చెన్నై, తమిళనాడు : డీఎండీకే అధినేత, దివంగత నటుడు విజయ్‌కాంత్ తనయుడు వి.విజయ్ ప్రభాకర్ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడియన్ లీగ్ (డీఎండీకే) పార్టీ, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేల మధ్య పొత్తు కుదిరింది. అలయన్స్‌లో భాగంగా విజయ్ ప్రభాకర్ విరుధ్ నగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇదే స్థానం నుంచి ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ బీజేపీ తరుపున టికెట్ దక్కించుకున్నారు. డీఎంకే - ఇండియా అలయన్స్ మాత్రం అభ్యర్ధిని ప్రకటించలేదు.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి కెప్టెన్ కుమారుడు
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే విడుదల చేసిన 16 మంది లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో కెప్టెన్ విజయ్ కాంత్ కొడుకు విజయ్ ప్రభాకర్ పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా డీఎండీకే జనరల్ సెక్రటరీ, విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత మాట్లాడుతూ.. తన కుమారు విజయ్‌కి రాజకీయాల పట్ల నిబద్ధత, ఇష్టం ఉన్నాయని, రానున్న లోక్‌సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు తెలిపారు.
ఏఐఏడీఎంకే మేనిఫెస్టో విడుదల
ఏఐఏడీఎంకే పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. వాటిల్లో డీఎండీకే, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పుతియా తమిజగం నేతృత్వంలో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోని సైతం విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment