అలర్ట్‌, ‘గూగుల్‌ పే’ లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ ఏంటో తెలుసా! | Sundar Pichai Said Google Pay Also Get Transaction Search Via Voice Feature | Sakshi
Sakshi News home page

అలర్ట్‌, ‘గూగుల్‌ పే’ లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ ఏంటో తెలుసా!

Published Mon, Dec 19 2022 9:24 PM | Last Updated on Mon, Dec 19 2022 9:25 PM

Sundar Pichai Said Google Pay Also Get Transaction Search Via Voice Feature - Sakshi

ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ సంచలనం నిర్ణయం తీసుకుంది. భార‌త్‌లో యూపీఐ ఆధారిత గూగుల్ పే సేవ‌ల్లో వాయిస్ ద్వారా ‘ట్రాన్సాక్ష‌న్ సెర్చ్‌’ ఫీచ‌ర్ తీసుకొస్తున్న‌ట్లు ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచ్చాయ్‌  ప్ర‌క‌టించారు.  ఢిల్లీలోని ప్ర‌గతి మైదాన్‌లో జ‌రిగిన  గూగుల్ 8వ ఎడిష‌న్‌లో సంస్థ సీఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్‌ అందుబాటులోకి తేనున‍్న ఫీచర్లను పరిచయం చేశారు. 

ముఖ్యంగా డాక్టర్ల ప్రిస్కప్షన్‌తో పాటు స్థానిక భాషల్లో సమాచారం,మల్టీ సెర్చ్‌ ఇలా రకరకాల ఫీచర్లను గురించి పిచ్చాయ్‌ వివరించారు. దీంతో పాటు గూగుల్‌ పేలో ఈ సరికొత్త ఫీచర్‌ను ఎనేబుల్‌ చేయనున్నట్లు తెలిపారు. 

ఇదే ఈవెంట్‌లో కేంద్ర టెలీ క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌ వ‌ల్ల ప‌లు రంగాల్లో గ‌ణ‌నీయ మార్పులు రానున్నాయ‌నే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement