేషన్ సమర్పించిన తరువాత మీకు అక్నాలెజ్‌మెంట్ నెంబర్ ఇస్తారు. దీని ద్వారా అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయవచ్చు. ➤తరువాత మీ చిరునామాలకు 15 నుంచి 20 రోజులలోపు పాన్ కార్డు డెలివరీ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment