ఏ మార్పైన కొంత వరకు మంచిదే. కానీ అతిగా జరిగితే అనార్ధం తప్పదు. అలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఎటు చూసినా ఇదే చర్చ నడుస్తోంది. దీనిని నమ్మితే మానవజాతి వినాశనం తప్పదని, మానవుని ఎదుగుదలకు మూలమైన సృజనాత్మకతను అంతం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా దిగ్గజ టెక్ సంస్థలు ఈ ఏఐ రేసులో ఒకదానికొకటి పోటీపడుతున్నాయి.
శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ విభాగంలో సత్తా చాటేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు కృత్రిమ మేధస్సు వినియోగంలో కాస్త వెనుకంజలో ఉన్న మరో టెక్ దిగ్గజం యాపిల్ సైతం దృష్టి సారించింది. గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీతో ముందంజలో ఉంటే యాపిల్ ఏఐని విస్మరించింది. ఊహించని పరిణామలతో ఓపెన్ ఏఐ లాంటి సంస్థలతో పోటీపడలేక ఆ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చీఫ్ జాన్ జియానాండ్రియా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
బంగారు గుడ్లు పెట్టే బాతుల్లా
నివేదికల ప్రకారం.. ఏఐలో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురిలో శ్రీనివాస్ వెంకటా చారి, ఆనంద్ శుక్లాలు (స్టీవెన్ బాకెర్ కాకుండా) ఇద్దరు దిగ్గజ కంపెనీలకు బంగారు గుడ్లు పెట్టే బాతుల్లాగా కనిపిస్తున్నారు. అందుకే ఎంత ప్యాకేజీ కావాలంటే అంత చెల్లించి తమ సంస్థలో చేర్చుకునేందుకు పోటీపడుతున్నారు.
యాపిల్‌ను వదిలేసి గూగుల్ వైపు
యాపిల్ సెర్చ్ టెక్నాలజీలో పని చేస్తున్న ఆ ముగ్గురు యాపిల్‌ను వదిలేసి గూగుల్‌లో చేరారు. అందులో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్‌ఎల్‌ఎం)పై పనిచేస్తున్నారు. వారిలో ఇద్దరు ఐఐటీని పూర్తి చేశారు. ఆ ఇద్దరిని తమతో పాటు ఉంచుకునేందుకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రయత్నిస్తుంటే.. యాపిల్ సంస్థ నుంచి గూగుల్‌కు వెళ్లిన ఆ ఇద్దరినే.. మళ్లీ తమవైపుకు తిప్పుకోవాలని సీఈవో టిమ్‌కుక్ చూస్తున్నారు. దీంతో ఇప్పుడు ఐఐటీయన్ల కోసం టెక్ సంస్థలు పోటీ పడుతున్న తీరు ప్రపంచ టెక్ రంగంలో చర్చాంశనీయంగా మారింది.
ఎవరా ఇద్దరు భారతీయులు?
ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్‌ను పూర్తి చేసిన వెంకటాచారి ప్రస్తుతం గూగుల్ ఏఐ ప్రొడక్ట్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. మరొకరు ఆనంద్ శుక్లా. శుక్లా గూగుల్‌లో మంచి పేరున్న ఇంజినీర్‌గా చెలామణి అవుతున్నారు. లింక్డిన్ ఫ్రొఫైల్ ప్రకారం.. 2022 అక్టోబర్ నెలలో వెంకటచారీ యాపిల్‌కు రిజైన్ చేయగా.. అదే ఏడాది నవంబర్‌లో యాపిల్‌కు గుడ్‌పై చెప్పి గూగుల్‌లో చేరారు శుక్లా.
బ్రతిమలాడి, బామాలి
ది ఇన్ఫర్మేషన్ నివేదిక ప్రకారం, ఆ ఇద్దరు భారతీయులు గూగుల్‌లో పనిచేందుకు మొగ్గుచూపుతున్నట్లు తేలింది. గూగుల్ ఎల్‌ఎల్‌ఎంలో పనిచేసుందకు మంచి ప్రదేశమని భావించారని, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సైతం తమ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వాళ్లిద్దరికి ఇక్కడే ఉండమని ఒప్పించేందుకు ప్రయత్నించారని నివేదిక పేర్కొంది.
చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్
Comments
Please login to add a commentAdd a comment