మాల్దీవుల్లో మస్త్‌ మజా | bikini babe shriya saran in maldives | Sakshi
Sakshi News home page

మాల్దీవుల్లో మస్త్‌ మజా

Published Sat, Apr 1 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

మాల్దీవుల్లో మస్త్‌ మజా

మాల్దీవుల్లో మస్త్‌ మజా

సముద్రపు లోతుల్లోకి వెళ్లి లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే... ఏదైనా ఫొటోల్లో చూడు. అంతేకానీ సముద్రంలోకి వెళ్లాలనుకోవద్దు... పిరికివాళ్లు అనే మాట ఇది. అదే శ్రియలాంటి ధైర్యసాహసాలున్న అమ్మాయి అయితే సముద్రంలోకి వెళుతుంది. నీటి లోపల అందాన్ని తనివి తీరా ఆస్వాదించేస్తుంది. శ్రియ ఇటీవల అదే చేశారు. పిల్లలందరూ సమ్మర్‌ వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తున్నట్లు ఈ బ్యూటీ కూడా ఓ వెకేషన్‌ ప్లాన్‌ చేసుకున్నారు. మాల్దీవులు వెళ్లారు. అక్కడ స్కూబా డైవింగ్‌ చేశారు.

అలాగే బోటు షికారుని ఎంజాయ్‌ చేశారు. ఆ సమయంలో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా బయటపెట్టారామె. మాల్దీవుల్లో మస్త్‌ మజా చేసి, మళ్లీ వచ్చేవరకూ ‘టాటా’ అంటూ, ఇండియా వచ్చేశారు. శ్రియ స్కూబా డైవింగ్‌ చేయడం ఇది ఫస్ట్‌ టైమ్‌ కాదు. అంతకుముందు చాలాసార్లు చేశారు. ఏడాదికోసారి కంపల్సరీగా డైవ్‌ చేయాల్సిందే.
http://img.sakshi.net/images/cms/2017-04/71490989149_Unknown.jpg
http://img.sakshi.net/images/cms/2017-04/51490989248_Unknown.jpg
http://img.sakshi.net/images/cms/2017-04/61490989335_Unknown.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement