కాళేశ్వరంపై విచారణ వేసవి సెలవులు ముగిశాకే.. | Investigation on Kaleswaram after summer holidays | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై విచారణ వేసవి సెలవులు ముగిశాకే..

Published Thu, Apr 11 2024 4:37 AM | Last Updated on Thu, Apr 11 2024 4:37 AM

Investigation on Kaleswaram after summer holidays - Sakshi

సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ  

తెలంగాణలోని 4 కోట్ల మందికి చెందిన రూ.లక్ష కోట్లకు సంబంధించిన అంశమన్న పిటిషనర్‌

జూన్‌ తర్వాతకు వాయిదా వేసిన హైకోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లలో విచారణను హైకోర్టు వేసవి సెలవుల (జూన్‌) తర్వాతకు వాయిదా వేసింది. సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌తో పాటు బక్క జడ్సన్‌ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ప్రధానన్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. కేఏ.పాల్‌ వాదనలు వినిపిస్తూ.. ‘దేశంలోనే అత్యంత అవినీతి జరిగిన ప్రాజెక్టు కాళేశ్వరం. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణలోని 4 కోట్ల మందికి చెందిన రూ.లక్ష కోట్లకు సంబంధించిన అంశం ఈ ప్రాజెక్టు. సీబీఐ దర్యాప్తుతోపాటు భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వినియోగించుకునేలా నిపుణుల కమిటీని కూడా వేయాలి.

ఎన్నికలకు ముందు పలు సభలు, సమావేశాల్లో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్‌ అధికారంలోని రాగానే మాట మార్చారు. సీబీఐ విచారణ కోరకుండా.. రిటైర్డ్‌ జడ్జితో విచారణ అంటున్నారు’అని పేర్కొన్నారు. ఈ కేసులో సీఎం పార్టీ కాదని.. ఆయనపై చర్చ అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాల్‌ వాదనలను ధర్మాసనం పలుమార్లు తప్పుబట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement