న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విష ప్రయోగం వల్లే మరణించాడంటూ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ కడుపులో ఉన్న విషం ఆనవాలు లేకుండా పోయేంత వరకు వేచిచూసి.. ఆ తర్వాతే శవ పరీక్ష నిర్వహించారన్నారు. నటుడి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని.. హంతకుల రాక్షస మనస్తత్వం, వారి చెడు ఉద్దేశాల గురించి త్వరలోనే బయటపడుతుందని పేర్కొన్నారు.(చదవండి: ‘కరోనా రిపోర్టు రాకముందే పోస్ట్‌మార్టం ఎందుకు?’)
ఇక సుశాంత్ సన్నిహితుడిగా పేరొందిన సందీప్ సింగ్ తీరుపై కూడా సుబ్రహ్మణ్య స్వామి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడు పదే పదే దుబాయ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని, ఈ విషయాలపై కూడా విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుశాంత్ మృతికి కారకులైన వారి వివరాలు వెల్లడయ్యే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆది నుంచి ఈ నటుడిది హత్యేనని పేర్కొంటూ సుబ్రహ్మణ్యస్వామి పలు సందేహాలను లేవనెత్తుతున్నారు.
ఈ క్రమంలో సుశాంత్ హత్య జరిగిన రోజున దుబాయ్ కంప్లైంట్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ సింగ్‌ను కలిశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక సుశాంత్ కేసు మాదిరిగానే ప్రముఖ నటి శ్రీదేవి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులను కూడా సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. (చదవండి: సుశాంత్ కేసు.. స్వామి సంచలన ఆరోపణలు)
Now the diabolical mentality of the killers and their reach is being slowly revealed: autopsy was deliberately forcibly delayed so that the poisons in SSR’s stomach dissolves beyond recognition by the digestive fluids in the stomach . Time to nail those who are responsible
— Subramanian Swamy (@Swamy39) August 25, 2020
ఇక అనేక పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు ఇటీవలే సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన కేంద్ర దర్యాప్తు సంస్థ... నిజానిజాలను వెలికితీసేందుకు లోతుగా దర్యాప్తు చేపట్టింది. (చదవండి: సుశాంత్ మృతి: జూన్ 14న ఏం జరిగిందంటే..)
Comments
Please login to add a commentAdd a comment