
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేలోని ఓ ఐదారుగురు సొంత ప్రయోజనాలకోసం పనిచేస్తున్నారని, వారు తమ పద్దతిని మార్చుకోవాలని అన్నాడీఎంకే రెబల్ అభ్యర్థి, ఎమ్మెల్యే దినకరన్ అన్నారు. లేకపోతే ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఏం జరిగిందో అదే ప్రభుత్వం విషయంలో కూడా జరుగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం త్వరలోనే పడిపోతుందని కూడా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. కాగా, దీనిపై మీడియా ప్రతినిధులు పన్నీర్‌ను ప్రశ్నించగా 'అదంత దినకరన్ కల మాత్రమే. ఆయన కలలపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయను' అని పన్నీర్ చెప్పారు.
కాగా, తమకు రెబల్‌గా తయారైన టీటీవీ దినకరన్ కోటను బద్ధలు కొట్టే కార్యక్రమాల్లో అధికార అన్నాడీఎంకే పార్టీ వేగం పెంచింది. దాదాపు 130మంది దినకరన్ మద్దతుదారులుగా గుర్తించి పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల నుంచి వీరిని తొలగించినట్లు ప్రకటించింది. పార్టీ సమన్వయ కర్త, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, సహ సమన్వయ కర్త, సీఎం కే పళనిస్వామి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. తిర్పూర్, పుదుకొట్టాయ్, ధర్మపురి ప్రాంతాల్లోని పార్టీకి సంబంధించిన వారిని దినకరన్ మద్దతుదారులుగా గుర్తించి తొలగించినట్లు తెలిపారు. వీరిలో 65మంది ఒక్క తిర్పూర్ నుంచే అధికంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment