Shriya
-
స్పెషల్ సాంగ్స్‌కి సై
‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనేది సామెత. చిత్ర పరిశ్రమలో ఈ సామెత బాగా వర్తిస్తుంది. ప్రత్యేకించి హీరోయిన్ల విషయంలో.. క్రేజ్ ఉన్నప్పుడే వరుసగా సినిమాలు చేసి, అటు ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఇటు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెంచుకోవాలి. ఇందుకు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా ట్రెండ్‌కి తగ్గట్టుగా కెరీర్‌ని మలచుకుంటూ స్పెషల్ సాంగ్స్‌కి కూడా సై అంటున్నారు పలువురు కథానాయికలు.పైగా ప్రత్యేక పాటల్లో నటించే వారికి పారితోషికం కూడా భారీగా ఇస్తుండటంతో స్పెషల్ సాంగ్స్‌లో నర్తించేందుకు హీరోయిన్లు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే, శ్రియ, నేహా శెట్టి, కేతికా శర్మ, రెబా మోనికా జాన్, చంద్రికా రవి వంటి హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్‌లో నటిస్తున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.రెట్రోకి హైలైట్ ‘ఇష్టం’ (2001) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రియా శరణ్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్... ఇలా పలువురు హీరోలకి జోడీగా నటించి, స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు శ్రియ. ప్రస్తుతం హీరోయిన్గా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ సాంగ్స్‌పై దృష్టి పెట్టారు శ్రియ. ప్రత్యేక పాటల్లో నర్తించడం ఆమెకు కొత్త కాదు. రామ్‌ని హీరోగా, ఇలియానాని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి తెరకెక్కించిన ‘దేవదాసు’ (2006) సినిమాలో తొలిసారి ప్రత్యేక పాటలో చిందేశారు శ్రియ.ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘మున్నా’ (2007), వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ‘తులసి’ (2007), పవన్ కల్యాణ్ హీరోగా చేసిన ‘పులి’, సందీప్ కిషన్, సాయిదుర్గా తేజ్ నటించిన ‘నక్షత్రం’ (2017) వంటి తెలుగు సినిమాలతో పాటు పలు తమిళ, హిందీ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన శ్రియ తాజాగా ‘రెట్రో’ సినిమాలో ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొదుతున్న ఈ సినిమాలో సూర్యకి జంటగా పూజా హెగ్డే నటించారు.సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌లో సూర్యతో కాలు కదిపారు శ్రియ. గోవాలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో సూర్య, శ్రియలపై ఈ పాట చిత్రీకరించారు మేకర్స్. సూర్య, జ్యోతిక, కార్తికేయ సంతానం నిర్మించిన ఈ మూవీ మే 1న విడుదల కానుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ముచ్చటగా మూడోసారినాగచైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ (2014) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు పూజా హెగ్డే. ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోలకి జోడీగా నటించి, తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రస్తుతం తమిళ, హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నర్తించారు.రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘రంగస్థలం’ (2018) సినిమాలోని ‘జిల్ జిల్ జిగేల్ రాణి...’ పూజా చేసిన తొలి స్పెషల్ సాంగ్. ఈ పాటలో రామ్‌చరణ్, పూజా హెగ్డే మాస్ డ్యాన్సులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘ఎఫ్ 3’ (2022) సినిమాలో ‘అధ్యక్షా... లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా...’ అనే సాంగ్‌లో రెండోసారి చిందేసిన పూజ ముచ్చటగా మూడోసారి ‘కూలీ’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు.రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొదిన చిత్రం ‘కూలీ’. అనిరు«ధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీలోని ప్రత్యేక పాట చాలా వెరీ వెరీ స్పెషల్‌గా ఉంటుందట. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సన్న్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘కూలీ’ నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించలేదు.అది దా సర్ప్రైజ్అది దా సర్ప్రైజ్ అంటున్నారు కేతికా శర్మ. ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమయ్యారు కేతిక. 2021 అక్టోబరు 21న విడుదలైన ఈ మూవీలో ఈ అమ్మడు అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘లక్ష్య, రంగరంగ వైభవంగా, బ్రో’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన కేతికా శర్మ తొలిసారి ‘రాబిన్‌హుడ్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. ‘భీష్మ’ (2020) వంటి హిట్ మూవీ తర్వాత హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొదిన ద్వితీయ చిత్రం ‘రాబిన్‌హుడ్’.శ్రీలీల హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలో ‘అది దా సర్ప్రైజ్...’ అంటూ సాగే ప్రత్యేక పాటలో కేతికా శర్మ సందడి చేశారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించిన ఈ పాటని ఇటీవలే విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటని నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి పాడగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.నా ముద్దుపేరు స్వాతి రెడ్డి శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవర గమన’ (2023) సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు రెబా మోనికా జాన్. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ బ్యూటీ క్రేజ్ ఓ రేంజ్‌కి వెళ్లింది. ప్రస్తుతం ఆమె ‘మృత్యుంజయ్’ మూవీలో శ్రీవిష్ణుతో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. ఓ వైపు హీరోయిన్గా నటిస్తున్న ఈ బ్యూటీ మరోవైపు ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారు. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’.కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియాంకా జవాల్కర్, మురళీధర్ గౌడ్, డైరెక్టర్ కేవీ అనుదీప్ కీలక పాత్రలు పోషించారు. ‘మ్యాడ్’కి (2023) సీక్వెల్‌గా రూపొదిన ‘మ్యాడ్ స్క్వేర్’లో రెబా మోనికా జాన్ ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.‘నా ముద్దుపేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి... నే ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి...’ అంటూ సాగే ఈ పాటలో హుషారైన స్టెప్పులు వేశారు రెబా. సురేష్ గంగుల సాహిత్యం అందించిన ఈ పాటని స్వాతి రెడ్డి, భీమ్స్ ఆలపించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్ కానుంది.మొదటి సారి...ఆకాశ్ పూరి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘మెహబూబా’ (2018) సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగుకి పరిచయం అయ్యారు కన్నడ బ్యూటీ నేహా శెట్టి. ఆ సినిమా తర్వాత ‘గల్లీ రౌడీ, డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి సినిమాల్లో నటించి, మెప్పించారామె. సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమాలో రాధిక పాత్రతో కుర్రకారు మనసులు దోచేశారీ బ్యూటీ. ఈ మూవీలో ఆమె నటన, గ్లామర్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇదిలా ఉంటే నేహా శెట్టి తొలిసారి ఓ ప్రత్యేక పాటలో చిందేశారు. పవన్ కల్యాణ్ హీరోగా ‘సాహో’ మూవీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా మోహన్, శ్రియా రెడ్డి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో పవన్ కల్యాణ్‌తో కలిసి చిందేశారట నేహా శెట్టి. థాయ్‌ల్యాండ్‌లో ఈ పాటని చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరులో రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్.టచ్‌లో ఉండు ఓ రబ్బీ...తమిళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా నటించిన చంద్రికా రవి ఓ స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాలో ఓ ప్రత్యేక పాట ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారీ బ్యూటీ. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీర సింహారెడ్డి’ (2023) మూవీలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే...’ అనే స్పెషల్ సాంగ్‌లో తనదైన గ్లామర్, డ్యాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేశారు చంద్రిక.తాజాగా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేశారామె. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా ద్వారా హీరోగా పరిచయమైన యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన ద్వితీయ చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం నితిన్, భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దీపికా పిల్లి కథానాయికగా నటించారు. యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొదిన ఈ మూవీలో ‘టచ్‌లో ఉండు ఓ రబ్బీ... ఓ రబ్బీ...’ అంటూ చిందేశారు చంద్రిక.ఈ పాటకి చంద్రబోస్ మాస్ లిరిక్స్ అందించగా, లక్ష్మీ దాస, పి. రఘు పాడారు. రధన్ తనదైన హుషారైన సంగీతం అందించారు. శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై రూపొదిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ఏప్రిల్ 11న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో చిరంజీవితో కలిసి ఊర్వశీ రౌతేలా చిందేయనున్నారని టాక్. ‘వాల్తేరు వీరయ్య’ (2023) సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ...’ అనే ప్రత్యేక పాటలో చిరంజీవి– ఊర్వశీ రౌతేలా తమదైన స్టెప్పులతో అలరించిన సంగతి తెలిసిందే.ఈ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ‘విశ్వంభర’లోనూ చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌లో ఊర్వశి మెరవనున్నారట. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ మూవీ ఈ వేసవిలో విడుదల కానుందని టాక్. ఇదిలా ఉంటే... బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన హిందీ చిత్రం ‘జాట్’. ఈ మూవీలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా ఇతర కీలక పాత్రధారులు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాటలో హీరోయిన్ నిధీ అగర్వాల్ మెరవనున్నారని టాక్. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. కాగా ‘విశ్వంభర’లో ఊర్వశీ రౌతేలా, ‘జాట్’లో నిధీ అగర్వాల్ స్పెషల్ సాంగ్స్ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.వీరే కాదు.. మరి కొందరు హీరోయిన్లు కూడా ప్రత్యేక పాటల్లో సందడి చేయనున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
ఆ విషయంలో నేను లక్కీ
‘‘పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, సంగీతం కూడా చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రులు కేవలం చదువు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల్ని చదువుతోపాటు సంగీతం, ఆటపాటల్లోనూప్రోత్సహించాలని చెప్పే చిత్రమే ‘మ్యూజిక్ స్కూల్’’ అన్నారు శ్రియ.పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ► శ్రియ, శర్మాన్ జోషి, షాన్ ప్రధానపాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ‘దిల్’ రాజు, హిందీలో ‘పీవీఆర్’ సినిమాస్ ‘మ్యూజిక్ స్కూల్’ని రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో శ్రియ చెప్పిన విశేషాలు. ► ఐఏఎస్‌గా ఉన్నత స్థానంలో ఉన్నపాపారావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఐదారు కథలు సిద్ధం చేసుకున్నారు. వాటిలో ‘మ్యూజిక్ స్కూల్’ ఒకటి. ఈ కథ వినగానే ఎగై్జటింగ్‌గా అనిపించడంతో నటించేందుకు ఓకే చె΄్పాను. ‘సంతోషం’ చిత్రంలో నేను సంగీతం నేర్చుకునే స్టూడెంట్‌గా చేశా. ‘మ్యూజిక్ స్కూల్’లో సంగీతం నేర్పించే టీచర్పాత్ర నాది. ► పిల్లల్లో ఉండే ప్రతిభని తల్లితండ్రులు గుర్తించి,ప్రోత్సహించాలి. ఆ విషయంలో నేను లక్కీ. మా తల్లితండ్రులు ఏ విషయంలోనూ నాకు అడ్డు చెప్పకుండాప్రోత్సహించారు. మా అమ్మాయి రాధను కూడా చదువుతోపాటు సంగీతం, డ్యాన్స్, ఆటల్లో ప్రోత్సహిస్తాను.పాపారావుగారు ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ సినిమాకి ఇళయరాజాగారి సంగీతం హైలైట్. ∙‘ఇష్టం’ (2001) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఇన్నేళ్ల కెరీర్లో ఎంతోమంది దర్శకులతో పనిచేశా.. ఎన్నో వైవిధ్యమైనపాత్రలు చేశా.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను చేసే ప్రతిపాత్ర డ్రీమ్ రోల్లాంటిదే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్లో ఐదురోజులు మాత్రమేపాల్గొన్నాను. నాపాత్ర నిడివి తక్కువే అయినా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌ను సవాలుగా తీసుకుని చేస్తాను. ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నాను. -
20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!
హీరోయిన్ శ్రియ శరన్ క్రేజ్ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో అలరిస్తుంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ మెగాస్టార్ చిరంజీవితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇష్టం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రియ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించింది. కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే కుర్ర హీరోలతో పాటు బడా హీరోలతోనూ జతకట్టింది. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. 2003లో వచ్చిన బ్లాక్ బస్టర్ ఠాగూర్ చిత్రంలో చిరు సరసన హీరోయిన్గా నటించింది. అయితే ఇప్పుడు మరోసారి చిరుతో స్టెప్పులు వేయనుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి ‘భోళా శంకర్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం శ్రియను సంప్రదించగా, ఆమె కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ పాట కోసం ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. చదవండి: ఇండస్ట్రీకి రాకముందు సిరి ఏం చేసేదో తెలుసా? ఫస్ట్ జాబ్ అదేనట -
తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా నేర్చుకున్నా
‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి చాలా నేర్చుకుని, రాసుకుని సినిమాలు చేశాను. దర్శకుడు చంద్రు మూడేళ్లు కష్టపడి ‘కబ్జ’ చిత్రాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చారు’’అని ఉపేంద్ర అన్నారు. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర, శ్రియ జంటగా సుదీప్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ మార్చి 17న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్ .సుధాకర్ రెడ్డి సమర్పణలో హీరో నితిన్ రుచిరా ఎంటర్టైన్ మెంట్స్, ఎన్. సినిమాస్ పతాకాలపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఆర్.చంద్రు మాట్లాడుతూ–‘‘మార్చి 17న పునీత్ రాజ్‌కుమార్‌గారి జయంతి.. ఆ రోజు మా ‘కబ్జ’ని రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఉపేంద్రగారితో వర్క్ చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శ్రియ. కాగా ఆస్కార్ ముంగిట నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్య, ‘నాటు నాటు..’ పాట రాసిన చంద్రబోస్‌ను ఉపేంద్ర అండ్ టీమ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సాయినాథ్, హనుమంత రెడ్డి, లగడపాటి శ్రీధర్, హీరో విశ్వక్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్న సీనియర్ హీరోయిన్లు
సినిమాల సక్సెస్ రేటు పడిపోయింది. విజయాలు రావటం అంటే అశా మాషి విషయం కాదు అనేలా మారింది. అయితే..కొందరు సీనియర్ భామలు మాత్రం..వెతుక్కుంటూ మరి హిట్ సినిమాలలో నటిస్తున్నారు. వీళ్ల గురించి..ఎవరు పట్టించుకోని టైమ్ లో..ఫోకస్ మొత్తం ఈ బ్యూటీల సైడ్ మారిపోయేలా చేశారు.ముందు ముందు కూడా మంచి సినిమాలతో దూసుకపోయేలా ప్లాన్ కూడా చేస్తున్నారు. టాబు అప్పట్లో కథానాయికగా ఓ ఊపు ఊపింది.ఇప్పుడు కూడా ప్రధాన పాత్రలలో నటిస్తూ..ఆకట్టుకుంటుంది. ఈమె నటించిన దేదే ప్యార్ దే మూవీ హిట్ కొట్టింది.అలాగే అల..వైకుంఠపురంలో మూవీలో కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించిన మ్యాటర్ తెలిసిందే. ఈమె ప్రధాన పాత్రలో నటించిన భూల్ భులయ్య 2 కూడా బిగ్ హిట్ కొట్టింది.అలాగే రీసెంట్ గా దృశ్యం 2 లో కూడా నటించింది.ఈ మూవీ రెండు వందల కోట్ల వసూళ్లు రాబట్టింది శ్రీయా శరన్ కూడా టాలీవుడ్ తో పాటు..బాలీవుడ్ లో నటించింది. ఈ భామ అదృష్టం కూడా బాగానే ఉంది. ట్రిపుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీలో ఓ పాత్రలో మెరిసింది..దృశ్యం 2 లో అజయ్ దేవగన్ పక్కన జోడి కట్టింది. 2018 లో వచ్చిన 96 సినిమా తప్పితే,త్రిషకు అనుకున్న విజయాలు మాత్రం దక్కటం లేదు. ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ మూవీలో కుందవాయ్ దేవిగా ఆకట్టుకుంది .ఈ మూవీ బిగ్ హిట్ కొట్టింది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి 67 మూవీ రూపొందబోతుంది.ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా ఫిక్స్ అయిందట. మొత్తానికి సినిమా సక్సెస్ రేట్ పడిపోయినా..కొందరు సీనియర్ హీరోయిన్స్ బాక్సాఫీసు దగ్గర సత్తా చూపిస్తున్నారు. -
25న చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్
‘‘చెన్నకేశవరెడ్డి’ సినిమాని 20 ఏళ్ల క్రితం ఒక పండగలా రిలీజ్ చేశాం. ఇప్పుడు కూడా రీ రిలీజ్‌లా లేదు.. కొత్త సినిమాని విడుదల చేస్తున్నట్లే అనిపిస్తోంది. మంచి ఉద్దేశం కోసం రీ రిలీజవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, నందమూరి ఫ్యాన్స్ ఆదరించాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. బాలకృష్ణ హీరోగా, టబు, శ్రియ హీరోయిన్లుగా వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెన్నకేశవ రెడ్డి’. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా 2002 సెప్టెంబర్ 25న రిలీజైంది. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 25న రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు బెల్లంకొండ సురేష్. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’లో బాలయ్యగారిని ఎలా చూపించాలా? అనే పిచ్చితో కొన్ని గంటలు మాత్రమే నిద్రపోయేవాణ్ణి. ఈ సినిమాలో వచ్చే మేజర్ రెవెన్యూని ‘బసవతారకం ట్రస్ట్’కి విరాళంగా ఇస్తాం’’ అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’ రీ రిలీజ్ గురించి బాలకృష్ణగారికి చెప్పగానే సంతోషపడ్డారు. ఈ నెల 24న ప్రీమియర్ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్ షోలతో విడుదల చేస్తున్నాం. రీ రిలీజ్లో ఒక సినిమాని కోటి రూపాయలకు అడిగిన దాఖలాలు లేవు.. కానీ పలువురు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కోటి రూపాయలకు అడగడం ‘చెన్నకేశవ రెడ్డి’ క్రేజ్‌కి నిదర్శనం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం ‘బసవతారకం ట్రస్ట్’కి, మిగతాది నాకు సంబంధించిన అసోషియేషన్స్కి ఇస్తాను. నవంబర్ నుంచి మళ్లీ యాక్టివ్‌గా ప్రొడక్షన్ మొదలు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు. -
మ్యూజిక్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోనున్న శ్రియా సరన్!
‘మ్యూజిక్ స్కూల్’లో అడ్మిషన్ తీసుకోనున్నారు శ్రియ. కానీ ఈ మ్యూజిక్ స్కూల్ సంగీతం నేర్చించే అకాడమీ కాదు. సంగీతం ద్వారా పిల్లల చదువుల గురించి చెప్పే ‘మ్యూజిక్ స్కూల్’ సినిమాలో ఆమె కథానాయికగా నటించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా బాణీలు అందిస్తారు. ‘విల్లింగ్ టు శాక్రిఫైజ్’ డాక్యుమెంటరీతో జాతీయ స్థాయి అవార్డులు సాధించిన బియ్యాల పాపారావు దర్శకత్వంలో ఈ సినిమాను యామినీ ఫిలింస్ నిర్మించనుంది. శర్మాన్ జోషి, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించనున్న ఈ బహు భాషా చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాశ్‌రాజ్ తదితరులు కీలక పాత్రధారులు. డాక్టర్లను, ఇంజినీర్లను చేయడానికి పిల్లలను క్రీడలకు, కళలకు దూరం చేస్తున్న అంశం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందట. ఇందులో దాదాపు పన్నెండు పాటలు ఉంటాయని సమాచారం. ఈ సినిమాకు లండన్ బేస్డ్ సినిమాటోగ్రాఫర్ కిరణ్ దేవ్హాన్స్ (హిందీ చిత్రం ‘జోధాఅక్బర్’కు వర్క్ చేశారు) వర్క్ చేయనున్నారు. -
హీరోగా రాఘవేంద్రుడు
దర్శకులు రాఘవేంద్రరావు తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్స్లో ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు సాధారణం. ఆయన తదుపరి సినిమాలోనూ ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలిసింది. అయితే ఇది ఆయన దర్శకుడిగా తెరకెక్కించే సినిమాలో కాదు. హీరోగా చేయబోతున్న సినిమాలో. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఆయన కథానాయకుడిగా, నలుగురు హీరోయిన్లతో ఓ సినిమా ప్రస్తుతం ప్లానింగ్‌లో ఉంది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్లు రమ్యకృష్ణ, శ్రియ, సమంత, ఓ కొత్త హీరోయిన్ నటించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ఈ సినిమాలో రాఘవేంద్రరావు భార్యగా రమ్యకృష్ణ కనిపిస్తారట. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకుడు. జనార్దన∙మహర్షి కథారచయిత, చంద్రబోస్ పాటల రచయిత, కీరవాణి సంగీత దర్శకుడు. -
మేము సిద్ధమే అంటున్న హీరోయిన్స్
కథానాయికలంటే గ్లామర్‌కి మాత్రమే.. పాటల్లో కలర్ఫుల్గా కనిపించడానికే... సినిమాల్లో నాయికలకు సీన్లు ఉన్నా కథలో పెద్దంత సీన్ ఉండదు. అందుకే... కథతో పాటుగా ప్రయాణించే పాత్రలు ఇవ్వండి. ఛాలెంజింగ్ పాత్రలు రాయండి.. చాలెంజ్‌లు విసరండి. మేము సిద్ధమే అంటున్నారు కథానాయికలు. ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకుంటున్నారు. ఆ పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు. వాళ్ల స్టోరీ ఏంటో చూద్దాం. కాజల్ అగర్వాల్ ఇప్పటివరకూ చాలా రకాల పాత్రలు చేశారు. కానీ తొలిసారి వయసుకు మించిన పాత్రను చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో కాజల్ 80 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నారు. కాజల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా పాల్గొంటారని సమాచారం. అంటే.. యంగ్ ఏజ్, ఓల్డేజ్ ఏజ్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం పల్లెటూరి అమ్మాయిగా మారిపోయారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ సినిమాలో రకుల్ పాత్ర డీ గ్లామరైజ్డ్గా ఉంటుంది కూడా. అంటే మేకప్ లేకుండా కనిపించనున్నారు. ఈ సినిమాలో రకుల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక శ్రియను మనందరం ఇప్పటి వరకూ అన్నీ పాజిటివ్ పాత్రల్లోనే చూశాం. తనలోని విలన్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నెగటివ్ యాంగిల్‌ను చూపించడానికి రెడీ అవుతున్నారు. హిందీ చిత్రం ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోంది. ఇందులో నితిన్ హీరో. ఈ సినిమాలో విలన్ పాత్రలో శ్రియ నటించనున్నారని టాక్. ‘సీటీ మార్’ చిత్రం కోసం కబడ్డీ కోచ్‌గా మారారు తమన్నా. కోచ్ ఎలా ఉండాలి? ఫిట్నెస్, బాడీ లాంగ్వేజ్ వంటి విషయాల మీద శ్రద్ధ పెట్టి ఈ పాత్ర చేస్తున్నారు తమన్నా. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ హీరో. ‘మూకుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రంలో అమ్మవారిగా కనిపించనున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ పాత్ర చేస్తున్నన్ని రోజులు నియమ నిష్టలతో ఉన్నారట. మాంసాహారం ముట్టుకోలేదు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. పరుగుల రాణిగా మారబోతున్నారు తాప్సీ. ‘రాకెట్ రష్మి’ అనే చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారామె. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ చిత్రం. ఈ పాత్ర కోసం డైట్ మార్చేశారు. వ్యాయామాలు చేస్తూ, రన్నింగ్ మీద దృష్టి పెట్టారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా గ్రామీణ యువతిగా కనిపిస్తారట. అలానే చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఆల్రెడీ చిత్తూరు యాసను ప్రాక్టీస్ చేయడంతోపాటు గ్రామీణ యువతి హావభావాలను నేర్చుకుంటున్నారట. సమంత ఇటీవలే ఓ కొత్త దర్శకుడి సినిమాలో నటించడానికి అంగీకరించారట. ఈ సినిమాలో ఆమె మూగ మరియు చెవిటి అమ్మాయిగా కనిపించనున్నారు. ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని టాక్. ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో ఆయనకు జోడీగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండు పాత్రలకు మధ్య వ్యత్యాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట పూజా హెగ్డే. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర చేస్తున్నారు కంగనా రనౌత్. ‘తలైవి’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇలా కొత్త పాత్రలు విసురుతున్న సవాల్‌ను స్వీకరించి శారీరకంగా లేదా మానసిక శ్రమను ఇష్టంగా తీసుకుంటున్నారు నాయికలు. ఇలాంటి చాన్స్‌లు అరుదుగా వస్తాయి కాబట్టి నిరూపించుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. శభాష్ అనిపించుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
శ్రియ గమనం
శ్రియ కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘గమనం’. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. పోస్టర్లో మధ్యతరగతి యువతిలా కనిపిస్తున్నారు శ్రియ. ఓ రియల్ లైఫ్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు సృజనరావు తెరకెక్కించారు. కెమెరామేన్ జ్ఞానశేఖర్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా చేస్తూనే రమేశ్ కరుటూరి, వెంకీ పుషడపులతో కలిసి నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందించారు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాశారు. -
కిలాడీ లేడీ ఎవరు?
హిందీలో ఘనవిజయం సాధించిన ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోందనే వార్తలు వచ్చినప్పటి నుండి ఒకటే ప్రశ్న – ‘హిందీలో టబు చేసిన పాత్ర ఎవరు చేస్తారు?’ అని. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అంధాధూన్’. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. నభా నటేష్ హీరోయిన్. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మించనున్నారు. అయితే మొదటి నుంచి టబు పోషించిన పాత్రకు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పాత్రకు అంత స్పెషాలిటీ ఏంటీ అంటే? నెగటివ్ షేడ్స్ ఉండటమే. కథను మలుపు తిప్పే కిలాడీ పాత్ర కావడమే అందుకు ప్రధాన కారణం. మొదట టబూయే ఆ పాత్ర మళ్లీ చేస్తారు అనే వార్త వచ్చింది. తర్వాత నయనతార ఆ పాత్ర చేయబోతున్నారని ఓ వార్త. తాజాగా ఈ పాత్రకు ప్రియమణి లేదా శ్రియను తీసుకోవాలనుకుంటున్నారట చిత్రబృందం. మరి ఈ కిలాడీ లేడీ పాత్ర చేసే ఛాన్స్ ఎవరికొస్తుందో వేచి చూడాలి. -
ఒక్కో బుక్... ఒక్కో కిక్
లాక్ డౌన్ లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సమయాన్ని వినియోగించుకుంటున్నారు. యోగా, ధ్యానం, డాన్స్, కుకింగ్, బుక్స్... ఇవన్నీ శ్రియను బిజీగా ఉంచుతున్నాయట. ఈ లాక్ డౌన్లో చదివిన పుస్తకాల గురించి ఓ వీడియోను పంచుకున్నారామె. ఒక్కో బుక్ ఒక్కో కిక్ ఇచ్చిందంటున్నారీ బ్యూటీ. ఇటీవల తాను చదివిన పుస్తకాల గురించి శ్రియ మాట్లాడుతూ –‘‘విలియమ్ డాల్ రాసిన ‘అనార్కీ’ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. చరిత్రకు సంబంధించిన విషయాలు భలే ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. దక్షిణ భారత దేశానికి సంబంధించిన చరిత్ర పుస్తకాలు వెతుకుతున్నాను. ‘గాడ్ ఫాదర్’ చిత్రదర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పొల రచించిన ‘లివ్ సినిమా అండ్ ఇట్స్ టెక్నిక్స్’ చదివాను. సినిమాలంటే ఇష్టం ఉన్నవాళ్లు, సినిమాల్లో పని చేసేవాళ్లు ఈ బుక్ కచ్చితంగా చదవాలి. చాలా స్ఫూర్తివంతంగా అనిపించింది. ఈ పుస్తకాన్ని ఆండ్రూ (శ్రియ భర్త) నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. రచయిత జో డిస్పెంజ్ ‘బికమింగ్ సూపర్ న్యాచురల్’లో మన మెదడు ఎలా పని చేస్తుందో భలే చెప్పాడు. ట్రెవోర్ నోహా రాసిన ‘బోర్న్ క్రై మ్’ సరదాగా సాగింది. ‘ఉమెన్ హూ రన్ విత్ ఉల్ఫ్వ్’ మన స్పిరిట్‌ని పెద్ద స్థాయిలో ఉంచుతుంది. యోగాకి సంబంధించి ‘కృష్ణమాచార్య : హిజ్ లైఫ్ అండ్ టీచింగ్స్’ చదివాను. విపాసనకు సంబంధించి కొన్ని పుస్తకాలు చదివాను. ఈ పుస్తకాలన్నీ మీరు కూడా చదివి ఆనందిస్తారని, నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మీరు కూడా నాకేదైనా పుస్తకాలు సూచించండి. విషాదంగా ఉండే పుస్తకాలు మాత్రం వద్దు’’ అన్నారు శ్రియ. -
మరో మూడు నెలల్లో రెండేళ్లు
గత ఏడాది మార్చిలో బ్యాచిలర్ లైఫ్‌కి ఫుల్స్టాప్ పెట్టారు శ్రియ. తన బాయ్‌ఫ్రెండ్, రష్యాకు చెందిన బిజినెస్‌మ్యాన్ ఆండ్రూ కోచీవ్‌ను పెళ్లాడారామె. కానీ ఈ వేడుక అతికొద్ది మంది స్నేహితులతో, పెద్ద హడావిడి లేకుండా జరిగింది. వివాహం విషయంలో అంత గోప్యత పాటించడానికి కారణం ఏంటి? అనే ప్రశ్నను శ్రియ ముందుంచితే – ‘‘ఆండ్రూతో వివాహం అయి మరో మూడు నెలల్లో రెండేళ్లు పూర్తి కావస్తోంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. మా పెళ్లిని రహస్యంగానో, చాటుగానో ఉంచాలనుకోలేదు. పెళ్లనేది నాకు, ఆండ్రూకి జరిగిన చాలా వ్యక్తిగతమైన విషయం. మా వ్యక్తిగత విషయం మా మధ్యనే ఉండాలనుకున్నాం. అంతకు మించి వేరే కారణం ఏం లేదు. సినిమాలు నా వృత్తి. ఆ విషయంలో మా ఆయన చాలా సపోర్ట్‌గా ఉన్నారు. నేను ఎక్కువ సినిమాలు చేయాలంటున్నారు ఆయన’’ అని పేర్కొన్నారు. భర్తతో విదేశాల్లో నివసిస్తున్నారు శ్రియ. ‘‘ముంబైలో ఉంటున్న మా అమ్మానాన్న దగ్గరకు వచ్చి వెళుతుంటాను. అలాగే సినిమాల షూటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళతాను. నేను ఎక్కడ ఉన్నా షూటింగ్స్‌కి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను’’ అన్నారు శ్రియ. -
తీన్మార్?
‘సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల’ సినిమాల్లో జంటగా నటించారు వెంకటేశ్, శ్రియ. వెంకటేశ్ నటించిన ‘తులసి’ సినిమాలో ‘నే చికుబుకు బండినిరో..’ అనే స్పెషల్ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ఇప్పుడు మూడోసారి వెంకటేశ్, శ్రియ జోడీ కడుతున్నట్టు తెలిసింది. ధనుష్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ చిత్రం ‘అసురన్’ని వెంకటేశ్ తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలోనే హీరోయిన్గా శ్రియ నటించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది అధికారిక ప్రకటన రాలేదు. టీవీ యాంకర్, దర్శకుడు ఓంకార్ ఈ రీమేక్‌ను డైరెక్ట్ చేయొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కలైపులి యస్. థాను, సురేశ్‌బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
భర్త క్షేమం కోరి...
కర్వా చౌత్... ఉత్త రాదిన పాటించే ఆచారం ఇది. కర్వా చౌత్ నాడు భర్త ఆయురారో గ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు. హిందీ పరిశ్రమలో ప్రతి ఏడాదీ ఉపవాసం ఆచరించి, పూజలు చేసే తారలు చాలామందే ఉన్నారు. గురువారం కర్వా చౌత్ సందర్భంగా కొందరు తారలు ఉపవాసం ఉన్నారు. తన భార్య జయా బచ్చన్ ఉపవాసం ఉన్న విషయాన్ని అమితాబ్ ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. గతంలో తామిద్దరూ దిగిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో తాను కనిపించకుండా జయబాధురి కనిపించేట్లు ఫొటో పెట్టి, ‘బెటర్ హాఫ్. మిగతా సగం ఇక్కడ అనవసరం. అందుకే కనిపించడంలేదు’’ అని సరదాగా అన్నారు. అనిల్ కపూర్ తాను పరిగెడుతున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘‘ఇన్నేళ్లుగా నువ్వు (భార్య సునీతను ఉద్దేశించి) చూపిస్తున్న ప్రేమ, చేస్తున్న పూజలు, ఆచరిస్తున్న ఉపవాసాలే నన్ను వేగంగా పరిగెత్తేలా చేస్తున్నాయి. ప్రతిరోజూ నేను ఆరోగ్యంగా ఉండేలా చేస్తున్నాయి. హ్యాపీ కర్వా చౌత్’’ అని పేర్కొన్నారు. ‘‘ఉపవాసం కోసం అంతా సిద్ధం చేసుకున్నాను. కొందరు కనిపించని, ఎప్పటికీ కలవని దేవుళ్ల కోసం ఉపవాసం ఉంటారు. కానీ నేను బతికి ఉన్నవాళ్ల కోసం చేస్తుంటాను. నా జీవితాన్ని ఆనందమయం చేసిన నా తల్లిదండ్రులు, నా భర్త, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆనందం కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అన్నారు రవీనా టాండన్. ఫిట్నెస్కి బాగా ప్రాధాన్యం ఇచ్చే శిల్పా శెట్టి.. ఉపవాసం ఉంటున్న వాళ్ల కోసం ‘లౌకీ కీ ఖీర్’ అనే పోషకాలు ఉన్న స్వీట్‌ని ఎలా తయారు చేయాలో చెప్పారు. సొరకాయతో ఈ ఖీర్ తయారు చేస్తారు. ప్రతి ఏడాదీ కర్వా చౌత్‌ని బాగా చేసుకుంటారు శిల్పా శెట్టి. ఈ ఏడాది కూడా ఫాస్టింగ్ ఉన్నారు. బార్సిలోనాలో శ్రియ పండగ చేసుకున్నారు. గత ఏడాది మార్చిలో రష్యాకి చెందిన వ్యాపార వేత్త ఆండ్రీ కొషీవ్ని ఆమె పెళ్లాడారు. ‘‘అందరికీ కర్వా చౌత్ శుభాకాంక్షలు. మా అమ్మగారిని మిస్ అవుతున్నాను. అయితే పండగ సందర్భంగా తను పంపించిన ‘గోటా పట్టి’ చీర కట్టుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు శ్రియ. ఇంకా షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్ కూడా భర్త కోసం ఉపవాసం ఉన్నారు. ఇలా గురువారం తారల డిజైనర్ శారీస్, నగలతో ఉత్తరాదిన కర్వా చౌత్ సందడి కనిపించింది. ఇంకో విషయం ఏంటంటే...పండగ సందర్భంగా ‘దబాంగ్ 3’లో సోనాక్షీ సిన్హా లుక్‌ని విడుదల చేశారు. మామూలుగా కర్వా చౌత్ రోజున జల్లెడ లోంచి చంద్రుడ్ని చూస్తారు. ఈ లుక్ కూడా అలానే ఉంది. సో.. సినిమాలో భర్త సల్మాన్ ఖాన్ కోసం సోనాక్షీ కర్వా చౌత్ ఆచరించే సీన్ ఉంటుందన్న మాట. జయా బచ్చన్ ఆండ్రీ, శ్రియ -
మాటలొద్దు.. సైగలే
‘నాతో ఏదైనా చెప్పాలంటే మాట్లాడకండి.. సైగ చేయండి’ అంటున్నారు కథానాయిక శ్రియ. అలా సైగ చేస్తే విషయాన్ని త్వరగా అర్థం చేసుకుంటానని చెబుతున్నారట. కానీ, ఇదంతా వెండితెరపై మాత్రమే. నిజ జీవితంలో కాదు. తన తాజా చిత్రంలో శ్రియ వినికిడి లోపం ఉన్న పాత్రను చేయనున్నారని సమాచారం. ఈ సినిమాతో సృజన అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఈ చిత్రంలో బోలెడంత ఎమోషనల్ కంటెంట్ ఉంటుందని టాక్. కథ ముఖ్యంగా శ్రియ పాత్ర చుట్టే తిరుగుతుందని తెలిసింది. శ్రియ ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు పైనే అయింది. ఇన్నేళ్ల జర్నీలో చేయనటువంటి చాలెంజింగ్ రోల్ ఇది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కొన్ని కీలక పాత్రలు ఉంటాయట. ప్రతి పాత్రకూ ఓ సొంత కథ ఉంటుందని సమాచారం. -
ది బాస్
నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు శ్రియ. కథానాయికగా వైవిధ్యమైన పాత్రలతో పాటుగా కమర్షియల్ గెటప్‌లు వేశారు. ఆండ్రీ కొచ్చివ్‌తో గత ఏడాది శ్రియ వివాహం జరిగింది. చిన్న బ్రేక్ తర్వాత ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి శ్రియ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆర్. మాదేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సండక్కారి: ది బాస్’ సినిమాలో శ్రియ నటిస్తున్నారని కోలీవుడ్ టాక్. 2012లో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ మూవీ ‘మై బాస్’ చిత్రానికి ఇది తమిళ రీమేక్ . యాక్షన్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. లండన్, న్యూయార్క్‌తో పాటుగా కొచ్చి, గోవాలో షూట్ ప్లాన్ చేశారట. శ్రియ నటించిన తమిళ చిత్రం ‘నరగాసురన్’, హిందీ చిత్రం ‘తడ్కా’ విడుదల కావాల్సి ఉంది. -
నవ్వులు పంచే లోకం
‘‘ఇప్పటి వరకూ యమలోకం బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘యమలోకం’ వాటన్నింటికంటే భిన్నంగా ఉంటుంది. రెండున్నర గంటలసేపు ప్రేక్షకుడు ఈ లోకాన్ని మరపించేలా మా సినిమా ఉంటుంది’’ అంటున్నారు కె.వి. రావు. తమిళ హాస్య నటుడు వడివేలు నటించిన చిత్రం ‘ఇంద్రలోగత్తిల్ నా అళగప్పన్’ చిత్రాన్ని నిర్మాత కె.వి.రావు తెలుగులో ‘యమలోకం’ పేరుతో అనువదిస్తున్నారు. ‘ఇంద్రలోక సుందరవదన’ అనేది ట్యాగ్‌లైన్.ఇందులో యముడు, ఇంద్రుడు, నరుడు మూడు పాత్రల్లో కనిపిస్తారు వడివేలు. కె.విరావు మాట్లాడుతూ – ‘‘ తెలుగు ప్రేక్షకులు తప్పక చూడాల్సిన చిత్రం కావడంతో తెలుగు హక్కులను మేం సొంతం చేసుకున్నాం. మూడు పాత్రల్లో వడివేలు అద్భుతంగా నటించారు. శ్రియ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శహభాష్ మురళి, దర్శకుడు: తంబి రామయ్య. -
‘నరకాసురుడు’ మూవీ స్టిల్స్
-
వేసవికి నరకాసురుడు
అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నరకాసురుడు’. తమిళంలో తెరకెక్కిన ‘నరగాసురన్’ సినిమాకు ఇది తెలుగు వెర్షన్. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ వేసవిలోనే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది’’ అన్నారు. ఆత్మిక, ఇంద్రజిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికందన్, సంగీతం: రాన్ ఏతాన్ యోహాన్, కెమెరా: సుజిత్ సారంగ్. -
‘వెంకీమామ’ అండ్ టీమ్ రెడీ అవుతోంది!
మార్చిలో మొదలు పెట్టడానికి ‘వెంకీమామ’ అండ్ టీమ్ రెడీ అవుతోంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ దర్శకత్వంలో ‘వెంకీమామ’ అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. డి. సురేష్‌బాబు ఓ నిర్మాత. ఇందులో నాగచైతన్యకు జోడీగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తారు. ఇంతకుముందు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో చైతన్య, రకుల్ జంటగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక వెంకీ సరసన శ్రియ లేదా తమన్నా నటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ ఇద్దరి హీరోయిన్లతో సినిమాలు చేశారు వెంకీ. అసలు... ఈ సినిమా ఈపాటికే సెట్స్‌పైకి వెళ్లాల్సింది కానీ వెంకటేశ్ కుమార్తె పెళ్లి వేడుక ఉండటంతో సినిమాను మార్చిలో స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారట టీమ్. అయితే ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి ఈ ఏడాదే ‘వెంకీమామ’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట టీమ్. ఇక ఈ సినిమాలో రియల్‌లైఫ్‌లో మాదిరిగానే మామా అల్లుళ్లగానే కనిపించనున్నారు వెంకీ అండ్ చైతూ. -
యశ్ మహాచంద్ర
‘కేజీయఫ్’తో తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన నటుడు యశ్. ఆయన కీలక పాత్ర చేసిన ‘చంద్ర’ చిత్రాన్ని ‘మహాచంద్ర’ పేరుతో అనువదిస్తున్నారు. యశ్, ప్రేమ్ కుమార్, శ్రియ ముఖ్య పాత్రలు పోషించారు. రూపా అయ్యర్ దర్శకత్వంలో షాన్వాజ్ నిర్మించారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత షాన్వాజ్ మాట్లాడుతూ – ‘‘కన్నడంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. యశ్ కీలక పాత్రలో కనిపిస్తారు. శ్రియ అద్భుతమైన నటన కనబరిచారు. ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: దామోదర వనాఛార్య, సంగీతం: గౌతమ్ శ్రీ వాస్తవ్, కెమెరా: దాస్. -
స్క్రీన్ టెస్ట్
కొత్త సంవత్సరం వచ్చింది. కొత్త నిర్ణయాలు, కొత్త ఆశయాలు, కొత్త కలలు... ఏడాదంతా బాగుండాలనే పాజిటివ్ ఫీలింగ్‌తో 2019 స్టార్ట్ అయింది. సంవత్సరంలో తొలి నెల, తొలి వారంలో ‘తొలి కబుర్లు’ ఈ వారం క్విజ్ స్పెషల్. 1. సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి యన్టీఆర్ నటించిన చిత్రం ‘మన దేశం’. కానీ యన్టీఆర్ ఏ చిత్రం ద్వారా మాస్ హీరోగా చిత్రపరిశ్రమలో నిలబడ్డారో తెలుసా? ఎ) పాతాళ భైరవి బి) గులేబకావళి కథ సి) గుండమ్మకథ డి) పాండవ వనవాసం 2. ప్రముఖ నటి విజయశాంతి తెలుగులో నటించిన మొదటి సినిమా ‘కిలాడి కృష్ణుడు’. ఆ చిత్రంలో హీరో ఎవరో చెప్పుకోండి? ఎ) చిరంజీవి బి) మోహన్‌బాబు సి) నాగార్జున డి) కృష్ణ 3. తెలుగులో మొట్టమొదటి సూపర్‌స్టార్ ఈ ప్రముఖ నటి. ఆమె నటి, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సింగర్, రచయిత. ఇంతకీ ఆమెఎవరు? ఎ) అంజలీదేవి బి) జమున సి) సావిత్రి డి) భానుమతి 4. తెలుగులో వచ్చిన మొదటి 70 యం.యం సినిమా పేరేంటో తెలుసా? ఎ) అల్లూరి సీతారామరాజు బి) ఈనాడు సి) తెలుగువీర లేవరా డి) సింహాసనం 5. ‘బంగారక్క’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్గా పరిచయమైన నటి ఎవరో తెలుసా? ఎ) రాధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుహాసిని 6. తాను హీరోయిన్గా నటించిన మొదటి చిత్రం హీరోనే పెళ్లి చేసుకున్న నటి ఎవరో కనుక్కోండి? ఎ) శ్రియ బి) సమంత సి) శ్వేతాబసు ప్రసాద్ డి) స్వాతి 7. నటుడు నాని నటించిన మొదటి చిత్రదర్శకుడెవరో చెప్పుకోండి? ఎ) ఇంద్రగంటి మోహనకృష్ణ బి) ‘పిల్లజమిందార్’ అశోక్ సి) సత్యం బెల్లంకొండ డి) నందినీరెడ్డి 8. వెంకటేశ్ నటించిన మొదటి చిత్రం ‘కలియుగ పాండవులు’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమైన ప్రముఖ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) నగ్మా బి) ఖుష్బూ సి) సౌందర్య డి) రోజా 9. ‘సిరివెన్నెల’ చిత్రంలో పాటలు రాసినందుకు ఆయనకు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అనే పేరొచ్చింది. రచయితగా ఆయన తొలి సినిమా హీరో ఎవరో తెలుసా? ఎ) సర్వధమన్ బెనర్జీ బి) బాలకృష్ణ సి) సోమయాజులు డి) కృష్ణంరాజు 10. ప్రముఖ గాయకుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం ఏ హీరోకి తన మొదటి తెలుగు సినిమా పాట పాడారో తెలుసా? ఎ) శోభన్‌బాబు బి) చంద్రమోహన్ సి) రంగనాథ్ డి) గిరిబాబు 11. రామ్‌గోపాల్ వర్మ ‘రక్తచరిత్ర’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్ నటి ఎవరు? ఎ) ఊర్మిళా మటోండ్కర్ బి) మైరా సరీన్ సి) రాధికా ఆప్టే డి) నిషా కొఠారి 12. ‘మంచి మనుషులు’ చిత్రంలో బాలనటునిగా నటించిన నటుడెవరు? చిన్న క్లూ: హీరోగా మెప్పించి, ఇప్పుడు నటుడిగా చాలా బిజీగా ఉన్నారాయన? ఎ) జగపతిబాబు బి) వెంకటేశ్ సి) నాగార్జున డి) కమల్‌హాసన్ 13. సుకుమార్‌కి దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చిన నిర్మాత ఎవరో కనుక్కోండి? ఎ) అశ్వనీదత్ బి) సురేశ్‌బాబు సి) ‘దిల్’ రాజు డి) అల్లు అరవింద్ 14. అఖిల్ హీరోగా పరిచయమైన చిత్రం ‘అఖిల్’. ఆ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) పూరి జగన్నాథ్ డి) విక్రమ్ కె. కుమార్ 15. దేవిశ్రీ ప్రసాద్‌కి సంగీత దర్శకునిగా తొలి చిత్రం ‘దేవి’. ఆ చిత్రాన్ని యం.యస్. రాజు నిర్మించారు. చిత్ర దర్శకుడెవరు? ఎ) కోడి రామకృష్ణ బి) కృష్ణవంశీ సి) ఈవీవీ డి) శ్రీను వైట్ల 16. దర్శకుడు పూరీ జగన్నాథ్ 2000లో ఏ చిత్రం ద్వారా దర్శకునిగా మెగా ఫోన్ పట్టారో తెలుసా? ఎ) బాచీ బి) బద్రి సి) ఇడియట్ డి) శివమణి 17. నటుడు సుమంత్ హీరోగా పరిచయమైన చిత్రం ‘ప్రేమకథ’. ఆ చిత్రంలో సుమంత్ సరసన నటించిన నటి ఎవరు? ఎ) ఆంత్ర మాలి బి) ప్రీతీ జింతా సి) ప్రీతీ జింగ్యాని డి) అంజలా జవేరి 18. బాలీవుడ్ ప్రముఖ నటి కంగనారనౌత్ నటించిన ఒకే ఒక్క తెలుగు చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్. మరి ఆ చిత్ర హీరో ఎవరో తెలుసా? ఎ) మహేశ్‌బాబు బి) నితి¯Œ ∙సి) రానా డి) ప్రభాస్ 19. దాసరి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘తాతా మనవడు’. ఆ చిత్రంలో తాతగా యస్వీఆర్ నటించారు. మరి మనవడిగా మురిపించిన నటుడెవరో గుర్తుందా? ఎ) చలం బి) శరత్‌బాబు సి) రాజనాల డి) రాజబాబు 20. హీరో రామ్ కెరీర్లో తొలి హీరోయిన్ ఎవరో కనుక్కోండి? ఎ) హన్సిక బి) జెనీలియా సి) ఇలియానా డి) అక్ష మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) డి 4) డి 5) సి 6) బి 7) ఎ 8) బి 9) ఎ 10) ఎ 11) సి 12) ఎ 13) సి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) డి 19) డి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
జోడీ కుదిరిందా?
నాగచైతన్యకు కొత్త అత్తయ్య దొరికింది. కొత్త అత్తయ్య ఏంటి? అని కన్ఫ్యూజ్ కావొద్దు. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘వెంకీమామ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఆల్రెడీ నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్ సింగ్ ఓకే అయ్యారు. గతేడాది వచ్చిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో కలిసి నటించారు చైతన్య అండ్ రకుల్. ఇక వెంకటేశ్‌కు జోడీగా కొంతమంది కథానాయికల పేర్లను పరిశీలించిన తర్వాత ఫైనల్‌గా శ్రియను కన్ఫార్మ్ చేశారని తాజా సమాచారం. ఇంతకు ముందు ‘సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల’ సినిమాల్లో జంటగా కనిపించారు వెంకీ అండ్ శ్రియ. నిజజీవితంలో మామాఅల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య ఈ సినిమాలో కూడా మామా అల్లుళ్లగానే నటించనున్నారు. ఒకవేళ ఈ సినిమాలో వెంకీకి జోడీగా శ్రియ ఫిక్స్ అయితే ఈ చిత్రంలో నాగచైతన్యకు శ్రియ వరసకు అత్తయ్య అవుతారు కదా! ఇలా రీల్‌లైఫ్‌లో నాగచైతన్యకు కొత్త అత్తయ్య దొరికినట్లే? మరి.. మామాఅల్లుళ్లకు జోడీలు కుదిరిన ట్లేనన్నమాట. -
స్క్రీన్ టెస్ట్
అక్కడ ఇక్కడ.. సినిమాకి నో బౌండరీస్. ఇక్కడ హిట్టయిన సినిమా అక్కడ... అక్కడ హిట్టయిన సినిమా ఇక్కడ రీమేక్ అవుతుంటాయి. అలాంటి రీమేక్ మూవీస్ గురించి ఈ వారం స్పెషల్. 1. హిందీ చిత్రం ‘మిలీ’ తెలుగు ‘జ్యోతి’ చిత్రానికి మాతృక. అక్కడ (బాలీవుడ్లో) జయభాదురీ టైటిల్ రోల్ చేశారు. ఇక్కడ (టాలీవుడ్) ఆ పాత్రను పోషించిన నటి ఎవరు? ఎ) జయసుధ బి) జయప్రద సి) శ్రీదేవి డి) సుజాత 2. యన్టీఆర్ నటించిన ‘యుగంధర్’ సినిమా హిందీ ‘డాన్’కి రీమేక్. ఆ చిత్రంలో హీరోగా నటించిందెవరో గుర్తుందా? ఎ) జితేంద్ర బి) రిషికపూర్ సి) మిథున్ చక్రవర్తి డి) అమితాబ్ 3. తమిళ సూపర్ డూపర్ హిట్ ‘నాట్టామై’ తెలుగులో ‘పెదరాయుడు’గా విడుదలై, ఇక్కడా బంపర్ హిట్ సాధించింది. తెలుగులో మోహన్‌బాబు నటించారు. తమిళ్లో మోహన్‌బాబు పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) విజయ్‌కాంత్ బి) పార్తిబన్ సి) శరత్‌కుమార్ డి) రజనీకాంత్ 4. విజయశాంతి హిందీలో చేసిన మొదటి చిత్రం ‘ఈశ్వర్’. తెలుగులో ఘనవిజయం సాధించిన ‘స్వాతిముత్యం’ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్ర దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కె.విశ్వనాథ్ బి) బి.గోపాల్ సి) కె. రాఘవేంద్రరావు డి) కె. మురళీమోహన రావు 5. అక్కినేని నాగేశ్వరరావు హిందీలో ఒకే ఒక్క సినిమాలో నటించారు. తెలుగులో ఆయన నటించిన ఓ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అది. ఆ చిత్రకథానాయిక అంజలీదేవి, ఆమె భర్త, చిత్రనిర్మాత ఆదినారాయణరావు మాటను కాదనలేక ఏయన్నార్ హిందీలో నటించారు. ఇంతకీ ఆ సినిమా పేరేంటి? ఎ) దేవదాసు బి) సువర్ణసుందరి సి) కీలుగుర్రం డి) తెనాలి రామకృష్ణ 6. హీరో రాజÔó ఖర్ను ఒకప్పుడు ‘అంకుశం’ రాజశేఖర్ అనేవారు. ఆ సినిమా ద్వారా ఆయనకు అంత పేరొచ్చింది. మరి... ఆ సినిమా రీమేక్ ద్వారా బాలీవుడ్‌కి హీరోగా పరిచయమైన తెలుగు నటుడెవరో తెలుసా? ఎ) బాలకృష్ణ బి) వెంకటేశ్ సి) చిరంజీవి డి) నాగార్జున 7. ‘మిస్సమ్మ’ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ సినిమాలో ఎన్టీఆర్ చేసిన పాత్రను తమిళ్లో చేసిన నటుడెవరు? ఎ) యంజీఆర్ బి) శివాజీ గణేశన్ సి) జెమినీ గణేశన్ డి) శివకుమార్ 8. కన్నడ చిత్రం ‘యు టర్న్’ తెలుగు రీమేక్‌లో సమంత జర్నలిస్ట్‌గా చేశారు. కన్నడ ‘యు టర్న్’లో ఆ పాత్ర చేసిన నటి ఎవరో కనుక్కోండి? ఎ) ప్రియమణి బి) రకుల్ ప్రీత్‌సింగ్ సి) అంజలి డి) శ్రద్ధా శ్రీనాథ్ 9. రజనీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ అన్ని భాషల్లోనూ పెద్ద హిట్. ఆ సినిమా మొదట మలయాళంలో వచ్చింది. ‘చంద్రముఖి’ కన్నడ, తమిళ్, తెలుగు భాషలకు డైరెక్టర్ పి.వాసు. ఒరిజినల్ మలయాళ చిత్రానికి దర్శకుడెవరు? ఎ) సురేశ్ కృష్ణ బి) సిద్ధిక్ లాల్ సి) ఫాజిల్ డి) ప్రియదర్శన్ 10 కృష్ణ, జయప్రద జంటగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఊరికి మొనగాడు’. ఆ చిత్రాన్ని హిందీలో ‘హిమ్మత్వాలా’ పేరుతో విడుదల చేశారు. అది పెద్ద హిట్. జయప్రద రోల్‌ను పోషించిన నటి ఎవరు? ఎ) రేఖ బి) హేమ మాలిని సి) శ్రీదేవి డి) డింపుల్ కపాడియా 11. ‘ప్రేమమ్’ తెలుగు సినిమాలో లెక్చరర్ పాత్రలో నటించారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఆ పాత్ర ఒరిజినల్ క్యారెక్టర్‌ను మలయాళంలో చేసిన నటి ఎవరో తెలుసా? ఎ) సాయిపల్లవి బి) మంజిమా మోహన్ సి) అనుపమా పరమేశ్వరన్ డి) నివేథా థామస్ 12 మహేశ్ బాబు కెరీర్లో ‘పోకిరి’ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. అదే పేరుతో ఆ సినిమాను తమిళ్లో తెరకెక్కించారు. అక్కడ కూడా ‘పోకిరి’ మంచి హిట్‌ను సొంతం చేసుకుంది. మహేశ్‌బాబు క్యారెక్టర్‌ను చేసిన ఆ తమిళ్ హీరో ఎవరు? ఎ) అజిత్ బి) శివ కార్తికేయన్ సి) విజయ్ డి) సూర్య 13. ‘తుమ్హారి సులు’ అనే సినిమాను హిందీలో విద్యాబాలన్ చేశారు. తమిళ్లో ఆ సినిమా రీమేక్ ‘కాట్రిన్ మొళి’లో ఆ పాత్రను చేసిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రుతీహాసన్ బి) జ్యోతిక సి) నయనతార డి) సమంత 14 నాగచైతన్య, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఏ మాయ చేసావె’. ఆ చిత్రం తమిళ్ వెర్షన్లో సమంత పాత్రను పోషించిన నటి ఎవరో తెలుసా? ఎ) శ్రియ బి) త్రిష సి) అమలాపాల్ డి) మీరా జాస్మిన్ 15. సునీల్ హీరోగా నటించిన ‘మర్యాద రామన్న’ చిత్రం హిందీ రీమేక్‌లో ఆ పాత్రను పోషించిన నటుడెవరో తెలుసా? ఎ) అజయ్ దేవగన్ బి) అక్షయ్ కుమార్ సి) సంజయ్‌దత్ డి) సైఫ్ అలీఖాన్ 16. విద్యాబాలన్ చేసిన హిందీ ‘కహానీ’ తెలుగు రీమేక్ ‘అనామిక’లో నయనతార నాయికగా నటించారు. ‘అనామిక’ సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) మణిశర్మ బి) యం.యం.కీరవాణి సి) మిక్కీ జే మేయర్ డి) కె.యమ్ రాధాకృష్ణన్ 17. వెంకటేశ్ హీరోగా తెలుగు ‘సూర్యవంశం’, అమితాబ్ బచ్చన్ హీరోగా హిందీ ‘సూర్యవంశ్’ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు చిత్రాలనూ తెరకెక్కించిన దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) ఈవీవీ సత్యనారాయణ బి) దాసరి నారాయణరావు సి) కోడి రామకృష్ణ డి) బి.గోపాల్ 18. విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సంచలన విజయం సాధించింది. హీరోయిన్గా షాలినీ పాండే నటించారు. ఆ చిత్రాన్ని హిందీలో సేమ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిందీ ‘అర్జున్ రెడ్డి’లో హీరోయిన్గా నటిస్తున్నది ఎవరో తెలుసా? ఎ) కరీనా కపూర్ బి) కియరా అద్వాని సి) ఆలియా భట్ డి) ప్రియాంకా చోప్రా 19. తమిళ చిత్రం ‘వసంత మాళిగై’ అంటే తెలుగు ‘ప్రేమనగర్’. రెండు భాషల్లోనూ హీరోలు శివాజీ గణేశన్, అక్కినేని. కానీ హీరోయిన్ ఒక్కరే. ఎవరా హీరోయిన్? ఎ) సావిత్రి బి) వాణిశ్రీ సి) జమున డి) కాంచన 20. రీమేక్ చిత్రాలు చేయడానికి ఇష్టపడనని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన శంకర్ ఓ హిందీ సినిమాని ‘నన్బన్’ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ఇది ‘స్నేహితుడా’ పేరుతో తెలుగులో విడుదలైంది. హిందీలో కరీనా కపూర్ నాయిక.. మరి సౌత్‌లో ఎవరు? ఎ) ఇలియానా బి) చార్మి సి) కాజల్ అగర్వాల్ డి) శ్రియ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) డి 3) సి 4)ఎ 5) బి 6) సి 7) సి 8) డి 9) సి 10) సి 11) ఎ 12) సి 13) బి 14) బి 15) ఎ 16) బి 17) ఎ 18) బి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
బాహుబలి వెబ్ సిరీస్‌లో స్టార్ హీరోయిన్
బాహుబలి దేశ విదేశాల్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అందుకే బాహుబలి ప్రపంచాన్ని ఇక ముందు కూడా కొనసాగించే ప్రయత్నాల్లో ఉన్నారు మేకర్స్. అందులో భాగంగా బాహుబలికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్ సీరీస్‌ను నిర్మిస్తున్నారు నిర్మాతలు. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం, ఆమె ఎదుగుదల ప్రధానాంశంగా ఈ వెబ్ సీరీస్ తెరకెక్కనుంది. ఈ వెబ్‌సీరీస్‌లో ప్రధాన పాత్ర శివగామిగా ఉత్తరాది నటి మృణాల్ థాకూర్ నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి శ్రియ మరో కీలక పాత్రలో నటించనున్నారు. నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్‌కు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారులతో పాటు మరో బాలీవుడ్ దర్శకుడు పని చేయనున్నట్టుగా తెలుస్తోంది. -
‘వెంకీమామ’పై పుకార్లకు ఫుల్స్టాప్!
వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వెంకీమామ’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనున్నారు. వెంకటేశ్‌కు జోడీగా శ్రియ, హ్యూమా ఖురేషి పేర్లను పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ సంస్థలు నిర్మించనున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లదనే పుకార్లు పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ‘‘వెంకీమామ’ చిత్రం సెట్స్‌పైకి వెళ్లదనే వార్తల్లో నిజం లేదు. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుతం నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా ప్రమోషన్స్, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే వెంకటేశ్ ‘ఎఫ్ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ఏంటంటే.. ‘వెంకీమామ’ సినిమా చిత్రీకరణ వచ్చే నెల సెకండ్ వీక్‌లో స్టార్ట్ కానుందట. ‘‘ఈ సినిమా పనులతో బాబీ బిజీగా ఉన్నాడు. వచ్చే నెల షూటింగ్ స్టార్ట్ చేస్తాం. వచ్చే ఏడాది ఓ మంచి ఎంటర్టైనర్ని ఇవ్వబోతున్నామనే నమ్మకంతో అందరం పని చేస్తున్నాం’’ అన్నారు కోన వెంకట్. -
స్క్రీన్ టెస్ట్
1. హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ మొదట ఏ సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారో తెలుసా? ఎ) ధృవ బి) జయ జానకీ నాయకా సి) సరైనోడు డి) నాన్నకు ప్రేమతో 2. అదితీ రావు హైదరీ సిల్వర్ స్క్రీన్‌పై మొదట ఏ హీరోతో నటించారో తెలుసా? ఎ) మమ్ముట్టి బి) కార్తీ సి) సుధీర్ బాబు డి) ధనుశ్ 3. హీరో నాని గతంలో కబడ్డీ ఆటగాడిగా నటించారు. ఇప్పుడు ఆయన మరో క్రీడా నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. ఏ క్రీడకు సంబంధించిన చిత్రంలో ఆయన నటిస్తున్నారు? ఎ) బ్యాడ్మింటన్ బి) క్రికెట్ సి) హాకీ డి) ఖోఖో 4. దాసరి దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ సినిమా ‘గోరింటాకు’. ఆ చిత్రంలో కథానాయిక పాత్ర చేశారు నటి సుజాత. మొదట దర్శక,నిర్మాతలు అనుకున్న హీరోయిన్ సుజాత కాదట. మరి మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) మాధవి బి) సరిత సి) రాధిక డి) సుహాసిని 5. కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి రచయితెవరో తెలుసా? ఎ) పద్మరాజు బి) జంధ్యాల సి) పరుచూరి బ్రదర్స్ డి) మహారధి 6. ఐశ్వర్యారాయ్ ఏ హీరోని సినిమాలో చిట్టీ అని పిలిచారో గుర్తుందా? ఎ) రజనీకాంత్ బి) కమల్ హాసన్ సి) విజయ్ డి) విక్రమ్ 7. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని ‘పెనివిటి...’ పాటను పాడింది ఎవరు? ఎ) కాలభైరవ బి) శ్రీరామచంద్ర సి) హేమచంద్ర డి) దీపు 8. ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంలో హీరో రామ్. ఆ చిత్రంలో ఓ హీరోయిన్గా అనుపమా పరమేశ్వరన్ నటించారు. మరో హీరోయిన్ ఎవరు? ఎ) రష్మికా మండన్నా బి) ప్రణీత సుభాశ్ సి) లావణ్య త్రిపాఠి డి) రాశీ ఖన్నా 9. ప్రభాస్ హీరోగా తెలుగులో ఇప్పటివరకు ఎన్ని చిత్రాలు రిలీజ్ అయ్యాయో కనుక్కోండి? ఎ) 14 బి) 24 సి) 16 డి) 18 10. ‘హౌస్‌ఫుల్ 4’ నుంచి నానా పటేకర్ తప్పుకున్నాక ఆ పాత్రకు ఓ తెలుగు హీరోని తీసుకున్నారు. అతనెవరో తెలుసా? ఎ) రానా బి) సందీప్ కిషన్ సి) నాని డి) అఖిల్ 11. అల్లు అర్జున్, మంచు మనోజ్ ఈ ఇద్దరు హీరోలు నటించిన ‘వేదం’ చిత్రంలో వేశ్య పాత్రలో నటించిన నటి ఎవరు? ఎ) ధీక్షాసేథ్∙ బి) కమలినీ ముఖర్జీ సి) అనుష్క డి) శ్రియ 12. ప్రముఖ నటి సౌందర్య తనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లారో తెలుసా? ఎ) 42 బి) 36 సి) 32 డి) 35 13. ‘బొబ్బిలి రాజా’ చిత్రంలో వెంకటేశ్‌కు అత్తగా పవర్ఫుల్ క్యారెక్టర్లో నటì ంచిన ప్రముఖ నటి ఎవరో గుర్తున్నారా? ఎ) శారద బి) వాణీశ్రీ సి) జయచిత్ర డి) జయంతి 14. ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’ చిత్రంలో నటించిన హీరోయిన్ నిరోషా ఓ ప్రముఖ హీరోయిన్‌కి చెల్లెలు. ఆ హీరోయిన్ పేరేంటి? ఎ) రాధిక బి) జయసుధ సి) జయప్రద డి) రాధ 15. ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ మొదటి భార్యగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) మాళవికా నాయర్ బి) నిత్యామీనన్ సి) కీర్తీ సురేశ్ డి) మాళవికా శర్మ 16. 2018లో విడుదలైన మూవీ ‘గీతగోవిందం’ లోని ‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి..’’ అనే సూపర్‌హిట్ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) శ్రీమణి బి) అనంత శ్రీరామ్ సి) వరికుప్పల యాదగిరి డి) చంద్రబోస్ 17. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’ లో నటిస్తున్న హీరోయిన్ ఎవరు? ఎ) రెజీనా బి) కాజల్ అగర్వాల్ సి) ఇలియానా డి) నయనతార 18. జయప్రద లీడ్ రోల్లో నటించిన సూపర్‌హిట్ సినిమా ‘అంతులేని కథ’ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) దాసరి నారాయణరావు బి) కె.బాలచందర్ సి) భారతీరాజా డి) మణిరత్నం 19. ఈ ఫోటోలో ఉన్న చిన్నప్పటి బాలీవుడ్ భామ ఎవరో తెలుసా? ఎ) దీపికా పదుకోన్∙ బి) కాజోల్ సి) అయేషా టకియా డి) కరీనా కపూర్ 20. చిరంజీవి నటించిన ఈ స్టిల్ ఏ సినిమాలోనిదో కనుక్కోండి? ఎ) కొండవీటి దొంగ బి) సింహపురి సింహం సి) మంచి దొంగ డి) రాజా విక్రమార్క మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) ఎ 3) బి 4) డి 5) డి 6) ఎ 7) ఎ 8) బి 9) డి 10) ఎ 11) సి 12) సి 13) బి 14) ఎ 15) ఎ 16) బి 17) సి 18) బి 19) ఎ 20) బి నిర్వహణ: శివ మల్లాల -
భయం వేసింది
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది ట్యాగ్‌లైన్. ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వంలో అప్పారావు బెల్లన నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని శ్రీవిష్ణు లుక్‌ను విడుదల చేశారు. ‘‘పచ్చబొట్లు వేయించుకున్నాను. కాస్త భయం కలిగింది. ఈ పాత్ర చేస్తున్నప్పుడు చాలా రకాల అనుభూతులకు లోనయ్యాను’’అని పేర్కొన్నారు శ్రీవిష్ణు. ‘‘వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇప్పటికే రిలీజ్ చేసిన మిగతా తారల లుక్స్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీతం అందించారు. -
స్క్రీన్ టెస్ట్
1. ‘భలే భలే మగాడివోయ్ బంగారు నా సామిరోయ్...’ ఈ సూపర్ హిట్ పాటలో నటించిన హీరోయిన్ ఎవరు? ఎ) జయసుధ బి) సరిత సి) మాధవి డి) జయచిత్ర 2. అఖిల్ నటిస్తున్న మూడో చిత్రానికి దర్శకుడెవరు? ఎ) విక్రమ్.కె. కుమార్ బి) వెంకీ కుడుముల సి) శ్రీకాంత్ అడ్డాల డి) వెంకీ అట్లూరి 3.వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటిస్తున్న మరో హీరో ఎవరో తెలుసా? ఎ) ‘అల్లరి’ నరేశ్ బి) నవీన్ చంద్ర సి) ఆర్యన్ రాజేశ్ డి) రాహుల్ రవీంద్రన్ 4. క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండను సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేసిన దర్శకుడెవరు? ఎ) రవిబాబు బి) శేఖర్ కమ్ముల సి) నాగ్ అశ్విన్ డి) తరుణ్ భాస్కర్ 5 నాగార్జున, నాని నటిస్తున్న చిత్రం ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్‌కి ఇది ఎన్నో చిత్రం ? ఎ) 42 బి) 52 సి) 48 డి) 54 6. ఇటీవల విడుదలై విజయం సాధించిన చిత్రం ‘కేరాఫ్ కంచరపాలెం’. ఆ చిత్రదర్శకుడెవరు? ఎ) రాహుల్ రవీంద్రన్ బి) పవన్ కుమార్ సి) రవికాంత్ పేరేపు డి) వెంకటేశ్ మహా 7. ‘బిగ్ బాస్’ సీజన్ 1’లో మంచి పేరు సంపాదించుకున్నారు హరితేజ. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఏ సినిమాలో ఆమె కామెడీ పాత్రలో నటించారో తెలుసా? ఎ) అఆ బి) సన్నాఫ్ సత్యమూర్తి సి) జులాయి డి) అత్తారింటికి దారేది 8. ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది...’ ఈ పాటలో నటించిన ప్రముఖ నటి ఎవరు? ఎ) భూమికా చావ్లా బి) సిమ్రాన్ సి) లయ డి) రమ్యకృష్ణ 9. తెలుగులో విశాల్ హీరోగా విడుదలైన మొదటి డబ్బింగ్ సినిమా పేరేంటో తెలుసా? ఎ) పందెం కోడి బి) ప్రేమ చదరంగం సి) భరణి డి) భయ్యా 1.0 ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘బిల్లా’. ఆ చిత్రంలో అనుష్క ఓ హీరోయిన్గా నటించారు. అనుష్కతో పాటు మరో బ్యూటీ కూడా హీరోయిన్గా నటించారు. ఆవిడ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) త్రిష సి) ప్రియమణి డి) నమిత 11. ‘అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు...’ రజనీకాంత్ చెప్పే ఈ డైలాగ్ ఏ సినిమాలోదో కనుక్కోండి? ఎ) అరుణాచలం బి) భాషా సి) నర సింహా డి) కథానాయకుడు 12 .దర్శకుడు గౌతమ్ మీనన్ పరిచయం చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్‌లో టాప్ హీరోయిన్. ఎవరామె? ఎ) సమంత బి) తమన్నా సి) నయనతార డి) శ్రియ 13. ‘సెకండ్ షో’ ఆ హీరోకి మొదటి మలయాళ సినిమా. ఈ మలయాళ నటుడు తెలుగు వారికీ సుపరిచితుడు. ఎవరతను? ఎ) మమ్ముట్టి బి) మోహన్‌లాల్ సి) దుల్కర్ సల్మాన్ డి) సురేశ్ గోపి 14. ‘మల్లెçపువ్వు’ చిత్రానికి సంగీత దర్శకుడెవరో తెలుసా? ఇది 2008లో విడుదలైన ‘మల్లెపువ్వు’. ఎ) ఇళయరాజా బి) కోటి సి) చక్రవర్తి డి) అనూప్ రూబెన్స్ 15. ఇటీవల స్వర్గస్తురాలైన దర్శకురాలు జయ ఎన్ని చిత్రాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారో తెలుసా? ఎ) 4 బి) 3 సి) 5 డి) 6 16. ‘చలి చలిగా అల్లింది గిలిగిలిగా గిల్లింది. నీ వైపే మళ్లింది మనసు’.. పాట ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా లోనిది. ఆ పాట పాడిన గాయని ఎవరు? ఎ) చిన్మయ్ బి) శ్రేయా గోషల్ సి) సుచిత్ర డి) చిత్ర 17. తమిళ సినిమా ‘పేటై్ట’లో నటిస్తున్న హీరో ఎవరో కనుక్కోండి? (చిన్న క్లూ: ఈ సినిమాకు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు) ఎ) కమల్‌హాసన్ బి) శరత్ కుమార్ సి) రజనీకాంత్ డి) విజయ్ 18. సెప్టెంబర్ 20న ఈ ప్రముఖ నటుని పుట్టినరోజు. ఎవరా నటుడు? ఎ) ఎన్టీఆర్ బి) అక్కినేని సి) కృష్ణ డి) కృష్ణంరాజు 19. ఈ ఫొటోలోని బుడతడు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరో. ఎవరై ఉంటారబ్బా? ఎ) అల్లు అర్జున్ బి) ఎన్టీఆర్ సి) రామ్ చరణ్ డి) మహేశ్ బాబు 20. కింది ఫొటోలోని ప్రముఖ నటుడెవరో కనుక్కోండి? ఎ) చలం బి) పధ్మనాభం సి) నగేశ్ డి) రాజనాల మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) బి 2) డి 3) ఎ 4) ఎ 5) బి 6) డి 7) ఎ 8) ఎ 9) బి 10) డి 11) సి 12) ఎ 13) సి 14) ఎ 15) డి 16) బి 17) సి 18) బి 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
వసంతరాయలు వస్తున్నాడహో...
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియ, శ్రీవిష్ణు ముఖ్య తారలుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరభోగ వసంత రాయలు’. ఇంద్రసేన ఆర్. దర్శకత్వంలో బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావ్ బెల్లాన నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా అప్పారావ్ బెల్లాన మాట్లాడుతూ– ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోంది. షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. మా చిత్రం టైటిల్ ఆసక్తిగా ఉందని అంటున్నారు. సినిమాలో కథ కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. ‘కొత్త మతం పుట్టుకొస్తుంది’ అనే ట్యాగ్ లైన్‌తో ఈ చిత్రం వస్తుంది. త్వరలోనే ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: ఎస్. వెంకట్, నవీన్ యాదవ్. -
స్క్రీన్ టెస్ట్
1. నాని ఇప్పటివరకు ఎన్ని చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారో తెలుసా? ఎ) 3 బి) 5 సి) 1 డి) 6 2. నాటి తరం హీరోలు కృష్ణ, కృష్ణంరాజులు ఎన్ని చిత్రాల్లో కలిసి నటించారో కనుక్కోండి? ఎ) 12 బి) 21 సి) 9 డి) 15 3. మణిపాల్ యూనివర్సిటీలో జర్నలిజం పూర్తి చేసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకుందామా? ఎ) అనూ ఇమ్మన్యుయేల్ బి) నిత్యామీనన్ సి) నివేథా థామస్ డి) మంజిమా మోహన్ 4. సౌత్‌లో చాలా సినిమాలు చేసి, నార్త్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న టబు హాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. ఆమె ఏ భాషలో మొదట హీరోయిన్గా నటించారో తెలుసా? ఎ) తమిళ బి) ఇంగ్లీషు సి) మలయాళం డి) తెలుగు 5. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘అలా మొదలైంది’ చిత్రసంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) యం.యం.కీరవాణి బి) కల్యాణి మాలిక్ సి) సాయికార్తీక్ డి) శేఖర్ చంద్ర 6. ‘చెల్లుబోయిన చిట్టిబాబు’ అనే పేరుతో నటించి 2018 బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో నిలిచిన ఈ హీరో ఎవరో తెలుసా? (సి) ఎ) విజయ్ దేవరకొండ బి) నాని సి) రామ్‌చరణ్ డి) అల్లు అర్జున్ 7. ‘బాహుబలి’ చిత్రంలో అస్లాం ఖాన్ పాత్రను పోషించిన నటుడెవరో కనుక్కోండి? ఎ) నాజర్ బి) సుదీప్ సి) ప్రభాకర్ డి) సుబ్బరాజు 8. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘మేఘ సందేశం’ చిత్రంలో ఓ సింగర్ తన నిజమైన పేరుతోనే ఓ పాత్ర చేశారు. ఎవరా సింగర్? ఎ) యస్పీ బాలసుబ్రమణ్యం బి) కె.జే.ఏసుదాస్ సి) మను డి) మంగళంపల్లి బాలమురళీ కృష్ణ 9 మేడమ్ స్పీకర్ అని ‘భరత్ అనే నేను’ సినిమాలో మహేశ్‌బాబు ఏ ఆర్టిస్ట్‌ను ఉద్దేశించి సంబోధిస్తారో తెలుసా? ఎ) జయలలిత బి) అపూర్వ సి) రజిత డి) ప్రియా 10. ఎన్టీఆర్ బయోపిక్‌లో హెచ్.ఎమ్. రెడ్డి పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటుడెవరో తెలుసా? ఎ) కైకాల సత్యనారాయణ బి) జయప్రకాశ్ రెడ్డి సి) కోట శ్రీనివాసరావు డి) నరేశ్ 11. ‘పేపర్‌బాయ్’ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టిన నటి పేరు ఏంటి? ఎ) ప్రియ వడ్లమాని బి) రియా సుమన్ సి) నందితా శ్వేతా డి) నభా నటేశ్ 12. ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్టర్ మల్లన్న... ఒక కాఫీ తాగుదాం ఆవోనా...’ పాట ‘మల్లన్న’ చిత్రం లోనిది. ఈ పాటలో ‘మల్లన్న’ పాత్రధారి విక్రమ్‌ను ఆట పట్టించిన కథానాయిక ఎవరో గుర్తుందా? ఎ) సదా బి) సమంత సి) శ్రియ డి) సంగీత 13. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఫేమస్ అయిన హీరో పేరేంటో తెలుసా? ఎ) ప్రిన్స్ బి) కార్తికేయ సి) నందు డి) వైభవ్ 14. శ్రీ అమ్మయంగార్ అయ్యప్పన్ ఈ ప్రముఖ నటి అసలు పేరు. ఎవరామె? ఎ) సుజాత బి) సుహాసిని సి) రాధిక డి) శ్రీదేవి 15. ‘బాహుబలి’ చిత్రంలో హీరో ప్రభాస్‌కు అమ్మగా నటించారు రమ్యకృష్ణ. ఇప్పుడు మరో హీరోకు అత్తగా ఆమె నటించిన ఓ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది. ఆ హీరో ఎవరు? ఎ) అఖిల్ బి) మంచు విష్ణు సి) నాగచైతన్య డి) ఆది 16. ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) చంద్ర సిద్ధార్థ బి) చంద్రశేఖర్ యేలేటి సి) చందు మొండేటి డి) శేఖర్ కమ్ముల 17. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? ఎ) రాజేంద్ర ప్రసాద్ బి) నరేశ్ సి) శివాజీ రాజా డి) శ్రీకాంత్ 18. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రాజీ’లో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) శ్రద్ధా కపూర్ బి) కరీనా కపూర్ సి) సోనమ్ కపూర్ డి) ఆలియా భట్ 19. ఈ ఫొటోలోని ప్రముఖ నటుడెవరో కనిపెట్టండి? ఎ) చిత్తూరు వి .నాగయ్య బి) యస్వీ రంగారావు సి) కాంతారావు డి) ముక్కామల 20. ఈ ఫొటోలోని బాల నటుడు ఇప్పుడొక పెద్ద నటుడు చెప్పగలరా? ఎ) మంచు మనోజ్ బి) అఖిల్ సి) ఆది డి) మహేశ్‌బాబు మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) ఎ 2) బి 3) బి 4) డి5) బి 6) సి 7) బి 8) డి 9) ఎ 10) ఎ 11) బి 12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) సి 18) డి 19) బి 20) ఎ నిర్వహణ: శివ మల్లాల -
అప్పుడు బాధపడతా
‘సంతోషం, నువ్వే నువ్వే, ఠాగూర్’ వంటి చిత్రాల్లో నటించి వెండి తెరపైకి వచ్చిన తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు హీరోయిన్ శ్రియ. ఆ తర్వాత ‘ఛత్రపతి, దేవదాసు, శివాజీ’ వంటి హిట్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ హీరోయిన్గా దాదాపు 16ఏళ్ల కెరీర్‌ను కంప్లీట్ చేశారు. ఇన్నేళ్ల జర్నీలో ఫ్లాప్ అయిన సినిమాల గురించి మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అన్న ప్రశ్నను శ్రియ ముందు ఉంచితే– ‘‘నా సినిమాలు సరిగ్గా ఆడనప్పుడు నేను నిరుత్సాహపడలేదు అని చెబితే అది అబద్ధం అవుతుంది. ఫెయిల్ అయిన కొన్ని సినిమాలు కెరీర్‌పై కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుకే ఫెయిల్యూర్ సినిమాకి చాలా ఫీలవుతాను. సినిమా ఫీల్డ్‌లో తప్పులను కరెక్ట్ చేసుకోవడం కష్టం. పుస్తకాలను ఎంచుకున్నంత బాగా నేను స్క్రిప్ట్స్‌ను సెలక్ట్ చేసుకోలేను. అలాగే నాకు బాగా కనెక్ట్ అయిన వారితోనే నేను ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను’’ అని చెప్పుకొచ్చారు శ్రియా. ప్రస్తుతం ఆమె చే సిన సినిమాల విషయానికొస్తే సౌత్‌లో ఆమె నటించిన ‘నరగాసురన్, వీరభోగ వసంతరాయలు’, హిందీలో ‘తడ్కా’ మూవీస్ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో టెన్నిస్ ప్లేయర్ ఆండ్రీ కొశ్చివ్‌తో శ్రియ ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. -
వైవిధ్యమైన పాత్రలో...
పాత్రల ఎంపికలో ఎప్పటికప్పుడు వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు సుధీర్‌బాబు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ఆర్. ఇంద్రసేన్ దర్శకత్వంలో శ్రియా శరణ్, నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ మూవీ ఇది. ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది ట్యాగ్‌లైన్. అప్పారావు బెల్లన నిర్మించారు. ఇటీవల శ్రియ, నారా రోహిత్, శ్రీవిష్ణు ఫస్ట్ లుక్స్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఇప్పుడు సుధీర్ బాబు లుక్‌ను విడుదల చేశారు. ‘‘రిలీజ్ చేసిన అందరి లుక్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అందరి పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాశ్, నవీన్ నేని తదితరులు నటించిన ఈ సినిమాకు మార్క్ కే. రాబిన్ సంగీతం అందించారు. -
మామా అల్లుళ్ల అల్లరి
అల్లుడుకి తోడుగా మామ ఎంట్రీ కూడా ఉంటుందా? లేక మామ, అల్లుడు వేరు వేరుగా ఎంట్రీ ఇస్తారా? అసలు సెట్స్‌లోకి ముందు ఎవరు కాలుపెడతారు? ఈ డౌట్ ఆగస్టు సెకండ్ వీక్‌లో క్లియర్ అవుతుంది. వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వెంకీ మామ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన కార్పొరేషన్ సంస్థలు నిర్మించనున్నాయి. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. రియల్ లైఫ్ మాదిరిగానే రీల్ లైఫ్‌లోనూ వెంకటేశ్, నాగచైతన్య మామా అల్లుళ్లుగా నటించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 8న మొదలవుతుందని సమాచారం. మామా అల్లుళ్లు కలిసి వెండితెరపై చేయబోయే అల్లరి ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా రకుల్‌ప్రీత్ సింగ్ నటిస్తారు. ఇక వెంకీ సరసన కథానాయికలుగా హ్యూమా ఖురేషీ, శ్రియ పేర్లను పరిశీలిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంగీతం అందించేందుకు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లను సంప్రదిస్తున్నారట. -
స్టన్నింగ్
‘మెంటల్ మదిలో, ఉన్నది ఒకటే జిందగీ, నీదీ నాదే ఒకే కథ’ చిత్రాలతో శ్రీవిష్ణు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘వీర భోగ వసంత రాయలు’ ఒకటి. నారా రోహిత్, సుధీర్‌బాబు, శ్రియలు కూడా ఈ చిత్రంలో మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పటివరకూ నారా రోహిత్, శ్రియల లుక్స్‌ని రిలీజ్ చేశారు. శనివారం శ్రీవిష్ణు లుక్‌ని విడుదల చేశారు. చిత్రానికి పని చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ లుక్‌ని రిలీజ్ చేయడం విశేషం. ‘‘నారా రోహిత్, శ్రియల లుక్స్‌కి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన శ్రీవిష్ణు స్టన్నింగ్ లుక్ బాగుందని అందరూ అంటున్నారు’’ అని చిత్రబృందం పేర్కొంది. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాకి ఇంద్రసేన్ ఆర్. దర్శకుడు. మార్క్ కే. రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాబా క్రియేష¯Œ ్స బ్యానర్‌పై అప్పారావు బెల్లనా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి మరియు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్, ఎడిటర్: శశాంక్ మాలి. -
దివ్యాంగుడిగా నారా రోహిత్
కెరీర్ స్టార్టింగ్ నుంచి వరుసగా ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో నారా రోహిత్. డిఫరెంట్ జానర్ లో తెరకెక్కే సినిమాలతో పాటు మల్టీ స్టారర్ సినిమాలతోనూ అలరించిన ఈ యంగ్ హీరో తాజాగా మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న రోహిత్ తన నెక్ట్స్ సినిమాలో దివ్యాంగుడిగా కనిపించనున్నాడట. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘వీర భోగ వసంత రాయలు’. ఇంద్రసేన.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా రోహిత్ ఓ చాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నాడట. ఇప్పటికే రిలీజ్ అయిన శ్రియ లుక్కు మంచి రెస్సాన్స్రాగా త్వరలో నారా రోహిత్ లుక్‌ను రివీల్ చేయనున్నారట. ఈ సినిమాలో రోహిత్ పాత్రకు కుడిచేయి ఉండదని తెలుస్తోంది. అయితే ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే లుక్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఈ సినిమాలో హీరోలు ఉండరు
‘‘వీరభోగ వసంతరాయలు’ చిత్రంలో హీరోలు అంటూ ఉండరు. ప్రతి క్యారెక్టర్ హీరోనే. ఇది ప్రయోగాత్మక సినిమా. తెలుగులో కచ్చితంగా ఇలాంటి సినిమా రాలేదు. డైరెక్టర్ ఇంద్ర ప్రపంచాన్ని తలకిందులుగా చూశాడు. సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్‌తోనే ఉంటుంది’’ అని హీరో నారా రోహిత్ అన్నారు. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రియ ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ ‘వీరభోగ వసంతరాయలు’. ఇంద్రసేన.ఆర్ దర్శకత్వంలో ఎంవికె రెడ్డి సమర్పణలో అప్పారావు బెల్లాన నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగోను హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఇంద్రసేన.ఆర్ మాట్లాడుతూ– ‘‘చిన్నప్పుడు మా ఇంటి వెనకాల ఉన్న గుడిలో రోజూ ‘బ్రహ్మంగారి చరిత్ర’ వినేవాణ్ని. అందులో ‘వీరభోగ వసంతరాయలు’ గురించి విన్నా. అది నా మనసులో స్థిరంగా నాటుకుపోయింది. కథకి తగ్గ టైటిల్ ఇది. పాపాలు పెరిగాయనే అంశం చుట్టూనే కథ తిరుగుతుంది’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ ఎవరూ చూడని విధంగా, ఊహించని విధంగా ఈ సినిమా ఉంటుంది. నిర్మాతగా నన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది డాక్టర్ ఎంవీకే రెడ్డిగారు. సౌతాఫ్రికా, అమెరికాలో ఉన్న డాక్టర్ మాధవి, డాక్టర్ నిరంజన్‌గారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు’’ అన్నారు అప్పారావు బెల్లాన. ‘‘సినిమా ప్రారంభమైన పదిహేను నిమిషాలకు ఇంగ్లీష్ సినిమానా? తెలుగు సినిమానా? అనే విషయం అర్థమవుతుంది. డైరెక్టర్ ఇంద్ర ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. నన్ను టార్చర్ పెట్టాడు. కానీ, అవుట్‌పుట్ చూసుకున్నాక వెరీ వెరీ హ్యాపీ’’ అన్నారు శ్రీ విష్ణు. -
పోలిక ఉండదు
నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్‌బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవీకే రెడ్డి సమర్పణలో ఇంద్రసేన .ఆర్ దర్శకత్వంలో అప్పారావు బెల్లాన నిర్మించారు. సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా అప్పారావు బెల్లాన మాట్లాడుతూ– ‘‘ఇంద్రసేన కథ చెప్పగానే సినిమా ప్రొడ్యూస్ చేద్దామనిపించింది. అంతగా కథ నచ్చింది. మంచి నటీనటులు కుదిరారు. సినిమాలోని నాలుగు ముఖ్య పాత్రలను ఇప్పటివరకు ఏ సినిమాలోనూ కనిపించని విధంగా దర్శకుడు డిజైన్ చేశారు. ఏ పాత్రకు మరో పాత్రతో పోలిక ఉండదు. ఈ సినిమా తెలుగు అండ్ హిందీ శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడు పోయాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలలోనే టైటిల్ లోగో ఆవిష్కరణ ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలో టీజర్, ట్రైలర్‌ను విడుదల చేసి, మూవీ రిలీజ్‌డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘ఇది సొసైటీలో జరిగే గ్రే అండ్ డార్క్ సైడ్లను టచ్ చేసే వినూత్నమైన మల్టీస్టారర్ మూవీ’’అన్నారు ఇంద్రసేన. శశాంక్, చరిత్ మానస్, స్నేహిత్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: రాబిన్. -
మిస్ ఇండియా కిరీటం సాధిస్తా
సాక్షి, తిరుమల: జూన్‌లో జరిగే ఫైనల్ పోటీల్లో మిస్ ఇండియా సాధించాలని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నానని, తాను మిస్ ఇండియా కిరీటం సాధిస్తాననే నమ్మకం ఉందని శ్రేయారావు అన్నారు. శుక్రవారం ఆమె సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. మిస్ ఇండియా పోటీలకు 30 రాష్ట్రాల నుంచి 30 మంది ఎంపికయ్యారని, తాను ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానని తెలిపారు. మే నెల నుంచి నెల రోజులపాటు శిక్షణ ఉంటుందన్నారు. జూన్ 23వ తేదీన ఫైనల్ పోటీలు ఉంటాయని పేర్కొ న్నారు. తిరుమల దర్శనం ఎంతో ప్రశాంత తను ఇచ్చిందన్నారు. -
ఆ విషయం శ్రీదేవిగారికి చెప్పాలని ఉంది
‘నటిగా మీకెవరు ఇన్స్పిరేషన్?’ అని శ్రియను ఓ ఇంటర్వ్యూలో ‘సాక్షి’ అడిగితే... ‘శ్రీదేవి’ అన్నారు. తనకు ఆదర్శంగా నిలిచిన శ్రీదేవి భౌతికంగా దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నా అన్నారు. శ్రియ మనోభావాలు ఈ విధంగా... ► నేనీ రోజు యాక్టర్ అయ్యానంటే శ్రీదేవి గారు కూడా ఒక కారణం. నాకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ వస్తే ఇంటిపట్టున ఉండాల్సి వచ్చింది. దాంతో కొద్దిసేపు శ్రీదేవిగారి డ్యాన్స్ చూసి, ఆ తర్వాత కొంచెంసేపు చదువుకునేదాన్ని. నేను చదువుకోవటానికి మా పేరెంట్స్ నాకు ఇచ్చిన లంచం ‘శ్రీదేవిగారి డ్యాన్స్ వీడియోలు’. జస్ట్ ఒక్క నిమిషం వీడియోలో కూడా శ్రీదేవిగారు చేసే మ్యాజిక్ ఎవ్వరూ చేయలేరు. ప్రస్తుతం మీడియా (అందరూ కాదు) తనకు ఏం చేస్తోందో చూస్తుంటే చాలా విచారంగా ఉంది. తన ఇమేజ్ను ముక్కలు ముక్కలుగా చింపేస్తున్నారు. తన పర్శనల్ లైఫ్ ఏదో సేల్కు ఉన్నట్లుగా... ఇప్పుడైనా తన ఆత్మను శాంతంగా ఉండనీయండి ప్లీజ్. ► హీరోయిన్ రోల్లో కూడా హీరో అంత డైనమిక్‌గా ఉండగల ఓకే ఒక ఉమన్ శ్రీదేవి. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో థియేటర్లకు జనాల్ని రప్పించగల క్రౌడ్‌పుల్లర్ శ్రీదేవి. చాలా త్వరగా విడిచి వెళ్లిపోయారు. ఇది చాలా అన్యాయం. శ్రీదేవిగారు చనిపోయారనే విషయం తెలియగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీళ్లు నేను ఆమెకు అందించిన నివాళి. నాకొక్క అవకాశం వస్తే తనను నేనెంతగా ఆరాధించానో, అభిమానించానో శ్రీదేవిగారికి చెప్పాలనుంది. ఆమె మనందరి మదిలో ఒక బ్యూటిఫుల్ మెమొరీ. ఎవరో మన చైల్డ్‌హుడ్ బ్యూటిఫుల్ మెమొరీని లాక్కెళ్లిపోయినట్టుగా ఉంది. -
శ్రియ పెళ్లి ఎప్పుడో తెలుసా.?
సాక్షి, సినిమా : నటి శ్రియకు పెళ్లి కళ వచ్చేసింది. శ్రియ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది నటీమణుల్లానే శ్రియాకు చాలా కాలంగా మీడియా నుంచి ఎదురవుతున్న ప్రశ్న పెళ్లి ఎప్పుడు? అని. అలాంటి వాటినన్నిటిని ఎదుర్కొంటూ వస్తున్న ఆమెకు వివాహ గడియలు తోసుకొచ్చాయట. అవీ ఎంతో దూరంలో లేవు. మరో రెండు వారాల్లోనే అనే ప్రచారం వైరల్ అవుతోంది. అవును శ్రియ రష్యన్‌కు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కోస్చీవ్ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని, మార్చిలో ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నారని సమాచారం. శ్రియ పెళ్లి వేడుక ఉదయపూర్‌లో మార్చి 17,18,19 తేదీల్లో జరగనుందని సమాచారం. అయితే ఈ విషయమై అధికారికపూర్వక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. కాగా కొద్ది రోజుల క్రితం కూడా శ్రియ పెళ్లిపీటలెక్కుతున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రియ స్పందిస్తూ ... పెళ్లి తనది కాదని, తన స్నేహితురాలిదని తెలిపింది. అయితే మరోసారి శ్రియ వివాహం అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అవి వాస్తవమా కాదా అని తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. ఇష్టం అనే తెలుగు చిత్రంతో ఇష్టపడి మరీ ఈ రంగంలోకి వచ్చిన ఉత్తరాది భామ శ్రియ. అలా ఒక్కో మెట్టూ ఎక్కుతూ నటిగా మంచి గుర్తింపు పొందింది. శ్రియ కోలీవుడ్‌లో శివాజీ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించే అవకాశం తలుపు తట్టింది. అంతే ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. అదే విధంగా టాలీవుడ్‌లోనూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్స్‌తో నటించి ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. ఆమె ప్రస్తుతం ‘వీర భోగ వసంత రాయలు’ చిత్రంలో నటిస్తున్నారు. -
ముచ్చటగా మూడోసారి
వెంకటేశ్, శ్రియకి ముచ్చటగా మూడోసారి జోడీ కుదిరింది. ‘సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల’ వంటి చిత్రాల్లో అలరించిన ఈ జంట మరోసారి ఓ చిత్రంలో కలిసి నటించనున్నారని టాక్. అఫ్కోర్స్ వెంకీతో ‘తులసి’లో శ్రియ ‘నే చుక్ చుక్ బండి’ అనే ఐటమ్ సాంగ్ చేసిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. ఆ సంగతలా ఉంచి, తాజా చిత్రం విషయానికొస్తే.. ‘గురు’ వంటి హిట్ సినిమా తర్వాత వెంకటేశ్ నటిస్తున్న సినిమా ‘ఆట నాదే వేట నాదే’ (పరిశీలనలో ఉన్న టైటిల్). ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత తేజ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో వెంకీకి జోడీగా కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ వంటి పేర్లు వినిపించాయి. వారిద్దరూ కాదు.. బాలీవుడ్ బ్యూటీ అదితీ రావ్ హైదరీని ఫిక్స్ చేశారంటూ ఆ మధ్య వార్తలు హల్చల్ చేశాయి. కట్‌చేస్తే.. తాజాగా శ్రియ పేరు లైన్లోకి వచ్చింది. వెంకటేశ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఆయనకు జోడీగా శ్రియ కరెక్ట్ అని చిత్రబృందం ఆలోచన అట. ‘గోపాల గోపాల’ సినిమాలో ఓ బిడ్డకు తల్లిగా కనిపించిన శ్రియ ఈ సినిమాలో ఇద్దరు పిల్లలకు తల్లి పాత్రలో నటించనున్నారట. ప్రస్తుతం తెలుగులో ‘వీర భోగ వసంతరాయలు’లో నటిస్తున్నారు శ్రియ. తమిళంలో చేసిన ‘నరగసూరన్’, ప్రకాశ్‌రాజ్ కాంబినేషన్లో నటించిన హిందీ చిత్ర ‘తఢ్కా’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. -
ఆ శక్తి వాళ్లను నాశనం చేస్తుంది
‘‘గాయత్రి’ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇంటర్నెట్లో పెట్టారు. ఒక సైట్లో 2 లక్షల మంది, ఇంకో సైట్లో 75 వేల మంది చూశారని అమెరికా నుంచి మిత్రులు ఫోన్ చేసి చెప్పారు. సినిమా విడుదలైన రోజే పైరసీ సీడీలు వస్తుంటే ఏం చేయాలి? నిర్మాతగా హృదయంలో ఏడుస్తున్నాను. కళ్లలో నీళ్లు కూడా రావడంలేదు’’ అని నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు లీడ్ రోల్లో నటించి, నిర్మించిన సినిమా ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వం వహించారు. విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘పైరసీ బారిన పడ్డ నాలాంటి నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లు బయటకు రాలేక, చెబితే వినేవాడు లేక ఉన్నారు. 42 ఏళ్ల సినిమా కెరీర్ ఉన్న నేను చెబితే కొంచెం అయినా చెవిన పడుతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ‘గాయత్రి’ కోసం తొమ్మిది నెలలు కష్టపడ్డాను. చేతికి, మోకాలికి సర్జరీ జరిగినా లెక్క చేయలేదు. దేవుడి దయవల్ల, ప్రేక్షకుల ప్రేమ వల్ల అన్నీ సంపాదించాను. నేను.. నా కుటుంబం.. నా బిడ్డలు... ఓ నలుగురికి సాయం చేయగలుగుతున్నాం. ‘అయ్యా.. పైరసీ చూసే మహానుభావుల్లారా. దయచేసి చూడొద్దు’. మనందరం దేవుణ్ణి.. ఏదో ఓ శక్తి ఉందని నమ్ముతాం. ఆ పైరసీ చూసేవాళ్లందర్నీ ఆ శక్తి నాశనం చేస్తుంది. ఎదుటివాడు చెడిపోవాలనుకుంటే మనమే చెడిపోతాం. పైరసీ చేసినవాళ్లు, దాన్ని చూసే వాళ్లు ఉంటే ఎక్కడికి పోతుందీ దేశం. రిలీజ్ రోజే పైరసీ చేసింది థియేటర్ ఆపరేటరా? ఓనరా? ఇంకా ఎవరైనానా? ఇవన్నీ ఆ శివుడు.. సాయినాథుడికే ఎరుక. ‘రౌడీ’ సినిమా అప్పుడు ‘విష్ణు ఎంత చక్కగా చేస్తున్నాడు’ అన్నాడు రామ్‌గోపాల్ వర్మ. డబ్బు ముఖ్యమా? పేరు ముఖ్యమా అంటే పేరే ముఖ్యం అంటాను నేను. ఏ తండ్రి అయినా బిడ్డల్ని చూసి పొందేదే సంతోషం. యంగ్ శివాజీ పాత్రలో విష్ణుకి మంచి పేరు వచ్చింది. శ్రియ కూడా బాగా చేసింది. వీడియో పైరసీ చేసినవాళ్లను కూడా ఆ దేవుడు చల్లగా చూడాలి’’ అన్నారు. మదన్ రామిగాని మాట్లాడుతూ– ‘‘సినిమాకు మేము చేసిన పబ్లిసిటీ కంటే మౌత్ టాక్ చాలా ఎక్కువగా ఉంది. విజయవాడకు చెందిన నాటక పరిషత్ వాళ్లు ‘గాయత్రి’ సినిమా నటులకు డిక్షనరీలా ఉంటుంది అన్నారు. ‘మోహన్‌బాబుకు వయసు అయిపోదా? ఆ ఎనర్జీ ఏంటి?’’ అని రాయలసీమలో ఓ ఫ్రెండ్ అన్నాడు. ఈ సినిమాకి ఇవి రెండూ బెస్ట్ కాంప్లిమెంట్స్. మోహన్‌బాబుగారు హిట్స్.. ఫ్లాప్స్ పట్టించుకోరు. కథ నచ్చితే చేస్తారు. హాలీవుడ్ యాక్టర్ టామ్ క్రూజ్ ఏదో స్టంట్ చేస్తూ గాయపడ్డాడని ప్రపంచం మొత్తం మాట్లాడుకున్నారు. మోహన్‌బాబుగారు భుజం నొప్పితో వారం రోజులపాటు ఫైట్ సీన్లో పాల్గొన్నారు. వయసులో టామ్ క్రూజ్ కంటే మోహన్ బాబుగారే పెద్ద. ఎందుకు మనం మనవాళ్ల గురించి గొప్పగా మాట్లాడుకోమో తెలియదు. పరాయి వాళ్ల గొప్పలే కనిపిస్తుంటాయి మనకు. మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి కానీ అప్లై చేయం, విల్ పవర్ ఉంటుంది కానీ వాడం. మోహన్‌బాబుగారు ఆ రెండూ చేస్తారు. మా కెరీర్లో ‘గాయత్రి’ ఒక మంచి మైలు రాయి. ఈ సినిమా గొప్పతనం మెల్లిగా తెలుస్తుంది. సినిమాల్లో 24 క్రాఫ్ట్‌లే కానీ 25వ క్రాఫ్ట్ రావాలి.. అదే ఆత్మ పరిశీలన. ఈ సినిమాకు అది జరిగింది. ప్రతీ సీన్ ఒకటికి మూడు సార్లు ఆలోచించి తీశాము’’ అన్నారు. ‘‘భారతదేశంలో ఇద్దరి పరిస్థితే బాగోలేదు. ఒకరు రైతు, ఇంకొకరు నిర్మాత. సినిమా రాకముందే రివ్యూలు వచ్చేస్తున్నాయి. రోజు గడవకముందే పైరసీ ప్రింట్లు వచ్చేస్తున్నాయి. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు నిర్మాత’’ అన్నారు డైలాగ్ రైటర్ డైమండ్ రత్నబాబు. నేను ఏ పార్టీవాణ్ణి కాదు ‘గాయత్రి’ సినిమాలో కొన్ని డైలాగ్స్ వివాదంగా ఉన్నాయనీ.. ఓ పార్టీని ఉద్దేశించి ఆ డైలాగ్స్ మాట్లాడాననే మాటలు విన్నాను. నేను ఏ పార్టీకీ చెందినవాణ్ణి కాదు. రోజూ పేపర్లో చూసే కొన్ని ఛలోక్తులు సినిమాలో వాడాం. నేను రాజకీయాల గురించి త్వరలో మాట్లాడతాను. ఏ పార్టీకి ఓటు వేయాలో.. ఏ పార్టీకి వేస్తే నష్టపోతారో చెబుతాను. -
శ్రియకు పెళ్లా
తమిళసినిమా: నటి శ్రియకు పెళ్లంట. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్త ఇదే. నటిగా ఈ ఉత్తరాది భామ వయసు 15 ఏళ్లు. ఇష్టం చిత్రంతో టాలీవుడ్‌కు, ఉనక్కు 20 ఎనక్కు 18 చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన శ్రియ ఆ తరువాత ఈ రెండు భాషల్లోనూ ఒక్కో మెట్టూ ఎక్కుతూ అగ్రనటిగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో చాలా తక్కువ కాలంలోనే సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శివాజీ చిత్రంలో జోడీ కట్టే అవకాశాన్ని దక్కించుకున్న నటి శ్రియ. అలా విజయ్, విశాల్, ధనుష్ అంటూ స్టార్ హీరోలందరితోనూ వరుస పెట్టి నటించేసింది. అదే విధంగా తెలుగులోనూ చిరంజీవి నుంచి ప్రముఖ నటులందరితోనూ నటించి విజయాలను తన ఖాతోలో వేసుకుంది. హిందీలోనూ గుర్తింపు పొందిన శ్రియకు పెళ్లి గడియలు ముంచుకొచ్చేస్తున్నాయని, మార్చిలోనే రష్యాకు చెందిన తన బాయ్‌ఫ్రెండ్‌తో పీపీపీ..డుండుండుంకు రెడీ అయిపోతుందనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే శ్రియ పెళ్లి చేసుకోబోతోందన్న ప్రచారాన్ని ఆమె తల్లి నీర్జ ఖండించింది. ఈమె ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన భేటీలో శ్రియ పెళ్లి వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. శ్రియ ప్రస్తుతం తమిళం, తెలుగు భాషా చిత్రాలతో బిజీగా ఉందని చెప్పారు. అయితే రాజస్థాన్‌లోని తన మిత్రుడి పెళ్లికి వెళ్లిందని, అందులో భాగంగా ఒక డిజైనర్‌కు ప్రత్యేకంగా జ్యువెలరీ, డ్రస్‌ను తయారు చేయడానికి ఆర్డర్ చేసిందని, దీంతో తన పెళ్లికే ఈ జ్యువెలరీ, డ్రస్‌ను ఆర్డర్ చేసిందని భావించి నెటిజన్లు పెళ్లి ప్రచారం చేస్తున్నారని వివరించారు. అలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని శ్రియతల్లి నీర్జ పేర్కొన్నారు. శ్రియ నటించిన తెలుగు చిత్రం గాయత్రి శుక్రవారం తెరపైకి రానుంది. తమిళంలో అరవిందస్వామితో కలిసి నరకాసురన్ చిత్రంలో నటిస్తోంది. -
‘గాయత్రి’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
మహానటుల్లో ఆయన ఉంటారు
‘‘గాయత్రి’ సినిమా తండ్రి, కూతుళ్ల కథ. పూర్తిగా వారి మధ్యన నడుస్తుంది. గాయత్రిగా నిఖిలా విమల్ నటించారు. మోహన్‌బాబుగారు ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్ర పేరు గాయత్రీపటేల్.. మరొకటి శివాజీ. గాయత్రీపటేల్ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది’’ అని దర్శకుడు మదన్ రామిగాని అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మదన్ చెప్పిన విశేషాలు.. ► మన జీవితంలో చాలా విషయాలు కష్టమైనవి, ఇష్టమైనవి ఉంటాయి. రెండూ ముడిపడి ఉండేదే గాయత్రి. ఓ విభిన్నమైన అంశం ఈ సినిమాలో ఉంటుంది. అదేంటన్నది తెరపై చూడాలి. ► ‘గాయత్రి’ సినిమా మోహన్‌బాబుగారికి రీ–లాంచ్ లాంటిది. ఆయన మంచి సలహాలు ఇచ్చారు. ఎవరు సలహా చెప్పినా ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారు. అదే మోహన్బాబుగారిలోని గొప్పదనం. కేవలం ఒక్క సిట్టింగ్‌లో సినిమా ఓకే చేసేశారు. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉంది. ► మోహన్‌బాబుగారు మహానటుడు. అంతటి నటుణ్ణి ఎలా హ్యాండిల్ చేయగలనా? అనిపించేది. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏయన్నార్, శివాజీ గణేశన్ గార్లు మహానటులు. ఆ జాబితాలో ఆయనుంటారు. ఆయనకు గొప్ప పాత్రలు రాయాలంతే. విష్ణు పాత్ర ఇద్దరు మోహన్బాబుల్లో ఒకరికి యంగర్ వెర్షన్‌గా ఉంటుంది. ► ఫ్యామిలీ డ్రామాల్లో కొత్త.. పాత ఉండదు. అన్నిటిలోనూ ఎమోషన్ ఉంటుంది. ట్రెండ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు తీసినా పండుతాయి. నేను తక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేక కారణం ఏం లేదు. ఎందుకో అలా కుదిరింది. కొత్త కథలు రాసుకుంటున్నా. ఈ ఏడాదే మరో చిత్రం ఉంటుంది. అది ఎవరితో అన్నది తర్వాత చెబుతా. -
నేను లక్కీ
‘‘డైరెక్టర్ మదన్ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా గత చిత్రాలతో పోలిస్తే ‘గాయత్రి’ సినిమాలో నా పాత్ర కూడా సహజంగా, అందంగా ఉంటుంది. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా’’ అని కథానాయిక శ్రియ అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రియ విలేకరులతో మాట్లాడారు. ► ‘గాయత్రి’ సినిమాలో నేను ఓ చిన్న పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తా. నా క్యారెక్టర్ చాలా అమాయకంగా, నిజాయితీగా, తెలివిగా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. మోహన్‌బాబుగారు గొప్ప నటుడు. విష్ణుతో యాక్ట్ చేయడం మంచి అనుభూతినిచ్చింది. ► మదన్ ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా కూల్‌గా ఉంటారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా ఈ చిత్రం తీశారు. ఆయనతో పని చేయడం చాలా బాగుంది. షూటింగ్ చేసినన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశా. నాపై ఓ బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉంటుంది. ► దర్శకులు, రచయితలు మంచి కథలు, పాత్రలు రాస్తున్నారు కాబట్టి ఇన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నా. నేను ఎంపిక చేసుకునే సినిమాలు కూడా నాకు బాగా కలిసొచ్చాయి. ఒక మూసలో పడిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త పాత్రలు చేసే అవకాశం వస్తోంది. అందుకే నేను లక్కీ. ► ప్రస్తుతం తెలుగులో ‘వీరభోగ వసంతరాయలు’, తమిళంలో కార్తీక్ నరేన్‌తో ‘నరగసూరన్’ సినిమాలు చేస్తున్నా. ఆ తర్వాత ఓ లేడీ డైరెక్టర్ సినిమా చేయనున్నా. యువ దర్శకులతో వరుస సినిమాలు చేయడానికి కారణం వారి కథలే. చక్కగా, వైవిధ్యంగా రాసుకుంటున్నారు. అందుకే నేను వారి సినిమాల్లో చేయడానికి ఒప్పుకుంటున్నా. -
విర్రవీగితే తొక్కేస్తాడు – మోహన్‌బాబు
‘‘మాకు తెలిసిన ఫీల్డ్, వ్యాపారం సినిమా. నటుడిగా పుట్టా. నటుడిగా.. నిర్మాతగా తప్ప వేరే వ్యాపకాలు లేవు. భగవంతుడి ఆశీర్వాదాలతో విద్యాసంస్థ స్థాపించా’’ అని నటులు మంచు మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వంలో అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై మోహన్‌బాబు నిర్మించారు. తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘కష్టపడి సినిమా తీశాం. విజయం భగవంతుని ఆశీస్సులతో ఉంటుంది. అలా తీశాం.. ఇలా తీశాం.. అంటుంటాం. కానీ అన్నీ భగవంతుడు చూస్తుంటాడు. ఎంత అణిగి మణిగి ఉంటే అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన మనకు ఇస్తాడు. విర్రవీగినప్పుడు ఒక తొక్కు తొక్కుతాడు. దాదాపు 60పైన సినిమాలు తీశాం. జయాలు.. అపజయాలున్నాయి. విజయం వచ్చినప్పుడు విర్ర వీగలేదు.. అపజయం వచ్చినప్పుడు కుంగిపోలేదు. ఐదు సినిమాలు హిట్ అయినా.. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే.. ఐదు సినిమాల హిట్టూ పోతుంది. నన్ను నటుడిగా పరిచయం చేసిన మా గురువు దాసరి నారాయణరావుగారు ఎంత గొప్ప దర్శకుడో ఈ జనరేషన్‌కి తెలీదు. మహానటుడు ఎన్టీఆర్ తర్వాత డైలాగులు చెప్పగలడని నాకు పేరొచ్చిందంటే ఆ క్రెడిట్ మా గురువుగారిదే. నన్ను నా వైఫ్ నిర్మల ఎప్పుడూ ‘బావా’ అని ప్రేమగా పిలిచేది. కానీ.. ఈ మధ్య పిలవడం లేదు. ఎందుకంటే నాకు సక్సెస్ లేదు కదా. సక్సెస్ లేకపోతే ఎవరూ పిలవరు (నవ్వుతూ). ‘గాయత్రి’ సినిమాలో శ్రియ నటన చూసి నాకు కౌగిలించుకోవాలని కోరిక ఉండేది. కానీ విష్ణు ఎక్కడ సీరియస్ అవుతాడోనని ఊరుకున్నా (నవ్వుతూ). ‘గాయత్రి’ చిత్రంలో విష్ణు తన నటనతో కంటతడి పెట్టించాడు. సెన్సార్ కాకుండా ఫిబ్రవరి 9వ తారీఖు రిలీజ్ అవుతుందని చెప్పకూడదు. సెన్సార్ పూర్తయి అదే తారీఖుకి సినిమా విడుదలవుతుందని.. అవ్వాలని కోరుకుందాం. మదన్ ‘గాయత్రి’ సినిమాను అద్భుతంగా తీశాడు. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’ అన్నారు. ‘‘42 ఏళ్ల కెరీర్లో ఓ పాత్రకీ మరో పాత్రకీ సంబంధం లేని పాత్రలు చేశారు మోహన్‌బాబు’’ అన్నారు ఎంపీ, ‘కళాబంధు’ టి. సుబ్బరామిరెడ్డి. మదన్ మాట్లాడుతూ– ‘‘ఆ నలుగురు’ సినిమాలో ఓ డైలాగ్ రాశా. ‘మనుషులను చదివినవాడు వేదాంతి అయినా అవుతాడు లేదా వ్యాపారి అయినా అవుతాడు’ అని. ఈ సందర్భంలో ఆ డైలాగ్ రాయాల్సి వస్తే ‘మనుషులను చదివినవాడు వేదాంతి అయినా అవుతాడు.. వ్యాపారి అయినా అవుతాడు.. లేదా మోహన్బాబుగారిలాగా మహా నటుడైనా అవుతాడు’’ అన్నారు. ‘‘గాయత్రి’లో నా పాత్ర నా కెరీర్లో వన్నాఫ్ ది మోస్ట్ టర్నింగ్ పాయింట్ అవుతుంది’’ అన్నారు విష్ణు. నటులు కోటా శ్రీనివాసరావు, గిరిబాబు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, డైరెక్టర్ బి.గోపాల్, మంచు లక్ష్మి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క నిమిషం!
ఒక్క నిమిషం.. అంటే 60 సెకన్లు్ల.. ఒకే ఒక్క నిమిషంలో ఏం చేయగలం? అంటే.. తలచుకుంటే ఏమైనా చేయొచ్చు. మంచి నిర్ణయం కూడా తీసుకోవచ్చు. అదే చేశారు హీరోయిన్లు శ్రియ, నిక్కీ గల్రాని. ‘‘న్యూ ఇయర్ రిజల్యూషన్ గురించి ఇంకా ఆలోచిస్తున్నారా? నేనైతే రోజులో కనీసం ఒక్క నిమిషమైనా యోగ చేయాలనుకుంటున్నా. డైలీ యోగ చేయడాన్ని మర్చిపోలేని అలవాటుగా మార్చుకోవాలని డిసైడ్ అయ్యాను’’ అన్నారు శ్రియ. అయితే ఒక్క నిమిషంలో ఏ ఆసనం వేస్తారో మాత్రం చెప్పలేదు. ఇక నిక్కీ గల్రాని కూడా సేమ్ శ్రియ తీసుకున్న నిర్ణయాన్నే తీసుకున్నారు. ఆమె కూడా యోగా చేయాలని ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా ప్రాణాయామం చేయాలని ఫిక్సయ్యారట. ‘‘ఈ సంవత్సరం ప్రతి రోజూ కనీసం ఒక్క నిమిషమైనా ప్రాణాయామం ప్రాక్టీస్ చేస్తా. మీరూ ఓ మంచి నిర్ణయం తీసుకోండి’’ అన్నారు నిక్కీ. ఈ సంగతి ఇలా ఉంచితే.. నిక్కీకి ఫిబ్రవరి 9 సూపర్ డే. ఆమె హీరోయిన్గా నటించిన రెండు చిత్రాలు ‘కీ, కలకలప్పు–2’ ఆ రోజునే విడుదల కానున్నాయి. సో..ఆ రోజు నిక్కీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా అన్నమాట. -
అదిరిపోయే డైలాగ్స్!
డైలాగ్స్ చెప్పడంలో మోహన్‌బాబు స్టైలే డిఫరెంట్. స్క్రీన్‌పై ఆయన డైలాగ్స్ చెబుతుంటే ప్రేక్షకుల రెస్పాన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. త్వరలో విడుదల కాబోతున్న ‘గాయత్రి’లో పవర్ఫుల్ డైలాగ్స్ చాలా ఉన్నాయి. మోహన్‌బాబు, విష్ణు, శ్రియ, నిఖిలా విమల్ ముఖ్య తారలుగా ఆర్.మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గాయత్రి’. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. టీజర్లో మోహన్‌బాబు చెప్పిన డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు. ‘‘మోహన్‌బాబుగారి నటన ఈ సినిమాకు కొండంత అండ’’ అని చిత్రబృందం చెబుతోంది. అనసూయ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. ‘గాయత్రి’ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మిస్ ఇన్నోసెంట్!
చిన్న ఉద్యోగం చేసుకుంటూ లైఫ్‌ని లీడ్ చేస్తుంది ఓ అమాయకురాలైన అమ్మాయి. చెప్పుకోవాల్సినంత బాధలు, గుర్తుపెట్టుకోవాల్సినన్ని బాధ్యతలు తనకు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే.. హ్యాపీ లైఫ్ అన్నమాట. కానీ ఎప్పుడూ ఒకేలా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది. సడన్‌గా ఓ ఇన్సిడెంట్. లైఫ్ అంతా టోటల్ చేంజ్. ఏంటా ఇన్సిండెట్? దాని వల్ల ఆ అమ్మాయి జీవితంలో వచ్చిన మార్పులేంటి? అంటే ప్రజెంట్ సస్పెన్స్. ఆ అమాయకురాలి పాత్రలో నటిస్తున్నారు శ్రియ. సుజన దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ లేడీ ఓరియంటెడ్ మూవీలో శ్రియ ముఖ్య తార. ఇళయరాజా సంగీతం అందించనున్న ఈ చిత్రం ద్వారా ఛాయాగ్రాహకుడు వీఎస్ జ్ఞానశేఖర్ నిర్మాతగా మారుతున్నారు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందించనున్నారు. ‘‘నటీనటుల ఎంపిక ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. సెట్ డిజైన్ వర్క్స్ జరుగుతున్నాయి. మార్చి ఫస్ట్ వీక్‌లో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సుజన. -
స్క్రీన్ టెస్ట్
► ఎన్టీఆర్–జయప్రద ఫేమస్ సాంగ్ ‘ఓలమ్మి తిక్క రేగిందా..’ పాటను ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘యమదొంగ’ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఆ పాటలోని ‘మేల్ వాయిస్’ ఎవరిదో తెలుసా? ఎ) యం.యం. కీరవాణి బి) ఎస్.ఎస్.రాజమౌళి సి) జూ. యన్టీఆర్ డి) యస్పీ బాలసుబ్రహ్మణ్యం ► ‘డాడీస్ లిల్ గాళ్’ అనే టాటూ ఏ ప్రముఖ బాలీవుడ్ నటి చేతిపై ఉంటుంది? ఎ) ప్రియాంకా చోప్రా బి) దీపికా పదుకోన్ సి) విద్యాబాలన్ డి) కరీనాకపూర్ ► సమయం లేదు మిత్రమా! శరణమా? రణమా? ఈ డైలాగ్‌ను రాసిన రచయిత ఎవరో తెలుసా? ఎ) జనార్థన మహర్షి బి) సాయిమాధవ్ బుర్రా సి) క్రిష్ డి) పరుచూరి బ్రదర్స్ ► నాకు ఓల్డ్ స్టైల్ రొమాన్సే (1990ల్లో) ఇష్టం అని చెప్పే హీరోయిన్ ఎవరు? ఈ హీరోయిన్ తండ్రి కూడా పెద్ద హీరోనే. తండ్రి తనకు రొమాంటిక్ స్టోరీలు చెప్పేవారని ఆమే చెప్పారు. ఎ) శ్రుతీహాసన్ బి) కీర్తీ సురేష్ సి) కార్తీక డి) వరలక్ష్మీ ► మరియప్పన్ అనే క్రీడాకారుని జీవితం ఆధారంగా ఓ చిత్రం (బయోపిక్) తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తానని ప్రకటించారు. మరియప్పన్ ఏ క్రీడకు చెందినవాడు? ఎ) క్రికెట్ బి) బాక్సింగ్ సి) లాంగ్ జంప్ డి) హై జంప్ ► ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న భామ ఎవరో కనుక్కోండి? ఎ) శ్రద్ధా కపూర్ బి) కంగనా రనౌత్ సి) ఇలియానా డి) రకుల్ ప్రీత్ ► ‘దేవదాసు’ చిత్రానికి మొదట అనుకొన్న హీరోయిన్ సావిత్రి కాదు. మరి ఎవరై ఉంటారో కనుక్కోండి? ఎ) భానుమతి బి) యస్. వరలక్ష్మి సి) అంజలీదేవి డి) ‘షావుకారు’ జానకి ► ‘శంకరాభరణం’ చిత్రంలో మంజు భార్గవి కొడుకు పాత్రలో నటించింది ఓ అమ్మాయి. తర్వాత కాలంలో ఆమె నటిగా చాలా పాత్రలు పోషించారు. ఆమె పేరేంటి? ఎ) శ్రీలక్ష్మీ బి) తులసి సి) ప్రగతి డి) రజిత ► యలవర్తి నాయుడమ్మ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శాస్త్రవేత్త. ఆయన మనవరాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటుడెవరు? ఎ) నాని బి) రామ్‌చరణ్ సి) కల్యాణ్‌రామ్ డి) ఆది ► ‘మనం దేన్నైతే అసహ్యించుకుంటామో దేవుడు అందులోంచి ముంచి లేపుతాడు’ అనేది ‘మహానుభావుడు’ సినిమాలో డైలాగ్. సినిమాలో ఈ డైలాగ్‌ను ఏ కమెడియన్ చెప్తాడు? ఎ) భద్రం బి) ‘వేన్నెల’ కిశోర్ సి) టిల్లు వేణు డి) రఘుబాబు ► ‘దాన వీర శూర కర్ణ’ సినిమా దర్శకుడెవరు? ఎ) కమలాకర కామేశ్వరరావు బి) కె.వి. రెడ్డి సి) విఠలాచార్య డి) ఎన్టీ రామారావు ► ప్రభాస్ తన మొదటి చిత్రం ‘ఈశ్వర్’తో మొదలుకొని ‘బాహుబలి’ రెండు పార్టులతో కలిపి ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా? ఎ) 18 బి) 21 సి) 14 డి) 25 ► ‘ఆకలేస్తే అన్నం పెడతా మూడొస్తే ముద్దుల్ పెడతా చిన్నోడా..’ అనే పాటను పాడింది ఎవరు? ఎ) శ్రేయా ఘోషల్ బి) గీతా మాధురి సి) మమతా మోహన్‌దాస్ డి) దామిని ► యస్.యస్. రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్ 10న. అదే రోజు పుట్టిన టాప్ హీరోయిన్ ఎవరు? ఎ) రాశీఖన్నా బి) కాజల్ అగర్వాల్ సి) శ్రియ డి) రకుల్‌ప్రీత్ సింగ్ ► కమల్‌హాసన్ నటించిన ‘దశావతారం’ సినిమా దర్శకుడెవరు? ఎ) కె.యస్. రవికుమార్ బి) పి.వాసు సి) సురేశ్‌కృష్ణ డి) లింగుస్వామి ► ‘అబ్బ దబ్బ జబ్బ..’ అనే డైలాగ్ చాలా పాపులర్. ఈ డైలాగ్‌లో నటించిన లేడీ కమెడియన్ శ్రీలక్ష్మీ. ఆమెకు జోడీగా నటించిందెవరు? ఎ) ఏవీయస్ బి) బ్రహ్మానందం సి) ధర్మవరపు డి) సుధాకర్ ► 2017లో రిలీజైన సినిమాకు 2016వ సంవత్సరానికి నేషనల్ అవార్డు లభించింది.ఆ సినిమా పేరేంటి? ఎ) ౖఖñ దీ నం 150 బి) గౌతమిపుత్ర శాతకర్ణి సి) బాహుబలి డి) శతమానం భవతి ► నటుడు వెంకటేశ్ ఎవరి సిద్ధాంతాలను నమ్ముతారో తెలుసా? ఎ) స్వామి వివేకానంద బి) రమణ మహర్షి సి) రామకృష్ణ పరమహంస డి) స్వామి పరిపూర్ణానంద ► 19. ఈ ఫొటోలోని లక్ష్మణుని పాత్రలో నటించిన నటుడెవరో గుర్తుపట్టండి ? ఎ) కాంతారావు బి) హరనాథ్‌బాబు సి) శోభన్‌బాబు డి) చలం ► ఈ ఫోటోలోని ప్రముఖ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) నిత్యామీనన్ బి) అనుష్క సి) భావన డి) కాజల్ అగర్వాల్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) ఎ 3) బి 4) ఎ 5) డి 6) ఎ 7) డి 8) బి 9) ఎ 10) బి 11) డి 12) ఎ 13) సి 14) డి 15) ఎ 16) బి 17) బి 18) బి 19) ఎ 20) ఎ -
తర్వాత సంగతి తర్వాత!
