సుందర్‌ పిచాయ్‌పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? Google Employees Share Memes On Ceo Sundar Pichai | Sakshi
Sakshi News home page

గూగుల్‌లో జీతాల పంచాయితీ.. సుందర్‌ పిచాయ్‌ను విమర్శిస్తున్న ఉద్యోగులు!

Published Thu, May 4 2023 7:55 PM | Last Updated on Thu, May 4 2023 8:39 PM

Google Employees Share Memes On Ceo Sundar Pichai - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తీరుపట్ల ఆ సంస్థ ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీలోని ఉద్యోగులకు కాస్ట్‌ కటింగ్‌ నిబంధనలు అమలు చేస్తున్న సమయంలో సీఈవో భారీ ఎత్తున వేతనాలు ఇవ్వడం చర‍్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఇదే విషయాన్ని ఉద్యోగులు సైతం ఇంట్రర్నల్‌ ఫోరమ్‌లో సంస్థను ప్రశ్నిస్తున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో గూగుల్‌ సెక్యూరిటీస్‌ ఫైలింగ్‌లో సుందర్‌ పిచాయ్‌కు ఎంత వేతనం చెల్లిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. వ్యయ నియంత్రణ అంటూ ఉద్యోగులకు భారీగా కోతపెడుతున్న గూగుల్‌.. సీఈవోకు మాత్రం 2022 సంవత్సరానికి రూ.1,850 (226 మిలియన్‌ డాలర్లు) కోట్ల పారితోషికం ఇచ్చింది.

గూగుల్‌లో సగటు ఉద్యోగి వేతనంతో పోల్చితే.. ఇది 800 రెట్లు ఎక్కువ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ జనవరిలో గ్లోబుల్‌ వర్క్‌ ఫోర్స్‌లో 6 శాతంతో సుమారు 12 వేల మందిని విధుల నుంచి తొలగించడాన్ని తప్పుబడుతున్నారు. 

చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఏమన్నారంటే?

సుందర్‌ పిచాయ్‌ వర్సెస్‌ టిమ్‌కుక్‌
సుందర్ పిచాయ్ కాంపన్సేషన్ కింద భారీ మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. దీంతో సీఈవోకి చెల్లించే వేతనాల విషయంలో గూగుల్‌ ఉద్యోగులు పిచాయ్‌ వేతనాన్ని, యాపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ వేతనంతో పోల్చుతూ మీమ్స్‌ను షేర్‌ చేస్తున్నారు. టిమ్‌కుక్‌ గత ఏడాదిలో సుమారు 40 శాతం వేతనంలో కోత విధించుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ మీమ్స్‌ వేస్తున్నారు. కంపెనీ ఖర్చులను తగ్గించుకున్నప్పటికీ సుందర్ పిచాయ్ వేతనాల పెంపుపై గూగుల్‌ ఇంట్రర్నల్‌ ఫోరమ్‌లో ఉద్యోగులు సంస్థకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.   

వీపీఎస్‌, సీఈవో మినహా అందరికీ వర్తిస్తుంది
మార్చి నెలలో గూగుల్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రూత్‌ పోరట్‌ ఉద్యోగులకు మెమో పంపారు. సంస్థ ఖర్చుల్ని తగ్గించుకునే పనిలో భాగంగా స్నాక్స్, లంచ్‌లు, లాండ్రీ, మసాజ్‌ సర్వీసులు ఆఫీసులో ఉండవని ప్రకటించింది. ఇలా ఆదా చేసిన డబ్బుల్ని మరిన్ని కీలకమైన పరిశోధనలకు ఖర్చు పెడతామని పేర్కొన్నారు. అందులో ఖర్చు ఆదా అందరికీ వర్తిస్తుంది. సంస్థ కోసం కష్టపడే వైస్‌ ప్రెసిడెంట్‌ సీఈవోకి మినహాయింపు ఉంటుందని గూగుల్‌ ఎంప్లాయిస్‌ ఫోరమ్‌లో పోరట్‌ స్పష్టం చేశారు.

కాగా, ఉద్యోగుల నుంచి వస్తున్న విమర్శలపై గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ స్పందన ఎలా ఉంటుందోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విమర్శలకు చెక్‌ పెట్టేలా జీతాన్ని తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా? లేదంటే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటారా? అని చర్చించుకుంటున్నారు. 

చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement