ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్
బాలీవుడ్‌లో వన్నాఫ్ ది బెస్ట్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ మాల్దీవుల్లో మస్త్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ వెకేషన్‌తో పాటు పెళ్లి రోజు సంబరాల్ని కూడా అక్కడే జరుపుకున్నారీ దంపతులు. అప్పుడు ఆరాధ్య పోజు ప్లీజ్ అంటే, కూతురి కెమెరాకి ఇద్దరూ పోజు ఇచ్చినట్లున్నారు. ‘‘ఈ ఫొటోను మా జీవితాల వెలుగు దివ్వె అయిన ఆరాధ్య తీసింది’’ అంటూ పైన ఉన్న ఫొటోను షేర్ చేశారు ఐశ్వర్యారాయ్.
ఇది అభిషేక్ అండ్ ఐశ్వర్యాల 12వ వివాహ వార్షికోత్సవం కావడం విశేషం. న్యూయార్క్‌లో జరిగిన ‘గురు’ ప్రీమియర్ షో సమయంలో ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు అభిషేక్. ఆ తర్వాత 2007 ఏప్రిల్ 20న వీరిద్దరి వివాహం జరిగింది. 2011 నవంబరులో ఆరాధ్యకు జన్మనిచ్చారు ఐశ్వర్య. ‘గురు’ సినిమాకు ముందు ‘టాయి అక్షర్ ప్రేమ్ కే’ (2000), ‘కుచ్ నా కహో’ (2003) చిత్రాల్లో కలిసి నటించారు ఐశ్వర్య అండ్ అభిషేక్. ఇప్పుడు ‘గులాబ్ జామ్’ అనే చిత్రంలో జంటగా నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment