Summer vacation
-
గిరిజనుల జీవనశైలిని చూసొద్దాం రండి..
పెద్దదోర్నాల: విద్యార్థులు వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారు. నిత్యం పాఠ్య పుస్తకాలతో కుస్తీ పట్టే పిల్లలు సెలవుల్లో విజ్ఞానం పెంచుకోవడానికి విహారయాత్రలు చేసేందుకు ఇష్టపడతారు. అలాగే ఉద్యోగులు, వివిధ వృత్తులలో ఉన్నవారు సైతం వేసవికాలంలో కాస్తంత విశ్రాంతి, మానసికానందం కోసం పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు సరిహద్దులో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలోని చెంచులక్ష్మి ట్రెబల్ మ్యూజియంలో చెంచుల జీవిత విశేషాలను తెలుసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ఐటీడీఏ ఏర్పాటుచేసిన ఈ ట్రైబల్ మ్యూజియంలో చెంచులతోపాటు అడవి బిడ్డలైన శోలాములు, కోంధులు, గోండులు, నాయకపోడులు, యానాదులు మొదలైన వారందరి చరిత్ర, సంస్కృతిని తెలియజేసేలా ప్రతిమలు ఉన్నాయి. ట్రైబల్ మ్యూజియంలో ఇవీ ప్రత్యేకతలు... » ప్రధాన ద్వారం నుంచి లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా ఒక పుట్ట, దానిముందు పామును ఆడిస్తున్నట్టుగా ఒక చెంచు గిరిజనుడి ప్రతిమ కనిపిస్తాయి. నాదస్వరంతో సర్పాన్ని ఆడిస్తున్న తీరు చెంచులకు వాటితో గల అనుబంధం, భక్తి, విశ్వాసాలను తెలియజేస్తుంది. » రెండో గదిలో ఢంకా బజాయిస్తున్న చెంచు, ఆ చుట్టూ గోడలకు అవజాల, మద్దెల, మృదంగం, తుడుము, విడక, తప్పెట, డోలు, డోల్కాడ్, మువ్వలదండు, పిల్లనగ్రోవి, కికిరి, పికిరి, డిర్జింగోవరాయ్, గుమ్మలం, పర్ర మొదలైన గిరిజన తెగల వారి సంగీత వాయిద్యాలు ఉన్నాయి. మల్లికార్జున స్వామికి ఇష్టమైన వీటిని మహాశివరాత్రి ఉత్సవాల్లో వివిధ తెగలకు చెందిన గిరిజనులు వాయిస్తుంటారు. » మూడో గదిలో చెంచుగుచ్చ ఏర్పాటుచేశారు. చెంచుల ఆభరణాలు, ఆయుధాలు, ఇతర వస్తు సామగ్రి ఇందులో చూడవచ్చు. » ఐదో గదిలో రవితార, చిడతలు పట్టి శివకథలను చెబుతున్న దేవచెంచుల బొమ్మ ఉంది. శివపూజ చేసే దేవ చెంచులే కష్టాలకోర్చి శ్రీశైలాన్ని రక్షించినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో ఉన్న చెంచులంతా ఈ దేవ చెంచుల జాతికి చెందినవారే. వీరు వాడే పెరుబాకు, కొడవలి, గొరక, వంకటి తెడ్డు, రోకలి, తేనెబుట్ట, గుండురాయి ఈ గదిలో ఉన్నాయి. »తొమ్మిదో గదిలో సోది చెప్పే ఎరుకలసాని కొరవంజి కనపడుతుంది. ఈమె భ్రమరాంబ మల్లికార్జునుల పెళ్లి సంగతి, శ్రీశెలం పెద్ద పట్టణంగా విస్తరించి 12 ఆమడల పట్టణం అవుతుందని సోది చెప్పినట్టు పెద్దలు చెబుతారు. ఈ గదిలో ఎరుకల, యానాదులు ఉపయోగించే వివిధ రకాల వాయిద్య పరికరాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ఎన్నో విశేషాలతో కూడిన ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. -
కాళేశ్వరంపై విచారణ వేసవి సెలవులు ముగిశాకే..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లలో విచారణను హైకోర్టు వేసవి సెలవుల (జూన్) తర్వాతకు వాయిదా వేసింది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌తో పాటు బక్క జడ్సన్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. కేఏ.పాల్ వాదనలు వినిపిస్తూ.. ‘దేశంలోనే అత్యంత అవినీతి జరిగిన ప్రాజెక్టు కాళేశ్వరం. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణలోని 4 కోట్ల మందికి చెందిన రూ.లక్ష కోట్లకు సంబంధించిన అంశం ఈ ప్రాజెక్టు. సీబీఐ దర్యాప్తుతోపాటు భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వినియోగించుకునేలా నిపుణుల కమిటీని కూడా వేయాలి. ఎన్నికలకు ముందు పలు సభలు, సమావేశాల్లో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ అధికారంలోని రాగానే మాట మార్చారు. సీబీఐ విచారణ కోరకుండా.. రిటైర్డ్ జడ్జితో విచారణ అంటున్నారు’అని పేర్కొన్నారు. ఈ కేసులో సీఎం పార్టీ కాదని.. ఆయనపై చర్చ అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాల్ వాదనలను ధర్మాసనం పలుమార్లు తప్పుబట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. -
మంచులో చిల్ అవుతున్న మహేశ్‌బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
బికినీలో అనసూయ రచ్చ...స్విమ్మింగ్ ఫూల్ పిక్స్ వైరల్
గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంటుంది యాంకర్ అనసూయ. తనను ట్రోల్ చేసినా పట్టించుకోదు. పైగా ట్రోల్స్ మితిమీరితే గట్టి కౌంటర్ ఇస్తుంది కూడా. ఇది తన జీవితం అని.. తనకు నచ్చినట్లుగానే ఉంటానని తెగేసి చెబుతుంది. తనవి మాత్రమే కాదు ఫ్యామిలీ ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈ యాంకరమ్మ ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్‌కి వెళ్లింది. స్విమ్మింగ్ ఫూల్లో భర్త, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసింది. దానికి సబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అనసూయ మొదటిసారి బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. సండే ఉదయం పూట హీట్ పెంచేదంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక అనసూయ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం అనసూయ నటిగా జోరుమీదనే ఉందని చెప్పాలి. చివరిగా ‘మైఖేల్‘, ‘రంగమార్తండ’ వంటి చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. మరిన్ని చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో పుష్ప 2 : దిరూల్, విమానం సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
రోజుకు 3 గంటలు చూసేస్తున్నారు.. అమేజాన్ సర్వేలో షాకింగ్ విషయాలు
వేసవి సెలవుల్లో పిల్లలు కనీసం 3 గంటలు ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌తో గడుపుతున్నారని దేశంలో 85 శాతం మంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్టు ‘అమేజాన్’ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. దీనివల్ల పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బ తింటుందని వారు భయపడుతున్నారు. పిల్లల్ని ఆరోగ్యకరమైన వ్యాపకాల్లో పెట్టాలని వారంతా కోరుకుంటున్నారు. కాకుంటే పిల్లల్ని స్క్రీన్ మీద నుంచి దృష్టి మళ్లించేలా చేయడమే అసలు సమస్య. మన దగ్గర సమయం లేక పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలో తెలియక వారి చేతుల్లో పెడుతున్న ఫోన్ ఇవాళ విశ్వరూపం చూపిస్తున్నదని అమేజాన్ సంస్థ తాజాగా కాంటార్ అనే ఏజెన్సీ ద్వారా నిర్వహించిన సర్వే చెబుతోంది. 10 మెట్రో, నాన్ మెట్రో నగరాల్లో 750 మంది తల్లిదండ్రులను సర్వే చేయగా 69 శాతం మంది ఇప్పుడు మొదలైన వేసవి సెలవుల్లో పిల్లలు మూడు గంటలకు మించి ఫోన్‌గాని కంప్యూటర్ స్క్రీన్గాని చూస్తున్నారని అంగీకరించారు. మొత్తం 85 శాతం మంది తమ పిల్లలు అవసరానికి మించి ఫోన్లు చూస్తున్నారని ఇందుకు తాము చాలా ఆందోళన చెందుతున్నామని తెలియచేశారు. అంతంత సేపు వాళ్లు ఫోన్ చూడటం వల్ల మజ్జుగా ఉండటమే కాదు సోమరులుగా తయారవుతున్నారు. నిద్ర లేమితో బాధపడుతున్నారు అని తెలియచేశారు. ► రెక్కలు కత్తిరించి అయితే ఈ తప్పు పిల్లలదా? వారు నిజంగా ఆడుకోరా? గెంతరా? అల్లరి చేయరా? అంటే చేస్తారు. కాని ఆటస్థలాలు లేకపోవడం, వీధుల్లో ఆడలేకపోవడం, అపార్ట్మెంట్లలో సెల్లార్లు ఉన్నా ఆడటానికి కమిటీలు అంగీకరించకపోవడం, పార్క్‌లు నామమాత్రంగా ఉండటం... వీటన్నింటి వల్ల రోజువారి జీవితంలో బడి నుంచి వచ్చాక మాత్రమే వారు ఫోన్ చేతిలోకి తీసుకునేవారు. తల్లిదండ్రుల ఉద్యోగాల వల్లో, పని వొత్తిడి వల్లో, పిల్లలతో గడిపే సమయం వారు తమ ఫోన్‌కు ఇస్తున్నందు వల్లో పిల్లలు ఫోన్ చూస్తున్నా చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. ఇప్పుడు వేసవి సెలవుల్లో వారికి ఆ అలవాటు వ్యసనం స్థాయికి వెళ్లడం, నివారిస్తే అలగడం మనస్తాపం చేస్తుండటంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. ► ఇలా చేయాలని ఉంది సర్వేలో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులను ‘మీ పిల్లలు ఈ సెలవుల్లో ఏం చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు’ అనే ప్రశ్నకు ఇంగ్లిష్ నేర్చుకోవడం (50 శాతం), నైతిక విషయాలు సంఘ మర్యాదలు తెలుసుకోవాలి (45 శాతం), కళలు నేర్చుకోవాలి (36 శాతం), ఆడుకోవడం విహారాలు చేయడం (32 శాతం) సమాధానం చెప్పాలి. అందరూ ఆశిస్తున్నది విజ్ఞానం వినోదం కలగలిసి ఉంటే బాగుంటుందని. ‘పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవాలని కోరుకుంటారు. ఫోన్ చూసే సమయాన్ని తగ్గించి కొత్త విషయాలు నేర్పించడంలో వారిని ఉత్సాహపరచాలని ఉంది అని చాలామంది తల్లిదండ్రులు మాతో అన్నారు’ అని సర్వే చేసిన కాంటార్ ఏజెన్సీ ప్రతినిధి తెలియచేశారు. ► మెల్లగా మళ్లించాలి స్క్రీన్ టైమ్‌ను తగ్గించాలంటే అది ఒక్కసారిగా బంద్ చేయకుండా మెల్లగా తగ్గించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఫోన్లు రీచార్జ్ చేయకుండా నిరుత్సాహ పరచడం, ఇంట్లో రౌటర్ ఉంటే దానిని తరచూ ఆఫ్ చేస్తూ ఉండటం, ఈ పుస్తకం చదివితే ఫోన్ ఇస్తాను, కాసేపు ఆడుకుంటే ఇస్తాను, ఫ్రెండ్స్‌ను కలిసి వచ్చాక ఇస్తాను అని వారిని దారి మళ్లించడం, విహారాలకు తీసుకెళ్లడం, ఆడుకునే సమయం– కథలు చదివే సమయం– ఫోన్ సమయం అని టైమ్ విభజించి ఆ టైమ్ పాటించడం... అలా మెల్లగా ఫోన్ టైమ్‌ను తగ్గించాలి. పిల్లలు ఫోన్ చూడటం వల్ల వారి మానసిక, బౌతిక స్థితుల కంటే వారు చూస్తున్నది ఆరోగ్యకరమైనదో కాదో పరిశీలించే తీరికలో కూడా తల్లిదండ్రులు లేకపోతే అట్టి సర్వేలకు అందనంత తీవ్ర ఆందోళన చెందాల్సిందే. -
సమ్మర్లో ఫారిన్ షూటింగ్ అంటున్న స్టార్ హీరోలు
సమ్మర్లో కూల్‌గా ఉండే లొకేషన్స్‌ని ఎంచుకుని, వెకేషన్‌కి వెళుతుంటారు కొందరు స్టార్స్. కొందరిని షూటింగే చల్లని ప్రాంతాలకు తీసుకెళుతుంది. అలా ‘కేరాఫ్ ఫారిన్’ అంటూ షూటింగ్స్‌కి, వెకేషన్‌కి విదేశాలు వెళ్లిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► రెండు వారాలుగా ఫారిన్లోనే ఉంటున్నారు ఇండియన్. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తైవాన్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతోంది. కమల్‌పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు శంకర్. ఈ వారం కూడా ‘ఇండియన్ 2’ టీమ్ సౌతాఫ్రికాలోనే ఉంటుందని తెలిసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ► ఇటలీలో ఫైట్స్ చేశారు ప్రభాస్. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగ ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గత నెలలో ఇటలీ లొకేషన్స్‌లో జరిగింది. ముఖ్యంగా ప్రభాస్‌పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ‘సలార్’ సినిమా యూనిట్ మరోసారి ఫారిన్ వెళ్లనుందని సమాచారం. బుడాపెస్ట్ లొకేషన్స్‌లో ‘సలార్’ షూటింగ్‌ను ప్లాన్ చేశారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ‘సలార్’ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కాగానే ‘సలార్’ కోసం ప్రభాస్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కుతారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ► లండన్‌లో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల లండన్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. గత వారం శర్వానంద్, కృతీపై కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించారు. ► బాలీవుడ్ ‘బడే మియా చోటే మియా’ లండన్‌కు షిఫ్ట్ అయ్యారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలోరూపొందుతున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను స్కాట్లాండ్లో చిత్రీకరించారు. అట్నుంచి అటు లండన్ వెళ్లారు. మరో పది రోజులపాటు లండన్ షెడ్యూల్ జరుగుతుందట. అలాగే మరో బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ షూటింగ్ కూడా లండన్‌లో జరిగింది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఫారిన్ లొకేషన్స్‌లో షూటింగ్స్‌ను ప్లాన్ చేశాయి. -
ఫ్యామిలీ వెకేషన్స్.. టాప్ 5 డెస్టినేషన్స్ ఇవే
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులంతా కలసి వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాల్లో గోవా, నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ టాప్–5గా ఉన్నట్టు ఓయో నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ – ఫ్యామిలీ ఎడిషన్ 2022’పేరుతో తన సర్వే వివరాలను ఒక నివేదిక రూపంలో ఓయో విడుదల చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలను ఆడించడం, వారినే అట్టిపెట్టుకోవడం కష్టమైన టాస్క్‌గా తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బదులు కొన్ని రోజుల పాటు కుటుంబమంతా కలసి విహారయాత్రకు వెళ్లి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘65 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి వేసవి సెలవులకు ట్రిప్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వేసవిలో లౌక్డౌన్లు ఉండడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణం’’అని ఓయో పేర్కొంది. జూన్ మొదటి రెండు వారాల్లో ఓయో ఈ సర్వే నిర్వహించింది. 1,072 మంది అభిప్రాయాలను సమీకరించింది. పిల్లలకు సదుపాయాలు ఇందులో 41 శాతం మంది తమ ఎంపిక గోవా అని చెప్పారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ ప్రదేశంగా దీన్ని భావిస్తున్నారు. ఆ తర్వా త నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్అబూ, పుదుచ్చేరి, మెక్లయోడ్ గంజ్, మహాబలేశ్వర్ ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను పరిశీలిస్తే తల్లిదండ్రులు ప్రకృతి సహజత్వం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, బీచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు ఓయో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ్ గాడ్ బోల్ పేర్కొన్నారు. హోటళ్లలో ఎంపికలను గమనిస్తే.. 56 శాతం మంది స్విమ్మింగ్ పూల్ ఉన్న హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిల్లల కోసం వారు స్విమ్మింగ్ పూల్, ఆటలాడుకునే ప్లే ఏరియా ను హోటళ్లలో కోరుకుంటున్నారు. ఆ తర్వాత వాటర్ పార్క్‌లు, పెద్ద టెలివిజన్ ఇతర సదుపాయాలు ఉంటే బావుంటుందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 1–3 రోజుల పాటు ట్రిప్‌కు వెళ్లొచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెబితే.. 38 శాతం మంది ఒక వారం రోజులైనా జాలీగా గడిపి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
స్వదేశీ పర్యాటకానికే మొగ్గు
సాక్షి, అమరావతి: కోవిడ్ తర్వాత దేశీయ పర్యాటకుల ఆలోచనలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నది. వేసవి పర్యాటకం అనగానే విదేశాలు ఎగిరిపోయే పర్యాటకులు ఈసారి స్వదేశీ పర్యాటకానికే మొగ్గు చూపారు. మొత్తం పర్యాటకుల్లో 94 శాతం మంది విదేశాల కంటే దేశంలోని చల్లటి ప్రదేశాలకు వెళ్లడానికే మొగ్గు చూపినట్లు ఓయో మిడ్ సమ్మర్ వెకేషన్ ఇండెక్స్ 2022 వెల్లడించింది. గతేడాది డిసెంబర్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ పర్యాటకులు విదేశీ ప్రయాణాలకు అంతగా ఇష్టపడడం లేదన్న విషయం ఆ సర్వేలో వెల్లడయ్యింది. స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్న వారిలో 58 శాతం మంది ఈ సారి జమ్ము అండ్ కాశ్మీర్‌లోని గుల్మార్గ్కు వెళ్లారు. అలాగే స్కాట్లాండ్కు వెళ్లాలనుకునేవారిలో 78 శాతం మంది కర్ణాటకలోని కూర్గ్‌కు పయనమయ్యారు. అదేవిధంగా అమెరికాలోని అలస్కాకు వెళ్లాలనుకునేవారిలో 67.9 శాతం మంది ఉత్తరాఖండ్‌లోని అలిని ఎంచుకున్నారు. వీటితోపాటు కులు, మనాలి, రిషికేష్, ఊటీ, సిక్కిం, అలెప్పీ, జిమ్ కార్బెట్ (ఉత్తరాఖండ్) వెళ్లడానికి అత్యధికంగా మొగ్గు చూపారు. బీచ్ అంటే గోవానే.. వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి బీచ్‌లకు వెళ్లాలనుకునేవారిలో అత్యధికమంది గోవాకే మొగ్గు చూపినట్లు వెల్లడయ్యింది. ఆ తర్వాతి స్థానంలో అండమాన్ నికోబార్, కేరళ బీచ్‌లున్నాయి. వాస్తవంగా వేసవిలో బీచ్ టూరిజం అంటే ముందుగా గుర్తుకొచ్చేది మాల్దీవులు. ఆ తర్వాతి స్థానాల్లో దుబాయ్, థాయ్‌లాండ్, అమెరికా బీచ్‌లున్నాయి. అలాగే కోవిడ్ భయంతో పర్యాటక రోజులను గణనీయంగా తగ్గించుకున్నారు. ఈ వేసవిలో 55 శాతం మంది తమ పర్యాటకాన్ని మూడు రోజుల్లోనే ముగించుకున్నారు. కొంతకాలంగా పర్యాటకుల ఆలోచనలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయని, వారాంతాల్లో అప్పటికప్పుడు దేశంలోని ప్రకృతి ప్రాంతాలను సందర్శించడానికి ఇష్టపడుతున్నారని ఓయో చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ పేర్కొన్నారు. కాగా, మన భారతీయులు సగటు పర్యాటక వ్యయాన్ని రూ.10,000లోపు పూర్తి చేయడానికే మొగ్గు చూపుతున్నారని సర్వేలో తేలింది. -
టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ!
జూన్ నెల వచ్చేసింది. కొత్త విద్యాసంవత్సరం మొదలు. పాత సమస్యలే కొత్తగా పుట్టుకొస్తాయి. ‘నేను కాలేజ్‌కి వెళ్లను’ అనిపిస్తుంది టీనేజ్ స్ట్రెస్. ఒత్తిడిని చేత్తో తీసేయడం కుదరదు... కానీ మంచి మాటలతో... ఒత్తిడి మూలాలకు మందు వేయవచ్చు వేసవి సెలవులు పూర్తవుతున్నాయి. అకడమిక్ క్యాలెండర్ మొదలవుతోంది. కొన్ని విద్యాసంస్థలు ఇప్పటికే క్లాసులు మొదలు పెట్టేశాయి. కొన్ని కొత్త విద్యాసంవత్సరానికి సిద్ధమవుతున్నాయి. టెన్త్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ కొత్త కాలేజీలో అడుగుపెట్టాలి. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న వాళ్లు గ్రాడ్యుయేషన్ కాలేజీల బాటపట్టాలి. అప్పటివరకు ఆత్మీయతలు పంచుకున్న స్నేహితులు మరోచోట చేరిపోయి ఉంటారు. కొత్త వాతావరణానికి అలవాటు పడాలి. కొత్త మనుషుల మధ్య మెలగాలి. కొత్త వాళ్లలో స్నేహితులను వెతుక్కోవాలి. కొత్త మిత్రులు అర్థం అవుతున్నట్లే ఉంటారు, అలాగని పూర్తిగా అర్థం కారు. గతంలో స్నేహితులు, శత్రువుల్లా కొట్టుకున్న తోటి విద్యార్థులు గుర్తు వస్తారు. అప్పటి శత్రువులు కూడా చాలా మంచివాళ్లనిపిస్తుంటుందిప్పుడు. అలాగని వెనక్కి వెళ్లలేరు, ముందుకు సాగాల్సిందే. ఇది చిన్న సంఘర్షణ కాదు. రెక్కలు విచ్చుకుంటున్న లేత మనసులకు అది విషమ పరీక్ష అనే చెప్పాలి. పిల్లలు రెండు రకాలు ‘‘కొత్త పుస్తకాలు, కొత్త డ్రస్‌లు, కొత్త కాలేజ్... పట్ల ఉత్సుకత, ఉత్సాహంతో ఉరకలు వేసే పిల్లలు ఒక రకం. వీళ్లలో టీనేజ్ స్ట్రెస్ వంటి ఇబ్బందులుండవు. కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి బెంబేలు పడే వాళ్ల విషయంలోనే తల్లిదండ్రులు జాగ్రత్తగా మెలగాలి. టెన్త్ పరీక్షలకు ముందు పిల్లలు విపరీతమైన ఆందోళనకు గురైతే అప్పటికి ధైర్యం చెప్పి పరీక్షలు రాయించి ఉంటారు. అయితే అలాంటి పిల్లలను కాలేజ్‌లో చేర్చే ముందే వాళ్లకు తగిన కౌన్సెలింగ్ ఇప్పించాలి. కొత్త వాతావరణంలో ఇమడలేకపోవడం అనేది అలాంటి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. పేరెంట్స్ తమకు నచ్చిన కాలేజ్ అని, మంచి కాలేజ్ అనే పేరుందని, అక్కడ చదివితే ఐఐటీలో సీటు వస్తుందని తమకు తామే నిర్ణయించేసి ఫీజులు కట్టేస్తారు. పిల్లలు ఆ కాలేజ్‌కి వెళ్లడానికి ఇష్టపడకపోతే ఫీజు వృథా అవుతుందేమో, బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోననే ఆందోళనతో పిల్లలను మరింత ఒత్తిడికి గురి చేస్తుంటారు’’ అని చెబుతున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ వీరేందర్. మౌనం వీడరు ఇక్కడ విచిత్రం ఏమిటంటే... పేరెంట్స్ ఎంత సున్నితంగా అడిగినా పిల్లలు పూర్తిగా ఓపెన్ కారు. అలాగే పేరెంట్స్ ఎంతగా కౌన్సెలింగ్ ఇచ్చినా అవన్నీ నీతిసూత్రాలే అవుతుంటాయి. అందుకే పిల్లలు ‘ఎప్పుడు ఆపేస్తారా’ అన్నట్లు చికాగ్గా ముఖం పెడతారు. ఒక కాలేజ్ కుర్రాడు కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులకు ఠంచన్‌గా లాప్టాప్తో సిద్ధమయ్యేవాడు. పేరెంట్స్ కూడా క్లాసులను జాగ్రత్తగా వింటున్నాడనే అనుకున్నారు. పరీక్షలు రాసిన తర్వాత తెలిసింది అస్సలేమీ చదవలేదని, పాఠాలు వినలేదని. ఆ ఏడాది మొత్తం లాప్టాప్లో వెబ్‌సీరీస్ చూశాడా కుర్రాడు. కొంతమంది జూనియర్ కాలేజ్‌లో యంత్రాల్లా చదివి చదివి విసిగిపోయి ఉంటారు. డిగ్రీ కాలేజ్‌కి వెళ్లగానే వాళ్లకందిన స్వేచ్ఛను ఎలా ఆస్వాదించాలో తెలియక అనేక దురలవాట్లకు బానిసలవుతుంటారు. స్వేచ్ఛ కూడా ఒత్తిడి చేసినంత నష్టాన్ని కలిగిస్తోంది. ఆ ఒత్తిడిని ఒక్కసారిగా తీసి పక్కన పెట్టినప్పుడు వచ్చే స్వేచ్ఛతో... అన్నింటికీ ‘ఇట్స్ ఓకే’ అనే కొత్త భాష్యం చెప్పుకోవడం మొదలైంది. చదవడం లేదా, బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా, క్లాసులు బంక్ కొడుతున్నారా, బ్యాక్ బెంచ్ స్టూడెంటా... అన్నింటికీ ఇట్స్ ఓకే ఫార్ములానే. దీంతోపాటు బ్యాక్లాగ్ లేని స్టూడెంట్స్ మీద కామెంట్స్ చేయడం కూడా. ఒక కప్పు కింద రెండు ప్రపంచాలు సమాజానికి ఆరోగ్యకరమైన ఒక కొత్త తరాన్ని ఇవ్వడం పేరెంట్స్ బాధ్యత. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన కారణంగా ఈ తరం పిల్లలు పేరెంట్స్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటున్నారు. చాలామంది పేరెంట్స్ ఆ డిజిటల్ ప్రపంచంలోకి ఎంటర్ కాలేని స్థితిలోనే ఉంటారు. అలాగే పేరెంట్స్ ప్రపంచంలో జీవించడానికి పిల్లలు ఇష్టపడరు. రెండు భిన్నమైన ప్రపంచాలు ఒకే ఇంట్లో నివసిస్తున్నాయిప్పుడు. ఈ క్లిష్టమైన స్థితిలో పేరెంట్స్ పిల్లలతో మరింత స్నేహంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. టీన్స్‌లోకి రాకముందు నుంచే వాళ్లతో స్నేహితులుగా మెలగాలి. పిల్లలు చెప్పే విషయాలను అనుమానించడం మాని అర్థం చేసుకోవాలి, అర్థవంతంగా విశ్లేషించడం మొదలుపెట్టాలి. ఒక తోటలో చిగురించిన మొలకను పెకలించి మరో చోట నాటితే మొదట వాడిపోతుంది. జాగ్రత్తగా చూసుకుంటే కొత్త వాతావరణానికి అలవాటు పడుతుంది. కొత్త చివుళ్లు వేస్తుంది. కొత్త మట్టిసారంలో మరింత ఏపుగా పెరుగుతుంది. ఈ దశలో నిర్లక్ష్యంగా ఉంటే మొక్క వాడిపోతుంది. పిల్లలు కూడా మొక్కల్లాంటి వాళ్లే. టీనేజ్ స్ట్రెస్ లక్షణాలిలా ఉంటాయి అస్థిమితంగానూ ఆత్రుతగానూ ఉండడం, త్వరగా అలసటకు లోనుకావడం, తరచుగా కడుపు నొప్పి, ఛాతీ నొప్పి అని చెప్పడం, కుటుంబ సభ్యులతో కలవకుండా దూరం పెంచుకోవడం, నిద్రలేమి లేదా విపరీతంగా నిద్రపోవడం, పనులను వాయిదా వేయడం, బాధ్యతల పట్ల నిర్లక్ష్యం... పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ఉపేక్షించరాదు. మొండి నిద్రపోతారు! కొత్త కాలేజ్‌లో అలవాటు పడలేని పిల్లల్లో ఆకలి మందగించడం, తిన్నది జీర్ణం కాకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా వస్తుంటాయి. నిజానికి ఆ లక్షణాలు దేహ అనారోగ్య లక్షణాలు కావు, మానసిక ఆందోళన ప్రభావంతో ఎదురయ్యే సమస్యలు. కాబట్టి మొదట పిల్లలను జాగ్రత్తగా గమనించాలి, అది నిఘా కాకూడదు. ఎనిమిదిన్నరకు కాలేజ్‌కి రెడీ కావాల్సిన పిల్లలు ఒక్కోసారి తొమ్మిది వరకు నిద్రలేవరు. ఎంత లేపినా సరే మొండిగా నిద్రపోతుంటారు. కాలేజ్ టైమ్ దాటిన తర్వాత వాళ్లే లేస్తారు. ఆ రోజుకు ఏమీ అడగకుండా వాళ్లనలా వదిలేయడమే మంచిది. కాలేజ్‌కి వెళ్లడానికి అయిష్టత వెనుక కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. – డా‘‘ సి. వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ , యు అండ్ మి – వాకా మంజులారెడ్డి -
హైకోర్టుకు 2 నుంచి వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు మే 2వ తేదీ నుంచి జూన్ 3వరకు వేసవి సెలవులని రిజిస్ట్రార్ జనరల్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమయంలో అత్యవసర కేసులను విచారించేందుకు వెకేషన్ కోర్టులు పనిచేస్తాయన్నారు. లంచ్ మోషన్, అత్యవసర కేసులు, ముందస్తు బెయిల్, బెయిల్ అప్లికేషన్లు, బెయిల్ అప్పీళ్లు, హెబియస్ కార్పస్ తదితర అత్యవసర కేసులను వెకేషన్ కోర్టులు విచారిస్తాయి. మే 2, 8, 16, 23, 30తేదీల్లో అత్యవసర కేసులను దాఖలు చేసుకోవాలి. వాటిని వరుసగా 5వ తేదీన న్యాయమూర్తులు జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్ నాగార్జునల ధర్మాసనం, మే 12న జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం, 19న జస్టిస్ అభిషేక్‌రెడ్డి, జస్టిస్ ఎం.సుధీర్ కుమార్ ధర్మాసనం, 26న జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పి.మాధవీదేవి ధర్మాసనం, జూన్ 2న జస్టిస్ జి.శ్రీదేవి, జస్టిస్ ఎం.లక్ష్మణ్‌ల ధర్మాసనం విచారణ జరుపుతాయి. ఆ తేదీల్లో సింగిల్ జడ్జి ధర్మాసనాలు వరుసగా న్యాయమూర్తులు జస్టిస్ ఎ.సంతోష్‌రెడ్డి, జస్టిస్ జి.అనుపమా చక్రవర్తి, జస్టిస్ జువ్వాడ శ్రీదేవి, జస్టిస్ ఎస్.నంద, జస్టిస్ ఎన్.తుకారాంజీల ఏకసభ్య ధర్మాసనాలు అత్యవసర కేసుల్ని విచారిస్తాయని నోటిఫికేషన్లో హైకోర్టు పేర్కొంది. -
రేపటి నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు చివరి పని దినాన్ని, వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటిం చింది. ఈనెల 26వ తేదీని ఆయా విద్యా సంస్థలకు చివరి పని దినంగా పేర్కొంది. 27వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది. పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు సెలవులపై ఆదివారం ఆన్లైన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, విద్యా శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించిన అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయగా, తాజాగా 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి పాఠశాలలు, జూనియర్ కాలేజీల ప్రారంభంపై జూన్ 1న సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వెనువెంటనే చివరి పని దినం, సెలవులపై ఇంటర్మీడియట్ బోరుŠడ్ కార్యదర్శి, పాఠశాల విద్య ఇంచార్జి డైరెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. పది రోజులుగా కోరుతున్న నేపథ్యంలో... రాష్ట్రంలో కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్/డిజిటల్ విద్యా బోధనను ప్రారంభించిన ప్రభుత్వం గత ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులతోపాటు ఇంటర్మీడియట్, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనకు అనుమతించింది. అదే నెల 24వ తేదీ నుంచి 6, 7, 8 తరగతులకు కూడా ప్రత్యక్ష బోధనకు ఓకే చెప్పింది. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో మార్చి 24 నుంచి విద్యా సంస్థలన్నింటికీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. ప్రత్యక్ష విద్యా బోధనను నిలిపివేసింది. అంతేకాదు మే 1 నుంచి నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్ పరీక్షలు, మే 17 నుంచి నిర్వహించాల్సిన టెన్త్ పరీక్షలపైనా ఈ నెల 15నే నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలను రద్దు చేయడంతోపాటు, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలను వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో తమకు కూడా సెలవులు ఇవ్వాలని, పెరుగుతున్న కరోనా కేసుల వల్ల పాఠశాలలకు వెళ్లి రావాలంటే భయంగా ఉందని టీచర్లంతా వాపోయారు. తాము స్కూళ్లకు వెళ్లి చేసేదేమీ లేకపోగా, కరోనా మహమ్మారి బారిన పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు సెలవులు ఇస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఆ విద్యార్థులంతా పాస్: సబితా ఇంద్రారెడ్డి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే టెన్త్ పరీక్షలు రద్దు చేసి, 5,46,865 మందిలో పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,392 మంది విద్యార్థులను పాస్ చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇపుడు 1 నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న 53,79,388 మంది విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేసినట్లు తెలిపారు. వారికి పరీక్షలేమీ ఉండవని స్పష్టంచేశారు. మొత్తంగా 59,26,253 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. తరగతుల వారీగా నమోదైన విద్యార్థులు తరగతి విద్యార్థుల సంఖ్య 1 60,5,586 2 6,23,571 3 6,37,563 4 6,28,572 5 6,14,862 6 5,86,231 7 5,77,412 8 5,60,417 9 5,45,174 10 5,46,865 -
మాల్దీవుల్లో వాలిపోయిన బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్!
సమ్మర్ వెకేషన్ మొదలైందో లేదో బాలీవుడ్ సెలబ్రిటీలు ‘ఛలో మాల్దీవులు’ అంటున్నారు. తాజాగా డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ తన భర్త డా.శ్రీరామ్ నానే, ఇద్దరు పిల్లలు ఆరిన్, రెయాన్లతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. తమ వినోద, విహారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇవి నెటిజనులను తెగ ఆకట్టుకుంటున్నాయి. వ్యూ ఆఫ్ ది డే...పేరుతో పడవ ప్రయాణం, చల్లటి తీయటి ఐస్‌క్రీమ్‌తో ఆనందం, క్యాండిల్ లైట్ డిన్నర్.. మొదలైన ఫొటోలు పోస్ట్ చేయడమే కాకుండా తనదైన శైలిలో వాటికి వ్యాఖ్యలు జోడించారు మాధురీ. కుటుంబ సభ్యులతో మాల్దీవులలో మాధురీ దీక్షిత్ మరి శ్రీరామ్ ఏమైనా తక్కువ తిన్నాడా! ఆమెతో దిగిన సెల్ఫీలకు ప్రేమకవిత్వంలాంటి పంక్తులు జోడించాడు. అంతే కాదు తన కాలేజీ రోజుల నాటి ఫొటోకు, కుమారుడి ఫొటో జోడించి ‘ఎవరు వీరు?’ అనే ప్రశ్న వేశాడు. జవాబు కూడా తానే సరదాగా చెప్పాడు... -
సుప్రీంకోర్టు సెలవుల రద్దు!
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కేసుల విచారణపై ప్రభావం చూపినందున ఈసారి వేసవి సెలవులను త్యాగం చేసేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. మే 17న ప్రారంభం కానున్న సెలవులను రద్దు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు 50 రోజులుండే వేసవి సెలవు దినాల్లో కేవలం అత్యవసర కేసులు మాత్రమే విచారణకొస్తాయి. అయితే ఈసారి అందుకు భిన్నంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే సెలవులను రద్దు చేసే దిశగా నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తుల్లో సగానికి పైగా మంది వేసవిలోనూ పని చేయనున్నారు. (లిక్కర్‌పై సుప్రీంకోర్టుకెక్కిన తమిళనాడు) లాక్డౌన్ వల్ల ఇప్పటికే పని దినాలను కోల్పోయామని, కాబట్టి వేసవి సెలవులను తగ్గిస్తూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారించాలని జస్టిస్ ఎల్ఎన్ రావుతో కూడిన న్యాయమూర్తుల కమిటీ సిఫారసు చేసింది. దీంతో భారత అత్యున్నత న్యాయస్థానం కేసుల విచారణ కోసం ఏడు వారాల వేసవి సెలవులను తగ్గించుకోనుంది. అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాయర్లు, జడ్జులు, ఇతర న్యాయ సిబ్బందికి కూడా కొత్త డ్రెస్ కోడ్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు సెలవులను తగ్గించుకున్న విషయం తెలిసిందే. (ఆన్లైన్లో మద్యం విక్రయంపై ఆలోచించండి) -
నేటి నుంచే బడులు
సాక్షి, హైదరాబాద్ : వేసవి సెలవులు ముగించుకొని పాఠశాలలు బుధవారం ప్రారంభం కాబోతున్నాయి. బుడిబుడి అడుగులు వేస్తూ విద్యార్థులు బడులకు వెళ్లనున్నారు. బ్యాగులనిండా పుస్తకాలను వేసుకొని భుజాలు వంగిపోతున్నా రాష్ట్రంలోని 65,29,072 మంది విద్యార్థులు 42,834 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బ్యాగు బరువు తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో విద్యార్థులకు తంటాలు తప్పడం లేదు. మరోవైపు పెరిగిన ఫీజుల భారం తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారినా తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లించేందుకు సిద్ధమయ్యారు. 20 శాతం నుంచి 30 శాతం వరకు ఫీజలను పెంచినా.. వాటిని నియంత్రించే చర్యలు లేకపోవడంతో అప్పులు చేసైనా చెల్లించే ఏర్పాట్లు చేసుకున్నారు. పాఠశాలల్లోనూ సమస్యలు ఎలాగూ దర్శనమిచ్చే పరిస్థితే ఉంది. కొన్ని స్కూళ్లలో బోధించే టీచర్లు లేరు. దాదాపు 15 వేల మంది విద్యా వలంటీర్ల సర్వీసు ఇంకా రెన్యువల్ కాలేదు. నాలుగైదు రోజుల్లో వారి నియామకానికి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే రిటైర్ అయిన స్థానాల్లో విద్యా వలంటీర్లు లేక కొన్ని పాఠశాల్లో టీచర్లు ఉండని పరిస్థితి నెలకొంది. ఆయా పాఠశాలల్లోనూ విద్యా వలంటీర్లను నియమించేందుకు చర్యలు చేపట్టాలని, వర్కర్లను నియమించుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఎటూ తేలని ఫీజుల నియంత్రణ... ఫీజుల నియంత్రణ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఎప్పటిలాగే యాజమాన్యాలు ఈసారి ఫీజులను భారీగా పెంచేశాయి. 20 శాతం నుంచి 30 శాతం వరకు పెంచడంతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పెరిగింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాల గతేడాది ఒకటో తరగతికి రూ. 45 వేలు వసూలు చేయగా, ఈ సారి ఆ విద్యార్థి రెండో తరగతికి వచ్చే సరికి రూ.53 వేలకు పెంచింది. కరీంనగర్‌లోని మరో ప్రైవేటు పాఠశాలలో గత ఏడాది ఎల్కేజీకి రూ.25 వేలు వసూలు చేయగా, ఈసారి రూ.32 వేలకు పెంచింది. రాష్ట్రంలోని ప్రముఖ పాఠశాలలన్నింటిలో దాదాపు ఇదే పరిస్థితి. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. దీంతో గతేడాది ఫీజులను పెంచవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం, దానిపై ప్రైవేటు పాఠశాలలు కోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. దీంతో యాజమాన్యాలు ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం తాము ఫీజుల నియంత్రణకు తాము చర్యలు చేపడుతున్నామని, తిరుపతిరావు కమిటీ నివేదికపై పరిశీలన జరుపుతున్నామని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినా ఇంకా తీర్పు వెలువడలేదు. బ్యాగు బరువుపై చర్యలు శూన్యం రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల బ్యాగు బరువు తగ్గించేందుకు 2017లోనే ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో 22) జారీ చేసింది. కానీ ఉత్తర్వుల అమలుపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించిన సందర్భమే లేదు. కేవలం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను డీఈవోలకు పంపి చేతులు దులుపుకున్నారు. దీంతో బ్యాగు బరువు అమలుకు నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని అనేక ప్రైవేటు పాఠశాలలు ఈ–స్కూల్, టెక్నో కరిక్యులమ్, ఒలంపియాడ్ తదితర 65 రకాల ఆకర్షనీయ పేర్లతో విద్యార్థులపై పుస్తకాల బరువుతోపాటు ఆర్థిక భారం మోపుతున్నాయి. ప్రభుత్వ సిలబస్ విద్యార్థుల పుస్తకాలకు రూ.600 మించి కాకపోగా ప్రైవేటు స్కూల్స్ పుస్తకాలకు కనీసంగా రూ.3 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. విద్యాశాఖ దీనిపై ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టడం లేదు. బ్యాగు బరువుపై ప్రభుత్వం ఏం చెప్పిందంటే.. ప్రైవేటు పాఠశాలల్లో ఎస్సీఈఆర్టీ నిర్ధేశిత పుస్తకాలనే వాడాలని, పైగా బ్యాగుతో సహా 1, 2 తరగతులకు 1.5 కిలోలే బరువు ఉండాలని.. 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోలు.., 7 తరగతుల బరువు 4 కిలోలకు మించకూడదని.. 8, 9, 10 తరగతుల బరువు 4.5 నుంచి 5 కిలోల లోపే ఉండాలని స్పష్టం చేసింది. కానీ వాటిని పక్కాగా అమలు చేయడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైంది. ఈనెల 14 నుంచి బడిబాట... రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 19వ తేదీ వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహించాలని విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. నిర్వహణ వ్యయం కింద ఒక్కో పాఠశాలకు రూ. 1000 చొప్పున నిధులను విడుదల చేసింది. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచిత యూనిఫారాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ నిధుల కొరతతో ఇంకా ఇది క్లాత్ కొనుగోలు దశలోనే ఉండటం గమనార్హం. -
జూన్ 30వరకు సుప్రీంకోర్టుకు సెలవులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు నేటి నుంచి వేసవి సెలవులు కావడంతో అత్యవసర వ్యాజ్యాల విచారణను ప్రత్యేక ధర్మాసనాలు చేపట్టనున్నాయి. నేటి(సోమవారం) నుంచి జూన్ 30వరకు సెలవులు ఉండటంతో.. సెలవు దినాల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. మే 13 నుంచి 20వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది. మే 21 నుంచి 24 వరకు జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, మే 25 నుంచి మే 30వరకు సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, మే 31 నుంచి జూన్ 2వరకు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, జూన్ 3నుంచి జూన్ 5వరకు జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, జూన్ 6 నుంచి జూన్ 13 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగి ధర్మాసనం విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే జూన్ 14 నుంచి జూన్ 30 వరకు ధర్మాసనాల వివరాలను తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు వర్గాలు తెలియజేశాయి. -
13 నుంచి సుప్రీంకు సెలవులు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నెల 13 నుంచి జూన్ 30వరకు సెలవులు ఉండటంతో.. సెలవు దినాల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. మే 13 నుంచి 20వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం పిటిషన్లను విచారించనుంది. మే 21 నుంచి 24 వరకు జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, మే 25 నుంచి మే 30వరకు సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, మే 31 నుంచి జూన్ 2వరకు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, జూన్ 3నుంచి జూన్ 5వరకు జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం, జూన్ 6 నుంచి జూన్ 13 వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగి ధర్మాసనం విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే జూన్ 14 నుంచి జూన్ 30 వరకు ధర్మాసనాల వివరాలను తర్వాత వెల్లడిస్తామని సుప్రీంకోర్టు వర్గాలు తెలియజేశాయి. -
పోజు ప్లీజ్!
బాలీవుడ్లో వన్నాఫ్ ది బెస్ట్ కపుల్స్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ మాల్దీవుల్లో మస్త్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సమ్మర్ వెకేషన్‌తో పాటు పెళ్లి రోజు సంబరాల్ని కూడా అక్కడే జరుపుకున్నారీ దంపతులు. అప్పుడు ఆరాధ్య పోజు ప్లీజ్ అంటే, కూతురి కెమెరాకి ఇద్దరూ పోజు ఇచ్చినట్లున్నారు. ‘‘ఈ ఫొటోను మా జీవితాల వెలుగు దివ్వె అయిన ఆరాధ్య తీసింది’’ అంటూ పైన ఉన్న ఫొటోను షేర్ చేశారు ఐశ్వర్యారాయ్. ఇది అభిషేక్ అండ్ ఐశ్వర్యాల 12వ వివాహ వార్షికోత్సవం కావడం విశేషం. న్యూయార్క్‌లో జరిగిన ‘గురు’ ప్రీమియర్ షో సమయంలో ఐశ్వర్యకు ప్రపోజ్ చేశారు అభిషేక్. ఆ తర్వాత 2007 ఏప్రిల్ 20న వీరిద్దరి వివాహం జరిగింది. 2011 నవంబరులో ఆరాధ్యకు జన్మనిచ్చారు ఐశ్వర్య. ‘గురు’ సినిమాకు ముందు ‘టాయి అక్షర్ ప్రేమ్ కే’ (2000), ‘కుచ్ నా కహో’ (2003) చిత్రాల్లో కలిసి నటించారు ఐశ్వర్య అండ్ అభిషేక్. ఇప్పుడు ‘గులాబ్ జామ్’ అనే చిత్రంలో జంటగా నటించనున్నారు. -
ఈ నెల 21వరకు స్కూళ్లకు సెలవులు
-
సరస్వతీ నమస్తుభ్యం..
►మోగిన బడిగంట.. సర్కారు బడిలో సమస్యల స్వాగతం ►పిల్లలతోనే గదుల శుభ్రం ►పలు స్కూళ్లలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు ►సమాచారం లేక వెనుదిరిగిన విద్యార్థులు సిటీబ్యూరో: సుధీర్ఘ వేసవి సెలవుల అనంతరం సోమవారం బడిగంట మోగింది. నిన్నమొన్నటి వరకు సెలవులను ఎంజాయ్ చేసిన విద్యార్థులు తాజాగా పుస్తకాలను భుజాన వేసుకొని బడిబాట పట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎప్పటిలాగే దుమ్ముపట్టిన బెంచీలు..కుర్చీలు, బూజు పట్టిన గదులు స్వాగతం పలుకాయి. వారే గదులను శుభ్రం చేసుకున్నారు. ఇక ప్రైవేటు స్కూళ్లు ‘వెల్కమ్.. బ్యాక్ టు స్కూల్’ బోర్డులతో ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులకు ఘనస్వాగతం పలికాయి. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లే బస్సులు, ఆటోలతో పాటు తల్లిదండ్రులు సొంత వాహనాలతో రోడ్డెక్కడంతో రహదారులపై ట్రాఫిక్ స్తంభించింది. ఈదిబజార్, జీజీహెచ్ఎస్ ఫలక్‌నుమా, జీహెచ్ఎస్ కోట్ల అలిజా, జీహెచ్ఎస్ చాంద్రాయణగుట్ట, మైసారం, వహర్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాల, బోరబండ నాట్కో పాఠశాల, ఎన్బీటీ నగర్, ఎర్రమంజిల్ హైస్కూల్స్, వనస్థలిపురం, సాహెబ్‌నగర్ తదితర పాఠశాలల్లో ఉదయం టెన్త్ సప్లిమెంటర్ పరీక్షలు జరిగాయి. ఈ విషయం తెలియక ఉదయమే స్కూలుకు చేరు కున్న విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. సమస్యల స్వాగతం.. ఎంసీహెచ్ క్వార్టర్స్‌లోని బౌలి గులాబ్‌సింగ్ హైస్కూల్ వరండా పూర్తిగా చెత్తాచెదారం, బీరు బాటిళ్లతో నిండిపోయింది. తరగతి గదులలో వర్షపునీరు చేరింది. టేబుళ్లు, కుర్చీలు దుమ్ముపట్టి దర్శనిమిచ్చాయి. పాఠశాలలో 55 మంది విద్యార్థులు ఉండగా, తొలి రోజు ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. డోర్బస్తీలోని ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ మరాఠి మీడియం పాఠశాలలో బాత్రూమ్లు శిధిలావస్థకు చేరాయి. పైకప్పు నుంచి వర్షపునీరు కారుతోంది.పాతబస్తీలోని రియాసత్‌నగర్ డివిజన్లోని దర్గా బర్హానే షా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు గదులను విద్యార్థులతో కడిగించారు. ఉదయాన్నే పాఠశాలకు విచ్చేసిన విద్యార్థులకు చీపుర్లు, నీటి డబ్బాలు, డస్టర్లు ఇచ్చి పనిచెప్పారు. గౌలిపురా అయోధ్యనగర్‌లోని జీబీహెచ్‌ఎస్ శాలిబండ పాఠశాలలో బెంచీలు లేకపోవడంతో విద్యార్థులు నేలపై కూర్చుకున్నారు.పురానాపూల్‌లోని ప్రభుత్వ హిందీ పాఠశాల గేటు తాళాలు ఉదయం 9 గంటల వరకు తీయకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వర్షంలో తడవాల్సి వచ్చింది.గొల్లకిడికిలోని గ్యాబ్రిల్ చారిటబుల్ స్కూల్లో అనేక మంది విద్యార్థులు ఉన్నప్పటికీ.. సరైన సౌకర్యం లేకపోవడంతో మెట్లపైన కూర్చోవాల్సి వచ్చింది.వనస్థలిపురం కమలానగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో రికార్డు ప్రకారం 40 మంది విద్యార్థులు ఉండగా.. ఉదయం 9.30 వరకు ఒక్క విద్యార్థి కూడా హాజరు కాలేదు. ఎల్బీనగర్లోని ప్రాథమిక పాఠశాలలో అటెండర్ లేకపోవడంతో విద్యార్థులు, ప్రధానోపాధ్యాయుడే గంట కొట్టారు.నేరేడ్మెట్ పాఠశాలలో సుమారు 80 మంది విద్యార్థులకుగాను సుమారు 30 మంది, వాజ్‌పేయినగర్‌లో 130 మందికి సుమారు 50 మంది విద్యార్థులు హాజరయ్యారు.మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని పాఠశాలల్లో తొలిరోజు ఉదయం ప్రార్థన (8.45) సమయానికి ఉపాధ్యాయుల్లో చాలా మంది హాజరు కాలేదు. ఆసిఫ్‌నగర్ మండలం గోల్కొండ జోన్ పరిధిలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యావలంటీర్లు ఆలస్యంగా పాఠశాలకు చేరుకున్నారు. -
సమ్మర్.. విహారం గ్రేటర్
వేసవి సెలవుల్లో దేశ, విదేశాలను చుట్టొచ్చిన హైదరాబాదీలు - గతేడాది కంటే ఈ సీజన్లో 33 శాతం అధికం - యాత్రా డాట్‌కామ్ సర్వేలో వెల్లడి - మార్చి–మే మధ్య 1.58 లక్షల మంది విదేశీ పర్యటనలు - మరో 4.35 లక్షల మంది దేశీయ విమానాల్లో రాకపోకలు సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లో విదేశీ, స్వదేశీ పర్యటనలతో ‘గ్రేటర్’వాసులు ఆహ్లాదంగా గడిపారు. గతేడాది కంటే ఈ ఏడాది దాదాపు 33 శాతం అధికంగా దేశ, విదేశాలకు విమాన ప్రయాణాల చేశారు. యాత్రా డాట్‌కామ్ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది మార్చి–మే మధ్యకాలానికిగాను ఈ సర్వే చేశారు. దేశంలోని పర్యాటక స్థలాలను విమానాల్లో చుట్టొచ్చిన వారి సంఖ్య 50 శాతం పెరగగా.. విదేశీ పర్యటనలు చేసినవారి సంఖ్య 33 శాతం పెరిగినట్లు అందులో వెల్లడైంది. పర్యాటక ప్యాకేజీలు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులోకి రావడంతో ఇలా పర్యటనలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. యాత్ర ఏదైనా.. విమాన ప్రయాణమే! గ్రేటర్ నగరానికి ఆణిముత్యంలా ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిత్యం 400 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వాటిలో సుమారు 40 వేల మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ వేసవి సెలవుల్లో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, గోవా, కేరళ, ముంబై, విశాఖపట్నం, చెన్నై, హిమాచల్‌ప్రదేశ్ వంటి పర్యాటక స్థలాలకు వెళ్లేందుకు సుమారు 4.35 లక్షల మంది విమానాలనే ఎంచుకున్నట్లు సర్వేలో గుర్తించారు. ఇక సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్, కౌలాలంపూర్, లండన్, ఆమ్స్టర్డ్యామ్ వంటి అంతర్జాతీయ నగరాలకు సుమారు 1.58 లక్షల మంది వెళ్లినట్లు అంచనా వేశారు. ఈ నగరాలకు భలే డిమాండ్ హైదరాబాద్ నుంచి విదేశాల పర్యటనకు వెళ్లేవారిని పరిశీలిస్తే.. అత్యధికులు సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ నగరాలకు వెళ్లినట్లు తెలిసింది. తర్వాత కౌలాలంపూర్, లండన్, ఆమ్స్టర్డ్యామ్ నగరాలకు పర్యటన చేసినట్లు తేల్చారు. మన దేశంలో గోవా, కేరళ, ఊటీ, కొడైకెనాల్, కులు, మనాలీ వంటి ప్రదేశాలను చుట్టివచ్చేందుకు గ్రేటర్ వాసులు మక్కువ చూపుతున్నారని చెబుతున్నారు. మధ్య తరగతిలో భలే క్రేజీ కాస్మొపాలిటన్ నగరంగా మారిన గ్రేటర్లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలతోపాటు ఐటీ, బీపీఓ, కేపీఓ, రియల్టీ, సేవా రంగాల్లో పనిచేస్తున్నవారు ఇటీవలికాలంలో విమాన ప్రయాణాలంటే మక్కువ చూపుతున్నారు. వారి అభిరుచికి, బడ్జెట్‌కు తగినట్లుగా కాక్స్‌అండ్ కింగ్స్, థామస్ కుక్, యాత్రా డాట్‌కామ్, సదరన్ ట్రావెల్స్, బుకింగ్ డాట్‌కామ్ వంటి టూరిస్టు ఆపరేటర్లు, ఆన్లైన్ బుకింగ్ ఏజెన్సీలు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. దీంతో విమానాల్లో పర్యాటక, దర్శనీయ స్థలాలకు వెళ్లేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. -
మాల్దీవుల్లో మస్త్ మజా
సముద్రపు లోతుల్లోకి వెళ్లి లోపల ఎలా ఉందో చూడాలనుకుంటే... ఏదైనా ఫొటోల్లో చూడు. అంతేకానీ సముద్రంలోకి వెళ్లాలనుకోవద్దు... పిరికివాళ్లు అనే మాట ఇది. అదే శ్రియలాంటి ధైర్యసాహసాలున్న అమ్మాయి అయితే సముద్రంలోకి వెళుతుంది. నీటి లోపల అందాన్ని తనివి తీరా ఆస్వాదించేస్తుంది. శ్రియ ఇటీవల అదే చేశారు. పిల్లలందరూ సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఈ బ్యూటీ కూడా ఓ వెకేషన్ ప్లాన్ చేసుకున్నారు. మాల్దీవులు వెళ్లారు. అక్కడ స్కూబా డైవింగ్ చేశారు. అలాగే బోటు షికారుని ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో దిగిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టారామె. మాల్దీవుల్లో మస్త్ మజా చేసి, మళ్లీ వచ్చేవరకూ ‘టాటా’ అంటూ, ఇండియా వచ్చేశారు. శ్రియ స్కూబా డైవింగ్ చేయడం ఇది ఫస్ట్ టైమ్ కాదు. అంతకుముందు చాలాసార్లు చేశారు. ఏడాదికోసారి కంపల్సరీగా డైవ్ చేయాల్సిందే. -
కొత్త తరగతిలోకి...
⇒నేటి నుంచి నూతన విద్యా సంవత్సరం ⇒ఇప్పటికే పాఠశాలలకు చేరిన పాఠ్యపుస్తకాలు ⇒ పలు స్కూళ్లలో వేధిస్తున్న సమస్యలు కాళోజీ సెంటర్ : ఆనవాయితీకి భిన్నంగా మూడు నెలల ముందుగానే కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవుతోంది. పాఠశాల విద్యావ్యవస్థలోనే తొలిసారి వేసవి సెలవులకు ముందే సీబీఎస్ఈ విధానం తరహాలో నూతన విద్యా సంవత్సరం మంగళవారం ఆరంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో తీసుకొచ్చిన మార్పుల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. సాధారణంగా ఏటా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. కానీ ఈసారి విద్యార్థులు మంగళవారమే పై తరగతులకు ప్రమోట్ కానున్నారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం, వరంగల్ రూరల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ముందస్తు విద్యా సంవత్సరానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పాఠశాలలకు ఎక్కువ శాతం పాఠ్యపుస్తకాలు చేరగా మిగిలినవి త్వరలోనే అందుతాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 644 పాఠశాలలు జిల్లాలో అన్ని యాజమన్యాలవి కలిపి 644 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 455, ప్రాథమికోన్నత పాఠశాలలు 76, ఉన్నత పాఠశాలలు 133 ఉండగా, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు కూడా కొనసాగుతున్నాయి. వీటన్నింట్లో కూడా సోమవారం నుంచే నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎప్పుడూ ఏప్రిల్ 23 వరకు జరగాల్సిన 1నుంచి 9వ తరగతుల వార్షిక పరీక్షలను ఈనెల 16వరకే ముగించేశారు. అలాగే, జవాబు పత్రాలను మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులు మంగళవారం విద్యార్థులకు ఫలితాలు వెల్లడించనున్నారు. పాఠశాలలకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు పాఠశాలల ప్రారంభం రోజున చేతిలో నూతన తరగతి పాఠ్యపుస్తకాలు ఉండాలన్న విద్యార్థులు, తల్లిదండ్రుల లక్ష్యం నెరవేరబోతోంది. ఈ మేరకు విద్యాశాఖ అదికారులు అవసరమైన మేరకు పాఠ్యపుస్తకాలను పాఠశాలలకు చేర్చారు. విద్యాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలోని 664 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అన్ని టైటిళ్లు కలిపి 3,05,900 పాఠ్యపుస్తకాలు అవసరం. ఇందులో 80శాతం మేర పాఠ్యపుస్తకాలు మండలాలకు చేరుకున్నాయి. ఎంఈఓ కార్యాలయాల నుంచి పాఠశాలలకు చేర్చే ప్రక్రియ కూడా చురుకుగా కొనసాగుతోంది. అలాగే, త్వరలోనే విద్యార్థులకు యూనిఫాం కూడా పంపిణీ చేయనున్నారు. సమస్యల స్వాగతం ఎప్పటిలాగా ఈసారి కూడా ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలు విద్యార్థులకు స్వాగతం పలకనున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు మండిపోతుండగా.. పలు పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడంతో సమస్యగా మారనుంది. అలాగే, మధ్యాహ్న భోజన నిర్వాహకులు సైతం ఇబ్బంది పడక తప్పదని చెప్పాలి. ఇంకా పలు పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం లేకపోగా.. ఉన్న వాటిలో ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కబోత నడుమే విద్యార్థులు పాఠాలు వినాల్సి వస్తుంది. ఇక ఉపాధ్యాయుల కొరత ఎలాగూ ఉంటుంది. ఇలా పలు సమస్యల నడుమే కొత్త విద్యాసంవత్సరం ఆరంభం కానుండగా.. అధికారులు స్పందించి సౌకర్యాల కల్పనకు కృషి చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మేలో 97 లక్షల శ్రీవారి లడ్డూల అమ్మకాలు
సాక్షి, తిరుమల: వేసవి సెలవుల్లో పెరిగిన భక్తులకు అనుగుణంగా మే నెలలో రికార్డు స్థాయిలో 97.27 లక్షల తిరుమల శ్రీవారి లడ్డూల అమ్మకాలు జరిగాయి. టీటీడీ చరిత్రలో ఒక నెలలో ఇన్ని లడ్డూలను భక్తులకు వితరణ చేయటం ఇదే తొలిసారి. 2013 లో మేలో 72.33 లక్షలు, 2014లో 80.84 లక్షలు, 2015లో 89.84 లక్షలు అందజేయగా ఈసారి మాత్రం 97.24 లక్షలు పంపిణీ చేశారు. టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు పర్యవేక్షణలో రోజుకు 6 లక్షల లడ్డూలకు తగ్గకుండా నిల్వ ఉంచుకుని కొరత లేకుండా పంపిణీ చేశారు. తగ్గని రద్దీ: తిరుమలలో వేసవి సెలవుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. శనివారం కాలిబాట భక్తుల క్యూలో జరిగిన తోపులాటలపై టీటీడీ ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిబాట భక్తుల క్యూ వద్ద లగేజీ డిపాజిట్ చేసుకునేందుకు వీలుగా వసతులు కల్పించారు. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 67,113 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లు నిండాయి. వీరికి 15 గంటలు, కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. -
వేసవి భోజనం తింటున్నది 27 శాతం లోపే
విద్యాశాఖ అంచనా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం తింటున్న విద్యార్థుల సంఖ్య 27 శాతంలోపే ఉందని విద్యాశాఖ అంచనాకు వచ్చింది. ఈనెల 21న ప్రారంభించిన వేసవి మధ్యాహ్న భోజన పథకం అమలుపై విద్యాశాఖ పరిశీలన చేపట్టగా, ప్రాథమిక పాఠశాలల విద్యార్థులే ఎక్కువ మంది ఈ భోజనం తింటున్నట్లు వెల్లడైంది. ఉన్నత పాఠశాలల విద్యార్థులు కొద్ది మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తినేందుకు వస్తున్నట్లు గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 21వ తేదీన 5,77,503 మంది (23.92 శాతం), 22వ తేదీన 6,15,314 మంది (25.49 శాతం), 23వ తేదీన 6,28,383 మంది (26.03 శాతం), 24వ తేదీన 5,64,186 మంది (23.37 శాతం) మధ్యాహ్న భోజనం తిన్నట్లు లెక్కలు తేల్చింది. పక డ్బందీగా టెట్ జంబ్లింగ్ వచ్చే నెల 1వ తేదీన నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షలో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడేందుకు కొందరు పన్నిన కుట్రను గుర్తించిన విద్యాశాఖ, పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపటి ్టంది. ఇదే అంశంపై సోమవారం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతో చర్చించింది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సంబంధిత పరీక్ష కేంద్రంలోనే ఫీజులు చెల్లించి, వరుసగా హాల్‌టికెట్లు పొందిన వారిని ఆయా పరీక్ష కేంద్రంల్లోనే వేర్వేరు గదుల్లో, వరుస క్రమంలో కాకుండా, సీటింగ్ వేర్వేరుగా ఉండేలా చర్యలు చేపట్టింది. -
వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
హెచ్ఎంలకు బాధ్యతల అప్పగింత ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో టిఫిన్, రెండుపూటలా భోజనం విద్యారణ్యపురి : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ఎస్సీ, ఎస్టీ గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజనం అమలు చేయబోతున్నారు. ఈ మేరకు ఆయూ పాఠశాలల హెచ్ఎంలకు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులు వివరాలు వెల్లడించారు. హైస్కూళ్లలో ఎక్కువమంది విద్యార్థులున్నచోట హెచ్‌ఎంతోపాటు మరో టీచర్ కూడా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉదయం 8 గంటలకు విద్యార్థులు పాఠశాలకు వచ్చి కాసేపు ఆడుకున్నాక 10 గంటలకు భోజనం పెట్టాలి. ఈ నెల 21 నుంచి ఆదివారాలతో కలిపి మొత్తం 53 రోజులపాటు ఈ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు టిఫిన్‌తో సహా మధ్యాహ్నం, రాత్రి భోజనం అందుబాటులో ఉంచాలి. వివిధ రెసిడెన్షియల్ స్కూళ్లు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులు వేసవి సెలవుల్లో ఏ మండలంలో ఉంటే అక్కడి రెసిడెన్షియల్ స్కూల్‌కు కూడా వెళ్లి భోజనం చేయవచ్చు. జిల్లాలో 25 చోట్ల బాలురకు, 25చోట్ల బాలికలకు రెసిడెన్షియల్‌గా కూడా మధ్యాహ్న భోజనం అందించబోతున్నారు. ఈనెల 25 నుంచి గురుకుల, ఆశ్రమ పాఠశాలల్లో దీన్ని అమలుచేయబోతున్నారు. కాగా, విధులు నిర్వహించే హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు పీపీఎల్ లీవ్స్ ఇచ్చే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు. భోజనం అమలుపై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు అందనున్నారుు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, అదనపు జేసీ తిరుపతిరావు, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ బాలయ్య, డీఈవో పి రాజీవ్, ఐటీడీఏ పీవో ఆమయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 2,46, 811 మంది.. జిల్లాలో అన్ని ప్రభుత్వ స్కూళ్లలో కలిపి 2,46, 811 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సుమారు 40 శాతం మంది మధ్యాహ్న భోజనానికి వస్తారని అంచనా. కాగా, అన్ని పాఠశాలలకు 53 రోజులకు సరిపడా సుమారు 999.457 మెట్రిక్‌టన్నుల బియ్యం పంపిణీ చేయబోతున్నారు. అలాగే వంట ఖర్చుల కింద రూ 3.55 కోట్లు అవసరమని విద్యాశాఖాధికారులు అంచనా వేశారు.