
సాక్షి, చెన్నై : నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పటికీ ఆమె నామమాత్రంగానే ఉండేవారని, మొత్తం వ్యవహారాలు శశికళ చూసుకునేవారని అన్నారు.
ఎక్కడ ? ఎవరు? ఎలా పనిచేస్తున్నారనే విషయాలు శశికళకే ఎక్కువగా తెలుసని అన్నారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిపై శశికళ పరిశీలన ఉండేదని అన్నారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు సాధిస్తాడని తాను ముందే ఊహించానని అన్నారు. అయినా తనకు ముందు నుంచే దినకరన్‌పై సానుభూతి ఉండేదని అన్నారు. శశికళకు అవకాశం ఇస్తే పరిపాలన కూడా చేయగలదనే దోరణిలో స్వామి వ్యాఖ్యలు చేశారు.