సాక్షి, చెన్నై:
బీజేపీ కూటమితో కలసి లోక్ సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డీఎం డీకేకు 14 స్థానాలను బీజేపీ కేటాయించింది. తమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయకాంత్ ప్రచార బాట పట్టారు. ఈనెల 14న తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన విజయకాంత్ తమ అభ్యర్థుల జాబితాను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తన టీవీ ఛానల్ ద్వారా ఐదుగురి పేర్లను ప్రకటించి కూటమిలో కలకలం సృష్టించారు.
అదే సమయంలో నామక్కల్ అభ్యర్థి మహేశ్వరన్ తనకు సీటు వద్దు బాబోయ్ అంటూ ఆస్పత్రిలో చేరడం విజయకాంత్‌కు షాక్ తగలినట్టు అయింది. ఎట్టకేలకు సీట్ల పందేరం, స్థానాల ఎంపిక ఖరారు కావడం, కూటమి పార్టీలన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చెన్నైలో రెండు రోజుల క్రితం ప్రకటించారు.
దీంతో ఎన్నికల బరిలో నిలబడే తమ అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసే పనిలో విజయకాంత్ నిమగ్నం అయ్యారు. అన్ని కసరత్తులు పూర్తి చేసి ఆదివారం త మ అభ్యర్థుల జాబితాను డీఎంకే పార్టీ కార్యాలయం అధికార పూర్వకంగా ప్రకటించింది. విజయకాంత్ ఆదేశాల మేరకు ఉదయం కోయంబేడులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం వర్గాలు ఈ జాబితాను మీడియాకు విడుదల చేశారుు.
అభ్యర్థులు : సెంట్రల్ చెన్నై- జేకే రవీంద్రన్, తిరువళ్లూరు -యువరాజ్, ఉత్తర చెన్నై- సౌందర పాండియన్, సేలం - ఎల్‌కే సుదీష్ , తిరుచ్చి - ఏఎంజీ విజయకుమార్, తిరునల్వేలి-ఎస్ శివానంద పెరుమాల్, విల్లుపురం - కే ఉమా శంకర్, కడలూరు - రామానుజం, కళ్లకురిచ్చి - వీపీ ఈశ్వరన్, తిరుప్పూర్ - ఎన్ దినేష్‌కుమార్, దిండుగల్ - కృష్ణమూర్తి, నామక్కల్ - ఎస్‌కే వేల్, మదురై - శివముత్తుకుమార్, కరూర్- ఎన్‌ఎస్‌కృష్ణన్ పోటీ చేస్తారని ప్రకటించారు.
గత లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన పలువురు అభ్యర్థులకు మళ్లీ సీట్లు ఇచ్చారు. తన బావమరిది సుదీష్‌ను సేలం నుంచి పోటీకి దించారు. సీట్ల పందేరంలో ఈ స్థానం కోసం బీజేపీ కూటమిపై డీఎండీకే తీవ్రంగానే ఒత్తిడి తెచ్చింది. అయితే, ఒక్క మహిళా అభ్యర్థికి కూడా విజయకాంత్ సీట్లు కేటాయించక పోవడం గమనార్హం. ఆలందూరు ఉప ఎన్నిక రేసులో ఎఎం కామరాజ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
ప్రేమలత ప్రచార బాట: కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయకాంత్ రాష్ట్ర పర్యటనలో ఉంటే, కేవలం తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార బాటకు ఆయన సతీమణి ప్రేమలత సిద్ధమయ్యారు. రెండు రోజులకు ఒక నియోజకర్గం చొప్పున ఆమె పర్యటన షెడ్యూల్ సిద్ధం చేశారు. ఒకే నియోజకవర్గంలో ఏడెనిమిది చోట్ల ఆమె ప్రసంగాలు సాగనున్నారుు. ఆదివారం తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలో తమ అభ్యర్థి యువరాజ్‌కు మద్దతుగా ప్రచారాన్ని చేపట్టారు.
సోమవారం కూడా ఆమె పర్యటించనున్నారు. 25న ఉత్తర చెన్నైలో, 26న ఆలందూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. 27, 28 తేదీల్లో సెంట్రల్ చెన్నై, 29,30 తేదీల్లో విల్లుపురం, ఏప్రిల్ 1,2 తేదీల్లో కడలూరు, 3,4 తేదీల్లో కళ్లకురిచ్చి, 5,6 తేదీల్లో సేలం, 7,8 తేదీల్లో నామక్కల్, 9,10 తేదీల్లో తిరుచ్చి, 11,12 తేదీల్లో కరూర్, 13,14న తిరుప్పూర్, 15,16న దిండుగల్, 17,18న తిరునల్వేలి, 19,20 తేదీల్లో మదురైలో ఆమె పర్యటన సాగనున్నది.
డీఎండీకే జాబితా విడుదల
Published Mon, Mar 24 2014 12:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement