యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వచ్చాక ఆర్థిక లావాదేవీలు అత్యంత సులభతరం అయ్యాయి. విస్తృతమైన బ్యాంకింగ్ ఆధారాల అవసరం లేకుండా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి, బిల్లులు చెల్లించడానికి, వివిధ లావాదేవీలను నిర్వహించడానికి యూపీఐ వినియోగదారులకు వెసులుబాటు కలిగింది. ఓ వైపు సౌలభ్యం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్లో బ్యాంక్ సర్వర్లు, సాంకేతిక లోపాలు లేదా అనధికార లావాదేవీలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలపై ఫిర్యాదు ఎలా చేయాలో ఇక్కడ అందిస్తున్నాం..
యూపీఐ సమస్యల రకాలు
ఫిర్యాదును ఫైల్ చేసే ముందు మీరు ఎదుర్కొనే వివిధ రకాల యూఏఐ సమస్యలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.
» పిన్ సమస్యలు: యూపీఐ పిన్ బ్లాక్ అవడం లేదా ఎర్రర్ రావడం వంటి సమస్యలు మిమ్మల్ని లావాదేవీలను పూర్తి చేయకుండా నిరోధించవచ్చు.
» ప్రాసెసింగ్ సమస్యలు: లావాదేవీలు జరగకుండానే డబ్బు కట్ అవడం, తప్పు ఖాతాలకు డబ్బు వెళ్లడం, లావాదేవీలు పెండింగ్‌లో పడిపోవడం లేదా తిరస్కరణకు గురికావడం, లావాదేవీల పరిమితులను అధిగమించడం లేదా లావాదేవీల సమయం ముగియడం వంటి సమస్యలు ఉంటాయి.
» ఖాతా సమస్యలు: ఖాతా వివరాల లింక్, ఫెచ్చింగ్, ఖాతాను మార్చడం లేదా తొలగించడం లేదా నమోదు రద్దు చేయడం వంటి సమస్యలు.
» ఇతర సమస్యలు: వీటిలో లాగిన్ వైఫల్యాలు, నమోదు సమస్యలు లేదా ఓటీపీ (OTP) లోపాలు ఉండవచ్చు.
తప్పు లావాదేవీపై ఫిర్యాదు
యూపీఐ లావాదేవీ సమయంలో సమస్యలను ఎదుర్కొంటే, మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి ఫిర్యాదు చేయవచ్చు. తప్పుడు లావాదేవీపై ఫిర్యాదు చేయడానికి ఈ దశలను అనుసరించండి..
» ఎన్‌పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.
» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.
» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.
» 'Incorrectly transferred to another account' ఎంచుకుని, మీ సమస్య క్లుప్త వివరణను అందించండి.
» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.
» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్‌డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ ఫోటోను అప్‌లోడ్ చేయండి.
» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌పై ఫిర్యాదు
యూపీఐ లావాదేవీ విఫలమైతే ఈ దశల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
» ఎన్‌పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.
» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.
» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.
» 'Transaction failed but amount debited' ఎంచుకుని సమస్య క్లుప్త వివరణను అందించండి.
» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.
» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్‌డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ ఫోటోను అప్‌లోడ్ చేయండి.
» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.
Comments
Please login to add a commentAdd a comment