Guide
-
వజ్రం మరో వజ్రాన్ని కోస్తుంది!
ఆభరణం చాలా రోజులు బీరువాలో ఉంచితే కొద్దిగా మసకబారినట్లు అనిపిస్తుంది. ఆభరణం ధగధగలాడాలంటే ధరించే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ధరించిన తర్వాత తిరిగి భద్రపరిచేటప్పుడు ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. 👉ఆభరణాన్ని (బంగారు ఆభరణం, వజ్రాల ఆభరణం ఏదైనా) ధరించే ముందు వెల్వెట్ క్లాత్ లేదా మెత్తని నూలు వస్త్రంతో సున్నితంగా తుడవాలి. 👉దుమ్ము పట్టేసినట్లనిపిస్తే వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇది చాలా అరుదుగా మాత్రమే చేయాలి. ఓపెన్ సెట్టింగ్ వజ్రాల ఆభరణాన్ని వేడి నీటిలో ఒకసారి ముంచి తీసి వెంటనే టిష్యూ పేపర్‌తో తేమ వదిలే వరకు సున్నితంగా తుడవాలి. ఇది ఇతర రంగు రాళ్లేవే లేకుండా అన్నీ వజ్రాలే ఉన్న ఆభరణానికి మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాళ్లు పొదిగిన ఆభరణాలను వేడి నీటిలో ముంచరాదు. 👉క్లోజ్డ్ సెట్టింగ్ వజ్రాల ఆభరణాన్ని నీటిలో ముంచకూడదు. నీటిలో ముంచినట్లయితే కొంతనీరు వజ్రానికి బంగారానికి మధ్యలో చేరుతుంది. ఆ నీటిని తొలగించడం కష్టం. మరీ ఎక్కువగా నీరు పట్టినప్పుడు వజ్రాన్ని తీసి మళ్లీ చేయించుకోవడమే మార్గం. కాబట్టి క్లోజ్డ్ సెట్టింగ్ వజ్రాల ఆభరణం మీద పట్టిన దుమ్మును వదిలించాలంటే టిష్యూ పేపర్ లేదా వెల్వెట్ క్లాత్‌తో తుడవాలి. అంతేకాదు, ఆభరణాలను తరచూ నీటితో శుభ్రం చేస్తుంటే బంగారం కరిగిపోతుంది. 👉ఏ ఆభరణాన్నయినా (పూర్తి బంగారు ఆభరణాలు, రాళ్లు పొదిగిన ఆభరణాలు, వజ్రాల ఆభరణాలు) తెల్లటి ప్లాస్టిక్ బాక్సుల్లోనే పెట్టాలి. 👉 వెల్వెట్ క్లాత్కి రంగును వదిలే స్వభావం ఉంటుంది. దీర్ఘకాలం వెల్వెట్ క్లాత్ మధ్య ఉంచితే వెల్వెట్ క్లాత్ రంగు ప్రభావం ఆభరణం మీద పడుతుంది. 👉వజ్రాల ఆభరణాలు ఒక బాక్సులో ఒక్కటి మాత్రమే ఉండాలి. వజ్రం గట్టిగా ఉంటుంది. కోసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఒక స్టోన్ కారణంగా మరొక స్టోన్ కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. -
కూరగాయల షాపింగ్ గైడ్!
కూరగాయాలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కి వెళ్లిన ప్రతిసారి పాడయినవే పొరపాటున కొనేస్తాం. ఎన్నాళ్లు కొన్నా కూడా ఏదో ఓ కూరగాయ వద్ద అంచనా తప్పి మంచివి కొనలేకపోతుంటాం. అలాంటప్పుడూ ఎలాంటి కూరగాయాలు కొంటే మంచిది అనేది ఎవరైనా పెద్దవాళ్ల సలహాతో ప్రయత్నించి చూస్తాం కదా..!. చాలామంది అందుకు ఓ కచ్చితమైన గైడ్ ఉంటే బాగుండును అని ఫీలవుతుంటారు. ప్రస్తుతం అలాంటి సలహాలు సూచనలతో కూడిన కూరగాయల షాపింగ్ గైడ్ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మార్కెట్లో కూరగాయాలను కొనేముందు ఇలాంటి సూచనలు, సలహాలు పాటించండి అంటూ ఓ కూరగాయల షాపింగ్ గైడ్ నెటింట తెగ హల్చల్ చేస్తోంది. అందులో టమోటాలు పసుపు ఎరుపు రంగులో కాస్త ఓ మోస్తారు పచ్చిగా ఉన్నవి తీసుకుంటే ఎక్కువకాలం వాడుకోవచ్చు. రంధ్రాలు పడిన టమోటాలు ఎట్టిపరిస్థితుల్లో కొనుగోలు చెయ్యొద్దు. బంగాళదుంపలు గట్టిగా ఉంటేనే తీసుకోవాలి. కాస్త మెత్తగా ఎక్కడైన తగిలితే దాన్ని ఎంపిక చేసుకోకూడదు. అలాగే మెంతి ఆకులు తాజాగా కనిపిస్తేనే కొనాలి. అలాగే బచ్చలి, ఉల్లపాయలు, పచ్చిమిర్చి వంటివి.. ఎలాంటి కొంటే మంచిది అనేది.. ఆ గైడ్లో చాలా విపులంగా వివరించి ఉంది. ఓ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ తన భార్య స్వయంగా చేతులతో రాసిన.. ఎలాంటి కూరగాయలు కొనాలనే షాపింగ్ గైడ్‌ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. తాను కూరగాయల కోసం మార్కెట్‌కి వెళ్తున్నపుడు ఉపయోగ పడుతుందంటూ.. ఈ చీటి తన చేతిలో పెట్టినట్లు చెప్పుకొచ్చారు. నెటిజన్లు వావ్ కూరగాయలు కొనుగోలు మార్గదర్శిని అంటూ అతడి భార్యపై ప్రశంసలు కురిపించారు. అలాగే పండ్ల గైడ్ కడా ఇస్తే బాగండు అంటూ పోస్టులు పెట్టారు. కొత్తగా మార్కెట్లో కూరగాయలు కొనేవాళ్లకు ఈ గైడ్ చక్కగా ఉపయోగపడుతుంది కదూ..!.While going for market for vegetables my wife shared with me this👇 stating that you can use this as a guide 🤔🤔😃 pic.twitter.com/aJv40GC6Vj— Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) September 13, 2024 (చదవండి: ఎముకలు కొరికే చలి! ఆ ఫీల్ కావలంటే ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!) -
13 రోజుల్లో.. మూడుసార్లు ఆమె ఎవరెస్ట్‌ను జయించింది!
పదమూడు రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచంలోనే మొదటి మహిళగా పూర్ణిమా శ్రేష్ట గుర్తింపు పొందింది. నేపాల్‌లో వృత్తి రీత్యా ఫొటో జర్నలిస్ట్ అయిన 33 ఏళ్ల పూర్ణిమ, సాటి మహిళలను ప్రోత్సహించడానికి సవాళ్లనే సోపానాలుగా చేసుకుంటున్నాను అంటోంది.‘ప్రపంచంలో ఒకే సీజన్లో ఎవరెస్ట్ శిఖరాన్ని మూడుసార్లు అధిరోహించిన మొదటి మహిళగా గుర్తింపు రావడం ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. పర్వతారోహణలో పాల్గొంటున్న మహిళలను ఇప్పటికీ వేళ్లమీద లెక్కించవచ్చు. వారికి ఆసక్తి ఉంటుంది. కానీ, భయంతో వెనకంజ వేస్తుంటారు.ఇప్పుడు చాలామంది యువతులు పర్వతారోహణ గురించి నన్ను కలుస్తుంటారు. వారిలో ప్రభావంతమైన మార్పును తీసుకు రాగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది. రాబోయే రెండేళ్లలో 14 మంది మహిళలను ఎవరెస్ట్ అధిరోహణకు తీసుకెళ్లగలనని నమ్మకం ఉంది.మూస పద్ధతికి స్వస్తి...ఎప్పుడూ ఒక విధమైన జీవనంలో మూసపద్ధతిలో కొనసాగడం నాకు ఇష్టం ఉండదు. అలాగని నేనేమీ సంపన్నుల ఇంట్లో పుట్టలేదు. మా అమ్మానాన్నలు నేపాల్‌లోని గోర్ఖా ప్రాంతంలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న రైతులు. నా చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ నీటి కొరత ఉండేది. రాగిబిందెతో కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు మోసుకొచ్చేదాన్ని. ఆ కష్టం నాలో సవాళ్లకు మార్గం చూపింది. ఇప్పటివరకు ఎనిమిది శిఖరాలను అధిరోహించాను. నా సవాళ్ల సాధన కోసం నా స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుండి డబ్బు తీసుకున్నాను. గైడింగ్ కంపెనీ నుండి కొంత లోన్ తీసుకున్నాను. తిరిగి ఈ అప్పు తీర్చడానికి మౌంటనీయర్ గైడ్‌గా చేయాలనుకుంటున్నాను. రికార్డ్ సాధించి, పర్వతారోహణలో మహిళలు పాల్గొనడానికి ఉన్న అడ్డంకులను తొలగించాలన్నది నా లక్ష్యం. చాలామంది అడ్డు చెప్పారు. కానీ, 8,000 కిలోమీటర్ల రికార్డ్‌ను సాధించాను. ‘ఒక సాధారణ అమ్మాయి రికార్డ్ బ్రేక్ చేసింది’ అనే మాటలు విన్నప్పుడు, ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. అలసట కలిగినా..ఈ వసంత కాలంలో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు సులువుగానే అధిరోహించాను. తర్వాత మూడవసారి కొంచెం అలసటతో కిందటి నెల 25వ తేదీని అధిరోహణ ప్రారంభమైంది. నా గైడ్, నేను ఈ అధిరోహణకు బయల్దేరాం. అలసటతో నా అడుగులు భారంగా అనిపించాయి. శిఖరాగ్రానికి చేరుకోవడానికి మధ్యలోనే అలసటతో కొంతసేపు నిద్రలోకి జారుకున్నాను.నిద్రలేపడానికి గైడ్ నా ముఖంపైకి మంచుగడ్డలను విసరాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో త్వరగానే తేరుకున్నాను. ఒక్కో అడుగు వేయడంపై దృష్టి పెట్టి మధ్యాహ్నం ఒంటి గంటకు శిఖరాగ్రానికి చేరుకుని రికార్డ్ సృష్టించాను. దాదాపు ఒక గంటపాటు పై భాగంలోనే ఉన్నాం. నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను. కలల సాధనకు కృషిస్కూల్ చదువు పూర్తయ్యాక ఫొటో జర్నలిజం చేశాను. 2017లో ఎవరెస్ట్ మారథాన్ కవర్ చేసే ఫొటోగ్రఫీ అసైన్మెంట్ సమయంలో పర్వతారోహణ ప్రపంచానికి పరిచయం అయ్యాను. పర్వతాలను కలుసుకోవడానికి అంత సమయం పట్టిందే అని చాలా బాధపడ్డాను. శిఖరపు అంచున నిలబడి, అక్కడినుంచి ప్రపంచాన్ని చూడటంలోని కష్టాన్ని అర్ధం చేసుకోవాలనుకున్నాను. చాలా మంది స్త్రీలు ఇంటిపని కోసం మాత్రమే పుట్టారని అనుకుంటారు. గ్రామాల్లో చాలామంది అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేస్తుంటారు.పెళ్ళే జీవనసాఫల్యంగా ఉంటారు. ఆ తర్వాత వెంటనే మాతృత్వం. ఇంటిపనులతో జీవితం. ఇలా ఉండకూడదు నా జీవనం అనుకున్నాను. 2018లో నా పర్వతారోహణ ప్రక్రియను ప్రారంభించాను. 2022లో కాంచన్ జంగా, లోత్సే, మకాలును అధిరోహించాను. అదే నెలలో అతి తక్కువ రోజుల్లో మూడుసార్లు ఎవరెస్ట్‌ను అధిరోహించగలననే నమ్మకం కలిగింది. ఎవరెస్ట్ పైనుంచి కొత్తగా లేదా గొప్ప పనిచేస్తే ప్రజలు ముఖ్యంగా మహిళల్లో మార్పు వస్తుంది అనుకున్నాను. వాళ్లు కూడా తమ పట్ల శ్రద్ధ వహిస్తారని నా నమ్మకం.ప్రజలలో మహిళల పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చడమే నా ఉద్దేశ్యం. తమ సామర్థ్యాలను విశ్వసించ లేనివారు కలలను సాకారం చేసుకోలేరు.. మనం ఏం సాధించాలని అనుకుంటున్నామో దానిని మనలోనే అన్వేషించాలి. అప్పుడు మనలోని అంకితభావం, ధైర్యంతో ముందడుగు వేస్తే ఆ ఆశయమే అత్యున్నత శిఖరాలను చేర్చుతుంది’’ అని వివరించే పూర్ణిమ మాటలు యువతకు స్ఫూర్తిని కలిగిస్తాయి. -
వద్దమ్మా.. తప్పూ!
ఈ మధ్య ‘గైడింగ్ హ్యాండ్స్’ అంటూ ఒక వీడియో వచ్చింది. అది వెక్కిరింత వీడియో. ఫోన్ చూసుకుంటూ తల ఎల్లవేళలా కిందకు దించి ఉండేవారిని చేయి పట్టి చేరవలసిన చోటుకు చేర్చే‘సహాయక చేతులను’ భవిష్యత్తులో ఉపాధిగా చేసుకోవచ్చని అందులో చూపుతారు. అంటే అంధులను చేయి పట్టి నడిపించేవారికి మల్లే ఈ ఫోన్ బానిసలను చేయి పట్టి నడిపించి చార్జ్ తీసుకునే వ్యక్తులు భవిష్యత్తులో వస్తారన్న మాట. మనం ఫోన్‌కు శ్రుతి మించి ఎడిక్ట్ అయ్యామని చెప్పేందుకు ఈ వీడియో చేశారు. బండి మీద వెళుతూ ఫోన్ మాట్లాడితే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. కొందరు హెల్మెట్‌లో దూర్చి మరీ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం బారిన పడతారు. మరికొందరు హెడ్‌ఫోన్స్‌తో మాట్లాడుతూ వెనకొచ్చే వాహనాల హారన్ వినక ప్రమాదంలో పడుతున్నారు. మొన్నటి మార్చి 26న బెంగళూరు విద్యారణ్యపురలో ఒక మహిళ ఇలా ఫోన్ బిగించి కట్టి మాట్లాడుతూ ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది. అతను షూట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అందరూ ఇలా చేయడం ప్రమాదం అన్నారు. ఈ ఎండల్లో ఫోన్ వేడెక్కి పేలినా ప్రమాదమే అని మరికొందరు హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. చివరకు వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. బండి నంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి యలహంక ట్రాఫిక్ స్టేషన్ వారు 5 వేల రూపాయల ఫైన్ వేశారు. అవసరమా ఇదంతా? -
తలకు షాంపూ.. ఇలా ఐతే మంచిది!
ఆధునిక జీవనశైలి, వాతావరణ కాలుష్యం, అనారోగ్యకరమైన ఆహారాల వల్ల చాలా మందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తున్నాయి. కొంతమందికి జుట్టు తొందరగా జిడ్డుపట్టే తత్త్వం ఉంటుంది. వీటినుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వాడుతున్నారు. వీటిని వాడడం వల్ల మంచి ఫలితాల మాట ఎలా ఉన్నా, కొన్ని రోజుల తర్వాత జుట్టు చెడిపోతుంది. అయితే షాంపూ చేయడానికి ముందు కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. తలకు నూనె పట్టించడం షాంపూ చేయడానికి ముందు జుట్టుకు తప్పకుండా నూనెను అప్లై చేయాలి. తలకు నూనెను పట్టించిన రెండు గంటల తర్వాత జుట్టును శుభ్రం చేయడం మంచిది. తల దువ్వుకోవడం షాంపూ చేయడానికి ముందు జుట్టును బాగా దువ్వాలి. దువ్విన తర్వాత షాంపూను అప్లై చేయడం వల్ల జుట్టు చిట్లకుండా ఉంటుంది. జుట్టు రాలడం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. సల్ఫేట్ రహిత షాంపూలు సో బెటర్ ప్రస్తుతం చాలా మంది బాగా గాఢంగా ఉండే రసాయనాలతో కూడిన షాంపూలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా మైల్డ్‌గా.. సల్ఫేట్ రహితంగా ఉండే షాంపూలను వినియోగించడం మంచిది. తలకు చన్నీరే మంచిది జుట్టు సమస్యలతో బాధపడేవారు తలస్నానం చేసే సమయంలో చల్లని లేదా గోరువెచ్చటి నీటితో మాత్రమే చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టు మొదళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. అంతేకాకుండా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. (చదవండి: అగ్గిపుల్లతో ఇలా చేస్తే..మొక్కలు పూలతో కళకళలాడతాయి!) -
నోటిమాట నిప్పుతో సమానం
మనకు ప్రధానంగా మూడు ఉపకరణాలుంటాయి–శరీరం, మనస్సు, వాక్కు. శరీరం అన్నం చేత తయారవుతుంది. సూక్ష్మ శరీరమైన, సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సు కూడా అన్నం వలననే తయారవుతుంది. ఇది ప్రాణం అత్యంత ప్రధానమైనది. ఎంతకాలం ప్రాణం లోపల తిరుగుతుంటుందో అంతకాలమే ఈ శరీరానికి పూజనీయత. ఎంతకాలం వాయువు బయటికెళ్ళి లోపలకు వస్తుంటుందో అంతకాలం మాత్రమే ‘బాగున్నారా !’, ‘బాగున్నారా!’ అని అని కుశల ప్రశ్నలు వేస్తుంటారు. లోపలికి వెళ్ళిన వాయువు బయటికి వెళ్ళకపోయినా, బయటికి వెళ్ళిన వాయువు లోపలికి పీల్చబడకపోయినా .. అక్కడితో దాని మంగళప్రదత్వం పోతుంది. అది ఇక శివం కాదు, శవం. అటువంటి ప్రాణాన్ని పోషించగలిగేది నీరు. ప్రాణులను అన్నింటినీ కూడా పోషించగలిగిన శక్తి నీటికి ఉంటుంది. అందుకే ‘అమృతం వా ఆపః’ అంటారు. నీరు అమృతంగా చెప్పబడింది. పరమేశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు పంచామృతాభిషేకం అంటారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మంచినీరు.. ఇవి పంచామృతాలు. నీళ్ళు ముఖాన చిలకరిస్తే... స్పృహæతప్పిపోయినవాడికి కూడా స్పృహ, ప్రాణాలు వస్తాయి. అంటే ప్రాణాలను తిరిగి యథాస్థానంలో నిలబెట్టగలిగిన శక్తి నీటికి ఉంది. చిట్టచివరిది వాక్కు. ఈ వాక్కు.. స్వరపేటిక పేరిట భగవంతుడిచ్చిన మహత్తరమైన కానుక. దీనిని ఆధారం చేసుకుని మనిషి తాను తరించిపోవచ్చు... ఇతరుల అజ్ఞానం పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. కలియుగంలో భగవంతుని నామాన్ని పలకడంకన్నా గొప్పది మరొకటి లేదు. అది భగవంతుడిని ఉద్దేశించే పలికింది కాకపోవచ్చు. ‘బిడ్డపేరుపెట్టి పిలిచిననైన విశ్రామకేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయనతలుప కలుషహరము’ అంటారు... భాగవతంలో. బిడ్డను దేముడి పేర్లలో ఒకటిపెట్టి పిలిచినప్పటికీ... పిలిచింది బిడ్డనే అయినా... భగవంతుడి నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి పాపరాశి ధ్వంసమవుతుంది... అన్నారు. విశ్రామకేళినైన... ఆడుకునే సమయంలో ఇరుపక్షాలూ ఒకరు రాముడి పక్షమనీ, మరొకరు కృష్ణుడి పక్షమంటూ అలా పేర్లుపెట్టుకుని ఆడుకుంటూ ఆ పేర్లను ఉచ్చరించినా చాలట. పద్యమో, గద్యమో, గీతమో... ఏదయినా కావచ్చు... అది భగవంతుని నామంతో కూడుకున్నదయితే చాలు అది కలుషహరము.. కలుషాలను అన్నింటినీ పోగొట్టగలిగిన శక్తిని పొంది ఉంటుంది. అలా తనకు తాను తరించడానికే కాదు.. ఇతరుల అజ్ఞానమనే చీకటిని దహించివేయడానికి కూడా వాక్కు ఉపకరిస్తుంది ... ఎలా? వాక్కు అగ్నిహోత్రంతో సమానమైనది. అగ్నిహోత్రానికి ఉన్న లక్షణం అవతలి వస్తువును దహించి వేస్తుంది. అలాగే వాక్కుకు ఉన్న లక్షణం అవతలివారి అజ్ఞానాన్ని తొలగించేస్తుంది. తెలియని విషయం అది తెలిసినవారి దగ్గర విన్నప్పుడు.. ‘నాకు తెలియదు’ అన్న తెలియనితనం పోతుంది. అంత గొప్ప వాక్కు మహాత్ములయినవారి నోటివెంట వచ్చినప్పుడు దేశకాలాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అది వ్యక్తి ఉద్ధరణకు, సమాజ ఉద్ధరణకు కారణమయి ఉంటుంది. వారు దేశికులై ... అంటే మార్గనిర్దేశకులై మనం ఎటువైపు ప్రయాణం చేయాలో దిశానిర్దేశనం చేస్తుంటారు. (సశేషం). బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బాహుబలి సీన్ రిపీట్.. ఏనుగును ఆపడానికి..
ఒక జంతు సందర్శనశాలలో ఏనుగులను చూడటానికి వచ్చిన పర్యాటకులకు షాకింగ్ సంఘటన ఎదురైంది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భారీ గజరాజు ఒక్కసారిగా తమవైపు దూసుకొచ్చింది. అంతలో మావటివాడు సైగ చేయడంతో ఆగిపోయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఔరా అంటున్నారు. ఫారెస్ట్ సఫారీలో భాగంగా ఏనుగులను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు ఏనుగులను చూపిస్తూ వాటి గురించి వివరిస్తున్న మావటి వాడిని చూసి ఏనుగు ఘీంకరించి తనవైపు దాడి చేయడానికి వేగంగా పరుగు తీసింది. మొదట పరధ్యానంగా ఉన్న మావటి వాడు తర్వాత స్పందించి అలా చేతిని పైకెత్తాడు. అంతే మదమెక్కిన ఆ ఏనుగు సైతం అలా ఉన్నచోటనే నిలిచిపోయింది. అతనింకా చేయ దించక ముందే ఆ ఏనుగు వెనక్కి అడుగులు వేసుకుంటూ తోక ముడిచింది. ఈ సన్నివేశం ఇపుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అచ్చం బాహుబలిలో ప్రభాస్ మదపుటేనుగుని నియంత్రించిన సీన్ చూసినట్టే ఉందని కామెంట్లు కూడా చేస్తున్నారు నెటిజన్లు. Safari guide stopping a charging elephant with his hand. pic.twitter.com/U6f85rWYZD — Figen (@TheFigen_) June 29, 2023 ఇది కూడా చదవండి: మూగజీవి సమయస్ఫూర్తి.. మనిషిని ఎలా సాయమడిగిందో చూడండి.. -
ఓయూలో పీహెచ్డీ పర్యవేక్షణకు ప్రొఫెసర్ల కొరత
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పర్యవేక్షణకు (గైడ్) ప్రొఫెసర్ల తీవ్ర కొరత నెలకొంది. గత 10 సంవత్సరాలుగా నియామకాలు చేపట్టకపోవడంతో అధ్యాపకుల సంఖ్య 1254 నుంచి 362కు తగ్గింది. తాత్కాలికంగా అధ్యాపకులను నియమించి బోధనను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్ కాలేజీలతో పాటు అనుబంధ కాలేజీల్లో 362 మంది పర్మనెంట్ అధ్యాపకులు పని చేస్తున్నారు. ఓయూ పరిధిలోని ఐదు జిల్లాల పీజీ కేంద్రాలను కాంట్రాక్టు అధ్యాపకులతోనే నిర్వహిస్తున్నారు. ఓయూలో కాంట్రాక్టు 430, పార్టుటైం అధ్యాపకులు 260 మంది పని చేస్తున్నారు. కాంట్రాక్టు, పార్టుటైం అధ్యాపకులతో పాటు సుమారు 200 మంది పర్మనెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ గైడ్షిప్ అర్హత లేదు. గైడ్షిప్ గల 162 మంది పర్మనెంట్ అధ్యాపకుల వద్ద గతంలో ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్‌డీలో కొనసాగుతుండగా కొత్త వారికి అవకాశం దక్కడం లేదు. ఆరేళ్ల తర్వాత.. ఓయూలో ఆరు సంవత్సరాల తర్వత పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఆరేళ్లలో ఓయూనే పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 50 వేలకు పైగా ఉండగా ఇతర వర్సిటీలకు చెందిన వారు మరో 15 వేల మంది ఉన్నారు. గతంలో ఓయూలో 1254 పర్మనెంట్ అధ్యాపకులు పనిచేయగా వారిలో సగం మందికి పీహెచ్డీ గైడ్షిప్ అర్హత ఉండేది. ఒక్క అధ్యాపకుని వద్ద 8 మంది విద్యార్థులకు పరిశోధనలకు అవకాశం కల్పిస్తారు. దీంతో ఏటా పార్ట్‌టైం, ఫుల్‌టైం పీహెచ్‌డీలో సుమారు 4 వేల మందికి ప్రవేశాలు లభించేవి. అయితే అధ్యాపకుల కొరత కారణంగా ప్రస్తుతం వేయి మందికి కూడా పీహెచ్డీ అవకాశం దక్కేలా లేదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్డీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ తర్వాత కొత్త వారిని నియమించకపోవడంతో బోధనకు, పరిశోధనకు కొరత ఏర్పడింది. 105 ఏళ్ల ఓయూ చరిత్రలో తొలిసారిగా ఈ విద్య సంవత్సరం నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ కోర్సులకు అనుమతినిచ్చారు. ఓయూ పరిధిలోని దరఖాస్తు చేసుకున్న 15 అటానమస్ కాలేజీల్లో పని చేసే అర్హత గల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశాలను కల్పించారు. ఓయూలో పని చేసే పార్టుటైం, కాంట్రాక్టు అధ్యాపకులు బోధనకే పరిమితం. రెండేళ్ల క్రితం వరకు అర్హత గల కాంట్రాక్టు అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ అవకాశం ఉండేది. అయితే వివిధ కారణాల నేపథ్యంలో వారికి గైడ్షిప్ను రద్దు చేశారు. (క్లిక్: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్!) పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కొనసాగించాలి ఓయూలో పాత పద్దతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలి. కొత్త పద్ధతిలో అడ్మిషన్లకు పీహెచ్డీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కొత్త విధానంలో అడ్మిషన్లతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, యూజీసీ నెట్, జేఆర్ఎఫ్ సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. వీసీ ప్రొ.రవీందర్ సొంత నిర్ణయాలు పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తాయి. కాకతీయ వర్సిటీ తరహాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేసే అర్హత గల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు గైడ్షిప్ ఇవ్వాలి. కొత్త విధానంతో పీహెచ్డీ ప్రవేశాలను చేపడితే అడ్డుకుంటాం. – కొర్ర శరత్‌నాయక్ పరిశోధనలు కుంటుపడతాయి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ చదివితే హాస్టల్ వసతి, ఫెలోషిప్‌లకు అవకాశం ఉండదు. సంపాదించే వయస్సులో పీహెచ్డీ చేయడమే ఎక్కువ.. పరిశోధనలకు రూ.లక్షలు ఖర్చు చేయాలంటే పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక భారం అవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల విద్యార్థులకు సొంతంగా ఖర్చుపెట్టుకుని పీహెచ్డీ చదివే ఆర్థిక స్థోమత ఉండదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్డీ అనుమతితో అధిక శాతం మంది పరిశోధనలు చేయలేరు. దీంతో పరిశోధనలు కుంటుపడతాయి. ఓయూలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో అర్హత గల వారికి గైడ్షిప్కు అవకాశం కల్పించాలి లేదా ఖాళీగా ఉన్న అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయాలి. – బైరు నాగరాజుగౌడ్ ఓయూ విద్యార్థులపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని ఆందోళన చేస్తున్న ఓయూ జేఏసీ నాయకులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. బుధవారం ఓయూ పాలన భవనం ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు వీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై టాస్క్‌ఫోర్స్ పోటీసులు విరుచుకుపడ్డారు. విద్యార్థులపై దాడి చేసి వారిని చెల్లాచెదురు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిలో నవ తెలంగాణ విద్యార్థి సంఘం (ఎన్టీవీఎస్) రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజుగౌడ్ సృహ తప్పి పడిపోగా అతడిని ఆసుపత్రికి తరలించారు. ధర్నాలో పాల్గొన్న 27 మంది విద్యార్థులను అరెస్ట్ చేసి మలక్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడిని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. కొత్త విధానంతో విద్యార్థులు నష్టపోతారని పాత పద్ధతిలోనే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. (క్లిక్: హైదరాబాద్ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ) -
అమ్మ కోసం.. లక్షకుపైగా జీతం వస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి!
సాక్షి, తిరుపతి: కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ దక్షిణామూర్తి క్రిష్ణకుమార్ అమ్మ కోసం రూ.లక్షకు పైగా జీతం వస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి.. ఓ యాత్రికుడిగా మారాడు. అమ్మకు గైడ్‌గా మారాడు. తల్లి చిన్నప్పటి నుంచి చూడాలని తపించిన దేశంలోని పుణ్య క్షేత్రాలన్నింటినీ స్వయంగా ఓ స్కూటర్‌పైనే తిప్పుతూ చూపిస్తున్నాడు. 2018లో ఈ యాత్రను మొదలుపెట్టారు. మధ్యలో 2020లో కోవిడ్ రావడంతో కొంతకాలం విరామం ఇచ్చారు. మళ్లీ ఆర్నెల్ల నుంచి యాత్రను మొదలుపెట్టి ఇప్పుడు తిరుమల తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకునేందుకు.. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. తండ్రి జ్ఞాపకంగా మిగుల్చుకున్న పాత బజాజ్ చేతక్ స్కూటర్‌పై 2018 జనవరి 16వ తేదీన భారతదేశ పుణ్యక్షేత్రాల సందర్శనకు శ్రీకారం చుట్టానన్నారు. ఇప్పటికి దాదాపు 57 వేల కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసుకున్నామని వివరించారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కోల్‌కతా, అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలు సందర్శించామని చెప్పారు. శక్తి ఉన్నంత కాలం.. భగవంతుడు తమకు అవకాశం ఇచ్చినంత కాలం ఈ యాత్ర కొనసాగిస్తామని దక్షిణామూర్తి తెలిపారు. చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల టికెట్లు ఎప్పుడంటే..) -
నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతా వందనాలు
నీ గుండె నా లేత పాదాలకు పరిచిన తొలి మెత్తటి రహదారి... నీ చిటికెన వేలు నా చిట్టి గుండెకు దొరికిన తొలి దిలాసా... నీ వీపు నేనధిరోహించిన తొలి ఐరావతం... నా మూడు చక్రాల బండితో పరుగెత్తి నిను ఓడించినదే నేను గెలిచిన తొలి రేస్... నీ కావలింత నా కన్నీళ్లకు స్టాప్బటన్... నువ్వే నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. నాన్నా... నా గురించి తప్ప నీ గురించిన చింత నీకు లేదు. ఏడ్పించే లోకాన్ని గుమ్మం బయటే వదిలి గడపలో విజేతగా నా కోసం అడుగుపెడతావు. నువ్వే కదా నా ఫస్ట్ సూపర్‌స్టార్. నాన్నా... గుర్తుకొస్తున్నావు. నాన్నా... నిను చూడాలని ఉంది. నాన్నా... నీ పాదాలు తాకి నీతో కాసేపు కబుర్లు చెప్పాలని ఉంది. నాన్నా... నీ గొప్పతనం గురించి గొంతు పెగుల్చుకుని నాలుగు ముక్కలు మాట్లాడాలని ఉంది. నాన్నా... నను కన్నందుకు కృతజ్ఞతావందనాలు. నాన్నా... నేను పుట్టినప్పుడు నువ్వు పడ్డ ఆరాటం గురించి అమ్మ చాలాసార్లు చెప్పింది. ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌ను తోడు పిలుచుకున్నావట. సులభంగా కాన్పు జరుగుతుందన్నా సిజేరియన్ అవసరం అవుతుందేమోని తెగ అప్పు చేసి డబ్బు పెట్టుకున్నావట. తొలికాన్పు మా బాధ్యత నాయనా అని తాతయ్య చెప్పినా, కాదు... నాకు పాప పుట్టినా బాబు పుట్టినా నా రెక్కల కష్టంతోటే భూమ్మీదకు రావాలని పుట్టింటికి పంపకుండా వాళ్లనే అమ్మ దగ్గరకు రప్పించావట. నాన్నా... ఆ కంగారులో నువ్వేం చేశావో తెలుసా. మార్చి నెల ఎండల్లో నేను పుడితే ఆ వెంటనే బజారుకు వెళ్లి ఉన్ని టవలు, ఉన్ని స్వెటరు తీసుకొచ్చావ్. అందరూ భలే నవ్వారటలే. అవి ఇంకా నా దగ్గర ఉన్నాయి. నీ లీలలు ఇంకా విన్నాను. నాకు టీకాలు వేస్తే నువ్వు ఏడ్చేవాడివట. జ్వరం వస్తే అమ్మను అస్సలు నమ్మకుండా సిరప్‌ను నువ్వే కొలత పెట్టి తాపించేవాడివట. ‘నువ్వు పడుకో’ అని అమ్మకు చెప్పి రాత్రంతా మేలుకునేవాడివట. ‘దొంగముఖమా... అన్నీ ఆయన చేత చేయించుకుని మాటలు వచ్చిన వెంటనే మొదటిమాటగా నాన్నా అనే పిలిచావు’ అని అమ్మ ఇప్పటికీ భలే ఉడుక్కుంటుందిలే. అమెరికాలో ఉన్నా కదా. నువ్వు ఊళ్లో ఉన్నావు. అందుకే నువ్వు ఉన్నట్టుగానే ‘నాన్నా’ అని చిన్నప్పుడు పిలిచినట్టు పిలుస్తుంటాను. నీ మనవడు పరిగెత్తుకొని వస్తాడు.. అచ్చు నీ పోలికలతో. నాన్నా... నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు నిజంగా తెలుసా. ఈ కూతురు ఎప్పుడూ నాన్న కూతురే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా. నాన్నా... ఐదో క్లాసులో మొదటిసారి నువ్వు నా మీద కోప్పడ్డావు. యూనిట్ టెస్ట్‌లో మార్కులు సరిగా రాలేదని ‘ఏంట్రా ఈ మార్కులు’ అన్నావ్. నాలుగు దెబ్బలు వేసినా బాగుండేది. కాని నేను గెలిచి డబ్బాలో దాచిన గోలీలన్నీ విసురుగా లాక్కుని బయటకెళ్లిపోయావ్. ఏడ్చి ఏడ్చి నిద్రపోయాను. తెల్లారి అమ్మను అడిగితే ‘ఆ గోలీలన్నీ మీ నాన్న పారేసి వచ్చాడు’ అని చెప్పింది. మళ్లీ ఏడ్చాను. వాటిలో గోధుమ రంగు గోలీలంటే నాకు ఇష్టం. నీతో నేను మాట్లాడలేదు. అలిగాను. నువు పలకరించినా ముఖం తిప్పుకున్నాను. నన్ను తిడతావా అని నీ మీద కోపంతో చదివాను. రోజూ ఎక్కువ ఎక్కువ చదువుతుంటే నువ్వు చాల్లే పడుకో అన్నా వినలేదు. వారం తర్వాత నువ్వు ఒకరోజు ఆఫీసు నుంచి తొందరగా వచ్చావ్. నన్ను సైకిల్ మీద కూచోబెట్టుకుని స్వీట్స్టాల్కు తీసుకెళ్లి గులాబ్ జామూన్ తినిపించావ్. ‘చాలా బాగా చదువుతున్నావ్’ అని ముద్దు పెట్టి పెన్ను కొనిచ్చావ్. ‘ఆడుకో. వద్దనను. కాని చదువును మర్చిపోయి కాదు’ అని ఇంటికి తీసుకు వచ్చావ్. ఆ తర్వాత నువ్వు చేసిన పని ఇవాళ్టికీ తలుచుకుంటా తెలుసా. అటక దగ్గర కుర్చీ వేసుకుని పైన దాచిన నా గోలీల డబ్బా తీసి ఇచ్చావ్. ఆటలో గోలీలతో పాటు చదువులో మార్కులు గెలవడం నేను నేర్చానంటే నీ వల్లే నాన్నా. ఇవాళ ఇంత పెద్ద ఉద్యోగం నీ వల్లే. నా అకౌంట్లో లక్షలు ఉన్నాయి. కాని నీ డబ్బులతో ఇవాళ మళ్లీ గులాబ్ జామూన్ తినాలని ఉంది. బయట కారులో వెయిట్ చేస్తున్నా. షర్ట్ వేసుకుని రా. హ్యాపీ ఫాదర్స్ డే. డాడీ... నేను ఇంటర్లో ఉన్నప్పుడు కాలేజీ నుంచి ఇంటికొస్తుంటే ఎవడో కుర్రాడు ఏదో కాయితం చేతిలో పెట్టి పారిపోయాడు. అదేమిటో కూడా చూడకుండా, వణికిపోయి, ఏడ్చుకుంటూ ఇంటికొస్తే అప్పుడే నువ్వు బయటి నుంచి వచ్చి ముఖం కడుక్కుంటున్నావు. ‘ఏంటమ్మా... ఏంటమ్మా’ అని దగ్గరకు తీసుకున్నావు. అమ్మ కంగారు పడుతుంటే అరిచి కూల్‌గా విషయం తెలుసుకున్నావు. నా చేతిలోని లెటర్ చూసి ‘ఇదా... లవ్ లెటర్’ అన్నావు. ‘కాలేజీల్లో ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. పట్టించుకోకూడదు’ అని ఎంత కూల్‌గా అన్నావో తెలుసా. ఆ తర్వాత ఆ అబ్బాయిని కలిసి ఫ్రెండ్లీగా మాట్లాడావని, ఆ అబ్బాయి సారీ చెప్పాడని నువ్వు చెప్పినప్పుడు పెద్ద రిలీఫ్. అమ్మ నాకు అన్నింటిలో గైడ్ చేస్తున్నా నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పేవాడివి. ఫిజికల్‌గా, మెంటల్‌గా వచ్చే మార్పుల గురించి, ఆపోజిట్ సెక్స్‌ను చూసినప్పుడు వచ్చే అట్రాక్షన్ గురించి, ఎమోషన్స్ గురించి ఎంతో వివరించేవాడివి. మెచ్యూర్డ్ వయసు, చదువు వచ్చే వరకు వీటిని ఫేస్ చేస్తూ తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండాలని చెప్పావ్. మగవారితో ఏమైనా సమస్యలు వస్తే ముందే నీకు చెప్పేంత స్నేహం, చనువు నాకు ఇచ్చావు. నా పెళ్లి నా చాయిస్‌కే వదిలి కేవలం సలహాలు ఇచ్చావు తప్ప బలవంతం చేయలేదు. నువ్వు నా చేతిలో ఎప్పుడూ కంపాస్బాక్స్లా ఉన్నావు డాడీ. ఐ హానెస్టీ›్ల లవ్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే. అబ్బా... నా జీవితంలో చాలా రోజుల పాటు నాదే మార్గమో తెలుసుకోలేదు. కానీ మీకు మాత్రం తెలుసు– మీది మీ కొడుకును సపోర్ట్ చేసే మార్గం అని. ఇంటర్ ఫెయిల్ అయ్యాను. పర్లేదు నేనున్నాగా అన్నారు. బిఎస్సీ చేరి ఒక సంవత్సరం చదివి బి.కామ్‌కు మారేను. పర్లేదు సరే అన్నారు. ఎం.బి.ఏ చేస్తానంటే ఫీజు కట్టారు. కాదు సి.ఏ చేస్తానన్నాను. ఆ ఫీజు వదిలి మళ్లీ దీని ఫీజు కట్టారు. ఒక్కరోజు తిట్టలేదు. కొట్టలేదు. హర్ట్ చేయలేదు. నేను కూడా మీరున్నారన్న ధైర్యంతోనే ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేశాను. ‘నేనున్నాగా’ అనే మీ మాట. ఒక తండ్రి నుంచి పిల్లల మంచి కోసం వచ్చే ఆ మాట పిల్లలకు ఎంత బలం ఇస్తుందో. నేను డిగ్రీ పాసైనప్పుడు నాకు ఇష్టమైన హీరో సినిమా ఊళ్లో ఉందని అమ్మీతో పాటుగా మీరు మొదటిసారి నాతో సినిమాకు వచ్చారు. ‘ఎవర్రా ఆ హీరో’ అని హీరోను మెచ్చుకున్నారు. మొన్న ఆ హీరో నా ఆఫీస్‌కు వచ్చాడు అబ్బా... నాకు ఆడిటర్‌గా ఉంటారా అని. నువ్వే గుర్తుకొచ్చావు. లెక్కా, జమా చూడటంలో నన్ను మించినవాడు లేడు అబ్బా. కానీ నీ ప్రేమ లెక్కా జమాను మాత్రం చూడలేకపోతున్నాను. ఐ లవ్ యూ అబ్బా. నాన్నా... ‘ఒరేయ్.. ఒక చిన్న గదిలో ఉండి మీ నలుగురిని సాకానురా’ అని నువ్వు అనేవాడివి. నాకేం పట్టేది కాదు. నా లోకం నాది. నా చదువు నాది. నువ్వు పాకెట్ మనీ ఇస్తే దానిని దాచుకుని, నా దగ్గర ఉన్నా, నువ్వు ఒక్కోసారి చిల్లర కోసం అవస్థ పడుతుంటే నీకివ్వకుండా చోద్యం చూస్తుండేవాడిని. అంత స్వార్థం నాది. పెళ్లి చేసుకుని మళ్లీ ఇంటి వైపు చూళ్లేదు. అమ్మను, నిన్ను నా దగ్గర నాలుగు రోజులు ఉంచుకోలేదు. నేనే చుట్టపు చూపుగా వచ్చి వెళ్లేవాణ్ణి. నాతో కలిపి నీ నలుగురు పిల్లలు మా వల్ల కాదంటే మా వల్ల కాదంటూ మిమ్మల్ని ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్‌కు పంపారు. ప్రేమ పంచడం మీ బాధ్యత. పొందడం మా హక్కు అన్నట్టు ఉండేవాణ్ణి. కాని ఇంటర్‌కు వచ్చిన నా కొడుక్కి అచ్చు నా పోలిక వచ్చింది నాన్నా. నాకు భయంగా ఉంది. నా కొడుకు నన్ను ఉత్త ఏటిఎం మిషన్లా చూస్తున్నాడు. మీరు మా ఇంటికి వచ్చి, నాతో ఉండిపోయి, నన్ను నిజమైన నాన్నను చేయండి. నేను నిజమైన కొడుకులా మారనివ్వండి. ఈ ఫాదర్స్ డే రోజున ఈ వేడుకోలు ఇదే నాన్నా. -
‘గైడ్’ సినిమాను తలపించే ప్రేమ కథ.. ఫ్రెంచ్ అమ్మాయి మనసు దోచిన బిహారీ
ఢిల్లీ చూడటానికి వచ్చింది పారిస్ నుంచి ఆమె. అతడు గైడ్. అతడు కబుర్లు చెప్పి తిప్పాడు. ఆమె పదే పదే నవ్వింది. ఇద్దరూ ఫోన్ నంబర్లు తీసుకున్నారు. మూడు నెలల తర్వాత ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఆమె అతణ్ణి గైడ్ నుంచి బిజినెస్‌మేన్‌గా మార్చడానికి పారిస్ పిలిపించింది. ఎదిగేలా చేసింది. ఆరేళ్ల తర్వాత ఇదిగో ఇలా బిహార్‌కు వచ్చి మరీ వివాహం చేసుకుంది. ఒక కుతూహలం రేపే రాకుమారి తోటరాముడు కథ. గైడ్ సినిమాలో దేవ్ఆనంద్ కథ. ఈ ప్రేమకథ వింటే పాత తరం వారికి ‘గైడ్’ సినిమా గుర్తుకు వస్తుంది. ఆర్.కె.నారాయణ్ రాసిన నవల ఆధారంగా దేవ్ ఆనంద్, వహీదా రహెమాన్ నటించిన ‘గైడ్’ సినిమాకు ఈ ప్రేమ కథ కొంతమేర పోలి ఉంది. ‘గైడ్’లో ఉదయ్‌పూర్ దగ్గర గైడ్‌గా పని చేస్తున్న దేవ్ ఆనంద్‌ను ఆ ప్రాంతాన్ని చూడటానికి వచ్చిన వహీదా ప్రేమిస్తుంది. ఈ ప్రేమ కథలో కూడా భారత్‌ను చూడటానికి ఫ్రాన్స్ నుంచి వచ్చిన యువతి ఢిల్లీలో గైడ్‌గా పని చేస్తున్న కుర్రాణ్ణి ప్రేమించింది. అయితే మనదేశంలో కొన్నిసార్లు కనిపించే కుల, మత, జాతి అడ్డంకులు ఈ ప్రేమకథలో రాలేదు. ప్రేమ ఫలించింది. మొన్నటి ఆదివారం వీరి పెళ్లి జరగగా నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆరేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం పారిస్ నుంచి మేరీ లోరి హెరెల్ అనే యువతి ఇండియా చూడటానికి ఢిల్లీ వచ్చింది. అక్కడ బిహార్‌లోని బేగుసరాయి జిల్లాకు చెందిన రాకేష్ గైడ్‌గా పని చేస్తున్నాడు. మేరీకి ఢిల్లీ చూపించే బాధ్యత వృత్తిలో భాగంగా అతనిపై పడింది. చురుగ్గా ఉంటూ విసుగు చూపించకుండా నవ్విస్తూ ఢిల్లీలో రెండు మూడు రోజుల పాటు గైడ్‌గా వ్యవహరించిన రాకే మేరీకి నచ్చాడు. నిజానికి పారిస్‌లో మేరీ టెక్స్టైల్ రంగంలో ఉంది. వ్యాపారవేత్త. రాకుమారి కిందే లెక్క. రాకేష్ బేగుసరాయ్‌లో ఒక దిగువ మధ్యతరగతి తల్లిదండ్రులకు పుట్టిన కుర్రవాడు. ఒక దేశం కాదు. ఒక భాష కాదు. ఒక సంస్కృతి కాదు. అయినా సరే ‘మనిషి మంచివాడు... ఈమె హృదయం మంచిది’ అని స్త్రీ, పురుషులకు అనిపించడానికి అవి అడ్డు నిలవలేకపోయాయి. వారు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అసలైన ప్రేమ ఆ తర్వాత మొదలైంది. ఫోన్ ప్రేమ టూరిస్ట్‌లు టూర్ ముగిసిన వెంటనే గైడ్లను మర్చిపోతారు. వారికి చూసిన ప్రాంతాలు గుర్తుంటాయి కాని చూపించిన మనుషులు గుర్తుండరు. కాని భారత్ చూసి పారిస్ వెళ్లిపోయిన మేరీ రాకేష్‌కు తరచూ ఫోన్ చేసేది. రాకేష్ కూడా ఆమెకు ఫోన్ చేసి మాట్లాడేవారు. సరిగ్గా మూడు నెలలు గడిచాక ఇద్దరికీ అర్థమైంది తాము ప్రేమలో ఉన్నామని. ఇద్దరూ ఐ లవ్ యూ చెప్పుకున్నారు. కాని ప్రపంచాన్ని చూసిన మేరీకి రాకేష్ చేస్తున్న ఉద్యోగం, పని భవిష్యత్తులో ముందుకు పోవడానికి సహకరించవని మేరీకి అర్థమైంది. ‘నువు పారిస్ వచ్చి ఏదైనా మంచి పని చేయి’ అంది. ‘నాకు ఎవరు ఇస్తారు పని’ అన్నాడు రాకేష్. ‘నా వ్యాపారంలోనే పార్టనర్‌గా మారు’ అంది మేరీ. అంతే కాదు వీసా, టికెట్ రెండూ పంపింది. మూడేళ్ల క్రితం రాకేష్ పారిస్ వెళ్లాడు. అంతవరకూ మధ్యలో సంవత్సరానికి ఒకటి రెండుసార్లు మేరీ ఇండియా వచ్చి రాకేష్‌ను కలిసి వెళ్లేది. అప్పటికి వారిది ప్రేమే తప్ప పెళ్లి ఆలోచన లేదు. తండ్రి పాదాలకు నమస్కరిస్తున్న నూతన వధువు ప్రేమతో పని చేస్తుంటే పారిస్ వెళ్లిన రాకేష్ మేరీ వ్యాపారంలో పార్టనర్‌గా మారి పని చేయడం మొదలెట్టాడు. ఢిల్లీలో చూసిన రాకేష్‌లో ఏమాత్రం మార్పు లేదని అతను తన పనిని మనసు పెట్టి చేస్తాడని, జీవితం పట్ల, మనుషుల పట్ల అతనికి విశ్వాసం ఉందని మేరీ అర్థం చేసుకుంది. జీవితాంతం అతనితో కలిసి జీవించవచ్చని మరో మూడేళ్లకు ఆమె నిర్థారణ చేసుకుంది ‘మనం పెళ్లి చేసుకుందాం’ అంది. సరే చేసుకుందాం అని రాకేష్ అంటే ‘ఇక్కడ కాదు... ఇండియాలో. మీ పద్ధతిలో. మీ తల్లిదండ్రుల సమక్షంలో’ అని చెప్పింది. రాకేష్ పారిస్ నుంచి తల్లిదండ్రులతో బంధువులతో మాట్లాడారు. ‘నువ్వు చేసుకుంటే మేము అడ్డు చెప్పేదేముంది’ అన్నారు వారు. రాకేష్‌ను మూడేళ్లుగా చూస్తున్నారు కనుక మేరీ తల్లిదండ్రులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పెళ్లి ఖాయమైంది. నవంబర్ 19, ఆదివారం రాత్రి, బేగుసరాయ్‌లో పెళ్లి. వియ్యంకులయ్యారు రాకేష్ తండ్రి రామచంద్ర షా, మేరీ తండ్రి వేస్ హెరెల్ వియ్యంకులయ్యారు. పారిస్ నుంచి తల్లిదండ్రులతో బేగుసరాయ్ వచ్చిన మేరీ వధువుగా మారి రాకేష్‌ను పతిగా పొందింది. దానికి ముందు వియ్యంకులు ‘జప్మాలా’ అనే తంతులో పాల్గొన్నారు. బాలీవుడ్, భోజ్‌పురి పాటలకు నృత్యాలు చేశారు. విదేశీ అమ్మాయిని మన ఊరి కుర్రాడు పెళ్లి చేసుకుంటున్నాడన్న వార్త విని ఊరి జనాలు విరగపడ్డారు. పెళ్లి బాగా జరిగింది. మరి కొన్ని రోజుల్లో ఆ జంట పారిస్‌కు వెళ్లనుంది. కొన్ని ప్రేమకథలు కలతను కలిగిస్తాయి. కొన్ని సంతోషాన్నిస్తాయి. ఈ పెళ్లి వార్త సోషల్ మీడియాలో అందరికీ నచ్చింది. మేరీ, రాకేష్‌లను అందరూ అభినందిస్తున్నారు. ప్రేమ పండించుకున్న అదృష్టవంతులు వీరు. త్వరలో ఇదంతా సినిమాగా వచ్చినా ఆశ్చర్యం లేదు. -
ఈ గైడ్ ఫీజ్ అడగడు
ఈ రోజుల్లో కుర్రాళ్లు సెల్ఫోన్లలో కూరుకుపోయి చాటింగ్‌లలో చతికిలపడుతుంటే పకిడే అరవింద్ మాత్రం తెలంగాణా అంతా చారిత్రక ప్రాంతాలను గాలిస్తూ, వాటి గొప్పతనాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నాడు. పురావస్తు శాఖకు తెలియని విశేషాలు కూడా అరవింద్‌కు తెలుసు అంటే అతిశయోక్తి లేదు. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంzచనపల్లికి చెందిన పకిడే అరవింద్ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్న అరవింద్ హన్మకొండలోని ఏకశిల జూనియర్ కాలేజిలో ఇంటర్ మీడియట్, డిగ్రీ సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జర్నలిజం పూర్తి చేశాడు.అరవింద్‌కు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అందులోనూ చరిత్ర పుస్తకాలంటే ప్రాణం. పుస్తకంలో చదివిన ప్రదేశాలకు వెళ్లి, అక్కడి చరిత్రను స్వయంగా తెలుసుకోవాలని కోరిక. తలిదండ్రులు, ఉపాధ్యాయులు ఇతని కోరికలోని నిజాయితీని గుర్తించి ప్రోత్సహించడం మొదలు పెట్టారు. గూగుల్ మ్యాప్ ద్వారా వివిధ చారిత్రక ప్రదేశాలను గుర్తించి దానిని ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఆరంభించాడు. అంతవరకే అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర లేదేమో, తన పరిశోధనల్లో భాగంగా అరవింద్ ఇటీవల దట్టమైన అడవుల్లో ముళ్లపొదల మధ్య కనుమరుగవుతున్న పురాతన విగ్రహాలను వెలికి తీశాడు. పురావస్తు శాఖ శోధించని అనేక ప్రాంతాలను గుర్తించి వెలుగులోకి తీసుకు వచ్చాడు. అంతేకాదు, వివిధ ప్రదేశాల చారిత్రక అంశాలను డాక్యుమెంటేషన్ చేయడంలో ప్రావీణ్యం సాధించాడు. దాంతో తాను కనుగొన్న వాటిని సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. కాకతీయుల కట్టడాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాడు! పరిశోధనలో భాగంగా అరవింద్ అనేక ప్రాచీన దేవాలయాలు, చెరువులను సందర్శించాడు. విలువైన సమాచారాన్ని సేకరించాడు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంద్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని పలు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చరిత్రను తెలుసుకున్నాడు. చరిత్రను సోషల్‌మీడియా ద్వారా తెలియ చెబుతుండటంతో ఇతర దేశాలకు చెందిన చరిత్ర పరిశోధకులు కూడా రావడం మొదలు పెట్టారు. ఇలా దాదాపు 10 దేశాల నుంచి చరిత్ర పరిశోధకులు వచ్చారు. ఈ క్రమంలో అరవింద్‌కు పలువురు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. తన పరిశోధనలో భాగంగా అరవింద్ సుమారు 750 పురాతనకట్టడాలు, చారిత్రక ప్రదేశాలను గుర్తించాడు. వాటిలో కాకతీయుల కట్టడలు అధికం. వీటిపై గతంలో వెలువడిన పుస్తకాలను సేకరించాడు. వ్యాసాల ద్వారా వచ్చే డబ్బుతో... తనకు తెలిసిన చరిత్రను అందరికి చాటి చెప్పేందుకు ప్రైవేట్ వెబ్సైట్లు, పత్రికలు, సోషల్ మీడియాను వినియోగించుకున్నాడు. ప్రైవేట్ వెబ్సైట్లకు వ్యాసాలు రాయడం ద్వారా వచ్చే డబ్బును కూడా పురాతన కట్టడాలకు వెళ్ళి పరిశీలించడానికి వెచ్చిస్తున్నాడు. ఫోటో ఎగ్జిబిషన్ అరవింద్ సందర్శించిన పురాతన కట్టడాలు, ఆలయాలను ఫోటోల రూపంలో బంధించారు. ఇప్పటివరకు 30 వేల ఫోటోలను తీశాడు. ఆ ఫోటోలలో ఎవరికీ తెలియని కట్టడాలు, దేవాలయాల ఫోటోలను ఎంపిక చేసుకున్నాడు. వాటిని ఇటీవల హైదారాబాద్‌లోని రవీంద్ర భారతిలో అన్‌టోల్డ్ తెలంగాణ పేరుతో ఫోటో ఎగ్జిబిషన్‌ను ఐదు రోజులపాటు నిర్వహించారు. ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఫోటోలతో పాటు దాని చరిత్రను రాసి బుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, వరంగల్ రూరల్ ఫోటోలు: పెద్దపెల్లి వరప్రసాద్ పురాతన కట్టడాలు, దేవాలయాలు ఎక్కడ ఉన్నా వెళ్ళి దాని చరిత్ర తెలుసుకోవడం ఇష్టం. పుస్తకాలలో ఉన్నవే చరిత్ర కాదు, అంతకు మించిన చరిత్ర తెలంగాణ గడ్డపైన ఉంది. ఒక్క కొత్త విషయం తెలుసుకుని ప్రపంచానికి చాటి చెబితే ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. 32 కిలో మీటర్ల గుట్టను సైతం ఎక్కి అక్కడికి వెళ్ళి చరిత్రను తెలుసుకుని వచ్చాను. రెండు సంవత్సరాలు కష్టపడి కాకతీయుల వంశీయులను సైతం కలిశాను. ప్రభుత్వం సాయం చేస్తే నేను మరింత లోతుగా పరిశోధిస్తాను. – అరవింద్, యువ చరిత్రకారుడు -
నమస్తే.. మేం మీకెలా సాయపడగలం!
సాక్షి, హైదరాబాద్: ‘నమస్తే.. ఈ చారిత్రక నగరానికి మీకు స్వాగతం.. నగరంలో మీరు హాయిగా గడిపేందుకు మేం మార్గదర్శనం చేస్తాం. చారిత్రక, పర్యాటక ప్రాంతాల వివరాలు కావాలన్నా, మీ షెడ్యూల్లో స్పష్టత కావాలన్నా మమ్ముల్ని సంప్రదించండి..’పోచంపల్లిలో రూపొందిన వాస్కోటు ధరించిన యువకులు మొహంపై చిరునవ్వుతో విదేశీ అతిథులను ఇలా ‘గైడ్’చేయబోతున్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు వస్తున్న దేశవిదేశీ అతిథుల సేవకు భారీ సైన్యం ఏర్పాటైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యాటక అతిథ్య సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్కు చెందిన 300 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సిద్ధం చేసింది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ సాధారణంగా పెద్ద ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో పాల్గొనే వారికి టూర్ గైడ్లుగా వాలంటీర్లను సిద్ధం చేయటం కద్దు. కానీ ఈ సదస్సు ప్రతిష్టాత్మకమైంది కావటంతో టూర్ గైడ్ల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మూడు సంస్థల్లో చురుకుగా ఉండే యువకులను ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ప్రతినిధులు ఎయిర్‌పోర్టులో కాలు మోపింది మొదలు సదస్సు పూర్తయ్యాక మళ్లీ విమానాశ్రయానికి చేరుకునే వరకు ఈ పర్యటనకు సంబంధించిన సమాచారాన్ని వీరి నుంచి తెలుసుకునేలా సిద్ధం చేసింది. విదేశీ అతిథులు ఏ దశలో అసహనం వ్యక్తం చేయకుండా వీరికి తర్ఫీదునిచ్చారు. హైదరాబాద్ ప్రత్యేకతల గురించి ప్రశ్నిస్తే కూడా చెప్పేందుకు వీలుగా ఇక్కడి పర్యాటక ప్రాంతాలు, వంటలు, వాతావరణం, ఇతర ప్రత్యేకతల్లో ముఖ్యమైన విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఏ విషయాలపై ఎన్నిసార్లు ప్రశ్నించినా విసుక్కోవద్దని, ఎక్కడా మాటల్లో తడబాటు ఉండొద్దని, తనకు తెలియదు అన్న సమాధానం రావొద్దని నిపుణుల ద్వారా మూడ్రోజులపాటు తర్ఫీదునిచ్చారు. మధ్యలో ఓ రోజు అమెరికాకు చెందిన ఓ బృందం కూడా వచ్చి వీరికి కొన్ని పద్ధతులపై అవగాహన కల్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ వస్త్ర శైలిలో ప్రత్యేకతగా నిలిచేది ఆయన వాస్కోటు. అదే తరహాలో ఈ టూర్ గైడ్లకు కూడా పోచంపల్లిలో ప్రత్యేంగా వాస్కోట్లు రూపొందించి అందించారు. ‘ఇది ప్రతిష్టాత్మక సదస్సు. ఇందులో లోపం తలెత్తితే మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది. అందుకే ప్రత్యేక శిక్షణతో ఈ బృందాన్ని సిద్ధం చేశాం. విదేశీ ప్రతినిధులకు వీరు సంప్రదాయ పద్ధతిలో సహాయంగా ఉంటారు’అని పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ క్రిస్టినా చోంగ్తు ‘సాక్షి’కి చెప్పారు. -
టీ కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జ్‌గా మాజీ సీఎం!
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రక్షాళనకు ఆపార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. గత కొంత కాలంగా ఆపార్టీలోని నేతల పనితీరు, తెలంగాణలో రోజురోజూకూ పార్టీ బలహీనపడటం అ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమత్రి ఊమెన్ చాందీని నియమించనున్నట్లు సమాచారం. పార్టీ తెలంగాణ నేతలతో సమావేశమైన సోనియాగాంధీ ఈ మేరకు హింట్ ఇచ్చారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు వెల్లడించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షణ్ స్కీమ్ తో కాంగ్రెస్ బలహీనపరుస్తున్న నేపథ్యంలో ఊమెన్ చాందీకి పగ్గాలు అప్పగించనున్నారు. కాగా చాందీ కేరళకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. -
'గైడ్'గా పనిచేయాలని ఉందా?
బహదూర్‌పురా: రోటీన్‌కు భిన్నంగా ఏదైనా కొత్తగా చేయాలని మీరు తహతహలాడుతారా? ఎదుటివారికి చక్కగా వివరించే చెప్పే నైపుణ్యం, పర్యాటకులను ఆకట్టుకునే వాక్చాతుర్యం మీ సొంతమా? అయితే ఈ ఆఫర్ మీకోసమే. నెహ్రూ జూవాలాజికల్ పార్కులో 'గైడ్' పోస్టులు మీకోసం ఎదురుచూస్తున్నాయి. పార్కులో స్వచ్ఛందంగా గైడ్లుగా, వాలంటరీలుగా పనిచేసేందుకు ఆసక్తి గల యువత ముందుకు రావాలని జూపార్కు క్యూరేటర్ గోపిరవి అన్నారు. అన్ని విభాగాల్లో అభివద్ధి చెందిన జూపార్కును గైడ్లను, వాలంటరీలను సమకూర్చాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వచ్ఛందంగా వాలంటరీలుగా, జూ గైడ్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల వారు జూ ప్రధాన కార్యాలయంలో గానీ క్యూరేటర్ 9440810162 నంబర్లో సంప్రదించాలన్నారు. -
గైడ్‌పై దాడి చేసిన చిరుత
-
‘మార్గదర్శి’పై ఆర్బీఐ వేటు..
రాష్ట్రంలోని 31 ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్లను రద్దు చేసిన ఆర్బీఐ జాబితాలో మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ లీజింగ్ కంపెనీ, మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు హైదరాబాద్: రామోజీరావు సారథ్యంలోని ‘ఈనాడు’ గ్రూపునకు చెందిన రెండు ‘మార్గదర్శి’ సంస్థల్ని నాన్‌బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకుండా రిజర్వు బ్యాంకు నిషేధించింది. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని ఇకపై ఎలాంటి బ్యాకింగ్ కార్యకలాపాలూ నిర్వహించరాదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆర్బీఐ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రాష్ర్ట సీఐడీ విభాగం మంగళవారం విడుదల చేసింది. రామోజీకి చెందిన రెండు సంస్థలతో పాటు రాష్ట్రంలోని పలు (నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ-ఎన్బీఎఫ్సీ)లు కూడా అందులో ఉన్నాయి. రిజర్వు బ్యాంకు చట్టంలోని 45(1ఎ) సెక్షన్‌ను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఎలాంటి కంపెనీ నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించవచ్చో, ఎవరు రుణాలివ్వవచ్చో, ఎవరు డిపాజిట్లు స్వీకరించవచ్చనే వివరాలు 45(1ఎ) సెక్షన్లో ఉంటాయి. దీన్ని ఉల్లంఘించిన సంస్థల్ని ఆర్బీఐ నిషేధిస్తూ ఉంటుంది. వాటి రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థలతో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు నెరపవద్దని ప్రజలను హెచ్చరిస్తూ రాష్ర్ట సీఐడీ అదనపు డీజీ సత్యనారాయణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ డిపాజిట్లు స్వీకరిస్తోందని గతంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటపెట్టడంతో రామోజీ గ్రూపు నానా యాగీ చేయడం తెలిసిందే. తర్వాత అక్రమంగా సేకరించిన డిపాజిట్లను తిరిగి ఇవ్వాల్సి రావడంతో నిధుల సమీకరణ కోసం పలు సంస్థల్ని సంప్రదించింది. చివరకు రిలయన్స్ సంస్థ నిధులివ్వడంతో ఆ మొత్తాన్ని రామోజీ తన డిపాజిటర్లకు చెల్లించారు. దీనిపై వివిధ న్యాయస్థానాల్లో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల రద్దుకు కారణాలు నాన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించకపోవడం ఆర్బీఐ నిబంధనలను అమలు చేయకపోవడం, ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఖాతాల నిర్వహణలో విఫలమవడం ఆర్బీఐ తనిఖీ అధికారుల ఆదేశాల మేరకు ఖాతా పుస్తకాలు, ఇతర రికార్డులను సమర్పించడంలో విఫలమవడం డిపాజిట్ల స్వీకరణపై ఆర్బీఐ మూడు నెలలు, ఆపై నిషేధం విధించినా పాటించకపోవడం మేమే రద్దు చేసుకున్నాం: రామోజీ గ్రూపు వివరణ మా రెండు ఫైనాన్షియల్ సంస్థలు ఎన్నడూ ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించలేదు. రిజిస్ట్రేషన్ల రద్దు కోరుతూ స్వయంగా మేమే దరఖాస్తు చేసుకోగా, ఆర్బీఐ ఆ మేరకు రద్దు చేసింది. మా దరఖాస్తులకు సంతృప్తి చెందిన తర్వాత ఈ రెండు సంస్థల రిజిస్ట్రేషన్లను ఆర్బీఐ రద్దు చేసింది. తెలంగాణ సీఐడీ జారీ చేసిన పత్రికా ప్రకటన ప్రజలను గందరగోళానికి గురిచేసే విధంగా ఉంది. -
మార్గదర్శనం ఈ ఆదర్శగ్రామం
గంగదేవిపల్లి ఇటీవల ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. దాదాపుగా ఆరువందల మంది హాజరైన ఆ సమావేశంలో ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ కార్యక్రమాన్ని ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ ఓ గ్రామాన్ని దత్తత చేసుకుని దానిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దమని సూచిస్తూ... అంకితభావంతో పనిచేస్తే అది సాధ్యమే అని ఏడు నిమిషాల వీడియోను ప్రదర్శించారు. అది మన తెలుగు గ్రామం. బాలవికాస్ సంస్థ నిర్వహకులు ప్రజల భాగస్వామ్యంతో తీర్చిదిద్దిన గంగదేవిపల్లి. అసలు అది ఆదర్శగ్రామం ఎలా అయిందంటే... వరంగల్జిల్లా గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి 320 కుటుంబాలున్న గ్రామం. జాతీయస్థాయిలో ఆదర్శగ్రామంగా మన్ననలు పొందుతోంది. ఇంతకీ ఆదర్శగ్రామం అంటే..? ప్రభుత్వం కొన్ని గ్రామాలను ఆదర్శగ్రామాలుగా ఎంపిక చేసి ప్రత్యేక వసతులు కల్పిస్తుంటుంది. ఇదీ అలాంటిదేనా? ఏ మాత్రం కాదు. ఇది ప్రజలు సంఘటితమై ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకున్న ఆదర్శ గ్రామం. అదెలా సాధ్యమైందంటే... పాతికేళ్ల కిందట గంగదేవి పల్లి కూడా అత్యంత సామాన్యమైన గ్రామమే. వర్గ తగాదాలు, రాజకీయ వైషమ్యాలతో పరస్పర విభేదాలతో ఉండేది. తాగునీటికి కిలోమీటర్ల దూరం వెళ్లక తప్పని పరిస్థితి. ఇదిలా ఉండగా... అది 1992వ సంవత్సరం. బాలవికాస స్వచ్ఛంద సంస్థ గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించే ఉద్దేశంతో పనులు చేస్తోంది. గంగదేవిపల్లికి పొరుగూరులో మంచినీటి ట్యాంకు ప్రారంభోత్సవం జరుగుతోంది. గంగదేవి పల్లి గ్రామస్థులు కొంతమంది అక్కడికి వెళ్లి ‘తమ ఊరికి కూడా మంచినీటి ట్యాంకు కట్టించాల్సింది’గా బాలవికాస కేంద్రం నిర్వహకులను కోరారు. గ్రామంలోని వర్గవిభేదాలను తుడిచేయడానికి ఇదే మంచి సమయం అనుకున్నారు బాలవికాస కేంద్రం సి.ఇ.ఓ సింగారెడ్డి శౌరిరెడ్డి. ‘గ్రామం అంతా ఒకే మాట మీద కలిసికట్టుగా ఉండాలి, నీటి ఓవర్ట్యాంకు నిర్మాణంలో 15 శాతం గ్రామస్థుల భాగస్వామ్యం ఉండాలి’ అనే నియమాలను చెప్పి వారికి కొంత సమయం ఇచ్చారు. ‘‘మూడు నెలలకు మొదట కలిసిన వాళ్లు మరికొంత మందిని కలుపుకుని వచ్చారు. తమ వంతుగా అరవై వేల రూపాయలు సిద్ధం చేసి, శ్రమదానం చేస్తామన్నారు. ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తయి నీళ్లు ఇంటికే రావడంతో గ్రామస్థులలో పరివర్తన మొదలైంది’’ అన్నారు శౌరిరెడ్డి. ఇప్పుడు... మద్యపాన నిషేధం. అక్షరాస్యత సాధన. కుటుంబాలకు మరుగుదొడ్లు. అన్ని కుటుంబాలు పొదుపు చేయడం. ప్రతి ఇంటికీ నీటి కుళాయి... రోజూ నీటి సరఫరా. ప్రతి ఇంటి ముందూ చెట్లు పెంచడం. ప్రతి రోజూ వెలిగే వీథి దీపాలు. బడి... గుడి... ఆరోగ్యకేంద్రం. బాల కార్మికుల నిర్మూలన. ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీరు, అందరూ ఇంటిపన్ను - కరెంటు బిల్లులు కట్టడం వంటి వాటిలో నూటికి నూరుశాతం లక్ష్యాలను సాధించారు. ఈ ఇరవై ఏళ్లలో ఏ జంట కూడా ఇద్దరు పిల్లల నియమాన్ని తప్పలేదు. ఇరవై ఏళ్లలో గ్రామంలో ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాలేదు. ప్రభుత్వ పథకాల నిర్ణయాలు పైస్థాయిలో జరుగుతాయి. వాటిని ‘ఆచరించకపోతే ఏమవుతుంది’ అనే తిరుగుబాటు ధోరణి వ్యక్తమవుతుంటుంది. ప్రభుత్వం చెప్తున్న సంగతి అంత ప్రాముఖ్యం కాదనే అవగాహన లోపమూ ఉంటుంది. అలా కాకుండా ‘‘తమకు తాముగా తీసుకునే నిర్ణయం కావడంతో అందరూ ఆచరిస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇలాంటి స్ఫూర్తినే రగిలించాల’’ంటారు ప్రధాని... అన్నారాయన. గంగదేవిపల్లిలో వాటర్ కమిటీ, హెల్త్ కమిటీ, మదర్స్ కమిటీ, స్కూల్ ఎడ్యుకేషన్, టెంపుల్ కన్స్ట్రక్షన్, ఫార్మర్స్ కమిటీ, యూత్ కమిటీ, ప్లాస్టిక్ కంట్రోల్, మహిళా కమిటీ, గంగా డిష్ కనెక్షన్, పొదుపు, జీవిత బీమా, బాల కార్మిక నిర్మూలన వంటి 15 కమిటీలున్నాయి. గ్రామస్థులలో సగం మంది ఏదో ఓ కమిటీలో సభ్యులై ఉంటారు. ఐక్యత, సమర్థ నాయకత్వం, ఒకే విధమైన ముందుచూపు ఉంటే గ్రామాన్ని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దవచ్చు అంటారు శౌరిరెడ్డి. నిబంధనలు కఠినంగానే ఉంటాయి! ఆదర్శగ్రామం అనే బిరుదును అందుకోవడం చిన్న విషయమేమీ కాదు. ఆశయం మంచిదైనా ఆచరణ సరిగ్గా ఉండాలంటే నియమాలు, నిబంధనలు కఠినంగానే ఉండాలి. ఇంటి ముందు నాటిన చెట్టు చనిపోయినా, నీటి తొట్టి నిండి పొర్లిపోయినా, నీటి కుళాయి లీకవుతున్నా ఇంటికి నీటి సరఫరాను నిలిపేస్తారు. ఒకసారి నల్లా (నీటి కుళాయి) బంద్ అయితే వాటర్ కమిటీ ముందు క్షమాపణ చెప్పి జరిమానా చెల్లించాలి. మరుగుదొడ్డి ఉపయోగించపోయినా ఫైన్ కట్టాలి. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమిటంటే... వారానికోసారి గ్రామస్థులంతా ఎవరి ఇంటి ముందు వాళ్లే వీథిని శుభ్రం చేసుకుంటారు. ఊరంతా కలిసి డిష్ కేబుల్ ఏర్పాటుచేసుకున్నారు. ఇక నెలవారీ బిల్లులుండవు. విదేశీ ప్రతినిధులు గ్రామంలో పర్యటించే వివరాలు, గ్రామానికి అవార్డు వచ్చిన వార్తలను, గర్భిణులకు పరీక్షలు చేయడానికి, పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి హెల్త్ వర్కర్లు గ్రామానికి వచ్చే తేదీల సమాచారాన్ని ప్రత్యేకంగా ప్రసారం చేస్తారు. ఆర్థికంగా కాదు ఆదర్శంగా!: గంగదేవి పల్లికి పొరుగున కొన్ని గ్రామాల్లో పెద్ద పెద్ద భవనాలు, సిమెంటు రోడ్లు, కమ్యూనిటీ భవనాల వంటివి ఉన్నాయి. కానీ అవేవీ ప్రజల భాగస్వామ్యంతో జరిగినవి కాదు. ప్రజల భాగస్వామ్యంతో సాధించిన అభివృద్ధే ఆదర్శవంతమైన అభివృద్ధి. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరుకుంటున్న అభివృద్ధి కూడా అలాంటిదే. మన పార్లమెంటు సభ్యులు చేసి చూపాల్సింది కూడా ప్రజలను భాగస్వాములను చేసిన ఆదర్శగ్రామాలనే. - వాకా మంజులారెడ్డి ఫొటోలు: రాజేంద్రప్రసాద్, వరప్రసాద్, సాక్షి గ్రామ స్వరాజ్యమే కాదు... సురాజ్యమూ సాధ్యమే! అభివృద్ధి ఒక్కరోజులో వచ్చేది కాదు. గ్రామస్థుల మధ్య అవగాహన బాగుంటే ఆలోచనలు బాగుంటాయి. ఆలోచనలు బాగుంటే ఆశయం బాగుంటుంది. ఆశయం బాగుంటే ఆచరణ బాగుంటుంది. ఆచరణ బాగుంటే అభివృద్ధి బావుంటుంది. అంటే అభివృద్ధి అనే మహావృక్షానికి బీజం అవగాహన... అని మేము ఎంపిక చేసుకున్న వంద గ్రామాల ప్రజలకూ చెప్తున్నాం. ప్రధానమంత్రి ఢిల్లీలో పార్లమెంటు సభ్యులకు గంగదేవిపల్లిని ఆదర్శంగా చూపించినప్పుడు వారిలో ఒక ఆశ కనిపించింది. ఎం.పిలలో మార్పు సాధ్యమే అనే అభిప్రాయం కలగడాన్ని గమనించాను. వారి స్ఫూర్తితో ముందుకు వస్తే చాలా గ్రామాలు ఆదర్శగ్రామాలవుతాయి. గాంధీజీ కలలు కన్నట్లు గ్రామ స్వరాజ్యం మాత్రమే కాకుండా మన ప్రధాని కోరినట్లు గ్రామసురాజ్యాన్ని కూడా సాధించవచ్చు. -
ఫుట్‌బాల్ అభిమానులకు గైడ్ ‘కిక్-ఆఫ్’
సాక్షి, న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచమంతా ఇప్పుడు బ్రెజిల్వైపే చూస్తోంది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మ్యాచ్‌లు ఫుట్‌బాల్ అభిమానులను గోల్స్ వర్షంలో తడిపేస్తున్నాయి. రోజుకో రసవత్తర పోరుతో ప్రేక్షకులు ఆనందలోకాల్లో విహరిస్తున్నారు. ఫుట్‌బాల్ వీరాభిమానుల్లో కొందరికి ఆట ఆడడం అంటే ఇష్టమైతే మరికొందరికి ఆ ఆటలోని ప్రతి అంశాన్ని తెలుసుకోవడంపై ఆసక్తి ఉంటుంది. ఇలా ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రతోపాటు ఇండియన్ ఫుట్‌బాల్ చరిత్ర తెలుసుకోవాలనుకునే వారు మాత్రం ‘ది ఫుట్‌బాల్ ఫెంటాస్టిక్ ఎసెన్షియల్ గైడ్’ పుస్తకం చదవాల్సిందే. ‘కిక్-ఆఫ్’ పేరిట ప్రముఖ ఫుట్‌బాల్ నిఫుణుడు, ప్రముఖ వ్యాఖ్యాత నవీ కపాడియా ఈ పుస్తకాన్ని రచించారు. ఫుట్‌బాల్ వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సందర్భంగా తన పుస్తకానికి సంబంధించి రచయిత కపాడియా ‘సాక్షి’తో ఎన్నో అంశాలు పంచుకున్నారు. 1930 నుంచి 2010లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన ప్రపంచ ఫుట్బాల్కప్లకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని పొందుపర్చినట్టు తెలిపారు. మొత్తం 19 భాగాల్లో ఆయా కాలాల్లోని ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు, ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచిపోయే మధుర ఘట్టాలు, వివాదాలు సహా పలు అంశాలను కూలంక షంగా వివరించారు. అదేవిధంగా భారత్ ఫుట్‌బాల్‌కి సంబంధించిన చరిత్రను సైత ం పొందుపరిచారు. నవతరం ఫుట్‌బాల్ క్రీడాకారుల కోసం ఆటకు సంబంధించి పలు సూచనలు సైతం ఉన్నాయి. ఫుట్‌బాల్ అభిమానులతోపాటు పోటీపరీక్షలకు సన్నద్ధం అయ్యేవారి కోసం ఫుట్‌బాల్ ఆటకు సంబంధించి వంద క్విజ్ ప్రశ్నలను సైతం స్థానం కల్పించినట్టు పుస్తక రచయిత నవీ కపాడియా తెలిపారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో ఈ పుస్తకం పాఠకులకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. -
ధర్మానుసరణతోనే జీవితాల్లో శాంతి
సృష్టి ప్రారంభం నుండి, సృష్టికర్త మానవ మనుగడ కోసం ఒక జీవన వ్యవస్థను, ధర్మాన్ని అవతరింపజేశాడు. తన ఇష్టాన్ని, అయిష్టాన్నీ ఎరుకపరిచాడు. సాఫల్య వైఫల్యాల మార్గాలను విస్పష్టంగా తెలియజేశాడు. ఏవిధమైన జీవన విధానాన్ని అవలంబిస్తే ఇహపరలోకాల్లో సుఖశాంతులు, సంతృప్తి సాఫల్యాలు పొందవచ్చునో, ఏ విధానంలో ఇహ పర కష్టనష్టాలు, అశాంతి, అసంతృప్తులు, వైఫల్యాలు ఉన్నాయో వివరించాడు. తన మనోభీష్టాన్ని ప్రజలకు వివరించి, ముక్తి, మోక్షాల మార్గం చూపడానికి వారి నుండే ప్రవక్తలను ఎంచుకున్నాడు. వారిపై తన ఆదేశాలను అవతరింపజేశాడు. దైవాదేశాలకనుగుణంగా, దైవ సందేశహరులు ఎప్పటికప్పుడు ప్రజలకు మార్గదర్శకం వహిస్తూ, వారిని రుజుమార్గంపై నడపడానికి ప్రయత్నించారు. దైవం, దైవప్రవక్తల ఉపదేశాలకనుగుణంగా, ధర్మానుసరణలో జీవితం గడిపినంతకాలం మానవ సమాజం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉంది. ఎప్పుడైతే జీవన విధానంలో అధర్మం ప్రవేశించిందో, అప్పుడే మానవాళికి కష్టాలు ప్రారంభమయ్యాయి. జీవితంలో శాంతి కరువైపోయింది. ఈవిధంగా మానవులు సన్మార్గం తప్పి వక్రమార్గం పట్టినప్పుడల్లా, దైవం వారిని మళ్లీ రుజుమార్గంపైకి తీసుకురావడానికి, వారి జీవన విధానాన్ని గుర్తు చేసి వైఫల్యాల నుండి రక్షించడానికి, వారిలో నుండే ఉత్తములైన వారిని ఎంపిక చేస్తూ వచ్చాడు. దాదాపు లక్షా ఇరవైనాలుగువేలమంది మహనీయులను దైవం తన సందేశహరులుగా నియమించినట్లు ధర్మశాస్త్రగ్రంథాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ పరంపరలోని చివరి దైవప్రవక్త ముహమ్మద్ (స). ఈయన ద్వారా ధర్మం సంపూర్ణమైంది. ఇక ప్రళయం వరకు జన్మించే మానవులందరికీ ముహమ్మద్ ప్రవక్త (స)మార్గదర్శకత్వమే అనుసరణీయం. ఎందుకంటే, ఈయనకంటే ముందు నియమితులైన దైవప్రవక్తలందరూ ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక కాలానికో పరిమితమయ్యారు. అలాగే ఆద్ జాతి వారికి ‘హూద్’ (అ) ప్రవక్తగా నియమితులయ్యారు. అదేవిధంగా మూసా, ఈసా (అ.ముస్సలా)లు తమ తమ జాతి జనులకు మాత్రమే (ఇశ్రాయేలు సంతతి) ప్రవక్తలుగా నియమించబడ్డారు. కాని ముహమ్మద్ ప్రవక్త (స) సమస్త మానవాళికీ మార్గదర్శిగా వచ్చారు. ప్రళయకాలం వరకు వచ్చే మానవులందరికీ ఆయన కారుణ్యంగా ప్రభవించారు. ఆయన జీవన విధానం మానవాళికంతటికీ ఆదర్శమని, సమస్త మానవాళికీ ఆయన కారుణ్యమనీ పవిత్ర ఖురాన్ స్పష్టం చేసింది. (ముహమ్మద్:) మేము నిన్ను యావత్తు ప్రపంచవాసుల పాలిట కారుణ్యంగా చేసి పంపాము. (అంబియా 107)‘ప్రవక్త జీవన విధానంలో మీకు మంచి ఆదర్శం ఉంది’ (అహెజాబ్ 21). కనుక ముహమ్మద్ ప్రవక్త (స) ఒక వర్గానికో, ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక భాష మాట్లాడే వారికో లేక ఒక కాలానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన అందరి ప్రవక్త. విశ్వజనీన ఆదర్శమూర్తి. విశ్వకారుణ్యమూర్తి. ఆయన ద్వారానే ధర్మం పరిపూర్ణమైంది. ఆయన మాటను, ఆయన బాటను అనుసరించడంలోనే మానవుల సాఫల్యం ఉంది. ఏకేశ్వరారాధనలోనే మానవుల ఇహపర సాఫల్యాలు ఉన్నాయని ముహమ్మద్ ప్రవక్త (స) స్పష్టం చేశారు. స్వార్థాన్ని వీడితేనే శాంతి దొరుకుతుందని సెలవిచ్చారు. బుద్ధిని ఉపయోగిస్తేనే నిజాలు వెల్లడవుతాయని ప్రవచించారు. అంధానుకరణ అజ్ఞానంలోకి నెట్టివేస్తుందని హెచ్చరించారు. కాబట్టి, జీవితాల్లో సుఖశాంతులు పరిఢవిల్లాలంటే, మానసిక ప్రశాంతత, ఆత్మసంతృప్తి సిద్ధించాలంటే, ఇహలోకంంతోపాటు, పరలోక సాఫల్యం పొందాలంటే తు.చ. తప్పకుండా దైవధర్మాన్ని అనుసరించాలి. దైవాదేశాలు, ప్రవక్త ప్రవచనాల వెలుగులో జీవితాలను సమీక్షించుకుంటూ జీవనయానం కొనసాగించాలి. అప్పుడే శాంతి సాఫల్యాలు సొంతమవుతాయి. - యండి. ఉస్మాన్‌ఖాన్