jenelia
-
జెనీలియా మూవీపై దర్శకుడు సంచలన ఆరోపణలు.. !
జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'మిస్టర్ మమ్మీ'. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. షాద్ అలీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏడాది చివర్లో విడుదల కానుంది. ఈ సినిమాలో మహేశ మంజ్రేకర్, అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిస్టర్ మమ్మీ ట్రైలర్లో రితేశ్ గర్భంతో కనిపిస్తుండగా.. మహేష్ మంజ్రేకర్ డాక్టర్ పాత్రలో కనిపించారు. అయితే తాజాగా ఈ సినిమాపై మరో దర్శకుడు సంచలన ఆరోపణలు చేశారు. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) కోల్‌కతాకు చెందిన చిత్రనిర్మాత, దర్శకుడు ఆకాశ్ ఛటర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ తన స్క్రిప్ట్‌ను కాపీ కొట్టిందని ఆయన ఆరోపించారు. 'మిస్టర్ మమ్మీ' చిత్రంలోని కాన్సెప్ట్‌ను తన స్టోరీ అయిన 'విక్కీ పేట్ సే' నుంచి కాపీ చేశారంటూ వ్యాఖ్యానించారు. ఆకాశ్ ఛటర్జీ మాట్లాడుతూ.. 2020లో నేను 'విక్కీ పేట్ సే' కథతో టీ-సిరీస్‌ను సంప్రదించా. అప్పుడు ఈ చిత్ర నిర్మాణానికి కూడా అంగీకరించారు. కానీ ఆ తర్వాత అసలు కథకు ఎలాంటి మార్పులు లేకుండా 'మిస్టర్ మమ్మీ' పేరుతో మూవీని రూపొందించారు.' అని అన్నారు. అందుకే తన కథకు క్రెడిట్ ఇవ్వాలని ఆకాశ్ ఛటర్జీ డిమాండ్ చేస్తున్నారు. తన స్క్రిప్ట్‌ను స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్‌లో రిజిస్టర్ చేశానని ఆకాశ్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. టి-సిరీస్‌తో అతని సంభాషణకు సంబంధిచిన స్క్రీన్ షాట్లను పంచుకున్నారు. ఆ చిత్రంలో టైటిల్ రోల్లో ఆయుష్మాన్ ఖురానా కనిపించారు. -
ఆ మాటలకు నా ఇగో హర్ట్ అయ్యింది: జెనీలియా భర్త
పాపులర్ టీవీ ప్రోగ్రాం ‘ది కపిల్ శర్మ కామెడీ షో’కు ఈ వారం జెనీలియా డిసుజా, ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ అతిధులుగా రాబోతున్నారు. అయితే ఈ షోలో రితేష్ దేశ్‌ముఖ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. బెంగుళూరులో ఒకసారి క్రికెట్ లీగ్ చూడటానికి వెళ్లినప్పుడు అక్కడ ఇద్దరు క్రికెటర్లు గుసగుసలాడుకొని ‘మీరు జెనీలియా భర్త కదా’ అని అడిగారని తెలిపారు. ఆ మాటకు తన ఇగో కొంచెం హర్ట్ అయ్యిందని రితేష్ తెలిపారు. ఇక అప్పుడు తను వారితో ‘చూడండి ఇక్కడ నేను జెనీలియా భర్తను అయితే మహారాష్ట్రలో ఆమె రితేష్ భార్య’ అని తెలిపాను. అప్పుడు వారు చూడండి ఒక్క రాష్ట్రం, మహారాష్ట్రలోనే ఆమెను రితేష్ భార్య అంటారు, కానీ కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మిమ్మల్ని జెనీలియా భర్త అనే అంటారు అని సమాధానం ఇచ్చారు అని రితేష్ చెప్పగానే అక్కడ ఉన్న వారందరూ గట్టిగా నవ్వారు. ఈ ఎపిసోడ్ ప్రోమోను సోని ఛానల్ వారు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. View this post on Instagram Bollywood ke cute aur talented couple Riteish-Genelia ke saath hogi dher saari romanchak baatein jab aayenge woh Kapil ke ghar. Dekhiye #TheKapilSharmaShow iss Sat-Sun raat 9:30 baje. @kapilsharma @kikusharda @krushna30 @bharti.laughterqueen @sumonachakravarti @banijayasia @archanapuransingh @chandanprabhakar @riteishd @geneliad A post shared by Sony Entertainment Television (@sonytvofficial) on Oct 20, 2020 at 12:30am PDT చదవండి: సుశాంత్ కేసు: రూ. 10 లక్షలు ఇప్పించండి! -
మిసెస్ శివాజీ
కెరీర్లో మంచి సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమించి పెళ్లాడారామె. వివాహం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ రితేష్ దేశ్‌ముఖ్ నటించి, నిర్మించే సినిమాల్లో సరదాగా అతిథి పాత్రల్లో మెరుస్తుంటారు. రితేష్ నటించిన ‘లాయి బహారీ, మౌళి’ సినిమాల్లో తళుక్కున మెరిశారు జెనీలియా. ప్రస్తుతం ఓ పూర్తి స్థాయి పాత్రతో తన కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రితేష్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాలో శివాజీ భార్య పాత్రలో కనిపించనున్నారట జెనీలియా. నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది. -
స్క్రీన్ టెస్ట్
కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆశయాలు, కొత్త కలలు... ఏడాదంతా బాగుండాలనే పాజిటివ్ ఫీలింగ్‌తో 2019 స్టార్ట్ అయింది. సంవత్సరంలో తొలి నెల, తొలి వారంలో ‘తొలి కబుర్లు’ ఈ వారం క్విజ్ స్పెషల్. 1. సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి యన్టీఆర్ నటించిన చిత్రం ‘మన దేశం’. కానీ యన్టీఆర్ ఏ చిత్రం ద్వారా మాస్ హీరోగా చిత్రపరిశ్రమలో నిలబడ్డారో తెలుసా? ఎ) పాతాళ భైరవి బి) గులేబకావళి కథ సి) గుండమ్మకథ డి) పాండవ వనవాసం 2. ప్రముఖ నటి విజయశాంతి తెలుగులో నటించిన మొదటి సినిమా ‘కిలాడి కృష్ణుడు’. ఆ చిత్రంలో హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) చిరంజీవి బి) మోహన్‌బాబు సి) నాగార్జున డి) కృష్ణ 3. తెలుగులో మొట్టమొదటి సూపర్‌స్టార్ ఈ ప్రముఖ నటి. ఆమె నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సింగర్, రచయిత. ఇంతకీ ఆమెఎవరు? ఎ) అంజలీదేవి బి) జమున సి) సావిత్రి డి) భానుమతి 4. తెలుగులో వచ్చిన మొదటి 70 యం.యం సినిమా పేరేంటో తెలుసా? ఎ) అల్లూరి సీతారామరాజు బి) ఈనాడు సి) తెలుగువీర లేవరా డి) సింహాసనం 5. ‘బంగారక్క’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమైన నటి ఎవరో తెలుసా? ఎ) రాధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుహాసిని 6. తాను హీరోయిన్గా నటించిన మొదటి చిత్రం హీరోనే పెళ్లి చేసుకున్న నటి ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ బి) సమంత సి) శ్వేతాబసు ప్రసాద్ డి) స్వాతి 7. నటుడు నాని నటించిన మొదటి చిత్రదర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) ‘పిల్లజమిందార్’ అశోక్ సి) సత్యం బెల్లంకొండ డి) నందినీరెడ్డి 8. వెంకటేశ్ నటించిన మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమైన ప్రముఖ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) నగ్మా బి) ఖుష్బూ సి) సౌందర్య డి) రోజా 9. ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసినందుకు ఆయనకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అనే పేరొచ్చింది. రచయితగా ఆయన తొలి సినిమా హీరో ఎవరో తెలుసా? ఎ) సర్వధమన్ బెనర్జీ బి) బాలకృష్ణ సి) సోమయాజులు డి) కృష్ణంరాజు 10. ప్రముఖ గాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి తన మొదటి తెలుగు సినిమా పాట పాడారో తెలుసా? ఎ) శోభన్‌బాబు బి) చంద్రమోహన్ సి) రంగనాథ్ డి) గిరిబాబు 11. రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి ఎవరు? ఎ) ఊర్మిళా మటోండ్కర్ బి) మైరా సరీన్ సి) రాధికా ఆప్టే డి) నిషా కొఠారి 12. ‘మంచి మనుషులు’ చిత్రంలో బాలనటునిగా నటించిన నటుడెవరు? చిన్న క్లూ: హీరోగా మెప్పించి, ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నారాయన? ఎ) జగపతిబాబు బి) వెంకటేశ్ సి) నాగార్జున డి) కమల్‌హాసన్ 13. సుకుమార్‌కి దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎవరో కనుక్కోండి? ఎ) అశ్వనీదత్ బి) సురేశ్‌బాబు సి) ‘దిల్’ రాజు డి) అల్లు అరవింద్ 14. అఖిల్ హీరోగా పరిచయమైన చిత్రం ‘అఖిల్’. ఆ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) పూరి జగన్నాథ్ డి) విక్రమ్ కె. కుమార్ 15. దేవిశ్రీ ప్రసాద్‌కి సంగీత దర్శకునిగా తొలి చిత్రం ‘దేవి’. ఆ చిత్రాన్ని యం.యస్. రాజు నిర్మించారు. చిత్ర దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) కృష్ణవంశీ సి) ఈవీవీ డి) శ్రీను వైట్ల 16. దర్శకుడు పూరీ జగన్నాథ్ 2000లో ఏ చిత్రం ద్వారా దర్శకునిగా మెగా ఫోన్ పట్టారో తెలుసా? ఎ) బాచీ బి) బద్రి సి) ఇడియట్ డి) శివమణి 17. నటుడు సుమంత్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ప్రేమకథ’. ఆ చిత్రంలో సుమంత్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) ఆంత్ర మాలి బి) ప్రీతీ జింతా సి) ప్రీతీ జింగ్యాని డి) అంజలా జవేరి 18. బాలీవుడ్ ప్రముఖ నటి కంగనారనౌత్ నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్. మరి ఆ చిత్ర హీరో ఎవరో తెలుసా? ఎ) మహేశ్‌బాబు బి) నితి¯Œ ∙సి) రానా డి) ప్రభాస్ 19. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’. ఆ చిత్రంలో తాతగా యస్వీఆర్ నటించారు. మరి మనవడిగా మురిపించిన నటుడెవరో గుర్తుందా? ఎ) చలం బి) శరత్‌బాబు సి) రాజనాల డి) రాజబాబు 20. హీరో రామ్ కెరీర్లో తొలి హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) హన్సిక బి) జెనీలియా సి) ఇలియానా డి) అక్ష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) డి 4) డి 5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ 11) సి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) డి 19) డి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
సేమ్ మ్యాజిక్
‘బొమ్మరిల్లు’ సినిమాలో హాసినిగా అలరించిన జెనీలియాను తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన జెనీలియా ఆరేళ్ల క్రితం తెలుగులో రానా హీరోగా వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత తెలుగుతెరపై కనిపించలేదు. అదే ఏడాది బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నారామె. ఆ తర్వాత ఇప్పటి వరకు మూడు హిందీ సినిమాల్లో గెస్ట్‌గా మెరిసిన ఆమె ‘మౌళి’ అనే మురాఠి చిత్రంలో ఓ పాటలో నర్తించారు. ఈ సినిమాలో ఆమె భర్త రితేష్ దేశ్‌ముఖ్ హీరో కావడం విశేషం. ‘‘జెనీలియాతో నటించే అవకాశాన్ని వదులుకోవాలనుకోను. ఈ సాంగ్‌లో నటించమని తనని అడిగా. నాలుగు సంవత్సరాల తర్వాత మేమిద్దరం కలిసి ఓ డ్యాన్స్ నంబర్‌కు కాలు కదపడం హ్యాపీగా ఉంది. ఇంతకుముందు జెనీలియా డ్యాన్స్‌లో ఎలాంటి మ్యాజిక్ ఉందో సేమ్ మ్యాజిక్ ఇప్పుడు కూడా ఉంది’’ అన్నారు రితేష్. ఈ సినిమాకు జెనీలియా నిర్మాతగా వ్యవహరించారు. నాలుగేళ్ల క్రితం ‘లయ్ భారీ’ అనే సినిమాలోని ఓ సాంగ్‌కు కలిసి నటించారు రితేష్ అండ్ జెనీలియా. -
బాలీవుడ్ హిట్ పెయిర్ మురిపెం
ముంబై: బాలీవుడ్ హిట్ పెయిర్ జెనీలియా, రితేష్ దేశ్ ముఖ్ పుత్రోత్సాహంలో మునిగి తేలుతున్నారు. తమ ముద్దుల కుమారుడు రియాన్ కబుర్లు చెప్పుకుని మురిసిపోతున్నారు. సుదీర్ఘ కాలం ప్రేమించుకుని దంపతులుగా మారిన వీరిద్దరూ ఇపుడిపుడే బుడిబుడి అడుగులు వేస్తున్న తమ చిన్నారి ఎదుగుదలను నలుగురితో పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బిడ్డలకు తొలి గురువులైన తల్లిదండ్రులుగా తన అనుభూతులతో కూడిన ఫోటో ఒకదాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. జెనీలియా భర్త రితేశ్ దేశ్‌ముఖ్ తన కొడుకు రియాన్ దేశ్‌ముఖ్‌కి తొలి పాఠం నేర్పాడట. ఈ విషయాన్ని అతనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపాడు.అందరినీ గౌరవించడం ఎలాగో నేర్పాడట. ఒక తండ్రి కొడుక్కి నేర్పిన మొదటి పాఠం అంటూ ట్విట్ చేశాడు. దీంతో పాటు తన కుమారుడుతో దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా అభిమానులకు, మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు రితీష్. Father teaches the son his first lesson - RESPECT ABOVE ALL riteishd https://t.co/VMhpdX3UkE — Genelia Deshmukh (@geneliad) November 10, 2015