Dmdk
-
తమిళ రాజకీయాల్లో కెప్టెన్ సంచలనాలు
చెన్నై: డీఎండీకే అధినేత, సినీ నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వందకిపైగా చిత్రాలతో తమిళ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారాయన. అయితే.. విజయ్ కాంత్ అటు సినీ రంగం ద్వారా యాక్షన్ హీరోగానే కాదు.. తమిళ రాజకీయాల్లోనూ సొంత పార్టీ డీఎండీకే ద్వారా సంచలనాలు కేరాఫ్‌గా నిలిచారాయన. తద్వారా కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత మాదిరే.. విజయ్‌కాంత్ తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. తన రాజకీయ ప్రస్థానంలో విజయకాంత్ రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. 2005 సెప్టెంబర్‌లో విజయ్‌కాంత్ డీఎండీకే(దేశీయ మర్పోక్కు ద్రావిడ కజగం) పార్టీని స్థాపించారు. 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారిగా విజయ్‌కాంత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. విరుదాచలం నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గారాయన. అయితే.. ఆ ఎన్నికల్లో 234 స్థానాల్లో పోటీ చేసిన డీఎడీకే తరఫున విజయ్‌కాంత్ ఒక్కడే విజయం సాధించారు. అనంతరం, 2009 జనరల్ ఎలక్షన్స్‌లో 40 స్థానాల్లో డీఎండీకే పోటీలో నిలిచింది. తమిళనాడులో 39 స్థానాల్లో, పుదుచ్చేరిలో ఒక్క స్థానం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ప్రతిపక్ష నేతగా.. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకే పెను సంచలనం సృష్టించింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో డీఎండీకే పొత్తు పెట్టుకుంది. ఎన్నికల్లో డీఎండీకే 41 స్థానాల్లో పోటీ చేయగా 29 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో, విజయకాంత్ శాసనసభ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఐదేళ్లపాటు.. అంటే 2016 ఎన్నికల వరకు శాసనసభపక్ష నేతగా కొనసాగారు. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో పరాజయం పొందారు. 2019 పార్లమెంట్ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పోటీ చేయగా ఘోర ఓటమిని చవిచూసింది. 2016 ఎన్నికల తరువాత, జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ కారణంగా విజయకాంత్ అన్నాడీఎంకే నుండి విడిపోయాడు. ఇక, బీజేపీతో డీఎండీకేతో ఎన్డీయే నాయకుల సంప్రదింపులు జరిపారు. ఒకానొక సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ.. విజయ్‌కాంత్‌కు ప్రత్యేక సూచన ఇచ్చి ఆయనను తన స్నేహితుడిగా పేర్కొన్నారు. పార్టీలో చోటుచేసుకున్న వెన్నుపోటు రాజకీయాల కారణంగా విజయ్‌కాంత్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన తరచుగా ఆసుపత్రిపాలు కావాల్సి వచ్చింది. ఇదీ చదవండి: కెప్టెన్ విజయ్‌కాంత్ అస్తమయం -
విషమంగా విజయకాంత్ ఆరోగ్యం
సాక్షి, చైన్నె: డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోగ్యంపై ఆ పార్టీ వర్గాలలో ఆందోళన నెలకొంది. ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు బుధవారం బులెటిన్ విడుదలైంది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అందులో వైద్యులు వెల్లడించారు. వివరాలు.. డీఎండీకే అధినేత విజయకాంత్ ఈనెల 18వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన్ని మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఆయన అవయవాల పరిస్థితిపై వైద్యులు పరిశోధించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తుండటం, తరచూ శ్వాస సమస్య తలెత్తినట్టుగా, కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆయన ఆరోగ్యంపై వదంతులు రావడంతో దేరడంతో వాటిని నమ్మవద్దని డీఎండీకే కార్యాలయం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో బుధవారం వెలువడ్డ బులిటెన్ డీఎండీకే వర్గాలలో ఆందోళన రెకెత్తించాయి. విజయకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అవశ్యమైనట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చికిత్స కొనసాగుతోందని, ఆయన మరో రెండు వారాలు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని ఆ బులిటెన్‌లో పేర్కొనడం డీఎండీకే వర్గాలను కలవరంలో పడేశాయి. గతంలో విజయకాంత్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆయన ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. తాజాగా ఆయనకు మరోమారు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడం గమనార్హం. -
డీఎండీకేలో జోష్ నింపిన కెప్టెన్
సాక్షి, చైన్నె: సినీ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ శుక్రవారం 71వ వసంతంలోకి అడుగుపెట్టారు. చాలా కాలం తర్వాత ఆయన జనంలోకి వచ్చారు. ఆయన్ను చూడగానే డీఎండీకే నాయకులు సంతోషంతో మునిగిపోయారు. విజయకాంత్ సినీ, రాజకీయ ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం ఆయన ఇంటికే పరిమితమయ్యారు. పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, పార్టీ కోశాధికారి ప్రేమలత విజయకాంత్ తన భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో విజయకాంత్‌ను చూడలేకపోతున్నామే అన్న ఆవేదనలో ఉన్న కేడర్‌కు ఆయన జన్మదిన వేడుక అవకాశం కల్పించింది. తన బర్త్‌డే సందర్భంగా ఇంటి నుంచి విజయకాంత్ బయటకు వచ్చారు. పార్టీ కార్యాలయంలో కేడర్ ముందు ప్రత్యక్షం అయ్యారు. ఆనందోత్సాహం కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయానికి ఉదయం 11 గంటల సమయంలో విజయకాంత్ వచ్చారు. వీల్ చైర్ మీద నుంచే ఆయన కేడర్ ముందుకు వచ్చారు. ఆయన్ను చూసేందుకు పెద్ద ఎత్తున డీఎండీకే శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. విజయకాంత్‌ను చూడగానే కరుప్పు ఎంజీఆర్ అన్న నినాదాలు మార్మోగాయి. ఆయనతో ఫొటోలు దిగేందుకు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఎగబడ్డారు. డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్‌తో పాటుగా ముఖ్య నాయకులు రాష్ట్రవ్యాప్తంగా తరలి వచ్చిన జిల్లా కార్యదర్శులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. పార్టీ బలోపేతం దిశగా ముందుకెళ్లాలని పిలుపు నిచ్చారు. విజయకాంత్ తనయుడు విజయ్ ప్రభాకరన్, షణ్ముగ పాండియన్ వచ్చిన వారందర్నీ ఆహ్వానించారు. విజయకాంత్‌తో అందరూ ఫొటోలు దిగేందుకు వీలు కల్పించారు. అలాగే, తన బర్త్‌డే కేక్ కట్ చేసిన విజయకాంత్ తన వారసుడు షణ్ముగ పాండియన్ నటించనున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. విజయకాంత్‌కు సీఎం స్టాలిన్, విశ్వనటుడు కమల్‌తో పాటు పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రేమలత చేతికి పార్టీ పగ్గాలు..?
సాక్షి, చెన్నై(తమిళనాడు): విజయకాంత్ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా డీఎండీకే పగ్గాలు చేపట్టేందుకు ఆయన సతీమని ప్రేమలత విజయకాంత్ సిద్ధమవుతున్నారని డీఎండీకేలో చర్చ జరుగుతోంది. సినీ నటుడిగా రాజకీయ పార్టీ పెట్టి 2006 ఎన్నికల్లో తనకంటూ ఓటు బ్యాంక్‌ను డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ చాటుకున్నారు. 2011 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. దివంగత సీఎం జయలలితతో వైర్యం విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులు తెచ్చిపెట్టాయి. 2014 లోక్ సభ, 2016 అసెంబ్లీ, 2019 లోక్ సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయి. ముఖ్య నేతలందరూ విజయకాంత్‌కు హ్యాండిచ్చారు. అయినా ఏ మాత్రం తగ్గకుండా పార్టీని విజయకాంత్ నడుపుతున్నారు. కొంత కాలంగా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ కోశాధికారిగా పగ్గాలు చేపట్టిన ఆయన సతీమని ప్రేమలత డీఎండీకేను ముందుండి నడిపిస్తున్నారు. అధ్యక్ష...లేదా ప్రధాన కార్యదర్శిగా.. నగర పాలక సంస్థల ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొనేందుకు డీఎండీకే సిద్ధం అవుతోంది. ఇందు కోసం పార్టీ పూర్తి బాధ్యతలను తన భుజాన వేసుకునేందుకు ప్రేమలత విజయకాంత్ సిద్ధమవుతున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో దీనిపై చర్చ జరిగినట్లు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ నిర్వాహక అధ్యక్ష పదవిని ప్రేమలత చేపట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అయితే అధ్యక్షుడిగా విజయకాంత్ వ్యవహరిస్తున్న దృష్ట్యా, పార్టీలో కొత్తగా ప్రధాన కార్యదర్శి పదవిని సృష్టించి ఆ పదవి చేపట్టాలని ప్రేమలతకు జిల్లాల కార్యదర్శులు సూచించారు. మరి కొద్ది రోజుల్లో జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ, సర్వ సభ్య సమావేశంలో ఇందుకు తీర్మానాలు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు డీఎండీకేలో జోరుగా చర్చ జరుగుతోంది. విజయకాంత్ వారసులు సైతం పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టబోతున్నట్టు సమాచారం. -
నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన..
సాక్షి, చెన్నై: అన్యుల మాటలకు మోసపోయి పార్టీకి ద్రోహం చెయొద్దు, పార్టీపై దుష్ప్రచారం చేసే వారిని నమ్మవద్దని కార్యకర్తలకు డీఎండీకే అధ్యక్షులు విజయ్‌కాంత్ విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి తీవ్ర ఆవేదనతో సోమవారం విడుదల చేసిన ప్రకటనలోని అంశాలు ఇలా.. ‘తమిళనాడులో మార్పు తీసుకువచ్చి, రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయాలనే ఉన్నతమై సంకల్పంతో డీఎండీకేను స్థాపించానన్న సంగతి మీకందరికీ తెలుసు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజాసంక్షేమం కోసం నా అభిమాన సంఘాలు పనిచేశాయి. అభిమాన సంఘాలు పార్టీలో విలీనమైన తరువాత నాకు అండగా నిలిచింది మీరే. అందరూ కష్టపడి బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. చదవండి: (నేరగాడిగా చిత్రీకరించే ఆ వ్యాఖ్యలు నొప్పించాయి: విజయ్ ఆవేదన) అయితే ఇప్పుడు కొందరు కార్యకర్తలు బ్రెయిన్‌వాష్ చేసే వారి మాటలు నమ్మి పార్టీని వీడివెళ్లడం.. నాకు మాత్రమే కాదు పార్టీకే ద్రోహం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నాను. ఇలా వీడి వెళ్లడం మీ బలహీనతను చాటుతోంది. అవకాశవాదంతో ఈ నిర్ణయం తీసుకున్నా మని మీరంతా బాధపడే రోజు వస్తుంది. నా ఆరోగ్యం క్షీణించి ఉన్న విషయం నిజమే. ఈమాత్రాన పార్టీకి భవిష్యత్ లేదని భావించడం సరికాదు. వందేళ్లయినా డీఎండీకేను రూపుమాపడం ఎవ్వరివల్ల కాదు. చదవండి: (అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు) తమిళనాడులో ఎప్పటికీ అది వేళ్లూనుకునే ఉంటుంది. పార్టీని ప్రగతిబాటలో తీసుకు వెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృతనిశ్చయంతో ఉండాలి. పార్టీని అప్రతిష్టపాలు చేసేవారి మాటలు నమ్మవద్దు. పార్టీని వీడేలా ప్రలో భాలకు గురిచేస్తున్న వారిని ఖండించడంతోపాటూ అలాంటి వ్యక్తులను గుర్తించి ప్రధాన కార్యాలయం దృష్టికి తీసుకెళ్లండి. అందరం కలిసి బలమైన పార్టీగా ముందుకు సాగుదాం’ అని విజ్ఞప్తి చేశారు. -
విజయకాంత్‌కు అనార్యోగం? చికిత్స కోసం అమెరికాకు..
సాక్షి, చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ వైద్య చికిత్స కోసం సోమవారం చెన్నై నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లారు.దీంతో విజయకాంత్ ఆరోగ్యంపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి.ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్నేళ్ల క్రితం, సింగపూర్, అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చారు. అయినా ఆశించినంతగా ఆరోగ్యం మెరుగుపడలేదు. ప్రస్తుతం పార్టీ బాధ్యతలను ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలతకు అప్పగించి ఇంటి వద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అడపాదడపా చెన్నైలోని ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. సెకెండ్ వేవ్‌లో ఆయన కరోనా బారినపడి కోలుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రసంగాలు చేయలేక ప్రజలకు చేతితో సైగలు చేస్తూ నామమాత్రంగా ప్రచారం నిర్వహించారు. ఈనెల 25వ తేదీన జన్మదినం కూడా జరుపుకున్నారు. మాట్లాడే సామర్థ్యం, తానుగా లేచి నిలబడే శక్తిని కోల్పోయి బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం విజయకాంత్ తన కుమారుడు షణ్ముగపాండియన్, సహాయకులు కుమార్, సోములతో మళ్లీ అమెరికాకు పయనమయ్యారు. చదవండి : '40 ఏళ్ల క్రితం ఈ అమ్మాయి కనిపిస్తే నాకు విడాకులు అయ్యేవి కావు' Karthikeya 2: హీరోయిన్ను రివీల్ చేశారు.. -
Tamil Nadu: స్టాలిన్‌తో జతకట్టనున్న నటుడు విజయ్‌కాంత్!
ఉదయసూర్యుని (డీఎంకే చిహ్నం) కిరణాల ధాటికి రాష్ట్రంలోని రెండాకులు (అన్నాడీఎంకే చిహ్నం) విలవిల్లాడుతున్నాయి. రెండాకుల నీడను వీడి, దినకరన్ పంచన చేరిన విజయకాంత్ ఇకపై ఉదయసూర్యుడి కోసం ఢంకా (డీఎండీకే చిహ్నం) భజాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు విజయకాంత్ అధ్యక్షతన డీఎండీకే ఏర్పడిన తరువాత రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొంది. 2011 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే కూటమిలో చేరింది. అధికార అన్నాడీఎంకే తరువాత అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా ప్రధాన ప్రతిపక్షస్థానం హోదాను పొందింది. ఆ తరువాత జయలలితతో విబేధించి 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే సహా పలుపార్టీలు ఏకమై ప్రజా సంక్షేమ కూటమిని ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగి అందరూ బోల్తాపడ్డారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగిన డీఎంకేడీకే, టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే కూటమిలో చేరింది. అయితే ఆ కూటమి కనీసం ఒక్కసీటులో కూడా గెలుపొందలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందని కొందరు అంచనా వేసినా అది జరగలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత డీఎండీకే తరఫున విజయకాంత్ బావమరిది ఎల్కే సుధీష్, కుమారుడు విజయ్ ప్రభాకరన్ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత సీఎం స్టాలిన్ అనారోగ్యంతో ఉన్న విజయకాంత్‌ను ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడు కరోనా నివారణ కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.10 లక్షలను విజయకాంత్ అందజేశారు. ఈ పరిణామాలతో డీఎంకే, డీఎండీకే కార్యకర్తలు, నిర్వాహకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. మరికొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా డీఎంకే కూటమిలో డీఎండీకే చేరుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకే శ్రేణుల కూడా ఇదే ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఏమీ సాధించలేమని డీఎండీకే నేత ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే డీఎంకే కూటమిలో చేరాలని భావించాం, అయితే చివరి రోజుల్లో ఆ నిర్ణయం మారిపోయిందని సీనియర్ నేత ఒకరు పెదవి విరిచారు. అన్ని పార్టీలతోపాటూ డీఎండీకే కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు స్థానిక ఎన్నికల్లో చవిచూడరాదని డీఎండీకే గట్టిగా భావిస్తోంది. డీఎంకే కూటమిలో చేరి స్థానిక ఎన్నికల బరిలో దిగేందుకు నిర్ణయించుకున్న డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి, కోశాధికారి ప్రేమలత త్వరలో పార్టీ నిర్వాహకులతో సమావేశం అవుతున్నట్లు సమాచారం. అదే సమావేశంలో డీఎంకే కూటమిలో డీఎండీకే చేరడంపై అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. -
కెప్టెన్ ఇంటికి సీఎం స్టాలిన్.. ఆత్మీయ పలకరింపు
సాక్షి, చెన్నై: అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితమైన డీఎండీకే అధినేత విజయకాంత్‌ను సీఎం ఎంకే స్టాలిన్ ఆదివారం పరామర్శించారు. డీఎంకే పార్టీ నేతలు దురైమురుగన్, రాజాలతో కలిసి విరుగంబాక్కంలోని విజయకాంత్ ఇంటికి స్టాలిన్ వెళ్లారు. విజయకాంత్‌ను శాలువతో సత్కరించారు. తన పక్కన కూర్చోవాలని స్టాలిన్‌ను విజయకాంత్ కోరడం విశేషం. 15 నిమిషాల పాటు స్టాలిన్ అక్కడే గడిపారు. వారితో పాటు విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత, తనయుడు విజయ ప్రభాకరన్, బావమరిది సుదీష్ ఉన్నారు. అనంతరం కరోనా నివారణ నిధికి రూ. 10 లక్షల చెక్కును విజయకాంత్ సీఎంకు అందజేశారు. రాజకీయ వైర్యం మరిచి తమ నేతను స్టాలిన్ కలవడంపై డీఎండీకే నేతలు హర్షం వ్యక్తం చేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిని వీడి అమ్మామక్కల్ మునేట్ర కళగంతో కలిసి పోటీచేసిన డీఎండీకే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. -
ఆసుపత్రి నుంచి కెప్టెన్ విజయకాంత్ డిశ్చార్జ్
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విజయకాంత్ కోలుకొని ఇంటికి చేరుకున్నారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆయన క్షేమంగా ఉన్నారని, అనవసరంగా ఆయన ఆరోగ్యం గురించి లేనిపోని పుకార్లు సృష్టించవద్దని అభ్యర్థించారు. కాగా ఈనెల 19న విజయ్‌కాంత్ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఊపిరాడని సమస్య మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై మనప్పాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అప్పటినుంచి విజయ్‌కాంత్ ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. పార్టీ కార్యాలయం తాజాగా విడుదల చేసిన ప్రకటనతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కెప్టెన్ అంటూ ప్రజలతో అభిమానంగా పిలువబడే విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను సింగపూరులో చికిత్స చేయించి సుమారు మూడునెలల తరువాత చెన్నైకి తీసుకొచ్చారు. దాదాపుగా మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనకుండా ప్రధాన కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. పార్టీ కోశాధికారి హోదాలో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని నడుపుతున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండా కారులోనే కూర్చుండి సైగలతో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఆయన మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు. చదవండి : Vijayakanth Health Condition 2021: విజయ్ కాంత్‌కు అస్వస్థత టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత -
Vijayakanth Health Condition 2021: విజయ్ కాంత్‌కు అస్వస్థత
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు, నటుడు విజయకాంత్ అనారోగ్యం మరోసారి ఆందోళనకరంగా మారింది. ఆయన్ను బుధవారం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చగా ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నారు. కెప్టెన్ అంటూ ప్రజలతో అభిమానంగా పిలువబడే విజయకాంత్ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన కుటుంబ సభ్యులు విజయకాంత్‌ను సింగపూరులో చికిత్స చేయించి సుమారు మూడునెలల తరువాత చెన్నైకి తీసుకొచ్చారు. దాదాపుగా మాట కూడా పడిపోయింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనకుండా ప్రధాన కార్యాలయంలో జరిగే ముఖ్యమైన సమావేశాలకు మాత్రమే హాజరవుతున్నారు. పార్టీ కోశాధికారి హోదాలో ఆయన సతీమణి ప్రేమలత పార్టీని నడుపుతున్నారు. అడపదడపా చెన్నై రామాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన హెల్త్చెకప్ చేయించుకుంటున్నారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొత్తు విషయంలో విపరీత జాప్యం చోటుచేసుకుంది. విజయకాంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అంశం కూడా అనుమానంగా మారింది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కూటమిలో చేరిన డీఎండీకే అభ్యర్థుల కోసం విజయకాంత్ తిరుచ్చిరాపల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించినా ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఏమీ మాట్లాడకుండా కారులోనే కూర్చుండి సైగలతో ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత ఆయన మళ్లీ ఇంటికే పరిమితమయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయనకు అకస్మాత్తుగా ఊపిరాడని సమస్య మొదలైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చెన్నై మనప్పాక్కంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. విజయకాంత్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స చేస్తున్నట్లు సమాచారం. ‘అలవాటుగా జరుపుకునే హెల్త్చెకప్ కోసం విజయకాంత్‌ను ఆసుపత్రిలో చేర్చాం. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఒకటి, రెండు రోజుల్లో ఇంటికి చేరుతారు. వదంతులను నమ్మవద్ద’ని పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. -
ప్రేమలతకు కరోనా.. రంగంలోకి దిగిన కెప్టెన్
సాక్షి, చెన్నై : డీఎండీకే నేత విజయకాంత్ ఎట్టకేలకు ప్రజల్లోకి వచ్చారు. బుధవారం గుమ్మిడి పూండిలో రోడ్ షోతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక ప్రచారంలో ఉన్న ప్రేమలత విజయకాంత్‌కు అధికారులు షాక్ ఇచ్చారు. అమ్మ మక్కల్ కూటమితో కలిసి డీఎండీకే ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసింది. డీఎండీకే అభ్యర్థులు 60 స్థానాల్లో పోటీచేస్తున్నారు. అయితే, ఈ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లే డీఎండీకే నేతలు కరువయ్యారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత విరుదాచలంలో పోటీచేస్తుండటంతో, ఆమె ఆ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఇతర అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఇక, విజయకాంత్ బావ మరిది, పార్టీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సుదీష్ కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో డీఎండీకే అభ్యర్థులకు మద్దతుగా కదిలే నేతలు ఆ పార్టీలో కరువయ్యారు. ఈ పరిస్థితుల్లో అనారోగ్యంతో ఇంటికీ, లేదా కార్యాలయానికి పరిమితమైన విజయకాంత్, తన అభ్యర్థుల కోసం అడుగుబయట పెట్టకతప్పలేదు. బు«ధవారం సాయంత్రం హఠాత్తుగా ఆయన ప్రచార పర్వంలోకి అడుగు పెట్టారు. ఐదు రోజుల పర్యటన... విజయకాంత్ ఎన్నికల ప్రచారంలో విరుదాచలంతోపాటుగా మరో నియోజకవర్గంలో ఓటర్లను కలిసేందుకు తొలుత నిర్ణయించారు. అయితే, తమకు మద్దతుగా ప్రచారం చేసే వాళ్లు లేరంటూ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు పెడుతున్న కేకల్ని విన్న విజయకాంత్ తానొస్తున్నానని అడుగు తీసి ముందుకు వేశారు. ఐదు రోజుల పాటుగా ఆయన ప్రచారం సాగనుంది. బుధవారం సాయంత్రం గుమ్మిడి పూండిలో సుడిగాలి పర్యటనతో ముందుకు సాగారు. అయితే, ఎక్కడా ప్రసంగాలకు తావివ్వలేదు. కేవలం పార్టీ వర్గాలను వాహనం నుంచి పలకరిస్తూ విజయకాంత్ ప్రచారం చేశారు. గురువారం తిరుత్తణిలో, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు చెన్నైలో తమ అభ్యర్థులు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారానికి ఆయన నిర్ణయించారు. పరీక్ష చేసుకోవాల్సిందే తన సోదరుడు సుదీష్, ఆయన భార్య పూర్ణిమ ఇద్దరు కరోనా బారిన పడటంతో ప్రేమలత విజయకాంత్‌కు సంకటం తప్పలేదు. ఆమె విరుదాచలంలో సుడిగాలి పర్యటనతో ఓట్ల వేటలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆమెకు అధికారులు షాక్ ఇచ్చారు. తప్పనిసరిగా కరోనా పరీక్ష చేసుకోవాల్సిందేనని, తదుపరే ప్రచారంలోకి వెళ్లాలని ఆరోగ్య శాఖ వర్గాలు హెచ్చరించాయి. దీంతో కరోనా టెస్ట్ చేసుకోక తప్పలేదు. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. -
పోటీకి దూరంగా విజయకాంత్.. బరిలో సతీమణి
సాక్షి, చెన్నై: డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ విరుదాచలం నుంచి పోటీ చేయనున్నారు. భర్త, పార్టీ అధినేత విజయకాంత్ ప్రప్రథమంగా గెలిచిన నియోజకవర్గం ఇదే కావడం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో విజయకాంత్ పోటీ చేయడం లేదు. అన్నాడీఎంకేతో జతకట్టేందుకు ప్రయత్నించి చివరకు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో సర్దుకోవాల్సిన పరిస్థితి విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు ఎదురైన విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో నీవే సీఎం అభ్యర్థి అంటూ, ప్రజాకూటమికి సారథ్యం వహించాలని అనేక పార్టీలు విజయకాంత్ చుట్టూ తిరిగాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి మారడంతో ఈ సారి పొత్తుకోసం డీఎండీకే కుస్తీలు పట్టక తప్పలేదు. ఎట్టకేలకు అమ్మముక ఇచ్చిన 60 సీట్లలో పోటీకి డీఎండీకే సిద్ధమైంది. 2006 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయకాంత్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అనారోగ్య సమస్యల దృష్ట్యా, ఆయన పోటీ చేయనప్పటికీ, చివరి క్షణంలో ప్రచారంలోకి రాబోతున్నారు. ఆయన తరఫున ప్రేమలత విజయకాంత్ ప్రప్రథమంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. 2005లో డీఎండీకే ఆవిర్భావంతో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి విజయకాంత్ ఒక్కడే విరుదాచలం నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ప్రస్తుతం ఇదే విరుదాచలంను ప్రేమలత ఎంపిక చేసుకున్నారు. విరుదాచలం ప్రగతికి విజయకాంత్ గతంలో చేసిన సేవలు, అక్కడ ఆయనకు ఉన్న అభిమానాన్ని పరిగణించి ప్రేమలత ఓట్ల వేటకు సిద్ధమయ్యారు. ఈనెల 19న చివరి రోజు నామినేషన్ దాఖలుకు నిర్ణయించారు. మంగళవారం ప్రేమలత మాట్లాడుతూ విరుదాచలం నుంచి తాను పోటీ చేయనున్నానని, తమ కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. విజయకాంత్ చివరి క్షణంలో ఎన్నికల ప్రచారంలోకి వస్తారని, ఆ వివరాలను మరి కొద్దిరోజుల్లో ప్రకటిస్తామన్నారు. చదవండి: సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు! -
అన్నాడీఎంకేకు ప్రేమలత హెచ్చరిక
సాక్షి, చెన్నై: కూటమి ధర్మానికి కట్టుబడి ఓపికగా ఉన్నాం...అదే నశిస్తే...ఒంటరి పోటీకి రెడీ అని అన్నాడీఎంకేకు డీఎండీకే కోశాధికారి ప్రేమలత హెచ్చరికలు చేశారు. అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే ఉందని ఆ పార్టీ పేర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు అన్నాడీఎంకే వర్గాలు డీఎండీకేతో సీట్ల పందేరం విషయంగా స్పష్టత ఇవ్వలేదు. మమా అనిపించే రీతిలో పయనం సాగుతున్నాయేగానీ, పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటు, కూటమి చర్చ సాగలేదు. పలుమార్లు చర్చలకు డీఎండీకే ఆహా్వనించినా అన్నాడీఎంకే దృష్టి అంతా పీఎంకేపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఎదురుచూసి తమకు సహనం నశించిందని, ఇక ఒంటరి పోటీకి సిద్ధమయ్యే నిర్ణయం తీసుకోకతప్పదని అన్నాడీఎంకేకు ప్రేమలత విజయకాంత్ ఆదివారం హెచ్చరికలు చేయడం గమనార్హం. ప్రేమలత హెచ్చరిక.. టీనగర్, సైదాపేట, మైలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మాంబళంలో ఆదివారం ప్రేమలత భేటీఅయ్యారు. ఆమె అన్నాడీఎంకేకు హెచ్చరికలు చేస్తూ వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. అన్నాడీఎంకే కూటమిలో ఉన్నా కాబట్టే, ఆ కూటమి ధర్మానికి కట్టుబడి చర్చల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కూటమి ధర్మాన్ని తాము గౌరవిస్తున్నామని, అందుకే ఓపికతో, సహనంతో ఉన్నామని, ఇది నశించిన పక్షంలో ఒంటరి పోటీకి సిద్ధమే అని ప్రకటించారు. ఇప్పటికే 234 నియోజకవర్గాలకు విజయకాంత్ ఇన్‌చార్జ్‌లను నియమించారని, వాళ్లనే తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. తాము ఒంటరిగా పోటీ చేసినా పదిహేను శాతం ఓటు బ్యాంక్ దక్కించుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. -
ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత
సాక్షి, చెన్నై: అసెంబీ ఎన్నికల్లో ఒంటరి పోరుకైనా సిద్ధంగానే ఉన్నామని శనివారం డీఎండీకే ప్రకటించింది. ఆదివారం పొత్తుపై ఆ పార్టీ అధినేత విజయకాంత్ ప్రకటన చేయబోతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే–బీజేపీ కూటమితో ఎన్నికల్ని డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డిపాజిట్లే కాదు, ఉన్న కాస్త ఓటు బ్యాంక్‌ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి. అయినా తాము అదే కూటమిలో ప్రస్తుతానికి ఉన్నామని ఆ పార్టీ కోశాధికారి ప్రేమలత చెబుతున్నారు. 2021 ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్నది అందరితో చర్చించి ప్రకటిస్తామని వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓ వైపు స్పందిస్తూ, మరో వైపు చిన్నమ్మ శశికళకు మద్దతుగా గళాన్ని ప్రేమలత వినిపించడం చర్చకు దారి తీసింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే ఎటో అన్న చర్చ సాగుతోంది. అదే సమయంలో అన్నాడీఎంకే సైతం డీఎండీకేను పెద్దగా పట్టించుకోనట్టుగా ప్రచారం సాగుతోంది. డీఎండీకే 41 సీట్లు ఆశిస్తుండగా, పది సీట్లు ఇవ్వడానికి అన్నాడీఎంకే మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో శనివారం డీఎండీకే ఇన్‌చార్జ్‌ల సమావేశం జరగడంతో ప్రాధాన్యత నెలకొంది. ఇన్‌చార్జ్‌లతో భేటీ.. విజయకాంత్ దూరం.. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను డీఎండీకే రంగంలోకి దించిన విషయం తెలిసిందే. మండల, డివిజన్, జిల్లా స్థాయిలోనూ ఇన్‌చార్జ్‌లను నియమించి ఎన్నికల పనుల వేగాన్ని పెంచారు. మొత్తం 320 మంది ఇన్‌చార్జ్‌లతో డీఎండీకే కోశాధికారి ప్రేమలత విజయకాంత్ శనివారం కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. సమావేశానికి అధినేత విజయకాంత్ రాలేదు. ఇందులో అసెంబ్లీ ఎన్నికల పనులు, పట్టున్న నియోజకవర్గాలు, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే పరిస్థితి గురించి సమీక్షించారు. సమావేశం చివర్లో పొత్తు నిర్ణయానికి అధికారాన్ని విజయకాంత్‌కు అప్పగించారు. ఒంటరి పోటీకైనా డీఎండీకే సిద్ధం అని ప్రకటించారు. పొత్తా, ఒంటరి పయనమా అనే విషయంగా ఆదివారం విజ యకాంత్ ప్రకటన చేస్తారని డీఎండీకే వర్గాలు పేర్కొనడంతో ఎదురుచూపులు పెరిగాయి. -
మోదీ సభ: బీజేపీ కూటమిలోకి విజయ్‌కాంత్
సాక్షి, చెన్నై: పొత్తుల పరంగా తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే, బీజేపీ కూటమితో నటుడు కెప్టెన్ విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే చేతులు కలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం కంచీపురంలో భారీ ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో అన్నాడీంఎకే-బీజేపీ కూటమిలో డీఎండీకే చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ కూటమిలో డీఎండీకే చేరిన విషయాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి ధ్రువీకరించారు. రానున్న ఎన్నికల్లో మొత్తం నాలుగు పార్టీలు (అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, డీఎండీకే) కూటమిగా పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. విజయ్‌కాంత్ సతీమణి, డీఎండీకే కోశాధికారి ప్రేమలతతోపాటు పలువురు నేతలు సీఎం నివాసంలో పళనిస్వామిని కలిశారు. మరోవైపు ప్రధాని మోదీ సభా ప్రాంగణంలో వేదికపై ఏర్పాటు చేసిన పోస్టర్లో ప్రధాని మోదీ, సీఎం పళనిస్వామితోపాటు విజయ్‌కాంత్ చిత్రం కూడా ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే కూటమిగా ఏర్పడ్డాయి. కూటమిలో కొత్తగా చేరిన డీఎండీకేకు నాలుగు నుంచి 5 లోక్‌సభ స్థానాలు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్-డీఎంకేలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిలో చేరేందుకు డీఎండీకే ఆసక్తి చూపించినా.. మిత్రపక్ష పార్టీల కోసం మరిన్ని సీట్లు వదులుకోవడానికి డీఎంకే నిరాకరించడంతో ఇది సాధ్యపడలేదని తెలుస్తోంది. తమిళనాడులోని 39స్థానాల్లో బీజేపీకి ఐదు, పీఎంకేకు ఏడు స్థానాలను అన్నాడీఎంకే ఇప్పటికీ ఖరారు చేసింది. -
విజయకాంత్, రజనీకాంత్ భేటీపై తీవ్ర చర్చ
సాక్షి, చెన్నై: నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయకాంత్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం విజయకాంత్ నివాసానికి వచ్చిన రజినీకాంత్ అరగంట సేపు అక్కడ గడిపారు. కేవలం విజయకాంత్‌ను పరామర్శించేందుకే తాను వచ్చినట్టు భేటీ అనంతరం రజనీకాంత్ పేర్కొన్నారు. అలాగే తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిపారు. కానీ ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న రాజకీయ నేపథ్యంలో వీరి భేటీ రాజకీయ వర్గాలో తీవ్ర చర్చకు దారితీసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీతో కలిసి అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడితే.. డీఎంకే కాంగ్రెస్‌తో జత కట్టింది. అయితే తొలుత అన్నాడీఎంకే కూటమిలో చేరుతుందని భావించిన డీఎండీకే.. సీట్ల సర్దుబాటు కుదరక కూటమి నుంచి వైదొలుగుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాల మధ్య విజయకాంత్ తమ పార్టీ ఆశవహులు ఒంటరిగా బరిలో నిలువనున్నారనే సంకేతాలు పంపారు. ఈ నేపథ్యంలో గురువారం విజయకాంత్‌తో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తాజా మాజీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. పరోక్షంగా అన్నాడీఎంకే కూటమికి దూరంగా ఉండాలని ఆయన విజయకాంత్‌ను కోరినట్టుగా సమాచారం. అయితే ఆ మరుసటి రోజే రజినీకాంత్ విజయకాంత్‌తో భేటీ కావడంతో డీఎండీకే ఏ కూటమి వైపు మొగ్గు చూపుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొంది. మరోవైపు రాజకీయ ఎంట్రీని స్పష్టం చేసిన రజినీకాంత్.. తాను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని తెల్చిచెప్పిన సంగతి తెలిసిందే. -
మెట్టుదిగని కెప్టెన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే–బీజేపీ కూటమి దాదాపు ఖరారైపోగా ఒక్క డీఎండీకే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. 9 స్థానాలకు డీఎండీకే పట్టుబడుతుండగా నాలుగు లేదా ఐదు స్థానాలు మాత్రమేనని అన్నాడీఎంకే స్పష్టం చేసింది. మొత్తం 40 పార్లమెంటు స్థానాల్లో కనీసం 20 స్థానాల్లో ఖచ్చితంగా పోటీచేయాలని అన్నాడీఎంకే నేతలు భావిస్తున్నారు. మిగిలిన 20 స్థానాలను మిత్రపక్షాలకు వదిలేశారు. ఇందులో బీజేపీకి ఐదు, పీఎంకేకు ఏడు స్థానాలపై ఒప్పందం జరిగిపోయింది. ఇక మిగిలిన 8 స్థానాల్లో పుదియతమిళగం, తమిళ మానిల కాంగ్రెస్ (ఇంకా చర్చల దశలో), ఇండియా జననాయక కట్చి, పుదియనీదికట్చిలకు తలా ఒకటి కేటాయించాలని నిర్ణయించారు. ఇక డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌కు మిగిలింది నాలుగుస్థానాలే. అయితే ఆయన 9 స్థానాలను కోరుతుండగా ఎంతమాత్రం వీలుకాదని అన్నాడీఎంకే తేల్చిచెప్పేసింది. మూడు లేదా నాలుగుస్థానాలు మాత్రమే కేటాయించగలమని స్పష్టం చేసింది. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, కేంద్రమంత్రి పీయూష్‌గోయల్ మంగళవారం రాత్రి వరకు విజయకాంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎంతకూ ఆయన మెట్టుదిగకపోవడంతో పీయూష్‌గోయల్ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ దశలో ఇరుపక్షాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఇదిలా ఉండగా బీజేపీ కూటమిలో పీఎంకే చేరడానికి నిరసనగా పీఎంకే యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరి ప్రియా రాజీనామా చేశారు. ఉప ఎన్నికల షరతుపై డీఎండీకే నో: సీట్ల సర్దుబాట్లు అలా ఉంచితే ఖాళీగా ఉన్న 21 అసెంబ్లీ స్థానాల్లో మిత్రపక్షంగా ఎన్నికల ప్రచారం చేయాలని, పోటీ అభ్యర్థులను పెట్టరాదు, ఎన్నికల ప్రచారం చేయాలనే నిబంధనలకు బీజేపీ, పీఎంకే సమ్మతించినట్లు సమాచారం. అయితే డీఎండీకే మాత్రం ఈ నిబంధనకు ససేమిరా అని కుండబద్దలు కొట్టడం ప్రతిష్టంభనకు మరోకారణౖమైంది. పార్లమెంటు స్థానాల్లో్ల మిత్రపక్షం, అసెంబ్లీ స్థానాలో ప్రతిపక్షంగా వ్యవహరించడం ఏమిటని డీఎండీకేను అన్నాడీఎంకే ప్రశ్నిస్తోంది. ఉప ఎన్నికల్లో అభ్యర్థులను పోటీపెట్టబోమని హామీ ఇచ్చినట్లయితేనే నాలుగు లేదా ఐదు స్థానాలను కేటాయించగలమని అన్నాడీఎంకే వాదిస్తోంది. ఇదిలా ఉండగా, తాము కోరినన్ని సీట్లు కేటాయించని పక్షంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోకతప్పదని విజయకాంత్ హెచ్చరించారు. బుధవారం రాత్రికి డీఎండీకే, అన్నాడీఎంకే మధ్య సామరస్యపూర్వకమైన ఒప్పందం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
డీఎండీకే అధినేతకి అస్వస్థత
సాక్షి, చెన్నై : : డీఎండీకే అధినేత, తమిళ ప్రముఖ నటుడు విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. అరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆదంబాక్కంలోని మియాట్ ఆస్పత్రికి తరలించారు. గత కొంత కాలంగా విజయ్ కాంత్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సినీ నటుడిగా అశేష అభిమానుల నాయకుడిగా మన్ననల్ని అందుకున్న విజయకాంత్ డీఎండీకేతో రాజకీయాల్లో అడుగు పెట్టి ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి చేరారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. -
రాజకీయాల్లో ఆయన నా సీనియర్..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ పార్టీ ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఇటీవల పలు పార్టీల నేతలను, సహచర నటులను కలుస్తున్నారు. ఆ కోవలోనే ఆయన నటులు రజనీకాంత్, డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్లను ఆదివారం కలిశారు. తాజాగా, సోమవారం చెన్నైలోని కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి విజయకాంత్‌తో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. ‘మీవంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడం అవసరం’ అని కమల్‌కు విజయకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని ప్రారంభించే ముందు నేతలను కలుస్తున్నట్లే రాజకీయాల్లో తన కంటే సీనియర్ అయిన విజయకాంత్‌ను కలిసానని కమల్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కాగా, కమల్, రజనీ కలవడం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని మంత్రి జయకుమార్ వాఖ్యానించారు.ఈ నెల 21న రామేశ్వరంలో కమల్ తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అదే రోజు మథురైలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత, విజయకాంత్ ఇలా అందరూ తమ రాజకీయ తొలి అడుగును మథురై జిల్లా నుంచే ప్రారంభించడం గమనార్హం. -
ప్రతిపక్షం అన్నింటా వైఫల్యం
తిరువళ్లూరు: రాష్ట్రంలో అసమర్ధుడైన ప్రతిపక్ష నాయకుడు ఉండడం వల్లే ప్రజా సమస్యలపై గళమెత్తే పరిస్థితి లేకుండా పోయిందని డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ఆరోపించారు. బస్సు చార్జీల మోతకు నిరసనగా డీఎండీకే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం తిరువళ్లూరులోని బజారువీధిలో ధర్నాకు జిల్లా కన్వీనర్ కృష్ణమూర్తి నాయుడు అధ్యక్షత వహించారు. ప్రేమలతా విజయకాంత్ హాజరై ప్రసంగించారు. మొదట ఆమె ఎద్దుల బండిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినా దాలు చేస్తూ, బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ రాష్ట్రంలో స్టాలిన్ లాంటి అసమర్థ నేత ప్రతిపక్షంగా ఉండడం ప్రజల దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. స్టాలిన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడని జోస్యం పలికారు. అన్నాడీఎంకే ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని స్పష్టం చేసిన ఆమె, వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే అడ్రస్ లేకుం డా పోతుందని విమర్శించారు. రవాణా శాఖలో రూ.5,700 కోట్ల కుంభకోణం, కార్మిక సంఘాల పేరిట విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న నేతల వైఖరే నష్టాలకు కారణమని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సినీ నటులు రాజకీయ పార్టీలను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని పరోక్షంగా కమల్ రజనీకాంత్‌లను ఉద్దేశించి ప్రసంగించిన ప్రేమలత, జయలలిత ఉన్నప్పుడు వారెం దుకు పార్టీని స్థాపించలేదని ప్రశ్నించారు. ఆందోళనలో పార్టీ నేతలు శేఖర్, శరవణన్, రజనీకాంత్ పాల్గొన్నారు. -
పనికొచ్చే ప్రశ్నలు వేయండి
సాక్షి, చెన్నై : ప్రజల్లోకి వచ్చిన మరుసటి రోజే డీఎండీకే అధినేత విజయకాంత్ టెన్షన్‌కు గురయ్యారు. తన ధోరణి ఇంతే అని నిరూపించుకుంటూ మీడియా ముందు శివాలెత్తారు. ఏందీ..అమ్మమ్మా...అంటూ కోపం వచ్చేస్తుంది..వస్తే అంతే అంటూ విరుచుకు పడ్డారు. తదుపరి త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు.రెండు నెలలకు పైగా డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యంతో ఇం టికి, ఆస్పత్రికి పరిమితమైన విష యం తెలిసిందే. శని వారం శివగంగైలో పర్యటించిన ఆయన తాను ఆరోగ్య వంతుడినయ్యానని చాటుకున్నారు. ప్రజలతో ఇక మమేకం అని ప్రకటించుకుని , రెండో రోజు ఆదివారం తిరునల్వేలిలో పర్యటించారు. అయితే, ఆయన ధోరణిలో మాత్రం ఎలాంటి మార్పులేదు. మరింత దూకుడుతో ఆగ్రహాన్ని ప్రదర్శించడం గమనార్హం. కెప్టెన్ టెన్షన్ : డీఎండీకే నాయకుడి ఇంటి శుభకార్య వేడుకకు సతీమణి ప్రేమలతతో కలిసి హాజరై విజయకాంత్‌ను మీడియా వర్గాలు చుట్టుముట్టి ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో తనలో కొంత కాలంగా నిద్రపోతున్న ఆవేశాన్ని బయటకు తీశారు. అన్నాడీఎంకే గురించి సంధించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ఓపీఎస్ చెప్పాడంటా... అమ్మ.. అమ్మ మ్మా... ఏందీ అమ్మమ్మా...నాకు కోపం వచ్చిం దో... అంటూ నాలుక మడత పెట్టి మరీ ఆగ్రహాన్ని ప్రదర్శించడంతో మీడియా వర్గాలు అవాక్కయ్యారు. అన్నాడీఎంకేలోని శిబిరాల గురించి ప్రస్తావించగా, ఓపీఎస్(పన్నీరు), ఈపీఎస్(ఎడపాడి పళనిస్వామి) ఇద్దరూ వేస్ట్.., తన వద్ద ఆ ఇద్దరి ప్రస్తావన వద్దే వద్దంటూ మళ్లీ తన ఆక్రోశాన్ని ప్రదర్శించారు. అమ్మ సమాధి వద్ద కూర్చున్నాడంటా...నీ...అంటూ మళ్లీ కోపం వచ్చేస్తుందంటూ ఆ ప్రశ్నకు సమాధానం దాట వేశారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం, చిదంబరం ఇంట్లో ఐటీ దాడుల ప్రస్తావన తీసుకురాగా, ఉపయోకరంగా, ప్రజలకు మంచి అనిపించే ప్రశ్నలను వేస్తే సమాధానాలు ఇస్తానని, లేదంటే వెళ్లి పోతానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రజనీకాంత్‌కు వ్యతిరేకత బయలు దేరి ఉందే అని ప్రశ్నించగా, అవన్నీ సహజం అని, తనుకూ వ్యతిరేకత తప్పలేదు..ఇప్పుడు రాజకీయాల్లో ఏ స్థాయికి చేరానో చూసుకోండంటూ వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ తనకు మంచి మిత్రుడు...అంతే అని స్పందించారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోసం సిద్ధం కావాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ ఎన్నికలకు ముందే రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. చివరగా ఈవీఎంలలో ఎలాంటి మోసాలు, అవకతవకలు చేయడానికి వీలు లేదని ఆయన స్పష్టం చేశారు. -
ప్రేమలతకు పగ్గాలు
డీఎండీకే పగ్గాలు విజయకాంత్ సతీమణి ప్రేమలత చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టేందుకు డీఎండీకే వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. సాక్షి, చెన్నై: 2005లో సినీ నటుడు విజయకాంత్ దేశీయ ముర్పోగు ద్రావిడ కళగం(డీఎండీకే)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో జరిగిన తొలి ఎన్నికల్లో తానొక్కడినే గెలిచినా, ఢీలా పడకుండా అడుగులు వేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా జోడు పదవులతో ముందుకు సాగి 2011లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. అయితే 2016 ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు డీఎండీకేను ఢీలా పడేలా చేశాయి. ఎండీఎంకే, వామపక్షాలు, వీసీకే నేతృత్వంలోని కూటమిలోకి విజయకాంత్ వెళ్లడాన్ని ఖండిస్తూ, ఆ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ బయటకు వచ్చేశారు. ఈ ప్రభావం ఆ ఎన్నికల్లో విజయకాంత్‌కు గట్టి దెబ్బ తగిలేలా చేశాయి. డిపాజిట్లే కాదు, గత కొన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంక్‌ను ఆయన కోల్పోక తప్పలేదు. మళ్లీ పూర్వ వైభవం లక్ష్యంగా మీలో ఒక్కడ్నీ అంటూ కేడర్ వద్దకు పరుగులు తీస్తూ వచ్చిన విజయకాంత్ ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రికి, ఇంటికి తిరగక తప్పడం లేదు. ప్రస్తుతం ఆయనకు మళ్లీ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో పార్టీని నడిపించడంతోపాటుగా కేడర్‌ను దక్కించుకునే విధంగా పగ్గాలు ఆయన సతీమణి ప్రేమలతకు అప్పగించేందుకు తగ్గ కార్యాచరణ డీఎండీకేలో సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయకాంత్ సతీమణి ప్రేమలత మంచి వాక్చాతుర్యం కల్గిన వారు. సమయానుగుణంగా స్పందించే తత్వం ఉన్న వారు. ఇంకా చెప్పాలంటే, విజయకాంత్‌ను మించి ప్రసంగాలు సాగించగల సమర్థురాలు. డీఎండీకే ఎన్నికల ప్రచారంలో ఆమె పాత్ర కీలకం. పార్టీలో ఎలాంటి పదవీ లేకున్నా, అన్నీ తానై విజయకాంత్ వెన్నంటి ఆమె సాగుతున్నారని చెప్పవచ్చు. పార్టీలో ఆమెకు పదవి కట్టబెట్టాలన్న నినాదం ఎప్పటి నుంచో వస్తున్నా, విజయకాంత్ అందుకు తగ్గ నిర్ణయాన్ని ఎన్నడూ తీసుకోలేదు. ఇందుకు కారణం, ఎక్కడ పార్టీలోని సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తారోననే. ప్రస్తుతం సీనియర్లు ఎవ్వరూ ఆ పార్టీలో లేరు. ఉన్నదంతా అభిమాన లోకం. వారిని రక్షించుకోవాలంటే, పార్టీ పగ్గాలు ప్రేమలతకు అప్పగించాల్సిన అనివార్యం ప్రస్తుతం ఏర్పడి ఉంది. విజయకాంత్ ఆసుపత్రిలో ఉండడంతో, పార్టీని నడిపించేందుకు తగ్గ కార్యాచరణను డీఎండీకే వర్గాలు సిద్ధం చేశాయి. విజయకాంత్ చేతిలో ఉన్న జోడు పదవుల్లో ఓ పదవిని ప్రేమలత స్వీకరించాలన్న నినాదాన్ని అందుకుని ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి పదవి విజయకాంత్ వద్దే ఉంచి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని ప్రేమలత మీద ఒత్తిడి తెచ్చే పనిలో కేడర్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో, డీఎండీకే వెబ్సైట్లోనూ ఆమె తప్ప మరొకరు లేరని, ఆమె పగ్గాలు చేపట్టాల్సిందేనని కేడర్ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో డీఎండీకే కార్యాలయం నుంచి ప్రేమలత ప్రధాన కార్యదర్శి అన్న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువేనని ఓ నేత పేర్కొన్నారు. విజయకాంత్ బావమరిది సుధీష్ ఆ పార్టీ యువజన నేతగా ఉన్నా, పార్టీని నడిపించే సత్తా మాత్రం ప్రేమలతకు మాత్రమే ఉందని, ఆమె పగ్గాలు చేపట్టేందుకు ఇదే మంచి సమయంగా ఆ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఆసుపత్రిలో కెప్టెన్
ఆందోళన వద్దన్న నేతలు సాధారణ పరీక్షలేనని ప్రకటన చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ ఆసుపత్రిలో చేరారు. మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు చికిత్సలు అందిస్తున్నారు. ఏడాదికి ఓ మారు జరిగే సాధారణ వైద్య పరీక్షలు మాత్రమేనని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎండీకే కార్యాలయం ప్రకటించింది. సినీ నటుడిగా అశేష అభిమానుల నాయకుడిగా మన్ననల్ని అందుకున్న విజయకాంత్ డీఎండీకేతో రాజకీయాల్లో అడుగు పెట్టి ప్రధాన ప్రతి పక్ష నేత స్థాయికి చేరిన విషయం తెలిసిందే. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లే కాదు, అడ్రస్సునూ గల్లంతు చేసుకుని పాతాళంలోకి నెట్టబడ్డారు. ముఖ్య నాయకులు బయటకు వెళ్లడంతో ఉన్న వారితో పార్టీని నెట్టుకొస్తున్నారు. మీలో ఒక్కడ్ని అన్న నినాదంతో కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునే విధంగా గత ఏడాది ఆగస్టు నుంచి జిల్లా పర్యటనలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరిన సమాచారం గురువారం వెలుగులోకి వచ్చింది. బుధవారం ఆయన్ను విరుగంబాక్కం ఇంటి నుంచి మనపాక్కంలోని ఓ ప్రైవేటు మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు సాగుతున్నాయి. విజయకాంత్ ఆసుపత్రిలో ఉన్న సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. ఇప్పటికే సింగపూర్‌లో ఆయనకు కొన్ని నెలల పాటుగా వైద్య చికిత్సలతో పాటు శస్త్ర చికిత్స జరిగినట్టు సంకేతాలు ఉన్నాయి. ఆయనకు మూత్ర పిండాల మార్పిడి జరిగినట్టుగా ప్రచారం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయాల్లో ఆయన హావాభావాలు, తీవ్ర ఇబ్బందులకు గురవుతూ కనిపించడంతో ఆరోగ్య పరిస్థితిపై మరో మారు ఆందోళనను రేగాయి. ఆయనకు టాన్సిల్స్ సమస్య ఉన్నట్టు స్వయంగా విజయకాంత్ సతీమణి ప్రేమలత ఆ సమయంలో వివరణ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో తాజాగా, విజయకాంత్‌ను చడీ చప్పుడు కాకుండా ఆసుపత్రిలో చేర్పించడం డీఎండీకే వర్గాల్లో ఆందోళనను రేపింది. దీంతో ఆ పార్టీ కార్యాలయం అప్రమత్తం అయింది. విజయకాంత్‌కు ఎలాంటి సమస్య లేదని, ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ఏడాదికి ఓ మారు చేయించుకోవాల్సిన సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరినట్టు వివరించారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, వైద్య పరీక్షల అనంతరం ఒకటి రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటారని ప్రకటించారు. -
సారీ కెప్టెన్..
ఉపఎన్నికల్లో ఎవరికీ మద్దతుఇచ్చేది లేదన్న మక్కల్ ఇయక్కం నేతలు డీఎండీకేకు మద్దతుపై తిరుమా మరో కొత్త పలుకు సాక్షి, చెన్నై: మక్కల్ ఇయక్కం వర్గాల మాటల గారడీ రాజకీయ విశ్లేషకులనే విస్మయంలో పడేస్తోంది. రోజుకో మా ట, పూటకో అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా, మరో మారు డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఝలక్ ఇచ్చారు. నిన్నటి వరకు మద్దతు కోరితే, పరిశీలన అని పలికిన ఆ నాయకులు మంగళవారం ఉప ఎన్నికల్లో డీఎండీకేకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చారు. ఇక, వీసీకే నేత తిరుమావళవన్ కొత్త పలుకుగా, యూసీసీకి వ్యతిరేకంగా రా జకీయ పక్షాలు ఏకం కావాలంటూ అఖి ల పక్షానికి పిలుపునిచ్చే పనిలో పడ్డారు. మక్కల్ ఇయక్కంలోని ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్‌ల తీరు విమర్శలకు దారి తీస్తున్నారుు. రోజుకో మాట, పూటకో అభిప్రాయం అన్నట్టుగా ఎవరికి వారు మీడియా ముందుకు వచ్చి చర్చల్లోకి ఎక్కడమే కాకుండా, విమర్శలను, వ్యంగ్యాస్త్రాలను ముట్టగట్టుకునే పనిలో పడ్డారు. నిన్నటి వరకు ఉప ఎన్నికల్లో డీఎండీకే మద్దతు కోరితే పరిశీలిస్తామన్న సీపీఎం, సీపీఐ, వీసీకే నేతలు , తాజాగా మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని తేల్చేశారు. వీరి పరిశీలన మేరకు డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమని ప్రేమలత మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులకు అనుగుణంగా తమకు మద్దతును ప్రకటించాలని విన్నవించారు. దీంతో మక్కల్ ఇయక్కం మద్దతు ఉప రేసులో ఉన్న డీఎండీకే అభ్యర్థులకు దొరికినట్టేనా..? అన్న ఎదురు చూపులు పెరిగా రుు. అయితే, మీడియా సందించిన ప్రశ్నలకు సమాధానంగానే పరిశీలన అన్న నినాదాన్ని తాము తెర మీదకు తెచ్చామేగానీ, ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు లేదంటూ ఆ ఇయక్కం తేల్చడం డీఎండీకేకు మరో షాక్కే. గత వారం విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించి తప్పు చేశామని ఆ ఇయక్కంలోని వైగో స్పందిస్తే, తాజాగా మిగిలిన ముగ్గురు విజయకాంత్‌కు పరిశీలన అంటూ ఝలక్ ఇవ్వడం గమనార్హం. వీసీకే నేత తిరుమావళవన్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉప ఎన్నికల్ని బహిష్కరిస్తూ ఇయక్కం వర్గాలు నిర్ణయం తీసుకున్నాయని, విజయకాంత్ తమ వద్దకు వచ్చి ఎలాంటి మద్దతు కోరలేదని, ఏ పనిచేసినా సక్రమంగా చేయాలన్నదే తన అభిమతం అని, అందుకే ఉప ఎన్నికల్లో ఎవ్వరికీ మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. సీపీఎం నేత రామకృష్ణన్ అదేపల్లవి అందుకున్నారు. తామందరం కల సి కట్టుగా ఎన్నికల బహిష్కరణ నిర్ణ యం తీసుకున్నామని, అలాంటప్పుడు ఎలా మద్దతు ఇస్తామని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. ఇక, పరిశీలన అన్న విషయం, కేవలం డీఎండీకేకు మద్దతు ఇస్తారా..? అని మీడియా సంధించిన ప్రశ్నకు , అటు వైపు నుంచి వచ్చే విజ్ఞప్తి మేరకు పరిశీలన అని సమాధానం ఇచ్చామేగానీ, మద్దతు ఇచ్చేస్తామని చెప్పలేదుగా అంటూ స్పందించారు. తిరుమా కొత్త పల్లవి : యూనిఫాం ’సివిల్’ కోడ్ (యూసీసీ- ఉమ్మడి పౌర సృ్మతి)కి వ్యతిరేకంగా రాష్ట్రంలో మైనారిటీ సంఘాలు, పార్టీలు, జమాత్‌లు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తాము సైతం అంటూ వీసీకే నేత తిరుమావళవన్ కదిలారు. ఏకంగా సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా ఏకం అవుదామని రాజకీయ పక్షాలకు పిలుపు నిచ్చారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఈ విషయంలో తమతో చేతులు కలపాలని, ప్రతి పక్షాలన్నీ ఏకం కావాలని కోరారు. అఖిల పక్షంగా ముందుకు సాగుదామని, యూసీసీని వ్యతిరేకిద్దామని పిలుపు నిచ్చారు. -
మద్దతు ప్లీజ్..
► ప్రేమలత విజ్ఞప్తి ► ఉప ప్రచారం ముమ్మరం ► ఏర్పాట్లపై ఈసీ దృష్టి ► రంగంలోకి పారా మిలటరీ తమ అభ్యర్థుల పరిస్థితులకు అనుగుణంగా మద్దతు ఇవ్వాలని సీపీఎం, సీపీఐ, వీసీకేలకు డీఎండీకే విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు సోమవారం ఆ పార్టీ అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత విన్నవించారు. ఇక, ఉప ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సాక్షి, చెన్నై : తంజావూరు, అరవకురిచ్చి, తిరుప్పరగుండ్రం ఉప ఎన్నికల్లో డీఎండీకే అభ్యర్థులు అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులకు దీటుగా ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. గెలుపు ధీమాను సైతం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం వేడెక్కడంతో ఓట్ల వేటలో దూసుకెళుతున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్న డీఎండీకే తమకు విజ్ఞప్తి చేస్తే, మద్దతు పరిశీలన చేస్తామని, సీపీఎం, సీపీఐ, వీసీకేలు ప్రకటించాయి. దీంతో తమకు పరిస్థితులకు అనుగుణంగా మద్దతు ఇవ్వాలని ప్రేమలత విజయకాంత్ ఆ పార్టీలకు విన్నవించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో ధన ప్రవాహం ఎక్కువగానే ఉందని ఆరోపించారు. ప్రజా స్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేది అనుమానమేనని పేర్కొంటూ, న్యాయం వైపుగా ఓటర్ల నిలబడాలని, అవినీతికి వ్యతిరేకంగా తమ మద్దతు పలకాలని కోరారు. తమకు మద్దతు ఇచ్చేందుకు పరిశీలిస్తామన్న ఆ మూడు పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక, అరవకురిచ్చి అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీకి ఎక్కడకు వెళ్లినా, ముట్టడించి నిరసనలు తెలిపే వారి సంఖ్య పెరుగుతుండడంతో ఆ పార్టీ వర్గాలు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాయి. రంగంలోకి పారా మిలటరీ: ప్రచార హోరు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు ఎన్నికల ఏర్పాట్ల మీద ఈసీ దృష్టి కేంద్రీకరించింది. ఆయా నియోజకవర్గాల్లో నిఘా , తనిఖీల ముమ్మరం చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖానీ ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకంగా ముఫ్పై బృందాలతో స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగే రీతిలో పన్నెండు కంపెనీలకు చెందిన పారా మిలటరీ బలగాల్ని భద్రతకు నియమించేందుకు నిర్ణయించారు. మీడియాతో లఖానీ మాట్లాడుతూ, వాహన తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. తంజావూరులో రూ.70 లక్షలు లెక్కలోకి రాని నగదు పట్టుబడిందన్నారు. తిరుప్పరగుండ్రంలో రూ. కోటి విలువగల నగలు, రూ. 75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాలకు తుది ఓటర్ల జాబితాను పంపించామని వివరించారు. ఎన్నికల నిర్వహణకు తగ్గ ఏర్పాట్లను ఆయా జిల్లా యంత్రాంగాల పర్యవేక్షణలో వేగవంతం చేశామన్నారు. -
పంచముఖ పోటీ
► రంగంలోకి డీఎండీకే ► రేపటితో నామినేషన్లు ఆఖరు తమిళనాడులో ముచ్చటగా మూడుచోట్ల సాగుతున్నఉప ఎన్నికల్లో డీఎండీకే కూడా బరిలోకి దిగింది. అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీ అభ్యర్దులకు డీఎండీకే కూడా ప్రత్యర్దిగా మారడంతో చతుర్ముఖ పోటీకాస్తా పంచముఖ పోటీగా మారింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన మేలో జరిగిన సార్వత్రి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన ఆరోపణలపై తంజావూరు, అరవకురిచ్చిలో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనవేల్ మృతితో తిరుప్పరగున్రం నియోజవర్గం కూడా ఖాళీ అయింది. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ఈనెల 19వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ప్రధాన ప్రత్యర్థులుగా అన్నాడీఎంకే, డీఎంకే పోటీపడుతుండగా, బీజేపీ, పీఎంకేలు ఆయా నియోజకవర్గాల్లో తమ బలమేంటో తెలుసుకునేందుకు బరిలోకి దిగుతున్నాయి. గత నెల 26వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై ఈనెల 2వ తేదీతో గడువు ముగుస్తుంది. ఉప ఎన్నికల వేడి రాజుకుని నాలుగు పార్టీలు అభ్యర్థుల జాబితాను వెల్లడించే వరకు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిన డీఎండీకే గత నెల 30వ తేదీన అకస్మాత్తుగా తాము పోటీచేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఉప ఎన్నికలు పంచముఖ పోటీగా మారాయి. ఈనెల 2వ తేదీన పీఎంకే, డీఎండీకే అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. ఉప ఎన్నికల్లో తాము పోటీచేయడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ రామకృష్ణన్ సోమవారం ప్రకటించారు. వర్షపు హోరులోనూ జోరుగా ప్రచారం పోలింగ్ సమయం సమీపస్తుండగా ఈ మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార అన్నాడీఎంకే, ప్రధాన ప్రతిపక్ష డీఎంకేల మధ్య విమర్శల వేడి రాజకుంది. మధురైలో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో మంత్రులు సెల్లూరురాజా, ఉదయకుమార్ తదితరులు కార్యకర్తలకు కర్తవ్య బోధ చేశారు. ప్రతిపక్ష డీఎంకే అభ్యర్థులు డిపాజిట్టు కోల్పోయేలా అన్నాడీఎంకే అభ్యర్థులకు అత్యధిక మెజార్టీతో విజయాన్ని చేకూర్చాలని మంత్రులు అన్నారు. తిరుప్పరగున్రంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో డీఎంకే కోశాధికారి, ప్రతిపక్ష నేత స్టాలిన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే అభ్యర్థులపై అత్యధిక ఓట్ల తేడాతో తమ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. ముఖ్యమంత్రి లేని అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్జీవంగా మారిందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
మల్లగుల్లాలు
సాక్షి, చెన్నై: ఉప ఎన్నికల బరిలో అభ్యర్థుల్ని నిలబెడదామా, వద్దా? అని మక్కల్ ఇయక్కం ఓ వైపు, తమిళ మానిల కాంగ్రెస్, డీఎండీకేలు మరో వైపు వేర్వేరుగా మల్లగుల్లాలు పడుతున్నాయి. మిత్రుల మధ్య భిన్న వాదనల నేపథ్యంలో మక్కల్ ఇయక్కం కన్వీనర్ ఎండీఎంకే నేత వైగో పార్టీ నేతల అభిప్రాయాల సేకరణలో పడ్డారు. చివరకు ఏకాభిప్రాయం కుదిరేలా చేశారు. ఇక, తాను సోమవారం నిర్ణయాన్ని ప్రకటిస్తాన ని తమిళ మానిల కాం గ్రెస్ నేత వాసన్ వ్యాఖ్యానించారు. డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ మాత్రం మౌనంగానే ఉన్నా రు. రాష్ర్టంలో వాయిదా పడ్డ తం జావూరు, అరవకురిచ్చిలతో పాటు శీనివేల్ మరణంతో ఖాళీగా ఉన్న తిరుప్పర గుండ్రం స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలి సిందే. ఇప్పటికే అన్నాడీఎంకే, డీఎంకేలు తమ తమ అభ్యర్థులను ప్రకటించాయి. అన్నాడీఎంకే అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. అయితే, అరవకురిచ్చి అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ల మోత మోగుతున్న దృష్ట్యా, ఉత్కంఠ తప్పడం లేదు. సెంథిల్ బాలాజీని ఢీకొట్టేందుకు రేసులో ఉన్న డీఎంకే అభ్యర్థి కేసీ పళనిస్వామికి వ్యతిరేకంగా కూడా కోర్టుల్ని ఆశ్రయించేందుకు పలువురు సిద్ధం అవుతుండడం గమనార్హం. ఇక, మిగిలిన అభ్యర్థులు తమకు ఎలాంటి చిక్కులు ఉండబోదన్నట్టుగా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇక, తిరుప్పరగుండ్రం డీఎంకే అభ్యర్థి శరవణన్‌కు ఆ పార్టీ బహిష్కృత నేత అళగిరి రూపంలో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందుకు కారణం మరో అభ్యర్థి దొరకలేదా..? అని డీఎంకేను అవహేళన చేస్తూ అళగిరి వారసుడు దయానిధి అళగిరి ట్విట్టర్లో స్పందించి ఉండడం ఆలోచించ దగ్గ విషయమే. అన్నాడీఎంకే, డీఎంకేలు రేసులో దిగడంతో, ఇక తామూ దిగుదామా వద్దా అన్న యోచనలో గత ఎన్నికల్లో ఆరుగురిగా ముందుకు సాగి, ఇప్పుడు నలుగురికి పరిమితమైన మక్కల్ ఇయక్కం మల్లగుల్లాలు పడుతున్నది. భిన్న వాదనలు : అసెంబ్లీ ఎన్నికల్లో ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లు ఒకే వేదికగా ప్రజా సంక్షేమ కూటమి అంటూ ప్రజల్లోకి వెళ్లి డిపాజిట్లనే కాదు, ఓటు బ్యాంక్‌నూ కోల్పోయిన విషయం తెలిసిందే. ఫలితాల తారుమారుతో ఆరుగురిలో, చివరకు నలుగురుగా మిగిలారు. ప్రస్తుతం మక్కల్ ఇయక్కంగా ముందుకు సాగుతున్న ఆ నలుగురిలో ఉప ఎన్నికలు విభేదాల్ని సృష్టించేనా అన్న ప్రశ్నను తెర మీదకు తెచ్చింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు ఆ ఇయక్కంలో సాగుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఉప రేసులో తమ అభ్యర్థులను బరిలో దించాలా, వద్దా అన్న విషయంలో ఆ ఇయక్కం నేతల మధ్య భిన్న వాదనలు బయలు దేరాయి. సీపీఎం, సీపీఐ ఓ వాదన విన్పిస్తుంటే, వీసీకే, ఎండీఎంకేలు వేర్వేరుగా తమ తమ వాదనలు విన్పించే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. అయితే, ఈ వాదనలు ఏమిటో అన్నది గోప్యంగా సాగుతున్నా, రేసులో తాము ఉండాలా, వద్దా అని తేల్చుకునేందుకు ఆ కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో సిద్ధమయ్యారు. శనివారం ఎగ్మూర్‌లోని ఎండీఎంకే కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ వర్గాల అభిప్రాయాల్ని సేకరించారు. అయితే, ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదన్న సూచనను పలువురు ఇచ్చినా, తుది నిర్ణయం ఇయక్కం నేతల ఏకాభిప్రాయంతో సాధ్యం అన్న విషయాన్ని పరిగణించి ముందుకు సాగే పనిలో పడ్డారు. చివరకు ఆ నలుగురూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఉప ఎన్నిక ప్రజా స్వామ్యబద్ధంగా జరిగే అవకాశాలు లేని దృష్ట్యా, ఇక, ఆ ఎన్నికలకు తాము దూరం అని ప్రకటించేశారు. వాసన్, కెప్టెన్ ఎటో: అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురం అంటూ పయనం సాగించి, ఘోర పరాభావంతో ఇక తమ దారి తమదే అని బయటకు వచ్చిన నేతల్లో డీఎండీకే అధినేత విజయకాంత్ ఒకరు. మరొకరు తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్. స్థానిక ఎన్నికల నినాదంతో డీఎంకేకు దగ్గరయ్యేందుకు జీకే వాసన్ తీవ్రంగానే ప్రయత్నించినా, అందుకు తగ్గ మార్గం లభించలేదు. ఇక, ఉప ఎన్నికల ద్వారా సత్తా చాటుకుందామా, వద్దా అన్న డైలమాలో ఉన్నారు. తమ ప్రతినిధి ఒక్కరైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని కాంక్షిస్తున్న జీకే వాసన్, ఉప ఎన్నికల ద్వారా రేసులో తానే స్వయంగా దిగితే ఎలా ఉంటుందో అన్న పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఏదేని తిరకాసు ఎదురైన పక్షంలో రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం తప్పదన్న విషయాన్ని పరిగణించి, ఆచీతూచీ అడుగులు వేయడానికి నిర్ణయించారు. ఉప రేసులో ఉండాలా వద్దా అన్నది సోమవారానికి తేల్చేస్తానని మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరబాటుకు పాతాళంలోకి నెట్టబడ్డ విజయకాంత్, ఇంకా తన మౌనాన్ని వీడనట్టుంది. ఉప ఎన్నికల రేసులో ఉండాలా, వద్దా అన్న సందిగ్ధంలో విజయకాంత్ ఉన్నా, ఆ కేడర్ మాత్రం కొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయకాంత్‌కు సొంత జిల్లా మదురై అన్న విషయం తెలిసిందే. ఆ జిల్లా పరిధిలో ఉన్న తిరుప్పరగుండ్రం నియోజకవర్గంలో ఆయనకు బలం కూడా ఉందని, ఈ దృష్ట్యా, ఆయన ఈ ఉపఎన్నికల్ని సద్వినియోగం చేసుకుని రేసులో దిగాలని కాంక్షించే కేడర్ ఎక్కువే. 2006లో తానొక్కడినే అసెంబ్లీ మెట్లు ఎక్కి, తదుపరి ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన విజయకాంత్, ఈ ఎన్నికల ద్వారా మళ్లీ పార్టీ తరఫున తానొక్కడే అడుగు పెట్టి, మళ్లీ అందలం ఎక్కే రీతిలో కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునేందుకు సిద్ధం కావాలని సూచించే నాయకులు డీఎండీకేలో ఉండడం గమనార్హం. అయితే, కెప్టెన్ తుది నిర్ణయం ఏమిటో అన్నది ఆ పార్టీ వర్గాలకే అంతు చిక్కదు. -
డీఎండీకే నేత ఇంటిపై బాంబు దాడి
టీనగర్(చెన్నై): పెరంబుదూరు సమీపంలో డీఎండీకే నేత ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు బాంబుతో దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి బాంబు దాడికి పాల్పడిన ముఠా కోసం గాలిస్తున్నారు. పెరంబుదూరు సమీపంలోని తండలంలో డీఎండీకే నేత శశికుమార్ నివసిస్తున్నారు. ఇతడు తండలం పంచాయతీ ఉపాధ్యక్షునిగా, డీఎండీకే యూనియన్ నిర్వాహకునిగా ఉన్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో శశికుమార్ పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం ఆయన శుక్రవారం ఉదయం నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శశికుమార్ ఇంటిపై నాటు బాంబులు విసిరి పరారయ్యారు. అదృష్టవశాత్తు బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదు. కాగా శశికుమార్ పంచాయతీ అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఇష్టంలేని వర్గం ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు బాంబులు విసిరిన ముఠా కోసం గాలిస్తున్నారు. -
అన్నా డబ్బుల్లేవు..
కెప్టెన్‌కు నేతల షాక్ ఇక దరఖాస్తుల హోరు తమిళనాడు ‘స్థానిక’ సమరం డీఎండీకే వర్గాలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఓ వైపు బల నిరూపణ, మరో వైపు ఎన్నికల ఖర్చుకు నిధి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఉన్నదంతా పార్టీ కోసం ఇన్నాళ్లు ఖర్చు పెట్టిన వాళ్లంతా, ఇప్పుడు ‘అన్నా’ డబ్బుల్లేవు...నీవే దిక్కు అని కెప్టెన్ కోర్టులోకి బంతిని నెట్టే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గ షాక్‌లను పార్టీ అధినేత విజయకాంత్‌కు ఇచ్చే పనిలో జిల్లా నేతలు ఉన్నారు. చెన్నై : రాష్ట్రంలో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి డీఎండీకే అన్నట్టుగా ప్రజల మన్ననల్ని అందుకున్న నాయకుడు విజయకాంత్. పార్టీ ఆవిర్భావ సమయంలో సినీ అభిమానం ఆయన వెంట కదిలింది. అభిమాన లోకం రాజకీయంగా ఎదిగారు. తమ నేత ఇచ్చే పిలుపుమేరకు చేపట్టే కార్యక్రమాలకు ఇళ్లు గుళ్ల చేసుకున్న వాళ్లెందరో ఉన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించినా, చివరకు అధికార పక్షంతో విజయకాంత్ పెట్టుకున్న వైరం డీఎండీకే వర్గాల్ని ఆర్థికంగా మరింత కష్టాల్లోకి నెట్టిందని చెప్పవచ్చు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే, చావు దెబ్బే తిన్నారు. ఇక, తాము ఇమడలేమంటూ పెద్ద సంఖ్యలో కేడర్ డీఎండీకేను వీడింది. దీంతో మిగిలిన వాళ్లను రక్షించుకునేందుకు విజయకాంత్ తీవ్రంగానే కుస్తీలు పట్టారు. ఇప్పుడు ఉన్న కేడర్‌లో ఆర్థికంగా దెబ్బ తిన్న వాళ్లు కొందరు అయితే, మరి కొందరు చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా రాజకీయాలు చేసే వాళ్లు ఉన్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నేతల్లో స్థానిక ఎన్నికల ఖర్చు గుబులు బయలు దేరింది. ఎక్కడ తమ నెత్తిన వేసే రీతిలో కెప్టెన్ పిలుపునిస్తారో అన్న ఉత్కంఠ బయలు దేరింది. దీంతో ముందస్తుగా మేల్కొన్న జిల్లాల నేతలు అన్నా..డబ్బుల్లేవు...నీవే దిక్కు అన్నట్టు విజయకాంత్ వద్ద మొరపెట్టుకునే పనిలో పడ్డారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? పొత్తా? ఒంటరా..? అన్న అంశాలపై కేడర్ అభిప్రాయాల్ని విజయకాంత్ స్వీకరించే పనిలో పడ్డారు. మంగళవారం నుంచి ఈ ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఇందులో జిల్లాలు, డివిజన్ల నుంచి వస్తున్న నేతలు విజయకాంత్‌కు షాక్‌లు ఇచ్చే పనిలో పడ్డారట..!. బలోపేతం లక్ష్యంగా కెప్టెన్ ఇచ్చే సూచనలు, సలహాలను నేతలు చక్కగా ఆలకిస్తున్నారు. అదే అభిప్రాయాల విషయానికి వచ్చే కొద్ది నేతలు తమ గళాన్ని విప్పే పనిలో పడడం కెప్టెన్‌కు పెద్ద షాక్కే అంట..!. డబ్బుల్లేవు, మళ్లీ..మళ్లీ తాము సొంత డబ్బులు ఖర్చు పెట్టలేం అన్న సమాధానాలు పెద్ద సంఖ్యలో వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలకు దూరంగా ఉంటే మంచిదన్నట్టుగా సలహాలు ఇచ్చే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అందరి అభిప్రాయాల్ని శ్రద్ధంగా వినే విజయకాంత్, చివరలో ఎన్నికల్లోకి వెళ్తున్నాం...తాను సూచించే వ్యక్తి గెలుపునకు శ్రమించాల్సిందే అంటూ కేడర్‌కు హుకుం జారీ చేసి పంపించేస్తున్నట్టు సమాచారం. ఇంత మాత్రానికి తమను పిలిపించి అభిప్రాయాలు సేకరించడం ఏమిటో అంటూ పలువురు నేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయం నుంచి బయట పడ్డాక పెదవి విప్పే పనిలో పడడం గమనార్హం. అదే సమయంలో తాను మాత్రం తగ్గేది లేదన్నట్టుగా విజయకాంత్ ముందుకు సాగుతుండడంతో స్థాని కంలో బలాన్ని చాటగలమా అన్న అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారట! ఇక, ఓ వైపు కేడర్ అభిప్రాయాలు అంటూ, మరో వైపు దరఖాస్తుల స్వీకరణ అంటూ విజయకాంత్ తనదైన రూట్లో పయనం సాగిస్తుండడం గమనార్హం. దరఖాస్తుల హోరు : ఎన్నికలపై అభిప్రాయ సేకరణ ఓ వైపు కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో సాగితే, మరో వైపు బుధవారం నుంచి ఎన్నికల బరిలో నిలబడే ఆశావహులు దరఖాస్తులు సమర్పించుకునే విధంగా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయడం ఆలోచించదగ్గ విషయమే. ఇక విజయకాంత్ రూటే సెపరేటుగా ఉంటే, పీఎంకే అయితే, తాము ఒంటరే అన్నది స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో నిలబడే ఆశావహుల నుంచి దరఖాస్తుల ఆహ్వానానికి శ్రీకారం చుట్టారు. అలాగే, బీజేపీ సైతం ఒంటరి అన్నట్టుగానే దరఖాస్తుల పర్వానికి శ్రీకారం చుట్టింది. కోడంబాక్కంలో ఈ దరఖాస్తుల పంపిణీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ప్రారంభించేశారు. దీంతో ఆయా పార్టీలో దరఖాస్తుల పర్వం వేగం పుంజుకుంది. -
ఇక వదినమ్మ రాజ్యం
సాక్షి, చెన్నై: డీఎండీకేలో వదినమ్మ ప్రేమలత విజయకాంత్ ఇక పూర్తిస్థాయిలో చక్రం తిప్పబోతున్నారు. కొత్త రక్తంతో పూర్వవైభవం లక్ష్యంగా అడుగులకు సిద్ధ పడ్డ విజయకాంత్ తన సతీమణికి పార్టీలో పదవి కట్టబెట్టేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. త్వరలో ఇందుకు తగ్గ అధికార ప్రకటన వెలువడ బోతున్నది. పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి పగ్గాలు వదినమ్మను వరించే అవకాశాలు ఉన్నట్టుగా డీఎండీకేలో చర్చ బయలుదేరడం గమనార్హం. సినీ నటుడి నుంచి రాజకీయ నేత గా ఎదిగిన విజయకాంత్‌కు వెన్నంటి ఆయన సతీమణి ప్రేమలత, బావ మరి ది సుదీష్ ఉంటూ వస్తున్నారు. సుదీష్ డీఎండీకే యువజన పగ్గాలతో ఆది నుం చి ముందుకు సాగుతూ వస్తున్నారు. పా ర్టీ ఆవిర్భావంతో డీఎండీకే వ్యవహారాలను తెర వెనుక నుంచి ప్రేమలత సా గించే వారు. 2011 ఎన్నికల్లో ఆమె పార్టీ కోసం పూర్తి స్థాయిలో తనను అంకితం చేసుకున్నారు. ఎలాంటి పదవి పార్టీలో లేకున్నా, ఆ ఎన్నికల్లో డీఎంకే పతనం లక్ష్యంగా ప్రచార బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తన వాక్చాతుర్యంతో ప్రజ ల్ని ఆకర్షించారని చెప్పవచ్చు. ఆ ఎన్నికల్లో డీఎండీకే ప్రధాన ప్రతి పక్షంగా అవతరించడం ప్రేమలత బాధ్యతలు పెరి గాయి. పార్టీ అనుబంధ మహిళా విభా గం కార్యదర్శి పదవితో పార్టీ వ్యవహారాల్లో ఆమె జోక్యం పెరిగిందని చెప్పవచ్చు. ఇది మరీ ఎక్కువ కావడంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకేకు పెద్ద దెబ్బ తగిలేలా చేశాయి. టార్గెట్ వదినమ్మ: ప్రజా సంక్షేమ కూటమిలోకి డీఎండీకేను తీసుకెళ్లడంలో ప్రేమలత కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు, విమర్శలు బయలు దేరాయి. వదినమ్మ తీరును ఖండిస్తూ, నిరసిస్తూ బయటకు వెళ్లిన వాళ్లు తీవ్రంగానే స్పందించారు. వాటిని ఖాతరు చేయని వదినమ్మ రాష్ట్ర వ్యాప్తం గా సుడిగాలి పర్యటనే సాగించారు. విజ యకాంత్ కేవలం బహిరంగ సభలకు పరిమితం అయితే, తానొక్కరే అన్నట్టుగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రేమలత తీవ్రంగానే చక్కర్లు కొట్టారు. ఇంత వరకు సాగిన తతంగాలు ఓ ఎత్తు అయితే, ఎన్నికల అనంతరం డీఎండీకేను వీడే వారు మరీ ఎక్కువే అయ్యారు. వీళ్లు కూడా వదినమ్మను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించిన వాళ్లే. వదినమ్మకు పదవి: ఇన్నాళ్లు తన సతీమణికి పార్టీలో ఎలాం టి పదవి లేనందునే, విమర్శలు, ఆరోపణలు గుప్పించారని, ఇక, ఆమెను అందలం ఎక్కిస్తా చూడండి అన్నట్టు, ఉండే వాళ్లు ఉండొచ్చు, వెళ్లే వాళ్లు వెళ్లొచ్చన్న సంకేతాన్ని విజయకాంత్ జిల్లాల నేతల కు రెండు రోజుల క్రితం పంపిం చినట్టు సమాచారం. ఇప్పటికే డీఎండీకే నుంచి ముఖ్యమైన నాయకులు బయటకు వెళ్లిన దృష్ట్యా, ఇక ఉన్న వాళ్లందరూ తన అభిమానులేనని, వీరి ద్వారా సరికొత్త రక్తాన్ని నింపి, బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతానన్న ధీమాను విజయకాంత్ తన సంకేతంతో నేతల్లోకి పంపించి ఉండడం గమనార్హం. సరికొత్త అడుగులతో ముందుకు సాగి పూర్వ వైభవాన్ని చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉందని, స్థానిక సమరంతో సత్తా ను చాటుకోవాల్సి ఉన్నందున, పార్టీలో వదినమ్మకు పదవిని అప్పగించే విధం గా జిల్లాల్లో తీర్మానాలు చేసి రాష్ర్ట కమిటీకి పంపించాలని సూచించి ఉండటం ఆలోచించదగ్గ విషయమే. తానేదో స్వ యంగా వదినమ్మకు పదవి కట్టబెట్టినట్టుగా కాకుండా, జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు అందలం ఎక్కించినట్టు చెప్పుకునేందుకే అన్నయ్య తన సంకేతా న్ని పంపించినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాల కమిటీల సమావేశాల్లో తీసుకునే తీర్మానం మేరకు త్వరలో రాష్ట్ర కమిటీ ఆమోదించి వదినమ్మకు పార్టీలో పదవి కట్టబెట్టడం ఖాయం అంటున్నారు. వదినమ్మకు పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి పగ్గాలు అప్పగించేందుకు అవకాశాలు ఉన్నాయ ని, ఆ పదవికి ఆమె అన్ని రకాలుగా అర్హురాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. విజయకాంత్ సంకేతం అలా పంపించారో లేదో, ఇలా కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం జిల్లాల నేతలు ఇందుకు తామూ ఒకే అన్నట్టుగా తమ అన్నయ్యకు లేఖల్ని పంపించి ఉండడం విశేషం. విజయకాంత్ ఆరోగ్య పరంగా సమస్యల్ని ఎదుర్కొంటున్న దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్యటనలు సాగించడం కష్టతరమే. ఇందుకు నిదర్శనం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం బహిరంగ సభలకే ఆయన పరిమితం కావడమే. ఈ దృష్ట్యా, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, కేడర్‌లో ఉత్సాహం నింపడం, పూర్వ వైభం లక్ష్యంగా ముందుకు సాగాలంటే, వదినమ్మకు తగిన బాధ్యతలు తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తించే తమ అన్నయ్య పదవీ నిర్ణయాన్ని తీసుకున్నట్టు డీఎండీకే నాయకుడు ఒకరు పేర్కొనడం గమనార్హం. వదినమ్మ చేతికి పదవి దక్కిన పక్షంలో, ఇక డీఎండీకేలో ఆమె పూర్తిస్థాయిలో చక్రం తిప్పే అవకాశాలు ఎక్కువే. ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు, పరిణామాలకు దారి తీస్తాయో అన్నది వేచి చూడాల్సిందే. -
సుప్రీంకు అన్న, వదిన..
వారెంట్ రద్దుకు పిటిషన్ విల్లుపురం కోర్టు సమన్లు సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతల, ఆ పార్టీ వర్గాల మీదున్న పరువు నష్టం దావాల విచారణల వేగం పెరిగింది. తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీ చేసి ఉంటే, విల్లుపురం కోర్టు బుధవారం సమన్లు జారీ చేయడం గమనార్హం. సీఎం జయలలితకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు, ఆధార రహిత ఆరోపణలు గుప్పించే వారిపై పరువు నష్టం దావాల మోత రాష్ట్రంలో మోగడం జరుగుతున్నది. ఆ దిశగా డీఎండీకే అధినేత విజయకాంత్‌పై అనేకానేక పిటిషన్లు జిల్లాల వారీగా దాఖలై ఉన్నాయి. పిటిషన్ల విచారణల్లో భాగంగా కోర్టు మెట్లు ఎక్కకుండా డుమ్మాలు కొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుప్పూర్ కోర్టు డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు మంగళవారం పిటీ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అదే సమయంలో బుధవారం విల్లుపురం కోర్టు సమన్లు జారీ చేయడం గమనార్హం. మరో కేసు నిమిత్తం కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉండగా, డుమ్మా కొట్టారు. ఎక్కడ తిరుప్పూర్ కోర్టు తరహాలో విల్లుపురం కోర్టు సైతం పీటీ వారెంట్ జారీ చేస్తుందోనన్న ఆందోళనతో విజయకాంత్, ప్రేమలత తరఫున న్యాయవాదులు మేల్కొన్నారు. ఆ ఇద్దరు కోర్టుకు హాజరు కాలేని పరిస్థితులను వివరించడంతో న్యాయమూర్తి సరోజిని దేవి ఏకీభవించారు. ఆగస్టు తొమ్మిదో తేదీకి విచారణ వా యిదా వేస్తూ, ఆ రోజున తప్పని సరిగా కోర్టుకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. విల్లుపురం కోర్టు సమన్లతో తప్పించుకున్నా, తిరుప్పూర్ కోర్టు వారెంట్‌తో ఎక్కడ అరెస్టు కావాల్సి వస్తుందోనన్న బెంగ తో విజయకాంత్, ఆయన సతీమణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ ఇద్దరి తరఫున న్యాయవాది మణి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్‌ను రద్దు చేయాలని విన్నవించారు. -
అన్న, వదినమ్మకు వారెంట్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు తిరుప్పూర్ కోర్టు మంగళవారం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దర్నీ అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలన్న ఈ వారెంట్‌తో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేసినా, ఆధార రహిత ఆరోపణలు గుప్పించినా కోర్టు మెట్లు ఎక్కాల్సిందే. ఇందుకు అద్దం పట్టే విధంగా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు పరువు నష్టం దావాల్ని కోర్టుల్లో కోకొల్లలుగా దాఖలు చేశారు. ఇందులో భాగంగా గతంలో తిరుప్పూర్ జిల్లా పల్లడంలో జరిగిన బహిరంగ సభలో డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత సీఎం జయలలితను టార్గెట్ చేసి తీవ్రంగానే విరుచుకు పడ్డారు. వారి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది సుబ్రమణియన్ తిరుప్పూర్ మొదటి మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో సీఎంకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు గుప్పించిన విజయకాంత్, ప్రేమలతలపై చర్యకు కోర్టును విన్నవించారు. ఈ పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి అలమేలు నటరాజన్ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అని విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు సమన్లు జారీ చేసింది. అయితే, ఆ సమన్లను ఆ ఇద్దరూ ఖాతరు చేయలేదు. మంగళవారం కోర్టుమెట్లు ఎక్కాల్సిన ఆ ఇద్దరు డుమ్మా కొట్టారు. దీంతో న్యాయమూర్తికి ఆగ్రహం వచ్చినట్టుంది. ఆ ఇద్దర్నీ కోర్టులో హాజరు పరచాలని పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ జారీతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన బయలు దేరింది. అసలే రోజుకో రూపంలో సమస్యలు తమ అన్న, వదినమ్మలను చుట్టుముట్టుతున్న సమయంలో ఈ వారెంట్ ఏమిటో అన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు రాష్ర్టంలో తమకు వ్యతిరేకంగా ఉన్న దృష్ట్యా, పోలీసులు అరెస్టు చేసినా చేస్తారేమో అన్న ఉత్కంఠకు గురి అవుతున్నారు. ఇది వరకు విజయకాంత్, ప్రేమలతల మీద వేర్వేరుగా కోర్టుల్లో పరువు నష్టం దావాలు విచారణలో ఉన్నాయి. అయితే, తిరుప్పూర్ కోర్టులో మాత్రం ఇద్దరి మీద ఒకే కేసు విచారణలో ఉన్నది. -
ఎట్టకేలకు పెదవి విప్పిన వదినమ్మ...
సాక్షి, చెన్నై: ఎందరు వెళ్లినా, తమ బలం తమదే అని డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్ విజయకాంత్ వెన్నంటి లక్షల్లో అభిమానులు ఉన్నారని, వారి మద్దతుతో పూర్వ వైభవం తప్పనిసరిగా వ్యాఖ్యానించారు. పార్టీని వీడి వెళ్తున్న నాయకులందరూ ద్రోహులే అని మండిపడ్డారు. ఇక, ఎన్నికల సమయంలో ఎండీఎంకే నేత వైగో తమకు తీవ్ర షాక్ ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఎన్నికల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలతకు వ్యతిరేకంగా ఆ పార్టీ వర్గాలే పెదవి విప్పడం మొదలెట్టాయి. ఆమె అనాలోచిత నిర్ణయాలతో పార్టీ పాతాళంలోకి నెట్టబడిందని విమర్శలు, ఆగ్రహం ప్రదర్శించే వాళ్లు ఎక్కువే. కొందరు గుడ్‌బై చెప్పి బయటకు వస్తుం టే, మరికొందరు కెప్టెన్ మీదున్న అభిమానంతో ఇంకా అంటి పెట్టుకుని ఉన్నారు. అదే సమయంలో వదినమ్మ ప్రేమలత జోక్యం ఇక పార్టీలో ఉండకూడదంటూ కెప్టెన్‌కు హెచ్చరికలు, సూచనలు చేసేవాళ్లు పెరిగారు. తన మీద పార్టీ వర్గా లు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నా, మౌనంగా ఉంటూ వచ్చిన ప్రేమలత శుక్రవారం పెదవి విప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానేమిటో, కెప్టెన్ ఏమిటో వివరిస్తూ, పార్టీ వ్యవహా రాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. కెప్టెన్ ఏ నిర్ణయాన్నైనా సరే కార్యకర్తలతో చర్చించి తీసుకుంటారని వ్యాఖ్యానించారు. వైగో షాక్ ఇచ్చారు: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా డీఎండీకే అవతరించాలన్న లక్ష్యంతో ప్రజాసంక్షేమ కూటమితో పయనం సాగించామని ప్రేమలత గుర్తు చేశారు. అవినీతి డీఎంకేను తరిమి కొట్టడం లక్ష్యంగా 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో చేతులు కలపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే తీరు నచ్చక బయటకు వచ్చామని, ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించామని వివరించారు. అందుకే ప్రజలతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనే విధంగా ప్రజా కూటమికి నేతృత్వం వహించడం జరిగిందని వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల చివరి క్షణంలో ఎండీఎంకే నేత వైగో పెద్ద షాక్కే ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమైనా, చివరి క్షణంలో పోటీకి దూరంగా ఉండడం ఆవేదన కల్గించిందని పేర్కొన్నారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చినా, ఆయన ఏ మాత్రం తగ్గలేదని అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరి పయనమా లేదా..? అన్నది కెప్టెన్ ప్రకటిస్తారని చెప్పారు. ప్రజాసంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చినట్టుగా కెప్టెన్ స్వయంగా ఇంత వరకు ప్రకటించలేదుగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మా వల్లే ఓటమి: డీఎంకేకు తమ వల్లే గట్టి దెబ్బ తగిలిందని వివరించారు. తమతో పొత్తుకు డీఎంకే ముందుకు రాని దృష్ట్యా, అధికారం వారి చేతికి చిక్కలేదని ఎద్దేవా చేశారు. డీఎంకే అవినీతి పార్టీ అన్న విషయాన్ని కెప్టెన్ ఎప్పుడో పరిగణించారని, అందుకే వారి వెంట వెళ్లకూడదన్న నిర్ణయంతో ఆది నుంచి ఉంటూ వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కూటమితో ఒరిగిందేమిటో అని ఈసందర్భంగా ప్రశ్నించగా, లోక్‌సభ ఎన్నికల్లో 37 సీట్లను గెలుచుకున్న అన్నాడీఎంకేతో ఒరిగిందేమిటో అని పొంతన లేని సమాధానం ఇవ్వడం గమనార్హం. అభిమానులు మా వెంటే: కెప్టెన్‌ను చూస్తే పీఎంకే అధినేత రాందాసు, ఆయన తనయుడు రాందాసులకు భయం అని, అందుకే తమను టార్గెట్ చేసి వ్యాఖ్యల్ని సంధిస్తున్నారని మండిపడ్డారు. డీఎండీకే గురించి వారికి ఏమి తెలుసునని, వాళ్ల పార్టీ గురించి ముందు ఆలోచించుకుంటే మంచిదంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎండీకే నుంచి ఎందరు బయటకు వెళ్లినా, కెప్టెన్ బలం...కెప్టన్ దే...మా బలం మాదే...! అని ధీమా వ్యక్తం చేశారు. వెళ్తున్న వాళ్లందరూ ద్రోహులు అని, చంద్రకుమార్ లాంటి వారికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది కెప్టెన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వెళ్తూ..వెళ్తూ నిందల్ని వేయడం చూస్తుంటే, ఏ మేరకు కెప్టెన్‌కు ద్రోహం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. ఎందరు నాయకులు బయటకు వెళ్లినా, కెప్టెన్ అభిమానులు లక్షల్లో వెన్నంటి ఉన్నారని, వాళ్లను కదిలించడం అంత సులభం కాదని ధీమా వ్యక్తం చేశారు. జోక్యం లేదు: పార్టీ వ్యవహారాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని, చేసుకోబోనని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న కెప్టెన్ ముందుగా నాయకులతో చర్చిస్తారని, తదుపరి కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటారని వివరించారు.నిర్ణయం తీసుకున్న తర్వాత చివరకు తనకు సమాచారం ఇస్తారేగానీ, ఎన్నడూ తనకు ముందే ఎలాంటి విషయాలు చెప్పరని వ్యాఖ్యానించారు. 2005లో పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని వ్యవహారాల్లోనూ ప్రతిచోట కార్యకర్తలు కన్పిస్తారని, వారి అభీష్టం మేరకు కెప్టెన్ నిర్ణయం ఉంటుందన్నారు. -
శశికళ ద్వారా కెప్టెన్‌కు రూ.750 కోట్లు
సాక్షి, చెన్నై : ప్రజా సంక్షేమ కూటమితో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్న డీఎండీకే అధినేత విజయకాంత్‌కు అన్నాడీఎంకే తరఫున భారీ కానుక ముట్టినట్టు మాజీలు ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ద్వారా రూ.750 కోట్లు కెప్టెన్ ఖాతాలోకి చేరినట్టుగా ఆరోపణలు గుప్పిస్తూ, డీఎండీకే ట్రస్టులో మాయమైన రూ. ఐదు వందల కోట్ల వ్యవహారం కోర్టులో తేల్చుకుంటామని ప్రకటించారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కింగ్ కావాలన్న ఆశతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా సంక్షేమ కూటమితో కలిసి ఎదుర్కొన్నారు. ఈ కూటమి అన్నాడీఎంకే షాడోగా, ఇందుకుగాను కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగోకు రూ. 1,500 కోట్లు అన్నాడీఎంకే ముట్టచెప్పినట్టు ఆరోపణలు ఎన్నికల సమయంలో గుప్పుమన్నాయి. అదే సమయంలో ఆ కూటమితో పొత్తు వద్దే వద్దంటూ డీఎండీకే ముఖ్య నేతలు తమ కెప్టెన్‌కు సూచించి, చివరకు టాటా చెప్పారు. ఆ ఎన్నికల్లో డిపాజిట్లే కాదు, ఇక డీఎండీకే పాతాళంలోకి చేరినట్టే అన్నట్టుగా ఫలితాలు వెలువడ్డాయి. ఈ ప్రభావం తో డీఎండీకేను వీడి డీఎంకే, అన్నాడీఎంకే గూటికి చేరే వారి సంఖ్య పెరిగి ఉన్నది. అత్యధిక శాతం మంది డీఎంకేలోకి వస్తున్నారని చెప్పవచ్చు. అలాగే, డీఎండీకేను చీల్చి మక్కల్ డీఎండీకేను ఏర్పాటు చేసుకుని డీఎంకేలోకి విలీనానికి సిద్ధం అవుతున్న మాజీలు తమ కెప్టెన్ మీద తీవ్ర ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే డీఎండీకే ట్రస్టులో ఉన్న రూ. ఐదు వందల కోట్లను విజయకాంత్ కుటుంబం మింగేసిందంటూ డీఎండీకే మాజీలు ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. తాజాగా, అన్నాడీఎంకే నుంచి విజయకాంత్‌కు ఇటీవల భారీ కానుక ముట్టినట్టుగా ఆరోపణలు అందుకోవడం గమనార్హం. రూ.750 కోట్లు : డీఎంకే చేతికి అధికారం చిక్కకుండా చేయడం లక్ష్యంగా ఆవిర్భవించిన ప్రజా సంక్షేమ కూటమిలో ఏమి ఏరుగని అమాయకుడిగా వ్యవహరించిన విజయకాంత్ నిజ స్వరూపం తాజాగా బయట పడిందని మక్కల్ డీఎండీకే నేత ఆరోపించే పనిలోపడ్డారు. మాజీ ఎమ్మెల్యే మక్కల్ డీఎండీకే నేత చంద్రకుమార్ నేతృత్వంలో సేలం వేదికగా బుధవారం జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, ముఖ్య నేత పార్తీబన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకేకు వ్యతిరేకం..వ్యతిరేకం అంటూ , చివరకు ఆ పార్టీకి అధికార పగ్గాలు అప్పగించడంలో విజయకాంత్ కూడా కీలక భూమిక పోషించి ఉన్నారని ఆరోపించారు. పేదరిక నిర్మూలన, అవినీతి నిర్మూలన అని వ్యాఖ్యలు చేసిన విజయకాంత్‌కు అవినీతి సొమ్ము కోట్లల్లో ముట్టి ఉన్నదని ఆరోపణలు గుప్పించారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి రావడం లక్ష్యంగా చేసుకున్న లోపాయికారి ఒప్పందానికి తగ్గ కానుక విజయకాంత్‌కు ఇటీవల లభించినట్టు పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలిత నెచ్చెలి శశికళ ద్వారా రూ. 750 కోట్లు విజయకాంత్ గుప్పెట్లోకి చేరి ఉన్నదని ఆరోపించారు. అవినీతి గురించి డైలాగులు వళ్లించే విజయకాంత్ సినిమాల్లోనే హీరో అని, వాస్తవిక జీవితంలో విలన్‌గా మారి ఉన్నారని ధ్వజమెత్తారు. విజయకాంత్ బండారం బయట పడి ఉన్నదని, అందుకే ఆపార్టీ గుడారం ఖాళీ కానున్నదని వ్యాఖ్యానించారు. డీఎండీకే నుంచి 90 శాతం మంది బయటకు రానున్నారని, ఇందులో 70 శాతం మంది తమతో కలిసి డీఎంకేలో చేరనున్నట్టు ప్రకటించారు. సేలం వేదికగా ఈనెల 17న జరగనున్న బహిరంగ సభతో డీఎంకే దళపతి స్టాలిన్ సమక్షంలో మక్కల్ డీఎండీకేను విలీనం చేయనున్నామని ప్రకటించారు. విజయకాంత్‌కు వ్యతిరేకంగా త్వరలో కోర్టుకు వెళ్లనున్నామని, పేదల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టు నుంచి మాయం చేసిన రూ. 500 కోట్లను కక్కిస్తామన్నారు. ఈట్రస్టు నుంచి ఇటీవల 1.15 కోట్లతో ఓ కారును సైతం కొనుగోలు చేసి ఉండడం బట్టి చూస్తే, విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్ ఏ మేరకు అవినీతికి పాల్పడి ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నాని పేర్కొన్నారు. ఆ ట్రస్టు వ్యవహారాలు, నిధులకు సంబంధించిన శ్వేత పత్రాన్ని విడుదల చేయడానికి సిద్దమా..? అని ఈ సందర్భంగా విజయకాంత్‌కు సవాల్ విసిరారు. -
మూడు లక్షల మంది పార్టీకి టాటా!
చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్‌ను అసెంబ్లీ ఎన్నికలు పీకల్లోతు కష్టాల్లో ముంచిన విషయం తెలిసిందే. పార్టీలో చీలిక, జిల్లాల కార్యదర్శులు గుడ్‌బై లేఖాస్త్రాలు, కేడర్‌లో అసంతప్తి జ్వాల వెరసి డీఎండీకే భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నది. ఇప్పటికే పలువురు నాయకులు గుడ్‌బై చెప్పేయగా, ఉన్న వాళ్లను లాక్కెళ్లేందుకు మక్కల్ డీఎండీకే నేత చంద్రకుమార్ తీవ్రంగానే కుస్తీలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ డీఎండీకే కేడర్‌ను తన వైపునకు తిప్పుకోవడంతో తీవ్రంగానే చంద్రకుమార్ అండ్ బృందం పరుగులు తీస్తున్నది. డీఎండీకే నుంచి మూడు లక్షల మంది తమతో కలసి డీఎంకేలో చేరబోతున్నట్టు ఆదివారం చంద్రకుమార్ ప్రకటించడం గమనార్హం. దీంతో విజయకాంత్ వెన్నంటి ఎందరు ఉంటారో అన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక సమరంపై సమాలోచనకు ఆహ్వానిస్తే నేతలు పార్టీ కార్యాలయం వైపుగా తొంగిచూడక పోవడం బట్టి చూస్తే, ఇక, డీఎండీకే భవిష్యత్తు ఏమిటో అన్న ప్రశ్న బయలు దేరింది. స్థానిక బరిలో దిగాలంటే, పార్టీ నిధులు ఇవ్వాల్సిందేనని, తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టే స్థితిలో లేమంటూ పలువురు నాయకులు కరాఖండీగా విజయకాంత్ ఎదుట స్పష్టం చేశారు. పార్టీ నిధులు ఇప్పట్లో రాలే పరిస్థితిలేని దష్ట్యా, ట్రస్టు నిధుల వ్యవహారంలో ఆరోపణలు వచ్చి ఉన్న నేపథ్యంలో ఈ సారి స్థానిక సమరం తమకు అవసరమా? అన్న యోచనలో విజయకాంత్ ఉన్నట్టు సమాచారాలు వెలువడుతున్నాయి. నిధులు పంపిణీ చేసినా, ఎన్నికల్లో ప్రస్తుతం తమ ఓటమి తప్పదని, అధికార బలం ముందు అభ్యర్థులు తల వంచాల్సిన పరిస్థితి తప్పదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఉన్నట్టు సమాచారం. అందుకే ఈ సారి స్థానిక ఎన్నికల్ని బహిష్కరించి, తదుపరి పార్టీ బలోపేతం దిశగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు తగ్గ కార్యాచరణతో విజయకాంత్ ఉన్నట్టుగా ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. స్థానిక సమరం బహిష్కరణ ప్రకటనను తన జన్మదినం సందర్భంగా విజయకాంత్ చేస్తారని చెబుతున్నారు. -
ఇక ఒంటరే!
మళ్లీ పాత నినాదం కెప్టెన్ నిర్ణయం ఇలంగోవన్ వ్యాఖ్య ఆ మూడు చోట్ల బరిలో అభ్యర్థులు స్థానికంతో సత్తా చెన్నై : పార్టీ ఆవిర్భావంతో అందుకున్న నినాదాన్ని మళ్లీ తారక మంత్రంగా స్వీకరించి ప్రజల్లోకి వెళ్లేందుకు కెప్టెన్ నిర్ణయించారు. తంజావూరు, అరవకురిచ్చిలతో పాటు తిరుప్పర గుండ్రం ఉపఎన్నికలో ఒంటరిగా తమ అభ్యర్థుల్ని నిలబెట్టేందుకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ కోశాధికారి ఇలంగోవన్ స్పందించడం గమనార్హం. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తానే అంటూ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాన ప్రతి పక్ష స్థాయికి ఎదిగిన నాయకుడు డీఎండీకే అధినేత విజయకాంత్. పార్టీ ఆవిర్భావంతో ఐదేళ్లు ఒంటరిగా పయనం సాగించి, తదుపరి అన్నాడీఎంకేతో కలిసి ఎదుర్కొన్న ఎన్నికలతో ప్రజల మన్ననల్ని అందుకున్నారు. అయితే, ఇటీవలి ఎన్నికల్లో ఆయన తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పాతాళంలోకి నెట్టింది. కింగ్ కావాలన్న ఆశతో ఈ కింగ్‌మేకర్ ప్రజా సంక్షేమ కూటమికి నేతృత్వం వహించి చతికిల బడ్డారు. అడ్రస్సు గల్లంతు చేసుకుని, చేసిన తప్పునకు ఇప్పుడు పశ్చాత్తాపంలో పడ్డారని చెప్పవచ్చు. కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకునేందుకు బలోపేత నినాదాన్ని అందుకున్నారు. బలోపేతం లక్ష్యంగా పార్టీ వర్గాలతో ఏకంగా పది రోజులు చర్చించి, సమీక్షించి చేసిన తప్పులు మళ్లీ చేయకూడదన్న నిర్ణయానికి వచ్చారు. గతంలో ఒంటరిగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు ఆదరణ లభించిన దృష్ట్యా, మళ్లీ అదే నినాదంతో ముందుకు సాగేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక, తాను ఒంటరి...ప్రజలతోనే పొత్తు అంటూ బయట నుంచి ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీయండి, అరవకురిచ్చి, తంజావూరు ఎన్నికలు, తిరుప్పరగుండ్రం ఉప ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కొనేందుకు కసరత్తుల్లో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా డీఎండీకే కోశాధికారి ఏఆర్ ఇళంగోవన్ గురువారం స్పందించడం గమనార్హం. ధర్మపురిలో జరిగిన ఓ కార్యక్రమానంతరం మీడియా ప్రశ్నలకు ఇలంగోవన్ సమాధానాలు ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తి రాష్ట్రంలో డీఎండీకే మాత్రమేనని, కోల్పోయిన వైభవాన్ని మళ్లీ చేజిక్కించుకుని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. స్వలాభం కోసం కొందరు పార్టీని వీడారని, నిజమైన అభిమానం పార్టీలోనే ఉన్నదని వ్యాఖ్యానించారు. ఇక, ఏ ఎన్నికలు అయినా సరే ఒంటరిగానే ఎదుర్కొనేందుకు తమ అధినేత నిర్ణయించారని, అందుకు తగ్గ పయనం సాగనున్నదని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కొంటామని, ఇక ఏ కూటమి లేదని, అవసరం అయితే, ఎవరైనా తమ గొడుగు నీడకు రావాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. వాయిదా పడ్డ ఆ రెండు నియోజకవర్గాలు, తిరుప్పర గుండ్రం ఉప ఎన్నికల్లో డీఎండీకే అభ్యర్థులు పోటీలో ఉంటారని, ఒంటరి పయనం, ఇక ప్రజలతో తమ అధినేత కెప్టెన్ పొత్తు అంటూనే, అసెంబ్లీలో డీఎంకే అధినేత కరుణానిధి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
టాటా..బైబై
ఇక ఎవరి దారి వారిదే త్వరలో కొత్త పొత్తులు వాసన్ బహిరంగ ప్రకటన తదుపరి కెప్టెన్ సమాయత్తం వీసీకే, వామపక్షాలు కూడా సంక్షేమ కూటమి శుభం కార్డు ప్రజా సంక్షేమ కూటమికి టాటా.. బైబై చెప్పేందుకు అందులోని పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. ఆ కూటమితో పొత్తు ముగిసిందంటూ తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ వ్యాఖ్యానించారు. తదుపరి ఇదే వ్యాఖ్యను అందుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. ఆయన బాటలో తలా ఓ దారి అన్నట్టుగా వీసీకే, వామపక్షాలు నడిచేందుకు నిర్ణయించాయి. ఈ దృష్ట్యా, ఇక ప్రజా సంక్షేమ కూటమి అడ్రస్సు గల్లంతైనట్టే. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామే అని జబ్బలు చరిచిన డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమికి ఫలితాలు చెంప పెట్టే. ఈ కూటమిలోని డీఎండీకే, ఎండీఎంకే, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్, సీపీఎం, సీపీఐల డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. అందరి కన్నా,ఈ ఎన్నికల్లో భారీ నష్టాన్ని డీఎండీకే, సీపీఎం, సీపీఐలు చవిచూశాయి. ఇక, కాంగ్రెస్‌ను వీడి తమిళ మానిల కాంగ్రెస్‌కు పునర్ జీవం పోసిన సీకే వాసన్‌కు తొలి ఎన్నికలే పెద్ద షాక్. డీఎంకే గొడుగు నీడన రాజకీయ పయనం సాగించి ప్రజా సంక్షేమ కూటమిలోకి చేరిన వీసీకేకు కోలుకోలేని దెబ్బ తప్పలేదు. ఇక, ఎండీఎంకే అంటారా..?. గత ఎన్నికల్ని బహిష్కరించిన ఆ పార్టీకి, తాజా ఫలితాల ఓ లెక్కే కాదు. ఎన్నికల అనంతరం ఆ కూటమిలో బీటలు వారినట్టే అన్న ప్రచారం బయలు దేరింది. అయితే, కూటమి కన్వీనర్ ఎండీఎంకే నేత వైగో మాత్రం తమ కూటమిలో చీలికకు అవకాశం లేదని, ప్రజల కోసం ఒకే గళం, ఒకే నినాదంతో ముందుకెళ్తామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ కూటమికి టాటా..బైబై అని స్పందించడంతో అదే నినాదంతో ముందుకు వెళ్లేందుకు మిగిలిన పార్టీలు సిద్ధమయ్యాయి. టాటా.. బైబై : చెన్నైలో పార్టీ ముఖ్య నాయకులు, జిల్లాల నేతలతో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ సమాలోచించారు. ఇందులో తీసుకున్న నిర్ణయం మేరకు ఇక టాటా గుడ్ బై అంటూ ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చేశారు. ఆ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వరకు మాత్రమేనని ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వాసన్ వ్యాఖ్యానించారు. అందుకే ఎన్నికల సమయంలో తమ కంటూ ప్రత్యేక మేనిఫెస్టోను ప్రకటించామని గుర్తు చేశారు. ఆ కూటమి ఆ ఎన్నికలతో ముగిసిందని, ఇక తమ పయనం బలోపేతం అని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నట్టు వివరించారు. స్థానిక ఎన్నికల్లో తమ బలాన్ని చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో పొత్తు ఎవరితో అన్నది తేల్చుతామని వ్యాఖ్యానించారు. సందర్భానుచితంగా, సమయానుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ కొత్త పొత్తు ప్రయత్నాలు ఉంటాయని చెప్పారు. కెప్టెన్ కూడా : వాసన్ అధికారికంగా ప్రకటించి కూటమి నుంచి బయటకు వెళ్లడంతో ఆ బాటను అనుసరించేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. పార్టీ నేతలతో సమీక్షను ముగించిన విజయకాంత్ ఇక, భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఇందులో భాగంగా ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నామన్న అధికారిక ప్రకటనను ఒకటి రెండు రోజుల్లో విజయకాంత్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో సమీక్షల సమయంలో నాయకుల అభిప్రాయాల్ని విన్న విజయకాంత్, వారి అభిష్టానికి అనుగుణంగా నడచుకునే విధంగా వ్యవహరించడమే కాకుం డా, కొన్ని సందర్భాల్లో తిరగబడే విధంగా వ్యాఖ్యల్ని సంధించినట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన నాయకులకు దూకుడుకు కల్లెం వేసే రీతిలో అవసరం అయితే, పార్టీని రద్దు చేయడం, లేదా మరో పార్టీలోకి విలీనం చేయడానికి తాను వెనుకాడబోనంటూ విజయకాంత్ హెచ్చరించి ఉండటం గమనించాల్సిన విషయమే. ఇక, ప్రజా సంక్షేమ కూటమితో ఒరిగిందేమీ లేని దృష్ట్యా, మళ్లీ డీఎంకేకు దగ్గరయ్యే విధంగా వీసీకే నేత తిరుమా ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు అద్దం పట్టే రీతిలో డీఎంకే అధినేత కరుణానిధికి అనుకూల వ్యాఖ్యల్ని అందుకుని ఉండటం ఆలోచించాల్సిందే. అదే విధంగా వామపక్షాలు సైతం కూటమి నుంచి బయటకు వచ్చేందుకు నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వామపక్షాలు మాత్రమే ఇక కలిసి నడిచే రీతిలో కార్యాచరణను సీపీఎం, సీపీఐ వర్గాలు సిద్ధం చేసి ఉండడం ఆలోచించ దగ్గ విషయం. స్థానిక ఎన్నికల్లో సీపీఎం, సీపీఐలు కలిసి కట్టుగా సాగితే, తమకు పట్టున్నచోట్ల గెలుపు బావుటాకు మార్గం సుగమం అవుతుందన్న ధీమాతో ఆ పార్టీల వర్గాలు ఉండడం విశేషం. -
ప్రజా సంక్షేమ కూటమికి కెప్టెన్ గుడ్‌బై
చెన్నై: ప్రజా సంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్)కి డీఎండీకే నేత విజయ్ కాంత్ గుడ్‌బై చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆయన సోమవారమిక్కడ ప్రకటించారు. కాగా గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన విజయ్ కాంత్ తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూపీ)తో జట్టు కట్టిన ఆయన ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయారు. కింగ్ మేకర్ అవుతారనుకున్న 'కెప్టెన్' చివరకు కుదేలయ్యారు. 'అమ్మ' హవాకు కొట్టుకుపోయారు. డీఎంకే ఆహ్వానాన్ని తిరస్కరించి ప్రజా సంక్షేమ కూటమి(పీబ్ల్యూఎఫ్)తో ఎన్నికల్లో పోటీ చేసిన విజయ్ కాంత్ చివరకు బోర్లా పడ్డారు. పీబ్ల్యూఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో నిలిచిన విజయ్ కాంత్ తన సీటు కూడా కాపాడుకోలేకపోయారు. ఉలందూరుపేట నుంచి పోటీ చేసిన కెప్టెన్ డిపాజిట్ కూడా కోల్పోయి మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2011లో రిషివాందియమ్, 2006లో విరుదాచలం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన మూడో పర్యాయం ఎన్నికల్లో భంగపాటుకు గురయిన విషయం తెలిసిందే. -
కెప్టెన్ కసరత్తు
రాష్ర్ట పర్యటనకు నిర్ణయం బలోపేతం లక్ష్యంగా పయనం సాక్షి, చెన్నై: చతికిలపడ్డ డీఎండీకేను బలోపేతం చేయడం లక్ష్యంగా ఆ పార్టీ అధినేత విజయకాంత్ కసరత్తుల్లో పడ్డారు. పార్టీల నేతలతో సమీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 20 వరకు ఈ సమీక్షలు సాగనున్నాయి. తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతున్నారు. బలోపేతం లక్ష్యంగా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే రీతిలో ఈ పర్యటనకు చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తానే అన్నంతగా ఎదిగిన నేత విజయకాంత్. డీఎండీకే ఆవి ర్భావంతో సత్తా చాటి, ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించి చివరకు చతికిలబడ్డారు. ఎంత వేగంగా ఎదిగారో, అంతే వేగం గా పాతాళంలోకి నెట్టబడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్ మేకర్‌గా ఉండి ఉంటే, కెప్టెన్‌ను ప్రజలు ఆదరించి ఉంటారేమో. కింగ్ అంటూ ముందుకు సాగి ఆరుగురితో కలసి డీఎంకే, అన్నాడీఎంకే అనే ఇద్దర్ని వేర్వేరుగా ఢీ కొట్టి చివరకు అడ్రస్సు గల్లంతు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయకాంత్ చరిష్మా అంటే ఇది అని చెప్పుకున్న వాళ్లంతా, ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలు, చమత్కారాలు సంధించే పనిలో పడ్డారు. డిపాజిట్లు గల్లంతై, ఓటు బ్యాంక్ కోల్పోయి దీనావస్థలో ఉన్న పార్టీకి కొత్త ఉత్సాహం నింపడం ఇప్పుడు విజయకాంత్ ముందు ఉన్న పెద్ద సవాల్. కోల్పోయిన వైభవాన్ని చేజిక్కించుకోవడం లక్ష్యంగా తీవ్ర కసరత్తులకు సిద్ధం అయ్యారు. ఆ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండల, యూనియన్, నియోజకవర్గ స్థాయిల్లోని నేతలతో సమీక్షించి, మళ్లీ బలనిరూపణ లక్ష్యంగా ముందుకు సాగాల్సిన తీరుపై సమీక్షించే పనిలో పడ్డారు. ఆ మేరకు సమీక్షలకు సోమవారం శ్రీకారం చుట్టారు. చెన్నై కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో తొలి రోజు చెన్నై, తిరువళ్లూరు జిల్లాల నేతలతో సమీక్షించారు. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి వరకు ప్రస్తుతం పార్టీ పరిస్థితి, వెన్నంటి ఉన్న కేడర్, నాయకుల వివరాలను సేకరించారు. పార్టీలో ప్రక్షాళన పర్వంతో ముందుకు సాగితే, కొత్త రక్తం నింపినట్టు అవుతుందన్న అంశాన్ని నాయకుల ముందు ఉంచి వారి అభిప్రాయాల్ని సేకరించినట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామని, అధికార పూర్వకంగా ప్రజా సంక్షేమ కూటమికి టాటా చెప్పే ప్రకటన విడుదల చేయాలని విజయకాంత్‌ను నాయకులు పట్టుబట్టి ఉన్నారు. ఇందుకు సానుకూలంగానే విజయకాంత్ స్పందించినట్టు, ఆ కూటమితో పని లేకుండా, పార్టీ బలం పెంపు లక్ష్యంగా ముందుకు సాగుదామని నేతలకు సూచించి ఉన్నారు. ఈ సమీక్షలు 20వ తేదీ వరకు సాగించే రీతిలో నిర్ణయం తీసుకుని ఉన్నారు. మంగళవారం తిరువణ్ణామలై, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కాంచీపురం, విల్లుపురం జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా విజయకాంత్ పర్యటన సాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో రోజుకు ఒక జిల్లా చొప్పున ఎంపిక చేసుకుని, మూడు నాలుగు ప్రధాన నియోజకవర్గ కేంద్రాల్లో సంక్షేమ సామగ్రి పంపిణీ, బహిరంగ సభలతో బలాన్ని చాటుకోవడం, ఢీలా పడ్డ కేడర్‌లో ఉత్సాహం నింపడం లక్ష్యంగా విజయకాంత్ పర్యటన సిద్ధం అవుతోన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సంక్షేమ కూటమికి బీటలు
* వైదొలగనున్న డీఎండీకే, తమాకా * అదే దిశగా వామపక్షాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని ప్రచారం చేసుకుంటూ ప్రజాసంక్షేమ కూటమి ఆవిర్భవించింది. ఎండీఎంకే అధినేత వైగో కూటమి రథసారధిగా, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు కూటమిలో చేరిపోయాయి. డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించారు. అధికారంలోకి రాకున్నా కనీసం పది సీట్లు గెలుచుకుంటామని కూటమి నేతలు ఆశించారు. అయితే ఎన్నికల ఫలితాల్లో వారి ఆశలు తల్లకిందులయ్యాయి. కనీసం ఒక్కసీటును కూడా గెలుచుకోలేదు. ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్ ఎంతో అవమానకరంగా డిపాజిట్టు కోల్పోయారు. ఆఖరుకు కూటమిలోని పార్టీలు ఈసీ గుర్తింపునే కోల్పోయే దుస్థితికి చేరుకున్నాయి. కూటమి ఓటమికి నువ్వంటే నువ్వు కారణమని నేతలు వాదించుకుంటున్నారు. సీఎం అభ్యర్థిగా విజయకాంత్‌ను ప్రకటించడం వల్లనే ఘోరపరాజయాన్ని చవిచూశామని వీసీకే అధినేత తిరుమావళవన్ ఫలితాలు వెలువడగానే వ్యాఖ్యానించాడు. కూటమి పార్టీల్లోని నేతలకు ఒకరంటే ఒకరికి పడని వైషమ్యాలు తలెత్తాయి. కూటమి నుంచి వెంటనే వైదొలగాల్సిందిగా డీఎండీకే జిల్లా కార్యదర్శులు విజయకాంత్‌పై ఒత్తిడి తెచ్చారు. తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి నుంచి వైదొలగడమే మేలని డీఎండీకే, తమాకా నిర్ణయించుకున్నాయి. మూడో కూటమికి ముగింపు పలికి పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు నిర్ణయించుకున్నాయి. అలాగే వామపక్షాలు సైతం వైదొలగాలనే ఆలోచనలో పడ్డాయి. ఎన్నికల్లో కూటమి ఆశించిన విజయాన్ని అందుకోలేదు, అయితే కూటమి ఏర్పాటైన పదినెలలకే గణనీయమైన ఓట్లు సాధించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణన్ అంటున్నారు. ఘన విజయాన్ని తాము అంచనా వేయలేదు, అయితే ప్రస్తుత పరాజయ పరిస్థితి తాత్కాలికమేనని అన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాలు కొనసాగుతాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కొనసాగాలంటే ధనస్వామ్యాన్ని అరికట్టాలని ఆయన వ్యాఖ్యానించారు. -
తప్పులు గుర్తించే పనిలో..
ఘోర పరాజయం డీఎండీకేను డీలా పడేలా చేసింది. డిపాజిట్ల గల్లంతుతో పాటుగా ఓటు బ్యాంక్ పతనం కావడంతో భవిష్యత్తు కార్యచరణపై విజయకాంత్ దృష్టి పెట్టారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాల కార్యదర్శులతో సమాలోచనలో మునిగారు. ప్రజా సంక్షేమ కూటమితో పొత్తే పార్టీ కొంప ముంచిందని పలువురు జిల్లా కార్యదర్శులు విజయకాంత్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. బీజేపీ సైతం తప్పులను గుర్తించే పనిలో పడింది. సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలి సిందే. ఇందులో డీఎండీకేకు అత్యధికంగా నష్టం జరిగి ఉన్నది. ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో ఉన్న పార్టీ, ఇప్పుడు చతికిల పడింది. 5.4 శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను సైతం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొంది. విజయకాంత్ సైతం ముఫ్పై వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సినంతగా డీఎండీకే దిగజారింది. విజయకాంత్‌కు తీవ్ర నష్టం ఏర్పడిందన్న విషయం కూటమిలోని మిత్రులందరికీ తెలుసు. అందుకే ఆయన్ను ఓదార్చే రీతిలో కూటమిలోని ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, తమిళ మానిల కాంగ్రెస్‌లు రెండు రోజుల క్రితం విజయకాంత్‌తో సమాలోచించారు. ఈ సమాలోచనతో విజయకాంత్ మినహా తక్కిన నేతలు మీడియా ముందుకు వచ్చి తమ కూటమి కొనసాగుతుందని ప్రకటించి వెళ్లారు. అయితే, నష్టం ఎక్కడి నుంచి తమకు ఎదురైందో అన్వేషించి, భవిష్యత్తును మళ్లీ పునర్ నిర్మించుకునేందుకు విజయకాంత్ సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటుగా రాష్ట్రంలోని పార్టీ జిల్లాల కార్యదర్శులు ముఖ్య నాయకులతో సమాలోచనకు నిర్ణయించారు. ఆ మేరకు కోయంబేడులో జరిగిన సమాలోచనకు ఉదయం పలువురు జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. పొత్తే కొంప ముంచింది: కోయంబేడులో విజయకాంత్ నేతృత్వంలో జరిగిన ఈ సమాలోచనలో పలువురు నేతలు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసి ఉన్నారు. ప్రజా సంక్షేమ కూటమితో కలిసి వెళ్లడం వల్లే పార్టీ పతనం కావాల్సి వచ్చిందని, ఇది కొనసాగితే, ఇక కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న హెచ్చరికను చేసినట్టు సమాచారం. ఇకనైనా వ్యూహాత్మకంగా వ్యవహరించడం, అదును చూసి అడుగులు వేసి బలోపేతం చేసుకోవాలని లేనిపక్షంలో కేడర్ చేజారే ప్రమాదం ఉందని సూచించినట్టు తెలిసింది. పార్టీ ఎన్నికల గుర్తింపు రద్దు, ఢంకా చిహ్నం దూరం కాబోతున్న విషయంగా విజయకాంత్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోపు బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుదామని, ఆ ఎన్నికల్లో గెలుపుతో మళ్లీ బలాన్ని చాటుకుందామన్న భరోసాను కేడర్‌కు ఇచ్చే విధంగా పలు సూచనలు , సలహాల్ని జిల్లాల కార్యదర్శులకు విజయకాంత్ ఇచ్చి ఉన్నారు. ఇక, విజయకాంత్ బాటలోనే ఎండీఎంకే నేత వైగో ఓటమిపై నేతలతో సమాలోచించేందుకు నిర్ణయించారు. ఒకటో తేదిన చెన్నైలోని పార్టీ కార్యాలయంలో ఈ సమాలోచనా సమావేశం సాగనున్నది. ఇక, రాష్ట్రంలో ఓటమి చవి చూసినా, ఓటు బ్యాంక్ ఊరట నివ్వడంతో తదుపరి అడుగులు దిశగా పీఎంకే సిద్ధం అయింది. ఇందు కోసం కేడర్‌తో సమాలోచించేందుకు నిర్ణయించారు. ఓటమి చవిచూసిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నేతలతో మంగళవారం పీఎంకే అధినేత రాందాసు, ఎంపీ అన్భుమణి రాందాసు, పార్టీ అధ్యక్షుడు జికే మణిలు సమాలోచనా సమావేశానికి నిర్ణయించారు. కమలనాథుల మంతనాలు : ఇక ఐదుసీట్లు గ్యారంటీ అని ఢిల్లీకి నివేదిక పంపించి చివరకు ఒక్కటి కూడా దక్కక నిరాశలో పడ్డ కమలనాథులు సైతం మంతనాల్లో మునిగారు. నాలుగు చోట్ల రెండో స్థానం దక్కినా, మిగిలిన అన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతు కావడంతో ఓటమి కారణాలపై సోమవారం సమీక్షించారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సంతోష్ నేతృత్వంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్, నేతలు ఇలగణేషన్, వానతీ శ్రీనివాసన్, హెచ్ రాజా తదితరులతో కూడిన కమిటీ సమాలోచించి ఓటమి కారణాలను ఆరా తీసింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు తగ్గట్టుగా బలాన్ని పెంచుకునే విధంగా కార్యచరణను సిద్ధం చేశారు. ఈసమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీలోని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించేందుకు నిర్ణయించారు. -
మళ్లీ తెరపైకి కెప్టెన్
చిత్ర పరిశ్రమలోనే కాదు రాజకీయాల్లోనూ కెప్టెన్‌గా పేరుగాంచిన నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నటనపై దృష్టి సారించారు. ఇంతకు ముందు చిత్రపరిశ్రమలో ప్రముఖ కథానాయకుడిగా రాణించిన విజయకాంత్ నడిగర్‌సంఘం అధ్యక్షుడిగా కొంత కాలం బాధ్యతలు నిర్వహించారు. ఆ తరువాత రాజకీయరంగప్రవేశం చేసి డీఎండీకే పార్టీని పెట్టిన సంగతి తెలిసిందే. 2011 శాసనసభ ఎన్నికల్లో 29 నియోజక వర్గాల్లో తన అభ్యర్థులను గెలిపించుకుని ప్రతి పక్ష నేత స్థాయికి ఎదిగారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కింగ్‌మేకర్‌ను కాదు ఏకంగా కింగ్‌నే అవతానని ఆశించారు. అయితే సరైన ప్రణాళిక లేకుండా ఎన్నికల బరిలోకి దిగిన విజయకాంత్ పార్టీ ఫలితాల్లో బొక్కబోర్లాపడింది. కనీసం ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడమే కాకుండా డిపాజిట్లనే కోల్పోయి ఇప్పుడు పార్టీ గుర్తింపునకే ముప్పు ఏర్పడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత విజయకాంత్ తన దృష్టిని నటనపై సారించారు. ఆయన చివరిగా తన కొడుకు షణ్ముగపాండియన్ను హీరోగా పరిచయం చేసిన సహాబ్ధం చిత్రంలో అతిథి పాత్రలో నటించారు.ఆ తరువాత ఎన్నికలకు రెండు నెలల ముందు తన కొడుకుతో కలిసి తమిళన్ ఎండ్రు సొల్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఆ చిత్రం 10 రోజులు షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత ఎన్నికలు దగ్గర పడడంతో దాన్ని పక్కన పెట్టి ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో పార్టీ తుడుచుకుపోవడంతో ఇప్పుడు తమిళన్ ఎండ్రు సొల్ చిత్రంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ మన విజయం మరికొంత ఆలస్యం అవుతోంది. ధైర్యాన్ని కోల్పోవద్దు. మనం అధికారాన్ని చేపడతాం. ప్రస్తుతం తాను తమిళన్ ఎండ్రు సొల్ చిత్రంపై దృష్టి సారిస్తున్నాను అంటూ ఆ చిత్ర ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో విజయకాంత్ రచయితగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. -
కెప్టెన్ దుకాణం ఇక బంద్!
అనుకున్నంతా జరిగింది.. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు అయ్యింది. నిన్నమొన్నటి వరకు 28 మంది ఎమ్మెల్యేలకు బాస్‌గా వ్యవహరించిన కెప్టెన్ విజయకాంత్.. ఇప్పుడు పూర్తిగా దుకాణం కట్టేసుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన పార్టీ డీఎండీకే ఎన్నికల సంఘంలో గుర్తింపును కోల్పోయింది. ఏదైనా పార్టీకి గుర్తింపు ఉండాలంటే అది పోటీ చేసిన ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లలో కనీసం 6 శాతం సాధించాలి. కానీ ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా గెలవలేని డీఎండీకే.. కేవలం 2.4 శాతం ఓట్లను మాత్రమే పొందింది. దాంతో రాష్ట్ర పార్టీగా ఇన్నాళ్లూ ఎన్నికల సంఘం వద్ద ఉన్న గుర్తింపును కూడా డీఎండీకే కోల్పోయింది. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు దక్కించుకుంది. ఈసారి పరిస్థితి తారుమారైంది. డీఎండీకేతో పొత్తుకు డీఎంకే ప్రయత్నించినా కెప్టెన్ ససేమిరా అన్నారు. తాను కింగ్ అవుతాను తప్ప కింగ్‌మేకర్‌గా కూడా ఉండే ప్రసక్తి లేదని ఆయన మొండిపట్టు పట్టారు. అందుకే సొంత కుంపటి పెట్టుకుని పోటీ చేశారు. చివరకు తాను డిపాజిట్ సైతం కోల్పోయి దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోయారు. కాగా, ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటామని, తమ పరాజయానికి మనీ పవర్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ కె. ధనరాజు తెలిపారు. -
విజయ్ కాంత్ కు మరో గండం!
చెన్నై: కుంటి కుక్కపై కొబ్బరి బొండం పడినట్టుగా తయారైంది డీఎండీకే నేత విజయ్ కాంత్ పరిస్థితి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన 'కెప్టెన్' పార్టీకి మరో గండం పొంచివుంది. ఆయన పార్టీ గుర్తింపు రద్దయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన విజయ్ కాంత్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూపీ)తో జట్టు కట్టిన ఆయన ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఆయన కూడా ఓటమి పాలయ్యారు. డీఎండీకే పార్టీకి కేవలం 2.4 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే కనీసం 6 శాతం ఓట్లు కలిగివుండాలి. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన డీఎండీకే 29 సీట్లు దక్కించుకుంది. ఈసారి పరిస్థితి తారుమారైంది. డీఎండీకేతో పొత్తుకు డీఎంకే ప్రయత్నించినా ఫలించలేదు. కరుణానిధితో 'కెప్టెన్' చేతులు కలిపితే ఫలితాలు మరోలా ఉండేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఓటమి గల కారణాలను సమీక్షించుకుంటామని, తమ పరాజయానికి మనీ పవర్ ప్రధాన కారణంగా భావిస్తున్నామని మాజీ ఎంపీ కె. ధనరాజు తెలిపారు. -
విజయ్‌కాంత్‌కు బ్లాక్‌బ్లస్టర్ లేనట్లే!
చెన్నై: ఎట్టకేలకు తమిళనాడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల వంతే మిగిలింది. అది కూడా మరో రెండు రోజుల్లో.. ఈలోపు ఎవరికి తోచిన అంచనాలు వారివి. ఏదేమైనా ఈ ఎన్నికల్లో కాస్తంత హడావిడిగా హంగుఆర్భాటంగా కనిపించిన వ్యక్తి మాత్రం విజయ్ కాంత్. డీఎండీకే అధ్యక్షుడు అయిన ఆయన గతంలో మాదిరిగానే ఈసారి కూడా ప్రజాసంక్షేమకూటమి పేరుతో మూడో ప్రత్యామ్నాయంగా ఎన్నికల బరిలోకి దిగారు. ఆయనకు నిజంగానే తమిళనాడు ప్రజలు పట్టం కట్టబెట్టనున్నారా అన్నంత హడావిడి చేశారు. అదే క్రమంలో పలుమార్లు తన ప్రచార శైలితో విమర్శల పాలయ్యారు. నిజంగానే తమిళ ప్రజలు ఈసారి మనసు మార్చుకొని థర్డ్ ఫ్రంట్‌కు అధికారం కట్టబెట్టనున్నారా అనే అంశంపైన చర్చలు జరగడం.. అదే స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే, ఈ ఫ్రంట్ ప్రచారానికి భిన్నంగా.. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయిన తొలినాళ్లనాటి పార్టీలుగా ఉన్న డీఎంకే, ఏఐఏడీఎంకే ఎలాంటి లొల్లి లేకుండానే ఈ ఎన్నికల్లో డీఎండీకేను కార్నర్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా నమోదైన ఓటింగ్ శాతం.. అక్కడి ప్రజల ప్రతిస్పందన ప్రకారం చివరకు తమిళ ప్రజలు పూర్తి స్థాయిలో డీఎంకే, ఏఐడీఎంకేలకే అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈసారి అధికార మార్పిడి జరిగి మరోసారి తమిళనాడులో కరుణోదయం కానుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. జయలలితకు భంగపాటు తప్పదని వెల్లడించాయి. ఈ నేపథ్యంలో తమిళనాట రాజకీయ చిత్రసీమలో ఇద్దరు అగ్ర నేతల చిత్రాల మధ్య సర్రున దూసుకెళ్దామనుకున్న డీఎండీకే అధినేత విజయ్ కాంత్ సినిమా ఊహించినంత బ్లాక్ బ్లస్టర్ కాదు కదా కనీసం యావరేజ్ కూడా అనిపించుకోబోదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. -
ఓటు వేయకుంటే చంపేస్తాడు: కెప్టెన్
కేకేనగర్: ఎన్నికల్లో డీఎండీకే పార్టీకి ఓటు వేసి గెలిపించకపోతే తన కుల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఓటర్ల ప్రాణాలు తీస్తాడని ఆ పార్టీ అధినేత కెప్టెన్ విజయకాంత్ విచిత్ర ప్రచారానికి దిగారు. దేవుడి పేరు చెప్పి ఓటర్ల ను భయపెడుతున్న కెప్టెన్ తీరుకు ప్రజలు, రాజకీయ పార్టీల వారు విస్తుపోతున్నారు. ఓటర్లను బుజ్జగించడం, లేకపోతే భయపెట్టి ఎలాగైనా ఓట్లు సాధించడమే ధ్యేయం గా కెప్టెన్ ప్రచారం సాగిస్తున్నారు. విల్లుపురం జిల్లా ఊళుందూరుపేట నియోజక వర్గంలో విజయకాంత్ పోటీ చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి తిరునావలూర్ నియోజకవర్గంలో రాత్రి వరకు భారీగా ప్రచారం చేశారు. మడపట్టు గ్రామంలో విజయకాంత్ మాట్లాడుతూ ప్రస్తుతం మీడియాలో వచ్చే అభిప్రాయ సేకరణను ప్రజలు నమ్మవద్దని కోరారు. వాటి అన్నింటిని అధిగమించి ప్రజా సంక్షేమ కూటమి అమోఘ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మడపట్టు ప్రాంతంలో వీధిదీపాలు వెలగకపోవడంతో ఇక్కడ నగదు బట్వా డా జరుగుతోందా? అని కెప్టెన్ ప్రశ్నించారు. తాను పరిక్కల్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఓటర్లకు నగదు పంపిణీ చేయనని ప్రమా ణం చేసినట్లు తెలిపారు. ‘నాకు మీరు ఓటు వేయకుంటే నరసింహస్వామి మిమ్మల్ని చంపకుండా వదలడు. నా లాగా ఇతర పార్టీల వారు అవినీతి చేయమని ప్రమాణం చేయగలరా’? అని విజయకాంత్ ప్రశ్నించారు. -
‘మాపై డీఎండీకే ప్రభావం ఉండదు’
చెన్నై: తమ విజయావకాశాలపై సినీనటుడు విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకే, బీజేపీ కూటమి ప్రభావం ఏమీ ఉండబోదని డీఎంకే చీఫ్ కరుణానిధి విశ్వాసం వ్యక్తం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఈ నెల 16న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మహా అయితే ఆ కూటమి ఏఐడీఎంకే ఓట్లను కొల్లగొట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 1957 నుంచి వరుసగా 12 అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొంటూ వస్తున్న కరుణానిధి ఈసారి ఎన్నికలను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ ఎన్నికలు విభిన్నమైన పరిస్థితికి అద్దం పడుతున్నాయని, కొన్ని పార్టీలైతే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాలను కూడా ప్రకటించాయని ఆయన పేర్కొన్నారు. ఆయా పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశంలేదని, కాకపోతే వారి ప్రభావం అధికార పార్టీ అవకాశాలను దెబ్బతీయవచ్చన్నారు. కాషాయ పార్టీకి తమిళనాడులో చోటు లేదని అభిప్రాయపడ్డారు. సంపూర్ణ మద్య నిషేధంపై జయలలిత ఇచ్చిన హామీని ప్రజలు నమ్మబోరన్నారు. -
విజయకాంత్ రూటే సెపరేటు
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ రూటే సెపరేటు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి అంతం, పేదరిక నిర్మూలన నినాదంతో పార్టీ ఆవిర్భావకాలం నుంచి ముందుకు సాగుతూ వస్తున్నారు. అయితే, ఈ సారి ఆయన సీఎం పగ్గాలు చేపట్టేందుకు రేసులో పరుగులు తీస్తున్నారు. తానే సీఎం, తానే సర్వం అన్నట్టుగా ఓటర్ల ప్రసన్నంలో ఉన్న విజయకాంత్ ఈ సారి కీలక నిర్ణయం తీసుకుని అందర్నీ విస్మయంలో పడేశారు. ఓటుకు నోటు వద్దే..వద్దు అని ఎన్నికల యంత్రాంగం అందుకుని ఉన్న నినాదానికి మద్దతు పలుకుతూ, తానూ సైతం అని ఏకంగా ఓ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి సమక్షంలో ప్రతిజ్ఞ చేసి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఉలందూరు పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కెప్టెన్ రేసులో ఉన్నారు. తన నియోజకవర్గంలో ఓట్ల వేటలో ఉన్న ఆయన అక్కడి లక్ష్మీనర్సింహస్వామి వారిని దర్శించుకున్నారు. పూజాది కా ర్యక్రమాల అనంతరం దేవుడి ఎదుట ప్రమాణం చేస్తూ ప్రతిన బూనారు. తాను ఓటుకు నోటు ఇవ్వబోనని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటును కొనుగోలు చేయనని ఇదే తన ప్రతిజ్ఞ అంటూ, ఇదే తన శపథంగా వ్యాఖ్యానించారు. అలాగే, వెలుపలకు వచ్చిన విజయకాంత్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పంచె పెకైత్తి కట్టి మరీ కదన రంగంలో దూకేందుకు తాను సిద్ధం అని, తనను ఎవ్వడూ కదిలించ లేడని వీరావేశంతో ప్రసంగించారు. ఇంత వరకు బాగానే, ఉ న్నా, సోషల్ మీడియాల్లో కెప్టెన్ ప్రతి జ్ఞ, ఎవ్వరూ కదిలించలేడు అన్న అంశాలు చమత్కారాలకు దారి తీశాయి. కెప్టెన్ ఒక్కడే నోటుకు ఓటు ఇవ్వనని ప్రతిజ్ఞ చేస్తే ఎలా, మిగిలిన డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థుల చేత కూడా చేయించాలి మరీ..! అని వ్యంగ్యాస్త్రాలు సంధించే పనిలో పడ్డారు. అలాగే, ఎవ్వరూ విజయకాంత్‌ను కదిలించాల్సిన అవసరం లేదని, ఆయనే తుళ్లి పడతారులే అని చమత్కారాలు అందుకుని ఉండడం గమనార్హం. -
కెప్టెనే సీఎం
► మంత్రిగా తిరుమావళవన్ ► ‘రమణ’ బాణిలో అవినీతి అంతం ► ఆ ఇద్దరికీ విశ్రాంతి ఇద్దాం ► ఓటర్లకు ప్రేమలత పిలుపు సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ సీఎం పగ్గాలు చేపట్టనున్నారని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన సతీమణి, పార్టీ మహిళా విభాగం నేత ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. వీసీకే నేత తిరుమావళవన్ కీలక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపడతారని వ్యాఖ్యానించారు. కెప్టెన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘రమణ’(ఠాగూర్) సినీ బాణిలో రాష్ట్రంలో అవినీతి అంతం సాగుతుందని స్పష్టం చేశారు. డీఎండీకే-ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్న వారిలో విజయకాంత్ సతీమణి ప్రేమలత కూడా ఉన్నారు.ఆ కూటమిలోని నేతలు బహిరంగ సభలు, అప్పుడుప్పుడు రోడ్‌షోలతో ప్రజల్లోకి వస్తుంటే, ప్రేమలత మాత్రం నిర్విరామంగా రోడ్‌షోలతో ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ఓటర్లు అత్యధికంగా ఉండే రోడ్లు, చిన్న చిన్న వీధుల్లోనూ మైక్ అందుకుని ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. నివ్వెరపోయి వినేంతగా ఆమె వాగ్ధాటి సాగుతూ ఉన్నది. డీఎంకే, అన్నాడీఎంకేలను కడిగి పారేస్తున్నారు. తాజాగా ఆమె పర్యటన సేలం, ఈరోడ్, నామక్కల్‌లలో సాగుతున్నది. ఈ రోడ్ షోలో భాగంగా మంగళవారం ఆమె ఓటర్లను ఉద్దేశించి పలు చోట్ల ప్రసంగిస్తూ, తన భర్త, పార్టీ అధినేత విజయకాంత్‌ను పొగడ్తలతో ముంచుతూ, తదుపరి సీఎం ఆయనే అని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని ఓటర్లకు సూచించే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే అధినేత్రి ఏమో సెల్‌ఫోన్ ఇస్తున్నానంటూ ప్రకటించారని, అయితే, ఇక్కడ ఎవరి చేతిలో చూసినా సెల్ఫోన్లే అని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు ఆమె ఇచ్చే సెల్ఫోన్లు అవసరమా...అవసరమా..? అంటూ ప్రశ్నిస్తూ, వద్దు..వద్దు అని ఓటర్ల చేత సమాధానం రాబట్టారు. రేషన్ షాపుల వద్ద మహిళలు నిత్యావసర వస్తువుల కోసం పెద్ద సంఖ్యలో గంటల తరబడి నిలబడి ఉండడాన్ని చూసి ఆవేదన చెందిన కెప్టెన్ ఇంటి వద్దకే నిత్యవసర వస్తువులు అన్న అంశాన్ని మేనిఫెస్టోలో ప్రకటించారని వివరించారు. ఇక, టాస్మాక్‌ల వద్ద మగరాయుళ్ల బారులు తీరి ఉండడాన్ని దృష్టిలో ఉంచుకునే సంపూర్ణ మద్యనిషేధం నినాదాన్ని అందుకున్నట్టు పేర్కొన్నారు. కెప్టెన్ అధికార పగ్గాలు చేపట్టగానే, తొలి సంతకంగా మద్య నిషేధంకు అనుకూలంగానే ఉంటుందని స్పష్టం చేశారు. వయస్సుపై బడ్డ వాళ్లు ఇక, సీఎం కూర్చీల్లో కూర్చునేందుకు అనర్హులుగా పేర్కొంటూ, జయలలిత, కరుణానిధిలకు ఇక శాశ్వత విశ్రాంతిని ఇద్దామని ఓటర్లకు పిలుపునిచ్చారు. కెప్టె సీఎం కావడం తథ్యం అని, తిరుమావళవన్ కీలక మంత్రిత్వ శాఖను చేపడతారంటూ, కెప్టెన్ బ్లాక్ బస్టర్ రమణ సినీమా బాణిలో రాష్ర్టంలో అవినీతి అంతం సాగబోతోందన్నారు. -
మీడియాపై విజయ్‌కాంత్ కస్సుబుస్సు
చెన్నై: సినీ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ మరోసారి మీడియా కస్సుబుస్సులాడారు. త్వరలో తమిళనాడులో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఓ రెండు చానెళ్ల పోల్ సర్వే ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సర్వేలన్నీ తప్పుల తడకని, వాటిని ప్రజలు నమ్మాల్సిన పనిలేదని చెప్పారు. ఒక సర్వే ఏఐఏడీఎంకే విజయం సాధిస్తుందని, మరో సర్వే డీఎంకే విజయం సాధిస్తుందని తెలిపిందని, ఆ రెండు చానెళ్లు కావాలని ఒక వ్యూహం ప్రకారమే అలా ప్రచారం చేస్తున్నాయి తప్ప ఆ ఫలితాలు సరైనవి కావని అన్నారు. తన పార్టీ ఒకప్పుడు డీఎంకే ఫౌండర్ సీఎన్ అన్నాదురై సాధించినంతటి గొప్ప విజయం సాధిస్తుందని చెప్పారు. -
మా ఆయన కింగ్ అవుతారు
చెన్నై: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో డీఎండీకే చీఫ్ కెప్టెన్ విజయ్‌కాంత్ భార్య ప్రేమలత దూసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి జయలలిత సారథ్యంలోని అధికార అన్నా డీఎంకే, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేలను విమర్శిస్తూ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన వాగ్ధాటితో ఓటర్లను ఆకర్షిస్తూ, డీఎండీకే కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి కృషిచేస్తున్నారు. ప్రేమలత తమ తరపున ప్రచారం చేయాలని డీఎండీకే అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఎన్నికల అనంతరం విజయ్‌కాంత్ కింగ్ అయితే, ప్రేమలత పాత్ర కింగ్ మేకర్ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తన భర్త విజయ్ కాంత్ కింగ్ అవుతారని ప్రేమలత ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలసి డీఎండీకే పోటీ చేస్తోంది. ఈ కూటమి తరపున విజయ్‌కాంత్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. కూటమి గెలుపుకోసం విజయ్ కాంత్, ప్రేమలత వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. విజయ్‌కాంత్ గెలుపు కోసం ప్రేమలత నిమిషం కూడా వృథా చేయకుండా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలకు డీఎండీకేనే ప్రత్యామ్నాయమని చెబుతున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీలను వ్యతిరేకిస్తున్న ప్రేమలత.. గత ఎన్నికల్లో అన్నా డీఎంకేతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవడం అతిపెద్ద తప్పని అంగీకరించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు ప్రజలతో సంబంధాలు లేవని విమర్శించారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇక జయలలితపైనా ఆమె ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ఎండలకు పిల్లలు (ప్రజలు) చనిపోతుంటే అమ్మ (జయలలిత) ఏసీలో కూర్చోరని అన్నారు. తన భర్త విజయ్‌కాంత్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన సినిమాల్లో నటిస్తారు కానీ ప్రజల ముందుకాదంటూ వ్యాఖ్యానించారు. తమిళనాడు మార్పును కోరుకుంటోందని, తమ పార్టీలో అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. విజయ్‌కాంత్ సినిమాల్లోని పవర్ఫుల్ డైలాగులు చెబుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అన్నాడీఎంకేను సాగనంపండి!
టీనగర్: డీఎంకే ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాలని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్టాలిన్ శుక్రవారం కోయంబత్తూరు జిల్లాలో ప్రచారం చేశారు. శనివారం నీలగిరి జిల్లా, కున్నూరులోను, సాయంత్రం ఈరోడ్ జిల్లాలోను ప్రచారం జరిపారు. సత్యమంగళం బస్టాండ్‌లో భవానిసాగర్ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి సత్య, కచ్చేరిమేడులో గోపి నియోజకవర్గం అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి శరవణన్, అందియూరు డీఎంకే అభ్యర్థి వెంకటాచలం, మొడకురిచ్చిలో డీఎంకే అభ్యర్థి సచ్చిదానందం, పెరుందురైలో డీఎంకే అభ్యర్థి కేపీ స్వామిలకు మద్దతుగా ప్రసంగించారు. ఈరోడ్ వెస్ట్ నియోజకవర్గం డీఎంకే అభ్యర్థి ముత్తుసామి, ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గం మక్కల్ డీఎండీకే అభ్యర్థి చంద్రకుమార్‌కు మద్దతుగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొందరు తామే బడా నాయకులమని చెప్పుకుంటూ ప్రజల గుర్తింపునకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. వారు ఎవరనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. 2011లో జయలలితను ముఖ్యమంత్రి పదవిలో అధిష్టింపచేసిన వ్యక్తుల్లో చంద్రకుమార్ కూడా ఒకరన్నారు. అప్పట్లో తాను పెద్ద పొరపాటు చేసినట్లు ప్రస్తుతం ఆయన ఒప్పుకుంటున్నట్లు తెలిపారు. గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి జయలలిత ఒక్క రోజైనా ఈరోడ్‌ను సందర్శించారా? అన్ని ప్రశ్నించారు. జయ ఉత్తర్వుల ప్రకారం నాడు శశిపెరుమాళ్ ప్రాణాలను కాపాడేందుకు విఫలమైన పోలీసు శాఖ అధికారులు, నేడు మనసు మార్చుకుని తమ వైపు వస్తున్నట్లు తెలిపారు. తదుపరి డీఎంకే అధికారం చేపట్టడం ఖాయమన్న భావనతో వారు అప్రమత్తమైనట్లు తెలిపారు. కరుణానిధి వడ్డితో కలిపి విద్యారుణాన్ని మాఫీ చేయనున్నట్లు ప్రకటించారన్నారు. ప్రస్తుతం ఉన్న అమ్మ క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్ల పేరిట ఆధునీకరించి అప్‌గ్రేడ్ చేస్తారని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కాకుండా నియోజకవర్గం స్థాయిలో కరుణానిధి ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారని, ప్రజలందరి కోర్కెలు నెరవేర్చబడతాయన్నారు. అందుకు ప్రజలంతా చేయాల్సింది అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమేనన్నారు. -
ట్విట్టర్లో కెప్టెన్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత, ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి విజయకాంత్ ఆదివారం ట్విట్టర్లో ప్రత్యక్షం అయ్యారు. అభిమానులు, ప్రజలు , పార్టీ వర్గాలు సంధించిన ప్రశ్నలకు గంట పాటుగా సమాధానాలు ఇచ్చారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి విజయకాంత్ ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో ఉన్నారు. ఎండ వేడి ఎక్కువగా ఉండటంతో కేవలం సాయంత్రం వేళల్లో బహిరంగ సభలతో తన ప్రచారాన్ని సాగించేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా మారడంతో తన దూకుడును దక్కించుకుని, తన ధోరణిని మార్చుకుని వినూత్న రీతిలో పయనం సాగించే పనిలో కెప్టన్ నిమగ్నం అయ్యారు. ఇప్పటికే ప్రచారంలో కొత్త బాణి సాగిస్తున్న విజయకాంత్ ప్రస్తుతం ట్విట్టర్లో ప్రత్యక్షం అయ్యారు. సోషల్ మీడియాకు ఉన్న అమిత స్పందనను పరిగణలోకి తీసుకుని ఆదివారం గంట సేపు ట్విట్టర్లో అభిమానులు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. తమిళంలో అడిగిన ప్రశ్నలకు తమిళంలోనే సమాధానాలు, ఆంగ్లంతో అడిగిన వారికి ఆంగ్లంలోనే సమాధానాలు ఇచ్చారు. ముందుగానే పది న్నర నుంచి పద కొండున్నర వరకు విజయకాంత్ ట్విట్టర్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారంటూ డీఎండీకే వర్గాలు పదే పదే ప్రచారం ఇవ్వడంతో స్పందన అమితంగానే ఉందని చెప్పవచ్చు. అయితే, విజయకాంత్‌ను ఉక్కిరి బిక్కిరికి చేస్తూ పలువురు ప్రశ్నల్ని సంధించడంతో ఇరకాటంలో పడ్డారట..!. చివరకు తనదైన శైలిలోనే స్పందించి గంట గడిపేశారు. -
తళి నియోజకవర్గంలో అన్నాడీఎంకే,సీపీఐ అభ్యర్థుల నామినేషన్లు
తరలి వచ్చిన వేలాది మంది డెంకణీకోట : తళి నియోజక వర్గంలోని వివిధ గ్రామాల నుంచి సీపీఐ, విడుదల చిరుత, డీఎండీకే, తమిళమానిల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రామచంద్రన్ అభిమానులు వేలాది మంది స్వచ్చందంగా తరలిరాగా తళి నియోజకవర్గ తళి నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి, తళి ఎమ్మెల్యే టి.రామచంద్రన్ డెంకణీకోట తాలూకాఫీసులో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టి. రామచంద్రన్ డీఎండీకే జిల్లా కార్యదర్శి చంద్రన్, తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శులు వెంటరాగా రామచంద్రన్ చేత నామినేషన్లు రెండు సెట్లు దాఖలు చేయించారు. డెంకణీకోటలో ఎక్కడ చూసినా జనం ఇసుక వేస్తే నేలపై రాలనంత జనం. వీధులన్నీ ఎక్కడికక్కడే కదలని పరిస్థితి. ట్రాఫిక్‌జామ్‌తో సతమతమయ్యారు. డీఎండీకే, వీసీకె, తమిళమానిల కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలు జెండాలు పట్టి పట్టణ వీధుల్లో ఊరేగింపు జరిపారు. డెంకణీకోట డీఎస్పీ నేతృత్వంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తళి నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థిగా నాగేష్ గురువారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. డెంకణీకోట తాలూకా కార్యాలయంలో అన్నాడీఎంకే నాయకులు సంపంగిరామరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే.వి.మురళీధరన్‌లు వెంటరాగా నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. అన్నాడీఎంకే కార్యకర్తలు రైతు బజారు నుండి ఊరేగింపుగా వచ్చారు. రెండు ప్రధాన పార్టీ పార్టీలు ఒకే రోజు నామినేషన్లు వేయడంతో డెంకణీకోట పట్టణంలో ఎక్కడ చూసినా జనం కనపించారు. మండుటెండల్లో కార్యకర్తలు సేద తీరుర్చుకొనేందుకు నానా అవస్థలు పడ్డారు. -
ఈ కెప్టెన్ వద్దు బాబోయ్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘విజయకాంత్ ప్రచారానికి వస్తున్నారా... వద్దు బాబోయ్’ అని వేడుకునేలా డీఎండీకేలో చిత్రమైన పరిస్థితి నెల కొంది. పార్టీ అధినేత విజయకాంత్ ప్రచారానికి రాకుండా చూడాలని పార్టీ నేతలు, కార్యకర్తలే ప్రాధేయపడుతున్నారు. ప్రేమలతతో సరిపెట్టుకుంటామని సర్దుబాటు మంత్రం జపిస్తున్నారు. సహజంగా రాజకీయాల్లో పార్టీ అగ్రనేత వచ్చి ప్రచారం చేయాలని కార్యకర్తలు ఆశిస్తారు. అగ్ర జులు వచ్చి ప్రసంగిస్తే అధికసంఖ్యలో ప్రజలను ఆకట్టుకోవచ్చని ఆశపడతారు. పార్టీ అధ్యక్షుల రాకకోసం పరితపిస్తారు. అయితే దేశంలో మరే పార్టీలో లేని విధంగా డీఎండీకే నేతలు సాక్షాత్తు అధ్యక్షుల రాకనే తిరస్కరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే విజయకాంత్ వస్తున్నాడంటే భయపడిచస్తున్నారు. అవును, ఇందులో ఆశ్చర్యమేముందని తమిళనాడు రాజకీయాలను గమనిస్తున్న ఎవ్వరిని అడిగినా ఇట్టే చెబుతారు. విగ్రహమేకానీ నిగ్రహం లేని కెప్టెన్: ఒక ప్రధాన రాజకీయ పార్టీ నేతగా చలామణి అయ్యేందుకు అవసరమై నిండైన విగ్రహం కలిగి ఉన్న విజయకాంత్‌కు అందుకు తగిన నిగ్రహం లేదని చెప్పక తప్పదు. ప్రజా బాహుళ్యంలోకి అడుగుపెట్టినపుడు తరచూ ఆవేశానికి లోను కావడం పరిపాటిగా మారింది. గత ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులనే తన్నిన దాఖలు ఉన్నాయి. సుమారు నాలు గు నెలల క్రితం విమానాశ్రయంలో మీడియా ప్రతినిధు లు వేసిన ప్రశ్నకు బదులివ్వకపోగా ఆగ్ర హంతో విలేఖరిపైనే చేయిచేసుకున్నారు. దీంతో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. అంతకు ముందు పార్టీ నేతలను, తన సెక్యూరిటీ గార్డును, మరోసారి కార్యకర్తలను కొట్టి ఉన్నారు. అలాగే తన కారు డ్రైవర్‌ను ఏకంగా కాలితో కొట్టి కలకలం రేపారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులతో సమావేశం నిమిత్తం సేలం చేరుకున్న విజయకాంత్‌కు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఈ సమయంలో మరోసారి సహనాన్ని కోల్పోయిన విజయకాంత్ సెక్యూరిటీపైనా, పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులపైనా చేయిచేసుకున్నారు. విజయకాంత్ వద్దని వేడుకోలు: రానురాను కెప్టెన్ వైఖరి శ్రుతిమించడంతో ‘అయ్యా తమరు రావద్దు’ అని చెప్పేందుకు సైతం వెనుకాడని పరిస్థితి పార్టీలో ఉత్పన్నమైంది. రాష్ట్రంలో రసవత్తరంగా ఎన్నికల పోరుసాగుతున్న దశలో సర్వశక్తులు ఒడ్డి ఓటర్లను ఆకట్టుకోవాల్సి పోయి విమర్శలకు తావిచ్చేలా విజయకాంత్ వ్యవహరించడం పార్టీ నేతలు సహించలేక పోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో విజయకాంత్ అనాగరికంగా నడుచుకోవడం పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని ఆందోళన చెందుతున్నారు. పార్టీ అభ్యర్థులు సమావేశమై ప్రత్యామ్నాయం ఏమిటని చర్చించుకున్నారు. విజయకాంత్‌కు బదులుగా ఆయన సతీమణి ప్రేమలత ప్రసంగించేలా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని డీఎండీకే కార్యాలయానికి తెలుపగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
మీడియాపై కెప్టెన్ చిందులు
పిడికిలి బిగించి ఆక్రోశం సర్వత్రా విస్మయం అభ్యర్థులతో సేలంలో సమావేశం డీఎండీకే అధినేత విజయకాంత్ మళ్లీ తన చేతికి పని పెట్టే పనిలో పడ్డారు. మీడియాపై చిందులు తొక్కడమే కాకుండా, నాలుక మడిచి, పిడికిలి బిగించి కొట్టేందుకు సిద్ధం అయ్యారు. తన పక్కనే ఉన్న ప్రయివేటు భద్రతా సిబ్బందికి మోచేతి గుద్దుల రుచి చూపించారు. సీఎం అభ్యర్థి ఇలా బాదుడికి దిగడంతో సర్వత్రా విస్మయంలో పడ్డారు. సేలంలో హఠాత్తుగా అభ్యర్థులతో కెప్టెన్ సమాలోచించడం గమనార్హం. సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ రూటే సెపరేటు అన్న విషయం తెలిసిందే. ఆయన ప్రసంగాలు శైలి గందరగోళమే. ప్రతి ఎన్నికల్లోనూ ఆయన చేతి దెబ్బ ఎవరో ఒకరు రుచి చూడక తప్పదు. అది అభ్యర్థి కావొచ్చు, పార్టీ నాయకులు కావచ్చు. కోపం వస్తే చాలు చితక్కొట్టుడే. ఇన్నాళ్లు ఓ పార్టీ నేతగా ఆయన ప్రచారాల్లో వ్యవహరించిన తీరుపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. అయితే, ఈసారి ఎన్నికల్లో విజయకాంత్ హోదా పెరిగింది. ఐదు పార్టీలు కలిసి ఆయన్ను సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నాయి. దీంతో తదుపరి సీఎం తానే అన్న ధీమాతో విజయకాంత్ ముందుకు సాగుతున్నారు. ఇన్నాళ్లు మీడియాపై పదే పదే చిందులు తొక్కుతూ వచ్చిన విజయకాంత్, సీఎం అభ్యర్థిగా ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో కాస్త తగ్గారు. హుందాతనాన్ని ప్రదర్శించే ప్రయత్నాలు చేసినా, చివరకు తానింతే అని దూకుడుగా ప్రదర్శించి విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. బుధవారం హఠాత్తుగా సేలం లో పార్టీ జిల్లాల కార్యదర్శులు, 104 మంది అభ్యర్థులతో సమావేశానికి విజయకాంత్ పిలుపు నివ్వడంతో అక్కడికి వచ్చిన మీడియాకు చీవాట్లు తప్పలేదు. పిడికిలి బిగించి చివరకు ఆక్రోశాన్ని పక్కనే ఉన్న ప్రైవేటు భద్రతా సిబ్బంది మీద చూపించిన విజయకాంత్‌పై సెటైర్లు బయలు దేరాయి. కెప్టెన్ బాధుడు : సేలం ఐదు రోడ్ల కూడలిలోని కల్యాణ మండపంలో పార్టీ కార్యదర్శులు, అభ్యర్థుల సమావేశానికి చర్యలు తీసుకున్నారు. ఈ సమావేశానికి మీడియాకు ఆహ్వానం లేదు. వీడియో కెమెరాలు, ఫోటో గ్రాఫర్లు ఆ దరిదాపుల్లోకి రాకూడదన్న ఆంక్షలు సైతం విధించారు. పది గంటల సమయంలో ఎన్నికల అధికారి శేఖర్ ఓ వీడియో గ్రాఫర్ తో కలిసి అక్కడికి వచ్చారు. అయితే, ఆయన్ను లోనికి అనుమతించ లేదు. తీవ్ర ఆక్రోశాన్ని ఆయన వ్యక్తం చేసిన తదుపరి అనుమతించారు. సరిగ్గా పదకొండున్నర గంటల సమయంలో విజయకాంత్ అక్కడికి వచ్చారు. ఆయన తన వాహనం నుంచి దిగడంతో సమావేశం ప్రాధాన్యతను గురించి తెలుసుకునేందుకు మీడియా ఉరకలు తీసింది. మీడియా చుట్టుముట్టడంతో విజయకాంత్ సహనం కోల్పోయారు. తానో సీఎం అభ్యర్థి అన్న విషయాన్ని మరిచి నాలుక మడిచి , పిడికిలి బిగిస్తూ మీడియా వర్గాలపై దాడికి యత్నించే విధంగా ప్రయత్నం చేశారు. అంతలో తనను తాను శాంతించుకుని వద్దన్నట్టుగా చేతులు ఊపుతూ ముందుకు వెళ్లే యత్నం చేశారు. ఓ మీడియా ప్రతినిధి మైక్ విజయకాంత్ ముందుగా ప్రత్యక్షం కావడంతో ఆక్రోశాన్ని ఆపుకోలేక, ఆ మైక్‌ను దూరంగా విసిరి కొట్టారు. అంతటితో ఆగకుండా, ముందుకు సాగుతూ తన వెనుక రక్షణగా వస్తున్న ప్రైవేటు భద్రతా సిబ్బంది ఆక్రోశాన్ని ప్రదర్శించారు. మో చేతితో అతడి ముఖం మీద గుద్దుతూ విజయకాంత్ వ్యవహరించిన తీరు అనేక తమిళ ఛానళ్లకు హాట్ టాపిక్‌గా మారాయి. పదే పదే ఆయన వ్యవహరించిన తీరును ప్రసారం చేస్తూ, సెటైర్లు, వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం. ఇక, విజయకాంత్ ఆక్రోశంతో వీర బాదుడు పర్వాన్ని మళ్లీ కొనసాగించే పనిలో పడటంతో ఇక, అభ్యర్థులు, ఆ పార్టీ నాయకులు ఆయనకు కాస్త దూరంగా ఉండాల్సిందే. అలాగే, ఐదు పార్టీల నాయకులు ఏదేని వేదిక పై ప్రత్యేక్షమైన పక్షంలో విజయకాంత్‌కు కాస్త దూరంగా కూర్చుంటే సరి, లేదంటే ఆయన బాదుడు రుచి చూడాల్సిందే అన్న చమత్కారాలు సోషల్ మీడియాల్లో బయలు దేరాయి. -
మీడియాపై కెప్టెన్ మళ్లీ ఫైర్
సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ మీడియాతో మళ్లీ దురుసుగా వ్యవహరించారు. ప్రైవేటు భద్రతా సిబ్బందిని కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఎండీఎంకే, వీసీకే, తమాకా, వామపక్షాలతో కూడిన ప్రజా సంక్షేమ కూటమికి డీఎండీకే అధినేత విజయకాంత్ సీఎం అభ్యర్థిగా నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయికతే ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సేలం టౌన్ కు వచ్చిన విజయకాంత్‌ను మీడియా చుట్టుముట్టడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. నాలుక మడత పెట్టి, పిడికిలి బిగిస్తూ కొట్టేందుకు సిద్ధపడి చివరకు తనను తాను సముదాయించుకున్నారు. ఓ మీడియా మైక్‌ను లాగి పడేసి ముందుకు సాగారు. చివరకు తన వెంట ఉన్న ప్రైవేటు భద్రతా సిబ్బందిపై ఆగ్రహాన్ని చూపించి మోచేతితో ఓ వ్యక్తిపై దాడి చేశారు. కొంత కాలం నుంచి మీడియాతో దురుసుగా వ్యవహరిస్తూ వచ్చిన విజయకాంత్, సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతుండటంతో తన పంథాను మార్చుకున్నట్లు కనిపించారు. అయితే, మళ్లీ తన ఆవేశాన్ని వెళ్లగక్కడంతో రాజకీయ ప్రత్యర్థులు ఈ విషయంపై వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ అభ్యర్థినో, పార్టీ నాయకుడినో చితక్కొట్టడం విజయకాంత్‌కు పరిపాటే కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. -
మరో వివాదంలో విజయ్ కాంత్
చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై డిఎండికె అధినేత, నటుడు విజయ్ కాంత్ చేసిన వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం చల్లారకముందే ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నారు. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్ మరోసారి రెచ్చిపోయాడు. బుధవారం సేలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో జర్నలిస్టులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సహనం కోల్పోయిన విజయ్ కాంత్ పాత్రికేయులపై ఆగ్రహంతో ఊగిపోయారు. చెంప దెబ్బ కొడతానంటూ బెదిరించి మరో వివాదానికి కేంద్రంగా మారారు. అయితే ఆయన జర్నలిస్టులపై విరుకుచుపడడం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. కాగా డిఎండీకె, పీడబ్ల్యూఎఫ్ కూటమికి ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా బరిలో ఉన్న విజయకాంత్ ఉల్లుందూర్ పేట్ నుంచి పోటీ చేస్తున్నారు. -
విజయకాంత్‌కు ఓటమి భయమా?
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘స్థానబలిమే గానీ తన బలిమి కాదని’ అనేది విజయాన్ని సాధించిన నేపథ్యంలో చలామణి ఉండే ప్రాచీన సామెత. అయితే తన బలిమిపై విజయకాంత్‌కు సందేహమో ఏమో స్థాన బలిమి కోసం తరచూ నియోజకవర్గాన్ని మారుస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే, డీఎండీకేను స్థాపించినపుడు విజయకాంత్ 2006లో తొలిసారిగా విరుదాచలం నియోజకవర్గం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆనాటి ఎన్నికల్లో డీఎండీకే తరఫున పోటీచేసి గెలిచిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆ వైపు వెళ్లలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజా విజ్ఞప్తులను పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశన్ స్వీకరించేవాడు. అడపాదడపా విజయకాంత్ బావమరిది, యువజన విభాగం అధ్యక్షుడు సుదీష్ వెళ్లి ప్రజలను కలిసేవాడు. ఆ తరువాత 2011 నాటి ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్నాడు. ఆనాటి ఎన్నికల్లో విజయకాంత్ ఆశించిన స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులను జయలలిత ప్రకటించడంతో కోపగించుకుని వామపక్షాలతో కలిసి పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో జయలలిత మళ్లీ విజయకాంత్‌ను బుజ్జగించి రిషివైద్యం నియోజకవర్గం నుంచి పోటీకి సమ్మతించారు. ఆ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రతిపక్ష నేత హోదాకు ఎదిగారు. ఈసారి ఉళుందూర్ పేట మూడోసారి ముచ్చటగా విజయకాంత్ మరోసారి నియోజకవర్గం మార్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉళుందూరుపేట నుంచి విజయకాంత్ పోటీ చేస్తాడని పార్టీ ప్రకటించింది. గెలిచినా, ఓడినా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడరనే విమర్శలను ఆయన ఎదుర్కొంటున్నారు. తొలి ఎన్నికల్లో ఒంటరిపోరు, మలి ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా గెలుపొందారు. ప్రస్తుతం ప్రజా సంక్షేమ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కెప్టెన్‌కు గెలుపు ప్రతిష్టాత్మకమని ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. దీంతో విజయకాంత్‌కు గెలుపు అనివార్యమైంది. ఫలితాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా కూటమి పరువు పోవడం ఖాయం. గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తే ప్రజలు ఓడించి తీరుతారనే భయంతోనే విజయకాంత్ ఈసారి ఉళుందూర్పేటను ఎన్నుకున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాసంక్షేమ కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలో ఉన్న విజయకాంత్ గెలుపోటముల మాటెలా ఉన్నా గణనీయమైన సంఖ్యలో ఓట్లను చేకూర్చాలని కూటమిలోని అన్నిపార్టీల నేతలు పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. -
'రజనీకాంత్‌లా పిరికివాడిని కాను'
చెన్నై: తమిళ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు భయపెడితే భయపడటానికి తానేమీ రజనీకాంత్ మాదిరిగా పిరికివాడిని కాదంటూ విజయ్ కాంత్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. విజయ్ కాంత్ వ్యాఖ్యలపై రజనీకాంత్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో పలుచోట్ల రజనీ అభిమానులు విజయ్ కాంత్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. విజయ్‌కాంత్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ఎన్నికల పొత్తు గురించి అడిగిన మీడియా ప్రతినిధులను దుర్భాషలాడారు. అప్పట్లో మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఇక సొంత పార్టీ నాయకుల పట్ల కూడా ఆయన అనుచితంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి. -
విజయకాంత్ కు షాక్
చెన్నై: 'కెప్టెన్' విజయకాంత్ కు షాక్ తగిలింది. డీఎండీకేలో రగిలిన ముసలం పార్టీ విచ్ఛిన్నానికి దారి తీసింది. డీఎండీకే రెండుగా చీలిపోయింది. తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే చంద్రకుమార్.. డీఎండీకే నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టారు. పీడీఎండీకే పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నై టీ నగర్ లోని త్యాగరాజ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు అసంతృప్త నాయకులతో చంద్రకుమార్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయకాంత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. డీఎంకేతో పొత్తుకే ఎక్కువశాతం మొగ్గుచూపిన ఎమ్మెల్యేలు, నేతలను కాదని ప్రజా సంక్షేమ కూటమితో జతకట్టడంపై తిరుగుబాటు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక విజయకాంత్ తో కొనసాగరాదని వారందరూ నిర్ణయించుకున్నారు. కొత్త పార్టీ ఏర్పాటుకు మొగ్గుచూపారు. చంద్రకుమార్ నాయకత్వంలో పీడీఎండీకే పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీఎండీకే రెండు పార్టీలుగా చీలిపోవడం రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. ఇంకా ఎన్ని సిత్రాలు జరుగుతాయోనని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
కెప్టెన్‌కు ఎసరు!
►నేడు తిరుగుబాటుదారుల సమావేశం ► డీఎండీకే అత్యవసర సమావేశం ► పోటాపోటీగా బలనిరూపణ ► డీఎండీకేలో ముదురుతున్న ముసలం చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎండీకేలో ఇటీవల పుట్టిన ముసలం రోజురోజుకూ ముదురుతోంది. ఏకంగా పార్టీ అధ్యక్షులు విజయకాంత్ పదవికే ఎసరు పెట్టేందుకు తిరుగుబాటు అభ్యర్థులు, తన పరువును, పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు కెప్టెన్ వేర్వేరుగా ఆదివారం సమావేశం అవుతున్నారు. పొత్తులతో బలపడాల్సిన డీఎండీకే అనూహ్యరీతిలో బలహీనపడిపోయింది. డీఎంకేతో పొత్తుకే ఎక్కువశాతం మొగ్గుచూపిన ఎమ్మెల్యేలు, నేతలను కాదని ప్రజా సంక్షేమ కూటమితో జతకట్టడం ఆ పార్టీలో చిచ్చురేపింది. అంతే ఎన్నికల వేళ ఏకతాటిపై నిలవాల్సిన నేతలు చిన్నాభిన్నమైనారు. అన్నాడీఎంకే ప్రభుత్వంతో విభేదించి ఎక్కువ నష్టపోయినదని తమ పార్టీనేనని, ఇటువంటి దుస్థితిలో డీఎంకేతో పొత్తుపెట్టుకోకుండా ప్రజా సంక్షేమ కూటమిలో చేరిపోవడాన్ని తాము సహించలేమంటూ నలుగురు ఎమ్మెల్యేలు, కొందరు ప్రధాన నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పొత్తు నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా విజయకాంత్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే వీరి సూచనను విజయకాంత్ వినిపించుకోలేదు. పార్టీపై విజయకాంత్ పెత్తనానికి ఏనాడో కాలం చెల్లింది, ఆయన సతీమణి ప్రేమలత నేడు అంతాతానై నడిపించడం సహించలేమని అసంతృప్తివాదులు మీడియాకు ఎక్కారు. ఈ పరిణామంతో ఉగ్రుడైన విజయకాంత్ వారందరినీ సస్పెండ్ చేశారు. అయితే తిరుగుబాటు దార్లు సైతం సస్పెన్షన్ కోసమే ఎదురుచూసినట్లుగా వ్యవహరించి కెప్టెన్ తీరుపై మరింత రెచ్చిపోయారు. అయితే వీరిలో కొందరు తాము విజయకాంత్ తీరును విభేదించినా పార్టీలోనే కొనసాగుతామని పేర్కొన్నారు. అంటే మరో వర్గంగా మారేందుకు సిద్దమైనట్లు ప్రకటించారు. డీఎండీకేలో కుమ్ములాటలు మిన్నంటిన నేపధ్యంలో అస్మతీయులు, తస్మదీయులు ఆదివారం వేర్వేరుగా బలనిరూపణ సమావేశాలు నిర్వహిస్తున్నారు. నేడు చెన్నైలో తిరుగుబాటుదారుల సమావేశం డీఎండీకే తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే చంద్రకుమార్ ఆదివారం భారీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చెన్నై టీన గర్ లోని త్యాగరాజ కల్యాణమండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి అసంతృప్తివాదులు హాజరవుతున్నట్లు సమాచారం. విజయకాంత్ నిర్ణయాలను పార్టీలోని 90శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తిరుగుబాటుదారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో విజయకాంత్ పనితీరు కార్యకర్తల మనోభావాలకు విరుద్దంగా సాగుతోందని విమర్శిస్తున్నారు. డీఎండీకేలో విజయకాంత్ కంటే తనకే ఆదరణ ఎక్కువ ఉందని, ఎక్కువశాతం కార్యకర్తలు తన మాటకే కట్టుబడి ఉన్నారనే వాదనతో చంద్రకుమార్ బలనిరూపణకు సిద్దం అవుతున్నారు. అంతేగాక ఆదివారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తామని తిరుగుబాటుదారులు తెలిపారు. చంద్రకుమార్ వాదనకు ఆదివారం నాటి సమావేశంలో బలం చేకూరిన పక్షంలో ప్రజాస్వామ్యతీరులో డీఎండీకే అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు చంద్రకుమార్ ప్రయత్నించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే కెప్టెన్ అధ్యక్ష పదవికే ముప్పువాటిల్ల వచ్చు. నేడు కెప్టెన్ సర్వసభ్య సమావేశం ఇదిలా ఉండగా, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ సైతం ఆదివారం ఉదయం కోయంబేడులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. సర్వసభ్య సమావేశం, కార్యవర్గ సమావేశాన్ని వరుసగా నిర్వహించడం ద్వారా తనవారెవరు, చంద్రకుమార్ వైపు ఎవరో తేల్చుకోనున్నారు. ఆదివారం ఉదయం చెన్నై నగరంలో ఒకేసారి ఒకవైపు విజయకాంత్, మరోవైపు తిరుగుబాటుదారుల సమావేశం ఏర్పాటు కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. -
కమలమే దిక్కా?
సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే-ప్రజాసంక్షేమ కూటమి దారులు మూసుకోవడంతో ఇక, బీజేపీ ఒక్కటే తమాకా నేత జీకే వాసన్‌కు దిక్కుగా మారింది. ఇందుకు తగ్గట్టుగా బీజేపీతో కలసి ఎన్నికల పయనానికి తగ్గ సమాలోచనలు సాగుతుండడం గమనార్హం.ఒకప్పుడు తన కంటూ కాంగ్రెస్‌లో ప్రత్యేక బలగాన్ని కల్గిన జీకే వాసన్, సొంత కుంపటి పెట్టే సరికి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. తమిళ మానిల కాంగ్రెస్ పునరుద్ధరణతో ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తుకు యత్నించి,అక్కడి తలుపులు మూసుకోవడంతో ఢీలా పడాల్సిన పరిస్థితి. ఇక, డీఎంకేలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని తేల్చారు. డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలో సీట్ల సర్దుబాటు గొడవ సాగుతుండటంతో, అక్కడ చాన్స్ కరువైనట్టే. ఇక, మిగిలిందల్లా, జాతీయ పార్టీ బీజేపీ కలసి పనిచేయడమే. ఇంతకన్నా మరో మార్గం జీకే వాసన్‌కు లేదని చెప్పవచ్చు. లేదంటూ ఒంటరిగా బలం ఉన్న స్థానాల్లో బరిలోకి దిగాల్సిందే. అయితే, తన దృష్టిని కమలం వైపుగా వాసన్ మళ్లించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా బీజేపీ వర్గాలు స్పందిస్తుండడంతో కమలంతో కలసి వాసన్ అడుగులు వేస్తారా..? అన్న చర్చ బయలు దేరింది. ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నట్టు, ఒకటి రెండు రోజుల్లో పార్టీ సమావేశంలో చర్చించి, వాసన్ తుది నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం బయలు దేరింది. ఈ సమయంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో సోదరుడు వాసన్ బీజేపీతో కలసి ఎన్నికల్ని ఎదుర్కోవడం శ్రేయస్కరంగా పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు సంప్రదింపుల్లో ఉన్నారని, ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తంచేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమాకా ఆవిర్భవించి ఉన్నదని, ఈ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, సమష్టిగా అవినీతి పరుల్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరిద్దామని సూచించారు. -
కెప్టెన్ కసరత్తు
సాక్షి, చెన్నై : పార్టీని, కేడర్‌ను నిలుపుకునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. అదే సమయంలో డీఎండీకేను రక్షించడం లక్ష్యంగా పోటీ సర్వసభ్య సమావేశానికి సన్నద్ధం అవుతున్నట్టు చంద్రకుమార్ ప్రకటించారు. డీఎండీకేలో ముసలం బయలు దేరిన విషయం తెలిసిందే. విజయకాంత్ సతీమణి ప్రేమలత చేతిలోకి చేరిన పార్టీని కైవసం చేసుకునేందుకు చంద్రకుమార్ నేతృత్వంలోని బృందం తీవ్ర కసరత్తుల్లో మునిగింది. రాష్ట్ర వ్యాప్తంగా డీఎండీకే వర్గాల మద్దతు సేకరించే పనిలో చంద్రకుమార్ నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో పోటీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రేమలత గుప్పెట్లో ఉన్న డీఎండీకేను రక్షించుకుంటామని చంద్రకుమార్ ప్రకటించడం గమనార్హం. విజయకాంత్ చేతి నుంచి డీఎండీకే ప్రేమలత చేతిలోకి చేరినందుకే, తాము తిరుగు బాటుతో ముందుకు సాగుతున్నామని, ఒకటి రెండు రోజుల్లో తమ నిర్ణయం ఉంటుందని గురువారం చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. పదో తేదిన తమ నిర్ణయాన్ని ప్రకటించేందుకు చంద్రకుమార్ ఉరకలు తీస్తుంటే, మరో వైపు అదే రోజున అభ్యర్థుల జాబితా ప్రకటించేందుకు విజయకాంత్ సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. అలాగే, అదే రోజు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, సర్వ సభ్య సమావేశానికి ఆయన పిలుపు నివ్వడం గమనార్హం. ఇక, ధర్మపురి, కోయంబత్తూరు, నాగపట్నం జిల్లాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యే విజయకాంత్‌ను కలిసి, ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చే విధంగానిర్ణయం తీసుకోవాలని, గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించి, డీఎంకేలోకి చేరుదామంటూ కన్నీళ్ల పర్యంతంతో ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయితే, విజయకాంత్ ఏమాత్రం తగ్గని దృష్ట్యా, ఆ నలుగురు చంద్రకుమార్ జట్టులోకి దూకేందుకు సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, డీఎండీకేలో ముసలం బయలు దేరిన సమయంలో ప్రజా సంక్షేమ కూటమి కన్వీనర్, ఎండీఎంకే నేత వైగో కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి పరుగులు తీశారు. అక్కడ విజయకాంత్‌తో సమాలోచించారు. తదుపరి తన వెంట వచ్చిన కొన్ని పార్టీల నేతల్ని విజయకాంత్‌కు పరిచయం చేసి, వారి మద్దతును స్వీకరించారు. ఎస్ఎంకేలోనూ : ప్రజా సంక్షేమ కూటమి నుంచి బయటకు రావాలని విజయకాంత్‌పై ఒత్తిడి తెచ్చే విధంగా డీఎండీకేలో తిరుగు బాటు సాగుతుంటే, మరో వైపు అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు రావాలని సినీ నటుడు శరత్‌కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి(ఎస్ఎంకే)లో తిరుగు బాటు బయలు దేరింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు కాళిదాసు, నాయకుడు ఆదియమాన్ శరత్‌కుమార్ తీరును ఖండిస్తూ తిరుగు బాటు చేపట్టారు. అన్నాడీఎంకేలో అత్యధిక స్థానాలు ఆశించకుండా, కేవలం తన వరకు మాత్రం శరత్‌కుమార్ చూసుకోవడం మంచి పద్ధతి కాదని, ఆ కూటమి నుంచి బయటకు రావాలని ఈ నేతలు నినదించడం గమనార్హం. కూటమిలోనే గరం గరం: డీఎంకే అధినేత కరుణానిధిపై ఎండీఎంకే నేత వైగో చేసిన వ్యాఖ్యలను ప్రజా సంక్షేమ కూటమిలో ఉన్న పార్టీలు ఖండిస్తుండడం గమనార్హం. ఆయన వ్యాఖ్యల్ని పట్టించుకోదలచుకోలేదని సీపీఎం నేత జి రామకృష్ణన్ వ్యాఖ్యానించగా, ఆయన వ్యాఖ్యల్ని వీసీకే నేతలు తిరుమావళవన్, రవికుమార్‌లు ఖండించారు. ఇక, సీపీఐ నేత ముత్తరసన్ సైతం ఆ వ్యాఖ్యల్ని అంగీకరించ లేమని వ్యాఖ్యానించారు. ఇక, జీకే వాసన్ సైతం వైగో తీరును తప్పుబట్టారు. వ్యక్తిగత విమర్శలు వైగో మానుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై హితవు పలికారు. ఇక, రాష్ట్రవ్యాప్తంగా వైగోకు వ్యతిరేకంగా డీఎంకే నిరసనలు రాజుకున్నాయి. దీంతో జీవిత కాలంలో తాను చేసిన అతిపెద్ద తప్పు ఇది అని, కరుణానిధి వద్ద బహిరంగ క్షమాపణ కోరుతున్నట్టుగా వైగో ఓ ప్రకటన విడుదల చేశారు. -
చీలికే లక్ష్యం
కన్నీళ్లు పెట్టిన చంద్రకుమార్ పెరుగుతున్న మద్దతు కెప్టెన్‌కు తప్పని షాక్‌లు కేడర్‌ను దక్కించుకునేందుకు పరుగు నేతలతో విజయకాంత్ సమాలోచన తొమ్మిది మంది ఎమ్మెల్యేల డుమ్మా సాక్షి, చెన్నై : డీఎండీకేను చీల్చేందుకు బహిష్కృత నేత చంద్రకుమార్ సిద్ధమవుతున్నారు. మద్దతు గణంతో డీఎండీకేను కైవసం చేసుకునేందుకు సన్నాహాలు వేగం వంతం చేశారు. అసంతృప్తి వాదుల్ని ఏకం చేసి డీఎంకేతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కార్యచరణతో ముందుకు వెళుతున్నారు. మెజారిటీ బలంతో ఎన్నికల కమిషన్ ఎదుట తమదే నిజమైన డీఎండీకే అని చాటుకుని ఢంకా చిహ్నాన్ని తన్నుకెళ్లే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఇక చంద్రకుమార్ స్పీడ్‌కు కళ్లెం వేయడానికి విజయకాంత్ సైతం తీవ్ర కుస్తీలు పట్టే పనిలో పడ్డారు. అందుబాటులో ఉన్న నాయకులతో సమాలోచనలో మునిగారు. డీఎండీకేలో తిరుగుబాటు బయలుదేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శి, అసెంబ్లీ విప్ చంద్రకుమార్ నేతృత్వంలో శేఖర్, పార్తిబన్ తదితర ఎమ్మెల్యేలతో పాటుగా పది మంది జిల్లాల కార్యదర్శులు తిరుగు బాటు ధోరణి అనుసరించడంతో వారికి విజయకాంత్ ఉద్వాసన పలికారు. ఈ పరిణామాలతో ఆ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో డీఎంకేలోకి వలసలు బయలు దేరినట్టే అన్న సంకేతాలు బయలు దేరాయి. అయితే, తమది డీఎంకే బాట కాదని, డీఎండీకేను చీల్చడం, తదుపరి కైవసం లక్ష్యం అన్న నినాదాన్ని చంద్రకుమార్ బృందం అందుకునేందుకు సిద్ధం అవుతుండడం చర్చనీయాంశంగా మారి ఉన్నది. ఇందుకు తగ్గట్టుగానే వారి వ్యవహారాలు ముందుకు సాగుతున్నాయని చెప్పవచ్చు. తమను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని స్పష్టం చేసిన చంద్రకుమార్, మద్దతు సమీకరణతో ఒకటి రెండు రోజుల్లో పార్టీని చీల్చబోతున్నారు. అనంతరం పోటీ సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందులో తీసుకునే నిర్ణయం మేరకు డీఎండీకేను కైవ సం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే సమయంలో పార్టీ ప్రస్తుతం ప్రేమలత గుప్పెట్లో ఉందని, ఆమె రూపంలో సర్వనాశనం అవుతున్న పార్టీని, కేడర్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని చంద్రకుమార్ స్పందించడం ఆలోచించాల్సిందే. పార్టీ కైవసంతో తమ మెజారిటీని ఎన్నికల యంత్రాంగం ఎదుట చాటుకుని డీఎండీకే చిహ్నం ఢంకాను సైతం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. తదుపరి డీఎంకేతో కలసి బరిలోకి దిగేందుకు తగ్గ వ్యూహంతో చంద్రకుమార్ బృందం దూకుడు పెంచి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. కన్నీళ్లు పెట్టిన చంద్రకుమార్: బుధవారం మైలాపూర్‌లో తన మద్దతు ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శులతో కలసి చంద్రకుమార్ మీడియాతో మాట్లాడారు. తమను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా తాము డీఎండీకేలోనే ఉన్నామని, కెప్టెన్ చిత్ర పటాన్నే తమ జేబుల్లో పెట్టుకుని ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం డీఎండీకే వదినమ్మ ప్రేమలత గుప్పెట్లోకి చేరిందని, అందుకే తాము గళం విప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తమ మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటే వివరణ కోరాల్సి ఉందని, క్రమ శిక్షణ చర్యలు తప్పని సరి అన్నప్పుడు కమిటీ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు. అయితే, ఆ కమిటీలో ఉన్న వాళ్లల్లో ఎక్కువ శాతం మంది ఇక్కడే ఉంటే, ఎలా చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. తమ కెప్టెన్ కు ఇష్టం లేకున్నా, బలవంతంగా ప్రజా సంక్షేమ కూటమిలోకి ప్రేమలత చేర్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. జేబులు, ఇళ్లు గుళ్ల అయ్యాయని, ఆస్తులు పార్టీ కోసం కరిగి పోయాయని, అద్దె ఇళ్లల్లో భారాన్ని మోస్తున్న తాము మళ్లీ మళ్లీ కష్టాల్ని చవి చూడదలచుకోలేదని ఈసందర్భంగా చంద్రకుమార్ కన్నీళ్లు పెట్టడం మీడియా సమావేశంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. తానేదో ఎవరో ఇచ్చే నోట్లకు ఆశ పడి తిరుగు బావుటా ఎగుర వేయలేదని, పదవుల కోసం వెంపర్లాడం లేదని, మహోన్నత ఆశయంతో డీఎండీకే ఆవిర్భవించిందని, దానిని, కేడర్‌ను రక్షించుకోవాలన్న లక్ష్యంతో ఈ తిరుగుబాటు అని కన్నీళ్ల పర్యంతంతో వ్యాఖ్యలు చేశారు. ఎండీఎంకే నేత వైగో అనుచితంగా తమ మీద వ్యాఖ్యలు చేస్తున్నారని, తమ పార్టీ అంతర్యగత విభేదాలు, వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని వైగోను హెచ్చరించారు. డీఎంకే నుంచి బయటకు వచ్చినప్పుడు అన్నాడీఎంకే వద్ద ఎన్ని కోట్లు తీసుకుని ఎండీఎంకేను పెట్టావు..? అని తాము ప్రశ్నించాల్సి ఉంటుందని మండి పడ్డారు. అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరించి వైగో, ఇప్పుడు డీఎండీకేను సర్వనాశనం చేయడానికి సిద్ధం అయ్యారని,అందుకే పార్టీని రక్షించుకుంటాం అంటూ పరోక్షంగా ఇక కైవసం తదుపరి అన్న సంకేతాన్ని ఇవ్వడం గమనార్హం. అలాగే, ఒకటి రెండు రోజుల్లో మద్దతు చాటుకుంటామని, తదుపరి తమ నిర్ణయాల్ని ప్రకటిస్తామంటూ దూకుడు పెంచే పనిలో పడ్డారు. అదే సమయంలో చంద్రకుమార్ వెంట నడిచేందుకు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, 20 మంది జిల్లాల కార్యదర్శులు సిద్ధం అవుతుండడంతో ఇక, డీఎండీకేను చేజిక్కించుకుంటారా..?అన్న ఉత్కంఠ నెలకొంది. కెప్టెన్ సమాలోచన : చంద్రకుమార్ బృందం దూకుడు కల్లెం వేసి కేడర్‌ను దక్కించుకునేందుకు విజయకాంత్ రంగంలోకి దిగారు. పార్టీ నేతలు, జిల్లాల కార్యదర్శులు, ఎమ్మెల్యేల్ని ఆగమేఘాలపై చెన్నైకు పిలిపించారు. అయితే, తొమ్మిది మంది ఎమ్మెల్ల్యేలు ఇరవై జిల్లాలకు చెందిన కార్యదర్శులు, మరికొందరు నాయకులు ఈ సమావేశానికి డుమ్మాకొట్టారు. అయినా, వచ్చిన వారితో సమాలోచించి, కేడర్‌ను దక్కించుకునేందుకు తగ్గ వ్యూహ రచనల్లో పడ్డారు. చాలా రోజులుగా పార్టీ కార్యాలయానికి దూరంగా ఉన్న విజయకాంత్, మధ్యాహ్నం కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని తనతో కలిసి వచ్చే వారితో సమాలోచనలో మునిగారు. ఇక, చంద్రకుమార్ అండ్ బృందం పై కెప్టెన్ వెన్నంటి ఉన్న ఎమ్మెల్యేలు పార్థసారథి, ఎ.మురుగేషన్ తీవ్రంగా స్పందించారు. -
కెప్టెన్‌కు షాక్
సాక్షి, చెన్నై: విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేలో ప్రకంపనలు బయలుదేరాయి. విజయకాంత్‌కు కుడి భుజంగా, పార్టీ సిద్ధాంతాల ప్రచార కార్యదర్శిగా ఉన్న చంద్రకుమార్ తిరుగు బావుటా ఎగుర వేశారు. ఆయన వెంట ఐదుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడంతో విజయకాంత్‌కు పెద్ద షాక్ తగిలినట్టు అయింది. ఆగమేఘాలపై వారిలో పది మందిని పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తమ వెంట మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు నడవబోతున్నారని చంద్రకుమార్ ప్రకటించారు. ప్రజాసంక్షేమ కూటమితో కలసి తమఅధినేత విజయకాంత్ అడుగులు వేయడాన్ని డీఎండీకే వర్గాలు పెద్ద సంఖ్యలో వ్యతిరేకిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. విజయకాంత్ తీరును నిరసిస్తూ పలువురు టాటా చెప్పే పనిలో పడ్డారు. డీఎంకే దళపతి స్టాలిన్ చేపట్టిన ఆకర్ష్‌తో పలువురు జిల్లాల కార్యదర్శులు ఇప్పటికే డీఎండీకేను వీడారు. మరెందరో డీఎండీకేను వీడబోతున్నట్టుగా తీర్థం పుచ్చుకున్న వాళ్లందరూ ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో అసెంబ్లీలో విజయకాంత్ తదుపరి స్థానంలో, కెప్టెన్‌కు కుడి భుజంగా, పార్టీలో కీలక పదవిలో ఉన్న చంద్రకుమార్ తిరుగుబాటు డీఎండీకేలో కలకలం రేపింది. చంద్రకుమార్ వెంట గుమ్మిడి పూండి శేఖర్, మెట్టూరు ఎస్ఆర్ పార్తిబన్‌తో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు నడవడం గమనార్హం. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు మరో 24 గంటల్లో తన వెంట రాబోతున్నారని చంద్రకుమార్ ప్రకటించడంతో ఆ పార్టీలో ప్రకంపనలు బయలుదేరాయి. తిరుగు బాటు : మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో చంద్రకుమార్‌తో కలసి నలుగురు ఎమ్మెల్యేలు, పది మంది జిల్లాల కార్యదర్శులు చెన్నై ప్రెస్ క్లబ్లో ప్రత్యక్షం అయ్యారు. ఇప్పటికే డీఎండీకే నుంచి వలసలు డీఎంకేలోకి బయలు దేరి ఉండడంతో, వీరి రాక ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. మీడియాతో చంద్రకుమార్ మాట్లాడుతూ అన్నాడీఎంకేతో కలిసి గత ఎన్నికల్లో పయనం సాగించి విజయ ఢంకా మోగించినా, తమ కెప్టెన్ నిర్ణయంతో ఎదురైన కష్టాలు, నష్టాలను గుర్తు చేశారు. విజయకాంత్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించి తిరుగు బావుట ఎగుర వేశారు. 95 శాతం మంది పార్టీ వర్గాలు డీఎంకేతో కలిసి అడుగులు వేద్దామని విజయకాంత్‌కు సూచించారన్నారు. ఇందుకు కెప్టెన్ కట్టుబడి, చివరకు ప్రజా సంక్షేమ కూటమిలోకి చేరడాన్ని జీర్ణించుకోలేక పోయామని వ్యాఖ్యానించారు. ఆ కూటమితో కలసి మళ్లీ అన్నాడీఎంకేను అధికారంలోకి తెచ్చేందుకు తమ కెప్టెన్ అడుగులు వేయడాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతో మీడియా ముందుకు వచ్చామన్నారు. 24న ఈ విషయంగా కెప్టెన్‌కు లేఖ రాశామని, ఆయన నుంచి స్పందన లేని దృష్ట్యా, ఇక మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. డిఎంకేతో కలసి అడుగులు వేద్దామని, ఇకనైనా ప్రజా సంక్షేమ కూటమిని వీడాలంటూ బుధవారం మధ్యాహ్నం వరకు విజయకాంత్‌కు గడువు ఇస్తూ మాటల తూటాల్ని పేల్చారు. విజయకాంత్ తమను ఆహ్వానించి సంప్రదింపులు జరుపుతారన్న నమ్మకం ఉందని, ఆయన అలా వ్యవహరించని పక్షంలో మరో ఐదుగురు ఎమ్మెల్యేలు, మరో పది మంది జిల్లాల కార్యదర్శులు బయటకు అడుగు పెట్టడం ఖాయం అని వ్యాఖ్యానించారు. ఇక, తదుపరి అడుగు డీఎంకే వైపు అన్న విషయాన్ని పరోక్ష వ్యాఖ్యలతో ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక డీఎండీకేలో ప్రస్తుతం కెప్టెన్ మాటకు చెల్లుబాటు లేదని, అంతా వదినమ్మ (ప్రేమలత విజయకాంత్) హవా అంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఉద్వాసన : విజయకాంత్‌కు బుధవారం మధ్యాహ్నం వరకు చంద్రకుమార్ అండ్ బృందం గడువు ఇస్తే, డీఎండీకే పార్టీ కార్యాలయం మాత్రం ఆ బృందానికి రెండున్నర గంటల్లో షాక్ ఇచ్చింది. విజయకాంత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఐదుగురు ఎమ్మెల్యేలతో పాటుగా, పది మందికి ఉద్వాసన పలుకుతూ ప్రకటన వెలువరించింది. అలాగే, మరి కొందరిపై చర్యలు తప్పదని , అందుకు తగ్గ కార్యాచరణలో ఉన్నట్టు వివరించడం గమనార్హం. చంద్రకుమార్ తో కలిసి అడుగులు వేస్తూ పది హేను జిల్లాలకు చెందిన కీలక నాయకులు బయటకు అడుగులు వేయడం, మరో పదిహేను మంది సిద్ధం అవుతోన్న సంకేతాలతో విజయకాంత్ అప్రమత్తం అయ్యారు. ఉన్న వాళ్లనైనా దక్కించుకునేందుకు తగ్గ కసరత్తుల్లో పడ్డారు. ఆగమేఘాలపై బుధవారం పార్టీ సమావేశానికి పిలుపు నిచ్చారు. ఇక, ఇప్పటికే 29 మందిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలోకి చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఐదుగురు బయటకు వెళ్లడంతో, మిగిలిన పదిహేను మందితో పాటుగా జిల్లాల కార్యదర్శులు తప్పని సరిగా సమావేశానికి హాజరు కావాలని పిలుపు నిచ్చి ఉన్నారు. అదే సమయంలో చంద్రకుమార్ అండ్ జట్టు డీఎంకే నోట్లకు అమ్ముడు పోయారంటూ డీఎండీకేకు చెందిన ఎమ్మెల్యేలు నల్లతంబి, మోహన్ రాజులు ఆరోపించడం గమనార్హం. చంద్రకుమార్ సృష్టించి, ప్రకంపనతో ఇన్నాళ్లు కార్యకర్తలు లేక బోసి పోయిన ఉన్న డీఎండీకే కార్యాలయంలో తాజాగా హడావుడి నెలకొని ఉండడం కొసమెరుపు. -
విజయ్‌కాంత్ పార్టీలో ముసలం
చెన్నై: తమిళనాడులో కెప్టెన్ విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేలో ముసలం మొదలైంది. పీడబ్ల్యూఎఫ్(పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్)తో పొత్తు కుదుర్చుకోవాలన్న విజయ్‌కాంత్ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు సహా 10 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. ‘వారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, అప్రతిష్ట తెచ్చారు. పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి వారిని తొలగిస్తున్నాం’ అని విజయ్‌కాంత్ మంగళవారం తెలిపారు. అసమ్మతిని సహించబోమని చెప్పడానికే సీనియర్ నేతలపై వేటు వేశారని పార్టీ వర్గాలు చెప్పాయి. అంతకుముందు, పీడబ్ల్యూఎఫ్‌తో పొత్తు వద్దని, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకేతో కలసి ఎన్నికల్లో పోటీచేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు సహా పదిమంది సీనియర్ నేతలు విజయ్‌కాంత్‌కు అల్టిమేటం ఇచ్చారు. ఎమ్మెల్యే, ప్రచార కార్యదర్శి వీసీ చంద్రకుమార్ మాట్లాడుతూ, ‘జయ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పొత్తు నిర్ణయం జరగలేదు. డీఎంకేతో పొత్తుతోటే విజయం సాధ్యమవుతుంది. పీడబ్ల్యూఎఫ్‌తో పొత్తు పార్టీలోని 95 శాతం మందికి ఇష్టం లేదు’ అని అన్నారు. డీఎండీకే 124 స్థానాల్లో, పీడబ్ల్యూఎఫ్ 110 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. -
పదవుల పందేరం!
డిప్యూటీ సీఎంగా వైగో విద్యామంత్రిగా తిరుమా ఆర్థిక మంత్రిగా ముత్తరసన్ రామకృష్ణన్‌కు స్థానిక పరిపాలన శాఖ జాబితా ప్రకటించిన సుదీష్ సాక్షి, చెన్నై: సీట్ల పందేరంతో నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ జరగలేదు...ఇంకా, ఎన్నిక లూ జరగలేదు...అయితే, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి మాత్రం అధికార పగ్గాలు చేపట్టిన ధీమాతో ముందుకు సాగుతోంది. తన బావ విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా తెర మీదకు తెచ్చిన కూటమి నేతలకు పదవుల పంపకాల్లో డీఎండీకే యువజన నేత సుదీష్ నిమగ్నమయ్యారు. ప్రచార వేదిక లో కూటమి నేతలకు పదువల్ని కట్టబెట్టేసి అందర్నీ విస్మయంలో పడేశారు. ప్రజా సంక్షేమ కూటమిలోకి డీఎండీకే అధినేత విజయకాంత్ చేరిన విషయం తెలి సిందే. ఆయన రాకతో ఆ కూటమిలోని ఎం డీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత జి.రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. విజయకాం త్ను తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, కెప్టెన్ కూటమి గా పేరు మార్పు జరగడం వివాదానికి దా రి తీసింది. చివరకు నేతలందరూ ఏకతా టి పైకి వచ్చి డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అన్న నినాదాన్ని అందుకున్నా రు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. సీట్ల పందేరాల్లో సామరస్య పూర్వకంగానే నాయకులు వెళుతున్నారు. కూటమిలో చీలికకు ఆ స్కారం లేని విధంగా అడుగు లు వేసి, ఒకరి అభిప్రాయాల కు మరొకరు గౌరవం ఇస్తూ, తాము పంచ పాండవులం అని చాటుకునే పనిలో పడ్డారు. తమ బలాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ప్రచార సభల్ని విస్తృతం చేశారు. వీసీకేకు ఎన్నికల యంత్రాంగం ఉంగరం చిహ్నం కేటాయించడాన్ని పురస్కరించుకుని ఏకంగా పార్టీ నేత తిరుమావళవన్‌కు మంగళవారం రెండు సవరాలతో కూడిన బంగారం ఉంగరాన్ని తొడిగి తమ స్నేహబంధాన్ని వైగో చాటుకున్నారు. ఈ పరిస్థితుల్లో తన బావను సీఎం చేయడానికి సిద్ధమైన ప్రజా కూటమి నేతల్ని బుధవారం పొగడ్తల పన్నీరుతో ముంచెత్తిన డీఎండీకే యువజన నేత, విజయకాంత్ బావమరిది సుదీష్ పదవుల పంపకాలతో కూడిన జాబితాను ప్రకటించి అందర్నీ విస్మయంలో పడేశారు. డిప్యూటీ సీఎం వైగో: కోవిల్ పట్టి గాంధి మైదానంలో బుధవారం జరిగిన ప్రచార సభలో సుదీష్ తన ప్రసంగం ద్వారా ప్రజా కూటమి నేతల్ని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటుగా పదవుల పంపకాల్లో నిమగ్నం అయ్యారు. డీఎండీకే - ప్రజా కూటమి అధికార పగ్గాలు చేపట్టినట్టేనని, విజయకాంత్ సీఎం పగ్గాలు చేపట్టే సమయం ఆసన్నమవుతోందని వ్యాఖ్యానించారు. విజయకాంత్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే, డిప్యూటీ సీఎంగా వైగో బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. వీసీకే నేత తిరుమావళవన్ విద్యా శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం నేత రామకృష్ణన్ స్థానిక పరిపాలనా శాఖ మంత్రిగా పగ్గాలు చేపడుతారని ప్రకటించి, అక్కడున్న వారందర్నీ విస్మయంలో పడేశారు. సుదీష్ వ్యాఖ్యానించడంపై అక్కడే గుస..గుసలు అడిన వాళ్లూ ఉండడం గమనార్హం. ఇక, విజయకాంత్ ప్రభుత్వంలో తాను మాత్రం ఏ పదవీ స్వీకరించనని, ఒక సభ్యుడిగా అందరితో కలసి ఉంటానని, కూటమిలోకి వచ్చే వారికి కీలక మంత్రి పదవి గ్యారంటీ అని వ్యాఖ్యానించి పరోక్షంగా టీఎంసీ నేత వాసన్ తమ వైపునకు వస్తారన్న సంకేతాన్ని సుదీష్ ఇవ్వడం గమనార్హం. వాసన్‌కు 24 గ్యారెంటీ: తమతో కలిసి వస్తే 24 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని టీఎంసీ నేత జీకే వాసన్‌కు డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమి సంకేతాన్ని పంపింది. ఇందుకు తగ్గ పొత్తు మంతనాల్లో కెప్టెన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనకు ప్రజా సంక్షేమ కూటమి కేటాయించిన 124 సీట్లలో 24 సీట్లను వాసన్‌కు ఇవ్వడానికి విజయకాంత్ నిర్ణయించినట్టు డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. వాసన్ తనకు మంచి మిత్రుడు కావడంతో ఆ దిశలోనే విజయకాంత్ ప్రయత్నాల్లో ఉన్నట్టు, రెండు మూడు రోజుల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోకి వాసన్ అడుగు పెడుతారని చెబుతున్నారు. -
డీఎంకేలోకి యువరాజ్
సాక్షి, చెన్నై: తమ దారికి డీఎండీకే అధినేత విజయకాంత్ రాని దృష్ట్యా, ఇక ఆపరేషన్ ఆకర్ష్‌తో ఆ పార్టీ వర్గాల్ని తమ వైపునకు తిప్పుకునే పనిలో డీఎంకే సిద్ధమైంది. ఇందుకు తగ్గ వ్యూహల అమలులో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి యువరాజ్, సేలం యూనియన్ నేత షణ్ముగం తమ బుట్టలో పడడంతో, ఇక వారి ద్వారా పావుల్ని కదిపే పనిలో పడ్డారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే ప్రయత్నిం చిన విషయం తెలిసిందే. అ యితే, ఆయన దూరం కావడంతో ఇక, ఆ పార్టీ కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే సిద్ధమైంది. విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రజా కూటమి ప్రకటించినా, ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్లే ఆ పార్టీలో ఎక్కువ. డీఎంకేతో కలసి నడుద్దామని విజయకాంత్ మీద మెజారిటీ శాతం జిల్లాల కార్యదర్శులు ఒత్తిడి కూడా తె చ్చారు. అయితే, తమ అభిప్రాయాల్ని విజ యకాంత్ ఖాతరు చేయకపోవడంతో వారం తా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పవచ్చు. వీరందర్నీ గురి పెట్టి, ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్‌కు డీఎంకే దళపతి స్టాలిన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఉత్తర చెన్నై జిల్లా డీఎండీ కే కార్యదర్శి, విజయకాంత్ సన్నిహితుడు యువరాజ్‌ను తమ వైపునకు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. బుధవారం గోపాలపురంలో అడుగు పెట్టిన యువరాజ్ అధినేత కరుణానిధి సమక్షంలో డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. అలాగే, సేలం యూనియన్ నేత షణ్ముగం నేతృత్వంలో వందకు పైగా ఆ జిల్లాలోని నాయకులు డీఎంకేలోకి చేరడం గమనార్హం. డీఎంకేలో తమ కోసం తలుపులు తెరవడంతో లోనికి అడుగులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో డీఎండీకే జిల్లాల కార్యదర్శులు ఉరకలు తీయడానికి సిద్ధమవుతున్నారని యువరాజ్ ప్రకటించారు. తన లాంటి వారెందరో డీఎంకేతో కలసి అడుగులు వేద్దామని సూచించినా, తమకు విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జయలలిత పతనం లక్ష్యం అంటున్న విజయకాంత్, అందుకు తగ్గ నిర్ణయం తీసుకోకుండా పెద్ద తప్పు చేశారని , ఈ ఎన్నికల ద్వారా ఆయనకు తీవ్ర కష్టాలు, నష్టాలు తప్పదని హెచ్చరించడం గమనార్హం. కాగా, విజయకాంత్‌ను నమ్ముకుని పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టినా, తమకు ఇంత వరకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఇక్కడే ఉండి ఉన్నది రాల్చుకోవడం కన్నా, డిఎంకే తీర్థం పుచ్చుకుని భవిష్యత్తులో ఏదో ఒక పదవినైనా దక్కించుకోవచ్చన్న ఆశాభావంతో జంప్ జిలానీకి జిల్లాల కార్యదర్శులు సిద్ధం అవుతుండడం గమనార్హం. ఇక, ఈ వలసల్ని అడ్డుకునేందుకు విజయకాంత్ తీవ్ర కసరత్తులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. యువరాజ్ బయటకు వెళ్లడంతో తక్షణం ఆ పదవిని ఎగ్మూర్ ఎమ్మెల్యే నల్ల తంబి ద్వారా బర్తీ చేశారు. బరిలోకి ఎస్ఎస్పీ: రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని శివగామి నేతృత్వంలోని సమూహ సమత్తువ మక్కల్ పడై ఉదయ సూర్యుడి చిహ్నంతో ఎన్నికల బరిలో దిగనుంది. ఈ మేరకు కరుణానిధితో శివగామి భేటీ అయ్యారు. ఒక్క సీటును అప్పగించడంతో డీఎంకే చిహ్నం మీదే పోటీకి శివగామి నిర్ణయించారు. మద్య నిషేధం అమలు లక్ష్యంగా డీఎంకే నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు. -
ఆరోగ్యంగానే ఉన్నాను
పుకార్లు నమ్మొద్దు {పజా సంక్షేమ కూటమి విజయకాంత్ స్పష్టీకరణ చీలిక ఎవరి తరం కాదన్న ప్రేమలత వామపక్షాల వద్దకు వైగో, తిరుమా పరుగు ఒకే వేదిక మీదుగా అభ్యర్థుల జాబితా చెన్నై : ప్రజా సంక్షేమ కూటమికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలు, పుకార్లను నమ్మకండి అని తమ కేడర్‌కు ఆ కూటమి నేతలు సూచించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. ఈ కూటమిని చీల్చడం ఎవరి తరం కాదని ప్రేమలత విజయకాంత్ వ్యాఖ్యానించారు. ఇక, కూటమి పేరు వ్యవహారంలో వామపక్షాల భిన్న స్వరంతో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమా పరుగులతో బుజ్జగింపులు సాగించి ఉన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా డీఎండీకే, ఎండీఎంకే, వీసీకే, వామపక్షాల నేతృత్వంలో ఏర్పాటైన కూటమిపై రోజుకో మలుపులతో చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కూటమి పేరు వ్యవహారంలో ఆదివారం వామపక్షాలు, ఎండీఎంకే, వీసీకేల మధ్య భిన్న స్వరాలు బయలు దేరాయి. అలాగే, డీఎండీకే అధినేత, సీఎం అభ్యర్థి విజయకాంత్ అనారోగ్యం పేరుతో సింగపూర్ పయన సమాచారం చర్చకు దారి తీశాయి. ఇక, మరెన్ని ట్విస్టులతో ఈ కూటమి పయనం సాగనుందో అన్న ప్రశ్న బయలు దేరింది. కెప్టెన్ టీం అన్న పేరుకు వ్యతిరేకంగా వామపక్షాల వ్యాఖ్యలతో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్ మేల్కొన్నట్టున్నారు. ఆగమేఘాలపై ఈ ఇద్దరు నేతలు సీపీఎం కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. సీపీఎం నేత జి రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్లను బుజ్జగించడంతో పాటుగా సీట్ల పందేరంలో సమయానుకూలంగా సర్దుకుందామన్న హామీని ఇచ్చి ఉన్నారు. దీంతో కూటమిపై వస్తున్న వదంతులు నమ్మ వద్దంటూ కేడర్‌కు నాయకులు సూచించే పనిలో పడ్డారు. ఇక, తమ కూటమిని చీల్చే యత్నం సాగుతున్నదని, ఇందుకు మీడియా కూడా వంత పాడుతున్నట్టుగా నాయకులు పల్లవిని అందుకోవడం గమనార్హం. ఇక, తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలను డీఎండీకే అధినేత విజయకాంత్ తీవ్రంగా ఖండించారు. విజయకాంత్ ఆరోగ్యంపై ఆయన సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలతోనే సింగపూర్ పర్యటన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానంటూ విజయకాంత్ తరపున సోమవారం ప్రకటన వెలువడటం గమనార్హం. కూటమికి, తనకు వ్యతిరేకంగా వస్తున్న కథనాలు, ప్రచారాలు, పుకార్లు ఏ ఒక్కటినీ నమ్మొద్దని అందులో కేడర్‌కు సూచించారు. ఏదేని విషయాలు ఉంటే, పార్టీ కార్యాలయం సమాచారాలు అందిస్తుందని, అంతే గానీ, మీడియాల్లో వచ్చే వార్తలు, కథనాలతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్నికల ప్రచారంతో ప్రజల్లోకి వస్తానని విజయకాంత్ వివరించారు. అలాగే, ఏప్రిల్ పదో తేదిన కూటమిలోని పార్టీల అభ్యర్థులు ప్రకటన, పరిచయ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. ఇక, కూటమిని చీల్చేందుకు తీవ్ర కుట్రలు జరుగుతున్నాయని, ఇందుకు పలు మీడియాలు కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని ప్రేమలత విజయకాంత్ తీవ్రంగా దుయ్యబట్టారు. మదురైలో జరిగిన ప్రచార కార్యాక్రమంలో అధికార మార్పు లక్ష్యంగా ప్రజా కూటమి ఆవిర్భవించిందని, దీనిని చీల్చేందుకు రకరకాల ప్రయత్నాలు, కుట్రలు జరుగుతూనే ఉన్నాయని మండి పడ్డారు. పండు తేనెలో పడిందని, ఇన్నాళ్లు అమ్మకు, అయ్యకు ఓటేయండంటూ నినాదాలు విన్పించాయని, ఇక ఆ రెండింటిని పక్కన పెట్టి అన్న(విజయకాంత్)కు ఓటేయండన్న నినాదాన్ని ప్రతి ఒక్కరూ అందుకోవాలని పిలుపునిచ్చార -
'ఓటుకు లక్ష రూపాయలు అడగండి'
తిరునెల్వేలి: తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. నాయకులు మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ సతీమణి, ఆ పార్టీ మహిళ విభాగం అధ్యక్షురాలు ప్రేమలతపై కేసు నమోదు చేశారు. తిరునెల్వేలిలో జరిగిన బహిరంగ సభలో ప్రేమలత మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్నా డీఎంకే, డీఎంకే పార్టీలు ఓట్ల కోసం డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓటర్లకు సూచించారు. 'కొన్ని పార్టీలు ఓటుకు రెండు నుంచి మూడు వేల రూపాయల వరకు ఇస్తాయి. మీరు ఓటుకు లక్ష రూపాయలు అడగండి' అని ప్రేమలత ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారని పోలీసులు చెప్పారు. అన్నా డీఎంకే కార్యకర్తలు ఫిర్యాదు చేయగా, ప్రేమలత మాట్లాడిన వీడియో రికార్డింగ్‌లను పరిశీలించిన అనంతరం పోలీసులు ఆమెపై కేసు నమోదుచేశారు. తమిళనాడు ఎన్నికల్లో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయ్‌కాంత్ బరిలో దిగుతున్నారు. -
రూ.500 కోట్లు..80 సీట్లు
డీఎండీకేకు డీఎంకే బేరమని వైగో వివాదాస్పద వ్యాఖ్యలు వైగోకు కరుణానిధి నోటీసులు బీజేపీ, డీఎండీకే ఖండన చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎన్నికల ప్రచార యుద్ధం మొదలు కాకముందే ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో ప్రకంపనలు సృష్టించాడు. డీఎండీకేను తనవైపు తిప్పుకునేందుకు డీఎంకే రూ.500 కోట్లు, 80 సీట్లు ఆఫర్ చేసిందని ఆరోపణలు చేయడం కరుణానిధి శిబిరంలో కలకలం రేపింది. ఈ ఆరోపణలు తిప్పికొడుతూ వైగోపై కరుణానిధి కోర్టులో కేసు వేశారు.డీఎండీకేతో పొత్తుపెట్టుకునేందుకు డీఎంకే, బీజేపీలు తీవ్రస్థాయిలో ప్రయత్నించాయి. డీఎంకేలో చేరడం దాదాపు ఖాయమైనట్లు ప్రచారాలు సాగగా, కరుణానిధి సైతం ఈ ప్రచారాలను బలపరిచారు. అయితే ఆ తరువాత తమ పార్టీ ఒంటరిపోరుకు సిద్ధమైనట్లు విజయకాంత్ ప్రకటించారు. విజయకాంత్ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన తరువాత సైతం డీఎండీకే తమతో కలుస్తుందని కరుణానిధి ఆశాభావ ప్రకటనలు గుప్పించారు. ఇంతటి ఒత్తిడిని ఎదుర్కొన్న విజయకాంత్ అకస్మాత్తుగా వైగో నాయకత్వంలోని ప్రజాసంక్షేమ కూటమిలో చేరాడు. డీఎండీకే కోసం అంతగా ప్రయత్నించని సంక్షేమ కూటమిలో విజయకాంత్ రాకతో ఆనందాలు వెల్లివిరిశాయి. ఇదే అదనుగా ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో డీఎంకేను అప్రతిష్ట పాలుచేసే ప్రయత్నం చేశాడు. తమ కూటమిలో చేరితే రూ.500 కోట్లు, 80 సీట్లు ఇస్తామని విజయకాంత్‌తో డీఎంకే బేరసారాలు ఆడిందని వైగో ఎద్దేవా చేశాడు. అలాగే బీజేపీ సైతం కేంద్ర మంత్రివర్గంలో చోటు, రాజ్యసభకు సీటు ఇస్తామని ఆఫర్ చేసి విఫలమైందని వ్యాఖ్యానించాడు. కరుణ ఆగ్రహం-వైగోకు నోటీసులు: డీఎంకేపై వైగో నిరాధార ఆరోపణలు చేశాడని పార్టీ అధ్యక్షులు కరుణానిధి మండిపడ్డారు. ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు కరుణానిధి తరఫున న్యాయవాది కే అళగురామన్ శనివారం నోటీసులు పంపారు. కరుణానిధి ప్రతిష్టకు కళంక ం తెచ్చేలా చేసిన వ్యాఖ్యలను ఏడు రోజుల్లోగా ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. లేకుండా సివిల్, క్రిమినల్ పరువునష్టం దావాలను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. వైగో వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేసిన అభాండాలు మాత్రమేనని డీఎంకే కోశాధికారి స్టాలిన్ అన్నారు. డీఎండీకేతో తాము ఒక్కసారికూడా చర్చలు జరపలేదని, ఈ విషయాన్ని విజయకాంత్ సతీమణి ప్రేమలత స్పష్టం చేశారని తెలిపారు. వైగో ఆరోపణలపై కరుణానిధి చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పారు. వైగోకు పంపిన కేసులను ఉపసంహరించుకోవాలని కరుణానిధిని ప్రేమలత కోరారు. సీనియర్ నేతగా మీరు ఎన్నో కేసులను ఎదుర్కొన్నారు, అలాగే విజయకాంత్‌పై కూడా అనేక పరువునష్టం దావాలు ఉన్నాయని చెప్పారు. కోర్టు కేసులకు వైగో భయపడరు, ఎదుర్కొంటారని అన్నారు. ఖండించిన బీజేపీ: డీఎంకే లాగానే బీజేపీ సైతం డీఎండీకేతో బేరసారాలు ఆడిందని వైగో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాజ్యసభ సీటు, కేంద్రమంత్రివర్గంలో చోటు ఇచ్చేలా బీజేపీ బేరం పెట్టిందన్న వైగో ఆరోపణలు సత్యదూరమని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ అన్నారు. బేరం పెట్టాల్సిన అవసరం బీజేపీకి లేదు, విజయకాంత్ అంతటి పెద్దవాడు కాదని వైగో తెలుసుకోవాలని హితవుపలికారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ సైతం తీవ్రస్థాయిలో ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం వైగో అవాకులు చవాకులు పేలరాదని అన్నారు. నేను సిద్ధం: వైగో కరుణానిధి ఇచ్చిన నోటీసులను చట్టపరంగా ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వైగో ప్రకటించారు. వారిని కోర్టుకు రానీయండి అన్నారు. కరుణానిధి నోటీసులు ఇవ్వడం, కేసులు పెడతామని హెచ్చరించడాన్ని స్వాగతిస్తున్నానని వైగో వ్యాఖ్యానించారు. -
ఆ ఆరోపణలు వెనక్కితీసుకో.. లేదు తీసుకోను!!
చెన్నై: తమిళనాడులో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి, ఎండీఎంకే అధినేత వైగో మధ్య పోటాపోటీ సమరం సాగుతోంది. విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకేతో పొత్తు కోసం కరుణానిధి డబ్బులు ఎరవేశారని ఆరోపించగా.. లీగల్ నోటీసులతో ఆయనకు కరుణానిధి బదులిచ్చారు. రూ. 500 కోట్లు, సీట్లు ఆశ చూపినప్పటికీ విజయ్‌కాంత్ దానిని తిరస్కరించి తమతో జత కట్టారని వైగో పేర్కొనగా.. ఆయనకు తన లాయర్ ద్వారా కరుణానిధి లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన ఈ తప్పుడు ఆరోపణలను ఏడు రోజుల్లోగా ఉపసంహరించుకొని.. విచారం వ్యక్తం చేయాలని, లేదంటే తాను తీసుకోబోయే చట్టపరమైన సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ వైగోని బెదిరించారు. కరుణానిధి లీగల్ నోటీసులను వైగో తేలికగా తీసుకున్నారు. తన ఆరోపణలను వెనక్కితీసుకోబోనని, లీగల్ నోటీసులను కోర్టులోనే ఎదుర్కొంటానని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంక్షేమ ఫ్రంట్ (పీడబ్ల్యూఎఫ్)తో జతకట్టిన విజయ్‌కాంత్‌ను ప్రశంసిస్తూ.. ఆయన కరుణానిధి ఇచ్చిన రూ. 500 కోట్లు, 80 సీట్ల ఆఫర్‌ను, బీజేపీ ఇవ్వజూపిన రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి బెర్తును తిరస్కరించి తమతో కలిశారని అన్నారు. -
కెప్టెన్‌గానే..
ప్రజా సంక్షేమ కూటమికి ‘కెప్టెన్’ చేకూరాడు. వైగో నేతృత్వంలో సాగుతున్న కూటమిలో డీఎండీకే చేరడం ద్వారా విజయకాంత్ ఒంటరి పోరుకు తెరదించాడు. అలాగే పొత్తులు పెట్టుకున్నా సీఎం అభ్యర్థిగా మాత్రమే ఎన్నికల బరిలోకి దిగుతాననే పంతాన్ని కెప్టెన్ ఎట్టకేలకూ నెగ్గించుకున్నాడు. చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులతో రాజకీయపార్టీల వ్యూహాలన్నీ ఒక కొలిక్కివచ్చినా డీఎండీకే మాత్రం నాన్చుడు ధోరణిని అవలంభించింది. ఇదిగో వస్తా, అదిగో చె బుతా అంటూ డీఎంకే, బీజేపీలను ఊరిం చి ఉడికించింది. చివరకు డీఎండీకే ఒంటి రి పోరుకు సిద్ధపడినట్లు ఇటీవల విజయకాంత్ ప్రకటించాడు. రాజకీయపార్టీలన్నీ విజయకాంత్ ప్రకటనతో నివ్వెరపోయాయి. డీఎండీకేపై బీజేపీ ఆశలు వదులుకోగా డీఎంకే మాత్రం ‘వస్తాడు నా రాజు ఈరోజు’ అంటూ సోమవారం వర కు పాటలు పాడుకుంటూ ఆశతో ఎదురు చూసింది. ఖంగు తినిపించిన విజయకాంత్: రాజకీయ నిర్ణయాల్లో ఆచీతూచీ అడుగేస్తున్నట్లుగానే వ్యవహరిస్తూ పొత్తు లు, కూటములపై జాప్యం చేస్తూ వచ్చిన విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరడం ద్వారా అందరినీ ఖంగుతినిపించాడు. కూటమి నేత వైగో, విజయకాంత్ సూలైలోని ఒక స్నేహితుని ఇంటిలో రెండురోజుల క్రితం కలుసుకున్నారు. విజయకాంత్ సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్లు కెప్టెన్ వెంట ఉన్నారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా వైగో సోమవారం కూటమినేతలో మరోసారి సమావేశం అయ్యారు. దీంతో డీఎండీకేతో పొత్తు కుదిరింది. మంగళవారం ఉదయం 9.45 గంటలకు విజయకాంత్, సుదీష్ తదితర ముఖ్యనేతలు కోయంబేడులోని పార్టీ కార్యాలయానికి వెనుకవైపు ద్వారం గుండా చేరుకున్నారు. 9.50 గంటలకు వైగో, వీసీకే అధ్యక్షులు తిరుమావలవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జీ రామకృష్ణన్ వచ్చి విజయకాంత్‌తో చర్చలు జరిపారు. సుహృద్భావ వాతావరణంలో చర్చలు ముగియగా పొత్తు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. ప్రజా సంక్షేమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ పేరును నిర్దారించారు. అలాగే డీఎండీకేకు 124సీట్లు, వైగో బృందానికి 110 సీట్లు కేటాయించేలా ఒప్పందం జరిగింది. వైగో మాట్లాడుతూ తమ కూటమి అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయకాంత్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరడం హాస్యాస్పదమని పీఎంకే అధికార ప్రతినిధి బాలు వ్యాఖ్యానించారు. కూటమి నేతలు ఇంతవరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నీరుగారిపోయాయని ఎద్దేవా చేశారు. విజయకాంత్ తన రాజకీయ జీవితాన్ని వృథా చేసుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సానుభూతి వ్యక్తం చేశారు. -
ఎట్టకేలకు కెప్టెన్ పొత్తు ఖరారైంది!
చెన్నై: రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో జతకడతాడో అన్న విషయంలో గత కొంతకాలంగా ఉన్న సందిగ్ధతకు కెప్టెన్ విజయ్‌కాంత్ బుధవారం తెరదించాడు. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వమే లక్ష్యంగా పావులు కదిపిన కెప్టెన్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నాడు. నాలుగు పార్టీల కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్) నాయకులు.. వైగో(ఎండీఎంకే), తోల్ తిరుమవలవన్(వీసీకే), జీ. రామకృష్ణన్(సీపీఎం), ఆర్. ముతరాసన్(సీపీఐ)లు బుధవారం ఉదయం డీఎండీకే కార్యాలయంలో విజయ్‌కాంత్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కెప్టెన్ ఆధ్వర్యంలోని డీఎండీకే 124 స్థానాల్లో, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ అభ్యర్థులు 110 స్థానాల్లో పోటీ చేయడానికి పొత్తు కుదిరింది. దీనిలో భాగంగా డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్ కూటమికి కెప్టెన్ విజయ్‌కాంత్ సీఎం అభ్యర్థిగా ఖరారయ్యారు. -
ఒంటరికి సై!
డీఎండీకే అధినేత విజయకాంత్ తీరుతో కమలనాథులు విసిగి వేసారినట్టున్నారు. ఇక, ఆయనతో ఎలాంటి చర్చలు సాగించ కూడదన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇందుకు తగ్గట్టుగామంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై వ్యాఖ్యానించారు. ఒంటరి నినాదంతో ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో మునిగారు. చెన్నై : డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని చాటుకునే ప్రయత్నంలో ఢీలా పడ్డ కమలనాథులకు ప్రాంతీయ పార్టీల తీరు తీవ్ర అసహనానికి గురిచేస్తున్నట్టుంది. పొత్తు వ్యవహారంలో పీఎంకే తన స్పష్టతను తెలియజేసినా, నాన్చుడు ధోరణితో ఒంటరి నినాదాన్ని డీఎండీకే అందుకున్నా, ఆ ఇద్దరు తమతో కలసి వస్తారన్న ఆశల పల్లకిలో ఇన్నాళ్లు కమలనాథులు ఊగిసలాడారని చెప్పవచ్చు. అయితే, పొత్తు మంతనాల్లో తమతో ఆ పార్టీల నేతలు వ్యవహరిస్తున్న తీరుతో కలత చెందిన కమలనాథులు, ఇక వారిని తమ దరి దాపుల్లోకి చేర్చకూడదన్న నిర్ణయానికి వచ్చేసినట్టుంది. ఇం దుకు తగ్గ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఇక చర్చల్లేవ్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఒంటరి కసరత్తు : డీఎండీకే, పీఎంకేలు ఇక తమతో కలసి వచ్చేది అనుమానం గానే మారడంతో తమ బలాన్ని చాటుకునేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ ఎత్తుగడల నేపథ్యంలో తమదైన శైలిలో రాజకీయం సాగించేందుకు కసరత్తుల్లో మునిగారు. ఈ సారికి ఆయా పార్టీలు తమ దైన బాణిలో పయనిస్తుండడంతో, ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలచుకుని ఓట్ల చీలిక ద్వారా లబ్ధిపొందాలన్న వ్యూహంతో ముందుకు సాగేందుకు కమలనాథులు నిర్ణయించి ఉన్నారు. ఇందుకు తగ్గ కార్యచరణను సిద్ధం చేసే పనిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై నిమగ్నం అయ్యారు. మంగళవారం టీ నగర్‌లోని కమలాలయంలో ఒంటరి నినాదాన్ని అందుకునేందుకు తగ్గ కసరత్తుల్ని చేపట్టారు. రాష్ర్టంలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కార్యవర్గంతో ఆమె సమాలోచించారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ బలా బలాలను జిల్లాల వారీగా సమీక్షించారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి ఉన్న బలాన్ని అంచనా వేశారు. ఎన్నికల బరిలో నిలబడేందుకు సిద్ధంగా ఉన్న అభ్యర్థుల వివరాల్ని పరిశీలించారు. ఇందుకు తగ్గ నివేదికను ఢిల్లీకి పంపించేందుకు నిర్ణయించారు. చర్చల్లేవ్ : ఈ కసరత్తుల తదుపరి మీడియాతో తమిళి సై మాట్లాడుతూ, ఇక, డీఎండీకేతో ఎలాంటి చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పొత్తు కోసం వెనక్కు తగ్గే స్థితిలో బీజేపీ లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ పార్టీ అన్న విషయాన్ని గుర్తెరగాలని పరోక్షంగా విజయకాంత్‌కు హితవు పలికారు.ఈ ఎన్నికల్ని ఎలా ఎదుర్కొనాలో తమకు తెలుసునని, ఎవర్నీ తాము నిర్బంధించబోమని, వస్తే కలిసి పనిచేస్తామేగానీ, వాళ్ల డిమాండ్లకు తలొగ్గి, సామరస్య పూర్వకంగా వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 234 స్థానాల్లోనూ అభ్యర్థుల్ని నిలబెట్టగలిగిన బలం బీజేపీకి ఉందని, అందుకు తగ్గ కసరత్తులోనే ఉన్నామని వ్యాఖ్యానించడం విశేషం. నేడు అమిత్ షా : తమిళనాట ఎన్నికల రాజకీయ రసవత్తరంగా మారిన సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం చెన్నైకు రానున్నారు. ఆయన రాకతో రాజకీయ ప్రాధాన్యతకు ఆస్కారం ఉంటుందా..? అన్న చర్చ బయలు దేరింది. అయితే, ఆయన కామరాజర్ అరంగంలో జరిగే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సహస్త్ర చంద్ర దర్శనం వేడుకకు హాజరై వెంటనే ఢిల్లీ వెళ్లేలా పర్యటనను సిద్ధం చేసుకుని ఉన్నారు. -
నిర్ణయం వారిదే!
సాక్షి, చెన్నై : సంప్రదింపులతో చర్చలు సాగాయని, ఇక నిర్ణయం వారి చేతుల్లో అంటూ పీఎంకే, డీఎండీకేలకు పొత్తు విషయంగా కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. తమ వెంట పన్నెండు పార్టీలు ఉన్నాయని, ఆ ఇద్దరు కలసి వస్తే బలం పెరిగినట్టేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక, సీనియర్ నటుడు విజయకుమార్ కమలంకు మద్దతు ప్రకటించారు. రాష్ర్టంలో అధికారం తమదే అన్నట్టుగా గతంలో ధీమా వ్యక్తం చేసిన కమలనాథులు, ఇక మౌనముద్రతో ముందుకు సాగుతున్నారు. ప్రాంతీయ పార్టీలు షాక్ ఇచ్చినా, చివరి క్షణంలో తమతో కలసి వస్తాయన్న ఆశతో ఎదురు చూపుల్లో ఉన్నారు. ప్రస్తుతానికి తమతో కలిసి వచ్చిన చిన్నా చితక పార్టీల్ని అక్కున చేర్చుకున్న బీజేపీ పెద్దలు, వారికి సీట్ల పంపకాల మీద దృష్టి పెట్టారు. ఇందుకు తగ్గ కసరత్తుల్లో కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ పూర్తిగా నిమగ్నమయ్యారు. బుధవారం అఖిల భారత ముస్లిం మున్నేట్ర కళగం నేత సదర్ అబ్దుల్లా, ఇండియ మున్నేట్ర కల్వి కళగం నేత దేవనాదం, దక్షిణ భారత ఫార్వడ్ బ్లాక్ నేత తిరుమగన్లతో సీట్ల పంపకాల చర్చల్లో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పొన్ రాధాకృష్ణన్‌ను మీడియా కదిలించగా, తమ వెంట పన్నెండు పార్టీలు నడిచేందుకు సిద్ధమయ్యాయని ఆయన వివరించారు. బలమైన కూటమి ఏర్పాటు చేయాలన్న కాంక్షతో ఆ దిశగా ప్రయత్నాలు సాగించామని, డీఎండీకే, పీఎంకేలతోనూ చర్చలు సాగాయని పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం అవుతున్నదని, ఈనెలాఖరులో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ప్రజాహితం కాంక్షించే దిశగా ఈ మేనిఫెస్టో ఉండబోతోందని, కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ద్వారానే రాష్ర్ట సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యం అని తద్వారా ప్రజల్లోకి వెళ్లబోతున్నామన్నారు. డీఎండీకే, పీఎంకేలతో సంప్రదింపులు, చర్చలు సానుకూలంగానే సాగాయని, అయితే, నిర్ణయం అన్నది వారి చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు. వారి నిర్ణయాల మేరకు తుది నిర్ణయాన్ని బీజేపీ ప్రకటిస్తుందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఇక, సీనియర్ నటుడు విజయకుమార్ పొన్ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. తన మద్దతును బీజేపీకి ప్రకటించారు. ఇప్పటికే పలువురు నటీ మణులు, నెపోలియన్ వంటి నటులు బీజేపీలో చేరిన దృష్ట్యా, త్వరలో వారు అధికారికంగా కమలం తీర్థం పుచ్చుకునేందుకు విజయకుమార్ సిద్ధమవుతున్నారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ తరఫున ప్రచారం సాగించేందుకు విజయకుమార్ వ్యాఖ్యానించినట్టుగా కమలాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
రెండోస్సారి!
