TTV Dhinakaran
-
అన్నాడీఎంకేలో నా పార్టీ విలీనం చేయను: టీటీవీ దినకరన్
చెన్నై: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అన్నాడీఎంకే ఘోర ఓటమికి ఆ పార్టీ నేత ఎడప్పాడి కె పళనిస్వామి క్షమాపణలు చెప్పాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ అన్నారు. తంజావురులో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం డబ్బులు ఉన్నవారి చేతిలో చిక్కుకుందన్నారు.కేవలం కార్యర్తలు మాత్రమే దివంగత జయలలిత అభిమానులని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి నాయకత్వం దారితప్పిందని విమర్శలు చేశారు. అటువంటి పార్టీలో తన పార్టీని ఎట్టిపరిస్థితుల్లోను విలీనం చేయబోనని నకరన్ అన్నారు. అన్నాడీఎంకే తన పార్టీని విలీనం అస్సలు సాధ్యంకాదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 20 స్థానాల్లో అన్నాడీఎంకే ఓటు షేర్ తగ్గిందని తెలిపారు. మరోవైపు ఎన్డీయే కూటమి అనూహ్యంగా 18.5 శాతం ఓటు షేర్‌ను సాధించిందని అన్నారు. అన్నాడీఎంకే తగ్గిన ఓటు షేర్‌ను గమనిస్తే.. ఆ పార్టీకి మైనార్టీ కులాల నుంచి మద్దతు పడిపోయిందన్నారు. విక్రవంది అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎన్డీయే కూటమి పక్షాలు అన్నీ చర్చించుకోని నిర్ణయిస్తామని అన్నారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా టీటీవీ దినకరన్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
పన్నీరు, టీటీవీ, శశికళ మద్దతుదారులే టార్గెట్
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే నుంచి ఉద్వాసనకు గురైన పన్నీరు సెల్వం, టీటీవీ దినకరన్ మద్దతు దారులను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి వ్యూహాలకు పదును పెట్టారు. ముగ్గురు మినహా తక్కిన నాయకులు అందరూ పార్టీలోకి రావాలని పిలుపు నివ్వడమే కాకుండా, ఆయా జిల్లాలోని పార్టీ నేతల ద్వారా మంతనాలు జరిపి పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. వివరాలు.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టినానంతరం మదురై వేదికగా మహానాడును పళణి స్వామి విజయవంతం చేసుకుని మంచి జోష్ మీదున్నారు. మాజీ సీఎం పన్నీరుసెల్వం, అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగం నేత దినకరన్, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న దక్షిణ తమిళనాడులో తన బలాన్ని నిరూపించుకునే విధంగా పళణి స్వామి సఫలీకృతులయ్యారు. మహానాడుకు 15 లక్షల మంది వచ్చినట్టుగా స్వయంగా పళణిస్వామి ధీమా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో దక్షిణ తమిళనాడులో తన బలాన్ని మరింత పెంచుకునేందుకు సిద్ధమయ్యా రు. పార్టీ కిందిస్థాయి కేడర్ అంతా తన వెన్నంటి ఉండడంతో, ద్వితీయ శ్రేణి, జిల్లాస్థాయిలో కీలకంగా ఉన్న పన్నీరు, టీటీవీ, శశికళ మద్దతు నాయకులను తన వైపునకు తిప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ముగ్గురు నాయకులు మినహా తక్కిన వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు. తమ సామాజిక వర్గం అధికంగా ఉన్న మదురై కోటలో పళణి స్వామి తన బలాన్ని నిరూపించుకు వెళ్లడంతో ఆయన వెన్నంటి నడిచేందుకు పన్నీరు, టీటీవీ, శశకళ మద్దతుదారులు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. వీరందరినీ పార్టీలోకి మళ్లీ తీసుకొచ్చే బాధ్యతలను ఆయా జిల్లాలోని నేతలకు పళణి స్వామి అప్పగించారు. -
టీటీవి దివాలా
సాక్షి, చైన్నె: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్‌ను దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టింది. ఈ వివరాలను హైకోర్టుకు శుక్రవారం ఆయన తరఫు న్యాయవాది కుమార్ తెలియజేశారు. సైదాపేటకు చెందిన పార్థిబన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. మనీలాండరింగ్ కేసులో టీటీవీ దినకరన్‌కు రూ.31 కోట్లు జరిమానా విధిస్తూ గతంలో ఈడీ ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. అయితే, ఇంతవరకు ఆ మొత్తాన్ని ఆయన చెల్లించలేదని పేర్కొన్నారు. ఆయన నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ఈడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గంగాపూర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ విచారించింది. టీటీవీ తరఫున హాజరైన న్యాయవాది కుమార్ తన వాదనలో ఈ వ్యవహారంలో సివిల్ కేసు ఉన్నట్టు వివరించారు. అలాగే, టీటీవీ దివాలా తీసిన వ్యక్తిగా ప్రకటించేందుకు ఈడీ కసరత్తులు చేపట్టిందని వాదించారు. ఈ వాదననతో పిటిషన్ విచారణను న్యాయమూర్తుల బెంచ్ ముగించింది. -
మద్దతుదారులతో చిన్నమ్మ మంతనాలు.. టార్గెట్ అదే!
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ తన మద్దతు దారులతో బుధవారం చెన్నైలో సమావేశమయ్యారు. అదే సమయంలో ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తేలేదని పేర్కొనడం గమనార్హం. వివరాలు.. అన్నాడీఎంకేలో చీలికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి టీం బలంగా ఉంది. పన్నీరు సెల్వం శిబిరం ఆ తర్వాతి స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఇక అన్నాడీఎంకే నుంచి చీలికతో ఆవిర్భవించిన అమ్మమక్కల్ మున్నేట్ర కళగం నేత టీటీవీ దినకరన్ బలోపేతమే లక్ష్యంగా కుస్తీలు పడుతున్నారు. ఇక అన్నాడీఎంకేకు తానే ప్రధాన కార్యదర్శి అని, కోర్టు తీర్పు సైతం తనకు అనుకూలంగా వస్తుందన్న ఆశతో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ఉన్నారు. అన్నాడీఎంకేలోని అందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఆమె పదేపదే పిలుపునిస్తున్నా స్పందించే వాళ్లు కరువయ్యారు. గత వారం జరిగిన పన్నీరు శిబిరం సమావేశంలో గానీయండి, మంగళవారం జరిగిన పళనిస్వామి శిబిరం సమావేశంలో కానీయండి ఎవరికి వారు పార్టీని పూర్తిగా తమ గుప్పెట్లోకి తెచ్చుకునే వ్యూహంతో ఉండడంతో చిన్నమ్మ సైతం స్పందించారు. తన మద్దతు దారులతో కలిసి తనదైన వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. బుధవారం చెన్నైలో మద్దతు నాయకులందరిని పిలిపించి తదుపరి కార్యచరణపై దృష్టి పెట్టారు. లోక్ సభ ఎన్నికలలోపు అన్నాడీఎంకేలో ఉన్న వారందరీని ఒకే వేదిక మీదకు తీసుకు వచ్చేందుకు, ప్రజలలోకి చొచ్చుకెళ్లి తన బలాన్ని మరింతగా పెంచుకునే విధంగా చిన్నమ్మ నిర్ణయాలు తీసుకున్నట్టు మద్దతు నేత ఒకరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, చిన్నమ్మ ప్రతినిధిగా అమ్మమక్కల్ మున్నేట్రకళగంకు నేతృత్వం వహిస్తున్న టీటీవీ దినకరన్ మీడియాతో స్పందిస్తూ, తాను అన్నాడీఎంకేతో కలిసే ప్రసక్తే లేదని, తన బలాన్ని తాను చాటుకుంటానని పేర్కొనడం గమనార్హం. -
మాతో టచ్‌లో 10 మంది ఎమ్మెల్యేలు.. త్వరలోనే పార్టీలోకి
తిరువళ్లూరు (చెన్నై): అన్నాడీఎంకేతో 10 మంది డీఎంకే ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనాయకుడు ఎడపాడి పళణిస్వామి చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి మాజీ ఎమ్మెల్యే కేఎస్ విజయకుమార్ కుమార్తె వివాహానికి ఎడపాడి పళణిస్వామి బుధవారం ఉదయం హాజరయ్యారు. ఎడపాడి పళణిస్వామికి పార్టీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వధూవరులను ఆశ్వీరించిన మాజీ ముఖ్యమంత్రి, ఈగువారిపాళ్యం వెళ్లి యూనియన్ చైర్మన్ శివకుమార్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. అనంతరం మీడియా సమావేశంలో ఈపీఎస్ మాట్లాడుతూ అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు డీఎంకేతో టచ్‌లో ఉన్నారనే వార్తలు అవాస్తమన్నారు. డీఎంకే ఏడాదిన్నర పాలనలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు విసిగిపోయారని, వారిపై ఉన్న అసంతృప్తి త్వరలో బయటపడుతుందని వ్యాఖ్యానించారు. డీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని త్వరలో వారిని పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో మేయర్, డిప్యూటి మేయర్లను వెనుక సీట్లు కేటాయించడం వివాదస్పదంగా మారిన విషయంపై స్పందిస్తూ, డీఎంకే కార్పొరేట్ కంపెనీ లాంటింది. ఇక్కడ సీఈఓలుగా ఉన్న ఉదయనిధి స్టాలిన్, కనిమొళికి ఉన్న ప్రాధాన్యత ప్రజాప్రతినిధులకు వుండదన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న ఉదయనిధిను షాడో సీఎంగా ప్రమోట్ చేస్తున్నారని విమర్శించారు. శశికళ– దినకరన్‌లకు చోటులేదు అన్నాడీఎంకేలోకి శశికళ, టీటీవీ దినరకన్ ఓపీఎస్ ఆహ్వానించడం హర్షిందగ్గ విషయం కాదన్నారు. అన్నాడీఎంకేలో కార్యకర్తలే పాలకులని, గతంలో పార్టీకి ద్రోహం చేసిన వారిని మళ్లీ పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తామన్నారు. అన్నాడీఎంకే జనరల్ కమిటీ సమావేశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓపీఎస్ సుప్రీంకోర్టుకు వెళ్తున్న విషయంపై ఎడపాడి సీరియస్ అయ్యారు. సుప్రీంకోర్టుకు వెళ్లినా తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున అంతకు మించి తాము మాట్లాడనన్నారు. వేగంగా స్పందించలేదు అన్నాడీఎంకే కార్యాలయంలోని కీలక డాక్యుమెంట్ల చోరీ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పళణి స్వామి ఆరోపించారు. డీఎంకే హయాంలో సాధారణ ప్రజలకే భద్రత లేనప్పుడు తమ కార్యాలయానికి భద్రత కల్పిస్తారనే నమ్మకం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమిళనాడు సరిహద్దుల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పునరాలోచన చేయాలని కోరారు. -
అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ సాగిస్తున్న పయనానికి తమ మద్దతును అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ప్రకటించారు. ఆమె పర్యటనలకు తమ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతారని తెలిపారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్క వనితామణి కుమారుడు దినకరన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నమ్మ ప్రతినిధిగానే ఆయన రాజకీయ పయనంలో ఉన్నారు. అన్నాడీఎంకేలో చీలికతో ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను ఏర్పాటు చేశారు. తొలుత చిన్నమ్మ ఈ కళగంకు ప్రతినిధిగా పేర్కొన్నా, చివరకు తానే ప్రధాన కార్యదర్శి ఆయన చాటుకున్నారు. అన్నాడీఎంకే కైవసంలో చిన్నమ్మకు కోర్టుల్లో చట్టపరంగా కొత్త చిక్కులు ఎదురు కాకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో తాజాగా చిన్నమ్మ దూకుడు పెంచారు. అన్నాడీఎంకే కేడర్‌ను తన వైపుకు తిప్పుకుని పార్టీ కైవశంకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. చదవండి: (స్వగ్రామానికి రాజ్ కిరణ్ మృతదేహం.. సీఎం స్టాలిన్ రూ. పది లక్షల సాయం) శశికళ పర్యటన ఇలా.. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన్న చిన్నమ్మ శశికళ ఈనెల 27న తంజావూరులో , 28న మదురైలో, 29న రామనాథపురంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. పలు కార్యక్రమాలు, కేడర్‌తో పలకరింపుల దిశగా ఆమె పయనం సాగనుంది. ఈ పర్యటనల విజయవంతంతో పాటుగా ఆమెకు బ్రహ్మరథం పట్టేందుకు అమ్మమక్కల్ మున్నేట్ర కళగం సేనల్ని రంగంలోకి దించేందుకు దినకరన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా, చిన్నమ్మకు తన మద్దతు అని శనివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రకటించారు. -
కమల్, దినకరన్, సీమాన్, కుష్బుకు తప్పని ఓటమి
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు మంత్రులు, సినీ తారలు చతికిలబడ్డారు. గెలుపు కోసం తీవ్రంగా శ్రమించినా, చివరకు ఓటమి తప్పలేదు. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కల్గిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే , అన్నాడీఎంకే కూటముల మధ్య ప్రధాన సమరం నెలకొంది. ఇరు కూటముల్లో ముఖ్య నేతలు, సినీతారలు సైతం పలువురు ఎన్నికల్లో పోటీ చేశారు. అన్నాడీఎంకే తరపున పోటీ చేసిన వారిలో మంత్రులు 12 మంది ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి. పాండియరాజన్, ఎంసీ సంపత్, సీవీ షణ్ముగం, జయకుమార్, కేటి రాజేంద్ర బాలాజీ, బెంజమిన్, ఎంఆర్ విజయభాస్కర్, కామరాజ్, ఓఎస్ మణియన్, రాజలక్ష్మి, వెల్లమండి నటరాజన్, వి.సరోజలు పరాజయం చవిచూశారు. ఈ కూటమి తరపున బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేసిన పలువురు ముఖ్య నేతలకు కూడా ఓటమి తప్పలేదు. కర్ణాటకలో ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి స్వస్థలం కరూర్ జిల్లా అరవకురిచ్చి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అన్నామలై ఓడిపోయారు. దినకరన్, కమల్, సీమాన్‌లకు తప్పని ఓటమి అమ్మమక్కల్ మున్నేట్ర కళగం పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు ఓటమి తప్పలేదు. కోవిల్ పట్టి నుంచి ఆయన ఓటమి పాలయ్యారు. మూడో కూటమితో ఎన్నికల్ని ఎదుర్కొన్న డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విజయకాంత్ విరుదాచలం నుంచి పరాజయం పాలయ్యారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్న నామ్ తమిళర్ కట్చి నేత, సినీ నటుడు, దర్శకుడు సీమాన్ తిరువొత్తియూరు నుంచి ఓటమి పాలయ్యారు. కోయంబత్తూరు దక్షిణం నుంచి పోటీ చేసిన మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమలహాసన్ సాయంత్రం వరకు కాస్త మెజారిటీతో ముందుకు సాగారు. ఆ తదుపరి రౌండ్లలో మెజారిటీ తగ్గడంతో ఆయనకు పరాజయం తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నటి కుష్బు చెన్నై థౌజండ్ లైట్స్ నుంచి పోటీ చేశారు. గతంలో డీఎంకే, కాంగ్రెస్‌లలో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని దృష్ట్యా, ఈసారి బీజేపీలో చేరిన ఆమె అతికష్టం మీద సీటు దక్కించుకున్నారు. గెలుపు లక్ష్యంగా థౌజండ్ లైట్స్‌లో శ్రమించినా ఫలితం దక్కలేదు. -
దినకరన్ యూటర్న్.. చిన్నమ్మ నిర్ణయం ఏమిటో?
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ఉపకార్యదర్శి పదవీ వ్యవహారంలో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ యూటర్న్ తీసుకున్నారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు, ఈ కేసు నుంచి వైదొలుగుతున్నట్టు కోర్టుకు దినకరన్ సూచించారు. దీంతో ఈ వ్యవహారంలో శశికళ నిర్ణయం ఎమిటో అన్న ప్రశ్న బయలుదేరింది. జయలలిత మరణంతో 2017లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికైన విషయం తెలిసిందే. ఆమె ప్రతినిధిగా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి పదవిని దినకరన్ చేపట్టారు. చిన్నమ్మ జైలుకు వెళ్లడం తర్వాత పరిణామాలతో అన్నాడీఎంకే నుంచి ఇద్దరు గెంటి వేయబడ్డారు. పన్నీరు, పళనిల ఏకంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి రద్దయింది. అన్నాడీఎంకేలో కొత్తగా సమన్వయ కమిటీ ఏర్పాటైంది. దీనిని వ్యతిరేకిస్తూ శశికళ, దినకరన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వెనక్కి తగ్గిన దినకరన్.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని చిన్నమ్మ, ఉప ప్రధాన కార్యదర్శి తానేనంటూ దినకరన్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణ మూడేళ్లుగా మద్రాసు హైకోర్టులో సాగింది. తర్వాత ప్రత్యేక కోర్టుకు మార్చారు. అదే సమయంలో ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో– కన్వీనర్ పళనిస్వామి, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ రిట్ దాఖలు చేశారు. సోమవారం పిటిషన్లన్నీ ప్రత్యేక కోర్టు ముందు విచారణకు రాగా, దినకరన్ తరఫున న్యాయవాదులు హాజరై యూటర్న్ వాదనలు వినిపించారు. దినకరన్ తరఫున కోర్టుకు లేఖ సమర్పించారు. అందులో తాను అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏర్పాటు చేసినట్టు, ఈ పార్టీకి తానే ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నట్టు వివరించారు. ఈ దృష్ట్యా, అన్నాడీఎంకే వ్యవహారాలపై తాను దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్టు, ఈ కేసు నుంచి వైదొలుగుతున్నట్టు దినకరన్ స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో మరో పిటిషనర్ కూడా ఉన్నారని, వారి మాటేంటో అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ కేసులో మరో పిటిషనర్‌గా ఉన్న శశికళ తన నిర్ణయం ఏమిటో ఏప్రిల్ 9వ తేదీలోపు కోర్టుకు తెలియజేయాలని పేర్కొంటూ, అదే రోజుకు పిటిషన్ విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. చదవండి: రాసలీలల కేసు: ఆమె కోసం హైదరాబాద్‌కు.. -
పన్నీరు వస్తే.. ఆహ్వానానికి రెడీ
సాక్షి, చెన్నై: విశ్రాంతిలో ఉన్న శశికళ ఇక, రాజకీయ దూకుడు పెంచబోతున్నారు. కేడర్‌లోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈనెల 24న జయలలిత జయంతి రోజున ముఖ్యులతో భేటీ, ఆలయ దర్శనానికి చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. జైలు నుంచి టీనగర్ ఇంటికి చేరిన శశికళ వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్భంధంలో ఉన్నట్టు సమాచారం వెలువడింది. వారం రోజులు చిన్నమ్మ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 22న జయలలిత జయంతి సందర్భంగా రాజకీయ వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు శశికళ నిర్ణయించారు. వైద్యులతో సంప్రదించినానంతరం కేడర్‌లోకి చొచ్చుకెళ్లే రీతిలో కార్యక్రమాలపై దృష్టి పెట్టబోతున్నారు. జయంతి రోజున ఇంటి వద్దే జయలలిత చిత్ర పటానికి నివాళర్పించే శశికళ ముఖ్యులతో భేటీకి నిర్ణయించారు. వీరితోపాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకు చెందిన వారితో భేటీ కానుండడంతో ఇక రాజకీయంగా దూకుడు పెంచ వచ్చన్న చర్చ జోరందుకుంది. అదేరోజు నగరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలకు తగ్గ ఏర్పాట్లలో శశికళ ఉన్నట్టు సమాచారం. పన్నీరు వస్తే ఆహ్వానం.. సీఎం కుర్చీలో తనను కూర్చోబెట్టడంలో చిన్నమ్మ పాత్ర ఏమిటో అన్న విషయం గురించి పన్నీరుకు బాగానే తెలుసునని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ వ్యాఖ్యానించారు. శనివారం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ ఆయన భరతుడు అయితే, చిన్నమ్మ పక్షాన నిలబడేందుకు సిద్ధంగా ఉంటే, ఆహ్వానించేందుకు తామూ రెడీ అని ప్రకటించారు. ఆయన అసంతృప్తితో ఉన్న మాట వాస్తవేమని, ఆయన వస్తానంటే, ఆదరించేందుకు చిన్నమ్మ సిద్ధమేనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాము బీజేపీతో సంప్రదింపులు జరపలేదని, ఎవ్వరిపై ఓత్తిడి తీసుకు రాలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎంకే అధికారంలోకి రాకూడదన్నదే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. జయంతి సభలు.. ఈనెల 24న జయలలిత జయంతి వేడుకల్ని బ్రహ్మాండంగా నిర్వహించేందుకు అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వేర్వేరుగా సిద్ధమయ్యాయి. సేవా కార్యక్రమాలో పరుగులు తీయనున్నాయి. అన్నాడీఎంకే నేతృత్వంలో ప్రజాకర్షణ దిశగా బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నై ఆర్కేనగర్లో జరిగే సభలో సీఎం పళనిస్వామి, బోడినాయకనూర్‌లో డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వం పాల్గొననున్నారు. -
అమ్మ జయంతి తరువాత చూడండి
చెన్నై: జయలలిత జయంతి రోజు ఈనెల 24వ తేదీ తరువాత ఏం జరుగుతుందో చూడండి, చోటుచేసుకునే అనూహ్య రాజకీయ పరిణామాలకై వేచి ఉండండని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (అమ్మముక) ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ అన్నాడీఎంకే శ్రేణులకు సవాల్ విసిరారు. నామక్కల్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాదరణతో మళ్లీ అధికారంలోకి వస్తాం, ఎంజీఆర్, జయలలిత చేత దుష్టశక్తి అని పిలువబడే డీఎంకేను అధికారంలోకి రానిస్తే ప్రజలు బాధితులుగా మారతారని అన్నాడీఎంకే ప్రచారం చేస్తోందన్నారు. అమ్మముక ప్రాబల్యం దక్షిణ తమిళనాడులో మాత్రమేనని కొందరు మంత్రులు ఎద్దేవా చేస్తున్నారన్నారు. అయితే శశికళ విడుదల కాగానే రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు తరలివస్తున్నారన్నారు. శశికళకు స్వాగతానికి రూ.198 కోట్లు ఖర్చుచేశారని దుష్ప్రచారం చేస్తున్నారని, అన్నాడీఎంకే, డీఎంకే 60:40 శాతం నిష్పత్తితో చేతులు కలిపారని అన్నారు. చెన్నై కేకే నగర్లో నా గెలుపుగా రాబోయే ఎన్నికల్లో అమ్మముక పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమ్మ జయలలిత జయంతి తరువాత ఏమవుతుందో చూడండి అని అన్నారు. -
శశికళ వర్గానికి తమిళ సీఎం స్ట్రాంగ్ కౌంటర్
చెన్నె: జైలు శిక్ష అనుభవించి చెన్నె చేరుకున్న శశికళపై తమిళనాడు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టింది. నిన్న ఆస్తుల జప్తు చేయగా తాజాగా నేడు ముఖ్యమంత్రి నేరుగా ఆమెపై, ఆమె వర్గానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దివంగత నాయకురాలు జయలలితకు అసలైన వారసులం తామేనని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. అన్నాడీఎంకేని నాశనం చేయడానికి విష శక్తులు కుట్రలు పన్నుతున్నాయంటూ వి.కె.శశికళపై పరోక్షంగా విమర్శించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పళని మాట్లాడారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన వాళ్లు పార్టీని తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి పార్టీ నుంచి తొలగించామని, మళ్లీ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి పార్టీలోకి చేర్చుకోబోమని స్పష్టం చేశారు. ఎన్ని జిమ్మిక్కులకు పాల్పడినా.. వారి ఆటలు సాగవని పేర్కొన్నారు. టీటీవీ దినకరన్ వర్గం తలకిందులుగా తపస్సు చేసినా వారు అనుకున్నది ఎన్నటికీ జరగదని ప్రకటించారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తమకే ఉన్నాయని సీఎం పళని స్వామి తెలిపారు. తమిళనాడులో కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శశికళ రాకతో రాజకీయం రాజకీయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే తన పార్టీనేనని, రెండాకుల గుర్తు కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల్లో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈసీ దక్షిణాది పర్యటన: 15 తర్వాత మినీ సమరం? -
కమల్ హాసన్‌కు నిరాశ.. టార్చ్‌లైట్ పోయే..
సాక్షి, చెన్నై: మక్కల్ నీది మయ్యంకు టార్చ్‌లైట్ చిహ్నం దూరమైంది. ఆ చిహ్నాని ఎంజీఆర్ మక్కల్ కట్చికి దక్కింది. తమ చిహ్నం దూరం కావడంతో కమల్ హాసన్‌కు నిరాశ తప్పలేదు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌కు ప్రెషర్ కుక్కర్ చిక్కడంతో ఆ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా కమలహాసన్ మక్కల్ నీదిమయ్యం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కొంత మేరకు ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు నినాదంతో ప్రచార ప్రయాణాన్ని సైతం మదురై నుంచి మొదలెట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కేటాయించిన టార్చ్‌లైట్ ను పార్టీ చిహ్నంగా మార్చేసుకుని ప్రచార పయనంలో దూసుకెళ్తున్న కమల్‌కు నిరాశ తప్పలేదు. ఎన్నికల కమిషన్ ఆ టార్చ్‌లైట్ చిహ్నంను కమల్‌కు దూరం చేసింది. ఈ చిహ్నంను ఎంజీఆర్ మక్కల్ కట్చికి తాజాగా అప్పగించడంతో కమల్ వర్గానికి షాక్ తప్పలేదు. పుదుచ్చేరిలో మాత్రం మక్కల్ నీది మయ్యంకు టార్చ్‌లైట్‌ను చిహ్నంగా కేటాయించడం కాస్త ఊరట. అన్నాడీఎంకేను చీల్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న శశికళ ప్రతినిధి దినకరన్ పంతం నెగ్గించుకున్నారు. దక్కిన ప్రెషర్ కుక్కర్.... అమ్మ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆర్కేనగర్ నుంచి దినకరన్ ప్రెషర్ కుక్కర్ చిహ్నంపై పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ చిహ్నం కోసం పోరాటం చేసి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఈసారి ముందుగానే మేల్కొన్న దినకరన్ ప్రెషర్ కుక్కర్ కోసం పట్టు బట్టి సొంతం చేసుకున్నారు. తమ పార్టీ చిహ్నం తమకు దక్కడంతో ఆ పార్టీ వర్గాలు మంగళవారం సంబరాల్లో మునిగారు. బాణసంచాను హోరెత్తించారు. నటుడు సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చికి మళ్లీ రైతు చిహ్నం దక్కింది. చదవండి: ('అధికారంలోకి వస్తే మధురై రెండో రాజధాని') టార్చ్ పోయినా..లైట్ హౌస్లా ఉంటాం.. ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్ బృందం తమ వాహనాల్లో ఉన్న టార్చ్‌లైట్ చిహ్నాల్ని తొలగించారు. ఇంకా తమకు ఎన్నికల కమిషన్ చిహ్నం కేటాయించని దృష్ట్యా, టార్చ్‌లైట్ దక్కించుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. టార్చ్‌లైట్ దూరం విషయంగా తేనిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్‌ను ప్రశ్నించగా, టార్చ్‌లైట్ దూరమైనా లైట్‌హౌస్ వలే ప్రజలకు వెలుగు నిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దోపిడీదారులు నోట్లను చల్లి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చిహ్నం విషయంగా తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రజనీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలన్న కాంక్షతో, అందుకు తగ్గ సిద్ధాంతాలతో వస్తే, ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని, ఇప్పటికే ఈ విషయాన్ని తాను స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. తామిద్దరి మధ్య ఒక్క ఫోన్‌కాల్ చాలు అని, ప్రజల సంక్షేమం, మార్పు, మంచి కోసం ఇగోను పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. -
అమ్మ శిబిరంలో కమలం పంచాయితీ!
2021 ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా అన్నాడీఎంకే బలాన్ని పెంచేందుకు బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఢిల్లీ వెళ్లిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ రహస్యంగా బీజేపీ నేతలను కలిసినట్టుగా వస్తున్న ప్రచారం కొత్త చర్చకు దారి తీసింది. సాక్షి, చెన్నై: దివంగత జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో చీలికలు వచ్చాయి. పన్నీరు, పళని నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఓ వైపు, జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ ప్రతినిధి దినకరన్ నేతృత్వంలోని అమ్మా మక్కల్ మునేట్ర కళగం మరో వైపు అన్నట్టుగా ఓటు బ్యాంక్, సభ్యత్వం ముక్కలైంది. ఈ పరిస్థితుల్లో చిన్నమ్మ శశికల జనవరిలో విడుదల కాగానే రాజకీయ పరిణామాలు తమిళనాట అనూహ్యంగా మారుతాయన్న చర్చ జోరందుకుంది. ఇదే జరిగిన పక్షంలో అన్నాడీఎంకేకు తీవ్ర నష్టం తప్పదన్న ప్రచారం ఊపందుకుంది. ఈ పరిస్థితుల్లో అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ హఠాత్తుగా ప్రత్యేక విమానంలో మిత్రుడు, సహాయకుడితో కలిసి ఆదివారం ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. చిన్నమ్మ విడుదల విషయంగా ఢిల్లీలోని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులను కలిసేందుకు దినకరన్ వెళ్లినట్టు ఆ కళగం వర్గాలు పేర్కొంటున్నాయి. (జనవరి 27న శశికళ విడుదల!) ఢిల్లీ పెద్దల పంచాయితీ.. 2021 ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించే అవకాశం ఉందని వచ్చిన సర్వేల నేపథ్యంలో బీజేపీ పెద్దలు వ్యూహాలకు పదును పెట్టారు. అందుకే దినకరన్‌ను ఢిల్లీకి పిలిపించినట్టు సమాచారం. ఇందుకు అనుగుణంగానే ఢిల్లీలో తిష్ట వేసిన దినకరన్ అక్కడి పెద్దలతో రహస్య భేటీల తదుపరి పరప్పన అగ్రహార చెరకు వెళ్లి ఢిల్లీ పెద్దల పంచాయితీ విషయాన్ని చిన్నమ్మ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టే దినకరన్ పర్యటన ఉండబోతోందని అమ్మ శిబిరం వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. (200 సీట్లే లక్ష్యం!: డీఎంకే మిత్రుల్లో కలవరం) అన్నాడీఎంకేతో కూటమి కొనసాగుతుందని, ఇది మరింత బలాన్ని పుంజుకోనున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ వ్యాఖ్యానించడం ఆలోచించ దగ్గ విషయమే. అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంద ని, దానిని భర్తీ చేయడానికి తగ్గట్టుగా ఆ పార్టీకి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో దిండుగల్‌కు చెందిన సూర్యమూర్తి పిటిష న్ వేయడంతో రాజకీయ ఆసక్తి పెరిగింది. -
శశికళ చేతిలోకే అన్నాడీఎంకే!
సాక్షి, వేలూరు: జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే శశికళ చేతిలోకి అన్నాడీఎంకే పార్టీ వెళ్లడం కాయమని పార్లమెంట్ సభ్యులు కార్తీ చిదంబరం తెలిపారు. ఆయన బెంగళూరు నుంచి చెన్నైకి కారులో వచ్చారు. ఆ సమయంలో ఆంబూరు బస్టాండ్ ప్రాంతంలో తిరుపత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభు అధ్యక్షతన పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో కార్తీ చిదంబరం విలేకరులతో మాట్లాడారు. కందశష్టి కవశాన్ని అవమానం పరచడాన్ని మత నమ్మకం ఉన్న వారు ఎవరూ వదిలి పెట్టరన్నారు. మురుగుడి భక్తుడిగా ఉన్న తానే వాటిని అంగీకరించనన్నారు. ఒక మతానికి చెందిన దేవున్ని అవమాన పరిచడం సరికాదు. దేవుళ్లను అవమాన పరిచేందుకు పూనుకోకూడదన్నారు. (సీఎం నివాసంగా వేద నిలయం..) శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అన్నాడీఎంకే పార్టీ పూర్తి అ«ధికారాలను ఆమె చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. టీటీవీ దినగరన్ మరోసారి అన్నాడీఎంకే పార్టీలో చేరిపోతారన్నారు. వారి కుటుంబం అదుపులోనే ఉంటుందన్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి కాంగ్రెస్ ఇదివరకే తెలిపిన విధంగా ఒక్కొక్కరికీ రూ.10 వేలు అందజేసి ఉండాలన్నారు. అయితే రూ. 1000 మాత్రమే అందజేశారని చెప్పారు. బాధితులకు అదనంగా నివారణ సాయం అందజేయాలన్నారు. ప్రస్తుతం లాక్డౌన్ అమలులో ఉన్నందున నిబంధనలుకు విరుద్ధంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరడంతో ఆంబూరు పోలీసులు కార్తీ చిదంబరంతో పాటు జిల్లా అధ్యక్షులు ప్రభుతో పాటు 50 మంది కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. (వేదనిలయంలోకి దీపక్) -
దినకరన్‌కు షాక్.. భారీగా నగదు పట్టివేత
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో నోట్ల కట్టల వెల్లువ కొనసాగుతోంది. ఆదాయపన్ను శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడుతోంది. తాజాగా తేని జిల్లా ఆండిపట్టిలో ఈసీ, ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 1.48 కోట్ల నగదు పట్టుబడింది. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మునేట్ర కజగం(ఏఎంఎంకే) నేత నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆండిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. వార్డు నంబర్లు, ఓటర్ల సంఖ్యలు రాసివున్న కవర్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ. 300 చొప్పున నగదు ఉంచినట్టు గుర్తించారు. అంతేకాదు ఏఎంఎంకే అభ్యర్థికి టిక్ పెట్టిన పోస్టల్ బ్యాలెట్ పేపర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకే సోదాలు మొదలు పెట్టారు. ఐటీ అధికారులను అడ్డుకునేందుకు ఏఎంఎంకే కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి వారిని చెదరగొట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, డీఎంకే అభ్యర్థికి చెందిన రూ. 11.53 కోట్ల నగదు పట్టుబడటంతో వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం ఉత్తర్వులిచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో ఐటీ దాడులు చేయిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కూడా రేపు జరగనుంది. (చదవండి: వెల్లూరులో ఎన్నిక రద్దు) -
నాకెవ్వరూ పోటీ కాదు: స్టాలిన్
చెన్నై: కేంద్రంలో బీజేపీని మళ్లీ గద్దెనెక్కకుండా చేయడం, రాష్ట్రంలో అన్నాడీఎంకేను ఓడించడమే తమ లక్ష్యమని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం మీడియాకు తెలిపారు. టీటీవీ దినకరన్ ఆధ్వర్యంలో అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) దక్షిణ చెన్నై సెక్రెటరీగా వ్యవహరిస్తున్న వీపీ కళైరాజన్ ఈ రోజు మధ్యాహ్నం డీఎంకేలో చేరారు. తిరుచ్చిలో జరిగిన ఒక సభలో కళైరాజన్‌ను పార్టీలోకి ఆహ్వానించిన స్టాలిన్ మాట్లాడుతూ బీజేపీ, అన్నాడీఎంకే ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఏఎంఎంకేతోపాటు వివిధ పార్టీలకు చెందిన చాలామంది నాయకులు తమ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. బీజేపీ, అన్నాడీఎంకేలను ఎదుర్కోవడం తమతోనే సాధ్యమని మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. పార్టీలో చేరిన కళైరాజన్ మాట్లాడుతూ ‘తమిళనాడును కాపాడే సత్తా, ద్రవిడ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే తెగువ స్టాలిన్‌కే ఉన్నాయన్నారు. కళైరాజన్‌ను ఏఎంఎంకే నుంచి దినకరన్ బుధవారం బహిష్కరించారు. వీ సెంథిల్ తర్వాత ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రెండో నేత కళైరాజన్. -
సీఎం అయ్యేందుకు పన్నీర్‌సెల్వం కుట్ర
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సంచలన ప్రకటన చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాటి పళనిస్వామిని పదవి నుంచి తప్పించేందుకు డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. చెన్నైలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతేడాది జూలై 12న ఓ మిత్రుడి చొరవతో తనను పన్నీర్‌సెల్వం కలుసుకున్నారని దినకరన్ తెలిపారు. ఈ సందర్భంగా తనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రతిపాదించారని వెల్లడించారు. ‘ఇద్దరం కలిసి పళనిస్వామిని అధికారం నుంచి దించేద్దాం’ అని తనతో చెప్పారన్నారు. కేవలం పళనిస్వామిని తప్పించి సీఎం పీఠం ఎక్కాలన్న అత్యాశతో పన్నీర్‌సెల్వం తనను కలిశారని విమర్శించారు. గత నెలలో మరోసారి తనను కలిసేందుకు పన్నీర్‌సెల్వం యత్నించగా, తాను అంగీకరించలేదని చెప్పారు. 2017లో జరిగిన సమావేశం సందర్భంగా అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళపై తిరుగుబాటు చేసినందుకు ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. పన్నీర్‌సెల్వం తనను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ విషయాలను బయటపెట్టాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయమై పన్నీర్‌సెల్వంను మీడియా ప్రశ్నించగా..‘అదంతా గడిచిపోయిన కథ‘ అంటూ క్లుప్తంగా జవాబిచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఏకమయ్యాం.. రాష్ట్రాభివృద్ధి కోసమే పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు ఏకమయ్యాయని మంత్రి తంగమణి అన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వీలుకాకపోవడంతో ప్రజలు, పార్టీలో గందరగోళం సృష్టించేందుకు దినకరన్ కొత్త నాటకాలు మొదలెట్టాడని ఆరోపించారు. 18 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కేసులో విజయం సాధిస్తామని అన్నాడీఎంకే నేత మురుగవేల్ అన్నారు. -
మరో కొత్తపార్టీ!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ శనివారం ఆవిర్భవించింది. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం పేరిట పార్టీని టీటీవీ భాస్కరన్ ఏర్పాటు చేశారు. నీలంకరైలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరును, జెండాను భాస్కరన్ ప్రకటించారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి కేంద్రంగా చిన్నమ్మ శశికళ కుటుంబం ఒకప్పుడు సాగించిన రాజకీయదందా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మ జయలలిత, నెచ్చెలి శశికళను అడ్డం పెట్టుకుని ఈ కుటుంబం మన్నార్‌కుడి మాఫియాగా ఎదిగిందని చెప్పవచ్చు. అయితే, జయలలిత మరణం తదుపరి పరిణామాలు, చిన్నమ్మ జైలు జీవితం వెరసి ఈ కుటుంబాన్ని కష్టాలపాలు చేశాయి. చిన్నమ్మ గుప్పెట్లో ఉన్న అన్నాడీఎంకే చేజారడం పెద్ద షాక్. ఆ తదుపరి పరిణామాలు చిన్నమ్మ ఫ్యామిలీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఐటీ దాడులు ఓ వైపు, పాత కేసుల విచారణలు మరోవైపు ఈ కుటుంబానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ ఉనికి చాటుకునే రీతిలో చిన్నమ్మ ప్రతినిధిగా, ఆమె అక్క వనితామణి కుమారుడు దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే కేడర్‌ను చీల్చడంలో సఫలీకృతుడైన దినకరన్, తన బలాన్ని చాటుకునేందుకు రంకెలు వేస్తున్నారు. ఈ పార్టీ రూపంలో చిన్నమ్మ సోదరుడు, మేనమామ దివాకరన్‌తో ఏర్పడ్డ విభేదాలు దినకరన్‌కు కొత్త చిక్కుల్ని తెచ్చి పెట్టాయి. చిన్నమ్మ కుటుంబం నుంచి మరో పార్టీ దివాకరన్ నేతృత్వంలో పుట్టుకు వచ్చింది. తన వారసుడు జై ఆనంద్‌ను రాజకీయంగా ఉన్న స్థానంలో కూర్చొబెట్టడం లక్ష్యంగా అన్నాద్రావిడర్ కళగంను దివాకరన్ ప్రకటించుకున్నారు. ఈయన సైతం తన బలాన్ని చాటే దిశగా కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో అన్నయ్య దినకరన్, మేనమామ దివాకరన్లనుఢీకొట్టే రీతిలో చిన్నమ్మ కుటుంబం నుంచి మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఈ పార్టీని దినకరన్ సోదరుడు, నటుడు టీటీవీ భాస్కరన్ ప్రకటించారు. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం: కుటుంబ విభేదాల నేపథ్యంలో అన్నయ్య దినకరన్, మేనమామ దివాకరన్ బాటలో కొత్త పార్టీ ప్రకటనకు గత నెల భాస్కరన్ సిద్ధమయ్యారు. అయితే, భాస్కరన్ మహానాడును తలపించే రీతిలో తిరుత్తణి వేదికగా పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే, అధికార పక్షం భాస్కరన్‌కు చెక్ పెట్టే రీతిలో వ్యవహరించింది. హంగామాతో సత్తా చాటుకోవాలనుకున్న భాస్కరన్ మహానాడుకు అనుమతి నిరాకరించారు. దీంతో వెనక్కు తగ్గిన భాస్కరన్, హంగు ఆర్భాటాలు లేకుండా, నిరాడంబరంగా శనివారం నీలాంకరై వేదికగా తన కొత్త పార్టీని ప్రకటించుకున్నారు. ఉదయం తన నివాసంలో దురైరాజ్ – ఝాన్సీ దంపతులకు వివాహాన్ని తన చేతుల మీదుగా భాస్కరన్ జరిపించారు. అనంతరం కొత్త పార్టీని మద్దతుదారులు, అభిమానుల సమక్షంలో ప్రకటించారు. అన్నా జయంతిని పురస్కరించుకుని పార్టీని ప్రకటించాలన్న లక్ష్యంతో ఈ ప్రకటన చేస్తున్నట్టు వివరించారు. అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగంగా పార్టీ పేరును ప్రకటించారు. పై భాగంలో ఆరంజ్ (కమలా పండు) రంగు, మధ్య భాగంలో పచ్చ, కింది భాగంలో నలుపు వర్ణంతో కూడి మధ్య భాగంలో ఎంజీఆర్ ముఖ చిత్రంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు. భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ భారీ ఎత్తున పార్టీని ప్రకటించాలని తాను సంకల్పించినా, అందుకు తగ్గ అనుమతుల్ని ఈ పాలకులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. తన పార్టీని చూసి పాలకులకే గుబులు పట్టుకుందంటే, ఇక, మిగిలిన పార్టీలకు తనను చూస్తే ముచ్చెమటలేనని ధీమా వ్యక్తం చేశారు. అన్నా జయంతి సందర్భంగా పార్టీని ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం నిరాడంబర ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. త్వరలో పార్టీ కార్యవర్గం ప్రకటించనున్నట్టు తెలిపారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగుతుందని ప్రకటించారు. మోదీని మళ్లీ పీఎం చేయడం లక్ష్యంగా శ్రమిస్తామన్నారు. అవినీతి రహిత పాలన లక్ష్యంగా ముందుకు సాగే వాళ్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాని తెలిపారు. అన్నా, ఎంజీఆర్ మద్దతుదారులు, అభిమానుల్ని కలుపుకుని బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. కాగా, అన్నయ్య మద్దతుదారుల్ని ఇరకాటంలో పెట్టే రీతిలో తమ్ముడు పార్టీ పేరును ప్రకటించడం గమనార్హం. అన్నయ్య దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను ప్రకటించుకున్నారు. ఇక అన్నా, ఎంజీఆర్ మక్కల్ కళగం (ఏఎంఎంకే)ను తమ్ముడు ప్రకటించడం గమనార్హం. -
అన్నాడీఎంకే తీవ్ర నిర్ణయం.. 130మందిపై వేటు
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలోని ఓ ఐదారుగురు సొంత ప్రయోజనాలకోసం పనిచేస్తున్నారని, వారు తమ పద్దతిని మార్చుకోవాలని అన్నాడీఎంకే రెబల్ అభ్యర్థి, ఎమ్మెల్యే దినకరన్ అన్నారు. లేకపోతే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అదే ప్రభుత్వం విషయంలో కూడా జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. కాగా, దీనిపై మీడియా ప్రతినిధులు పన్నీర్‌ను ప్రశ్నించగా 'అదంత దినకరన్ కల మాత్రమే. ఆయన కలలపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను' అని పన్నీర్ చెప్పారు. కాగా, తమకు రెబల్‌గా తయారైన టీటీవీ దినకరన్ కోటను బద్ధలు కొట్టే కార్యక్రమాల్లో అధికార అన్నాడీఎంకే పార్టీ వేగం పెంచింది. దాదాపు 130మంది దినకరన్ మద్దతుదారులుగా గుర్తించి పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల నుంచి వీరిని తొలగించినట్లు ప్రకటించింది. పార్టీ సమన్వయ కర్త, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, సహ సమన్వయ కర్త, సీఎం కే పళనిస్వామి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. తిర్పూర్, పుదుకొట్టాయ్, ధర్మపురి ప్రాంతాల్లోని పార్టీకి సంబంధించిన వారిని దినకరన్ మద్దతుదారులుగా గుర్తించి తొలగించినట్లు తెలిపారు. వీరిలో 65మంది ఒక్క తిర్పూర్ నుంచే అధికంగా ఉన్నారు. -
46 మంది అన్నాడీఎంకే నేతలపై వేటు
సాక్షి ప్రతినిధి, చెన్నై: దినకరన్‌కు మద్దతుగా నిలిచారనే ఆరోపణల కారణంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల సహా 46 మంది పార్టీ జిల్లా కార్యదర్శులపై సీఎం ఎడపాటి పళనిస్వామి గురువారం బహిష్కరణ వేటు వేశారు. వారందరినీ పార్టీ పదవులు, అన్నాడీఎంకే ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వేటు పడిన వారిలో మాజీ ఎమ్మెల్యే ఆర్ సామితో పాటు మదురై, విల్లుపురం, ధర్మపురి, తిరుచ్చిరాపల్లి, పెరంబులూరు జిల్లాలకు చెందిన నాయకులు ఉన్నారు. కాగా, జయలలిత మరణంపై విచారణ జరుపుతున్న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అర్ముగస్వామి నేతృత్వంలోని కమిషన్ జయలలిత స్నేహితురాలు శశికళకు సమన్లు జారీ చేసినట్లు ఈ నెల 22న కమిషన్ కార్యాలయం వెల్లడించింది. శశికళ బెంగళూరు జైల్లో ఉన్నందున లిఖితపూర్వకంగా లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం నమోదు చేసుకుంటామని, తప్పనిసరైన పక్షంలో నేరుగా విచారణ జరుపుతామని తెలిపింది. కాగా, జయ చికిత్సపై ఆధారాలు అందజేయాల్సిందిగా ఈనెల 22వ తేదీన ఈ మెయిల్ ద్వారా కమిషన్ నుంచి వచ్చిన సమన్లను జైలు అధికారులు శశికళ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మెయిల్ ద్వారా వచ్చిన సమన్లను ఆమె నిరాకరించినట్లు, నేరుగా వచ్చి సమన్లు అందజేస్తేనే స్వీకరిస్తానని ఆమె వివరణ ఇచ్చినట్లు జైలు వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, ఈ మెయిల్ ద్వారా శశికళకు సమన్లు పంపలేదని విచారణ కమిషన్ వివరణ ఇచ్చింది. -
‘ఆయన ఉన్నంత వరకు ఆ పార్టీ గెలవదు’
సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో తమిళనాట రాజకీయాలు రోజుకో మలువు తిరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి డీఎంకే నేత స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీలో స్టాలిన్ ఉన్నంత వరకు డీఎంకే గెలవదని జోస్యం చెప్పారు. ఆర్కే నగర్ ఓటమిపై వెంటనే సమీక్ష జరపాలని అళగిరి డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో డీఎంకే విఫలమవుతోందని ఆయన విమర్శించారు. అంతేకాక క్షేత్రస్థాయిలో పార్టీ ప్రక్షాళన జరగాలని అళగిరి అభిప్రాయపడ్డారు. ఆర్కే నగర్లో టీటీవీ దినకరన్ విజయం సాధించడంతో అధికార, విపక్ష పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
దినకరన్ గెలుపు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత జయలలిత మరణం తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న తమిళనాడు రాజకీయాల్లో ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితం సహజంగానే ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన టీటీవీ దినకరన్ భారీ మెజారిటీతో గెలుపొందడం అధికార అన్నాడీఎంకేకు మాత్రమే కాదు... ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు కూడా ఊహించని పరిణామమే. అలాగే తెరవెనక ఉంటూ రాష్ట్ర రాజకీయాలను శాసి స్తున్నదని పేరుబడ్డ బీజేపీ అధిష్టానానికి సైతం ఇది షాక్. జయలలిత మరణా నంతరం ఆమె సన్నిహితురాలు శశికళ ముఖ్యమంత్రి కావాలని ఆశించి అప్పటి సీఎం పన్నీర్ సెల్వంతో రాజీనామా చేయించడం... సీఎం పదవి చేతికందేలోపే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు శిక్షపడటం, అనంతరం ఆ వర్గానికి చెందిన పళనిస్వామి ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగాయి. కానీ శశికళ మేన ల్లుడు దినకరన్ రంగ ప్రవేశం తర్వాత పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు ఏకమై ఆయన్ను ఏకాకిని చేశాయి. ఆ తర్వాత దినకరన్‌ను కేసులు చుట్టు ముట్టాయి. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆర్కే నగర్ ఓటర్లు ఆయనకు రాజకీ యంగా ఊపిరిపోశారు. తమిళనాడు రాజకీయం విలక్షణమైనది. నాలుగు దశాబ్దాలుగా అక్కడ రెండు పార్టీల వ్యవస్థే రాజ్యమేలుతోంది. జయలలిత మరణం, శశికళ జైలు కెళ్లడం పర్యవసానంగా అన్నా డీఎంకేకు చెప్పుకోదగ్గ నాయకత్వం లేదు గనుక అది కనుమరుగవుతుందని డీఎంకే ఆశించింది. దినకరన్ జయలలిత అను గ్రహాన్ని కోల్పోయి పార్టీకి దూరంగా ఉండిపోయిన వ్యక్తి. కనుక జయ వారసు డిగా ఆయన్ను ఓటర్లు పరిగణనలోకి తీసుకోరని డీఎంకే భావించింది. ఇక దినకరన్‌పై వచ్చిపడిన కేసులు సరేసరి. పైగా ఎవరికీ పరిచయం లేని ప్రెషర్ కుక్కర్ గుర్తుతో ఆయన బరిలో నిలిచారు. వీటన్నిటినీ ఆర్కే నగర్ ఓటర్లు తోసి రాజన్నారు. ఎప్పుడూ జయలలిత కూడా సాధించనంత మెజారిటీ దినకరన్‌కు ఇచ్చారు. ఆయనకు 40,707 ఓట్ల మెజారిటీ వచ్చింది. పోలైన ఓట్లలో 50 శాతం పైగా ఓట్లు ఆయనవే కావడం, డీఎంకే సైతం డిపాజిట్ కోల్పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ధారాళంగా డబ్బు ఖర్చు పెట్టడం వల్లే ఆయన గెలిచారని ప్రత్యర్థులు ఆరోపించవచ్చుగానీ... ఆ పని అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలు చేసి ఉండవని ఎవరూ అనుకోరు. మొత్తానికి తాము జయలలిత వారసులమని చెప్పుకున్న ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలకు ఈ ఉప ఎన్నికలో ఆదరణ దొరకలేదు. వచ్చే మూడు నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని దినకరన్ చెబుతున్నారు. అది జరిగినా, జరగకపో యినా పళని ప్రభుత్వం ఇబ్బందులు పడటమైతే తప్పకపోవచ్చు. ఎందుకంటే మొన్న సెప్టెంబర్‌లో ఆయన ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనవలసిన తరుణంలో దినకరన్ వర్గంలోని 18మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ ధన్పాల్ అన ర్హులుగా ప్రకటించారు. వారి పిటిషన్ స్వీకరించిన మద్రాస్ హైకోర్టు బలపరీక్షను నిలుపుచేసింది. ఇప్పుడా బలపరీక్ష జరిగినా, వారి అనర్హత సబబేనని తీర్పు వెలు వడి ఉప ఎన్నికలొచ్చినా పళని సర్కారుకు సమస్యలు తప్పవు. ఇవిగాక స్థానిక ఎన్నికల బెడద ఒకటి ఉంది. ఈ ఉప ఎన్నిక అనేకమంది ఆశల్ని అడియాసలు చేసింది. పళనిస్వామి– పన్నీర్‌సెల్వం వర్గాలను ఏకం చేయడంలో విజయం సాధించిన బీజేపీ అధినా యకులు... వీరిద్దరి సాయంతో భవిష్యత్తులో రాష్ట్రంలో కాలు మోపవచ్చునని ఆశపడ్డారు. ఈ నేతలిద్దరి చేతగానితనమూ అడుగడుగునా కనబడుతూనే ఉన్నా జయలలిత వారసులుగా జనం వారినే గుర్తిస్తారని, కేసుల్లో ఇరుక్కున్న దినకర న్కు ఆదరణ ఉండదని వారు భావించారు. ఇదంతా ఇప్పుడు తలకిందులైంది. పైగా బరిలో నిలిచిన తమ పార్టీ అభ్యర్థికి కేవలం 1,417 ఓట్లు రావడం బీజేపీ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అలాగే పార్టీలో తన వర్గానికి ప్రాధాన్యం దక్కటం లేదన్న అసంతృప్తితో ఉన్న డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వానికి కూడా ఈ ఉప ఎన్నిక ఫలితం విఘాతమే. విలీనమై నాలుగు నెలలు కావస్తున్నా పన్నీర్‌కు డిప్యూటీ సీఎంతోపాటు రాజకీయ సమన్వయకర్త పదవి రావడం మినహా ఆయన వర్గీయులకు దక్కిందేమీ లేదు. తమ వర్గానికి చెందిన మధుసూదన్ ఈ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే ప్రాబల్యం పెరుగుతుందని, అప్పుడు పదవుల కోసం గట్టిగా ఒత్తిడి తీసుకురావొచ్చునని పన్నీర్ వర్గం ఆశపడింది. ఇందులో కులం కోణం కూడా ఉంది. పన్నీర్ తీవర్ కులస్థుడు. పళనిస్వామి గౌండర్. జయ లలిత వద్ద శశికళ ప్రాబల్యం పెరిగిననాటినుంచీ పార్టీలో తీవర్లదే ఆధిపత్యం. తమ కులస్తుడు గనుక చెప్పుచేతల్లో ఉంటాడన్న భావనతోనే జయ మరణా నంతరం శశికళ పన్నీర్‌కు మద్దతిచ్చారు. తీరా ఆయన ఎదురు తిరగడంతో గౌండర్ కులస్తుడైన పళనిస్వామిని అందలం ఎక్కించారు. ఇప్పుడు పళని, పన్నీ ర్లు ఏకమైనా పార్టీలో తమ ఆధిపత్యం పోయిందన్న దిగులు తీవర్లను బాధి స్తోంది. మధుసూదన్ గెలుపు ఈ సమస్యను తీరుస్తుందని పన్నీర్ వర్గం ఎంత గానో ఆశపెట్టుకుంది. అటు పళనిస్వామికి సైతం ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారింది. జయలలిత సొంత స్థానంలో, రెండాకుల గుర్తు తమకే వచ్చినా నెగ్గక పోతే అది రాజకీయంగా సమాధి అవుతుందని గ్రహించి ఆయన తన శక్తిమేరకు కష్టపడ్డారు. కానీ అదంతా బూడిదలో పోసిన పన్నీరైంది. రాష్ట్రంలో ఇక ఎదురు లేదని... ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం తనదే అని భావిస్తున్న డీఎంకేకు ఇప్పుడు డిపాజిట్ గల్లంతు కావడం మింగుడు పడని విషయం. పైగా దినకరన్ శశికళ పేరు చెప్పుకుని, ఆమె ఫొటో పెట్టుకుని ప్రచారం చేసి గెలిచారు. ఇది ఆర్కే నగర్లో కనబడిన ధోరణా లేక రాష్ట్రంలో గాలి మళ్లిందా అన్న అయోమయం డీఎంకేను చుట్టుముట్టింది. రాగలకాలంలో దినకరన్ గెలుపు తమిళ రాజకీయా లను మరెన్ని మలుపులు తిప్పుతుందో చూడాల్సి ఉంది. -
స్వామి మరో సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై : నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి తాజాగా అలాంటి వ్యాఖ్యలే చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పటికీ ఆమె నామమాత్రంగానే ఉండేవారని, మొత్తం వ్యవహారాలు శశికళ చూసుకునేవారని అన్నారు. ఎక్కడ ? ఎవరు? ఎలా పనిచేస్తున్నారనే విషయాలు శశికళకే ఎక్కువగా తెలుసని అన్నారు. మంత్రుల నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిపై శశికళ పరిశీలన ఉండేదని అన్నారు. ఆర్కే నగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు సాధిస్తాడని తాను ముందే ఊహించానని అన్నారు. అయినా తనకు ముందు నుంచే దినకరన్‌పై సానుభూతి ఉండేదని అన్నారు. శశికళకు అవకాశం ఇస్తే పరిపాలన కూడా చేయగలదనే దోరణిలో స్వామి వ్యాఖ్యలు చేశారు. -
అది బీజేపీ వ్యతిరేక ఓటు కానేకాదు!
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్ష అన్నాడీఎంకే తిరుగుబాటు అభ్యర్థి, వీకే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ దాదాపు 40 వేల మెజారిటీతో విజయం సాధించడాన్ని పలువురు పలు రకాలుగా విశ్లేషిస్తున్నారు. దినకరన్‌కు నేడు 40,707 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నాడు జయలలిత 39 వేల మెజారిటీతోనే విజయం సాధించారు. దానర్థం జయలలితకన్నా దినకరన్ ఎక్కువ ఆదరణ కలిగిన వ్యక్తని అర్థం కాదు. పాలకపక్ష అన్నాడీఎంకే అభ్యర్థి ఈ. మధుసూదన్‌కు ఈ ఎన్నికల్లో 48,306 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుధుగణేశ్ 24,651 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఆదివారం నాడు ఓట్ల లెక్కింపు ప్రారంభమై దినకరన్ విజయం సాధిస్తున్న సూచనలు కనిపించగానే వివిధ టీవీ ఛానళ్ల చర్చల్లో పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నేతలు తమ విశ్లేషణలు వినిపించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఇది ప్రజలిచ్చిన తీర్పంటూ పలు పార్టీల నేతలు అభిప్రాయాలను వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు లాంటి నిర్ణయాలే కాకుండా బలవంతంగా హిందీ భాషను రుద్దడం, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ‘నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్’ లాంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజలు దినకరన్‌కు ఓటేశారని తేల్చారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలనుకుంటే డీఎంకే అభ్యర్థిని గెలిపించేవారు. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్న పార్టీ డీఎంకే. కాగా, డీఎంకే అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం. బీజేపీ మతతత్వ వాదాన్ని వ్యతిరేకించే ప్రజలు దినకరన్‌వైపు మొగ్గుచూపారని కూడా అంటున్నారు. మతతత్వంపై పోరాడాలన్న తపన ప్రజల్లో ఏ కోశాన, ఎక్కడా కనిపించలేదు. డబ్బు ప్రవాహం ప్రభావం వల్లనే దినకరన్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. దినకరన్ ఎన్నికల కోసం దాదాపు వంద కోట్ల రూపాయలను కుమ్మరించారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ ఈ నెల మొదట్లోనే ఆరోపించడం ఇక్కడ గమనార్హం. ఉప ఎన్నికల్లో డబ్బే ప్రధాన ప్రభావం చూపిస్తుందని తేలడం ఇదే మొదటిసారి కాదు. 2003లో శాంతకులం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పాలకపక్షం ఏఐఏడీఎంకే అభ్యర్థి విజయం సాధించడంలో డబ్బు ప్రభావం మొదటిసారి కనిపించింది. అప్పుడు ప్రభుత్వం పట్ల ప్రజలకు ఎంతో ఆగ్రహం ఉన్నప్పటికీ పాలక పక్ష అభ్యర్థినే గెలిపించడం, డబ్బును విచ్చలవిడిగా వెదజల్లడం స్పష్టంగా కనిపించింది. ఎన్ని చర్యలు తీసుకున్నా మన ఎన్నికల కమిషన్ మాత్రం ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అరికట్టడంలో విఫలం అవుతోంది. -
ఆర్కే నగర్ తీర్పు: మారుతున్న తమిళ రాజకీయం..!
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఫలితాలతో తమిళనాడు రాజకీయం మళ్లీ వేడెక్కింది. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ అనూహ్యంగా 40వేలకుపైగా మెజారిటీ ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఈ నియోజకవర్గంలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జయలలిత వారసులం తామేనంటున్న అధికార అన్నాడీఎంకే ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అటు జయ మృతి తర్వాత నాటకీయ పరిణామాలతో ఇరుకునపడిన శశికళ వర్గం కూడా ఈ ఎన్నికను చావో-రేవో అన్నట్టుగా తీసుకొని బరిలోకి దిగింది. ఈ క్రమంలో శశికళ వర్గానికి చెందిన టీటీవీ దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి.. రాజకీయ పరిశీలకులు సైతం ఊహించనిరీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ అటు అన్నాడీఎంకేగానీ, ఇటు ప్రధాన ప్రతిపక్షం డీఎంకేగానీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయాయి. ఈ విజయం శశికళ వర్గంలో కొత్త ఉత్తేజం నింపిందని చెప్పవచ్చు. జయ సొంత నియోజకవర్గం ఆర్కే నగర్లో పాగా వేయడంతో శశి వర్గం ఆనంద డొలికల్లో తేలియాడుతోంది. అమ్మ వారసురాలం తామేనని చెప్పుకోవడానికి ఈ విజయం ఉపకరిస్తుందని ఆ వర్గం భావిస్తోంది. ఈ విజయంతో సంబరాలు చేసుకుంటున్న శశి వర్గం కార్యకర్తలు.. అన్నాడీఎంకే అధ్యక్షుడు దినకరనే అంటూ నినాదాలు చేశారు. అటు దినకరన్ కూడా అన్నాడీఎంకే సర్కారు మూడు నెలల్లో కూలిపోతుందంటూ జోస్యం చెప్పారు. నిజానికి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దినకరన్ వర్గం ఎప్పుడో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. పళనిస్వామి (ఈపీఎస్), పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గాల విలీనం నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానం ఇంతవరకు అసెంబ్లీలో చేపట్టలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాల నేపథ్యంలో ఈ అవిశ్వాస తీర్మానం తెరపైకివచ్చే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరుతున్నట్టు కనిపిస్తోంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో విజయం నేపథ్యంలో ఎమ్మెల్యే వట్రివేలు, ఎంపీ సెంగుట్టువన్ దినకరన్‌ను కలిసి అభినందనలు తెలిపారు. మరింతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దినకరన్‌కు అండగా నిలబడితే.. పళనిస్వామి సర్కారు ఇబ్బందులు పడే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
దినకరన్‌కు కలిసొచ్చింది ఎలాగంటే...
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఓవైపు కొనసాగుతున్న వేళ.. సర్వేలన్నీ శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్‌కు అనుకూలంగా రావటం ఆసక్తికరంగా మారింది. అయితే ఇందుకుగానూ పలు కారణాలను ఆయా సర్వేలు చూపుతున్నాయి. 54 ఏళ్ల దినకరన్ అన్నాడీఎంకే పార్టీలో కీలక నేత. దశాబ్దం క్రితం దాకా జయకు ఆప్తుడిగానే ఉన్నాడు. ఆమె తీసుకున్న కీలక నిర్ణయాల్లో దినకరన్ పాత్ర ఉండేది కూడా. 1999లో పెరియాకులం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన ఎన్నికయ్యారు.. తర్వాత 2004-10 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా చేశారు. అయితే 2011లో మన్నార్ గుడి మాఫియా(శశికళ మరియు ఆమె బంధువులు)ను జయలలిత పార్టీ నుంచి బహిష్కరించటంతో ఆయన తెర వెనక్కవెళ్లిపోయారు. చివరకు జయ మరణానంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలతో వారంతా వెనక్కి వచ్చారు. అయితే వచ్చి రాగానే పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలన్న వారి ప్రయత్నం ఫలించలేదు. అయితే జయ అసలైన వారసత్వం అన్న ట్యాగ్ లైన్‌తో పళని స్వామి గ్రూప్ తరపున ఆయన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో నిల్చోగా.. ఓటర్లకు యథేచ్ఛగా డబ్బు పంచిన ఆరోపణలతో ఆ ఎన్నిక కాస్త రద్దు అయ్యింది. కానీ, పరిస్థితులు తర్వాత పూర్తి వ్యతిరేకంగా మారాయి. అక్రమాస్తుల కేసులో శశికళ జైలు పాలయ్యారు. ఆమె వారసుడిగా రంగంలోకి దిగిన దినకరన్‌కు చిక్కులు ఎదురయ్యాయి. ఓవైపు ఎన్నికల్లో అవినీతి కేసు.. మరోవైపు ఫెరా కేసు ఊపిరి సలపకుండా చేశాయి. పళని-పన్నీర్ వర్గాలు కలిసిపోయి.. శశికళ వర్గాన్ని బహిష్కరించాయి. ఒకదాని వెంట ఒకటి దెబ్బలు తగులుతున్న తరుణంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక వచ్చి పడింది. ఇక రెండాకుల గుర్తు కోల్పోవటంతో టోపీ కోసం యత్నించగా.. అది దక్కలేదు. దానికి తోడు జయ మరణం వెనుక ఆమె హస్తం ఉందన్న ప్రచారాన్ని ప్రత్యర్థులు పెద్ద ఎత్తున్న వినిపించారు. ఒక రకంగా ప్రభుత్వం కావాలనే దినకరన్ పై కుట్ర చేస్తోందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇన్ని పరిణామాల మధ్య ఎన్నికకు సరిగ్గా ఒక్క రోజు సంచలనానికి తెరలేపారు. అమ్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీడియోను విడుదల చేశారు. తనకు తెలీకుండా జరిగిపోయిందని దినకరన్ చెబుతున్నప్పటికీ.. ఈ వీడియో ప్రభావంతో సమీకరణాలు మొత్తం మారిపోయాయని వారంటున్నారు. ఆర్కే నగర్ ప్రజల్లో దినకరన్ పై సింపథీ బాగా వర్కవుట్ అయ్యిందని.. అందుకే ఓటింగ్ శాతం కూడా ఓ మోస్తరుగా పెరిగిందని వారంటున్నారు. మరి ఈ పరిణామాలన్నింటిని తనకు అనుకూలంగా మార్చుకోబోతున్నాడా? విశ్లేషకులు భావించింది జరగుతుందా? జయకు అసలైన వారసుడని ఆర్కే నగర్ వాసులు భావించారా? మరికాసేపట్లోనే తేలనుంది. -
అపోలో ఆసుపత్రిలో జయ.. వీడియో బయటకు..
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో బయటకు వచ్చాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికకు ముందు ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అపోలో ఆసుపత్రిలో జయ చేరిన అనంతరం ఆమెను ఎవరూ కలవలేదనే ఆరోపణలపై స్పందించిన టీటీవీ దినకరన్ మద్దతుదారుడు పీ వెట్రివేల్ ఈ వీడియోను విడుదల చేశారు. జయ వీడియోను చాలా రోజులుగా విడుదల చేయాలనుకుంటున్నామని, అనివార్య కారణాల వల్ల అప్పుడు బయటపెట్టలేదని వెట్రివేల్ వెల్లడించారు. జయ మృతిపై ఏర్పాటైన కమిషన్ నుంచి తమకు ఎలాంటి సమన్లు అందలేదని చెప్పారు. సమన్లు అందిన తర్వాత ఆధారాలను కమిషన్ ముందు ఉంచుతామని వివరించారు. కాగా, ఆర్కే నగర్ ఉప ఎన్నికలో లాభపడేందుకు జయ వీడియో, ఫొటోలను దినకరన్ వర్గం ఇప్పుడు విడుదల చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నికను వాయిదా వేయాలనే పిటిషన్ ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. గురువారం(రేపు) జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్‌ను శాంతి భద్రతల నడుమ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. అపోలో ఆసుపత్రిలో జయ.. వీడియో బయటకు.. -
దినకరన్ శపథం
చెన్నై: రెండాకుల గుర్తును తిరిగి సాధించుకుంటామని అన్నాడిఎంకే బహిష్కృత నాయకుడు టీటీవీ దినకరన్ ప్రతిజ్ఞ చేశారు. తిరుర్పూర్‌లో శుక్రవారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ శపథం చేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే పార్టీ అధికార చిహ్నమైన ‘రెండాకుల గుర్తు’ను తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గానికి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయంతో రెండాకుల గుర్తు కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళకు ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని దినకరన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో ఈసీ పక్షపాతంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. కాగా, ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ డిసెంబర్ 21న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. -
అన్నాడీఎంకే పార్టీలో స్లీపర్ సెల్స్ కలకలం
-
ఆ గొంతు దినకరన్‌దే
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తుకోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపిన కేసు విచారణలో భాగంగా స్వరపరీక్ష వివరాలను పోలీసులు శనివారం ప్రకటించారు. బ్రోకర్‌తో సెల్ఫోన్లో మాట్లాడిన గొంతు టీటీవీ దినకరన్దేనని నిర్ధారించారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఎన్నికల కమిషన్.. పార్టీ రెండాకుల చిహ్నంపై తాత్కాలిక నిషేధం విధించింది. రూ. 50 కోట్లు ముడుపులు ముట్టజెప్పడం ద్వారా ఎన్నికల కమిషన్ అధికారులను లోబరుచుకుని పార్టీ చిహ్నాన్ని దక్కించుకోవాలని దినకరన్ ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. పెరోల్‌పై జైలు నుంచి విడుదలైన అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ చెన్నైలో తన భర్త నటరాజన్ చికిత్స పొందుతున్న గ్లోబల్ ఆస్పత్రికి వెళ్లి ఆయన్ని పరామర్శించారు. నటరాజన్‌కు ఈనెల 4న తేదీన కాలేయం, మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్స చేశారు. -
దినకరన్ వర్గానికి షాక్!
ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇంటిపై ఐటీ దాడులు సాక్షి, చెన్నై: తమిళనాడులో తిరుగుబాటు రాజకీయాలను నడుపుతున్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై తాజాగా కేంద్ర సంస్థలు దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. దినకరన్ వర్గంలో కీలక నేత, ఇటీవల అనర్హత వేటు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఇళ్లపై ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహించింది. సెంథిల్ బాలాజీకి సంబంధించిన ఆస్తులపై పదిచోట్ల ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. పళనిస్వామి ప్రభుత్వానికి ఎదురుతిరిగిన దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకన్ ధనపాల్ ఇటీవల వేటువేసిన సంగతి తెలిసిందే. పళనిస్వామి సర్కారు అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధమవుతున్న వేళ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటువేయడంతో తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. స్పీకర్ అనర్హత వేటు ఉత్తర్వులను తప్పుబడుతూ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తమ ఆదేశాలు వచ్చేవరకు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించకూడదంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు మొన్నటివరకు రిసార్ట్‌లో గడుపుతూ క్యాంపు రాజకీయాలు నడిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంథిల్ బాలాజీపై ఐటీశాఖ దాడులు జరపడంతో కేంద్ర సంస్థలు దినకరన్ వర్గాన్ని టార్గెట్ చేసినట్టు వినిపిస్తోంది. -
ఉత్కంఠ రేపుతున్న తమిళ రాజకీయం!
చెన్నైకి చేరుకున్న గవర్నర్..మరికాసేట్లో సీఎంతో భేటీ సాక్షి, చెన్నై: పళనిస్వామికి బలపరీక్ష ముప్పు.. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు మంగళవారం చెన్నైకి చేరుకున్నారు. మరికాసేపట్లో ఆయన సీఎం పళనిస్వామితో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ అనంతరం అవిశ్వాస తీర్మానంపై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాజకీయ ఉత్కంఠకు తెరదించేవిధంగా బలపరీక్ష విషయంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వారం తర్వాత గవర్నర్ విద్యా సాగర్‌రావు చెన్నైకి రావడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు నేపథ్యంలో అసెంబ్లీలో బలపరీక్షకు సీఎం పళనిస్వామి గవర్నర్ ఆదేశాలు ఇచ్చే అవకాశముందని అంటున్నారు. మరోవైపు స్పీకర్ ధనపాల్ తమపై అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ.. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్టవిరుద్ధంగా స్పీకర్ తమపై అనర్హత వేటు వేశారని వారు ఆరోపించారు. ఇక తాజా రాజకీయ ఉత్కంఠ నేపథ్యంలో డీఎంకే కూడా పావులు కదుపుతోంది. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు నేపథ్యంలో స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే శాసనసభాపక్షం మంగళవారం సాయంత్రం 5గంటకు భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం డీఎంకేతోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన 100మంది ఎమ్మెల్యేలు సామూహికంగా రాజీనామా చేయనున్నట్టు వినిపిస్తోంది. పళనిస్వామి సర్కారును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డీఎంకే రాజీనామా అస్త్రాన్ని సంధించవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో డీఎంకే శాసనసభా భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తసికరంగా మారింది. దినకరన్ వర్గం తిరుగుబాటుతో సీఎం పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సర్కారు మైనారిటీలో పడ్డ విషయం తెలిసిందే. దినకరన్‌కు మద్దతుగా 21 మంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తుండడంతో సీఎం పళనిస్వామి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. మైనారిటీలో ఉన్న పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. బల పరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం రాలేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. -
18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
-
18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం తలెత్తింది. రాజకీయ ఉత్కంఠకు తెరదించే విధంగా బల పరీక్ష విషయంలో గవర్నర్ నిర్ణయం ఎలా ఉండబోతుందోనని ఎదురు చూపులు చూడగా చివరికి దినకరన్ వర్గానికి స్పీకర్ భారీ షాకిచ్చారు. అన్నాడీఎంకే ఉపప్రధాన కార్యదర్శి దినకరన్ వర్గానికి చెందిన 18 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. సీఎం పళని స్వామిపై తిరుగుబావుట ఎగురవేసిన ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ సోమవారం ప్రకటించారు. దీంతో దినకరన్ వర్గానికి ఏం చేయాలో మింగుడు పడటం లేదు. తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్‌రావు నేడు చెన్నైకి రానున్న నేపథ్యంలో స్పీకర్ ధనపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ ధనపాల్ నిర్ణయాన్ని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. తమపై అనర్హత వేటు వేయడం అన్యాయమని, దీనిపై తాము హైకోర్టుకు వెళతామని తెలిపారు. మరోవైపు గవర్నర్ బల పరీక్షకు ఆదేశిస్తే, ఇరాకాటంలో పడుతామన్న ఆందోళనతో సీఎం పళని స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తమపై తిరుగుబాటు చేస్తున్న వారిపై అనర్హత వేటు పడేలా పావులు కదిపింది. మైనారిటీ ప్రభుత్వాన్ని బలం నిరూపించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో దినకరన్ వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డీఎంకే సభ్యులకూ అనర్హత టెన్షన్..! దినకరన్ వర్గం ఎమ్మెల్యేలతో పాటు డీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో సాగిన గుట్కా వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని డీఎంకే సభ్యులు 21 మందిని సస్పెండ్ చేయడానికి పళనిస్వామి వర్గం తగ్గ కార్యాచరణ సిద్ధం చేసి, సభా హక్కుల సంఘం ద్వారా ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు సైతం ఇప్పించారు. గుట్కా వ్యవహారం కోర్టులో విచారణలో ఉండడం, ఇప్పటికే నిషేధిత వస్తువులపై కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఉండటాన్ని అస్త్రంగా చేసుకుని నోటీసు రద్దుకు డీఎంకే సభ్యులు హైకోర్టు తలుపు తట్టడంతో సస్పెన్షన్ వేటు నుంచి ఇటీవల తాత్కాలిక ఊరట లభించింది. ఏ సమయంలోనైనా స్పీకర్ వారిపై వేటు వేసే అవకాశాలున్నాయి. -
అత్తారింటికి వెళ్లేదెవరో!
నేతల మధ్య మాటల తూటాలు.. సవాళ్లు ప్రతి సవాళ్లు సీఎం హెచ్చరిక, విరుచుకుపడ్డ మంత్రులు ఎదురుదాడిలో దినకరన్ అత్తారింటికి వెళ్లేది నువ్వంటే.. నువ్వే నంటూ అన్నాడీఎంకే గ్రూపుల మధ్య శనివారం మాటల తూటాలు పేలాయి. మళ్లీ జైలుకు వెళ్తావంటూ సీఎం పళని స్వామి దినకరన్‌కు హెచ్చరిక చేశారు. అమ్మ జయలలిత మరణానికి ప్రధాన కారకురాలు చిన్నమ్మ శశికళ అని మంత్రులు విరుచుకు పడ్డారు. తానేమీ తక్కువ తిన్నానా..? అంటూ దినకరన్ ఎదురుదాడికి దిగారు. శాశ్వతంగా ఇంటికి.. ఆ తదుపరి అత్తారింటికి వెళ్లబోయేదెవరో మరి కొద్దిరోజుల్లో తేలుతుందని హెచ్చరించారు. సాక్షి, చెన్నై : సీఎం పళని స్వామిని ఇరకాటంలో పెట్టే రీతిలో, ప్రభుత్వాన్ని కూల్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని దినకరన్ వేగవంతం చేసిన నేపథ్యంలో ఆయన్ను గురిపెట్టి పాలకులు తీవ్రంగా స్పందించే ప నిలో పడ్డారు. సీఎం పళని స్వామి మొదలు, మంత్రుల వరకు శనివారం దినకరన్‌ను గురిపెట్టి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు. చిన్నమ్మ శశికళ కుటుంబంపై దుమ్మెత్తి పోశారు. అమ్మ మరణానికి ప్రధాన కారకురాలు శశికళ అని తీవ్రంగా విరుచుకుపడ్డారు. అత్తారింటికి దినకరన్ వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. అత్తారిళ్లు(జైలు) తనకు కొత్త కాదని, ఇక, వెళ్లబోయేదెవరో వెయిట్ అండ్ సీ.. అని దినకరన్ ఎదురుదాడికి దిగారు. సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య పళని, దినకరన్ శిబిరాల మాటల తూటాలు పేలడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ మొదలైంది. మళ్లీ జైలుకెళ్లడం ఖాయం.. సీఎం పళని స్వామి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, దినకరన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, అందర్నీ తొలగిస్తున్న దినకరన్, అమ్మ జయ లలిత బతికి ఉండి ఉంటే, ఆమె కూడా పదవి నుంచి తొలగించి ఉండే వాడేమోనని మండిపడ్డారు. అమ్మ కన్నెర్ర చేయడంతో పది సంవత్సరాలు వనవాసంలో ఉన్న దినకరన్, ఇప్పుడు అమ్మ లేని దృష్ట్యా, జబ్బలు చరుస్తున్నాడని ధ్వజమెత్తారు. ఆయన బెదిరింపులు, హెచ్చరికలకు ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. అమ్మ జయలలిత ఆశీస్సులతో తాను ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యానని పేర్కొంటూ, దినక రన్ లాంటి కపట నాటక దారుడ్ని నమ్మే స్థితిలో అన్నాడీఎంకే కేడర్ లేదని ధీమా వ్యక్తంచేశారు. అమ్మ ఆత్మ ఎన్నడూ క్షమించదని, దినకరన్ అండ్ బృందానికి గుణపాఠం తథ్యమని హెచ్చరించారు. అమ్మ మరణానికి చిన్నమ్మే కారణం దిండుగల్, తిరుచ్చి, తంజావూరుల్లో జరిగిన వివిధ కార్యక్రమల్లో మంత్రులు దిండుగల్ శ్రీనివాసన్, వెల్ల మండి నటరాజన్, ఓఎస్ మణియన్, బెంజమిన్, ఎంపీలు తంబిదురై, వైద్యలిం గం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. దినకరన్, శశికళను గురిపెట్టి తీవ్రంగానే స్పందించారు. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలకు దిగారు. దిండుగల్ శ్రీనివాసన్ మాట్లాడుతూ, అమ్మ రోగం తీ వ్రత పెరగడంతో, చివరకు సహజ మరణంగా రూపొందించారని ఆరోపించారు. అమ్మను చూసేందుకు ఎవరినీ అనుమతించకుండా శశికళ అడ్డుకున్నారని, అమ్మ మరణానికి ప్రధాన కారకురాలు చిన్నమ్మేనని ఆరోపించారు. అందుకే ఆ కుటుంబాన్ని సాగనంపడం లక్ష్యంగా తమ ప్రభుత్వం, పార్టీ ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు. వెల్లమండి నటరాజన్ స్పందిస్తూ, జయలలిత ఆరోగ్యంపై పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ఉన్నారని, చిన్నమ్మ శశికళ దగ్గరుండి మరీ అమ్మ ఆరోగ్యం క్షీణించేందుకు ప్రధాన కారకురాలు అయ్యారని ఆరోపించారు. ఓఎస్ మణియన్ పేర్కొంటూ, దినకరన్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని, త్వరలో సంకట పరిస్థితుల్ని ఎదుర్కోవడం ఖాయం అని హెచ్చరించారు. అదే సమయంలో చిన్నమ్మ శశికళ విషయంగా, ఆమెను వదులుకునే పరిస్థితి ఉండబోదని స్పందించారు. బెంజమిన్ వ్యాఖ్యానిస్తూ, ద్రోహులకు గుణపాఠం నేర్పే రోజు సమీపించిందని హెచ్చరించారు. ఎంపీ వైద్యలింగం మాట్లాడుతూ, దినకరన్ లాంటి వ్యక్తుల కాకమ్మ బెదిరింపులకు పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అవసరం అయితే, మెజారిటీ నిరూపించుకుని ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు తామెప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్నారు. తంబిదురై వ్యాఖ్యానిస్తూ, అన్నాడీఎంకే సర్కారును కూల్చడం, ఆ పార్టీని నిర్వీర్యం చేయడం ఎవరితరమూ కాదన్నారు. దినకరన్ ఎదురుదాడి తన మీద ఆరోపణలు, విమర్శనాస్త్రాల్ని ఎక్కుబెట్టడంతో దినకరన్ ఎదురు దాడికి దిగారు. అడయార్‌లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. త్వరలో ఈ మంత్రులు అందరూ శాశ్వతంగా ఇంటికి వెళ్లబోతున్నారని పేర్కొన్నారు. శశికళకు పళనిస్వామి తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. అమ్మ ఆశయాలకు తూట్లు పెట్టే విధంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఉప్పు తిన్న వాడు నీళ్లు తాగక తప్పదని, తిన్నింటి వాసాలు లెక్కించే పళని స్వామి అండ్ బృందం త్వరలో అత్తారింటికి వెళ్లడం ఖాయం అని హెచ్చరించారు. తనకు అత్తారిళ్లు కొత్త కాదని, అయితే, ఇక వెళ్లబోయే వాళ్లకే కొత్త అని వ్యాఖ్యానించారు. తన మీద విదేశీ మారక ద్రవ్యం కేసు మాత్రమే ఉందని పేర్కొంటూ, సీఎం, మంత్రుల వలేæ తాను అవినీతికి పాల్పడ లేదని, ప్రజాధనాన్ని దోచుకోలేదన్నారు. ప్రజా ధనాన్ని కోట్లు కోట్లుగా దోచి దాచి పెట్టుకుంటున్న వాళ్లకు అత్తా రిళ్లు ఆహ్వానం పలికేందుకు సిద్ధంగా ఉందని, ఎవరెవరు వెళ్లబోతున్నారో వేచి చూడంటూ ముగించారు. బెంగళూరుకు దినకరన్ మాటల తూటాలు ఓ వైపు సాగుతుంటే, మరోవైపు తన మద్దతు ఎమ్మెల్యేలతో భేటీకి దినకరన్ నిర్ణయించారు. మైసూరు సమీపంలోని ఓ రిసార్ట్‌లో ఉన్న ఎమ్మెల్యేల్ని కలుసుకునేందుకు సిద్ధం అయ్యారు. 20వ తేదీన ఆయన బెంగళూరు మీదుగా మైసూర్‌కు పయనం కానున్నారు. అలాగే, మత్స్య శాఖ మంత్రి జయకుమార్ చేతిలో ఉన్న మత్స్యకారులకు సంబంధించిన సంఘం పదవిని ఊడగొట్టారు. ఇక, ఈ శిబిరంలో ఉన్న అంబూర్ ఎమ్మెల్యే బాలసుబ్రమణియన్ తాను అజ్ఞాతంలో లేనని, నియోజకవర్గ ప్రజలతో సంప్రదింపుల్లో ఉన్నట్టుగా మీడియా ముందుకు వ్యాఖ్యానించారు. ఇక, తమ నాయకుడ్ని గురిపెట్టి మంత్రులు, సీఎం స్వరం పెంచడంతో దినకరన్ మద్దతు ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ ఎదురుదాడికి దిగుతూ, దమ్ముంటే బల పరీక్షకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ రెండు శిబిరాల సమరంపై ద్రవిడ కళగంనేత వీరమణి స్పందిస్తూ, ఆత్మలు, కాషాయంలతోనే పాలకుల సంప్రదింపులు అని ఎద్దేవా చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ అయితే, పరస్పరం విమర్శలు, ఆరోపణలతో ముందుకు సాగుతున్న వాళ్లను శాశ్వతంగా సాగనంపేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారని వ్యాఖ్యానించారు. -
పళనీ త్వరలోనే అత్తగారింటికి : దినకరన్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామిని త్వరలోనే అత్తగారింటికి(జైలు)కు పంపిస్తానని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ అన్నారు. త్వరలో జైలుకు వెళ్లేది ఆయనేనని తాను కాదని తెలిపారు. పళనీస్వామి ఇప్పటికే భయపడుతున్నారని, ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ మొదలుపెడితే ఎక్కడ జైలుకు వెళతారోనని బెంబేలెత్తిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతోనే 19మంది ఎమ్మెల్యేలను డబ్బుతో కొని మీ పక్కన పెట్టుకున్నారని పళనీస్వామి వర్గం ఆరోపిస్తుందని గుర్తు చేయగా.. 'అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో కలిసి నేను బాంబులు పెట్టానని కూడా నా విరోధులు ఆరోపిస్తారు. వాటిని మీరు నమ్ముతారా?(మీడియాను ప్రశ్నిస్తూ).. నమ్మరుగా.. దయచేసి అలాంటి అడగకండి' అంటూ దినకరన్ అన్నారు. -
పళనిస్వామికి దినకరన్ చెక్!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పళనిస్వామి, శశికళ వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. పార్టీ తాత్కాలిక పదవి నుంచి ‘చిన్నమ్మ’ను తొలగించిన మరుసటి రోజే సీఎం ఎడపాడి పళనిస్వామికి టీటీవీ దినకరన్ ఝలక్ ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పదవి నుంచి పళనిస్వామిని తొలగిస్తున్నట్టు దినకరన్ ప్రకటించారు. ఆయన స్థానంలో పి. పళనియప్పన్‌ను నియమించినట్టు తెలిపారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి దిందిగల్ సి శ్రీనివాసన్‌ను తప్పించి, ఎం. రంగస్వామిని నియమించినట్టు ఆయన ప్రకటించారు. అన్నాడీఎంకే సేలం జిల్లా కార్యదర్శి పదవి నుంచి పళనిస్వామిని తొలగించినట్టు గత నెలలో దినకరన్ తెలిపారు. తన దగ్గరున్న 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌ను కలిసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎస్ రాజేంద్రన్‌ను కూడా పార్టీ పదవి నుంచి అప్పుడే తప్పించారు. రాజేంద్రన్ స్థానంలో పి ముతుయాన్‌ను నియమించినట్టు వెల్లడించారు. పళనిస్వామిని సీఎం పీఠం నుంచి దించాలన్న లక్ష్యంతో గత కొద్దిరోజులు పార్టీ పదవుల నుంచి ఆయన వర్గీయులను దినకరన్ తొలగిస్తున్నారు. అంతకుముందు ఐదుగురు మంత్రులను పార్టీ పదవుల నుంచి తొలగించి, తన అనుచరులను నియమించారు. కాగా, ఇప్పటివరకు సీఎం మార్పు కోసమే ప్రయత్నించానని, ఇకపై పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చమే లక్ష్యంగా పనిచేస్తానని దినకరన్ నిన్న ప్రకటించారు. -
మైసూరుకు దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు మరోసారి మకాం మార్చారు. నిన్న ఉదయం తమిళనాడు తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలుసుకున్న తరువాత మొత్తం 20 మంది ఎమ్మెల్యేలను రాత్రికి రాత్రే వారిని మైసూరుకు పంపించేశారు. ఈనెల 12న ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో పార్టీ సర్వసభ్య, కార్యవర్గ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పుదుచ్చేరి నుంచి మైసూరులోని గుడగుమలై లగ్జరీ రిసార్టుకు మకాం మార్చారు. ఇదిలా ఉండగా, దినకరన్ వర్గ ఎమ్మెల్యేలంతా ఈనెల 14వ తేదీన తనను నేరుగా కలవాలని స్పీకర్ ధనపాల్ శుక్రవారం ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడటంతో ఆగష్టు 24న ఒకసారి, సెప్టెంబర్ 1 మరోసారి స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు అధికార అన్నాడీఎంకే పార్టీలో గొడవలు శ్రుతి మించాయి. ఇప్పటివరకు నాయకుల మధ్య మాటల యుద్ధం జరగగా ఇప్పుడు ఏకంగా కొట్లాటకు దిగారు. మధురైలో పన్నీరుసెల్వం, దినకరన్ వర్గాల మధ్య గొడవ జరిగింది. మధురై విమానాశ్రయంలో ఇరు వర్గాల నాయకులు బాహాబాహీకి దిగారు. రెండు వర్గాలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ కలబడ్డాయి. జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేశారు. -
దినకరన్‌కు ఎదురుదెబ్బ!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ దినకరన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన ఫెరా కేసులో మూడు నెలల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దినకరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యవహరించలేమంటూ సుప్రీంకోర్టు సోమవారం దినకరన్ అప్పీల్‌ను కొట్టివేసింది. 2001లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదుచేసిన ఫెరా కేసులో దినకరన్‌పై ఇప్పటికే ఎగ్మూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. విదేశీ మారక ద్రవ నియంత్రణ చట్టం (ఫెరా)లోని పలు నిబంధనలు ఉల్లంఘించారని, ఆర్బీఐ అనుమతి లేకుండా కోటి 4 లక్షల 93వేల 313 డాలర్ల అక్రమ లావాదేవీలను దినకరన్ నిర్వహించి.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోని డిప్పర్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్‌లోకి తరలించినట్టు ఈడీ అభియోగాలు మోపింది. 36 లక్షల 36వేల డాలర్లు, లక్ష పౌండ్ల అక్రమ లావాదేవీలు విదేశాల్లో నిర్వహించినట్టు ఈడీ మరో కేసు కూడా దినకరన్‌పై పెట్టింది. ఈ రెండు కేసులకు సంబంధించి ఊరట కోసం దినకరన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దినకరన్ తన వర్గం ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. -
దినకరన్‌కు మరో షాక్!
ఫెరా కేసులో అభియోగాలు ఖరారు చెన్నై: అన్నాడీఎంకే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్టు ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు మరో షాక్ తగిలింది. 2001లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదుచేసిన కేసులో ఆయనపై ఎగ్మూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. విదేశీ మారక ద్రవ నియంత్రణ చట్టం (ఫెరా)లోని పలు నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు గురువారం వ్యక్తిగతంగా హాజరైన దినకరన్ న్యాయమూర్తి అభియోగాలు చదివి వినిపించగా.. వాటిని తిరస్కరించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా కోటి నాలుగు లక్షల 93వేల 313 డాలర్ల అక్రమ లావాదేవీలను దినకరన్ నిర్వహించి.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోని డిప్పర్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్‌లోకి తరలించినట్టు ఈడీ కేసు నమోదుచేసింది. 36 లక్షల 36వేల డాలర్లు, లక్ష పౌండ్ల అక్రమ లావాదేవీలు విదేశాల్లో నిర్వహించినట్టు ఈడీ మరో కేసు కూడా దినకరన్‌పై పెట్టింది. ఈ రెండు కేసులలోనూ విచారణను న్యాయస్థానం జూన్ 22కు వాయిదా వేసింది. -
24మంది ఎమ్మెల్యేలు జంప్!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ హైడ్రామాను తలపిస్తున్నాయి. జైలు నుంచి విడుదలైన శశికళ అక్క కొడుకు టీవీవీ దినకరన్ మళ్లీ చక్రం తిప్పుతున్నారు. అధికారిక అన్నాడీఎంకే నుంచి తనను, చిన్నమ్మను దూరం చేసి.. ఏకాకిని చేసేందుకు సీఎం ఎడపాడి పళనిస్వామి వర్గం ప్రయత్నిస్తుండగా.. అందుకు విరుద్ధంగా దినకరన్ బలం నానాటికీ పెరుగుతుండటం గమనార్హం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వరుసగా దినకరన్‌కు మద్దతు పలుకుతుండటం గమనార్హం. మంగళవారం రాత్రి వరకు దినకరన్‌కు మొత్తం 24మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఎడపాడి వర్గంలో ఉన్న 123 మంది ఎమ్మెల్యేల్లో 24మంది జారుకున్నట్టు అయింది. ఈ పరిణామాలతో లోలోపల ఖుషీ అవుతున్న ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్ అసెంబ్లీ సమావేశాలకు ముందే ఎడపాటి ప్రభుత్వం కూలిపోతుందని అంచనాలు వేస్తున్నారు. అన్నాడీఎంకే అధికారిక గుర్తు ‘రెండాకుల’ కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్టైన దినకరన్ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం సోమవారం ఆయన బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న చిన్నమ్మ శశికళను కలిశారు. అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. సోమవారాం రాత్రి అతను చెన్నైలోని తన నివాసానికి చేరుకొనే సమయంలో ఆయనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. మంగళవారం రాత్రి నాటికి ఏకంగా 24మంది ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరి.. మన్నార్గుడి మాఫియాకు మద్దతు పలికారు. దీంతో స్వరం పెంచిన దినకరన్ ఇప్పటికే పార్టీ అధినేత్రి శశికళేనని, ఆమె గైర్హాజరీలో పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా తానే పార్టీని నడుపుతానని తేల్చిచెప్పారు. పార్టీలోని ఫ్యాక్షన్ గొడవలకు రెండు నెలల్లో చరమగీతం పాడాలని సూచించారు. మరోవైపు బొటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం ఎడపాటి వర్గంలో తాజా పరిణామాలతో కలవరం మొదలైంది. మరింత ఎమ్మెల్యేలు జారుకుంటే అన్నాడీఎంకే పూర్తిగా దినకరన్ చేతుల్లోకి వెళ్లే అవకాశముందని ఎడపాటి వర్గం భావిస్తున్నది. ఎమ్మెల్యేలు దినకరన్ వైపు వెళ్లకుండా ఎడపాటి చర్యలు తీసుకుంటున్నట్టు పెద్దగా సఫలం కావడం లేదని తెలుస్తోంది. -
దినకరన్ అరెస్టయ్యాడా?
-
దినకరన్ అరెస్టయ్యాడా?
ఎగ్మూర్ కోర్టు ప్రశ్న సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను అన్ని సమస్యలు ఒకే సారిగా చుట్టుముట్టిన విషయం తెలిసిందే. పార్టీ నుంచి బహిష్కరణ వేదన, రెండాకుల చిహ్నం కోసం లంచం వ్యవహారం ఒకవైపు, ఫెరా కేసు ఉచ్చు ఇంకో వైపు ఆయనను చుట్టుముట్టాయి. రెండాకుల కోసం రూ.50 కోట్లు లంచం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన మూడు రోజులుగా ఢిల్లీలో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. శనివారం ఏడు గంటలు, ఆదివారం పది గంటల పాటు ఆయనను పోలీసులు విచారించారు. మరోవైపు ఫెరా కేసు విచారణ నిమిత్తం టీటీవీ ప్రతి రోజు ఎగ్మూర్ కోర్టుకు హాజరు కావాల్సివుంది. ఢిల్లీలో ఉన్న ఆయన సోమవారం విచారణకు హాజరుకాలేకపోయారు. ఆయన తరఫున హాజరైన న్యాయవాది.. న్యాయమూర్తి మలర్ మతికి వివరణ ఇచ్చుకున్నారు. ఓ క్రిమినల్ కేసు అభియోగంపై ఢిల్లీకి టీటీవీ వెళ్లారని, అందుకే ఆయన రాలేని పరిస్థితి ఉన్నట్టు తెలిపారు. ఢిల్లీ పోలీసుల సమక్షంలో ఆ విచారణ సాగుతోందని న్యాయవాది పేర్కొగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుని దినకరన్‌ను అరెస్టు చేశారా? అని ప్రశ్నించారు. ఇందుకు న్యాయవాది లేదని సమాధానం ఇచ్చారు. ఒకవేళ ఆయనను అరెస్టు చేస్తే సమాచారం కోర్టుకు ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేశారు. మూడో రోజూ విచారణ ఆదివారం 10 గంటల పాటుగా జరిగిన విచారణలో దినకరన్ ముందు పలు ఆధారాలను పోలీసులు ఉంచినట్టు సమాచారం. ఫోన్ సంభాషణలు, వాట్సాప్, ఎస్ఎంఎస్ సమాచారాలు, మధ్యవర్తి సుకేష్చంద్ర శేఖర్‌తో సాగిన వ్యవహారాలను దినకరన్ ముందు ఉంచినట్టు తెలిసింది. శనివారం వరకు సుకేష్ చంద్రశేఖర్ ఎవరో అన్నది తనకు తెలియదని వాదిస్తూ వచ్చిన దినకరన్ తాజాగా ఆయనో న్యాయమూర్తిగా తనకు పరిచయమైనట్టు వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. సోమవారం సాయంత్రం నుంచి దినకరన్‌తో పాటుగా ఆయన పీఏ జనార్దన్, సన్నిహితుడు మల్లికార్జున్ లను కూడా ఢిల్లీ పోలీసులు విచారణ సాగించే పనిలో పడ్డారు. ఈ విచారణ మరెన్ని గంటలు సాగనుందో వేచి చూడాల్సిందే. పోలీసులకు కావాల్సిన ఆధారాలు చిక్కినట్టేనని, ఇక దినకరన్ అరెస్టు కావడం తథ్యమన్న ప్రచారం ఊపందుకుంది.