subrahmanian swamy
-
నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు
‘దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ’ అనేది ప్రతీ యుగంలోనూ జరుగుతూవస్తోంది. ఈ మహోన్నత కార్యాన్ని నెరవేర్చేందుకు అవతారపురుషులు, మహనీయులు జన్మిస్తూనే ఉన్నారు. ఇదే కోవలో దుష్ట శిక్షణకు ఉద్భవించినవాడే సుబ్రహ్మణ్యుడు. లోకసంరక్షణార్ధం పరమశివుని మహాతేజస్సు నుంచి షష్టి తిథి రోజున సుబ్రహ్మణ్యస్వామి అవతరించాడు. అందుకే ఆ రోజును సుబ్రహ్మణ్య షష్టి అని అంటారు.సుబ్రహ్మణ్య షష్ఠి దీపావళి పండుగ తర్వాత వస్తుంది. దీనిని స్కందషష్ఠి అని, సుబ్బారాయషష్ఠి అని కూడా అంటారు. ఈ సారి సుబ్రహ్మణ్య షష్టి 2024, డిసెంబరు 7న అంటే ఈరోజు వచ్చింది. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య షష్టిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసం ఉండి, సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్యుడిని కార్తికేయుడు అని కూడా అంటారు.తమిళనాడులో సుబ్రహ్మణ్య షష్ఠిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కుక్కే సుబ్రమణ్య షష్ఠి లేదా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి పేరుతో వివిధ ఆలయాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజున కార్తికేయుడు ఆరు రోజుల సుదీర్ఘ యుద్ధం తర్వాత తారకాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. తమిళనాడులో ఎంతో ప్రాచుర్యం పొందిన సుబ్రమణ్యస్వామి దేవాలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాల్లో సుబ్రహ్మణ్య షష్టి రోజున ఘనంగా పూజలు నిర్వహిస్తారు.1. తిరుపరంకుండ్రం.. ట్రెక్కింగ్ చేస్తూ..తమిళనాడులోని తిరుపరంకుండ్రంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం పొందింది. కొండపై ఉన్న ఈ దేవాలయంలోని శిల్పకళ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. అందమైన పరిసర ప్రాంతాలు ఇక్కడ అనేకం ఉన్నాయి. భక్తులు, పర్యాటకులు ఈ ఆలయాన్ని తరచూ దర్శిస్తుంటారు. ఇక్కడ జరిగే ‘పంగుని ఉతిరమ్’ ఉత్సవానికి లక్షలాదిమంది భక్తులు హాజరవుతుంటారు. ట్రెక్కింగ్ చేసేవారు తమ అభిరుచిని నెరవేర్చుకుంటూ, ఈ ఆలయాన్ని దర్శిస్తుంటారు.2. తిరుచెందూర్.. బంగాళాఖాతం ఒడ్డున..తిరుచెందూర్లోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం తమిళనాడులోని సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలలో ఒకటి. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఉంది. ఈ ఆలయం వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. స్కంద షష్టినాడు ఇక్కడ జరిగే పూజలను తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయం పక్కనే కనిపించే సుందరమైన బీచ్ భక్తులకు అద్భుత అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ కనిపించే సూర్యోదయం, సూర్యాస్తమయం ఎంతో అద్భుతంగా ఉంటాయని చెబుతారు. ఈ ఆలయం నిత్యం రద్దీగా ఉంటుంది.3. దండాయుతపాణి ఆలయం.. ప్రత్యేక ప్రవేశ ద్వారం..దండయుతపాణి స్వామి ఆలయం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని పళనిలో ఉంది. ఎత్తైన కొండపై ఉన్న ఈ దేవాలయానికి అద్భుతమైన ప్రవేశ ద్వారం ఉంది. నాటి శిల్పకళకు తార్కాణంగా ఈ ఆలయం నిలుస్తుంది. ఈ ఆలయానికి భక్తులే కాకుండా సహసయాత్ర చేయాలనుకునేవారు కూడా తరలి వస్తుంటారు.4. స్వామినాథ స్వామి ఆలయం.. 60 మెట్లతోతమిళనాడులోని స్వామిమలైలో ఉన్న స్వామినాథ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్టి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొండపై ఉన్న ఈ ఆలయం సందర్శకులకు దివ్యమైన అనుభూతిని అందిస్తుంది. జీవితంలోని ఆరు దశలకు ప్రతీకగా ఇక్కడ 60 మెట్లు కనిపిస్తాయి. వీటి అధిరోహణ యాత్రికులకు అద్భుత అనుభూతిని అందిస్తుంది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.5. తిరుత్తణి.. 365 మెట్లను అధిరోహిస్తూ..తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఆధ్యాత్మిక అనుభూతిని అందించడమే కాకుండా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు అవకాశం కల్పిస్తుంది. భక్తులు ఈ ఆలయాన్ని దర్శించేందుకు 365 మెట్లను అధిరోహించాల్సి ఉంటుంది. ఈ ఆచారాన్ని ఇక్కడకు వచ్చే భక్తులు తప్పనిసరగా పాటిస్తుంటారు. పండుగల సమయంలో ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతుంటారు. అద్భుతమైన శిల్ప సంపద ఈ ఆలయంలో అడుగడుగునా కనిపిస్తుంది.6. పజముదిర్చోలై.. కార్తికేయుని ఆరు నివాసాలలో..తమిళనాడులోని పురాతన సుబ్రమణ్య స్వామి ఆలయాలలో పజముదిర్చోలైలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఒకటి. ఇది కార్తికేయుని ఆరు నివాసాలలో ఒకటిగా పేరొందింది. ఈ ఆలయాన్ని అరుపడై వీడు అని పిలుస్తారు. ముఖ్యంగా కార్తిక మాసంలో ఈ ఆలయానికి లెక్కకు మించిన సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతిరోజూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.7. కల్యాణ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంకల్యాణ సుబ్రమణ్య స్వామి దేవాలయం తమిళనాడులో కల్యాణ పులియంకుళం పట్టణంలో ఉంది. ఈ మురుగన్ ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి రోజున విశేష పూజలు జరుగుతుంటాయి. అలాగే సుబ్రహ్మణ్యుని కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ నిర్మాణం సాంప్రదాయ, ఆధునిక శైలులకు ప్రతీకగా నిలుస్తుంది.8. అరుపడై వీడు మురుగన్ ఆలయంకొడైకెనాల్ శివారులో ఉన్న అరుపడై వీడు మురుగన్ ఆలయం కొండలు, అందమైన లోయల నడుమ ఉంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. తమిళనాడులో మురుగన్‌కు ఉన్న ఆరు నివాసాలలో ఇది ఒకటని చెబుతుంటారు. ఈ ఆలయాన్ని సందర్శించేవారు ఇక్కడ ట్రెక్కింగ్ చేయడాన్ని అమితంగా ఇష్టపడతారు.9. పచ్చైమలై మురుగన్ ఆలయం.. ప్రశాంతతకు నిలయంపచ్చైమలై మురుగన్ ఆలయం తమిళనాడులోని గోబిచెట్టిపాళయంలో ఉంది. కొండలపై నెలకొని ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రశాంతతను అందిస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెతుక్కునే వారికి ఇది మైలురాయిలా నిలుస్తుంది. ఆలయ నిర్మాణం దక్షిణ భారతీయ శైలిలో ఉంటుంది.10. సెంగుంథర్ శివ సుబ్రమణ్య స్వామి ఆలయంతమిళనాడులోని సెంగుంథర్పేట పట్టణంలో ఉంది. ఈ ఆలయం సెంగుంథర్ సంప్రదాయాలకు నిలయంగా ఉంది. ఈ ఆలయ విశిష్టత మురుగన్ పురాణ గాథలలో కనిపిస్తుంది. సుబ్రహ్మణ్య షష్టి రోజున ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని కల్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది.ఇది కూడా చదవండి: ఏ పెట్రోల్ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.. రోజూ వెళ్లేవారికీ తెలియని విషయాలు -
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర
భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కటి చేయగలిగింది. అయితే కొంతకాలంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకికవాద) పదాలను తొలగించాలని సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం! పైగా తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి సోషలిస్టు భావనను వ్యతిరేకించినట్టుగా అంబేడ్కర్ మాటలను ఆయన ఉటంకించారు. ఇది అంబేడ్కర్‌ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే! భారతదేశ చరిత్రను అర్థం చేసుకోవాలంటే, ‘భారత రాజ్యాంగం అమలుకు ముందు, అటు తర్వాత’ అని చూడాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో మనుషులంతా ఒక్కటి కాదు. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడివడి ఉన్నారు. కుల సమాజాన్ని సృష్టించి, పెంచి పోషించిన మనువాదం ఒక పరిపాలనాపత్రంగా, అదే శాసనంగా, అదే రాజ్యాంగంగా అమలు అవుతూ సమాజంలో అంత రాలను ఇంకా బలంగా వేళ్ళూనుకొనేలా చేసింది. అలాంటి సంద ర్భంలో కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ రాజ్యాంగం ఒక్కటి చేయగలిగింది. అప్పటి వరకు కులాన్ని బట్టి విలువ ఉండేది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క విలువను మనువాదం ప్రబోధించింది. కానీ భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒకే విలువను కల్పించి, కనీసం దానిలోనైనా ఒక సమానత్వ ప్రపంచాన్ని అందించింది. అందుకే భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం. రెండు వేల సంవత్సరాలకు పైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని అది బద్దలు చేసింది. అయితే కొంతకాలంగా భారత రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తియ్యడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగం గానే గతవారం కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’(సామ్యవాద), ‘సెక్యులర్’ (లౌకిక వాద) పదాలను తొలగించాలని పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానున్నది. ఇదే విషయమై, 2020 జూలైలో న్యాయవాది విష్ణు శంకర్ కూడా పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణకు అంగీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీన్ని విచారించనున్నారు. సోషలిస్టు, సెక్యులర్ అనే పదాలు రాజ్యాంగ సభ ద్వారా ఆమోదించిన పీఠికలో లేవనీ, 1976లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారనీ, రాజ్యాంగ సభ చర్చలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లాంటి వాళ్ళు కూడా వీటిని వ్యతిరేకించారనీ ఈ పిటిషన్లో పేర్కొ న్నారు. పిటిషనర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ మాటలను ఉటం కించినట్టు కనిపిస్తున్నది. అయితే, అంబేడ్కర్ మాటలను పరిశీలిస్తే సుబ్రహ్యణ్యస్వామియే అంబేడ్కర్‌ను తప్పుగా అర్థంచేసుకున్నట్టు కనిపిస్తున్నది. ఆ రోజు సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ... ‘‘రాజ్యాం గాన్ని మనం ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రూపొందించు కోవాలి. భవిష్యత్‌లో ప్రజలు ఎటువంటి విధానాలను అవలంబించా లనుకుంటారో వారికి అవకాశం ఇవ్వాలి. అంతేగానీ ఇప్పుడే అన్ని విషయాలను ముగించకూడదు. అంతేకాకుండా, రాజ్యాంగంలోని నాలుగవ భాగమైన ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా సోషలిస్టు భావనలను సమర్థిస్తు్తన్నాయనే విషయాన్ని గుర్తుం చుకోవాలి’’ అంటూ రాజ్యాంగ సభకు కేటీ షా ప్రతిపాదించిన సవరణకు సమాధానమిచ్చారు. అంబేడ్కర్ ఎక్కడా, సోషలిస్టు భావనను వ్యతిరేకించింది లేదు. పైగా దాని సారాంశాన్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు. సరిగ్గా ఇక్కడే అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడానికి రాజ్యాంగ సభలో మాట్లాడింది మాత్రమే సరిపోదు. ఒకరకంగా అది అప్పటి నాయకుల ఉమ్మడి అభిప్రాయం కూడా కావచ్చు. అయితే అంబేడ్కర్ మొదటినుంచీ సమానత్వ సమాజ స్థాపనకు పాటుపడిన వ్యక్తి. అంతేకాకుండా, రాజ్యాంగ సభలో తాను సభ్యుడిగా ఉంటానో లేదో నని భావించి, 1946లో రాజ్యాంగ సభకు ఒక మెమోరాండంను సమర్పించారు. దానినే ‘స్టేట్స్ అండ్ మైనారిటీస్’ అంటారు. అందులో ప్రభుత్వం సోషలిస్టు విధానాలను అనుసరించాలని, దానికి స్టేట్ సోషలిజం అనే మాటను కూడా ఆయన వాడారు. అందులో ఆర్థికపరమైన అంశాలను పేర్కొంటూ– దేశంలోని భారీ పరిశ్రమలను ప్రభుత్వమే నిర్వహించాలనీ, ఇన్సూరెన్స్ లాంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనీ, దేశవ్యాప్తంగా ఉన్న భూములను జాతీయం చేయాలనీ ప్రతిపాదించారు. ఈ విషయాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరచడానికి తన శాయశక్తులా కృషి చేశారు. అయినా సఫలం కాలేదు. అటువంటి సామాజిక మార్పును కోరుకుని, దాని కోసమే యావత్ జీవితాన్నే ప్రజలకు సమర్పించిన ఓ మహో న్నత వ్యక్తి వ్యాఖ్యలను తప్పుగా, తమ సోషలిస్టు వ్యతిరేక భావాలకు మద్దతుగా వాడుకోవడం విచారకరం. ఈ విషయం అట్లా ఉంచితే, 1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ïపీఠికలో ‘సోషలిస్టు, సెక్యులర్’ అనే పదాలను మాత్రమే కాకుండా, ఇంకా చాలా విష యాలను రాజ్యాంగంలో చేర్చారు. అయితే 1977లో జనతాపార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా విషయాలను 43వ సవరణ ద్వారా తొలగించారు. అయితే రాజ్యాంగ పీఠికలోని ఆ రెండు పదాల జోలికి మాత్రం పోలేదు. ప్రస్తుత పిటిషనర్ సుబ్రహ్యణ్యస్వామి అప్పుడు జనతాపార్టీ లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు. మరి అప్పుడు తన గొంతును ఎందుకు వినిపించలేదో ఆయనకే తెలియాలి. 2008లో ‘గుడ్ గవర్నెన్స్ ఇండియా ఫౌండేషన్’కు చెందిన సంజీవ్ అగర్వాల్ ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ‘‘సోషలిజం అనగానే అదేదో కమ్యూనిస్టులకు సొంతమైనట్టు అను కోవడం సరైనది కాదు. ప్రజల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం కూడా అందులో భాగమే’’ అని వ్యాఖ్యానించింది. అందు వల్ల ఆ పదాలను తొలగించాల్సిన అవసరమే లేదని భారత అత్యు న్నత న్యాయస్థానం ఆనాడు కుండ బద్దలుకొట్టింది. ప్రస్తుతం మళ్లీ ఎందుకు ఈ ప్రతిపాదన ముందుకుతెస్తున్నారనేది ప్రశ్న. దీనికి ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, సామాజిక విధానాలు... సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను, ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు, కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా మైనారిటీ మతాలను, వాటికి సంబంధించిన సంస్థలను వేధిస్తుండడం ఎక్కువైందని అంత ర్జాతీయ సంస్థలు ఎన్నో నివేదికల ద్వారా వెల్లడించాయి. ఎవరైనా ఈ విషయాలన్నింటినీ కోర్టుల్లో సవాల్ చేస్తారని ముందే ఊహించి, వాటిని తొలగిస్తే ఇక నైతికంగా కూడా తమకు ఎదురు ఉండదని భావించి అటువంటి పిటిషన్‌ను అధికార పార్టీ సభ్యుడే వేయడం జరిగి ఉండొచ్చనే అభిప్రాయానికి రావడవం తప్పేమీకాదు. అదే విధంగా భారత దేశంలో హిందూమతాన్ని అధికార మతంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. దానికి రాజ్యాంగాన్నే మార్చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టు సా«ధువులు, సంతులు స్వయంగా ప్రకటించారు. అందుకనుగుణంగానే ఇప్పటికే ముప్ఫై పేజీల డాక్యుమెంటు రూపొందించినట్టు కూడా ప్రకటించారు. ఇటువంటి నేపథ్యం నుంచి ఈ పీఠికను చూడాల్సి ఉంది. నిజానికి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు సోషలిస్టు, సెక్యులర్ స్ఫూర్తిని బలపరచడమే కాకుండా నిర్దిష్టమైన మార్గాన్ని చూపుతున్నాయి. సోషలిస్టు, సెక్యులర్ పదాలు భారత రాజ్యాంగాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాయే తప్ప ఎటువంటి దుష్ప్రభావాన్నీ కలిగించడం లేదు. భారత రాజ్యాంగ రక్షణ ఈ దేశ సామాజిక ప్రగతికీ, మనుగడకూ ఒక తక్షణ అవసరంగా ఉంది. అందువల్ల రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే ఇటువంటి కుట్రలను భారత సమాజం సహించబోదని ఆశిద్దాం. (చదవండి: చరిత్రను పాతిపెట్టి ఏం బావుకుంటారు?) - మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు -
నెహ్రూ, వాజ్‌పేయిల మూర్ఖత్వం వల్లే టిబెట్, తైవాన్ చైనాలో కలిశాయి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహరీ వాజ్‌పేయీల మూర్ఖత్వం వల్లే ఇవాళ టిబెట్, తైవాన్లు చైనాలో భాగమయ్యాయని ఆరోపించారు. వారి వల్లే మనమంతా దీన్ని అంగీకరించాల్సి వచ్చిందన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న వాస్తవాధీన రేఖ ఒప్పందాన్ని కూడా చైనా గౌరవించడం లేదని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. భారత భూభాగమైన లద్దాఖ్‌లోని కొంత ప్రాంతాన్ని డ్రాగన్ దేశం ఆక్రమించుకుందని ఆరోపించారు. ఇంత జరగుతున్నా ప్రధాని మోదీ మాత్రం మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మత్తులో ఉన్నట్లుగా మాట్లాడుతన్నారని ధ్వజమెత్తారు. We Indians conceded that Tibet and Taiwan as part of China due the foolishness of Nehru and ABV. But now China does even honour the mutually agreed LAC and grabbed parts of Ladakh while Modi is in stupor stating "koi aaya nahin". China should know we have elections to decide . — Subramanian Swamy (@Swamy39) August 3, 2022 చైనా పదే పదే హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటిస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. పెలోసీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న చైనా.. తైవాన్ భూభాగంలోకి ఫైటర్ జెట్స్‌ను ప్రయోగించింది. అంతేకాదు తైవాన్ ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేసింది. చదవండి: కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తవగానే అమలులోకి ‘పౌరసత్వ’ చట్టం! -
‘విష ప్రయోగం వల్లే సుశాంత్ మృతి చెందాడు’
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ విష ప్రయోగం వల్లే మరణించాడంటూ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ కడుపులో ఉన్న విషం ఆనవాలు లేకుండా పోయేంత వరకు వేచిచూసి.. ఆ తర్వాతే శవ పరీక్ష నిర్వహించారన్నారు. నటుడి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించడంలో ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని.. హంతకుల రాక్షస మనస్తత్వం, వారి చెడు ఉద్దేశాల గురించి త్వరలోనే బయటపడుతుందని పేర్కొన్నారు.(చదవండి: ‘కరోనా రిపోర్టు రాకముందే పోస్ట్‌మార్టం ఎందుకు?’) ఇక సుశాంత్ సన్నిహితుడిగా పేరొందిన సందీప్ సింగ్ తీరుపై కూడా సుబ్రహ్మణ్య స్వామి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడు పదే పదే దుబాయ్‌కు వెళ్లాల్సిన అవసరం ఏంటని, ఈ విషయాలపై కూడా విచారణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సుశాంత్ మృతికి కారకులైన వారి వివరాలు వెల్లడయ్యే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. కాగా జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆది నుంచి ఈ నటుడిది హత్యేనని పేర్కొంటూ సుబ్రహ్మణ్యస్వామి పలు సందేహాలను లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలో సుశాంత్ హత్య జరిగిన రోజున దుబాయ్ కంప్లైంట్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ సింగ్‌ను కలిశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక సుశాంత్ కేసు మాదిరిగానే ప్రముఖ నటి శ్రీదేవి, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేసులను కూడా సీబీఐ విచారించాలని డిమాండ్ చేశారు. (చదవండి: సుశాంత్ కేసు.. స్వామి సంచలన ఆరోపణలు) Now the diabolical mentality of the killers and their reach is being slowly revealed: autopsy was deliberately forcibly delayed so that the poisons in SSR’s stomach dissolves beyond recognition by the digestive fluids in the stomach . Time to nail those who are responsible — Subramanian Swamy (@Swamy39) August 25, 2020 ఇక అనేక పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు ఇటీవలే సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన కేంద్ర దర్యాప్తు సంస్థ... నిజానిజాలను వెలికితీసేందుకు లోతుగా దర్యాప్తు చేపట్టింది. (చదవండి: సుశాంత్ మృతి: జూన్ 14న ఏం జరిగిందంటే..) -
‘ఆ రోజు సుశాంత్ డ్రగ్ డీలర్‌ని కలిశాడు’
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సోమవారం సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ హత్య జరిగిన రోజున దుబాయ్ కంప్లైంట్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ సింగ్‌ను కలిశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వామి సునంద పుష్కర్ కేసుపై కూడా వ్యాఖ్యానించారు. ‘సునంద పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆమె కడుపులో వెలికి చూసిన వాటితోనే నిజం ఏంటనేది తెలిసింది. కానీ శ్రీదేవి, సుశాంత్ కేసులో ఇది జరగలేదు. అంతేకాక సుశాంత్ హత్య జరిగిన రోజు దుబాయ్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్‌ని కలిశాడు ఎందుకు’ అని స్వామి తన ట్వీట్లో ప్రశ్నించారు. (సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో) సుశాంత్ మృతితో దుబాయ్‌కు సంబంధాలు ఉండవచ్చని వారం రోజుల క్రితం స్వామి ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాక సీబీఐ సుశాంత్ కేసుతో పాటు శ్రీదేవి సహా గతంలోని ఉన్నతస్థాయి వ్యక్తుల మరణాల కేసులను కూడా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్, యూఏఈ దౌత్య సంబంధాలతో, భారతదేశానికి చెందిన దుబాయ్ దాదాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు స్వామి. సుశాంత్, శ్రీదేవి, సునంద హత్య కేసుల సమాచారం కోసం సీబీఐ మొసాద్, షిన్ బెత్ సహాయం తీసుకోవాలి అని స్వామి ఆగస్టులో ట్వీట్ చేశారు. శ్రీదేవి 2018 ఫిబ్రవరిలో దుబాయ్ హోటల్లోని బాత్‌టబ్‌లో మునిగిపోయి మరణించిన సంగతి తెలిసిందే. సునంద పుష్కర్ 2014 జనవరి 17న న్యూ ఢిల్లీలోని ఒక హోటల్ గదిలో అనుమానస్పద రీతిలో చనిపోయారు. (సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు) సుశాంత్ మృతి కేసు దర్యాప్తు కోసం గత వారం ముంబై చేరుకున్న సీబీఐ బృందం, నటుడి స్నేహితుడు సిద్ధార్థ్ పిథాతో పాటు నీరజ్ సింగ్‌ను సోమవారం మరోసారి ప్రశ్నించింది. ముంబైలోని శాంతక్రూజ్ ప్రాంతంలోని డీఆర్డీఓ గెస్ట్ హౌస్ వద్ద వీరిద్దరిని ప్రశ్నించారు. అంతేకాక సీబీఐ అధికారులు ఈ రోజు సుశాంత్ రెండు నెలలు బస చేసిన వాటర్‌స్టోన్ రిసార్ట్‌ను కూడా సందర్శించారు. అక్కడ ఉన్న సమయంలో సుశాంత్ ఎలా ప్రవర్తించాడో తెలుసుకోవడానికి సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సీబీఐ ఈ రోజు రియా చక్రవర్తి, ఆమె తండ్రి ఇంద్రజిత్‌ను ప్రశ్నించడానికి పిలిపించింది. జూన్ 8న రియా సుశాంత్ అపార్ట్మెంట్ నుంచి ఎందుకు వెళ్లిపోయిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. -
సుశాంత్ మృతిపై ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు
-
భారత దేశం ధర్మ సత్రం కాదు
రాయదుర్గం: స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత్‌కు వచ్చిన హిందువులందరికీ దేశ పౌరసత్వం ఇస్తారని రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. భారత్‌లో పుట్టిన ముస్లింలకు సీఏఏ ఏ మాత్రం వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని సావిత్రిబాయిపూలే ఆడిటోరియంలో బుధవారం రాత్రి అఖిల భారత విద్యార్థి పరిషత్ హెచ్‌సీయూ శాఖ ఆధ్వర్యంలో‘సీఏఏ– ఏ హిస్టోరికల్ ఇంప్యారిటివ్ బియాండ్ కాంటెంపరరీ పాలిటిక్స్’ అంశంపై ఆయన ప్రత్యేక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ భారతదేశం ధర్మసత్రం కాదని ఎవరు పడితే వారు వచ్చి ఇక్కడ పౌరసత్వం తీసుకుంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. అందుకే కేంద్రం ప్రత్యేక చట్టం తెచ్చిందన్నారు. ఈ చట్టం భారత్‌లో పుట్టిన ఏ మతానికి వ్యతిరేకం కాదని కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని, చట్టంలో లోపాలు ఉన్నాయని, ఒక మతానికి వ్యతిరేకమని నిరూపించాలని ఆయన చాలెంజ్ చేశారు. రోహింగ్యాలు స్వాతంత్య్ర సమయంలో బర్మాకు వెళ్ళేందుకు సిద్దపడి వినతిపత్రాలు ఇచ్చారని, ఆ తర్వాత 1949లో పాకిస్తాన్ వెళ్తామని చెప్పారని, కానీ ఎప్పుడు కూడా ఇండియాలోకి వస్తామని చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయిల్‌కు చెందిన పార్సీలు, ఆంగ్లో ఇండియన్లు కూడా ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారని, ఆంగ్లో ఇండియన్లకు చట్టసభల్లో ప్రత్యేక సభ్యత్వం ఇచ్చారన్నారు. భారత దేశం అన్ని కులాలకు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సీఏఏ చట్టం ఎవరికో వ్యతిరేకంగా తీసుకురాలేదని, భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ అనుకూలంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.రోహిత్ కుమార్, అజిత్‌కుమార్, అశోక్, బాలకృష్ణ, సురేష్, మనోజ్ పాల్గొన్నారు. వచ్చే పదేళ్లలో బలమైన ఆర్థిక శక్తిగా భారత్ సాక్షి, సిటీబ్యూరో: వచ్చే పదేళ్లలో భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఆవిర్భవిస్తుందని రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామి అన్నారు. 2020–21 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రజ్ఞా భారతి’ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో నిర్వహించిన 2030 నాటికి ‘బలమైన ఆర్థిక శక్తిగా భారత్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. స్వాతంత్రం నాటి నుంచి 1990 వరకు భారత్ అంతగా అభివృద్ధి చెందలేదని, ఏడాదికి 3.5 శాతం మాత్రమే జీడీపీ వృద్ధి సాధించిందన్నారు. ఇందుకు జవహర్ లాల్ నెహ్రూ విధానాలే కారణమని ఆరోపించారు. నెహ్రూ సోవియట్ ఆర్థిక విధానాల కారణంగానే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. తిరిగి పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంతో ఏడాదికి 8శాతం జీడీపి వృద్ధి సాధించిందన్నారు. అనంతరం వచ్చిన మన్మోహన్ సింగ్ కూడా వాటిని కొనసాగిం చారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నారని, నిరుద్యోగ నిర్మూలన, పేదరిక నిర్మూలనపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ఏడాదికి 10శాతం వృద్ధితో వచ్చే పదేళ్లలో భారత్ చైనాను అధిగమిస్తుందన్నారు. -
టీటీడీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం వద్దు
సాక్షి, తిరుమల: టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రసుత్తం టీటీడీ పాలనా నిర్వహణపై వాజ్యం నడుస్తుందని తెలిపారు. గతంలో ఆనంద నిలయం బంగారు తాపడాని వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించి విజయం సాధించానని తెలిపారు. పాలకమండలి ఏర్పాటుతో రమణ దీక్షితులు వ్యవహరం కొలిక్కి వస్తుందన్నారు. -
జైట్లీకి ఎకానమీ గురించి ఏమీ తెలీదు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఆర్థిక వ్యవస్థ గురించి ఏమీ తెలియదని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. గత ఐదేళ్లలో చేపట్టిన నిర్ధిష్ట ఆర్థిక విధానాలు, నిర్ణయాలు తనను మెప్పించలేదని స్పష్టం చేశారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినా, దాన్ని అమలుపరిచిన తీరు సరిగా లేదని పెదవివిరిచారు. జీఎస్టీ అమల్లో ఉన్నా ఇప్పటికీ చాలా పన్నులున్నాయని, వాటిపై స్పష్టత కొరవడిందని అన్నారు. జైట్లీకి ఎకనమిక్స్ అంటే తెలియదని మండిపడ్డారు. ఆర్థిక మంత్రితో తనకున్న అనుబంధం గురించి సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్రహ్మణ్య స్వామిని అడగ్గా.. జైట్లీ తనకు తెలియదంటూ అసలు జైట్లీ, చిదంబరంలు ఆర్ధికవేత్తలు కాదని వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థ గురించి తెలిసిన మన్మోహన్ సింగ్ మాత్రం ఆర్థిక మంత్రిగా పనిచేశారని, ఎకనమిక్స్ తెలియకుండా ఆర్థిక మంత్రులు అయిన వాళ్లున్నారని జైట్లీ, చిదంబరంలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ తిరిగి అధికార పగ్గాలు చేపడతారని సుబ్రహ్మణ్య స్వామి ధీమా వ్యక్తం చేశారు. మోదీ బ్రాండ్ కంటే తాము నమ్మే హిందుత్వ, జాతీయతావాదం వంటి అంశాలే బీజేపీని విజయతీరాలకు చేర్చుతాయని చెప్పుకొచ్చారు. 2014లోనూ మోదీ బ్రాండ్ లేదని, అది కేవలం మీడియా సృష్టేనని వ్యాఖ్యానించారు. కాగా ఏప్రిల్ 11 నుంచి ఏడు దశల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. మే 23న ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. -
‘ఆ నివేదిక వెలుగుచూస్తే శశిథరూర్‌కు షాక్’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్‌పై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సునంద పుష్కర్ మృతి కేసులో ఢిల్లీ పోలీసుల అంతర్గత విచారణ నివేదిక వెలుగుచూస్తే శశిథరూర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగాలకు బదులు హత్య ఆరోపణలు మోపేవారని వ్యాఖ్యానించారు. శశి థరూర్ సహకారంతో సాక్ష్యాలను తారుమారు చేసినట్టు ఢిల్లీ పోలీసుల అంతర్గత విచారణలో వెల్లడైందన్నారు. ఈ నివేదిక బయటకు వస్తే ఆయనపై కేవలం ఆత్మహత్యకు సహకరించారనే ఆరోపణల స్ధానంలో హత్య కేసు అభియోగాలు నమోదయ్యేవని స్వామి పేర్కొన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన తమ మాజీ సహోద్యోగులను కాపాడుకునేందుకు ఈ నివేదికలో అంశాలను బహిర్గతం చేసేందుకు ఢిల్లీ పోలీసులు వెనుకాడుతున్నారన్నారు. ఈ నివేదిక వెలుగుచూడాలని పోలీసులు కోరుకోవడం లేదని, ఏమైనా న్యాయమూర్తులు చివరకు ఓ నిర్ణయం తీసుకుంటారన్నారు. చార్జిషీట్లో సాక్ష్యాల తారుమారు నివేదికను ప్రస్తావించకుంటే పూర్తి విచారణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. 2014, జనవరి 17న సునందా పుష్కర్‌ను ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ గదిలో అనుమానాస్పద పరిస్థితుల్లో విగతజీవిగా గుర్తించారు. కాగా శశిథరూర్ ఇల్లు పునర్మిర్మాణంలో ఉండటంతో థరూర్ దంపతులు హోటల్లో విడిది చేశారు. -
ఆ అల్లర్ల వెనుక కాంగ్రెస్ కుట్ర..
లక్నో : పోలీస్ అధికారి సహా ఇద్దరు మరణించిన బులంద్‌షహర్ అల్లర్ల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వానికి మచ్చ తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ వ్యక్తులే ఈ అల్లర్లకు కుట్ర జరిపారా అనేది తాము తేల్చుతామని స్వామి చెప్పుకొచ్చారు. యూపీ తగలబడుతుంటే యోగి ఆదిత్యానాథ్ ప్రచారంలో బిజీగా మారారనే కాంగ్రెస్ ఆరోపణలపై ఆయన స్పందిస్తూ 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లలో భారత్ తగులబడలేదా అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీలో ఎలాంటి విచారణ లేకుండానే వేలాది మంది అమాయక ప్రజలను జైళ్లలో నిర్భందించిన కాంగ్రెస్ యూపీ సీఎంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. యూపీలోని బులంద్‌షహర్‌లో గోవధ వదంతుల నేపథ్యంలో హింసాత్మక నిరసనలు జరిగిన విషయం తెలిసిందే. అల్లరిమూకలు పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలకు నిప్పంటించి రాళ్లు విసరడంతో ఉద్రిక్తత నెలకొంది. అల్లర్ల ఘటనలో పోలీస్ ఇన్స్పెక్టర్ సుబోధ్ వర్మ సహా స్ధానిక యువకుడు మరణించారు. -
రజనీ, కమల్‌ను నమ్ముకుంటే భవిష్యత్ ఉండదు..!
సాక్షి, చెన్నై : తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీ బీజేపీ అక్కడ పాగా వేయాలని చూస్తోంది. అధికార అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని కొందరు, లేదు డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని మరికొందరు గతంలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా.. సినీ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్‌లు కూడా తమిళ రాజకీయాల్లోకి దూకిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రజనీకాంత్ లేదా కమల్ హాసన్ పార్టీలతో జతకట్టనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. సొంతంగా ప్రయత్నిస్తే కనీస ఓటు బ్యాంక్ అయినా సాధించవచ్చనీ, రజనీ.. కమల్ పార్టీలతో పొత్తు వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని మీడియాకు వెల్లడించారు. ఎవరినో నమ్మి ముందుకెళ్తే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సినీస్టార్ల రాజకీయాలపై బీజేపీ కార్యవర్గ సమావేశంలో చర్చించాలని సూచించారు. కరునానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్‌కే పార్టీని నడిపించే సమర్థత ఉందని వ్యాఖ్యానించారు. -
తెలంగాణ సర్కార్‌పై సుబ్రమణ్యస్వామి ఫైర్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ఫైర్ అయ్యారు. ఈ విషయం గురించి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పరిపూర్ణానంద స్వామిజీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తిస్తుందని లేఖలో పేర్కొన్నారు. గూండాలపై పెట్టే కేసులు స్వామీజీపై పెడతారా అని ప్రశ్నించారు. ఒక సాధువును గూండాల ట్రీట్ చేస్తారా అని తీవ్ర స్థాయిలో సుబ్రమణ్యస్వామి మండిపడ్డారు. పరిపూర్ణానంద స్వామిని నగర బహిష్కరణ చేయడమంటే ఆయనను తీవ్రంగా అవమానించడమేనని, అలాగే ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగిందని లేఖలో తెలియజేశారు. నగర బహిష్కరణ వల్ల ఆయన వాక్స్వాతంత్ర్యం, ఉద్యమ స్వాతంత్ర్యం హక్కులకు భంగం కలిగిందని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. రాముడిపై కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌లో ర్యాలీ తలపెట్టడంతో కత్తి మహేశ్‌తో పాటు పరిపూర్ణానంద స్వామిని కూడా పోలీసులు 6 నెలల పాటు నగర బహిష్కరణ చేసిన సంగతి తెల్సిందే. -
నటీనటులపై ఆరోపణలు చేస్తే ఏం పట్టించుకోరులే..
పెరంబూరు: బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యంస్వామి ఆత్మపరిశీలన చేసుకోవాలని నటి కస్తూరి వ్యాఖ్యానించారు. ఇటీవల ఈమె సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయపరమైన అంశాల గురించి తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వార్తల్లో ఉంటున్నారనే చెప్పాలి. శనివారం ఉదయం మదురై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయరంగప్రవేశం చేస్తున్న నటుడు కమలహాసన్, రజనీకాంత్‌ల గురించి స్పందిస్తూ వారి విషయాన్ని ప్రజలు చూసుకుంటారని అన్నారు. అయితే నటీనటులపై ఆరోపణలు చేస్తే ఏం పట్టించుకోరులే అన్న భావనతో బీజీపీ నాయకుడు సుబ్రహ్మణ్యంస్వామి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తారలు ఎవరో రాసిచ్చిన వాటిని వళ్లివేస్తారని సుబ్రమణ్యంస్వామి లాంటి వారు ఆరోపించే ముందు వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని, ఆ తరవాతనే మాట్లాడాలని అన్నారు. నటుడు విజయకాంత్ మార్పు తీసుకొస్తారని భావించారని, అయితే ఆయన ఆరోగ్యపరమైన కారణాల రీత్యా జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. కమలహాసన్, రజనీకాంత్ విషయాన్ని ప్రజలు చూసుకుంటారని కస్తూరి పేర్కొన్నారు. అయితే సినీతారలు ఇంతకు ముందు రాజకీయ చరిత్రలో స్థానం సంపాదించారని, ఈ విషయాన్ని సుబ్రహ్మణ్యంస్వామి ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆమె అన్నారు. -
అవినీతి నిర్మూలనపై స్వామి స్పందన ఇలా..
న్యూయార్క్ : వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికార పగ్గాలు చేపడుతుందని, దేశంలో మిగిలిన అవినీతి మరకలను రెండో విడత పాలనలో తొలగిస్తుందని పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. కొలంబియా బిజినెస్ స్కూల్లో జరిగిన 14వ వార్షిక భారత వాణిజ్య సదస్సులో పాల్గొనేందుకు స్వామి అమెరికా పర్యటనలో ఉన్నారు. 2019లోనూ తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాలనలో సమర్థనేతగా మోదీకి ఉన్న ప్రతిష్టతో పాటు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటం తమకు సానుకూల అంశాలని వివరించారు. హిందువుల్లో కులాలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయాలన్న ఆకాంక్ష పెరిగిందని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో తాము నిర్మూలించని అవినీతి ఏమైనా ఉంటే దాన్ని తొలగిస్తామని చెబుతూ 2019 ఎన్నికల్లో ప్రజల ముందుకెళతామన్నారు. పటిష్ట, ఐక్య భారత్ నిర్మాణమే తమ లక్ష్యమని, బీజేపీ మైనారిటీలకు వ్యతిరేకం కాదని సుబ్రహ్మణ్య స్వామి స్పష్టం చేశారు. విద్యార్ధులు, విద్యా వేత్తలు, పారిశ్రామికవేత్తలు, అధికారులు హాజరైన ఈ సదస్సును ఉద్దేశించి స్వామి పలు అంశాలపై ప్రసంగించారు. -
అయోధ్య కేసు: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
సాక్షి, న్యూఢిల్లీ : సున్నితమైన బాబ్రీ మసీదు-అయోధ్య రాజజన్మ భూమి భూవివాదం కేసులో సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుతో ప్రమేయమున్న అసలైన కక్షిదారులు (పార్టీలు) మాత్రమే తమ వాదనలు కొనసాగించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ కేసులో తమను కూడా కక్షిదారులుగా భావించి తమ వాదనలు కూడా వినాలంటూ దాఖలైన మధ్యంతర అభ్యర్థనలన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాబ్రీ మసీదు కేసులో అసలైన కక్షిదారుల వాదనలు మాత్రమే కొనసాగించేందుకు అనుమతించాలని, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులు జోక్యం కోరుతూ దాఖలు చేసిన అభ్యర్థనలను తిరస్కరించాలన్న విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీబ్‌తో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో జోక్యం కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే, అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలోని రామ మందిరంలో పూజలు చేసే ప్రాథమిక హక్కు తనకు ఉందని స్వామి వేసిన రిట్ పిటిషన్‌ను పునరుద్ధరించేందుకు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ఆస్తిహక్కు కంటే ప్రాథమిక హక్కు ఉన్నతమైందని తాను పేర్కొన్నట్టు స్వామి పీటీఐతో తెలిపారు. -
స్వామి మరో సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పటికీ ఆమె నామమాత్రంగానే ఉండేవారని, మొత్తం వ్యవహారాలు శశికళ చూసుకునేవారని అన్నారు. ఎక్కడ ? ఎవరు? ఎలా పనిచేస్తున్నారనే విషయాలు శశికళకే ఎక్కువగా తెలుసని అన్నారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిపై శశికళ పరిశీలన ఉండేదని అన్నారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు సాధిస్తాడని తాను ముందే ఊహించానని అన్నారు. అయినా తనకు ముందు నుంచే దినకరన్‌పై సానుభూతి ఉండేదని అన్నారు. శశికళకు అవకాశం ఇస్తే పరిపాలన కూడా చేయగలదనే దోరణిలో స్వామి వ్యాఖ్యలు చేశారు. -
రజనీ.. రాజకీయాలకు సరిపోడు!
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలకు ఏమాత్రం సరిపోడని, ఆయన నటనారంగానికి మాత్రమే పరిమితం అయితే సరిపోతుందని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యం స్వామి మండిపడ్డారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న రాజకీయ పరిస్థితికి రజనీ ఏమాత్రం సరిపోడని, ఆయనకు అసలు రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు లేదా మరే విషయం గురించి అసలు ఐడియా లేదని అన్నారు. రజనీ డైలాగులు బాగా చెప్పి జనాన్ని ఆనందింపజేస్తారని, అందువల్ల ఆయన సినిమాలకు పరిమితం అయితే బాగుంటుందని స్వామి చెప్పారు. అసలు సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడం ఎందుకని, ఇప్పటికే తమిళ రాజకీయాల్లోకి వచ్చిన సినిమావాళ్లు రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేశారని మండిపడ్డారు. కామరాజ్ నాడార్ హయాంలో జరిగిన అభివృద్ధి మొత్తాన్ని సినిమావాళ్లు వచ్చి పాడుచేశారని, అందుకే తాను సినిమావాళ్లు రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తానని స్వామి తెలిపారు. తలైవా బీజేపీలో చేరబోతున్నారని, అందుకే పలువురు పార్టీ పెద్దలు కూడా ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని వచ్చిన కథనాలను ప్రస్తావించగా, ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఆయన ఏ పార్టీలోనూ చేరుతున్నట్లు చెప్పలేమన్నారు.