గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలో తన బాల్యంలో ఇంట్లో గడిపిన మధుర క్షణాలు కనుమరుగు కానున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. పలు కథనాల ప్రకారం.. చెన్నై అశోక్ నగర్‌లో పిచాయ్ చిన్ననాటి ఇంటిని ఇటీవలే పిచాయ్ తండ్రి అమ్మేసినట్లు సమాచారం. ఆ ఇంటిని తమిళ నటుడు, నిర్మాత సి.మణికందన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. (గూగుల్ సీఈవో ప్రైమరీ ఫోన్ ఏదో తెలుసా, ఏఐపై కీలక వ్యాఖ్యలు)
సుందర్ పిచాయ్ బాల్యంలో గడిపిన ఆ ఇంటిని పిచాయ్ తల్లిదండ్రులు అమ్ముతున్నారని తెలుసుకొని కొనుగోలు చేసేందుకు మణికందన్ ముందుకు వచ్చారు. ‘సుందర్ పిచాయ్ ఇంటిని కొనుగోలు చేయడం అదృష్టంగా భావిస్తున్నా. పిచాయ్ సాధించిన విజయాల పట్ల తన గర్వంగా ఉందంటూ’ ప్రశంసల వర్షం కురిపించారు.
నాలుగు నెలల సమయం
తాను ఆ ఇల్లు కొనుగులో చేసే సమయంలో పిచాయ్ తండ్రి అమెరికాలో నివసిస్తున్నారని,లావాదేవీల ప్రక్రియ పూర్తి చేసేందుకు నాలుగు నెలల సమయం పట్టినట్లు మణికందన్ చెప్పారు. సుందర్ పిచాయ్ తండ్రికి అదే మొదటి ఆస్తి కావడంతో.. ఆస్తిపత్రాలు ఇచ్చే సమయంలో ఉద్వేగ్వానికి గురైనట్లు గుర్తు చేశారు.
చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది!
Comments
Please login to add a commentAdd a comment