టీ కాంగ్రెస్కు ఇన్ఛార్జ్గా మాజీ సీఎం! | Former Kerala CM Oommen Chandy to guide Telangana Congress | Sakshi
Sakshi News home page

టీ కాంగ్రెస్కు ఇన్ఛార్జ్గా మాజీ సీఎం!

Published Tue, Jul 5 2016 1:20 PM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM

టీ కాంగ్రెస్కు ఇన్ఛార్జ్గా మాజీ సీఎం! - Sakshi

టీ కాంగ్రెస్కు ఇన్ఛార్జ్గా మాజీ సీఎం!

న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రక్షాళనకు ఆపార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. గత కొంత కాలంగా ఆపార్టీలోని నేతల పనితీరు, తెలంగాణలో రోజురోజూకూ పార్టీ బలహీనపడటం అ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది.  ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమత్రి ఊమెన్ చాందీని నియమించనున్నట్లు సమాచారం.

పార్టీ తెలంగాణ  నేతలతో సమావేశమైన సోనియాగాంధీ ఈ మేరకు హింట్ ఇచ్చారని  సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు వెల్లడించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షణ్ స్కీమ్ తో కాంగ్రెస్ బలహీనపరుస్తున్న నేపథ్యంలో ఊమెన్ చాందీకి పగ్గాలు అప్పగించనున్నారు. కాగా చాందీ కేరళకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement