how
-
యూపీఐ రాంగ్ పేమెంట్.. ఇలా చేయండి కంప్లయింట్..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వచ్చాక ఆర్థిక లావాదేవీలు అత్యంత సులభతరం అయ్యాయి. విస్తృతమైన బ్యాంకింగ్ ఆధారాల అవసరం లేకుండా డబ్బు పంపడానికి, స్వీకరించడానికి, బిల్లులు చెల్లించడానికి, వివిధ లావాదేవీలను నిర్వహించడానికి యూపీఐ వినియోగదారులకు వెసులుబాటు కలిగింది. ఓ వైపు సౌలభ్యం ఉన్నప్పటికీ, కొన్నిసార్లు స్లో బ్యాంక్ సర్వర్లు, సాంకేతిక లోపాలు లేదా అనధికార లావాదేవీలు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలపై ఫిర్యాదు ఎలా చేయాలో ఇక్కడ అందిస్తున్నాం..యూపీఐ సమస్యల రకాలుఫిర్యాదును ఫైల్ చేసే ముందు మీరు ఎదుర్కొనే వివిధ రకాల యూఏఐ సమస్యలను అర్థం చేసుకోవడం చాలా అవసరం.» పిన్ సమస్యలు: యూపీఐ పిన్ బ్లాక్ అవడం లేదా ఎర్రర్ రావడం వంటి సమస్యలు మిమ్మల్ని లావాదేవీలను పూర్తి చేయకుండా నిరోధించవచ్చు.» ప్రాసెసింగ్ సమస్యలు: లావాదేవీలు జరగకుండానే డబ్బు కట్ అవడం, తప్పు ఖాతాలకు డబ్బు వెళ్లడం, లావాదేవీలు పెండింగ్‌లో పడిపోవడం లేదా తిరస్కరణకు గురికావడం, లావాదేవీల పరిమితులను అధిగమించడం లేదా లావాదేవీల సమయం ముగియడం వంటి సమస్యలు ఉంటాయి.» ఖాతా సమస్యలు: ఖాతా వివరాల లింక్, ఫెచ్చింగ్, ఖాతాను మార్చడం లేదా తొలగించడం లేదా నమోదు రద్దు చేయడం వంటి సమస్యలు.» ఇతర సమస్యలు: వీటిలో లాగిన్ వైఫల్యాలు, నమోదు సమస్యలు లేదా ఓటీపీ (OTP) లోపాలు ఉండవచ్చు.తప్పు లావాదేవీపై ఫిర్యాదుయూపీఐ లావాదేవీ సమయంలో సమస్యలను ఎదుర్కొంటే, మీరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)కి ఫిర్యాదు చేయవచ్చు. తప్పుడు లావాదేవీపై ఫిర్యాదు చేయడానికి ఈ దశలను అనుసరించండి..» ఎన్పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.» 'Incorrectly transferred to another account' ఎంచుకుని, మీ సమస్య క్లుప్త వివరణను అందించండి.» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి.» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి.ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌పై ఫిర్యాదుయూపీఐ లావాదేవీ విఫలమైతే ఈ దశల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.» ఎన్పీసీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి What we do' ట్యాబ్‌కు వెళ్లి 'UPI' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.» 'UPI' విభాగం కింద 'Dispute Redressal Mechanism'పై క్లిక్ చేయండి.» 'Complaint' విభాగం కింద 'Transaction' ఎంపికకు స్క్రోల్ చేయండి.» మీ ఫిర్యాదు ప్రకారం 'Nature of the transaction'ని ఎంచుకోండి.» 'Transaction failed but amount debited' ఎంచుకుని సమస్య క్లుప్త వివరణను అందించండి.» ట్రాన్సాక్షన్ ఐడీ, బ్యాంక్ పేరు, యూపీఐ ఐడీ, అమౌంట్, లావాదేవీ తేదీ, ఈమెయిల్ ఐడీని నమోదు చేయండి.» మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను అందించి అప్డేట్ చేసిన బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ ఫోటోను అప్లోడ్ చేయండి.» సత్వర పరిష్కారం కోసం అన్ని వివరాలు ఖచ్చితంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. -
పెద్ద తలనొప్పిగా మారిన స్పామ్ కాల్స్
-
పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా?
న్యూఢిల్లీ: భారతీయ పౌరులకు బయోమెట్రిక్ డేటా ఆధారంగా ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డు ఆధార్ కార్డ్. ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకం చేయడానికి, నల్లధనాన్ని అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా తాజాగా ఆర్థిక శాఖ పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది. పాన్, పన్ను రిటర్న్‌లు దాఖలు కోసం ఆధార్ తప్పనిసరి. ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేసేందుకు పాన్‌తో ఆధార్ అనుసంధానాన్ని జులై 1 నుంచి తప్పనిసరి చేసింది ప్రభుత్వం. డిసెంబరు 31 తుది గడువుగా ప్రకటించింది. ఈ గడువు ముగిసిన తర్వాత పాన్ ఇన్వాలిడ్ అవుతుందని కేంద్రం హెచ్చరిస్తోంది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా? మొదట పన్ను చెల్లింపుదారులఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి. ఇదివరకే యూజర్ ఖాతా కలిగి ఉన్నవారు నేరుగా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నేరుగా లాగిన్ అయితే సరిపోతుంది.లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ లింక్ ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇక్కడ పేరు, పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివరాలను ఎంటర్ చేయాలి. ఈ వివరాలను ఆటోమేటిగ్గా సరిచూస్తుంది. క్రాస్ చెక్ పూర్తయిన తర్వాత మీ నంబరు, క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే.. నిమిషాల్లో ఈ ఆధార్ లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. వివరాలన్నీ సరిపోలితేనే ఈ అనుసంధాన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అనుసంధానం పూర్తయిన వెంటనే సమాచారం అందుతుంది. పాన్‌తో పాటు ఆధార్ అనుసంధానం చేయని పక్షంలో కొన్ని రోజుల తర్వాత పాన్ పనికిరాకుండా పోతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే ఆధార్ లేని వారు దాని కోసం దరఖాస్తు చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ఒకవేళ ఈ మధ్యే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొని వుంటే అనుసంధానం చేసేటప్పుడు ఎన్రోల్మెంట్ నంబరు వేస్తే చాలు. -
జియో మరో బంపర్ ఆపర్
న్యూఢిల్లీ: సంచలనానికి మారుపేరుగా నిలిచిన రిలయన్స్ జియో ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉచిత డేటా ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయాలనుంచి టారిఫ్ లలోకి ఎంట్రీ ఇచ్చిన జియో ఇపుడు ప్రైమ్ మెంబర్ షిప్ ను కూడా ఉచితంగా అందించే ప్లాన్ ను ఒక దాన్ని తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. హ్యాపీ న్యూ ఆఫర్లో రూ.99 ల చార్జితో ప్రైమ్ మెంబర్ షిప్ ద్వారా మార్చి 2018 వరకు జియో సేవలు ఉచితం. అయితే జియో మనీ ద్వారా ప్రత్యేక ఆఫర్లో ఉచితంగా ప్రైమ్ మెంబర్ షిప్ పొందే అవకాశాన్ని కల్పించింది. ఎలా అంటే.. 15 మార్చి నుండి ప్రారంభమైన ఈ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉంది. జియోమనీ వాలెట్ లేదా మై జియో యాప్ లేదా www.jio.com లాగిన్ ద్వారా రూ.99+303 చెల్లించాలి. అనంతరం యాప్ లోరూ.50 డిస్కౌంట్ వోచర్ లభిస్తుంది. ఈ వోచర్ రూ.303లు, ఆ పైన విలువగల తరువాతి రీచార్జ్ సమయంలో వినియోగించుకోవచ్చు. 25 మార్చి నుంచి జూన్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ పరిమిత కాలంలో ఇలా యూజర్ 5 సార్లు మాత్రమే ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి వీలవుతుంది. సో.. ఇలా రెండుసార్లు రీచార్జ్ చేసుకొని, రెండు సార్లు 50 క్యాష్ బ్యాక్ ఆఫర్ పొందడం ద్వారా ప్రైమ్ మెంబర్ షిప్‌ను ఉచితంగా పొందవచ్చన్నమాట. కాగా 303 రూపాయల ప్లాన్‌లో ప్రైమ్ మెంబర్స్‌కు 30జీబీ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 2.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ, 499 రూపాయల ప్లాన్ లో 28 రోజుల వ్యాలిడిటీతో 58జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 5జీబీ డేటా, 999 రూపాయల రీచార్జ్‌పై ప్రైమ్ మెంబర్స్‌కు 60జీబీ హై స్పీడ్ డేటా, నాన్ ప్రైమ్ యూజర్లకు 12.5జీబీ డేటా, 60రోజుల వ్యాలిడిటీ, 1999 రూపాయల ప్లాన్‌లో ప్రైమ్ మెంబర్స్‌కు 125 జిబి 90 రోజుల వ్యాలిడిటీ, నాన్ ప్రైమ్ యూజర్లకు 30 రోజుల వ్యాలిడిటీ 30 జీబీ ఆఫర్ సంగతి తెలిసిందే. -
బాలీవుడ్ హిట్ పెయిర్ మురిపెం
ముంబై: బాలీవుడ్ హిట్ పెయిర్ జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నారు. తమ ముద్దుల కుమారుడు రియాన్ కబుర్లు చెప్పుకుని మురిసిపోతున్నారు. సుదీర్ఘ కాలం ప్రేమించుకుని దంపతులుగా మారిన వీరిద్దరూ ఇపుడిపుడే బుడిబుడి అడుగులు వేస్తున్న తమ చిన్నారి ఎదుగుదలను నలుగురితో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిడ్డలకు తొలి గురువులైన తల్లిదండ్రులుగా తన అనుభూతులతో కూడిన ఫోటో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ తన కొడుకు రియాన్ దేశ్‌ముఖ్‌కి తొలి పాఠం నేర్పాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు.అందరినీ గౌరవించడం ఎలాగో నేర్పాడట. ఒక తండ్రి కొడుక్కి నేర్పిన మొదటి పాఠం అంటూ ట్విట్ చేశాడు. దీంతో పాటు తన కుమారుడుతో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులకు, మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు రితీష్. Father teaches the son his first lesson - RESPECT ABOVE ALL riteishd https://t.co/VMhpdX3UkE — Genelia Deshmukh (@geneliad) November 10, 2015