కొంతమంది మనస్తత్వం అంతే.. మనసులో ఏదనిపిస్తే అది బయటకు చెప్పేస్తారు. తర్వాత సంగతి తర్వాత అంటారు. ఎవరేమనుకుంటారో అని భయపడరు. లోపల ఒకటి అనుకొని బయట ఇంకోలాగా ప్రవర్తించటం వాళ్లకు చేత కాదు. అలాంటి మనస్తత్వం ఉన్న పాత్రనే పోషించారు శ్రియ ‘గాయత్రి’ సినిమాలో. ఈ సినిమాలో శ్రియ లుక్‌ను శనివారం విడుదల చేశారు. ‘నేనేదనుకుంటే అది చెప్పటం నాకలవాటు.. తర్వాత సంగతి తర్వాత’ అని క్యాప్షన్ ఉన్న ఆమె పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. అరియానా, వివియానా మరియు విద్యా నిర్వాణ సమర్పణలో మంచు మోహన్‌బాబు నటించి, శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పై నిర్మించిన ఈ సినిమాలో గాయత్రి పాత్రను నిఖిలా విమల్ పోషించారు. విష్ణు, శ్రియ భార్యాభర్తలుగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు మదన్ రామిగాని దర్శకుడు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సర్వేష్ మురారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్.ఆర్. -
ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం
తల్లి కాబోతున్న భార్యను భర్త కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకుంటే ఆ భార్య మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇక్కడున్న ఫొటోలు శ్రియ కళ్లల్లో ఆ ఆనందం చూడొచ్చు. విష్ణు ఎంచక్కా జడ అల్లుతున్నారు కదా. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నటించి, నిర్మించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ కీలక పాత్రలు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ‘ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం’ అనే క్యాప్షన్‌తో విష్ణు–శ్రియల ఫొటోను విడుదల చేశారు. పుట్టబోయే బిడ్డ గురించి శ్రియ కలలు కంటుంటే.. విష్ణు ఆమెకు జడ వేస్తున్న ఈ ఫొటో భలే పసందుగా ఉంది కదూ. అన్నట్లు.. ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం అంటే.. వారి జీవితాల్లోకి కొత్తగా రాబోయే బేబి గురించి అయ్యుండొచ్చని ఊహించవచ్చు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన మోస్ట్ చాలెంజింగ్ రోల్స్‌లో ‘గాయత్రి’లో చేసిన రోల్ ఒకటి. నా కెరీర్లో వన్నాఫ్ మై బెస్ట్ సాంగ్ కూడా ఈ సినిమాలో ఉంది. నా ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు నచ్చిందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు విష్ణు. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ కుమార్. ఆర్. ఈ సంగతి ఇలా ఉంచితే.. రియల్ లైఫ్‌లో మంచు విష్ణు సతీమణి విరానిక సోమవారం బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విష్ణు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. -
ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం
తల్లి కాబోతున్న భార్యను భర్త కాలు కింద పెట్టనివ్వకుండా అపురూపంగా చూసుకుంటే ఆ భార్య మనసు ఆనందంతో నిండిపోతుంది. ఇక్కడున్న ఫొటోలు శ్రియ కళ్లల్లో ఆ ఆనందం చూడొచ్చు. విష్ణు ఎంచక్కా జడ అల్లుతున్నారు కదా. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నటించి, నిర్మించిన చిత్రం ‘గాయత్రి’. మదన్ రామిగాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ కీలక పాత్రలు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా ‘ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం’ అనే క్యాప్షన్‌తో విష్ణు–శ్రియల ఫొటోను విడుదల చేశారు. పుట్టబోయే బిడ్డ గురించి శ్రియ కలలు కంటుంటే.. విష్ణు ఆమెకు జడ వేస్తున్న ఈ ఫొటో భలే పసందుగా ఉంది కదూ. అన్నట్లు.. ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం అంటే.. వారి జీవితాల్లోకి కొత్తగా రాబోయే బేబి గురించి అయ్యుండొచ్చని ఊహించవచ్చు. ‘‘ఇప్పటివరకు నేను చేసిన మోస్ట్ చాలెంజింగ్ రోల్స్‌లో ‘గాయత్రి’లో చేసిన రోల్ ఒకటి. నా కెరీర్లో వన్నాఫ్ మై బెస్ట్ సాంగ్ కూడా ఈ సినిమాలో ఉంది. నా ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు నచ్చిందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు విష్ణు. ఫిబ్రవరి 9న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్ కుమార్. ఆర్. ఈ సంగతి ఇలా ఉంచితే.. రియల్ లైఫ్‌లో మంచు విష్ణు సతీమణి విరానిక సోమవారం బాబుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని విష్ణు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. -
ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం!
సాక్షి, హైదరాబాద్: మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్న తాజా చిత్రం ‘గాయత్రి’.. మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మంచు విష్ణు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ ను విష్ణు ట్విట్టర్లో షేర్ చేశాడు. గర్భవతిగా కనిపిస్తున్న శ్రియకు విష్ణు జడ వేస్తూ కనిపిస్తున్న ఈ పోస్టర్లో 'ఇకపై ఇద్దరిదీ ఒకటే ప్రాణం' అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. తన కెరీర్లో ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో అత్యంత చాలెజింగ్ రోల్ ఇదేనని, తన కెరీర్లో బెస్ట్ సాంగ్ కూడా ఇదేనని.. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు విష్ణు కామెంట్ చేశారు. నిఖిలా విమల్ టైటిల్ రోల్లో కనిపిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. . తమన్ సంగీతం అందించాడు. One of the most challenging roles I played so far. And one of my career best song in #Gayatri. Hope you all like the my first look from #Gayatri pic.twitter.com/ChyPhA4uhG — Vishnu Manchu (@iVishnuManchu) 1 January 2018 -
రాముడు చేసింది తప్పు అయితే నాదీ తప్పే
... అంటున్నారు మోహన్‌బాబు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి? ఆ తప్పుని రైట్ అని చెప్పడానికి రాముడితో ఎందుకు పోల్చారు? అనేది తెలియాలంటే ‘గాయత్రి’ సినిమా చూడాల్సిందే. విలక్షణ నటుడు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ఈ చిత్రంలో గాయత్రి పాత్రను నిఖిలా రామన్ పోషిస్తున్నారు. ఆరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మదన్ రామిగాని దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రంలో మోహన్‌బాబు పవర్ఫుల్ లుక్‌ను విడుదల చేశారు. ‘ఆ రోజు రాముడు చేసింది తప్పు అయితే నాదీ తప్పే’ అనే క్యాప్షన్‌తో ఉన్న పోస్టర్‌తో విడుదలైన ఈ లుక్ ఆసక్తి పెంచే విధంగా ఉంది. ఇందులో మంచు విష్ణు, శ్రియ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: సర్వేశ్ మురారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: విజయ్‌కుమార్ ఆర్. -
విష్ణు పవర్ఫుల్... శ్రియ స్పెషల్!
ఎవరికి? మంచు మోహన్‌బాబు ‘గాయత్రి’కి! యస్... ‘పెళ్లైన కొత్తలో’ ఫేమ్ మదన్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘గాయత్రి’లో మంచు విష్ణు, శ్రియ నటిస్తున్నారు. ఆల్రెడీ షూటింగులో పాల్గొంటున్నారు కూడా! ఓ రకంగా ప్రేక్షకులకు స్వీట్ సర్ప్రైజే ఇది. సైలెంట్‌గా, లో ప్రొఫైల్‌లో ఈ సిన్మా షూటింగ్ చేస్తున్నారు. కొంత విరామం తర్వాత మోహన్‌బాబు హీరోగా నటిస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. తెరపై ఆయనుంటే చాలు. డైలాగులతో, నటనతో చెలరేగుతారు. మరి, ఆయనకు తోడు తనయుడు విష్ణు, శ్రియ అనగానే ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి కలుగుతోంది. పవర్ఫుల్ పాత్రలో విష్ణు, స్పెషల్ రోల్లో శ్రియ కనిపించనున్నారని చిత్రబృందం తెలిపింది. ఇప్పుడీ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. సోమవారం విష్ణు సెట్స్‌లో జాయిన్ అయ్యారు. అదే రోజున నందమూరి బాలకృష్ణ ‘గాయత్రి’ సెట్స్‌కి విచ్చేసి మోహన్‌బాబు, విష్ణులను కలసి కాసేపు వారితో ముచ్చటించారు. అనసూయ, ‘మేడ మీద అబ్బాయి’ ఫేమ్ నిఖిలా విమల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘గాయత్రి’ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. -
ఓ సలహా.. ప్లీజ్..
... అంటున్నారు శ్రియ. ఇంతకీ ఏ విషయంలో సలహా కావాలి? అంటే.. బుక్స్ గురించి. ఈ బ్యూటీ బాగా పుస్తకాలు చదువుతారు. ‘‘ఏదైనా మంచి పుస్తకం ఉంటే సూచించండి. ప్రభావితం చేసే జీవిత కథలు, మంచి ప్రేమకథలు, చరిత్రకు సంబంధించిన బుక్స్ గురించి చెప్పండి’’ అంటున్నారు. ఒక్క కండిషన్ పెట్టారు. మర్డర్ మిస్టరీ, హారర్ పుస్తకాల గురించి మాత్రం చెప్పొద్దంటున్నారామె. ఏం? అలాంటి బుక్స్ చదవాలంటే భయమా? అనడిగితే – ‘‘భయం కాదు. అవి చదవడం వల్ల మనం ఏం నేర్చుకుంటాం? మంచి పుస్తకాలు చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. మన జ్ఞానం పెరుగుతుంది’’ అన్నారు. ఇంత తీరికగా బుక్స్ గురించి అడుగుతున్నారంటే శ్రియ చేతిలో సినిమాలు లేవనుకుంటున్నారేమో? తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోన్న ‘నరగసూరన్’, తెలుగు చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’లో నటిస్తున్నారు. షూటింగ్ స్పాట్లో ఏమాత్రం గ్యాప్ దొరికినా ఏదొక బుక్ చదువుతుంటారు. -
బ్యాక్ టు వర్క్
సముద్రంతో స్నేహానికి సెలవు ప్రకటించారు శ్రియ... ప్రస్తుతానికి మాత్రమే అనుకోండి! మొన్నటివరకూ సముద్రంలో తనకిష్టమైన స్కూబా డైవింగ్, స్విమ్మింగ్ వంటివి చేస్తూ ఎంజాయ్ చేశారీ సుందరి. ఇప్పుడు సరదాలను పక్కను పెట్టి, షూటింగుల్లోకి వచ్చేశారు. తమిళ సినిమా ‘నరగసూరన్’లో అరవింద్ స్వామి, సందీప్ కిషన్, ఇంద్రజిత్ సుకుమాన్ (మలయాళ హీరో), శ్రియ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సెలవులకు చెక్ పెట్టిన శ్రియ స్ట్రయిట్‌గా ఈ సినిమా షూటింగులో ఎంటరయ్యారు. తమిళంలో విమర్శకులతో పాటు ప్రేక్షకులకు ప్రశంసలందుకున్న ‘డి16’ ఫేమ్ కార్తీక్ నరేన్ ఈ చిత్రానికి దర్శకుడు. గౌతమ్ మీనన్ నిర్మాతల్లో ఒకరు. తెలుగులో ‘16: ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్’ పేరుతో విడుదలైన ‘డి16’ మంచి విజయం సాధించింది. ఇప్పుడీ ‘నరగసూరన్’నూ తెలుగులో విడుదల చేయడానికి దర్శక–నిర్మాతలు రెడీ! ‘నరకాసురుడు’ అనే టైటిల్ కూడా ప్రకటించారు. -
సాహసం.. నా నేస్తం!
మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అనడిగితే... కొందరి పేర్లు చెబుతాం. శ్రియకు కూడా అలా చెప్పడానికి ఓ లిస్ట్ ఉంది. ఆ లిస్ట్‌లో ‘సాహసం’ కూడా ఉంటుంది. అవును.. అడ్వెంచర్ నా ఫ్రెండ్ అంటారు శ్రియ. అందుకే వీలు కుదిరినప్పుడల్లా నేస్తానికి దగ్గరగా వెళతారు. ప్రస్తుతం ఆ పని మీదే ఉన్నారు. విదేశాల్లో అడ్వంచర్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీకి స్కూబా డైవింగ్ అంటే ఇష్టం. అందుకే స్కూబా డైవింగ్ కోర్స్‌తో పాటు, అండర్ వాటర్ ఫొటోగ్రఫీ కోర్స్‌లను ఆమె కంప్లీట్ చేశారట. విక్రమ్ హీరోగా తెలుగులో వచ్చిన ‘మల్లన్న’ సినిమాలోని ‘ఎక్స్‌క్యూజ్‌మి మిస్టర్ మల్లన్న..’సాంగ్‌లో ఆమె అండర్‌వాటర్ సీన్లో నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం శ్రియ ఇండోనేషియాలోని బాలీలో హాలీడేను ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. దానికి సంబంధించిన ఫొటోను శ్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఫస్ట్ సన్‌రైజ్ నా ఫేస్‌ను టచ్ చేస్తున్నప్పుడు సముద్రంలో బ్యూటిఫుల్ డైవ్ చేస్తున్నాను. సముద్రంలో ఇలా చేయడం ఇట్స్ ఎ మ్యాజికల్’’ అని పేర్కొన్నారు శ్రియ. చూశారుగా... నీటి లోపల ఏమాత్రం భయం లేకుండా ఎంత హాయిగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇలా చేయాలంటే ధైర్యం ఉండాలండి బాబు. శ్రియ డేరింగ్ అండ్ డ్యాషింగ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకతంలో తెరకెక్కుతున్న ‘నరకాసురుడు’, ఇంద్రసేన దర్శకత్వంలో రూపొందుతున్న ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాల్లో శ్రియ నటిస్తున్నారు. -
సీన్ రివర్స్!
‘ఏ జాలే లేని మరణం నేనే. ఏ పాపం లేని ప్రళయం నేనే’ అంటూ ‘ధృవ’ సినిమాలో సిద్ధా్దర్థ్ అభిమన్యు క్యారెక్టర్లో స్టైలిష్ విలన్‌గా అదరగొట్టారు అరవింద్ స్వామి. ఈ సినిమాలో రామ్‌చరణ్ ధృవ క్యారెక్టర్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. కార్తీక్ నరేన్ దర్వకత్వంలో అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియ, ఇంద్రజిత్ ముఖ్యపాత్రల్లో ‘నరగాసురన్’ అనే చిత్రం రూపొందు తోంది. తెలుగులో ‘నరకాసురుడు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో అరవింద్ స్వామి ధృవ క్యారెక్టర్లో నటిస్తున్నారని కోలీవుడ్ సమాచారం. సెప్టెంబర్ 16న స్టార్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్‌ను బుధవారం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ షూట్లో అరవింద్ స్వామి బిజీ. -
ఎందుకు మారాలి?
ఆడపిల్లకు పాతికేళ్లొస్తే చాలు... పెళ్లి కాకపోతే టెన్షన్. అసలు వయసుకీ పెళ్లికీ లింకేంటి? ఆ మాటకొస్తే... వయసుకీ కెరీర్‌కీ లింకేంటి? ముఖ్యంగా హీరోయిన్లు థర్టీ ప్లస్ ఏజ్‌లో ఉంటే.. రిటైర్ అవ్వాల్సిందేనా? సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా మారాల్సిందేనా? ఏం...? 30 ఏళ్లు దాటితే హీరోయిన్లుగా పనికి రారా? అక్క–వదిన–అమ్మ పాత్రలకు మారాల్సిందేనా? అవసరం లేదంటున్నారు కొందరు కథానాయికలు. మెయిన్లీ థర్టీ ప్లస్ ఏజ్‌లో ఉన్న శ్రియ, త్రిష, అనుష్క, నయనతార... ఈ నలుగురూ హీరోయిన్లుగానే దూసుకెళుతున్నారు. ‘నో ఏజ్ లిమిట్ ఫర్ హీరోయిన్స్’ అని ప్రూవ్ చేస్తున్నారు. ఫిల్మ్ వరల్డ్ ఎంతమందినైనా వెల్కమ్ చేస్తుంది. అందరికీ చోటుంటుంది. లక్ ఫేవర్ చేస్తే... చాన్సులు ఈజీగానే వచ్చేస్తాయి. టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే బెర్త్ కన్ఫార్మ్.. కొత్తవాళ్లొస్తే సీనియర్లు తప్పుకోవాలా? ‘నో... నో’. ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరంలేదు. ఎవరి అవకాశాలు వాళ్లకుంటాయి. అందుకే పదీ పదిహేనేళ్లకు పైగా హీరోయిన్లుగా కొనసాగుతోన్న శ్రియ, త్రిష, అనుష్క, నయనతారలకు చాన్సులు తగ్గలేదు. జోరుగా.. హుషారుగా సినిమాలు చేస్తున్నారు. నలుగురిలో ఏదో సమ్మోహన శక్తి ఉంది. రోజు రోజుకీ ఈ నలుగురిలో అందం మరింత పెరుగుతోంది. వయసు అంతకంతకూ తగ్గుతోంది. శ్రియ సంగతికొస్తే... కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోలతో నటించారు. ఆ తర్వాత స్పెషల్ సాంగులు, ‘పవిత్ర’ వంటి బోల్డ్ మూవీస్ చేశారు. ఇక, శ్రియ పనైపోయిందనుకుంటున్న టైమ్‌లో... ‘మనం’తో మళ్లీ స్టార్ హీరోయిన్ల రేసులోకి వచ్చారు. ఓ రకంగా ఇది శ్రియకు సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవాలేమో! ఈ ఇన్నింగ్స్‌లో ‘గోపాల గోపాల, దృశ్యం, గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి నటనకు ఆస్కారమున్న సినిమాలతో పాటు పక్కా కమర్షియల్ ‘పైసా వసూల్’ వంటివీ చేశారు. ప్రస్తుతం తమిళంలో ‘నరగసూరన్’, తెలుగులో ‘వీరభోగ వసంతరాయలు’ సినిమాలతో బిజీగా ఉన్నారు. నయనతార సంగతి చూస్తే... తెలుగులో పక్కా కమర్షియల్ సిన్మాలు చేస్తూ, మధ్యలో ‘శ్రీరామరాజ్యం’లో సీతగా అభినయించి, తనలో మంచి పెర్ఫార్మర్ ఉందని నిరూపించుకున్నారు. ఇక, తమిళంలో అయితే లేడీ ఓరియెంటెడ్ సిన్మాలకు ఓటేస్తున్నారు. అవెలాగో తెలుగులో డబ్బింగ్ అవుతాయనుకోండి! దీంతో గ్లామర్‌తో పాటు యాక్టింగ్ గ్రామర్‌ను కవర్ చేసేస్తున్నారు. ఆమె నటించిన ‘ఆరమ్’ విడుదలకు రెడీ అవుతోంది. చేతిలో ‘వేలైక్కారన్’, ‘ఇమైక్క నొడిగళ్’, ‘కొలయుదిర్ కాలమ్’, ‘కో కో’ వంటి సినిమాలున్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తోన్న ‘జయసింహ’లో తనే హీరోయిన్. అలాగే, చిరంజీవి ‘సైరా’ కూడా కమిట్ అయ్యారు. త్రిష, నయన, శ్రియలతో పోల్చితే అనుష్క అంత బిజీగా లేరు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘భాగమతి’ మాత్రమే ఉంది. ఈ బొమ్మాళికి బోలెడన్ని అవకాశాలు వస్తున్నా.. ఎందుకనో ఒప్పుకోవడంలేదట. అరుందతి, బాహుబలి. రుద్రమదేవి, తాజా ‘భాగమతి’ వంటి సినిమాలు చేశాక... ఇకపై కూడా మంచి సినిమాల్లోనే కనిపించాలని అనుకుంటున్నారట. అందుకే ఆచి తూచి అడుగులేస్తున్నారు. త్రిష అయితే కెరీర్ ప్రారంభం నుంచి ఎక్కువగా కమర్షియల్ సినిమాలే చేశారు. కానీ, కథానాయికగా 50 సిన్మాలు పూర్తయ్యాక కాస్త రూటు మార్చారు. లేడీ ఓరియెంటెడ్ సిన్మాలపై దృష్టి పెట్టారు. ‘సదురంగ వేటై్ట–2’, ‘1818’, ‘96’ సినిమాలు చేస్తున్నారు. ‘హే జ్యూడ్’ అనే చిత్రం ద్వారా మలయాళ పరిశ్రమకు కూడా పరిచయం కానున్నారు. 15 ఏళ్ల కెరీర్ తర్వాత ఇప్పుడు వేరే భాషలో చాన్స్ దక్కించుకోవడం అంటే చిన్న విషయం కాదు... తమిళ పొన్ను తడాఖా అది. సినిమా సెలక్షన్‌ను పక్కన పెడితే... ముగ్గురిలో ముఖ్యంగా చెప్పుకోవలసింది అందం గురించి! వీళ్లు చిత్రసీమలోకి వచ్చి పదేళ్లు దాటిందనీ, వీళ్లకు 30 ఏళ్లు వచ్చేశాయనీ గుర్తు చేస్తే తప్ప గుర్తు రానంతగా వయసును దాచేస్తున్నారు. 15 ఇయర్స్... ఈజ్ రియల్లీ సమ్‌థింగ్! మనం చూస్తూనే ఉండాలి గానీ... ఇంకో పదిహేనేళ్లు నటిస్తూనే ఉంటారు. చూస్తుందాం బాస్... హాలీవుడ్లో థర్టీ, ఫార్టీ, ఫిఫ్టీ ప్లస్ ఏజ్ లోనూ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇండియన్ హీరోయిన్ల కెరీర్‌కి కూడా అంత లాంగ్విటీ ఉంటే ఏం పోతుంది? వయసు తెచ్చే పరిణతి, కెరీర్ తెచ్చిన అనుభవంతో మంచి మంచి సినిమాలు సెలక్ట్ చేసుకుంటారు. ఏమంటారు? -
నెటిజన్లపై శివమెత్తిన శ్రియ
తమిళసినిమా: ఇంటర్నెట్లో హాట్ హీరోయిన్స్ అని టైప్ చేస్తే చాలు అర్ధ నగ్నం, నగ్న హీరోయిన్ల ఫొటోలు కోకొల్లలుగా దర్శనమిస్తాయి. వాటిలో కొన్ని మార్ఫింగ్ ముఖాలు కూడా కనిపిస్తాయి. కొందరు హీరోయిన్లు అయితే తమ అందాలను ఆరబోసే విధంగా కురచ దుస్తులు ధరించి ఫొటోలను తమ ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పోస్ట్ చేసి ఫ్రీ పబ్లిసిటీ పొందేస్తున్నారు. హిందీ చిత్రం జూలీ–2లో నటి రాయ్‌లక్ష్మీ నటించిన దృశ్యాలను తిలకిస్తే అందులో ఆమె దాదాపు అర్ధనగ్నానికి ఎక్కువగా, నగ్నానికి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అలాంటి అశ్లీల దృశ్యాలకు గ్లామర్ అనే పేరు పెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారనిపించక మానదు. గ్లామర్ విషయంలో నటి శ్రియ కూడా చాలా చిత్రాల్లో శృతి మించే నటించింది. అసలు అందానికి, అశ్లీలానికి తేడా ఏమిటన్న ప్రశ్నకు నటి శ్రియ ఆగ్రహంతో మండిపడింది. హీరోయిన్లు చీర కడితే వెంటనే పాత సంప్రదాయం అనేస్తారు. కాస్త మోడ్రన్ దుస్తులు ధరిస్తే అశ్లీలం, అసభ్యకరం అని విమర్శలు గుప్పిస్తారు. నిజం చెప్పాలంటే ఈ రెండింటిలోనూ దేనికదే అందం దాగుంటుంది. అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. అయితే సమీపకాలంలో నెటిజన్లు మోడ్రన్ దుస్తులు ధరించిన హీరోయిన్ల గురించి చెడుగా రాసేస్తున్నారు. గ్లామర్‌గా కనిపిస్తే చెడ్డవాళ్లా అంటూ విరుచుకుపడింది. చీర కట్టినా, మోడ్రన్ దుస్తులు ధరించినా అందం అనే ఒక్కటే అని తనదైన బాణీలో అందానికి శ్రియ నిర్వచనం చెప్పింది. -
స్టార్ స్టార్ సూపర్‌స్టార్ -శ్రియ
-
జర్నలిస్ట్ టు ఎయిర్ హోస్టెస్!
శ్రియను చూస్తే కొంతమంది అమ్మాయిలకు అసూయగా, అబ్బాయిలకు హ్యాపీగా ఉందట. ఎందుకంటే... ఇప్పుడామె వయసెంత? అల్మోస్ట్ 35 ఇయర్స్. శ్రియను చూస్తే అలా కనిపిస్తారా? పాతికేళ్ల అమ్మాయిలా ఉంటారు కదూ! అందుకే, అమ్మాయిలు అసూయ పడుతున్నారట! ఇప్పుడామె నటిస్తున్న సినిమా విడుదలైనప్పుడు ఆ అమ్మాయిలంతా మరింత అసూయ పడతారేమో? ఎందుకంటే... అందులో అల్ట్రా మోడ్రన్ ఎయిర్ హోస్టెస్‌గా నటిస్తున్నారీమె. నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్‌బాబు హీరోలుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘వీరభోగ వసంతరాయులు’. ఇందులోనే శ్రియ ఎయిర్ హోస్టెస్‌గా కనిపించనున్నారు. రీసెంట్గా రిలీజైన ‘పైసా వసూల్’లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా మెప్పించారు శ్రియ. ఇప్పుడా పాత్ర నుంచి బయటకొచ్చేశారు. జర్నలిస్ట్ టు ఎయిర్ హోస్టెస్‌గా మారారు. ప్రస్తుతం ‘వీరభోగ వసంతరాయులు’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఎయిర్ హోస్టెస్‌గా శ్రియ, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇంద్రసేన దర్శకత్వంలో బెల్లాన అప్పారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోలు, విలన్లు ప్రత్యేకంగా ఎవరూ లేరు. కథలో ప్రతి ఒక్కరి పాత్రకూ ప్రాముఖ్యత ఉంటుందట! -
సైకో థ్రిల్లర్‌లో సీనియర్ హీరోయిన్
12 ఏళ్లుగా హీరోయిన్గా కొనసాగుతున్న సీనియర్ బ్యూటీ శ్రియ, ఇన్నేళ్ల తరువాత తనకు నచ్చిన కథ దొరికిందని చెపుతున్నారు. కెరీర్లో ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన ఈ బ్యూటీ, పవిత్ర లాంటి ప్రయోగాలు చేసిన పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ప్రస్తుతం సీనియర్ హీరోలతో జతకడుతూ బిజీగా ఉన్న శ్రియ త్వరలో ఓ ఆసక్తికరమైన సినిమాలో కనిపించనుందట. ప్రస్తుతం బాలకృష్ణ సరసన నటించిన పైసా వసూల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న శ్రియ, సైకో థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సినిమాలో లీడ్ రోల్ లో నటించనున్నారు. ఈ సినిమాతో ఏ 23 ఏళ్ల కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడని హింట్ ఇచ్చిన శ్రియ త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారని తెలిపారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో తొలిసారిగా అభిమానులను భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు శ్రియ. -
నరకాసురన్‌లో ఆద్మిక
తమిళసినిమా: అరవిందస్వామి చిన్న గ్యాప్ తరువాత రీఎంట్రీ అయ్యి విలన్‌గా మారి మంచి పేరు తెచ్చుకున్నారు. తనీఒరువన్ చిత్రంలో ఆయన స్టైలిష్ విలనిజం ప్రేక్షకులను మెప్పించింది. కాగా తాజాగా మరోసారి హీరోగా తన సత్తా చాటడానికి రెడీ అయ్యారు. అప్పటికే చతురంగవేట్టై–2 చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నారు. అదే విధంగా నరకాసురన్ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. దీన్ని ఇంతకు ముందు దృవంగళ్ 16 చిత్రంతో చిత్ర పరిశ్రమ మొత్తం దృష్టిని తన వైపు తిప్పుకున్న యువ దర్శకుడు కార్తీక్ నరేన్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో అరవిందస్వామితో పాటు నటి శ్రియ, సందీప్‌కిషన్ నటించడానికి ఎంపికయ్యారు. తాజాగా యువ నటి ఆద్మికను ఎంపిక చేసినట్లు దర్శకుడు కార్తీక్ నరేన్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆద్మిక వీసైమురుక్కు చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన నటి అన్నది తెలిసిందే. తొలి చిత్రంతోనే తమిళ ప్రేక్షకుల ఆదరణను పొందిన ఈ అమ్మడికిప్పుడు వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయట. అందులో ఒకటి నరకాసురన్. ఈ చిత్ర ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరగుతున్నాయట. సెప్టెంబర్ 16న చిత్ర షూటింగ్‌ను ఊటీలో ప్రారంభించనున్నట్లు, అక్కడే 40 రోజుల పాటు చిత్రీకరించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. -
త్వరలో పెళ్లి చేసుకుంటా!
తమిళసినిమా: నటి శ్రియకు పెళ్లిపై దృష్టి మళ్లినట్టుంది. త్వరలోనే వివాహం చేసుకుంటానంటోంది. ఈ అమ్మడు నటిగా దశాబ్దన్నర కాలాన్ని టచ్ చేసింది. తమిళంలో ఎనక్కు 20 ఉనక్కు 18 చిత్రం ద్వారా రంగప్రవేశం చేసిన శ్రియ ఆ తరువాత జయంరవికి జంటగా మళై చిత్రంలో నటించింది. అలా తక్కువ కాలంలోనే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జత కట్టే లక్కీచాన్స్‌ను దక్కించుకుంది. అదే విధంగా తెలుగులో ఇష్టం చిత్రంతో పరిచయమైన శ్రియ అక్కడ కూడా వేగంగానే స్టార్డంను అందుకుంది. ఇలా తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథానాయకిగా రాణిస్తూ బాలీవుడ్‌లోనూ కొన్ని చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ హీరోయిన్గా రాణిస్తున్నా, అంత క్రేజ్ మాత్రం లేదనే చెప్పాలి. తాజాగా బాలకృష్ణతో నటించిన తెలుగు చిత్రం పైసావసూల్ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఒక భేటీలో శ్రియ పేర్కొంటూ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నానని వెల్లడించింది. తాను తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాలలో నటిస్తూ ప్రముఖ కథానాయికిగా వెలుగొందుతున్నానని అంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా శివాజీ చిత్రంలో నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొంది. తానిప్పటికీ నటనను ప్రేమిస్తున్నానని, వృత్తిని గౌరవించేవాళ్లకు అది ఎప్పటికీ బోర్ కొట్టదని అంది. తానిక్కడ ఒంటరిగానే జయించానని చెప్పింది. తనకిక్కడ చేదు అనుభవాలెప్పుడూ ఎదరవలేదని అంది. నటిగా ఎలా నిలదొక్కుకోగలనా అని మొదట్లో సంకట పడ్డా సహ నటీనటులు, దర్శక నిర్మాతల సహకారంతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నానని చెప్పింది. తనను చాలా మంది పెళ్లి ఎప్పుడు? అని అడుగుతున్నారని, స్త్రీ జీవితంలో పెళ్లి, పిల్లలు చాలా ముఖ్యం అని పేర్కొంది. తనకు త్వరలోనే వివాహం జరుగుతుందని, మనసుకు నచ్చినోడు తారస పడగానే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. తనకు కాబోయే భర్త మంచి స్నేహితుడై ఉండాలని అంది. ముందున్న జీవితం కూడా మంచి సాగిపోవాలని అంది. ఇకసోతే చాలా మంది తన అందంలోని రహస్యం ఏమిటని అడుగుతుంటారని, తన అందానికి ప్రధాన కారణం యోగానేనని చెప్పింది. యోగా తన జీవితంలో చాలా మార్చు తీసుకొచ్చిందని, ఉద్రేకాలను అదుపు చేసుకోవడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని అంది. అదే విధంగా ధ్యానం కూడా చేస్తానని తెలిపింది. ఈ తరం యువత మాదక ద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవడం బాధగా ఉందని, ఎలాంటి చెడు అలవాట్లకు అలవాటు పడకుండా యువత చక్కగా చదువుపైనే దృష్టి సారించాలని హితవు పలికింది. కుటుంబంలో ఒక్కరు డ్రగ్స్‌కు అలవాటు పడితే ఆ కుటుంబం అంతా బాధింపునకు గురవుతుందన్నది తెలుసుకోవాలని శ్రియ పేర్కొంది. -
బాలయ్య డబ్బులిచ్చి సినిమాలు ఆడించలేదు
– మోహన్‌బాబు ‘‘బాలయ్య ఒక చరిత్ర సృష్టించాడు. సిల్వర్‌జూబ్లీ, గోల్డెన్‌జూబ్లీ రికార్డులు క్రియేట్ చేశాడు. ఇది నిజం... డబ్బులు ఇచ్చి సినిమాలు ఆడించలేదు’’ అని మంచు మోహన్‌బాబు అన్నారు. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘పైసా వసూల్’. అనూప్ రూబెన్స్ స్వరకర్త. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఆడియో సెలబ్రేషన్స్ జరిగాయి. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘ప్రపంచం గర్వించదగ్గ మహానటుడు మా అన్నయ్య ఎన్టీఆర్. ఆయన కుమారుడు బాలయ్య ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా నన్ను పిలవడంతో చెన్నై వెళ్లాల్సి ఉన్నా... ఇది నా ఇంటి ఫంక్షన్ కాబట్టి వచ్చా. ‘పైసా వసూల్’ 101కోట్ల కంటే ఎక్కువ వసూలు చేయాలి’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘నాకు మోహన్‌బాబుగారితో చనువు ఎక్కువ. ఆయన్ను తరచూ కలుస్తుంటా. నేనెక్కువగా కథలు, సినిమాల గురించి ఆలోచించను. నాకు, పూరీకి మధ్య ఈ కథ గురించి ఎక్కువ డిస్కషన్ జరగలేదు. చేసేద్దామనుకుని మొదలుపెట్టాం. మా ఇద్దరికీ పని తప్ప వేరే ఆలోచన లేదు. నిర్మాత బాగుండాలన్నదే మా తపన. అభిమానులు, ప్రేక్షకులు నా నుంచి ఆశించే అన్ని హంగులూ ఉన్న చిత్రమిది’’ అన్నారు. ‘‘బాలయ్య బాబుతో సినిమా చేయాలనే కోరిక ఈ ‘పైసా వసూల్’తో తీరింది. ఆయనతో మరెన్నో సినిమాలు చేసే ఛాన్స్ ఇస్తారని ఆశిస్తున్నా. చెన్నైలో స్టంట్ మాస్టర్ అసోసియేషన్ 50 వసంతాల సభకు బాలయ్య బాబు, మంచు విష్ణుగారు హాజరయ్యారు. వాళ్ల నాన్నగారి బయోపిక్ గురించి అక్కడి వారితో కొంత డిస్కస్ చేశారు. బాలయ్యబాబు 101వ సినిమా సందర్భంగా ఆయన అభిమానుల్లో 101మంది మెరిట్ స్టూడెంట్స్‌కు రూ. పదివేల చొప్పున అందజేయాలని అనుకుంటున్నాం. సెప్టెంబర్ 1న పూరీగారు పండగ తీసుకొస్తున్నారు’’ అన్నారు నిర్మాత. ‘‘నా లైఫ్‌లో... ‘లైట్ పోతుంది, త్వరగా షాట్ తీద్దాం రండి’ అని అందర్నీ పిలిచి కెమెరా ముందుకెళ్లి నిలబడిన ఏకైక హీరో బాలకృష్ణగారు.‘నిర్మాతల డబ్బు వృథా కాకూడదు’ అని ఫీలయ్యే వ్యక్తి. ఇలాంటి హీరోను నేనిప్పటివరకు చూడలేదు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం అమేజింగ్. సేమ్ డెడికేషన్ ఇంతకు ముందు మోహన్‌బాబు గారిలో చూశా’’ అన్నారు పూరి. దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, నాయికలు శ్రియ, కైరా దత్, ముస్కాన్, నటుడు అలీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి, లైన్ ప్రొడ్యూసర్ చార్మీ కౌర్, పాటల రచయితలు భాస్కరభట్ల, పులగం చిన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మూడు రోజులాగండి!
తప్పదు... ‘హీరోలందు పూరి హీరోలు వేరయా’ అని చెప్పక తప్పదు! ప్రతి హీరోని న్యూ మేకోవర్‌లో చూపించే దర్శకుడు పూరి జగన్నాథ్, ‘పైసా వసూల్’లో బాలకృష్ణనూ కొత్తగా చూపించారు. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు పూరి. ఈ నెల 28న ఉదయం10 గంటల 12 నిమిషాలకు ‘పైసా వసూల్’ స్టంపర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. సినిమా ఎలా ఉండబోతుందో... ఈ స్టంపర్ చూస్తే తెలుస్తుందట. అసలు, ‘స్టంపర్’ అంటే ఏంటి? అనడిగితే... ‘‘రెగ్యులర్‌గా అందరూ విడుదల చేసే టీజర్, ట్రైలర్లకు భిన్నంగా ఉంటుంది. 28వ తేదీ వరకు వెయిట్ చేయండి’’ అంటున్నారు పూరి. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతోంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఈ వారంలోనే ప్యాచ్ వర్క్ పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘బాలకృష్ణగారితో సినిమా చేస్తున్నందుకు గర్వంగానూ, హ్యాపీగానూ ఉంది. ఆయన పాత్రలో లీనమైన తీరు చూసి ఆశ్చర్యపోయా. నందమూరి అభిమానులు కోరుకునే డైలాగ్స్, సాంగ్స్, మిగతా అంశాలన్నీ ఇందులో ఉంటాయి’’ అన్నారు పూరి జగన్నాథ్. శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. -
నరకాసురుడు ఎవరు?
‘నేరమే నా నెత్తుటి వర్ణంరా... ద్రోహమే నా సృష్టిలో స్వర్గంరా...’ అంటూ ‘ధృవ’ సినిమాలో సై్టలిస్ట్ విలన్‌గా యాక్ట్ చేసి తనలోని కొత్త నటుణ్ణి బయటపెట్టారు అరవింద్ స్వామి. తాజాగా ఈ సై్టలిస్ట్ విలన్ తమిళ దర్శకుడు నరేన్ తెరకెక్కించనున్న ‘నరగాసురన్’లో యాక్ట్ చేయనున్నారు. ఇందులో సందీప్ కిషన్ యాక్ట్ చేస్తున్నారు. డార్క్ అండ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తెలుగులో ‘నరకాసురుడు’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు, ఇందులో అరవింద్ స్వామి, సందీప్ కిషన్, ఇంద్రజిత్, శ్రియ నటిస్తున్నట్లు దర్శకుడు నరేన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వెంటనే ‘గుడ్‌లక్ టు ఆల్ నరగాసురన్ టీమ్’ అని అరవింద్ ట్వీట్ చేశారు. మరి.. ఇందులో సందీప్ కిషన్ హీరోగా యాక్ట్ చేస్తున్నారా లేక మరేదైనా రోల్ చేస్తున్నారా? ఇంతకీ వెండితెర ‘నరకాసురుడు’ ఎవరో మరి? -
ఎన్టీఆర్ పాటకు బాలయ్య స్టెప్స్
గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో ఘనవిజయం అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పైసా వసూల్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రస్తుతం యంగ్ జనరేషన్ హీరోలు తమ ఫ్యామిలీ ఇమేజ్ను క్యాష్ చేసుకునేందుకు సీనియర్ల పాటలను రీమిక్స్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఇప్పటికే ఈ ఫార్ములాతో మంచి సక్సెస్‌లు సాధించారు. ఇప్పుడు అదే బాటలో బాలకృష్ణ కూడా ఎన్టీఆర్(సీనియర్) సూపర్ హిట్ పాటను రీమిక్స్ చేస్తున్నాడు. 1971లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జీవిత చక్రం సినిమాలోని 'కంటి చూపు చెబుతోంది.. కొంటె నవ్వు చెబుతోంది' పాటను పైసా వసూల్ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నారు. అప్పట్లో శంకర్ జై కిషన్‌లు సంగీతం అందించిన ఈ పాటను అనూప్ రుబెన్స్ అంతే మధురంగా రీమిక్స్ చేశాడట. బాలకృష్ణ, శ్రియలపై త్వరలోనే ఈ పాటను షూట్ చేయనున్నారు. చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
ఫ్యాన్స్‌కు పండగ
పూరి జగన్నాథ్ హీరో ఎలా ఉంటాడు? మాంచి మాస్‌గా, సై్టలిష్‌గా ఉంటాడని టకీమని ఆన్సర్ వచ్చేస్తుంది. హీరో గెటప్, బాడీ లాంగ్వేజ్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. డౌట్ ఉంటే.. ‘పైసా వసూల్’ సినిమా స్టిల్ చూడండి. దర్శకుడు పూరి జగన్నాథ్ మార్క్ మేకోవర్‌లో బాలకృష్ణపై ఓ లుక్కేయండి. స్టిల్ మాంచి మాసీగా, సై్టలిష్‌గా ఉంది కదూ.బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమాకు ‘పైసా వసూల్’ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. నేడు బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. పూరి మాట్లాడుతూ – ‘‘ఇటీవల ఎక్కువగా సీరియస్ రోల్స్ చేసిన బాలకృష్ణగారు ఇందులో ఎంటర్టైన్మెంట్ రోల్ చేస్తున్నారు. ఆయన డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్‌కు పండగే. కథకు తగ్గ టైటిల్ కుదిరింది’’ అన్నారు. ‘‘బాలకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఇవాళ మధ్యాహ్నం 2.50 గంటలకు ఆయన, పూరి జగన్నాథ్ ఫేస్బుక్లో లైవ్‌లోకి వస్తారు’’ అన్నారు నిర్మాత. శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
నో డూప్... ఆల్ రియల్!
బాలకృష్ణ డిక్షనరీలో ‘డూప్’ అనే పదం దాదాపు కనిపించదు. డూప్ లేకుండా ఆయన చేసే రిస్కీ స్టంట్స్‌ను లైవ్‌లో చూసే యూనిట్ జనాలు క్లాప్స్ కొట్టడం ఈ మధ్య కామన్ అయ్యింది.‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కోసం వైల్డ్ హార్స్‌ను రైడ్ చేసిన ఆయన, తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం ఓ యాక్షన్ సీక్వెన్స్‌లో కారును 360 డిగ్రీస్‌లో డ్రిఫ్టింగ్ పద్ధతిలో రైడ్ చేశారట! పూరి మాట్లాడుతూ – ‘‘పోర్చుగల్ రాజధాని లిస్బన్లో ఆదివారం ఓ ఛేజ్ తీశాం. రెండుసార్లు డూప్ లేకుండా బాలకృష్ణగారు కారును డ్రిఫ్టింగ్ పద్ధతిలో 360 డిగ్రీస్‌లో తిప్పే షాట్‌ను షూట్ చేశాం. ఆయన పక్క సీట్లో కూర్చున్న శ్రియ షాక్‌కి గురైంది. షాట్ ఓకే అయ్యాక యూనిట్ అంతా క్లాప్స్ కొట్టారు’’ అన్నారు. ‘‘ఈ నెల 10న బాలకృష్ణగారి బర్త్‌డే సందర్భంగా 9వ తేదీ రాత్రి బాలకృష్ణగారు, పూరిగారు మా ‘భవ్య క్రియేషన్స్’ ఫేస్బుక్ పేజీ లైవ్‌లోకి వస్తారు’’ అన్నారు నిర్మాత వి. ఆనంద్‌ప్రసాద్. -
డాన్ లుక్‌లో బాలయ్య..!
గౌతమిపుత్ర శాతకర్ణితో ఘనవిజయం సాధించిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. బాలయ్య సరసన శ్రియ హీరోయిన్గా నటిస్తుండగా మరికొంత మంది ముద్దుగుమ్మలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బాలకృష్ణ లుక్ లీక్ అయ్యింది. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ చెప్పిన కొద్ది గంటల్లోనే బాలకృష్ణ వర్కింగ్ స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాలయ్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో అలరించనున్నాడు. మాఫియా డాన్‌గా పవర్ ఫుల్ రోల్ చేస్తుండగా టాక్సీ డ్రైవర్‌గా మరో లుక్‌లో కనిపించనున్నాడు. టాక్సీ డ్రైవర్ లుక్కు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ వీడియోస్ ఇదివరకే రిలీజ్ కాగా తాజాగా బాలయ్య డాన్ లుక్ కూడా లీక్ అయ్యింది. పూరి మార్క్ స్టైలింగ్‌తో డిజైన్ చేసిన ఈ లుక్ నందమూరి అభిమానుల్లో అంచనాలను మరింత పెంచేస్తోంది. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
హీరోలు... విలన్లు ఉండరు!
నారా రోహిత్, శ్రీవిష్ణు కలిసి నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. ఈ ఇద్దరితో పాటు శ్రియ, సత్యదేవ్ కలసి నటించనున్న మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’. బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవీకే సమర్పణలో అప్పారావు బెల్లన నిర్మించనున్నారు. ఈ చిత్రం ద్వారా ఆర్. ఇంద్రసేన దర్శకునిగా పరిచయం కానున్నారు. మే రెండో వారంలో చిత్రీకరణ ఆరంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఇంద్రసేన నాకు మంచి మిత్రుడు. కథ చెప్పగానే మైండ్ బ్లో అయింది. కథ విన్న వెంటనే నారా రోహిత్, శ్రీవిష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రియాగారు, సత్యదేవ్ స్టోరీ విని ఎగై్జట్ అయ్యారు. ఈ నలుగురి పాత్రలను ఇంద్రసేన చక్కగా తీర్చిదిద్దాడు’’ అన్నారు. ‘‘సమాజంలో జరిగే విభిన్న కోణాలను టచ్ చేసే మల్టీస్టారర్ స్టోరీ ఇది. పాత్రలు తప్ప సినిమాలో హీరోలు.. విలన్లు ఉండరు ’’ అన్నారు ఆర్. ఇంద్రసేన. ఈ చిత్రానికి సంగీతం: సతీష్ రఘునాథన్. -
ప్రతి నాయకిగా శ్రియ
నరకాసురన్‌కు నటి శ్రియ విలన్‌గా మారనుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వస్తోంది. శ్రియకు మళ్లీ అవకాశాలు పెరుగుతున్నాయి. చారిత్రాత్మక కథా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలకృష్ణకు జంటగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ, టాలీవుడ్లో మరోసారి అదే హీరోతో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో శింబుతో ‘అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్’ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. కాగా తాజాగా ప్రతినాయకిగా మారడానికి ఏ మాత్రం సంకోచించకుండా నరకాసురన్ అనే చిత్రంలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వివరాల్లోకెళ్లితే ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం దృవంగళ్ పదునారు. దీనికి సృష్టికర్త నవ దర్శకుడు కార్తీక్‌నరేన్. తొలి చిత్రంతోనే శభాష్ అనిపించుకున్న ఈ వర్ధమాన దర్శకుడు తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం పేరే నరకాసురన్. ఇందులో అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించనున్నారు. యవ కథానాయకుడిగా టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య నటించడానికి అంగీకరించినా, ఇప్పుడు ఆయన వైదొలగినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. కారణం ఆయన త్వరలో తన ప్రేయసి సమంతను వివాహమాడబోతుండడమేనని సమాచారం. ఆయన పాత్రలో మరో టాలీవుడ్ నటుడి కోసం వేట మొదలైందని తెలుస్తోంది. ఇందులో ప్రతినాయకిగా శ్రియ నటించనున్నారట. కథ వినగానే తన పాత్ర తెగ నచ్చేయడంతో విలనీయం ప్రదర్శించడానికి శ్రియ సిద్ధం అనేసిందట. మరో విషయం ఏమిటంటే ఆ చిత్ర కథ నచ్చడంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ తానే నిర్మించడానికి ముందుకు వచ్చారట.అయితే చిత్ర దర్శకుడు కార్తీక్‌నరేన్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోనున్నారని తెలిసింది. చిత్ర షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. -
బాలయ్యకు జోడిగా మరోసారి..?
గౌతమిపుత్ర శాతకర్ణి తరువాత షార్ట్ గ్యాప్ తీసుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇటీవల కాలంలో మోస్ట్ క్రేజీ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ, పూరిలు అభిమానుల కోసం ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం కోటీ 50 లక్షల రూపాయలతో భారీ సెట్ నిర్మించారు. ఇప్పటికే బాలయ్యకు జోడిగా ముస్కాన్ అనే ముంబై భామను సెలెక్ట్ చేయగా.. లీడ్ హీరోయిన్గా సీనియర్ స్టార్ శ్రియను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు. గౌతమిపుత్ర శాతకర్ణితో పాటు పలు హిట్ చిత్రాల్లో బాలయ్యకు జోడిగా నటించిన శ్రియ మరోసారి నందమూరి అందగాడితో ఆడిపాడనుంది. ప్రస్తుతానికి ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో ముస్కాన్ పాల్గొంటుండగా.. నెక్ట్స్ షెడ్యూల్లో శ్రియ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. -
మాల్దీవుల్లో మస్త్ మజా
సముద్రపు లోతుల్లోకి వెళ్లి లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే... ఏదైనా ఫొటోల్లో చూడు. అంతేకానీ సముద్రంలోకి వెళ్లాలనుకోవద్దు... పిరికివాళ్లు అనే మాట ఇది. అదే శ్రియలాంటి ధైర్యసాహసాలున్న అమ్మాయి అయితే సముద్రంలోకి వెళుతుంది. నీటి లోపల అందాన్ని తనివి తీరా ఆస్వాదించేస్తుంది. శ్రియ ఇటీవల అదే చేశారు. పిల్లలందరూ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ బ్యూటీ కూడా ఓ వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. మాల్దీవులు వెళ్లారు. అక్కడ స్కూబా డైవింగ్ చేశారు. అలాగే బోటు షికారుని ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారామె. మాల్దీవుల్లో మస్త్ మజా చేసి, మళ్లీ వచ్చేవరకూ ‘టాటా’ అంటూ, ఇండియా వచ్చేశారు. శ్రియ స్కూబా డైవింగ్ చేయడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. అంతకుముందు చాలాసార్లు చేశారు. ఏడాదికోసారి కంపల్సరీగా డైవ్ చేయాల్సిందే. -
ఆరోగ్యకరమైన పోటీ మాది!
బాలకృష్ణ హీరోగా నటించిన వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో వై. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బాలకృష్ణ, కథానాయిక శ్రియతో కలసి మీడియాతో సమావేశమయ్యారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ... ► శాతకర్ణి పాత్ర మీకు దక్కినందుకు మీ అనుభూతి ఏంటి? ఈ సువిశాల దేశాన్ని ఒక్క ఏలుబడి కిందకు తెచ్చిన మహా చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగువాడని ఎందరికి తెలుసు? మన కంటూ ఓ సంస్కృతిని, వారసత్వాన్ని, ప్రపంచ పటంలో ఓ గుర్తింపుని ఇచ్చిన శాతకర్ణి చరిత్ర... బిడ్డకు పరిచయం లేని పురిటినొప్పుల లాగా పుడమి గర్భంలో కలసింది. ఎన్టీఆర్ వారసుడిగా, తెలుగు బిడ్డగా... ఈ చిత్రం నేను చేయడం కాకతాళీయమో! యాదృచ్ఛికమో! నాకు ఈ అవకాశం నాన్నగారే కల్పించారేమో! నాన్నగారు చేయాలనుకున్న పాత్రని నా వందో చిత్రంలో చేసే అవకాశం రావడం నా పూర్వజన్మ సుకృతం. శాతకర్ణి జననం నుంచి గ్రీకు చక్ర వర్తి డిమిత్రిస్ని ఓడించడం దాకా సినిమాలో ఉంటుంది. ► శాతకర్ణి చరిత్రను కథగా రూపొందించడం కష్టమైందా? ‘నాణేలపై తమ బొమ్మ ముద్రించిన మొట్టమొదటి రాజు శాతకర్ణి’ అని కృష్ణశాస్త్రిగారు పురావస్తు శాఖ డైరె క్టర్‌గా పనిచేసిన టైమ్‌లో తెలిసింది. చారిత్రక పరిశోధ కులు పరబ్రహ్మ శాస్త్రిగారు పలు పరిశోధనలు చేసిన తర్వాత ‘శాతకర్ణి తెలుగువాడు’ అని నిరూపించారు. పుస్తకాల్లో శాతకర్ణి గురించి తక్కువ ఉంది. నాసిక్‌లో ‘గౌతమీ బాలాశ్రీ’ వేయించిన శాసనాలు, పుస్తకాలు, అప్పటి శిల్పాల నుంచి సమాచారంతో క్రిష్ స్క్రిప్ట్ రెడీ చేశారు. కథ రూపకల్పనలో ఆయనే ఎక్కువ కష్టపడ్డారు. ► మీకు పౌరాణిక పాత్రల్లో నటించిన అనుభవం ఉంది. శాతకర్ణిగా నటించడానికి ఎలా సన్నద్ధమయ్యారు? నాన్నగారు ఓ ఎన్సైక్లోపీడియా. కృష్ణుడు, రాముడు తదితర పాత్రలతో కట్టుబొట్టు దగ్గర నుంచి ఆభరణాల వరకూ ఎలా ఉండాలనేది చెప్పారు. అవన్నీ మా స్టూడి యోలో ఉన్నాయి. త్వరలో మ్యూజియం ఏర్పాటుకి సన్నా హాలు చేస్తున్నాం. నేను చేసిన పౌరాణిక పాత్రలకు హెల్ప్ అయ్యాయి. కానీ, శాతకర్ణి పాత్రకి రిఫరెన్స్‌లు లేవు. దాంతో ఈ పాత్ర నాకో పెద్ద పరీక్ష పెట్టింది. నిజానికి, శాతవాహనులు గిరిజ నులు. వస్త్రధారణ, ఆచారవ్యవ హారాలు వేరు. క్రిష్ సలహాతో, ఆయన చెప్పింది చేశా! ► క్రిష్ దర్శకత్వం గురించి? క్రిష్ ఆరో చిత్రమిది. అతడి గత చిత్రాలు చూస్తే... ఓ చిత్రానికీ, మరో చిత్రానికీ సంబంధం లేదు. కొందరు దర్శకుల దగ్గర జబ్బు ఏంటంటే.. ‘ఒకే రకమైన సిన్మాలు తీస్తూ, మీ కోసమే ఈ కథ తయారు చేశాం’ అంటారు. ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో! అలాంటి కథ తీసుకురమ్మని అడుగుతా. సరిగ్గా క్రిష్ నేను కోరు కున్న కథ తెచ్చాడు. నాతో పాటు ప్రతి ఒక్కరి పాత్రనూ అద్భుతంగా తీర్చిదిద్దాడు. 2.15 గంటల్లో తీశాడు. హ్యాట్సాఫ్ టు క్రిష్. ► ఎన్టీఆర్‌తో చేసిన హేమమాలిని, ఇప్పుడు మీతో నటించడం...? హేమమాలిని లేకపోతే సినిమా లేదండీ. నాన్న గారితో ‘పాండవ వనవాసం’లో చేశారు. తర్వాత ‘శ్రీకృష్ణ పాండవీయం’లో రుక్మిణి పాత్రకు తీసుకోవాలనుకున్నారు. హిందీలో ఐదు సినిమాలు అంగీకరించడంతో ఆమెకు కుదరలేదు. ఇప్పుడీ సినిమాలో పాత్ర ఏంటి? అనేది చూశారామె. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తల్లి పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు. ►కన్నడ శివరాజ్‌కుమార్‌ను తీసుకోవాలనే ఆలోచన మీరే ఇచ్చారట కదా! రాజ్‌కుమార్ ఫ్యామిలీ ఇతర భాషల్లో నటిస్తే అభిమానులు ఒప్పుకోరు. ఇప్పటివరకూ చేయలేదు కూడా! కానీ, శాతకర్ణి కీర్తిని వివరించే పాట ఆయన చేస్తే బాగుంటుందని నా ఆలోచన. నేను ఫోన్ చేసి అడగ్గానే, సాయంత్రానికి ఒప్పుకున్నారు. ► ఫస్ట్ కాపీ చూశాక మీ ఫీలింగ్ ఏంటి? ఈ కథకి ఓకే చెప్పినప్పటి నుంచీ అనిర్వచనీయ అనుభూతి. ఈ కథకీ, నాకూ సంధానకర్తగా క్రిష్‌ని అదృశ్య శక్తులు పంపాయని నమ్ముతున్నా. ఎప్పుడూ ఇలాంటివి నమ్మని క్రిష్ ఓ సందర్భంలో ‘79 రోజుల్లో చిత్రీకరణ పూర్తవడం వెనుక ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు. ► భారీ చిత్రాన్ని నిర్మాతలెలా చేశారు? సినిమా అంటే కేవలం వినోదం కాదు. భావితరాలకు మన గొప్ప సంస్కృతిని అందిస్తూ, కాపాడు కోవాలి. మా నిర్మాత లకు అంత మంచి ఆలోచన ఉంది కాబట్టే అకుంఠిత దీక్షతో ఇంత మంచి సినిమా,ఎక్కడా రాజీ పడకుండా తీశారు. ► సంక్రాంతికి రెండు పెద్ద చిత్రాలు రిలీజ్. చిరంజీవితో మీ పోటీ అనుకోవచ్చా? ‘పోటీ ఎవరూ లేరు, సక్సెస్ వచ్చే సింది’ అనేది ఆశాజనకంగా ఉండదు. అయినా మా మధ్య ఉన్నది ఆరోగ్య కరమైన పోటీ. పండగకి మంచి చిత్రాలు రావడం సంతోషం. రెండూ హిట్టయితే ఇండస్ట్రీకి మంచిది. చిరంజీవికి నా శుభాకాంక్షలు. ► 101వ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ చేయనున్నారా? ‘రైతు’లో కీలక పాత్రలో నటించాల్సిందిగా అమితాబ్ బచ్చన్గారిని కలిశాం. కృష్ణవంశీతో కలసి ఆయనకు కథ వినిపించా. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అమితాబ్ స్పందనను బట్టి నిర్ణయం తీసుకుంటా. ► వందో చిత్రం.. విడుదలకు ముందు నెర్వస్‌గా ఏమైనా ఉందా? ఎలా కనపడుతున్నా! నాట్ ఎట్ ఆల్ నెర్వస్. నా అభిమానులు, ప్రేక్షకదేవుళ్లు కొత్తగా ప్రయత్నించిన ప్రతిసారీ ఆదరించారు. వాళ్ల అభిమానమే నాకు శ్రీరామరక్ష. నాకు ఏ భయం లేదు. ఇప్పుడు జనరేషన్ మారుతోంది. ఇకపై చేసే ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటా! ప్రేక్షకులు కొత్త బాలకృష్ణని చూస్తారు. నాన్నగారు ఏ పాత్ర చేసినా పాత్రలో లీనమై చేసేవారు. నేను శాతకర్ణిగా ఎలా చేశాననేది రేపు చూస్తారు. నటన అంటే కేవలం నవ్వడం, ఏడవడం, హావభావాలు పలికించడం కాదు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటించాలి. కబీర్‌బేడీ ఫస్ట్‌డే షూటింగ్‌కి వచ్చినప్పుడు నాకూ, ఆయనకీ మధ్య ‘బడుగు జాతి కాదురా.. తెలుగుజాతి. మేము అధములం కాదురా.. ప్రథములం’ అనే సీన్ ప్లాన్ చేశారు. నేను డైలాగ్ చెప్ప గానే కబీర్‌బేడి ‘సారీ అండీ. నేను పాత్రలోకి వెళ్లడానికి టైమ్ కావాలి. మన్నించండి’ అని చెప్పి హోటల్‌కి వెళ్లారు. ఆయనకు రాత్రంతా నిద్రపట్టలేదట! డైలాగులు, హావభావాలు ప్రాక్టీస్ చేశానన్నారు. ఎంత పెద్ద నటుడికైనా అలాంటి తపన ఉండాలి. కథ చెప్పగానే నేను చేయగలనా? లేదా? అని కంగారుపడ్డా. ప్రతి అంశంలో క్రిష్ రీసెర్చ్ చేయడంతో ఆయనను ఫాలో అయ్యా. బాలకృష్ణగారితో నటించి పదేళ్లు దాటింది. అప్పటికీ, ఇప్పటికీ ఆయనలో ఏ మార్పూ లేదు. సెట్లో నటీనటులకు ఎంతో గౌరవం ఇస్తారు.’’ – శ్రియ -
శ్రీవారి సేవలో గౌతమిపుత్ర చిత్రబృందం
-
శ్రియను ఏడిపించిన యువకుడెవరు?
తనను ఒక యువకుడు అవమానించి, ఏడిపించాడని నటి శ్రియ స్వయంగా చెప్పి వాపోయారు. అయితే ఈ విషయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం శ్రియను ఏడిపించిన ఆ యువకుడు ఎవరన్న అంశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు ఆ సంగతేంటో చూద్దాం. అందాలభామ శ్రియ తమిళం, తెలుగు భాషల్లో ఒక రౌండ్ కొట్టేసి, ప్రస్తుతం రెండో రౌండ్‌కు సిద్ధమయ్యారని చెప్పవచ్చు. కోలీవుడ్‌లో సంచలన నటుడు శింబుకు జంటగా అన్భానన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక తెలుగులో బాలకృష్ణకు జంటగా భారీ చారిత్రక కథా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్య నటి శ్రియ ఒక ఇంటర్వ్యూ లో తనను ఒక ధనవంతుడైన యువకుడు అవమానించి, ఏడ్చేలా చేశాడని చెప్పారు. తాను అంతగా ఏడుస్తున్నా, అతను ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం సముదాయించకుండా పైగా నవ్వుతూ ఎంజాయ్ చేశాడని తెలిపారు. అది భరించలేని తాను పొంగుకొస్తున్న ఏడుపును ఆపుకోలేక బాత్రూంకు వెళ్లి గట్టిగా ఏడ్చేశానని చెప్పారు. అయితే తనను అవమాన పరిచి ఆవేదనకు గురి చేసిన ఆ యువకుడెవరన్నది శ్రియ వెల్లడించలేదు. ఆమె వేదనతో కూడిన మాటలు ప్రేక్షకుల్లో చర్చనీయాంశంగా మారాయి. -
ఎవరో చెప్పుకోండి!
ఈ ఫొటోలో శ్రీయ చూపిస్తున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా?! వీరి వీరి గుమ్మడిపండు.. దాగుడుమూతల దండాకోర్.. వీరి పేరు ఏంటో? చెప్పుకోండి చూద్దాం - అనే చిన్నపిల్లల ఆటలు శ్రీయ ఆడుతున్నట్టు లేదూ! నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ లొకేషన్ ఈ సరదా దృశ్యానికి వేదికైంది. నృత్య దర్శకురాలు బృందా నేతృత్వంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నప్పుడు విరామంలో ఆటవిడుపుగా తీసుకున్న ఫొటో ఇది. ఇంతకీ, ఆ కళ్లు మూసుకున్న వ్యక్తి ఎవరో గుర్తు పట్టారా? దర్శకుడు క్రిష్ అండీ. -
క్రికెటర్‌తో డేటింగ్?
క్రికెట్ ప్లేయర్లతో సినిమా తారలు ప్రేమలో పడటం కొత్త విషయం కాదు. గతంలో పటౌడీని షర్మిలా ఠాగూర్ ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అజారుద్దీన్, సంగీతా బిజలానీ ప్రేమ వివాహం చేసుకుని, కొన్నేళ్ల తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యువరాజ్ సింగ్-హజల్ కీచ్, విరాట్ కోహ్లీ-అనుష్కా శర్మ కూడా డేటింగ్ చేస్తూ, వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పుడీ జాబితాలో శ్రీయ కూడా చేరారు. ఈ ఢిల్లీ బ్యూటీ తన పదిహేనేళ్ల కెరీర్లో ఎఫైర్ల పరంగా వార్తల్లో నిలిచిన దాఖలాలు లేవు. ఇప్పుడు వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో డేటింగ్ చేస్తున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వచ్చే నెల విడుదల కానున్న హిందీ చిత్రం ‘తుమ్ బిన్ 2’ ప్రమోషనల్ వీడియో షూట్లో పాల్గొనడానికి డ్వేన్ ఇండియా వచ్చారు. ముంబైలో చిత్రీకరణ జరిగింది. ఈ షూటింగ్‌కీ, శ్రీయకూ సంబంధం లేదు. అందుకే డ్వేన్‌తో ఆమె ఓ హోటల్లో కలసి లంచ్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇద్దరూ హోటల్ నుంచి బయటికొస్తుంటే.. ఫొటోగ్రాఫర్లు కెమేరాలు క్లిక్మనిపించినప్పుడు శ్రీయ మాత్రం కంగారు పడ్డారట. కెమేరా కన్నుని తప్పించుకోవాలని ప్రయత్నించారట. ‘ఏమీ లేనప్పుడు అంత కంగారు ఎందుకు’ అన్నది కొందరి అభిప్రాయం. ‘ఏదో ఉంది’ కాబట్టే, శ్రీయ అలా తడబడ్డారని ప్రచారం మొదలుపెట్టారు. క్రికెటర్‌తో ప్రేమలో పడిన మరో తార అని మాట్లాడుకుంటున్నారు. రెండ్రోజులుగా ఈ వార్త జోరుగా ప్రచారమవుతున్నా శ్రీయ నుంచి స్పందన లేదు. మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా? గాసిప్‌కి స్పందించడం ఎందుకు? అని శ్రీయ ఊరుకున్నారనుకోవాలా? ఎవరి ఊహలు వారికే! -
ఒకేసారి రెండు ప్రతిష్టాత్మక చిత్రాల్లో..!
సీనియర్ హీరోయిన్ శ్రియ క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ బ్యూటి కొంత కాలంగా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. అయితే ఇక కెరీర్ ముగిసినట్టే అనుకున్న ప్రతీసారి ఏదో ఒక సినిమాతో తిరిగి సత్తా చాటుతున్న శ్రియ, ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రెండు భారీ చిత్రాల్లో నటిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ వందో సినిమాగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణిలో హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటి. తాజాగా మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఖైదీ నంబర్ 150లో కూడా ఈ బ్యూటి ఛాన్స్ కొట్టేసిందట. ఈ సినిమాలో శ్రియ ఓ స్పెషల్ సాంగ్‌లో అలరించనుంది. గతంలో చిరు హీరోగా తెరకెక్కిన ఠాగూర్ సినిమాలో మెగాస్టార్‌కు జోడిగా నటించిన శ్రియ మరోసారి చిరుతో కలిసి చిందేసేందుకు రెడీ అవుతోంది. -
ఎదురు చూపులు ఎవరి కోసం?
మనిషిక్కడ... మనసెక్కడో... కళ్లల్లో తడి... మనసులో వేదన... ఆ కళ్లు ఏదో కథ చెబుతున్నట్లు ఉన్నాయి కదూ! అఖండ భారతాన్ని జయించి.. ఏకఛత్రాధిపత్యంగా పాలించాలనే విజయకాంక్షతో యుద్ధభూమిలో అడుగుపెట్టిన భర్త శాతకర్ణి రాకకై ఎదురు చూస్తున్నట్టు లేదూ! నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఇందులో శాతకర్ణి భార్య వశిష్ఠిదేవిగా శ్రీయ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం శ్రీయ పుట్టినరోజు సందర్భంగా వశిష్ఠిదేవి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, హేమమాలిని, శ్రీయ తదితరులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబా నిర్మిస్తున్నారు. -
అమ్మే నా తొలి గురువు : శ్రీయ
టీచర్స్ డే స్పెషల్ చిన్నప్పట్నుంచీ చదువులో నేను యావరేజ్ స్టూడెంటే. డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమంటే.. చిన్నప్పుడు ఓసారి అమ్మతో కలసి గుడికి వెళ్లాను. అక్కడ జరుగు తున్న డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి అమ్మ చేతిని వదిలేసి అటు వెళ్లా. జనాలు గుంపులు గుంపులుగా ఉన్నారు. నేను కనపడకపోవడంతో అమ్మ కంగారు పడుతూ వెతికింది. చివరకు, స్టేజి మీద డ్యాన్స్ చేస్తూ కనిపించడంతో ఊపిరి పీల్చుకుంది. నాకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో అమ్మకు తెలిసింది. ఆ తర్వాత తనే నాకు నేర్పించింది. అమ్మే నా తొలిగురువు. డ్యాన్స్‌లో నా ప్రతిభ చూసే ఢిల్లీ ‘లేడీ శ్రీరామ్ కాలేజ్’లో సీట్ ఇచ్చారు. అమ్మతో పాటు నా స్కూల్, కాలేజీ గురువులందరూ నాకు ఆదర్శంగా నిలిచారు. ఒక్కో టీచర్లో ఒక్కో లక్షణాన్ని ఆదర్శంగా తీసుకున్నాను. పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర చాలా ఉంటుంది కాబట్టి ‘ఆచార్య దేవోభవ’. -
అత్తాకోడళ్ల లుక్ అదిరింది..
తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రారాజు గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' షూటింగ్ ఊపందుకుంది. దర్శకుడు క్రిష్ వివాహం సందర్భంగా నెల రోజులపాటు షూటింగ్‌కు బ్రేక్ తీసుకున్న చిత్ర యూనిట్.. తిరిగి చిత్రీకరణను మొదలుపెట్టింది. మధ్యప్రదేశ్‌లో ఉన్న కోటల్లో శాతకర్ణి షూటింగ్ జరుగుతోంది. ఇందులో బాలకృష్ణ తల్లిగా ప్రముఖ నటి హేమామాలిని, భార్యగా శ్రీయ నటిస్తున్నారు. వారిద్దరూ ప్రస్తుతం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. కాగా హేమామాలిని, శ్రీయలకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో అత్తాకోడళ్ల లుక్ అదిరిందంటూ అభిమానులు కితాబునిస్తున్నారు. ఇంతకుముందు జార్జియాలో శాతవాహన పైనికులకు, గ్రీకు సైనికులకు మధ్య జరిగే సన్నివేశాలను, క్లైమాక్స్‌ను భారీగా చిత్రీకరించారు. అంతకుముందు మొరాకోలో మొదటి షెడ్యూల్‌ను పూర్తిచేశారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో ఉన్న కోటల్లో రాజకుటుంబానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. -
వెడ్డింగ్ వావ్స్ ఎక్స్పో లో శ్రియా
-
శింబు ట్రిపుల్ ఏ ప్రారంభం
సంచలన నటుడు శింబు తాజా చిత్రం ఆదివారం ఉదయం దిండుగల్‌లో ప్రారంభమైంది. ఇదునమ్మఆళు చిత్రం తరువాత శింబు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అచ్చంయంబదు మడమయడా చిత్రంలో నటించారు. ఆ చిత్రం నిర్మాణం చివరి దశకు చేరుకుంది. దీంతో అన్బానవన్ అసరాధవన్ అడంగాదవన్ చిత్రానికి రెడీ అయ్యారు. త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం ఫేమ్ ఆధిక్ రవిచందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అన్భానవన్ అసరాదవన్ అదంగాదవన్(ఏఏఏ) అనే పేరును నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మైఖెల్ రాయప్పన్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇందులో శింబు త్రిపాత్రాభినయం చేయడం విశేషం. ఆయనకు జంటగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అందులో ఒక పాత్రకు నటి శ్రీయ నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరో ఇద్దరు ఎవరన్నది తెలియాల్సి ఉంది. శింబు నటించనున్న మూడు పాత్రల్లో ఒకటి 80 ప్రాంతానికి చెందినది. ఈ పాత్రకు జంటగానే శ్రీయ నటించనున్నారు. ప్రారంభ దృశ్యాలను శింబు 80 ప్రాంత పాత్రతోనే ప్రారంభించారు. ఆయనతో పాటు నటుడు మహంత్ ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో తొమ్మిది పాటలు ఉంటాయని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇందులోని పాటలను యువన్ రెడీ చేశారట. శింబు గెటప్‌ల కోసం సీన్‌బుట్ అనే ప్రముఖ హాలీవుడ్ మేకప్‌మెన్‌ను రప్పించినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. -
నారదుడుగా ధనుష్
‘రఘువరన్ బీటెక్’, ‘అనేకుడు’, ‘నవ మన్మథుడు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తమిళ హీరో ధనుష్. తమిళంలో ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ దాదాపు తెలుగులోనూ విడుదలవుతున్నాయి. తాజాగా మరో చిత్రం రానుంది. ధనుష్, శ్రీయ, జెనీలియా ప్రధాన పాత్రల్లో జోహార్ దర్శకత్వంలో సూరజ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఓ తమిళ చిత్రం ‘నారదుడు’ పేరుతో తెలుగులోకి విడుదల కానుంది. రేష్మ, కరిష్మా సమర్పణలో ఉమ (సైదాపురం) ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఉమ మాట్లాడుతూ- ‘‘రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన చిత్రమిది. తెలుగువారికి అవసరమైన కమర్షియల్ అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు, విజయ్ ఆంటోని సంగీతం, భువనచంద్ర పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుందనే నమ్మకముంది. ఈ నెలలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. -
శ్రీయ మృతదేహానికి నేడు రీ పోస్టుమార్టం
కోర్టు ఆదేశాల మేరకు నిర్వహించనున్న అధికారులు జవహర్‌నగర్: హైదరాబాద్ విద్యార్థిని టీఎన్ఆర్ శ్రీయ మృతదేహానికి శనివారం తెల్లవారుజామున ఫోరెన్సిక్ అధికారులు రీ పోస్టుమార్టం చేయనున్నారు. విశాఖపట్నంలోని గీతం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీయ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం విదితమే. రంగారెడ్డి జిల్లా యాప్రాల్ అమ్ముగూడ శ్మశానవాటికలో ఈనెల 4వ తేదీన శ్రీయ మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాల్సి ఉండగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో వాయిదా వేశారు. శ్రీయ తల్లిదండ్రులు యవన్, ప్రసాద్‌లు కోర్టుకె ళ్లడంతో శనివారం రీ పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని భద్రపర్చాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జవహర్‌నగర్ సీఐ నర్సింహారావు అన్ని ఏర్పాట్లు చేశారు. -
సింహపురిలో శ్రీయ సందడి
-
మళ్లీ అవన్నీ చేస్తా!
ఆ రోజులే వేరు... మళ్లీ ఆ పాత రోజుల్లోకి వెళ్లే అవకాశం వస్తే... అని ఒక్కసారైనా అనుకోనివాళ్లు ఉండరు. ఈ మధ్య శ్రీయ కూడా అలానే అనుకున్నారు. కాలం వెనక్కి వెళితే తాను ఏమేం చేయాలనుకుంటున్నారో శ్రీయ చెబుతూ - ‘‘కాలేజీలో జాయినవుతా. బోల్డంత మందితో స్నేహం చేస్తా. కాలేజీ లైఫ్‌ని వీలున్నంతవరకూ ఎంజాయ్ చేస్తా. బాగా చదువుకుంటా. అలాగే, నేనెక్కడ మొదలయ్యానో మళ్లీ అక్కడికి వెళ్లాలనుకుంటా. అంటే... సినిమాల్లోకి రాకముందు నేను కొన్ని నృత్యప్రదర్శనలు ఇచ్చాను. అక్కణ్ణుంచే నా సినిమా కెరీర్ మొదలైంది. అందుకని మళ్లీ స్టేజి మీద డ్యాన్స్ చేయాలని ఉంది’’ అని పేర్కొన్నారు. మరి.. భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్న శ్రీయ ముందుంచితే - ‘‘బ్లైండ్, డెఫ్ అండ్ డంబ్ చిల్డ్రన్ సహాయం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నా. పుస్తకాలు చదవాలనుకుంటున్నా. అలాగే, విదేశాల్లో నివసించాలని ఉంది. ఆ దేశాల్లో ప్రజల జీవన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా. ఇంకా చాలా చాలా అనుకుంటున్నా. అనుకున్నట్లు అన్నీ చేయగలిగితే బాగానే ఉంటుంది. చూద్దాం.. భవిష్యత్తు ఎలా ఉంటుందో?’’ అన్నారు. -
క్రాకర్స్ మోత మోగాల్సిన అవసరం లేదు!
శ్రీయా శరణ్ దీపావళి రోజున ఇంటిని అందంగా అలంకరించి, మన కుటుంబసభ్యులకు, స్నేహితులకు స్వీట్లు , బహుమతులు ఇస్తే చాలు. ఇక ఆ సంతోషానికి మించింది లేదు. క్రాకర్స్ మోత మోగిస్తేనే దీపావళి అని కొందరి అభిప్రాయం. వాళ్లను నేను తప్పుబట్టను. ఎవరి ఇష్టం వాళ్లది. మా ఇంట్లో మాత్రం చాలా చక్కగా ఈ పండగ చేసుకుంటాం. దీపావళి అంటే దీపాలను అందంగా అమర్చడమే. దాని కోసం క్రాకర్స్ కాల్చాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద శబ్దాలతో ఈ టపాసులు కాల్చడం వల్ల పర్యావరణంతో పాటు మన ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. -
అవి భయంకరమైన అనుభవాలు!
అందాల తారలు ఆమడ దూరంలో కనిపిస్తే చాలు.. ఆమెతో మాట్లాడడానికి, కలిసి ఫొటోలు దిగడానికి జనాలు గుమిగూడి పోతారు. జనంలో తమ పట్ల ఉన్న ఆ అభిమానానికి తారలు పొంగిపోతారు. కానీ, అదే సమయంలో కొంతమంది వెకిలి చేష్టలు చేసి వాళ్లను ఇబ్బందుల పాలు చేసేస్తారు. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయం గురించి శ్రీయ చెబుతూ - ‘‘నేను పబ్లిక్ ఈవెంట్స్‌కి వెళ్లే ముందు వాటి గురించి ట్విట్టర్లో పోస్ట్ చేసేదాన్ని. అది తప్పని ఆ తర్వాత తెలిసింది. ట్వీట్స్ చదివేసి ఆ కార్యక్రమం దగ్గరకు వచ్చేస్తున్నారు. నాకు కూడా అభిమానులను చూడాలనే ఉంటుంది. అయితే, అభిమానం పేరుతో వెకిలిగా ప్రవర్తించినప్పుడు మాత్రం బాధ కలుగుతుంది. సందట్లో సడేమియా అన్న చందంగా ఆకతాయిలు తాకడానికి ట్రై చేస్తారు. ఒక్కోసారి గిచ్చేస్తారు కూడా. ఏం జరుగుతోందో ఊహించేలోపు వాళ్ల చేతులు మమ్మల్ని తడిమేస్తుం టాయ్. అలాంటి భయంకరమైన అనుభవాలు చాలా ఎదుర్కొన్నా. అందుకే నేను పాల్గొనే కార్యక్ర మాల గురించి ట్వీట్ చేయడం లేదు’’ అని పేర్కొన్నారు. -
సెప్టెంబర్ 11న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు శ్రీయ (నటి), అంజలి (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 1. ఇది రవికి సంబంధించినది కావడం వల్ల కొత్త ఉత్సాహం, దేనినైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం కలుగుతాయి. అవివాహితులకు వివాహం అవుతుంది. పిల్లలు జీవితంలో స్థిరపడతారు. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీ పుట్టిన తేదీ 11లో రెండు ఒకట్లు ఉండటం వల్ల ఇది న్యూమరాలజీలో మాస్టర్ నంబర్. ఇది చంద్రుడికి సంబంధించిన సంఖ్య కావడం వల్ల వీరి కల్పన శక్తి వెలుగులోకి వస్తుంది. గత సంవత్సరం రాసిన పోటీపరీక్షలలో విజేతలవుతారు. సంప్రదింపులు, ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలపై ఆసక్తి నెలకొంటుంది. అయితే సూర్య, చంద్రుల ప్రభావం వల్ల నేత్రవ్యాధులు, మానసిక ఆందోళన తలెత్తే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,5,7; లక్కీ కలర్స్: తెలుపు, ఎరుపు, క్రీమ్, బ్రౌన్; లక్కీ కలర్స్: ఆది, సోమ, బుధ, శుక్రవారాలు. సూచనలు: అనాథలకు బెల్లం పాయసం తినిపించటం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం లేదా వినడం, వీలైనంత సేపు వెన్నెలలో విహరించడం, తల్లిని లేదా తత్సమానురాలిని ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
స్టార్ స్టార్ సూపర్ స్టార్- శ్రీయ
-
దృశ్యంపైనే ఆశలు
శ్రీయ మంచి నటి. నోడౌట్ ఎబౌట్ ఇట్. కథానాయికగా దశాబ్దం దాటి ఏలారు. స్టిల్ షీఈజ్ హీరోయిన్. అయితే అంత డిమాండ్ లేకపోవచ్చు. అలాగని అవకాశాలే లేవనడం సరి కాదు. దక్షిణాదిలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ రజినీకాంత్ నుంచి యువహీరోలందరితోనూ నటించిన ఘనత శ్రీయది. ‘జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. నా కేరీర్లో సూపర్ డూపర్ హిట్స్, డిజాస్టర్స్ చూశాను. అయినా నాకు దేవుని దయ ఉంది. అందుకే ఇంకా అవకాశాలు వస్తున్నాయి’ అంటున్న శ్రీయకు తమిళం, తెలుగు భాషల్లో చిత్రాలు లేకపోయినా, ప్రస్తుతం దృశ్యం హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. ఈమె హిందీలో ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో నటించారు. అయితే అవేవీ తన కేరీర్‌కు అంతగా హెల్ప్ అవ్వలేదు. అయితే దృశ్యం చిత్రం విజయంపై చాలా నమ్మకం ఉందంటున్నారు. ఆమె నమ్మకానికి కారణం లేక పోలేదు. మలయాళంలో తెరకెక్కిన దృశ్యం చిత్రం విశేష విజయాన్ని సాధించింది. అది అక్కడితో ఆగలేదు. తెలుగు, కన్నడం, తమిళ భాషల్లో పునర్నిర్మాణం అయ్యి మంచి విజయం పొందింది. అలా మలయాళం, తెలుగు భాష ల్లో మీనా, తమిళంలో గౌతమి నటించి మెప్పించి పాత్రను హిందీలో శ్రీయ పోషిస్తున్నారు. అజయ్‌దేవగన్ కథనాయకుడు. ఇందులో పిల్లల తల్లిగా నటించడం గురించి శ్రీయ స్పందిస్తూ అమ్మగా నటించడం నాకిష్టం. పైగా సులభం కూడా. అజయ్‌దేవగన్ చాలా స్పీట్ పర్సన్. ఇందు లో ముఖ్య పాత్ర పోషిస్తున్న నటి టబుతో నేనింతకుముందు కూడా కలిసి నటించాను. దృశ్యం హిందీలో నూ మంచి సక్సెస్ కావడం తధ్యం అని శ్రీయ దృఢ నమ్మ కం వ్యక్తం చేస్తున్నారు. -
అక్కినేని బాధ చూసి... నాగ్ కాల్చుకుంటానన్నారు!
దేవదాసు, మేఘసందేశం, ప్రేమాభిషేకం... ఇలా వెండితెరపై అక్కినేని నాగేశ్వరరావు మిగిల్చిన తీపిజ్ఞాపకాలు ఎన్నో. అందుకే, ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినా ఇంకా ఇక్కడే ఉన్నారనే భావనతో చాలామంది ఉన్నారు. ఏ పాత్ర చేసినా, ‘ఈ పాత్రను అక్కినేని మినహా ఇంత అద్భుతంగా ఎవరూ చేయలేరు’ అనిపించుకోగలిగారాయన. నటన అంటే ఏయన్నార్‌కు అంత కమిట్మెంట్, ప్రేమ. అందుకే, ఏ ఆస్పత్రిలోనో కాకుండా షూటింగ్ లొకేషన్లోనే తుదిశ్వాస వదిలేస్తే బాగుండు అని ఆయన అనుకున్నారు. మరికొన్ని రోజుల్లో మృత్యువు ఒడిలోకి చేరడం ఖాయం అని తెలిసినా, చివరి సినిమా ‘మనం’ షూటింగ్లో ఆయన గుండె నిబ్బరంతో పాల్గొన్నారు. ఆరోగ్యం పెద్దగా సహకరించకపోయినా, ఆ చిత్రంలో నటించడంతో పాటు, తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. వృత్తిపట్ల ఏయన్నార్‌కి ఉన్న కమిట్మెంట్కి ఇది నిదర్శనం. ‘మనం’ చిత్రంలో ఆయన కాంబినేషన్లో నటించినవాళ్లందరూ, జీవితాంతం గుర్తుండే అనుభూతులు మిగిలాయంటూ ఉంటారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీయ అయితే.. ‘‘మరికొన్ని రోజుల్లో చనిపోతానని తెలిసినా ఏయన్నార్‌గారు ఎంతో పాజిటివ్‌గా ఉండేవారు’’ అని పేర్కొన్నారు. ‘‘ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఏయన్నార్‌గారు మాట్లాడిన ప్రతి మాటా నాకు గుర్తే. ‘మనం’ చిత్రంలో ఏయన్నార్‌గారు రోడ్డు మీద పడిపోయే సీన్ ఒకటుంటుంది. ఆ సీన్లో నా ఒడిలో ఆయన తల ఉంటుంది. ఆయనను కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటాను. క్యాన్సర్ వల్ల అప్పటికే ఆయనకు ఒంట్లో అస్సలు బాగా లేదు. డాక్టర్ల అనుమతి తీసుకొని, రెండు గంటల పాటు ఎలాగోలా షూటింగ్లో పాల్గొంటున్నారు. క్యాన్సర్‌కు అప్పుడే ఆపరేషనైన ఆ పెద్దాయన, ఆ పరిస్థితుల్లో, కష్టమైనా సరే ఇష్టపడి నటిస్తుంటే నాకేమో కంగారుగా ఉంది. అప్పుడాయన, ‘ఎందుకు కంగారుపడుతున్నావ్. ఆస్పత్రిలో చనిపోయే కన్నా, ఇప్పుడు ఇక్కడే కెమెరా ముందు ప్రాణం విడిస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది’ అన్నారు. మరో రెండు నెలలో చనిపోతారనగా, ఈ చిత్రంలో నటించారాయన. సెట్లో ఆయనతో, ‘సార్! ఇంత స్ట్రెయిన్. ఫరవాలేదా’ అని అడిగేదాన్ని. అప్పుడాయన ‘నా గురించి బాధపడొద్దు. నేను చాలా హ్యాపీ మ్యాన్’ని అనేవారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఆయన షూటింగ్ చేయడం చూసి, నాగార్జున చాలా బాధపడేవారు. ఒకసారైతే ‘ఏదైనా గన్ ఉంటే ఇవ్వు. కాల్చుకుంటాను. నాన్నను ఇలా చూడలేకపోతున్నాను’ అని నాగార్జున ఉద్వేగానికి గురయ్యారు. వృత్తిపట్ల ఏయన్నార్‌గారికి ఉన్న అంకితభావం చూసి, నాకు ఆశ్చర్యం అనిపించేది. రాత్రిపూట షూటింగ్ అంటే మా లాంటివాళ్లం ఒక్కోసారి విసుక్కుంటుంటాం. కానీ, ఆయన ఏనాడూ అలా చేయలేదు. సినిమా అంటే ఆయనకు అంత మమకారం. సినిమాలో తన వర్క్, డబ్బింగ్‌తో సహా ముందే పూర్తి చేసేశారు. మనల్ని ఆశీర్వదించడానికి కొన్ని ఆత్మలు మన చుట్టూ ఉంటాయంటారు. అలా ‘మనం’ కోసం ఏయన్నార్ ఆత్మ ఉండి, అందరినీ ఆశీర్వదించిందని అనిపించింది’’ అని శ్రీయ చాలా ఉద్వేగంగా వివరించారు. వృత్తి పట్ల ఏయన్నార్ కమిట్మెంట్ ఏ వృత్తిలో ఉన్నవాళ్ళకైనా పెద్ద లెసన్ కదూ! -
అద్భుత ప్రపంచంలో ఉన్నట్లనిపించింది!
ఒక మంచి పెయింటింగ్‌ని చూసినప్పుడు ఎవ్వరికైనా సరే అందమైన అనుభూతి కలుగుతుంది. ఇక కళలను ప్రేమించేవారికైతే ఆ అనుభూతి రెట్టింపు స్థాయిలో ఉంటుంది. శ్రీయ కూడా ఈ జాబితాలో చేరతారు. రవివర్మ పెయింటింగ్స్ అంటే ఈ సుందరాంగికి చాలా ఇష్టం. ఆ మాటకొస్తే, మంచి బొమ్మ ఎవరు గీసినా అభినందిస్తుంటారామె. అడపా దడపా శ్రీయ కూడా కుంచె పడుతుంటారు. చిత్రకళ మీద ఉన్న మమకారం ఇటీవల ఆమెను కేరళ వరకూ తీసుకెళ్లింది. ప్రతి ఏటా అక్కడ ‘కొచ్చి ముజిరిస్ బియెన్నల్’ పేరుతో చిత్రకళల పండగ జరుగుతుంటుంది. ఈ పండగకు వేదికగా నిలిచిన అస్పిన్‌వాల్ హౌస్‌ని శ్రీయ సందర్శించారు. అక్కడ రకరకాల వర్ణ చిత్రాలను వీక్షించారు. ఆ సమయంలో ఓ అద్భుత ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపించిందని శ్రీయ పేర్కొన్నారు. ఇక్కడి చిత్రాల అందం గురించి మాటల్లో వర్ణించలేననీ, కళకు భాష లేదనీ ఆమె తెలిపారు. -
ఆకట్టుకున్న నటిశ్రేయ నృత్యప్రదర్శన
-
వైజాగ్ కోసం...నేను సైతం!
శ్రీయ మంచి నటి మాత్రమే కాదు.. మంచి చిత్రకారిణి కూడా. ఆ విషయం కొద్దిమందికే తెలుసు. చిన్నప్పుడు సరదాగా ఎన్నో అందమైన బొమ్మలు గీసిన శ్రీయ తాజాగా కుంచె పట్టారు. అయితే ఈసారి సరదా కోసం కాదు.. ఓ బలమైన కారణం కోసం. హుదూద్ తుపాను కారణంగా నిన్నటి విశాఖపట్నం శోభ ఇప్పుడు లేదు. నగరానికి మళ్లీ పాత వైభవాన్ని తీసుకురావడానికి ఎవరికి తోచిన రీతిలో వాళ్లు సహాయం చేస్తున్నారు. శ్రీయ కూడా తన వంతుగా రెండు బొమ్మలు గీశారు. వైజాగ్ పునరుద్ధరణ కోసం నిధి సమకూర్చే దిశలో ఏర్పాటు చేసిన ఒక ‘ఆర్ట్ షో’కు తాను గీసిన కృష్ణుడు, బుద్ధుడి బొమ్మలను పంపించారు శ్రీయ. ఆదివారం హైదరాబాద్‌లో ఈ షో జరగనుంది. ఈ సందర్భంగా శ్రీయ మాట్లాడుతూ -‘‘ఆర్ట్ షోకి ఏదైనా బొమ్మలు గీసివ్వాలని నిర్వాహకులు నన్ను కోరారు. ఓ సత్కార్యం కోసం చేస్తున్నది కాబట్టి, వెంటనే అంగీకరించాను. నా పరిధిలో వైజాగ్ కోసం ఏ సహాయం చేయడానికైనా వెనకాడకూడదనుకున్నాను. విశాఖ నగరంతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. బోల్డన్ని తీపి జ్ఞాపకాలు మిగిల్చిన నగరం అది. నటిగా నా తొలి సన్నివేశం చేసింది అరకులోనే. అలాగే, నౌకాదళంలో పని చేస్తున్న నా కజిన్ ఉండేది ఆ నగరంలోనే. ప్రకృతి సృష్టించిన బీభత్సం గురించి తను చెప్పినప్పుడు చాలా బాధగా అనిపించింది’’ అని చెప్పారు. -
నటి రూపా అయ్యర్ ప్రేమ వివాహం
నటి, దర్శకురాలు అయిన రూపా అయ్యర్ తన చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చిన, సంగీత దర్శకుని ప్రేమించి వివాహమాడారు. శ్రీయ నటించిన చంద్ర చిత్రానికి రూపా అయ్యర్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా పలు చిత్రాల్లోనూ రూపా అయ్యర్ నటిస్తున్నారు. చంద్ర చిత్రానికి సంగీత దర్శకునిగా గౌతమ్ శ్రీవత్స పనిచేశారు. చిత్రంలో పని చేస్తుండగా ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇది ప్రేమ వివాహం అయినప్పటికీ దీని గురించి గౌతమ్ మాట్లాడుతూ ఇది రెండు కుటుంబాల సమ్మతితో జరిగిన వివాహమే అని తెలిపారు. మూడు ఏళ్లుగా తమను వివాహం చేసుకోమని ఇరు కుటుంబీకులు కోరుతున్నారని చెప్పారు. చిత్రాలతో తాము బిజీగా ఉండడంతో వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చామని, ప్రస్తుతం ఇది నెరవేరిందన్నారు. తమ వివాహం బెంగళూరులో సంప్రదాయ పద్ధతిలో జరిగిందని వెల్లడించారు. -
నాయికగా ఎన్నాళ్లని?
ఏ రంగంలో అయినా మార్పు అనేది సహజం. సినీ రంగం అందుకు అతీతం కాదు. నటీనటులు కూడా పరిస్థితులకనుగుణంగా తమను తాము మార్చుకుంటూ వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ పరిపక్వతతో కూడిన నటనతో ముందుకు పయనించాలి. హీరోల్లో సకలకళావల్లభుడు కమలహాసన్ ఇలాంటి భావాన్నే వ్యక్తం చేశారు. మరో నటుడు అజిత్ కూడా 41 వయసుకు తగ్గ పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఇమేజ్ అనే చట్రం నుంచి బయటకొచ్చి వైవిధ్యభరిత పాత్రలతో విజయపథంలో కొనసాగుతున్నారు. ఇక హీరోయిన్లలో నటి శ్రీయ ఇదే పంథాను అవలంభించాలనుకుంటున్నారు. శ్రీయ మంచి నటి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె నవ నటుల నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ స్థాయి హీరోలతో జతకట్టారు. అయితే నాయికగా దశాబ్దాన్ని దాటారు. ఇంకా హీరోయిన్‌గానే కొనసాగాలని కొంత కాలంగా బింకం చూపినా ప్రస్తుతం ఆ ఆలోచనల నుంచి బయటపడ్డారు. ఫలితంగా పలు విభిన్న నటనలకు అవకాశం ఉన్న పాత్రలు శ్రీయను వరిస్తున్నాయి. ఆ మధ్య తెలుగులో నాగార్జున సరసన మనం చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా సమంత నటించారన్నది గమనార్హం. అయినా శ్రీయ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఓ మైగాడ్ హిందీ చిత్రం రీమేక్ గోపాల గోపాల తెలుగు చిత్రంలో వెంకటేష్ సరసన నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఇందులో ఆమె వెంకటేష్ భార్యగా నటిస్తున్నారన్నది గమనార్హం. ఈ సందర్భంగా శ్రీయ తన మనసులోని భావాలను వెల్లడిస్తూ తాను రజనీకాంత్, నాగార్జున లాంటి సీనియర్ నటుల సరసన నటించడం వలన ఈ తరం దర్శకులు కాస్త వయసు పాత్రలనే ఇస్తున్నారన్నారు. అందువలన ఇకపై హీరోయిన్ అనే చట్రం నుంచి బయటపడి అవకాశం ఉన్న పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. -
సైమా అవార్డ్స్ కర్టెన్ రైజర్ విశేషాలు
-
స్కూబా డైవింగ్ భలే ఇష్టం
చిట్‌చాట్: ‘మలేషియా ప్రకృతి, పర్యాటక ప్రదేశాలు అద్భుతంగా ఉంటాయి. షూటింగ్ కోసం చాలా సార్లు మలేషియా వెళ్లా. అక్కడి ఐలాండ్స్ కనువిందు చేస్తాయి. దీవుల్లో స్కూబా డైవింగ్ మరపురాని అనుభూతి..’ అంటున్నారు నటి శ్రీయ. ‘మనం’ సినిమాలో సరికొత్త పాత్రలో కనిపించిన శ్రీయ గురువారం సైమా అవార్డుల అనౌన్స్మెంట్ కార్యక్రమంలో మెరిసారు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో మాట్లాడుతూ ‘ కెరీర్ ప్రారంభంలో రెండేళ్లు తెలుగు ప్రేక్షకులు నన్ను భరించారు. తమిళ, మళయాల, కన్నడ పరిశ్రమల్లో నటించినా టాలీవుడ్ అంటే నాకు ప్రత్యేకాభిమానం. రజనీకాంత్‌తో ‘శివాజీ’ సినిమాలో నటించడం చాలా గర్వంగా ఫీలయ్యా. తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్ అందరూ నాకు ఎంతో సహకారం అందించారు’ అని గుర్తు చేసుకుందీ ముద్దుగుమ్మ. ‘విదేశాల్లో దక్షిణాది సినిమాలు పాపులరయ్యాయి. షూటింగ్‌లు, ఇతర పనులపై విదేశాలు వెళ్లినప్పుడు అక్కడి క్యాబ్ డ్రైవర్లు కూడా మన సినిమాల గురించి మాట్లాడుకోవడం విన్నా. సైమా అవార్డులు మలేషియాలో నిర్వహించడం ద్వారా అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతి కచ్చితంగా పెరుగుతుంది. సెప్టెంబర్ 11న నా బర్త్‌డే. మరుసటిరోజే సైమా అవార్డ్స్. ఈసారి నా పుట్టినరోజును మలేషియాలో జరుపుకోబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అంటూ తన సంతోషాన్ని పంచుకుంది. -
ఆ రూమర్ నన్ను ఇబ్బంది పెట్టింది : విశాల్
వాణిజ్య చిత్రాలతో పాటు ప్రయోగాలకు ప్రాధాన్యమిచ్చే విశాల్ ఇటీవలే ‘ఇంద్రుడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. హైదరాబాద్ వచ్చిన విశాల్‌తో ‘సాక్షి’ జరిపిన సంభాషణ. ఉన్నట్లుండి ఇలా ప్రయోగాల బాట పట్టారేం? ఇప్పుడు చేయపోతే... ఇంకెప్పుడు చేయలేం. అసలు ఇలాంటి పాత్రలు చేసే సామర్థ్యం నాకుందా? అనే మీమాంసలో ఉండేవాణ్ణి మొదట్లో. ‘వాడు-వీడు’ చిత్రంతో ప్రయోగాలు చేయొచ్చని అర్థమైంది. ఏళ్ల తరబడి ప్రేక్షకుల హృదయాల్లో ఉండాలంటే ఇలాంటి పాత్రలే కరెక్ట్. వాణిజ్యపరంగా చూసుకుంటే ఇది రిస్కే. అందుకని రొటీన్‌గా వెళ్లమంటే నా వల్ల కాదు. ‘ఇంద్రుడు’లో నార్కొలస్పీ డిజార్డర్‌తో బాధపడే పాత్ర చేశారు కదా. దీనికోసం ఏమైనా హోమ్‌వర్క్ చేశారా? సాధారణంగా పోరాటాలు, నృత్యాల సమయంలో కష్టం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఆ పడిపోయే సన్నివేశాలే కష్టంగా అనిపించాయి. నిల్చున్నవాణ్ణి నిల్చున్నట్లే పడిపోవాలి. చేతుల్ని నేలకు బేలన్స్ చేయకూడదు. దాంతో భారీగా దెబ్బలు తగిలేవి. వాటన్నింటినీ భరిస్తూ చేశాను. హీరో అంటే.. ‘విలన్లను ఒంటిచేత్తో కొట్టేయాలి’ అనేది చాలామంది అభిప్రాయం. కానీ... ఇందులో కంటి ముందు హీరోయిన్ని కొట్టి చంపుతుంటే.. నిద్రపోతాను. ఈ కథ విని కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. కానీ నాకు మాత్రం ఈ కథ బాగా నచ్చింది. మీరు తెలుగబ్బాయి. కానీ... తమిళ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కారణం? నేను పుట్టింది, పెరిగిందీ చెన్నయ్‌లో. సహాయ దర్శకునిగా కెరీర్ మొదలుపెట్టిందీ అక్కడే. అందుకే.. ఆ పరిశ్రమపై మక్కువ ఎక్కువ. ఒకవేళ ఇక్కడే పుడితే ఇలా జరిగేది కాదేమో. నేను తెలుగువాణ్ణి కాబట్టే.. మాతృభాషలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మా నాన్నగారు తపించారు. అందుకే ఇక్కడా విజయాలు అందుకోగలిగా. త్వరలో తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాను. అందులోనూ నా పాత్ర భిన్నంగానే ఉంటుంది. శ్రీనువైట్ల సహాయకుడు శశికాంత్‌ని ఈ సినిమా ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాను. ‘శివ’ను గుర్తుచేసేలా ఉంటుందీ సినిమా. అక్టోబర్‌లో మొదలుపెడతాం. అన్ని భాషా చిత్రాలూ చూస్తుంటారు కదా. కథల విషయంలో ఎవరు ముందున్నారంటారు? వందశాతం తమిళ సినిమానే. బాలీవుడ్ అంతా ఇప్పుడు మన సౌత్ సినిమాలపైనే ఆధారపడింది. ఇక తెలుగు సినిమా మాత్రం హీరోల ఇమేజ్‌లు, భారీ తనానికే ప్రాధాన్యత ఇస్తోంది. కానీ... తమిళంలో అలా కాదు. కథకే అక్కడ తొలి ప్రాముఖ్యత. ఇటీవల మీపై కూడా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. వాటిని వింటుంటే ఏమనిపిస్తుంది? పట్టించుకోను. అయితే.. ఈ మధ్య ఓ రూమర్ మాత్రం కాస్త ఇబ్బంది పెట్టింది. శ్రీయతో కలిసి నేను హిమాలయాలకు వెళ్లానట. ఆ రాసిన వారికి ఫోన్ చేశాను. నేను వెళ్లినట్లు మీకెలా తెలుసు? సాక్ష్యాలేమైనా ఉన్నాయా? హిమాలయాలంటే నాకిష్టం... వెళ్తాను. శ్రీయతో వెళ్లాల్సిన పనేంటి? అని అడిగేశాను. మా నాన్న అయితే.. నాపై ఇలాంటి రూమర్లు పేపర్లో రాగానే వాటిని కట్ చేసి దాచుకుంటారు. ఎందుకంటే మా అబ్బాయి పేరు న్యూస్ పేపర్లో వచ్చిందని ఆయన ఆనందం. ఇంతకూ మీ పెళ్లెప్పుడు? నేను పెళ్లికి రెడీ అవ్వలేదు. పెళ్లంటే ఒక పనిగా చేసుకోకూడదు. ఈ టైమ్‌కి బడికెళ్లాలి, ఈ టైమ్‌కి జాబ్ చేసుకోవాలి, ఈ టైమ్‌కి పెళ్లాడాలి అనే పద్ధతికి నేను పూర్తి విరుద్ధం. ఇంకా రెండేళ్ల వరకూ పెళ్లి ప్రస్తావనే రానీయను. -
‘గోపాల గోపాల’లో కొత్త శ్రీయ
శ్రీయ తన కెరీర్లో ఎక్కువగా గ్లామర్ పాత్రలే పోషించారు. పరిపూర్ణ వ్యక్తిత్వం గల స్త్రీగా ఆమె నటించింది లేదు. తొలిసారిగా ‘మనం’లో అలా కనిపించింది. ఇంకేముంది ఎక్కడ లేని ప్రశంసలు. లేటెస్ట్ లేడీ సూపర్‌స్టార్ సమంతకు దీటుగా మార్కుల్ని కొట్టేశారు శ్రీయ. పైగా ‘మనం’లో సమంత పాత్రతో పోలిస్తే శ్రీయ పాత్ర నిడివి చాలా తక్కువ. ఏది ఏమైనా ‘మనం’ ఆమెకు మంచి మలుపు అయ్యింది. ఇప్పుడు ‘గోపాల గోపాల’ లాంటి ప్రతిష్ఠాత్మకమైన చిత్రంలో కథానాయికగా ఎంపిక అయ్యిందంటే.. అదంతా ‘మనం’ పుణ్యమే. విశేషమేంటంటే- ‘గోపాల గోపాల’లో కూడా శ్రీయ పాత్ర సామాన్యమైనది కాదట. నిజమైన స్త్రీ మూర్తికి నిర్వచనంగా ఆ పాత్ర ఉంటుందట. పైగా వెంకటేశ్ పాత్రకు దీటుగా ఆమె పాత్ర ఉంటుందని సమాచారం. నిజానికి మాతృక ‘ఓ మైగాడ్’లో కథానాయిక పాత్ర లేదు. కేవలం తెలుగు సినిమా కోసమే ఈ పాత్రను దర్శకుడు డాలీ డిజైన్ చేశారట. ఈ పాత్ర గురించి ఇటీవల శ్రీయ మాట్లాడుతూ- ‘‘నాకు కొత్త ఉత్సాహం వచ్చినట్టుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఇంత గొప్పగా మొదలవుతుందని అనుకోలేదు. ఈ విషయంలో ‘మనం’ సినిమాకు థ్యాంక్స్. ఇప్పుడు చేస్తున్న ‘గోపాల గోపాల’లో కూడా నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఒక కొత్త శ్రీయను చూస్తారు. ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఈ పాత్ర నాకు ఓ ఊతంగా ఉపయోగపడుతుంది’’ అని చెప్పారు. -
గోపాలా.. గోపాలా..?
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. విశ్వంలో సంభవించే ప్రతి విలయానికీ, ప్రతి అద్భుతానికీ దేవుడే కారణభూతుడు. సృష్టించేది దైవమే, నశింపజేసేదీ దైవమే. భగవద్గీత, ఖురాన్, బైబిల్... ఇలా ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పేది ఇదే. మరి అలాంటప్పుడు మనిషి బాధలకు బాధ్యుడు దైవం కాక ఇంకెవరు? అని ప్రశ్నిస్తాడో సామాన్యుడు. ప్రకృతి విలయాన్ని సృష్టించి తన జీవనోపాధిపై దెబ్బకొట్టిన దైవంపై కోర్టుకెక్కాడు. దైవమో, లేక ఆయన అనుచరులుగా చెప్పుకుంటున్న మతగురువులో ఎవరో ఒకరు తనకు నష్టపరిహారం చెల్లించాలని న్యాయదేవత ముందు గగ్గోలు పెడతాడు. మరి అభియోగం మోపబడ్డ దైవం ఏం చేసింది? ఆ వ్యక్తికి న్యాయస్థానంలో న్యాయం జరిగిందా? ఆసక్తికరమైన ఈ కథాంశంతో బాలీవుడ్లో తెరకెక్కిన చిత్రం ‘ఓ మైగాడ్’. దేవునిపై కోర్టుకెక్కిన సామాన్యుడి పాత్రలో పరేశ్‌రావల్ జీవిస్తే, దైవంగా అక్షయ్‌కుమార్ అదరహో అనిపించేశారు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ తెరపై వచ్చిన అమోఘమైన ప్రయోగం ‘ఓ మైగాడ్’. ఈ కథను తెలుగీకరించాలనే ఆలోచన రావడమే పెద్ద సాహసం. ఈ విషయంలో నిర్మాతలు డి.సురేశ్‌బాబు, శరత్‌మరార్‌ను అభినందించాల్సిందే. ఇందులో పరేశ్‌రావెల్ పాత్రను వెంకటేశ్, అక్షయ్‌కుమార్ పోషించిన శ్రీకృష్ణుడి పాత్రను పవన్‌కల్యాణ్ పోషించనున్న విషయం తెలిసిందే. సవాల్‌గా తీసుకొని వీరిద్దరూ ఈ పాత్రల్ని పోషించనున్నట్లు తెలిసింది. కొంచెం ఇష్టం-కొంచెం కష్టం, తడాఖా చిత్రాల దర్శకుడు డాలీ ఈ చిత్రానికి దర్శకుడు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ విషయంలో ఇప్పటివరకూ పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ‘దేవ దేవం భజే’ అంటుంటే, ఇంకొందరూ ‘గో గో గో గోవిందా’ అనే పేరును ఖరారు చేసినట్లు చెప్పుకుంటున్నారు. అయితే... ‘సాక్షి’కి తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ చిత్రానికి ‘గోపాలా గోపాలా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారని వినికిడి. కథలోని ఆత్మ దెబ్బ తినకుండా ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసినట్లు తెలిసింది. స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తి కావస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన కథానాయికగా శ్రీయను తీసుకున్నారు. మాతృకలో చేసిన పాత్రనే ఇందులో మిథున్ చక్రవర్తి పోషించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. -
సినిమా రివ్యూ: మనం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల్లో 'మనం' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు జనరేషన్ లు తెరపై కనిపించడం అన్నివర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరెస్ట్ లాంటి అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడం, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఒకే చిత్రంలో నటించడం అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచింది. విడుదలకు ముందే ఫస్ట్ లుక్ తోపాటు ప్రోమోలతో సగటు సినీ ప్రేక్షకుడికి చేరువైన 'మనం' చిత్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే. అర్ధాంతరంగా చనిపోయిన రెండు జంటలు (రాధామోహన్ & కృష్ణవేణి, సీతారాం &రామ లక్ష్మి) మళ్లీ జన్మించడమే మనం చిత్ర కథ. రెండు జంటలను కలుపడానికి వారి కుమారులు చేసిన ప్రయత్నానికి తెర రూపమే 'మనం' చిత్రం. సీతారాం, నాగేశ్వరరావు పాత్రల్లో అక్కినేని నాగార్జున, రాధామోహన్, నాగార్జునగా నాగ చైతన్య, కృష్ణవేణి, ప్రియగా సమంత, రామలక్ష్మి, అంజలి పాత్రల్లో శ్రీయలు, నాగ చైతన్య పాత్రలో అక్కినేని నాగేశ్వరరావులు నటించారు. కథ: నాగార్జున ఓ బిజినెస్ మాగ్నెట్. అతి చిన్న వయస్సులోనే ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన వ్యాపారవేత్త. అనుకోకుండా నాగచైతన్య, సమంతలను కలుసుకుంటాడు. నాగచైతన్య, సమంతలను చూడగానే తన చిన్నతనంలో చనిపోయిన తల్లి, తండ్రులు (రాధా మోహన్, కృష్ణవేణి) మళ్లీ పుట్టారు అని నిర్థారించుకుంటాడు. నాగచైతన్య, సమంతల రూపంలో ఉన్న తన తల్లితండ్రులను కలిపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నసమయంలో ఓ యాక్సిడెంట్ కు గురైన అక్కినేని నాగేశ్వరరావుకు నాగార్జున రక్తాన్ని ఇచ్చి కాపాడుతాడు. ఈ ఘటనలో శ్రియను కలుసుకుంటాడు. అయితే ఆస్పత్రిలో నాగార్జున, శ్రియలను చూసిన నాగేశ్వరరావు.. తన పసితనంలో పొగొట్టుకున్న తల్లితండ్రులు(రామలక్ష్మి, సీతారాం)లుగా గుర్తిస్తాడు. నాగార్జున, శ్రియలను కలుపడానికి నాగేశ్వరరావు, నాగ చైతన్య, సమంతలను కలుపడానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తారు. నాగార్జున, నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా?, నాగ చైతన్య, సమంతలు పూర్వజన్మ గురించి తెలుసుకుంటారా? నాగార్జున, శ్రియలు ఒక్కటవుతారా? తమ నాగార్జున, శ్రియలను కలపడానికి అక్కినేని నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఎంటి? అనే ప్రశ్నలకు సమాధానమే 'మనం' చిత్ర కథ. నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియలు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఒకే చిత్రంలో రెండు జనరేషన్లకు చెందిన పాత్రలను పోషించడంలో జట్టుగా అక్కినేని నాగేశ్వరరావుతోపాటు నలుగురు హీరోహీరోయిన్లు పాత్రలకు జీవం పోశారు. సమంతను అమ్మ అంటూ, నాగ చైతన్యను నాన్న అంటూ పిలుస్తూ నాగార్జున ఆకట్టుకోవడమే కాకుండా.. ప్రేక్షకులను మెప్పించారు కూడా. ముఖ్యంగా నాగేశ్వరరావు పాత్రలో నాగార్జున నటించిన తీరు ప్రశంసనీయం. ఇంటర్వెల్ లో అక్కినేని నాగేశ్వరరావు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో ఓ అనుభూతిని కలిగించాడు. రెండవ భాగం ప్రారంభమైన దగ్గర నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకుడిలో అక్కినేని నాగేశ్వరరావు చేరువవ్వడంతోపాటు చక్కటి ఫీలింగ్ ను నింపారు. ఇక నాగచైతన్య తన వయస్సుకు మించిన ఓ బరువైన పాత్రలో కనిపించడమే కాకుండా రెండు పాత్రలకు తగినట్టుగా పరిణతిని ప్రదర్శించాడు. సమంత, శ్రియలు విభిన్నమైన పాత్రలతో మెప్పించారు. ఆలీ, బ్రహ్మనందం, సప్తగిరి కామెడీతో ఆలరించారు. ముఖ్యంగా ఈ చిత్ర కథను రూపొందించిన విక్రమ్ కే కుమార్ కే క్రెడిట్ దక్కుతుంది. మనం చిత్రంలో అక్కినేని వంశంలోని నాగేశ్వరరావు, నాగార్జున, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ లకు తగినట్టుగా కథను రూపొంది.. చాలా ఒద్దికగా, కథపై నియంత్రణతో.. చిత్రాన్నిమలిచిన తీరు ఆకట్టుకునేలా ఉంది. రెండు పునర్జన్మ కథలను చక్కగా చిత్రీకరించి ప్రేక్షకులను ఆలరింప చేయడంలో విక్రమ్ కుమార్ సఫలమయ్యారు. వివిధ జనరేషన్లకు తగినట్టుగా ఓ మూడ్ ను క్రియేట్ చేయడంలో కెమెరామెన్ పీఎస్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ లు ప్రధాన పాత్రలు పో్షించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. అనూప్ రూబెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. అనూప్ రూబెన్ అందించిన అందర్ని పాటలు ఆకట్టుకున్నాయి. వందేళ్ల సినిమా చరిత్రలో దాదాపు 70 సంవత్సరాల సినీ జీవితంతో ప్రేక్షకుడికి విభిన్నమైన పాత్రలతో ఆలరించి, ఆకట్టుకుని తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు 'మనం' చిత్రం గొప్ప నివాళి. -
రైలు పరిచయం!
లండన్‌లో ఉద్యోగం చేసుకుంటున్న ఆ యువకుడు అనుకోకుండా తన గ్రామానికి రావాల్సి వస్తుంది. లండన్‌లోనే చదువు పూర్తి చేసిన ఆ యువతి కూడా తన గ్రామానికి రావాల్సి వస్తుంది. ఈ అపరిచితులిద్దరూ ఇండియా ప్రయాణం అవుతారు. ఇండియాకి వచ్చిన తర్వాత తమ తమ గ్రామాలకు వెళ్లడం కోసం రైలు ఎక్కుతారు. అక్కడ ఇద్దరికీ పరిచయం అవుతుంది. ఆ పరిచయం ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? అనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని ‘లవ్ టు లవ్’ పేరుతో వల్లభనేని అశోక్ తెలుగులోకి విడుదల చేయనున్నారు. ఆర్య, శ్రీయ, ప్రీతికారావ్ ముఖ్య తారలుగా మణికంఠన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మే 1న విడుదల చేయనున్నామని, పాటలకు మంచి ఆదరణ లభించిన నేపథ్యంలో త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరపనున్నామని విడుదల హక్కులు పొందిన కొండపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు. -
శ్రియకు డెడ్‌లైన్ పెట్టిన ప్రియుడు
-
డి గ్లామర్ రోల్ గా శ్రియ
-
‘మనం’లో నటించడం నాకో వరం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: అక్కినేని వంశంలోని మూడు తరాల నటులతో తీస్తున్న మనం సినిమాలో తాను కూడా నటించడం ఓ వరంగా భావిస్తున్నానని ప్రముఖ హీరోయిన్ శ్రీయ అన్నారు. సినిమాల్లో నటించడంతోపాటు పేదలకు సేవ చేయడంలో మరింత తృప్తి కలుగుతుందని చెప్పారు. ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం విశాఖ వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... మంచి సినిమాల కోసం.... ఈ మధ్య సినిమాలు తక్కువగా ఒప్పుకుంటున్నాను. చాలా మంది కథలతో వస్తున్నారు. కానీ నేను ఆచితూచి అడుగు వేస్తున్నాను. మంచి కథ దొరికితేనే ఒప్పుకుంటున్నాను. అందుకే ఇటీవల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, పవిత్ర మాత్రమే చేశాను. ఆశించినంత విజయం దక్కలేదు పవిత్ర సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. అది చాలా మంచి సినిమా. సందేశాత్మకమైన చిత్రం. కానీ ఆశించిన విజయం దక్కలేదు. ఏఎన్ఆర్తో నటించడం అదృష్టం ‘మనం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో నటించడం అదృష్టం. నా కెరీర్లో ఇది మరిచిపోలేని చిత్రంగా భావిస్తున్నా. నటిగానే కాకుండా ఓ ప్రేక్షకురాలిగా కూడా ఈ సినిమాను ఎప్పుడు తెరపై చూద్దామా అని తహతహలాడుతున్నాను. యోగా టిప్స్ నేర్చుకుంటున్నా... నాకు సంతోషం సినిమాలో అక్కినేని అమలతో మంచి పరిచయం ఏర్పడింది. ఆమె చాలా మంచి వ్యక్తి. తన వద్ద నేను విపాసన యోగ టిప్స్ నేర్చుకుంటున్నాను. సేవా కార్యక్రమాలు స్త్రీ స్పందన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాను. దీని ద్వారా అంధులకు సేవ చేస్తున్నాను. వివిధ దేశాల్లో ప్రభుత్వం అంధులకు, వికలాంగులకు ఎంతో సేవ చేస్తోంది. మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి. వీధి బాలలపై ఆర్ట్ ఫిల్మ్ ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు దీప మెహతా దర్శకత్వంలో నేను వీధి బాలల కోసం ఓ ఆర్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. అందులో నా పాత్ర పేరు పార్వతి. ‘మిడ్నైట్ చిల్డ్రన్’ అనే పేరుతో ఈ ఆర్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. విశాఖ నాకు చాలా ఇష్టం నాకు విశాఖ అంటే చాలా ఇష్టం. షూటింగ్‌లకు, క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా విశాఖ కొత్తగానే ఉంటుంది. సహజసిద్ధమైన అందంతో కొత్తగానే దర్శనమిస్తుంది. ఇక్కడ బీచ్ నాకు చాలా ఇష్టం. -
కాజల్ దృష్టిలో... రిటైర్మెంట్కి రెడీగా ఉన్న నాయిక?
నటన మాత్రమే కాదు, మీడియాను ఫేస్ చేయడం కూడా ఆర్టిస్టులకు ఛాలెంజే. అందుకే చాలా జాగ్రత్తగా మీడియా దగ్గర మాట్లాడుతుంటారు. అయితే నిర్మొహమాటంగా మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. వాళ్లల్లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇటీవల ఓ కోలీవుడ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ సమాధానాలు వింటే... అది నిజమని ఎవరైనా అంగీకరిస్తారు. ఇప్పటికిప్పుడు దక్షిణాది కథానాయికల్లో రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్న నాయిక ఎవరు? అని అడిగితే -‘శ్రీయ’ అని తడుముకోకుండా సమాధానమిచ్చేశారు కాజల్. శ్రీయ రిటైర్ అవుతున్నట్లు ప్రకటించనేలేదు. ప్రస్తుతం కాజల్‌కి ఉన్న పోటీదారుల్లో శ్రీయ లేదు కూడా. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. మరి అలాంటప్పుడు అంత నిక్కచ్చిగా శ్రీయ పేరు ఎలా చెప్పగలిగింది కాజల్ అంటూ కోలీవుడ్‌లో ఒకటే చర్చ. ఇదే ఇంటర్వ్యూలో.. ‘తమిళ హీరోల్లో ఫ్యాషన్‌ని ఫాలో అయ్యే స్టయిల్ ఐకాన్ ఎవరు?’ అనే ప్రశ్నకు కాజల్ ఇచ్చిన సమాధానం ‘విజయ్’. ‘‘‘తుపాకీ’లో విజయ్ స్టయిల్ చూసి ఫ్యాన్ అయిపోయా’’ అని విజయ్‌ని ఈ సందర్భంలో పొగడ్తల్లో ముంచెత్తారు కాజల్. చివరిగా అడిగిన ప్రశ్న... పారితోషికం తీసుకోకుండా నటించాల్సి వస్తే ఏ హీరోతో నటిస్తారు? అనడిగితే... ‘సూపర్‌స్టార్ రజనీకాంత్’ అని తడుముకోకుండా చెప్పి ఇంటర్వ్యూని ముగించారు కాజల్. -
పెళ్లి ఘడియ ఎప్పుడు?
సినిమాల సంఖ్య తగ్గడంతో శ్రీయ పెళ్లి గురించి మీడియాలో గత రెండుమూడేళ్ల్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే... వాటిని శ్రీయ కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. అయితే... ఈ మధ్య పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు శ్రీయ వాయిస్‌లో కాస్తంత మార్పు కనిపించింది. ఈ టాపిక్ తెస్తే చాలు అంతెత్తున లేచే శ్రీయ... ఈ దఫా మాత్రం చిరునవ్వులు చిందిస్తూ... తనదైన శైలిలో రొమాంటిక్‌గా కళ్లు తిప్పుతూ సమాధానం ఇచ్చారు. ‘‘ప్రతి ఒక్కరి జీవితంలో ఆ ఘడియ తప్పదు. అలాగే నా జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ సందర్భం రావాల్సిందే. కచ్చితంగా వస్తుంది. అయితే... అది ఎప్పుడొస్తుందో మాత్రం చెప్పలేను. ఏ క్షణాన్నయినా రావచ్చు. నా పెళ్లంటూ ‘ఓకే’ అయితే... నిశ్చితార్థపు ఉంగరం మీడియాకు చూపించే మా ఆయనతో తొడిగించుకుంటా’’ అంటూ చెప్పుకొచ్చారు శ్రీయ. ఈ ముద్దుగుమ్మ వాలకం చూస్తుంటే... పెళ్లిపీటలెక్కే ఘడియ ఎంతో దూరంలో లేదేమో అనిపిస్తోంది. -
సంతోష దీపావళి
ప్రతి ఇంటా కాంతులీనే పర్వదినం దీపావళి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పండుగను జరుపుకుంటారు. వినోదాన్ని పంచే సినిమా ఈ వేడుకలో భాగంగా మారింది. దీపావళిని దృష్టిలో ఉంచుకునే కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. దీపావళి ప్రతి ఇంటా సంతోషం నింపాలంటోంది శ్రీయ. ఆమె ఇంకా ఏమి చెబుతోందంటే.. పలు భాషలలో నటించారు. నటిగా ఏ భాషలో నటించడం సౌలభ్యంగా అనిపించింది? నిజం చెప్పాలంటే హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నటించడం సౌకర్యంగా ఉంది. అయితే భాషల్లో భేదం ఉండొచ్చుగానీ భావం ఒక్కటే. నవ్వమంటే నవ్వాలి, ఏడవమంటే ఏడవాలి అంతే. మీ చిత్రాలలో మీకు బాగా నచ్చిన పాట ఏది? మళై చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన నీ వరంబోదు.. అనే పాట అంటే చాలా ఇష్టం. అదే విధంగా ఎ.ఆర్.రెహ్మాన్ బాణీలు కట్టిన శివాజీ చిత్రం లోని ఆంబల్... అనే పాట బాగా ఇష్టం. రజనీకాంత్ సరసన నటించడం ఎలాంటి అనుభూతి ఇచ్చింది? నిరాడంబరతకు మారుపేరు రజనీ. ఎక్కడ నుంచి వచ్చామన్న విషయాన్ని మరచిపోకుండా జీవించే అద్భుత మనిషి. మంచికి, మానవత్వానికి చిహ్నం. సూపర్‌స్టార్ అన్న భావన ఆయనలో మచ్చుకైనా కనిపించదు. ఎలాంటి ఈగో లేని వ్యక్తి. నన్ను ఆశ్చర్యపరచిన నటుడు రజనీకాంత్. పెళ్లెప్పుడు చేసుకుంటారు? అలాంటి ఒకరోజు కచ్చితంగా వస్తుంది. అయితే అది ఎప్పుడన్నది తెలియదు. అందరికీ తెలిసే నా పెళ్లి జరుగుతుంది. కల్యాణ ఘడియలొచ్చిప్పుడు నా చేతి వేలికి అంగుళీకం ఉంటుంది. ప్రేమ గురించి మీ భావన? అది ఒకరి వ్యక్తిగత విషయం. అందులో ఇతరులు తలదూర్చడం దాని గురించి మాట్లాడడం మంచి సంస్కృతి కాదు. ఈ దీపావళిని ఎక్కడ జరుపుకుంటున్నారు? ముంబయిలోనే. కుటుంబ సభ్యులు, స్నేహితులు వస్తారు. ఇల్లంతా దీపాల వెలుగులతో కలర్ఫుల్గా మార్చేస్తాం. స్వీట్స్, నూతన వస్త్రాలు ఇలా ఆనందభరితమైన అంశాలన్నీ ఉంటాయి. -
శ్రేయ - స్టార్ స్టార్ సూపర్ స్టార్