బాలీవుడ్ హిట్ పెయిర్ మురిపెం | I trained my son How to respect eleders sasy rithish | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ హిట్ పెయిర్ మురిపెం

Published Tue, Nov 10 2015 6:37 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM

బాలీవుడ్ హిట్ పెయిర్  మురిపెం - Sakshi

బాలీవుడ్ హిట్ పెయిర్ మురిపెం

ముంబై: బాలీవుడ్ హిట్ పెయిర్   జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్  పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నారు. తమ ముద్దుల కుమారుడు రియాన్ కబుర్లు చెప్పుకుని మురిసిపోతున్నారు. సుదీర్ఘ కాలం ప్రేమించుకుని దంపతులుగా మారిన వీరిద్దరూ  ఇపుడిపుడే  బుడిబుడి అడుగులు వేస్తున్న తమ చిన్నారి  ఎదుగుదలను నలుగురితో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిడ్డలకు తొలి గురువులైన తల్లిదండ్రులుగా  తన అనుభూతులతో కూడిన ఫోటో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.   


జెనీలియా భర్త రితేశ్‌ దేశ్‌ముఖ్‌ తన కొడుకు రియాన్‌ దేశ్‌ముఖ్‌కి తొలి పాఠం నేర్పాడట.  ఈ విషయాన్ని అతనే స్వయంగా తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా తెలిపాడు.అందరినీ గౌరవించడం ఎలాగో నేర్పాడట.    ఒక తండ్రి కొడుక్కి నేర్పిన మొదటి పాఠం అంటూ ట్విట్ చేశాడు. దీంతో పాటు తన కుమారుడుతో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా   అభిమానులకు, మిత్రులకు  దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు రితీష్.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement