స్క్రీన్‌ టెస్ట్‌ | tollywood movies special screen test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Fri, Jan 4 2019 5:07 AM | Last Updated on Tue, Jun 4 2019 6:45 PM

tollywood movies special screen test - Sakshi

కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆశయాలు, కొత్త కలలు...  ఏడాదంతా బాగుండాలనే  పాజిటివ్‌ ఫీలింగ్‌తో 2019 స్టార్ట్‌ అయింది. సంవత్సరంలో తొలి నెల, తొలి వారంలో  ‘తొలి కబుర్లు’ ఈ వారం క్విజ్‌ స్పెషల్‌.

1. సిల్వర్‌ స్క్రీన్‌పై మొదటిసారి యన్టీఆర్‌ నటించిన చిత్రం ‘మన దేశం’. కానీ యన్టీఆర్‌ ఏ చిత్రం ద్వారా మాస్‌ హీరోగా చిత్రపరిశ్రమలో నిలబడ్డారో తెలుసా?
ఎ) పాతాళ భైరవి     బి) గులేబకావళి కథ  సి) గుండమ్మకథ      డి) పాండవ వనవాసం

2. ప్రముఖ నటి విజయశాంతి తెలుగులో నటించిన మొదటి సినిమా ‘కిలాడి కృష్ణుడు’. ఆ చిత్రంలో హీరో ఎవరో చెప్పుకోండి?
ఎ) చిరంజీవి    బి) మోహన్‌బాబు    సి) నాగార్జున    డి) కృష్ణ

3. తెలుగులో మొట్టమొదటి సూపర్‌స్టార్‌ ఈ ప్రముఖ నటి. ఆమె నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సింగర్, రచయిత. ఇంతకీ ఆమెఎవరు?
ఎ) అంజలీదేవి  బి) జమున  సి) సావిత్రి  డి) భానుమతి

4. తెలుగులో వచ్చిన మొదటి 70 యం.యం సినిమా పేరేంటో తెలుసా?
ఎ) అల్లూరి సీతారామరాజు    బి) ఈనాడు   సి) తెలుగువీర లేవరా  డి) సింహాసనం

5. ‘బంగారక్క’ చిత్రం ద్వారా  తెలుగులో హీరోయిన్‌గా  పరిచయమైన నటి ఎవరో  తెలుసా?
ఎ) రాధ     బి) జయప్రద  సి) శ్రీదేవి   డి) సుహాసిని

6. తాను హీరోయిన్‌గా నటించిన మొదటి చిత్రం హీరోనే పెళ్లి  చేసుకున్న నటి ఎవరో కనుక్కోండి?
ఎ) శ్రియ బి) సమంత  సి) శ్వేతాబసు ప్రసాద్‌ డి) స్వాతి

7. నటుడు నాని నటించిన మొదటి చిత్రదర్శకుడెవరో చెప్పుకోండి?
ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) ‘పిల్లజమిందార్‌’ అశోక్‌  సి) సత్యం బెల్లంకొండ  డి) నందినీరెడ్డి

8. వెంకటేశ్‌ నటించిన మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమైన ప్రముఖ నటి ఎవరో తెలుసుకుందామా?
ఎ) నగ్మా బి) ఖుష్బూ  సి) సౌందర్య డి) రోజా

9. ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసినందుకు ఆయనకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అనే పేరొచ్చింది. రచయితగా ఆయన తొలి సినిమా హీరో ఎవరో తెలుసా?
ఎ) సర్వధమన్‌ బెనర్జీ బి) బాలకృష్ణ  సి) సోమయాజులు  డి) కృష్ణంరాజు

10. ప్రముఖ గాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి తన మొదటి తెలుగు సినిమా పాట పాడారో తెలుసా?
ఎ) శోభన్‌బాబు  బి) చంద్రమోహన్‌ సి) రంగనాథ్‌ డి) గిరిబాబు

11. రామ్‌గోపాల్‌ వర్మ ‘రక్తచరిత్ర’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్‌ నటి ఎవరు?
ఎ) ఊర్మిళా మటోండ్కర్‌  బి) మైరా సరీన్‌  సి) రాధికా ఆప్టే  డి) నిషా కొఠారి

12. ‘మంచి మనుషులు’ చిత్రంలో బాలనటునిగా నటించిన నటుడెవరు? చిన్న క్లూ:  హీరోగా మెప్పించి, ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నారాయన?
ఎ) జగపతిబాబు     బి) వెంకటేశ్‌  సి) నాగార్జున         డి) కమల్‌హాసన్‌

13. సుకుమార్‌కి  దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎవరో కనుక్కోండి?
ఎ) అశ్వనీదత్‌  బి) సురేశ్‌బాబు  సి) ‘దిల్‌’ రాజు  డి) అల్లు అరవింద్‌

14. అఖిల్‌ హీరోగా పరిచయమైన చిత్రం ‘అఖిల్‌’. ఆ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) శ్రీను వైట్ల   బి) వీవీ వినాయక్‌ సి) పూరి జగన్నాథ్‌  డి) విక్రమ్‌ కె. కుమార్‌

15. దేవిశ్రీ ప్రసాద్‌కి సంగీత దర్శకునిగా తొలి చిత్రం ‘దేవి’.  ఆ చిత్రాన్ని యం.యస్‌. రాజు నిర్మించారు. చిత్ర దర్శకుడెవరు?
ఎ) కోడి రామకృష్ణ     బి) కృష్ణవంశీ    సి) ఈవీవీ    డి) శ్రీను వైట్ల

16. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ 2000లో ఏ చిత్రం ద్వారా దర్శకునిగా మెగా ఫోన్‌ పట్టారో తెలుసా?
ఎ) బాచీ    బి) బద్రి    సి) ఇడియట్‌    డి) శివమణి

17. నటుడు సుమంత్‌ హీరోగా పరిచయమైన చిత్రం ‘ప్రేమకథ’. ఆ చిత్రంలో సుమంత్‌ సరసన నటించిన నటి ఎవరు?
ఎ) ఆంత్ర మాలి    బి) ప్రీతీ జింతా    సి) ప్రీతీ జింగ్యాని   డి) అంజలా జవేరి

18. బాలీవుడ్‌ ప్రముఖ నటి కంగనారనౌత్‌ నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌. మరి ఆ చిత్ర హీరో ఎవరో తెలుసా?
ఎ) మహేశ్‌బాబు     బి) నితి¯Œ    ∙సి) రానా    డి) ప్రభాస్‌

19. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’.  ఆ చిత్రంలో తాతగా యస్వీఆర్‌ నటించారు. మరి మనవడిగా  మురిపించిన నటుడెవరో గుర్తుందా?
ఎ) చలం    బి) శరత్‌బాబు    సి) రాజనాల    డి) రాజబాబు

20. హీరో రామ్‌ కెరీర్‌లో తొలి హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) హన్సిక బి) జెనీలియా సి) ఇలియానా డి) అక్ష

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) ఎ 2) డి 3) డి 4) డి  5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ
11) సి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) బి  17) ఎ 18) డి 19) డి  20) సి


నిర్వహణ: శివ మల్లాల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement