cbi investigation
-
సీబీఐ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్ దర్యాప్తును స్వాగతిస్తున్నాం
-
సరికొత్త కుట్రకు తెర తీసిన చంద్రబాబు!!
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణ మీద దేశవ్యాప్తంగా సీబీఐ విచారణ జరగాలని కోరుతుంటే, ఆయన మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించడం చర్చనీయాంశమైంది. చేసిన తప్పు నుంచి బయటపడడానికి చంద్రబాబు ఈ ప్లాన్ వేశారన్న ఆరోపణలూ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సిట్లను సాధారణంగా ముఖ్యమంత్రితో ముడిపడని అంశాల మీదే ఏర్పాటు చేస్తుంటారు. కానీ శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణను స్వయంగా ముఖ్యమంత్రే చేశారు. విచారణ జరిగితే ముందుగా ఆయన వద్ద నుంచే సమాచారం సేకరించాల్సి ఉంటుంది.అందువల్ల సిట్ దర్యాప్తుతో పెద్దగా ప్రయోజనం ఉండదనేది ఎక్కువమంది భావన. పైగా వివాదస్పద, పక్షపాతంతో వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని పనిగట్టుకొని సిట్ సారథిగా నియమించడం కచ్చితంగా దురుద్దేశంతో చేస్తున్న ప్రక్రియగానే అనిపిస్తోంది. గతంలో టీటీడీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ పనిచేసిన గోపీనాధ్ జెట్టీని సిట్ సభ్యునిగా నియమించారు. ఇందులో హేతుబద్దత ఏమిటో తెలియదు. చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజం ఉండి ఉంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పని చేసిన వ్యక్తిగా కూడా ఆ తప్పుతో సంబంధం ఉండే అవకాశముంది.సిట్ విధి విధానాలు ఇంకా వెల్లడి కాలేదు గానీ అందులో కీలకమైన అంశాలకు ఎంతమేరకు తావు ఉంటుందనే సందేహమే. ఉదాహరణకు లడ్డూలో కల్తీ నెయ్యిని వాడలేదని ఈవో శ్యామలరావు, మంత్రి లోకేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబేమో లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని చెబుతున్నారు. ఇందులో ఎవరిది సత్యమన్నదన్న విషయాన్నిన్ని ఈ సిట్ నిర్ధారిస్తుందా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలుగానీ ,ఇతర ఆహార పదార్థాలుగానీ విపరీతమైన దుర్వాసన వస్తాయని రుచి శ్రీవాస్తవ లాంటి ఆహార పరిశోధకులు చెబుతున్నారు. ఆవు నెయ్యి కంటే ఫిష్ ఆయిల్, పిగ్ ఆయిల్ ఖరీదు ఎక్కువేనని అందువల్ల వాటిని కలిపే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నిపుణులను సిట్ అన్ని కోణాల్లో విచారణ చేస్తుందా? లేకపోతే చంద్రబాబు ఏం చెబితే అదే చేస్తారా? వేచి చూడాలి. ఇప్పటికే చంద్రబాబు తన తీర్పు ఇచ్చేసినందున, దానికి విరుద్దంగా నివేదిక వస్తుందా? టీటీడీ ఈవో మొదట ఒక రకంగా, తరువాత చంద్రబాబు చెప్పినట్లుగాను మాట మార్చడమే ఒక నిదర్శనం. జున్, జులై నెలల్లో కొత్త ప్రభుత్వం ఆధీనంలోనే టీటీడీ పని చేసింది. ఏఆర్ కంపెనీ నుంచి పది ట్యాంకర్ల నెయ్యి వస్తే నాలుగు ట్యాంకర్లను తిరస్కరించారు. తిరస్కరించిన నెయ్యిని లడ్డూల్లో వాడే అవకాశమే లేదు. అటువంటపప్పుడు అనుమతించిన నెయ్యిలో కల్తీ ఉందని చంద్రబాబు భావిస్తున్నారా? ఒక వేళ కల్తీ నెయ్యిని అనుమతించి ఉంటే చంద్రబాబు నియమించిన ఈవో శ్యామలరావే బాధ్యుడు అవుతారు కదా? ఆయన్ను విచారిస్తారా? గతంలో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లకు మరోసారి పరీక్షలు నిర్వహించిన సందర్భం లేదు. కానీ ఈ సారి ఏఆర్ కంపెనీ నెయ్యి శాంపిల్స్ నే ఎందుకు ఎన్డీడీబీకి పంపించారు. ఇందులో ఏమైనా కుట్ర ఉందా? చంద్రబాబు హయాంలో 14 సార్లు, జగన్ సమయంలో 18 సార్లు టీటీడీ నెయ్యి ట్యాంకర్లను తిరస్కరించినప్పుడు ఎందుకు ఇలా శాంపిల్స్ వేర్వేరు ప్రయోగశాలలకు పంపలేదు? కేవలం ఏదో విధంగా జగన్ ప్రభుత్వానికి, వైఎస్సార్ సీపీకి అంటగట్టడానికే ఈ సిట్ ను వేశారనే అభియోగం వస్తోంది. పోనీ సిట్ ఉన్నతాధికారి త్రిపాఠి ట్రాక్ రికార్డ్ ఏమైనా బాగా ఉందా? అని చూస్తే.. ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశానికి పూర్తిగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, నేతలపై టీడీపీ విధ్వసకాండ జరిపినా చూసీ చూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఒక అక్రమ కేసులో ఇరికించడం తదితర ఆరోపణలు కూడా అప్పట్లో వచ్చాయి.చంద్రబాబు నియమించిన సిట్ చీఫ్ త్రిపాఠి ఆయనకు వ్యతిరేకంగా తన రిపోర్ట్ లో ఏమైనా రాసే పరిస్థితి ఉంటుందా? ఇంత సున్నితమైన అంశాన్ని చంద్రబాబు ఎందుకు ఇంత ఘోరంగా ప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు? ఆయన టైమ్‌లో జరిగిన కల్తీని వైఎస్సార్సీపీకి అంటగట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయా సందర్భాల్లో కొన్ని కమిటీలు, కమిషన్లు వేసినా అవి తూతూ మంత్రంగానే సాగాయి. ఉదాహరణకు రాజమండ్రిలో పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. అది కూడా చంద్రబాబు కుటుంబం స్నానాల ఘట్టం షూటింగ్ తీసే సందర్భంలో అయితే ,ఆయన నియమించిన విచారణ కమిషన్ మాత్రం క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేసింది. తప్పు భక్తులది, మీడియాది ఫలానా టైమ్ మంచి ముహూర్తమని ప్రచారం చేయడంవల్లే తొక్కిసలాట జరిగిందని ఆ కమిషన్ చెప్పిందే తప్ప, చంద్రబాబు ఆ స్నానాల ఘట్టానికి వెళ్లడం తప్పని చెప్పలేకపోయింది. అంత పెద్ద ఘటనలో ఒక్క పోలీస్ కానిస్టేబుల మీద కూడా చర్య తీసుకోలేదు. పైగా సీసీ టీవీ పుటేజిని మాయం చేసినా ఎవరికీ ఇబ్బంది రాలేదు. అలాగే కాపుల రిజర్వేషన్ అంశంపై మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేశారు. తీరా మంజునాథ్ తన ఆలోచనలకు భిన్నంగా నివేదిక ఇస్తారని తెలిసిన చంద్రబాబు ఆ కమిటీ సభ్యులతో వేరే నివేదిక తెప్పించి శాసన సభలో పెట్టారు.ఇలా పలు విషయాల్లో చంద్రబాబు టైమ్ లో వేసిన కమిటీలు ఉత్తుత్తి కమిటీలుగానే మిగిలిపోయాయి. శ్రీవారి ప్రసాదం మీద వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు, సుప్రీంకోర్ట్ జడ్జితో విచారణ జరపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వస్తుంటే చంద్రబాబు మాత్రం సింపుల్ గా సిట్ వేసి చేతులు దులుపుకున్నారు. మొదట తాను చేసిన రభస వల్ల తనకే నష్టం జరిగిందని, తన ప్రభుత్వమే ఆత్మరక్షణలో పడిందన్న భయంతోటి ఇలా చేస్తుండవచ్చు. లేదంటే అందరూ కోరుకున్న విధంగా సిబిఐ లేదా ఒక జడ్జి నేతృత్వంలో విచారణకు అంగీకరించేవారు. అలా చేయకపోవడంతో అందరి వేళ్లు ఆయనవైపే చూపెడుతున్నాయి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.ఇదీ చదవండి: Tirupati Laddu Controversy: బాబూ మీరు కొన్నది రూ. 276కే -
సీబీఐ దర్యాప్తు పూర్తయినా 6,900 కేసులు కోర్టుల్లోనే పెండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దర్యాప్తు చేసిన 6,900కుపైగా అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 361 కేసులు ఏకంగా 20 ఏళ్లుగా కోర్టుల్లోనే మూలుగుతున్నాయి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) తన వార్షిక నివేదికలో ఈ దిగ్భ్రాంతికర నిజాలను వెల్లడించింది. 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి అందిన వివరాలను అందులో పేర్కొంది. సీబీఐ విచారణ కోసం ఎదురు చూస్తున్న 658 అవినీతి కేసుల్లో 48 కేసులు ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. దిగువ కోర్టుల్లోని మొత్తం 6,903 కేసులకు గాను 1,379 కేసులు మూడేళ్ల లోపు, 875 కేసులు మూడు నుంచి ఐదేళ్లుగా విచారణ కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపింది. మరో 2,188 కేసులు ఐదు నుంచి పదేళ్లుగా విచారణకు నోచుకోలేదని పేర్కొంది. దాదాపుగా 2,100 అవినీతి కేసులు దర్యాప్తు ముగిశాక కూడా పదేళ్ల నుంచి 20 ఏళ్లుగా కోర్టుల్లో నానుతున్నాయని, మరో 361 కేసులు 20 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉండటం మరీ దారుణమని పేర్కొంది. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న మొత్తం 6,903 కేసులకుగాను 2,461 కేసులు 10 ఏళ్లకు పైగా విచారణకు నోచుకోకపోవడం ఆందోళనకర పరిణామమంటూ వ్యాఖ్యానించింది. సీబీఐతోపాటు నిందితులు దాఖలు చేసిన 12,773 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని సీవీసీ వివరించింది. ఇందులోని 501 అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లు 20 ఏళ్లుగా ఆయా కోర్టుల్లో మూలుగుతున్నాయంది. అధిక పని ఒత్తిడి, సిబ్బంది కొరత, సంబంధిత అధికారుల నుంచి విచారణ అనుమతుల్లో జాప్యం వంటివి దర్యాప్తు సకాలంలో ముగించడానికి అవరోధాలుగా ఉన్నాయని వివరించింది. సీబీఐకి మంజూరైన 7,295 పోస్టులకుగాను 2023 డిసెంబర్ 31వ తేదీ నాటికి 1,610 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీవీసీ నివేదిక తెలిపింది. అదే సమయంలో సీబీఐ అధికారులపై 82 శాఖాపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నట్లు కూడా తెలిపింది. -
సీబీఐ దర్యాప్తే సరైంది!
దేశవ్యాప్తంగా వైద్యవర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు రగిల్చిన కోల్‌కతా వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్టు మంగళవారం ఆదేశాలివ్వటం అన్ని విధాలా సబబైనది. జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న పీజీ విద్యార్థిని మొన్న శుక్రవారం వేకువ జామున ఒక దుండగుడి అఘాయిత్యానికి బలైంది. ఈ కేసు విషయంలో గత అయిదురోజులుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లో సందేహాలు తీర్చకపోగా... మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దుండగుడిని అరెస్టు చేశామంటున్న పోలీసుల ప్రకటనపై అటు మెడికో కుటుంబ సభ్యులు, ఇటు వైద్య విద్యార్థులు, సిబ్బంది సంతృప్తి చెందలేదు. హత్య, అత్యాచారం ఉదంతంలో కచ్చితంగా ఇతరుల ప్రమేయం ఉందని మొత్తుకున్నారు. కానీ పోలీసులు పట్టనట్టే ఉన్నారు. అసలు ఆస్పత్రి పాలకవర్గం, లేదా ప్రిన్సిపాల్ ఇంతవరకూ ఈ ఉదంతంలో ఫిర్యాదు దాఖలు చేయలేదు. కనీసం వారిని పిలిచి ప్రశ్నించినవారూ లేరు. ఆరు రోజుల్లో... అంటే వచ్చే ఆదివారంలోగా నిగ్గు తేల్చకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చ రించారు. కానీ హైకోర్టు భిన్నంగా ఆలోచించింది. ఇందులో జాప్యం జరిగినకొద్దీ సాక్ష్యాధారాలు మాయమవుతాయని, దోషులు తప్పించుకునే అవకాశం ఉన్నదని భావించింది.కొన్ని నేరాలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తాయి. మనుషులుగా అసలు మన ఉనికిపైనే సందేహం రేకెత్తిస్తాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ ఉదంతం అటువంటిదే! ప్రజలంతా ఉద్యమించిన పర్యవసానంగా ఆ విషయంలో నాటి కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదిలి కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. నేరగాళ్లకు ఉరితో సహా కఠినశిక్షలు అమలుచేసింది. కానీ ఆ తర్వాత కూడా నేరాలు తగ్గలేదు. దీనికి కారణం కేవలం ప్రభుత్వాల అలసత్వం మాత్రమే! నేరగాళ్లను వెనువెంటనే శిక్షించేలా పకడ్బందీ దర్యాప్తు జరగకపోవటం అన్ని చోట్లా కనబడుతోంది. కేవలం చట్టాలు మాత్రమే సరిపోవనీ, వాటిపై అవగాహన కల్పించి, ఆపత్కాలంలో మహిళలు తక్షణం ఆశ్రయించే సదుపాయం అమల్లోకి తేవాలని ప్రభుత్వాలు అను కోలేదు. తెలంగాణలో షీ టీమ్స్ అయినా, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ యాప్, దిశ చట్టమైనా మహిళలకు ఎంతో తోడ్పాటుగా నిలిచాయి. ముఖ్యంగా ఏపీలో దిశ యాప్ వల్ల నేరాలను నివారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోల్‌కతా ఆస్పత్రిలో ఉన్న అస్తవ్యస్త పరిస్థితి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క దేశవ్యాప్తంగా లైంగిక నేరాలు పెరిగాయని తెలుస్తూనే ఉన్నా మహిళా సిబ్బంది భద్రతకూ, రక్షణకూ ఆస్పత్రి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అక్కడి పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. నేరగాడు సంజయ్ రాయ్ పోలీస్ వలంటీర్‌గా ఉంటూ ఆస్పత్రిలో ఎక్కడికైనా యథేచ్ఛగా వెళ్తాడని అందరూ చెబుతున్న మాట. ఆఖరికి మహిళా వైద్య సిబ్బంది విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి కూడా నిశిరాత్రి అతగాడు వెళ్లగలిగాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ జూనియర్ డాక్టర్ 36 గంటలు అవిశ్రాంతంగా రోగులకు సేవలందించి అలసి నిదిరిస్తున్న వేళ నేరగాడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తోటి సిబ్బంది అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు జరిగినప్పుడు సేవలందించటానికి నమోదు చేసుకున్న నేరగాడికి ఆస్పత్రిలో సంచరించే స్వేచ్ఛ ఎవరిచ్చారో తేలాల్సివుంది. గర్భిణి అయిన భార్యను హింసించిన ఉదంతంలో వచ్చిన ఫిర్యాదుపై రెండేళ్లుగా పోలీసులు పట్టించుకోలేదంటే అతగాడి పలుకుబడిని అంచనావేయొచ్చు. అప్పుడే చర్య తీసుకుంటే ఈ ఘోరం జరిగేదా? తమ కుటుంబాల్లో వైద్య అవస రాలున్నప్పుడల్లా ఆస్పత్రిలో అన్నీ అందేలా చూస్తున్నాడన్న ఏకైక కారణంతో పోలీసులు అతడిని చూసీచూడనట్టు వదిలేశారని చాలామంది చెబుతున్న మాట. తాము తీసుకున్న వలంటీర్ల నడవడి ఎలావుంటున్నదో, వారిని కొనసాగించాలో లేదో సమీక్షించుకునే సంస్కృతి లేకపోవటం ఎటువంటి ఘోరాలకూ, నేరాలకూ దారితీస్తుందో అంచనా వేయలేనంత స్థితిలో పోలీసులుండటం ఆశ్చర్య కరం. నిజానికి లోతైన దర్యాప్తు జరిగితే తమ లోపాలు కూడా బయటపడతాయన్న ఏకైక కారణంతోనే గత అయిదురోజులుగా కోల్‌కతా పోలీసులు దర్యాప్తు డ్రామా కొనసాగిస్తున్నారనుకోవాలి. చదువు పూర్తయ్యాక ఇతర రంగాల్లో వెనువెంటనే స్థిరపడే అవకాశం ఉన్నా దాన్ని కాదనుకుని పలువురు విద్యార్థులు ఎన్నో సవాళ్లతో కూడిన, దీర్ఘకాలం పట్టే వైద్యవిద్యకు మొగ్గుచూపుతారు. సమాజం పట్లా, మనుషుల పట్లా ఎంతో సేవాభావం, ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యంకాదు. కానీ అలాంటివారికి ఆ రంగంలో సరైన గౌరవ మర్యాదలు లభిస్తున్నాయా? వారి భద్రతకు సక్రమమైన చర్యలు తీసుకుంటున్నారా? ఈ విషయంలో జూనియర్ డాక్టర్లు తరచు చెప్పే అంశాలు అంత సంతృప్తికరంగా లేవు. వారి శ్రమకు తగ్గ వేతనాలు అందవు. అవి కూడా నిర్దిష్ట సమయానికి రాని దుఃస్థితి చాలాచోట్ల ఉంటున్నది. వేళకాని వేళల్లో సైతం అవిశ్రాంతంగా పనిచేసేవారికి కనీసం కాసే పయినా భద్రంగా నిద్రపోయే సౌకర్యం ఆస్పత్రి పాలకవర్గం కల్పించలేకపోయిందంటే, ఆ విష యంలో సీనియర్లు శ్రద్ధ పెట్టలేదంటే ఏమనుకోవాలి? పెత్తనం చలాయించటానికి ఉబలాటపడే వారు తాము కూడా ఒకప్పుడు జూనియర్లమనీ, వారిని కంటికి రెప్పలా చూసుకోవాలనీ భావించక పోవటం విషాదం. సహ సిబ్బంది పట్లా, వారి దురవస్థలపట్లా సహానుభూతి లేనివారి వల్లే ఇలాంటి దురంతాలు చోటు చేసుకుంటున్నాయి. కోల్‌కతా ఆస్పత్రి ఉదంతమైనా అటువంటి వారి కళ్లు తెరిపించాలి. వైద్యసిబ్బంది రక్షణకూ, భద్రతకూ దేశవ్యాప్తంగా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. -
అవినీతి మరక లేకపోతే ఎందుకు భయం ?
మైసూరు: 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను శుద్ధంగా ఉన్నానని వందసార్లు చెప్పిన సీఎం సిద్ధరామయ్య అవినీతికి పాల్పడకుండా శుభ్రంగా ఉంటే సీబీఐ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ నిలదీశారు. ఆయన శుక్రవారం సాయంత్రం నగరంలోని భాజపా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాల్మీకి కుంభకోణాన్ని తొక్కిపెట్టేందుకు యత్నించారని, ఈడీ రంగంలోకి దిగగానే తప్పు జరిగిందని ఒప్పుకున్నారన్నారు. పెట్రోల్ బంకులతో పాటు వివిధ వనరుల నుంచి రాష్ట్రానికి చెందిన డబ్బు తెలంగాణ ఎన్నికలకు తరలించారన్నారు. వాల్మీకి కుంభకోణం గురించి సీఎంకు చాలా సమాచారం ఇచ్చానని, అయితే ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సీఎం ప్రజలను మభ్యపెడుతున్నారని ఆర్.అశోక్ మండిపడ్డారు. ముడా కుంభకోణానికి వ్యతిరేకంగా జేడీఎస్‌తో కలిసి పాదయాత్ర చేస్తున్నామన్నారు. ముడా కుంభకోణంపై మీ సొంత పార్టీ అధ్యక్షుడు మరిగౌడ ఈడీ అధికారులకు లేఖ రాశారు కదా అని గుర్తు చేశారు. అలా అయితే మీ పార్టీ నేత అబద్ధాలు చెబుతున్నారా? అని నిలదీశారు. జనాందోళన సభకు కాంగ్రెస్ నేతలు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చారని అశోక్ విమర్శించారు. -
ఐదేళ్లు... 65 పేపర్ల లీకులు
సాక్షి, అమరావతి : దేశంలో ప్రశ్నపత్రాల లీకులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే నీట్ ప్రశ్నపత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు.. దానిపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రశ్నపత్రాల లీకేజీ అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కోసం నిర్వహించే పోటీ పరీక్షలు.. వైద్య, ఇంజినీరింగ్ తదితర కోర్సుల్లో చేరేందుకు ప్రవేశపరీక్షలు, వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలు లీకుకావడం అంతకంతకూ పెరుగుతోంది. ప్రధానంగా 2019 నుంచి 2024 వరకు ప్రశ్నపత్రాలు లీకులు అమాంతంగా పెరిగాయి. ఈ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఏకంగా 65 రకాల పరీక్షల ప్రశ్నపత్రాలు లీకుకావడం గమనార్హం. గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీకుల వివరాలివీ..» 2019–24 మధ్య దేశంలో పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షలు, వార్షిక పరీక్షలకు సంబంధించి 65 ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. వాటిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాటిలో సైన్యంలో నియామకాల కోసం నిర్వహించిన ఆర్మీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్–2021, ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించిన సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ)–2023, నీట్–యూజీ–2021, జాయింట్ ఎంటన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2021 ప్రధానమైవి. » ప్రశ్నపత్రాలు లీకైన వాటిలో 45 పరీక్షలు ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు 45 ఉన్నాయి. మొత్తం మూడు లక్షల ఉద్యోగాల భర్తీకోసం ఆ పరీక్షలు నిర్వహించారు. వాటిలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో టీచర్ల నియామక పోటీ పరీక్షలు, అసోం, రాజస్థాన్, కర్ణాటక, జమ్మూ–కశ్మీర్‌లలో పోలీసు నియామక పరీక్షలు, ఉత్తరాఖండ్ అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీ పరీక్ష, తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్‌లలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ పరీక్షలు మొదలైనవి ఉన్నాయి.» ఇక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కోసం నిర్వహించిన 17 ప్రవేశ పరీక్షల ప్రశ్నపత్రాలూ లీకయ్యాయి. » మొత్తం మీద గత ఐదేళ్లలో ఇలా 65 రకాల ప్రశ్నపత్రాలు లీక్ కాగా.. వాటిలో 27 పరీక్షలను రద్దుచేయడంగానీ వాయిదా వేయడంగానీ చేశారు. » అలాగే, గత ఐదేళ్లలో 19 రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. మొదటి రెండు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, బిహార్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది ప్రశ్నపత్రాలు, బిహార్‌లో ఆరు లీకయ్యాయి. గుజరాత్, మధ్యప్రదేశ్‌లలో నాలుగు చొప్పున.. హరియాణా, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో మూడేసి ప్రశ్నాపత్రాలు.. తెలంగాణ, ఢిల్లీ, మణిపుర్‌లలో రెండేసి ప్రశ్నపత్రాలు లీక్ కాగా.. జమ్మూ–కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లలో ఒక్కో ప్రశ్నపత్రం లీకైంది. శభాష్ ఏపీవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఘనత ఇదీ..2019–24 మధ్య కాలంలో పోటీ పరీక్షల నిర్వహణ దేశవ్యాప్తంగా విఫలమైనప్పటికీ ఏపీకు మాత్రం ఆ మరక అంటలేదు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పోటీ పరీక్షలు, ఉన్నత విద్యా సంస్థల్లో చేరేందుకు నిర్వహించిన ప్రవేశపరీక్షలను పకడ్బందీగా నిర్వహించింది. ఏకంగా ఒకేసారి 1.50 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక పరీక్ష, 6,500 మంది పోలీసుల నియామక పరీక్ష, గ్రూప్–1, గ్రూప్–2 తదితర ప్రవేశ పరీక్షలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది. -
నీట్ అవకతవకలపై దర్యాప్తు సీబీఐకి అప్పగింత
-
నీట్‌పై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశం... మరోవైపు ఎన్టీఏ డీజీపై సుబోధ్ సింగ్‌పై వేటు... నేడు జరగాల్సిన నీట్- పీజీ పరీక్ష వాయిదా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కాళేశ్వరంపై విచారణ వేసవి సెలవులు ముగిశాకే..
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మేడిగడ్డ పియర్ల కుంగుబాటుపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్లలో విచారణను హైకోర్టు వేసవి సెలవుల (జూన్) తర్వాతకు వాయిదా వేసింది. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌తో పాటు బక్క జడ్సన్ మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం ఈ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టింది. కేఏ.పాల్ వాదనలు వినిపిస్తూ.. ‘దేశంలోనే అత్యంత అవినీతి జరిగిన ప్రాజెక్టు కాళేశ్వరం. వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. తెలంగాణలోని 4 కోట్ల మందికి చెందిన రూ.లక్ష కోట్లకు సంబంధించిన అంశం ఈ ప్రాజెక్టు. సీబీఐ దర్యాప్తుతోపాటు భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వినియోగించుకునేలా నిపుణుల కమిటీని కూడా వేయాలి. ఎన్నికలకు ముందు పలు సభలు, సమావేశాల్లో కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ అధికారంలోని రాగానే మాట మార్చారు. సీబీఐ విచారణ కోరకుండా.. రిటైర్డ్ జడ్జితో విచారణ అంటున్నారు’అని పేర్కొన్నారు. ఈ కేసులో సీఎం పార్టీ కాదని.. ఆయనపై చర్చ అవసరం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాల్ వాదనలను ధర్మాసనం పలుమార్లు తప్పుబట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. -
చంద్రబాబు చేసింది వెయ్యి కోట్ల భూకుంభకోణం
గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ మూలనైనా ఎకరానికి వంద కోట్ల ధర ఉంది. అలాంటిది 850 ఎకరాలంటే దాదాపు లక్ష కోట్ల రుపాయల విలువ. కేవలం నాలుగు రోజుల్లోనే లక్ష కోట్ల విలువైన భూమిని పక్కదారి పట్టించడమంటే చంద్రబాబు ఘనత అర్థం చేసుకోవచ్చు. 1999-2004 మధ్య జరిగిన ఈ కుంభకోణాన్ని బయటకు రాకుండా చేయడానికి నానా పాట్లు పడ్డా.. చివరికి హైకోర్టు తీర్పు రావడంతో బాబు కుంభకోణమంతా బట్టబయలైంది. సాక్షి, హైదరాబాద్: ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే 850 ఎకరాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్న 2003 నాటి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. కనీస విచారణ లేకుండా, అంతర్జాతీయ కంపెనీతో సంబంధాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా, అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా ధారాదత్తం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పోర్ట్స్ అకాడమీ నిర్వహణ కోసం అంటూ ఏటా కోట్లాది రూపాయలు ముట్టజెప్పేందుకు, విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ సౌకర్యాలు 100 శాతం ఉచితంగా కల్పించేందుకు అంగీకరించడం గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదంటూ విస్మయం వ్యక్తం చేసింది. గతంలో ఏ కంపెనీకీ అది ఏర్పాటైన 4 రోజుల్లో వందల ఎకరాలు అప్పగించినట్టుగా, నిర్వహణ ఖర్చులు, బిల్లుల మాఫీకి అంగీకరించినట్టుగా లేదని అభిప్రాయపడింది. 2007లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం విస్తృత ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే సదరు భూమిని వెనక్కు తీసుకుంటూ చట్టం చేసిందని స్పష్టం చేసింది. రాజ్యాంగంలో ఉన్న అధికారాల మేరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చిందని.. ఇది ఎంతమాత్రం ఆక్షేపణీయం కాదని తేల్చిచెప్పింది. ఐఎంజీ భారత్ (పిటిషనర్) పేర్కొంటున్నట్లుగా ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎక్కడా జరగలేదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్ కనిపించలేదని, ఆ ఒప్పందాన్ని ఏవిధంగానూ సమర్ధించలేమని ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటిల ధర్మాసనం 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత గురువారం తీర్పు ఇచ్చింది. దీనిపై మీరు సీబీఐ విచారణ జరిపిస్తారా? లేక మమ్మల్నే ఆదేశించమంటారా? అంటూ రాష్ట్ర ప్రభు త్వాన్ని ఈ అంశంపైనే దాఖలైన ఓ పిల్ విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై వా రం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. యువతను క్రీడల్లో తీర్చిదిద్దడం కోసం అంటూ.. ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఎంజీబీపీఎల్) 2003, ఆగస్టు 5న ఏర్పాటైంది. కంపెనీ ఏర్పాటైన 4 రోజులకే అంటే ఆగస్టు 9నే చంద్రబా బు నేతృత్వంలోని నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఐఎంజీ భారత్‌తో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. క్రీడల్లో రాష్ట్ర యువతను చాంపియన్లుగా తీర్చిదిద్దడం కోసం అంటూ ఈ ఎంవోయూ చేసుకుంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ అకాడెమీలను నిర్మించడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం కోసం అంటూ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో 400 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం మామిడిపల్లి సర్వే నంబర్ 99/1లోని మరో 450 ఎకరాలు అప్పగించేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా ఐఎంజీ భారత్ అంతర్జాతీయ స్థాయిలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించుకునేందుకు బంజారాహిల్స్ నుంచి మాదాపూర్ వెళ్లే మార్గంలో ఎకరం నుంచి 5 ఎకరాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు 2004, ఫ్రిబవరిలో గచ్చి»ౌలిలో ఎంతో విలువైన 400 ఎకరాలను స్వల్ప మొత్తానికి అంటే కేవలం రూ.2 కోట్లకే ఐఎంజీ భారత్‌కు అప్పగించింది (సేల్ డీడ్ చేసింది). అయితే 2006లో ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. 2007లో దీన్ని చట్టబద్ధం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తి (పరిరక్షణ, రక్షణ, పునఃప్రారంభం) చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్ట ప్రకారం ఐఎంజీ భారత్‌తో అంతకుముందు ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ, ఆ మేరకు సేల్‌డీడ్ కూడా రద్దయ్యాయి. ఈ క్రమంలో 2007 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం సంబంధిత లావాదేవీలు రద్దు చేయడమే కాకుండా ఐఎంజీ చెల్లించిన మొత్తాన్ని ఏడాదికి 12 శాతం వడ్డీతో తిరిగి ఇచ్చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ప్రభుత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ భారత్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పూర్తి కేబినెట్ ఆమోదం లేదు: ఏజీ ‘పూర్తి కేబినెట్ ఆమోదం లేకుండా నాటి ప్రభుత్వం ఎంఓయూపై సంతకాలు చేసింది. ఆ సమయంలో భూమి విలువ ఎకరం రూ.13 లక్షలు ఉండగా, పిటిషనర్‌కు రూ.50 వేల స్వల్ప మొత్తానికే సరైన ఎలాంటి కారణం లేకుండా విక్రయించారు. ఐఎంజీ భారత్‌కు అమెరికన్ కంపెనీ అయిన ఐఎంజీతో ఎలాంటి సంబంధం లేదు. కానీ దానికి అనుబంధ సంస్థ అంటూ మోసగించారు. అందుకే తదుపరి ప్రభుత్వం ఎంవోయూను రద్దు చేసింది. పరిహారం ఇవ్వాలని కూడా నిర్ణయించింది. 2007లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఒక్క ఐఎంజీ కోసమే కాదు. ఇది ఇతర భూ లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఇలా చట్టం తీసుకొచ్చే అధికారం రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం శాసనసభకు ఉంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత 2007లో చేసిన చట్టం అమల్లోకి వచ్చింది..’అంటూ అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. కాగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ..‘ఒక ఐఎంజీ భారత్ కోసమే చట్టాన్ని తేవడం సమరి్థనీయం కాదు. ఎంవోయూను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు..’అంటూ వాదించారు. ఎలాంటి విచారణ చేయకుండానే ఆమోదం: ధర్మాసనం ‘2003 ఆగస్టు 5న ఐఎంజీ భారత్ ఏర్పాటైన తర్వాతి రోజే, ఎలాంటి విచారణ చేసుకోకుండానే 6న నాటి యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం, కల్చలరల్ డిపార్ట్మెంట్ కంపెనీకి ఆమోదం తెలుపుతూ సర్క్యులర్ జారీ చేసింది. అదే రోజు నలుగురు మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీనికి ఆగమేఘాలపై గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత 9వ తేదీన ఎంవోయూ కుదుర్చుకున్నారు. స్పోర్ట్స్ అకాడెమీ, స్టేడియాల నిర్వహణకయ్యే ఖర్చు ఏడాదికి రూ.2.5 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అయితే ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. తొలి మూడేళ్లపాటు విద్యుత్, నీటి, సీవేజ్, డ్రైనేజీ బిల్లులనూ 100 శాతం తిరిగి చెల్లిస్తామని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా దీన్ని తగ్గిస్తామని తెలిపారు. ముఖ్యంగా పిటిషనర్‌కు అంతర్జాతీయ క్రీడా సంస్థ (ఐఎంజీ, అమెరికా)తో సంబంధం గానీ, గతంలో క్రీడా రంగంలో అనుభవం గానీ లేవు. ఉన్నట్లుగా ఐఎంజీ ఎలాంటి పత్రాలను ప్రభుత్వానికి సమర్పించలేదు. ప్రభుత్వం రద్దయ్యాక 400 ఎకరాలకు సేల్‌డీడ్! 2003, నవంబర్ 14నే చంద్రబాబు ప్రభుత్వం రద్దయ్యింది. తర్వాత ఆపద్ధర్మ ప్రభుత్వంగా మాత్రమే కొనసాగింది. ఈ ఆపద్ధర్మ ప్రభుత్వ హయాంలోనే 400 ఎకరాలను నామమాత్రపు ధరకు ఐఎంజీ భారత్‌కు అప్పగిస్తూ సేల్‌డీడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు చట్టం ద్వారా ఒక వ్యక్తి మాత్రమే ప్రభావితం అయినా, 2007లో భూములపై రాష్ట్ర శాసనసభకు ఉన్న అధికారాలతోనే చట్టాన్ని రూపొందించింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సరైన కారణాలు ఉన్నప్పుడు రాజ్యాంగం ప్రభుత్వానికి ఈ అధికారం కలి్పంచింది. జాగ్రత్తగా గమనిస్తే.. కంపెనీ ఏర్పాటైన కేవలం 4 రోజుల్లోనే వేల కోట్ల విలువచేసే వందల ఎకరాల భూములు అప్పగించారు. మరే ఇతర కంపెనీకి రాష్ట్రంలో అంత స్వల్ప సమయంలో ఇలా భూములు ధారాదత్తం చేయలేదు. పిటిషనర్‌కు పరిహారం కోరే హక్కు ఉంది. అయితే 2007లో తీసుకొచ్చిన చట్టాన్ని తన ఒక్క కంపెనీ కోసమే అంటూ సవాల్ చేయలేరు. ప్రజా ఆస్తుల పరిరక్షణకే వైఎస్ సర్కార్ చట్టం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ప్రభుత్వం ఉల్లంఘించిందన్న వాదన కూడా సరికాదు. ప్రజల ఆస్తులను కాపాడటం కోసమే 2007లో వైఎస్ సర్కార్ చట్టం తీసుకొచ్చింది. అది ఎవరి వ్యక్తిగత అవసరాల కోసం కాదన్న విషయం గ్రహించాలి. కంపెనీ ఏర్పాటు చేసిన నాలుగు రోజుల్లో వేల కోట్ల భూములు గతంలో మరే ఇతర కంపెనీకి ప్రభుత్వం కేటాయించినట్లుగా ఐఎంజీ నిరూపించలేకపోయింది. అలాగే ప్రభుత్వం చేసిన చట్టం చెల్లుబాటును అడ్డుకునేందుకు ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు కూడా జరగలేదు. సేల్ డీడ్‌ను రద్దు చేయకూడదనే వాదన ఆమోదానికి అర్హమైనది కాదు. ఎంఓయూనే రద్దయినప్పుడు సేల్‌డీడ్ అమల్లో ఉండటం సాధ్యం కాదు..’అంటూ ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. సీబీఐ విచారణకు లేఖ రాశామన్నారుగా.. ‘ఐఎంజీ భారత్‌కు భూముల అప్పగింతపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో లేఖ రాశాం అన్నారు.. ఎంత వరకు వచ్చింది? మీరు విచారణ కోరతారా? లేక మమల్నే సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వమంటారా?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణలోగా ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ, విచారణను వారం పాటు వాయిదా వేసింది. ఐఎంజీ భారత్‌కు భూముల కేటాయింపు, ఎంవోయూ, సేల్‌డీడ్.. ఇలా అన్ని అంశాలపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ టి.శ్రీరంగారావుతో పాటు మరొకరు 2012లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ ఒప్పందం వెనుక పెద్ద ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసే ప్రయత్నం జరిగిందని, దీని వెనుక ఉన్న కుట్రదారులెవరో తేల్చాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ పిటిషన్లను గురువారం మరోసారి సీజే ధర్మాసనం విచారించింది. సీబీఐకి అప్పగించే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్ అభిప్రాయం ధర్మాసనం కోరింది. ఆయన తమకు కొంత సమయం కావాలనడాన్ని, ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాత తెలియజేస్తాననడాన్ని తప్పుబట్టింది. ఇంకా ఎంతకాలం ఆగాలని, వారంలోగా ఏదో ఒకటి తేల్చిచెప్పాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. కాగా గతంలో ఇదే పిల్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వం కోరితే దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి సీబీఐ తెలియజేయడం గమనార్హం. -
సీబీఐ విచారణలో కాకాణికి క్లీన్చిట్
సాక్షి, అమరావతి: నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో కాకాణికి ఏమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో ఏపీ పోలీసులు సక్రమంగానే దర్యాప్తు చేశారని తేల్చిచెప్పింది. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులుగా పేర్కొన్న సయ్యద్ హయత్, షేక్ ఖాజా అనే ఇద్దరు వ్యక్తులే నెల్లూరు న్యాయస్థానంలో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు ఫైళ్లను కూడా అపహరించినట్లు నిర్ధారించింది. మంత్రి కాకాణి ఆ ఫైళ్లను దొంగతనం చేయించారన్న టీడీపీ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈమేరకు విజయవాడలోని ఐదో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్– మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో సీఐబీ దాఖలు చేసిన చార్జ్‌షీట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ... నెల్లూరులోని నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానంలో 2022 ఏప్రిల్ 13వతేదీ రాత్రి కొందరు ఆగంతకులు దొంగతనానికి పాల్పడిఎలక్ట్రానిక్ ఉపకరణాలతోపాటు పలు పత్రాలను అపహరించారు. దీనిపై మర్నాడు కేసు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు దర్యాప్తు చేసి దొంగతనానికి పాల్పడ్డ సయ్యద్ హయత్, షేక్ ఖాజాలను అరెస్ట్ చేసి వారి నుంచి ల్యాప్‌టాప్, సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు పంపారు. ఈ ఉదంతంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో దాఖలైన కేసులో ఆధారాలను గల్లంతు చేసేందుకు చోరీకి పురిగొల్పారని అభాండాలు వేశారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టిన మంత్రి కాకాణి దీనిపై సీబీఐ విచారణకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాలతో ఈ కేసు విచారణ చేపట్టిన సీఐబీ అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు జరిపింది. రెండేళ్లపాటు దర్యాప్తు చేసి 88 మంది సాక్షులను విచారించి రూపొందించిన 403 పేజీల చార్జ్‌షీట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది. ఈ వ్యవహారంతో మంత్రి కాకాణికి ఎలాంటి సంబంధం లేదని సీబీఐ నిర్ధారించింది. ఏపీ పోలీసులు ఈ కేసును సక్రమంగానే విచారించారని స్పష్టం చేసింది. చార్జ్‌షీట్‌లో సీబీఐ ప్రధానంగా పేర్కొన్న అంశాలివీ.. కాకాణికి సంబంధం లేదు... నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్ల గల్లంతు వ్యవహారంతో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. మంత్రి కాకాణి, ఆయన పీఏలు, సన్నిహితుల ఫోన్ కాల్స్ డేటాను సీబీఐ విశ్లేషించింది. న్యాయస్థానం సిబ్బందితోగానీ, ఈ కేసుతో సంబంధం ఉన్న వారితోగానీ, దర్యాప్తు అధికారులతోగానీ మంత్రి కాకాణి, ఆయన అనుచరులు ఫోన్లో మాట్లాడినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాట్ల గురించి అతి స్వల్ప వ్యవధి కాల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ దొంగతనం కేసులో అరెస్ట్ చేసిన నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్‌తో మంత్రి కాకాణికి ఎలాంటి సంబంధాలు లేవన్నది నిర్ధారణ అయింది. నిందితుల నుంచి పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను ఎవరూ ట్యాంపర్ చేయలేదని తిరువనంతపురంలోని సీ–డాక్ పరీక్షల్లో నిర్ధారణ అయింది. దొంగతనాలే ప్రవృత్తి.. ఈ కేసులో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూలే నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనానికి పాల్పడ్డారు. నేర చరిత్ర ఉన్న వారిద్దరిపై 15 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఏడు కేసుల్లో శిక్ష పడగా మిగిలిన కేసులు విచారణలో ఉన్నాయి. మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటు పడిన నిందితులిద్దరూ దొంగతనాలనే వృత్తిగా చేసుకున్నారు. నిందితుల భార్యలు కూడా వారికి దూరంగా ఉంటున్నారు. నిందితులు తమ తల్లుల ఫోన్లను మాత్రమే వినియోగిస్తున్నారు. వారిద్దరే నెల్లూరు న్యాయస్థానంలో చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ల్యాప్‌టాప్, ట్యాబ్, మొబైల్ ఫోన్లను తస్కరించి మిగిలిన పత్రాలను సమీపంలోని కాలువలో పారేశారు. తాము అపహరించిన వస్తువులు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కేసుకు సంబంధించినవి అనే విషయం నిందితులకు తెలియదు. పోలీసులు వారిద్దరి నుంచి ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాలువలో పారేసిన రబ్బరు స్టాంపులు, రౌండ్ సీళ్లు, స్టాంపు, స్టాంప్ ప్యాడ్లు మాత్రం లభ్యం కాలేదు. సోమిరెడ్డి ఆరోపణలు అవాస్తవం మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, రాష్ట్ర పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని సీఐబీ తేల్చి చెప్పింది. ఆయన చేసిన 14 ఆరోపణలను విడివిడిగా ప్రస్తావిస్తూ అవన్నీ నిరాధారణమని పేర్కొంది. నెల్లూరు న్యాయస్థానంలో దొంగతనానికి పాల్పడ్డ సయ్యద్ హయత్, ఖాజా రసూలపై విచారణ కొనసాగించాలని సీఐబీ పేర్కొంది. సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? పారదర్శకంగా నెల్లూరు పోలీసుల విచారణ: మంత్రి కాకాణి నెల్లూరు(సెంట్రల్): కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలను పటాపంచలు చేస్తూ సీబీఐ క్లీన్చిట్ ఇచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మంత్రిగా ప్రమాణం చేసిన మూడు రోజులకే కోర్టులో ఫైల్స్ మిస్సింగ్ ఘటన చోటు చేసుకుందని, ఈ కేసును విచారించిన ఎస్పీ విజయారావు పూర్తి వివరాలను వెల్లడించారని గుర్తు చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తనపై బురద చల్లేందుకు దీన్ని తనకు ఆపాదిస్తూ ఆరోపణలు చేశారన్నారు. చంద్రబాబు, లోకేశ్ కూడా తనపై ఆరోపణలు చేశారన్నారు. ఏడాదిపాటు క్షుణ్నంగా విచారించిన సీబీఐ అధికారులు 88 మందిని విచారించి స్టేట్మెంట్లు రికార్డు చేశారని చెప్పారు. ఆ ముగ్గురూ సమాధానం చెప్పాలి తనకు సంబంధం లేని ఫైల్స్ చోరీ కేసులో చంద్రబాబు తనపై నిందలు వేశారని, లోకేశ్ కూడా కోర్టు దొంగ అంటూ తనపై నిందలు మోపారని, ప్రజలు నాలుగుసార్లు తిరస్కరించిన సోమిరెడ్డి తనపై దురుద్దేశంతో ఆరోపణలు చేశారని కాకాణి పేర్కొన్నారు. సీబీఐ ఇచ్చిన నివేదికతో ఆ ముగ్గురు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా సీపీఐ రామకృష్ణ కూడా విమర్శలు చేశారన్నారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ లోకేశ్ పలు దఫాలు విమర్శలు చేశారన్నారు. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా విచారణ నిర్వహించారనేందుకు ఈ కేసే ఉదాహరణ అని తెలిపారు. బాబు కుమ్మక్కు రాజకీయాలు నిజం గెలవాలంటూ పర్యటిస్తున్న నారా భువనేశ్వరి నిజంగానే అలా కోరుకుంటుంటే చంద్రబాబుపై ఉన్న కేసులపై సీబీఐ విచారణ జరిగితే నిజం గెలుస్తుందని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు. చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమేనా? అని మంత్రి సవాల్ విసిరారు. తనకు అనుభవం ఉందంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు నిత్యం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌తో రాజకీయంగా తలపడలేక కుమ్మక్కు రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు. -
చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి మంత్రి రోజా సవాల్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): మాజీ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. భువనేశ్వరి కోరినట్లుగా తన ఆస్తులపై సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని, మరి మీరు కూడా సిద్ధమేనా భువనేశ్వరీ అంటూ సవాల్ విసిరారు. గురువారం ఆమె రాజమహేంద్రవరంలోని శ్రీ ఉమా మార్కండేయేశ్వరస్వామి ఆలయాన్ని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌తో కలిసి సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 1991లో చిత్ర పరిశ్రమకు వచ్చిన నాటి నుంచి తన సంపాదన ప్రారంభమైందని, దానిపై సీబీఐతో విచారణకు తాను సిద్ధమేనని చెప్పారు. మరి అదే సమయంలో భువనేశ్వరి కూడా ఆమె ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఆర్థిక నేరగాడికి సంకెళ్లు వేస్తే మొత్తం రాష్ట్రానికే సంకెళ్లు వేసినట్టు భువనేశ్వరి వ్యాఖ్యానించడాన్ని చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారని అన్నారు. -
డీకేపై విచారణ 3 నెలల్లో పూర్తిచేయండి
బనశంకరి: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తును సవాలు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. ఇప్పటి వరకు ఉన్న స్టేను ఎత్తివేస్తూ దర్యాప్తు మూడునెలల్లో పూర్తిచేయాలని సీబీఐను ఆదేశించింది. దర్యాప్తు చాలావరకు పూర్తయిందని, అందుకే ఈ దశలో కోర్టు జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. 2014–18 మధ్య డీకే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ ఏడాది ప్రత్యేక కేసు నమోదు చేసింది. అంతకుముందు రెండు మూడుసార్లు డీకే, ఆయన సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు జరిపి నగదు, రికార్డులను స్వా«దీనం చేసుకుంది. కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో డీకే కొన్ని నెలల కిందట హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తుపై స్టే తెచ్చుకున్నారు. గత సోదాల సమయంలో రూ.200 కోట్లకుపైగా అక్రమాస్తులు వెలుగు చూశాయని సీబీఐ తరఫు న్యాయవాదులు వాదించారు. కేసుపై స్టే ఎత్తివేయాలని అభ్యర్థించారు. హైకోర్టు తీర్పును డీకే సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశముందని తెలిసింది. రాజకీయ దురుద్దేశంతోనే: డీకే రాజకీయ దురుద్దేశంతో గతంలో బీఎస్ యడియూరప్ప ప్రభుత్వం తన కేసును సీబీఐకి అప్పగించిందని డీకే శివకుమార్ ఆరోపించారు. తీర్పు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనను, కుటుంబాన్ని కనీసం ఒక్కరోజు కూడా విచారణకు రావాలని పిలవలేదన్నారు. మరి 90 శాతం దర్యాప్తు ఎలా పూర్తి చేశారోనని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కోర్టులపై తనకు నమ్మకం ఉందని, పోరాటం చేస్తానని చెప్పారు. తనను జైలుకు పంపిస్తామన్న రాష్ట్ర బీజేపీ, జేడీఎస్ నాయకుల మాటలను ప్రస్తావిస్తూ.. దమ్ముంటే త్వరగా ఆ పనిచేయాలని సవాల్ విసిరారు. -
‘స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది’
సాక్షి, రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కామ్ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరగాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే స్కిల్ స్కాం జరిగిందని జీఎస్టీ డీజీ తేల్చినట్టు ఉండవల్లి చెప్పుకొచ్చారు. కాగా, ఉండవల్లి అరుణ్‌కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ఈ కేసులో వాస్తవాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరగాలి. స్కిల్ స్కామ్‌లో ఫైళ్లు మాయం చేశారని చెబుతున్నారు. స్కిల్ స్కామ్ కేసుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పూణే జీఎస్టీ అధికారుల విచారణలో ఇది బయటపడింది. స్కిల్ స్కామ్ కేసును జీఎస్టీ అధికారులు వెలికితీశారు. ఈ ప్రాజెక్ట్‌తో సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ చెప్పింది. ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని సీమెన్స్ తెలిపింది. ఒప్పందంపై సంతకం పెట్టిన వ్యక్తి తమ కంపెనీలో పనిచేయడం లేదని వెల్లడించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీ లేఖ రాసింది. చంద్రబాబు ఎందుకు ఎవరి మీదా చర్యలు తీసుకోలేదు?. బెయిల్ ఇవ్వలేదని జడ్జిపై ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారు. ప్రాథమిక సాక్ష్యాధారాలతో రిమాండ్‌కు పంపించారు. సీబీఐ విచారణ చేస్తే ఫైళ్లు ఎలా తగటబడ్డాయో తెలుస్తుంది. టీడీపీలో మంత్రులుగా చేసిన వాళ్లు కూడా చౌకబారుగా విమర్శలు చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ దేశం వదిలి పారిపోయారు. బెయిల్‌పై పిటిషన్ వేయకుండా కేసు కొట్టేయాలని వాదిస్తున్నారు. స్కిల్ స్కామ్‌లో వాస్తవాలు బయటకు రావాలి. ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీ అడిగితే తప్పేంటి?. నేను సీబీఐ విచారణ కోరితే టీడీపీకి ఎందుకు కోపం వస్తోంది?. స్కిల్ స్కాంలో ఉన్నవి సూటుకేసు కంపెనీలు. చంద్రబాబుకు సౌకర్యాలు కావాలంటే కోర్టు ద్వారా అడగొచ్చు. రాజమండ్రి జైలులో చాలా సౌకర్యాలు ఉన్నాయి. లైబ్రరీ ఉంది.. వాకింగ్ చేయవచ్చు. కేసు ఒక పద్దతిలో వెళ్తోంది. స్కిల్ స్కామ్‌లో అవినీతి జరిగిందనే విషయంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబుకు తెలియకుండా స్కామ్ జరిగిదంటే ఎవరూ నమ్మరు. చంద్రబాబు తనకు తాను సీఈవో అనుకుంటాడు’ అంటూ కామెంట్స్ చేశారు. -
పుంగనూరు ఘటన: సిబిఐ చేత దర్యాప్తు చేయించాలని బాబు బిల్డప్పు
-
వివేకా హత్య కేసులో విస్మయం కలిగిస్తున్న సీబీఐ దర్యాప్తు
-
Viveka Case: దర్యాప్తు తీరు ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ కథనం -2
వివేకాను చివరిగా ఎవరు చూశారు? వాచ్మెన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం 2019 మార్చి 14 రాత్రి 12 గంటల సమయంలో వివేకా తన నివాసం నుంచి బయటకు వచ్చి సిగరెట్ తాగడం రంగన్న చూశాడు. నిందితులు కాకుండా వివేకా జీవించి ఉండగా చివరిసారిగా చూసిన వ్యక్తి రంగన్న. పోలీసు దర్యాప్తు నియమావళి ప్రకారం జీరో అవర్‌గా పిలిచే అప్పటి నుంచే దర్యాప్తు మొదలు కావాలి. అయితే 2021లో దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం గానీ అనంతరం రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలోగానీ 11.30 గంటలకు ఎర్ర గంగిరెడ్డి వివేకా నివాసానికి వచ్చారని చెప్పడం గమనార్హం. సాక్షి, అమరావతి: మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరు ఆద్యంతం అశాస్త్రీయం, అహేతుకం, అసంబద్ధం, సందేహాస్పదంగా ఉందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ కుండబద్దలు కొట్టింది. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని చెబుతున్న సీబీఐ.. కీలకమైన ఆస్తి వివాదం కోణాన్ని విస్మరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. వివేకా హత్య అనంతరం ఆయన నివాసంలో నిందితులు ఆస్తి పత్రాల కోసం వెతికారన్నది స్పష్టమవుతున్నా, ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని ప్రశ్నించింది. రెండున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా గుర్తుకొచ్చిందా? నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో కూడా ఏమీ చెప్పని వాచ్మెన్ రంగన్నకు రెండున్నరేళ్ల తర్వాత అంతా గుర్తుకు వచ్చినట్టు సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడంపై సందేహాలు వ్యక్తం చేసింది. ఇక కీలక ఆధారంగా గొప్పగా ప్రకటించిన గూగుల్ టేక్ అవుట్ డాటా పూర్తిగా తప్పని స్వయంగా సీబీఐనే ప్రకటించడాన్ని ‘ద వైర్’ ప్రధానంగా ప్రస్తావించింది. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి రాసిన రెండు విశ్లేషణాత్మక కథనాలను ‘ద వైర్’ వెబ్సైట్ ప్రముఖంగా ప్రచురించింది. సాక్షుల వాంగ్మూలాల పేరిట కట్టు కథలా? మొదటి కథనంలో సీబీఐ దర్యాప్తులో డొల్లతనాన్ని బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రచురించిన రెండో కథనంలో మరింత లోతుగా విశ్లేషించి సీబీఐ దర్యాప్తు తీరును ఎండగట్టింది. సీబీఐ ప్రస్తావించిన ఐపీడీఆర్ డాటా కూడా హేతుబద్ధ ఆధారం కాదని తేల్చి చెప్పింది. దర్యాప్తునకు ఆధారంగా చెబుతూ సాక్షుల వాంగ్మూలాల పేరిట సీబీఐ చెబుతోంది కట్టు కథలేనని స్పష్టం చేసింది. ఏకంగా 14 మంది సాక్షులు సీబీఐ తీరును తప్పుబట్టడం.. ఏకంగా రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం సీబీఐపైనే న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. ఏ కోణంలో చూసినా సరే వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దారి తప్పిందనే విషయాన్ని స్పష్టం చేసింది. వాచ్మెన్ రంగన్న అప్పుడలా.. ఇప్పుడిలా వివేకా హత్య కేసు దర్యాప్తు చేసిన మొదటి దర్యాప్తు అధికారి చెప్పిన దాని ప్రకారం.. వాచ్మెన్ రంగన్న 2019 మార్చి 14వ తేదీ రాత్రి వివేకానందరెడ్డి నివాసం వరండాలో నిద్రపోయాడు. ఎన్నికల ప్రచారం ముగించుకుని రాత్రి 11.30 గంటల సమయంలో వివేకానందరెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. కారు శబ్దం వినిపించి రంగన్న నిద్ర లేచి గేటు తెరిచాడు. వివేకా ఇంటి వద్ద దిగిపోయాక.. కారు డ్రైవర్ ప్రసాద్ ఇంటికి వెళ్లిపోయాడు. ‘నేను నిద్రపోతాను.. నువ్వు నిద్రపో’ అని వివేకా రంగన్నతో చెప్పి తన నివాసంలోకి వెళ్లిపోయారు. నార్కో ఎనాలిసిస్ ఎందుకు బయటకు రాలేదు? ఆ తర్వాత వివేకాను ఆయన నివాసంలో ఆ రోజు రాత్రి హత్య చేస్తుంటే బయటే ఉన్న రంగన్న ఏం చేశాడనే దానిపై టీడీపీ ప్రభుత్వ హయాంలోని పోలీసు అధికారులు విచారించనే లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొన్ని వారాల తర్వాత రంగన్న పేరు కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. మరికొందరు అనుమానితులతోపాటు రంగన్నను కూడా అహ్మదాబాద్ తీసుకువెళ్లి నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఎలాంటి విషయాన్ని రాబట్ట లేదు. మరి రంగన్నకు ఏదైనా విషయం తెలిసి ఉంటే నార్కో ఎనాలిసిస్ పరీక్షల్లో బయటపడేది కదా! రెండున్నరేళ్ల తర్వాత అన్నీ గుర్తుకొచ్చాయా? వివేకా హత్య జరిగిన రెండున్నరేళ్ల తర్వాత సీబీఐ రంగన్నను ప్రత్యక్ష సాక్షిగా న్యాయస్థానంలో హాజరు పరిచింది. ఈ సారి రంగన్న కొన్ని కొత్త విషయాలు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. 2019 మార్చి 14న రాత్రి వివేకాను ఇంటి వద్ద దించేసి డ్రైవర్ ప్రసాద్ వెళ్లిపోయిన తర్వాత.. 15 నిమిషాలకు అంటే 11.45 గంటలకు వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డి అక్కడికి చేరుకున్నాడని చెప్పాడు. దర్యాప్తులో ఇదే కీలకమైన టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఈ మొత్తం ఎపిసోడ్లో దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలు రెండు చోట్ల సరిపోలుతున్నాయి. వివేకా నివాసానికి ఎర్ర గంగిరెడ్డి రావడం.. వెళ్లడం అనే అంశాలు. మృతదేహాన్ని అర్ధరాత్రే చూసిన రంగన్న 2021 జూలైలో జమ్మలమడుగు న్యాయస్థానంలో రంగన్న ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. 2019 మార్చి 14 అర్ధరాత్రి వివేకా నివాసం నుంచి శబ్దాలు రావడంతో కిటికీ వద్దకు వెళ్లి లోపలికి చూశాడు. లోపల నలుగురు వ్యక్తులు హాల్, బెడ్ రూమ్‌లలో తిరుగుతూ దేని కోసమో వెతుకుతున్నారు. రంగన్న ఓ చెట్టు వెనుక దాక్కున్నాడు. సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి బయటకు వచ్చి గోడదూకి వెళ్లిపోవడం చూశాడు. అనంతరం ఎర్ర గంగిరెడ్డి బయటకు వచ్చి విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి వెళ్లాడు. ఆ తర్వాత అంటే తెల్లవారుజామున 3 గంటల సమయంలో రంగన్న వివేకా నివాసం లోపలికి వెళ్లాడు. బెడ్రూమ్లో మంచం పక్కన రక్తం పడి ఉంది. బాత్రూమ్లో వివేకా కింద పడిపోయి ఉన్నారు. ఆయన చుట్టూ రక్తం మడుగు కట్టి ఉంది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్లు.. సాక్షుల వాంగ్మూలాల పేరిటా సీబీఐ అడ్డదారులు తొక్కింది. సాక్షులు చెప్పని విషయాలు చెప్పినట్టుగా గతంలో దర్యాప్తు అధికారిగా ఉన్న రామ్‌సింగ్ నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. కనీసం 14 మంది సాక్షులు తాము చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ వాంగ్మూలం నమోదు చేయడాన్ని ఖండించారు. నలుగురు సాక్షులు రామ్‌సింగ్‌కు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదే విషయాన్ని ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు రాసిన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు కూడా. వివేకా చనిపోయారనే విషయాన్ని 2019 మార్చి 15న ఉదయం 6.15 గంటలకు ఆయన పీఏ కృష్ణా రెడ్డి గుర్తించారు. చెప్పని విషయాలు ఎలా ఆపాదిస్తారు? అంతకు ముందే వివేకా మరణం గురించి ఎవరికైనా తెలుసా అనే కోణంలో సీబీఐ దృష్టి సారించింది. వివేకా హత్య గురించి గజ్జెల ఉదయ్ కుమార్ రెడ్డికి 2019 మార్చి 15 తెల్లవారు జామున 4 గంటలకే తెలుసని ఆయన తల్లి తమ పొరుగున ఉండే ప్రభావతి దేవికి చెప్పినట్టుగా సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆ మేరకు ప్రభావతి దేవి 161 వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా వెల్లడించింది. కానీ సీబీఐ వాదనను ప్రభావతి దేవి ఖండించారు. తాను చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తన పేరిట వాంగ్మూలం నమోదు చేసుకుందని ఆవిడ స్పష్టం చేశారు. (చదవండి : Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు') అజేయ కల్లం పేరిట తప్పుడు వాంగ్మూలం సాధారణ వ్యక్తులే కాదు.. ఏకంగా రాష్ట్ర రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ వక్రీకరించడం వివాదాస్పదమైంది. అజేయ కల్లం చెప్పని విషయాలను చెప్పినట్టుగా సీబీఐ తప్పుడు వాంగ్మూలం నమోదు చేసి చార్జ్ïÙట్లో పేర్కొంది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండిస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం సీబీఐ తీరును ఎండగడుతోంది. అజేయ కల్లం చెప్పింది ఇది 2019 మార్చి 15 ఉదయం 5 గంటలకు పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం మొదలైంది. గంటన్నర తర్వాత అంటే 6.30 గంటల సమయంలో సహాయకుడు వచ్చి ఓఎస్డీ కృష్ణ మోహన్‌రెడ్డిని పిలిచారు. ఆయన బయటకు వెళ్లారు. తర్వాత కాసేపటికి కృష్ణమోహన్‌రెడ్డి వచ్చి వైఎస్ జగన్ చెవిలో ఏదో చెప్పారు. దాంతో నిశ్చేష్టులైన వైఎస్ జగన్ వెంటనే లేచారు. తన చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోయారు అని మాతో చెప్పారు. వెంటనే సమావేశాన్ని ఆపేసి బయటకు వచ్చాం’ అజేయ కల్లం చెప్పారంటూ CBI మార్చిన వాంగ్మూలం ఇది ‘2019 మార్చి 15 ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతుండగా.. ఇంట్లో సహాయకుడు వచ్చి వైఎస్ భారతి పిలుస్తున్నారని వైఎస్ జగన్‌కు చెప్పారు. దాంతో లోపలికి వెళ్లిన జగన్ కాసేపటి బయటకు వచ్చి తన చిన్నాన్న వివేకానందరెడ్డి మరణించినట్టు అక్కడ ఉన్న మాకు చెప్పారు’ అని అజేయ కల్లం వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సీబీఐ తెలిపింది. దీన్ని అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. అసలు వైఎస్ భారతి పేరును తాను ప్రస్తావించలేదని, అలాగే తాను 6.30 గంటలని చెప్పగా 5.30 గంటలుగా సీబీఐ పేర్కొందని ఆయన తప్పుబట్టారు. అయినా బయట నిద్రించిన రంగన్న! రక్తం మడుగులో తన యజమాని వివేకానందరెడ్డి చనిపోయి ఉండడాన్ని చూసిన తర్వాత రంగన్న ఏం చేశారంటే.. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం తలుపు దగ్గరకు మూసివేసి బయటకు వచ్చి అటూ ఇటూ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో అక్కడే బీడీ తాగాడు. కాసేపు మెట్ల మీద కూర్చున్నాడు. కాసేపట్లో సమీపంలోని మసీదు నుంచి ఉదయం ప్రార్థనలు వినిపించాయి. దాంతో అక్కడే వరండాలో నిద్రపోయాడు. సీబీఐ అధికారులు ఆ ప్రాంతంలో ఉన్న రెండు మసీదుల్లోని మత పెద్దలతో మాట్లాడారు. వారు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం రోజూ ఉదయం 5 గంటలకు మసీదులో ప్రార్థనలు మొదలవుతాయి. అప్పటికి 15 నిమిషాల ముందే మసీదు మైకుల ద్వారా ఆజాన్ వినిపించడం మొదలు పెడతారు. అంటే తెల్లవారు జామున 3.30 గంటల నుంచి 4.45 గంటల మధ్యలో రంగన్న తన యజమాని వివేకా మృతదేహాన్ని చూశాడు. కానీ తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్న వివేకా వద్ద పని చేసే సిబ్బందికి గానీ.. అక్కడికి పది నిమిషాల్లోనే వెళ్లగలిగేంత సమీపంలో ఉన్న డ్రైవర్ ప్రసాద్ నివాసానికి గానీ.. మరెవరికైనా చెప్పాలనిగానీ అనుకోలేదు. ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల మధ్య వివేకా పీఏ కృష్ణా రెడ్డి, వంటమనిషి లక్షి, ఆమె కుమారుడు ప్రకాశ్ వచ్చే వరకు నిద్రపోతున్నట్టు నటిస్తూ గడిపాడు. పైగా ఉదయం వివేకా నివాసం ఉత్తరం వైపు తలుపు తెరచి ఉండటాన్ని చూసిన పీఏ కృష్ణా రెడ్డి.. తనను ఇంటి లోపలికి వెళ్లి చూడమంటే రంగన్న లోపలికి వెళ్లాడు. అప్పుడు వివేకా మృతదేహాన్ని మొదటి సారి చూసినట్టుగా అందర్నీ నమ్మించాడు. ఆ విషయాన్ని 861 రోజుల తర్వాత సీబీఐ ద్వారా న్యాయస్థానంలో ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. హత్య జరిగిన రెండేళ్ల తర్వాత దస్తగిరి ఇచ్చిన అప్రూవర్ వాంగ్మూలం, రంగన్న ఇచ్చిన వాంగ్మూలం తప్ప మరే ఆధారం లేదు. -
Viveka Case: దారి తప్పిన 'సీబీఐ దర్యాప్తు'
సాక్షి, అమరావతి: ‘మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. రాజకీయంగా అత్యంత సంచలనమైన కేసు.. దర్యాప్తు చేస్తోంది దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ. దర్యాప్తు చేపట్టిన 1,226 రోజుల తర్వాత కూడా సీబీఐ సాధించింది ఇదీ అని చెప్పడానికి ఏమీ లేదన్నది నిర్వివా దాంశం. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందనే మాట చెప్పడం తప్ప.. అందుకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన అభియోగాలకు ఒక్కటంటే ఒక్కదానికి కూడా ఆధారాలు చూపించలేకపోయింది’ అని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ పేర్కొంది. నిష్పాక్షికమైన థర్డ్ పార్టీగా ‘ద వైర్’ వెబ్సైట్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లోని అంశాలను విశ్లేషించింది. రాజకీయ, నేర, న్యాయ సంబంధమైన వార్తా విశ్లేషకురాలిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సరిత రాణి ‘ద వైర్’ వెబ్సైట్లో రాసిన విశ్లేషాత్మక వ్యాసం ఇలా.. సాధించింది శూన్యం 2020 మార్చి 11న వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికే 120 రోజుల సమయం తీసుకుంది. మరో 474 రోజుల తర్వాత 2021 అక్టోబర్‌లో మొదటి చార్జ్‌షీట్ దాఖలు చేసింది. వివేకా హత్యలో పాలుపంచుకున్నారని చెబుతూ ఎర్ర గంగిరెడ్డి(ఏ–1), సునీల్ యాదవ్(ఏ–2), గజ్జల ఉమాశంకర్ రెడ్డి(ఏ–3), దస్తగిరి(ఏ–4)లను నిందితులుగా పేర్కొంది. ఈ హత్య వెనుక విస్తృత కుట్రను వెలికి తీయాల్సి ఉందని చెప్పింది. సీబీఐ తుది చార్జ్‌షీట్ 2023 జూలై 20న బయటకు వచ్చింది. కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, వారి సన్నిహితుడు డి.శివశంకర్‌రెడ్డిలను కూడా నిందితులుగా పేర్కొంది. కానీ సీబీఐ మొదటి నుంచీ పేర్కొంటూ వచ్చిన విస్తృత కుట్ర గురించి మాత్రం ఏమీ చెప్పలేకపోయింది. హత్య వెనుక ఉద్దేశం అంటూ 14 పేరాల సుదీర్ఘ వ్యాసాన్ని చార్జ్‌షీట్‌లో పొందుపరిచింది. అందులో ఏముంది అంటే అందరికీ తెలిసిన వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ నేపథ్యం, వంశ చరిత్ర మాత్రమే. ఇది తప్ప వాస్తవానికి హత్య వెనుక విస్తృత కుట్ర గురించి సీబీఐ స్పష్టంగా ఏమీ చెప్పలేకపోయింది. ఇంతకీ ఇంతటి హైప్రొఫైల్ కేసుకు సంబంధించిన తుది చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు, వాటిలోని వాస్తవాలను పరిశీలిస్తే సీబీఐ దర్యాప్తులో డొల్లతనం బట్టబయలు అవుతోంది. సీబీఐ తాను పేర్కొన్న అభియోగాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క దానికి కూడా ఆధారం చూపించలేకపోయింది. అంతకు మించి వివేకా హత్య వెనుక ఆయన సొంత కుటుంబంలో విభేదాలు, బయట శక్తుల ప్రమేయాన్ని సీబీఐ పట్టించుకోకపోవడం విస్మయ పరుస్తోంది. చార్జ్‌షీట్‌లో సీబీఐ ఏం చెప్పింది.. అందులోని వాస్తవం ఏమిటన్నది అంశాల వారీగా పరిశీలిస్తే ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు సాధించింది శూన్యమన్నది స్పష్టమవుతోంది. సీబీఐ చెప్పిందేమిటి? వాస్తవం ఏమిటి? అన్నది చూద్దాం. 1.వివేకా క్రియాశీలకమైన నేతా? సీబీఐ : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. వాస్తవం : 2019 నాటికి వివేకా రాజకీయంగా ప్రభావవంతమైన నేత కాదు. హత్యకు గురయ్యే 15 ఏళ్ల ముందు 2004లో చివరిసారిగా ఎన్నికల్లో గెలిచారు. దశాబ్ద కాలంగా రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2008లో స్వదేశానికి తిరిగి వచ్చిన వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం సోనియా గాంధీని కలిశారు. కానీ ఆయనకు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. వివేకా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారని ఆయన కుమార్తె సునీతనే సీబీఐకి రెండుసార్లు చెప్పారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మపై పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన రాజకీయాల నుంచి రిటైరై పోయినట్టేనని ఆమె చెప్పారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆయన ఎలాంటి పదవిలో లేరు. పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మ చేతిలో భారీ తేడాతో ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన్ను పట్టించుకోలేదు. ఎమ్మెల్సీగా కూడా నామినేట్ చేయలేదు. ఆయన అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం కూడా ఇందుకు కారణం అయిఉండొచ్చు. 2.అవినాశ్ బలమైన అభ్యర్థి కాదా? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వైఎస్ అవినాశ్ రెడ్డి బలహీనమైన అభ్యర్థి అని వివేకానందరెడ్డి భావించారని షర్మిల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వాస్తవం : అవినాశ్‌రెడ్డి బలహీనమైన అభ్యర్థి అన్నది పూర్తిగా అవాస్తవం. ఆయన అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో 1,90,323 ఓట్ల భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచారు. ఆయన ఎంత బలమైన అభ్యర్థో ఆ మెజార్టీనే చెబుతుంది. ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌తో పార్టీ నిర్ణయం మేరకు తన ఎంపీ పదవికి 2018లో రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అవినాశ్‌రెడ్డి మరింత భారీ మెజార్టీతో అంటే 3,80,976 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిపై అంత మెజార్టీ సాధించడం విశేషం. ఏ రకంగా చూసినా అవినాశ్‌రెడ్డి బలమైన అభ్యర్థి అన్నదాంట్లో సందేహం లేదు. వివేకానందరెడ్డి తాను హత్యకు గురికావడానికి ముందు వరకు కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు. వివేక హత్యకు గురైన ముందు రోజు రాత్రి కూడా అవినాశ్‌రెడ్డి గెలుపు కోసం జమ్మలమడుగులో ప్రచారం చేశారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పినట్టు వెల్లడించారు. అవినాశ్‌రెడ్డే ఎంపీ అభ్యర్థి అన్న విషయంలో మరో మాటే లేదని వివేకానందరెడ్డి సోదరి వైఎస్ విమల కూడా స్పష్టం చేశారు. ఎంపీగా అవినాశ్ గెలుపు కోసం వివేకా చివరి వరకు ప్రచారం చేశారని కూడా ఆమె చెప్పారు. ప్రస్తుతం కొందరు రాజకీయ దురుద్దేశంతో అవినాశ్‌రెడ్డికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 3. షర్మిల వాంగ్మూలంలో చెప్పినదానికి ఆధారం ఎక్కడ? సీబీఐ : 2019 ఎన్నికల్లో కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల కానీ, విజయమ్మ కానీ పోటీ చేయాలని వివేకా భావించారనే విషయాన్ని షర్మిల వెల్లడించారు. వాస్తవం : కడప ఎంపీ అభ్యర్థిత్వం విషయంపై వివేకానందరెడ్డి తనతో చెప్పినట్టుగా షర్మిల వెల్లడించిన సమాచారానికి ఎలాంటి ఆధారం లేదు. ఎంపీగా తానుగానీ తన తల్లి విజయమ్మగానీ పోటీ చేయాలని వివేకా చెప్పినట్టు వాంగ్మూలం ఇచ్చిన షర్మిల.. అందుకు ఎలాంటి ఆధారం చూపించలేకపోయారు. ఎంపీ టికెట్ అంశంపై వారిద్దరు మాట్లాడుకున్నట్టు కూడా గతంలో ఎప్పుడూ మీడియాలోగానీ పార్టీ వర్గాలుగానీ చెప్పలేదు. సీబీఐ ఎలాంటి ఆధారం గురించి పేర్కొన లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ల తర్వాత షర్మిల తన సోదరుడితో రాజకీయంగా విడిపోయి తెలంగాణాలో సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ విషయం కూడా ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకున్నదే. ఒక వేళ కడప ఎంపీ అభ్యర్థి విషయంపై వివేకానందరెడ్డికి వేరే అభిప్రాయం ఉన్నా సరే రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపించదు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో విజయమ్మపై పోటీ చేసినప్పటి నుంచి వైఎస్సార్ కుటుంబ వ్యవహారాల్లో ఆయన పాత్ర పెద్దగా లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ రాజకీయ నిర్ణయాల్లో కూడా ఆయన పాత్ర పెద్దగా ఏమీ లేదన్నది ఆంధ్రప్రదేశ్‌లో అందరికీ తెలిసిన విషయమే. వివేకానందరెడ్డిపై సానుకూల దృక్పథంతో వైఎస్ జగన్ ఆయన్ను వైఎస్సార్ జిల్లా పార్టీ ఇన్చార్జ్ చేశారు. కానీ వివేకా ఏనాడూ కూడా పార్టీ ముఖ్య నేతగా ఉండలేదు. 4. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీబీఐ చెప్పింది కట్టుకథే సీబీఐ : 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి కారణం. అవినాశ్‌రెడ్డి అనుచరుడు డి.శివశంకర్‌రెడ్డి ఎమ్మెల్సీగా పోటీ చేయాలని భావించినప్పటికీ వైఎస్ జగన్ తన చిన్నాన్న వివేకానందరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. దాంతో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి పని చేశారు. దాంతో వివేకా ఆగ్రహంతో డి.శివశంకర్‌రెడ్డిని దూషించారు. వాస్తవం : స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమికి అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివ శంకర్‌రెడ్డి కారణమనడానికి సీబీఐ ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఆ ఎన్నికల్లో ఆ జిల్లాలోని 10 నియోజకవర్గాల పరిధిలోని 800 మందికిపైగా ఓటర్లలో ఎవర్ని ప్రలోభాలకు గురిచేశారో కూడా చెప్పలేకపోయింది. ఆ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో సీబీఐ కనీసం మాట్లాడనే లేదు. ఆ ఎన్నికల్లో వివేకా ఓటమికి, ఆయన హత్యకు సంబంధం ఉన్నట్టుగా కూడా సీబీఐ ఎలాంటి ఆధారాన్ని చూపించనే లేదు. రెండేళ్ల క్రితం నాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విషయంపై తలెత్తిన వివాదం వల్ల తమను దూషించారనే ఉద్దేశంతో 2019 ఎన్నికల ముందు హత్యకు ఎవరైనా ప్రయత్నిస్తారా? అందులోనూ 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన అభ్యర్థి కుటుంబం 2019 ఎన్నికల ముందు హత్య వంటి దుందుడుకు పనులకు ఎందుకు ఒడిగడుతుంది? పైగా 2019 ఎన్నికల్లో 3.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచిన అవినాశ్ రెడ్డికి వివేకాతో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఏమాత్రం ఉండదు. సీబీఐ తమ ఆరోపణకు ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. వివేకా రెండో వివాహంతో ఆ కుటుంబంలో విభేదాలు షమీమ్ అనే మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. వివేకా గుండెకు ఆపరేషన్ చేసుకున్నప్పటికీ ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులలో ఉండటం లేదు. హైదరాబాద్‌లో తన కుమార్తె సునీత నివాసంలో ఉంటున్నారు. నెలకు ఒకట్రెండుసార్లు పులివెందుల వచ్చి వెళుతున్నారు. కుమార్తె సునీత ఏడాదికి ఒకట్రెండుసార్లు మాత్రమే వస్తున్నారు. ‘షమీమ్‌తో మా నాన్న సహజీవనం చేస్తున్నారని 2011లో బయటపటినప్పటి నుంచి ఆయనతో నేను సఖ్యతగా లేను. పులివెందులకు ఎప్పుడోగాని వెళ్లడం లేదు. 2018లో క్రిస్మస్ తర్వాత మళ్లీ నేను పులివెందుల వెళ్లనే లేదు. నా భర్త ఎన్.రాజశేఖర్‌రెడ్డి మాత్రం అప్పుడప్పుడు వెళుతుండేవారు’ అని సునీత చెప్పారు. వివేకానందరెడ్డి తన పేరును అక్బర్ఖాన్గా మార్చుకుని షమీమ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఓ కుమారుడు ఉన్నారు. షమీమ్ కుటుంబం నిర్వహణ బాధ్యత చూస్తుండటంతోపాటు ఆమె చెల్లెళ్లకు పెళ్లిళ్లు చేశారు. బలపనూరులో ఆమె ఇంటి పై అంతస్తును నిర్మించడంతోపాటు 8 సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. ఇక వివేకానందరెడ్డి మొదటి భార్య సోదరులు తనను బెదిరించేవారని షమీమ్ సీబీఐకి చెప్పారు. పెద్ద భార్య పెద్ద సోదరుడు శివప్రకాశ్‌రెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని తెలిపారు. తన కుమారుడికి హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సీటు ఇప్పించడంతోపాటు అక్కడే ఓ ఇల్లు కొని ఇచ్చి.. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని వివేకా షమీమ్‌కు మాట ఇచ్చారు. కానీ అంతలోనే వివేకా హత్యకు గురయ్యారు. అప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో వివేకా వివేకానందరెడ్డి షమీమ్‌ను రెండో వివాహం చేసుకోవడంతోపాటు ఆస్తి ఇస్తానని చెప్పడంతో మొదటి భార్య కుటుంబం ఆగ్రహించింది. కుటుంబానికి చెందిన కంపెనీల్లో ఆయనకు చెక్ పవర్ రద్దు చేసింది.చెక్‌పవర్ రద్దు కావడంతో వివేకా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. మద్యం, ఇతర అవసరాలకు కూడా చేతిలో డబ్బులు లేక అల్లాడిపోయారని వివేకా ఇంట్లో పనివానిగా ఉన్న పెందింటి రాజశేఖర్ చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆయన సునీల్ యాదవ్, దస్తగిరిలతో సన్నిహితమయ్యారు. వారు చెప్పినట్టు చేస్తే వారిద్దరు డబ్బులు తెస్తారని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో చెప్పేవారు. ఎనిమిది మంది నుంచి రూ.5 కోట్లు అప్పు తీసుకున్నారు. ఓసారి పెందింటి రాజశేఖర్ వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పారు. తమ ఇంట్లో డబ్బు కోసం ఏదో గొడవ జరుగుతోంది.. వివేకానందరెడ్డి బాగా తాగేసి గొడవ చేస్తున్నారని చెప్పారు. ‘మా నాన్న వివేకా ఇష్టానుసారంగా అప్పులు చేసి, తీర్చకపోవడంతో కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ట్రాక్ రికార్డ్ సరిగా లేకపోవడంతో కంపెనీలకు బ్యాంకులు అప్పులు ఇచ్చేందుకు సుముఖత చూపలేదు. కంపెనీల నిర్వహణకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు అడ్డంకిగా ఉండకూడదనే మా నాన్న చెక్ పవర్‌ను రద్దు చేశాం’ అని సునీత చెప్పారు. వాస్తవం ఏమిటంటే.. వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన స్థానంలో సునీత ఆ కంపెనీల్లో డైరెక్టర్ అయ్యారు. జీవించి ఉండగా రోజువారి ఖర్చుల కోసం వివేకా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆయన మరణించిన తర్వాత కొన్ని నెలలకే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆ కంపెనీ అప్పులన్నీ చాలా వరకు తీర్చేశారు. కంపెనీలన్నీ గాడిలో పడ్డాయి. ఈ ఏడాది జనవరిలో 93 ఎకరాల భూమిని సౌభ్యాగమ్మ, సునీత పేరిట బదిలీ చేశారు. బయటి శక్తుల పాత్ర పట్టించుకోని సీబీఐ వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ దర్యాప్తు ఇప్పటికీ ఎలాంటి స్పష్టత ఇవ్వనే లేదు. కుటుంబ విభేదాలు, రాజకీయంగా అడ్డుకునేందుకు యత్నించారంటూ సీబీఐ చెబుతున్న కారణాలేవీ కూడా నమ్మదగ్గవిగా లేవు. వాటికి ఎలాంటి ఆధారాలూ లేవు. అదే సమయంలో వివేకా కుటుంబంలో విభేదాలు, ఇతర అంశాలను కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. మొత్తం ఉమ్మడి కుటుంబంలో విభేదాలు అనే అంశాన్నే సీబీఐ ప్రధానంగా ప్రస్తావిస్తుండటం కేవలం కేసును తప్పుదారి పట్టించేందుకేనని స్పష్టమవుతోంది. వివేకా హత్య వెనుక బయటి శక్తుల ప్రమేయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించనే లేదు. ఇప్పటి వరకు కేవలం సీబీఐ అప్రూవర్‌గా మార్చిన నిందితుడు దస్తగిరి, వాచ్‌మేన్ రంగయ్య వాంగ్మూలాలనే ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేస్తోంది. కానీ వారు నిజాలే చెబుతున్నారడానికి ఆధారం ఏమిటి? -
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ
-
వివేకా హత్య కేసులో రాజకీయ కోణం ఎక్కడా లేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వివేకా కేసులో సీబీఐ విచారణపై ఓ వర్గం మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విచారణను పక్కదారి పట్టించేలా, దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎల్లోమీడియా చర్చలు పెట్టిందని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక ఇలాటి పనులు చేస్తున్నారని, వ్యవస్థను కించపరిచేలా ఒక మూకలా తయారై దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు మీడియా పరిధులు దాటి వ్యహరిస్తోందని విమర్శించారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కథనాలు జడ్జికి దురుద్దేశాలు ఆపాదిస్తూ.. అతనికి డబ్బు మూటలు అందాయంటూ ఆ వర్గం మూఠా వ్యాఖ్యలు చేసిందని అన్నారు. జడ్జి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఏబీఎన్, మహాటీవీ కథనాలు ప్రచురించిందని, స్వేచ్చగా నిర్ణయం తీసుకోకుండా ప్రభావితం చేసేలా చర్చలు చేపట్టిందని పేర్కొన్నారు. వ్యక్తిత్వ హననానికి ఎల్లో మీడియా ప్రయత్నించిందని.. దర్యాప్తునకు సంబంధించిన అంశాలు వారికెలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరైన నేపథ్యంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘ఓ వర్గం మీడియా తమ సొంత అజెండాతో దుష్ప్రచారం చేస్తోంది. మీడియా ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు జరగాలి. టీవీ ఛానళ్ల డిబేట్లలో రెచ్చిపోయి వ్యాఖ్యానాలు చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. నిజాయితీపరులపై అమానుషంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ జగన్‌దే తుది నిర్ణయం వైఎస్ జగన్ చెమటోడ్చి నిర్మించుకున్న పార్టీ వైఎస్సార్సీపీ. ఆ తర్వాతే వివేకా పార్టీలో చేరతానంటే జగన్ ఆహ్వానించారు. పార్టీలో ఎవరికి టికెట్లు ఇవ్వాలనే విషయంలో జగన్‌దే తుదినిర్ణయం. ఎవరికి టికెట్లు ఇస్తే పార్టీకి ఉపయోగపడుతుందనేది జగన్ ఇష్టం. వివేకా హత్య కేసు విషయంలో రాజకీయం కోణం ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎవరిని అడిగిన ఆ విషయం చెప్తారు. ఒక్క కోణంలోనే సీబీఐ దర్యాప్తు లేఖను దాచిపెట్టాలని వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. కేవలం ఒక్క కోణంలోనే సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. వివేకా హత్య వెనక ఆస్తికి సంబంధించి వివాదాలు ఉన్నాయి. ఆస్తి, కుటుంబ వ్యవహారాల్లో దర్యాప్తు జరపడం లేదు. కీలక అంశాలపై సీబీఐ విచారణ చేపట్టలేదు. టీడీపీకి అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టా? ప్రతికూలంగా కోర్టు తీర్పులు వస్తే ప్రజాస్వామ్యం ఓడినట్టా? చివరకు న్యాయమే గెలుస్తుందని హైకోర్టు తీర్పుతో స్పష్టమైంది’ అని సజ్జల వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాశ్ రెడ్డికి ఊరట లభించిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివేకా కేసులో కస్టడీ విచారణ అవసరం లేదని కోర్టు తెలిపింది. -
అవినాశ్ ముందస్తు బెయిలుపై నిర్ణయానికి ఇన్ని రోజులా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిలుపై నిర్ణయం తీసుకోవడానికి ఇన్ని రోజులా అని తెలంగాణ హైకోర్టుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తంచేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఉత్తర్వులు జారీ చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. అవినాశ్ పిటిషన్‌పై ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపి తగిన ఆదేశాలివ్వాలని ఆదేశించింది. గతంలో మరో బెంచ్ విచారించినప్పటికీ వెకేషన్ బెంచ్ విచారణకు అడ్డంకి కాదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు (జూన్ 5) వచ్చే వరకు సీబీఐ నుంచి మధ్యంతర రక్షణ కల్పించాలని లేదా తన పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశాలివ్వాలంటూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఏప్రిల్‌లో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత హైకోర్టు విచారించలేదా అని జస్టిస్ నరసింహ ప్రశ్నించారు. హైకోర్టు రెండుసార్లు విచారించిందని, ఉత్తర్వులు ఇవ్వలేదని, జూన్ 5కు వాయిదా వేసిందని, మే 15న సీబీఐ నుంచి నోటీసులు వచ్చాయని అవినాశ్ తరపున సీనియర్ న్యాయవాది వి.గిరి తెలిపారు. ఆ తర్వాత ఏం జరిగిందని ధర్మాసనం ప్రశ్నించగా.. సీబీఐ నోటీసులు ఇచ్చిందన్నారు. ‘హైకోర్టులో విచారణ ఉండగా సీబీఐ నోటీసులు ఇవ్వడం గమనార్హం’ అని అభిప్రాయపడిన ధర్మాసనం.. సీబీఐ విచారణకు హాజరు కాలేదు కదా అని అనగా.. ఏడుసార్లు పిటిషనర్ హాజరయ్యారని గిరి తెలిపారు. ఒక్క రోజు వ్యవధిలో రావాలని నోటీసులు ఇవ్వడంతో మూడు రోజులు సమయం కోరామన్నారు. సీబీఐ తరపున ఎవరైనా హాజరయ్యారా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ఎవరూ హాజరు కాలేదని వైఎస్ వివేకా కుమార్తె సునీత తరపు న్యాయవాది లూత్రా తెలిపారు. హైకోర్టులో ఏప్రిల్ 27న ఇద్దరి పిటిషన్లూ విచారణకు వచ్చాయని, సీజే వద్దకు వెళ్లినా ఎలాంటి ఆర్డర్ రాలేదని, జూన్ 5న మేటర్ జాబితా అయిందని లూత్రా వివరించారు. జస్టిస్ నరసింహ జోక్యం చేసుకొని.. ఏమైనా అరెస్టు భయం ఉందా అని ప్రశ్నించారు. తాను మొదటి నుంచి అదే చెబుతున్నానని, ఇప్పటికే అవినాశ్ తండ్రి అరెస్టయ్యారని, తల్లి ఆసుపత్రిలో ఉన్నారని గిరి చెప్పారు. ఈ సమయంలో లూత్రా జోక్యం చేసుకోవడంతో గిరి ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గిరిని ధర్మాసనం మందలించడంతో ఆయన ధర్మాసనానికి క్షమాపణలు తెలిపారు. బెయిలు కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని ధర్మాసనం లూత్రానుద్దేశించి వ్యాఖ్యానించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ గురించి ఆరా తీసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు వెకేషన్ బెంచ్ వినాలని సూచిస్తామని తెలిపింది. హైకోర్టుకు వెళ్లాలని ఇరువర్గాలకు తెలిపింది. అవినాశ్ వద్దకు వెళ్లాలని సీబీఐ ప్రయత్నించగా వందలాది మంది అనుచరులు అడ్డుకున్నారని లూత్రా అనగా.. అవన్నీ సీబీఐ న్యాయవాది చెబుతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం జస్టిస్ నరసింహ ఉత్తర్వులు వెలువరించారు. Justice Narasimha: He has the right to... Mr. Luthra you can take all these objections when the anticipatory bail is taken up by vacation bench. — Live Law (@LiveLawIndia) May 23, 2023 Bench: ...We are inclined to accept the prayer as the anticipatory bail taken up for hearing pursuant to our order was heard, but no order was passed...We direct the Criminal LP...will be placed before next vacation bench on 25.05.2023... — Live Law (@LiveLawIndia) May 23, 2023 ఇది కూడా చదవండి: టీడీపీ మీడియాకే స్వేచ్ఛ ఉంటుందా.. విలువలు లేకుండా ఇంతలా దిగజారాలా? -
అవినాష్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
సాక్షి, గుంటూరు: వివేకా కేసులో తమ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని, తన తల్లికి సీరియస్‌గా ఉంది గనుకే ఇవాళ విచారణకు హాజరు కాలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయితే.. అవినాష్‌రెడ్డి గైర్హాజరు విషయంలో కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో కథనాలు ప్రసారం చేస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారాయన. శుక్రవారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశంతోనే అవినాష్ హైదరాబాద్‌కు వచ్చారు. తల్లి అనారోగ్యం గురించి సీబీఐకి సమాచారం ఇచ్చే ఉంటారు. అయినా ఏదో జరిగిపోతోందంటూ కొందరు హడావిడితో కూడిన ప్రచారం చేస్తున్నారు. కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో దుష్ఫ్రచారం చేస్తున్నాయి.. వార్తలు ఇస్తున్నాయి. గతంలో ఆయన సీబీఐ పిలిచిన ప్రతీసారి హాజరయ్యారు. ఆయన సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. అవినాష్‌రెడ్డి ఎక్కడికీ పోవడం లేదు.. తప్పించుకోవాల్సిన అవసరం అవినాష్‌రెడ్డికి లేదు అని సజ్జల స్పష్టం చేశారు. అవినాష్‌పై బుదర చల్లాలనే కొంత మంది అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, వైఎస్ సునీత, పచ్చమీడియా.. అంతా కలిసి అవినాష్‌పై అసత్య ప్రచారం చేయిస్తున్నారు అని సజ్జల ఆరోపించారు. అసలు హంతకుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు సీబీఐ పిలిచినప్పుడల్లా అవినాష్ విచారణకు హాజరయ్యారు. తల్లికి అనారోగ్యం అని క్రియేట్ చేసుకుని.. విచారణకు ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. కానీ, నిందితుడు, గూగుల్ టేకౌట్ అని రకరకాల పేర్లతో సీబీఐ హడావిడి చేస్తోంది. అయిదు సార్లు విచారణకు హాజరైన అవినాష్ ఇప్పుడెందుకు వెళ్లడు?. ఒకవేళ తీవ్రపరిణామాలు ఎదురైనా.. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. తల్లికి బాగలేదని సీబీఐకి చెప్పి మరీ వెళ్లాడు. సీబీఐ ఎదుటకు రేపు అయినా వెళ్లాల్సిందేగా?. అసలు హత్య చేశానన్నవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. నేరుగా సెటిల్మెంట్ చేస్తున్నాడు. కానీ, ఒక ఎంపీని మాత్రం వెంటాడుతున్నారు అని సజ్జల ఆక్షేపించారు. ఆ ఫ్యామిలీ అలాంటిది కాదు అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని కూడా వివేకా కేసులో సీబీఐ పిలవగానే విచారణకు వెళ్లారు. అన్యాయం ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తారు. ఒక ఎంపీపై బురద జల్లడం సబబు కాదు. వివేకా హత్యలో నిజంగా అవినాష్ పాత్ర ఉంటే.. అప్పట్లో చంద్రబాబు ఊరుకునేవారా?. వాస్తవాలు బయటకు రావాలనే సీబీఐ విచారణ చేస్తున్నా మేం అభ్యంతరం పెట్టలేదు. కానీ, వ్యక్తిత్వ హననం చేయడం కరెక్ట్ కాదు అని సజ్జల అన్నారు. ఇదీ చదవండి: అవినాష్‌రెడ్డి తల్లికి సీరియస్ -
దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట..
నేను సీబీఐ ఎస్పీకి చెప్పని వాటిని కూడా చెప్పినట్లుగా ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురించడం దిగజారుడు జర్నలిజానికి పరాకాష్ట. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మృతి చెందారని వైఎస్ జగన్ నాతో అన్నారని నేను సీబీఐకి వెల్లడించినట్లు వెలువడ్డ కథనం పచ్చి అబద్ధం. – అజేయ కల్లం సాక్షి, అమరావతి: మేనిఫెస్టో కమిటీ సమావేశానికి, హత్య కేసుకు సంబంధం ముడిపెడుతూ కథనాలను ప్రచురించటాన్ని బట్టి ఆంధ్రజ్యోతి ఏ స్థాయికి దిగజారిందో అర్ధం అవుతోందని ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు వైఎస్ జగన్ తనకు చెప్పారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త పచ్చి అబద్ధమని అజేయ కల్లం ఖండించారు. అంతకుముందే మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగిందని, అందులో పాల్గొన్న వారిని విచారించాలంటూ గతంలో ఓ కథనం వెలువరించిందని, అందులో భాగంగానే మళ్లీ పచ్చి అబద్ధాలను ప్రచురించిందన్నారు. ఏదో ఒకవిధంగా ముఖ్యమంత్రి జగన్ పేరును లాగాలనే ప్రయత్నం మినహా ఆంధ్రజ్యోతి కథనాల్లో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. విశ్వసనీయ వర్గాలంటూ తప్పుడు సమాచారంతో ఆ పత్రిక విశ్వసనీయతను కోల్పోయిందని విమర్శించారు. సీబీఐ తనను విచారించిందంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తను గురువారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అజేయ కల్లం తీవ్రంగా ఖండించారు. కొద్దిరోజుల క్రితం సీబీఐ ఎస్పీ తన ఇంటికి వచ్చి ఐదు నిమిషాలు మాట్లాడి సమాచారం తీసుకున్నారని, ఆ సమయంలో గుండెపోటు అంశం చర్చకే రాలేదని, దాని గురించి అడగలేదని అజేయ కల్లం వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందిన రోజు యాధృచ్ఛికంగా పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశం జరుగుతోందన్నారు. తమకు కాలేజీలో పాఠాలు బోధించిన గురువు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మేనిఫెస్టో రూపకల్పనలో సహాయం చేయాలని కోరడంతో సమాశానికి వెళ్లానని అజేయ కల్లం తెలిపారు. సమావేశం జరుగుతుండగా కొంతసేపటికి ‘వివేకానందరెడ్డి గారు నో మోర్..’ అని ఇంగ్లీషులో చెప్పడంతో ఇక లేచి వచ్చేశామన్నారు. అదే విషయాన్ని సీబీఐ ఎస్పీకి చెప్పానన్నారు. ‘మీరు స్వచ్ఛందంగా అంగీకరిస్తే రికార్డు చేసుకుంటామని సీబీఐ ఎస్పీ కోరారు. సెక్షన్ 161 కింద సమాచారాన్ని అడిగారు. అయితే ఆ సమాచారం, రికార్డుకు ఎటువంటి న్యాయపరమైన విలువ ఉండదు. సంతకాలు తీసుకోలేదు’ అని అజేయ కల్లం పేర్కొన్నారు. ‘సాంకేతికంగా ఎటువంటి విలువ ఉండదు. ఎవిడెన్స్‌గా పనికిరాదు. ఆ సెక్షన్ కింద కొన్ని అంశాలు యాడ్ చేసుకోవచ్చు, కొన్ని అంశాలు తొలగించవచ్చు’ అని కల్లం తెలిపారు. గుండెపోటు మాటే చర్చకు రాలేదు.. అసలు గుండె పోటు అనే పదమే సీబీఐ ఎస్పీని కలుసుకున్న సందర్భంగా చర్చకు రాలేదని అజేయ కల్లం స్పష్టం చేశారు. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో రహస్యంగా ఉండాల్సిన తమ ఇద్దరి సంభాషణ సమాచారం లీకుల పేరుతో ఆంధ్రజ్యోతిలో రావడం అంటే సీబీఐ విశ్వసనీయత కూడా దెబ్బతిన్నట్లేనని పేర్కొన్నారు. ఇది సీబీఐ పేరును దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. సీబీఐ ముందుకొచ్చి ఇలాంటి లీకు వార్తలను నిరోధించడంతో పాటు ఖండించాల్సి ఉందన్నారు. ‘మేనిఫెస్టో కమిటీ సమావేశంలో ఆ పనిమీద దృష్టి పెడతాం కానీ గడియారం చూసుకుంటూ కూర్చోం కదా! ఎవరు ఎప్పుడు బయటకు వెళ్లారో ఎలా తెలుస్తుంది? అయినా ఈ సమావేశాన్ని సీరియస్ మర్డర్ కేసుకు ముడిపెట్టి ఆంధ్రజ్యోతి తనకు కావాల్సినట్లు రాసుకోవడం కంటే అనైతికం మరొకటి ఉండదు..’ అని కల్లాం మండిపడ్డారు. ఖండించాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది తన దగ్గర నుంచి తీసుకున్న సమాచారం చార్జిషీటు వేసేవరకు రహస్యంగా ఉండాలని, లీకుల పేరుతో తప్పుడు సమాచారం మీడియాలో ప్రచురితమైనందున ఆ వార్తను ఖండించాల్సిన బాధ్యత సీబీఐపై ఉందని కల్లాం పేర్కొన్నారు. తప్పుడు సమాచారంతో మీడియాలో సమాంతర దర్యాప్తు జరగకూడదని, ఇన్విస్టిగేషన్ ఏజెన్సీలు మీడియాకు వివరాలు వెల్లడించరాదని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని కల్లాం ప్రస్తావించారు. నిందారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కూడా అందుబాటులో లేని సమాచారాన్ని మీడియాలో లీకుల పేరుతో ప్రచురించకూడదన్నారు. నా భార్యకు కూడా తెలియదు.. ‘దర్యాప్తు అంశాలను ఇష్టానుసారం ప్రచురించేందుకు, మీడియా తమ ఇష్టం అనేందుకు వీల్లేదని సుప్రీం కోర్టు తాజా తీర్పులున్నాయి. కనీస క్రమశిక్షణ, కోడ్ ఆఫ్ కాండక్ట్ మీడియాకు అవసరం. నేను సీబీఐ ఎస్పీకి చెప్పని అంశాలను చెప్పినట్లుగా నా ఫొటోతో పెద్ద శీర్షిక పెట్టి కథనాలు ప్రచురించటాన్ని బట్టి ఆ పత్రిక ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తోంది. ఆ సమయంలో నేను, సీబీఐ ఎస్పీ మాత్రమే ఉన్నాం. మా ఇంటికి సీబీఐ ఎస్పీ వచ్చిన విషయం నా భార్యకు కూడా తెలియదు. ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్త ప్రచురించిన తరువాతే మిగతా వారికి తెలిసింది’ అని కల్లాం తెలిపారు. ‘సెక్షన్ 161 కింద ఇచ్చిన సమాచారానికి ఎటువంటి న్యాయపరమైన విలువ లేదు. అయినా సాక్షిగా కూడా కాదు. తప్పుడు వార్తపై తగిన సమయంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటా’ అని చెప్పారు. సమాంతర విచారణ తగదు.. ఏదైనా క్రిమినల్ కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు దానికి సమాంతరంగా విచారణను ప్రభావితం చేసేలా మీడియా కథనాలను రాయకూడదు, చర్చలు పెట్టకూడదు. దర్యాప్తు సమయంలో విచారణాధికారికి సాక్షులు వెల్లడించిన అంశాలను చార్జిషీట్ వేసేవరకు బహిర్గతం చేయకూడదు. విచారణలో వెల్లడైన అంశాలను బహిర్గతం చేస్తూ కథనాలను ప్రచురిస్తే వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లేనని పలు కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పులిచ్చాయి. దీన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా స్వాగతించింది’ అని పేర్కొంటూ ఈ సందర్భంగా అజేయ కల్లం వాటిని ఉదహరించారు. చదవండి: గేరు మార్చి.. స్పీడ్ పెంచి.. సీఎం జగన్ బలం అదే.. ఇదీ లెక్క..! -
సీబీఐ కార్యాలయానికి సునీత భర్త రాజశేఖర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. వివేకా హత్య కేసులో స్టేట్మెంట్ను సీబీఐ రికార్డు చేసింది. సుమారు 3 గంటల పాటు సీబీఐ అధికారులు విచారించారు. రెండోసారి సీబీఐ విచారణకు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. కాగా, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు కాల పరిమితిని సుప్రీంకోర్టు పొడిగించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుండగా తాజాగా జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు వెలువరించిన సంగతి తెలిసిందే. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు(బుధవారం) వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. చదవండి: వివేకా హత్య కేసు: కుట్రదారులతో కుమ్మక్కు -
దస్తగిరితో డ్రామా! అప్రూవర్ వాంగ్మూలం ఉత్త కథే
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఎంత బోగస్ అనేది బట్టబయలైంది. ఆ చార్జ్‌షీట్ ఎంత కల్పితాల కట్టుకథో స్పష్టమైంది. వివేకాను హత్య చేసిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి ఇప్పించిన అవాస్తవ వాంగ్మూలం బండారం బహిర్గతమైంది. వాంగ్మూలంలో దస్తగిరి పేర్కొన్న బెంగళూరు భూ సెటిల్మెంట్ వ్యవహారం పూర్తిగా ఫేక్ అని సీబీఐ దర్యాప్తులోనే నిర్ధారణ కావడం గమనార్హం. వివేకాతో ఆయన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డికి వివాదాలున్నాయని ఓ కట్టుకథను కేంద్ర బిందువుగా చేసుకుని దాన్ని వైఎస్ భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డితో అంటగడుతూ దస్తగిరి ద్వారా సీబీఐ నడిపించిన డ్రామా గుట్టు వీడింది. కొత్త బృందం.. పాత పాటే! ‘బెంగళూరు భూసెటిల్మెంట్ వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డికి వాటా ఇవ్వకుండా వైఎస్ వివేకా ఎగ్గొట్టారు. దీంతో ఎర్ర గంగిరెడ్డి కక్ష పెంచుకుని వివేకాను హత్య చేయాలని నాతో చెప్పారు..!’ ఇదీ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో కీలక అంశం. ‘వివేకాను హత్య చేసిన తరువాత ఆ ఇంట్లో భూమి పత్రాల కోసం ఎర్రగంగిరెడ్డి గాలించారు..’ అని కూడా అందులో పేర్కొన్నారు. 2019 మార్చి 14న అర్ధరాత్రి దాటిన తరువాత వైఎస్ వివేకాను హత్య చేశామని దస్తగిరి చెప్పినట్టు వాంగ్మూలంలో ఉంది. దస్తగిరిని ఢిల్లీకి తరలించి కొద్ది వారాలపాటు చిత్రహింసలు పెట్టి మరీ ఇప్పించిన ఈ వాంగ్మూలం మినహా సీబీఐ వద్ద ఎలాంటి ఆధారం లేదు. పాత బృందంతోపాటు తాజాగా నియమించిన సీబీఐ కొత్త బృందం కూడా ఈ ఒక్క వాంగ్మూలం ఆధారంగానే దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే ఆ వాంగ్మూలం కట్టుకథేనని స్పష్టమైంది. డాక్యుమెంట్లు ఫేక్... సెటిల్మెంట్ ఫేక్ బెంగళూరు యలహంక ప్రాంతంలోని 8.6 ఎకరాల భూమి విషయంపై వై.రాధాకృష్ణ మూర్తి, హిమాచలపతి అనే వ్యక్తుల మధ్య విభేదాలున్నాయి. ఈ విషయం తెలిసి వైఎస్ వివేకానందరెడ్డి తన స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డితోపాటు లక్ష్మీకర్, మరికొందరితోపాటు వై.రాధాకృష్ణమూర్తిని కలసి తాము ఆ వివాదాన్ని పరిష్కరిస్తామన్నారు. భూమి వివాదం పరిష్కరిస్తే రూ.8 కోట్లు ఇస్తానని రాధాకృష్ణమూర్తి చెప్పారు. యలహంక ఎమ్మెల్యేగా ఉన్న అప్పటి కర్ణాటక హోంమంత్రి ద్వారా ఆ భూ వివాదాన్ని పరిష్కరించేందుకు వైఎస్ వివేకా ప్రయత్నించారు. ఈ క్రమంలో హోంమంత్రి పోలీసు అధికారులను పిలిచి ఆ భూ వివాదంపై చర్చించడంతో రాధాకృష్ణమూర్తి ఇచ్చిన భూమి పత్రాలు ఫోర్జరీవని తేలింది. బెడిసికొట్టిన బ్యాంకు రుణం భూమి పత్రాలు ఫోర్జరీవని తెలిసినప్పటికీ వైఎస్ వివేకా వాటి ఆధారంగా సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ పీటర్ క్యాండీని సంప్రదించారు. ఫోర్జరీ పత్రాలను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం ఇప్పించాలని కోరారు. బ్యాంకు రుణం వస్తే అందులో 60 శాతం వివేకా, రాధాకృష్ణమూర్తి పంచుకోగా మిగిలిన 40 శాతాన్ని బ్రోకర్ పీటర్ క్యాండీ తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. లీగల్ ఖర్చుల కోసం పీటర్ క్యాండీకి మల్లిశెట్టి వెంకటరమణ అనే వ్యక్తి ద్వారా వైఎస్ వివేకా రూ.24 లక్షలు ఇప్పించారు. అయితే ఏడాది దాటినా రుణం ఇచ్చేందుకు ఏ బ్యాంకు కూడా సమ్మతించలేదు. దీంతో తాను ఇచ్చిన రూ.24 లక్షలు తిరిగి ఇవ్వాలని వివేకా, పీటర్ క్యాండీని మల్లిశెట్టి వెంకటరమణ ఒత్తిడి చేశారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో 2019 ఫిబ్రవరి, మార్చిలో నాలుగు డిమాండ్ డ్రాఫ్ట్‌ల రూపంలో రూ.24 లక్షలు తిరిగి చెల్లించారు. చివరి డిమాండ్ డ్రాఫ్ట్‌ను 2019 మార్చి 12న అంటే వివేకా హత్యకు రెండు రోజుల ముందే చెల్లించారు. పీటర్ క్యాండీ తన వద్ద ఉన్న ఫోర్జరీ పత్రాలను సైతం రాధాకృష్ణమూర్తి కుమారుడు వెంకట ప్రసాద్‌కు తిరిగి ఇచ్చేశారు. ఇక ఆ భూమి సెటిల్మెంట్ చేయడం, బ్యాంకు రుణం తీసుకోవడం సాధ్యం కాదని తేలడంతో ఆ వ్యవహారాన్ని వదిలేశారు. ఈ సెటిల్మెంట్ చేసేందుకు యత్నించిన వైఎస్ వివేకా స్నేహితుడు ఎర్ర గంగిరెడ్డికి మొత్తం వ్యవహారం తెలుసు. అంటే బెంగళూరు భూ సెటిల్మెంట్ అన్నదే లేదని, భూమి పత్రాలు సైతం వివేకా వద్ద లేవని ఎర్ర గంగిరెడ్డికి స్పష్టంగా తెలుసు. ఇదంతా సీబీఐ దర్యాప్తులోనే వెల్లడైంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న రాధాకృష్ణమూర్తి, హిమాచలపతి, వెంకట ప్రసాద్, పీటర్ క్యాండీలను సీబీఐ అధికారులు విచారించి మరీ దీన్ని నిర్ధారించుకున్నారు. జరగని సెటిల్మెంట్.. లేని పత్రాల కోసం హత్య ఏమిటి? అసలు బెంగళూరు భూసెటిల్మెంట్ అనేది జరగలేదని ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. అటువంటప్పుడు వైఎస్ వివేకా తనకు వాటా ఇవ్వలేదని కక్ష ఎందుకు పెంచుకుంటారు? అంటే ఈ కారణంతో వివేకాను హత్య చేయాలని ఎర్ర గంగిరెడ్డి తనకు చెప్పినట్లు దస్తగిరి పేర్కొనడం పూర్తిగా అవాస్తవం అని తేటతెల్లమవుతోంది. వైఎస్ వివేకాను హత్య చేసిన తరువాత ఆయన ఇంట్లో బెంగళూరు భూమి పత్రాల కోసం ఎర్ర గంగిరెడ్డి, తాము గాలించినట్లు దస్తగిరి చెప్పాడు. కానీ ఆ భూమి పత్రాలను అప్పటికే రాధాకృష్ణమూర్తి కుమారుడికి తిరిగి ఇచ్చిన విషయం ఎర్ర గంగిరెడ్డికి తెలుసు. దీన్నిబట్టి దస్తగిరి చెప్పింది అవాస్తవమే అని స్పష్టమవుతోంది. ఇక బెంగళూరు భూ సెటిల్మెంట్ అన్నదే లేదని ఎర్ర గంగిరెడ్డికి తెలిసినప్పుడు ఆ కారణంతో వైఎస్ వివేకాను హత్య చేయమని చెప్పడంగానీ, తనకు అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి సహకారం ఉందనడం కూడా అవాస్తవం అని నిర్ధారణ అవుతోంది. అంటే అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం పేరిట సీబీఐ పూర్తిగా కల్పిత కథనాలను అల్లినట్లు తేలిపోతోంది. అసలు ఆ వాంగ్మూలమే అవాస్తవం అయినప్పుడు దాని ఆధారంగా భాస్కర్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డిని విచారణ పేరిట సీబీఐ వేధించడం దురుద్దేశపూరితమేని స్పష్టమవుతోంది. -
సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులూ రాలేదు
పులివెందుల: విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చి శనివారం తనను విచారణకు పిలిచినట్లు కొన్ని వార్తా పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని ఖండించారు. గతంలో నోటీసు ఇవ్వడానికి సీబీఐ అధికారులు వచ్చినప్పుడు తాను ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల వల్ల ఈనెల 24 తర్వాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని తెలిపారు. ఆ తర్వాత తనకు సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. -
సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా
-
సీబీఐ దర్యాప్తుపై సందేహాలు: ఎంపీ అవినాశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ.. నిజాన్ని వెలికితీసే కోణంలో కాకుండా, వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని సాగుతోందన్న భావన కలుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి అన్నారు. సీబీఐ విచారణ సరైన దిశలో వెళ్లాలని చెబుతున్నానే తప్ప అనుమానించడం లేదని స్పష్టం చేశారు. మీడియా సైతం ఈ విషయంలో నిజాలను నిజాలుగా చూపాలని కోరారు. తనకు తెలిసిన అన్ని నిజాలను పొందుపరుస్తూ సీబీఐ అధికారులకు వినతిపత్రం ఇచ్చానని, అందులోని అంశాలపైనా విచారణ జరగాలని కోరినట్టు తెలిపారు. అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కోఠిలోని సీబీఐ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరయ్యారు. అనంతరం సాయంత్రం బయటికి వచ్చాక మీడియాతో మాట్లాడారు. జనవరి 28న విచారణకు కొనసాగింపుగా శుక్రవారం రెండోసారి సీబీఐ అధికారుల విచారణకు హాజరైనట్లు తెలిపారు. గతంలో విచారణప్పుడు మరోమారు పిలుస్తామని చెప్పారని, ఈసారి మాత్రం మళ్లీ విచారణకు రావాలని చెప్పలేదన్నారు. ఎంపీ ఇంకా ఏమన్నారంటే.. మీడియా బాధ్యతగా వ్యవహరించాలి మీడియా బాధ్యతగా వార్తలు ప్రసారం చేయాలని మనవి చేస్తున్నా. గతంలోనూ ఇదే విషయం చెప్పాను. మళ్లీ అదే చెబుతున్నా. నేను విజయమ్మ గారి దగ్గరికి వెళ్లి వస్తే.. బెదిరించి వచ్చానని చర్చలు పెట్టి, ప్రచారం చేస్తున్నారు. అది ఎంత వరకు సబబు? నేను దుబాయ్‌కి వెళ్లిపోయానని వక్రీకరించే వార్తలు వేస్తున్నారు. ► తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్లు చేశానని వక్రీకరించే వార్తలు వేయడమే కాకుండా దానిపై గంటల తరబడి, రోజులపాటు చర్చలు పెడుతున్నారు. విచారణ జరుగుతున్నప్పుడు మీడియా బాధ్యతగా మెలగాలి. మీడియానే ట్రయల్ పూర్తి చేసి..దోషులెవరో, నిర్దోషులెవరో మీడియానే నిర్ణయిస్తోంది. ఇది విచారణపై ఎంత ప్రభావం పడుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నం జరుగుతోంది. అదేవిధంగా ఒక నిజాన్ని వంద నుంచి సున్నా చేసే ప్రయత్నం జరుగుతోంది. ► ముందు నుంచి కూడా ఫ్యాక్ట్ టార్గెట్‌గా కంటే పర్సన్ టార్గెట్‌గా విచారణ జరగడం సరికాదు. గూగుల్ టేకౌట్ అన్నది నిజమైన గూగుల్ టేకౌటా.. టీడీపీ టేకౌటా అన్నది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే.. సీబీఐ సమర్పించిన కౌంటర్లోని విషయాలన్నీ ఏడాది క్రితం టీడీపీ వాళ్లు చేసిన విమర్శలే. అందువల్ల ఎవరికైనా సందేహాలు రావడం సహజం. ఈ పరిస్థితిలో విచారణ సరైన కోణంలో వెళ్లాలని చెబుతున్నాను తప్ప.. నేను అనుమానించడం లేదు. ఆ రోజు చెప్పిందే ఈ రోజూ చెబుతున్నా ► వివేకం సార్ చనిపోయిన రోజు నేను మార్చురీ దగ్గర మీడియాతో మాట్లాడాను. మళ్లీ రెండు రోజుల తర్వాత కూడా మీడియాతో మాట్లాడాను. ఆ రోజు ఏం మాట్లాడానో.. ఈ రోజు కూడా అదే మాట్లాడుతున్నా. సీబీఐ వాళ్లకు అదే చెబుతున్నా. ఎవరెన్నిసార్లు పిలిచి అడిగినా అదే చెబుతా. ఎందుకంటే నాకు తెలిసిన నిజం అదే కాబట్టి. ► ఆ రోజు ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి నేనే. అందుకే నేను ఆ రోజు చెప్పిందే ఈ రోజూ చెబుతున్నా. సీబీఐ వారి ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పాను. ► వివేకం సార్ చనిపోయిన రోజు సీన్ ఆఫ్ క్రైంకి నేను వెళ్లేటప్పటికే అక్కడ ఒక లెటర్ ఉంది. కానీ, ఆ లెటర్‌ను దాచిపెట్టారు. ఆ లెటర్లో అది హత్య అని స్పష్టంగా ఉంది. అందులో అనేక అంశాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి నేను చెప్పడం కంటే భవిష్యత్తులో అవన్నీ బయటికి వస్తాయి. ► ఇంతకు ముందు అడిగినట్టే అడ్వొకేట్ సమక్షంలో ప్రశ్నించాలని, అన్ని విషయాలు ఆడియో.. వీడియో రికార్డింగ్ చేయాలని ఇప్పుడు కూడా కోరాం. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ కూడా లెటర్ పెట్టాం. కానీ అది జరగలేదు. అయితే ఒక ల్యాప్‌టాప్‌ను మాత్రం నా ముందు ఉంచారు. అది ఎందుకోసం అన్నది నాకు తెలియదు. -
విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు: అవినాష్ రెడ్డి
-
ముగిసిన ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ విచారణలో భాగంగా ఈరోజు(శుక్రవారం) హైదరాబాద్‌కు వచ్చిన అవినాష్‌రెడ్డి.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని, వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుగుతోందని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా. సీబీఐ కౌంటర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు..అన్నింటికీ సమాధానాలు చెప్పా. విచారణపై ఎవరికైనా సందేహాలు వస్తాయి. వివేకా చనిపోయిన రోజున మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. అదే వాస్తవం. నేను వెళ్లే సమయానికి లెటర్‌ను దాచిపెట్టారు. ఆ లెటర్లో అనేక విషయాలు ఉన్నాయి. విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు. విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే బెదిరించడానికి వెళ్లానని ప్రచారం చేశారు. తెల్లవారజామున మూడు గంటలకు ఫోన్లు చేశానంటూ డిబేట్లు పెట్టారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. టీడీపీ చేసిన విమర్శలే సీబీఐ కౌంటర్లో వస్తున్నాయంటే.. గూగుల్ టేకౌటా లేక టీడీపీ టేకౌటా అనేది భవిష్యత్‌లో తేలుతుంది.విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డ్ చేయాలని కోరాం. ఎక్కడ ఆడియో, వీడియో రికార్డు చేసినట్లు కనిపించలేదు. నేను సీబీఐకి లేఖ ఇచ్చాను. నేను సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై పూర్తి విచారణ చేయాలని కోరాను. మరోసారి విచారణకు రావాలని సీబీఐ నాకు చెప్పలేదు’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఎమ్మెల్యేల ఎర కేసు.. కీలకంగా సుప్రీం విచారణ!
సాక్షి, హైదరాబాద్: ఉన్నతన్యాయస్థానం దర్యాప్తు చేపట్టమని ఆదేశించింది. దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగేందుకు రెడీ కూడా అయ్యింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందనా, సహకరం రెండూ లేవు. పైగా కోర్టును ఆశ్రయించుకుంటూ పోతోంది. ఈ తరుణంలో.. సుప్రీం కోర్టు విచారణపైనే సీబీఐ దర్యాప్తు ఆధారపడనుంది. ఎమ్మెల్యేల ఎర కేసులో రేపు(శుక్రవారం) సుప్రీం కోర్టు విచారణ కీలకం కానుంది. సుప్రీం విచారణ తర్వాత కేసు నమోదుపై సీబీఐ ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే సీబీఐ దర్యాప్తునకు తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే.. కేసు వివరాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి ఐదుసార్లు లేఖ కూడా రాసింది దర్యాప్తు సంస్థ. అయినా ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఎమ్మెల్యేలకు ఎర కేసులో సుప్రీం విచారణ, ఆదేశాలపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
వివేకా కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు జరగాల్సిందే!
సాక్షి, ఢిల్లీ: వివేకానందరెడ్డి హత్య కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్యను సీబీఐ ఒక కోణంలోని ఎందుకు దర్యాప్తు చేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. చంద్రబాబు పాత్రపైనా దర్యాపు జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకానంద హత్య జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? ఆ టైంలో ఆయన(చంద్రబాబు నాయుడు) ఎందుకు క్రైమ్ సీను కాపాడలేకపోయారు?. ఎందుకు వివేకానంద రెడ్డి డెడ్ బాడీని మూవ్ చేశారు? ఎందుకు హడావుడిగా పోస్టుమార్టం చేయించారు? నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని ఎందుకు సీజ్ చేయలేదు?. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయించలేదు? చంద్రబాబును ఇప్పటివరకు ఎందుకు ప్రశ్నించలేదు? అని ప్రశ్నల వర్షం గుప్పించారు కేఏ పాల్. ఈ ప్రశ్నలన్నింటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలి. మీరు లేదంటే మీ నాయకులే ఈ పని చేయించారా?. 2019 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డికి చెడ్డ పేరు తీసుకురావాలని చూశారా? అని అనుమానాలు వ్యక్తం చేశారాయన. అలాగే.. సీబీఐ దర్యాప్తు కరెక్ట్ యాంగిల్ లో జరిగే వరకు ఊరుకోను అంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అవకతవకలకు ప్రయత్నాలూ చేశారని టీడీపీ అధినేతపై కేఏ పాల్ మండిపడ్డారు. ‘మళ్లీ మీ ఓటు బ్యాంకు పెరగాలని చూశారు. నా బీఫాం వాడుకొని 38 మందిని నిలబెట్టారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లను ప్రజాశాంతి పేరు మీద చంద్ర బాబు అభ్యర్థులను నిలబెట్టారని ఆరోపించారు కేఏ పాల్. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ
అశ్వాపురం: కాంగ్రెస్ నుంచి గెలిచి, పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేయించాలని పీఎం, కేంద్ర హోంమంత్రి, సీబీఐ డైరెక్టర్, చీఫ్ సెక్రటరీకి, మొయినాబాద్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామన్నారు. మొయినాబాద్ పోలీసులు ఇచ్చే నివేదిక, తమ ఫిర్యాదు ఫైల్‌ను సీబీఐకి పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పోలీసులు సీఎం కేసీఆర్ ఒత్తిడికి లొంగి సీబీఐకి కేసు సమాచారం ఇవ్వకుంటే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలతో పాటు పార్టీ ఫిరాయింపులే పనిగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా పీఎం, కేంద్ర హోం మంత్రి, సీబీఐ డైరెక్టర్‌కు లేఖలు రాయాలని కోరారు. లేదంటే కేసీఆర్‌తో వారు కుమ్మక్కయ్యారని భావించాల్సి వస్తుందన్నారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసే వరకు ఆ తీర్పు అమలును నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అత్యవసర లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ దర్యాప్తు చేయాలంటూ ఇచ్చిన తీర్పును మూడువారాలపాటు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ మంగళవారం ఈ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ, సీబీఐ దర్యాప్తు తీర్పును వారం రోజులైనా నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టును ఆశ్రయించే వరకు (పిటిషన్‌ను విచారణకు స్వీకరించే వరకు) స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ జడ్జి తీర్పుపై ద్విసభ్య ధర్మాసనం మెరిట్స్‌లోకి వెళ్లలేదు కాబట్టి తమ లంచ్‌మోషన్ పిటిషన్లో సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవచ్చని జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ప్రశ్నకు ఏజీ సమాధానమిచ్చారు. సీబీఐ దర్యాప్తును నిలుపుదల చేస్తూ స్టే ఇవ్వొచ్చని చెప్పారు. ప్రస్తుతం సిట్ విచారణ నిలిచిపోయిందని, ఈ పరిస్థితుల్లో సీబీఐ దర్యాప్తు చేసేందుకు అత్యుత్సాహం చూపడం సరికాదన్నారు. ఇప్పటికే సీబీఐ జేడీ ఫైళ్లు అప్పగించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారని, సీబీఐ అత్యుత్సాహాన్ని పరిగణనలోకి తీసుకుని స్టే ఇవ్వాలని కోరారు. ఈ కేసులో డివిజన్ బెంచ్ స్టే ఇచ్చిందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, సింగిల్ జడ్జి తీర్పు తర్వాత దర్యాప్తు కోసం సీబీఐ ప్రభుత్వంపై ఒత్తిడి చేయొద్దని ఉత్తర్వుల్లో స్పష్టంచేసిందని ఏజీ బదులిచ్చారు. ద్విసభ్య ధర్మాసనం అప్పీల్లోని మెరిట్స్ ఆధారంగా తుది ఉత్తర్వులు ఇవ్వలేదని, అప్పీల్‌కు విచారణార్హత లేదని తేల్చినందున సింగిల్ జడ్జి జోక్యం చేసుకోవచ్చన్నారు. నిందితుల తరఫు సీనియర్ న్యాయవాదులు రవిచందర్, ప్రభాకర్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు చెప్పాక స్టే కోసం సింగిల్ జడ్జి వద్దకు ప్రభుత్వం రావడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు వెళ్లడం తప్ప మరోమార్గం లేదని, సింగిల్ జడ్జి స్టే ఇవ్వడానికి ఆస్కారం లేదని వాదించారు. సింగిల్ జడ్జి తీర్పుపై సీజే బెంచ్ వద్ద అప్పీల్ దాఖలు చేస్తే తీర్పు వచ్చిందని, ఇప్పుడు మళ్లీ అదే సింగిల్ జడ్జి వద్దకు స్టే కోసం ఎలా వస్తారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుకు వెళ్లేవరకు ఆదేశాలను నిలుపుదల చేయడానికి ద్విసభ్య ధర్మాసనం నిరాకరించిందని గుర్తుచేశారు. సిట్ దర్యాప్తు చేయాలని భావించడమూ అత్యుత్సాహం కిందకే వస్తుందని చెప్పారు. వాదనలు విన్న తర్వాత జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి.. ద్విసభ్య ధర్మాసనం తీర్పు తర్వాత స్టే కోసం సింగిల్ జడ్జిని ఆశ్రయించవచ్చో లేదో చీఫ్ జస్టిస్ నుంచి స్పష్టత తీసుకుని చెప్పాలని ఏజీని ఆదేశించారు. బుధవారం సీజే బెంచ్ వద్ద స్పష్టత తీసుకుని చెబుతామని ఏజీ చెప్పడంతో విచారణను బుధవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి చెప్పారు. -
ముగిసిన వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ
సాక్షి, హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సీబీఐ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అవసరమైతే మరోసారి పిలుస్తామన్నారు. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరాము. మా విజ్ఞప్తిని సీబీఐ అధికారులు అంగీకరించలేదు. వాస్తవాలను ఒక సెక్షన్ మీడియా వక్రీకరిస్తోంది. విచారణను ఒక మీడియా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. కాగా, వివేకానందరెడ్డి కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని సాక్షిగా విచారించే క్రమంలో సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఆదేశాల్లో భాగంగా నోటీసులు అందుకున్న అవినాష్‌రెడ్డి శనివారం విచారణకు హాజరయ్యారు. -
సీబీఐ దాడులకు నేను భయపడను : కవిత
-
లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు వస్తే విచారణ జరపొద్దా..? : బండి సంజయ్
-
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ అమలుకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం ముగ్గురు నిందితులను తమ ప్రధాన కార్యాలయానికి రప్పించి, ప్రశ్నించింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేయడం లేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి తెలిసిందే. సీబీఐ శనివారం కొందరు నిందితులకు సమన్లు జారీ చేసింది. శుక్రవారం మనీశ్ సిసోడియా నివాసం సహా వివిధ ప్రాంతాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నన్లు అధికారులు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొందరు నిందితులకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వారందరినీ పిలిపించి, లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారిస్తామని అన్నారు. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం దృష్టి పెట్టింది. ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లోని సమాచారాన్ని సీబీఐ.. ఈడీకి అందజేసింది. -
రూ.11 కోట్ల చిల్లర మాయం కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లో కరౌలీ జిల్లాలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) మెహందీపూర్ శాఖలో రూ.11 కోట్ల విలువైన చిల్లర నాణేల మాయంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు 25 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలీ, అల్వార్, ఉదయ్‌పూర్, భిల్వారా తదితర ప్రాంతాల్లో బ్యాంకు మాజీ అధికారులకు, ఇతరులకు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఎస్బీఐ మెహందీపూర్ బ్రాంచ్‌లో రూ.11 కోట్ల విలువైన చిల్లర మాయమయ్యింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దర్యాప్తు సక్రమంగా ముందుకు సాగకపోవడంతో అధికారులు రాజస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ స్వీకరించింది. కరౌలీ ఎస్బీఐ శాఖలో రూ.13 కోట్ల విలువైన నాణేలు ఉండాలి. లెక్కించగా, కేవలం రూ.2 కోట్ల విలువైన నాణేలు మిగిలాయి. నాణేలు లెక్కించేందుకు వచ్చిన ప్రైవేట్ సిబ్బందిని కొందరు వ్యక్తులు బెదిరించినట్లు ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలి
-
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంపై హైకోర్టు తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి దాఖలు చేసిన ఫోర్జరీ కేసు డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు నెల్లూరు జిల్లా కోర్టు నుంచి చోరీకి గురైన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. దీంతో ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా కోర్టులో చోరీపై నెల్లూరు ప్రిన్సిపల్ జిల్లా జడ్జి (పీడీజే) సి.యామిని పంపిన నివేదికను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ పిల్‌పై మంగళవారం సీజే ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు మేలని పీడీజే నివేదికలో అభిప్రాయపడ్డారని గుర్తు చేసింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫు న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి స్పందిస్తూ, సీబీఐ దర్యాప్తునకు తమకూ అభ్యంతరం లేదన్నారు. కోర్టు ఆదేశిస్తే ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. సీబీఐ తరఫున జూనియర్ న్యాయవాది అలేఖ్య స్పందిస్తూ, సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశాలు జారీ చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ సైతం సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదన్నారు. దీనిపై ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. మీరెలా ఈ విషయం చెబుతారని ప్రశ్నించింది. కోర్టు ముందున్న రికార్డుల ప్రకారం నిర్ణయం తీసుకోవడానికి అభ్యంతరం లేదని అశ్వనీ కుమార్ చెప్పారు. దీనిని ధర్మాసనం రికార్డ్ చేసింది. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. -
సుపారీ కథ.. సూపర్ కదా!
సాక్షి, అమరావతి: చేతిలో కోటి రూపాయలున్న వ్యక్తి.. ఐదొందల కోసం అడుక్కుంటాడా..? ఏమైనా నమ్మశక్యంగా ఉందా...? కోట్లుంటే.. కాళ్ల బేరమెందుకు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఇలానే ఉంది మరి...! మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసేందుకు రూ.40 కోట్లకు సుపారీ కుదిరినట్లు సీబీఐ పేర్కొంది. ఈ కుట్రలో పాలు పంచుకున్న నిందితుడు దస్తగిరికి నెల రోజుల ముందే రూ.కోటి అడ్వాన్స్ అందినట్లు దర్యాప్తులో తేలిందని చార్జ్‌షీట్ నమోదు చేసింది. అయితే రూ.కోటి ముట్టాయని సీబీఐ చెబుతున్న దస్తగిరి హత్యకు ఒక రోజు ముందుదాకా అప్పుల కోసం నానా తిప్పలు పడినట్లు వెలుగులోకి వచ్చింది. 2019 ఫిబ్రవరి 10 నుంచి వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15 మధ్య నిందితులు దస్తగిరి, సునీల్ యాదవ్ మధ్య జరిగిన కొన్ని వందల వాట్సాప్ చాటింగ్‌ల వివరాలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. రూ.20 వేలు.. కాదు కాదు.. కనీసం రూ.వెయ్యి... అదీ వద్దు... ఖర్చులకు రూ.500 చాలంటూ సునీల్ యాదవ్‌ను పలుమార్లు దస్తగిరి ప్రాథేయపడటం గమనార్హం. దీంతో వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ కుదిరినట్లు సీబీఐ చెబుతుండటంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. నిందితుడినే అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం.. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశానని ఒప్పుకున్న నిందితుడు దస్తగిరి వాంగ్మూలం కేంద్రంగా సీబీఐ దర్యాప్తు తతంగాన్ని నడిపిస్తోంది. దస్తగిరిని ఢిల్లీ తీసుకెళ్లి తమ ‘అతిథి’గా చాలా రోజులు మర్యాదలు చేసి మరీ అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం ఇప్పించింది. హత్య చేశానని స్వయంగా చెప్పిన దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం, బెయిల్ పిటిషన్‌ను గట్టిగా వ్యతిరేకించకపోవడంతో సీబీఐ తీరుపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి. సీబీఐ చార్జిషీట్, దస్తగిరి వాంగ్మూలంలో అంశాలివీ.. వైఎస్ వివేకా హత్య కోసం 2019 ఫిబ్రవరి 10న రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి మిగిలిన ముగ్గురు నిందితులు సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలతో కలసి హత్యకు పన్నాగం పన్నాడు. వివేకాను హత్య చేస్తే డి.శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడని ఎర్ర గంగిరెడ్డి మిగతా ముగ్గురు నిందితులకు చెప్పాడు. ఎర్ర గంగిరెడ్డి ఆ తరువాత నాలుగు రోజులకు సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి రూ.కోటి అడ్వాన్స్ ఇచ్చాడు. ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్ కూడా చెరో రూ.కోటి తీసుకున్నారు. దస్తగిరి తనకు అందిన రూ.కోటిలో రూ.46.70 లక్షలను మున్నా అనే స్నేహితుడి వద్ద ఉంచాడు. మున్నా వద్ద దాచిన మొత్తాన్ని సీబీఐ స్వాధీనం చేసుకుంది. తాపీగా రెండేళ్ల తరువాత... హత్యకు పథకం వేసిన నాలుగు రోజులకే.. అంటే 2019 ఫిబ్రవరి 10 తరువాత దస్తగిరి వద్ద రూ.కోటి ఉన్నాయని సీబీఐ చెబుతోంది. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 15న హత్యకు గురికాగా ఈ కేసు దర్యాప్తును సీబీఐ 2020 జూలై 9న చేపట్టింది. 2021 నవంబరు 13న దస్తగిరి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆ తరువాత పలువురిని విచారించిన అనంతరం అంటే వివేకా హత్యకు గురైన దాదాపు రెండేళ్ల తరువాత సీబీఐ అధికారులు మున్నా వద్దకు వెళ్లి మరీ ఆ రూ.46.70 లక్షలను స్వాధీనం చేసుకున్నారట..! ఏమైనా లాజిక్ ఉందా...? వైఎస్ వివేకా హత్య కుట్రలో భాగస్వాములుగా సీబీఐ పేర్కొన్న సునీల్ యాదవ్, దస్తగిరి మధ్య 2019 ఫిబ్రవరి, మార్చిలో కొన్ని వందల సార్లు వాట్సాప్ చాటింగ్ జరిగింది. అప్పు కోసం దస్తగిరి అందులో పలుమార్లు దీనంగా వేడుకున్నాడు. ఎంతగా అంటే కనీసం రూ.500 ఇవ్వాలని ప్రాథేయపడటం గమనార్హం. వివేకా హత్యకు ముందు రోజు కూడా అప్పు ఇవ్వాలని దస్తగిరి కోరాడు. మరి దస్తగిరి చేతిలో రూ.కోటి ఉంటే ఇలా రూ.వెయ్యి... రూ.500 కోసం ఎందుకలా వేడుకుంటాడు? సీబీఐ చెబుతున్నట్లుగా ఇద్దరి వద్దా చెరో రూ.కోటి ఉంటే ఇలా అడగాల్సిన పనేమిటి? దస్తగిరి వద్ద డబ్బులు లేవంటే.. సుపారీ కింద రూ.40 కోట్లకు ఒప్పందం కుదిరిందన్న అభియోగాల్లో నిజం ఉందా? సుపారీ కథ సూపర్..! సునీల్ యాదవ్‌తో దస్తగిరి జరిపిన వాట్సాప్ చాటింగ్ చూస్తే సీబీఐ చెప్పిన విషయాలపై పలు అనుమానాలు తలెత్తక మానవు. వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీతో ఒప్పందం కుదిరిందని... అది డి.శివశంకర్‌రెడ్డి ఇస్తాడని ఎర్ర గంగిరెడ్డి మిగిలిన ముగ్గురు నిందితులకు చెప్పినట్లు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొనడం కట్టుకథేనా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దస్తగిరి వాట్సాప్ చాటింగ్ ద్వారా అతడి వద్ద డబ్బులు లేవన్నది స్పష్టమవుతోంది. మరి అతడి వద్ద రూ.కోటి లేవంటే... రూ.40 కోట్ల సుపారీ కథ కట్టుకథేనా? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అసలు దోషులను గుర్తించడంపై దృష్టి పెట్టకుండా టీడీపీ హయాంలో చంద్రబాబు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తెచ్చిన కట్టుకథ ఉచ్చులో సీబీఐ చిక్కుకున్నట్లుగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సునీల్ యాదవ్‌కు దస్తగిరి పంపిన వాట్సాప్ సందేశాల్లో ముఖ్యమైనవి.. 2019 ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12.07 గంటలకు.. ‘అన్నా... ఒక రూ.వెయ్యి ఇస్తావా. ఖర్చులకు లేవు అన్నా. ప్లీజ్ డబ్బులివ్వు అన్నా’ 2019 ఫిబ్రవరి 21 ఉదయం 6.32 గంటలకు.. ‘అక్కడ అనంతపురం వాడు ఫోన్ చేస్తున్నాడు. ఏం అన్నా... నువ్వు మనిషినే పట్టించుకోవు అన్నా’ 2019 ఫిబ్రవరి 21 ఉదయం 6.33 గంటలకు.. ‘ఏంటన్నా... నేను చనిపోయాక డబ్బులిస్తావా... ఏంటి అన్నా...’ 2019 మార్చి 3 ఉదయం 7.22 గంటలకు.. ‘పులివెందుల వచ్చానంటావు... మళ్లీ రాలేదంటావు. ఏందన్నా... రూ.20 వేలు అడిగితే ఈ రోజు.. రేపు అంటూ టైమ్ చెబుతావు. ఏంది అన్నా?’ 2019 మార్చి 3 ఉదయం 10.18 గంటలకు.. ‘అన్నా నేను అప్పుల వాళ్లతో అనిపించుకోలేను. నాకు అవసరం లేదు. నేను అప్పు తెచ్చాను కదా. అప్పు కట్టు అన్నా’ 2019 మార్చి 14 మధ్యాహ్నం 12.24 గంటలకు.. (వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ముందురోజు) ‘రూ.30 వేలు కూడా అవసరం లేదన్నా... నాకు రూ.19 వేలు ఇచ్చినా సరిపోతుంది. ‘ఇతియోస్’కు రూ.14,500.. స్కార్పియోకు రూ.4,500 ఇవ్వాలి. నాకు రూ.500 మిగులుతుంది. అవి నేను ఖర్చుకు ఉంచుకుంటా’ -
దారి తప్పిన దర్యాప్తు
► హతుడు ఏమైనా లేఖ రాశారా...? సెల్‌ఫోన్ ఎక్కడ ఉంది...? ► ఎక్కడైనా హత్యగానీ ఆత్మహత్యగానీ జరిగితే పోలీసులు, దర్యాప్తు అధికారులు వెంటనే దృష్టిసారించే అంశాలు ఇవీ. ► లేఖ, సెల్ఫోన్లను స్వాధీనం చేయకపోతే దానివెనుక కుట్ర కోణం ఏమై ఉంటుంది...? ► హత్యాస్థలిలో ఆధారాలు తుడిచివేయాలని ఎవరైనా ఆదేశిస్తే... కారణాలు ఏమై ఉంటాయి? ► ఇక గతానికి భిన్నంగా స్వరం మార్చి ఆరోపణలు చేస్తుంటే దాని వెనుక ఏమైనా ప్రలోభాలు, ఒత్తిళ్లు దాగి ఉన్నాయా? ► ఒక కేసు దర్యాప్తులో ప్రాథమికంగా దృష్టి సారించే కీలక అంశాలు ఇవీ. – సాక్షి, అమరావతి దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ చిన్న లాజిక్లను ఉద్దేశపూర్వకంగానే ఉపేక్షించడం విస్మయపరుస్తోంది. సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అంశాలను విస్మరించడంతో సీబీఐ దర్యాప్తు దారితప్పింది. టీడీపీ నేతల రాజకీయ కోణంలో సాగుతూ ఏకపక్ష దర్యాప్తుతో కేసును తప్పుదారి పట్టిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సహజ మరణం కాదని అప్పుడే తెలిసినా.. వైఎస్ వివేకానందరెడ్డి మృతి చెందారని 2019 మార్చి 15న ఉదయం మొదట ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన లేఖ, సెల్ఫోన్లను ఆయనే స్వాధీనం చేసుకున్నారు. సహజంగానే ఆ లేఖను ఆయనే తొలుత చదివి ఉంటారు. తనపై డ్రైవర్ ప్రసాద్ తీవ్రంగా దాడి చేశాడని ఆ లేఖలో వివేకానందరెడ్డి రాసినట్టుగా ఉంది. అంటే వివేకాది సహజ మరణం కాదు... ఎవరో దాడి చేశారని అప్పుడే స్పష్టమైంది. ఆ లేఖ, సెల్‌ఫోన్ విషయాన్ని కృష్ణారెడ్డి వెంటనే వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలియజేశారు. అయితే తాము వచ్చే వరకు వాటి గురించి ఎవరికీ చెప్పొద్దని రాజశేఖరరెడ్డి, ఆయన సోదరుడు ఆదేశించారు. దీంతో కృష్ణారెడ్డి ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అనంతరం అక్కడకు చేరుకున్న ఎంపీ అవినాష్రెడ్డికిగానీ ఇతరులకుగానీ చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ఎందుకా గోప్యత? ఆ లేఖ గురించి అప్పుడు చెప్పి ఉంటే వివేకానందరెడ్డిని ఎవరో హత్యచేశారని వెంటనే స్పష్టత వచ్చే ది. పోలీసులకూ చెప్పేవారు. మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి బయటకు తీసుకురాకుండా, రక్తపు మరకలు తుడవకుండా అడ్డుకునేవారు. కానీ ఆ లే ఖ, సెల్‌ఫోన్ విషయాన్ని పోలీసులతో సహా ఎవరికీ చెప్పొద్దని వివేకా అల్లుడు, ఆయన సోదరుడు ఎం దుకు చెప్పారన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారు మధ్యాహ్నం పులివెందుల చేరుకున్నాక ఆ లేఖ, సెల్ఫోన్లను తీసుకున్నారు. సాయంత్రం వాటిని పోలీసులకు కృష్ణారెడ్డి ద్వారా అప్పగించారు. ఆ మెస్సేజ్‌ల వెనుక కథ ఏమిటి...? మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వివేకా సెల్‌ఫోన్‌లోని మెస్సేజ్‌లు, ఇతర కీలక సమాచారాన్ని వారు డిలీట్ చేశారా...? చేస్తే ఎందుకు చేశారన్నది ఈ కేసులో కీలకం. అంతటి కీలకమైన అంశాలపై సీబీఐ అధికారులు ఇప్పటివరకు దృష్టి సారించనే లేదు. హత్య జరిగిన ముందు రోజు రాత్రి వివేకా సెల్‌ఫోన్‌కు ఓ మహిళ నుంచి వచ్చిన మెస్సేజ్‌లు తరువాత బయటపడ్డాయి. వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులను ఆమె దూషించి ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ మెస్సేజ్ల్లో ఉండటం గమనార్హం. అంటే వివేకా కుటుంబంలో తీవ్ర అంతర్గత విభేదాలు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది. మరి ఆ అంశాలపై సీబీఐ ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్ రెడ్డిలను విచారించి నమోదు చేసిన వాంగ్మూలాల్లో ఆ విషయాలపై స్పష్టత లేదు. గుండెపోటని టీడీపీ మంత్రితో ఎందుకు చెప్పారు? వివేకా పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి సూచనలతో ఆయన అనుచరుడు ఇనయతుల్లా మార్చి 15న ఉదయం ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహం ఫొటోలు, వీడియోలను శివప్రకాశ్‌రెడ్డికి వాట్సాప్ చేశారు. ఆ ఫొటోలు చూస్తే అది హత్యేనని స్పష్టమవుతుంది. కానీ ఆయన వాటిని చూసిన తరువాత కూడా అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మరణించినట్లు చె ప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. శివప్రకాశ్‌రెడ్డి అలా ఉద్దేశపూర్వకంగా గుండెపోటని ఎందుకు చెప్పారో సీబీఐ ఇంతవరకు దృష్టిసారించ లేదు. శివప్రకాష్‌రెడ్డి వాంగ్మూలం నమోదు సమయంలోనూ ఆ విషయంపై ప్రశ్నించలేదు. తుడవమని ఎందుకు చెప్పారు? వివేకా మృతదేహం వద్ద రక్తపు మరకలను తుడవాలని ఆయన సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డికి శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. అదే విషయాన్ని ఎర్ర గంగిరెడ్డి కూడా వెల్లడించాడు. అలా రక్తపు మరకలు తుడవమని ఎందుకు చెప్పారు? సాక్ష్యాధారాలు లేకుండా చేయాలని ఎందుకు భావించారు? ఈ విషయంపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేయలేదు. ఆయన్ను ప్రశ్నించనూ లేదు. శాస్త్రీయ ఆధారాలతో విచారిస్తే... గతంలో టీడీపీ ఏ ఆరోపణలు చేసిందో ప్రస్తుతం అవే అభియోగాలతో సీబీఐ చార్జ్‌షీట్ దాఖలు చేయడం, సాక్షులు చెప్పని విషయాలను కూడా వారు చెప్పినట్లుగా వాంగ్మూలాలు నమోదు చేస్తుండటం ఈ కేసు దారి మళ్లిందనేందుకు స్పష్టమైన నిదర్శనమని పరిశీలకులు పేర్కొంటున్నారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ తన స్థాయికి తగ్గట్టుగా శాస్త్రీయంగా, హేతుబద్ధంగా దర్యాప్తు చేస్తున్నట్లు కనిపించడం లేదని స్పష్టం చేస్తున్నారు. కీలక ఆధారాలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ . ఊహాజనిత, రాజకీయ ప్రేరేపిత ఆరోపణల ఆధారంగా దర్యాప్తు చేయడం వెనుక ఒత్తిళ్లు దాగి ఉన్నట్లు విశ్లేషిస్తున్నారు. మాట మార్చిన సునీత దంపతులు, టీడీపీ రాజకీయ ఆరోపణలు, తాము బలవంతంగా అప్రూవర్‌గా మార్చిన నిందితుల కోణం నుంచి కాకుండా శాస్త్రీయ ఆధారాలను బట్టి కేసును దర్యాప్తు చేయాలని సూచిస్తున్నారు. మాట మార్చటానికి కారణాలేమిటి? వివేకా హత్య అనంతరం ఆయన కుమార్తె సునీత పులివెందుల, హైదరాబాద్‌లలో మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దాదాపు 700 మంది ఉన్న తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఆమె స్పష్టం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలుపు కోసం పనిచేసిన తన తండ్రి వివేకానందరెడ్డి ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయాలని వైఎస్ అవినాష్‌రెడ్డిని ఎంపీ ని చేసేందుకు చివరివరకూ కృషిచేశారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, నాటి మంత్రి ఆదినారాయణరెడ్డి తమ కుటుంబంపై దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆమె ధ్వజమెత్తారు. ఇప్పుడు అందుకు విరుద్ధంగా తమ కుటుంబ సభ్యులపైనే సునీత ఎందుకు ఆరోపణలు చేస్తున్నారనే అంశంపై సీబీఐ అధికారులు ఏ మాత్రం ఆరాతీయలేదు. సునీత మాట మార్చ డం వెనుక ప్రలోభాలు, ఒత్తిళ్లు, రాజకీయ కారణాలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యంగా మారినా సీబీఐ ఈ అంశాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
కొత్త జిల్లాలకు సరిపడా సిబ్బంది
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొత్త జిల్లాలకు సరిపడా పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఇటీవలే రాష్ట్రానికి కేంద్రం ఐపీఎస్‌లను కేటాయించిందని, అందువల్ల కొత్త జిల్లాలకు వారి కొరత ఉండదని విశాఖలో సోమవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో గ్రామ పోలీసు చట్టం బ్రిటీష్ కాలం నుంచీ అమలులో ఉందని.. గ్రామస్థాయిలో పోలీసు విజిలెన్స్ కోసం సచివాలయ పోలీసు వ్యవస్థ అవసరమని డీజీపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయని తెలిపారు. వైఎస్ వివేకా ఘటనపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని.. ఈ సమయంలో దీనిపై మాట్లాడటం సరికాదని విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ఒడిశాతో కలిసి గంజాయి కట్టడి ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంజాయి సాగవుతోందని.. దీనిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గంజాయి సాగు, సరఫరా నియంత్రణ కోసం ఒడిశాతో కలిసి పనిచేస్తున్నామన్నారు. నిజానికి గంజాయి సాగు మొదటినుంచీ ఉందని.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దానిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా కాలేజీలు, రిసార్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. దిశ యాప్ మహిళల రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్), మిలాన్–2022ను విజయవంతంగా నిర్వహించిన పోలీసులను డీజీపీ అభినందించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన పోలీసుల వీక్లీ ఆఫ్‌లను తిరిగి అమలుచేస్తామని ఆయన స్పష్టంచేశారు. సమావేశంలో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా కూడా పాల్గొన్నారు. -
పరిధి మరిచి మాట్లాడారు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధులను, అధికారాలను దాటి వెళుతోందంటూ మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.చంద్రు చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనంతో పాటు మరో న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అభ్యంతరం తెలిపారు. జస్టిస్ చంద్రు పేరు ప్రస్తావించకుండా సీజే ధర్మాసనం, జస్టిస్ చంద్రు పేరును ప్రస్తావిస్తూ జస్టిస్ దేవానంద్ సోమవారం పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. లైమ్‌లైట్‌లో ఉండేందుకు కొందరు జ్యుడిషియల్ సెలబ్రిటీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సీజే జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. అలాంటి లైట్‌ను తాము ఆర్పివేస్తామన్నారు. న్యాయమూర్తులు కూడా మానవ మాత్రులేనని, వారూ తప్పులు చేస్తుంటారని తెలిపారు. మానవ హక్కుల గురించి మాట్లాడేందుకు వచ్చిన ఆయన దాని గురించే మాట్లాడి ఉండాల్సిందన్నారు. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఏ పని మీద వచ్చారో ఆ పరిధిని మర్చిపోయి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పరిధి గురించి మాట్లాడటమేమిటని సీజే ఆక్షేపించారు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలపై దాఖలైన వ్యాజ్యం విచారణ సందర్భంగా సీజే ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నమోదు చేసిన కేసులో పురోగతిపై అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది. గౌరవానికి జస్టిస్ చంద్రు అర్హులు కారు గ్రామ సచివాలయాలకు ఫర్నిచర్, స్టేషనరీ సరఫరా చేసిన వారికి బిల్లులు చెల్లించకపోవడంపై దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా జస్టిస్ దేవానంద్ జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు హైకోర్టు ప్రతిష్టను దిగజార్చేవిగా ఉన్నాయన్నారు. హైకోర్టు మొత్తాన్ని ఒకే గాటన కట్టి మాట్లాడటం అభ్యంతరకరమన్నారు. ఆయనకు ఎవరిపైనైనా అభ్యంతరం ఉండి ఉంటే వారి గురించి మాట్లాడితే సరిపోయేదన్నారు. మొత్తం హైకోర్టును ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని తెలిపారు. జస్టిస్ చంద్రుపై ఉన్న గౌరవం పోయిందన్నారు. గౌరవానికి ఆయన ఏమాత్రం అర్హులు కారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుతో పోరాడుతోందన్న వ్యాఖ్యలు ఎంత మాత్రం సమంజసం కాదని తెలిపారు. పౌరుల హక్కుల పరిరక్షణకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తున్న విషయం ఆయనకు తెలిసినట్లు లేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పెట్టిన అనుచిత పోస్టులపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం తప్పెలా అవుతుందన్నారు. ధిక్కార చర్యలకు సీజేకు లేఖ రాద్దామనుకున్నా హైకోర్టును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినందుకు జస్టిస్ చంద్రుపై క్రిమినల్ కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించాలని ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని భావించానని, అయితే జస్టిస్ చంద్రు వయస్సు, న్యాయవాదిగా ఆయన అందించిన సేవలను దృష్టిలో పెట్టుకుని ఆ ఆలోచనను విరమించుకున్నానని తెలిపారు. న్యాయమూర్తిగా తాను చేసిన రాజ్యాంగ ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు నిరూపిస్తే తక్షణమే బాధ్యతల నుంచి తప్పుకుంటానన్నారు. దేశంలో ఉన్న 25 హైకోర్టుల్లో కనీస మౌలిక సదుపాయాలు లేని హైకోర్టు ఏపీ హైకోర్టు మాత్రమేనన్నారు. కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. స్వయంగా కోర్టు ముందు హాజరైన రావత్ ఫర్నిచర్, స్టేషనరీ సరఫరా బిల్లులు చెల్లించకపోవడంపై వివరణ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ కోర్టు ముందు హాజరయ్యారు. శాఖల అంతర్గత విషయాల వల్ల సకాలంలో బిల్లులు చెల్లించలేకపోయామని రావత్ చెప్పారు. నిధులు విడుదల చేశామని, కొద్ది రోజుల్లో చెల్లింపు పూర్తవుతుందన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ దేవానంద్, విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు. ఆలోపు బిల్లుల మొత్తాలు అందాయో లేదో చెప్పాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులకు స్పష్టం చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి రావత్‌కు మినహాయింపునిచ్చారు. -
సీబీఐ దర్యాప్తు తీరుపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ
సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇప్పటికీ న్యాయమూ ర్తులను కించప రుస్తూ పోస్టులు పెడుతున్న పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని అరెస్ట్ చేసి తీరాల్సిందేనని సీబీఐకి తేల్చిచెప్పింది. ఇందుకు పది రోజుల గడువు నిస్తున్నట్లు తెలిపింది. తద్వారా దర్యాప్తు సరైన దిశలో సాగుతోందని రుజువు చేసుకోవాలని సీబీఐకి స్పష్టం చేసింది. లేని పక్షంలో సీబీఐ ఈ కేసులో సరైన దిశలో దర్యాప్తు చేయలేకపోతోందని పేర్కొంటూ, దర్యాప్తు బాధ్యతలను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు అప్పగిస్తామని మౌఖికంగా చెప్పింది. ఈ మొత్తం కేసును సుప్రీంకోర్టుకు నివేదించి తగిన ఆదేశాలు కోరుతామంది. 2020 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఈ కేసులో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేయనున్నారో తెలియ చేస్తూ ఓ నివేదిక ఇవ్వాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశిం చింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలితతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయ మూర్తులను దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నా పోలీసులు సరిగా స్పందించడం లేదంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గతేడాది పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. చానెల్‌ను బ్లాక్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు.. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ జనరల్ తరఫు న్యాయ వాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు విని పిస్తూ.. పంచ్ ప్రభాకర్ యూట్యూబ్ చానెల్‌ను బ్లాక్ చేయడంతో పాటు అతడి పోస్టులను యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల నుంచి తొలగిం చారని తెలిపారు. యూట్యూబ్ తరఫు న్యాయవాది కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిం చారు. ఫేస్బుక్ తరఫు సీనియర్ న్యాయవాది కె.వివేక్ వాదనలు వినిపిస్తూ.. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ద్వారా వీడియోలను వీక్షిస్తున్నారని.. ఇలా చేయ డం చట్టవిరుద్ధమని తెలిపారు. యూఆర్ఎల్ వివరాలు ఇస్తే 36 గంటల్లో పోస్టులను తొలగిస్తామ న్నారు. ధర్మాసనం స్పందిస్తూ కేసు నమోదు చేసిన వెంటనే అభ్యంతరకర పోస్టులను తొలగించాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ కంపెనీలపై ఉందం ది. సీబీఐ తరఫు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్ వాదనలు వినిపిస్తూ.. వీడియోల తొలగిం పునకు గూగుల్‌కు లేఖ రాశామన్నారు. పంచ్ ప్రభాకర్ విషయంలో ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ చేశామని తెలిపారు. అతడి అరెస్ట్ విషయంలో అమెరికా దర్యాప్తు సంస్థ సాయం కూడా తీసుకుం టున్నామన్నారు. దౌత్య మార్గాల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ కేసులో తాము ఏమీ చేయడం లేదనడం ఎంత మాత్రం సరికాదన్నారు. -
‘హెచ్‌సీఏపై సీబీఐ అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై సీబీఐ దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. క్రికెట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోందని వ్యాఖ్యానించింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టడంతో హెచ్‌సీఏ, బడ్డింగ్‌స్టార్ క్రికెట్ క్లబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా హెచ్‌సీఏ వ్యవహారాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ కొంత మంది మంచి వ్యక్తుల్ని నియమిస్తాం. విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తాం. హెచ్‌సీఏలోని రెండు గ్రూపులు మేనేజ్మెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తు అవసరం. న్యాయవ్యవస్థను కూడా లాగాలని వారు చూస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జస్టిస్ వర్మను ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దని తెలపండి. ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. బుధవారానికి విచారణ వాయిదా వేస్తాం. ఈ లోగా విచారణ నిమిత్తం కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. -
నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్–2021కు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమవుతుందని పరీక్ష నిర్వహణ సంస్థ ఐఐటీ ఖరగ్‌పూర్ పేర్కొంది. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ ఆదివారం నుంచే ప్రారంభం కావలసి ఉంది. కానీ ఈ పరీక్షకు అర్హత అయిన జేఈఈ మెయిన్–2021 ఫలితాలు వెలువడక పోవడంతో దరఖాస్తు ప్రక్రియను ఒక రోజు వాయిదా వేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈనెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజును సెప్టెంబర్ 20 వరకు చెల్లించవచ్చు. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష అక్టోబర్ 3వ తేదీన జరగనుంది. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుంది. వాస్తవానికి ఈ పరీక్ష జూలై 3న నిర్వహించాల్సి ఉండగా, కరోనా కారణంగా జేఈఈ మెయిన్ పరీక్షలు ఆలస్యం కావడంతో అక్టోబర్ 3కు వాయిదా పడింది. అభ్యర్థులకు వారి రెస్పాన్స్ షీట్లు అక్టోబర్ 5వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. అక్టోబర్ 10న ప్రాథమిక కీని విడుదల చేయనున్నారు. ప్రాథమిక కీపై అభ్యర్థుల అభిప్రాయాలను ఆధారాలతో సహా అక్టోబర్ 11వ తేదీ వరకు సమర్పించవచ్చు. అక్టోబర్ 18న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కోరుకొనే అభ్యర్థులు సంబంధిత ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష (ఏఏటీ)కు అక్టోబర్ 15, 16 తేదీల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ పరీక్ష అక్టోబర్ 18న నిర్వహిస్తారు. ఏఏటీ ఫలితాలను అక్టోబర్ 22న విడుదల చేస్తారు. ఐఐటీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియ అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. జేఈఈ మెయిన్ ప్రశ్నపత్రాల లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తుండడంతోపాటు ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన నేపథ్యంలో ఫలితాల ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో మెరిట్ సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులు. ఆదివారం అర్ధరాత్రి లేదా సోమవారం ఉదయానికి జేఈఈ మెయిన్ ఫలితాలు వెలువడే అవకాశముంది. -
వెయ్యి కోట్ల కుంభకోణం
సాక్షి, న్యూఢిల్లీ: కోకాపేట్ భూముల వ్యవహారం సీబీఐ ముందుకు చేరింది. కోకాపేట్, ఖానామెట్ భూముల విక్రయం ద్వారా రూ.వెయ్యి కోట్ల కుంభ కోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీబీఐ డైరెక్టర్‌ను కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఐదు పేజీల ఫిర్యాదు లేఖను సీబీఐ డైరెక్టర్‌కు అందించారు. అనంతరం నార్త్‌బ్లాక్ వద్ద రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భూముల అమ్మకాల పేరుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తన అనుయాయులకు, పార్టీ నేత లకు చవక ధరలకే విలువైన భూముల్ని కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలోనే అత్యంత విలువైన భూములున్న కోకాపేట్లో ఎకరం భూమిని రూ. 25 కోట్లకు అమ్మారని, అంతకన్నా తక్కువ రేట్లున్న పుప్పాలగూడ, ఖానామెట్‌లో మాత్రం ఎకరం భూమిని రూ.40 కోట్లకు అమ్మారన్నారు. పుప్పాల్‌గూడకు చెందిన 125 ఎకరాల భూకుంభకోణం వివరాలను త్వరలో బయటపెడతానని చెప్పారు. ప్రైవేట్ బిల్డర్లకు లాభం భూముల వేలం వ్యవహారంలో ఎంఎస్టీసీ క్రియాశీల సహకారంతో సిండికేట్ ఏర్పడినందున, వేలం ద్వారా ప్రభుత్వానికి రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు. రివర్స్ టెండరింగ్, స్విస్ చాలెంజ్ పద్ధతి వంటి పారదర్శక వేలం విధానాన్ని చేపట్టి ఉంటే కచ్చితమైన విలువ తెలిసి ఉండేదన్నారు. ఎంఎస్టీసీ ప్రోద్బలంతో ప్రభుత్వ ఉద్యోగులు ఖజానాకు నష్టాన్ని కలిగించి, ముఖ్యమంత్రి సన్నిహితులైన ప్రైవేట్ బిల్డర్లకు లాభాన్ని చేకూర్చారని ఆరోపించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఐటీ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు జయేష్ రంజన్, అరవింద్ కుమార్ నిబంధనలను ఉల్లంఘించి, కేసీఆర్ చెప్పినవారికే వేలంలో భూములు వచ్చేలా కుట్ర చేశారని ఆరోపించారు. మధ్యవర్తిగా వేలంలో పాల్గొన్న ఎంఎస్టీసీ నియోపోలిస్, కోకాపేట్, గోల్డెన్ మైల్ బిడ్డర్ల పేర్లను బహిర్గతపరచలేదన్నారు. ప్రధానికి ఫిర్యాదు చేస్తా.. భూకుంభకోణంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డిల కుటుంబ సభ్యులు, మైహోం సంస్థకు చెందిన వారు ఉన్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇదే వ్యవహారంపై త్వరలో ప్రధాని, కేంద్ర హోం మంత్రులను కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో జరిగిన అవినీతిపై ఏదైనా కోర్టు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉంటే తప్ప విచారణకు ఆదేశించే అవకాశం సీబీఐకి చాలా తక్కువగా ఉంటుందని డైరెక్టర్ చెప్పారన్నారు. కానీ, ఐఏఎస్, ఐపీఎస్‌లు అవినీతికి పాల్పడితే నేరుగా సీబీఐ విచారణ చేపట్టవచ్చన్న విçషయాన్ని డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు రేవంత్ తెలిపారు. అడిగిన 24 గంటల్లోనే కేసీఆర్‌కు అపాయింట్మెంట్ దొరికినప్పుడు, కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు బండి సంజయ్, కిషన్‌రెడ్డిలకు ప్రధాని అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు. -
మూడో రోజూ ఆయుధాల కోసం గాలింపు
పులివెందుల : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయుధాల కోసం పులివెందులలో సీబీఐ బృందం మూడోరోజు సోమవారం కూడా గాలించింది. ఉదయం పట్టణంలోని తూర్పు ఆంజనేయస్వామి గుడి వెనుక ఉన్న వంక బ్రిడ్జి కింద బురదను వెలికితీశారు. అలాగే, హత్య తర్వాత నిందితులు రక్తపు మరకల దుస్తులు వేశారన్న సమాచారంతో ఆర్టీసీ బస్టాండు వద్ద ఉన్న గరండాల్ బ్రిడ్జి కింద కూడా జేసీబీతో గాలింపు చేపట్టారు. అయితే, సాయంత్రం వరకు రెండుచోట్లా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో గాలింపును మంగళవారానికి వాయిదా వేశారు. ఇక సోమవారం ఉదయం ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో సీబీఐ అధికారులతో వివేకా కుమార్తె సునీత కాసేపు సమావేశమయ్యారు. అలాగే, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వల్లెపు వరప్రసాద్, ఎర్రంరెడ్డిపల్లె జగదీశ్వరరెడ్డి, రాజారెడ్డి ఆసుపత్రి సిబ్బంది శ్రీనివాసులరెడ్డి, సీఎస్ఐ చర్చికి సంబంధించిన శిఖామణి, సంపత్, నీలయ్య, సుధాకర్, దినేష్ నర్సింగ్ హోం మెడికల్ స్టోర్ సిబ్బంది ఓబులేసు, రామకృష్ణారెడ్డి, యూసీఐఎల్ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి, కాంపౌండర్ ప్రకాష్‌రెడ్డి, మాజీ లెక్చరర్ చంద్రశేఖరరెడ్డిలను సీబీఐ బృందం విచారించింది. వివేకా ఇంటి వద్దకు సునీల్ యాదవ్ వివేకా హత్యకేసులో నిందితుడు సునీల్ యాదవ్‌ను సోమవారం సాయంత్రం సీబీఐ అధికారులు వైఎస్ వివేకా ఇంటి వద్దకు తెచ్చి, అక్కడ ఫొటోలు తీసుకున్నట్లు తెలిసింది. అతడిని ఇంటి పరిసర ప్రాంతాల్లోని ఇరువైపులా ఉన్న రోడ్లపై వాహనంలోనే ఉంచి తిప్పారు. -
వివేకా హత్య కేసులో చట్ట ప్రకారమే దర్యాప్తు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చట్ట ప్రకారమే దర్యాప్తు చేస్తున్నామని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. హైకోర్టును తప్పుదోవ పట్టించి తమ దర్యాప్తునకు ఆటంకం కలిగించడమే పిటిషనర్ల ఉద్దేశమని పేర్కొంది. వివేకానందరెడ్డి హత్య కేసులో పిటిషనర్లయిన సునీల్ యాదవ్, అతని సోదరుడు కిరణ్ యాదవ్‌ల పాత్రను ప్రస్తుత దశలో కొట్టిపారేయలేమని సీబీఐ స్పష్టం చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు తమను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని, తమను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వైఎస్సార్ జిల్లా మోతునూతలపల్లికి చెందిన యాదాటి సునీల్ యాదవ్, అతని సోదరుడు, తల్లి, తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీబీఐ డీఎస్పీ దీపక్ గౌర్ కౌంటర్ దాఖలు చేశారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. పిటిషనర్లకు క్లీన్చిట్ ఇవ్వలేదు.. ► హైకోర్టు ఆదేశాల మేరకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేపట్టాం. చట్టానికి అనుగుణంగా దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు కీలక దశలో ఉంది. కఠినమైన చట్టం నుంచి తప్పించుకునేందుకు పిటిషనర్లు ఈ వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్లు చెబుతున్నవన్నీ నిరాధారమైనవి. రాష్ట్ర పోలీసులు క్లీన్చిట్ ఇవ్వలేదు. ఈ కేసులో పిటిషనర్ల పాత్రను తోసిపుచ్చలేం. పిటిషనర్‌ను ఢిల్లీ సీఐడీ కార్యాలయంలో విచారణ చేసినంత కాలం అతను ఢిల్లీలోని తన బంధువు ఇంట్లో ఉన్నారు. ► హత్యకు ముందు, ఆ తర్వాత సునీల్ యాదవ్ ప్రవర్తన, నడవడిక అత్యంత అనుమానాస్పదంగా ఉన్నట్లు మా దర్యాప్తులో తేలింది. అతనికి వ్యతిరేకంగా కీలక ఆధారాలు లభించాయి. వాటిని ప్రస్తుతం బయట పెట్టలేం. అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హతే లేదు. ► పిటిషనర్ ఆమోదంతో అతని ఈ మెయిల్ ఐడీ, ఫేస్ బుక్ ఖాతాలను, అతని చేతి రాత నమూనాలను అతని సమక్షంలోనే పరిశీలించాం. సునీల్ యాదవ్ అంగీకారంతో ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అతనికి సైకలాజికల్ అసెస్మెంట్, వాయిస్ లేయర్డ్ అనాలసిస్ నిర్వహించాం. అయితే ఎలాంటి పోలిగ్రాఫ్ టెస్ట్ చేయలేదు. థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం వాస్తవానికి సునీల్ యాదవ్ దాఖలు చేసిన వ్యాజ్యం గురువారం విచారణకు రావాల్సి ఉంది. అయితే విచారణకు రాకపోవడంతో సునీల్ తరఫు న్యాయవాది టీఎల్ నయన్ కుమార్ గురువారం ఉదయం న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ముందు ప్రస్తావించారు. దీంతో ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరుపుతానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
అమరావతి భూ కుంభకోణంపై 12న తుది విచారణ
సాక్షి, అమరావతి: అమరావతి భూ కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీని సవాల్ చేస్తూ మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ఆగస్టు 5కల్లా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆ కౌంటర్లో ఆగస్టు 12వ తేదీ లోపు రీజాయిండర్ దాఖలు చేయాలని దమ్మాలపాటిని ఆదేశించింది. ఈ వ్యాజ్యాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే అమరావతి భూ కుంభకోణంపై ఫిర్యాదు చేసిన న్యాయవాది కె.శ్రీనివాస స్వామిరెడ్డిని ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దమ్మాలపాటి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది. స్వామిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఉత్తర్వులిచ్చారు. ఏసీబీ కేసుపై దమ్మాలపాటి అత్యవసర పిటిషన్.. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు అవసరమైన ప్రాథమిక సమ్మతిని తెలియచేస్తూ కేంద్రానికి గతేడాది మార్చి 23న రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాశారు. దీనిని కొట్టేయాలని కోరుతూ దమ్మాలపాటి గతేడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా, ఇతర కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే.. ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో దమ్మాలపాటి హైకోర్టులో అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అమరావతి భూ కుంభకోణంపై పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో వార్తలు రాయడం వల్ల తమ పరువుపోతోందని తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వార్తలు రాయకుండా నియంత్రించాలని కోర్టును కోరారు. ‘సుప్రీం’ ఆదేశాల ప్రకారం విచారిస్తాం.. తాజాగా గురువారం దమ్మాలపాటి పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా దమ్మాలపాటి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టు ఉత్తర్వుల గురించి న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ దృష్టికి తీసుకొచ్చారు. ఆ ఉత్తర్వులను న్యాయమూర్తి పరిశీలించారు. 4 వారాల్లో ఈ కేసును తేల్చాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ ఆదేశాలకు అనుగుణంగానే విచారణ జరుపుతానని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో న్యాయమూర్తి కౌంటర్ దాఖలుకు, ఆ కౌంటర్‌పై రీజాయిండర్ దాఖలుకు ఇరుపక్షాలకు నిర్ణీత గడువు విధించారు. ఆగస్టు 12న తుది విచారణ జరుపుతామని చెప్పారు. ఏసీబీ దాఖలు చేసిన కేసులో 13వ నిందితురాలిగా ఉన్న వెల్లంకి రేణుకాదేవి వ్యాజ్యాన్ని కూడా దమ్మాలపాటి పిటిషన్‌కు జత చేశారు. ఆ వ్యాజ్యంలో కూడా విచారణను ఆగస్టు 12కి వాయిదా వేశారు. చర్చనీయాంశమైన ‘గ్యాగ్’.. ఈ వ్యాజ్యాన్ని అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి విచారించారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో ఏకంగా దర్యాప్తు, విచారణను నిలిపేశారు. ఈ కేసులో ఏ ఒక్కరిపైనా కఠిన చర్యలు తీసుకోవద్దని ఏసీబీని ఆదేశించారు. అమరాతి భూ కుంభకోణంపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడానికి వీల్లేదని ఆదేశిస్తూ గ్యాగ్ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం ఇటీవల సుప్రీంకోర్టు ముందు విచారణకు వచ్చింది. తమ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని, హైకోర్టులోనే స్టే ఎత్తివేత కోసం వాదనలు వినిపిస్తామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పిటిషన్ ఉపసంహరణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 4 వారాల్లో కేసును పరిష్కరించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. -
కోటి అందింది.. రాజా ఇంకా పది కోట్లివ్వాలి!
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ కె.రఘురామకృష్ణరాజు, టీవీ 5 చానల్ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు మధ్య ఒక మిలియన్ యూరో హవాలా లావాదేవీలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో పీఎంఎల్ఏ, ఫెమా ఉల్లంఘనలు జరిగాయని ఆధారాలతో సహా ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. తనకు ఇప్పటి వరకు ఒక్కటి (కోటి రూపాయలు) మాత్రమే ఇవ్వగా ఇంకా పది (పది కోట్ల రూపాయలు) చెల్లించాల్సి ఉందంటూ రఘురామకృష్ణరాజు చాటింగ్‌లో బిఆర్ నాయుడుతో పేర్కొనటం ఫిర్యాదుతో జత చేసిన ఆధారాల పేజీ నెం:4లో వివరంగా ఉంది. పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి సహా 15 మంది ఎంపీల సంతకాలతో కూడిన ఫిర్యాదు లేఖ ప్రతిని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల బృందం సోమవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేసింది. లేఖలో వివరాలు ఇలా ఉన్నాయి. శాస్త్రీయంగా నిర్థారణ.. ‘‘ఎంపీ రఘురామకృష్ణరాజు, బి.ఆర్. నాయుడు మధ్య చట్టాలను ఉల్లంఘిస్తూ జరిగిన అక్రమ లావాదేవీ, మనీ లాండరింగ్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. మనీలాండరింగ్, ఫారిన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999లోని పలు నిబంధనల ఉల్లంఘనలను ప్రాథమికంగా రుజువు చేసే సాక్ష్యాధారాలను కనుగొన్నారు. దర్యాప్తులో భాగంగా ఏపీ సీఐడీ పోలీసులు కేసులో ప్రధాన నిందితుడి ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో శాస్త్రీయంగా విశ్లేషించినప్పుడు పది లక్షల యూరోల అక్రమ హవాలా వ్యవహారానికి సంబంధించిన ఆధారాలు బయటపడ్డాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్) అసిస్టెంట్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా ఈ ఫిర్యాదుతో జతపర్చాం. ‘అంగడియా’ .... క్రిమినల్ కేస్ నెంబర్ 12/2021 విచారణ సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో నిందితుల వస్తువులను విశ్లేషించి ఒక మిలియన్ యూరోల మేరకు హవాలా లావాదేవీ జరిగినట్లు ఏపీ సీఐడీ పోలీసులు గుర్తించారు. హవాలా లావాదేవీకి రుజువుగా ‘అంగడియా’ అనే ప్రస్తావన రఘురామకృష్ణరాజు, బి.ఆర్.నాయుడు మధ్య సాగిన సంక్షిప్త సందేశాల సంభాషణలో ఉంది. ఓసీబీసీ ఖాతా నుంచి ఒక మిలియన్ యూరోలు వెల్స్ ఫార్గో ఖాతాకు బదిలీ అయినట్టు ఈ సంభాషణ తేటతెల్లం చేస్తోంది. ఇది మనీ లాండరింగ్‌ను రుజువు చేస్తోంది. లావాదేవీ ‘3’ అని చేసిన ప్రస్తావన హవాలా కింద ఇచ్చిన కోట్ల రూపాయల గురించి వెల్లడిస్తుండగా మిగిలినవి ఒక రోజు అనంతరం ఇస్తానని ఇచ్చిన హామీగా గుర్తించవచ్చు. ఒకటో నెంబరు నిందితుడిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు రెండో నెంబరు నిందితుడిగా ఉన్న బి.ఆర్.నాయుడు మొత్తం రూ.11 కోట్ల మేర లావాదేవీల్లో రూ.కోటి చెల్లించినట్లు పేజీ నెంబరు 4లో ఉంది. ఈ వ్యవహారాన్ని పేజీ నెంబరు 5లో పేర్కొన్న మిలియన్ యూరో బదిలీ ప్రస్తావనలోనూ గమనించవచ్చు. విదేశాలకు పరారీ కాకుండా నిరోధించండి.. నిందితులైన కె.రఘురామకృష్ణరాజు, బి.ఆర్.నాయుడులపై పీఎంఎల్ఏ, ఫెమా చట్టాల కింద కేసు నమోదు చేసి సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రధానిని విజయసాయిరెడ్డి కోరారు. నిందితులు విదేశాలకు పారిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కస్టడీలోకి తీసుకుని అనుమానాస్పద లావాదేవీలను వెలికి తీసేలా ఆదేశించాలన్నారు. సీఐడీ రాసిన లేఖను జతపరిచిన ఎంపీలు.. ఈ వ్యవహారంలో మనీ లాండరింగ్‌కు సంబంధించి అనుమానాస్పద లావాదేవీలను వివరిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు సీఐడీ రాసిన లేఖను, సంభాషణలను ప్రధానికి పంపిన ఫిర్యాదులో విజయసాయిరెడ్డి జోడించారు. ప్రధాన నిందితుడు ఎంపీ రఘురామకృష్ణరాజుకి సంబంధించి సీజైన మొబైల్ ఫోన్‌ను ఏపీఎఫ్ఎస్ఎల్కు ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపామని, దాని నివేదిక అందిందని సీఐడీ తన లేఖలో పేర్కొంది. రఘురామకృష్ణరాజు(ఏ1), టీవీ 5 ఛైర్మన్(ఏ2)కు మధ్య జరిగిన లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయని, ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని వివరించింది. ఇవిగో ఖాతా నంబర్లు... వెల్స్ ఫార్గో ఖాతా నెం: 51700263205 నుంచి పది లక్షల యూరోలను ఓసీబీసీ ఖాతా నెం: 501189518301కు బదిలీ చేసినట్లు ఆ ఫోన్ ఛాటింగ్ తేటతెల్లం చేసింది. ఇది పీఎంఎల్ఏ నిబంధనల ఉల్లంఘనను రుజువుగా నిలుస్తోంది. ఇద్దరు నిందితుల మధ్య జరిగిన కోట్ల రూపాయల మోసపూరిత హవాలా లావాదేవీలకు సంబంధించి ఈ ఫిర్యాదు పత్రంతో జత చేసిన ఆధారాల పేజీ నెంబర్లు 2, 3 లో ఛాటింగ్ వివరాలు ఉన్నాయి’’ -
అమరావతి భూకొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తు అవసరం
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూ కొనుగోళ్ల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. అమరావతి భూముల కొనుగోళ్ల వ్యవహారంలో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై సీఐడీ విచారణ నిలిపేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ వినీత్‌శరణ్, జస్టిస్ దినేష్మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్‌ధావన్ వాదనలు వినిపించారు. ‘కేసు హైకోర్టుకు పంపండి. దర్యాప్తు కొనసాగనీయండి. మేం చట్ట పరిధిలోనే ముందుకెళ్లాం. సుప్రీంకోర్టు గతంలో ఎప్పుడూ దర్యాప్తును ఆపలేదు..’ అని ధావన్ పేర్కొన్నారు. దమ్మాలపాటి తరఫున సీనియర్ న్యాయవాది హరీష్‌సాల్వే వాదనలు వినిపిస్తూ.. పత్రాలు, ఎఫ్ఐఆర్ చదివితే అని చెబుతుండగా.. జస్టిస్ వినీత్‌శరణ్ జోక్యం చేసుకొని ఇరుపక్షాలు కోరితే వాటిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. రాజీవ్‌ధావన్ హైకోర్టుకు పంపించాలని కోరుతున్నారు, మీ స్పందన ఏంటని ధర్మాసనం సాల్వేను ప్రశ్నించింది. ‘ఏడాది కాలంగా సుప్రీంకోర్టులో ఉంది.. పాలనాపరమైన కక్ష సాధింపే ఇది.. అక్కడికి ఇక్కడికి వెళ్లడానికి సిద్ధంగా లేము..’ అని సాల్వే చెప్పారు. హైకోర్టులో డీటైల్డ్‌గా విచారణ జరపవచ్చు ఈ సందర్భంగా జస్టిస్ శరణ్.. ఇరుపక్షాలు అంగీకరిస్తే సుప్రీంకోర్టే విచారణ చేపడుతుందని, దాన్నిబట్టి ముందుకెళ్తామని పేర్కొన్నారు. ధావన్ స్పందిస్తూ.. సాల్వే తన వ్యాఖ్యలు తనపైనే (పాలనపరమైన కక్ష సాధింపు) ప్రయోగించడం నచ్చిందన్నారు. సుప్రీంకోర్టులోనే విచారణ జరపాలని ఆదేశించేచోట తాను లేనని, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, హైకోర్టులో డీటైల్డ్‌గా విచారణ జరపొచ్చని చెప్పారు. ఒకవేళ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆదేశాలివ్వాల్సివస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని ఆ ఆదేశాల్లో స్పష్టం చేయవచ్చన్నారు. ‘ఎస్సెల్పీ మేం దాఖలు చేశాం.. ఒకవేళ కేసు విచారణ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు చేపడితే అన్ని వాస్తవాలు పరిగణనలోకి తీసుకోవాలి. కానీ వారికి సుప్రీంకోర్టులో విచారణ జరగాలని లేదు’ అని ధావన్ పేర్కొన్నారు. ఒకవేళ ఎస్సెల్పీపైనే అయితే విచారణ చేపట్టాలని, ఎస్సెల్పీని కొట్టివేస్తే అప్పుడు హైకోర్టు విచారిస్తుందని సాల్వే పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసినరోజే న్యాయమూర్తి విచారించారని, ప్రభుత్వ వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని ధావన్ చెప్పారు. న్యాయమూర్తులెవరనే దానిపై చర్చించదలచుకోలేదని, దర్యాప్తు కొనసాగనిస్తే అన్ని వాస్తవాలు బయటపడతాయని పేర్కొన్నారు. అందుకే సీబీఐ విచారణ కోరుతున్నామని చెప్పారు. ఈ కేసులో ఓ న్యాయమూర్తి పర్యవేక్షణ ఉండాల్సిందేనన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం.. అప్లికేషన్‌ను విచారిస్తామని, కొంత విచారణ తమకూ అవసరమని పేర్కొంది. కేసు విచారణకు వచ్చే వారంలో ఓ తేదీని నిర్ణయిస్తామని తెలిపింది. దర్యాప్తు నిలిచిపోయిందని, హైకోర్టు కూడా విచారణ జరపడం లేదని ధావన్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆగస్టులో విచారించాలని ధావన్ కోరారు. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేస్తూ జాబితాలో చివరిగా చేర్చాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ వినీత్‌శరణ్, జస్టిస్ ఎంఆర్‌షాలతో కూడిన ధర్మాసనం విచారించిన విషయం విదితమే. -
రఘురామ కేసులో ప్రతివాదిగా... రాష్ట్ర ప్రభుత్వం తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజు గాయాలపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని నివేదించారు. సీఐడీ పోలీసు కస్టడీలో తన తండ్రిని హింసించారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. భరత్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ పిటిషన్లో సీబీఐని ప్రతివాదిగా చేర్చాలని కోరారు. తొలుత ప్రతివాదులుగా చేర్చిన ఏపీ ప్రభుత్వం, మంగళగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్, సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఏసీపీ ఆర్.విజయపాల్‌ను ప్రతివాదులుగా తొలగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినలేదని, సీబీఐని ఏ రకంగా ప్రతివాదిగా చేరుస్తారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతివాదుల తొలగింపుపై పిటిషనర్ తరఫు న్యాయవాది రిస్క్ భరిస్తానని అంగీకరించారని పేర్కొంది. ‘ప్రతివాది నంబర్ 1గా ఎవరిని చేర్చారు? ఏపీ ప్రభుత్వాన్ని ఇపుడు ఎందుకు తొలగిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ధర్మాసనానికి దవే నివేదించారు. పిటిషనర్ తరపు న్యాయవాది రిస్క్ భరిస్తానంటున్నారు కదా? అని ధర్మాసనం పునరుద్ఘాటించింది. దవేకు ‘లోకస్ స్టాండీ’ లేదని, ఏపీ ప్రభుత్వాన్ని తొలగించాల్సిందేనని రోహత్గి పేర్కొనడంతో ఈ ప్రొసీడింగ్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని దవే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో చాలా అంశాలు ఉన్నట్లుగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ఆసక్తి ఉన్న పార్టీల వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని, కావాలనుకుంటే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. కేంద్రం, సీబీఐలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈలోగా ప్రతివాదులిద్దరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
నోటికొచ్చినట్లు మాట్లాడటం మానుకోండి: కొడాలి నాని
కృష్ణాజిల్లా: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడటంపై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వివేక హత్య జరిగిన కాలంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారనే విషయం తెలుసుకోవాన్నారు. వివేక కుమార్తై విజ్జప్తి మేరకు దీన్ని సీబీఐ విచారణ జరుపుతుందని అన్నారు. వివేక హత్యకేసు విషయంలో విజయమ్మ ఇప్పటికే బహిరంగ లేఖను రాసిన విషయాన్ని కొడాలి నాని గుర్తుచేశారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. అదే విధంగా, ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడిలో కూడా టీడీపీ వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఎన్ఐఏ దర్యాప్తు చేయడం అందరికీ తెలిసిందేనని అన్నారు. ఈ రెండు కేసులను కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే చూస్తున్నాయన్నారు. అయినా ప్రతిపక్షాలు కోడిగుడ్డుపై ఈకలు పీకే మాదిరి వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ఏనుగు లాంటివారని ప్రతిపక్షాలు కుక్కల మాదిరిగా మొరిగితే పట్టించుకోరని అన్నారు. కాగా, దోషులను పట్టుకోవడంలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని నాని స్పష్టం చేశారు,. -
విచారణ వేగవంతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: తన తండ్రి మృతిపై సీబీఐ విచారణ వేగవంతం చేయాలని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి డిమాండ్ చేశారు. తన తండ్రిని హత్య చేశారని, దీని వెనక రాజకీయ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. హత్య జరిగి రెండేళ్లయినా ఎవరు చేశారనేది ఇప్పటివరకు తెలియలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం దర్యాప్తు సాగుతోందని ఈ మధ్యలో సాక్షులకు ఏమైనా అవుతుందేమోననే భయంతో ఉన్నానని చెప్పారు.శ్రీనివాసరెడ్డి మృతి దీనికి బలం చేకూర్చిందన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం తమ్ముడు, ప్రస్తుత సీఎం బాబాయి మృతి విషయంలోనే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి, న్యాయం కోసం ఇంకెంత కాలం చూడాలి అని ప్రశ్నించారు. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తనకు అనుమానం ఉన్న 15 మంది పేర్లు రాసినట్లు తెలిపారు. ఇప్పటివరకు చార్జిషీటు దాఖలు చేయలేదని, అరెస్టులు కూడా చేయలేదని చెప్పారు. ఎంత కష్టమైనా నిందితుల్ని పట్టుకునే వరకు పోరాడతానని సునీత చెప్పారు. -
కళ్లుగప్పి.. కొల్లగొట్టారు
సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు.. కనికట్టు చేసి బ్యాంకులను దోచేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సన్నిహితుడు, ఆ పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా, సుజనా చౌదరిలనే మించిపోయారు. ఒకటి కాదు.. రెండు కాదు.. కెనరా బ్యాంకు నేతృత్వంలోని ఏకంగా 14 బ్యాంకుల కన్సార్షియంనే మోసం చేసి రూ.7,926.01 కోట్లను కొల్లగొట్టినట్లు సీబీఐ ప్రాథమికంగా తేల్చినట్లు తెలిసింది. బ్యాంకుల అధికారుల సహకారం లేకుండా రాయపాటి ఇంత భారీ కుంభకోణానికి పాల్పడే అవకాశం ఉండదనే నిర్ధారణకు వచ్చిన సీబీఐ.. ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. రూ.7,926.01 కోట్లు ఎగవేత పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, తిరుపతి–తిరుత్తణి–చెన్నై టోల్వేస్.. భోపాల్–బయోరా టోల్వేస్.. దిండిగల్–తెన్ని–కుమ్లి టోల్వేస్.. కృష్ణగిరి–దిండివనం హైవేస్, ఒబేదుల్లాగంజ్–బేతుల్, తిరుచ్చి–కలైకుడి టోల్వేస్ పనులు చేపట్టేందుకు రుణం ఇవ్వాలని కెనరా బ్యాంక్ నేతృత్వంలోని 14 బ్యాంకుల కన్సార్షియంను ట్రాన్స్ట్రాయ్ కోరింది. ఈ రుణానికి బోగస్ గ్యారంటీలను చూపింది. ఇవి నిజమైనవా కాదా అన్నది తేల్చుకోకుండా బ్యాంకుల కన్సార్షియం రూ.9,394.28 కోట్ల రుణం ఇచ్చేందుకు 2013–2014లో అంగీకరించింది. ఈ రుణాన్ని నగదు, లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్వోసీ), గ్యారంటీ (బీజీ)ల రూపంలో ఇస్తామని పేర్కొంది. 2015–16 నాటికి రూ.7,926.01 కోట్ల రుణాన్ని నగదు, ఎల్వోసీ, బీజీల రూపంలో ఇచ్చింది. కానీ, తీసుకున్న రుణం చెల్లించకుండా ట్రాన్స్ట్రాయ్ మోసం చేయడంతో 2019 డిసెంబర్ 30న యూనియన్ బ్యాంక్, 2020 డిసెంబర్ 15న కెనరా బ్యాంక్ అధికారులు వేర్వేరుగా సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసిన సీబీఐ.. ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి, ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్ సూర్యదేవర బాబ్జీ, మరో డైరెక్టర్ ఎం.సాంబశివరావులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తు ప్రాథమికంగా పూర్తయినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు దర్యాప్తులో వెల్లడైన అంశాలివీ.. రూ.2,261.58 కోట్లు ఏ బాబు జేబులోకో.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిబంధనల మేరకు ఏ సంస్థ అయినా బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన లావాదేవీలను ఆ బ్యాంకుల పరిధిలోనే నిర్వహించాలి. దీనివల్ల ఇచ్చిన రుణం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. కానీ, కన్సార్షియం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.7,926.01 కోట్లలో రూ.2,261.58 కోట్లను కన్సార్షియంలోని లేని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్), ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), ఆర్బీఎల్లకు మళ్లించినట్లు సీబీఐ గుర్తించింది. ఈ ఐదు బ్యాంకుల ద్వారా మళ్లించిన మొత్తానికి ట్రాన్స్ట్రాయ్ సరైన లెక్కలు చూపకపోవడంతో.. ఆ నిధులు ఏ బాబు జేబులోకి చేరాయనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ట్రాన్స్‌ట్రాయ్‌లో డైరెక్టర్‌గా ఉన్న ఎం.సాంబశివరావు పేరుతో యూనిక్ ఇంజనీర్స్ అనే సంస్థను ఏర్పాటు చేయించిన రాయపాటి, పోలవరం పనుల కోసం ఆ సంస్థ నుంచి కేవలం రూ.3 కోట్ల విలువ చేసే వాహనాలను మాత్రమే కొనుగోలు చేశారు. కానీ, కొన్న వాహనాలనే మళ్లీ మళ్లీ కొన్నట్లు చూపి బ్యాంకులు మంజూరు చేసిన రుణంలో యూనిక్ ఇంజనీర్స్ ఖాతాలోకి రూ.313.85 కోట్లను మళ్లించి కాజేశారు. సిమెంటు, స్టీలు వంటివి కొనకుండానే.. పోలవరం, ఇతర రహదారుల పనుల కోసం ఏప్రిల్, 2016 నుంచి మార్చి, 2017 వరకూ ట్రాన్స్ట్రాయ్ కేవలం రూ.274.36 కోట్ల విలువైన సామగ్రిని మాత్రమే ఐదు సంస్థల నుంచి కొనుగోలు చేసింది. కానీ.. అదే మెటీరియల్‌ను మళ్లీ మళ్లీ కొనుగోలు చేసినట్లు చూపి రూ.2,568.77 కోట్ల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని కాజేసినట్లు సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. ఒక సంస్థ నుంచి సిమెంటు కొనుగోలు చేసినట్లు బ్యాంక్ లెడ్జర్ బుక్‌లో చూపారు. కానీ, ఆ సంస్థకు కాకుండా మరో సంస్థకు చెల్లింపులు చేసినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లో తేలింది. బ్యాంక్ లెడ్జర్ బుక్కూ బ్యాంక్ స్టేట్‌మెంట్‌కూ పొంతన లేని లావాదేవీల ద్వారా రూ.1,624.35 కోట్లను ట్రాన్స్ట్రాయ్ దోచేసింది. సక్రమంగా చెల్లింపులూ చేయని ట్రాన్స్ట్రాయ్ ట్రాన్స్ట్రాయ్ ఎక్కడ పనిచేసినా సబ్ కాంట్రాక్టర్లకు సక్రమంగా చెల్లింపులు చేయదు. పోలవరంలో చేసిన పనులకు బిల్లులు ఎగ్గొట్టడంతో 2016 నుంచి 2019 వరకూ ట్రాన్స్‌ట్రాయ్‌కి వ్యతిరేకంగా సబ్ కాంట్రాక్టర్లు నెలల తరబడి ధర్నాలు, ఆందోళనలు చేశారు. కానీ, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణంలో రూ.794.16 కోట్లను సబ్ కాంట్రాక్టర్లకు అడ్వాన్సులుగా ఇచ్చామని.. వాటిని తిరిగి ఇవ్వలేని దుస్థితిలో సబ్ కాంట్రాక్టర్లు ఉండటంతో వాటిని మాఫీ చేశామని ట్రాన్స్ట్రాయ్ లెక్కలు చెప్పడంపై సీబీఐ అధికారులే నిర్ఘాంతపోయినట్లు సమాచారం. -
శిరోముండనం కేసును సీబీఐకి అప్పగించండి
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం పోలీసులు తనకు శిరోముండనం చేసిన కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బాధితుడు ఐ.ప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినా కూడా పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అందువల్ల ఈ కేసులో దర్యాప్తును సీబీఐ వంటి స్వతంత్ర సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, సీబీఐని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. -
న్యాయవాద దంపతుల హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిల దారుణహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘‘అధికార పార్టీ నేతలపై, పోలీసులపై, స్థానిక రాజకీయ నాయకుల అక్రమాలపై వామన్‌రావు, నాగమణి అనేక కేసులు వేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అక్రమాలపై కూడా హైకోర్టులో కేసులు వేశారు. దీంతో తన కుమారుడు, కోడలిపై పుట్ట మధుకర్, ఆయన అనుచరులు వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నారు. పుట్ట మధుకర్‌కు నేరచరిత్ర ఉంది. గతంలో ఆయనపై రౌడీషీట్ ఉండటంతోపాటు అనేక క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఓ వివాదంలో పుట్ట మధుకర్‌పై వామన్‌రావు గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే మంథని మున్సిపల్ చైర్మన్, మధుకర్ భార్య శైలజ ఎన్నికను సవాల్ చేస్తూ పీవీ నాగమణి ఎన్నికల పిటిషన్ కూడా దాఖలు చేశారు. శీలం రంగయ్య అనే వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటనపై లాకప్‌డెత్‌గా పేర్కొంటూ నాగమణి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించింది. మైనింగ్, ఇసుక మాఫియాకు చెందిన వారే రంగయ్యను హత్య చేయించారని వామన్‌రావు నాకు చెప్పాడు. నా కుమారుడి హత్య వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తన కుమారుడిపై గతంలో అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆయన ఆధ్వర్యంలో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదు. నిందితులు అధికార పార్టీకి చెందిన నేతలు. నిందితులతో స్థానిక పోలీసులకు సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ సహా స్థానిక పోలీసు అధికారులను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలి. హత్య ఘటనపై పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 17న నమోదైన క్రైమ్ నంబర్ 21/2021 దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి’’అని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ ఒకటి, రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
బొల్లినేని శ్రీనివాసగాంధీపై సస్పెన్షన్ వేటు
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ జీఎస్టీలో అసి స్టెంట్ కమిషనర్‌గా ఉన్న బొల్లినేని శ్రీనివాసగాంధీపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు, రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేసిన ఘటనల్లో సీబీఐ కేసులు నడుస్తున్న క్రమంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్ (సీబీఐసీ) శాఖ బొల్లినేనిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అతనితోపాటు డిప్యూటీ కమిషనర్ చిలుకా సుధారాణిపైనా వేటు వేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లకూడదంటూ ఆదేశించింది. అవినీతి, అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బొల్లినేనిపై ఏడాది వ్యవధిలో రెండు సార్లు సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అనుచరుడిగా ఆయన రాజకీయ శత్రువులపై కేసులు పెట్టి వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న బొల్లినేని అక్రమాలు క్రమంగా వెలుగు చూస్తున్నాయి. బొల్లినేని వేధింపులకు తాళలేక గతేడాది ఓ బాధితుడు సీబీఐకి ఫిర్యాదు చేశారు. 2019 జూలైలో బొల్లినేనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. 2020 సెప్టెంబర్‌లో మరో కేసు నమోదు చేసింది. అయితే ఇన్ని ఆరోపణలున్నా.. బొల్లినేనికి ఉన్నతాధికారులు క్లీన్ చిట్ ఇవ్వడంతో గతేడాది అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి పొందడం గమనార్హం. సాధారణంగా పదోన్నతుల సమయంలో వ్యక్తిగత ప్రవర్తనపై సీబీఐసీ ఢిల్లీ అధికారులు రిపోర్టు కోరినప్పుడు తనపై సీబీఐ కేసులున్న సంగతి పైకి వెళ్లకుండా బొల్లినేని జాగ్రత్తపడ్డాడని సమాచారం. పకడ్బందీగా వేధింపులు.. రూ.కోట్లలో బేరాలు దర్యాప్తులో బొల్లినేని అక్రమాలు తెలుసుకుని సీబీఐ అధికారులు అవాక్కయ్యారు. విశ్వసనీయ సమా చారం ప్రకారం.. బొల్లినేని తన వద్దకు వచ్చిన జీఎస్టీ రిటర్నులను బాగా అధ్యయనం చేస్తాడు. లోపాలుంటే వాటిని దర్యాప్తు చేసి నిందితులపై కేసు నమోదు చేయాలి. కానీ, బొల్లినేని ఇక్కడే తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తాడని తెలిసింది. ముందుగా తాను కేసు నమోదు చేయబోయే వ్యాపారి, ఉత్పత్తి దారులకు సన్నిహితంగా ఉండే సిబ్బంది, వ్యాపార భాగస్వాములను విచారణ పేరుతో పిలిపించి, కేసులు పెడతామని బెదిరిస్తాడు. వారు దారికి రాగానే.. ముందుగా రాసిన స్టేట్మెంట్పై సంత కాలు తీసుకుంటాడు. తర్వాత అసలు వ్యాపారిని పిలిపిస్తాడు. ‘మీ సిబ్బంది అంతా అప్రూవర్‌గా మారారు. మీరే మిగిలారు.. మా ఉన్నతాధికారులు మీపై కోపంగా ఉన్నారు. మేం అడిగిన్ని రూ.కోట్లు ఇవ్వకపోతే మీపై కేసులు పెడతాం. మీ ఇంట్లో ఆడవారు కూడా జైల్లోకి వెళ్లాల్సి వస్తుంది’అని బెదిరింపులకు దిగుతాడు. అడిగినంత ఇస్తే కేసే లేదు.. కానీ, ఇవ్వకపోతే వారిపై కేసులు నమోదు చేసేస్తాడు. డిమాండ్ చేసిన లంచాన్ని నగదు రూపంలో కూడా పూర్తిగా తీసుకోడు. 10 శాతం నగదు, మిగిలిన 90 శాతం బాధితుల భూములు బినామీల పేరిట రాయించుకుంటాడని తెలిసింది. బదిలీలు లేకుండా ఒకేచోట 13 ఏళ్లు.. 1992లో సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో ఇన్ స్పెక్టర్‌గా చేరిన బొల్లినేని శ్రీనివాస గాంధీ 2002లో సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందాడు. 2003లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లోకి డిప్యుటేషన్ పై వెళ్లిన ఆయన ఏడాది పాటు అందులో పనిచేశాడు. 2004లో ఈడీకి బదిలీపై వెళ్లిన బొల్లినేని.. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ పని చేయని స్థాయిలో 2017 వరకు ఎలాంటి బదిలీలు లేకుండా ఈడీ (ఇన్వెస్టిగేషన్ ) లోనే విధులు నిర్వర్తించాడు. ఇలాంటి పోస్టుల్లో ఎవరికైనా రెండేళ్లే అవకాశమిస్తారు. మరీ అత్యవసరం అనుకుంటే మరో ఏడాది అదనంగా డిప్యుటేషన్ కొనసాగనిస్తారు. అంతే తప్ప 13 ఏళ్ల పాటు ఒకే చోట కొనసాగించిన దాఖలాలు లేనే లేవని సొంతశాఖ అధికారులే విస్తుపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బొల్లినేనికి కీలక పోస్టు లభించడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైదరాబాద్ జీఎస్టీ, బేగంబజార్ రేంజ్‌కి బొల్లినేనిని సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. అక్కడ కూడా నిబంధనల ప్రకారం అతడికి దర్యాప్తు విభాగంలో పోస్టింగ్ ఇవ్వకూడదు. ఈ సమయాన్ని ‘కూలింగ్ పీరియడ్’అంటారు. కానీ, తనకున్న పరిచయాలతో కూలింగ్ పీరియడ్‌ను తప్పించుకుని యాంటీ ట్యాక్స్ ఎవేషన్ డిపార్ట్మెంట్, బషీర్‌బాగ్‌లో పోస్టింగ్ తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై జీఎస్టీ ఎగవేత కేసులో బొల్లినేని వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలున్నాయి. రూ.65 లక్షల జీతం.. రూ.200 కోట్ల ఆస్తులు! 2010–2019 వరకు పదేళ్లలో రూ.65 లక్షలు జీతంగా అందుకున్న బొల్లినేని.. కుమార్తె మెడికల్ సీటుకే రూ.70 లక్షలు చెల్లించడం గమనార్హం. ఇక ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తులు విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.3.74 కోట్లు.. కూకట్పల్లి హైదర్‌నగర్‌లో ఇంటిని రూ.1.20 కోట్లతో నిర్మించారు. 2019 జూలై 8న బొల్లినేనిపై అక్రమాస్తుల కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ఆ మరుసటి రోజు హైదరాబాద్, విజయవాడల్లోని ఆస్తులపై ఏకకాలంలో దాడులు చేశారు. ఏపీలోని తుళ్లూరు, గుణదల, పెద్దపులిపాక, కన్నూరు, కంకిపాడు, ప్రొద్దుటూరు.. హైదరాబాద్‌లోని కొండాపూర్, మదీనాగూడ, కూకట్‌పల్లిలలో బొల్లినేని భారీగానే స్థిరాస్తులు కూడగట్టినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ దాదాపు రూ.200 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కూడా అతనిపై దర్యాప్తు మొదలుపెట్టింది. ఈడీ అధికారులు బొల్లినేనిపై ఇప్పటికే ఎన్ ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) దాఖలు చేశారు. భారీ ఎత్తున మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు పేర్కొన్నారు. -
సిట్ దర్యాప్తు సాగుతోందిగా.. సీబీఐ ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు సంబంధించి సిట్ దర్యాప్తు సాగుతున్నందున ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు అవసరంలేదని హైకోర్టు పేర్కొంది. ఈ దాడులపై సీబీఐ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన లెక్చరర్ కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) పరిష్కరించింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేశామన్న ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సిట్ దర్యాప్తును కొనసాగనిద్దామని తెలిపింది. సిట్ దర్యాప్తు ముగియకముందే సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం అపరిపక్వమే అవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, ఈ దశలో న్యాయస్థాన జోక్యం కూడా అవసరం లేదని తేల్చిచెప్పింది. ఒకవేళ సిట్.. దేవాలయాలపై దాడులకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో విఫలమైతే అప్పుడు కోర్టుకు రావచ్చని పిటిషనర్‌కు మౌఖికంగా తెలిపింది. ఈ దాడుల కేసు దర్యాప్తును సిట్ ఓ తార్కిక ముగింపునకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తూ పిల్‌ను పరిష్కరించింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ఆలయాలపై తరచు దాడులు జరుగుతున్నాయని, విగ్రహాల ధ్వంసం జరుగుతోందని చెప్పారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం తగులబెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో దేవతామూర్తి విగ్రహం నుంచి తలను వేరుచేశారని, దీనిపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. రథం దగ్ధం కన్నా రామతీర్థం ఘటన తీవ్రమైనదని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఆలయాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తోందని, అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిల్‌ను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
అరుదుగానే సీబీ‘ఐ’
సాక్షి, అమరావతి: పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై దాడి కేసు దర్యాప్తు విషయంలో సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తమ అభిప్రాయాన్ని బుధవారం హైకోర్టుకు తెలియజేసింది. సీబీఐ దర్యాప్తుకు హైకోర్టులు అరుదుగానే ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో స్పష్టంగా చెప్పిందని సీబీఐ నివేదించింది. జాతీయ భద్రత చట్టం నిర్ధేశించిన షెడ్యూల్డ్ నేరాల జాబితా పరిధిలోకి పోలీస్‌స్టేషన్‌పై దాడి ఘటన రాదని ఎన్ఐఏ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పిటిషనర్ వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. 2018లో పాత గుంటూరు పోలీస్‌స్టేషన్‌పై కొందరు ముస్లిం యువకులు దాడి చేసిన ఘటనకు సంబంధించి నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం గత ఆగస్టులో జీవో ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ గణేశ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దాడి కేసును స్వతంత్ర దర్యా ప్తు సంస్థకు అప్పగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న ధర్మాసనం.. సీబీఐ, ఎన్ఐఏ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్ఐఏ ఎస్పీ సీవీ సుబ్బారెడ్డి, సీబీఐ ఎస్పీ పి.విమలాదిత్య, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ కౌంటర్లు దాఖలు చేశారు. బుధవారం ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని మరోసారి విచారించింది. అసాధారణ కేసుల్లోనే ఆదేశించాలి: సీబీఐ అసాధారణ కేసుల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొందని సీబీఐ తరఫు న్యాయవాది పి.చెన్నకేశవులు తెలిపారు. షెడ్యూల్డ్ నేరాల జాబితాలోని దేశ భద్రత, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, బాంబుపేలుళ్లు తదితర కేసుల్లో మాత్రమే తాము దర్యాప్తు చేస్తామని ఎన్ఐఏ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ తెలియజేశారు. ప్రాసిక్యూషన్ ఉపసంహరణ వెనుక దురుద్దేశాల్లేవు పోలీస్‌స్టేషన్‌పై దాడికి సంబంధించి నమోదైన కేసుల్లో ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ఎలాంటి దురుద్దేశాలు, రాజకీయ కారణాలు లేవ ని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. తాము సూచన మాత్రమే చేశామని, అంతిమ నిర్ణయం సంబంధిత మేజిస్ట్రేట్‌దేనని ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. అయితే దర్యాప్తు దశలో ఉన్న కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌ను ఎలా ఉపసంహరించుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చే విషయంలో న్యాయస్థానం స్వీయ నియంత్రణ పాటించాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ సీబీఐ ఎస్పీ దాఖలు చేసిన కౌంటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అఫిడవిట్‌ను తామెన్నడూ చూడలేదని వ్యాఖ్యానించింది. -
‘గీతం’పై సీబీఐ విచారణ జరపాలి
సీతమ్మధార (విశాఖ ఉత్తరం): విశాఖలో గీతం యూనివర్సిటీ అక్రమాల పర్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే అనే డిమాండ్ పెరుగుతోంది. 71 ఎకరాలకు పైగా చేజిక్కించుకున్నది చాలక పక్కనున్న ప్రభుత్వ భూమి 40 ఎకరాలనూ కాజేయాలనుకోవడం దుర్మార్గమని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పలు ప్రజా సంఘాలు నినదిస్తున్నాయి. ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తుంటే ఉపేక్షించరాదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ అండతో కబ్జాల పర్వం కొనసాగించారని, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. చట్టవిరుద్ధంగా నిర్మించిన భవనాలన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, వైద్య వ్యాపారం ద్వారా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న గీతం యూనివర్సిటీపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ సోమవారం ఆందోళన నిర్వహించింది. యాజమాన్యాన్ని అరెస్టు చేసి, సంస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరింది. ఈ మేరకు జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు ఎంవీపీ కాలనీలోని సీబీఐ కార్యాలయంలో ఎస్పీ విమల్ ఆదిత్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఎత్తున విదేశాల నుంచి రూ.కోట్లాది నిధులు, విరాళాలు పొందుతూ.. అక్రమంగా ఆస్తులు సంపాదిస్తూ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన గీతంపై అంతర్గత ఆడిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గతంలో సంస్థ అధినేత విశాఖ ఎంపీగా పనిచేసిన సమయంలో విశాఖ నగరాభివృద్ధికి కేటాయించిన నిధులను సైతం గీతం వర్సిటీకి దారి మళ్లించారని, గీతం ఇచ్చిన నకిలీ డిగ్రీలతో అనేకమంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. నిబంధనల ప్రకారం సముద్ర తీర ప్రాంతంలో భారీ కట్టడాలు, భవంతులు ఉండరాదని హైకోర్టు ఉత్తర్వులుండగానే అదే హైకోర్టులో అరగంటలో అక్రమ కట్టడాలను కూల్చివేయరాదని ఏవిధంగా స్టే తెచ్చుకున్నారో విచారణ జరపాలన్నారు. గీతం వ్యవహారాలపై హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన వెంటనే పూర్తి స్థాయి విచారణ చేస్తామని సీబీఐ ఎస్పీ తెలిపారన్నారు. -
హథ్రస్ కేసు: ఆ రైతు పాలిట శాపంగా..
లక్నో : హథ్రస్ దళిత యువతిపై అత్యాచారం, హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతోంది. అధికారులు.. బాధితులు, నిందితులను ఇది వరకే పలుమార్లు విచారించారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. బాధితులతో కలిసి పంట పొలంలోని క్రైం సీన్‌ను పరిశీలించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కారణంగా తన పంట నాశనం అయిందని క్రైం సీన్ ఉన్న పంట పొలం యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 19 ఏళ్ల దళిత బాలిక అత్యాచారానికి గురైన బూల్‌గర్హీ గ్రామంలోని పంట పొలాన్ని సీబీఐ అధికారులు పలుమార్లు పరిశీలించారు. క్రైం సీన్‌ను కాపాడటానికి పొలానికి దూరంగా ఉండాలని దాని యజమానిని ఆదేశించారు. నీళ్లు పెట్టకపోవడం, కలుపు తీయకపోవటంతో పంట నాశనం అయిపోయింది. ( ఢిల్లీ వెళ్తామన్న ‘హాథ్రస్’ కుటుంబం ) దీనిపై సదరు రైతు మాట్లాడుతూ.. ‘‘క్రైం సీన్లోని ఆధారాలను పరిరక్షించటానికి దాదాపు రెండున్నర ఎకరాలు ఉన్న నా పొలానికి నీళ్లు పెట్టవద్దని, పొలంలో ఎలాంటి పనులు చేయవద్దని సీబీఐ అధికారులు ఆదేశించారు. దానికి తోడు చాలామంది పంటను తొక్కారు. దీంతో పంట నాశనమై 50 వేల రూపాయల నష్టంతో పాటు మా ఇంటిల్లిపాది కష్టం వృధా అయింది. ప్రభుత్వం నాకు నష్ట పరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్ చేశారు. -
హథ్రాస్ కేసు: ఐదు గంటల పాటు విచారణ!
లక్నో: హథ్రాస్ సామూహిక లైంగిక దాడి, హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే ఘటనాస్థలి వద్దకు వెళ్లి వివరాలు సేకరించిన సీబీఐ బృందం, శనివారం మరోసారి బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసింది. భూల్ఘర్‌లోని వారి ఇంటికి వెళ్లి, సుమారు ఐదు గంటల పాటు వారిపై ప్రశ్నల వర్షం కురిపించింది. బాధితురాలి తల్లి, వదిన చెప్పిన వివరాలను నమోదు చేసుకుంది. వీరితో పాటు చోటు అనే సాక్షిని కూడా విచారించినట్లు సమాచారం. అంతేగాకుండా ఈ కేసులోని ప్రధాన నిందితుడు, బాధితురాలి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లు ఆధారాలు పోలీసులు వెల్లడించిన నేపథ్యంలో, ఈ విషయం గురించి బాధితురాలి కుటుంబ సభ్యులను ఆరా తీసినట్లు తెలుస్తోంది. (చదవండి: వాళ్లు భయపడ్డం లేదు.. జైలు మార్చండి!) కాగా, ఈ కేసులోని నలుగురు నిందితుల కుటుంబసభ్యుల్ని సీబీఐ అధికారులు గురువారం విచారించిన విషయం తెలిసిందే. ఆధారాల సేకరణ కోసం వారి ఇళ్ల వద్ద సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఈ నేపథ్యంలో నిందితుడు లవ్ కుశ్ సికార్వర్ ఇంట్లో రక్తపు మరకలతో కూడిన దుస్తుల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే అవి రక్తపు మరకలు కాదని, ఎర్రని పెయింట్ అని అతడి సోదరుడు వీడియో విడుదల చేయడం గమనార్హం. ఇక హథ్రాస్ దళిత యువతి సామూహిక అత్యాచారం, హత్య కేసులో సీబీఐ విచారణను పర్యవేక్షించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా బాధితురాలి కుటుంబానికి, ఈ కేసులోని సాక్షులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపింది. ఇప్పటికే, బాధితురాలి ఇంటి వద్ద విధులు నిర్వరిస్తున్న పోలీసు సిబ్బంది, ఇతరత్రా వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేసింది. (‘ఎవరికీ భయపడం.. న్యాయం తప్ప ఇంకేమీ వద్దు’) -
సోషల్ మీడియాలో పోస్టింగ్‌లపై సీబీఐ దర్యాప్తు
సాక్షి, అమరావతి: సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులపై పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లన్నింటినీ సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించింది. ఆధారాలన్నీ సీబీఐకి అందచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఏదైనా కాగ్నిజబుల్ నేరం ఉందని భావిస్తే మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తును ఓ తార్కిక ముగింపునకు తీసుకురావాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ఈ పోస్టుల వెనుక భారీ కుట్ర ఉన్నట్లు గమనిస్తే హోదా, స్థాయితో నిమిత్తం లేకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, ఆ యూజర్లను బ్లాక్ చేయాలని సీబీఐకి సూచించింది. తీర్పు కాపీ అందుకున్న నాటి నుంచి ఎనిమిది వారాల్లోపు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో తమ ముందుంచాలని ఆదేశించింది. సీబీఐ కోరితే పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి సూచిస్తూ తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో కొత్త ఒరవడి మొదలైన విషయాన్ని ఈ న్యాయస్థానం గుర్తించింది. హైకోర్టు, న్యాయమూర్తులపై సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇంటర్వ్యూలలో దూషణల పర్వం మొదలైంది. దూషించినా, తిట్టినా తమ నిష్పాక్షికత, నిజాయితీ గురించి చెప్పుకునే వేదిక న్యాయమూర్తులకు లేదు. ఈ అపరాధులను శిక్షించేందుకు కోర్టు ధిక్కార చట్టం సరిపోదు. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించారు. అయితే దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందన్న విషయాన్ని వీరు మర్చిపోయారు’ అని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. అప్పటికప్పుడు ఆదేశాలు.. సీఐడీతో పోలిస్తే మానవ వనరులు, సాధన సంపత్తి అధికంగా ఉండటం, విస్తృత పరిధి తదితర కారణాలతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు హైకోర్టు తన 20 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తరఫు న్యాయవాదులు కూడా సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం చెప్పకపోవడం మరో కారణమని పేర్కొంది. ఈ కేసు సోమవారం నాటి కేసుల విచారణ జాబితా (కాజ్ లిస్ట్)లో లేకున్నా భోజన విరామం అనంతరం ధర్మాసనం అప్పటికప్పుడు ఆదేశాలు వెలువరించింది. -
సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తాం
సాక్షి, అమరావతి: పలు హెబియస్ కార్పస్ పిటిషన్లలో పోలీసులపై అక్రమ నిర్భంద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీచేస్తామని హైకోర్టు ప్రాథమిక అభిప్రాయం వ్యక్తంచేసింది. ఈ కేసులను సీబీఐతో దర్యాప్తునకు ఎందుకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో రాజ్యాంగ అమలు వైఫల్యం (కాన్స్టిట్యూషనల్ బ్రేక్‌డౌన్) ఉందా లేదా అన్న అంశంపై వాదనలు వినిపించాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్‌కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. పోలీసులపై దాఖలైన పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం గత కొద్దిరోజులుగా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం తన విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ సర్వా సత్యనారాయణప్రసాద్ పోలీసుల తరఫున వాదనలు వినిపించారు. ఆ న్యాయవాది పట్ల దురుసుగా ప్రవర్తించలేదు దంపతుల అక్రమ నిర్భందంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని సత్యనారాయణప్రసాద్ అన్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కూడా ఒత్తిడి చేయలేదన్నారు. న్యాయవాది ఇంట్లో తనిఖీలకు ఈ కేసుకు సంబంధంలేదని ఆయన తెలిపారు. పిటిషనర్లవి కేవలం ఆరోపణలే తప్ప, వాస్తవాలు కావన్నారు. సివిల్ జడ్జి ఇచ్చిన నివేదికలో అనేక లోపాలున్నాయని, ఆ నివేదిక సమగ్రంగా లేదని సత్యనారాయణ ప్రసాద్ చెప్పారు. ఇలాంటి కేసుల్లో సీబీఐ దర్యాప్తా.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. సివిల్ జడ్జి నివేదికలో ఉన్న వాస్తవాలని పిటిషనర్లు చెబుతున్నారని, అయితే.. ఆ నివేదికను పోలీసులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని తెలిపింది. ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ సమయంలో సత్యనారాయణ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ.. ప్రతీ చిన్న కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరంలేదన్నారు. ఎలాంటి సందర్భాల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నిర్దేశించిందని తెలిపారు. అసలు ఈ వ్యాజ్యాల్లో పోలీసు ఉన్నతాధికారులపై ఎలాంటి ఆరోపణలులేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ఇలాంటి కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన దాఖలాలు లేవన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇదే రీతిలో గతంలో ఓ న్యాయవాది విషయంలో కూడా పోలీసులు వ్యవహరించారని, తరువాత ఆ న్యాయవాది తన కేసును ఉపసంహరించుకున్నారని తెలిపింది. ఆ కేసును ఇప్పటికే మూసేసినప్పటికీ, దానిపై మళ్లీ విచారణ జరుపుతామని స్పష్టంచేసింది. ఆ కేసును కూడా ప్రస్తుత కేసుల జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. -
అదో బోగస్ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి!
ముంబై: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులపై నటి రియా చక్రవర్తి లాయర్ సతీశ్ మనేషిండే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. #JusticeforSushant అనేది ఓ బోగస్ ప్రచారం అంటూ విరుచుకుపడ్డారు. సుశాంత్ సింగ్ మృతి కేసులో హత్య కోణాన్ని తోసిపుచ్చుతూ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన సతీశ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులో సీబీఐ విచారణ ఓ కొలిక్కి వచ్చేంత వరకు ఎదురుచూడాలి. కానీ దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ముంబై పోలీసులు, ఎయిమ్స్ వైద్యులపై కొంత మంది నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వాళ్లకు నచ్చిన సమాధానం రాకపోవడంతో ఇష్టారీతిన రెచ్చిపోతున్నారు. ఇక సుశాంత్‌కు న్యాయం చేయాలంటూ ఉద్యమం చేస్తున్నవాళ్లదంతా ఓ బోగస్ ప్రచారం. డాక్టర్లు ఏం చెప్పారో విన్నారు కదా. (చదవండి: కుక్కల్లా మొరిగిన వారు ఇప్పుడేం చెబుతారు!) మీలాంటి వాళ్లంతా సిగ్గుతో తలకు ఉరేసుకోవాలి. ఎందుకంటే మీ నటుడికి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందన్న విషయం బయటకు వచ్చింది. అతడి కుటుంబం వల్ల, సోకాల్డ్ మీడియా సృష్టించిన అసత్య ప్రచారాల వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి వాళ్లంతా సిగ్గుతో ఉరేసుకోవాలి’’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. దీంతో అతడితో సహ జీవనం చేసిన నటి రియా చక్రవర్తిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనేక పరిణామాల అనంతరం ఈ కేసు సీబీఐ చేతికి వచ్చింది. ఈ క్రమంలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక రియా తరఫున సతీశ్ మనేషిండే వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
సుశాంత్ మృతి: మర్డర్ కేసుగా మార్చండి!
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆ లోకాన్ని వీడి మూడు నెలలు దాటినా అతడి మరణానికి గల స్సష్టమైన కారణాలు మాత్రం ఇంతవరకు వెల్లడికాలేదు. బంధుప్రీతి, బాలీవుడ్ ప్రముఖుల విపరీత పోకడల అంశం చుట్టూ తిరిగిన ఈ కేసు డ్రగ్స్ వ్యవహారంతో మరో మలుపు తీసుకుంది. మీడియా, సోషల్ మీడియాలో మాదక ద్రవ్యాల కేసు గురించే విపరీతచర్చ జరుగుతోంది. దీంతో సుశాంత్ మృతి కేసును పక్కదోవ పట్టిస్తున్నారని, అతడిది ఆత్మహత్యా లేదా హత్యా అన్నది తేల్చడంలో సీబీఐ ఎందుకు ఆలస్యం చేస్తోందంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సుశాంత్ కుటుంబ లాయర్ వికాస్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. (చదవండి: డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!) ఈ మేరకు.. ఎయిమ్స్ బృందంలోని ఓ డాక్టర్‌కు తాను గతంలో కొన్ని ఫొటోలు పంపించానని, అందులో సుశాంత్ మెడపై కొన్ని గుర్తులున్నట్లు స్పష్టంగా తేలిందన్నారు. వాటిని బట్టి సుశాంత్‌ను ఎవరో గొంతు నులిమి చంపేశారని, అయితే 200 శాతం సూసైడ్ కాదని చెప్పుకొచ్చారు. ఇన్ని ఆధారాలు కనిపిస్తున్నా ఈ కేసును మర్డర్ కేసుగా మార్చడంలో సీబీఐ జాప్యం చేయడం విసుగు తెప్పిస్తోందంటూ వికాస్ సింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇందుకు స్పందనగా సుశాంత్ సోదరి శ్వేతాసింగ్ కీర్తి సైతం.. ‘‘చాలా రోజుల నుంచి ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నాం! నిజాన్ని వెలికితీసేందుకు ఇంకెంత సమయం పడుతుంది?’’అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఇదిలా ఉండగా సుశాంత్ కేసును పరిశీలిస్తున్న ఎయిమ్స్ ఫోరెన్సిక్ టీం పానెల్ చీఫ్ వికాస్ సింగ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. మృతుడి శరీరంపై ఉన్న మరకల ఆధారంగా ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని, రిపోర్టు వచ్చేంత వరకు కాస్త ఓపికగా వేచిచూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి ప్రస్తుతం డ్రగ్స్ కేసులో బైకుల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. We have been so patient for so long! How long will it take to find the truth? #SSRDeathCase https://t.co/Vn5R62a0SY — Shweta Singh Kirti (@shwetasinghkirt) September 25, 2020 -
తప్పు చేయకుంటే భయమెందుకు?
సాక్షి, న్యూడిల్లీ: అమరావతిలో భూముల అక్రమాలపై ఆధారాలుంటే కేసులు పెట్టాలని సవాల్ చేసిన టీడీపీ నేతలు దర్యాప్తుపై స్టే ఎందుకు తెచ్చుకున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీలు సూటిగా ప్రశ్నించారు. ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, గోరంట్ల మాధవ్ మంగళవారం పార్లమెంట్ ఆవరణలో మాట్లాడారు. దొంగే.. దొంగ అన్నట్లుగా ఉంది: బెల్లాన ► సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే దానిపై స్టే తెచ్చారు. విపక్ష పార్టీల నేతలు గుడులు, గోపురాలపై దాడులు చేస్తూ దొంగే దొంగ అని అరిచిన మాదిరిగా వ్యవహరిస్తున్నారు. సవాల్ చేసి పరార్.. రంగయ్య..: భూ కుంభకోణాలు, ఇతర స్కాములపై ఆధారాలు చూపి కేసులు పెట్టుకోవాలని సవాళ్లు చేసిన ప్రతిపక్ష నేతలు మాటపై నిలబడకుండా పారిపోతున్నారు.తప్పులు చేయనప్పుడు భయం ఎందుకు? కోర్టులకు వెళ్లి స్టే ఉత్తర్వులు ఎందుకు తెచ్చుకుంటున్నారు? తప్పు చేయకుంటే స్వాగతించండి: బ్రహ్మానందరెడ్డి ► అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటే అడ్డుకుంటున్నారు. ► అమరావతిలో చంద్రబాబు భూ కుంభకోణానికి పాల్పడ్డారు. తప్పు చేయకుంటే సీబీఐ దర్యాప్తును ఎందుకు స్వాగతించడం లేదు? ఆలయాలపై పారదర్శకంగా వ్యవహరిస్తూ సీబీఐ దర్యాప్తు కోరితే స్వాగతించకుండా విమర్శలకు దిగడం సిగ్గుచేటు. -
హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 1411, మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేస్తూ జారీచేసిన జీఓ 344ల్లో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించి జారీచేసిన జీఓలను తప్పుపట్టడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అక్రమాలను వెలుగులోకి తెచ్చేందుకు మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ను ఏర్పాటుచేశారన్న విషయాన్ని హైకోర్టు విస్మరించింది. పిటిషన్లు వేసేందుకు అర్హతలేని వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరపడమే కాకుండా, ప్రభుత్వం తన కార్యనిర్వాహక అధికారాలను ఉపయోగించడాన్ని తప్పుపట్టడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసింది. అవినీతి ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం తన అధికార పరిధిని ఉపయోగించి ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపట్టడం సరికాదు’.. అని వారు పేర్కొన్నారు. విచారణాధికారం ప్రభుత్వానికి లేదా? అలాగే, ‘గత ప్రభుత్వాల అక్రమాలపై విచారణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అలాంటి ప్రజాస్వామ్యబద్ధ అధికారాన్ని న్యాయస్థానం తిరస్కరించవచ్చా? అన్నదే ప్రధాన ప్రశ్న. గత ప్రభుత్వంపై విస్తృత అవినీతి ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఈ ఒక్క కారణంతో హైకోర్టు ఉత్తర్వులను రద్దుచేయవచ్చు. గత ప్రభుత్వ నిర్ణయాలను పునః సమీక్షించే స్వతఃసిద్ధ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పడం ద్వారా హైకోర్టు తప్పుచేసింది. దర్యాప్తు చేయడాన్ని పునః సమీక్షగా హైకోర్టు భావించింది. ఇది ఎంత మాత్రం సబబు కాదు. దర్యాప్తు చేసే, దర్యాప్తు సంస్థలను ఏర్పాటుచేసే కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. అయితే, ఈ విషయాన్ని న్యాయస్థానం పట్టించుకోలేదు’.. అని అందులో వివరించారు. హైకోర్టు తప్పుగా అర్ధంచేసుకుంది అంతేకాక.. ‘ప్రభుత్వ కార్యనిర్వాహక అధికారాలు చాలా విస్తృతమైనవి. ఈ విషయంలో హైకోర్టు అభిప్రాయం సరికాదు. దర్యాప్తుదారు, ఫిర్యాదుదారు ఒక్కరే కాబట్టి, పక్షపాతం ఉండే అవకాశం ఉందన్న హైకోర్టు వాదనను పరిగణనలోకి తీసుకుంటే.. ఏ ప్రభుత్వానికీ అలాంటి దర్యాప్తు చేయడానికి వీలుండదు. దర్యాప్తుదారు, ఫిర్యాదుదారు ప్రభుత్వంలో భాగం కాబట్టి, దానికి పక్షపాతాన్ని ఆపాదించడానికి ఏ మాత్రం వీల్లేదు’.. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి అందులో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా, సుమోటోగా సీబీఐ దర్యాప్తును కోరలేదు. ఈ విషయాన్ని హైకోర్టు తప్పుగా అర్ధం చేసుకుంది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న న్యాయసూత్రాన్ని హైకోర్టు విస్మరించింది’.. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీఏడీ ముఖ్య కార్యదర్శి తమ పిటిషన్లో పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేయాలని వారు అభ్యర్థించారు. మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు జీఓలను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌లు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
సుశాంత్‌ది ముమ్మాటికీ హత్యే.. ఒకవేళ
‘‘నాలుగేళ్ల నుంచి సుశాంత్‌తో టచ్‌లో లేను. అయితే తను ఆత్మహత్య చేసుకున్నాడంటే నేను నమ్మను. తనది ముమ్మాటికి హత్యే అనిపిస్తోంది’’ అంటూ టీవీ నటుడు దీపక్ ఖజీర్ తన మనసులోని భావాలు వెల్లడించాడు. రాయడం అంటే సుశాంత్‌కు ఎంతో ఇష్టమని, ఒకవేళ తను నిజంగానే బలవన్మరణానికి పాల్పడితే సూసైడ్ నోట్ ఎందుకు రాయలేదని అనుమానం వ్యక్తం చేశారు. మీడియా కథనాల ఆధారంగా ఈ విషయంలో అందరి అభిప్రాయాలు మారుతున్నాయని, అయితే సీబీఐ విచారణ పూర్తై, సుశాంత్‌ది ఆత్మహత్య అని తేలిస్తే తన అభిప్రాయంలో మార్పు ఉండవచ్చన్నారు. కాగా బుల్లితెరపై ప్రేక్షకులను అలరించి, అంచెలంచెలుగా ఎదుగుతూ బాలీవుడ్లో అడుగుపెట్టిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించి విషయం విదితమే. (చదవండి: డ్రగ్స్ కేసు: తల్లి ఫోన్ వాడిన రియా!) ఈ క్రమంలో అతడి మృతి అనేక సందేహాలు, ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. అంతేగాక సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి వాట్సాప్ చాట్లు బహిర్గతం కావడంతో డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో సుశాంత్‌కు ఎంతో గుర్తింపు తెచ్చిన పవిత్ర రిష్తా సీరియల్లో అతడితో కలిసి నటించిన దీపక్ ఖజీర్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ‘‘ పవిత్ర రిష్తా సీరియల్ తర్వాత మళ్లీ తనను ఎన్నడూ కలవలేదు. అయితే నాలుగైదేళ్లలో ఓ వ్యక్తి పూర్తిగా మారిపోతాడని నేను అనుకోను. సుశాంత్‌కు ప్రతీ విషయం పేపర్‌పై పెట్టడం అలవాటు. నిజంగా ఆత్మహత్య చేసుకుంటే నోట్ రాసేవాడు కదా. (చదవండి: ‘రియా ఎవరో నాకు నిజంగా తెలియదు’) అంతేకాదు అయినా ఎలాంటి ఆధారాలు లభించకుండానే సుశాంత్‌ది సూసైడ్ అని ముంబై పోలీసులు ఎలా తేలుస్తారు? సుశాంత్ కుటుంబం ఇప్పటికే శోక సంద్రంలో మునిగిపోయి ఉంది. వాళ్ల వాంగ్మూలాలు నమోదు చేసే సమయంలో మరాఠీలో రాశారని వార్తలు వచ్చాయి. అసలు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది? ’’అని ప్రశ్నించారు. ఇక డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో నటి, ఎంపీ జయా బచ్చన్ చేసిన వ్యాఖ్యలను దీపక్ విమర్శించారు. ‘‘ఆమె అన్నట్లు ఇక్కడ చాలా మంది దగ్గర కనీసం కంచం కూడా లేదు. ఓ చిన్న గిన్నె పట్టుకుని పేమెంట్ల కోసం ఎదురుచూస్తారు. ఆలస్యమైతే ఆర్థిక బాధలు భరించలేక జీవితాలను అంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి’’అని సినీ నటుల పరిస్థితిని వివరించారు. అయితే సుశాంత్‌కు ఇలాంటి కష్టాలేమీ లేవని, అతడు ఆర్థికంగా బలంగా ఉండటం సహా చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్నాడని, అలాంటి వ్యక్తి ఇలా ప్రాణాలు తీసుకున్నాడంటే నమ్మడం కష్టంగా ఉందని అభిప్రాయపడ్డారు. తనను ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని సందేహం వ్యక్తం చేశారు. -
నక్సల్స్‌కు మద్దతుగా పిటిషన్లా?
‘నక్సలైట్లు దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. అటువంటి వారికి మద్దతుగా పిటిషన్లు ఎలా వేస్తారు? ఇలాంటి పిటిషన్ల విషయంలో తీవ్రంగా స్పందించాల్సిన అవసరం ఉంది. నక్సలైట్ల చేతిలో ఎంతోమంది పోలీసులు చనిపోయారు. ఆ పోలీసుల కుటుంబాల కోసం ఎవరైనా హైకోర్టులో పిటిషన్లు వేశారా? ఆ కుటుంబాలను ఎవరైనా పట్టించుకున్నారా?’ – హైకోర్టు ధర్మాసనం సాక్షి, అమరావతి: విశాఖ జిల్లా పెదబయలు మండలం బురద మామిడిలో 2012లో ఇద్దరు ఆదివాసి రైతులను ఎన్కౌంటర్లో కాల్చి చంపడంపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ జరపాలని దాఖలైన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. పౌర హక్కుల నేత ఎన్‌హెచ్ అక్బర్ 2012లో దీనిపై పిల్ దాఖలు చేశారు. ఘటనకు కారణమైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. నక్సలైట్లపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. వారిని సమర్థిస్తూ పిల్ దాఖలు చేసినందుకు పిటిషనర్‌ను వివరణ కోరతామంది. -
ఆ రెండింటికి సమాధానం చెప్పలేకపోతున్న రియా
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి శుక్ర, శనివారాలు వరుసగా రెండు సార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆదివారం కూడా ఆమెను విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో సీబీఐ విచారణలో రియా రెండు ముఖ్యమైన ప్రశ్నలకు దాటవేసే సమాధానాలిస్తున్నట్లు సమాచారం. సుమారు 50 ప్రశ్నలు అడిగితే అందులో రెండింటికి మాత్రం సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. దీంతో ఆ రెండు ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలతో సంతృప్తి చెందని సీబీఐ దీనిపై మరింత క్లారిటీ కోసం మరోసారి వీటిని ప్రశ్నించనుంది.(చదవండి: ‘బ్రేకప్ తర్వాత మాట్లాడలేదు.. వాళ్ల వైపే ఉంటా’) ఇంతకీ ఆ రెండు ప్రశ్నలేంటంటే.. "జూన్ 8న సుశాంత్‌తో బ్రేకప్ చేసుకున్నాకే అతని ఇంటి నుంచి వెళ్లిపోయారా? సమాధానం అవును అయితే ఏ కారణంతో విడిపోయారు?" రెండోది.. "మీరు అతని ఇంటి నుంచి వెళ్లిపోయాక కూడా సుశాంత్.. మీ సోదరుడికి ఫోన్ చేస్తూ మీ క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. మరి జూన్ 8 నుంచి 14 తేదీల మధ్య అతని కోసం మీరేమైనా పట్టించుకున్నారా? లేదా?" ఆదివారం నాటి విచారణలోనైనా రియా దగ్గర నుంచి ఈ రెండింటికి సరైన సమాధానాలు రాబట్టాలని సీబీఐ ఆలోచిస్తోంది. ఇదిలా వుండగా ఈ కేసులో సీబీఐ ఇప్పటికే సుశాంత్ ఫ్లాట్మేట్ సిద్ధార్థ్ పితానీ, సామ్యూల్ మిరండ, సుశాంత్ వంటమనిషి నీరజ్, వాచ్మెన్, మేనేజర్, రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ప్రశ్నించిన విషయం తెలిసిందే. (చదవండి: సుశాంత్ గంజాయి తాగేవాడు, నేనేం చేయగలను: రియా) -
‘విష ప్రయోగం వల్లే సుశాంత్ మృతి చెందాడు’
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విష ప్రయోగం వల్లే మరణించాడంటూ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ కడుపులో ఉన్న విషం ఆనవాలు లేకుండా పోయేంత వరకు వేచిచూసి.. ఆ తర్వాతే శవ పరీక్ష నిర్వహించారన్నారు. నటుడి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని.. హంతకుల రాక్షస మనస్తత్వం, వారి చెడు ఉద్దేశాల గురించి త్వరలోనే బయటపడుతుందని పేర్కొన్నారు.(చదవండి: ‘కరోనా రిపోర్టు రాకముందే పోస్ట్‌మార్టం ఎందుకు?’) ఇక సుశాంత్ సన్నిహితుడిగా పేరొందిన సందీప్ సింగ్ తీరుపై కూడా సుబ్రహ్మణ్య స్వామి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడు పదే పదే దుబాయ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని, ఈ విషయాలపై కూడా విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుశాంత్ మృతికి కారకులైన వారి వివరాలు వెల్లడయ్యే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆది నుంచి ఈ నటుడిది హత్యేనని పేర్కొంటూ సుబ్రహ్మణ్యస్వామి పలు సందేహాలను లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలో సుశాంత్ హత్య జరిగిన రోజున దుబాయ్ కంప్లైంట్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ సింగ్‌ను కలిశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక సుశాంత్ కేసు మాదిరిగానే ప్రముఖ నటి శ్రీదేవి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులను కూడా సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. (చదవండి: సుశాంత్ కేసు.. స్వామి సంచలన ఆరోపణలు) Now the diabolical mentality of the killers and their reach is being slowly revealed: autopsy was deliberately forcibly delayed so that the poisons in SSR’s stomach dissolves beyond recognition by the digestive fluids in the stomach . Time to nail those who are responsible — Subramanian Swamy (@Swamy39) August 25, 2020 ఇక అనేక పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు ఇటీవలే సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన కేంద్ర దర్యాప్తు సంస్థ... నిజానిజాలను వెలికితీసేందుకు లోతుగా దర్యాప్తు చేపట్టింది. (చదవండి: సుశాంత్ మృతి: జూన్ 14న ఏం జరిగిందంటే..) -
బాబు అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, వ్యవస్థల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన చేసిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలని ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి సవాలు విసిరారు. గతంలో తాను చంద్రబాబు అక్రమాలపై వేసిన కేసును 14 ఏళ్లపాటు స్టేలతో అడ్డుకున్నారని తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ► చంద్రబాబు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాస్తున్నాను. ఈ మేరకు నా విజ్ఞప్తిని అంగీకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, న్యాయ వ్యవస్థకు కూడా లేఖ రాస్తున్నా. దీనిపై ప్రధాని స్పందించి విచారణకు ఆదేశించాలి. ► చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను అవినీతిమయం చేసి ఏటీఎంగా మార్చారన్న ప్రధాని.. గత ప్రభుత్వ అవినీతిని ఎత్తి చూపించారు. ► ఇప్పుడైనా ఆ అవినీతిపై విచారణకు ఆదేశించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది. ► ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారో బాబు స్పష్టం చేయాలి. కనీస ఆధారాలే లేకుండా ఫోన్ ట్యాపింగ్ గురించి ప్రధానికి బాబు లేఖ ఎలా రాస్తారు. ► చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయం ముసుగులో బాబు వ్యవస్థలను దోపిడీ చేస్తున్నారు. -
సుశాంత్ కేసు: పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసును ప్రస్తుతం పోలీసులు విచారించవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టి వేస్తూ గురువారం అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. పోలీసులను తమ పని తమను చేయనివ్వాలని, తమకేదైనా స్పష్టమైన సందేహం ఉంటే ముంబై హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్ అల్కా ప్రియకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. (దిల్ బేచారా: ఎంత మంది చూశారంటే!) అలాగే అభిమానులు, కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించలేమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముంబైలో దర్యాప్తు జరుగుతుండగా సుశాంత్ తండ్రి రియాపై పట్నాలో ఫిర్యాదు చేయడంతో బిహార్ పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. తన కొడుకును మోసం చేసి రియా డబ్బులు లాక్కుందని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో ఆరోపించారు. (సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు) కాగా రియా ఈ కేసును ముంబైకి బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కేసు విచారణను బీహార్ నుంచి ముంబైకి ట్రాన్సఫర్ చేయాలనీ.. రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైలో దర్యాప్తు జరుగుతుండగా అదే కేసులో బీహార్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం చట్టవిరుద్ధమని రియా న్యాయవాది చెప్పారు. అంతేగాక స్వయంగా హోమంత్రి అమిత్‌షాకు ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారు. మరోవైపు రియా చర్యను అడ్డుకోవాలని కోరుతూ సుశాంత్ తండ్రి ఈ రోజు(గురువారం) సుప్రీంకోర్టులో కోవియట్ పిటిషన్ వేశారు. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఇప్పటికే 40 మందికి పైగా ప్రశ్నించారు. (ఆత్మహత్య చేసుకున్న మరో నటుడు) -
రంగయ్య మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
మంథని/గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామయ్యపల్లికి చెందిన శీలం రంగయ్య మృతిపై సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంథనిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులు హింసించడం వల్లే రంగయ్య చనిపోయినట్లు కుటుంబ సభ్యులు చెబుతుంటే.. పోలీసులు మాత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దళితుల ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఖననం చేయకుండా దహనం ఎందుకు చేయించారని భట్టి ప్రశ్నించారు. రంగయ్య కుటుంబానికి న్యాయం జరిగే వరకు అవసరమైతే రాజ్యాంగ వ్యవస్థలోని అన్ని తలుపులను తడుతామని, రాష్ట్రపతి, గవర్నర్, రాష్ట్ర, జాతీయ హక్కుల కమిషన్లను కలుస్తామని ఆయన వివరించారు. మంథని ఘటనపై ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని, సిరిసిల్లలోని నేరెళ్ల, పెద్దపల్లిలోని బొంపెల్లి ఘటనలపై విచారణ జరిపించి.. నివేదికలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధైర్యంగా తలెత్తుకొని బతకొచ్చని ఆశించి తెలంగాణ తెచ్చుకుంటే.. ఆరేళ్లలో ఏ ఒక్క వర్గం అలా ముందుకెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశించిన తెలంగాణ కోసం మరోమారు గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రంగయ్య మృతిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలి సింగరేణి మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలని భట్టి, శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యం చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.ఓసీపీ–1 బ్లాస్టింగ్‌లో మృతి చెందిన కార్మిక కుటుంబాలను పరామర్శించేందుకు బుధవారం గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. -
సుధాకర్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు
సాక్షి, అమరావతి: మద్యం తాగి ఉభయ రాష్ట్రాల సీఎంలను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రోడ్డుపై న్యూసెన్స్ చేసినందుకు అనస్తీషియా వైద్యుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన వ్యవహారంలో హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై 8 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని సీబీఐకి నిర్దేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని వీడియో క్లిప్పులను, ప్రభుత్వ కౌంటర్, మెజిస్ట్రేట్ నివేదికలతో అన్ని రికార్డులను సీబీఐ అడిగినప్పుడు ఇవ్వాలని రిజిస్ట్రా్టర్ జనరల్‌కు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఈ కేసులో పోలీసులు ఎంత నిజాయతీగా, నిష్పాక్షికంగా దర్యాప్తు జరిపినా, ఎవరో ఒకరు వేలెత్తి చూపుతారని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ► డాక్టర్ సుధాకర్ విషయంలో అధికారులు అమానుషంగా ప్రవర్తించారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. లేఖతోపాటు ఓ వీడియోనూ జత చేశారు. ఆ వీడియోను ఎడిట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫొటోను జత చేశారు. దీన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా పరిగణించడం తెలిసిందే. ► దీనిపై జస్టిస్ రాకేష్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ నెల 16న విశాఖలో డాక్టర్ సుధాకర్ మద్యం సేవించి సిగరెట్లు తాగి పోలీసులపైకి విసరడం.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రిని అసభ్య పదజాలంతో దూషించడం.. తదితరాలకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను పోలీసులు ధర్మాసనం ముందుంచారు. పోలీసుల పట్ల అత్యంత అభ్యంతరకరంగా సుధాకర్ వ్యవహరించారని ప్రభుత్వ న్యాయవాది వైఎన్ వివేకానంద నివేదించారు. ► ఈ క్లిప్పింగులను పరిశీలించిన ధర్మాసనం.. ఇవి గానీ, అనిత పంపిన వీడియో క్లిప్పింగులు గానీ పరిపూర్ణంగా లేవని, వీటి ఆధారంగా నిర్దిష్టమైన నిర్ణయానికి రావడం సాధ్యం కాదంది. ► అనంతరం డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని నమోదు చేసి విశాఖ నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పంపిన నివేదికనూ పరిశీలించిన ధర్మాసనం.. ఇందులోని అంశాలకు, ప్రభుత్వ కౌంటర్లోని అంశాలకు మధ్య తేడాలున్నాయంది. సుధాకర్ ఒంటిపై ఆరు గాయాలున్నట్లు మేజిస్ట్రేట్ నివేదికలో ఉందని, అయితే వైద్యులు ఒక గాయమే ఉన్నట్లు పేర్కొన్నారని తెలిపింది. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయని, అందువల్ల ఓ స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు జరిపించడం మేలంటూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. -
కర్నూలు లైంగికదాడి కేసు సీబీఐకి..
కర్నూలు: కర్నూలు శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో 2017లో జరిగిన పదోతరగతి విద్యార్థిని లైంగికదాడి, హత్య అభియోగాలు ఉన్న కేసును సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేసినట్లు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థిని తల్లిదండ్రులు రాష్ట్ర హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను కలిసి న్యాయం చేయాల్సిందిగా గత ఏడాది ఆగస్టులో వినతిపత్రం సమర్పించారన్నారు. ఈ నేపథ్యంలో అదే ఏడాది అక్టోబర్ 21వ తేదీన కేసు తదుపరి దర్యాప్తునకు ఆదేశాలు వచ్చాయన్నారు. అప్పటికే కేసు ట్రయల్‌లో ఉన్నప్పటికీ కోర్టులో జడ్జి అనుమతి తీసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. నిజాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో అడిషనల్ ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అత్యాధునిక సాంకేతిక సహాయంతో దర్యాప్తు చేపట్టిందన్నారు. అయితే కేసును సీబీఐకి అప్పగించాలన్న బాధితురాలి కుటుంబీకులు, దళిత సంఘాల డిమాండ్‌తో డీజీపీ సానుకూలంగా స్పందించి తగిన ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సిందిగా సిఫారసు చేస్తూ డీజీపీకి నివేదించగా తదుపరి చర్యల నిమిత్తం వాటిని హోం సెక్రటరీకి పంపినట్లు ఎస్పీ వెల్లడించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ కరస్పాండెంట్ వల్లపురెడ్డి జనార్దన్‌రెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిలపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద అప్పట్లో కేసు నమోదు చేశారు. -
రాజధాని దందా నిగ్గు తేలుస్తాం
సాక్షి, అమరావతి: ‘రాజధాని ముసుగులో అమరావతి వేదికగా గత సర్కారు పాలనలో అంతులేనన్ని అక్రమాలు చోటు చేసుకోవడంపై లోకాయుక్త, సీఐడీ, సీబీఐలలో ఏదో ఒక సంస్థతో దర్యాప్తు చేయించాలని శుక్రవారం రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసుకుని గత పాలకులు ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం నిగ్గు తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై పలు రిజి్రస్టేషన్ డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలు లభ్యం కావడంతో మరింత లోతుగా సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో జరిగిన కుంభకోణంపై మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చెప్పారు. రాజధాని వ్యవహారంలో చాలా తప్పులు జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రికి వాటాలు ఉన్న సంస్థ కూడా ఈ ప్రాంతంలో 2014 డిసెంబర్‌కు ముందు (రాజధాని ఈ ప్రాంతంలో వస్తుందని అధికారికంగా ప్రకటించడానికి ముందు) భూములు కొనుగోలు చేసిన విషయం బట్టబయలైందని చెప్పారు. రాజధాని ప్రకటించడానికి కొంత ముందు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరెవరు ఆ ప్రాంతంలో భూములు కొన్నారో పూర్తిగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కచ్చితంగా బయట పెడతాం ‘రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసినందున గత పాలకులు.. డ్రైవర్లు, పనివాళ్లు, బంధువుల పేర్లతో కారు చౌకగా భూములు కొన్నారు. నైతిక విలువలు వదిలేసి అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమికంగా తేలింది. 2014 జూన్ నుంచి 2014 డిసెంబర్ నెలాఖరు మధ్య (రాజధాని ఎక్కడ పెడతారో ప్రకటించక ముందు) టీడీపీ నేతలు ఇక్కడ 4,075 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని మంత్రివర్గ ఉప సంఘం పేర్కొంది. ఇలా చేయరాని తప్పులు చేసిన వారే ఇప్పుడు రోడ్డెక్కి మాట్లాడుతున్నారు. రైతులను రెచ్చగొడుతున్నారు. దమ్ముంటే అక్రమాలు నిరూపించాలని సవాలు చేస్తున్నారు. జరిగిన తప్పును ఎవరూ దాచలేరు. అందుకే మొత్తం వ్యవహారంపై లోకాయుక్త లేదా సీఐడీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెచ్చగొడుతూ.. దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేస్తున్న పెద్ద మనుషుల కోరికను తప్పకుండా మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఎవరెవరు ఏమేరకు అక్రమాలకు పాల్పడ్డారో అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయి’ అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. -
విమానయాన సంస్థలతో తల్వార్ లింకులపై దర్యాప్తు
న్యూఢిల్లీ: కార్పొరేట్ లాబీయిస్ట్ (వ్యవహారాల నేర్పరి) దీపక్ తల్వార్‌కు దేశ, విదేశాలకు చెందిన 50 సంస్థలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించాయి. తన విదేశీ క్లయింట్లకు అనుకూలంగా ఎయిర్ ట్రాఫిక్ హక్కులను సంపాదించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనేతలకు తల్వార్ లంచాలు ఇచ్చినట్టు.. తద్వారా విమానయాన సంస్థల నుంచి తల్వార్‌కు రూ.272 కోట్లు ముట్టినట్టు దర్యాప్తు నివేదిక స్పష్టం చేస్తోంది. యూపీఏ హయాంలో తల్వార్ లాబీయింగ్ వ్యవహారాలు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించిన వాటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం తల్వార్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ఆరోపణలను ఆయన ఖండించడం గమనార్హం. ఎయిర్ఇండియా ప్రయోజనాలకు గండికొట్టి.. 2008–09లో మూడు విదేశీ విమానయాన కంపెనీలకు అనుకూలంగా ట్రాఫిక్ హక్కులను తల్వార్ సంపాదించిపెట్టినట్టు దర్యాప్తు ఏజెన్సీలు అభియోగాలు మోపాయి. -
మైనింగ్ మాఫియాకు మూడినట్టే..!
సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి అమరావతి: గుంటూరు జిల్లా పల్నాడులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై పల్నాడు ప్రజల్లో, యరపతినేని బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీబీఐ విచారణతో గత ఐదేళ్లుగా యరపతినేని సాగించిన ఖనిజ దందా, మనీలాండరింగ్, భూమాఫియా వ్యవహారాలు బట్టబయలవుతాయని మేధావులు, అధికారులు అంటున్నారు. ‘తెల్ల సున్నపురాయి తవ్విన గోతులను కొలిస్తే ఎన్ని టన్నులు అక్రమంగా (మైనింగ్ లీజు, పర్మిట్లు లేకుండా) తవ్వారో తేలిపోతుంది. దీంతో ఖజానాకు ఎంత రాయల్టీ, పెనాల్టీ ఎగవేశారో బట్టబయలవుతుంది. ఖజానాకు జరిగిన నష్టంతోపాటు అపరాధ రుసుం కూడా వసూలు చేయడానికి సీబీఐ విచారణ దోహదపడుతుంది. యరపతినేని సాగించిన అక్రమ మైనింగ్, ప్రశ్నించినవారిపై పెట్టిన అక్రమ కేసులు, సాగించిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయట్టబయలవుతాయి. దీంతో ఆయన శిక్ష నుంచి తప్పించుకోలేరు’ అని అధికారులతోపాటు టీడీపీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు అక్రమ మైనింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న టీడీపీ నేతలు హడలిపోతున్నారు. తమ గుట్టు రట్టు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. యరపతినేనికి సహకరించిన అధికారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. యరపతినేని కేసు పూర్వాపరాలివీ.. - టీడీపీ ప్రభుత్వ పెద్దల అండతో గురజాల నియోజకవర్గంలోని కోనంకి, కేశానుపల్లి, నడికుడి, తదితర క్వారీల్లో 96 లక్షల టన్నుల తెల్ల సున్నపురాయిని లీజులు తీసుకోకుండా, పర్మిట్లు లేకుండా అక్రమంగా తవ్వుకున్న నాటి టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు - ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలకు వేల టన్నుల పేలుడు పదార్థాల వినియోగం - ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ, పెనాల్టీ చెల్లించకుండా రూ.536 కోట్ల దోపిడీ - అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో 2015లో పిల్ దాఖలు చేసిన కె.గురవాచారి.. - అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని, అక్రమంగా తరలించిన ఖనిజానికి రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయాలని 2016లో ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు - అసలు నిందితుడు యరపతినేనిని వదిలేసి అనామకులైన 11 మందిపై కేసులు పెట్టి చేతులు దులుపుకున్న మైనింగ్ అధికారులు - ఎంత ఖనిజాన్ని అక్రమంగా తరలించారో లెక్కకట్టని వైనం. రాయల్టీని పెనాల్టీతో సహా వసూలు చేయకుండా హైకోర్టు ఉత్తర్వుల పట్ల నిర్లక్ష్యం అక్రమ మైనింగ్‌లో యరపతినేని హస్తాన్ని ధ్రువీకరించిన లోకాయుక్త - హైకోర్టు, లోకాయుక్త ఆదేశాలను టీడీపీ సర్కార్ తేలికగా తీసుకోవడంతో అక్రమ మైనింగ్‌పై శాటిలైట్ చిత్రాల ద్వారా ఆధారాలు సేకరించి 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి - గతేడాది హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు తీవ్రతను తగ్గించేందుకు సీఐడీకి అప్పగించిన టీడీపీ సర్కార్ నిజమైన దోషులను శిక్షించాలి పల్నాడులో జరిగిన అక్రమాలను వెలికితీయడానికి కేసును సీఎం సీబీఐకి అప్పగించారు. నిజమైన దోషులను శిక్షించాలి. దోచుకున్న సొమ్మును వడ్డీతో సహా వసూలు చేయాలి. –కాసు మహేశ్ రెడ్డి, గురజాల ఎమ్మెల్యే శుభపరిణామం అక్రమాలు, అన్యాయం చేసినవారు చట్టానికి ఎప్పుడూ అతీతులు కారు. కోర్టు సూచన మేరకు ప్రభుత్వం అక్రమ మైనింగ్ కేసును సీబీఐకి అప్పగించడం శుభ పరిణామం. – టీజీవీ కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ -
యరపతినేనికి వ్యతిరేకంగా 24 మంది సాక్షులు
సాక్షి, అమరావతి: మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. అంతకు ముందు ధర్మాసనం సీఐడీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 24 మంది సాక్షులు యరపతినేనికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చినా అతన్ని ఇప్పటివరకు ఎందుకు విచారించలేదని నిలదీసింది. లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజం తరలిపోవడమంటే.. అధికారుల సహకారం లేకుండా సాధ్యమయ్యే పనే కాదని, ఆ అధికారులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు ప్రాంతంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా లైమ్‌స్టోన్ తవ్వకాలు చేస్తున్నారని కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం విదితమే. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కాగ్ దాఖలు చేసిన కౌంటర్లో అక్రమ మైనింగ్ వ్యవహారంలో గనుల శాఖ అధికారులు సక్రమంగా పని చేయలేదని తేల్చి చెప్పిందని వివరించారు. అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. 31,30,420 మెట్రిక్ టన్నుల అక్రమ మైనింగ్ జరిగిందని వివరించారు. రూ.20.16 కోట్ల సీనరేజీ ఎగవేశారని తెలిపారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. -
సీబీఐ విచారణకు సుజనా డుమ్మా
సాక్షి, బెంగళూరు/అమరావతి: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసులో సీబీఐ విచారణకు కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి డుమ్మా కొట్టారు. బెంగళూరులోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా గురువారం సుజనాకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సుజనా గ్రూపునకు చెందిన ఎలక్ట్రికల్ పరికరాల ఉత్పత్తి సంస్థ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టŠస్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) ఉద్దేశపూర్వకంగా తమను రూ. 71 కోట్ల మేర మోసం చేసిందంటూ ఆంధ్రా బ్యాంకు 2017లో ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం నోటీసులు అందుకున్న సుజనా శుక్రవారం బెంగళూరుకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తన సన్నిహితులు, న్యాయవాదులతో చర్చిస్తూ అలాగే ఉండిపోయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తనకు ఆరోగ్యం సరిగా లేదని, విచారణ హాజరుకు మినహాయింపు ఇవ్వాలని తన న్యాయవాదుల ద్వారా సీబీఐతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. వారి విజ్ఞప్తికి సీబీఐ నుంచి ఎలాంటి సమాధానం అందకపోవడంతో ఆయన హాజరు కాకుండా మిన్నకుండి పోయారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తనను అరెస్టు చేస్తారనే భయంతోనే విచారణకు హాజరుకాలేదనే వార్తలు గుప్పుమన్నాయి. అరెస్టు అయితే ఆ తర్వాత శని, ఆదివారాలు సెలవు ఉన్నందువల్ల బెయిల్ కోసం సోమవారం వరకు వేచి ఉండాల్సి వస్తుందనే ఇలా చేశారని తెలుస్తోంది. ఇదే కేసులో బీసీఈపీఎల్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కాకులమర్రి శ్రీనివాస కల్యాణరావుతో సహా ఇతర ఎండీలకు సీబీఐ నోటీసులు జారీ చేయగా వారు కూడా గైర్హాజరయ్యారు. విచారణకు గైర్హాజరీ విషయంలో సుజనా చౌదరిగానీ, ఇతరత్రా సంబంధికులు కానీ తమతో సంప్రదింపులు జరపలేదని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. పక్కా ఆధారాలు సేకరించిన సీబీఐ, ఈడీ వివిధ బ్యాంకుల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని సుజనా చౌదరి ఎగ్గొట్టినట్లు నిర్ధారించిన ఈడీ, సీబీఐలు అందుకు పక్కా ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఒక్కో బ్యాంకు నుంచి తీసుకున్న రుణం డొల్ల కంపెనీల ద్వారా చివరకు ఎవరి వద్దకు చేరాయనే దానిపై విశ్లేషణ చేసే పనిలో సీబీఐ ఉంది. ఇటీవల బీసీఈపీఎల్ కేసుకు సంబంధించి వైస్రాయ్ హోటల్స్‌కు చెందిన రూ. 315 కోట్లు ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్‌లోని సుజనా ప్రధాన కార్యాలయంలో చేసిన సోదాల్లో వివిధ డొల్ల కంపెనీలకు చెందిన 124 రబ్బరు స్టాంపులు దొరికాయి. లబ్ధి పొందిన బినామీ కంపెనీలు, వివిధ రుణదాతలు, వ్యాపార సంస్థలకు చెందిన వివరాలు లభించాయి. వీటి ఆధారంగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సుజనా చౌదరి, అతని బినామీలకు ఎలా చేరిందన్న దానిపై దర్యాప్తు సంస్థలు ఆధారాలు సేకరించాయి. దీని తర్వాతనే చౌదరిని విచారణకు హాజరవ్వాలంటూ సీబీఐ సమన్లు జారీ చేసింది. శుక్రవారం హాజరుకాకపోవడంతో మరోసారి సుజనానే స్వయంగా హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని, దానికి కూడా స్పందించకపోతే అరెస్ట్ వారెంటు జారీ చేసే అవకాశముందని సీబీఐ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. -
ఆ ‘బంగారం’పై సీబీఐ విచారణ
సాక్షి, అమరావతి : తమిళనాడు పోలీసుల తనిఖీల్లో పెద్దఎత్తున పట్టుబడిన బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినదిగా అని చెబుతున్న దాంట్లో నిజాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు సీబీఐ విచారణ లేదంటే సిట్టింగ్ జడ్జి విచారణ జరగాలని దేవాలయ పరిరక్షణ పీఠం అధిపతి స్వామి కమలానంద భారతి డిమాండ్ చేశారు. అది చాలా పెద్ద కుంభకోణమని, ఇందులో దొంగతనం దాగి ఉందని అయన అనుమానం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించిన 1,381 కిలోల బంగారాన్ని ఒక డొక్కు వ్యానులో తరలిస్తారా? ఎన్నికల సమయంలో తనిఖీలు ఉంటాయని తెలిసీ దేవుడి బంగారాన్ని తరలిస్తూ కనీసం పోలీసు భద్రత తీసుకోకపోవడం.. అందుకు సంబంధించిన పత్రాలు కూడా దగ్గర ఉంచుకోకపోవడం ఏమిటని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. టీటీడీ బంగారాన్ని ప్రైవేట్ వ్యక్తులు మూడో కంటికి తెలియకుండా చెన్నైలో ఉండే బ్యాంకు నుంచి తీసుకుని ఎక్కడో ఒక దగ్గర దానిని మాయం చేయడానికి ప్రయత్నం చేశారా? అంటూ ఆయనే స్వయంగా ఆదివారం ఒక వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్టుచేశారు. వీడియో పూర్తి పాఠం ఆయన మాటల్లోనే.. దేవుడే పోలీసులకు పట్టించాడు రాష్ట్ర గవర్నర్ గారికి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం గారికి.. సీఎం గారికి.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గారికి.. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి.. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటికీ.. వెంకటేశ్వరస్వామిని ఇలవేల్పుగా పూజించుకునే భక్తులందరికీ ఒక విన్నపం. తమిళనాడులో ఒక డొక్కు వ్యాన్, అనాథ శవాలను తరలించుకుని పోయేటటువంటి ఒక వ్యానులో 1,381 కిలోల బంగారాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తరలించారు. తమిళనాడు పోలీసులు ఎన్నికల విధులు నిర్వహిస్తూ ఆ వాహనాన్ని తనిఖీ చేస్తే.. అందులో ఈ బంగారం బయటపడితే, ఆ తర్వాత ఈ బంగారం మాది అని టీటీడీ ప్రకటించుకుంది. ఆ తర్వాత టీటీడీ ఈవో కొన్ని కాగితాలు పంపి, ఆ బంగారం మాది అని విడిపించుకొచ్చారు. ఇది చాలా పెద్ద కుంభకోణం. టీటీడీ నుంచి బంగారం కానీ, డబ్బులు కానీ బయటకు వెళ్లవని నాకైతే విశ్వాసం ఉంది. నేనెప్పుడూ ఎవరినీ అనలేదు. కానీ, ఇప్పుడు అనడానికి నూరు శాతం అవకాశం దొరికింది. ఒక బ్యాంకు నుంచి 1,381 కిలోల బంగారం విడుదల చేస్తే, దానిని చెన్నై నుంచి తిరుపతికి తీసుకొస్తుంటే.. దానికి పోలీసు బందోబస్తు లేదు.. దానికి సంబంధించిన పత్రాల్లేవు. బ్యాంకు వాళ్లు అక్కడ దానిని నిర్ధారించడం లేదు. టీటీడీ ఈవో కాగితాలు ఇచ్చి పంపారు. వేరే ప్రైవేట్ వ్యక్తులు ఆ బంగారాన్ని విడుదల చేసుకుపోతుంటే, టీటీడీ పేరుతో బయటేసుకుని పరిపూర్తి చేసుకోవాలనుకున్నారా? లేదా టీటీడీ బంగారాన్నే మూడో కంటికి తెలియకుండా చెన్నైలో ఉండే బ్యాంకు నుంచి తీసుకుని ఎక్కడో ఒక దగ్గర దానిని మాయం చేయడానికి ప్రయత్నం చేశారా? దీంట్లో ఉండే నిజానిజాలను బయటకు తీయాలి. దేవుడికి చెందిన బంగారాన్ని తీసుకుపోతుంటే దేవుడే పోలీసులకు పట్టించాడు. ఎవరైనా నాశనం కావాల్సిందే తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆడుకుంటే వారు ఎవరైనా నాశనమైపోతారు. ఏం తమాషాలు పడుతున్నారా? ఎన్నికల నేపథ్యంలో ప్రతి దగ్గరా పోలీసు చెకింగ్ ఉందని తెలుసు. పోలీసు పహారా లేకుండా, పత్రాలు లేకుండా 1,381 కిలోల బంగారాన్ని దిక్కుమాలిన బంగారం అనుకున్నారా? వెంకటేశ్వరస్వామి దిక్కుమాలిన వారు అనుకున్నారా. ఇంత దిక్కుమాలిన, పనికిమాలిన, తెలివి తక్కువ ఈవో టీటీడీకి ఎప్పుడూ రాలే. ముందు అరెస్టుచేసి లోపల పారేయాలి! తిరుమలలో అన్ని రకాల వీఐపీ ట్రీట్మెంట్ పొందే మీడియా కూడా స్వామికి ద్రోహం జరుగుతుంటే చర్చించదా? దీనికి నూటికి నూరు శాతం ఈవో, జేఈవో సమాధానం చెప్పాలి. సంవత్సరాల నుంచి శ్రీనివాసరాజును భరించిన పాపానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. శ్రీనివాసరాజు లాంటి అవినీతిపరుడ్ని, ఆయన లాంటి హిందుమత వ్యతిరేకిని.. ఇతర మతాలను ప్రోత్సహించే ఒక అధికారిని తిరుమలలో ఉంచిన పాపం ఇది. వెంకటేశ్వరస్వామి ఏడో కన్ను, పదో కన్ను తెరిచారు.. ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు? ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి తరలించుకుపోవడానికి 1,381 కిలోల బంగారాన్ని, బయటకు తీశారో సింఘాల్ సమాధానం చెప్పాలి. దీనికి వెనుక ఖచ్చితంగా దొంగతనం ఉంది. తిరుమల వెంకటేశ్వరస్వామికి ద్రోహం చేసిన వారు ఎవరూ బాగుపడల. నాశనమై పోతారు పాపాత్ములారా.. నాశనమైపోతారు రా, నాశనమై పోతారు. ఒళ్లు మండిపోతోంది. వందల కోట్లు టీటీడీ డబ్బులు పందికొక్కుల్లా తింటున్నారు. ఈ టీటీడీ ఈవో, జేఈవో, దానికి సంబంధించిన ఆర్థిక సలహాదారు వీళ్లందరూ కుమ్మక్కై టీటీడీని దోచుకుతింటున్నారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారు. ఎంతమందిపై కేసులు పెడతారు. నాపై కేసులు పెట్టండి. నేను జైలుకు పోతా. పట్టుబడకుండా ఇంకెంత దేవుడి బంగారం తిన్నారో? ప్రజలూ టీటీడీ అవినీతి యంత్రాంగం మీద తిరగబడాలి. ఎక్కడికక్కడ టీటీడీ ఈవో దిష్టిబొమ్మను దగ్ధం చేయండి. ఆ అధికారులు కడుపుకు కూడు తింటున్నారా? గడ్డి తింటున్నారా? బంగారం ఈ రోజు పట్టుబడింది.. పట్టుబడకుండా వీళ్లు ఎన్ని కిలోల బంగారాన్ని ఈ దేశాన్ని దాటించారన్నదే తేలాలి. అదే బాధ. ఎన్ని వందల కిలోల బంగారాన్ని తిన్నారు. ఎవరెవరు పంచుకున్నారు. ఇవన్నీ విచారణలో తేలాలి. ఈవోను సస్పెండ్ చేసి విచారణ జరపాలి టీటీడీలో అవకతవకలు జరుగుతున్నాయని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై టీటీడీ అధికారులు కేసులు పెడుతున్నారు. ఆ కేసులు వాదించడానికి లాయర్ల కోసం దేవస్థానం కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇప్పుడు 1,381 కిలోల బంగారం బ్యాంకు నుంచి వస్తూ పట్టుబడితే, కేసులో మొదటి ముద్దాయి ఎవరు? ఎవరిని అరెస్టు చేయాలి? దీనిపై సీబీఐ విచారణ జరపాలి. ఖచ్చితంగా సీబీఐ విచారణ ద్వారా దీని వెనకాల ఉన్న నిజాలు నిగ్గుతేల్చాలి. సీబీఐ విచారణ కాకపోతే రాష్ట్ర హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనైనా జరిపించాలి. వెంకటేశ్వరస్వామి వారి బొక్కసానికే కన్నం వేసే ఇంటి దొంగలను ఖచ్చితంగా శిక్షించాలి. టీటీడీ ఈవోనే ఈ రోజు మనం వేలెత్తి చూపించే స్థితిలో ఇరుక్కున్నాడు. ఆయనది ఒంటెద్దు పోకడ. ఆ బంగారు ఎవరిదో నీకు తెలిసో తెలియదో.. ఆ బంగారం టీటీడీది అవునో కాదో.. టీటీడీదని చెబుతూ నువ్వు కాగితాలు ఇచ్చి పంపావు. ఆ కాగితాలు ముందు ఎందుకు చేరలేదు? పోలీసు పహారా లేకుండా ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు ఆ బంగారం ఎక్కడ ఉంది? కనీసం ఈవో వెళ్లి చూసి వచ్చాడా? తక్షణం ఈవోను సస్పెండ్ చేసి, విధుల నుంచి తప్పించి విచారణ చేయాలి. అసలు మోకాలు కాదు, అరికాలులోనైనా ఈవోకు బుర్ర ఉందా అని అడుగుతున్నాను. వీళ్లను అరెస్టు చేయాలి. టీటీడీలో ఉండే అధికారులు, రాజకీయ నాయకులు తమాషా పడుతున్నారు. వెంకటేశ్వరస్వామి పూని మాట్లాడుతున్నా.. ఒళ్లు మండిపోతోంది. వెంకటేశ్వరస్వామి పూని మాట్లాడుతున్నా నేను. దీని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. మరలా హిందూ సమాజం రోడ్లపైకి వస్తోంది. తమాషాలు చేస్తున్నారేమో. తిరుపతిలో కూర్చునేది. పెత్తనం చేసేది.. వందల, వేల కోట్లు సంపాదించుకునేది. ఏం తమాషానా? అందుకే చెబుతున్నా.. రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీ సీఎం, ఏపీ ప్రతిపక్షం వెంటనే దీని గురించి స్పందించండి. ఓం నమో వెంకటేశాయా.. -
చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలి
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయిన చంద్రబాబుపై ఆంధ్రాద్రోహి అనే ముద్రకూడా పడే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై గత ఐదేళ్లుగా ఒకే స్టాండ్‌పై ఉంటే ప్రత్యేకహోదా ఎప్పుడో వచ్చేదని, గడికోమాట మాట్లాడి హోదా రాకుండా చేసింది చంద్రబాబే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొంగలా దొరికి పారిపోతే, పార్టీని నమ్ముకున్న వారంతా ఏం కావాలని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ భూస్థాపితం చంద్రబాబు మోసపూరిత, వెన్నుపోటు విధానాలవల్ల తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కటీ గెలవలేదని, పార్లమెంట్లో అభ్యర్థులను నిలిపే దమ్ము కూడా లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం చూడలేని బాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే కేసీఆర్‌కు కూడా వెన్నుపోటు పొడిచేందుకు చూశాడని ఆరోపించారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు చూసి అడ్డంగా దొరికిపోయాడన్నారు. హోదా అడిగే హక్కు బాబుకు లేదు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని కోరుకునే వాడైతే ప్రత్యేకహోదా కావాలనే డిమాండ్‌పై చంద్రబాబు ఎందుకు నిలబడలేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అడిగే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. నాలుగున్నరేళ్లపాటు ప్రధాని నరేంద్ర మోదీతో చేయికలిపి ఇద్దర్ని కేంద్రమంత్రి వర్గంలో ఉంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలి అని అడగలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలన్నీ పేర్లుమార్చి కాపీ కొట్టిన ఘనత చంద్రబాబుదని, ఇన్నిరోజులూ గుర్తుకురాని నిరుద్యోగభృతి, రైతుబంధు, పసుపు కుంకుమ ఎన్నికలముందే గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలెవరూ చంద్రబాబుకు ఓటువేయరాదని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబును తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఆత్మగౌరవం అనే పదం వాడే హక్కు బాబుకు లేదని, నీతిమాలిన రాజకీయాలకు చంద్రబాబు మారుపేరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రాలో జగనే సీఎం ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. ప్రభుత్వాలు మారితేనే పేదలు బాగుపడతారని, ఆంధ్రా ప్రజలు జగన్‌కు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క మాటపై నిలబడేవారని, బాబుది రెండు నాలుకల ధోరణి అన్నారు. జగన్‌ను ఏదోఒకవిధంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆంధ్రాప్రజానీకం గుర్తించాలన్నారు. చంద్రబాబుకు 70 ఏళ్లు రావడంతో ఆయనకు మతి భ్రమించిందన్నారు. -
హీరా కుంభకోణంపై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హీరా గ్రూపు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే విషయంలో వైఖరి ఏమిటో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఆ గ్రూపు వ్యవస్థాపకురాలు నౌహీరా షేక్ అరెస్టు, దర్యాప్తునకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. హీరా గ్రూపు యాజమాన్యం తన కంపెనీల ద్వారా రూ.50వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని, ఈ కేసును సీబీఐకి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హీరా గ్రూపు బాధితుల సంఘం అధ్యక్షుడు షహబాజ్ అహ్మద్ ఖాన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
నీ పాత్ర లేకుంటే సీబీఐకి ఎందుకివ్వవు?
హత్యకు గురైన మా చిన్నాన్న వివేకానందరెడ్డి సామాన్యుడేమీ కాదు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. మాజీ మంత్రి కూడా.. అలాంటి వ్యక్తికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి? – వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాత్ర లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలదీశారు. చంద్రబాబు తీరు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రికి తాబేదార్లుగా వ్యవహరిస్తున్న ప్రస్తుత డీజీపీ, ఇంటెలిజెన్స్ అడిషినల్ డీజీ వంటి అధికారుల విచారణతో తమకు న్యాయం జరగదని తేల్చిచెప్పారు. అలాంటి అధికారులను రాష్ట్రంలో ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్రెడ్డి శనివారం తన పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతర పరిణామాలపై గవర్నర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాము డిమాండ్ చేసినట్టు ఒకటి రెండు రోజుల్లో సీబీఐ విచారణకు అంగీకరించకపోతే కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘‘హత్యకు గురైన మా చిన్నాన్న వివేకానందరెడ్డి సామాన్యుడేమీ కాదు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి తమ్ముడు, మాజీ మంత్రి. అలాంటి వ్యక్తికే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి? వివేకానందరెడ్డి హత్య విషయంలో సీబీఐ విచారణతోనే న్యాయం జరుగుతుంది. సీఎం చంద్రబాబుకు సమాచారం అందించే అధికారులతో విచారణ చేయిస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుంది? అని గవర్నర్‌ను అడిగాం. మేము అక్కడ (పులివెందులలో) ఎస్పీతో, ఐజీతో మాట్లాడుతుండగానే ఇంటెలిజెన్స్ ఏడీజీ నుంచి ఫోన్లు వస్తున్నట్టు ఫోన్లో కనిపించింది. దీన్నిబట్టి చూస్తుంటే ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఈ విషయంలో ఎంత లోతుగా దిగి పర్యవేక్షిస్తున్నారో అర్థమవుతోంది. ఆయన వెంటవెంటనే ఫోన్లు చేయడమే ఇందుకు నిదర్శనం. వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను చంద్రబాబు తన వాచ్మెన్ డిపార్ట్మెంట్గా మార్చుకున్నారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది గ్రామాల్లో సర్వేలు చేసి, వైఎస్సార్సీపీ వాళ్లు ఎవరు? నాయకులు ఎవరు? వాళ్లు ఎన్ని ఓట్లను ప్రభావితం చేయగలుగుతారు? వాళ్లను ఎలా ప్రలోభపెట్టాలి? అనేదానిపై చంద్రబాబుకు రిపోర్టు ఇస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను, రాష్ట్రంలో నక్సల్స్ కార్యకలాపాలో, మరేదైనా జరగడానికి ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన ఇంటెలిజెన్స్ అధికారులను చంద్రబాబు తన వాచ్మెన్ల కంటే దారుణంగా వాడుకుంటున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు ఈవేళ వైఎస్సార్సీపీ నుంచో, ఇంకొకరి నుంచో నాయకులను ప్రలోభపెట్టి చంద్రబాబు పక్షాన చేర్చే విషయంలో ముందుంటున్నారు. మా పార్టీ గుర్తుపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావు మా పార్టీ ఎమ్మెల్యేలను తన వద్దకు పిలిపించుకుని చంద్రబాబు తరఫున మాట్లాడారు. ఆయనతోపాటు ఆంధ్రజ్యోతి పేపర్ యజమాని రాధాకృష్ణ నేరుగా మా వాళ్లను పిలిపించుకుని మాట్లాడి, చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి కండువాలు కప్పించారు. ఇంతటి దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతోంది. అటువంటి ఏబీ వెంకటేశ్వరరావు నిన్న నేను డీఐజీతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ల మీద ఫోన్లు చేశారంటే ఇక మాకు ఎలా న్యాయం జరుగుతుంది? జమ్మలమడుగు ఇన్‌చార్జీగా ఉండడమే పాపమా? చిన్నాన్న వివేకానందరెడ్డి చేసిన తప్పేమిటి? జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్‌చార్జీగా వ్యవహరించడమా? ఆ నియోజకవర్గంలో ఇంతకుముందు మా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అమ్ముడుపోయారు. చంద్రబాబు ఆయనను ప్రలోభపెట్టి తీసుకోవడమే కాకుండా ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చారు. జమ్మలమడుగులో యువకుడైన మా అభ్యర్థి సుధీర్‌రెడ్డిని తీసుకొచ్చాం. చిన్నాన్న చేసిన పాపమల్లా జమ్మలమడుగు ఇన్‌చార్జీగా ఆ నియోజకవర్గంలో ఎక్కువగా తిరగడం. ఆ పాపానికి వీళ్లు(టీడీపీ పెద్దలు) చేసిందేమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేశారు. ఇది ధర్మమేనా? బాబూ.. ఎందుకు సంకోచిస్తున్నారు? చంద్రబాబులో నిజంగా న్యాయమే ఉంటే, ఆయనకు ఈ హత్య కేసులో ఎలాంటి పాత్ర లేకుంటే సీబీఐ విచారణకు ఎందుకు సంకోచిస్తున్నారు? ఆయన ఏ తప్పూ చేయకపోతే భయమెందుకు? చిన్నాన్న హత్యపై కచ్చితంగా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన డీజీపీ, ఇంటెలిజెన్స్ అడిషినల్ డీజీ వంటి వ్యక్తులను రాష్ట్రంలో ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశాం. అలాగైతేనే కాస్తోకూస్తో ఇటువంటి ఘటనలు ఆగిపోతాయి. లేకుంటే ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు లాంటి వాళ్లు ఏమైనా చేస్తారు. ఇప్పటికే దొంగ ఓట్లను చేరుస్తున్నారు. ఉన్న వాటిని తీసివేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మనుషులను చంపేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇటువంటి అధికారులు ఉంటే రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరగవని గవర్నర్‌కు చెప్పాం. వివేకానందరెడ్డి హత్యపై ఒకటి రెండు రోజుల్లో సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించకపోతే కోర్టుకు వెళతాం. సీబీఐ లేదా తృతీయ పక్ష విచారణ జరగాలి. అది కూడా చంద్రబాబు ఆధీనంలోని లేని అధికారులతో జరగాలని కోరుతున్నాం. ప్రభుత్వం ఎప్పుడూ భద్రత కల్పించలేదు చిన్నాన్నకు సెక్యూరిటీ కూడా లేదు. ఈ ప్రభుత్వం ఎప్పుడూ ఆయనకు భద్రత కల్పించలేదు. దొంగే దొంగా దొంగా అని అరిచినట్లుగా చంద్రబాబు మాటలు ఉన్నాయి. వాళ్లే హత్య చేయిస్తారు, వాళ్లే ఇతరులపై బురదజల్లుతారు. అన్ని వేళ్లూ చంద్రబాబు వైపు చూపుతున్నాయి. ఇదేదో ఇప్పుడే మొదలైంది కాదు. గతంలో మా తాత రాజారెడ్డిని చంపారు. అప్పట్లో మానాన్న ప్రతిపక్ష నాయకుడు. ఆయనను కడపకే పరిమితం చేయడానికి మా తాతను అతి దారుణంగా చంపేశారు. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. సాక్షాత్తూ ప్రతిపక్ష నేత తండ్రిని హత్యం చేశారు. మానాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోవడానికి రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 31న చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా అన్న మాటలు.. నువ్వు (వైఎస్సార్) అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాడు. ఒక ముఖ్యమంత్రిని అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని చంద్రబాబు బెదిరించాడు. ఇది జరిగిన రెండు రోజులకే హెలికాప్టర్ ప్రమాదం నాన్న మృతి చెందాడు. ఇప్పటికీ మాకు సందేహాలున్నాయి. ఆరోపణలు ఉన్న వ్యక్తి ఎవరంటే చంద్రబాబే. అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించే విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో నాపై హత్యాయత్నం జరిగింది. విమానాశ్రయంలోకి కత్తి ఎలా వచ్చింది? నాపై హత్యాయత్నం చేసిన వ్యక్తి విమానాశ్రయంలో టీడీపీకి చెందిన ఒక నాయకుడి రెస్టారెంట్లో పని చేస్తున్నాడు. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబే. పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడే. అంటే అన్ని వేళ్లూ చంద్రబాబు వైపే చూపుతున్నాయి. ఇప్పుడు మా చిన్నాన్నను హత్య చేశారు. కడప జిల్లాలో చంద్రబాబు పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. అందుకే రాజకీయాల్లో గెలవడం కోసమని ఏ స్థాయికి దిగజారిపోయారో చూశాం. మళ్లీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చంద్రబాబే. అలాంటి వ్యక్తి తానే విచారణ జరుపుతా అంటున్నాడు. అలాంటప్పుడు న్యాయం జరుగుతుందా? చంద్రబాబుకు సంబంధం లేని థర్డ్ పార్టీతో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుంది. నా మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరు చంద్రబాబు ఈ పని (వివేకానందరెడ్డి హత్య) చేసి నా మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలని అనుకుంటున్నాడు. కానీ, అది సాధ్యం కాదు. నేను ఒకటే చెబుతున్నా. పైన దేవుడున్నాడు. ఆయన చూస్తున్నాడు. రాక్షసత్వం ఒక స్థాయి దాటిపోయినప్పుడు కచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు. చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. సహజ మరణంగా చిత్రీకరించేందుకు కుట్ర ఇంటెలిజెన్స్ ఏడీ నాయకత్వంలో ఎస్ఆర్సీ (భద్రతా సమీక్షా కమిటీ) ఉంటుంది. ప్రజాప్రతినిధులకు, ముఖ్యనేతలకు రక్షణ కల్పించాలి. కానీ, ఇక్కడ మాత్రం అది జరగలేదు. ఏదైనా జిల్లాకు ఒక ఎస్పీని నియమిస్తే రెండేళ్లపాటు ఆయనను బదిలీ చేయకూడదు. ఈ మేరకు జీవోలు కూడా ఉన్నాయి. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో అలా జరగలేదు. కడప జిల్లాకు నియమించిన ఎస్పీ రెండేళ్ల పాటు ఉండాల్సి ఉండగా, 40 రోజుల్లోనే బదిలీ అయ్యారు. ఎన్నికల్లో చంద్రబాబుకు సహాయం చేస్తాడన్న నమ్మకం లేక ఆయనను తీసేసి, కొత్త ఎస్పీని తీసుకొచ్చారు. వీటన్నింటినీ చూస్తే కుట్ర అన్పించదా? నిన్న ఎస్పీ, డీఐజీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లు నాకొక లేఖ చూపించారు. ఆ లేఖను మా చిన్నాన్న రాశాడట. ‘నా డ్రైవర్ నన్ను కొట్టి చంపాడు’ అని మా చిన్నాన్న రాశాడట. ఎంత దారుణం ఈ లేఖ? ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా సృష్టించారంటే.. అదేదో చిన్నాన్న రక్తం కక్కుకుని చనిపోయాడన్న భావన వచ్చేలా.. పక్కనే ఒక చోట రక్తం ఉంది.. ఆ తర్వాత చిన్నాన్న బాత్రూమ్లోకి పోయినట్టుగా బాడీ అక్కడ పడి ఉంది. బాత్రూమ్లో కమోడ్‌కు రక్తం పూశారు. అంటే రక్తస్రావం ఎక్కువగా జరిగినందువల్ల తల తిరిగి (గిడ్డీనెస్) బాత్రూమ్లో కుప్పకూలినట్టుగా, అలా కుప్పకూలుతున్నప్పుడు తల కమోడ్‌కు కొట్టుకుందన్నట్టుగా దానికి రక్తం పూశారు. తల కమోడ్‌కు కొట్టుకుని వెనక్కు పడిపోయినట్టుగా శవాన్ని పెట్టారు. అంటే పకడ్బందీగా మనిషిని తల వెనుక భాగాన కొట్టి, బెడ్రూమ్లోనూ కొట్టి చంపి బాత్రూమ్లో పెట్టి, ఇది సహజ మరణంగా చిత్రీకరించేందుకు కుట్ర జరిగింది. తనను చంపుతూ ఉండగానే చిన్నాన్న లేఖ రాస్తారా? వీళ్లు ఒకపక్క చంపుతా ఉంటే రక్తం కారుతున్న సమయంలోనే ఆయన లెటర్ రాస్తూ ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు ఆ లేఖపై రక్తపు మరకల్ని పూశారు. చిన్నాన్న చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు, కొడుతున్నాడు అని వాళ్ల ముందే రాస్తాడా? ఇవన్నీ ఏం చెబుతున్నాయి? వీటికి ఎక్కడైనా పొంతన ఉందా? వాస్తవాలను తప్పుదోవ పట్టించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు, కొత్త కొత్త కథలు సృష్టించారు. వాళ్లు ఎన్నయినా కాకమ్మ కథలు, సినిమా కథలు చెప్పనివ్వండి. నా ప్రశ్న ఒక్కటే.. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు నిజంగా ప్రమేయం లేకపోతే ఈ కేసును సీబీఐకి ఎందుకు ఇవ్వడం లేదు?’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అంతకుముందు గవర్నర్‌ను కలిసిన వారిలో జగన్‌తోపాటు వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, కె.పార్థసారథి, పీవీ మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు. -
సీబీఐ విచారణ జరపాలి
-
నయీం ఎన్కౌంటర్, అక్రమాలపై వ్యాజ్యాల కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాల్సిన ప్రత్యేక పరిస్థితులు ఏమున్నాయో పిటిషనర్లు వివరించలేకపోవడంతో ఈ వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ ఎన్‌కౌంటర్‌తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కి చెందిన మండవ శ్రీనివాస్ 2016లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. నయీం అరాచకాలకు సంబంధించిన కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మంగళవారం వాటిని మరోసారి విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న విషయాన్ని గుర్తుచేసింది. సిట్ దర్యాప్తు తుది దశకు చేరుకుందని తెలిపింది. -
ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ
షిల్లాంగ్: శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫంట్ కేసుల్లో కోల్‌కతా కమిషనర్ రాజీవ్‌కుమార్, టీఎంసీ ఎంపీ కునాల్ ఘోష్‌లను సీబీఐ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా విచారించారు. తొలుత వీరిని వేర్వేరు గదుల్లో విచారించిన అధికారులు, ఆ తర్వాత ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై విచారణకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌కు రాజీవ్‌కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా శారదా చిట్‌ఫండ్ కుంభకోణానికి సంబంధించిన కీలక సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఆయన యత్నించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శారదా కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించింది. తాజాగా సుప్రీం ఆదేశాల మేరకు ఇద్దరు సీబీఐ అధికారుల బృందం రాజీవ్‌కుమార్, కునాల్ ఘోష్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. వీడియో రికార్డింగ్‌కు సీబీఐ నో.. ఈ విషయమై సీబీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజీవ్ కుమార్‌ను రెండో రోజు విచారించామని తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి ముగిసిందన్నారు. తన విచారణను వీడియో తీయాలన్న రాజీవ్‌కుమార్ విజ్ఞప్తిని సీబీఐ తిరస్కరించిందని వెల్లడించారు. కస్టోడియల్ విచారణ సందర్భంగా మాత్రమే వీడియో రికార్డింగ్ చేస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్నం వరకూ రాజీవ్ కుమార్, ఘోష్‌ను వేర్వేరు గదుల్లో విచారించామనీ, ఆతర్వాత మాత్రం ఇద్దరిని ఒకే గదిలో కూర్చోబెట్టి విచారణ సాగించామని పేర్కొన్నారు. మరోవైపు షిల్లాంగ్‌లోని సరస్వతీదేవి ఆలయంలో పూజలు చేసిన అనంతరం కునాల్ ఘోష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కునాల్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ విషయంలో నేను ఎలాంటి కామెంట్లు చేయదల్చుకోలేదు. మొదటినుంచి నేను సీబీఐ అధికారులకు సహకరిస్తున్నా. అందులో భాగంగానే ఈరోజు విచారణకు హాజరయ్యా’ అని తెలిపారు. శారదా కుంభకోణానికి సంబంధించి 2013లో కునాల్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కొద్దికాలానికే ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. -
అగ్రిగోల్డ్ బధితులకు ఊరట
-
హాయ్‌ల్యాండ్ కనీస ధర రూ.600 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ గ్రూపునకు చెందిన ఆస్తుల్లో అత్యంత ఖరీదైన హాయ్‌ల్యాండ్ వేలానికి రంగం సిద్ధమైంది. హాయ్‌ల్యాండ్ కనీస ధరను రూ.600 కోట్లుగా హైకోర్టు నిర్ణయించింది. కనీస ధర ఖరారైన నేపథ్యంలో వెంటనే అమ్మకం నోటీసును, ఇతర ప్రకటనలను జారీ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ నోటీసు, ప్రకటనలకు స్పందించి ఔత్సాహికులు దాఖలుచేసే బిడ్లను తెరవడానికి వీల్లేదని, వాటిని సీల్డ్కవర్లో ఉంచి తమ ముందుంచాలని కన్సార్టియం అధీకృత అధికారికి నిర్దేశించింది. సీల్డ్ కవర్లలో ఉన్న బిడ్లను ఫిబ్రవరి 8న తామే స్వయంగా కోర్టు హాలులోనే తెరుస్తామని స్పష్టం చేసింది. బిడ్లు దాఖలు చేసినవారు ఆరోజున కోర్టుకొచ్చి వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చునంది. కనీస ధర రూ.600 కోట్లకు మించి హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేసే ఔత్సాహికులుంటే వారిని తమ ముందుకు తీసుకురావచ్చునని అగ్రిగోల్డ్, హాయ్‌ల్యాండ్ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. వీరు సైతం సీల్డ్కవర్లోనే బిడ్లను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. వేలం విషయంలో ఇతర షరతులు, నిబంధనలన్నింటినీ చట్టప్రకారం విధించుకునే వెసులుబాటు బ్యాంకుల కన్సార్టియంకు ఉందని తేల్చిచెప్పింది. కాగా, మిగిలిన ఆస్తుల వేలం కనీస ధరను వచ్చేవారం నిర్ణయిస్తామని తెలిపింది. మరోవైపు అగ్రిగోల్డ్ టేకోవర్‌కు ముందుకొచ్చిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్ కోర్టులో డిపాజిట్ చేసిన రూ.10 కోట్లలో రూ.7 కోట్లను వెనక్కిస్తూ నిర్ణయించింది. మిగతా రూ.3 కోట్లను అగ్రిగోల్డ్ డిపాజిటర్ల ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ డిపాజిటర్ల సంఘంతోపాటు పలువురు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయడం తెలిసిందే. వీటిని జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డి ఓ అఫిడవిట్‌ను కోర్టు ముందుంచారు. ఓవైపు ఓటీఎస్ ఆఫరిచ్చి.. మరోవైపు సర్ఫేసీ చట్టం కింద వేలం వేస్తోంది.. ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అగ్రిగోల్డ్ ఫార్మ్ ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు 16.33 శాతం వాటాలు, ఇతర గ్రూపు కంపెనీలకు 99 శాతం ఈక్విటీ వాటాలున్నాయని అగ్రిగోల్డ్ యాజమాన్యం ఈ అఫిడవిట్లో పేర్కొంది. హాయ్‌ల్యాండ్ ఆర్కా లీజర్‌కు చెందినదని తెలిపింది. ఎస్బీఐకి రూ.54.26 కోట్లు చెల్లించాల్సి ఉండగా, ఆ బ్యాంకు వన్ టైం సెటిల్మెంట్(ఓటీఎస్) కింద రూ.22.38 కోట్లు చెల్లించాలంటూ ఆగస్టు 14న లేఖ రాసిందని చెప్పింది. ఇదేరీతిలో ఓటీఎస్ ఆఫర్ ఇస్తారేమోనని ఇతర బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని, దీనివల్ల ఆస్తుల్ని ఎక్కువ ధరకు అమ్మి చిన్న డిపాజిటర్లకు చెల్లించవచ్చని భావించామని, అయితే టేకోవర్ ప్రతిపాదన నుంచి సుభాష్‌చంద్ర ఫౌండేషన్ తప్పుకోవడంతో ఎస్బీఐ తానిచ్చిన ఓటీఎస్ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవడం సరికాదని పేర్కొంది. కనీస ధరను రూ.550 కోట్లుగా నిర్ణయించండి... ఈ సమయంలో ఎస్బీఐ కన్సార్టియం తరఫు న్యాయవాది నరేందర్‌రెడ్డి స్పందిస్తూ.. హాయ్‌ల్యాండ్ వేలానికి కనీస ధరను నిర్ణయించేందుకు వీలుగా విచారణ శుక్రవారానికి వాయిదా పడిందని గుర్తుచేశారు. తాము హాయ్‌ల్యాండ్‌కు రూ.503 కోట్లను కనీస ధరగా నిర్ణయించామని, సుభాష్‌చంద్ర ఫౌండేషన్ రూ.550 కోట్లుగా నిర్ణయించిందని, ఈ రెండింటి ఆధారంగా కనీస ధరను నిర్ణయించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై రాష్ట్రప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ అభిప్రాయాన్ని ధర్మాసనం కోరింది. కనీస ధరను రూ.550 కోట్లుగా నిర్ణయించవచ్చని ఆయన తెలిపారు. ఈ మొత్తానికి అభ్యంతరం లేదని డిపాజిటర్ల సంఘం తరఫు న్యాయవాది చెప్పారు. అయితే కనీస ధరను రూ.600 కోట్లుగా నిర్ణయిస్తున్నామంటూ ఆ మేరకు ఉత్తర్వుల జారీకి ధర్మాసనం సిద్ధమైంది. ఆశలు అడియాసలు కావడానికి ఎంతో సమయం పట్టదు... ఈ సమయంలో ఆర్కా లీజర్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీధరన్ స్పందిస్తూ.. సర్ఫేసీ చట్టం కింద బ్యాంకుల వేలం చర్యలను సవాలు చేస్తూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని, అందుకు అనుమతినివ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. దీంతో హాయ్‌ల్యాండ్ వేలానికి ఎటువంటి అడ్డంకుల్లేవని తెలిపింది. హాయ్‌ల్యాండ్ విలువను ఆర్కా రూ.1,800 కోట్లుగా, అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.1,000 కోట్లుగా చెప్పిందని, కానీ వాస్తవ పరిస్థితుల్లో దాని విలువ వేరుగా ఉందని స్పష్టం చేసింది. ఆశలు అడియాసలయ్యేందుకు ఎంతో సమయం పట్టదని, అందువల్ల వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ హాయ్‌ల్యాండ్ వేలానికి కనీస ధరను రూ.600 కోట్లుగా నిర్ణయిస్తున్నామని తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటీసు, ఇతర ప్రకటనలను జారీ చేయాలని నరేందర్‌రెడ్డికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. -
రాష్ట్ర ప్రభుత్వ పెద్దల కలవరం అందుకే...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాలుగున్నరేళ్లుగా కొనసాగుతున్న అవినీతి వ్యవహారాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరగకుండా అడ్డుకునే లక్ష్యంతోనే ఏపీలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ టీడీపీ సర్కారు జీవో జారీ చేసినట్లు వెల్లడవుతోంది. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టడం, సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో అంచనాలు భారీగా పెంచి రూ.వేల కోట్లలో అవినీతికి పాల్పడటం, నీరు–చెట్టు పేరుతో ఉపాధి హామీ నిధులను టీడీపీ నేతలకు పంచిపెట్టడం, విశాఖలో లక్ష ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డులను గల్లంతు చేసి భూ కబ్జాలకు దిగడంతోపాటు తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబు దొరికిపోయిన నేపథ్యంలో ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిగితే తమ బండారం బయటపడుతుందనే భయంతోనే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరగకుండా రాష్ట్రంలోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతర్.. రాజధాని, నిర్మాణ పనులు, సాగునీటి ప్రాజెక్టుల్లో అంచనాల పెంపు లాంటి పలు అంశాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ గట్టిగా వ్యతిరేకించినప్పటికీ సీఎం చంద్రబాబు కేబినెట్లో ఆమోదించుకుని అక్రమాలను సక్రమం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నప్పటికీ ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఆదేశాలు జారీ చేశారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు మినిట్స్‌లో స్పష్టం చేశారు. రాజధాని టెండర్లతో పాటు తాత్కాలిక సచివాలయ నిర్మాణం, రాజధాని భూ సమీకరణలో ఇన్సైడర్ ట్రేడింగ్‌తో పాటు సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు, పోలవరం ప్రాజెక్టులో అంచనాల పెంపు, నామినేషన్లపై కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం వరకు నేరుగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో లొసుగులు ఉన్నట్లు మినిట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఉపాధి నిధులు నీటి పాలు! విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టు పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్నాక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి.. కమీషన్లు వసూలు చేసుకుంటున్నారు. హెడ్ వర్క్స్ నుంచి కుడి, ఎడమ కాలువ పనుల వరకూ ఇదే కథ. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల పోలవరం జలాశయం పనులకు సంబంధించిన డిజైన్లు కొలిక్కి రాలేదు. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లోనూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. చెరువుల్లో పూడిక తీత, మరమ్మతుల పనులను నీరు–చెట్టు కింద టీడీపీ కార్యకర్తలకు నామినేషన్‌పై అప్పగించి.. పనులు చేయకుండా చేసినట్లు చూపి రూ.15,689 కోట్లను దోచుకున్నారు. ఇందులో ఉపాధిహామీ నిధులే రూ.11,005.25 కోట్లు ఉండటం గమనార్హం. విశాఖ భూముల స్కాంపై స్వయంగా మంత్రే గళం విప్పినా... విశాఖపట్నం జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా భూ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురయ్యాయి. ఇందులో సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, గంటా, టీడీపీకి చెందిన మరో ఐదుగురు ఎమ్మెల్యేలలతో సహా పార్టీ ఇతర నాయకుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణం గురించి అదే జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆధారాలతో సహా ఆరోపణలు చేశారు. అయితే సిట్ విచారణ పేరుతో ఈ కుంభకోణాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టింది. ఏరులై పారిన అవినీతి.. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా పెండింగ్ ప్రాజెక్టుల పనులను కేవలం రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తాం. కొత్తగా 35.04 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తాం.. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం’ అని సాగునీటి ప్రాజెక్టులపై 2014 జూలై 28న విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. నాలుగున్నరేళ్లలో రూ.60,266.74 కోట్లు ఖర్చు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చును మినహాయిస్తే రూ.51 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేశారు. కానీ ఇప్పటివరకూ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోయారు. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అంచనా వ్యయాన్ని పెంచేసి.. కోటరీ కాంట్రాక్టర్లకు కట్టబెట్టి భారీ ఎత్తున దోచుకున్నారు. ఈ అవినీతిని 2015–16, 2016–17 కాగ్ నివేదికలు ఎత్తిచూపాయి. పోలవరం ప్రాజెక్టును 2018 ఖరీఫ్ నాటికి పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించడంలో విఫలమైన చంద్రబాబు సర్కార్.. అంచనా వ్యయాన్ని రూ.16,010.45 కోట్ల నుంచి రూ.57,970.86 కోట్లకు పెంచేయడంలో మాత్రం ప్రగతి సాధించిందని సీనియర్ ఐఏఎస్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ వదిలిపెట్టి... తెలంగాణ శాసనమండలి ఎన్నికల సందర్భంగా సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు అడ్డంగా దొరికిపోవడం తెలిసిందే. చంద్రబాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు డబ్బులు ఇస్తూ చిక్కి అరెస్టయ్యారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి ఉన్నఫళంగా అమరావతికి తరలివచ్చారు. దీనికి సంబంధించి న్యాయస్థానంలో కేసు విచారణలోఉంది. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిగితే తమ పాత్ర బయట పడుతుందనే భయంతోనే ఏపీలో సీబీఐకి ప్రవేశాన్ని నిషేధిస్తూ టీడీపీ సర్కారు జీవో జారీ చేసినట్లు తెలుస్తోంది. హాయ్‌ల్యాండ్‌పై లోకేష్ కన్ను! కీలకమైన హాయ్‌ల్యాండ్‌ను చేజిక్కించుకునేందుకు సీఎం తనయుడు, మంత్రి లోకేష్ ప్రయత్నించారనే తీవ్ర ఆరోపణలున్నాయి. అగ్రిగోల్డ్ వ్యవహారాల నిగ్గు తేల్చడానికి సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని బాధితులు, ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోని సీఐడీకి కేసును అప్పగించి తూతూ మంత్రంగా వ్యవహరించింది. న్యాయస్థానం కూడా ఇదే అభిప్రాయాన్ని పలు సార్లు వ్యక్తీకరించడం గమనార్హం. ఇవి కావా దోపిడీలు? - ఉచితం పేరుతో అధికార పార్టీకి చెందిన ఇసుక మాఫియా ఇష్జారాజ్యంగా దోపిడీకి పాల్పడుతోంది. - అమరావతి సదావర్తి సత్రానికి చెందిన చెన్నైలోని రూ.వెయ్యి కోట్ల విలువచేసే భూమిని ప్రభుత్వ పెద్దలు తమ బినామీకి కట్టబెట్టి సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. - విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర ప్రాంతాల్లోని ఆర్టీసీకి చెందిన స్థలాలు తమవారికి కట్టబెట్టి లబ్ధి పొందే ప్రయత్నాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. - విశాఖలో పేదల భూములను ‘గీతం’కు కట్టబెట్టారు. దొంగ డాక్యుమెంట్లతో దస్పల్లా హిల్స్‌ను కైకంకర్యం చేశారు. - బెరైటీస్, విదేశీ బొగ్గు కొనుగోళ్లలో అక్రమాలకు, సోలార్‌లో గోల్‌మాల్‌కు చంద్రబాబు సర్కారు తెగబడింది. - గ్రానైట్ ఖనిజం కోసం మంత్రి పుల్లారావు పేదల భూములను కొల్లగొట్టడానికి స్కెచ్ వేశారు. పత్తి కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలున్నాయి. - రెయిన్గన్ల నిర్వహణ పేరిట కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ.లక్ష కోట్ల దోపిడీ గుంటూరు–విజయవాడ మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు 2014 సెప్టెంబరు 4న సీఎం చంద్రబాబు శాసనసభలో ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వెలువడేలోగా చంద్రబాబు అండ్ కో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరలకే భూములు కొట్టేసింది. పది వేల ఎకరాల భూములను చంద్రబాబు అండ్ కో సొంతం చేసుకున్నాకనే రాజధాని ఏర్పాటుపై శాసనసభలో ప్రకటన చేయడం గమనార్హం! ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ఇలా రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్నారు. 29 గ్రామాల్లో సులభంగా భూసమీకరణ చేయాలన్న ముందస్తు వ్యూహంలో భాగంలో ఒక్కో గ్రామంలో ఇద్దరు చొప్పున మంత్రులు.. నలుగురైదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ద్వారా తక్కువ ధరలకే భూములు కొనుగోలు చేయించారు. భూసమీకరణకు సహకరించిన మంత్రులు, ఎమ్మెల్యేలకు అత్యంత ప్రాధాన్యం గల ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్లాట్లను కేటాయించడంతో లోగుట్టు రట్టయింది. మరోవైపు రాజధానిలో రైతుల నుంచి బలవంతంగా తీసుకున్న భూములను పలు కార్పొరేట్ సంస్థలకు చౌకగా కట్టబెట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అధిక రేట్లకు విక్రయించి ప్రయివేటు సంస్థలకు మాత్రం తక్కువ మొత్తానికి కట్టబెట్టి కమీషన్లు వసూళ్లు వసూలు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. స్విస్ ఛాలెంజ్ ముసుగులో.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ రూ.3,137 కోట్ల వ్యయంతో చేపట్టిన రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును ముందే ఎంపిక చేసిన సింగపూర్ కన్సార్టియంకు ప్రభుత్వం కట్టబెట్టింది. రాజధాని కోసం అంటూ రైతుల నుంచి 33 వేల ఎకరాలకు పైగా తీసుకున్నారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే నిర్ణయం తీసుకుని అక్కడ ప్రభుత్వ పెద్దల బినామీలతో భారీగా భూములను కొనుగోలు చేయించారు. దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ కుంభకోణంగా మార్చేశారు. అంతే కాకుండా రాజధానిలో సింగపూర్ కంపెనీలకు 1,691 ఎకరాలను కేటాయించారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ కేటాయింపుల నుంచి రూ.5,500 కోట్లతో మౌలిక వసతులు కల్పించడానికి అంగీకరించారు. ఇలా మౌలిక వసతులు కల్పించిన 1,691 ఎకరాలను ప్లాట్లుగా వేసి సింగపూర్ కంపెనీలు మూడో పార్టీకి విక్రయిస్తాయి. ఇందులో రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడినట్లు స్పష్టమైంది. సింగపూర్ కంపెనీలు కేవలం రూ.232 కోట్లు మాత్రమే పెట్టుబడి పెడతాయి. కానీ 1,691 ఎకరాలను ప్లాట్లు వేసి విక్రయించగా వచ్చిన మొత్తంలో సింహభాగం లాభం ఆ సంస్థలకే చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది రూ.446 కోట్లు మాత్రమే. సింగపూర్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందానికి కేంద్రం అనుమతించగా సింగపూర్ ప్రైవేట్ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం చేసుకోవడం గమనార్హం. కమీషన్లు రావనే భోగాపురం టెండర్ రద్దు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎయిర్ పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించడానికి టెండర్లలో అర్హత సాధించింది. టెండర్ దాఖలు చేసిన మరో సంస్థ ఇస్తామన్న రెవెన్యూ వాటా కన్నా ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా అత్యధికంగా ఇస్తానంది. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఎటువంటి కమీషన్లు, అక్రమ వ్యవహారాలు సాధ్యం కావనే ఉద్దేశంతో టెండర్‌ను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియాకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్‌ను ఖరారు చేయాలని రెండు సార్లు సిఫార్సు చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ససేమీరా అనటం వెనుక లోగుట్టు ఇదేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఏ రాష్ట్రంలోనైనా సీబీఐ దర్యాప్తు చేయవచ్చు
ఎవరైనా తప్పు చేస్తే.. ఆ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటారుగానీ ఆ వ్యవస్థను రద్దు చేయరు. సీబీఐ దర్యాప్తును రాష్ట్ర సర్కారు అడ్డుకోలేదు. రాష్ట్రానికి చెందిన అంశాలపై సదరు రాష్ట్ర సర్కారు కోరితేనే కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తుంది.. ఇందులో కొత్తదనం ఏమీ లేదు. రాష్ట్రంలో కేంద్ర నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టులు, పథకాల్లో అక్రమాలు, అవినీతి జరిగితే సీబీఐ దర్యాప్తు నేరుగా చేపడుతుంది, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. ఢిల్లీలోనే కేసు నమోదు చేసి ఏ రాష్ట్రానికైనా వెళ్లి దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి ఉంది. కేంద్ర అధికారులపై దర్యాప్తు చేసే అధికారం సీబీఐకి లేకపోతే ఏసీబీకి ఎలా వస్తుంది? అలాగే న్యాయస్థానాలు సీబీఐ దర్యాప్తును ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇదంతా సంచలనం కోసం చేసినట్లుంది తప్ప.. దీనివల్ల సీబీఐ దర్యాప్తును నిలువరించడం సాధ్యం కాదు. ఓ ముసలమ్మ కోడిని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని ఇక తెల్లారదులే అనుకున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. – ఐవైఆర్ కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి -
కారు ఆపనందుకు కాల్చేశారు
లక్నో: లక్నోలో దారుణం చోటుచేసుకుంది. యాపిల్ కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి శుక్రవారం అర్ధరాత్రి విధులు ముగించుకుని కారులో ఇంటికి వెళుతుండగా ఆయన్ను వెంబడించిన పోలీసులు కాల్చిచంపారు. యాపిల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్న వివేక్‌తివారీ(38) శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని మరో సహోద్యోగితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. ఇక్కడి ముకదమ్‌పూర్ వద్దకు రాగానే కారును ఆపాల్సిందిగా ఇద్దరు పోలీసులు సైగ చేశారు. వివేక్ కారును ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చారు. దీంతో ఆ కారును ఓవర్టేక్ చేసిన కానిస్టేబుల్ ప్రశాంత్ చౌధురి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ బుల్లెట్ వివేక్ ఎడమచెవి కింద దూసుకుపోవడంతో కారు డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది. అనంతరం వివేక్‌ను ఇక్కడి లోహియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆత్మరక్షణ కోసమే కాల్చాను: ప్రశాంత్ కాల్పులు జరిపిన కానిస్టేబుల్ ప్రశాంత్ మాట్లాడుతూ..‘శనివారం తెల్లవారుజామున 2 గంటలకు ముకదమ్‌పూర్ వద్ద ఓ కారు లైట్లు ఆర్పేసి అనుమానాస్పదంగా ఆగి ఉండటాన్ని చూశా. నేను దగ్గరకు వెళ్లగానే వివేక్ ఒక్కసారిగా కారును నామీద నుంచి పోనిచ్చేందుకు యత్నించాడు. 3సార్లు ఇలా యత్నించాడు. దీంతో నా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపాను’ అని తెలిపారు. కాగా, బుల్లెట్ కారణంగానే వివేక్ చనిపోయినట్లు తేలడంతో ఇద్దరు కానిస్టేబుళ్లపై ఐపీసీ సెక్షన్ 302(హత్య) కింద కేసు నమోదుచేశారు. సీఎం వచ్చి పరామర్శించేవరకూ వివేక్ అంత్యక్రియలు నిర్వహించబోనని భార్య తేల్చిచెప్పారు. సీబీఐ విచారణతో పాటు పోలీస్‌శాఖలో తన చదువుకు తగ్గ ఉద్యోగం, రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఘటనపై సీఎం యోగితో మాట్లాడిన హోంమంత్రి రాజ్‌నాథ్ దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. -
మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
సాక్షి, గుంటూరు: పల్నాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మైనింగ్ డీడీ పాపారావు, దాచేపల్లి మైనింగ్ ఏడీ జగన్నాధరావులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో కొనసాగుతున్న వారిని సీబీసీఐడీ విచారిస్తుందా? గురజాల నియోజకవర్గంలో అక్రమ క్వారీయింగ్ అంతా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ప్రభుత్వ పెద్దలకు స్పష్టంగా తెలిసినా ఈ వ్యవహారంలో ఉద్యోగులను బలి పశువులుగా మార్చే కుట్ర జరుగుతోంది. సీబీఐ విచారణకు సర్కారు జంకుతోంది. మైనింగ్ మాఫియాపై హైకోర్టు కన్నెర్ర చేయడం, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆందోళనలు నిర్వహించడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, మిల్లర్లకు నోటీసులు జారీ చేస్తోంది. మైనింగ్ ద్వారా కోట్లు గడించిన వారిని వదిలేసి వారి వద్ద పనిచేసే కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, సూపర్వైజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తోంది. గతంలో పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పనిచేసిన తహశీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మైనింగ్ అధికారులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మైనింగ్ డీడీ, ఏడీపై సస్పెన్షన్ వేటు వేసి అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని గమనిస్తే పెద్దల పాత్ర బయటకు రాకుండా కాపాడే యత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వంలో కొనసాగుతున్నవారిని సీబీసీఐడీ విచారించగలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెక్కలు దాచిపెట్టి కార్మికులపై చర్యలు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహంవ్యక్తం చేయడంతోపాటు సీబీఐ, కాగ్, కేంద్ర గనుల శాఖను ప్రతివాదులుగా చేర్చడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం బలి పశువుల కోసం రంగంలోకి దిగింది. మైనింగ్ మాఫియా అక్రమంగా దోచుకున్న వేల కోట్ల విలువ చేసే సున్నపురాయి లెక్కలను దాచిపెట్టి కార్మికులపై చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగులపై వేటు వేయడం ద్వారా అక్రమ మైనింగ్ వ్యవహారంలో తాము అన్ని చర్యలు చేపట్టామని న్యాయస్థానానికి నివేదించేందుకే కంటి తుడుపు చర్యలకు దిగినట్లు భావిస్తున్నారు. సీబీఐ విచారణకు ఆదేశించాలి రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో నడిచే సీబీసీఐడీ విచారణకు ఆదేశించి సరికొత్త డ్రామా మొదలు పెట్టింది. అక్రమ మైనింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుంటే సీబీఐ విచారణకు ఎందుకు జంకుతోంది? ఉన్నతాధికారులకు మా పార్టీ నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు మైనింగ్ ఉద్యోగులపై చర్యలకు దిగటాన్ని బట్టి కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందని స్పష్టమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై చర్యలు చేపట్టకుండా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏమిటి? మైనింగ్ మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. – కాసు మహేష్‌రెడ్డి (వైఎస్సార్సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త) -
ఫేస్బుక్ డేటా దుర్వినియోగంపై విచారణ
న్యూఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని ‘కేంబ్రిడ్జ్ అనలిటికా’ సంస్థ దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరుపుతుందని కేంద్రం తెలిపింది. ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ గురువారం రాజ్యసభలో ఈ మేరకు ప్రకటన చేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా ఉల్లంఘించిందో? లేదో? సీబీఐ నిర్ధారిస్తుందని తెలిపారు. ఫేస్బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికాకు నోటీసులు జారీచేయగా, డేటా చౌర్యం ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ బదులిచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపిస్తుండటంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో నకిలీ వార్తలు, విద్వేషపూరిత సమాచార కట్టడికి మార్గాలు కనుగొనాలని ఆ సంస్థలను ఆదేశించినట్లు చెప్పారు. మనుషుల అక్రమరవాణా బిల్లు ఆమోదం మనుషుల అక్రమ రవాణా నిరోధించేందుకు ప్రవేశపెట్టిన బిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. కాంగ్రెస్, సీపీఎం బిల్లును స్థాయీ సంఘానికి పంపాలని డిమాండ్ చేయగా, చట్టం చేయడానికి ఇప్పటికే ఆలస్యమైందని మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ బదులిచ్చారు. బాధితులను దృష్టిలో పెట్టుకునే ఈ చట్టం తెస్తున్నామని, దోషులకు శిక్షలు పడే రేటు పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. బాధితులు, సాక్షులు, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచేలా ఈ బిల్లులో నిబంధనలు చేర్చారు. మూడేళ్లలో అధ్యాపక పోస్టుల భర్తీ వర్సిటీలు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను మూడేళ్లలోగా భర్తీ చేయాలని వర్సిటీలను కేంద్రం ఆదేశించింది. ఆలిండియా సర్వే ఆన్ హైయ్యర్ ఎడ్యుకేషన్ 2016–17 ప్రకారం దేశవ్యాప్తంగా 3,06,017 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి మంత్రి జవడేకర్ చెప్పారు. వీటిలో 1,37,298 పోస్టులు పట్టణ ప్రాంతాల్లో, 1,68,719 అధ్యాపక పోస్టులు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. మహిళల సాధికారతకు కొత్త పథకం ప్రజల భాగస్వామ్యం ఆధారంగా గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించేందుకు ‘మహిళా శక్తి కేంద్ర’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ సహాయ మంత్రి వీరేంద్ర‡ రాజ్యసభకు తెలిపారు. 2017–20 మధ్యకాలంలో ఈ పథకం అమలుకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. పంచాయితీ స్థాయి కార్యక్రమంలో భాగంగా 115 జిల్లాల్లో ప్రభుత్వం ఎంపిక చేసిన విద్యార్థి వాలంటీర్లు గ్రామీణ మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వాలు తెచ్చిన పథకాలతో పాటు ఇతర సామాజిక సమస్యలపై అవగాహన కల్పిస్తారని కుమార్ పేర్కొన్నారు. -
సీబీఐ దర్యాప్తునకు ఎలా ఆదేశించాలి?
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో క్రైస్తవులపై దుష్ప్రచారం చేస్తున్నవారు ఎవరో తెలియకుండా సీబీఐ దర్యాప్తునకు ఎలా ఆదేశించాలని ఆలిండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్(ఏఐటీసీసీ)ను హైకోర్టు ప్రశ్నించింది. హిందూ జనశక్తి, శివశక్తిలకు చెందిన వారు ఏపీ, తెలంగాణాల్లో క్రైస్తవులపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పలు పోలీసు స్టేషన్లలో ఉన్న కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ విశాఖలోని మాధవధారకు చెందిన కౌన్సిల్ జాతీయ ప్రధాన కార్యదర్శి కొలకలూరి సత్యశీలరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఎవరిపై ఆరోపణలు చేస్తున్నారో వారిని వ్యాజ్యంలో పేర్కొనకుండా సీబీఐ దర్యాప్తు చేయాలని కోరడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. శివశక్తి, హిందూ జనశక్తిలను ప్రతివాదులుగా చేసేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. -
‘తిరుమల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆభరణాల మాయంపై విచారణ చేయించి టీడీపీ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. బుధవారం ఢిల్లీలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం జవాబు చెప్పి, భక్తుల అనుమానాలు నివృత్తి చేయాలన్నారు. టీటీడీ వ్యవహారంపై ప్రశ్నించేవారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ నెల 26న నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుందని, అదే రోజున ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని కన్నా తెలిపారు. రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయమని అమిత్ షా తనను ఆదేశించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించి ప్రభావవంతంగా పనిచేయాలని అమిత్ షా సూచించారని చెప్పారు. -
సీబీఐ విచారణ జరిపించాలి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పవిత్ర తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే ప్రజా ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం తొలగించిన అర్చకులను తిరిగి నియమించడమే కాకుండా అర్చక, పూజారుల వ్యవస్థలను పటిష్టం చేస్తుందన్నారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ రాక్షస క్రీడ ఆడుతోందని ఆరోపించారు. వైఖానస ఆగమ శాస్త్ర సంప్రదాయాలు, సంస్కృతి, వారసత్వ అర్చకులు, ఆచార వ్యవహారాలపై చంద్రబాబు సర్కార్ విష ప్రయోగం చేస్తోందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే వారసత్వ అర్చక కుటుంబాల్లో ప్రభుత్వం చిచ్చు రగిల్చిందని నిప్పులు చెరిగారు. తిరుమలలోనూ చంద్రబాబు కులాల కుంపట్లు పెట్టి ఆరని అగ్ని జ్వాలను రగిల్చారని ధ్వజమెత్తారు. హిందుత్వాన్ని దెబ్బతీసి అమరావతిలో మాదిరిగా బౌద్ధాన్ని నెలకొల్పేందుకూ ఇవన్నీ చేస్తున్నట్లు అనుమానించాల్సి వస్తోందన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఆగమ శాస్త్రానికి సంబంధించిన సందేహాలను లేవనెత్తితే నివృత్తి చేయాల్సింది పోయి ఆయనపై విమర్శలు చేయడం దారుణమన్నారు. స్వామి వారి నైవేద్యాల పోటులో ఏం జరిగిందో టీటీడీ చెప్పాలన్నారు. సంభావన అర్చకులను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం అధికార పార్టీకి మంచిది కాదన్నారు. కులాల మధ్య కుంపట్లు రగిల్చి చలి కాల్చుకోవాలనే తత్వం చంద్రబాబుదని దుయ్యబట్టారు. తిరుమలలో ఐఏఎస్ అధికారులు చంద్రబాబు ఆడమన్నట్లు ఆడుతున్నారనీ, పోటులో 20 రోజుల పాటు ఏం జరిగిందో తెలియదని ఈవో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆలయంలో సేవలు ఆగమోక్తంగా జరగడం లేదని, స్వామి వారి ప్లాటినం వజ్రం పోయిందని రమణదీక్షితులు అనుమానాలు వ్యక్తం చేయడంలో తప్పేముందన్నారు. పాలక మండలిని పాపాల మండలిగా మార్చారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన తప్పులకు క్షమాపణ చెప్పి పాప ప్రక్షాళన చేసుకోవాలని భూమన డిమాండ్ చేశారు. -
తెరవెనుక వ్యక్తులతో మాకు సంబంధం లేదు
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్ వ్యవహారంలో మరో పదివారాల గడువు కోరిన ఎస్సెల్ జీ గ్రూపునకు చెందిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అగ్రిగోల్డ్ ఆస్తులను అభివృద్ధి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో తమ గ్రూప్ చర్చలు జరపాల్సి ఉందని.. ఈ విషయంలో ప్రముఖ రాజకీయనేత అమర్‌సింగ్ కూడా ప్రభుత్వంతో సమావేశం కావాల్సి ఉన్నందున మరింత సమయం కోరుతూ ఫౌండేషన్ చేసిన వినతిని హైకోర్టు ధర్మాసనం సోమవారం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. దీనిపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేస్తూ తెరవెనుక వ్యక్తులతో తమకు సంబంధంలేదని తేల్చిచెప్పింది. అంతేకాక, టేకోవర్ విషయంలో తన వైఖరి ఏమిటో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. కాగా, అగ్రిగోల్డ్ ఆస్తుల విలువకు, చెల్లించాల్సిన అప్పులకు పొంతన లేదంటూ టేకోవర్ నుంచి ఫౌండేషన్ ఇప్పటికే తప్పుకుంది. కానీ, తాజాగా ప్రభుత్వంతో చర్చ పేరుతో గడువు కోరడం.. అమర్‌సింగ్ పేరును ప్రస్తావించడంతో ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ఆస్తులకూ, అప్పులకూ వ్యత్యాసం విచారణలో భాగంగా సోమవారం సుభాష్ చంద్ర ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది పి. శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను మదింపు చేయించామన్నారు. ఆస్తుల విలువ రూ.4,262 కోట్లు ఉండగా అప్పులు రూ.10వేల కోట్లు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో టేకోవర్ నుంచి పక్కకు తప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇదే సమయంలో తమ ఫౌండేషన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రిగోల్డ్ ఆస్తులను అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమర్‌సింగ్ తమకు తెలిపారని వివరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో పూర్తిస్థాయి స్పష్టత కోసం 8–10 వారాల గడువునివ్వాలని కోరారు. ప్రభుత్వమే ఎందుకు తీసుకోదు..? దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. అగ్రిగోల్డ్, దాని అనుబంధ సంస్థలను టేకోవర్ చేసుకోవడం ఆర్థికంగా మీకు సాధ్యం కానప్పుడు, ఇక వాయిదా ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. తప్పుకుంటామని చెబుతూనే తెర వెనుక ఉన్న ఎవరో వ్యక్తి గురించి మాట్లాడుతున్నారని, వాటిని తాము పరిగణనలోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టంచేసింది. గడువునిచ్చినంత మాత్రాన రూ.7,500 కోట్ల వ్యత్యాసం గణనీయంగా తగ్గిపోతుందా? అంటూ ప్రశ్నించింది. తెర వెనుక వ్యక్తి చేసిన ప్రతిపాదనను ఆమోదిస్తే డిపాజిటర్లను ప్రభుత్వమే కాపాడాల్సి ఉంటుంది. అయినా, సంయుక్తంగా ఎందుకు? ప్రభుత్వమే స్వయంగా ఎందుకు తీసుకోరాదు.?’ అని ప్రశ్నించింది. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది అర్జున్ స్పందిస్తూ.. ప్రభుత్వమే టేకోవర్ చేస్తామంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. దీనిపై ధర్మాసనం, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణప్రకాశ్ వివరణ కోరింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు రెండు వారాల గడువు కావాలని ఆయన కోరగా ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే అక్షయ గోల్డ్ కేసుల విచారణ సైతం 25వ తేదీకి వాయిదా పడింది. గుర్తించిన ఆస్తుల వేలం డ్రాఫ్ట్ నోటీసును తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. -
భిన్న రూపాల్లో హిందూ ఫాసిజం
హైదరాబాద్: దేశంలో సంక్లిష్టమైన పరిస్థితి ఉందని, హిందూ ఫాసిజం విస్తృతంగా ముందుకు సాగుతోందని ప్రముఖ రచయిత, సామాజికవేత్త అరుంధతీరాయ్ అన్నారు. హిందూ ఫాసిజం భిన్నమైన రూపాల్లో అమలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభలు జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, బీజేపీ మైనార్టీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వ్యవహరిస్తుందన్నారు. గోరక్షణ పేరుతో దళితులను చంపుతున్నారని విమర్శించారు. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్లో అమిత్‌షా పాత్ర ఉందని సీబీఐ విచారణ చేసిందని, ఈ కేసును జస్టిస్ లోయాకు విచారణకు అప్పగించగా అత ను అనుమానాస్పద రీతిలో మృతి చెందా రన్నారు. అమిత్‌షాను కాపాడటానికే లోయా ను హత్య చేశారనే ఆరోపణలున్నాయన్నారు. న్యాయవ్యవస్థను కూడా వదలట్లేదు.. భూమి, పర్యావరణం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారని అరుంధతీరాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో హిందుత్వాన్ని జోడిస్తున్నారని, చివరికి న్యాయ వ్యవస్థను కూడా వదల్లేదన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షురాలు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే మాట్లాడుతూ, ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల చదువుకోవటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. విద్యార్థి రాజకీయాలు లేకపోవటం వల్ల ఎవరిదారి వారిదే అన్నట్లుగా ఉందని, కలిసి పంచుకునే భావజాలం లేదన్నారు. విలువల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్.నారాయణరావు, ప్రొఫెసర్ నందిని సుందర్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ శేషయ్య, వి.రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ విచారణ చేయించండి: గద్దర్
సాక్షి, హైదరాబాద్: ఇరవైరెండేళ్ల క్రితం తనపై జరిగిన హత్యాయత్నంపై సీబీఐతో విచారణ జరిపించాలని ప్రజాగాయకుడు గద్దర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 1997లో తనపై జరిగిన హత్యాయత్నంపై అప్పటి పాలకులు సిట్ వేసి హంతకులను పట్టుకోకుండానే కేసు మూసేశారని పేర్కొన్నారు. దీనిపై 2016లో సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్రపతి, ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. స్పందించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయం అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విచారణ జరిపించాలని లేఖ రాసిందని గుర్తు చేశారు. -
ఎస్ఎస్సీ పేపర్‌లీక్‌పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా పలు సెంటర్లలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (టైర్–2) పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరపాలంటూ ఎస్ఎస్సీ కోరిన నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ‘విద్యార్థుల డిమాండ్‌ను మేం అంగీకరించాం. సీబీఐ విచారణకు ఆదేశించాం. ఈ విద్యార్థులంతా ఆందోళనలు విరమించాలని కోరుతున్నాం’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. పేపర్ లీక్‌ను నిరసిస్తూ ఫిబ్రవరి 27నుంచి ఢిల్లీలోని ఎస్ఎస్సీ కార్యాలయం ముందు ఉద్యోగ ఆశావహులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ.. పలువురు విద్యార్థుల బృందంతో కలిసి ఆదివారం కమిషన్ చైర్మన్ అషీమ్ ఖురానాతో చర్చలు జరిపి.. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి తమ ఆందోళనను తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ దిగువశ్రేణి ఉద్యోగాలను భర్తీచేసేందుకు ఎస్ఎస్సీ నియామక పరీక్షలు నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు జరిగిన ఎస్ఎస్సీ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1,90,000 మంది హాజరయ్యారు. అయితే ఫిబ్రవరి 17న జరిగిన పరీక్షలో ఢిల్లీ, భోపాల్‌లోని ఒక్కో పరీక్షా కేంద్రంలో అవకతవకలు జరిగినట్లు వెల్లడవటంతో విద్యార్థులు ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. -
నయీమ్ డైరీని బయట పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ డైరీ వివరాలను బయటపెట్టాలని సీపీఐ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మఖ్దూం భవన్లో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 12న హైదరా బాద్‌లో నయీమ్ బాధితులతో ముఖాముఖి సదస్సును నిర్వహించాలని తీర్మానిం చారు. నయీమ్ ఆస్తులతో పాటు అతనితో సంబంధమున్న రాజకీయ నేతలు, పోలీసుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నయీమ్ కేసులో తీసుకున్న చర్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. భువనగిరి, వరంగల్, హైదరాబాద్‌లలో నయీమ్ బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఒక బుక్లెట్ విడుదల చేయనున్నట్లు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. సమావేశంలో మానవ హక్కుల వేదిక కన్వీనర్ జీవన్‌కుమార్, సీపీఎం నేత నర్సింగరావు, పౌరహక్కుల సంఘ నేత నారాయణరావు, న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, గాదె ఇన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన: చాడ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మఖ్ధూమ్ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని వివరించారు. ముందస్తు ఎన్నికలు, 2018 మహాసభల నిర్వహణ, పంచాయతీ రాజ్ చట్టం తదితర అంశాలపై తమ కార్యవర్గ సమావేశం చర్చించిందని తెలిపారు. జనసేన నాయకుడు పవన్ కల్యాణ్‌కు తన మాటలపై తనకే స్పష్టత లేదని చాడ విమర్శించారు -
సదావర్తిపై సీబీఐ విచారణ జరపాలి
►ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ ►భూములను తక్కువ ధరకు కొట్టేయాలని సీఎం మరో స్కెచ్ సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అత్యధికంగా వేలం పాట పాడి తొలి బిడ్డర్‌గా నిలిచిన సత్యనారాయణ బిల్డర్స్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ బెదిరిస్తోందని చంద్రబాబు తప్పుడు ప్రకటనలు చేయిస్తుండటం దారుణం అన్నారు. ఈ ఆరోపణలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పోరాటం వల్లే రెండోసారి వేలం జరిగిందని, తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.40 కోట్ల ఆదాయం అదనంగా వచ్చిందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం దొడ్డిదారిన రూ.22 కోట్ల చౌక ధరకు సదావర్తి భూములను తన బినామీలకు కట్టబెట్టాలని చూస్తే.. వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం చేసి అడ్డుకుందన్నారు. కోర్టు సూచనతో రెండవ సారి వేలం నిర్వహిస్తే తిరిగి తక్కువ ధరకు భూములు కొట్టేయాలని చంద్రబాబు వ్యూహం రచించారన్నారు. ఇందులో భాగంగానే వేలంలో అత్యధిక బిడ్డర్‌గా నిలిచిన శ్రీనివాసులరెడ్డి పక్కకు తప్పుకుని తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. అన్ని విషయాలు తెలుసుకున్నాకే సదావర్తి భూముల వేలం పాటకు వచ్చామని, ఈ భూములు విలువైనవి అని వేలం జరిగాక శ్రీనివాసులరెడ్డి మీడియాకు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ప్రజలకు తెలిసిపోయిందని కొత్త డ్రామా చెన్నైలోని సదావర్తి భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద బ్రాహ్మణ విద్యార్థులు విద్యనభ్యసించేందుకు ఉపయోగించాలని రాజా వాసిరెడ్డి వారసులు 1885కు ముందే రాసిచ్చారని ఆర్కే చెప్పారు. వారికి దక్కాల్సిన ఆస్తిని తక్కువ ధరకు చంద్రబాబు, లోకేశ్‌లు దక్కించుకున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలియడంతో వైఎస్సార్సీపీ అడ్డుకుంటోందని కొత్త డ్రామాకు తెరలేపారని మండిపడ్డారు. -
సీబీఐ విచారణలో నిజాలు తెలుస్తాయి
రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆశాభావం ముంబై: సీబీఐ విచారణలో తాను నిష్కళంకుడిగా తేలతానని డోపింగ్ కారణంగా నాలుగేళ్ల నిషేధం ఎదుర్కొంటున్న భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం సీబీఐ విచారణ కొనసాగుతోంది. త్వరలోనే అసలు విషయం తెలుస్తుంది. న్యాయం నా పక్షానే ఉంటుందని నమ్ముతున్నాను. రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటే పతకం సాధించేవాణ్ణి. ఎందుకంటే ఆ గేమ్స్ విజేతను నేను గతంలోనే ఓడించాను. ప్రస్తుతం నా ప్రాక్టీస్‌ను ఆపలేదు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా ఉన్నాను’ అని 28 ఏళ్ల నర్సింగ్ యాదవ్ తెలిపాడు. ఎవరో కావాలని తన శాంపిల్‌ను టాంపరింగ్ చేశారని, అందుకే ఫలితం పాజిటివ్‌గా వచ్చిందని నర్సింగ్ అప్పట్లో ఆరోపించాడు. దీంతో అసలు విషయం తేల్చేందుకు సీబీఐ నడుం బిగించింది. -
డీఎస్పీ మృతిపై సీబీఐ విచారణ జరపాలి
∙ సీఎం సిద్ధు, మంత్రి జార్జి దిగిపోవాలి: యడ్యూరప్ప సాక్షి, బెంగళూరు: ‘డీఎస్పీ గణపతి ఆత్మహత్మ కేసు విషయంలో సాక్ష్యాలు నాశనమయినట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలో బయటపడింది. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామ చేయాలి.’ అని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప డిమాండ్ చేశారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్పీ గణపతి చావుకు అప్పటి హోంశాఖ మంత్రి కే.జే జార్జ్ ప్రధాన కారణమని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. కేసును పక్కదోవ పట్టించడానికే సాక్ష్యాలను నాశనం చేశారన్నారు. ఈ విషయాలన్నీ ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బయటికి వచ్చాయన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రితో పాటు మంత్రి కే.జే జార్జ్ వెంటనే పదవులకు రాజీనామ చేయాలన్నారు. లేదంటే ఈనెల 26న బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరతామన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి, రాష్ట్ర హోంశాఖ సలహాదారు కెంపయ్య వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థ మొత్తం నాశనమవుతోందన్నారు. వెంటనే ఆయన్ను ఆ స్థానం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కాగా, డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసుకు సంబంధించి కేంద్ర మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్‌గౌడ పేరు కూడా వినిపిస్తోంది కదా అన్న ప్రశ్నకు నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందేనన్నారు. మొత్తంగా డీఎస్పీ గణపతి కుటుంబానికి న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని యడ్యూరప్ప పేర్కొన్నారు. -
చిక్కుల్లో చిన్నమ్మ
⇒ క్రైం సినిమాలా లంచంపై కథనం ⇒ ఆరునెలల లగ్జరీల ఖర్చు రూ.15 కోట్లని ప్రచారం ⇒ సీబీఐ విచారణకు దీప డిమాండ్ సీఎం కాబోయి సెంట్రల్ జైలు ఖైదీగా మారిన అన్నాడీఎంకే (అమ్మ) ప్రధానకార్యదర్శి శశికళను ఇంకా చెడ్డరోజులు వెంటాడుతున్నాయి. బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో గుట్టుగా కాలం వెళ్లదీస్తున్న చిన్నమ్మకు కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప రూపంలో చిక్కులు వచ్చిపడ్డాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జైలుకు వెళ్లిన శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లకు సాధారణ గదులు, ఖైదీలందరితో సమానంగా ఆహారం అందజేశారు. డీజీపీ సత్యనారాయణరావు తొలిరోజుల్లో చాలా కఠినంగా వ్యవహరించారు. బైట నుంచి ఆహరం, మందులు వస్తున్నట్లు తెలుసుకుని మండిపడ్డారు. ఇదే విధానం కొనసాగితే నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తయ్యేనాటికి తమ వారు జీవచ్చవాల్లా మారిపోవడం ఖాయమని ఆందోళన చెందిన ఇళవరసి కుమారుడు వివేక్ డీజీపీని మచ్చిక చేసుకునేందుకు అన్నాడీఎంకే బెంగళూరు శాఖ ప్రముఖ నేతను డీజీపీపై ప్రయోగించాడు. చాలా స్ట్రిక్టు ఆఫీసరుగా ప్రచారంలో ఉండే జైళ్లశాఖ ఉన్నతాధికారి ఒకరు స్నేహితులతో కలిసి బెంగళూరు, హైదరాబాద్, దుబాయ్‌లలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు తెలుసుకున్నారు. వీరి ద్వారా జైలు అధికారిని లైన్లో పెట్టేందుకు హైదరాబాద్‌లో తొలిదశ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో బెంగళూరుకు చెందిన పెద్ద బిల్డర్ కూడా పాల్గొన్నాడు. చర్చల్లో పురోగతి ఫలితంగా బెంగళూరు–హొసూరు రహదారిలో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీలోని రూ.70 లక్షల విలువైన ఒక ఫ్లాట్‌ను, పెద్ద మొత్తంలో నగదును అందజేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ ముగిసిన వెంటనే జైల్లో శశికళ స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించినట్లు సమాచారం. ప్రత్యేక వంటగది, చెన్నై పోయెస్‌గార్డెన్ నుంచి వంటపని వారు, శశికళ కాళ్లు, చేతులకు మసాజ్ చేసేందుకు కొందరు వ్యక్తులు యథేచ్ఛగా జైలులోపలికి, బైటకు రాకపోకలు జరిగాయి. రెండో దశ చర్చలకు జైలు తరఫున దుబాయ్ నుంచి వ్యక్తులు వచ్చారు. బెంగళూరు శివార్లలోని ఒక ఫాంహౌస్‌లో చర్చలు ముగిసిన తరువాత హైదరాబాద్‌లోని ఒక తోటలో భారీ మొత్తం ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీల కోసం జైళ్ల అధికారి హైదరాబాద్–బెంగళూరు మధ్య అనేకసార్లు విమాన ప్రయాణం చేశారని, విమాన ఖర్చులు సైతం శశికళ తరఫు వ్యక్తులే భరించినట్లు సమాచారం. జైళ్ల నిబంధనలు తోసిరాజని.. జైళ్లలో ఖైదీలు పాటించాల్సిన నిబంధనలను శశికళ పూర్తిగా ధిక్కరించినట్లు అక్కడి రికార్డులే చెబుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో వందకు పైగా ములాఖత్‌లు, 50కి పైగా వివిధరంగాలకు చెందిన వారితో ములాఖత్‌లు, జైలు అధికారుల వాహనాల్లోనే బైటకు వెళ్లిరావడం సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్షను పునఃపరిశీలించాలని శశికళ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉండగా, జైల్లో లగ్జరీ జీవితం కోసం రూ.15 కోట్ల వరకు ఖర్చుచేసినట్లుగా జరుగుతున్న ప్రచారం చిన్నమ్మను మరింత చిక్కులో పడేసింది. శశికళను రాజకీయంగా అణిచివేయాలని కొందరు వ్యక్తులు పన్నుతున్న కుట్రల ఫలితంగా ఆమె మెడపై అనేక సమస్యల కత్తులు వేలాడుతున్నాయి. అంతేగాక సదరు ఆరోపణలపై కర్ణాటక ప్రభుత్వం విచారణ అధికారిని నియమించడం, తన వద్ద వీడియోలతో కూడిన ఆధారాలు ఉన్నాయని డీఐజీ రూప ప్రకటించడం శశికళను, ఆమెకు సహకరించిన వారికి వణుకు పుట్టిస్తోంది. సీబీఐ విచారణ జరపాలి: దీప శశికళపై డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అన్నాడీఎంకే జే దీప వర్గం (ఎంజీఆర్ అమ్మ దీప పేరవై) ప్రధాన కార్యదర్శి దీప శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సందర్భం వచ్చినçప్పుడు కర్ణాటక సీఎంను కలుసుకుంటానని ఆమె తెలిపారు. -
సీబీఐ 'గుబులు'!
► అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వ్యవహారంపై హైకోర్టులో డీఎంకే పిటిషన్ ► అది నకిలీ వీడియో : ఎమ్మెల్యే శరవణన్ ► ఎమ్మెల్యేల్లో సర్వత్రా ఉత్కంఠ ► 16న విచారణ అన్నాడీఎంకే ప్రభుత్వం విశ్వాస పరీక్ష సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కోట్లరూపాయలు ఎరవేసిందనే ఆరోపణలపై సీబీఐ, అవినీతి నిరోధకశాఖల చేత విచారణకు ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో డీఎంకే పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ఈనెల 16వ తేదీన విచారణకు రానుంది. ఏం ముంచుకొస్తుందోనని ఎమ్మెల్యేల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన మొదటి డివిజన్ బెంచ్ ముందు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది షణ్ముగ సుందరం మంగళవారం హాజౖరయ్యా రు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ, తమిళనాడు చట్టసభలో ఫిబ్రవరి 18వ తేదీన నిర్వహించిన ప్రభుత్వ విశ్వాసపరీక్షలో అవకతవకలు జరిగినట్లుగా గతంలో హైకోర్టులో పిటిషన్ వేశామని అన్నారు. ఈ పిటిషన్ జూలై 18వ తేదీన విచారణకు రానుందని తెలిపారు. అయితే ఆనాటి విశ్వాసపరీక్ష సమయంలో తమకు అనుకూలంగా ఓటువేయాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఎమ్మెల్యేలకు రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు సొమ్ము చెల్లించినట్లు బహిర్గతమైందని ఆయన అన్నారు. ఈ అక్రమాలు ఒక ప్రయివేటు చానల్లో ప్రసారం కావడం ద్వారా నిర్ధా్దరణైనట్లు భావిస్తున్నామని చెప్పారు. దీంతో అన్నాడీఎంకే ప్రభుత్వ, ఎమ్మెల్యేల అక్రమాలపై సీబీఐ, ఆదాయపు పన్నుశాఖచే విచారణకు ఆదేశించాల్సిందిగా డీఎంకే న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం నాడు విచారణకు రానుంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో ఆందోళన దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ ప్రభుత్వాధినేతగా కూడా మారాలనే ప్రయత్నంలో ఉండగా ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. అయినా ప్రభుత్వం తమ చేతుల నుంచి చేజారకూడదని ఎడపాడిని శాసనసభాపక్ష నేతగా చేశారు. మరోవైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఎమ్మెల్యేలను తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు. తమ గూటి ఎమ్మెల్యేలు పన్నీర్‌వైపునకు వెళ్లకుండా కూవత్తూరులోని ఒక ఫాంహౌస్‌లో శశికళ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల బలం అధికంగా ఉన్న ఎడపాడిని గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి నెలరోజుల్లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు. అయితే ఎడపాడి రెండు రోజుల్లోనే అసెంబ్లీ విశ్వాస పరీక్షకు సిద్దమై 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజేతగా నిలిచారు. అయితే శశికళ, పన్నీర్‌సెల్వం ఇద్దరూ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలను ఎరవేసినట్లు పన్నీర్‌వర్గ ఎమ్మెల్యే శరవణన్ ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో కుండబద్దలు కొట్టడం అన్నాడీఎంకేలో దుమారం రేపింది. సీబీఐ విచారణకు ఆదేశించాలని మద్రాసు హైకోర్టులో డీఎంకే పిటిషన్ వేయడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భయంతో ‘భుజాలు’తడుముకుంటున్నారు. అయితే సదరు ఎమ్మెల్యే శరవణన్ ఇంతలోనే అది నకిలీ వీడియో అని ఖం డించారు. వీడియో ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. కూవత్తూరులో ఎమ్మెల్యేలకు నగదు పంపిణీ జరగలేదని ఎమ్మెల్యేలు వెట్రివేల్ కనకరాజ్ తెలిపారు. ఈ వివాదం కొనసాగుతుండగా అదేరకమైన ఆరోపణలతో శరవణన్ మాట్లాడిన మరో వీడియో మంగళవారం విడుదలైనట్లు తెలు స్తోంది. అన్నాడీఎంకేలోని ఎడపాడి, పన్నీర్‌వర్గం ఏకం కావడం ఖాయమని మరోవర్గం నేత దినకరన్ మంగళవారం మీడియా ముందు వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వల్ల రాష్ట్రం పరువుపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు విమర్శించారు. -
భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరండి
గవర్నర్‌కు టీటీడీపీ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్‌కు టీటీడీపీ బృందం విన్నవించింది. ఈ మేరకు మంగళవారం టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు రాజ్‌భవన్‌లో గవర్నరును కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎల్.రమణ, రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్ అధికారులూ ఈ కుంభకోణంలో ఉన్నారని ఆరోపించారు. మియాపూర్ భూములను పేదలు ఆక్రమించుకోవాలని, వారికి టీటీడీపీ అండగా ఉంటుందని రేవంత్ అన్నారు. కబ్జా భూములు ప్రభుత్వానివేనని బోర్డులెందుకు పెట్టడంలేదని ప్రశ్నించారు. కుంభకోణంలో కీలక పాత్రధారులపై ఇప్పటికీ కేసులు నమోదుకాలేదని విమర్శించారు. పాత్రధారుల కుటుంబీకులతో ప్రభుత్వ భూములపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని, దీంతో ఆయన చిత్తశుద్ధి ఏమిటో ఇట్టే అర్థమవుతోందన్నారు. కుంభకోణంపై సమీక్షించాలని గవర్నర్‌ను కోరామని.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, సీబీఐ డైరెక్టరును కలసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని రేవంత్ చెప్పారు. -
భూ స్కాంపై సీబీఐ విచారణ కోరరేం: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: భూముల అక్రమ రిజిస్ట్రే షన్ల వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కుంభకోణం ఎప్పుడు జరిగితే ఏంటని, ఇప్పుడు అధికా రంలో ఉన్న సీఎం కేసీఆర్ విచారణ కోరవచ్చు కదా అన్నారు. రాష్ట్రంలో జరుగు తున్న ఆందోళనకర పరిణామాలపై గవర్నర్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని, రైతులకు సంకెళ్లు వేసినా, సచివాలయంలో, సచివాలయ పరిసరాల్లో మనుషులు చచ్చినా గవర్నర్‌కు పట్టడం లేదని అన్నారు. -
సీబీఐతో విచారణ చేయించాలి
నీళ్ల లీకేజీ ఘటనలో స్పీకర్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఆర్కే సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ లీకేజీ ఘటనను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. వర్షం పడిన రోజు అసెంబ్లీలోకి మీడియాను అనుమతించాలని ఎంత ప్రాధేయపడ్డా పట్టించుకోని స్పీకర్.. రెండ్రోజుల తర్వాత అసెంబ్లీని సుందరంగా తీర్చిదిద్ది అందరినీ అనుమతిస్తున్నామని చెప్పడంపై మండిపడ్డారు. గొట్టాలు కోసిన ప్రాంతానికి మీడియాను తీసుకెళ్లి సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని స్పీకర్ చెప్పడాన్ని తప్పుబట్టిన ఆర్కే.. గొట్టాల మీద కాదు సీఐడీ విచారణ.. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న గొట్టంగాళ్ల అవినీతిని బయటకు తీసేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వర్షం కురిసిన రోజే అసెంబ్లీలోని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చాంబర్కి వెళ్లానని, ఊడిన సీలింగ్‌ను, నీటితో మునిగినట్లు ఉన్న చాంబర్‌ను చూసి ఆశ్చర్యమేసిందని ఆర్కే చెప్పారు. ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో పాటు మీడియాను లోపలికి అనుమతించి ఉంటే అంతా చూపించేవాళ్లమన్నారు. స్పీకర్ కోడెల మీడియాను నేరుగా పైపులకు దగ్గరకు కాకుండా ప్రతిపక్ష నేత చాంబర్ వద్దకు.. అదే విధంగా ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ చాంబర్లకు తీసుకెళ్లి ఉంటే పరిస్థితి తెలిసేదన్నారు. అప్పుడు స్పీకర్ ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. -
భూ కుంభకోణంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం
♦ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలి ♦ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ సాక్షి, విశాఖపట్నం: విశాఖలో వెలుగుచూసిన భూ కుంభకోణం, రికార్డుల గల్లంతులో మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హస్తం ఉన్నందున సీబీఐ విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. విశాఖలో భూదందాలపై గురువారమిక్కడ వైఎస్సార్సీపీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఈ భూ కుంభకోణం విశాఖలోని పలు నియోజకవర్గాల్లో విస్తరించి ఉందని చెప్పారు. తొలుత లక్ష ఎకరాలకు చెందిన రికార్డులు గల్లంతయ్యాయని, ఐదు వేల ఎకరాలకు సంబంధించిన భూ రికార్డులు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని కలెక్టర్ చెప్పారని, కానీ మంత్రి లోకేశ్ వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిందన్నారు. చివరకు 244 ఎకరాలకు సంబంధించి మాత్రమే అవకతవకలు జరిగాయంటూ కలెక్టర్ చెప్పడం చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లు ఎంతగా పనిచేశాయో అర్థమవుతోందన్నారు. జిల్లా అధికారులు, రాష్ట్ర మంత్రుల సమక్షంలో జరిగే విచారణతో బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏ ఒక్కరికి లేదన్నారు. ఈ కేసును సీబీఐకు అప్పగించేంత వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో పోరాటం చేయాలని విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. భూ కబ్జాలపై సత్వర న్యాయం జరిగేలా ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. కబ్జాదారులకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను సవరించాలని విజ్ఞప్తి చేశారు. భూ కబ్జాలపై న్యాయస్థానాలకు..: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. హుద్‌హుద్ తుఫాన్ సమయంలో భూముల రికార్డులు గల్లంతయ్యాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ట్యాంపరింగ్, భూకబ్జాలపై న్యాయస్థానాలకు వెళ్లాల్సిన అవసరముందన్నారు. సీపీఎం నేత సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ భూ కబ్జాలకు పాల్పడేందుకే పట్టాదార్ పాస్ పుస్తకాలు రద్దు చేశారని ఆరోపించారు. -
‘భూమాయ’లో మంత్రి తలసాని హస్తం
సీబీఐ విచారణకు ఆదేశించాలి: దిగ్విజయ్ సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు ప్రమేయం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. బహుశా కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి డబ్బుల వసూలు కోసమే శ్రీనివాసయాదవ్లాంటి వ్యక్తులు అవసరమేమోనని వ్యాఖ్యానించారు. ఈ భూకుంభకోణంలో కేసీఆర్ సర్కారు సరైన విచారణ జరుపుతుందన్న నమ్మకం లేదని.. అందువల్ల సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే భూములపై కాంగ్రెస్ హయాం నుంచీ విచారణ జరిపించినా తమకు అభ్యంతరం లేదన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మియాపూర్ భూముల కుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ప్రమేయముందని దిగ్విజయ్ ఆరోపించారు. అధికారుల అండతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు. భూదాన్ భూములు ఏమయ్యాయో, మిగిలిన భూములు ఎక్కడ, ఎవరి చేతుల్లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మియాపూర్ భూములు కూడా అదే కోవలో మాయవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో సబ్రిజిస్ట్రార్లను బదిలీ చేశారుగానీ ముఖ్య నాయకులను వదిలేశారని వ్యాఖ్యానించారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులోనూ పోలీసుల మీద చర్య తీసుకుని రాజకీయ నాయకులను వదిలేశారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలకు సిద్ధం: 2019లో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోందని, అసెంబ్లీ సీట్ల వారీగా సూక్ష్మ పరిశీలన చేస్తున్నామని దిగ్విజయ్ తెలిపారు. మొత్తం 119 సీట్లకు పోటీ చేస్తామన్నారు. ఏపీలో తాము టీడీపీని వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణలోనూ టీడీపీ అవసరం లేదని.. ఈ విషయంలో సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఏ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదన్నారు. అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు మీడియా హైప్ ఇచ్చిందని, అనేక చేరికలు ఉంటాయని ప్రచారం జరిగినా అటువంటిదేమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ కార్డును ఉపయోగించి ఓట్లు చీల్చాలనేది బీజేపీ ప్రయత్నమని విమర్శించారు. -
సీబీఐతో విచారణ జరిపించాలి
నారాయణరెడ్డి హత్యపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన సాక్షి, హైదరాబాద్: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యోదంతంలో నిజానిజాలు నిగ్గు తేలాలంటే, ఏ స్థాయిలో కుట్ర జరిగిందో బయటకు రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. పక్కా ప్రణాళిక రూపొందించి నారాయణరెడ్డిని నిరాయుధుడిని చేసి చంపితే, దీనికి రెండు కులాల మధ్య గొడవలు అంటూ ప్రచారం చేయడం దారుణమని, దీన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైజం ఏమిటో మరోసారి రుజువైందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన తనయుడి ప్రోద్బలంతోనే నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేశారని చెప్పారు. ఎపుడో గ్రామం వదలి వెళ్లిన వారిని తిరిగి రప్పించి పక్కా ప్రణాళికతో నారాయణరెడ్డిని హత్య చేయించారని విమర్శించారు. -
సీబీఐ విచారణతోనే న్యాయం
నారాయణరెడ్డి హత్యపై వైఎస్ జగన్ డిమాండ్ సాక్షి ప్రతినిధి, కడప: కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నారాయణ రెడ్డి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణతోనే న్యాయం జరుగుతుందన్నారు. ఆయన మంగళవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ ఏం చెప్పారంటే... ‘‘పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్చార్జి నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడు, పులివెందుల నియోజకవర్గం వేంపల్లె ఉప మండలాధ్యక్షుడు రామిరెడ్డిలను కిరాతకంగా హత్య చేశారు. ఇవాళ చంద్రబాబు అధికారం లో ఉండొచ్చు, రేపు మేము అధికారంలోకి రావొచ్చు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఐదున్నర కోట్ల మంది ప్రజల్లో ముఖ్యమంత్రి అయ్యేందుకు దేవుడు ఒక్కరికే అవకాశం ఇస్తాడు. అలాంటి పదవిలో కూర్చున్న వ్యక్తి ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించు కోవాలి. ప్రజలకు మంచి చేయాలి. ఆ ప్రజల దీవెనలతో, దేవుడి ఆశీస్సులతో మళ్లీ మళ్లీ ముఖ్యమం త్రిగా ఎన్నికవ్వాలి. సీఎంగా ఉన్నప్పుడు ప్రత్యర్థులను ప్రలోభాలకు గురిచేసి లొంగదీ సుకోవడం, వారు పదవులకు అనర్హులు కాకుండా కాపాడడం, ఒక అడుగు ముందు కేసి వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం, అప్పటికి కూడా ఎవరూ లొంగకపోతే వారిని హత్యలు చేయించడం.. ఇలాంటి పనులను ఏ సీఎం అయినా ఎప్పుడూ చేయకూడదు. ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేస్తారు ఇవాళ దుర్బుద్ధితో నారాయణరెడ్డిని చంపారు. దుర్బుద్ధితో ఏదైనా చేస్తే అది ఎదురుతన్నడం ఖాయం. రేపు అదే పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచే పరిస్థితి వస్తుంది. నారాయణరెడ్డి కుటుంబం నుంచి అభ్యర్థి ఎన్నికల బరిలో నిలుస్తారు. భర్తను చంపేశారు.. ఏమవుతుంది? భార్య అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంతేగానీ వారి(టీడీపీ) పథకం పారదు. అభ్యర్థే లేకుండా పోతే పార్టీయే లేకుండా పోతుందనుకుంటున్న వారి దుర్బుద్ధికి ప్రజలు, దేవుడు మొట్టికాయలు వేసే పరిస్థితి కచ్చితంగా వస్తుంది. నారాయణరెడ్డి హత్యపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది. ఈ కేసులో సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రే నిందితుడు. ముఖ్యమంత్రి ఆశీస్సులతోనే ఈ హత్య జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వారి చేతుల్లోనే ఉన్న పోలీసు డిపార్టుమెంట్లో విచారణ జరిపిస్తే ఏం న్యాయం జరుగుతుంది? కాబట్టి సీబీఐతో విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి తప్పు చేసినా, ఉప ముఖ్యమంత్రి తప్పు చేసినా జైలుకు వెళ్లే పరిస్థితి వస్తుంది. అప్పుడే న్యాయ వ్యవస్థ బతుకుతుంది’’ అని జగన్ అన్నారు. -
జయ మృతిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి
పార్లమెంటులో పన్నీర్ అనుకూల ఎంపీల డిమాండ్ న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతికి దారితీసిన పరిస్థితులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు మద్దతిస్తున్న ఆ పార్టీ ఎంపీలు శుక్రవారం పార్లమెంటులో డిమాండ్ చేశారు. పలుసార్లు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో లోక్‌సభ ఒకసారి వాయిదాపడగా, రాజ్యసభలో కార్యక్రమాలు కాసేపు స్తంభించాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ఆరుగురు అన్నాడీఎంకే ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి జయ మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలంటూ ఆమె ఆస్పత్రిలో ఉన్న ఫొటో ప్లకార్డులు ప్రదర్శించారు. సబ్సిడీ వంటగ్యాస్, ఇతర ఇంధన ధరల పెంపుపై విపక్షాలు లోక్‌సభలో మండిపడ్డాయి. ధరలు పెంచి ప్రభుత్వం పేదలపై పెనుభారాన్ని మోపుతోందని మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాగా, శత్రు ఆస్తుల స్వాధీనానికి సంబంధించిన సవరణ బిల్లును రాజ్యసభ శుక్రవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. విద్యాసంస్థల్లో నైతిక విద్య కింద భగవద్గీత బోధనను తప్పనిసరి చేయాలంటూ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ లోక్‌సభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారు. మొత్తం 103 ప్రైవేటు బిల్లులను సభ్యులు తీసుకొచ్చారు. -
అమ్మ మరణంపై త్వరలో సీబీఐ దర్యాప్తు!
మాజీ ముఖ్యమంత్రి అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత 69వ జన్మదినాన్ని పురస్కరించుకొని తమిళనాడు తెలుగు యువశక్తి ప్రకటించిన 10 రోజుల పండుగ జరుపుకున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు, ఆంధ్రా రాష్ర్టాలలోని వివిధ ప్రాంతాలలో పలు సాంఘిక సేవ కార్యక్రమాలను ఫిబ్రవరి 24 నుంచి చేపట్టారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం చెన్నైలోని ‘స్వతంత్ర నగర్’ లో పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా తమిళనాడు తెలుగు యువశక్తి రాష్ర్ట అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు స్వతంత్ర నగర్ తెలుగు పెద్దలు మొండెం కృష్ణమూర్తి, గరికిపాటి సుబ్బారావు, బక్కా శ్రీనివాసులు, స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి బీ గోవర్ధన్, సీటీ సూర్య, కే మోహన్‌కృష్ణ, ఎస్ మహేష్ కుమార్, డీ ఈశ్వరరావు, నాగేశ్వరరావు, శ్రీదేవి, పెంచలమ్మ తదితరులు పాల్గొన్నారు. సభా ప్రారంభానికి ముందు అమెరికాలో జాతివివక్షతకు బలైన భారతీయుల ఆత్మ శాంతికోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు. కేతిరెడ్డి మాట్లాడుతూ.. జయలలితగారి 69వ జన్మదిన వేడుకలను తమిళనాడు తెలుగు యువశక్తి కార్యకర్తలు ఘనంగా జరపడం సంతోషకరమని తెలిపారు. త్వరలో వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపరచిన మహిళలకు ఏటా ఇచ్చే ‘అమ్మా యంగ్ ఇండియా’ అవార్డులు ప్రధానం చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కొందరు రాజకీయ నాయకులు తమిళనాడులో ప్రజాస్వామ్య విలువలను కాలరాయాలని చూస్తున్నారన్నారు. పదవీకాంక్ష, ధనకాంక్ష జయలలిత మరణంకు కారణమన్నారు. తమిళనాడు ప్రజలకు జయలలిత మరణం పలు అనుమానాలకు తావిస్తుందని, 75 రోజులుగా ఆసుపత్రిలో జరిగిన సంఘటనలే అందుకు ఆధారాలని అన్నారు. పొంతనలేని ప్రకటనలు, ఆమేను కలిసేందుకు వచ్చిన వారిని కలవనీయకుండా చేయడం చూస్తుంటే ఈ మరణం వెనక ఏదో కుట్ర దాగి ఉన్నదని చెప్పారు. సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు అపోలో హాస్పెటల్లో జరిగిన రాజకీయ డ్రామా తమిళనాడు ప్రజలకు తెలియజేయాలన్నారు. ప్రజల కోర్కెలను నివృత్తి చేయుటకు కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలివ్వాలన్నారు. డిసెంబర్ 5 నుంచి ఎన్నో రకాల పోటాలు తాను చేపట్టడం జరిగిందని చెప్పారు. సుప్రీంకోర్టు నందు కేసు, రాష్ర్టపతికి, ప్రధానికి, కేంద్ర మంత్రులకు, పార్లమెంట్ సభ్యులకు వినతి పత్రాలు సమర్పించామని చెప్పారు. ఉద్యమంలో భాగంగా పోస్ట్ కార్డుల ద్వారా నిరసనలు తెలపడం జరిగిందన్నారు. అదేవిధంగా తిరుపతి వెంకన్న ఉండీకి సంబంధించిన సీబీఐ విచారణ కోరుతూ వినతి పత్రం వేశామన్నారు. ప్రతిపక్షాలు కూడా మొదటి నుంచి విచారణ కోరుతూ తమ నిరసన తెలియజేస్తున్నారని చెప్పారు. నేను చేసిన ప్రయత్నానికి ఫలితం త్వరలో ఉంటుందన్నారు. వినతి పత్రాలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకోబోతుందన్నారు. 5 రాష్ర్టాల ఎన్నికల తర్వాత కేంద్రం కచ్చితంగా సీబీఐ విచారణకు ఆదేశాలు ఇస్తుందన్న బలమైన నమ్మకం తనకు ఉందని చెప్పారు. అదే జరిగితే తమిళనాడులో జయలలితను అభిమానించేవారి గుండెల్లో బీజేపీకి, నరేంద్ర మోదీకి చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం ఉంటుందని చెప్పడంలో సందేహంలేదు. ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులందరికీ జయలలిత మరణం గురించి మాట్లాడడం రాజకీయ పునరావాసంగా తయారైందని కొనియాడారు. గతంలో ప్రజలు గగ్గోలు పెడుతుంటే పట్టించుకోని జయలలిత కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు విచారణ గురించి ఇప్పుడు వ్యక్తం చేయడం వింతగా ఉందన్నారు. నేను ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎడపాటి పళని స్వామిని కోరేదేమిటంటే అమ్మ జయలలిత మరణం పట్ల ప్రజలకి అనుమానం ఉన్నది. కావునా ఈ అనుమానాన్ని నివృత్తి చేయవలసిన భాద్యత నీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి ఉందన్నారు. కాబట్టి వెంటనే కేంద్రాన్ని సీబీఐ విచారణను డిమండ్ చేస్తూ నీతోపాటు మంత్రివర్గం డిమాండ్ చేయడమే నువ్వు అమ్మకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ప్రతిపక్షాలు కూడా సీబీఐ విచారణ కోసం ప్రజా ఉద్యమాలు చేయాటకు పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు. -
ఈ వ్యాజ్యాలు దాఖలు కాకుంటే ఏం చేసేవారు..?
అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏపీ సర్కార్‌కు హైకోర్టు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేతపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు కాని పరిస్థితుల్లో డిపాజిటర్ల సంక్షేమం కోసం, వారి డిపాజిట్లు వారికి దక్కేలా చేసేందుకు ఏం చర్యలు తీసుకునే వారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అగ్రిగోల్డ్‌కు చెందిన ఆస్తుల జప్తు, వాటి వేలం, డిపాజిటర్లకు తిరిగి సొమ్ము చెల్లించే విషయంలో ప్రభుత్వానికున్న అధికారాలేమిటో తెలియజేయాలని సూచించింది. వివరాలతో ఓ అఫిడవిట్‌ను వేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్ల నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై పలుమార్లు విచారణ చేపట్టిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. -
సేల్ సర్టిఫికెట్ జారీ చేయబోం..
-
సేల్ సర్టిఫికెట్ జారీ చేయబోం..
- ‘సదావర్తి’ భూములపై హైకోర్టుకు ఏపీ సర్కారు నివేదన - ఏజీ చెప్పిన విషయాలను నమోదు చేసిన ధర్మాసనం - పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు ఆదేశం - సదావర్తి భూముల వేలంపై ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ - సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థన సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో ఉన్న సదావర్తి భూముల్ని వేలం ద్వారా దక్కించుకున్న వారికి సేల్ సర్టిఫికెట్ జారీ చేయబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ హామీని నమోదు చేసుకున్న హైకోర్టు.. మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సదావర్తి భూముల వేలం వ్యవహారంలో పెద్దఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్సీపీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. 150 ఏళ్లక్రితం సదావర్తి సత్రానికి రాజా వాసిరెడ్డి పెద్ద మొత్తంలో భూముల్ని దానంగా ఇచ్చారని, ప్రస్తుతం 83 ఎకరాలే మిగిలిందని, మిగతా వందల ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయని, ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఇలా జరిగిందని తెలిపారు. ఏపీ సర్కారు ఇటీవల ఈ 83 ఎకరాల భూమిని ఎకరా రూ.26 లక్షల చొప్పున వేలంద్వారా విక్రయించిందన్నారు. వాస్తవానికి ఎకరా రూ.7 కోట్ల వరకు ఉందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇంతకీ భూములు ఎక్కడున్నాయంది. మద్రాసులో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలకు సమీపంలో ఉన్నాయని సుధాకర్‌రెడ్డి బదులిచ్చారు. ఇంతలో ఏజీ కల్పించుకుంటూ.. సదావర్తి భూములు భారీగా ఆక్రమణలకు గురయ్యాయని, ప్రస్తుతం 83 ఎకరాలే మిగిలిందని, దీనిని ఆక్రమణల నుంచి కాపాడేందుకే వేలంద్వారా విక్రయించామని చెప్పారు. ఈ వేలంపై గతంలోనూ పిల్ దాఖలైందని, దాన్ని ఇదే కోర్టు కొట్టేసిందన్నారు. వేలంద్వారా వచ్చిన మొత్తం కన్నా రూ.5 కోట్లు ఎక్కువ చెల్లిస్తే ఆ భూముల్ని పిటిషనర్‌కు ఇచ్చేందుకు తమకభ్యంతరం లేదన్నారు. రూ.5 కోట్లు డిపాజిట్ చేస్తే గతంలో నిర్వహించిన వేలాన్ని రద్దుచేసి తిరిగి వేలం నిర్వహిస్తామని చెప్పారు. వేలం పూర్తయిందని, అయితే దాన్ని ఇంకా ఖరారు చేయలేదని, అంతేగాక సేల్ సర్టిఫికెట్ కూడా జారీ చేయలేదని, ప్రస్తుతానికి జారీ చేయబోమని వివరించారు. దీన్ని నమోదు చేయమంటారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. నమో దు చేయవచ్చని ఏజీ చెప్పడంతో.. ఆయన పేర్కొన్న విషయాల్ని నమోదు చేసింది. -
సీబీఐ ఓవరాక్షన్!
నిందితులుగా ఉన్నవారిని ప్రశ్నించడం నేర దర్యాప్తులో ఒక భాగం. అలాగే వారి ఇళ్లల్లో సోదాలు చేయడం, దర్యాప్తునకు పనికొచ్చే పత్రాలను, ఇతర ఆధారాలను స్వాధీనపరుచుకోవడం సర్వసాధారణం. కానీ ఈ రెండింటి విషయంలో పోలీసులు, నేర దర్యాప్తు విభాగాలు సక్రమంగా వ్యవహరించకపోవడం వల్ల చివరికొచ్చే సరికి నేర నిరూపణ అసాధ్యమవుతున్నది. కొన్ని సందర్భాల్లో నిందితులైనవారు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తున్నాయి. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖలో డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తూ ఒక లంచం కేసులో అరెస్టయిన బాల్కిషన్ బన్సల్‌తోపాటు ఆయన కుటుంబం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ముగిసిపోయింది. బన్సల్ నిర్బంధంలో ఉండగా ఆయన భార్య, కుమార్తె రెండు నెలలక్రితం ఆత్మహత్య చేసుకోగా... మూడురోజులక్రితం బన్సల్, ఆయన కుమా రుడు ఉసురు తీసుకున్నారు. మొత్తంగా కుటుంబం మొత్తం కనుమరుగైంది. ఈ లంచం కేసులో బన్సల్ ఒక్కరే నిందితుడు. సీబీఐ ఆయనను అరెస్టు చేయడంతో పాటు ఏడెనిమిదిచోట్ల సోదాలు నిర్వహించింది. బన్సల్‌పై వచ్చిన ఆరోపణ ఆర్ధిక నేరానికి సంబంధించింది. ఆయన భార్య, కుమార్తె, కుమారుడు దీంతో ఏమాత్రం సంబంధం లేనివారు. అందరూ ఉన్నత విద్యావంతులు. సీబీఐ దర్యాప్తును వారు ఆటంకపరిచారనిగానీ, సోదాలకు అడ్డుతగిలారనిగానీ, సిబ్బందిని దుర్భాషలాడా రనిగానీ ఆరోపణలు రాలేదు. ఈ లంచం ఆరోపణ వచ్చేవరకూ బన్సల్ కుటుంబం సమాజంలో గౌరవప్రదంగా మెలిగింది. ఇన్నేళ్లుగా ఉన్నత పదవులు నిర్వహించిన ఇంటిపెద్ద ఒక్కసారి డబ్బులు తీసుకుంటూ దొరికిపోవడంతో బంధుమిత్రుల్లో, ఇరుగుపొరుగువారిలో తమ పరువు పోయిందని కుటుంబసభ్యులు భావిస్తారు. సహజమే. దాన్నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. పైగా ఆయన అరెస్టుకు కొన్ని రోజులముందు కుమార్తె వివాహం నిశ్చయమైంది. అదికాస్తా ఈ ఉదంతంతో రద్దయింది. అయితే కేవలం ఇలాంటి కారణాలతోనే వారు ప్రాణాలు తీసుకున్నారా, మరేదైనా వారిని ప్రభావితం చేసిందా అన్నది దర్యాప్తులో తప్ప బయటపడదు. కానీ బన్సల్, ఆయన కుమారుడు ప్రాణాలు తీసుకుంటూ రాసిన లేఖల్లో తమ కుటుంబ సభ్యులందరినీ సీబీఐ మానసికంగా, శారీరకంగా హింసిం చిందని ఆరోపించారు. సాధారణంగా న్యాయస్థానాలు ఆత్మహత్య చేసుకునేవారు వదిలిపోయిన లేఖలను విశ్వసిస్తాయి. వాటిల్లో ప్రస్తావనకొచ్చిన అంశాలను బలపర్చే ఆధారాలున్నాయేమో పరిశీలిస్తాయి. ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడే వారు అబద్ధాలాడరన్న నమ్మకమే దీనికి ప్రాతిపదిక. నిజానికి ఈ కేసులో బన్సల్‌ను అరెస్టు చేయవలసిన అవసరం లేదని సీబీఐ కోర్టు మొదట్లోనే అభిప్రాయపడింది. అరెస్టులు నిర్వహించినప్పుడు కాస్తంత మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాలని హితవు పలికింది. ‘ఇది అత్యాచారం కేసు కాదు. హత్య కేసు అంతకన్నా కాదు. ఆర్ధికపరమైన నేరం. ఇలాంటి కేసుల్లో పత్రాలే సాక్ష్యాధారాలుగా సరిపోతాయి. మరి అరెస్టు ఎందుకు చేశార’ని న్యాయమూర్తి సీబీఐని నిలదీశారు. తీవ్ర నేర స్వభావమున్న కేసుల్లో నిందితుడు సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తాడని, సాక్షుల్ని బెదిరిస్తాడని లేదా పరారవుతాడని భావించినప్పుడు మాత్రమే అరెస్టు చేయాలని రెండేళ్లక్రితం సుప్రీంకోర్టు సూచించింది. ఏడేళ్ల శిక్ష పడే అవకాశమున్న నేరాల్లో మాత్రమే నిందితులను అరెస్టు చేయాలని స్పష్టమైన మార్గ దర్శకాలిచ్చింది. బన్సల్‌పై మోపిన అభియోగం కూడా ఈ పరిధిలోకే వస్తుంది. కానీ ఇలాంటి సూచనలన్నీ బేఖాతరవుతున్నాయి. నిందితులుగా ఉన్నవారిని అరెస్టు చేసి కొన్ని నెలలపాటైనా కటకటాల వెనక్కు నెట్టకపోతే తమ అహంకా రానికి, అధికారానికి, దర్పానికి భంగం వాటిల్లుతుందని...వాటిని ప్రదర్శించుకోవ డానికి వచ్చిన సందర్భాలను చేజార్చుకోకూడదని బలంగా విశ్వసిస్తున్నాయి. ఇలాంటి చవకబారు ఎత్తుగడల విషయంలో ఎంతో శ్రద్ధ కనబరుస్తున్న ఈ సంస్థలు తీరా నిందితులపై మోపిన అభియోగాలను నిరూపించాల్సిన చివరాఖరి ఘట్టంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. నిందితులను అరెస్టు చేయడం, వారి ఇళ్లను సోదా చేయడంలాంటి అంశాల్లో ఆర్భాటాన్ని ప్రదర్శించడం దృశ్య మాధ్యమం వచ్చాక మరీ ముదిరిపోయింది. ఇక దర్యాప్తు పేరిట వారు సాగించే హడావుడి అంతా ఇంతా కాదు. కేసుల్లో అరెస్టయ్యేవారంతా దోషులు కారు. వారు కేవలం నిందితులు. దర్యాప్తు తర్వాత న్యాయస్థానాల్లో వారు నిర్దోషులుగా బయటపడొచ్చు లేదా నేరస్తులుగా జైలుకు పోవచ్చు. ఈలోగా పోలీసు, దర్యాప్తు విభాగాలు నిందితులపై వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలను నిర్ధారించకుండా నానా యాగీ చేస్తున్నాయి. దర్యాప్తునకు సంబంధించిన నైపుణ్యాన్ని అలవర్చుకోలేని తమ అసమర్ధతను కప్పెట్టుకోవడానికి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని హింసించి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. బన్సల్ కుటుంబం ప్రాణాలు తీసుకున్న కేసులో ఢిల్లీ పోలీసుల తీరు సైతం అభిశంసనీయమైనది. ఈ కేసులో ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉండగా... బన్సల్, ఆయన కుమారుడు వదిలివెళ్లిన లేఖలను ఒకసారి చూడండంటూ సీబీఐకే వాటిని పంపారు. తగుదునమ్మా అన్నట్టు ఈ కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐ తీసుకుంది. ఆ లేఖల్లో భార్య, కుమార్తె పట్ల అమానుషంగా వ్యవహరించిన మహిళా అధికారుల పేర్లను, వారి చేష్టలను పేర్కొన్నారు. తన భార్యను వారు అనేకసార్లు కొట్టారని, గోళ్లతో నెత్తురోడేలా గిచ్చారని బన్సల్ చెప్పారు. భార్యనూ, కుమార్తెనూ చచ్చేట్లా కొట్టమని తన ఎదురుగానే సీబీఐ డీఐజీ మహిళా అధికారులను ఆదేశించాడని తెలిపారు. భార్య, కుమార్తెలది కేవలం హత్య లేనని ఘోషించాడు. బన్సల్ కుమారుడు యోగేష్ సైతం తనను చిత్రహింసలు పెట్టిన వైనాన్ని వెల్లడించాడు. ఈ కేసు దర్యాప్తును సీబీఐ నుంచి తప్పించి విశ్వసనీ యత కలిగిన ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందానికి అప్పగించాలి. ఇలాంటి కేసుల్లో అధికారులు అతిగా వ్యవహరించకుండా మరింత స్పష్టమైన మార్గ దర్శకాలను జారీచేయాలి. వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలుండాలి. -
సీబీఐతో విచారణ ఎందుకు: యనమల
సాక్షి, హైదరాబాద్: భూముల ఆరోపణలకు సంబంధించిన రికార్డులు స్పీకరుకు ఇస్తే ఇక్కడే తేల్చొచ్చని, సీబీఐతో విచారణ ఎందుకని ఆర్థిక మంత్రి యనమల ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుపై కేసులను వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా ఉపసంహరించుకున్నారని చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇల్లు తాకట్టులో ఉండేదని, ఇప్పుడు జగన్‌కు అంత ఆస్తి ఎలా వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్‌ను సైకో అంటూ మంత్రి కామినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరోపణలు రుజువు చేయాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. కాగా, ఐనవోలులో తన కుమార్తె పేరిట 3.57 ఎకరాల భూమి కొన్నానని, ఆ తర్వాత దానిని అమ్మేసి వేరే చోట కొన్నట్లు ఎమ్మెల్యే ధూళిపాళ్ల అంగీకరించారు. -
అసాధారణంగా ముగింపు తీర్మానం
రూల్ 329ను తెరపైకి తెచ్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: రాజధాని భూదందాపై విపక్ష నేత వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు శాసనసభలో సమాధానం చెప్పలేక, సీబీఐ విచారణకు అంగీకరించలేక అయోమయంలో పడ్డ అధికారపక్షం చర్చను ముగించేందుకు రూల్ 329ను హఠాత్తుగా తెరపైకి తెచ్చింది. ‘చర్చ వక్రమార్గం పట్టడంతో రూల్ 329 కింద చర్చను ముగించాలి. తీర్మానం పెడుతున్నాం’ అని మంత్రి యనమల పేర్కొన్నారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో సభ ఆమోదించినట్లు ప్రకటించిన స్పీకర్ చర్చ ముగిసిందన్నారు. భూముల లావాదేవీలపై విచారణతో ఇబ్బందేనన్న స్పీకర్: రాజధాని ప్రాంతంలో భూముల లావాదేవీలపై విచారణకు ఆదేశిస్తే రాజధాని నిర్మాణం ఆలస్యమవుతుందనే అభిప్రాయం ఉందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. రాజధాని భూదందాపై సీబీఐ విచారణ జరిపించాలని బుధవారం అసెంబ్లీలో విపక్ష నేత వైఎస్ జగన్ చేసిన డిమాండ్‌ను ప్రభుత్వం తిరస్కరించిన సందర్బంగా స్పీకర్ కలుగజేసుకొని వివరణ ఇచ్చారు. ‘‘రాజధాని భూములపై వస్తున్న కథనాలపై ఆ ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో విచారణకు ఆదేశిస్తే పెట్టుబడులు రావని ప్రభుత్వం కూడా చెబుతోంది’’ అని స్పీకర్ వివరించారు. -
అక్రమంగా కొన్నవారిపై కాకుండా రాసిన వాళ్లపై కేసులా?
మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో భూములను అక్రమంగా కొన్నవారిపై చర్యలు తీసుకోకుం డా, వాటి గురించి రాసిన వాళ్లపై కేసులు పెడుతూ మీడియాను బెదిరిస్తారా.. ఇదెక్కడి న్యాయం అంటూ సీఎం చంద్రబాబుపై మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. మిగిలిన పేపర్లు, చానళ్లు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుంటే.. ఒక పేపర్లో వ్యతిరేకంగా రాస్తే ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బుధవారం ఆయన శాసనమండలిలో మాట్లాడారు. ప్రభుత్వానికి ధైర్యముంటే భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ సభలో తీర్మానం చేయాలని సవాల్ విసిరారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రాకముందే రాజధానిని ఎక్కడ నిర్మిస్తారనే విషయం ముందుగానే ప్రకటించే అధికారం ఎవరిచ్చారని నిలదీశారు. రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని పక్కనపెట్టి రాజధాని ప్రాంతంలో భూములు సేకరించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణంపై ముందుగానే లీకులు ఇవ్వడంతోనే అధికార పార్టీ నేతలు అక్కడ భూములు కొనుగోలు చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను కేంద్రమే చేపట్టాల్సి ఉన్నా... రాష్ట్ర ప్రభుత్వం ఏం లాభం ఆశించి తన భుజాన వేసుకుందని ప్రశ్నించారు. -
కోర్టును తప్పుదోవ పట్టిస్తే తీవ్ర పరిణామాలు
అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం భూముల వేలం పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా జస్టిస్ సీతాపతి సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ యాజమాన్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. కోర్టుల సహనాన్ని పరీక్షించవద్దని స్పష్టం చేసింది. తమ ఆస్తులు అమ్మితే రూ.వేల కోట్లు వస్తాయని చెప్పడాన్ని తప్పుపట్టింది. కర్ణాటకలో ఆస్తులు ఉంటే వాటి గురించి ఆంధ్రప్రదేశ్‌లోని పత్రికల్లో ప్రకటనలు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అరెస్ట్‌ను తప్పించుకోవడానికే ఆస్తుల విక్రయం ద్వారా రూ.వేల కోట్లు వస్తాయని అగ్రిగోల్డ్ యాజమాన్యం చెబుతున్నట్లు తమకు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. అలాగే అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంతో సీఐడీ దర్యాప్తు తీరుపై హైకోర్టు మండిపడింది. అగ్రిగోల్డ్ భూముల వేలం పర్యవేక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ సూర్యారావు మృతి చెందడంతో ఆయన స్థానంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గుర్రం వెంకట సీతాపతిని నియమించింది. తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. ఆస్తుల విలువలో ఎంతో తేడా అగ్రిగోల్డ్ యాజమాన్యం రూ.6,350 కోట్లను డిపాజిట్లను వసూలు చేసి చేతులెత్తేసిందని, ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పిల్ దాఖలైన విషయం తెలిసిందే. వీటిని ధర్మాసనం సోమవారం విచారించింది. దర్యాప్తునకు సహకరిస్తున్నందున అగ్రిగోల్డ్ యాజ మాన్యాన్ని అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం రాలేదని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది పట్నాయకుని కృష్ణప్రకాశ్ కోర్టుకు నివేదించారు.ఆదంతా తప్పని ధర్మాసనం స్పష్టం చేసింది. దర్యాప్తు తీరు ఇలానే సాగితే సీబీఐకి అప్పగించేందుకు వెనుకాడబోమంది. -
న్యాయ క్రియాశీలత సరికాదు
తప్పుపట్టిన పార్లమెంటరీ కమిటీ ♦ కిందిస్థాయి కోర్టుల పనిని కూడా సుప్రీం, హైకోర్టులే చేస్తున్నాయి ♦ సీబీఐ దర్యాప్తులను నేరుగా పర్యవేక్షిస్తున్నాయి ♦ నిబంధనలకు విరుద్ధంగా రోజువారీ నివేదికలు కోరుతున్నాయి ♦ జిల్లాల్లో సీబీఐ ప్రత్యేక కోర్టుల ఏర్పాటుతో ద్వంద్వ న్యాయ వ్యవస్థ న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు అనేక కేసుల్లో జోక్యం చేసుకుంటూ, సీబీఐ దర్యాప్తులను నేరుగా పర్యవేక్షిస్తుండడం, దర్యాప్తు సంస్థకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టింది. సుప్రీంకోర్టు సహా అనేక హైకోర్టులు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే కేసులను నేరుగా సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నాయని, ఈ తరహా న్యాయ క్రియాశీలత సరికాదని పేర్కొంది. నేర న్యాయ వ్యవస్థ ప్రకారం కిందిస్థాయి క్రిమినల్ కోర్టులు నిర్వర్తించాల్సిన విధులను సైతం పై స్థాయి కోర్టులే నిర్వర్తిస్తున్నాయని ఆక్షేపించింది. నేరశిక్షా స్మృతి 1973లోని సెక్షన్ 172, సెక్షన్ 173లను పక్కనపెట్టి, చాలా కేసుల్లో రోజువారీ దర్యాప్తు పురోగతిని వివరిస్తూ సీల్డ్ కవర్లో నివేదికలు ఇవ్వాలని సీబీఐని ఆదేశిస్తున్నాయంది. దీంతో బాధితులు నేర న్యాయ వ్యవస్థలో తమకు ఉన్న హక్కులు, ఉపశమన అవకాశాలను కోల్పోతున్నారని వివరించింది. సిబ్బంది, ప్రజా ఇబ్బందులు, చట్టం, న్యాయ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు తన నివేదికలో పేర్కొంది. 2జీ, బొగ్గు స్కాం, వ్యాపమ్ వంటి అనేక కేసులను సుప్రీంకోర్టు నేరుగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. సీబీఐ ప్రత్యేక కోర్టులపై.. వివిధ జిల్లాల్లో సీబీఐ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడాన్ని కూడా పార్లమెంటరీ కమిటీ తప్పుపట్టింది. ఇది ద్వంద్వ న్యాయవ్యవస్థకు దారితీస్తుందని పేర్కొంది. ఇందుకు రాజ్యాంగం సమ్మతించబోదని తెలిపింది. ఇది ఇలాగే కొనసాగితే.. రాజ్యాంగం నిర్దేశించిన ‘పిరమిడ్’ నిర్మాణ తరహా పాలన కాస్త తలకిందులయ్యే ప్రమాదం ఉందని, వ్యవస్థల మధ్య అధికారాల సంఘర్షణకు దారి తీయొచ్చని, రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయొచ్చని ఆందోళన వ్యక్తంచేసింది. అన్ని కేసుల దర్యాప్తును సీబీఐకే అప్పగించడం వల్ల రాష్ట్ర పోలీసు విభాగాలు హోంగార్డుల స్థాయికే పరిమితమవుతాయని పేర్కొంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్(డీఎస్పీఈ) చట్టం-1946 ప్రకారం సీబీఐని నెలకొల్పారని, అయితే ప్రస్తుతం ఆ చట్టం పరిధిని దాటి సీబీఐ చాలా విసృ్తతమైందని తెలిపింది. -
సాక్షి కార్టూన్ (16-9-2015)
సీబీఐ దర్యాప్తు మీద నాకు నమ్మకం లేద్సార్! వేరే దర్యాప్తు సంస్థను కోరదాం!! -
పార్లమెంట్లో ‘ఓటుకు కోట్లు’
* ఆరు వారాలైనా అలికిడి లేదేంటి? * చంద్రబాబు సంభాషణల టేపులు బయటపడినా చర్యలేవి? * సీబీఐకి అప్పగించాలని పార్లమెంట్లో పట్టుబట్టనున్న కాంగ్రెస్ * రాహుల్‌తో సమావేశమైన తెలంగాణ, ఏపీ పీసీసీ నేతలు సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ పాల్పడిన ‘ఓటుకు కోట్లు’ ప్రలోభాల వ్యవహారం పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ కేసు వ్యవహారంపై పార్లమెంట్లో లేవనెత్తి సీబీఐ విచారణకు పట్టుబట్టాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ నెల 21న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ నేతలను ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వారితో వేర్వేరుగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా రాజమండ్రి పుష్కరాల్లో తొక్కిసలాట చోటు చేసుకుని 27 మంది మృతికి దారితీసిన సంఘటనపైనా చర్చించారు. ఈ రెండు ఘటనలపై సమగ్రమైన వివరాలతో నివేదిక సమర్పించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలను ఆదేశించారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.5 కోట్లు లంచం ఇవ్వజూపిన వ్యవహారంపై రెడ్‌హ్యాండెడ్‌గా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పట్టుబడటం, ఈ వ్యవహారంలో సూత్రధారిగా చంద్రబాబు ఉన్నట్టు టెలిఫోన్ సంభాషణ టేపులు బయటకు పొక్కిన వైనంపైనా హైకమాండ్ ఆరా తీసింది. నామినేటెడ్ ఎమ్మెల్యేతో నేరుగా సంభాషించినట్టు ఆడియో టేపులు బయటపడిన తర్వాత కూడా ఆ కోణంలో విచారణ జరక్కపోవడానికి కారణలేంటి అని అడిగినప్పుడు రేవంత్‌రెడ్డిపై కేసు నమోదై ఆరు వారాలు గడుస్తున్నప్పటికీ సూత్రధారిపై చర్యలు తీసుకోవడంగానీ కేసు పురోగతి ఎటువైపునకు వెళుతుందో తెలియని పరిస్థితి నెలకొందని పీసీసీ నేతలు వివరించారు. ఈ కేసు తెరమీదకు వచ్చిన తర్వాత చంద్రబాబు లేవనెత్తుతున్న అంశాలను పీసీసీ నేతలు వివరించినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని సులభంగా వ దిలిపెట్టరాదనీ, దీనికి సంబంధించి సమగ్ర వివరాలను అందించాలనీ, ఈ విషయాన్ని స్వయంగా పార్లమెంట్లో లేవనెత్తి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తానని రాహుల్‌గాంధీ చెప్పారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ఇరు రాష్ట్రాల పీసీసీ నేతలు సమగ్రమైన వివరాలు, కేసు పురోగతిపై నివేదికను అందించాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఏపీ పీసీసీ నేతలు కలిసినప్పుడు రాహుల్‌గాంధీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ బుధవారం ఇక్కడ ఏఐసీసీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. అనంతరం వారు రాహుల్‌ను కలిసి రాష్ట్ర రాజకీయాలు, ఇటీవల జరిగిన పరిణామాలపై వివరించారు. తర్వాత ఏపీపీసీసీ నేతలు ఎన్.రఘువీరారెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్యలు రాహుల్‌గాంధీతో విడిగా సమావేశమయ్యారు. పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట సంఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన కారణమని వివరించారు. పార్లమెంట్లో లేవనెత్తనున్న రాహుల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఓటుకు కోట్లు వ్యవహారాన్ని రాహుల్‌గాంధీ లేవనెత్తనున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఓటుకు కోట్లు, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ ఉల్లంఘన అంశాలను లేవనెత్తుతారని రాహుల్‌తో సమావేశం అనంతరం ఆయన చెప్పారు. -
సీబీఐ దర్యాప్తు అవసరం లేదు
* ఎర్రచందనం ఎన్కౌంటర్లపై హైకోర్టు ధర్మాసనం * సాక్షుల వాంగ్మూలాలు తమిళనాడులో నమోదు చేసేందుకు తిరస్కృతి * తదుపరి విచారణ ఆగస్టు 3కి వాయిదా సాక్షి, హైదరాబాద్: చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై ప్రస్తుతదశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పునరుద్ఘాటించింది. తదుపరి విచారణను ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని, అలాగే మృతులకు రీపోస్టుమార్టం నిర్వహించాలంటూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం వాటిని మరోసారి విచారించింది. బాధితుల తరఫున న్యాయవాదుల్లో ఒకరైన వి. రఘునాథ్, సుప్రీంకోర్టు న్యాయవాది వృందా గోవర్‌లు పలు అంశాలను ప్రస్తావించారు. వాటిని విన్న ధర్మాసనం సిట్ దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల మరికొంత కాలం వేచి చూడాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సమయంలో వృందా గ్రోవర్ వాదనలు వినిపిస్తూ... తమిళనాడులోని ఏ మేజిస్ట్రేట్ ముందైనా ముగ్గురు కూలీల తమ వాంగ్మూలాలను ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. అంతేకాక ఎన్కౌంటర్ మరణాలను కస్టోడియల్ మరణాలు భావించి సీఆర్పీసీ సెక్షన్ 176 (1ఎ) కింద విచారణకు ఆదేశించాలని కోరగా ధర్మాసనం తోసిపుచ్చింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు ఇది సరైన సమయం కాదంటూ తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది. -
ఆగని ‘వ్యాపమ్’ మృత్యుహేల
ట్రైనీ ఎస్సై అనుమానాస్పద మృతి * మధ్యప్రదేశ్ సీఎంపై దాడిని తీవ్రం చేసిన విపక్షాలు * పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ * వ్యాపమ్‌పై సీబీఐ దర్యాప్తును తోసిపుచ్చిన రాజ్‌నాథ్ * ఈ కుంభకోణం విచారణకు అంగీకరించిన సుప్రీం భోపాల్/న్యూఢిల్లీ: ‘వ్యాపమ్’ మరణాలు ఆగడం లేదు. తాజాగా శిక్షణలో ఉన్న ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయి కనిపించారు. వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించి 48 గంటల్లో ఇది మూడో మరణం. మధ్యప్రదేశ్ ‘వైద్య విద్య ప్రవేశాలు, ప్రభుత్వోద్యోగ నియామకాల కుంభకోణం’తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వ్యక్తులు వరుసగా చనిపోతుండడంపై దేశవ్యాప్తంగా భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ వ్యాపమ్ మరణాల సంఖ్య అధికారికంగానే 26 ఉండగా.. అనధికారికంగా 46కి చేరింది. ఈ భారీ కుంభకోణంతో సంబంధం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని, లేదంటే అతడిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ స్కామ్‌తో సంబంధముందని ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌ను తొలగించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. మరోవైపు, ఈ స్కామ్‌తో శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రత్యక్షంగా సంబంధం ఉందని ఆరోపించి ప్రజావేగు ఆశిశ్ చతుర్వేది సంచలనం సృష్టించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని, తదుపరి అనుమానాస్పద మరణం తనదే కావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. 26 ఏళ్ల ఆశిశ్ ఈ కుంభకోణం బయటపడటానికి ప్రధాన కారకుల్లో ఒకరు. తన ప్రాణానికి కూడా ముప్పుందని మరో ప్రజావేగు ఆనంద్ రాయ్ భయం వ్యక్తం చేశారు. ట్రైనీ ఎస్సై మృతి.. సాగర్ జిల్లాలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఎస్సై ట్రైనింగ్ పొందుతున్న అనామిక సికర్వార్(25).. ట్రైనింగ్ సెంటర్ పక్కనే ఉన్న చెరువులో సోమవారం శవమై కనిపించింది. స్కామ్‌ను పరిశోధించేందుకు వచ్చిన జర్నలిస్ట్ అక్షయ్‌సింగ్, స్కామ్‌లో భాగంగా మెడికల్ అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు జరిపిన జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన 48 గంటల్లోపే అనామిక మృతి చెందడం గమనార్హం. వ్యాపమ్ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆమె ఎస్సైగా ఎంపికయ్యారు. ఎస్సైగా ఆమె నియామకానికి, స్కామ్‌కు సంబంధం లేదని, ఆమె ఈ ఉద్యోగాన్ని అక్రమంగా సంపాదించలేదని పోలీసులు చెబుతున్నారు. అనామిక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నామని సాగర్ ఎస్పీ గౌతమ్ సోలంకీ తెలిపారు. స్కాంకు, ఈ మరణానికి సంబంధం లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ‘వ్యాపమ్ స్కామ్‌తో కానీ, ఆ స్కామ్ దర్యాప్తుతో కానీ అనామిక మృతికి సంబంధం లేదని నేను పూర్తి బాధ్యతతో చెబుతున్నా. ప్రతీ సంఘటననూ వ్యాపమ్‌తో ముడిపెట్టడం సరికాదు’ అన్నారు. రిజర్వ్‌లో అక్షయ్‌సింగ్ అటాప్సీ నివేదిక జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ మృతదేహానికి గుజరాత్‌లోని దహోద్ జనరల్ ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యుల బృందం.. ఆయన మృతికి కారణాలపై తమ అభిప్రాయాలను రిజర్వ్‌లో ఉంచింది. పోస్ట్‌మార్టం నివేదికలో ఆ వైద్యులు మృతికి కారణాలను వెల్లడించలేదని జబువా ఎస్పీ ఆబిద్ ఖాన్ తెలిపారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో పరీక్షించేందుకు అక్షయ్‌సింగ్ శరీరాంతర్గత అవయవాలను దహోద్ ఆసుపత్రిలో భద్రపరిచారని ఖాన్ చెప్పారు. మరోవైపు, జబల్పూర్ మెడికల్ కాలేజ్ డీన్ అరుణ్ శర్మ మృతికి సంబంధించి ప్రాథమిక దర్యాప్తులో ఎలాంటి అనుమానాస్పద సాక్ష్యాధారాలు లభించలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ వెల్లడించారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు సభ్యుల వైద్య నిపుణుల బృందం శర్మ మృతదేహానికి సోమవారం పోస్ట్‌మార్టం నిర్వహించింది. అక్షయ్‌సింగ్ దేహంపై అంతర్గతంగా కానీ బహిర్గతంగా కానీ ఎలాంటి గాయాలు లేవని పోస్ట్‌మార్టంలో తేలిందన్నారు. ఆ జర్నలిస్ట్ గుండె వ్యాకోచించి ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. మెడికల్ కాలేజ్ డీన్ అరుణ్ శర్మ శరీరంపై గొంతు నులిమిన ఆనవాళ్లున్నాయన్న బస్సీ.. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తామని తెలిపారు. సీఎంగా శివరాజ్ వైదొలగాలి: కాంగ్రెస్ తాజా మరణాలతో సీఎం శివరాజ్‌పై దాడిని కాంగ్రెస్ సోమవారం మరింత తీవ్రం చేసింది. సీఎంగా ఆయన వైదొలగుతేనే ఈ స్కామ్‌లో నిష్పక్షపాత దర్యాప్తు సాధ్యమవుతుందని పేర్కొంది. 45 మరణాల బాధ్యత నుంచి ఆయన తప్పించుకోలేడంది. ఈ స్కామ్ సూత్రధారి ముఖ్యమంత్రేనని ఆరోపించింది. ‘ఈ స్కామ్‌కు సంబంధించి సీఎం, ఆయన కుటుంబసభ్యులపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను తప్పేం చేయలేదని ఆయన భావిస్తే.. తక్షణమే సీబీఐ దర్యాప్తు కోరాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో డిమాండ్ చేశారు. కుంభకోణంపై ప్రధాని ఇంకా మౌనం పాటించడాన్ని వామపక్షాలు, ఆప్ ప్రశ్నించాయి. వ్యాపమ్ మరణాలను కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్‌గా అభివర్ణించిన టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. అవినీతిని, నేరాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. గవర్నర్ తొలగింపు పిటిషన్‌పై విచారణ వ్యాపమ్ స్కామ్‌లో హస్తం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్‌ను గవర్నర్ పదవి నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సోమవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించిన ఇతర పిటిషన్లతో పాటు దీనిపై కూడా జులై 9న విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. ప్రాణ హాని ఉంది:ఆశిశ్ చతుర్వేది ఈ స్కామ్‌తో సం బంధమున్న వ్యక్తులు చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నా రని స్కామ్ వెల్లడవడానికి ప్రధాన కారకుల్లో ఒకరైన ఆశిశ్ చతుర్వేది తెలిపారు. ‘సైకిల్‌పై వెళ్తుంటాను. నాకు రక్షణగా ఇచ్చిన పోలీసు మరో సైకిల్‌పై తోడుగా వస్తుంటా డు. ట్రాఫిక్‌లో నేనెక్కడో, తానెక్కడో చిక్కుకుంటాం. దాంతో నాపై దాడి సులభసాధ్యమవుతుంది. నాకు రాష్ట్ర, లేదా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించండి’ అని కోరారు. సీబీఐ దర్యాప్తు ఉండదు: రాజ్‌నాథ్ వ్యాపమ్ స్కామ్‌పై సీబీఐతో దర్యాప్తు జరిపించాలన్న విపక్షాల డిమాండ్‌ను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తోసిపుచ్చారు. స్కామ్‌పై మధ్యప్రదేశ్ హైకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ జరుపుతోందన్నారు. ‘సుప్రీంకోర్టునో, హైకోర్టునో మేం ఆదేశించలేం. దర్యాప్తు సరిగ్గా సాగడం లేదని హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ భావిస్తే.. సీబీఐ దర్యాప్తునకు అవి ఆదేశాలిస్తాయి. ఆ ఆదేశాలను పాటిస్తాం’ అన్నారు. సీబీఐ దర్యాప్తుకు సంబంధించి దాఖలైన పిల్‌ను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ శవరాజకీయాలు చేస్తోందని మధ్యప్రదేశ్ ఆరోగ్య మంత్రి నరోత్తమ్ మిశ్రా విమర్శించారు. కోర్టు అనుమతి లేకుండా సీబీఐ కానీ, మరే ఇతర దర్యాప్తు సంస్థను కానీ ఈ స్కాంపై విచారణ జరపాలని ఆదేశించడం కోర్టు పరిధిని అతిక్రమించడమవుతుందని బీజేపీ ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు వివరించారు. జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ మృతిపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులతో.. ‘ఈ రోజు నాకన్నా పెద్ద జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారా!?’ అని వ్యాఖ్యానించి మధ్యప్రదేశ్ బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఇటీవలే ఎంపికైన కైలాశ్ విజయ్‌వర్గియా వివాదంలో చిక్కుకున్నారు. -
'ఇద్దరు సీఎంలపై సీబీఐ విచారణ చేపట్టాలి'
కరీంనగర్(రాయికల్): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని శాసనసభ ఉప ప్రతిపక్షనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీ పెట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాస్యూదవ్ ఏ పార్టీలో ఉన్నారన్న విషయాన్ని గమనించకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడం విడ్డూరమన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గవర్నర్ నరసింహన్ రెండు రాష్ట్రాల మధ్య తగాదా పెంచడం కోసం పంచాయితీలో పెద్ద మనిషిలా వ్యవహరిస్తూ గంట గంటకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగి 15 రోజులు గడిచినా.. ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్ర సీఎం చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాలయూపన చేస్తే రెండు రాష్ట్రాల ప్రజల్లో విద్వేషాలకు దారితీసే అవకాశముందన్నారు. -
‘ఎర్ర’ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు నిలిపివేత
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: శేషాచలం అడవుల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేసింది. దీంతోపాటు బాధితులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని, అలాగే ఈనెల 9న స్వయంగా తమ ముందు హాజరుకావాలంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్), డీజీపీలను ఆదేశిస్తూ ఎన్హెచ్ఆర్సీ జారీ చేసిన ఉత్తర్వులను సైతం నిలిపేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎన్హెచ్ఆర్సీ ఉత్తర్వులను వచ్చేనెల 3వ తేదీ వరకు నిలుపుదల చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. -
మీకు ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వ హింస ఆగలేదు
- గవర్నర్‌కు జగన్ వినతిపత్రం - రాష్ట్రప్రభుత్వం బరితెగించి హింసకు పాల్పడుతోంది - ఈ హత్యాకాండపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వండి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ హత్యలపై మీ దృష్టికి గతంలో ఒకసారి తెచ్చినా అవి ఆగడం లేదని, టీడీపీ వారు వైఎస్సార్సీపీ శ్రేణులపై దారుణ హింసను కొనసాగిస్తూనే ఉన్నారని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం గవర్నర్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు. గత ఏడాది జూలై 7వ తేదీన కూడా గవర్నర్‌ను కలిసి హింసాకాండపై ఫిర్యాదు చేసిన విషయాన్ని అందులో ప్రస్తావించారు. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు... - రాష్ట్రంలో టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తరువాత, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందు నుంచే (జూన్ 8, 2014 కన్నా ముందు నుంచే) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చెలరేగాయి. నెల రోజుల్లోపే 17 మంది వైఎస్సార్సీపీ నేతలను, కార్యకర్తలను హత్య చేశారు. మరో 110 మందిని గాయపరిచారు. దాడులకు గురైన వారిలో సగం మంది ఎస్సీలు, మహిళలే ఉన్నారు. - పోలీసులు కొన్ని కేసులను నమోదు చేయకపోగా, కొన్నింటిలో వారే సూత్రధారులుగా వ్యవహరించడం దారుణం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చల్లో ఈ అంశాన్ని ప్రతిపక్ష నేతగా నేను లేవనెత్తినా ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రే సాక్షాత్తూ ఇలాంటివి ప్రోత్సహిస్తుంటే ఇక న్యాయం కోసం మేమెక్కడికి వెళ్లాలని గతంలోనే మేం మీ దృష్టికి తెచ్చాం. అయినా పరిస్థితుల్లో మార్పురాకపోగా, మరింత దిగజారుతున్నాయి. - తమనెవ్వరూ ఏమీ చేయజాలరనే విచ్చలవిడితనంతో రాష్ట్రప్రభుత్వం వైఎస్సార్సీపీ శ్రేణులపై హింసాకాండకు పాల్పడుతోంది. భూమిరెడ్డి ప్రసాదరెడ్డిని ఎమ్మార్వో కార్యాలయంలోనే హతమార్చడమే ఇందుకు తార్కాణం. పోలీస్‌స్టేషన్ పక్కనే ఈ హత్య జరిగింది. ప్రసాదరెడ్డిని తహసిల్ కార్యాలయానికి పిలిపించడం, అక్కడే హతమార్చడం చూస్తే ఈ హత్యలో తహశీల్దార్, ఆర్ఐల హస్తం ఉందనేది స్పష్టమవుతోంది. అయినా ఇది ఫ్యాక్షన్ (వర్గ వైషమ్యాల) వల్ల జరిగిందని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. మార్చి 31వ తేదీన కిష్టపాడు గ్రామంలో సింగిల్ విండో ఛైర్మన్ విజయభాస్కరరెడ్డిని కార్యాలయానికి పిలిపించి హతమార్చడం కూడా స్థానిక ఎస్ఐ పర్యవేక్షణలోనే జరిగింది. - ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారులు వీటి వెనుక ఉన్నారనేది తెలుస్తోంది. వీళ్లంతా కలిసి రాజకీయ హత్యలు చేసేందుకు, వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులు కొనసాగించేందుకు ఎస్ఐలను, తహశీల్దార్లను పావులుగా ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అనంతపురం జిల్లాలో జరిగిన హత్యలే ఇందుకు నిదర్శనం. - ప్రసాదరెడ్డి హత్యతో ఆగ్రహావేశపరులైన జనాన్ని శాంతింపజేసేందుకు మా పార్టీ మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, స్థానిక నేత తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డిలు ప్రయత్నించారు. హత్య చేసినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా మా పార్టీ నేతలిద్దరినీ అరెస్టు చేయడం ఆశ్చర్యకరంగా ఉంది. హంతకులను శిక్షించకపోతే టీడీపీ కార్యకర్తలు మరింత బరితెగిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సీబీఐ దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా మనవి చేస్తున్నాం. - జగన్‌తోపాటు గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి, శాసనసభాపక్షం ఉపనేతలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు శెట్టిపల్లె రఘురామిరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఆర్.కె.రోజా, గౌరు చరితారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, పోతుల రామారావు, యక్కలదేవి ఐజయ్య, మేకపాటి గౌతమ్‌రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, దిడ్డి ఈశ్వరి, పీడిక రాజన్నదొర, అత్తారు చాంద్‌బాష, దాడిశెట్టి రాజా, గుమ్మనూరు జయరామయ్య, మణి గాంధీ, వై.బాలనాగిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, భూమా అఖిలప్రియ, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరామయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనంతపురం పార్టీ నేతలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, రమేష్‌రెడ్డితో పాటు పలువురు నేతలున్నారు. -
సర్కార్ హత్యాకాండపై సీబీఐ విచారణ
- వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్.. గవర్నర్‌కు వినతి - చంద్రబాబు ప్రమేయంతోనే హింసాకాండ - డీజీపీ సొంత జిల్లాలోనే 8 హత్యలు - ప్రభుత్వోద్యోగులే హత్యల్లో భాగస్వాములు - ప్రభుత్వ కార్యాలయాలే హత్యా స్థలాలు - గవర్నర్‌తో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘‘ప్రభుత్వాధికారులు, ఉద్యోగులే హత్యల్లో పాలు పంచుకోవడం, ప్రభుత్వ కార్యాలయాలే హత్యా స్థలాలు కావడం దారుణం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పోలీసు యంత్రాంగం అధిపతి అయిన డీజీపీ సొంత జిల్లా అనంతపురంలోనే ఎనిమిది రాజకీయ హత్యలు జరిగాయి. చంద్రబాబు దగ్గరుండి రాష్ట్ర డీజీపీని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని హత్యలు చేయిస్తున్నారు. ఇది న్యాయమేనా? సాక్షాత్తూ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వ అధికారులను ఉద్యోగులను ఉపయోగించి ప్రతిపక్ష నేతలను ఏరివేసే కార్యక్రమం న్యాయంకాదు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే ఇక సామాన్య ప్రజలెలా బతకాలి?’’ హైదరాబాద్: చంద్రబాబునాయుడు ప్రభుత్వం తమ పార్టీ నేతలను కిరాతకంగా హతమారుస్తోందని, ప్రభుత్వ కనుసన్నల్లోనే హింసాకాండ సాగుతోందని, ఈ రాజకీయ హత్యలన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ దమనకాండపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఆంధ్రప్రదేశ్‌లో నానాటికీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిని జగన్, ఎమ్మెల్యేలు గవర్నర్ దృష్టికి తెచ్చారు. గవర్నర్‌తో సమావేశం ముగిసిన తరువాత ఆయన రాజ్‌భవన్ బయట మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు దగ్గరుండి రాష్ట్ర డీజీపీని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని హత్యలు చేయిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు సొంత జిల్లా అనంతపురంలోనే ఎనిమిది హత్యలు జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ‘‘మా పార్టీ నేత భూమిరెడ్డి ప్రసాదరెడ్డిని ఏప్రిల్ 29వ తేదీన రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయానికి పిలిచి మరీ అందరి కళ్లెదుటే దారుణంగా నరికి చంపారు. ఎమ్మార్వో, ఆర్ఐ ఇద్దరూ కలిసి ఫోన్ చేస్తే ప్రసాదరెడ్డి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. అక్కడ అప్పటికే దాచి ఉంచిన ఆయుధాలతో కిరాతకంగా హతమార్చారు. ప్రభుత్వాధికారులే హత్యల్లో పాల్గొనే పరిస్థితి రావడం, ప్రభుత్వ కార్యాలయాలే హత్యా స్థలాలు కావడం ఎంతవరకు సమంజసం? హత్య జరిగిన స్థలంలోనే స్థానిక ఎస్ఐ నేమ్‌ప్లేట్ కూడా పడి ఉంది, పోలీస్ స్టేషన్ పక్కనే ఈ హత్య జరిగిందంటే, ఇంతకంటే కిరాతకం ఎక్కడైనా ఉంటుందా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దిగజారాయో దీనిని బట్టి అర్థం అవుతోంది. ప్రసాదరెడ్డి హత్యకు సరిగ్గా నెల ముందు... అంటే మార్చి 31వ తేదీన కిష్టపాడు గ్రామంలో అక్కడి సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డిని కూడా ఇలాగే చంపారు. విజయభాస్కర్‌రెడ్డి స్కూలు టీచరు కుమారుడు. సింగిల్‌విండో పెయిడ్ సెక్రటరీ ఫోన్ చేసి పిలిస్తే కార్యాలయానికి వెళ్లారు. తీరా అక్కడకు వెళ్లాక చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని కోరారు. తిరస్కరించినందుకు ఆఫీసులోనే దారుణంగా కట్టెలతో కొట్టి చంపేశారు’’ అని జగన్ చెప్పారు. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో టీడీపీ మంత్రులెందుకు ఉన్నారు? ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని చంద్రబాబు అంటున్నపుడు... ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ మంత్రులు ఎందుకు కొనసాగుతున్నారు? వారిని బయటకు రమ్మనవచ్చు కదా? అని జగన్ ఆంగ్ల మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఓ వైపు చెబుతూనే మరోవైపు ప్రయివేటు విమానాల్లో చంద్రబాబు యాత్రలకు వెళ్లడం సమంజసమేనా? అని మరో ప్రశ్నకు జవాబుగా చెప్పారు. పదవీకాలాన్ని పెంచి హత్యలు చేయిస్తున్నారు... రెండు నెలల్లో పదవీ విరమణ చేయాల్సిన డీజీపీ జేవీ రాముడు పదవీకాలం పొడిగించి, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని హత్యలు చేయిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ‘‘డీజీపీ అనంతపురం జిల్లా వాసి. తెలుగుదేశం నాయకులందరూ ఆయనను ‘అన్నా’, ‘మామా’, ‘చిన్నాన్నా’... అని వరుసలు పెట్టి పిలుస్తూ ఉంటారు. ఆయన వారి ఇళ్లకు కూడా పోతారు. అనంతపురం జిల్లాకు వస్తే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్లేది జిల్లా మంత్రి గారి ఇంటికే. ఆయన అండ చూసుకునే జిల్లాలో ఎనిమిది హత్యలు జరిగాయి. ప్రసాదరెడ్డి హత్య జరిగాక ఎస్ఐని, సీఐని జిల్లా ఎస్పీ వీఆర్ (వేకెంట్ రిజర్వు)కు బదిలీ చేస్తే ఒక్క రోజైనా తిరక్కముందే వారిని మళ్లీ వెనక్కి తీసుకువచ్చారంటే ఏం అర్థం చేసుకోవాలి. శాంతిభద్రతల పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంటే ప్రజలెలా బతకాలి?’’ అని ప్రశ్నించారు. ఈ విషయాలన్నీ గవర్నర్‌కు వివరించామనీ, ఈ రాజకీయ హత్యలన్నింటి మీదా సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందిగా గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. అదుపుతప్పిన శాంతి భద్రతలపై తాము ఇదివరకే ఒకసారి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించామని, అయితే ఆ తరువాత పరిస్థితులు మరింత దిగజారాయని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము గవర్నర్‌కు ఇచ్చిన వినతిపత్రంలోని అంశాలను ప్రజల దృష్టికి ప్రముఖంగా తేవడం ద్వారా ఈ దారుణ హింసాకాండకు ముగింపు పల కాలని మీడియాకు కూడా విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌కు సమర్పించిన వినతిపత్రం ప్రతులను ఆయన మీడియాకు అందించారు. -
'వికార్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాలి'
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్‌సిటీ) : జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న వికారుద్దీన్ అతని అనుచరుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యుమన్ రైట్స్ అర్గనైజేషన్ (ఎన్సీహెచ్ఆర్వో) ప్రతినిధులు ప్రొఫెసర్ ఎ.మార్క్స్, రేణి, సుగుమారన్, మహ్మద్ యూసూప్లు పేర్కొన్నారు. తమ ఎన్సీహెచ్ఆర్వో ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీలలో వికార్గ్యాంగ్పై ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించామని, దానిని నిజనిర్ధారణ కమిటీగా తాము వివరాలు సేకరించామని తెలిపారు. ఆలేరు పీఎస్ పరిధిలో ఈ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. తెలంగాణ పోలీసులు పక్కా ప్రణాళికతో 5 మంది అండర్ ట్రైయిల్ ఖైదీలను హత్యచేసిందని వారు ఆరోపించారు. చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 30 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వికార్గ్యాంగ్ను ఎన్కౌంటర్ చేసేముందే పోలీసులు ట్రాఫిక్‌ను మరలించాలని తమ విచారణలో వెల్లడైందన్నారు. ఈ బూటకపు ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై హత్యానేరం కింద కేసులు పెట్టి వారిని శిక్షించాలని వారు కోరారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు ప్రత్మేశ్, మహ్మద్ అబ్దుల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
సత్యసాయి మృతిపై సీబీఐ విచారణ
-
సత్యసాయి మృతిపై సీబీఐ విచారణ
సమీప బంధువు గణపతిరాజు డిమాండ్ సత్యసాయిది హైటెక్ మర్డర్ ఏపీ సీఎం, పీఎంకి లేఖలు సాక్షి, హైదరాబాద్: సత్యసాయి బాబా(పుట్టపర్తి సాయిబాబా) మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని బాబా సమీప బంధువు ఎం.గణపతిరాజు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి మార్చి 29న మృతి చెందితే, ఏప్రిల్ 24న ఆరాధన దినోత్సవాలు జరపటం ఏమిటని ప్రశ్నించారు. సత్యసాయిబాబాది సహజ మరణం కాదని, వెల్ ప్లాన్డ్ హైటెక్ మర్డర్ అని, అందుకే తాము సీబీఐ విచారణ కోరుతున్నామని అన్నారు. ఆ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు, ప్రధాని మోదీకి లేఖలు రాశామని తెలిపారు. బాబా మృతి సంఘటనలోని దోషులకు అదృశ్యశక్తుల అండదండలు ఉన్నాయని, బాబాకు సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆస్తులు తరలించాయని ఆరోపించారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించాలని కోరిన తనపై రెండుసార్లు దాడులు జరిగాయని గుర్తు చేశారు. సత్యసాయి మృతికి సంబంధించి ఆధారాలు కొన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పారు. సమావేశంలో రవి, న్యాయవాది సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నన్ కేసు సీబీఐకి అప్పగింత
మరో వృద్ధురాలి అనుమానాస్పద మృతి రాణాఘాట్: రాణాఘాట్ కాన్వెంట్ స్కూల్లో 71ఏళ్ల నన్‌పై సామూహిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించేందుకు పశ్చిమబెంగాల్ సర్కారు అంగీకరించింది. ‘ఈ కేసులోని తీవ్రతను, సున్నితత్వంతో పాటు.. ఘటన జరిగిన ప్రాంతం సరిహద్దుకు దగ్గర ఉండటం దృష్టిలో ఉంచుకుని విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’ అని సీఎం మమతా బెనర్జీ తన ఫేస్బుక్ ఖాతాలో తెలిపారు. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా జాతీయ మానవహక్కుల సంఘం రాష్ట్రాన్ని ఆదేశించింది. కాగా, బుర్ద్వాన్ జిల్లాలో 75 ఏళ్ల వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చరణ్‌దాస్ ఆశ్రమంలో నివసిస్తున్న ఆమె మృతదేహం బుధవారం ఆశ్రమ సమీపంలో లభించింది. వివస్త్రగా పడి ఉన్న ఆమెను అత్యాచారం చేసి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు ఆశ్రమవాసులపై చేయి చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో మాత్రం మహిళను రేప్ చేసినట్లు కానీ, రేప్ వల్ల చనిపోయినట్లు కానీ ఆధారాలు లభించలేదని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
ఆత్మ‘హత్య’ ప్రకంపనలు!
ఐఏఎస్ రవి మృతిపై అట్టుడుకుతున్న కర్ణాటక ముమ్మాటికీ ఆత్మహత్య కాదంటున్న కుటుంబీకులు సీబీఐ విచారణకు డిమాండ్.. లేదంటే ఆత్మహత్య చేసుకుంటాం కేసు అప్పగించిన మరుసటిరోజే సీఐడీ అధికారిని మార్చిన రాష్ట్రం బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో ఐఏఎస్ అధికారి రవి అనుమానాస్పద మృతి ప్రకంపనలు సృష్టిస్తోంది. నిజాయితీ గల అధికారిని పొట్టనబెట్టుకున్నారని ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా.. రవిది ముమ్మాటికీ ఆత్మహత్య కాదని ఆయన కుటుంబీకులు స్పష్టంచేస్తున్నారు. రవి మృతిపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని, లేదంటే తామంతా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అటు రాష్ట్ర అసెంబ్లీ వరుసగా రెండోరోజు కూడా దద్దరిల్లిపోయింది. రవి మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని విపక్షాలు పట్టుబట్టాయి. బుధవారం రవి తల్లిదండ్రులు గౌరమ్మ, కరియప్ప, సోదరుడు రమేశ్, సోదరి భారతి, మామ హనుమంతరాయప్ప అసెంబ్లీ ముందు ధర్నాకు దిగారు. ‘మాకు న్యాయం కావాలి. నా కొడుకు ఆత్మహత్య చేసుకోలేదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడికి నేను జన్మనివ్వలేదు. రవి ధైర్యవంతుడు. ఈ దేశం ముద్దుబిడ్డ’ అంటూ తల్లి గౌరమ్మ కన్నీరుమున్నీరయ్యారు. రవి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని, లేదంటే మూకుమ్మడిగా ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రవిది హత్యగా అనుమానిస్తున్నామని, దీని వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చని రమేశ్ అన్నారు. రవి మామ హనుమంతరాయప్ప మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎస్ఏ నారాయణ స్వామిపై అనుమానం వ్యక్తంచేశారు. ‘ఆ ఎమ్మెల్యే ప్రభుత్వ భూమిని ఓ కంపెనీకి అమ్మారు. తర్వాత ప్రభుత్వం దాన్ని వెనక్కు తీసుకుంది. ఈ గొడవ హైకోర్టు వరకు కూడా వెళ్లింది’ అని చెప్పారు. రెండోరోజూ దద్దరిల్లిన అసెంబ్లీ.. రవి మృతిపై సీబీఐ విచారణ జరిపించాలన్న తమ డిమాండ్‌పై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. మంగళవారం రాత్రంతా శాసనసభలోనే ధర్నా చేసిన ప్రతిపక్ష సభ్యులు.. బుధవారం సభ మొదలు కాగానే బీజేపీ, జేడీఎస్ వెల్‌లోకి దూసుకెళ్లి దుమారం సృష్టించారు. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. ఆ తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. ఇది సీబీఐకి ఇవ్వాల్సిన కేసు కాదని సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీ బయట విలేకరులతో పేర్కొన్నారు. అనంతరం ఆయన రవి కుటుంబీకులను ఓదార్చారు. సీఐడీతో నిష్పాక్షికంగా దర్యాప్తు చేయిస్తానని హామీనిచ్చారు. అయితే కుటుంబీకులు వినకపోవడంతో.. సీబీఐ దర్యాప్తుపై నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని హామీనిచ్చారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే నారాయణ స్వామి కొట్టిపడేశారు. తనకు ఏ కంపెనీతో సంబంధం లేదని, ఎవరినీ బెదిరించలేదన్నారు. కాగా, రవి మృతి కేసును సీఐడీకి అప్పగించిన మరుసటి రోజే ప్రభుత్వం ఆ విభాగం ఐజీపీ ప్రణబ్ మొహంతిని మార్చేసింది. ఆయనను కర్ణాటక లోకాయుక్త ఐజీపీగా నియమించింది. సీఐడీ ఐజీపీగా సీహెచ్ ప్రతాప్‌రెడ్డిని నియమించింది. ఈ మార్పులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ పిటిషన్‌పై ఐఏఎస్‌ల సంతకాలు రవి మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ ఉత్తిష్ట భారత అనే ఎన్జీఓ చేపట్టిన ‘ఆన్లైన్ పిటిషన్’పై కర్ణాటకలోని పలువురు ఐఏఎస్‌లు సంతకాలు చేశారు. ఈ సంతకాలను ప్రధాని మోదీకి పంపనున్నారు. పలువురు ఐఏఎస్‌లతోపాటు 13.58 లక్షల మంది పౌరులు సంతకాలు చేసినట్టు సదరు సంస్థ తెలిపింది. మాఫియాకు హడల్ కలెక్టర్ డీకే రవి.. ఈ పేరు వింటే కోలార్ జిల్లాల్లో ఇసుక, భూమాఫియాలకు హడల్! కర్ణాటక కేడర్ 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రవి.. కోలార్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో మాఫియా దందాలపై ఉక్కుపాదం మోపారు. ఎక్కడ గొడవ జరిగినా ప్రత్యక్షమై పేదల పక్షం వహించేవారు. ఎవరి ఒత్తిళ్లు, బెదిరింపులకు లొంగకుండా నిజాయితీగా విధులు నిర్వర్తించే అధికారిగా గుర్తింపు పొందారు. సెలవు రోజుల్లో.. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే పేద యువకులకు శిక్షణ ఇచ్చేవారు. ఆయన మృతి చెందారని తెలియగానే జిల్లాలో ప్రజలు స్కూళ్లు, కాలేజీలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటించడం గమనార్హం. పెద్ద తలకాయలపై గురి నేపథ్యంలో.. కోలార్ జిల్లా నుంచి బెంగళూరు వాణిజ్య పన్నుల శాఖకు అడిషనల్ కమిషనర్‌గా వచ్చిన తర్వాతా రవి తన పంథాలోనే సాగారు. పన్ను ఎగవేతదారులకు చుక్కలు చూపించారు. బెంగళూరులో పన్నులు ఎగవేస్తున్న బడా సంస్థలపై గురిపెట్టిన నేపథ్యంలోనే రవి మరణించడం అనుమానాలకు తావిస్తోంది. నగరంలోని కొందరు పెద్ద డెవలపర్లపై ఉక్కుపాదం మోపేందుకు రవి సిద్ధమయ్యారని ఆర్టీఐ కార్యకర్త గణేశ్ కౌండిని తెలిపారు. అక్టోబర్‌లో వాణిజ్య పన్నుల శాఖకు వచ్చాక రవి పన్నులు ఎగవేసినహౌసింగ్ సొసైటీల నుంచి రూ.400 కోట్లు వసూలు చేశారని తెలిపారు. ‘గత గురువారం, శుక్రవారం రవితో ఫోన్లో మాట్లాడా. బెంగళూరులో పన్నులు ఎగవేసిన కొందరు బడా డెవలపర్లపై ఆయన దృష్టి సారించారు. అందుకు సంబంధించి కొన్ని ఆధారాలు అందించేందుకు నేనూ సిద్ధమయ్యా. ఈలోపే ఈ ఘటన చోటుచేసుకుంది’ అని చెప్పారు. దర్యాప్తు మొదలుకాక ముందే రవిది ఆత్మహత్య అని ప్రభుత్వం చెప్పడాన్ని గణేశ్ తప్పుపట్టారు. సీబీఐ విచారణ కావాలి రవి మృతిపై సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని కేంద్ర న్యాయ మంత్రి సదానంద గౌడ డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్ణాటక బీజేపీ ఎంపీలతో కలసి బుధవారం కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. రవిది ఆత్మహత్యగా చిత్రీకరించి కేసును మూసేయాలని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని విలేకరులతో అన్నారు. సీఎంతో మాట్లాడి నివేదిక తెప్పించుకుంటానని రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్లు బెంగళూరు ఎంపీ, కేంద్రమంత్రి అనంత్ కుమార్ చెప్పారు. -
గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు!
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖా మంత్రి గోపీనాథ్ ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. ఆయన మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్లు అధికం కావడంతో ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తు అంశంపై మోడీ త్వరలో తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దీనిపై ప్రజలకు ఏమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజానేతగా గుర్తింపు ఉన్న ముండే మృతి మాత్రం పార్టీకి తీరని లోటేనన్నారు. తొలిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన మహారాష్ట్రకు చెందిన ప్రముఖ బీసీ నాయకుడు ముండే మంగళవారం ఉదయం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ముంబై వెళ్లడానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ముండే తన కారులో (మారుతి సుజుకి ఎస్ఎక్స్4) వెళ్తుండగా పృథ్వీరాజ్ రోడ్డు-తుగ్లక్ రోడ్డు సర్కిల్ వద్ద 6:20 గంటలకు మరో కారు (టాటా ఇండికా) పక్క వైపు నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. -
సీబీఐ విచారణకు సిద్ధమేనా?: వైఎస్ విజయమ్మ
టీడీపీ అధినేత చంద్రబాబుకు వైఎస్ విజయమ్మ సవాల్ బొబ్బిలి (విజయనగరం జిల్లా)/ శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు హయామంతా స్కామ్‌లమయమే. ఏలేరు కుంభకోణం, మద్యం కుంభకోణం, నకిలీ స్టాంపుల కుంభకోణం, తెల్గీ కుంభకోణం, స్కాలర్‌షిప్‌ల కుంభకో ణం, ఐఎంజీ, ఎల్ అండ్ టీ, రహేజా తదితర కుంభకోణాలకు చంద్రబాబు పాల్పడ్డాడు. పనికి ఆహార పథకం, ఇంకు డు గుంతలు, నీరు-మీరు పథకాల్నీ వదల్లేదు. తుఫాన్ నిధుల్ని దిగమింగేశాడు. చంద్రబాబుపై దర్యాప్తు చేయమం టే నెల రోజుల పాటు జాప్యంచేసి సిబ్బంది లేరని కోర్టుకు చెప్పారు సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ. ఈలోగా దాదాపు 18 కుంభకోణాల్లో స్టేలు తెచ్చుకుని బతుకుతున్నాడు. అటువంటి అవినీతిపరుడా... మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని, జగన్మోహన్రెడ్డిని విమర్శించేది? చంద్రబాబూ.. నువ్వే తప్పూ చేయలేదనుకుంటే, నీకంత ధైర్యముంటే సీబీఐ విచారణకు సిద్ధమేనా?’’ అని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయ మ్మ విరుచుకుపడ్డారు. ఆమె గురువారం విజయనగరం జిల్లాలో సాలూరు నియోజకవర్గంలోని మక్కువ, పార్వతీపురం, కురుపాం.. శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, రాజాం, పొందూరు పట్టణాల్లో జరి గిన వైఎస్సార్ జనభేరి బహిరంగసభల్లో ప్రసంగించారు. పాలకొం డ, రాజాంలలో భారీ వర్షం కురుస్తున్నా ప్రజలు లెక్కచేయలేదు. పార్టీలో 15 వేల కుటుంబాల చేరిక మక్కువ మాజీ ఎంపీపీ మావుడి శ్రీనివాసరావు, రంగునాయుడుల ఆధ్వర్యంలో 15 వేల కుటుంబాలు గురువారం కాంగ్రెస్‌ను వీడి విజ యమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరాయి. డీసీసీబీ డెరైక్టరు మావుడి తిరుపతిరావుతో పాటు 11 మంది సర్పంచ్‌లు, 42 మంది వివిధ స్థాయిల్లో ఉండే ప్రజాప్రతినిధులు పార్టీలో చేరారు. -
పొన్నాల అవినీతిపై విచారణ చేయాలి
ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి అవినీతికి పాల్పడ్డారని, ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్త ఆర్.ఎస్.నరోత్తం మంగళవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐతో విచారణ జరిపించి అవినీతి నిరోధక చట్టం, ఇతర చట్టాల ద్వారా ఆయనను శిక్షించాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. పొన్నాల లక్ష్మయ్యను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. -
అసత్యాలతో అడ్డగోలు వాదన!
కూకట్పల్లి భూమిపై నామా అవాస్తవాలు 2004 మే 10న వైఎస్ ప్రాజెక్టు ఇచ్చారన్న నామా .. వైఎస్ సీఎంగా బాధ్యతలు స్వీకరించింది 2004 మే 14న చంద్రబాబు సీఎంగా ఉండగా 2004 ఫిబ్రవరిలోనే వేగంగా కసరత్తు నిబంధనలు ఉల్లంఘించి మధుకాన్‌కు ప్రాజెక్టును కట్టబెట్టిన అధికారులు నిగ్గుతేల్చిన విజిలెన్స్ నివేదిక... ఒప్పందాన్ని రద్దుచేయాలని సిఫారసు విజిలెన్స్ నివేదికను ఖండించని నామా... సాక్షి, హైదరాబాద్: తప్పుడు ధ్రువీకరణలతో, అధికారులను మేనేజ్ చేసి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వందల కోట్ల విలువైన భూమిని కాజేసేందుకు ప్రయుత్నించిన మధుకాన్ సంస్థ అధినేత నామా నాగేశ్వరరావు అసత్యాలతో, అడ్డగోలు వాదనతో తనను తాను సమర్థించుకునేందుకు ప్రయుత్నిస్తున్నారు. మంగళవారం ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదే కనిపించింది. 2004 మే 10వ తేదీన వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు ఈ ప్రాజెక్టును కట్టబెట్టారని నామా చెప్పారు. అయితే, వాస్తవానికి వైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టింది 2004 మే 14వ తేదీన. అంటే వైఎస్ సీఎంగా బాధ్యతలు చేపట్టక ముందే తనకు కూకట్పల్లి భూమిని అప్పగించారని నామా చెబుతున్నారన్నమాట. 2004 ఫిబ్రవరిలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఈ భూమిని కట్టబెట్టారన్న విషయాన్ని కప్పిపుచ్చడానికే నామా వైఎస్ ప్రస్తావన తెచ్చారని ఇక్కడ స్పష్టమవుతోంది. తన సంస్థ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికను కనీసం ప్రస్తావించలేదు. ఎందుకంటే ఫిబ్రవరి 2004లోనే ఆ భూమిని మధుకాన్‌కు అప్పగించేందుకు ముందస్తు నిర్ణయానికి వచ్చారని విజిలెన్స్ నివేదిక సుస్పష్టంగా పేర్కొంది. అంటే చంద్రబాబు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మధుకాన్‌కు భూసంతర్పణ నిర్ణయం జరిగిపోయిందన్నమాట. ఇదే విషయా న్ని ‘సాక్షి’ మంగళవారం సంచికలో పేర్కొంది. ఈ ఒప్పందాన్ని రద్దు చేసి, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలన్న విజిలెన్స్ సిఫారసుపై ప్రస్తుత కిరణ్ ప్రభుత్వం ఎందుకు మిన్నకుండిపోయిందన్న అంశాన్నీ ‘సాక్షి’ ప్రస్తావించింది. అయితే, తాను అక్రమాలకు పాల్పడినట్లుగా విజిలెన్స్ ఇచ్చిన నివేదికలోని ఒక్క అంశాన్ని కూడా నామా ప్రస్తావించలేదు. ఆ నివేదిక తప్పని చెప్పుకునే ప్రయత్నమూ చేయులేదు. వాస్తవాలు ఏమిటో చెప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే ఈ భూ సంతర్పణకు వేగంగా కసరత్తు జరిగింది. బిడ్డింగ్ నిబంధనలను మార్చడంతో పాటు మధుకాన్‌కు అర్హత కల్పించేందుకు టర్నోవర్‌ను కూడా రూ.100 కోట్ల నుంచి రూ.50 కోట్లకు తగ్గించారు. సాంకేతిక కన్సార్షియం భాగస్వామిగా బీనాపురి కంపెనీ ఉందని తప్పుడు పత్రాలను సమర్పించి కాంట్రాక్టును కైవసం చేసుకుంది. ఈ వాస్తవాలను కప్పిపుచ్చి నామా ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేయడం గమనార్హం. ఎకరాకు రూ.4.45 కోట్లు పెట్టా: నామా టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్ కూకట్‌పల్లిలో విలువైన భూములను మధుకాన్ కంపెనీ కారు చౌకగా కైవసం చేసుకున్న వైనంపై ఆ సంస్థల యజమాని, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు స్పందించారు. పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులుతో కలిసి మంగళవారం ఎన్టీఆర్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ భూములకు జరిగిన బిడ్డింగ్‌లో ఏడుగురు అర్హత పొందితే, అందులో అత్యధిక బిడ్డింగ్ వేసిన మధుకాన్ కంపెనీ ఎకరాకు 4.45 కోట్ల చొప్పున మొత్తం 40.28 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. ఆరోజు మార్కెట్ విలువ రూ.2 కోట్లు కూడా లేదని తెలి పారు. డబ్బంతా చెల్లించిన తర్వాత ఆ భూములకు సంబంధించి సమతానగర్ రెసిడెన్షియల్ అసోసియేషన్, జీహెచ్ఎంసీ, హుడా, ఏపీ హౌసింగ్, రాష్ట్ర ప్రభుత్వంపైనా, మాపైనా కేసులు వేశారని చెప్పా రు. ఆరోజు నుంచి ప్రభుత్వం వాటిని క్లియర్ చేసి భూములు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదన్నారు. ఈ విషయంలో అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. చంద్రబాబు మీద ఎందుకు బురదజల్లుతున్నారని ప్రశ్నిస్తూ.. ఈ సందర్భంగా ఆయన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సాక్షిపై తన అక్కసును వెళ్లగక్కారు. విజిలెన్స్ నివేదికపై మాత్రం ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. హౌస్ కమిటీతో విచారణ మొదలు ఈ ప్రాజెక్టులో అవకతవకలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.జనార్దన్‌రెడ్డి 2005 డిసెంబర్ 16న అసెంబ్లీలో నోటీసు ఇచ్చారు. స్పందించిన ప్రభుత్వం బాజిరెడ్డి గోవర్ధన్ నేతృత్వంలో హౌస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2008లో నివేదికను సమర్పించింది. జాయింట్ వెంచర్ ప్రాజెక్టులను చేపట్టే సమయంలో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. ఇందుకు అనుగుణంగా హౌసింగ్ బోర్డు పని విధానంలో వైఎస్ హయాంలో మార్పులు వచ్చాయి. తర్వాతి కాలంలో అనేక అవకతవకలు ఉన్నట్టు విజిలెన్స్ శాఖకు ఫిర్యాదులు అందడంతో విచారణ ప్రారంభించింది. గత ఏడాది ఆగస్టులో నివేదిక సమర్పించింది. అయితే, ఈ నివేదిక వచ్చి ఆర్నెల్లయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. విజిలెన్స్ నిగ్గు తేల్చిన నిజాలు! - ప్రాజెక్టును దక్కించుకునేందుకు వుధుకాన్ యుజ వూని ఏపీహెచ్‌బీ అధికారులను ‘మేనేజ్’ చేశారు. - కంపెనీకి ఉన్న అనుభవం గురించి కూడా మధుకాన్ తప్పుడు పత్రాలు సమర్పించింది. ‘వర్క్ కాంట్రాక్ట్స్’గా పనులు చేపట్టిన అనుభవం తమకుందని పత్రాలు సమర్పించింది. ఈ రకమైన పనులు చేపట్టేందుకు ‘డెవలపర్’ తరహా అనుభవం ఉండాలని ఈఓఐ (ఆసక్తి వ్యక్తీకరణ లేఖ) స్పష్టం చేస్తోంది. - సాధారణంగా ఈఓఐని క్రిసిల్‌లాంటి జాతీయస్థాయి సంస్థలు సమీక్షించాలి. మధుకాన్ ఈఓఐను మాత్రం ఏపీహెచ్‌బీ అధికారులే సమీక్షించారు. - సాంకేతిక కన్సార్షియం భాగస్వామిగా బీనాపురి కంపెనీ ఉందని మధుకాన్ పేర్కొంది. వాస్తవానికి బీనాపురి కంపెనీకి ఇందులో భాగస్వామ్యం లేదు. ఆ విషయాన్ని కప్పిపుచ్చి ఆ కంపెనీకి 11 శాతం ఈక్విటీ ఉన్నట్లుగా తప్పుడు పత్రాలు సమర్పించారు. -
తెలంగాణ ఏర్పడగానే సీఎంపై సీబీఐ విచారణ: హరీష్‌రావు
పాలకుర్తి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రిగా అవినీతికి పాల్పడిన కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఆయన తమ్ముడు సంతోష్‌రెడ్డిపై తెలంగాణ ఏర్పడగానే సీబీఐ విచారణ జరిపించి జైలుకు పంపిస్తామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పాలకుర్తిలో గురువారం జరిగిన నియోజకవర్గస్థారుు టీఆర్ఎస్ కార్యకర్తల శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రకటన రాగానే సీఎం చిత్తూరు జిల్లాకు రూ.7,200 కోట్ల నిధులతో హడావుడిగా శంకుస్థాపనలు చేశారన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీలు మూతపడుతుంటే.. చిత్తురు జిల్లాలో రూ.120 కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
సీబీఐతో దర్యాప్తు చేయించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: టీఎన్జీవోల మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో రూ. 787 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని, దానిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం స్పందించింది. దీనిపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, సీబీఐ జాయింట్ డెరైక్టర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీసీఎస్ డీసీపీలతో పాటు టీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.రాజమల్లయ్య, మరో ఇద్దరు దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రమేష్ రంగనాథన్ బుధవారం విచారించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రీపాద ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. సొసైటీ అధ్యక్షుడు స్వామిగౌడ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, అనర్హులకు సభ్యత్వం ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సంబంధం లేని ఉద్యోగులను, ఇతర జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులను సొసైటీలో చేర్చుకున్నారని.. అది సొసైటీ బైలాస్కు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై ఇంతకుముందే హైకోర్టును ఆశ్రయించామని.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో స్వామిగౌడ్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులకు, నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ నిర్ణయాలు తీసుకుందని, పలువురు వ్యక్తులకు అయాచిత లబ్ధి చేకూర్చిందని ప్రభుత్వం తన విచారణలో తేల్చిందని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా సహకార అధికారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు స్వామిగౌడ్‌పై గత ఏడాది కేసు నమోదు చేశారని.. కానీ ఇప్పటివరకూ ఆయనను అరెస్ట్ చేయలేదని చెప్పారు. దీనిని బట్టి దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని అర్థమవుతోందని ప్రభాకర్ కోర్టుకు వివరించారు. ఈ కేసును సీసీఎస్‌కు బదలాయించినా పురోగతి లేదని, విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేశారు.