ఇజ్రాయెల్‌పై హామాస్ ఉగ్రదాడిపై ప్రముఖ టెక్ దిగ్గజం, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌లో స్థానిక గూగుల్ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అండగా నిలుస్తామంటూ ఓ మెసేజ్‌ను షేర్ చేశారు.
ఇజ్రాయెల్ - హమాస్ ఉద్రిక్తతలపై సుందార్ పిచాయ్ ట్వీట్ చేశారు. ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద దాడిపై విచారం వ్యక్తం చేస్తున్నాం. గూగుల్‌కు చెందిన రెండు ఆఫీసుల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ ఉద్రికతల నేపథ్యంలో వారి అనుభవాలు ఎలా ఉన్నాయో ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఉద్యోగులు భద్రతపై వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Deeply saddened by the terrorist attacks in Israel this weekend and the escalating conflict underway. Google has 2 offices and over 2,000 employees in Israel. It’s unimaginable what they’re experiencing. Our immediate focus since Saturday has been on employee safety. We’ve now… https://t.co/VCiboq9oN8
— Sundar Pichai (@sundarpichai) October 10, 2023
స్థానికంగా ఉన్న మా ఉద్యోగులతో సంప్రదింపులు జరుపుతున్నాం. వారికి కంపెనీ అండగా నిలుస్తుంది. అదే విధంగా ఇజ్రాయెల్‌లో సహాయక చర్యలు చేపట్టే బృందాలకు మా వంతు సాయం అందిస్తాం’ అని సుందర్ పిచాయ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment