Vijay Kanth
-
లోక్‌సభ ఎన్నికల బరిలో ‘కెప్టెన్’ విజయ్ కాంత్ కుమారుడు
చెన్నై, తమిళనాడు : డీఎండీకే అధినేత, దివంగత నటుడు విజయ్‌కాంత్ తనయుడు వి.విజయ్ ప్రభాకర్ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడియన్ లీగ్ (డీఎండీకే) పార్టీ, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేల మధ్య పొత్తు కుదిరింది. అలయన్స్‌లో భాగంగా విజయ్ ప్రభాకర్ విరుధ్ నగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇదే స్థానం నుంచి ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ బీజేపీ తరుపున టికెట్ దక్కించుకున్నారు. డీఎంకే - ఇండియా అలయన్స్ మాత్రం అభ్యర్ధిని ప్రకటించలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కెప్టెన్ కుమారుడు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే విడుదల చేసిన 16 మంది లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో కెప్టెన్ విజయ్ కాంత్ కొడుకు విజయ్ ప్రభాకర్ పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా డీఎండీకే జనరల్ సెక్రటరీ, విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత మాట్లాడుతూ.. తన కుమారు విజయ్‌కి రాజకీయాల పట్ల నిబద్ధత, ఇష్టం ఉన్నాయని, రానున్న లోక్‌సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు తెలిపారు. ఏఐఏడీఎంకే మేనిఫెస్టో విడుదల ఏఐఏడీఎంకే పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. వాటిల్లో డీఎండీకే, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పుతియా తమిజగం నేతృత్వంలో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోని సైతం విడుదల చేసింది. -
విజయ్‌కాంత్‌పై ప్రేమతో ఆయన సతీమణి ఏం చేశారంటే..?
నటుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత తన చేతిపై భర్త బొమ్మను పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డీఎండికే అధినేత, నటుడు అనారోగ్యం కారణంగా గత డిసెంబర్లో కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఖననం చేశారు. విజయకాంత్ మృతి చెంది నెలరోజులు కావొస్తున్నా.. ఆయన స్మారక స్థూపానికి సినీ ప్రముఖులు, రాజకీయ పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు రోజూ పెద్దసంఖ్యలో తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు. ముఖ్యంగా బయట ప్రాతాల నుంచి చైన్నెకి వచ్చిమరీ అభిమానులు సందర్శిస్తున్నారు. అలాగే నిత్యం ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇదిలా ఉండగా విజయకాంత్ సతీమణి ప్రేమలత తాజాగా తన కుడిచేతిపై విజయకాంత్ బొమ్మను టాటూగా వేయించుకున్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిత్యం విజయకాంత్‌ను చూసుకునేలా ఈ టాటూ వేసుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రేమలత చేతికి పార్టీ పగ్గాలు..?
సాక్షి, చెన్నై(తమిళనాడు): విజయకాంత్ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా డీఎండీకే పగ్గాలు చేపట్టేందుకు ఆయన సతీమని ప్రేమలత విజయకాంత్ సిద్ధమవుతున్నారని డీఎండీకేలో చర్చ జరుగుతోంది. సినీ నటుడిగా రాజకీయ పార్టీ పెట్టి 2006 ఎన్నికల్లో తనకంటూ ఓటు బ్యాంక్‌ను డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ చాటుకున్నారు. 2011 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. దివంగత సీఎం జయలలితతో వైర్యం విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులు తెచ్చిపెట్టాయి. 2014 లోక్ సభ, 2016 అసెంబ్లీ, 2019 లోక్ సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ముఖ్య నేతలందరూ విజయకాంత్‌కు హ్యాండిచ్చారు. అయినా ఏ మాత్రం తగ్గకుండా పార్టీని విజయకాంత్ నడుపుతున్నారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ కోశాధికారిగా పగ్గాలు చేపట్టిన ఆయన సతీమని ప్రేమలత డీఎండీకేను ముందుండి నడిపిస్తున్నారు. అధ్యక్ష...లేదా ప్రధాన కార్యదర్శిగా.. నగర పాలక సంస్థల ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొనేందుకు డీఎండీకే సిద్ధం అవుతోంది. ఇందు కోసం పార్టీ పూర్తి బాధ్యతలను తన భుజాన వేసుకునేందుకు ప్రేమలత విజయకాంత్ సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ నిర్వాహక అధ్యక్ష పదవిని ప్రేమలత చేపట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే అధ్యక్షుడిగా విజయకాంత్ వ్యవహరిస్తున్న దృష్ట్యా, పార్టీలో కొత్తగా ప్రధాన కార్యదర్శి పదవిని సృష్టించి ఆ పదవి చేపట్టాలని ప్రేమలతకు జిల్లాల కార్యదర్శులు సూచించారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ, సర్వ సభ్య సమావేశంలో ఇందుకు తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు డీఎండీకేలో జోరుగా చర్చ జరుగుతోంది. విజయకాంత్ వారసులు సైతం పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టబోతున్నట్టు సమాచారం. -
వీరప్పన్‌కు తొలి వెండితెర జవాబు
అడవిలోని బందిపోట్లు ఆలివ్ గ్రీన్ డ్రస్‌లో మెడకు తూటాల పట్టీ వేలాడ దీసుకుని బుర్ర మీసాలతో ఉంటారని వీరప్పన్ కథ వల్ల మనకు తెలిసింది. కాని అడవి బయట ఉండే బందిపోట్లు తెల్ల చొక్కా తెల్ల పంచె కట్టుకుని భుజాన కండువాతో వేదికలెక్కి ఉపన్యాసాలిస్తుంటారని కూడా వీరప్పన్ కథ మనకు చెప్పింది. వీరప్పన్ దోచుకుంది కొంత. బయట అతని వల్ల దోచుకోబడింది కొండంత. ప్రభుత్వానికి ప్రభుత్వమే విలన్ అయితే ఎటువంటి విలన్స్ ఉబికి వస్తారనడానికి కూడా వీరప్పన్ కథ ఒక ఉదాహరణే. వీరప్పన్ తన పదిహేడవ ఏట మొదటి హత్య చేశాడు. దంతాల కోసం ఏనుగులను చంపుతున్నప్పుడు వాటిని అంకుశంతో బెదిరించవచ్చని అతడు గ్రహించాడు. కాని ‘భయం’ అనే అంకుశం ధరిస్తే ఏ మనిషి అయినా బెదిరిపోక తప్పదని కూడా గ్రహించాడు. డబ్బు సులభంగా రాదని డబ్బుకు వాటాదారులు ఎక్కువని కూడా అతడికి తెలుసు. వ్యవస్థకు ఎదురెళ్లాలంటే వ్యవస్థను లొంగదీసుకోవాలని కూడా తెలుసు. రెండు రాష్ట్రాలు... కర్నాటక, తమిళనాడు... వాటి సరిహద్దుల్లో ఉన్న అడవుల్లో రెండు రాష్ట్రాల వ్యవస్థలను లొంగదీసుకుని సామ్రాజ్యాన్ని స్థాపించినవాడు వీరప్పన్. నిజాయితీ ఉన్న అధికారి తన ప్రథమ శత్రువు అని తలచినవాడు. తెలుగు ప్రజలకు ఏ మాత్రం సంబంధం లేని ఈ కథకు ఒక ఉత్తమ ఆఫీసర్ బలి కావడం వల్ల కూడా తెలుగువారికి వీరప్పన్ విలన్ అయ్యాడు. వీరప్పన్‌ను మొదటగా అరెస్ట్ చేసిన ఒకే ఒక ఆఫీసర్– తెలుగువాడు– పందిళ్లపల్లి శ్రీనివాస్– వీరప్పన్‌కు పీడకలగా అవతరించాడు. అతణ్ణి 1986లో ఫారెస్ట్ ఆఫీసులో బంధించి విచారణ జరుపుతుండగా వీరప్పన్ తప్పించుకున్నాడు. అయినా శ్రీనివాస్ అతణ్ణి వదల్లేదు. ఉక్కిరిబిక్కిరి అయిన వీరప్పన్ 1991లో లొంగిపోతున్నానని కబురు పంపాడు. నిరాయుధంగా వస్తే లొంగిపోతానని చెప్పాడు. శ్రీనివాస్ అది నమ్మి వెళ్లి వీరప్పన్ చేతిలో హతమయ్యాడు. బొమ్మ ఒక్కటే ఉండదు. బొరుసు కూడా ఒక్కలాగే ఉండవు. వీరప్పన్‌కు క్రూరమైన వ్యక్తిత్వం ఉన్నట్టే మానవీయమైన వ్యక్తిత్వం కూడా వెతికే వారు ఉన్నారు. అది కనిపించవచ్చు కూడా. అయినప్పటికీ అతడు సంఘవ్యతిరేక శక్తి. సంఘానికి బెడదగా మారిన వ్యక్తి. అలాంటి వారు చట్టాన్నే కాదు కళలను కూడా ఆకర్షిస్తారు. వీరప్పన్‌ను అలా మొదటిసారి ఒక కమర్షియల్ సినిమాలోకి పట్టుకొచ్చిన సినిమా ‘కెప్టెన్ ప్రభాకర్’. దర్శకుడు మణివణ్ణన్‌కు శిష్యుడైన ఆర్.కె. సెల్వమణి సమకాలీన ఘటనల నుంచి కథలను రాసుకోవడంలో సిద్ధహస్తుడు. అతడి తొలి సినిమా ‘పోలీస్ విచారణ’ మద్రాసులో సీరియల్ కిల్లర్‌గా ఖ్యాతి చెందిన ‘ఆటో శంకర్’ జీవితం ఆధారంగా రాసుకున్న కథ. పెద్ద హిట్ అయిన ఈ సినిమాకు హీరో విజయ్‌కాంత్. ఈ సినిమా హిట్ కావడంతో దానిని నిర్మించిన ఇబ్రాహీమ్ రౌతర్ తదుపరి సినిమా కూడా సెల్వమణికే ఇచ్చాడు. హీరోగా మళ్లీ విజయ్కాంత్నే తీసుకున్నాడు. ఈసారి సెల్వమణి అప్పుడు విస్తృతంగా వార్తల్లో ఉన్న వీరప్పన్ పాత్రను తీసుకుని ‘కెప్టెన్ ప్రభాకర్’ కథ రాసుకున్నాడు. సినిమాలో వీరప్పన్ పట్టుబడతాడు. కాని వీరప్పన్ కథ ముగియడానికి ఈ సినిమా రిలీజైన 13 ఏళ్లు పట్టింది. గంధపు చెట్లు నరకడం, ఏనుగు దంతాలు సేకరించడం అడవిలో కష్టం కాదు. వాటిని రవాణా చేయడమే కష్టం. లారీలు చీమలు కావు చాటుగా వెళ్లడానికి. భారీ లారీల్లో గంధపు చెక్కలు రవాణా కావాలంటే దారుల వెంట ఉన్న చెక్‌పోస్ట్‌లు ‘ధారాళంగా’ ఉండాలి. ఆఫీసర్లు ఉదారంగా ఉండాలి. వారిపై అజమాయిషీ చేసే ఆఫీసర్లు, వారిని పోస్ట్ చేసే మంత్రులు కూడా ఉదారంగా ఉండాలి. తద్వారా లాభాన్ని పంచుకోవాలి. ఈ వ్యవస్థ ఇలా స్థిరపడి ఉండటం ఈ సినిమాలో చూపిస్తాడు. వీరప్పన్‌కు మద్దతుగా సినిమాలో స్థానిక ఎం.ఎల్.ఏ, కలెక్టర్, పోలీస్ కమిషనర్ పని చేస్తుంటారు. విజయ్‌కాంత్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా వచ్చేంతవరకు వీరప్పన్ ఊపుకు అడ్డే ఉండదు. విజయ్‌కాంత్ అతణ్ణి నిరోధించగలుగుతాడు. అయితే అడవిలో ఎక్కువ సేపు కథను నడపలేమని దర్శకునికి తెలుసు. అందుకే ఫస్టాఫ్‌లో సిటీలోనే కొంత కథను నడుపుతాడు. విజయ్‌కాంత్ పాత్రను గొప్పగా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అలాగే వీరప్పన్ పాత్రను కూడా. అడవిలోని వాతావరణం, గ్రామాల ప్రజలు, వీరప్పన్ బంధువర్గంలో అతడికి ఉండే విరోధులు, వాళ్ల పాత పగలు... ఇవన్నీ సినిమాలో అంతర్భాగం అవుతాయి. విజయ్‌కాంత్‌ను కేవలం ఒక ఆఫీసర్‌గా మాత్రమే చూపకుండా గృహస్తునిగా, భార్యా బిడ్డలతో, తల్లితో అనుబంధం ఉన్నవాడిగా కూడా చూపడం వల్ల స్త్రీల ప్రమేయం ఉన్న కథగా కూడా మారి మహిళా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సాధారణంగా సినిమాల్లో విలన్ల జోలికి పోలీసాఫీసరైన హీరో వెళితే అతడి కుటుంబం కష్టాల్లో పడుతుంటుంది. అది జోకనుకుంటాం. కాని ఇక్కడ నిజంగానే వీరప్పన్‌తో పెట్టుకుంటే అందరికీ ప్రమాదం వస్తుంది. కిడ్నాప్‌లకు మారుపేరైన వీరప్పన్ ఈ సినిమాలో కూడా విజయ్‌కాంత్ భార్యాబిడ్డల్ని కిడ్నాప్ చేస్తాడు. వాళ్లను విడిపించుకోవడమే క్లయిమాక్స్. తీరా వీరప్పన్‌ను పట్టుకుని ప్రభుత్వానికి అప్పజెప్తున్న సమయంలో అతడి ద్వారా తమ రహస్యాలు బయటపడతాయనుకున్న పెద్దలు అతణ్ణి షూట్ చేసి చంపేస్తారు. విజయ్‌కాంత్ ఆ పెద్దలను కూడా చంపి కోర్టులో సుదీర్ఘ వాదన చేసి బయటపడతాడు. ఇది కొంత వాస్తవ దూరంగా ఉన్నా సినిమాగా చూస్తున్నప్పుడు సరే అని అనిపిస్తుంది. కెప్టెన్ ప్రభాకర్ పెద్ద తెర మీద చూడాల్సిన, జనం చూసి మెచ్చిన సినిమా. కథ వల్ల, నేప«థ్యం వల్ల, దర్శకుడి ప్రతిభ వల్ల కూడా ఈ సినిమా రక్తి కట్టింది. అన్నింటికీ మించి వీరప్పన్ అనే పాత్ర వల్ల ఇది ఆకర్షవంతమైంది.ఈ సినిమా తర్వాత వీరప్పన్ మీద అనేక సినిమాలు వచ్చాయి. కాని కెప్టెన్ ప్రభాకర్ మాత్రం ఆ సినిమాలన్నింటిలో కెప్టెన్లాంటిది. నిజాయితీ నిండిన పోలీసాఫీసర్లకు సెల్యూట్లాంటిది. సెల్యూట్. కెప్టెన్ ప్రభాకరన్ సెల్వమణి దర్శకత్వంలో 1991లో తమిళంలో విడుదలైన ‘కెప్టెన్ ప్రభాకరన్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులో ‘కెప్టెన్ ప్రభాకర్’గా విడుదలై అంతే విజయం సాధించింది. ముఖ్యంగా బి, సి సెంటర్లలో హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచింది. అప్పట్లో తమిళపులి ‘ప్రభాకర్’కు తమిళనాట ఉన్న ఆదరణ కారణంగా హీరోకు ప్రభాకర్ అనే పేరు పెట్టారు. సాధారణంగా నూరో సినిమాలు అచ్చిరావనే అపప్రద తమిళంలో ఉంది. కానీ విజయ్‌కాంత్ నూరవ సినిమా అయిన ‘కెప్టెన్ ప్రభాకరన్’ బ్రహ్మాండమైన హిట్ అయ్యి విజయ్‌కాంత్‌కు ‘కెప్టెన్’ అనే ముద్దుపేరును సంపాదించి పెట్టింది. కేరళలోని ‘చాలకుడి’ ప్రాంతంలో అడవుల వెంట తీసిన ఈ సినిమా నిజంగానే గాఢమైన అడవుల్లో వీరప్పన్ కోసం వేట సాగిస్తున్నట్టుగా ఉంటుంది. ఈ సినిమాతో ‘మన్సూర్ అలీఖాన్’ విలన్‌గా తమిళంలో పెద్ద గుర్తింపు పొందాడు. రాజీవ్‌గాంధీ హత్య కేసు మీద ‘కుట్రపత్రికై’ తీసి సెన్సార్ కోరల్లో 14 ఏళ్ల పాటు చిక్కుకున్న సెల్వమణి కాలక్రమంలో ‘చామంతి’, ‘సమరం’ వంటి సినిమాలు తీసి నటి రోజా భర్తగా తెలుగువారి అల్లుడయ్యాడు. ఇక నటుడుగా, రాజకీయ నాయకునిగా విజయ్‌కాంత్ ప్రస్తుత పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. అతడికి మరో కెప్టెన్ ప్రభాకర్ అవసరం అయితే ఉంది. – కె -
ఆసుపత్రిలో కెప్టెన్
ఆందోళన వద్దన్న నేతలు సాధారణ పరీక్షలేనని ప్రకటన చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ ఆసుపత్రిలో చేరారు. మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్సలు అందిస్తున్నారు. ఏడాదికి ఓ మారు జరిగే సాధారణ వైద్య పరీక్షలు మాత్రమేనని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎండీకే కార్యాలయం ప్రకటించింది. సినీ నటుడిగా అశేష అభిమానుల నాయకుడిగా మన్ననల్ని అందుకున్న విజయకాంత్ డీఎండీకేతో రాజకీయాల్లో అడుగు పెట్టి ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి చేరిన విషయం తెలిసిందే. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లే కాదు, అడ్రస్సునూ గల్లంతు చేసుకుని పాతాళంలోకి నెట్టబడ్డారు. ముఖ్య నాయకులు బయటకు వెళ్లడంతో ఉన్న వారితో పార్టీని నెట్టుకొస్తున్నారు. మీలో ఒక్కడ్ని అన్న నినాదంతో కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునే విధంగా గత ఏడాది ఆగస్టు నుంచి జిల్లా పర్యటనలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరిన సమాచారం గురువారం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఆయన్ను విరుగంబాక్కం ఇంటి నుంచి మనపాక్కంలోని ఓ ప్రైవేటు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు సాగుతున్నాయి. విజయకాంత్ ఆసుపత్రిలో ఉన్న సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. ఇప్పటికే సింగపూర్‌లో ఆయనకు కొన్ని నెలల పాటుగా వైద్య చికిత్సలతో పాటు శస్త్ర చికిత్స జరిగినట్టు సంకేతాలు ఉన్నాయి. ఆయనకు మూత్ర పిండాల మార్పిడి జరిగినట్టుగా ప్రచారం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయాల్లో ఆయన హావాభావాలు, తీవ్ర ఇబ్బందులకు గురవుతూ కనిపించడంతో ఆరోగ్య పరిస్థితిపై మరో మారు ఆందోళనను రేగాయి. ఆయనకు టాన్సిల్స్ సమస్య ఉన్నట్టు స్వయంగా విజయకాంత్ సతీమణి ప్రేమలత ఆ సమయంలో వివరణ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో తాజాగా, విజయకాంత్‌ను చడీ చప్పుడు కాకుండా ఆసుపత్రిలో చేర్పించడం డీఎండీకే వర్గాల్లో ఆందోళనను రేపింది. దీంతో ఆ పార్టీ కార్యాలయం అప్రమత్తం అయింది. విజయకాంత్‌కు ఎలాంటి సమస్య లేదని, ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ఏడాదికి ఓ మారు చేయించుకోవాల్సిన సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్టు వివరించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య పరీక్షల అనంతరం ఒకటి రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటారని ప్రకటించారు. -
తాను మునిగి.. కరుణను ముంచిన కెప్టెన్
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పరాజయానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. అన్నింటికంటే ప్రధాన కారణం కెప్టెన్ విజయకాంతే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కెప్టెన్ తాను మునగడంతో పాటు.. కరుణను కూడా ముంచేశాడని చెబుతున్నారు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లుగానే ఎన్నికల్లో తమంతట తాముగా విజయం సాధించలేని కొన్ని పార్టీలు.. కొంతమేర ఓట్లను చీల్చుకోవడంతో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోతుంది. దాంతో ప్రతిపక్షాలు విజయం సాధించడం అసాధ్యం అవుతుంది. తమిళనాడులో సరిగ్గా ఇదే జరిగిందని విశ్లేషకులు వివరించారు. అమ్మ పాలనపై కొంతమేర వ్యతిరేకత ఉందని, అదే సమయంలో 91 ఏళ్ల వయసులో కరుణానిధి మండుటెండల్లో కూడా ఉధృతంగా ప్రచారం చేయడంతో ఆయన మీద సానుభూతి కలిగింది. కానీ, అదే సమయంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ రంగప్రవేశం చేయడం, ప్రజాస్వామ్య కూటమి పేరుతో కొన్ని పార్టీలను జత చేసుకోవడంతో కొంతమేర ఓట్లు చీలిపోయాయి. చాలా స్థానాల్లో డీఎంకే - అన్నాడీఎంకే అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా అతి స్వల్పంగా ఉంది. అదే డీఎంకే, ప్రజాస్వామ్య కూటమి ఓట్లను కలుపుకొంటే మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే ఎక్కువగానే కనిపిస్తోంది. దీన్ని బట్టే కెప్టెన్ తాను స్వయంగా సీఎం కాలేకపోయినా.. ముఖ్యమంత్రి కావాలన్న కరుణానిధి ఆశలకు కూడా గండికొట్టారు. -
విజయ్‌కాంత్‌కు బ్లాక్‌బ్లస్టర్ లేనట్లే!
చెన్నై: ఎట్టకేలకు తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల వంతే మిగిలింది. అది కూడా మరో రెండు రోజుల్లో.. ఈలోపు ఎవరికి తోచిన అంచనాలు వారివి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో కాస్తంత హడావిడిగా హంగుఆర్భాటంగా కనిపించిన వ్యక్తి మాత్రం విజయ్ కాంత్. డీఎండీకే అధ్యక్షుడు అయిన ఆయన గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రజాసంక్షేమకూటమి పేరుతో మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయనకు నిజంగానే తమిళనాడు ప్రజలు పట్టం కట్టబెట్టనున్నారా అన్నంత హడావిడి చేశారు. అదే క్రమంలో పలుమార్లు తన ప్రచార శైలితో విమర్శల పాలయ్యారు. నిజంగానే తమిళ ప్రజలు ఈసారి మనసు మార్చుకొని థర్డ్ ఫ్రంట్‌కు అధికారం కట్టబెట్టనున్నారా అనే అంశంపైన చర్చలు జరగడం.. అదే స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే, ఈ ఫ్రంట్ ప్రచారానికి భిన్నంగా.. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయిన తొలినాళ్లనాటి పార్టీలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఎలాంటి లొల్లి లేకుండానే ఈ ఎన్నికల్లో డీఎండీకేను కార్నర్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన ఓటింగ్ శాతం.. అక్కడి ప్రజల ప్రతిస్పందన ప్రకారం చివరకు తమిళ ప్రజలు పూర్తి స్థాయిలో డీఎంకే, ఏఐడీఎంకేలకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి అధికార మార్పిడి జరిగి మరోసారి తమిళనాడులో కరుణోదయం కానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. జయలలితకు భంగపాటు తప్పదని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయ చిత్రసీమలో ఇద్దరు అగ్ర నేతల చిత్రాల మధ్య సర్రున దూసుకెళ్దామనుకున్న డీఎండీకే అధినేత విజయ్ కాంత్ సినిమా ఊహించినంత బ్లాక్ బ్లస్టర్ కాదు కదా కనీసం యావరేజ్ కూడా అనిపించుకోబోదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
డీఎండీకే జాబితా విడుదల
సాక్షి, చెన్నై: బీజేపీ కూటమితో కలసి లోక్ సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డీఎం డీకేకు 14 స్థానాలను బీజేపీ కేటాయించింది. తమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయకాంత్ ప్రచార బాట పట్టారు. ఈనెల 14న తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన విజయకాంత్ తమ అభ్యర్థుల జాబితాను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తన టీవీ ఛానల్ ద్వారా ఐదుగురి పేర్లను ప్రకటించి కూటమిలో కలకలం సృష్టించారు. అదే సమయంలో నామక్కల్ అభ్యర్థి మహేశ్వరన్ తనకు సీటు వద్దు బాబోయ్ అంటూ ఆస్పత్రిలో చేరడం విజయకాంత్‌కు షాక్ తగలినట్టు అయింది. ఎట్టకేలకు సీట్ల పందేరం, స్థానాల ఎంపిక ఖరారు కావడం, కూటమి పార్టీలన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చెన్నైలో రెండు రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఎన్నికల బరిలో నిలబడే తమ అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసే పనిలో విజయకాంత్ నిమగ్నం అయ్యారు. అన్ని కసరత్తులు పూర్తి చేసి ఆదివారం త మ అభ్యర్థుల జాబితాను డీఎంకే పార్టీ కార్యాలయం అధికార పూర్వకంగా ప్రకటించింది. విజయకాంత్ ఆదేశాల మేరకు ఉదయం కోయంబేడులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం వర్గాలు ఈ జాబితాను మీడియాకు విడుదల చేశారుు. అభ్యర్థులు : సెంట్రల్ చెన్నై- జేకే రవీంద్రన్, తిరువళ్లూరు -యువరాజ్, ఉత్తర చెన్నై- సౌందర పాండియన్, సేలం - ఎల్కే సుదీష్ , తిరుచ్చి - ఏఎంజీ విజయకుమార్, తిరునల్వేలి-ఎస్ శివానంద పెరుమాల్, విల్లుపురం - కే ఉమా శంకర్, కడలూరు - రామానుజం, కళ్లకురిచ్చి - వీపీ ఈశ్వరన్, తిరుప్పూర్ - ఎన్ దినేష్‌కుమార్, దిండుగల్ - కృష్ణమూర్తి, నామక్కల్ - ఎస్కే వేల్, మదురై - శివముత్తుకుమార్, కరూర్- ఎన్ఎస్కృష్ణన్ పోటీ చేస్తారని ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన పలువురు అభ్యర్థులకు మళ్లీ సీట్లు ఇచ్చారు. తన బావమరిది సుదీష్‌ను సేలం నుంచి పోటీకి దించారు. సీట్ల పందేరంలో ఈ స్థానం కోసం బీజేపీ కూటమిపై డీఎండీకే తీవ్రంగానే ఒత్తిడి తెచ్చింది. అయితే, ఒక్క మహిళా అభ్యర్థికి కూడా విజయకాంత్ సీట్లు కేటాయించక పోవడం గమనార్హం. ఆలందూరు ఉప ఎన్నిక రేసులో ఎఎం కామరాజ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ప్రేమలత ప్రచార బాట: కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయకాంత్ రాష్ట్ర పర్యటనలో ఉంటే, కేవలం తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార బాటకు ఆయన సతీమణి ప్రేమలత సిద్ధమయ్యారు. రెండు రోజులకు ఒక నియోజకర్గం చొప్పున ఆమె పర్యటన షెడ్యూల్ సిద్ధం చేశారు. ఒకే నియోజకవర్గంలో ఏడెనిమిది చోట్ల ఆమె ప్రసంగాలు సాగనున్నారుు. ఆదివారం తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలో తమ అభ్యర్థి యువరాజ్‌కు మద్దతుగా ప్రచారాన్ని చేపట్టారు. సోమవారం కూడా ఆమె పర్యటించనున్నారు. 25న ఉత్తర చెన్నైలో, 26న ఆలందూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. 27, 28 తేదీల్లో సెంట్రల్ చెన్నై, 29,30 తేదీల్లో విల్లుపురం, ఏప్రిల్ 1,2 తేదీల్లో కడలూరు, 3,4 తేదీల్లో కళ్లకురిచ్చి, 5,6 తేదీల్లో సేలం, 7,8 తేదీల్లో నామక్కల్, 9,10 తేదీల్లో తిరుచ్చి, 11,12 తేదీల్లో కరూర్, 13,14న తిరుప్పూర్, 15,16న దిండుగల్, 17,18న తిరునల్వేలి, 19,20 తేదీల్లో మదురైలో ఆమె పర్యటన సాగనున్నది. -
వలసలు షురూ
: అన్నాడీఎంకేలోకి వలసలు మొదలయ్యూరుు. డీఎండీకే తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్ సుబ్రమణ్యం సీఎం జయలలితతో భేటీ అయ్యారు. డీఎండీకే రెబల్స్ జాబితాలో ఆయన కూడా చేరారు. పార్టీ నుంచి వలసలు మొదలవడంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష హోదాకు గండి పడనున్నది. ఆ పార్టీ మాజీ నేత బన్రూటి రామచంద్రన్ నేతృత్వంలో పలువురు నాయకులు గురువారం అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో అవతరించారు. అయితే, అన్నాడీఎంకేతో ఏర్పడిన వైరంతో ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్నాడీఎంకే పంచన చేరారు. డీఎండీకే రెబల్స్‌గా పార్టీ అధినేత విజయకాంత్‌కు ఆ ఏడుగురు చుక్కలు చూపిస్తున్నారు. ఇక, పార్టీ ప్రిసీడియం చైర్మన్ బన్రూటి రామచంద్రన్ అనారోగ్య కారణాలతో వైదొలిగారు. ఎమ్మెల్యే పదవికి , పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో డీఎండీకే సంఖ్యా బలం 29 నుంచి 21కు తగ్గింది. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న బన్రూటి రామచంద్రన్ ప్రస్తుతం అన్నాడిఎంకే పక్షాన చేరారు. ఆయన చేరికతో డీఎండీకే లో పెద్ద ఎత్తున వలసలు బయలుదేరడం తథ్యమన్న ఊహించినట్టుగానే వలసలు ప్రారంభమయ్యూరుు. వ లసలు: బన్రూటి రామచంద్రన్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు రామనాథన్, చిన్నస్వామి, అశోక్, తదితరులు పెద్ద ఎత్తు న తమ మద్దతుదారులతో గురువారం అన్నాడీఎం కే తీర్థం పుచ్చుకున్నారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో అధినేత్రి, సీఎం జయలలిత సమక్షంలో వీరంతా అన్నాడీఎంకేలో చేరారు. మరి కొం దరు అన్నాడీఎంకేలో చేరడానికి సిద్ధం అవుతోండటంతో డీఎండీకేలో గుబులు మొదలైంది.పార్టీ జిల్లా ల కార్యదర్శులు, ఇది వరకు బన్రూటితో సన్నిహితంగా ఉన్న నేతలందరూ అన్నాడీఎంకే బాట పట్టే పనిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ వర్గా లు బయటకు వెళుతుండటంతో వారిని అడ్డుకుని పార్టీని రక్షించుకునేందుకు విజయకాంత్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బృందాలు రంగంలోకి దిగాయి. పదవీ గండం:విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు గండి పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ పార్టీ తిరుత్తణి శాసన సభ్యుడు అరుణ్ సుబ్రమణ్యం సీఎం జయలలికు జై కొట్టారు. దీంతో డీఎండీ కే రెబల్స్ జాబితా ఎనిమిదికి చేరింది. సచివాల యంలో సీఎం జయలలితను నియోజకవర్గ అభివృ ద్ధి పేరుతో అరుణ్ సుబ్రమణ్యం కలిశారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని విన్నవించుకుంటూ, జయలలితకు ఆయన జై కొట్టారు. దీంతో విజయకాంత్ ఎమ్మెల్యే ల సంఖ్య 20కు పడిపోయింది. ఈ దృష్ట్యా, ఆయ న ప్రధాన ప్రతి పక్ష నేత పదవికి ఎసరు పెట్టేందుకు అన్నాడీఎంకే సిద్ధమవుతోంది.డీఎండీకేకన్నా, డీఎం కేకు ముగ్గురు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతి పక్ష హోదా దక్కే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ నుంచి అధికార పూర్వక ఆదేశాలు వెలువడాల్సి ఉంది. అయితే, అదే జరిగిన పక్షంలో రాష్ట్ర ప్రధాన ప్రతి పక్ష నేతగా డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ కావడం తథ్యం. పీఎంకే ఎమ్మెల్యే మంతనాలు: అసెంబ్లీలో పీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అనైకట్టు ఎమ్మెల్యే కళైయరసు ఉదయం సచివాలయంలో సీఎం జయలలితను కలుసుకున్నారు. తన నియోజకవర్గంలో కుంటుపడ్డ అభివృద్ధిని సీఎం దృష్టికి తీసుకెళ్లి, ఆదుకోవాలని విన్నవించారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కళైయరసు సీఎం జయలలితను కలవడంతో ఆయన ఇక ఆ పార్టీలోకి చేరినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈదృష్ట్యా, శాసన సభలో పీఎంకేకు రెబల్ ఎమ్మెల్యేగా కళైయరసు నిలవబోతున్నారు. అంతకు ముందుగా రాయపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీఎండీకే నాయకులతో పాటుగా నటి వెన్నిరాడై నిర్మల, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్‌లకు చెందిన అక్కడి పార్టీల నాయకులు అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. -
రంగవల్లుల్లో శాస్త్రీయత: విజయ్‌కాంత్
మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: మన పూర్వీకులు చేపట్టిన ప్రతి అంశంలో ఓ అర్థం, పరమార్థం దాగి ఉందని, రంగవల్లులు తీర్చిదిద్దడంలో కూడా శాస్త్రీయ పరిజ్ఞానం ఇమిడి ఉందని నేహషైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ విజయకాంత్ పేర్కొన్నారు. ‘సాక్షి’, నేహషైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా కేంద్రంలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఈ పోటీల్లో వయోబేధం లేకుండా మహిళలు, విద్యార్థినులతో పాటు ఓ మైనార్టీ మహిళ, పురుషుడు కూడా పాల్గొని, రంగవల్లులను తీర్చిదిద్దారు. వివిధ ఆకృతులు, పలు ఆకర్షణీయ రంగులతో రకరకాల ధాన్యాలు, కలశాలు, గొబ్బెమ్మలను అలంకరించారు. దేశభక్తి, సామాజిక అంశాలను జోడించిన సందేశాలను ముగ్గులతో పాటు ప్రదర్శించి జాతి సమైక్యత, ప్రజాహిత కార్యక్రమాలపై వారికున్న మమకారాన్ని చాటుకున్నారు. 96 మంది పాల్గొన్న ఈ పోటీ జిల్లా పరిషత్ మైదానానికి సంక్రాంతి శోభను చేకూర్చాయి. కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న డాక్టర్ విజయ్‌కాంత్ మాట్లాడుతూ ముగ్గుల్లో గణితం, సైన్స్, భౌగోళిక అనుసంధానం, దేశసంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయన్నారు. కుడి, ఎడమల సమాన దూరాన్ని, ప్రాముఖ్యతను పాటించే ముగ్గులు సమానత్వాన్ని సూచిస్తాయని, పసుపు, కుంకుమ ఆధ్యాత్మికతను వెల్లడిస్తాయన్నారు. సు న్నం, క్రిమికీటకాలను ఇళ్లలోకి రాకుండా కాపాడి ఆరోగ్యాన్ని పదిలపరుస్తాయని చెప్పారు. అన్ని రంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు మానసిక ప్రశాంతతను చేకూరుస్తాయని వివరించారు. జేపీఎన్ విద్యాసంస్థల అధిపతి కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ ముగ్గుల పోటీలు క్రమశిక్షణను, పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. సాక్షి యాజమాన్యం సంక్రాంతి సంబరాలను ముగ్గుల పోటీ రూపంలో చేపట్టడం అభినందనీయం ప్రశంసించారు. కలెక్టర్ సతీమణి అన్నపూర్ణ మాట్లాడుతూ ముగ్గులు, సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. ‘సాక్షి’ యూనిట్ ఎడిషన్ ఇన్‌చార్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తొలికిరణంతో పాటు తలుపులు తట్టే సాక్షి పత్రిక వార్తలనే కాకుండా సామాజిక అంశాలను సృజిస్తుందన్నారు. ‘సాక్షి’ని పాఠకులు తమ కుటుంబ సభ్యురాలిగా భావిస్తున్నారని అన్నారు. అనంతరం విజేతలతోపాటు పోటీల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులను అందజేశారు. అంతకుముందు ‘జగతి సిగలో జాబిలమ్మకు వందనం’ అంటూ నిహారిక, కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అంటు అనూష చేసిన నృత్యాలు, చంద్రముఖి కల్చరల్ అకాడమీ డెరైక్టర్ చంద్రశేఖర్, వాసవీ క్లబ్ ప్రతినిధి శ్రీనివాసులు చేసిన వ్యాఖ్యానాలు అలరించాయి. న్యాయనిర్ణేతలుగా కవిత, రాగసుధ, మంజులత వ్యవహరించారు. డీఆర్ఓ సతీమణి రాణి, సాక్షి బ్రాంచ్ మేనేజర్ తిరుపతిరెడ్డి, బ్యూరో ఇన్చార్జి రాజగోపాల్, సాక్షి టీవీ కరస్పాండెంట్ సుభాష్‌చంద్రబోస్, యాడ్స్, సర్క్యూలేషన్ మేనేజర్లు వెంకటేశ్, రవిశంకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే... ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి ఎన్.శ్రీలక్ష్మి(మహబూబ్‌నగర్), ద్వితీయ బహుమతి ఎస్.కరుణ(నారాయణపేట), తృతీ య బహుమతి కవిత(కొత్తకోట), ప్రోత్సాహక బహుమతులు జి.రమాదేవి(వనపర్తి), శుభాంగి, జ్యోత్స్న, సీహెచ్ నందిని (మహబూబ్‌నగర్), స్వప్న(షాద్‌నగర్) ఎంపికయ్యారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ ప్రత్యేక బహుమతులు అందజేశారు. -
తమిళనాట ప్రత్యక్ష రాజకీయాల్లోకి వదినమ్మ
తమిళనాట వదినమ్మ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. తమిళ సినీ రంగంలో కెప్టెన్‌గా, అభిమానులకు అన్నగా ప్రజాదరణ పొందిన విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత అలగర్‌స్వామి వచ్చే ఎన్నికల బరిలోకి దిగటాని ఆసక్తి చూపుతున్నారు. లోక్‌సభకు పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. విజయ్ కాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెండి తెర నుంచి రాజకీయ తెరపై మెరిసిన తమిళ స్టార్ విజయ్ కాంత్ డిఎండికే (దేశీయ ముర్పొక్కు ద్రవిడ ఖజగం) పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి రియల్ కెప్టెన్‌గా మారారు. రాజకీయాలలో ఆయనకు అన్ని విధాల భార్య ప్రేమలత సహరిస్తుంటారు. మొన్నటి ఎన్నికల్లో ఎత్తులు-పైఎత్తులు, పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు...వంటి అన్ని ప్రక్రియల్లోనూ విజయ్ కాంత్‌కు వెన్నుదన్నుగా నిలచారు. సూత్రధారిగా వ్యవహరించారు. ఈ మధ్య కాలంలో పార్టీలో అభిప్రాయ భేదాలు, కుమ్ములాటలు, కీలక నేతలు వలస దారిపట్టడంతో విజయ్ కాంత్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీలో పెద్ద తలకాయలా, విజయ్ కాంత్ కుడిభుజంగా ఉండే రామచంద్రన్ ఈ మధ్యనే రాజకీయాల నుంచి విమరించుకున్నారు. దాంతో పార్టీ పరిస్థితి మరింతగా దెబ్బతింది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికే భార్యను తెరపైకి తేవాలని విజయ్ కాంత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం తెర వెనుక ఉండి రాజకీయాలు నడిపిన ప్రేమలత ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. దీనికి పార్టీ అధిష్టానం అంగీకరించింది. తన రాజకీయ అరంగేట్రానికి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో ఏకంగా పార్లమెంటు ఎన్నికల బరిలో దిగాలన్న యోచనలో ప్రేమలత ఉన్నారు. కళ్ల కుర్చి లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లోక్‌సభ నియోజక వర్గ పరిధిలో డిఎండికేకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 5 నియోజక వర్గాల్లోనూ పార్టీకి చెప్పుకోదగ్గ ఆదరణే ఉంది. అందుకే ఈ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఏదైనా ఇతర రాజకీయ పార్టీ పొత్తుతో గానీ లేదా ఒంటరిగానైనా పోటీ చేయాలని ప్రేమలత నిర్ణయించుకున్నట్లు సమాచారం. తమిళ నాట ఇప్పటికే కాంగ్రెస్ నుంచి జయంతీ నటరాజన్, డిఎంకే నుంచి కనిమొళి, బిజెపి నుండి తమిళిసై సౌందర్ రాజన్, అన్నా డిఎంకే నుండి గోకుల ఇందిర, పిఎంకే నుండి సౌమ్య అన్బుమణి వంటి మహిళా నాయకురాళ్లు సత్తా చాటుతున్నారు. ఆ కోవలో తాను పయనించాలని ప్రేమలత పట్టుదలగా ముందుకు సాగుతున్నారు. -
ఇళయదళపతి వయసు 21
నటుడు విజయ్‌కి ఆయన అభిమానుల కట్టబెట్టిన బిరుదు ఇళయదళపతి. అయితే ఆయన వయసు 21. ఏమిటంటారా? చూపరులకిప్పటికీ ఆయన 21 ఏళ్ల యువకుడిగానే కనిపిస్తారు. అయితే విజయ్ నిజ వయసు 21 ఏళ్లు కాకపోయినా ఆయన సినీ వయసు మాత్రం ఖచ్చితంగా 21 ఏళ్లే. విజయ్ 1992లో నాళయ తీర్పు చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. రెండవ చిత్రం సెంధూరపాండి. ఇందులో విజయ్‌కాంత్‌తో కలిసి నటించారు. అయితే 1996లో నటించిన పూవే ఉనక్కాగ చిత్రం విజయం విజయ్ను స్టార్‌ను చేసింది. ఆ తరువాత నేరుక్కునేర్, కాదలుక్కు మరియాదై, తుళ్లాదమనం తుళ్లుం, ఖుషి, ఫ్రెండ్స్, తిరుమలై, గిల్లీ, తిరుపాచ్చి, శివకాశి వంటి పలు చిత్రాల విజయపరంపర విజయ్ను నెంబర్‌వన్ హీరోను చేశాయి. గత ఏడాది విజయ్ నటించిన తుపాకీ వందకోట్ల క్లబ్‌కు చేరింది. ప్రస్తుతం నటిస్తున్న జిల్లా చిత్రం సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ 21 ఏళ్ల నట వయసులో 56 చిత్రాల్లో నటించడం విశేషం. ఈ సందర్భంగా ఈ ఇళయదళపతికి చిత్ర ప్రముఖులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.