* పదేళ్లలో మరో ఒంటరిపోరు * డీఎండీకే నిర్ణయంపై అన్ని పార్టీల్లో విస్మయం * ప్రజాస్వామ్య కూటమిపై చర్చ చెన్నై, సాక్షి ప్రతినిధి : పార్టీ ఆవిర్భావంలో ఒకసారి ఒంటరిపోరుకు దిగిన డీఎండీకే సరిగ్గా పదేళ్ల తరువాత మరోసారి ఒంటరిగా ఎన్నికల సమరాన్ని ఎదుర్కోనుంది. తొలి సమరంలో కేవలం ఒక్కసీటు మాత్రమే దక్కగా రెండో సమరం ఫలితాలకు మరో నెలన్నర రోజులు ఆగాల్సి వచ్చింది. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలో డీఎంకే, అన్నాడీఎంకేల తరువాత తృతీయస్థానాన్ని దక్కించుకున్న డీఎండీకే సైతం కోలీవుడ్ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే. డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై, ప్రస్తుత అధ్యక్షుడు కరుణానిధి, అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీ రామచంద్రన్, ప్రస్తుతం పార్టీ అధినేత్రి జయలలిత సినిమారంగానికి చెందినవారని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆ రెండు పార్టీల అధినేతలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అదే వరుసలో తాను సైతం సీఎం కావాలని ఆశించిన విజయకాంత్ 2005లో రాజకీయాల్లోకి దిగారు. తమిళనాడులో ద్రవిడ పార్టీలకే ప్రజల్లో ఆదరణ ఉండటంతో విజయకాంత్ అధ్యక్షుడుగా దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం (డీఎండీకే) పేరుతో 2005లో పార్టీ ఆవిర్భవించింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2006లో అసెంబ్లీ ఎన్నికలు రాగా మొత్తం 234 స్థానాల్లో తమ అభ్యుర్థులను నిలబెట్టి ఒంటరిగా పోటీకి దిగారు. విరుదాచలం నియోజవర్గం నుంచి విజయకాంత్ పోటీచేశారు. అన్ని నియోజకవర్గాల్లో డీఎండీకే అభ్యర్థులు పరాజయం పాలుకాగా విజయకాంత్ ఒక్కరే గెలిచారు. అయితే అనేక నియోజకవర్గాల్లో గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం ద్వారా రాజకీయాల్లో కలకలం రేపారు. డీఎంకే, అన్నాడీఎంకే వంటి సీనియర్ పార్టీలను ఒంటికాలిపై ఢీకొని ఆ ఏడాది 8 శాతం ఓట్లను సాధించడం ఒక రికార్డుగా నిలిచింది. ఆ (2006) ఏడాది జరిగిన ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వచ్చినా పూర్తిస్థాయి మెజారిటీ లేకుండా పోయింది. అలాగే 2009 పార్లమెంటు ఎన్నికల్లో డీఎండీకే ఒంటరిగానే పోటీచేసి మొత్తం 39 స్థానాల్లోనూ ఓడిపోయింది. అయితే అన్ని నియోజకవర్గాల్లో కనీస ఓట్లను సాధించడం ద్వారా ఓటు బ్యాంకును చాటిచెప్పింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎం డీకే 41 స్థానాల్లో పోటీచే సి 29 స్థానాల్లో గెలుపొందింది. విజయకాంత్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ను దక్కించుకున్నారు. అన్నాడీఎంకేతో ఆయన చెలిమి ఎక్కవకాలం కొనసాగలేదు. ఈ పరిస్థితుల్లో 2006 తరువాత ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు. పార్టీ ఆవిర్భావం తరువాత రెండుసార్లు ఒంటరిపోరుకు దిగినట్లయింది. సతీమణి సలహాతోనే ఒంటరిపోరు ఏదో ఒక బలమైన పార్టీతో పొత్తుపెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగాలని విజయకాంత్ భావించగా, ఆయన సతీమణి ప్రేమలత మొత్తం వ్యూహాన్నే మార్చివేసినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని ఈ ఏడాది ఆ పార్టీకి బద్దశత్రువైన డీఎంకేతో జతకడితే ప్రజల్లోనూ, ఇతర పార్టీల్లోనూ చులకనై పోతామని ఆమె నూరిపోసినట్లు సమాచారం. ప్రేమలత మాటలను విశ్వసించిన విజయకాంత్ ‘పెళ్లాం చెబితే వినాలి’ అనే రీతిలో రాజకీయాలు నడిపిస్తున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కేవలం విజయకాంత్ భార్యగాకాక చురుకైన నేతగా ప్రేమలత పేరొందడంతో ఆమె నిర్ణయాలకు విలువ పెరుగుతోంది. అందుకే గురువారం జరిగిన సభలో వ్యూహాత్మకంగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలపై ప్రేమలత దుమ్మెత్తిపోశారు. అయితే ఇన్నాళ్లు ఏదోఒక బలమైన పార్టీతో జతకట్టి కొన్ని సీట్లు దక్కించుకోగలమని నమ్మకంతో ఉన్న పార్టీనేతలు ఒంటరిపోరుతో నిరాశపడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు పార్టీ వైఖరి స్పష్టం కావడంతో శుక్రవారం అభ్యర్థుల ఎంపికను ప్రారంభించారు. ప్రజాసంక్షేమ కూటమి కెప్టెన్‌తో కలిసేనా రాష్ట్రంలో 8 నుంచి 10 శాతం మాత్రమే ఓటు బ్యాంకు కలిగి ఉన్న డీఎండీకే ఒంటరి పోరుకు దిగడం అన్ని పార్టీలను ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ తమ కూటమిలోకి వస్తాడనే చర్చలు మారిపోయి ప్రస్తుతం కెప్టెన్ ఒక కొత్తకూటమిని ఏర్పాటు చేసుకుంటాడనే ప్రచారం సాగుతోంది. ప్రజా సంక్షేమ కూటమి విజయకాంత్‌తో చేతులు కలిపి అతడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా సంక్షేమ కూటమిలోని ఎండీఎంకే, వీసీకే, వామపక్షాలతో డీఎండీకే కూడా చేరితే బలమైన కూటమిగా ఏర్పడగలదని ఆశిస్తున్నారు. తద్వారా కూటమి బలం 15 శాతం నుంచి 18 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నారు. ఓటుబ్యాం కు లెక్కలు చెప్పి ఎలాగైనా కెప్టెన్‌ను తమతో కలుపుకోవాలని ప్రజాస్వామ్య కూటమి తహతహలాడుతోంది. -
నేనే కింగ్
ఇక ఒంటరి సమరమే ప్రకటించిన కెప్టెన్ ప్రత్యామ్నాయం డీఎండీకే రెండో మేనిఫెస్టో విడుదల డీఎంకే, బీజేపీలకు షాక్ ‘కింగ్ మేకర్‌గా కాదు...కింగ్‌గా ఉండాలనుకుంటున్నా...ఇక ఎన్నికల్లో ఒంటరి సమరమే...’ అని డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రకటించారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం డీఎండీకే మాత్రమేనని స్పష్టం చేశారు. పొత్తు సస్పెన్షన్‌కు తెర దించుతూ విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు డీఎంకే, బీజేపీ, ప్రజా కూటమిలకు పెద్ద షాక్ తగిలినట్టు అయింది. చెన్నై : పది శాతం మేరకు ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపు కలుపుకునే దిశగా డీఎంకే, బీజేపీ, ప్రజా కూటమిలు తీవ్ర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, విజయకాంత్ నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతూ వచ్చారు. ఈ సమయంలో రెండు రోజుల క్రితం విజయకాంత్ మా వెంటే అని డీఎంకే అధినేత కరుణానిధి ప్రకటించడం, అదే సమయంలో విజయకాంత్ సీఎం అభ్యర్థిగా కూటమి అని బీజేపీ ప్రకటించడం వంటి పరిణామాలతో డీఎండీకే కేడర్‌లో గందరగోళం బయలు దేరింది. ఇక నాన్చుడు ధోరణిని పక్కన పెట్టిన విజయకాంత్ తన మదిలో మాటను బయట పెట్టేందుకు నిర్ణయించారు. ఇందు కోసం వైఎంసీఏ మైదానంలో పార్టీ మహిళా విభాగం నేతృత్వంలో మహిళా దినోత్సవ మహానాడుకు ఆగమేఘాలపై చర్యలు తీసుకున్నారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ మహానాడుకు ప్రాధాన్యం సంతరించుకోవడంతో అందరి చూపు వైఎంసీఏ మీద పడింది. ఇందులో ప్రేమలత విజయకాంత్ ప్రసంగించే క్రమంలో తొలుత అన్నాడీఎంకే సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. క్రమంగా డీఎంకే టార్గెట్ చేసి వ్యాఖల్ని సంధించడంతో ఇక, ఆ పార్టీతో పొత్తు డౌటే అన్నది స్పష్టమైంది. అదే సమయంలో ప్రజాకూటమి, బీజేపీలను లెక్కలోకి తీసుకోకుండా ఆమె ప్రసంగం సాగడంతో డీఎండీకే పయనం ఎటో అన్న ప్రశ్న సర్వత్రా బయలుదేరింది. అయితే, ఆది నుంచి డీఎంకేను ప్రేమలత విమర్శిస్తూ వస్తున్న దృష్ట్యా, ఇక విజయకాంత్ ఎలాంటి ప్రకటన చేస్తారోనన్న ఉత్కంఠ బయలు దేరింది. ఇక ఆలస్యంగా విజయకాంత్ వేదిక మీదకు వచ్చిన రాగానే, పార్టీ నేతృత్వంలో సిద్ధం చేసిన యాప్‌ను విడుదల చేశారు. తదుపరి రెండో మేనిఫెస్టో అంటూ, మహిళా సంక్షేమాన్ని కాంక్షిస్తూ, అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాలు, పథకాలను వివరించే వీడియో చిత్రాన్ని విడుదల చేశారు. తదుపరి యథాప్రకారం తన దైన శైలిలో ప్రసంగాన్ని మొదలెట్టగానే, పొత్తు ప్రక టన చేస్తారా..? మళ్లీ నాన్చుడు ధోరణి అనుసరిస్తారా..? అన్న ఉత్కంఠ బయలు దేరింది. పొత్తు ప్రకటిస్తానంటూ, చివరకు విజయకాంత్ కింగ్ మేకర్‌గా కాదు...కింగ్ గా ఉండాలన్నదే కార్యకర్తల అభిమతంగా ప్రకటించారు. తానేదో భేరసారాల్లో ఉన్నట్టుగా తెగ కథనాలు వచ్చాయని, తానెవ్వరితోనూ ఎలాంటి భేరాలు సాగించ లేదని వ్యాఖ్యానించారు. చివరల్లో పొత్తు ప్రకటన చేస్తానని, అంత వరకు వేచి ఉండాల్సిందేనని వ్యాఖ్యానిస్తూ, తాను కింగ్...ఒంటరిగానే ఎదుర్కొంటా....ఇక, తన ఎన్నికల పయనం ఒంటరి సమరమే.. అని స్పష్టం చేయడం విశేషం. ఒంటరి సమరమే అంటూ విజయకాంత్ ప్రకటన చేయడంతో అక్కడున్న డీఎండీకే వర్గాలు కరతాళ ధ్వనులతో ఆహ్వానించారు. తదుపరి అభ్యర్థుల ఎంపిక కసరత్తు ఉందని, ఇందు కోసం ఓ కమిటీని ప్రకటిస్తూ, ఇక, ఒంటరిగా సమరాన్ని ఎదుర్కొనే కార్యచరణ మీదే దృష్టి... అంటూ ముగించడం విశేషం. కాగా, మహిళా సంక్షేమం, ప్రగతిని కాంక్షిస్తూ సరికొత్త పథకాల్ని, ప్రభుత్వ నేతృత్వంలో సినీ మాల్స్ నిర్మాణాలు, మహిళలకు అప్పగింత, పేద మహిళలకు ఆలయాల్లో ఉచిత వివాహాలు, అన్ని రకాల లాంఛనాలు, వివిధ రంగాల్లో శిక్షణలు, రాయితీలతో మహిళలకు రుణాలు, తదితర కొత్తప్రకటనలు మేనిఫెస్టో ద్వారా చేయడం విశేషం. ఇక, పొత్తు వ్యవహారాన్ని విజయకాంత్ తేల్చడంతో షాక్‌కు గురై తదుపరి కార్యచరణ మీద డీఎంకే, బిజేపీ, ప్రజా కూటమిలు దృష్టి పెట్టే పనిలో పడ్డాయి. -
కెప్టెన్ మా వెంటే!
►మద్దతు ఇస్తాడన్న నమ్మకం ఉంది ► పెదవి విప్పిన కరుణ ► రెండు రోజుల్లో మేనిఫెస్టో ► కొళత్తూరు బరిలో మళ్లీ స్టాలిన్ ► ఇంటర్వ్యూకు హాజరు సాక్షి, చెన్నై : డీఎండీకే పొత్తు వ్యవహారాలపై వస్తున్న ఊహాజనిత కథనాలకు ముగింపు పలికే విధంగా డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. కెప్టెన్ మా వెంటే అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్య, పండు పక్వానికి వచ్చింది...ఇక పాలల్లో పడాల్సిందే అని సామెతను వళ్లించి అటు కమలనాథులకు, ఇటు ప్రజా కూటమికి షాక్ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టోను సైతం ప్రకటించబోతున్నట్టు కరుణానిధి వెల్లడించారు. అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలతో డీఎంకే అధినేత కరుణానిధి ముందుకు సాగుతూ వస్తున్నారు. ఇప్పటికే ఆ కూటమిలోకి కాంగ్రెస్ చేరింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎప్పటి నుంచో డీఎంకేతో పయనం సాగిస్తూనే ఉంది. ఇక, పది శాతం మేరకు ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్ తమ వెంట ఉంటే చాలు, అన్నాడీఎంకేను పతనం అంచుకు చేర్చినట్టే అన్న భావనలో డీఎంకే వర్గాలు పడ్డాయి. అయితే, విజయకాంత్ ఎక్కడా, ఎవరికీ చిక్కకుండా నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఊహాజనిత కథనాలెన్నో పుట్టుకొచ్చాయి. బీజేపీ వైపు వెళుతున్నారంటూ కొన్ని మీడియాలు, ప్రజా కూటమి వైపు అంటూ మరికొన్ని మీడియాలు కోడై కూసినా, డీఎంకే అధినేత కరుణానిధి మాత్రం పొత్తు విషయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆశావహుల ఇంటర్వ్యూల మీదే తన దృష్టిని అంతా పెట్టారు. ఈ పర్వం సోమవారం పొద్దు పోయే వరకు సాగింది. 4,433 మందిని గత నెల 22వ తేదీ నుంచి కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఇంటర్వ్యూలు చేయడం విశేషం. ఇక, చివరగా కరుణానిధి ఇంటర్వ్యూకు స్టాలిన్ సైతం హాజరు కాక తప్పలేదు. కొళత్తూరు బరిలో మళ్లీ ఆయన నిలబడాలంటూ దరఖాస్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. దీంతో ఆ స్థానం తనదేనని సీటును రిజర్వు చేసుకుంటూ ఇంటర్వ్యూకు దళపతి స్టాలిన్ సైతం హాజరు కాక తప్పలేదు. కరుణానిధి సంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సైతం ఇచ్చారు. ఈ దరఖాస్తుల పర్వం ముగియడంతో మంగళవారం మీడియా ముందుకు వచ్చిన కరుణానిధి ఊహాజనిత కథనాలకు ముగింపు పలికే విధంగా వ్యాఖ్యల్ని , సామెతల్ని సంధించారు. కెప్టెన్ మా వెంటే : అన్నా అరివాలయంలో పొత్తు వ్యవహారాలపై కరుణానిధి స్పందించారు. డి ఎంకే కూటమిలోకి డిఎండికే వస్తుందా..? అని ప్రశ్నించగా, పండు పక్వానికి వచ్చిందని, ఇక పాలల్లో పడాల్సిందేనని సామెతను వళ్లించారు. పొత్తు వ్యవహారాల్లో జాప్యం ఏమిటో..? అని ప్రశ్నించగా, జాప్యం ఏమీ లేదు, ఇతర వివరాలు చెప్పలేను అంటూ దాట వేశారు. విజయకాంత్ వస్తారన్న నమ్మకం ఉందా..? అని ప్రశ్నించగా, తప్పకుండా వస్తారని వ్యాఖ్యానించడం విశేషం. డీఎంకే మేనిఫెస్టో సిద్ధమా..? అని ప్రశ్నించగా, రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నామన్నారు. ఇతర పార్టీల్ని కూటమిలోకి ఆహ్వానిస్తున్నారా..? అని ప్రశ్నించగా, ఇతరులెవ్వరినీ ఆహ్వానించ లేదు, ఆహ్వానించబోమని వ్యాఖ్యానించారు. ఇక, విజయకాంత్ తమ వెంటనే అన్నట్టుగా కరుణానిధి స్పందించడంతో కమలం వర్గాలు, ప్రజా కూటమి వర్గాలకు షాక్ తగిలినట్టు అయ్యాయి. ఇక, విజయకాంత్ చేజారినట్టేనా..అన్న భావనలో ఆ రెండు వర్గాలు పడ్డాయి. -
ఒంటరి పోరుకు సై
* తమిళిసై స్పష్టీకరణ * జవదేకర్ అదే వ్యాఖ్య సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది. 234 స్థానల్లోనూ పోటీకి తాము రెడీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ జవదేకర్ వ్యాఖ్యలూ అదే తరహాలో ఉండడం గమనార్హం. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలన్న కమలనాథుల ఆశలు అడియాశలు అవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు కలిసి రాక పోవడంతో ఒంటరిగా మిగిలే పరిస్థితి చోటు చేసుకుంది. గతంలో వలే ఒంటరిగానే ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కమలనాథులు సైతం సిద్ధం అవుతూ, అందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. డీఎండీకే తమతో కలిసి వస్తుందన్న ఆశాభావం ఎక్కడో మిగిలి ఉన్నా, చివరకు అది కూడా గల్లంతైనట్టే అన్న భావన బయల్దేరి ఉన్నది. ఇందుకు తగ్గట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తిరునల్వేలిలో సోమవారం స్పందించారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనే బలం బీజేపీకి రాష్ట్రంలో ఉందని వ్యాఖ్యానించారు. 234 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి సత్తాను చాటుకోగలమన్నారు. తమకు యాభై లక్షల మంది సభ్యులు ఉన్నారని, ప్రజాదరణ, ప్రధాని మోదీ ప్రభావంతో కమలం వైపు చూసే ఓటర్లు కోట్లాది మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. అయితే, రాష్ట్రంలో ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్న పాలనలకు స్వస్తి పలికి, మార్పు అన్నది తీసుకురావాలన్న కాంక్ష బీజేపీకి ఉందన్నారు. ఆ మార్పు అన్నది తమ ద్వారానే సాధ్యం అని, అందుకు తగ్గ ప్రయత్నాలు చేశామని, చేస్తున్నామని వ్యాఖ్యానించడం గమనార్హం. ఢిల్లీలో డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత తిష్ట వేసి బీజేపీ పెద్దలతో పొత్తు భేరాల్లో ఉన్నట్టుగా వచ్చిన వార్తల్ని రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్ ఖండించారు. డీఎండీకేతో పొత్తు ప్రయత్నాలేవి జరగ లేదని, ఎన్నికల ఇన్చార్జ్గా ఉన్న తనకు తెలియకుండా నేరుగా ఢిల్లీలో పార్టీ పెద్దల్ని కలిసేందుకు అవకాశాలు లేవన్నారు. ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కార్యాచరణతో ముందుకు సాగుతున్నామంటూ పొత్తు ప్రయత్నాలు బెడిసి కొడుతుండడంపై సంధించిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడం గమనార్హం. -
అమ్మే దిక్కు
పొత్తుకు డీఎండీకే, పీఎంకేలు దిగిరాకపోవడంతో, ఇక అమ్మ శరణు కోరేందుకు కమలనాథులు సిద్ధమవుతునట్టుంది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆ పార్టీ సీనియర్ నేత ఇలగణేషన్ స్పందించారు. అన్నాడీఎంకేతో పొత్తు ప్రయత్నాలకు అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించడం, ఇందుకు ఢిల్లీ నుంచి పెద్దలు రానుండడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. * అన్నాడీఎంకేతో పొత్తుకు బీజేపీ ప్రయత్నం * ఢిల్లీ నుంచి కమలం పెద్దలు సాక్షి, చెన్నై: లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ కూటమి ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్రంలో ఆ రెండు కూటములకు తామే ప్రత్యామ్నాయం అని అప్పట్లో కమలనాథులు జబ్బలు చరిచారు. ఎన్నికల అనంతరం ఆ కూటమి పటాపంచేలు అయింది. లోక్ సభ ఎన్నికల్లో కమలం గొడుగు నీడన చేరేందుకు ఉరకలు తీసిన వాళ్లు, తాజాగా చీత్కార ధోరణితో ముందుకు సాగుతున్నారు. తమ నేతృత్వంలో ఎలాగైనా కూటమి ఏర్పాటు చేయాలని విశ్వప్రయత్నాల్ని బీజేపీ వర్గాలు చేస్తూ వస్తున్నా ఫలితం శూన్యం. డీఎండీకే, పీఎంకేలు తమతో కలసి వస్తాయన్న ఆశ ఇన్నాళ్లు కమలనాథుల్లో ఉన్నా, ప్రస్తుతం నమ్మకం సన్నగిల్లినట్టుంది. ఆ రెండు పార్టీల వ్యవహారం కమలనాథులకు అంతు చిక్కని దృష్ట్యా, ఎక్కడ ఒంటరిగా మిగులుతామోనన్న బెంగ బయలు దేరినట్టుంది. డీఎంకే గొడుగు నీడ కాంగ్రెస్, ప్రజా కూటమిలో వామపక్షాలు ఉన్న దృష్ట్యా, వారితో పొత్తుకు ఆస్కారం లేదు. పీఎంకే, డీఎండీకేలు మెట్టుదిగని దృష్ట్యా, చివరకు అమ్మే దిక్కు అన్నట్టుగా అన్నాడీఎంకే గొడుగు నీడన చేరడానికి కమలనాథులు కసరత్తులకు సిద్ధమవుతున్నారు. ఇందు కోసం ఢిల్లీ నుంచి ప్రతినిధులు రానున్నడంతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకేతో కమలం పొత్తు కుదిరేనా అన్న చర్చ బయలు దేరింది. ఈ సమయంలో బీజేపీ సీనియర్ నేత ఇలగణేషన్ శుక్రవారం మీడియాతో స్పందిస్తూ, తమ ప్రయత్నం తాము చేశామని, ఇక ఢిల్లీ పెద్దలు చూసుకుంటారని వ్యాఖ్యానించడం గమనించాల్సిందే. అమ్మే దిక్కా : తమతో పొత్తుకు ఎవ్వరూ కలిసి రాక పోవడంతో ఒంటరిగా మిగలడం కన్నా, అమ్మ శరణం కోరడం మంచిదన్న నిర్ణయానికి కమలనాథులు వచ్చినట్టు ప్రచారం బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే విధంగా ఇలగణేషన్ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, పియూష్ గోయల్ నేతృత్వంలో ఎన్నికల కమిటీ రంగంలోకి దిగనున్నదని సూచించారు. ఈ కమిటీ చివరి ప్రయత్నంగా డీఎండీకే, పీఎంకేలతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దల రాకతో రాజకీయంగా మార్పులు, అన్నాడీఎంకేతో పొత్తు విషయంగానూ సంప్రదింపులకు అవకాశం ఉందని స్పందించడంతో ఇక, పాత మిత్రులు కొన్నేళ్ల అనంతరం మళ్లీ ఏకం అయ్యేనా అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. అన్నాడీఎంకే గొడుగు నీడన చేరడానికి ఇక కమలం సిద్ధ పడ్డట్టే అన్న ప్రచారం సాగుతున్నది. జయలలిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోది ఫోన్లో శుభాకాంక్షలు తెలియజేయడం, తాజాగా అన్నాడీఎంకేతోనూ పొత్తు సంప్రదింపులకు ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగనున్నడం గమనించాల్సిన విషయం. అయితే, ఏ నిర్ణయాన్ని అయినా, నిర్భయంగా తీసుకునే పురట్చి తలైవి తాజా రాజకీయ పరిస్థితులు, కర్ణాటక అప్పీలు విచారణ వేగం పెరిగిన నేపథ్యంలో కమలంతో పొత్తు విషయంలో ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
కెప్టెన్ కింగ్
డీఎండీకే అధినేత విజయకాంత్ గొడుగు నీడన ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు కమలనాథులు సన్నద్ధం అవుతున్నారు.కెప్టెన్‌ను కింగ్ చేయడానికి రెడీ అంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు వ్యాఖ్యానించి ఉన్నారు. ఇక ప్రజా కూటమి విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించే విషయాన్ని పరిశీలనలో ఉంచింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ సాగుతున్న విషయం తెలిసిందే. ఆయన్ను తమ వైపు తిప్పుకునే యత్నం చేసి డీఎంకే దాదాపుగా విరమించుకుందని చెప్పవచ్చు. బీజేపీ, ప్రజా కూటమి ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నాయి. అయితే ఒకరి గొడుగు నీడన తాను నిలబడడం కన్నా, తన గొడుగు నీడన ఇతరులు రావాలన్న కాంక్షతో విజయకాంత్ వ్యూహ రచనల్లో ముని ఉన్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా తాను ‘కింగ్’ కావాలో, లేదా కింగ్ మేకర్ కావాలో కార్యకర్తల అభీష్టానికి వదిలి వేస్తున్నట్టుగా కాంచీపురం మహానాడులో విజయకాంత్ ప్రకటించారు. తన ఎన్నికల మేనిఫెస్టోలో కొంత భాగా న్ని ప్రకటించేశారు. తాను సీఎం కావాలన్న కాంక్ష విజయకాంత్‌లో పెరిగి ఉండడాన్ని బీజేపీ, ప్రజా కూటములు పరిగణనలోకి తీసుకునే పనిలో పడ్డాయి. విజయకాంత్‌తో దోస్తీ కట్టని పక్షంలో ఒంటరిగా మిగులుతామన్న ఆందోళనలో ఉన్న కమలనాథులు ఆయన్ను కింగ్‌గా చూడడానికి సిద్ధం అయ్యారు. విజయకాంత్ సీఎం అభ్యర్థిగా ప్రకటించేం దుకు తగ్గ కూటమికి బీజేపీ సిద్ధం అవుతున్నది. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధరరావు స్పందిం చడం గమనార్హం. విజయకాంత్‌ను కింగ్‌ను చేయడానికి తాము సిద్ధం అని వ్యాఖ్యానించి ఉండడం ఆలోచించాల్సిందే. విజయకాంత్‌ను కింగ్ గా చూడడానికి బీజేపీ సిద్ధం కావడంతో, ఆయన మద్దతు కోసం తీవ్ర కుస్తీలు పడుతున్న ప్రజా కూటమి పరిశీలనలో పడింది. ప్రజా కూటమిలోని ఎండీఎంకే, వామపక్షాలు, వీసీ కే వర్గాలు విజయకాంత్ వ్యూహాల్ని పరిశీలిస్తూ, అందుకు తగ్గట్టుగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నారు. విజయకాంత్‌ను కింగ్ చేయడానికి తామూ సిద్ధం అని, అయితే ఆయన ప్రజా కూటమిలోకి రావాల్సి ఉంటుందని వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. తన వ్యూహాలకు పదును పెట్టి విజయకాంత్ కింగ్‌గా అవతరించే యత్నం చేస్తారా? లేదా, అధికారాన్ని శాసించే దిశగా కింగ్ మేకర్ అయ్యే మార్గాన్ని ఎంచుకుని డీఎంకే వైపు అడుగులు వేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. -
కెప్టెన్‌కు గట్టి ఎదురుదెబ్బ!
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్‌కు ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. డీఎండీకేకు చెందిన ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలు హఠాత్తుగా చేసిన రాజీనామాను ఆదివారం స్పీకర్ ధనపాల్ ఆమోదించారు. అలాగే, ప్రధాన ప్రతి పక్ష పదవికి విజయకాంత్ అర్హత కోల్పోయినట్టుగా ప్రకటించారు. ♦ డీఎండీకే ఎమ్మెల్యేలు 8 మంది రాజీనామా ♦ ప్రతిపక్ష నేత పదవి దూరం ♦ ఆమోదంతో కోల్పోయిన అర్హత ♦ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనట్టే ♦ పీఎంకే, పీటీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ♦ స్పీకర్ ధనపాల్ ప్రకటన సాక్షి, చెన్నై : ఏ పార్టీకి అర్హత లేని దృష్ట్యా, అసెంబ్లీకి ప్రధాన ప్రతి పక్షం అన్నది లేనట్టేనని స్పష్టం చేశారు. ఇక, పీఎంకే ఎమ్మెల్యే కలైయరసన్, పుదియ తమిళగం ఎమ్మెల్యే రామస్వామి సైతం పదవికి రాజీనామా చేయడం గమనార్హం. 2011 అసెంబ్లీ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలసి డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 29 మంది డీఎండీకే సభ్యులు విజయ కేతనం ఎగుర వేయడంతో రాష్ర్టంలో అతి పెద్ద పార్టీగా ఉన్న డీఎంకేకు పెద్ద దెబ్బ తగిలినట్టైంది. కనీసం ఆ పార్టీకి ప్రధాన ప్రతి పక్ష హోదా కూడా దక్కలేదు. డీఎండీకే అధినేత విజయకాంత్ ఈ ఎన్నికల ద్వారా ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఇంత వరకు బాగానే పయనం సాగినా తదుపరి పరిణామాలు అన్నాడీఎంకే, డీఎండీకేల మధ్య వైర్యాన్ని పెంచాయి. అసెంబ్లీ వేదికగా సాగిన సమరంతో వివాదం ముదిరింది. అదే సమయంలో అన్నాడీఎంకే చేపట్టిన ఆపరేషన్ ఆకర్షతో డీఎండీకేకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు రెబల్స్‌గా అవతరించారు. డీఎండీకేలో ఉంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా అసెంబ్లీలోనే కాదు, ఇంటా బయట వ్యవహరించడం మొదలెట్టారు. వీరిలో పాండియరాజన్(విరుదునగర్), సీ.అరుణ్ పాండియన్(పేరావూరని), మైకెల్ రాయప్పన్(రాధాపురం), టి సుందరరాజన్( మదురై వెస్ట్), తమిళలగన్(దిట్టకుడి), టి సురేష్‌కుమార్(సెంగం), శాంతి (సెంథామంగళం), అరుణ్ సుబ్రమణ్యం(తిరుత్తణి) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, డీఎండీకే సీనియర్ నేత, ఆలందూరు ఎమ్మెల్యే బన్రూటి రామచంద్రన్ ఏకంగా పదవికి రాజీనామా చేసి అన్నాడీఎంకేలో చేరారు. ఉప ఎన్నికల్లో ఆ సీటు అన్నాడీఎంకే ఖాతాలోకి చేరింది. ఇన్నాళ్లు రెబల్ ఎమ్మెల్యేలు డీఎండీకే సభ్యులుగానే ఉంటూ రావడంతో ప్రధాన ప్రతి పక్ష నేతగా విజయకాంత్ కొనసాగుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఎనిమిది మంది రెబల్ ఎమ్మెల్యేలు హఠాత్తుగా రాజీనామా చేయడం, దానికి ఆఘ మేఘాలపై స్పీకర్ ధనపాల్ ఆమోదం తెలపడంతో విజయకాంత్‌కు గట్టి షాక్ తగిలినట్టు అయింది. అర్హత కోల్పోయిన విజయకాంత్ : 29 మంది సభ్యుల్ని కల్గి ఉన్న విజయకాంత్‌కు బన్రూటి రామచంద్రన్ రూపంలో ఓ స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎనిమిది మంది రాజీనామాతో సంఖ్యా బలం 20కు పడిపోయింది. ఈ ఎనిమిది మంది రాజీనామాను ఆమోదిస్తూ స్పీకర్ ధనపాల్ ప్రకటన విడుదల చేశారు. డీఎండీకేకు చెందిన ఎనిమిది మంది సభ్యుల రాజీనామా ఆమోదించడం జరిగిందని, అందువల్ల ఆ పార్టీ సంఖ్యా బలం 20కు చేరినట్టు వివరించారు. ఈ దృష్ట్యా, అసెంబ్లీ ప్రధాన ప్రతి పక్ష నేత పదవిని విజయకాంత్ కోల్పోయినట్టుగా, ఆ పదవికి తగ్గట్టు కల్పించిన అన్ని రాయితీలను, అర్హతలను వెనక్కు తీసుకోవడం జరుగుతున్నదని ప్రకటించారు. ఏ ప్రతి పక్ష పార్టీకి 24 మంది సభ్యులు అసెంబ్లీలో లేని దృష్ట్యా, ప్రధాన ప్రతి పక్షంగా వ్యవహరించే అర్హత ఎవ్వరికీ లేదని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు రాజీనామా చేయకుండా రెబల్స్‌గా వ్యవహరిస్తూ వచ్చిన డీఎండీకే సభ్యులు ఎనిమిది మంది హఠాత్తుగా స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించడం, దానికి ఆమోదం తెలపడం గమనించాల్సిన విషయం. ఇటీవల పీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆనైకట్టు ఎమ్మెల్యే కలైయరసన్, పుదియ తమిళగం నుంచి బయటకు వచ్చిన నీల కోటై ఎమ్మెల్యేలు రామస్వామి తాజాగా రాజీనామ చేసి స్పీకర్‌కు పంపించారు. వీరిలో కలైయరసన్ రాజీనామా ఆమోదిం చారు. ఆశ్రయం ఇచ్చిన పార్టీకి వ్యతిరేకంగా ఇన్నాళ్లు వ్యవహరించి తాజాగా రాజీ నామా చేసి బయటకు వ స్తున్న వీరందరికీ అన్నాడీఎంకే లో సీట్లు దక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. -
కెప్టెన్‌తో ట్రాఫిక్ భేటీ
చెన్నై: డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌తో మక్కల్ పాదుగాప్పు కళగం అధ్యక్షుడు ట్రాఫిక్ రామస్వామి గురువారం సమావేశమయ్యారు. చెన్నై కోయంబేడులోగల డీఎండీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరిగింది. వారిరువురూ సుమారు 50 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఇందులో కోశాధికారి ఏఆర్ ఇలంగోవన్, యువజన సంఘం కార్యదర్శి ఎల్కే సుధీష్, ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు. అనంతరం విలేకరులతో ట్రాఫిక్ రామస్వామి మాట్లాడుతూ డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆహ్వానం మేరకు ఆయన్ను కలుసుకున్నానని, తాను రూపొందించిన 14 అంశాల గురించి ఇందులో ప్రస్తావించానన్నారు. ఇందులో ప్రాథమిక జీవనాధార వసతులు, హద్దు మీరి ప్రవర్తించేవారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవడం, ఉచిత విద్య తదితర అంశాలను ఆయనకు సమర్పించానన్నారు. తన ప్రయత్నాలకు డీఎండీకే అధ్యక్షుడు వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఎవరితో పొత్తులు కుదుర్చుకోవాలనే విషయంపై కూడా చర్చించామని, వచ్చే ఎన్నికల్లో అతిపెద్ద మార్పు ఏర్పడుతుందన్నారు. కాంచీపురం జిల్లాలో వచ్చే 20వ తేదీ జరిగే డీఎండీకే మహానాడు, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పును తీసుకురానుందన్నారు. -
గందరగోళం..రాజకీయం
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సమీపించే కొద్దీ రాష్ట్రంలో రాజకీయం గందరగోళంగా మారిపోతోంది. పొత్తులపై ఒక కొలిక్కిరాలేని అన్ని పార్టీలూ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి తలా ఒక దిక్కున పరుగులు తీస్తున్నాయి. పొత్తుల ఊహలకు అందని రీతిలో బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి తన ప్రకటనలతో కలవరం సృష్టించడం ప్రారంభించారు. డీఎంకే, డీఎండీకేలతో కూటమి ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామని బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించి రాజకీయ జీవులను ఆశ్చర్యపరిచారు. బీజేపీ కూటమిలోకి డీఎంకే, డీఎండీకేలను చేర్చేందుకు స్వామి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. లౌకికవాద డీఎంకే మతతత్వవాద పార్టీగా ముద్రపడిన బీజేపీకి మధ్య పొత్తు ఎలా సాధ్యమని అందరూ విస్తుపోతున్నారు. బలమైన కూటమి కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శతవిధాల ప్రయత్నిస్తుండగా, డీఎంకేతో స్వామి చేస్తున్న చెలిమి ప్రయత్నాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. అమిత్‌షా అదేశాల మేరకే స్వామి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అధికార అన్నాడీఎంకేకు బద్ధశత్రువైన డీఎండీకేతో పొత్తుకు సిద్ధం అంటూనే జయలలిత కోసం బీజేపీ ప్రయత్నాలు సాగిస్తోంది. మరో పదిరోజుల్లో కూటమిని ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రకటించారు. బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా, విజయకాంత్ మధ్య త్వరలో జరగాల్సిన చర్చలు వాయిదాపడ్డాయి. విజయకాంత్ మౌనం వల్లనే బీజేపీ వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ ఈనెల 10వ తేదీన రాష్ట్ర నేతలతో మరోసారి సమావేశం అవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా రాష్ట్ర అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు ముఠాపోరు నుంచి విముక్తి లభించలేదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు గతనెల ఢిల్లీకి పిలిపించుకున్న రాహుల్‌గాంధీ ఈనెల 10వ తేదీన మరోసారి సమావేశం అవుతున్నారు. కాంగ్రెస్ నేతలను బుజ్జగించే, భయపెట్టో కార్యోన్ముఖులను చేయడానికి రాహుల్ మరో ప్రయత్నం చేస్తున్నారు. అలాగే డీఎంకేతో పొత్తుకు దాదాపు సిద్దమైన కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించేందుకు సిద్దం కానుంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బును ఎన్నికల్లో పోటీచేయించాలని ఒక వర్గం గట్టి ప్రయత్నాలతో ఉంది. డీఎంకే నుండి బైటకు వచ్చిన కుష్బు పోటీకి సిద్దమైతే, అదే కూటమిలో చేరనున్న డీఎంకే అంగీకరిస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తుంది. కాగా, డీఎండీకేలో అభ్యర్దుల దరఖాస్తుల స్వీకరణను విజయకాంత్ శుక్రవారం ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ, అప్పగింత ఈనెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఎన్నికల్లో ఎవరితో పొత్తుపెట్టుకోవాలనే అంశంపై డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ తన పార్టీ అనుచరులతో సమావేశమైనారు. డీఎంకే, కాంగ్రెస్, బీజేపీ, ప్రజాస్వామ్య కూటమిల నుండి పొత్తుకు పిలుపురావడంతో ఏవైపు మొగ్గాలనే విషయంలో తలమునకలై ఉన్నారు. ఎవరికి మద్దతు ఇచ్చినా తనదే క్రియాశీలక పాత్ర ఉండాలని విజయకాంత్ ఆశిస్తున్నారు. అంతేగాక తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈనెల 20వ తేదీన కాంచీపురంలో నిర్వహించే పార్టీ మహానాడులో పొత్తు ఖరారును ప్రకటిస్తానని విజయకాంత్ చెప్పారు. అన్నాడీఎంకేలో అభ్యర్దుల దరఖాస్తుల స్వీకరణతో శనివారంతో ముగుస్తుండగా, శుక్రవారం నాటికి 25వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం. ప్రజాస్వామ్య కూటిమిలో భాగస్వామిగా ఉన్న వీసీకే అధినేత తిరుమావళవన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్దిగా ప్రకటించాలనే డిమాండ్‌ను అరుంధీయులు లేవనెత్తారు. దళితుడైన తిరుమావళవన్‌ను సీఎం అభ్యర్దిగా ప్రకటిస్తే మెరుగైన ఫలితాలు ఖాయమని వారు వాదిస్తున్నారు. కరుణానిధి ఆరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని శుక్రవారం ఒక వివాహ వేడకకు హాజరైన డీఎంకే కోశాధికారి స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
కెప్టెన్‌పై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం
చెన్నై: తమిళ సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్ చిక్కుల్లోపడ్డారు. జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఘటనపై విజయ్‌కాంత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దేవరాజన్ అనే జర్నలిస్ట్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుబ్బయ్య విచారించారు. గత నెలలో ప్రెస్ మీట్ సందర్భంగా విజయ్‌కాంత్ మీడియా ప్రతినిధుల పట్ల దురుసుగా ప్రవర్తించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తారని మీరు భావిస్తున్నారా అని ఓ విలేకరి విజయకాంత్‌ను ప్రశ్నించగా ... ఈ ప్రశ్నను జయలలితను అడిగే దమ్ము మీకుందా అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతూ.. మీకు భయం.. మీరు జర్నలిస్టులా అంటూ ఉమ్మి వేశారు. అప్పట్లో ఈ ఘటనను జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దేవరాజన్ హైకోర్టును ఆశ్రయించారు. డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్, మైలాపూర్ డిప్యూటి పోలీస్ కమిషనర్లను ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. డిసెంబర్ 28న ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశానని, స్పీడ్ పోస్ట్ లో కాపీని పోలీసు ఉన్నతాధికారులకు పంపానని, అయితే పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని దేవరాజన్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. విజయ్ కాంత్ పై చట్టప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. -
‘మహా’ కుట్ర!
సాక్షి, చెన్నై : ఎండీఎంకేను నిర్వీర్యం చేయడానికి మహా కుట్ర జరుగుతోందని ఆ పార్టీ నేత వైగో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్టీ వర్గాలకు నగదు, పదవుల్ని ఎరగా వేస్తూ డీఎంకే వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఇక, ప్రజా కూటమిలోకి రావాలని డీఎండికే అధినేత విజయకాంత్‌కు పిలుపునిచ్చారు. ఎండీఎంకే నుంచి వలసల పర్వం సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు మళ్లీ పాత గూటికే (డీఎంకే)లోకి చేరే పనిలో పడ్డారు. మరి కొందరు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా, ఎండీఎంకేకు బలం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల మీద డీఎంకే కన్నేసింది. అక్కడి ఆ పార్టీ ముఖ్య నాయకుల్ని తమ వైపు ఆకర్షించేందుకు శ్రీకారం చుట్టి, కార్యరూపం దాల్చే పనిలో డీఎంకే వర్గాలు పడ్డాయి. ఎక్కడెక్కడ జంప్ జిలానీలు ఉన్నారో వారిని పసిగట్టే పనిలో పడ్డ ఎండీఎంకే నేత వైగో, వారు పార్టీ ఫిరాయించకుండా చూసేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నారు. బలం ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ వర్గాలకు భరోసా ఇస్తున్నారు. ఇందులో భాగంగా తన పార్టీని దెబ్బతీసేందుకు మహా కుట్ర జరుగుతున్నదంటూ గురువారం వైగో తీవ్రంగానే స్పందించారు. ఈ కుట్రకు వ్యూహకర్త డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అని నిప్పులు చెరిగారు. పధకం ప్రకారం తనను, తన పార్టీని టార్గెట్ చేసి స్టాలిన్ ముందుకు సాగుతున్నట్లుందని ధ్వజమెత్తారు. ఈ ప్రయత్నాలను, కుట్రను ఎదుర్కొని తన బలాన్ని చాటుకుంటానని ప్రకటించారు. కొన్ని చోట్ల తన పార్టీ వర్గాలకు నగదు, పదవులు ఇస్తామంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీన్ని బట్టి చూస్తే, డీఎంకే ఎంతగా దిగజారుడు నీచ రాజకీయాలు సాగిస్తోందో స్పష్టమైందని దుయ్యబట్టారు. ఇక, డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రజా కూటమికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో ఏర్పడిన ఈ ప్రజా కూటమిలోకి డీఎండీకే అధినేత విజయకాంత్ కూడా రావాలని ఎదురు చూస్తున్నామని, ఆయనకు ఆహ్వానం సైతం పలికామన్నారు. ఒకవేళ విజయకాంత్ ప్రజా కూటమిలోకి వస్తే, ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా? అన్న ప్రశ్నకు.. ఆయన వస్తే ఆనందమేనని, అయితే ప్రజా కూటమికి నాయకత్వం ఎవరు వహించాలన్నది అందరూ చర్చించుకుని సమష్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. -
ఎటూ తేల్చని కెప్టెన్!
సాక్షి, చెన్నై : ఏ విషయాన్ని త్వరితగతిన తేల్చని డీఎండీకే అధినేత విజయకాంత్, ఎన్నికల పొత్తుల్లోనూ అదే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు. కూటమి అంశాన్ని మరో నెలన్నర రోజులు సాగ దీయడానికి సిద్ధమయ్యారు. బీజేపీ, ప్రజా కూటముల్ని ఊరిస్తూనే, అన్నాడీఎంకే నిర్ణయం మేరకు డీఎంకేతో చెలిమికి వ్యూహ రచన చేస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌కు దూకుడు ఎక్కువే. విమర్శలు, ఆరోపణలు గుప్పించేటప్పుడు గానీ, అనుచరులు ఏ చిన్న తప్పు చేసినా చితక్కొట్టడంలో గానీ ఈ దూకుడును ప్రదర్శించడం జరుగుతూ వస్తోంది. ఇక, ఏదేని నిర్ణయం తీసుకోవాలంటే అందరితోనూ చర్చించడం, చివరకు కింది స్థాయి కార్యకర్త అభిష్టాన్ని తీసుకున్నాకే వెల్లడించడం చేస్తూ వస్తున్నారు. అదే బాణిని ప్రస్తుతం అనుసరించే పనిలో పడ్డారు. రానున్న ఎన్నికల్లో తన మద్దతు కీలకం కావడం, తన చుట్టూ రాజకీయం సాగుతుండడం విజయకాంత్‌కు లోలోన ఆనందం కలిగిస్తోంది. అయితే, గత ఎన్నికల్లోలా కాకుండా, ఈ సారి పొత్తు వ్యవహారంలో ఆచితూచి స్పందించాలని నిర్ణయించారు. శనివారం పెరంబలూరు వేదికగా జరిగిన పార్టీ సమాలోచన సమావేశం, సర్వ సభ్యం భేటీలో ఇందుకు తగ్గ వ్యూహాల్ని రచించి ఉన్నారు. ఈ సమావేశంలో పార్టీ వర్గాలు మెజారిటీ శాతం మంది విజయ కాంత్‌ను సీఎంగా చూడాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసినా, అందుకు తగ్గ పరిస్థితులు రాష్ట్రంలో ఉందా..?, ఇది సాధ్యమేనా ..? అన్న ప్రశ్న కెప్టన్ మదిలో మెదులుతున్నట్టు సమాచారం. బీజేపీ లేదా ప్రజా కూటమిలతో కలసి పనిచేస్తే వచ్చే ఫలితాలు, డీఎంకేతో చెలిమికి సిద్ధ పడితే, వచ్చే లాభ నష్టాలపై ఈ సమావేశంలో కెప్టెన్ బేరిజు వేసుకున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే పొత్తు అన్న అంశాన్ని మరికొన్నాళ్లు తేల్చకుండా ఉండేందుకు నిర్ణయించడంతో పాటుగా తన వ్యూహాల్లో ఒకొక్కటి అమలుకు సిద్ధమైనట్టున్నారు. ముందుగా బీజేపీ, ప్రజా కూటమిల మదిలో తన మీదున్న అభిప్రాయాన్ని పసిగట్టేందుకు వీలుగానే, సీఎం ఆకాంక్షతో తాను ఉన్నట్టు ప్రకటించుకుని ఉన్నారని చెబుతున్నారు. ఆ రెండు పార్టీల్లో ఎవ్వరో ఒకరు తనను సీఎం అభ్యర్థి గా ప్రకటిస్తే, అందుకు తగ్గట్టు ఆ సమయంలో నిర్ణయం తీసుకునేం దుకు విజయకాంత్ నిర్ణయించి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నా యి. ప్రజా కూటమిలో ముసలం బయలు దేరి ఉండటం, వీరి వైపు నుంచి వచ్చే స్పందనను, ఆ కూటమిలో సాగే వ్యవహారాలను నిశితం గా పరిశీలించాలని పార్టీ వర్గాలకు కె ప్టెన్ సూచించి ఉన్నారని డీఎండీకే నేత ఒకరు పేర్కొన్నారు. ఇక, అన్నాడీఎంకే నిర్ణయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతే బీజేపీకి స్పష్టమైన హామీ ఇవ్వాలని సంకల్పించినట్టు చెబుతున్నారు. పరిస్థితులకు అనుగుణంగా తన నిర్ణయం ఉంటుందని పొత్తు అంశంపై ఆ పార్టీ అధినేత్రి జయలలిత ప్రకటించి ఉన్న దృష్ట్యా, కమలం అడుగుల్ని సైతం నిశితంగా పరిశీలించేందుకు పార్టీ వర్గాల్ని రంగంలోకి దించి ఉన్నారు. ఇక, తన కోసం డీఎంకే తలుపులు తెరుచుకునే ఉన్నందున, ఆ పార్టీని దూరం చేసుకోకుండా ఆచీ తూచి స్పందించేందుకు తగ్గ ఉపదేశాలను పార్టీ వర్గాలకు విజయకాంత్ చేసి ఉండటం గమనార్హం. తనకు డీప్యూటీ సీఎంతో పాటుగా 70 సీట్లు ఇస్తే డీఎంకేతో కలిసి పనిచేయడానికి సిద్ధం అన్న నిర్ణయాన్ని పార్టీ వర్గాల ముందు విజయకాంత్ ఉంచినా, పొత్తు అంశంపై అన్నాడీఎంకే వేసే ఎత్తుగడల మేరకు డీఎంకేతో చెలిమి అన్న విషయాన్ని స్పష్టం చేసినట్టు మరో నేత పేర్కొనడం గమనార్హం. అందుకే పొత్తు అంశాన్ని మరో నెలన్నర రోజులు సాగదీయడానికి నిర్ణయించి, ఫిబ్రవరి చివరి వారం లేదా, మార్చి మొదటి వారంలో పార్టీ మహానాడుకు కసరత్తుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఈ మహానాడు వేదికగా అందరి అభీష్టం మేరకు మార్చి రెండు లేదా, మూడో వారం విజయకాంత్ తన నిర్ణయాన్ని చెబుతారని, అంత వరకు అందరితోనూ మంతనాల పర్వం సాగాల్సిందేనని పేర్కొనడం గమనించాల్సిన విషయం. -
పొత్తులపై కెప్టెన్ రూటు ఎటు?
చెన్నై: కెప్టెన్ విజయకాంత్ స్థాపించిన తమిళ పార్టీ డీఎండీకే శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితో పొత్తులు పెట్టుకోవాలన్న నిర్ణయాన్ని అధినేతకు అప్పగిస్తూ తీర్మానించింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే నేత జయలలిత విజయానికి సహకరించిన విజయ్‌కాంత్ ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో జత కట్టారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు రావడంతో రాజకీయంగా అందరి దృష్టి ఆయనపైనే ఉంది. దేసియ ముర్పోకు ద్రవిడ కజగం (డీఎండీకే) ఇప్పటికే ఎన్డీయేలో భాగస్వామియేనని బీజేపీ భావిస్తుండగా విజయ్‌కాంత్ మాత్రం ఎవరితో జత కట్టాలనే విషయమై ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. అయితే తన డిమాండ్లను నెరవేర్చేందుకు ముందుకొచ్చే పార్టీలతోనే ఆయన పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తేనే ఏ కూటమితోనైనా చేతులు కలుపుతానని ఆయన స్పష్టం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. డీఎండీకే ఇప్పుడు తమిళనాడులో నెంబర్-2 స్థానంలో ఉంది. దీంతో ఇప్పటికే తమతో కలిసిరావాలని డీఎంకే సుప్రీం కరుణానిధి విజయ్‌కాంత్‌కు ఆహ్వానం పంపారు. అలాగే వామపక్షాలు, వైకో ఎండీఎంకే పార్టీలతో కొత్తగా ఏర్పడిన ప్రజా సంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్) కూడా విజయ్‌కాంత్‌తో పొత్తుకు తహతహలాడుతోంది. విజయ్‌కాంత్ మాత్రం ఎప్పటిలాగే కింగ్ మేకర్లాగా ఉండేందుకు సిద్ధపడటం లేదు. మరో అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి పీఠాన్నే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల పీడబ్ల్యూఎఫ్ నేతలతో జరిగిన చర్చల్లో ఇదే విషయాన్ని కెప్టెన్ స్పష్టం చేసినట్టు సమాచారం. విజయ్‌కాంత్‌కు బలమైన ఓటుబ్యాంకు ఉంది. 2006 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన విజయ్‌కాంత్ ఎవరితో పొత్తు పెట్టుకోకుండానే 10శాతం ఓట్లు సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనతో జతకట్టే ఏ కూటమి అయినా ఎక్కువ స్థానాలు గెలుపొందే అవకాశముంది. అదేవిధంగా విజయ్‌కాంత్ ఒంటరిగా పోటీచేస్తే పెద్దగా ప్రయోజనం ఉండదని పరిశీలకులు చెప్తున్నారు. దీంతో ఏ కూటమి వైపు విజయ్‌కాంత్ మొగ్గుచూపుతారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. -
కెప్టెన్ తేల్చేనా..!
♦ నేడు కార్యవర్గం భేటీ ♦ పెరంబలూరుకు నేతలు ♦ సచివాలయం సెట్ లో ఆంతర్యం సాక్షి, చెన్నై: పొత్తు విషయంలో తన నిర్ణయాన్ని డీఎండీకే అధినేత విజయకాంత్ తేల్చేనా!? అన్న ఎదురు చూపులు పెరిగాయి. పెరంబలూరు వేదికగా శనివారం డీఎండీకే సర్వ సభ్య సమావేశానికి సిద్ధమైంది. ఈ వేదిక ప్రవేశ మార్గంలో సెయింట్ జార్జ్ కోట(సచివాలయం)ను తలపించే రీతిలో సెట్ వేసి ఉండటంతో ఆంతర్యాన్ని తెలుసుకునే పనిలో పొత్తు కోసం ప్రయత్నించే పార్టీలు నిమగ్నయ్యాయి. పార్టీ ఆవిర్భావంతో తొలి ఎన్నికల్లో తానొక్కడినే అసెంబ్లీ మెట్లు ఎక్కినా, తన కంటూ ప్రత్యేక ఓటు బ్యాంకును కాపాడుకుంటూ వస్తున్న నేత విజయకాంత్. తదుపరి ఎన్నికలతో ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. సీఎం కావాలని కలలు కంటూ వస్తున్న ఈ నేతకు రానున్న అసెంబ్లీ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ప్రస్తుతం రాజకీయం అంతా ఆయన చుట్టూ పరిభ్రమిస్తోంది. ఓ వైపు ప్రజా కూటమి, మరో వైపు బీజేపీ, మరొక వైపు డీఎంకే విజయకాంత్‌కు తలుపులు తెరిచాయి. తమతో పనిచేయాలని ఆయన్ను తమ వైపు ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి. అయితే, ఎప్పటిలాగే మౌనం వహిస్తున్న విజయకాంత్ మరికొన్ని గంటల్లో తన నిర్ణయాన్ని ప్రకటించి, పొత్తు విషయం తేలుస్తారా? గతంలో వలే మెలిక పెడతారా? అని పొత్తు కోసం ఆరాట పడుతున్న పార్టీలు తర్జనభర్జన పడుతున్నాయి. పెరంబలూరు వేదికగా జరిగే పార్టీ సమావేశం మేరకు తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఇది వరకే విజయకాంత్ స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ కార్యకర్త, ద్వితీయ శ్రేణి నాయకులు, అగ్రనాయకులతో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించేందుకు విజయకాంత్ సిద్ధమయ్యారు. ఏర్పాట్లు పూర్తి శనివారం పెరంబలూరులో రెండు వేల మంది వరకు ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారని అంచనా. మెజారిటీ శాతం మంది పార్టీ వర్గాలు డీఎంకేతో కలిసి నడుదామన్న సూచన ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. రానున్న ఎన్నికల ద్వారా బలాన్ని మరింతగా పెంచుకోవాలంటే, డీఎంకేతో చెలిమి ద్వారానే సాధ్యమన్న నిర్ణయాన్ని ఇప్పటికే పలువురు డీఎండీకే వర్గాలు విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లాయని సమాచారం. అయితే, సమావేశంలో డీఎంకేపై తనదైన శైలిలో తిట్ల పురాణం అందుకోకుండా విజయకాంత్ వ్యవహరించిన పక్షంలో ఆ పార్టీ కూటమి వైపుగా తలొగ్టినట్టే. విజయకాంత్ ధోరణిలో మార్పు లేని పక్షంలో ఆశల్ని డీఎంకే వదులుకోవాల్సిందే. ఇక, డీఎంకేతో పాటు ప్రజా కూటమి, బీజేపీలను సైతం గందరగోళ పరిస్థితిలోకి నెట్టే విధంగా తన వేదిక ప్రవేశ మార్గాన్ని విజయకాంత్ ఏర్పాటు చేయించడం గమనార్హం. ఎప్పుడూ ప్రజా సమూహం తన వెంట ఉన్నట్టుగా ఫ్లెక్సీలు, బ్యానర్లు వేయించుకునే విజయకాంత్ ఈసారి సెయింట్ జార్జ్ కోట (సచివాలయం) సెట్ వేసి ఉండటంపై ఆసక్తి రేపింది; చర్చకూ తావిచ్చింది! అలాగే ఓ వైపు తాను, మరో వైపు తన సతీమణి ప్రేమలత ఫొటో ఉండేలా చేయడం కూడా రాజకీయచర్చకు తెరలేపింది. డీఎంకే తన ఊహల్లో లేనిపక్షంలో బీజేపీ తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందా, ప్రజా కూటమి తన నేతృత్వానికి కట్టు బడుతుందా..? అన్న విషయాన్ని తేల్చుకునేందుకు ఈ సరికొత్త సెట్ అంటూ డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. -
పీఎం పదవైనా ఒకే !
అధికారం ఇచ్చినా సరే సరైన సమయంలో నిర్ణయం కూటమిపై విజయకాంత్ వ్యాఖ్య సాక్షి, చెన్నై : గవర్నర్, సీఎం, ఇంకా చెప్పాలంటే, పీఎం పదవికి తానే అభ్యర్థి అని ఎంపిక చేసినా అందుకు ఒకే. అయితే, కూటమి ఎవరితో అన్నది మాత్రం ఇప్పట్లో చెప్పనని డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. మూడు సమావేశాల అనంతరం సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ రాజకీయం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. తమతో అంటే తమతో దోస్తీ కట్టాలంటూ ఓ వైపు బీజేపీ, మరో వైపు డీఎంకే, ఇంకో వైపు ప్రజా కూటమి ఆహ్వానాలు పలికాయి. ఇక, కాంగ్రెస్ కూడా తమతో కలసి రావాలన్న ఆహ్వానం ఇచ్చింది. ఇక, విజయకాంత్‌తో మంతనాల్లోనూ ఆయా పార్టీల వర్గాలు మునిగి ఉన్నారని చెప్పవచ్చు. అయితే, ఎవరికీ చిక్కకుండా విజయకాంత్ ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. అలాగే, పొత్తు విషయంగా మీడియా వద్ద నోరు జారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పొత్తుల ప్రయత్నాలు సాగుతున్న వేళ మీడియా ముందుకు విజయకాంత్ రాలేదని చెప్పవచ్చు. ఈ సమయంలో ఆదివారం ఆయన మీడియా ముందుకు వచ్చి ఏ పదవికి తనను ఎంపిక చేసినా సరే.. తాను మాత్రం ఒకే అంటూ తన దైన శైలిలో స్పందించడంతో పాటుగా, ఎవరితో పొత్తు అన్న విషయాన్ని మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నించినా గప్ చుప్ అంటూ ముందుకు సాగారు. పీఎం అభ్యర్థిత్వానికీ ఒకే : డీఎండీకే తరపున ఆదివారం నగరంలోని అడయార్, తండయార్ పేట, పోరూర్, మధ్యకైలాశ్లలో రక్త దాన, వైద్య శిబిరాలు జరిగాయి. మధ్యకైలాశ్లో శిబిరాన్ని ప్రారంభించినానంతరం మీడియాతో విజయకాంత్ మాట్లాడారు. తనను కూటమిలోకి రావాలని ఆహ్వానిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అయితే, పొత్తు ఎవరితో అన్నది మాత్రం ఇప్పట్లో తేల్చనని స్పష్టం చేశారు. ముందుగా పార్టీ కార్యవర్గ సమావేశం, తదుపరి సర్వసభ్య సమావేశం, చివరగా మహానాడులో కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం ఉంటుందని వివరించారు. పదే పదే గుచ్చిగుచ్చి ప్రశ్నలు సంధించినా, ఒక్కటే చెబుతున్నా, తన కార్యకర్తల్ని సంప్రదించకుండా నిర్ణయం మాత్రం తీసుకోనని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిగా ఎంపిక చేస్తే, అని ప్రశ్న సంధించగా, గవర్నర్, సీఎం, పీఎం పదవికి తనను అభ్యర్థిగా ఎంపిక చేసినా ఒకే, అయితే, పొత్తు విషయంలో మాత్రం నోరు జారబోనని వ్యాఖ్యానించారు. అధికారంలో వాటా ఇస్తే అని ప్రశ్నించగా, వాటా ఎందుకు, ఏకంగా అధికారం ఇచ్చినా తీసుకునేందుకు తాను రెడీ అని, అయితే, పొత్తు ఎవరితో అన్నది ఆ మూడు సమావేశాల అనంతరం చెబుతానని సమాధానం ఇచ్చారు. అంత వరకు వేచి ఉంటే, ఉండండి, లేదా ఏదో మీకు తోచించి రాసుకోండటంటూ మీడియాకు ఉచిత సలహా ఇచ్చారు. విమర్శతో చర్చ: జల్లికట్టు విషయంగా ప్రశ్నలు సంధించగా, డీఎంకే, బీజేపీల మీద పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం. పరోక్షంగా తాను ప్రజా కూటమికి విధేయుడిగా ఈ సమాధానం సాగడం విశేషం. కేబినెట్ మంత్రి జవదేకర్ అనుమతి ఇచ్చేస్తున్నారట.. సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హామీ ఇచ్చారట. దీనికి కట్టుబడి ఆయన దీక్షకు వాయిదా వేశారంటా..! అని విమర్శలు గుప్పించారు. డీఎండీకే ఓటు బ్యాంక్ తగ్గిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, అలాంటప్పుడు తన చుట్టూ ఎందుకు ఇంత చర్చ అని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందించారు. అన్నాడీఎంకేకు సుమారు పార్లమెంట్, రాజ్యసభల్లో 49 లేదా 50 మంది వరకు సభ్యులు ఉండగా, వారి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యమేనని మండి పడ్డారు. అన్నాడీఎంకే వాళ్లను, ఓపీఎస్‌ను( ఆర్థిక మంత్రి)ని అడగాల్సిన ప్రశ్నల్ని తనను అడుగుతున్నారంటూ సహాయ చర్యల మీద స్పందిస్తూ తీవ్రంగా మండి పడ్డారు. ఇదే ప్రశ్నలు వాళ్లకు సంధించే ధైర్యం ఉందా అంటూ ఏకంగా ఓ మీడియా ప్రతినిధిని ఉద్దేశించి తన దైన శైలిలో స్పందించారు. పోరూర్‌లోని శిబిరంలో రక్తదానం చేసినానంతరం మీడియాతో మాట్లాడిన ప్రేమలత విజయకాంత్ ఇప్పటికే విజయకాంత్ చెప్పారుగా, అదే విధంగా సరైన సమయంలో మంచి నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించారు. -
సీఎం పగ్గాలా...వాటానా..
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మూడు కూటముల రాజకీయం ప్రస్తుతం డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ తిరుగుతున్నాయి. తమ వైపునకు అంటే, తమ వైపునకు రావాలంటూ డీఎంకే, ప్రజాకూటమి, బీజేపీలు బహిరంగంగానే పిలుపు నివ్వడంతో తమ అధినేత నిర్ణయం ఎటో...అన్న ఎదురు చూపుల్లో డీఎండీకే వర్గాలు పడ్డాయి. ఇక, రానున్న ఎన్నికలతో సీఎం పగ్గాలు చేపట్టే స్థాయికి తాను ఎదుగుతానా..? లేదా , అధికారాన్ని శాసించే స్థాయికి ఎదుగుతానా..? అన్న మల్లగుల్లాల్లో విజయకాంత్ ఉన్నట్టు సమాచారం. ‘ఒంటరి’నీ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన విజయకాంత్ అదే బాటలో కొన్నేళ్లు పయనం సాగించారు. డీఎంకే పతనం లక్ష్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో దోస్తీ కట్టి తొలిసారిగా పొత్తుకు శ్రీకారం చుట్టారు. ఆ ఎన్నికల ద్వారా ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన విజయకాంత్ తన కంటూ కనీసంగా పది శాతం వరకు ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్నారని చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికల్ని ఎన్డీఏతో కలసి ఎదుర్కొని డిపాజిట్లు గల్లంతు చేసుకున్నా, తన ఓటు బ్యాంక్ మాత్రం పదిలంగానే ఉంచుకున్నారు. ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ ఆయన చుట్టూ ప్రతి పక్షాల రాజకీయం సాగేలా చేసి ఉన్నాయి. బీజేపీ, ప్రజా కూటమి వర్గాలు ఇప్పటికే ఆయనతో మంతనాల్లో మునిగారు. తమతో అంటే తమతో కలిసి నడవాలని, అవసరం అయితే, నేతృత్వం పగ్గాలు లేదా, సీఎం అభ్యర్థితత్వం అప్పగించే విధంగా సంప్రదింపులు సాగి ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి సైతం విజయకాంత్‌కు స్వయంగా ఆహ్వానం పలకడం చర్చకు దారి తీసింది. విజయకాంత్ కరుణానిధి పిలుపుపై ఇంత వరకు స్పందించ లేదని చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయం తన చుట్టూ తిరుగుతుండటంతో ఆచీ తూచీ అడుగులు వేయడానికి కెప్టెన్ సిద్ధమయ్యారు. ఇందుకు తగ్గ ఉపదేశాలను పార్టీ వర్గాలకు ఇచ్చి ఉన్నారు. అదే సమయంలో, బీజేపీ లేదా ప్రజా కూటమితో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్న పక్షంలో సీఎం కావాలన్న తన ఆశ నెర వేరుతుందా..? అన్న అంశాన్ని పరిగణించి, అందుకు తగ్గ రహస్య సర్వేకు సిద్ధ పడ్డట్టు సమాచారం. ఇక,డీఎంకే విషయంలో ప్రస్తుతం తాను అనుసరిస్తున్న బాణిని ఇలాగే కొనసాగించేందుకు నిర్ణయించి ఉన్నారు. ఎన్నికల నాటి పరిస్థితుల మేరకు మనస్సు మార్చుకుని డీఎంకేతో అధికారంలో వాటాకు పట్టుబడితే ఎలా ఉంటుందో...? అన్న కోణంలోనూ ఈ కరుప్పు ఎంజీఆర్ ఆలోచనలో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎంకేకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో వ్యవహరించి, ఇప్పుడు అదే పార్టీతో కలసి నడిచిన పక్షంలో ఎదురయ్యే నష్టాల్ని కూడా పరిగణలోకి తీసుకునే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తల నిర్ణయం మేరకు తన తుది నిర్ణయం ప్రకటించే విధంగా పయనంలో ఉన్న విజయకాంత్, ప్రజా కూటమికి ఎలాంటి హామీ ఇవ్వన్నట్టుగా, బీజేపీతో స్నేహ పూర్వక పలకరింపు మాత్రమే సాగినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. ఇక, తమ ‘కెప్టెన్’ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ సారథిగా వ్యవహరించి కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. -
డిప్యూటీ ఇస్తే ఓకే
సాక్షి, చెన్నై : డిప్యూటీ సీఎం పదవి తమకు ఇస్తే డీఎంకేతో దోస్తీకి సిద్ధమన్న సంకేతాలను డీఎండీకే పంపింది. డీఎండీకే అధినేత విజయకాంత్ డీఎం కే దూతల వద్ద మౌనం వహిస్తుండటంతో ఆయ న సతీమణి ప్రేమలత రంగంలోకి దిగారు. డీ ఎంకేను చిక్కుల్లో పడే స్తూ తమకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే పొత్తుకు ఓకే అన్న మెలిక పెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారం లక్ష్యంగా డీఎంకే కుస్తీ పడుతోంది. ప్రజల్ని ఆకర్షించే రీతిలో దూసుకెళుతోంది. ఇప్పటికే ఆ పార్టీ దళపతి, కోశాధికారి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలో మూడు విడుతలుగా నియోజకవర్గాల్లో పర్యటించారు. వినూత్న శైలిలో సాగుతున్న ఆయన పర్యటనకు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం అదేబాటలో మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి, కరుణానిధి గారాల పట్టి కనిమొళి పర్యటనకు సిద్ధమయ్యారు. తమతో దోస్తీకి రాజకీయ పక్షాలు ముందుకు రాకపోవడం డీఎంకేకు మింగుడు పడటం లేదు. తమకు వ్యతిరేకంగా ఎండీఎంకే పావులు కదిపి ప్రజా కూటమిని ఏర్పాటు చేసి ఉండటాన్ని తీవ్రంగా పరిగణించి ఉన్న డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆ కూటమిని చీల్చేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో కనీస ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే నేత విజయకాంత్‌ను ఎలాగైనా సరే తమతో కలిసి అడుగులు వేయించేందుకు కుస్తీలు పడుతున్నారు. దళపతి ఆదేశాల మేరకు విజయకాంత్‌తో సన్నిహితంగా మెలుగుతున్న పలువురు డీఎంకే వర్గాలు, మత పెద్దలు రంగంలోకి దిగి ఉన్నారు. విజయకాంత్‌తో ఇప్పటికే పలు దఫాలుగా దూతలు సంప్రదింపులు జరిపి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. మౌనం వహించిన విజయకాంత్ చివరకు అంతా ప్రేమలతే అంటూ తన సతీమణికి పొత్తు బాధ్యతను అప్పగించినట్టు సమాచారం. రంగంలోకి దిగిన ప్రేమలత డీఎంకేను ఇరకాటంలో పెట్టే రీతిలో తన నిర్ణయాన్ని వెల్లడించినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. తమకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంతోపాటు, తాము కోరిన సీట్లను తప్పనిసరిగా ఇచ్చేందుకు అంగీకరిస్తే దోస్తికి సిద్ధమని, మళ్లీమళ్లీ సంప్రదింపులు అనవసరమని తేల్చేసినట్లు తెలిసింది. డీఎంకే అధికారంలో వచ్చిన పక్షంలో సీఎంగా కరుణానిధి, డిప్యూటీ సీఎంగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టడం ఖాయం. ఏకంగా స్టాలిన్ పదవికి ఎసరు పెట్టే విధంగా ప్రేమలత వ్యవహరించి ఉండటం బట్టి చూస్తే డీఎంకే వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ముం దుగా ప్రజా కూటమి చీలిక, తదుపరి విజయకాంత్‌ను బుట్టలో వేసుకోవడం వంటి నిర్ణయాలతో స్టాలిన్ ముందుకు సాగుతున్నారు. కరుణానిధిని సీఎం కుర్చీ లో కూర్చోబెట్టేందుకు స్టాలిన్ తంత్రాల్ని ప్రయోగిస్తున్నట్లు చర్చ సాగుతోంది. -
కెప్టెన్ చిక్కేనా?
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు ఉన్న కనీస ఓటు బ్యాంక్ ఆయనకు ఓ వరం. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ ఆయన చుట్టూ పార్టీలు తిరగక తప్పడం లేదు. ప్రస్తుతం విజయకాంత్ చుట్టూ మూడు పార్టీలు ప్రదక్షిణ చేసే పనిలో పడ్డారు. ప్రజా కూటమిలోకి ఆయన్ను ఆహ్వానించడమే లక్ష్యంగా రంగంలోకి వైగో దిగారు. చెన్నై : గతంలో ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొన్న విజయకాంత్ పది శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్నారు. దీంతో ఆయనకు 2011 అసెంబ్లీ ఎన్నికల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. చివరకు అన్నాడీఎంకేతో జత కట్టి ఎవ్వరూ ఊహించని రీతిలో ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. ఆ పార్టీతో ఏర్పడ్డ విబేధాలతో బయటకు వచ్చి, చివరకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పక్షాన చేరారు. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా తన ఓటు బ్యాంక్‌ను మాత్రం పదిలం చేసుకున్నారు. ఈ ఓటు బ్యాంకే ప్రస్తుతం విజయకాంత్ చుట్టూ పార్టీలు తిరిగేలా చేస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ ఓటు బ్యాంక్ తమకు కలసి వస్తాయన్న ఆశాభావంతో తొలుత డీఎంకే వర్గాలు తీవ్రంగానే ఆయన్ను లాగే యత్నం చేశాయి. అయితే, విజయకాంత్ నోరు మెదపలేదు. ఎన్నికల సమయానికి ఆయన తమ వైపునకు తప్పకుండా వస్తారన్న ఆశాభావం డీఎంకే వర్గాల్లో ఉన్నా, ఇటీవలి పరిణామాలు కంగు తినిపించేలా చేస్తున్నాయి. ప్రజా కూటమి : ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఎంఎంకే నేత జవహరుల్లా, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ఒకే వేదిక మీదుగా వచ్చి ప్రజా కూటమిని ప్రకటించారు. ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న ఈ కూటమి ఎన్నికల కూటమిగా అవతరిస్తుందన్న ధీమాను పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈ కూటమిలోకి డీఎండీకే నేత విజయకాంత్, టీఎంసీ నేత జీకే వాసన్‌లను ఆహ్వానించేందుకు కసరత్తులు సాగాయి. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి విజయకాంత్‌తో భేటీ కావడం ప్రజా కూటమి వర్గాలకు షాక్ ఇచ్చినట్టైంది. బీజేపీ వైపు ఎక్కడ విజయకాంత్ అడుగులు వేస్తారోనన్న ప్రశ్న బయలు దేరడంతో వారికి చిక్కకుండా విజయకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు ఎండీఎంకే నేత వైగో రంగంలోకి దిగారు. రంగంలోకి వైగో: విజయకాంత్‌ను బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కలిసిన నేపథ్యంలో ప్రజా కూటమికి ఎక్కడ బలం త గ్గుతుందోనన్న ఉత్కంఠ ఆ కూటమి నాయకుల్లో బయలు దేరింది. ఇప్పటికే విజయకాంత్‌తో సీపీఎం నేత రామకృష్ణన్ సంప్రదింపులు జరిపారు. తాజాగా ఎండీఎంకే నేత వైగో రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. విజయకాంత్ , వైగోల మధ్య అన్నదమ్ముల్లా సాన్నిహిత్యం ఉండడంతో వారి సంప్రదింపులకు రంగం సిద్ధం అవుతోంది. లోక్ సభ ఎన్నికల అనంతరం బీజేపీ చూసిన చిన్న చూపును విజయకాంత్‌కు గుర్తు చేయడం, ఇచ్చిన హామీని విస్మరించి, చేసిన మోసాన్ని , ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాల్ని విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లి ఆయన్ను ప్రజా కూటమిలోకి ఆహ్వానించే విధంగా ప్రయత్నాలకు వైగో కార్యచరణ సిద్ధం చేశారు. దీంతో విజయకాంత్ చుట్టూ కూటమి రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి. ఈ దృష్ట్యా, విజయకాంత్ ఎవరికి చిక్కుతారోనన్నది మాత్రం మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందే. లేని పక్షంలో గతంలో వలే తాను ఎవరికీ చిక్కను అంటూ ఒంటరి నినాదాన్ని అందుకున్నా, అందుకునే అవకాశాలూ ఎక్కువే. -
నేనొక్కడినే..
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని ఢీ కొట్టేందుకు డీఎండీకే అధినేత, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ రెడీ అవుతున్నారు. అయితే, సభలో ఆయన ఒక్కడే ప్రధాన ప్రతి పక్షానికి కేటాయించిన సీట్లలో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇందుకు కారణం, డీఎండీకే ఎమ్మెల్యేల సస్పెన్షన్ కొనసాగింపు పర్వమే. చెన్నై : అన్నాడీఎంకేతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనడంతో డీఎండీకే అధినేత విజయకాంత్‌కు అదృష్టం కలసి వచ్చిందని చెప్పవచ్చు. డీఎంకే పతనంతో ప్రధాన ప్రతి పక్షనేతగా అవతరించిన విజయకాంత్ తన స్టంట్‌ను అధికార పక్షం మీద చూపించి చావు దెబ్బ తినాల్సి వచ్చింది. పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారారు. కీలక నేత బన్రూటి రామచంద్రన్ ఏకంగా పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో 29గా ఉన్న డీఎండీకే సభ్యుల సంఖ్య బన్రూటి రామచంద్రన్ రాజీనామాతో 28కి తగ్గింది. ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని అన్నాడీఎంకేకు అప్పగించుకోవాల్సి వచ్చింది. ఇక, రెబల్స్ రూపంలో మరో ఎనిమిది తగ్గాక తప్పలేదు. ఈ రెబల్స్ డీఎండీకే చిహ్నం మీద గెలిచినా, అసెంబ్లీలో మాత్రం అన్నాడీఎంకే సభ్యులతో కలసి కూర్చుంటూ వారితో కలిసి పోయారు. చివరకు తనతో పాటుగా 20 మంది సభ్యుల్ని మాత్రం విజయకాంత్ రక్షించుకోగలిగారు. అలాగే, అధికార అన్నాడీఎంకేతో ఏర్పడ్డ వైర్యం ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ కొన్నాళ్లు సభ నుంచి సస్పెండ్ కాక తప్పలేదు. ఏ రోజున సస్పెండ్ అయ్యారో, అప్పటి నుంచి సభలోకి అడుగు పెట్టడం మానేశారు. సభా సమయాల్లో అసెంబ్లీ ఆవరణలోని రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లడంతో సరి. తమ అధినేత అసెంబ్లీకి దూరంగా ఉండటంతో తమ సత్తా ఏమిటో అధికార పక్షానికి రుచి చూపించేందుకు ఆయన సేనలు వచ్చి రాని స్టంట్లు చేసి ఇరకాటంలో పడ్డారు. ఒక్కడే : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమ రెబల్స్‌తో ఫైట్ డీఎండీకే సభ్యులకు శిక్ష పడేలా చేశాయి. ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించి స్పీకర్ ధనపాల్ సభ్యులందర్నీ సస్పెండ్ చేశారు. ఆ సమావేశాల కాలంతో పాటుగా తదుపరి సమావేశాల కు కూడా సస్పెన్షన్ శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి. అయితే, ఆ ఘటన జరిగిన రోజు సభలో విజయకాంత్ లేరు. దీంతో సస్పెన్షన్ ఆయనకు వర్తించదు. ఈ పరిస్థితుల్లో ఈనెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో సభలో ప్రధాన ప్రతి పక్షం ఉండేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. విజయకాంత్ సభకు రాని పక్షంలో, ఇక వారికి కేటాయించిన సీట్లన్నీ ఖాళీయే అన్న వ్యంగ్యాస్త్రాలు బయలు దేరి ఉన్నది. ఈ సమయంలో నేనొక్కడ్నే అంటూ సభలో అడుగు పెట్టేందుకు విజయకాంత్ సిద్ధం అయ్యారు. అసెంబ్లీలో ఒక్కడ్నే ..ఒంటరిగా అధికార పక్షాన్ని చీల్చి చెండాడుతా..? అంటూ మరో మారు సభ వేదికగా అన్నాడీఎంకేతో ఢీకి రెడీ అవుతున్నారు. తన వెంట ఎమ్మెల్యేలు లేకున్నా, ఒక్కడ్నే చాలు అసెంబ్లీలో అడుగు పెడుతా..! అని విజయకాంత్ స్పష్టం చేస్తున్నారు. దీంతో సభలో మరో మారు అధికార పక్షం వర్సెస్ విజయకాంత్ మధ్య ఆసక్తికర సన్నివేశాలు వివాదాలు చోటు చేసుకోవడం ఖాయం. అదే సమయంలో విజయకాంత్ దూకుడుకు కళ్లెం వేయడానికి మేమూ రెడీ అని రెబల్స్ వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. -
మద్యంపై పోరు
రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం విధించాలని కోరుతూ వేలాది కార్యకర్తల సమక్షంలో డీఎండీకే అధినేత విజయకాంత్ గురువారం నిరాహారదీక్ష చేపట్టారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యం నిషేధం విధించాలనే డిమాండ్‌పై రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నీ గళమెత్తిన నేపథ్యంలో డీఎండీకే కొన్ని రోజుల క్రితం మానవహారంతో తన నిరసన ప్రకటించింది. మద్యంపై పోరులో భాగంగా చెన్నై కోయంబేడులోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద గురువారం ఉదయం సతీమణి ప్రేమలతతో కలిసి కెప్టెన్ నిరాహారదీక్షలు ప్రారంభించారు. వేలాది మంది కార్యకర్తలు రాష్టం నలుమూలల నుంచి తెల్లవారుజామునే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం ముందు భాగంగా భారీగా నిర్మించిన వేదికపై పార్టీ యువజన విభాగం కార్యదర్శి ఎల్కే సుధీష్ సహా ముఖ్యనేతలు కూడా కూర్చున్నారు. మద్య నిషేధం నినాదాలతో కూడిన ప్లకార్డులను వేదిక చుట్టూ అలంకరించారు. ఉదయం 9 గంటలకు నిరాహారదీక్షలు ప్రారంభం కాగా 9.20 గంటలకు విజయకాంత్ వేదికపైకి చేరుకున్నారు. ప్రజలే బుద్ధి చెప్పాలి: విజయకాంత్ ప్రజల జీవితాలను పణంగాపెట్టి మద్యంపై వచ్చే ఆదాయంతో బతుకున్న ఈ ప్రభుత్వానికి అదే ప్రజలు బుద్ధి చెప్పాలని విజయకాంత్ పిలుపునిచ్చారు. పాఠశాలలు, కాలేజీలు, దేవాలయాలు, ప్రార్థనామందిరాలు, బస్స్టేషన్లు అనే విచక్షణ లేకుండా టాస్మాక్ దుకాణాలకు అనుమతులిచ్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వ ధనదాహానికి మహిళలు, విద్యార్థులు, బాలురు సైతం మద్యానికి బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కంటే మద్యం అమ్మకాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత నిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. మద్యం వద్దంటూ మహిళలు సాగిస్తున్న పోరు, ప్రజా, విద్యార్థి సంఘాల ఆందోళనలపై ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. టాస్మాక్ దుకాణాల నిర్వహణలో అక్కడి సిబ్బందే అశువులు బాస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. మద్యం నిషేధం కోసం సాగుతున్న పోరాటంలో రాజకీయాలకు అతీతంగా అందరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఏం చేద్దాం!
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకేకు బీజేపీ దగ్గర కావడంతో తదుపరి తమ కార్యచరణ మీద డీఎండీకే అధినేత విజయకాంత్ దృష్టి కేంద్రీకరించారు. పొత్తుల కసరత్తుల్లో భాగంగా ఆదివారం పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించి పార్టీ వర్గాలతో సమాలోచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కలసి పయనించిన డీఎండీకే నేత విజయకాంత్‌కు అదృష్టం కలసి వచ్చి ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన విషయం తెలిసిందే. తదుపరి పరిణామాలతో ఆ పార్టీతో పెంచుకున్న వైర్యం లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు వైపుగా అడుగులు వేయించింది. ఆ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుతో భంగ పడ్డ విజయకాంత్ బీజేపీకి విధేయుడిగానే ఉంటూ వచ్చారని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ కూటమిలో లేనన్నట్టుగా వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, బీజేపీ కూటమికి సీఎం అభ్యర్థిగా తానే ఉంటానన్న భావనలో ఉంటూ వచ్చిన విజయకాంత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై పర్యటన ఆలోచనలో పడేసింది. అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ఇంటికి నరేంద్ర మోదీ వెళ్లడం విజయకాంత్‌కు పెద్ద షాక్కే. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, అన్నాడీఎంకేల మధ్య పొత్తు ఖరారైనట్టుగా సంకేతాలు రావడంతో తదుపరి తన కార్యచరణ మీద దృష్టి పెట్టే పనిలో విజయకాంత్ పడ్డారు. ఇందుకోసం అత్యవసరంగా ఆదివారం పార్టీ కార్యవర్గ సమావేశానికి పిలుపునిచ్చారు. సమాలోచన : కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో ఉదయం పది గంటల కు విజయకాంత్ నేతృత్వంలో సమావేశం ఆరంభం అయింది. ఇందులో బీ జేపీతో ఇక కలిసి పనిచేయడం కష్టమేన న్న విషయాన్ని గ్రహించి ,ప్రత్యామ్నా య పొత్తుల అన్వేషణపై పార్టీ వర్గాల అభిప్రాయాల్ని విజయకాంత్ సేకరించి నట్టు సమాచారం. ప్రధానంగా ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, వీసీకేలతో కలసి తన నేతృత్వంలో కూటమిని ఏర్పాటు చేయడం లేదా, డీఎంకే కూటమిలోకి వెళ్లడమా..? అన్న అంశంపై చర్చ సాగి నట్టు తెలిసింది. మెజారిటీ శాతం మం ది గతంలో వలే దూకుడు నిర్ణయాలు వ ద్దు అని, ఆలోచించి పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళదామంటూ విజయకాంత్ దృష్టికి తీసుకెళ్లినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ సమావేశంలో ముందుగా భారత రత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ మౌనం పాటించారు. తీర్మానాలు : ఈ సమావేశంలో పొత్తుల కసరత్తు చర్చకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినా, చివరకు కొన్ని తీర్మానాలు చేసి మీడియాకు ప్రకటించారు. అలాగే, త మ అధినేత విజయకాంత్ బర్త్‌డే వేడుక లు నెల రోజుల పాటుగా సాగనున్న నేపథ్యంలో ప్రజా హిత కార్యక్రమాలకు సిద్ధం అయ్యారు. ఇక, మద్యం ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయిం చారు. ఆగస్టు 15లోపు రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధంపై తన నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మానవ హారంలో పాల్గొన్న తమ పార్టీ వర్గాలపై పోలీసుల లాఠీ చార్జ్‌ను తీవ్రంగా ఖం డించారు. నాగపట్నం, తంజావూరు, తిరువారూర్‌లో మిథైన్ తవ్వకాలకు శాశ్వత నిషేధం విధించాలని, గ్రానైట్, రాళ్ల క్వారీలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే, భారత రత్న అబ్దుల్ కలాం అంత్యక్రియలకు సీఎం జయలలిత గైర్హాజరుపై తీవ్రంగా మండి పడుతూ ప్రత్యేక తీర్మానం చేశారు. -
మానవహారం భగ్నం
సాక్షి, చెన్నై : సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో డీఎండీకే తలపెట్టిన మానవహారం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఆ పార్టీ కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు లాఠీలు ఝుళిపించారు. ఆ పార్టీ అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, యువజన నేత సుధీష్‌తో పాటుగా నాయకుల్ని అరెస్టు చేశారు. టాస్మాక్‌లకు వ్యతిరేకంగా గురువారం కూడా నిరసనలు సాగాయి. కాగా, గాంధేయ వాది శశి పెరుమాళ్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబీకులు అంగీకరించారు. శుక్రవారం అంత్యక్రియలు జరగనున్నాయి. టాస్మాక్‌లకు వ్యతిరేకంగా గాంధేయవాది శశిపెరుమాళ్ ఆత్మతర్పణంతో రాష్ట్రంలో ఉద్యమం రాజుకున్న విషయం తెలిసిందే. సంపూర్ణ మద్యనిషేధం నినాదంతో రాష్ట్రంలో ఆందోళనలు ఉధృతం అయ్యాయి. విద్యార్థులు, మహిళలు, వికలాంగులు, కొన్ని పార్టీలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతకు దారి తీస్తూ వస్తున్నాయి. టాస్మాక్లపై దాడులు పెరిగాయి. సేలంలో జరిగిన దాడితో టాస్మాక్ సిబ్బంది సెల్వం బలి కావడంతో ఆందోళనలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుంది. గురువారం చోటు చేసుకున్న పరిణామాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. నాగుర్ కోవిల్లో టాస్మాక్ దుకాణంపై దాడికి యత్నించి విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించి చెదరగొట్టారు. పచ్చయప్ప కళాశాల విద్యార్థులు తమ కళాశాల ఆవరణలో దీక్ష చేపట్టడంతో దాన్ని భగ్నం చేయడానికి యత్నించి విఫలం అయ్యారు. అంబత్తూరులోని టాస్మాక్ గోడౌన్‌కు తాళం వేయడానికి యత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్టు చేశారు. నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో పలు చోట్ల నిరసనలు సాగగా, వారందర్నీ పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఇలా పలు చోట్ల నిరసనలకు యత్నించిన వాళ్లందర్నీ అరెస్టు చేయడం, తిరగబడ్డ పక్షంలో లాఠీలు ఝుళిపించే పనిలో పడ్డారు. ఇక, ప్రధాన ప్రతి పక్షం డీఎండీకే తలబెట్టిన మానవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. చేపాక్కంలో వికలాంగులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ సందర్శించి మద్దతు తెలియజేశారు. మానవహారం భగ్నం : టాస్మాక్‌లకు వ్యతిరేకంగా డీఎండీకే నేత విజయకాంత్ మానవహారానికి పిలుపునిచ్చారు. చెన్నై కోయంబేడు నుంచి సచివాలయం వరకు ఈ మానవ హారం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరారు. తొలుత అనుమతి ఇచ్చినట్టు ఇచ్చి, మళ్లీ వెనక్కు తీసుకోవడంతో పోలీసులకు వ్యతిరేకంగా కోర్టును విజయకాంత్ ఆశ్రయించారు. కోర్టు విచారణను ఈనెల పదో తేదికి వాయిదా వేయడంతో ముందుగా తీసుకున్న నిర్ణయం మేరకు మానవహారానకి ఆయన సిద్ధం అయ్యారు. సాయంత్రం కోయంబేడు నుంచి - సచివాలయం మీదుగా ఆ పార్టీ వర్గాలు అక్కడక్కడ గుమిగూడాయి. మరి కాసేపట్లో మానవహారం ఆరంభం కానున్న సమయంలో పోలీసులు రంగంలోకి దిగి భగ్నం చేశారు. విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, యువజన నేత సుధీష్లతో పాటుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల్ని బలవంతంగా అరెస్టు చేసి , బస్సులో ఎక్కించారు. దీంతో ఆగ్రహించిన ఆ పార్టీ వర్గాలు బస్సును అడ్డుకోవ డంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. దీంతో ఆ పార్టీ వర్గాలపై పోలీసులు తమ ప్రతాపం చూపించారు. కన్పించిన వాళ్లందర్నీ చితక్కొట్టి, చెదరగొట్టాడు. దీంతో ఆ పరిసరాల్లో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపులోకి వచ్చినానంతరం విజయకాంత్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లారు. అలాగే, పలు మార్గాల్లో గుమిగూడిన ఆ పార్టీ వర్గాలను ఎక్కడికక్కడ చెదరగొట్టారు. కాగా, తమ మానవహారం భగ్నం చేయడానికి లాఠీలు ఝుళిపించారని, ఆందోళన కారుల్ని అణగదొక్కేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రేమలత విజయకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, విజయకాంత్ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో పలు చోట్ల ఆ పార్టీ వర్గాలు ఆందోళన లకు దిగాయి. కాగా, దీక్ష భగ్నం చేస్తూ పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో విజయకాంత్ నేరుగా బస్సులోకి ఎక్కేస్తూ ప్రదర్శించిన హావా బావాలు వ్యంగాస్త్రాలకు అపహస్యానికి గురికాక తప్పలేదు. నేడు అంత్యక్రియలు : గాంధేయ వాది శశిపెరుమాళ్ మృతదేహాన్ని తీసుకునేందుకు ఆయన కుటుంబీకులు అంగీకరించారు. గాంధేయ వాది శశిపెరుమాళ్ కుటుంబం మృతదేహాన్ని తీసుకోకుండా దీక్ష చేపడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఉదయం ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత రామకృష్ణన్‌లు శశిపెరుమాళ్ కుటుంబాన్ని పరామర్శించారు. వారిని బుజ్జగించి మృత దేహాన్ని తీసుకునేందుకు అంగీకరింప చేశారు. అయితే, తాము చేపట్టిన దీక్ష మాత్రం అంత్యక్రియల అనంతరం విరమిస్తామని ఆయన కుటుంబీకులు స్పష్టం చేశారు. దీంతో శుక్రవారం శశిపెరుమాళ్ మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. దీంతో సేలంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు. మూడు వేల దుకాణాల మూత: రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదం ఊపందుకుని ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం అంతర్మథనంలో పడింది. టాస్మాక్ మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించి ప్రజల్ని బుజ్జగించే కార్యాచరణలో పడ్డట్టు సమాచారం. రాష్ట్రంలో స్కూళ్లు, ఆలయాలు, జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మూడు వేల మద్యం దుకాణాలు ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు అందుకు తగ్గ నివేదికను సీఎం జయలలితకు పంపినట్టు తెలిసింది. దీనిని పరిగణలోకి తీసుకున్న సీఎం జె జయలలిత ఏ క్షణానైనా ప్రకటన వెలువరించ వచ్చన్న సంకేతాలు ఉన్నాయి. మద్య నిషేధం దశల వారీగా అమలు చేయడంలో భాగంగా ఈ దుకాణాలను మూసి వేస్తూ, ప్రజల్లో బయలు దేరిన ఆక్రోశాన్ని చల్లార్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
ప్రజల్లోకి కెప్టెన్
డీఎండీకే అధినేత, ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఈనెల 20 నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. కాగా, ఈ పర్యటనల్లో తానే బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసుకోబోతున్నట్టు సమాచారం. సాక్షి, చెన్నై :రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించిన విజయకాంత్ ప్రజల పక్షాన నిలబడతానంటూ అధికార అన్నాడీఎంకేతో వైర్యాన్ని పెంచుకుని కష్టాలను కొనితెచ్చుకున్న విషయం తెలిసిందే. అధికార పక్షం కేసుల మోత ఓ వైపు, అనారోగ్య సమస్యలు మరో వైపు వెరసి కొన్నాళ్లు ప్రజల్లోకి వెళ్లడం మానుకోవాల్సిన పరిస్థితి. తాజాగా, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా పార్టీలు కసరత్తులు వేగవంతం చేయడాన్ని విజయకాంత్ పరిగణించారు. తాను బీజేపీ కూటమి నుంచి బయటకు వెళ్తున్నట్టు ఇంతవరకు ఆయన స్పష్టం చేయలేదు. ఆయన తమ కూటమి అంటూ బీజేపీనేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో అపాయింట్మెంట్ లభించడం, బీజేపీ పెద్దలతో మంతనాలు ముగించుకున్న విజయకాంత్ ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు కార్యచరణ సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఆగస్టులో తన జన్మదినం రానున్నడాన్ని ఆసరాగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. 20 నుంచి పర్యటన : తన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదరిక నిర్మూల పథకానికి శ్రీకారం చుట్టడంతో పాటుగా పనిలో పనిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు. అధికార పక్షం వైఫల్యాల్ని ఎత్తి చూపుతూ, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని మెప్పించే విధంగా పర్యటన సాగించేందుకు ఆయన నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రత్యేకంగా తమ నేత విజయకాంత్‌ను పలకరించడం, ఆయన ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించడంతో ఇక, తమ నేతకు బీజేపీ పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టేనన్న ఆశాభావంలో పడ్డారు. విజయకాంత్ సాగించనున్న రాష్ట్ర పర్యటనలో బీజేపీ కూటమి సీఎం అభ్యర్థి తమ నేతే అన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డీఎండీకే వర్గాలు సిద్ధమవుతోండడం గమనార్హం. ఇక, విజయకాంత్ పర్యటన ఆగస్టు 20వ తేదీని గుమ్మిడిపూండి నుంచి ఆరంభం కానున్నది. మరుసటి రోజు కాంచీపురంలో సాగనున్నది. అన్ని జిల్లాల్లో బహిరంగ సభల రూపంలో భారీ జన సమీకరణ, తమ బలం, సత్తా చాటే విధంగా విజయకాంత్ పర్యటనకు డీఎండీకే వర్గాలు ఉరకలు పరుగులు తీస్తున్నాయి. -
పేరు మార్చండి
అమ్మ టాస్మాక్గా మార్చాలని విజయ్‌కాంత్ చురక నామకరణానికి పట్టు సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని అన్ని టాస్మాక్ మద్యం దుకాణాల పేర్లను మార్చాలని డీఎండీకే అధినేత, ప్రతి పక్ష నేత విజయకాంత్ డిమాండ్ చేశారు. ఈ దుకాణాలకు ‘అమ్మ’టాస్మాక్ అని నామకరణ చేయాలని హితవు పలికారు. రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతున్న విషయం తెలిసిందే. మద్య నిషేధం లక్ష్యంగా కొన్ని పార్టీలు గళం విప్పాయి. ఇందులో డీఎండీకే కూడా ఉంది. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదంతో ముందుకెళ్తోన్న ఆ పార్టీ తాజాగా, ఆ దుకాణాలకు అమ్మ(జయలలిత) పేరు పెట్టాలన్న డిమాడ్‌ను తెర మీదకు తెచ్చింది. ఈ విషయంగా డీఎండీకే అధినేత విజయకాంత్ రెడ్ హిల్స్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. విద్యా ప్రదాత కామరాజర్ జయంతిని పురస్కరించుకుని తమ వంతుగా పార్టీ వర్గాలు సేవలు అందించాయని వివరించారు. తాజగా ఇక్కడ పేదలకు కుట్టు మిషన్లు, ఐరన్ బాక్సులు, హెల్మెట్ల పంపిణీ జరిగింద న్నారు. విద్యా ప్రదాత కామరాజర్ ప్రజల కోసం శ్రమించారని, పదవులు, పేరుకోసం ఏ మాత్రం కాదన్నారు. అయితే, ఇప్పుడున్న వాళ్లు పదవులు కాపాడుకోవడంతో పాటుగా తమ పేరు స్థిరం కావాలన్న కాంక్షంతో భజనల్ని అందుకుని ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎక్కడ చూసినా అమ్మ..అమ్మ....అబ్బో తెగ భజన చేస్తున్నారని చురకలు అంటించారు. ఏ టీవీ చూసినా అమ్మ, ఏ బోర్డు చూసినా అమ్మ ...ఇలా ప్రతి ఒక్కరూ ఆ అమ్మ భజనకే పరిమితం అవుతున్నారని, ఆ పథకం తమ అమ్మ ఘనత, ఈ పథకం తమ అమ్మ తీసుకొచ్చిందని జబ్బలు చరస్తున్నారని గుర్తు చేశారు. ఇంత హంగామా చేస్తూ, అమ్మ భజన చేస్తున్న వాళ్లు ,రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం దుకాణాలకు మాత్రం అమ్మ పేరు పెట్టడం మరచినట్టున్నారేనని ఎద్దేవాచేశారు. ఇకనైనా టాస్మాక్ మద్యం దుకాణాలకు అమ్మ టాస్మాక్ అని నామకరణం చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలంటూ హితవు పలికారు. -
మళ్లీ పేదరిక నిర్మూలన పథకం
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో డీఎండీకే నేతృత్వంలో పేదరిక నిర్మూలన పథకం మళ్లీ అమల్లోకి రానున్నది. రెండేళ్ల విరామ అనంతరం ఈ పథకానికి ఆగస్టులో శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు తగ్గ ఆదేశాలు పార్టీ జిల్లాల కమిటీలకు డీఎండీకే అధినేత విజయకాంత్ పంపి ఉన్నారు. సినీ నటుడిగా ఉన్న కాలం నుంచి తన బర్త్‌డేను పేదల సంక్షేమ దినంగా విజయకాంత్ జరుపుకుంటూ వస్తున్నారు. డీఎండీకే ఆవిర్భావం, ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించడంతో ప్రభుత్వాలు అమలు చేయకున్నా, తన పార్టీ నేతృత్వంలో ప్రత్యేక పథకం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. పేదల సంక్షేమ దినంను పేదరిక నిర్మూలన పథకంగా మార్చేశారు. 2012లో రాష్ట్ర వ్యాప్తంగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని విజయకాంత్ పర్యటించారు. ఈ పథకాన్ని అన్ని జిల్లాల పార్టీల నేతృత్వంలో అమలు చేయించి, పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగారు. అదే సమయంలో వేదికలెక్కి సీఎం జయలలితను టార్గెట్ చేసి విజయకాంత్, ఆయన ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు సాగించిన ప్రసంగాలు కోర్టుల చుట్టు తిరిగేలా చేశాయి. కోర్టు మెట్లు ఎక్కేందుకే సమయం ఎక్కువగా కేటాయించాల్సి రావడంతో రెండేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేయడంలో డీఎండీకే వర్గాలు వెనక్కు తగ్గాల్సి వచ్చింది. పేదరిక నిర్మూలన పథకం : ప్రతి జిల్లాలో తమ మీద పరువు నష్టం దావాలు దాఖలైనా, రోజుకో కోర్టుమెట్లు ఎక్కాల్సి వచ్చినా పార్టీని , కేడర్‌ను రక్షించుకుంటూ ముందుకు సాగే పనిలో విజయకాంత్ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రెండేళ్ల అనంతరం మళ్లీ పేదరిక నిర్మూలన పథకాన్ని పార్టీ నేతృత్వంలో అమలు చేయడానికి నిర్ణయించారు. ఈ పథకం మేరకు పార్టీ వర్గాలు ఏ మేరకు పేద ప్రజలకు పోటీలు పడి మరీ సంక్షేమ పథకాలు, అభివృది ్ధకార్యక్రమాలు చేపడుతాయో వాళ్లకే రానున్న ఎన్నికల్లో విజయకాంత్ సీట్లు కేటాయిస్తారన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఆగస్టులో విజయకాంత్ జన్మదినాన్ని పురస్కరించుకుని మళ్లీ ఈ పథకం అమలుకు చర్యలు చేపట్టారు. అన్ని జిల్లాల పార్టీ కార్యదర్శులకు ఇందుకు తగ్గ ఆదేశాలను విజయకాంత్ జారీ చేసి ఉన్నారు. ఆగస్టులో జిల్లాల వారీగా విజయకాంత్ పర్యటన సాగనున్నడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను వేగవంతం చేయాలని, పేద ప్రజల్ని ఆదుకునే రీతిలో సంక్షేమ కార్యక్రమాలకు కార్యచరణ సిద్ధం చేయాలని డీఎండీకే కార్యాలయం నుంచి కార్యదర్శులకు లేఖలు వెళ్లి ఉన్నాయి. దీంతో ఎన్నికలకు సిద్ధం అయ్యే రీతిలో ఆగస్టు నుంచి ఈ పథకం ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లేందుకు విజయకాంత్ సిద్ధమైనా, ఆ పార్టీ వర్గాలు పలు చోట్ల పెదవి విప్పే పనిలో పడ్డారు. ఇందుకు కారణం, ఇప్పటికే పార్టీ కోసం ఇళ్లు గుల్ల చేసుకున్న జిల్లాల కార్యదర్శులు ఆ పార్టీలో అధికం. ఇక రానున్న రోజుల్లో ఈ పథకం కోసం మరెంత వెచ్చించాల్సి వస్తుందోనన్న బెంగ వారిలో బయలుదేరి ఉన్నదట. -
అన్నాడీఎంకే + సీపీఐ
ఆర్కేనగర్లో పోటీకి అన్ని పార్టీలూ దూరమేనని సోమవారం తేటతెల్లమైంది. తమ అభ్యర్థిని పోటీకి పెట్టడంలేదని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, డీఎండీకే అధికారికంగా ప్రకటించాయి. అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత, సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ మధ్యనే ప్రధానపోటీ నెలకొంది. చెన్నై, సాక్షి ప్రతినిధి:శాసనసభ సభ్యత్వం లేకుండానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత ఆరు నెలల్లోగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సి ఉంది. అన్నాడీఎంకేకు పెట్టనికోట, చెన్నై కార్పొరేషన్ పరిధిలో ఉండడం వంటి కారణాలతో ఆర్కేనగర్ నుంచి పోటీచేయాలని ఆమె నిశ్చయించుకున్నారు. అమ్మ ఆదేశాల మేరకు ఆర్కేనగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేయగా ఉప ఎన్నిక భేరీ మోగింది. 2011లో ప్రభుత్వాన్ని చేపట్టడం, 2014లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం అన్నాడీఎంకే జైత్రయాత్ర కొనసాగడం, గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అమ్మ హవా తగ్గకపోవడం విపక్షాలకు మింగుడుపడడం లేదు. ఈ పరిస్థితిలో ఆర్కేనగర్ ఉప ఎన్నికలో పోటీచేయడంపై అన్ని పార్టీలూ ఆలోచనలో పడ్డాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ జైలుశిక్షకు గురైన కారణంగా ఖాళీ అయిన శ్రీరంగం నియోజకవర్గంలో విపక్షాలు పోటీచేసి అన్నాడీఎంకే చేతిలో బొక్కబోర్లాపడ్డాయి. ప్రస్తుతం ఆర్కేనగర్లో పోటీకి దిగినా శ్రీరంగం ఫలితాలు పునరావృతమవుతాని విపక్షాలు జంకాయి. ఆర్కేనగర్లో అమ్మపై పోటీకి దిగి ఓటమితో అప్రతిష్టను మూటగట్టుకోవడం మినహా మరే ప్రయోజనం ఉండదని పసిగట్టిన డీఎంకే పోటీచేయడం లేదని అన్నిపార్టీల కంటే ముందుగానే ప్రకటించేసింది. ఆ తరువాత వరుసగా పీఎంకే, ఎండీఎంకేలు పోటీకి దూరమని చెప్పుకున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు నెలరోజులుగా మల్లగుల్లాలు పడ్డాయి. కూటమి భాగస్వామైన డీఎండీకేపై ఆశలు పెంచుకున్న బీజేపీకి నిరాశే మిగిలింది. ఈసీ వల్లే పోటీకి దూరం నామినేషన్ గడువు మరో 24 గంటల్లో (10వ తేదీ) ముగుస్తుండగా మూడు పార్టీలూ నోరివిప్పాయి. ఆర్కేనగర్లో పోటీ పెట్టడం లేదని కాంగ్రెస్, బీజేపీ, డీఎండీకే సోమవారం అధికారికంగా ప్రకటించాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నందున, పారదర్శకంగా ఎన్నికలు జరిగే అవకాశం లేనందునే పోటీ కి దిగడం లేదనే ఒకేమాటను మూడుపార్టీలూ చెబుతున్నాయి. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీలే గెలవడం పరిపాటిగా మారిపోయిందని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. ఓటుకు నోటును అరికట్టితే పోటీకి సిద్ధమని తాను బహిరంగంగా ప్రకటించినా ఈసీ నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. ఆర్కేనగర్లో పోటీచేయడంలేదని ఆయన వివరించారు. తటస్థంగా వ్యవహరించాల్సిన ఈసీ అధికారపార్టీ వైపు మొగ్గుచూపుతున్నందునే పోటీకి దూరమైనట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలూ పోటీ పెట్టడం లేదని ప్రకటిస్తే ఎందుకని ఎవ్వరూ ప్రకటించలేదు, తనను మాత్రం పదే పదే నిలదీస్తున్నారని డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ నొచ్చుకున్నారు. అమ్మకు భయపడి ఆర్కేనగర్లో పోటీచేయడం లేదని కొందరు చేస్తున్న ప్రచారాన్ని విజయకాంత్ తీవ్రంగా ఖండిచారు. ఈసీపై నమ్మకం లేకనే పోటీ పెట్టడం లేదని వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే వర్సెస్ సీపీఐ అన్ని ప్రధానపార్టీలు పోటీ పెట్టడం లేదని స్పష్టం చేయడంతో అన్నాడీఎంకేకు సీపీఐ ప్రధాన ప్రత్యర్థి పార్టీగా మారింది. సీపీఐ అభ్యర్థిగా మహేంద్రన్ పోటీచేస్తుండగా, సీపీఎం మద్దతునివ్వనుంది. సోమవారం స్వతంత్య్ర అభ్యర్థులుగా మరో ఐదుగురు నామినేషన్ వేశారు. -
జయ ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ డీఎండీకే పిటిషన్
టీనగర్: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో డీఎండీకే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత నిర్దోషిగా విడుదలయ్యారు. దీంతో మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జయలలిత పదవి చేపట్టనున్నారు. ఇలావుండగా డీఎండీకే న్యాయవాది జీఎస్ మణి సుప్రీంకోర్టు లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో కర్ణాటక హైకోర్టు జయలలితను విడుదల చేస్తూ అందజేసిన తీర్పులో లోపాలు ఉన్నాయని తెలిపా రు. కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదా? హైకోర్టు తీర్పు సరైనదా? అనే విషయాన్ని సుప్రీంకోర్టు ఖరారు చేయాల న్నారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు జయలలిత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడానికి స్టే విధించాలని కోరారు. ఇదివరకే సంఘ సేవకుడు ట్రాఫిక్ రామసామి ఇదే తర హా పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసివుండడం గమనార్హం. -
పొత్తుకు ఎదురు చూపు
సాక్షి, చెన్నై: డీఎండీకేతో పొత్తుకు తాను ఎదురు చూపు ల్లో ఉన్నట్టు డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అన్నారు. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ వైపుకు తిప్పుకునేందుకు డిఎం కే తీవ్రంగానే ప్రయత్నిస్తున్నది. ఈ పరిస్థితుల్లో రెండు రోజుల క్రితం మేఘదాతులో డ్యాంల నిర్మాణం అడ్డుకట్ట నినాదంతో డిఎంకే అధినేత కరుణానిధిని విజయకాంత్ కలుసుకున్నారు. ఈ భేటీ అనంతరం కరుణానిధి పరోక్ష వ్యాఖ్య చేశారు. డీఎండీకేను తమ వైపుకు తిప్పుకునేలా ఇది కూటమిగా ఆవిర్భవిస్తే బాగుంటుం దన్నట్టు స్పందించారు. ఇందుకు విజయకాంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అదే సమయంలో విజయకాంత్ ఢిల్లీలో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులతో మంతనాల్లో మునగడం చర్చకు దారి తీసింది. దీంతో డీఎండీకే ఎవరితో పొత్తు అన్నట్టుగా రాష్ర్టంలో ప్రచారం బయలు దేరి ఉన్నది. ఈ విషయంగా డిఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ ఓ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. ఎదురు చూపుల్లో : సినీ నటుడిగా ఉన్న సమయంలో డిఎంకే అధినేత కరుణానిధితో విజయకాంత్ సన్నిహితంగా ఉండే వారని గుర్తు చేశారు. విజయకాంత్ వివాహం కరుణానిధి అధ్యక్షతన, దివంగత నేత మూపనార్ నేతృత్వంలో జరిగిందని వివరించారు. కరుణానిధిని ఓ వేడుకకు ఆహ్వానించిన విజయకాంత్ అతి విలువైన కానుకను ఇచ్చారని, అది నేటికి డిఎంకే ట్రెజరీలో ఉందని పేర్కొన్నారు. విజయకాంత్‌ను తాను సోదరిగా భావించి గౌరవిస్తానన్నారు. తామిద్దరం పలు సందర్భాల్లో ఎదురు పడ్డప్పుడల్లా తప్పని సరిగా మాట్లాడుకోవడం జరిగిందని కొన్ని సంఘటనలను గుర్తు చేశారు. సోదరుడు, స్నేహపూర్వకంగా మెలగాలని ఎదురు చూస్తున్నామని పేర్కొంటూ, డిఎంకే కూటమిలోకి డీఎంకే రావాలన్న ఆకాంక్ష తనకు ఉందన్నారు. ఆ ఎదురు చూపుల్లోనే ఉన్నాం అని, తరచూ ఎదురు అవతున్న హఠాత్ సంఘటనల పలకరింపు వలే, ఆ పొత్తు సాధ్యం కావాలని ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. -
విజయకాంత్‌కు జరిమానా
సాక్షి, చెన్నై: డీఎండీకే వర్గాల్ని పరువు నష్టం దావాలు వెంటాడుతున్నాయి. మంగళవారం ఆ పార్టీ అధినేత, ఆయన భార్య విజయకాంత్, ప్రేమలత మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. రూ.24 వేలు జరిమానా విధించడంతో పాటుగా తమ పిటిషన్లను సుప్రీం కోర్టుకు మార్చేం దుకు 15 రోజుల గడువును కోర్టు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలిసి ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్షం హోదాను డీఎండీకే దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, అధికార పక్షంతో కన్నా, ప్రజల పక్షాన నిలబడుతామంటూ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న విజయకాంత్, ఆయన సేనలు అసెంబ్లీ వేదికగా జబ్బలు చరిచి కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. అధికార పక్షానికి వ్యతిరేకంగాతీవ్ర విమర్శలు ఆరోపణలు గుప్పించే పనిలో విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. దీంతో డీఎండీకే వర్గాలపై అధికార పక్షం కన్నెర్ర చేసింది. విజయకాంత్‌పై రాష్ర్టంలోని అన్ని జిల్లా కోర్టుల్లోనూ పరువు నష్టం దావాలు దాఖలయ్యాయి. అలాగే, ఆయన సతీమణి ప్రేమలత, మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనేక కోర్టుల్లో దావాలు కొనసాగుతున్నాయి. ఈ కేసుల విచారణలు డీఎండీకే వర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కోర్టులు వారెంట్లు దాఖలు చేసిన సందర్భాలు అనేకం. చివరకు ఈ కేసులో విసిగి వేసారిన విజయకాంత్ అండ్ బృందం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. కోర్టుకు : తమ మీదున్న కేసుల విచారణలు నిలుపుదల చేయాలని, మాజీ సీఎం, మంత్రుల తరపున ప్రభుత్వ న్యాయవాదులు దాఖలు చేసిన ఈ దావాలను పరిగణనలోకి తీసుకోకూడదని తమ పిటిషన్లో సూచించారు. రాజకీయ నాయకులు చేసే విమర్శలు, ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వ న్యాయవాదులు ఇలాంటి దావాలు దాఖలు చేసే విషయంలో కొన్ని మార్గదర్శకాల్ని అనుసరించే విధంగా చర్యలు తీసుకోవాలి, తదితర పలు రకాల సూచనలతో పన్నెండు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ ముందు విచారణ జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో గత నెల బీజేపీ నేత సుబ్రమణ్యస్వామిపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా దాఖలు చేయడం, ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడాన్ని డీఎండీకే వర్గాలు పరిగణనలోకి తీసుకున్నాయి. గత నెల తాము దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా ఈ పిటిషన్లను సుప్రీం కోర్టుకు మార్చబోతున్నామని సూచించారు. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌ను గుర్తు చేస్తూ విజయకాంత్ తరపున న్యాయ వాదులు వాదన విన్పించారు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆగ్రహం- జరిమానా: సుప్రీం కోర్టును ఆశ్రయించుకోమని అనుమతి ఇచ్చి నెల రోజులకు పైగా యినా, విజయకాంత్ తరపు న్యాయవాదులు అందుకు తగ్గ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. ఆ పిటిషన్ల స్థితిగతులపై మంగళవారం సంజయ్ కిషన్ కౌల్, సుందరేషన్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ పరిశీలన జరిపింది. అయితే, సుప్రీం కోర్టును ఆశ్రయించడంలో కాలయాపనపై విజయకాంత్ తరపున న్యాయవాదులు తమ వాదనను బెంచ్ ముందు ఉంచారు. తమ కక్షిదారులు చేసిన ఆరోపణలు, విమర్శలు కొన్ని తమిళంలో ఉన్న దృష్ట్యా, వాటిని ఆంగ్లంలో అనువాదం చేయడంలో జాప్యం నెలకొందని, తమకు కొంత సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే నెల రోజులకు పైగా సమయం ఇచ్చామని మండి పడింది. కోర్టు సమయాన్ని వృథా చేసే విధంగా వ్యవహరిస్తే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సుప్రీం కోర్టును ఆశ్రయించడంలో జాప్యం చేయడంతోపాటుగా కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గాను, విజయకాంత్, ప్రేమలతతో పాటుగా దాఖలైన 12 పిటిషన్లకు జరిమానా విధిస్తున్నామని ప్రకటించారు. ఒక్కో పిటిషన్‌కు రూ.రెండు వేలు చొప్పున పన్నెండు పిటిషన్లకు రూ. 24 వేలు జరిమానాను చెల్లించాలని ఆదేశించారు. పదిహేను రోజుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించని పక్షంలో ఈ పన్నెండు పిటిషన్లను విచారణ యోగ్యం కాదని స్పష్టంచేస్తూ తిరస్కరించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు హెచ్చరించారు. -
అన్నాకు నివాళి
తమిళనాట ద్రవిడ పార్టీ ఆవిర్భావ కర్త అన్నాదురై వర్ధంతిని పురస్కరిం చుకుని మంగళవారం రాష్ర్ట వ్యాప్తం గా ఆయనకు నివాళులర్పించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోయెస్‌గార్డెన్‌లోని తన నివాసంలో, డీఎంకే అధినేత కరుణానిధి మెరీనా తీరంలోని అన్నా సమాధి వద్ద నివాళులు అర్పించారు. డీఎండీకే, ఎండీఎంకే నేతృత్వంలో అన్నాదురైకి పుష్పాంజలి ఘటించారు. సాక్షి, చెన్నై: ద్రవిడ పార్టీల ఆవిర్భావ కర్త మాజీ సీఎం అన్నాదురై 46వ వర్ధంతిని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల్లో ప్రత్యేకంగా నిర్వహించారు. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకేల నేతృత్వంలో అన్నా చిత్ర పటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చెన్నై మెరీనా తీరంలోని సమాధి వద్ద సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే నాయకులు నివాళులు అర్పించారు. పోయెస్ గార్డెన్‌లోని తన నివాసంలో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అన్నా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. డీఎంకే అధినేత కరుణానిధి నేతృత్వంలో చేపాక్కం నుంచి మౌన ప్రదర్శనగా శాంతి ర్యాలీ మెరీనా బీచ్ వరకు సాగింది. కరుణానిధి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్, కోశాధికారి స్టాలిన్ నేతృత్వంలో నాయకులు, ర్యాలీగా తరలి వచ్చి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. ఎండీఎంకే నేత వైగో ఆధ్వర్యంలో ఆ పార్టీ వర్గాలు తీరంలోని సమాధి వద్ద నివాళి అర్పించారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి వేడుకలో నివాళులు అర్పించారు. అన్నాడీఎంకే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. తిరువాన్మియూరులోని ఓ ఆలయంలో సీఎం పన్నీర్ సెల్వంలో సహపంక్తి భోజనం చేశారు. అలాగే రాష్ట్ర మంత్రుల నేతృత్వంలో శ్రీరంగం పరిసరాల్లో అన్నాకు నివాళులర్పించి, దేవాలయూల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. -
మద్దతుపై విజయకాంత్ మెలిక
సాక్షి, చెన్నై : శ్రీరంగం ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతు విషయంలో డీఎండీకే అధినేత విజయకాంత్ కొత్త మెలిక పెట్టారు. పార్టీ శ్రేణులతో ఆదివారం చెన్నైలో సమాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ ఢిల్లీ పెద్దలు అమిత్ షా , ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారు కోరినప్పుడే ప్రచారంలోకి వెళ్లడం, బహిరంగంగా మద్దతు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎండీకే మద్దతుతో శ్రీరంగం ఉప ఎన్నిక బరిలో తాము దిగుతున్నామని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. విజయకాంత్ తమకు మద్దతు ఇచ్చారని బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారేగానీ, డీఎండీకే వర్గా లు మాత్రం బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. లోపాయి కారి ఒప్పందం మేరకు ఈ మద్దతు ఉందన్న ప్రచారం సాగుతున్న సమయంలో విజయకాంత్ కొత్త మెలిక పెట్టే పనిలో పడ్డారు. మెలికలు పెట్టడంలో ఆరి తీరిన విజయకాంత్ బీజేపీకి మద్దతు విషయంలో ఇప్పుడే అదే బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారు. సమావేశం : శ్రీరంగంలోని పార్టీ నాయకులు, అన్ని జిల్లాల కార్యదర్శులను ఆగమేఘాలపై ఆదివారం విజయకాంత్ చెన్నై కు రప్పించారు. కోయంబేడులోని పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు ఈ సమావేశం సాగింది. ఇందులో పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కొన్ని జిల్లాల్లో పార్టీ నిర్వాహకుల తీరును ఆరా తీసి, వారిని తొలగించేందుకు నిర్ణయించినట్టు సమాచారం. పార్టీ పరంగా కొన్ని జిల్లాల్లో ప్రక్షాళనకు విజయకాంత్ నిర్ణయించినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. శ్రీరంగం ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు విషయమై సుదీర్ఘ చర్చ సాగినట్టు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రమే తనను కలిసి వెళ్లడం, జాతీయ నాయకులెవ్వరూ కనీసం మాట వరుసకైనా ఫోన్లో కూడా మాట్లాడక పోవడాన్ని విజయకాంత్ తీవ్రంగా పరిగణించారు. ఈ దృష్ట్యా, ఉప ఎన్నికల్లో మద్దతు తెలియజేయడంతో పాటుగా బీజేపీ అభ్యర్థితో కలసి ఓట్ల వేటకు వెళ్లడం, తానే స్వయంగా ప్రచారానికి వెళ్లే విషయంగా చర్చించి ఓ కొత్త మెలికను బీజేపీ అధిష్టానం ముందు ఉంచేందుకు సిద్ధమయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లేదా, ఇతర నాయకులు లేదా ప్రధాని నరేంద్ర మోదీలో ఎవరో ఒకరు తనతో ఫోన్లో సంప్రదించి మద్దతు కోరినప్పుడే స్పందించేందుకు నిర్ణయించి నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ వర్గాలు మద్దతు ప్రకటించినట్టు చెబుతున్నాయిగా? అని డీఎండీకే వర్గాలను ప్రశ్నించగా, వాళ్లు చెబితే చెప్పుకోనీయండి, తాము ప్రచారం బరిలో దిగాలిగా అని పేర్కొనడం గమనార్హం. తమను బీజేపీ పెద్దలు ఎవ్వరూ సంప్రదించని పక్షంలో ఇతర పార్టీల వలే మౌనంగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. -
మద్దతు వేట
సాక్షి, చెన్నై: శ్రీరంగం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే పనిలో ప్రతిపక్షాలు పడ్డాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రె ఫరెండంగా ఈ ఎన్నికలను మలచుకునేందుకు ఉరకలు తీస్తున్నాయి. డీఎండీకే, కాంగ్రెస్ మద్దతును కూడగట్టుకుని ఎన్నికల్లో గెలుపునకు డీఎంకే వ్యూహ రచనల్లో పడింది. డీఎండీకే, పీఎంకే మద్దతుతో అభ్యర్థిని దించి తమ సత్తా చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నాల్లో పడింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన శ్రీరంగం స్థానానికి ఉప ఎన్నిక రాజకీయ పక్షాల్లో ఉరుకులు పరుగులు తీయిస్తోంది. తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవశం చేసుకునేందుకు జయలలిత ఆదేశాలతో ఆ పార్టీ నేతలు, మంత్రులు నియోజకవర్గ బాట పట్టే పనిలో పడ్డారు. తమ అభ్యర్థి వలర్మతి గెలుపు లక్ష్యంగా సుడిగాలి పర్యటనతో ప్రచారంలో దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. శ్రీరంగం గెలుపుతో తమ అధినేత్రి జయలలిత ఏ తప్పూ చేయలేదని చాటే దిశగా అన్నాడీఎంకే శ్రేణులు పరుగులు తీస్తున్నారు. జయలలితకు జైలు శిక్ష పడ్డ నేపథ్యంలో వస్తున్న తొలి ఎన్నిక కావడంతో ఈ గెలుపును 2016 అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా మార్చుకునే పనిలో డీఎంకే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టాలంటే, ఈ స్థానంలో అన్నాడీఎంకేను ఓడించి, ఆ పార్టీ మీద, ఆ ప్రభుత్వం మీద ఏ మేరకు ప్రజల్లో వ్యతిరేకత ఉందో తెలియజేసేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి వ్యూహ రచనల్లో ఉన్నారు. బీజేపీ విషయానికి వస్తే తమిళనాడులో తమ బలం పెరిగిందని నిరూపించుకునేందుకు ఈ ఉప ఎన్నిక మీద దృష్టి పెట్టే పనిలో పడింది. అయితే, గెలుపు లక్ష్యంగా డీఎంకే, బీజేపీలు డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ ప్రదక్షిణలకు సిద్ధం కావడం గమనార్హం. కీలకంగా విజయకాంత్ : ఈ ఉప ఎన్నిక బరిలో డీఎండీకే అధినేత విజయకాంత్ తన అభ్యర్థిని నిలబెట్టేది అనుమానమే. ఈ దృష్ట్యా, ఆ పార్టీ మద్దతును తమకు అనుకూలంగా మలచుకునేందుకు డీఎంకే, బీజే పీలు పరుగులు తీస్తున్నాయి. డీఎండీకే అధినేత విజయకాంత్ మద్దతుతోపాటుగా కాంగ్రెస్‌ను తమ వైపు తిప్పుకున్న పక్షంలో ఆ ఓటు బ్యాంక్ కలసి వస్తే గెలుపు సునాయాసం అవుతుందన్న ధీమా డీఎంకే అధినేత కరుణానిధిలో నెలకొంది. పీఎంకే సైతం తమకు మద్దతు ఇస్తుందన్న ఆశాభావంతో తమ అభ్యర్థి ఆనంద్‌కు అండగా నిలవాలని ఇప్పటికే ప్రతి పక్షాలకు కరుణానిధి పిలుపు నిచ్చారు. మిగిలిన పక్షాల ఓట్లు తమ ఖాతాలో వేసుకోవడం సులభ మార్గమైనా విజయకాంత్ ఏ సమయంలో ఎలా స్పందిస్తారోనన్న ఉత్కంఠ డీఎంకేలో నెలకొంది. ఈ దృష్ట్యా, ఆయన్ను ఇప్పుడే తమ వైపు తిప్పుకుని, అసెంబ్లీ ఎన్నికల కూటమికి మార్గం సుగమం చేసే విధంగా డీఎంకే వర్గాలు కోయంబేడులోని డీఎండీకే కార్యాలయంలో అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యూరట!. ఇక బీజేపీ విషయానికి వస్తే విజయకాంత్ మద్దతు రాబట్టడం లక్ష్యంగా కసరత్తుల్లో సాగుతున్నాయి. అయితే, బీజేపీ మీద విజయకాంత్ ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ఆయన్ను శాంతింప చేసి ఆ పార్టీ మద్దతును చేజిక్కించుకునేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ మంతనాల్లో మునిగారు. విజయకాంత్‌తో సంప్రదింపులకు స్వయంగా తమిళిసై సిద్ధమవుతున్నారు. ఈ దృష్ట్యా, శ్రీరంగం ఉప ఎన్నిక మద్దతు వ్యవహారంలో డీఎండీకే అధినేత విజయకాంత్ కీలకంగా మారడం విశేషం. -
సీఎం అభ్యర్థి నేనే
బీజేపీ కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమయ్యారు. తనను ఆ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్‌ను తెర మీదకు తెచ్చే పనిలో పడ్డారు. విజయకాంత్ నిర్ణయాన్ని కమలనాథుల దృష్టికి తీసుకెళ్లేందుకు డీఎండీకే వర్గాలు సిద్ధమయ్యాయి. సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల సమయంలో విజయకాంత్‌కు కమలనాథులు ప్రత్యేక ప్రాధాన్యతను ఇచ్చారు. నరేంద్ర మోదీ ప్రచారానికి వచ్చినప్పుడు విజయకాంత్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. విజయకాంత్ భుజం మీద చేతులు వేస్తూ, ఆయన్ను ఆహ్వానించే రీతిలో వ్యవహరించి డీఎండీకే ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టారు. అయితే, ఎన్నికల అనంతరం విజయకాంత్‌కు అడుగడుగున అవమానాలే ఎదురయ్యూరుు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు పలు మార్లు యత్నించినా అనుమతి కరువైంది. కాశ్మీర్ నివారణ నిధి ఇద్దామన్నా అందుకు కూడా అనుమతి ఇవ్వలేదు. బీజేపీ మీద గుర్రుగా ఉన్న విజయకాంత్ ఆ కూటమిలో ఇంకా కొనసాగాలా? అన్న నిర్ణయానికి వచ్చారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆ కూటమిలో ఎండీఎంకే నేత వైగోకు ఎదురైన పరాభావాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యే తమకు తప్పదన్న విషయాన్ని గ్రహించి బీజేపీ నుంచి జారుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బీజేపీ, పీఎంకేలకు షాక్ బీజేపీ కూటమిలో ఉన్నామా..? లేదా..? అని చెప్పుకునే పరిస్థితుల్లో లేని పీఎంకే నేత రాందాసు కాసేపు కూటమికి అనుకూలంగా, మరి కాసేపు తమ నేతృత్వంలో కూటమి అంటూ వ్యాఖ్యానిస్తుండడాన్ని విజయకాంత్ పరిశీలించారు. తమ నేతృత్వంలో కూటమి అన్నప్పుడు అధినేత రాందాసు తనయుడు అన్భుమణి రాందాసు సీఎం అభ్యర్థి అన్న నినాదాన్ని పీఎంకే వర్గాలు అందుకున్నాయి. ఈ పరిణామాలన్నీ తన ఆశల్ని ఎక్కడ అడియాశలు చేస్తాయోనన్న విషయాన్ని గ్రహించిన విజయకాంత్ మేల్కొన్నారు. బీజేపీ, పీఎంకేలకు షాక్ ఇచ్చేందుకు నిర్ణయించారు. పార్టీ సర్వ సభ్య సమావేశానికి పిలుపునిచ్చి అందులో చర్చించే అంశాల్ని పార్టీ వర్గాల ద్వారా బయటకు పంపించే పనిలో పడ్డారు. జనవరి ఏడో తేదీన కోయంబత్తూరు వేదికగా జరిగే కార్యవర్గం భేటీ అసెంబ్లీ ఎన్నికల దశ, దిశ నిర్దేశం లక్ష్యంగా సాగబోతోందని డీఎండీకే నేతలు ప్రకటించారు. అరుుతే అంతలోపే బిజేపి కూటమి సీఎం అభ్యర్థిగా తమ నేత విజయకాం త్ పేరును ప్రకటించాల్సిందేనన్న నినాదాన్ని అందుకుని ప్రచారం చేస్తున్నారు. విజయకాంత్ సూచన మేరకు డీఎండీకే వర్గాలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు బీజేపీ కూటమి సంసిద్ధత వ్యక్తం చేస్తే సరే, లేని పక్షంలో ఆ కూటమికి జనవరి 7న టాటా చెప్పేందుకు విజయకాంత్ సిద్ధమవుతున్నారు. కూటమిలో తాను ఉండాల్సిన అవసరం ఉన్నట్టుగా బీజేపీ నాయకులెవ్వరైనా వ్యాఖ్యలు చేసిన పక్షంలో, సర్వ సభ్య సమావేశంలో విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసే రీతిలో తీర్మానం చేయడానికి డీఎండీకే వర్గాలు వ్యూహ రచన చేయడం గమనార్హం. -
ఏం చేద్దాం?
బీజేపీ కూటమి నుంచి వైదొలగేందుకు డీఎండీకే సన్నద్ధమవుతోంది. వైగోకు ఎదురైన అవమానం తమకు ఎదురయ్యేలోపు పక్కకు తప్పుకుంటే మంచిదన్న యోచనలో విజయకాంత్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు పార్టీ వర్గాలతో మంతనాల్లో మునిగారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన డీఎండీకేకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నీడన చేరాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడం విజయకాంత్ ను డీలా పడేలా చేసింది. ఎన్నికల సమయంలో కుదర్చుకున్న ఒప్పందాల మేరకు తమకు బీజేపీ న్యాయం చేస్తుందన్న ఆశాభావంతో ఉన్న విజయకాంత్‌కు చివరకు మిగిలింది నిరాశే. తన బావమరిది సుదీష్‌కు ఇస్తామన్న రాజ్యసభ సీటును ఇవ్వక పోగా, చివరకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ సైతం విజయకాంత్‌కు కరువైంది.అప్పటి నుంచి బీజేపీ మీద ఆయన గుర్రుగానే ఉన్నారు. సమయం వచ్చినప్పుడల్లాకేంద్రంపై దూకుడుగా స్పందించిన విజయకాంత్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల వేళ తగ్గారు. బీజేపీ వర్గాలు బుజ్జగించడంతో తన మద్దతును ప్రకటించారు. ఆ ఎన్నికల్లో కేవలం మద్దతు మాత్రమే ప్రకటించి, ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాల్ని విజయకాంత్ నిశితంగా పరిశీలిస్తున్నారు. పార్టీ జిల్లాల నాయకులతో తరచూ సంప్రదింపులు జరుపుతూ ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై సలహాలు సూచనలు ఇచ్చే పనిలో పడ్డారు. టాటా : బీజేపీ నేతల తీరును నిశితంగా పరిశీలిస్తున్న విజయకాంత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన నేతృత్వంలోని కూటమికి ఆ పార్టీ కట్టుబడుతుందా? అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. కమలనాథులు సూపర్ స్టార్ రజనీకాంత్ జపం అందుకున్న దృష్ట్యా, ప్రస్తుతం ఆ పార్టీ కూటమి నుంచి నెమ్మదిగా జారుకుని, ప్రత్యామ్నాయ మార్గం మీద దృష్టి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. కూటమిలోని ఎండీఎంకేను పొమ్మనకుండా పొగ పెట్టే రీతిలో బీజేపీ వ్యవహరించిన తీరును విజయకాంత్ తప్పుబడుతున్నారు. ఈ రోజు ఎండీఎంకేకు ఎదురైన పరాభావం రేపు తమకు ఎదురు కాదనడంలో గ్యారంటీ ఏమిటీ..? అన్న ప్రశ్నను డీఎండీకే నాయకులు పలువురు విజయకాంత్ ముందు ఉంచినట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికల ముందు నోరు విప్పేందుకు భయపడే బీజేపీ నాయకులు పలువురు, ఇప్పుడు జబ్బలు చరుస్తున్నారు. మున్ముందు తమతో కూడా ఇదే రకంగా వ్యవహరిస్తారన్న భావనలో డీఎండీకే నాయకులు ఉన్నారు. దీంతో మనమూ టాటా చెప్పేద్దాం! అన్న యోచనకు విజయకాంత్ వచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ వర్గాలతో సంప్రదింపుల అనంతరం తన నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటించేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీతో విభేదాలు లేవు. అలాగనీ మిత్ర బంధం కూడా లేదు. ఈ సమయంలో ఉన్నట్టుండి బయటకు వెళ్లడం కన్నా, ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో ఈలం తమిళుల విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయం మేరకు స్వరాన్ని పెంచేందుకు నిర్ణయించారు. ఎలాగూ శ్రీలంకకు అనుకూలంగా ప్రధాని మోదీ సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్న దృష్ట్యా, ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని మోదీపై విమర్శలతో బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు విజయకాంత్ సిద్ధమవుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
నవంబర్ 28న జీకే వాసన్ కొత్తపార్టీ
తమిళనాడు:కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ కొత్త పార్టీకి ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 28వ తేదీన కొత్తపార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వాసన్ తాజాగా స్పష్టం చేశాడు. రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో బహిరంగ సభలోనే పార్టీ ఏర్పాటును వాసన్ ప్రకటిస్తారు. ఈ మధ్యనే కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పిన వాసన్.. కొత్త పార్టీ పేరు.. అజెండాను అదే రోజు వెల్లడించనున్నారు. తిరుచ్చిలో జరగనున్న జీకేవీ మహానాడుకు డీఎండీకే శ్రేణు లు సైతం హాజరవుతున్నట్లు తెలుస్తోంది. జీకే వాసన్ కొత్తపార్టీకి విజయ్ కాంత్ మద్దతిచ్చే క్రమంలోనే ఆ కార్యక్రమానికి డీఎండీకే శ్రేణులు హాజరవుతున్నట్లు ప్రచారం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
జీకే వాసన్‌కు ‘కెప్టెన్’ మద్దతు
చెన్నై, సాక్షి ప్రతినిధి : కొత్త పార్టీ పెట్టబోతున్న జీకే వాసన్‌కు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా డీఎండీకే అధినేత విజయకాంత్ మరోసారి కలకలం సృష్టించారు. తిరుచ్చిలో జరగనున్న జీకేవీ మహానాడుకు డీఎండీకే శ్రేణు లు సైతం హాజరుకానున్నట్లు సమాచారం. పార్టీ ఆవిర్భావం నుంచి సంచలనానికి కెప్టెన్ కేంద్ర బిందువయ్యూ రు. పదేళ్ల క్రితం డీఎండీకే తొలిసారి ఎన్నికలను ఎదుర్కొన్నపుడు ఒక్క విజయకాంత్ మినహా ఎవ్వరూ గెలవకపోవ డం అప్పట్లో సంచలనం. ఆ తరువాత అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని డీఎంకే కంటే ఎక్కువ స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్షహోదాను దక్కించుకోవడం మరో కలకలం. స్వల్పకాలంలోనే అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో విబేధించి, ఇటీవలి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ కూటమిలో చేరడం ద్వారా మరో సం చలనానికి తెరదీశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రధాని మోదీకి సన్నిహితునిగా మారడంతోపాటూ 2016న రాబోయే అసెం బ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి ద్వారా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవాలని విజయకాంత్ ఆశిస్తున్నారు. ఇలా బీజేపీ కూటమిలోనే కొనసాగుతున్న విజయకాంత్ అకస్మాత్తుగా జీకే వాసన్‌కు శుభాకాంక్షలు చెప్పడం ద్వారా మరోసారి కలకలం రేపారు. కాంగ్రెస్‌తో విభేదించి జీకే వాసన్ పెట్టబోతున్న పార్టీతో చేతులు కలిపేందుకు సుముఖత చూపుతున్నారు. జీకేవాసన్, కెప్టెన్ రాజకీయాలకు అతీతంగా మిత్రు లు. ప్రస్తుతం మలేషియాలో ఉన్న విజ యకాంత్ సెల్‌ఫోన్ ద్వారా జీకేవీకి శుభాకాంక్షలు తెలపడం వరకే పరిమి తం అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తిరుచ్చిలో జరగనున్న కొత్త పార్టీ ఆవిర్భావ వేడుకకు జీకే వాసన్ ఆహ్వానించడం, తాను విదేశాల్లో ఉన్నందున తమ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని విజయకాంత్ చెప్పినట్లు సమాచారం. బీజేపీ కూటమి తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించిన పక్షంలో ఇదే కూటమిలో జీకే వాసన్ పార్టీ సైతం చేరినట్లయితే మరింత బలం చేకూరుతుందని కెప్టెన్ అంచనాగా ఉంది. అయితే కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ అభిప్రాయం తో నిమిత్తం లేకుండా కెప్టెన్ తనకు తానుగా జీకేవీకి చేరువవుతున్నారు. జీకే వాసన్ పార్టీతో డీఎండీకే జతకడుతుందా లేక బీజేపీ కూటమిలోకి వాసన్ వస్తారా అనే చర్చకు కెప్టెన్ తెరలేపారు. సభకోసం సమీకరణలు తిరుచ్చి సభను విజయవంతం చేసేం దుకు జీకే వాసన్ సమీకరణల బాట పట్టారు. సభకు కనీసం 2 లక్షల మందిని హాజరుపరచాలని పట్టుదలతో ఉన్నారు. ఈనెల 20 లేదా 21వ తేదీ తిరుచ్చి సభకు ముహూర్తంగా చెబుతున్నారు. జీ కార్నర్ ప్రాంగణంలో సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ఇద్దరు జీకే వాసన్వైపు మొగ్గుచూపుతున్న ఇద్ద రు (కాంగ్రెస్) ఎమ్మెల్యేల సభ్యత్వం ఉంటుందా, ఊడుతుందా అనే చర్చ సాగుతోంది. కన్యాకుమారి జిల్లా కిలి యూర్ ఎమ్మెల్యే జాన్‌జాకబ్, తంజావూరు జిల్లా పట్టుకోట్టై ఎమ్మెల్యే రంగరాజన్లు కొత్త పార్టీ పెట్టబోతున్న జీకే వాసన్‌కు మద్దతుగా నిలిచారు. హస్తం గుర్తుపై గెలిచి మరోపార్టీలో చేరుతున్నట్లు అధికారికం గా నిర్ధారణ కాగానే పార్టీ అధిష్టానం వెంటనే వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి ఆ ఉత్తరాన్ని అసెంబ్లీ కార్యదర్శికి పంపే అవకాశం ఉంది. అసెంబ్లీ కార్యదర్శి వెంటనే వారిద్దరి సభ్యత్వం రద్దయినట్లు ప్రకటించవచ్చు. డీఎంకే నుంచి ఒకరు, డీఎండీకే నుంచి 8 మంది ఎమ్మెల్యేలు ఏడాది కిందటే అన్నాడీఎంకే పంచన చేరిపోయారు. రంగరాజన్, జాన్‌జాకబ్ సభ్యత్వం కోల్పోగానే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరపక తప్పదు. రాష్ట్రంలో వ్యతిరేక పవనాలు వీస్తున్న దశలో ఉపఎన్నికలపై కాంగ్రెస్ విముఖత ప్రదర్శించవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితిలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎటువంటి వైఖ రిని అవలంభిస్తారో వేచిచూడాల్సిందే. -
పాల రచ్చ!
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో ఆవిన్ పాల ధరను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఒకే సారి లీటరు పాలపై రూ.పది పెంచడాన్ని ప్రజలు, రాజకీయ పక్షాలు జీర్ణించుకోలేకున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ధరను తగ్గించడం లక్ష్యంగా ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కదిలాయి. మంగళవారం డీఎండీకే నేతృత్వంలో నిరసన సాగగా, బుధవారం నుంచి ఆందోళనలు రాజుకున్నాయి. డీవైఎఫ్ఐ, ఐద్వాలతో పాటుగా పలు సంఘాల నేతృత్వంలో రాష్ట్రంలో ఆయా నగరాల్లో నిరసనలు చోటు చేసుకున్నాయి. పాల ధరను తగ్గించాల్సిందేనని నిరసన కారులు నినదించారు. చెన్నై సెంట్రల్ ఆవరణలో డీవైఎఫ్ఐ, ఐద్వా నేతృత్వంలో భారీ నిరసన జరిగింది. ఉద్రిక్తత : నిరసనకారులు బుధవారం ఉదయాన్నే రోడ్డెక్కారు. పాల ధరను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా శవయాత్ర నిర్వహించారు. సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎదురుగా పూందమల్లి హైరోడ్డులో బైఠాయించారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి. ఆందోళనకు తరలి వచ్చిన వారిలో అత్యధికంగా మహిళలు ఉండడంతో వారిని అడ్డుకోవడం పోలీసులకు శ్రమగా మారింది. చివరకు మిహ ళా పోలీసులు పెద్ద ఎత్తున రప్పించి వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట వాగ్యుద్ధం చోటు చేసుకుంది. కొందరు అయితే, రోడ్డుపై అడ్డంగా పడుకోవడం, మరి కొందరు వాహనాల చక్రాల కింద పడుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగడంతో పూందమల్లి హైరోడ్డు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కింది. చివరకు పెద్ద ఎత్తున బలగాల్ని రంగంలోకి దించి, నిరసనకారుల్ని అతి కష్టం మీద అరెస్టు చేశారు. ఈ నిరసనతో రెండు గంటల పాటుగా వాహన చోదకులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని క్రమ బద్ధీకరించేందుకు పోలీసులు చెమటోడ్చక తప్పలేదు. గురువారం నుంచి పాల ధర పెంపునకు నిరసనగా రోజుకో రాజకీయ పార్టీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. -
‘మెగా’ సాధ్యమే!
రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భావం సాధ్యమేనని ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం మహాబలి పురం వేదికగా మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదిక మీదకు రానుండడంతో రాజకీయ పరిణామాలు ఏ మలుపులు తిరగనున్నాయో..! అన్న చర్చ బయలు దేరింది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మెగా కూటమి ఏర్పాటు లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి పావులు కదుపుతున్నారు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచనల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఆయా పార్టీల మనోగతాలు మాత్రం అంతు చిక్కడం లేదు. ఏ క్షణాన ఏ పార్టీ ఎవరికి మద్దతుగా వ్యాఖ్యానిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మెగా కూటమి సాధ్యమే అన్న భావనను కలిగించాయి. ఎద్దేవా: రాష్ట్రంలో డీఎంకే , అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చంకలు గుద్దుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆ ఇంటర్వ్యూలో స్టాలిన్ విమర్శలు గుప్పించారు. గతంలో తమతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్నప్పుడే నాలుగు స్థానాలకు పరిమితమైన బీజేపీ, తాజాగా అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి రాష్ట్రంలో ఎదుగుతుందనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం సాధ్యం కాని పనిగా పేర్కొన్నారు. పార్లమెంట్లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకున్నా, వెలుపల మాత్రం అందరు ఎంపీలు స్నేహ పూర్వకంగానే ఉంటారన్నారు. అయితే, అలాంటి పరిస్థితి తమిళనాడు అసెంబ్లీలో లేదని, స్నేహ పూర్వక వాతావరణం లక్ష్యంగా డీఎంకే ప్రయత్నిస్తోందని చెప్పారు. అళగిరి పార్టీలో లేనందున ఆయన గురించి తానేమీ మాట్లాడబోనంటూ దాట వేశారు. ఎండీఎంకే నేత వైగోతో తనకు ఎలాంటి విబేధాలు లేవని, స్నేహ పూర్వకంగా తాము మెలుగుతామన్నారు. ఇటీవల అసెంబ్లీలో డీఎండీకేకు ఇబ్బందులు తలెత్తినప్పుడు తాము అండగా నిలిచామని, అదే విధంగా తమకు ఇబ్బందుల్ని అధికార పక్షం కల్పించినప్పుడు వాళ్లు అండగా నిలిచారని గుర్తు చేస్తూ, ఇలాంటి స్నేహ పూర్వక వాతావరణం అసెంబ్లీలో మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మెగా కూటమి సాధ్యం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, డీఎంకేలు కలసికట్టుగా మెగా కూటమి ఏర్పాటుకు ఆమోదిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకే వేదిక మీదకు : మెగా కూటమి సాధ్యమే అన్నట్టుగా స్టాలిన్ వ్యాఖ్యానించడం ఓ వైపు చర్చకు దారి తీస్తే, ఇందుకు అనుకూలించే పరిస్థితులు మరో రెండు రోజు ల్లో రానున్నాయి. మహాబలి పురం వేదికగా గురువా రం పీఎంకే అధినేత రాందాసు మనవడు, మనవరాలి వివాహం జరగనుంది. ఇందుకు కరుణానిధి నేతృత్వం వహించబోతున్నారు. ఈ వేడుకకు ఎండీఎంకే నేత వైగో సైతం హాజరయ్యేందుకు నిర్ణయించారు. ఈ దృష్ట్యా, మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కాబోతోండటం గమనార్హం. అదే సమయం లో డీఎండీకే నేత విజయకాంత్ సైతం ఈ కల్యాణ వేడుకకు హాజరయ్యే అవకాశాలున్నా, ఆయన వేదిక ఎక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇప్పటికే రాందా సు, వైగోను తమ వైపు తిప్పుకునే విధంగా డీఎంకే వర్గాలు వ్యాఖ్యలు చేశారుు. ఈ వేదిక మీద ఏ మేరకు పొగడ్తల వర్షం కురిసి మెగా కూటమికి దారి తీస్తాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం మీద వైగో, రాందాసు గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన విందుకు సైతం దూరంగానే ఉన్నారు. విజయకాంత్ సైతం ఈ విందు కు దూరంగా ఉన్నా, తరచూ మోదీ జపం అందుకోవడం ఆయన మదిలో నిర్ణయం ఏమిటోనన్నది అంతు చిక్కడం లేదు. ఈ కల్యాణ వేదికను అస్త్రంగా చేసుకుని ఁమెగారూ.మార్గాన్ని సుగమం చేసుకునేందుకు డీఎంకే అధినేత కరుణానిధి తన రాజతంత్రాన్ని ప్రయోగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. -
సీఎం అభ్యర్థి నేనే
టీనగర్: తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీజేపీ అధినేత నరేంద్ర మోడీ మద్దతు తెలుపుతారని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎండీకే జిల్లా కార్యదర్శుల సమావేశం కోయంబేడులోగల పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. సమావేశంలో పార్లమెంటు ఎన్నికల్లో డీఎండీకే వైఫల్యం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రానున్న అసెంబ్లీ ఎన్నికల గురించిన వ్యూహం వంటి వాటిపై చర్చించారు. సమావేశంలో అనేక తీర్మానాలు ప్రవేశపెట్టారు. విజయకాంత్ మాట్లాడుతూ డీఎండీకే కార్యకర్తలు పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. జిల్లా కార్యదర్శి తమ జిల్లా పరిధిలో గల ప్రాంతాల్లో పార్టీ నాయకులు సమావేశాలను ఏర్పాటు చేయాలని కోరారు. నగర గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు అందజేయాలన్నారు. బీజేపీ నాయకులు కొందరు రజనీకాంత్‌ను రాజకీయంలోకి ఆహ్వానిస్తున్నారని అయితే అది విఫలమైందన్నారు. రాష్ట్రంలోను, కేంద్రంలోను బీజేపీతో తమకు సత్ సంబంధాలు ఉన్నాయన్నారు. అందువల్ల బీజేపీ కూటమిలో పొత్తులు కుదుర్చుకుంటామన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి తాను మాత్రమేనని ఇందులోఎటువంటి మార్పు లేదన్నారు. అవినీతిని అంతమొందించేందుకు, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మోడి తనకు మద్దతు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
మీసం తీసేస్తా!
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తప్పు చేయలేదని నిరూపిస్తే, తాను ఒక పక్క మీసం తీసేస్తా అని డీఎండీకే అధినేత విజయకాంత్ గురువారం సవాల్ చేశారు. న్యాయమూర్తి తీర్పును తప్పుబట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్ తన నియోజకవర్గం రిషి వందియంలో గురువారం పర్యటించారు. ఎమ్మెల్యే నిధులతో చేపట్టిన కార్యక్రమాలు, పనులను పరిశీలించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను పంపిణీ చేశారు. నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, పోలీసు శాఖకు, అన్నాడీఎంకే వర్గాలకు సవాళ్ల మీద సవాళ్లను విసిరారు. తాను బతకడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, కష్ట పడి పనిచేసి, ప్రజలకు మంచి చేయాలన్న సదుద్దేశంతోనే ఇక్కడికి వచ్చానన్నారు. బతికేందుకు తనకు అనేక మార్గాలు ఉన్నాయని వివరించారు. అయితే, ఇక్కడ పాలకులు ప్రతిపక్షాల గళం నొక్కేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలను నీచాతి నీచంగా చూసినందుకు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో ఓ మారు గుర్తు చేసుకోండంటూ పరోక్షంగా అన్నాడీఎంకే వర్గాలకు చురకలంటించారు. ధర్మం గెలిచిందని, అందుకే బెయిల్ రావడం లేదని వ్యాఖ్యలు చేస్తూ, ఇక జయలలితకు బెయిల్ వచ్చే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు. ప్రజలకు మంచి చేయకుండా, దోచుకోవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చే వారికి జైలు శిక్ష తప్పదని, ఇందుకు జయలలిత కేసు ఓ హెచ్చరికగా పేర్కొన్నారు. తమ అమ్మ జైల్లో ఉందని మంత్రులందరూ తెగ ఏడ్చేస్తున్నారని, అలాంటప్పుడు అమ్మ బయటకు వచ్చాకే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఉండొచ్చుగా అని ప్రశ్నించారు. మొసలి కన్నీళ్లు కారుస్తూనే పదవుల్ని కాపాడుకునేందుకు పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇదే నా సవాల్: పాలకుల తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత, విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు ఉన్నాయన్నారు. అయితే,ప్రతి పక్షాల గొంతు నొక్కే విధంగా కేసుల మోతలు మోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి పక్షాలు ద్విముఖాలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఎవరి ముఖాలు ఎలా ఉన్నాయో సరి చూసుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం లక్ష్యంగా వ్యవహరిస్తే, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ఎవర్నీ దోచుకోలేదని, ప్రజల ఆస్తులు కబ్జా చేయలేదని పేర్కొంటూ, ఇవన్నీ చేసిన వాళ్లకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఇది వరకు ఉన్న పాలకులు టీవీలను ఇచ్చారని, ఇప్పుడున్న వాళ్లు కంప్యూటర్లు ఇచ్చారని గుర్తు చేస్తూ, వాటిలో మైకెల్ డీ గున్హ ఇచ్చిన తీర్పును ప్రజలు చూసుకుంటున్నారని వ్యంగ్యాస్త్రం సంధించారు. పోలీసు యంత్రాంగం మనస్సాక్షితో పనిచేయాలని, వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పాత కాలపు చట్టాలు చేతిలో పెట్టుకుని ప్రతి పక్షాల్ని బెదిరించడం మానుకుని నిబద్ధత, నిజాయితీతో పనిచేయాలని కోరారు. జయలలిత ఏ తప్పూ చేయలేదని, ఆమె నిర్దోషి అంటూ మైకెల్ డీ గున్హ తీర్పును వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక వేళ ఆమె తప్పు చేయకుంటే, బెయిల్ వచ్చి ఉండేదిగా అని ప్రశ్నించారు. ఆమె తప్పూ చేయలేదని పోలీసు యంత్రాంగం కానీ, అన్నాడీఎంకే నాయకులు కానీ నిరూపిస్తే, తాను ఒక పక్క మీసం తీసేసి తిరుగుతాననని సవాల్ చేశారు. -
తీర్పుకు కట్టుబడాల్సిందే!
సాక్షి, చెన్నై : న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు ప్రతి ఒక్కరూ కట్టుబడాల్సిందేనని డీఎండీకే అధినేత విజయకాంత్ అన్నారు. అనుకూలంగా తీర్పు వస్తే సంబరాలు చేసుకోవడం లేదంటే దాడులకు దిగడం హేయమైన చర్యగా ఖండించారు. ఇకనైనా ‘తలైవి’జపం వీడి ప్రజా హితాన్ని కాంక్షించాలని అన్నాడీఎంకే శ్రేణులకు హితవు పలికారు. కర్ణాటక, తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయొద్దని హెచ్చరించారు.అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్దతుగా ఆ పార్టీ వర్గాలు రాష్ట్రంలో సాగిస్తున్న నిరసనల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయంటూ పదే పదే ప్రధాన ప్రతి పక్ష నేత విజయకాంత్ గగ్గోలు పెడుతున్నారు. తమకు భద్రత కల్పించాలని ఏకంగా గవర్నర్ రోశయ్యకు సైతం విజ ్ఞప్తి చేసిన విజయకాంత్ తాజాగా తన స్వరాన్ని మరిం తగా పెంచారు. స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో అన్నాడీఎంకే వర్గాలపై విరుచుకు పడ్డారు. హిత బోధ చేస్తూనే, తలైవి జపం వీడండని సూచించారు. అంగీకరించాల్సిందే: సీఎంగా జయలలిత ఉన్న సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పులన్నింటిని అన్నాడీఎంకే వర్గాలు ఆహ్వానించాయని, అంగీకరించాయని, సంబరాలు చేసుకున్నాయని వివరించారు. అయితే, అదే కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును మాత్రం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. తమ తలైవి నిరపరాధి అని కన్నీళ్లు పెడుతున్నారని, ఆమె నిరపరాధిగా ఉండి ఉంటే, 18 ఏళ్లు వాయిదాల మీద వాయిదాలతో విచారణను ఎందుకు కాలయాపన చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఓ విధంగా, వ్యతిరేకంగా వస్తే మరో విధంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. అధికార పక్షంలో ఉంటూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడంతో పాటు ప్రజా సంఘాలు, ప్రైవేటు సంస్థల్ని బెదిరించి మరీ నిరసనల బాట పట్టించడం ఎంత వరకు సమంజసమని మండి పడ్డారు. 144 సెక్షన్: కావేరి, ముల్లైపెరియార్ డ్యాం హక్కులపై తమిళనాడుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇస్తే సంబరాలు చేసుకున్నారని, ఆ గెలుపు ఏదో జయలలిత వ్యక్తిగతంగా సాధించినట్టు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ఏదేని నిరసన బయలు దేరుతోందంటే చాలు జిల్లా...జిల్లాకు 144 సెక్షన్ అమలయ్యేదని గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాల రగులుతుంటే ఎందుకు ఆ సెక్షన్ ప్రయోగించడం లేదని ప్రశ్నించారు. కర్ణాటక , తమిళనాడు ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా పోస్టర్లు వెలుస్తుంటే, పోలీసులు చోద్యం చూడడం శోచనీయమని మండి పడ్డారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి వ్యతిరేకంగా, ఆ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా పోస్టర్లు వేస్తున్న అన్నాడీఎంకే వర్గాలపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇన్నాళ్లు తలైవి జపం చేసింది చాలు అని, ఇకనైనా ఁతలైవిరూ. నినాదాన్ని పక్కన పెట్టి ప్రజా హితాన్ని కాంక్షించే విధంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు విజయకాంత్ సూచించడం గమనార్హం. తనకు ఎలాంటి భయం లేదని, నా మీద నాకు నమ్మకం ఉందని, ప్రభుత్వంతో ప్రజల కోసం ఢీకొట్టేందుకు ఎంత వరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని హెచ్చరించడం విశేషం. -
మమ్మల్ని కాపాడండి: విజయకాంత్
చెన్నై: అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి తమను కాపాడాలని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎండీకే అధ్యక్షుడు ఎ.విజయకాంత్ కోరారు. ఈ మేరకు గవర్నర్ కె. రోశయ్యను కలిసి విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే కార్యకర్తల నుంచి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు రక్షణ కల్పించాలని గవర్నర్ ను కోరినట్టు భేటీ అనంతరం విజయకాంత్ తెలిపారు. తమ పార్టీ అధినేత్రి జయలలితకు కోర్టు జైలు శిక్ష విధించడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యకాండకు దిగారు. పుదుకొట్టయ్, తిరుచ్చిలోని డీఎండీకే కార్యాలయాలపై అన్నాడీఎంకే మద్దతుదారులు దాడి చేశారు. రెండు ప్రభుత్వ బస్సులను తగులబెట్టారు. -
‘మెగా’ మద్దతు
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నాటికి డీఎంకే మెగా కూటమికి మద్దతు పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే డీఎండీకే, ఎండీఎంకేలు పరోక్షంగా ఆ కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేయగా, అదే పల్లవిని బుధవారం పీఎంకే అధినేత రాందాసు అందుకున్నారు. హఠాత్తుగా గోపాలపురంలో రాందాసు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. మనవడు, మనవరాలి పెళ్లి వేడుకకు ఆహ్వానం పలికామేగానీ, రాజకీయ చర్చ లేదంటూనే రాజకీయ నాగరికత తెలిసిన నేత కరుణానిధి అంటూ ప్రశంసల కితాబు ఇవ్వడం గమనార్హం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీల్ని కలుపుకోవడం లక్ష్యంగా వ్యూహరచనల్లో పడ్డారు. తానే తదుపరి కూడా డీఎంకే కూటమి సీఎం అభ్యర్థినంటూ ప్రకటించుకుని ప్రతి పక్షాల దృష్టిని తన వైపు మళ్లించే యత్నంలో పడ్డారు. డీఎంకేలో నెలకొన్న వివాదాల్ని ఓవైపు పరిష్కరిస్తూనే, మరో వైపు మెగా కూటమి లక్ష్యంగా కుస్తీలు పడుతున్నారు. తదుపరి సీఎం అభ్యర్థి కరుణానిధి అన్న ప్రకటన వెలువడడంతో డీఎండీకే, ఎండీఎంకేలు పరోక్షంగా మద్దతు వ్యాఖ్యలు చేశాయి. అన్నాడీఎంకేకు అధికారం దూరం చేయడం లక్ష్యంగా ప్రతి పక్షాలన్నీ మళ్లీ డీఎంకే పక్షాన నిలబడే విధంగా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం హఠాత్తుగా పీఎంకే అధినేత రాందాసు గోపాలపురంలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. తమ నేతృత్వంలోనే కూటమి, తదుపరి తామే అధికార పగ్గాలు చేపడతామంటూ ప్రగల్బాలు పలుకుతూ వచ్చిన రాందాసు డీఎంకే అధినేత కరుణానిధితో భేటీ కావడంతో ఆంతర్యాన్ని కనిపెట్టే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి. పెళ్లికి రండి: పీఎంకే అధినేత రాందాసు తనయుడు, కుమార్తె అన్భుమణి, శాంతిలు వియ్యంకులు కాబోతున్నారు. అన్భుమణి కుమార్తె సంయుక్తను శాంతి కుమారుడు ప్రీతీవన్కు ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. వీరి వివాహం అక్టోబరు 30న మహాబలి పురం వేదికగా జరగనున్నది. ఈ వివాహం ఆహ్వాన పత్రికతో ఉదయాన్నే గోపాలపురంలో తన సతీమణి సరస్వతితో కలసి రాందాసు ప్రత్యక్షం అయ్యారు. రాందాసును సాదరంగా కరుణానిధి ఆహ్వానించారు. ఇద్దరు కుశల ప్రశ్నలతో ఇరవై ఐదు నిమిషాలు మాటా మంతిలో మునిగారు. ఈ సమాచారంతో మీడియా అక్కడికి పరుగులు తీసింది. వెలుపలకు వచ్చి రాగానే, మీడియా వద్దకు వచ్చిన రాందాసును ఁపెళ్లికి రండిరూ. అంటూ ఆహ్వానం పలికారు. ప్రశంసలు: తన మనవడు, మనవరాలి వివాహానికి కరుణానిధి కుటుంబాన్ని ఆహ్వానించామన్నారు. తమ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు కరుణానిధి హాజరయ్యారని, ఈ వేడుకకు కూడా హాజరు కానున్నారని తెలిపారు. ఉత్తరాధిలో రాజకీయ నాగరికత తెలిసిన నాయకులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. అయితే, దక్షిణాదిలో రాజకీయ నాగరికత తెలిసిన ఒకే ఒక్క నాయకుడు కరుణానిధి మాత్రమేనని కితాబు ఇచ్చారు. తమ మధ్య రాజకీయ సంబంధింత చర్చలు సాగలేదని, ఆ ప్రస్తావనే రాలేదని పేర్కొంటూనే, కరుణానిధిని ప్రశంసలతో ముంచెత్తడం గమనార్హం. రాజకీయ నాగరికత వికసించాలన్నదే కరుణానిధి తపన అని, ఇది వికసించాలని తాను కోరుకుంటున్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ ఆరంభమయ్యింది. డిఎంకే మెగా కూటమి వైపుగా పీఎంకే సైతం చూస్తున్నట్టుగా ప్రచారం ఊపందుకుంటోంది. -
రంగంలోకి అమిత్ షా!
సాక్షి,చెన్నై : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఎన్నికల అనంతరం కూటమిలోని మిత్రులకు ఇచ్చిన హామీల్ని బీజేపీ విస్మరించిందని చెప్పవచ్చు. దీంతో ఆ కూటమిలోని పీఎంకే, ఎండీఎంకే, డీఎండీకేలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. సమయం దొరికినప్పుడల్లా కేంద్రం తీరును ఎండగట్టే పనిలో ఆ పార్టీ నాయకులు పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ కూట మి కొనసాగుతుందని ప్రగల్భాలు పలికిన పార్టీ నాయకులు చివరకు తలా ఓ దారి అన్నట్టుగా పయనించారు. ఈ సమయంలో స్థానిక ఉపసమరం నగారా మోగడంతో మిత్రుల్ని దగ్గర చేర్చేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేసింది. తమ కూటమి కొనసాగుతోందని ప్రకటిస్తూ, ఆ పార్టీల మద్దతు కూడగట్టుకునే యత్నం చేసింది. ఆయా పార్టీల నాయకులు మద్దతుతో సరి పెట్టారేగానీ, ఆ పార్టీ అభ్యర్థుల కోసం ఎక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన దాఖలాలు లేవు. ఈ సమయంలో ఈలం తమిళులు, జాలర్ల విషయంలో, హిందీని తమిళులనెత్తిన రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో కేంద్రం తీరును ఎండ గట్టే పనిలో మిత్ర పక్షాలు పడ్డాయి. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి మెగా కూటమి లక్ష్యంగా రాజకీయ పక్షాలకు పిలుపు నివ్వడం, తక్షణం పరోక్ష సంకేతంతో ఎండీఎంకే స్పందించడం, డీఎండీకే సైతం అదేబాటలో పయనించేందుకు రెడీ అవుతుండడంతో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి కొనసాగేనా..? అన్న అనుమానాలు బయలు దేరాయి. అమిత్ షా చుట్టూ.. ఇప్పుడున్న మిత్రులందరూ డీఎంకే పక్షాన చేరిన పక్షంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అక్కున చేర్చుకునే వాళ్లు కరువైనట్టే. మళ్లీ రాష్ట్రంలో ఆ పార్టీ ఒంటరిగా మిగలడం ఖాయం. దీన్ని గుర్తెరిగిన ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాల్ని ఎప్పటికప్పుడు అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ కూటమి కొనసాగించడం లక్ష్యంగా అమిత్‌షా వ్యూహ రచన చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో రాష్ట్రంపై ఆయన దృష్టి పెట్టనున్నట్లు తెలిసింది. మిత్రుల్ని బుజ్జగించి, తమ నేతృత్వంలోని అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కోవడం, రాష్ట్రం లో బలమైన శక్తిగా అవతరించడమే థ్యేయంగా అమిత్‌షా ప్రయత్నాల్ని వేగవంతం చేశారు. ఈ విషయాలు ఆ కూటమిలోని ఐజేకే నేత పచ్చముత్తు పారివేందన్ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పీఎంతో భేటీ ఎస్ఆర్ఎం ఉద్యోగులు ఒక రోజు వేతనంగా 75 లక్షలు, ఐజేకే తరపున రూ.25లక్షలు నిధిని కాశ్మీర్ పునరుద్ధరణకు పచ్చముత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధిని శనివారం ప్రధాని నరేంద్రమోడీకి పచ్చముత్తు అందజేశారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని కూటమిలో సాగుతున్న పరిణామాలు, మిత్రుల్లో నెలకొన్న అసంతృప్తి అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అన్ని విషయాల్ని ఎప్పటికప్పుడు అమిత్‌షా రాష్ట్రం నుంచి సేకరిస్తూ వస్తున్నారని, తన దృష్టికి కూడా తెచ్చినట్టు నరేంద్ర మోడీ వివరించినట్టు తెలిసింది. అక్టోబర్ నెలాఖరు నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్రంపై అమిత్‌షా దృష్టి పెట్టనున్నారని, మిత్రులందరూ మళ్లీ ఒకచోట చేరుతారన్న ధీమాను మోడీ వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయంగా పచ్చముత్తును కదలించగా, అమిత్‌షా రాష్ట్రంలో పలుమార్లు పర్యటిం చేందుకు కార్యచరణ సిద్ధం చేసుకున్నారని, ఏడాదిన్నరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్ని కూటమిగా ఎదుర్కోవడం లక్ష్యంగా ఆయన సర్వాస్త్రాల్ని సిద్ధంచేసి ఉన్నట్టు పేర్కొన్నారు. -
‘అన్నా’కు ఘన నివాళి
సాక్షి, చెన్నై:ప్రతి ఏటా అన్నాదురై జయంతిని రాష్ర్టంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే తదితర పార్టీల నేతృత్వంలో సేవా, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ పోటీలకు వేదికగా అన్నా జయంతిని ఎంపిక చేసుకుంటూ వస్తున్నారు. సోమవారం అన్నాదురై 106వ జయంతి కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల్లో వేడుకలు జరిగాయి. ఆయా పార్టీల నేతృత్వంలో వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో అన్నా చిత్ర పటాల్ని ఉంచి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవల్ని గుర్తు చేసుకుంటూ అన్నా పాటల్ని, ప్రసంగాల్ని హోరెత్తించారు. నేతల నివాళి: అన్నా జయంతిని పురస్కరించుకుని కోయంబత్తూరులోని ఆయన విగ్రహానికి సీఎం జయలలిత పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు ఓ పన్నీర్ సెల్వం, పళనియప్పన్, వైద్యలింగం, మోహన్, మునుస్వామి తదితరులు నివాళులర్పించారు. చెన్నై అన్నా సాలైలోని అన్నా విగ్రహం వద్ద అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్, నాయకులు బన్రూటి రామచంద్రన్, సులోచనా సంపత్, విశాలాక్షి నెడుంజెలియన్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. వళ్లువర్‌కోట్టంలోని అన్నా విగ్రహం వద్ద డీఎంకే నేతృత్వంలో వేడుకలు జరిగాయి. డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్, కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, నాయకులు ఆర్కాట్ వీరా స్వామి, దురై మురుగన్, సద్గుణ పాండియన్, టీ ఆర్ బాలు తదితరులు పాల్గొని అన్నా విగ్రహానికి పూలమాలలు వేశారు. సాయంత్రం అన్నా అరివాళయంలో అన్నా జయంతి, పెరియార్ జయంతి, డీఎంకే ఆవిర్భావ వేడుక మూడింటిని కలుపుతూ ముప్పెరుం విళా ఘనంగా జరిగింది. ఇందులో డీఎంకే నేతృత్వంలో జరిగిన పోటీల్లో విజేతలకు, పదో తరగతి, ప్లస్‌టూ పరీక్షల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులను కరుణానిధి ప్రదానం చేశారు. ఎంజియార్ మండ్రం అధ్యక్షుడు ఆర్ఎం వీరప్పన్, పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం అన్నాకు నివాళులర్పించారు. ఎండీఎంకే నేతృత్వంలో ఆ పార్టీ కార్యాలయం తాయగంలో అన్నా జయంతిని నిర్వహించారు. ఆ పార్టీ అధినేత వైగో అన్నా విగ్రహానికి పూల మాలలు వేశారు. అనంతరం పూందమల్లిలో జరిగే మహానాడుకు వెళ్లారు. అక్కడ వేదిక వద్ద అన్నా విగ్రహం ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అన్నా జయంతిని పురస్కరించుకుని జరిగిన మహానాడులో బల నిరూపణకు వైగో యత్నించడం గమనార్హం. డీఎండీకే కార్యాలయంలో జరిగిన వేడుకలో అన్నా చిత్ర పటానికి విజయకాంత్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు పుష్పాంజలి ఘటించారు. -
విజయ్ కాంత్ 10 లక్షల విరాళం
చెన్నై: వరదలతో అతలాకుతలమైన జమ్మూ,కాశ్మీర్ ను ఆదుకునేందుకు డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్ కాంత్ 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు. గత 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా జమ్మూ, కాశ్మీర్ ను వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా ప్రజల జీవితం దుర్భరంగా మారిందని విజయ్ కాంత్ తెలిపారు. విజయ్ కాంత్ తన సహాయాన్ని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి అందించారు. కష్టాల్లో ఉన్న జమ్మూ,కాశ్మీర్ ప్రజలను ఆదుకునేందుకు సంపన్నులు, వ్యాపారవేత్తలు, యువకులు ముందుకు రావాలని ఓ ప్రకటనలో కోరారు. -
అన్నాడీఎంకేపై ధ్వజమెత్తిన విజయకాంత్
దిందిగల్(తమిళనాడు): అధికార అన్నాడీఎంకే పార్టీపై ప్రతిపక్ష నాయకుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఆగడాలు అధికమయ్యాయని మండిపడ్డారు. మరే పార్టీ పోటీ చేయకుండా అధికార పార్టీ అడుపడుతోందని ఆరోపించారు. మరేయితర పార్టీ పోటీ చేయకూడదనుకుంటే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్నాడీఎంకే ప్రలోభాలు, బెదిరింపులకు దిగుతోందని ఆయన ఆరోపించారు. -
పేదలకు రూ.కోటి
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ వెయ్యి మంది పేదలకు రూ.పది వేలు చొప్పున రూ.కోటి విలువ గల వస్తువులను శనివారం పంపిణీ చేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తన జన్మదిన వేడుకను గత కొన్నేళ్లుగా జరుపుకుంటూ వస్తుంటే, ప్రజాకర్షణ లక్ష్యంగా అధికార పక్షం పథకాలను హామీలకే పరిమితం చేస్తున్నదని మండిపడ్డారు. సినీ నటుడిగా ఉన్న సమయంలోనూ, రాజకీయ పార్టీ అధినేతగా అవతరించినప్పుడూ తన పుట్టినరోజును పేదరిక నిర్మూలన దినోత్సవం పేరుతో విజయకాంత్ జరుపుకుంటూ వస్తున్నారు. ఆగస్టు 25న 62వ వసంతంలోకి ఆయన అడుగు పెట్టనున్నారు. ఇందులో భాగంగా శనివారం కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయం ఆవరణలో ఈ వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది పేదలిను ఎంపిక చేసి, తలా పది వేలు చొప్పున కోటి రూపాయలు విలువగల వస్తువులను విజయకాంత్ పంపిణీ చేశారు. ఎంజీయార్ బధిర పాఠశాలకు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. ఈ వేడుకలో విజయకాంత్ సతీమణి ప్రేమలత, యువజన నేత ఎల్కే సుదీష్, పార్టీ నాయకులు పార్థసారథి, సివి చంద్రకుమార్, ఇళంగోవన్, యువరాజ, రాజన్, సెంతామరై కన్నన్, కామరాజ్, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ వేడుక అనంతరం విజయకాంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రజాధనం దుర్వినియోగం తన జన్మదినం రోజున పేదలకు ఇతోధికంగా సాయం అందించే లక్ష్యంతోనే వేడుకలు జరుపుకుంటూ వస్తున్నానని విజయకాంత్ గుర్తు చేశారు. అయితే, అధికార పక్షం కేవలం ప్రజాకర్షణే లక్ష్యంగా పథకాలను ప్రకటించి, అమల్లో విఫలమవుతోందని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారేగానీ, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరలేదని ధ్వజమెత్తారు. ప్రజాధనం దుర్వినియోగమైనట్లు కాగ్ స్పష్టం చేస్తోందని ఆరోపించారు. ప్రజల్ని ఆకర్షించే విధంగా సరికొత్త నినాదాన్ని అందుకుని పథకాలను ప్రకటిస్తున్నారని, ఇవన్నీ అమలయ్యేది అనుమానమేనన్నారు. ఎన్నికల హామీలనే సక్రమంగా అమలు చేయకుండా, చేసినట్టుగా జిమ్మిక్కులు చేయడం విడ్డూరంగా ఉందని మండి పడ్డారు. ఈ ప్రభుత్వ విధానాలతో ప్రజలు అష్టకష్టాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. హత్యలు, దోపిడీల పర్వంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. -
తమిళిసైకు అభినందనల వెల్లువ
సాక్షి, చెన్నై: రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం జయలలిత ప్రత్యేకంగా అభినందన లేఖ పంపించారు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే నేతలు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత కుమరి ఆనందన్ తన కుమార్తె ఎక్కడున్నా, ఆనందంగా ఉండాలని ఆశీర్వదించారు. సమష్టి సహకారంతో పార్టీ బలోపేతానికి ముందుకు సాగునున్నట్టు కొత్త అధ్యక్షురాలు తొలి పలుకు పలికారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ప్రప్రథమంగా మహిళా నాయకురాలు తమిళి సై సౌందరరాజన్ నియమితులైన విషయం తెలిసిందే. ఈమె తండ్రి కుమరి ఆనందన్ కాంగ్రెస్‌వాది. కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న కుమరి ఆనందన్ బాటలో కాకుండా, బీజేపీ వైపుగా పదిహేనేళ్ల క్రితం తమిళి సై అడుగులు వేశారు. భర్త సౌందరరాజన్, తాను వృత్తి పరంగా వైద్యులైనప్పటికీ, రాజకీయంగా స్వశక్తితో బీజేపీలో ఆమె ఎదిగారు. రెండు సార్లు అసెంబ్లీకి, ఓ మారు లోక్ సభకు పోటీ చేసి ఓటమి చవి చూసినా డీలా పడలేదు. చిన్న చిన్న పదవుల నుంచి జాతీయ స్థాయి పదవిని దక్కించుకుని, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానంలో కూర్చున్న తొలి మహిళగా రికార్డులోకి ఎక్కారు. దీంతో తమిళి సైకు పార్టీలకు అతీతంగా అభినందిస్తున్నారు. అభినందన లేఖ : తమిళి సై సౌందరరాజన్‌ను అభినందిస్తూ సీఎం జయలలిత ప్రత్యేక లేఖ పంపించారు. ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా తమరు నియమితులు కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రశంసించారు. తమరు మరింతగా రాణించగలరన్న నమ్మకం ఉంద ంటూ తన శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో, పీఎంకే నేత రాందాసు, పుదియ నిధి కట్చి నేత ఏసీ షన్ముగం శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్నాళ్లు బీజేపీ నేతలకు దూరంగా ఉన్న ఎండీఎంకే, పీఎంకే, డీఎండీకే నేతలు తమిళి సై రాకతో ఆనందం వ్యక్తం చేయడం గమనించాల్సిందే. ఇక, జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వంతో స్నేహ పూర్వకంగా మెలిగే పనిలో పడ్డ సీఎం జయలలిత, కొత్త అధ్యక్షురాలికి అభినందనల లేఖ రాయడం బట్టి చూస్తే, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని అక్కున చేర్చుకోవచ్చన్న చర్చ మొదలైంది. ఇక, తన కుమార్తె రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులవడంతో కుమరి ఆనందన్ సంతోషం వ్యక్తం చేశారు. ఆమె ఎక్కడున్నా.., ఆనందంగా జీవించాలని ఆశీర్వదిస్తున్నట్లు పేర్కొన్నారు. సమష్టిగా ముందుకు : అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తమిళిసై సౌందరరాజన్ సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా అందరినీ కలుపుకుని సమష్టిగా పార్టీ బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగనున్నట్టు ప్రకటించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, తన మీద నమ్మకంతో ఈ పదవిని జాతీయ నేతలు అప్పగించారని పేర్కొన్నారు. పదవిగా కాకుండా బాధ్యతగా తాను భావిస్తున్నానన్నారు. ప్రతి క్షణం పార్టీ కోసం శ్రమించనున్నట్టు చెప్పారు. అందర్నీ కలుపుకుని పార్టీ బలోపేతానికి అడుగులు వేయనున్నామని, అసెంబ్లీ ఎన్నికల్లోపు బలమైన శక్తిగా అవతరించాలన్న కాంక్షతో ముందుకు సాగుతామని తెలిపారు. తమిళ ప్రజలకు తన వంతుగా కేంద్రం నుంచి ఏమేమి రావాలో, అందాలో వాటిని సరైన సమయంలో సక్రమంగా తెప్పించేందుకు కృషి చేస్తానన్నారు. -
‘మెగా’చూపు
అసెంబ్లీ ఎన్నికల్లో మెగా కూటమి లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కూటమికి జైకొట్టే రీతిలో డీఎంకే వర్గాలకు డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత సంకేతాన్ని పంపించినట్టు తెలిసింది. కరుణ నేతృత్వానికి ఓకే అని, స్టాలిన్ అంటే ఆలోచించాల్సి ఉంటుందన్న ఆమె సంకేతం డీఎంకే వర్గాలను ఆలోచనలో పడేసినట్టు సమాచారం. సాక్షి, చెన్నై:డీఎండీకే ఆవిర్భావం కాలం నుంచి డీఎంకేకు వ్యతిరేకంగా విజయకాంత్ వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో దోస్తీ కట్టి, డీఎంకే ప్రభుత్వ పతనమే లక్ష్యంగా శ్రమించారు. ఆ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఛీదరించుకోవడంతో ఒంటరిగా మిగిలా రు. పార్టీ ఎమ్మెల్యేలు పలువురు రెబల్ అవతా రం ఎత్తినా, సీనియర్లు టాటా చెప్పినా విజయకాంత్ ఏమాత్రం తగ్గలేదు. లోక్ సభ ఎన్నికల్లో వినూత్న పంథాను అనుసరించారు. రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా జాతీయ పార్టీ(బీజేపీ) కూటమితో జతకట్టారు. ఈ ఎన్నికల అనంతరం బీజేపీ తమను పక్కన పెట్టడం విజయకాంత్‌ను జీర్ణించుకోలేకపోయారు. అన్నాడీఎంకే, బీజేపీ రూపంలో ఎదురైన అవమానాలతో అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాను చాటుకునేందుకు రెడీ అయ్యారు. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపే విధంగా ఁమీతో నేనురూ. కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల సింగపూర్ వెళ్లి, శస్త్ర చికిత్సను చేయించుకొచ్చిన విజయకాంత్ ఇంటి వద్ద నుంచి పార్టీ కార్యక్రమాలను, ప్రకటనలను విడుదల చేస్తూ, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై విమర్శలు, ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. పిలుపు: అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమయ్యే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ వస్తున్న విజయకాంత్ పొత్తుల విషయంలో ఇది వరకు చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలకు రెడీ అయ్యారు. తాను దూషిస్తున్నా, తనను అక్కున చేర్చుకునేందుకు పదేపదే డీఎంకే ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ సారి ఎన్నికల్లో ఆ కూటమి వైపు చూడ్డానికి విజయకాంత్ సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎన్నికల సమయంలో పొత్తులు ప్రకటించుకోకుండా, ముందుగానే నిర్ణయాలు తీసుకుని, కలసిమెలసి పనిచేయడం లక్ష్యంగా కసరత్తుల్లో నిమగ్నమై ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే శనివారం పార్టీ సమావేశానికి ఆయన పిలుపునిచ్చినట్టు చెబుతున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై పార్టీ నాయకుల అభిప్రాయాలను తీసుకుని ముందుకు సాగేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకోవటం గమనార్హం.చర్చలు : పొత్తుకు రెడీ అయిన విజయకాంత్ కసరత్తుల్లో బిజీ బిజీగా ఉంటే, తాము డీఎంకే వైపు చూస్తున్నామన్న సంకేతాన్ని ఆయన సతీమని ప్రేమలత పేర్కొనడం ఆలోచించాల్సిందే. ఇటీవల డీఎంకే నాయకులు పలువురు పరామర్శ పేరిట విజయకాంత్ ఇంటికి వెళ్లారు. వారితో రాజకీయ అంశాలపై విజయకాంత్ చర్చలు సాగించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ప్రేమలత డీఎంకే అధినేత కరుణ నేతృత్వానికి ఓకే అని, స్టాలిన్ నేతృత్వం అంటే ఆలోచించాల్సి ఉంటుందని పేర్కొనడం వెలుగులోకి రావడంతో చర్చ బయలు దేరింది. డీఎంకేలో స్టాలిన్ నేతృత్వానికి ఆయన మద్దతుదారులు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. దీన్ని కరుణానిధి వ్యతిరేకిస్తూ, పార్టీ వర్గాల నోళ్లు మూయించే పనిలో పడ్డారు. మెగా కూటమికి అడ్డంకులు సృష్టించే యత్నం చేయొద్దని పార్టీ వర్గాలకు హితవు పలికారు. ఈ పరిస్థితుల్లో ప్రేమలత విజయకాంత్ ఇచ్చిన సంకేతాన్ని డీఎంకే వర్గాలు ఆహ్వానిస్తున్నా, స్టాలిన్ మద్దతుదారులు మాత్రం గుర్రు మంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలో మెగా కూటమికి కరుణానిధి నేతృత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా, ఆయన గొడుగు నీడన ఎన్నికలు ఎదుర్కొనే రీతిలో పార్టీ సమావేశంలో విజయకాంత్ నిర్ణయం తీసుకుంటారా..? లేదా, ఒంటరి..ఒంటరి అంటూ చివరికి పొత్తుకు రెడీ అనే పాత పల్లవిని ఆయన అందుకుంటారో .. అన్నది వేచి చూడాల్సిందే. -
వీల్ చైర్లో కెప్టెన్
సాక్షి, చెన్నై: లోక్ సభ ఎన్నికల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్యం బారిన పడ్డట్టున్నారు. ఓ వైపు పార్టీ డిపాజిట్లు గల్లంతు కావడం, మరో వైపు జంప్ జిలానీకి ఎమ్మెల్యేలు రెడీ అవుతున్న సంకేతాలు వెరసి ఆయనలో కలవరాన్ని సృష్టించాయి. ఎన్నికల ముందుగా సింగపూర్‌కు పరుగులు తీసిన విజయకాంత్, ఎన్నికల అనంతరం కూడా ఉరకలు తీశారు. సింగపూర్ పర్యటనకు ముందుగా ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఒక రోజు చికిత్స పొందడం ఆ పార్టీ వర్గాలను కలవరంలో పడేసింది. అయితే, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారన్న భరోసాను ఇచ్చారు. ఆస్పత్రి నుంచి వచ్చిన విజయకాంత్ ఈనెల 13న తన సతీమణి ప్రేమలతతో కలసి సింగపూర్ వెళ్లారు. అయితే, ఆయన పర్యటన వివరాలను అత్యంత రహస్యంగా ఉంచారు. రెండు వారాల పాటుగా సింగపూర్‌లో ఉన్న విజయకాంత్ చెన్నైకు తిరుగు పయనం అవుతున్నట్టు శనివారం సమాచారం అందింది. అదే రోజు రాత్రి చెన్నైకు చేరుకోవాల్సి ఉన్నా, ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆదివారం ఉదయాన్నే ఆయన చెన్నైకు వస్తున్నారన్న సమాచారంతో మీడియా మీనంబాక్కం విమానాశ్రయానికి చేరుకుంది .ముందు ప్రేమలత : విజయకాంత్ ఏదేని కొత్త విషయాలు చెబుతారన్న ఆసక్తితో మీడియా మీనంబాక్కంకు పరుగులు తీసింది. సింగపూర్ నుంచి ఉదయం 10.10 గంటలకు సిల్క్ ఎయిర్ వేస్ చెన్నైలో ల్యాండ్ అయింది. ఆ విమానం నుంచి ప్రేమలత మాత్రం దిగి బయటకు వచ్చారు. అయితే, విజయకాంత్ రాలేదన్న సంకేతం ఇవ్వడానికే ఆమె తొలుత బయటకు వచ్చినట్టుంది. విమానం నుంచి ప్రయాణికులందరూ కిందకు దిగిన కాసేపటికి విజయకాంత్‌ను వీల్ చైర్లో సిబ్బంది తీసుకొచ్చారు. శరీరంపై దుప్పటి కప్పి ఉన్నట్టుగా వీల్ చైర్లో బయటకు వచ్చిన విజయకాంత్‌ను మీడియా కంట పడకుండా జాగ్రత్తగా కారులో ఎక్కించారు. అక్కడి నుంచి ఆ కారు విజయకాంత్ ఇంటి వైపుగా దూసుకెళ్లింది. అయితే, విజయకాంత్‌కు ఏమయ్యిందోనన్న వివరాలను ఆ పార్టీవర్గాలే చెప్పలేని పరిస్థితి. అనారోగ్యం బారిన పడ్డ విజయకాంత్‌కు సింగపూర్‌లో ఏదైనా శస్త్ర చికిత్స జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారయి. అయితే, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు ఎలాంటి వ్యాధులు లేవంటూ విజయకాంత్ ఇది వరకు స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఆయన వీల్ చైర్లో రావడంతో ఏమయ్యిందోనన్న విషయాన్ని ఆరా తీయడానికి తమిళ మీడియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. -
విజయకాంత్, ప్రేమలతపై పరువునష్టం దావా
టీనగర్: విల్లుపురం కోర్టులో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ప్రేమలతపై పరువునష్టం కేసు దాఖలైంది. ముఖ్యమంత్రి జయలలితపై అనుచి త వ్యాఖ్యలు చేసిన డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, మరో ఇద్దరు ఎమ్మెల్యేలపై విల్లుపురం కోర్టులో శుక్రవారం కేసు దాఖలైంది. ఫిబ్రవరి రెండవ తేదీవిల్లుపురం జిల్లా ఉల్లుందూర్ పేటైలో డీఎండీకే రాష్ట్ర మహానాడు జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి జయలలిత పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, ఎమ్మెల్యేలు పార్థసారథి వెంకటేశన్ మాట్లాడినట్లు విల్లుపురం ప్రభుత్వ న్యాయవాది పొన్ శివ విల్లుపురం జిల్లా ఫస్ట్ క్లాస్ కోర్టులో నలుగురిపై వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషన్‌పై విచారణ వచ్చే ఆగస్ట్ 27వ తేదీన జరుగనుంది. ఆరోజున విజయకాంత్, ప్రేమలత పార్థసారథి, వెంకటేశన్ హాజరు కావాలంటూ న్యాయమూర్తి కృష్ణమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. -
విజయకాంత్ డిశ్చార్జ్
సాక్షి, చెన్నై: ఆస్పత్రి నుంచి డీఎండీకే అధినేత విజయకాంత్ డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు తేల్చారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం బిజీ షెడ్యూల్‌తో డీఎండీకే అధినేత విజయకాంత్ ఉరుకులు పరుగులు తీస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. యాంజీయోగ్రాం చేయడానికి చర్యలు తీసుకున్నారు. అయితే, విజయకాంత్‌కు జరిపిన పూర్తి స్థాయి పరీక్షల అనంతరం ఆ ప్రయత్నం విరమించారు. ఈసీజీ, ఎక్స్‌రే, స్కాన్ తదితర పరీక్షల అనంత రం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని తేల్చారు. అధిక ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లేని దృష్ట్యా, ఆయన అస్వస్థతకు గురి కావడంతో స్వల్పంగా ఛాతి నొప్పి వచ్చి ఉంటుందని వైద్యులు భావించారు.విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ ఆయన్ను అదే రోజు రాత్రి డిశ్చార్జ్ చేశారు. ఉదయాన్నే విజయకాంత్‌ను పార్టీ ఎమ్మెల్యేలు కలిసేందుకు యత్నించినా, కుటుంబీకుల అంగీకరించలేదు. అసెంబ్లీ అనంతరం కొం దరు ఎమ్మెల్యేలులు విజయకాంత్‌ను ఆయన నివాసంలో కలిసినట్టు సమాచారం. -
నటించాలన్న ఆసక్తి లేదు
టీ.నగర్: తనకు మళ్లీ సినిమాల్లో నటించాలన్న ఆసక్తి లేదని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ వెల్లడించారు. సేలంలో సోమవారం ‘మీతో నేను’ అనే కార్యక్రమం ఐదురోడ్ల కూడలిలోని కల్యాణ మండపంలో జరిగింది. ఇందులో సేలం, నగర జిల్లా, తూర్పు, పచ్చిమ జిల్లాలకు చెందిన నిర్వాహకులు, కార్యకర్తలు 1000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయకాంత్ కార్యకర్తల ప్రశ్నలకు బదులిచ్చారు. కార్యకర్తలు సినిమాల్లో మళ్లీ నటిస్తారా అని ప్రశ్నించగా విజయకాంత్ బదులిస్తూ తనకు ఆరోగ్యం సహకరించనందున ఎక్కువ సేపు మాట్లాడలేనని అయినప్పటికీ ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నలకు బదులిస్తానన్నారు. తాను సినిమాల్లో నటించి నాలుగేళ్లకు పైగా కావస్తుందని ఇకపై సినిమాల్లో నటించే ఆశ లేదన్నారు. తనకు బదులు తన కుమారుడు సినిమాలో నటిస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు విజయకాంత్‌తో ఫొటోలు తీయించుకున్నారు. ఆ తరువాత నిర్వాహకులతో విజయకాంత్ సమావేశం నిర్వహించారు. 2016లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. 2016లో డీఎండీకే మహత్తర శక్తిగా రూపొందనుందన్నారు. ప్రతి యూనియన్‌లోను ప్రతి నెలా 1000 మంది సభ్యులు పార్టీలోకి చేరి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. -
బలోపేతం
లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతు, ఓటు బ్యాంక్ పతనం వెరసి డీఎండీకే అధినేత విజయకాంత్‌ను డైలమాలో పడేశాయి. మళ్లీ బలం పుంజుకోవడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకుల చెంతకు స్వయం గా వెళ్లేందుకు ఆయన నిర్ణయించారు. రోజుకో జిల్లాను ఎంపిక చేసుకుని పార్టీ వర్గాల మొరను ఆలకించడంతో పాటుగా బలోపేతానికి మార్గదర్శకాలను ఉపదేశించనున్నారు. సాక్షి, చెన్నై : బీజేపీ కూటమితో కలసి లోక్‌సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొన్న విషయం తెలిసిందే. 14 స్థానాల బరిలో అభ్యర్థులను నిల బెట్టిన విజయకాంత్‌ను ఫలితాలు పెద్ద షాక్‌కు గురి చేశాయి. సేలంలో తన బావమరిది సుదీష్ తప్పకుండా గెలుస్తాడని, మరో స్థానం తప్పకుండా తమ గుప్పెట్లోకి వస్తుందన్న ఆశాభావంతో ఉన్న విజయకాంత్ చివరకు భంగ పడ్డారు. డిపాజిట్లు గల్లంతు కావడంతోపాటుగా పూర్వం ఉన్న ఓటు బ్యాంక్ పతనంతో డైలమాలో పడాల్సి వచ్చింది. తమను నమ్ముకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొన్న బీజేపీ, తమ కంటే ఎక్కువ ఓటు బ్యాంక్‌ను దక్కించుకోవడం డీఎండీకే నేతలను, ఆ పార్టీ వర్గాల్ని కలవరంలో పడేసింది. కలవరం : తమ ఓటు బ్యాంక్‌ను బీజేపీ కొల్లగొట్టినా, ఆ ప్రభుత్వంలో తమకు చోటు దక్కని దృష్ట్యా, తీవ్ర అసంతృప్తితో విజయకాంత్ ఉన్నారు. పార్టీ అభ్యర్థుల ఓటమి కారణాల్ని అన్వేషించారు. పార్టీ నుంచి వలసలు బయలు దేరకుండా జాగ్రత్తలు పడ్డారు. తనయుడు చిత్ర షూటింగ్ నిమిత్తం సింగపూర్‌కు చెక్కేశారు. సింగపూర్ నుంచి తిరుగు పయనమైన విజయకాంత్ ఇక, పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతం మీద దృష్టి పెట్టేందుకు నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో చతికిలబడ్డ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు సిద్ధం అయ్యారు. కార్యకర్తలు, నాయకులను తన వద్దకు పిలిపించుకోవడం కన్నా, స్వయంగా తానే వారి వద్దకు వెళ్లడం మంచిదన్న నిర్ణయానికి వచ్చారు. కార్యకర్తల చెంతకు : పార్టీ బలోపేతానికి తానొక్కడినే నిర్ణయం తీసుకోకుండా, పార్టీ శ్రేణుల అభిప్రాయాల సేకరణ, కార్యకర్తల మొరను ఆలకించే విధంగా కార్యాచరణను విజయకాంత్ సిద్ధంచేశారు. రోజుకో జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ వార్డు కమిటీ నుంచి గ్రామ, పట్టణ, యూనియన్, నగర, జిల్లా కార్యవర్గాలతో సమావేశం కానున్నారు. సభ్యత్వ గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ విజయకాంత్ సమావేశానికి హాజరు కావాలని పార్టీ అధిష్టానం పిలుపు నివ్వడం గమనార్హం. 26 నుంచి పర్యటన : విజయకాంత్ పర్యటన వివరాలను డీఎండీకే రాష్ట్ర పార్టీ కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. ఈనెల 26న కోయంబత్తూరు నుంచి తన పర్యటనకు విజయకాంత్ శ్రీకారం చుట్టనున్నారు. 27న తిరుప్పూర్, 28న కరూర్, 29న నామక్కల్, 30న సేలం, జూలై ఒకటిన ధర్మపురి, రెండున కృష్ణగిరి, మూడున వేలూరు, నాలుగున తిరువణ్ణామలైలో తొలి విడత పర్యటన సాగనుంది. -
అయ్యో..కెప్టెన్
డీఎండీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్‌కాంత్ పరిస్థితి ప్రస్తుతం తారుమారు అయ్యింది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఓ ఊపు ఊపిన ఆయన ఇప్పుడు కమలనాధుల దర్శనం కోసం పడిగాపులు పడుతున్నారు. ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని భార్య ప్రేమలతతో కలిసి ప్రచారం చేసిన విజయకాంత్‌కు...మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. ఇక ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతైనా, మిత్ర పక్షాలతో ఢిల్లీలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ తన పట్ల చూపిన ప్రేమ,ఆప్యాయతలు విజయకాంత్‌లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలంటూ ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందో లేదా, రాజపక్సేకు వ్యతిరేకంగా రాష్ట్రంలో సాగుతున్న ఆందోళనల్ని సైతం ఖాతరు చేయలేదు. తన సతీమణి ప్రేమలత, బావమరిది సుధీష్‌తో కలసి ఢిల్లీకి పరుగులు తీసిన విజయకాంత్‌కు చివరకు మిగిలింది నిరాశే. ఢిల్లీలో ఉన్నా, ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. తొలుత అనారోగ్య కారణాలతో ఆయన వెళ్లలేదన్న ప్రచారం జరిగినా, చివరకు తన బావమరిది సుధీష్‌కు సహాయ మంత్రి పదవి ఇవ్వక పోవడం, తనకు మొదటి వరుసలో కాకుండా మూడో వరుసలో సీటు కేటాయించడంతో విజయకాంత్ కినుకు వహించారు. దర్శనం కోసం ఎదురు చూపు: ప్రమాణ స్వీకారం ముగిసినా, చెన్నైకు విజయకాంత్ తిరుగు పయనం కాలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను కలిసి ఎన్నికల సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందాల అమలుకు విజయకాంత్ తీవ్రంగానే ప్రయత్నించినట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర నేతలు పట్టించుకోకపోవడంతో ఒంటరిగానే అపాయింట్మెంట్ ప్రయత్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బుధవారం రాత్రి వరకు తన ప్రయత్నం చేసినా, కమలనాథుల దర్శనం మాత్రం విజయకాంత్‌కు దక్కలేదు. దీంతో విసిగి వేసారిన విజయకాంత్, ప్రేమలత, సుధీష్ తీవ్ర అసహనంతో గురువారం ఉదయాన్నే చెన్నైకు తిరుగు పయనం అయ్యారు. చివరి క్షణంలోనైనా తమకు మోడీ దర్శనం దక్కుతుందని భావించినా, మిగిలింది నిరాశే. ఎన్నికలప్పుడు తమను వాడుకుని ఇప్పుడు కమలనాథులు చీదరించుకోవడాన్ని డీఎండీకే వర్గాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అయితే డీఎండీకేను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను విజయకాంత్ తిరస్కరించడంతోనే ఆయన్ను దూరంగా పెట్టాలని కమలనాథులు నిర్ణయించినట్టు సమాచారం. అందుకే ఢిల్లీలో పడిగాపులు కాసినా, మోడీ, రాజ్‌నాథ్‌ల దర్శనం విజయకాంత్‌కు దక్కలేదన్న ప్రచారం ఊపందుకుంది. ఢిల్లీ నుంచి చెన్నైకు వచ్చిన విజయకాంత్ పార్టీశ్రేణులకు పిలుపునిస్తూ ప్రకటన విడుదల చేశారు. జూన్ నాలుగో తేదీన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనున్నదని, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఈ దృష్ట్యా, ఆ సమావేశానికి పెద్ద ప్రాధాన్యత నెలకొన్నట్టే కనిపిస్తోంది. -
బీజేపీ కూటమిలో బుజ్జగింపులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీపై గంపెడాశలు పెట్టుకున్న కూటమి నేతలు భంగపాటుకు గురవడంతో బుజ్జగింపుల పర్వం మొదలైంది. కేంద్ర మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం ఆశించిన విజయకాంత్, అన్బుమణి రాందాస్ ఆశలపై బీజేపీ నీళ్లు చల్లిందనే చర్చమొదలైంది. బీజేపీకి పూర్తిస్థాయి మెజార్టీ లభించడం ఖాయమని, అయినా మిత్రపక్షాలకు కేంద్రమంత్రి వర్గంలో చోటు ఉంటుందని ఎన్నికల ప్రచార సభలో నరేంద్రమోడీ పదేపదే ప్రస్తావించారు. దీంతో మిత్రపక్షాల్లో ఉత్సాహం ఉరకలేసింది. మోడీ చెప్పినట్లుగానే బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించగా, తమకు ఏదోఒక పదవి ఖాయమని డీఎండీకే అధినేత విజయకాంత్ భావించారు. ఢిల్లీ పెద్దలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మోడీ ప్రమాణస్వీకార సభకు ముందురోజే సతీమణి ప్రేమలత, బావమరిది సుదీష్లతో డిల్లీకి చేరుకున్నారు. పొత్తు చర్చల సమయంలోనే సుదీష్‌కు కేంద్రమంత్రి పదవి లేదా రాజ్యసభ సభ్వత్వం ఒప్పందం చేసుకున్నారు. అయితే ఎంతకూ మోడీ నుంచి పిలుపు రాకపోవడంతో ముగ్గురూ హోటల్‌కే పరిమితమయ్యూరు. తరువాత జరిగిన ప్రమాణస్వీకార సభకూ హాజరుకాలేదు.పీఎంకేకు నిరాశే రాష్ట్రంలో బీజేపీ కూటమి నుచి విజేతగా నిలిచిన ఏకైక అభ్యర్థి అన్బుమణి రాందాస్ (పీఎంకే) యూపీఏ 1లో ఆరోగ్యశాఖా మంత్రిగా కేబినెట్ హోదాలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ కారణంగా మిత్రపక్షాలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి తనకు మంత్రి పదవి ఖాయమని అన్బుమణి ఆశించారు. అయితే ఆయనకూ చోటు దక్కలేదు. కేబినెట్ కాదు కనీసం సహాయ మంత్రికీ నోచుకోలేదని విజయకాంత్, అన్బుమణి అసహనం వ్యక్తం చేస్తున్నారు. విస్తరణలో పొన్కు కేబినెట్ కన్యాకుమారి నుంచి గెలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్‌కు సహాయ మంత్రి పదవి దక్కడం కూడా విమర్శలకు తావిచ్చింది. 1999లో వాజ్‌పేయి కేబినెట్లో యువజన సంక్షేమం, దారిద్య్ర నిర్మూలన శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఈ సారి కేబినెట్ హాదా దక్కుతుందని ఆశించినా, మళ్లీ సహాయ మంత్రిగా సరిపెట్టుకోవడంపై బీజేపీలోనే చెవులు కొరుక్కుంటున్నారు. తక్కువ మంత్రులు ఎక్కువ సామర్ద్యం అనే నినాదంతో ముందుకెళ్లాలని భావిస్తున్న మోడీ రానున్న రోజుల్లో పొన్కు కేబినెట్ పదవినిస్తారని పార్టీ సీనియర్ నేత చెబుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తమిళనాడుకు చెందిన పార్టీ ప్రముఖులు సోమవారం రాత్రి పొన్ రాధాకృష్ణన్‌కు ఢిల్లీలోని ఒక హోటల్లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీ సీనియర్ నేత ఇలగణేశన్తోపాటూ మిత్రపక్షాలైన పీఎంకే, ఐజేకే తదితర మిత్రపక్ష పార్టీ నేతలు హాజరయ్యూరు. సుమారు గంటపాటూ వారితో గడిపిన పొన్‌రాధాకృష్ణన్ వారిలోని అసంతృప్తిని చల్లార్చేందుకు బుజ్జగించినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా. కేంద్ర కేబినెట్లో తమిళులు తమిళనాడు నుంచి వివిధ పార్టీల తరపున గతంలో కేంద్ర కేబినెట్లో పలువురు మంత్రి పదవులు పొందారు. కాంగ్రెస్ తరపున రాజాజీ, సుబ్బరాయన్, వెంకట్రామన్, సీ సుబ్రమణియన్, మోహన కుమారమంగళం, పీ చిదంబరం, జీకే వాసన్, అరుణాచలం, మణిశంకర్ అయ్యర్ ఉన్నారు. తమిళనాడు రాజీవ్ కాంగ్రెస్ వాళపాడి రామమూర్తి, అన్నాడీఎంకే నుంచి తంబిదురై, సేడపట్టి ముత్తయ్య, డీఎంకే నుంచి మురసొలి మారన్, టీజీ వెంకట్రామన్, టీఆర్ బాలు, దయానిధి మారన్, రాజా, అళగిరి, పీఎంకే తరపున అన్బుమణి, బీజేపీ నుంచి రంగరాజన్ కుమారమంగళం కేంద్రంలో కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. -
స్టాలిన్‌తో ఎలాంటి విబేధాలు లేవు
సాక్షి, చెన్నై: డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా నటి ఖుష్బు ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఏప్రిల్ ఐదో తేదీ నుంచి నిర్విరామంగా 17 రోజుల పాటు ఆమె ప్రచారం సాగ నుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం కోసం తాను సిద్ధం అయ్యానని, అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టే విధంగా తన ప్రచార ప్రసంగాలు ఉంటాయని వివరించారు. అయితే, ప్రచారంలో ఎక్కడా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువ మక్కల్ కట్చి నేత శరత్‌కుమార్‌ను విమర్శించనని ప్రకటించారు. పార్టీ ముఖ్యం: తాను డీఎంకేలో కార్యకర్తను, నాయకురాలిని కావున తనకు పార్టీ ముఖ్యం అని స్పష్టం చేశారు. డీఎంకేకు అనుకూలంగానే తాను వ్యవహరిస్తుంటానని పేర్కొన్నారు. వదంతులను పట్టించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. పుకార్లు పుట్టించే వాళ్లు పుట్టిస్తూనే ఉంటారని, వాటి గురించి ఆలోచించడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని వ్యంగ్యాస్త్రం సంధించారు. పార్టీ వర్గాలతో ఎలాంటి అభిప్రాయ బేధాలు తనకు లేదని స్పష్టం చేశారు. స్టాలిన్‌తో అసలు ఎలాంటి విబేధాలు లేవు అని, అంతా మీడియా సృష్టేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వేళ పార్టీలో తనకు ఇబ్బందులు కలిగి ఉంటే, ఎప్పుడో పార్టీని వీడేదాన్ని అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పిల్లల కోసం : తన ఇద్దరు పిల్లల కోసం సినిమాలకు దూరంగా ఉన్నానని, వారితో ఎక్కువ సమయం గడపాలన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలు లేనప్పుడు పిల్లలతో సరదాగా గడుపుతానని, అంత మాత్రాన పార్టీకి దూరంగా ఉన్నట్టు కాదన్నారు. పార్టీ కోసం కష్టపడేందుకు తాను సిద్ధం అని, తాను సరైన అభ్యర్థి కాదు కాబట్టే, తనకు ఎన్నికల్లో సీటు ఇవ్వలేదని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన సేవల్ని ప్రచారానికి పార్టీ ఉపయోగించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఎన్నికల్లో డీఎంకే ప్రగతిని, అన్నాడీఎంకే వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రసంగాలు చేయనున్నానని వివరించారు. డీఎంకే చేసిందేమిటో, అన్నాడీఎంకే చేసిందేమిటో ప్రజలకు వివరించడమే కాదు, ఎవరైనా చర్చకు వచ్చినా తేల్చుకునేందుకు తాను సిద్ధం అని సవాల్ చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయను: ప్రచారంలో ఎవరి మీదా వ్యక్తిగత విమర్శలను తాను చేయనని స్పష్టం చేశారు. వ్యక్తిగత విమర్శలకు డీఎంకే దూరం అన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా డీఎండీకే అధినేత విజయకాంత్, సమత్తువమక్కల్ కట్చినేత శరత్‌కుమార్ రాజకీయ పార్టీలకు అధినాయకులైనా, డీఎంకేకు ప్రత్యర్థులుగా ఉన్నా, వారిని మాత్రం విమర్శించనని స్పష్టం చేశారు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లతో తనకు ఎలాంటి వ్యక్తిగత విబేధాలు లేవు అని, తామంతా ఒకే కుటుంబం అని, అందువల్లే వారిని మాత్రం విమర్శించనని పేర్కొన్నారు. నటి నగ్మా తన కన్నా సీనియర్ అని, ఆమెను ముద్దాడే విధంగా వ్యవహరించిన నాయకుడి చెంప పగలగొట్టి ఉండాలని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆ స్థానంలో తాను ఉండి ఉంటే, ఆ వ్యక్తి చెంప పగిలి ఉండేదన్నారు. ఇలాంటి పరిస్థితి తమకు ఇంత వరకు ఎదురు కాలేదని, ఎదురు కాదు కూడా అని ధీమా వ్యక్తం చేశారు. డీఎంకేలో మహిళకు భద్రత, రక్షణ ఉందని చివరి ప్రశ్నకు సమాధానం ఇచ్చి ముగించారు. -
డీఎండీకే అభ్యర్థి మార్పు
సాక్షి, చెన్నై: కడలూరు అభ్యర్థిని మారుస్తూ డీఎండీకే అధినేత విజయకాంత్ నిర్ణయం తీసుకున్నారు. రామానుజంకు బదులుగా జయ శంకర్ పోటీ చేస్తారని గురువారం ప్రకటించారు. బీజేపీ కూటమితోకలసి లోక్‌సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి 14 సీట్లను కేటాయించారు. అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విజయకాంత్ తమ కూటమికి మద్దతుగా ప్రచార బాటలో పయనిస్తున్నారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటన సాగిస్తున్న విజయకాంత్ రెండు రోజుల క్రితం కడలూరులో ప్రచారం చేపట్టాల్సి ఉంది. అయితే, ఆయనకు ఊహించని రీతిలో షాక్ ఎదురు అయింది. ఇప్పటికే నామక్కల్‌లో తనకు సీటు వద్దు బాబోయ్ అంటూ మహేశ్వరన్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోని విజయకాంత్‌కు తాజాగా మరో సమస్య ఎదురైంది. కడలూరు అభ్యర్థి స్థానికుడే కాదన్నది తేలింది. దీంతో అక్కడ పర్యటనను వాయిదా వేసుకుని, పార్టీ నాయకులతో మంతనాలు, చర్చల అనంతరం కొత్త అభ్యర్థిని ప్రకటించే పనిలో పడ్డారు. షాక్: కడలూరు అభ్యర్థిగా రామానుజం పేరును విజయకాంత్ తొలుత ప్రకటించారు. రిటైర్డ్ ప్రొఫెసర్‌గా ఉన్న రామానుజం స్వగ్రామం దిట్టకుడి. పార్టీకి చెన్నై నుంచి ఆయన సేవలను అందిస్తూ వస్తున్నారు. ఆవడి సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే, ఆయన చెన్నైలోనే స్థిర పడ్డ దృష్ట్యా, కడలూరు గురించి తెలిసింది శూన్యం. అక్కడ పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంది లేదు. కడలూరు ప్రచారానికి ముందు రోజు తన దృష్టికి ఈ విషయం రావడంతో విజయకాంత్ విస్మయంలో పడ్డారు. హుటాహుటిన పార్టీ నాయకుల్ని చెన్నైకు పిలిపించి చర్చించారు. వారి నుంచి కూడా అదే సమాధానం రావడంతో ఇక అభ్యర్థిని మార్చాల్సిన సంకట పరిస్థితి విజయకాంత్‌కు ఏర్పడింది. ఇక, నియోజకవర్గంలో ప్రచారం చేపట్టొద్దంటూ రామానుజంను వెనక్కు పంపించేశారు. బరిలో జయ శంకర్: ఎట్టకేలకు కొత్త అభ్యర్థిగా సీఆర్ జయశంకర్‌ను గురువారం విజయకాంత్ ఎంపిక చేశారు. కడలూరు జిల్లా నైవేలికి చెందిన జయ శంకర్ ఫైనాన్సియర్, ఆ జిల్లా పరిధిలో 25కు పైగా ఫైనాన్స్ కార్యాలయ శాఖలు ఉండడంతోపాటు సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థినే విజయకాంత్ ఎంపిక చేశారు. జయ శంకర్ వద్ద 30 వేల మందికి పైగా పని చేస్తుండటంతో సరైన అభ్యర్థిని రంగంలోకి దించారన్న ప్రచారం మొదలైంది. ఇన్నాళ్లు అభ్యర్థులను మార్చే అలవాటు అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మాత్రమే ఉండేది. దీనిపై పలు మార్లు విజయకాంత్ విమర్శలు గుప్పించి ఉన్నారు. అయితే, తాజాగా అదే పరిస్థితి ఆయనకు రావడం గమనార్హం. -
డీఎండీకే జాబితా విడుదల
సాక్షి, చెన్నై: బీజేపీ కూటమితో కలసి లోక్ సభ ఎన్నికలను డీఎండీకే ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డీఎం డీకేకు 14 స్థానాలను బీజేపీ కేటాయించింది. తమ కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయకాంత్ ప్రచార బాట పట్టారు. ఈనెల 14న తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన విజయకాంత్ తమ అభ్యర్థుల జాబితాను మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. తన టీవీ ఛానల్ ద్వారా ఐదుగురి పేర్లను ప్రకటించి కూటమిలో కలకలం సృష్టించారు. అదే సమయంలో నామక్కల్ అభ్యర్థి మహేశ్వరన్ తనకు సీటు వద్దు బాబోయ్ అంటూ ఆస్పత్రిలో చేరడం విజయకాంత్‌కు షాక్ తగలినట్టు అయింది. ఎట్టకేలకు సీట్ల పందేరం, స్థానాల ఎంపిక ఖరారు కావడం, కూటమి పార్టీలన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ చెన్నైలో రెండు రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఎన్నికల బరిలో నిలబడే తమ అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసే పనిలో విజయకాంత్ నిమగ్నం అయ్యారు. అన్ని కసరత్తులు పూర్తి చేసి ఆదివారం త మ అభ్యర్థుల జాబితాను డీఎంకే పార్టీ కార్యాలయం అధికార పూర్వకంగా ప్రకటించింది. విజయకాంత్ ఆదేశాల మేరకు ఉదయం కోయంబేడులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం వర్గాలు ఈ జాబితాను మీడియాకు విడుదల చేశారుు. అభ్యర్థులు : సెంట్రల్ చెన్నై- జేకే రవీంద్రన్, తిరువళ్లూరు -యువరాజ్, ఉత్తర చెన్నై- సౌందర పాండియన్, సేలం - ఎల్కే సుదీష్ , తిరుచ్చి - ఏఎంజీ విజయకుమార్, తిరునల్వేలి-ఎస్ శివానంద పెరుమాల్, విల్లుపురం - కే ఉమా శంకర్, కడలూరు - రామానుజం, కళ్లకురిచ్చి - వీపీ ఈశ్వరన్, తిరుప్పూర్ - ఎన్ దినేష్‌కుమార్, దిండుగల్ - కృష్ణమూర్తి, నామక్కల్ - ఎస్కే వేల్, మదురై - శివముత్తుకుమార్, కరూర్- ఎన్ఎస్కృష్ణన్ పోటీ చేస్తారని ప్రకటించారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన పలువురు అభ్యర్థులకు మళ్లీ సీట్లు ఇచ్చారు. తన బావమరిది సుదీష్‌ను సేలం నుంచి పోటీకి దించారు. సీట్ల పందేరంలో ఈ స్థానం కోసం బీజేపీ కూటమిపై డీఎండీకే తీవ్రంగానే ఒత్తిడి తెచ్చింది. అయితే, ఒక్క మహిళా అభ్యర్థికి కూడా విజయకాంత్ సీట్లు కేటాయించక పోవడం గమనార్హం. ఆలందూరు ఉప ఎన్నిక రేసులో ఎఎం కామరాజ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ప్రేమలత ప్రచార బాట: కూటమి అభ్యర్థులకు మద్దతుగా విజయకాంత్ రాష్ట్ర పర్యటనలో ఉంటే, కేవలం తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార బాటకు ఆయన సతీమణి ప్రేమలత సిద్ధమయ్యారు. రెండు రోజులకు ఒక నియోజకర్గం చొప్పున ఆమె పర్యటన షెడ్యూల్ సిద్ధం చేశారు. ఒకే నియోజకవర్గంలో ఏడెనిమిది చోట్ల ఆమె ప్రసంగాలు సాగనున్నారుు. ఆదివారం తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలో తమ అభ్యర్థి యువరాజ్‌కు మద్దతుగా ప్రచారాన్ని చేపట్టారు. సోమవారం కూడా ఆమె పర్యటించనున్నారు. 25న ఉత్తర చెన్నైలో, 26న ఆలందూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. 27, 28 తేదీల్లో సెంట్రల్ చెన్నై, 29,30 తేదీల్లో విల్లుపురం, ఏప్రిల్ 1,2 తేదీల్లో కడలూరు, 3,4 తేదీల్లో కళ్లకురిచ్చి, 5,6 తేదీల్లో సేలం, 7,8 తేదీల్లో నామక్కల్, 9,10 తేదీల్లో తిరుచ్చి, 11,12 తేదీల్లో కరూర్, 13,14న తిరుప్పూర్, 15,16న దిండుగల్, 17,18న తిరునల్వేలి, 19,20 తేదీల్లో మదురైలో ఆమె పర్యటన సాగనున్నది. -
కూటమి ఖరారు
బీజేపీ జాబితా విడుదల 25 స్థానాలు ఖాయమని పార్టీ ధీమా ఒకే వేదికపై రాజ్‌నాథ్, విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్ చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీలో సీట్ల కేటాయింపులో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి ఎట్టకేలకు కూటమి ఖరారైంది. సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగడంతో అభ్యర్థుల జాబితా గురువారం విడుదలైంది. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పోల్చుకుంటే ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతీయ పార్టీలతో బీజేపీ బలమైన కూటమిగా ఏర్పడింది. అయితే అదే స్థాయిలో తలనొప్పులకు కారణమైంది. ఎవరికి వారు ప్రతిపక్ష పార్టీలుగా చలామణి అవుతున్న డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలు బీజేపీ కూటమిలో చేరడం ద్వారా మిత్రపక్షాలుగా మారిపోక తప్పలేదు. కూటమి ధర్మం ప్రకారం మిత్రులైనా పాత వైరుధ్యాలను పక్కన పెట్టలేకపోయిన ఆ పార్టీ నేతలంతా సీట్ల కోసం పట్టుపట్టారు. ఒకరు కోరిన స్థానాన్ని మరొకరు కోరడమే కాదు, చివరికి బీజేపీ ఎంచుకున్న స్థానాల కోసం సైతం పట్టుపట్టారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కూటమిలో చేరడానికే ముప్పుతిప్పలు పెట్టారు. ఆపై సీట్ల కోసం పట్టుబట్టారు. ఒక దశలో కూటమి చీలిపోతుందని, పీఎంకే,కూటమి ఖరారు డీఎండీకేలు వైదొలగిపోతాయనే ప్రచారం జరిగింది. మిత్రులకు నచ్చజెప్పేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర రావు, జాతీయ నేత ఇల గణేశన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 10 రోజుల క్రితమే వెల్లడి కావాల్సిన జాబితా వాయిదాపడుతూనే వచ్చింది. సారొచ్చారు పోలింగ్‌కు నెల రోజులుండగా బీజేపీ కూటమి జాబితాలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్న రాజ్‌నాథ్ వచ్చీ రాగానే మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడ్డారు. విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్‌లతో వేర్వేరుగా చర్చలు జరిపారు. స్వల్ప వ్యవధిలోనే అందరి మధ్య సఖ్యత సాధ్యమవుతుందని ఆశించిన రాజ్‌నాథ్ సింగ్‌కు కూటమి మిత్రులు చుక్కలు చూపించారు. సీట్ల ఖరారు చేసుకుని 12 గంటలకు ఏర్పాటు చేసుకున్న మీడియా సమావేశంలో వెల్లడి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. మీడియా వారు అరగంట ముందుగానే అంటే 11.30 గంటలకే చేరుకోగా ప్రతి అరగంటకు ఒకసారి పొడిగిస్తూ వచ్చారు. ఆ తరువాత అందరూ భోజనాలు చేసి రండని ప్రకటించారు. మిత్రులతో చర్చలు కొలిక్కిరాకపోవడమే మీడియా సమావేశం గంటలకొద్దీ వాయిదాకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. సాయంత్రం 4 గంటలు దాటుతుండగా రాజ్‌నాథ్ సింగ్ వచ్చి మీడియాతో మాట్లాడారు. 25 స్థానాల్లో గెలుపు ఖాయం బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏర్పడిన బలమైన కూటమి అభ్యర్థులు 25 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మరో రెండుసార్లు తమిళనాడులో పర్యటిస్తారని చెప్పారు. తమిళనాడు ప్రజల సమస్యలను, ముఖ్యంగా శ్రీలంక, తమిళ జాలర్ల వివాదాన్ని యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ పాలనలో ఒక్క తమిళనాడు మాత్రమే కాదు దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీరుతాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద కూటమిగా ఏర్పడటం వల్ల మిత్రపక్షాల్లో కొన్ని అసంతృప్తులు సహజమని అన్నారు. అయితే అవన్నీ వైదొలిగాయని, కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి పార్టీ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుందని చెప్పారు. డీఎండీకే 14, బీజేపీ 8, పీఎంకే 8, ఎండీఎంకే 7, ఐజేకే, కేఎండీకే ఒక్కో స్థానం కేటారుుస్తూ జాబితా ఖరారైందని ఆయన తెలిపారు. తమిళనాడు జాబితాను అధికారికంగా ఆయన విడుదల చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన బావమరిది సుదేష్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ రాజ్నాథ్తోపాటూ వేదికకెక్కడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు. -
నా కొద్దు బాబోయ్ సీటు
డీఎండీకే అధినేత విజయకాంత్‌కు నామక్కల్ అభ్యర్థి మహేశ్వరన్ పెద్ద షాక్ ఇచ్చారు. మరి కొన్ని గంటల్లో తమ అధినేత ఎన్నికల ప్రచారానికి రాబోతున్న సమయంలో తనకు సీటు వ ద్దు బాబోయ్ అంటూ తిరస్కార స్వరాన్ని అందుకున్నారు. దీంతో మరో అభ్యర్థి కోసం విజయకాంత్ వేట ఆరంభించారు. సాక్షి, చెన్నై : బీజేపీతో కూటమిలో ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్ గత వారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గుమ్మిడిపూండిలో ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టిన సమయంలో డీఎండీకే కార్యాలయం ఐదుగురు అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో నలుగురు ఎంపీ అభ్యర్థులు, ఒకరు ఆలందూరు ఉప ఎన్నికబరిలో నిలబడే అభ్యర్థి. వీరిలో నామక్కల్ ఎంపీ అభ్యర్థిగా స్థానిక నేత, గత ఎన్నికల్లో ఓటమి చవి చూసిన మహేశ్వరన్‌ను ఎంపిక చేశారు. తిరస్కారం: మహేశ్వరన్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన మద్దతుదారులు సంబ రాలు చేసుకున్నారు. అయితే సోమవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు. తాను ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు, ఈ సీటు మరొకరికి అప్పగించాలని విజయకాంత్‌ను అభ్యర్థిస్తూ మహేశ్వరన్ ప్రకటించారు. కొన్ని గంటల్లో నామక్కల్ ప్రచారం నిమిత్తం విజయకాంత్ వస్తుండగా మహేశ్వరన్ తిరస్కార స్వరాన్ని అందుకోవడం స్థానిక డీఎం డీకే వర్గాల్లో ఆందోళన రేపింది. ఆయన్ను బుజ్జగించేందుకు యత్నిస్తే, వెళ్లి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. అనారోగ్యం: అనారోగ్యం కారణంగా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నానని మహేశ్వరన్ స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం తనకు వెన్ను నొప్పి మొదలైందని, ఇప్పుడు తలనొప్పి బాధపెడుతోందని వివరించారు. ఇందుకు తగ్గ వైద్య పరీక్షలు చేయించుకుంటున్నానన్నారు. రెండు రోజుల క్రితం కోయంబత్తూరులో తాను చికిత్స తీసుకున్న ఆస్పత్రికి వైద్య పరీక్ష చేయించుకోగా, అడ్మిట్ కావాలని వైద్యులు తేల్చినట్టు పేర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్లే తాను తప్పుకుంటున్నానేగానీ, ఇతరుల ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. చివరి క్షణంలో తిరస్కార ప్రకటన చేయకుండా, ముందుగానే మహేశ్వరన్ ప్రకటించడాన్ని డీఎండీకే వర్గాలు ఆహ్వానిస్తున్నాయి. అయి తే, తమ నేత ప్రచారానికి వస్తున్న సమయం లో మహేశ్వరన్ ఇలా ప్రవర్తించడం మంచిపద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒత్తిడి : అనారోగ్య కారణాలు పైకి చెబుతున్నా, కుటుంబసభ్యుల ఒత్తిడితోనే మహేశ్వరన్ తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినట్టు తెలిసింది. గత ఎన్నికల్లో గెలుపు కోసం విచ్చల విడిగా నగదును మహేశ్వరన్ పంచి పెట్టారు. అయితే ఓటమి చవి చూశారు. విజయకాంత్ మీదున్న ప్రేమతో ఆ పార్టీలో కొనసాగుతూ, ఆ పార్టీ కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొంటూ వచ్చారు. మళ్లీ సీటు మహేశ్వరన్‌కు దక్కడంతో కుటుంబీకులు ఆగ్రహానికి లోనయ్యారు. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసినా ఓటమి తప్పదని, తప్పుకోవాలంటూ కుటుంబీకులు ఒత్తిడి తీసుకురావడంతో తిరస్కార నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. -
దటీజ్ తమిళనాడు!
ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇచ్చే హామీలలో తమిళ పార్టీలకు దేశంలో ఏ పార్టీలు సాటిరావు. ఇచ్చిన హామీలను అదే స్థాయిలో ఆ పార్టీలే అమలు చేసి జనాన్ని ఆకట్టుకుంటాయి. లోక్‌సభ ఎన్నికల్లో తమ సత్తాచాటుకోడానికి తమిళ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అన్ని పార్టీలు పోటీలుపడి తమ తమ మేనిఫెస్టోలు రూపొందిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా తమిళనాట ఎన్నికల్లో మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. భాష(తమిళ సెంటిమెంట్), వాదం, అభిమానం, పేదల సంక్షేమం...ఇలా ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో దేనిని వదిలిపెట్టరు. వీటన్నిటి మేళవింపుతో మేనిఫెస్టోలు రూపొందించడానికి పార్టీలన్నీ కసరత్తు చేస్తున్నాయి. తమిళనాట ఎన్నికల వేడి జోరందుకుంది. పార్టీల ఎన్నికల హామీలు ఎల్లలు దాటుతున్నాయి. ప్రధాన రాజకీయపార్టీలన్నీ వాడివేడి ప్రచారాస్త్రాలతో ఓటర్లను ఆకట్టుకోడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా పార్టీల మేనిఫెస్టోలే ఇక్కడ తిరుగులేని ప్రచారాస్త్రాలుగా మారనున్నాయి. ఎవరికివారే తమిళ జాతీయవాదం తమదంటే తమదని ఉపన్యాసాలు దంచేస్తూ ఎన్నికల రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఈ విధంగా మేనిఫెస్టో రాజకీయం తమిళనాట దుమారం రేపుతోంది. ఉచితంగా టీవీలిస్తామని ఒక పార్టీ చెబితే, ఉచితంగా ల్యాప్ టాప్‌లు ఇస్తామని మరో పార్టీ చెబుతోంది. భాష, వాదం, రక్షణలో తామే ముందున్నాం అని ఒక పార్టీ చెబితే, కాదు అదంతా తమ వల్లే అవుతుందని మరోపార్టీ చెబుతోంది. ఈ విధంగా ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఎవరి ప్రచారం వారు, ఎవరి వాగ్ధానాలు వారు చేస్తున్నారు. ఎన్నికల వేళ తమిళ పార్టీల్లో మేనిఫెస్టోల మోత మోగుతోంది. అన్నాడిఎంకె, డిఎంకె, డిఎండికెలు మేనిఫెస్టోల రూపంలో తమ ఎన్నికల వాగ్ధానాలను జనం ముందుంచాయి. సానుకూల వాతావరణం, అనుకూలతలను బట్టి అధికార అన్నాడిఎంకే ముందుగా తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ తర్వాత డిఎంకే తన ఎన్నికల హామీ పత్రాన్ని జనం ముందుంచింది. ఇక రేపోమాపో తమ మేనిఫెస్టోలను విడుదల చేయడానికి ఇతర పార్టీలు వాగ్ధాన పత్రాల తయారీలో మునిగితేలుతున్నాయి. ఏ మేనిఫెస్టో చూసినా తమిళ వాసనే వస్తోంది. అలా లేకపోతే అక్కడ ఓట్లు రాలవు. తమిళులను రక్షించుతామని, వారి ప్రయోజనాలను కాపాడతామని అన్ని పార్టీలు ఊదరగొడుతున్నాయి. బలంగా ఉన్న తమిళసెంటిమెంటును పుష్కలంగా పండించుకోవడమే సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీల ముందున్న పెద్ద పని. దాదాపు అన్ని పార్టీలూ ఇదే రేసులో పాల్గొంటున్నాయి. అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో తమిళవాదాన్ని ప్రధానంగా తెరపైకి తెస్తున్నాయి. శ్రీలంకలో తమిళుల రక్షణ - తీర ప్రాంత జాలర్లు - కావేరి జలాల సమస్య - రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధిపథంలో ముందుంచటం-.... ఇటువంటి అంశాలపైనే అందరూ దృష్టిపెట్టారు. డిఎంకె కేంద్రంలో చక్రం తిప్పిన సందర్భంలో వారి 2జి అవినీతిని ఎండగట్టే ప్రయత్నంలో అన్నాడిఎంకె ఉంది. జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను తవ్వే పనిలో డిఎంకె ఉంది. ఇక డిఎండికె అవినీతి రహిత సమాజం, సామాజిక న్యాయం అంటూ తమ వాగ్ధానాలను ప్రజల చెవినేస్తోంది. ఇదంతా ఒకెత్తైతే, బీజేపీ మరో పంథాలో ముందుకు సాగుతోంది. తమిళనాడు హైందవ సాంప్రదాయాలకు ఆలవాలం - ఆలయాల రాష్ట్రంగా ప్రసిద్ధి .. అటుంటి ఇక్కడ నుండి మళ్లీ హిందుత్వాన్ని తెరపైకి తెచ్చి కొన్ని సీట్లైనా సాధించాలనే లక్ష్యంతో జాతీయ పార్టీ బీజేపీ తన ప్రచార పర్వం కొనసాగిస్తోంది. జాతీయస్థాయి సమస్యలైన శ్రీలంక, జాలర్లు, రామసేతు అంశాలపై గొంతెత్తుతూ తమిళుల పరిరక్షణకు తామే కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇక వామపక్షాల పంథా వేరుగా ఉంది. బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాలకు తాము కట్టుబడి ఉన్నామని, అందుకే మూడో కూటమిగా ముందుకు సాగుతున్నామంటూ పొత్తు ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిపోరుకు సిద్ధమయ్యాయి. మొత్తంగా చూస్తే ఇక్కడ పార్టీలు తమిళ భాష - తమిళవాదం - శ్రీలంకలో తమిళులకు రక్షణ - తమిళ జాలర్లకు రక్షణ.. ఇలా తమిళం సెంటిమెంటుతోనే ప్రచారం సాగుతుంది. దటీజ్ తమిళనాడు!. s.nagarjuna@sakshi.com -
రాస్కోండి!
సాక్షి, చెన్నై: బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటు అయ్యేనా లేదా అన్న ఉత్కంఠ రాష్ట్రంలో నెలకొంది. ఈ కూటమిలోని పీఎంకే, డీఎండీకేల మధ్య సీట్ల పందేరం కొలిక్కి రాలేదు. పొత్తుల చర్చ లు సాగుతున్న సమయంలో శుక్రవారం విజయకాంత్ గుమ్మిడి పూండి వేదికగా తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారానికి ముందుగా తొలి విడత అభ్యర్థుల జాబితాను హఠాత్తుగా ప్రకటించి కూటమిపై నీలి నీడలు అలుముకునేలా చేశా రు. తిరువళ్లూరు-వి యువరాజ్, మదురై- శివముత్తుకుమార్, తిరుచ్చి - ఎంఎం జీ విజయకుమార్, నామక్కల్ - సౌందర పాడియన్లు బరిలో దిగుతారని విజయకాంత్ టీవీ చానల్ కెప్టెన్ న్యూస్‌లో ప్రకటించడం బీజేపీ వర్గాల్లో ఆందోళన రెకెత్తించింది. ఉరకలు : విజయకాంత్ హఠాత్ నిర్ణయం బీజేపీలో గుబులు రేపింది. రాత్రాంతా బీజేపీ వర్గాలు విజయకాంత్‌తో మంతనాల్లో మునిగాయి. అదే సమయంలో మెట్టు దిగాలంటూ పీఎంకే నేత రాందాసుకు సూచించే పనిలో పడ్డారు. శనివారం మధ్యాహ్నానికి సీట్ల పందేరం కొలిక్కి వచ్చినట్టు సమాచారం లేదు. శనివారం అరక్కోణం, వేలూరు, ఆరణిల్లో ప్రచారానికి విజయకాంత్ బయలు దేరడంతో మలి విడత జాబితా వెలువడుతుందన్న ఎదురు చూపులు పెరిగాయి. మీడియా అత్యుత్సాహం:విజయకాంత్ తొలి జాబి తాతో తమిళ పత్రికలు, చానళ్లల్లో కథనాలు ఆరంభం అయ్యాయి. బీజేపీ మెగా కూటమిలో చీలిక వచ్చినట్టేనని, విజయకాంత్ ఒంటరిగా ముందుకెళ్లబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. తన తుది నిర్ణయాన్ని అరక్కోణం లోక్‌సభ నియోజకవర్గం వేదికగా విజయకాంత్ ప్రకటించేందుకు సిద్ధం అయ్యారంటూ మీడియాల్లో కథనాలు రావడం విజయకాంత్‌లో ఆగ్రహాన్ని రేపినట్టుంది. తమ కూటమిలో ఎలాంటి చీలిక లేదని చాటుతూ, మోడీ కోసం తన ఓట్ల వేట సాగుతుందని స్పష్టం చేస్తూ, మీడియాపై సెటైర్ల వర్షం కురిపించారు. మీ ఇష్టం: సాయంత్రం జరిగిన ప్రచార సభలో మీడియాను విజయకాంత్ టార్గెట్ చేశారు. పెన్ను చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారు...రాస్కోండి...అని విరుచుకుపడ్డారు. ఒకప్పుడు 4 పత్రికలుంటే... ఇప్పుడు 40కు చేరాయని ఎద్దేవా చేశారు. జయ టీవీ, నమదు ఎంజీయార్ ఛానళ్ల మీద విమర్శలు చేస్తే మాత్రం కేసులు పెట్టేస్తారు బాబోయ్ అంటూ ఛమత్కరించారు. ‘పొట్ట కూటి కోసం రాసుకుంటున్న పత్రికా మిత్రులారా? మిమ్మల్ని మాత్రం ఏమీ అనబోను, నా కళ్లకు మీ కుటుంబాలు కన్పిస్తున్నాయి’ అంటూ పేర్కొన్నా రు. తనపై కేసులు పెట్టించి లోపల వేయించుకోండి తాను మాత్రం భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశా రు. చివరగా, బీజేపీ కూటమితోనే తన పయనం అని, మోడీని పీఎం చేయడం లక్ష్యంగా తన ప్రచారం సాగుతుందన్నారు. -
బీజేపీతోనే కెప్టెన్
-
కాంగ్రెస్‌తో పొత్తుకు విముఖత
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలో బలమైన కూటమిని ఏర్పాటు చేసుకుని అధిక స్థానాల్లో గెలుపొందాలన్న కాంగ్రెస్ ఆశలపై డీఎంకే, డీఎండీకే నీళ్లు చల్లారుు. ఒంటరిపోరు అనివార్యమైంది. పోటీ చేసేందుకు సొంత పార్టీ నేతలే వెనకడుగు వేస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేసిన డీఎంకేను తాత్కాలికంగా పక్కనపెట్టి డీఎండీకేతో జతకట్టేందుకు కాంగ్రెస్ తహతహలాడింది. డీఎండీకే బీజేపీకి చేరువయ్యే అవకాశాలకు గండికొట్టాలనే ఆలోచనే ఇందుకు ప్రధాన కారణం. రాష్ట్ర సమస్యల పేరుతో డీఎండీకే అధినేత విజయకాంత్ బృందాన్ని కాంగ్రెస్ ఢిల్లీకి పిలిపించుకుని ప్రధాని మన్మోహ న్సింగ్తో గ్రూపు ఫొటో దిగే అవకాశాన్ని సైతం కల్పించింది. ఆ తరువాత కాంగ్రెస్ విషయంలో ఆచితూచి అడుగేసిన కెప్టెన్ బీజేపీతో పొత్తుకు పచ్చజెండా ఊపారు. దీంతో ఖంగుతిన్న కాంగ్రెస్ గత్యం తరం లేని పరిస్థితుల్లో డీఎంకే వైపు మరోసారి దృష్టి సారించింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తుపెట్టుకుని మంచి ఫలితాలు దక్కించుకున్న కాంగ్రెస్ ఈ సారి కూడా అదే స్థాయిలో అందలం ఎక్కాలని ఆశపడింది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తేలేదని డీఎంకే ఇప్పటికే అనేకసార్లు ఖరాఖండిగా చెప్పినా, సర్వసభ్య సమావేశంలో అధికారికంగా తీర్మానం చేసినా ప్రయత్నాలు మాత్రం కొనసాగించారు. చివరి ప్రయత్నంగా కేంద్రమంత్రి పి.చిదంబరంను రంగంలోకి దించారు. కాంగ్రెస్ దూతగా డీఎంకేతో రాయబారం నడిపేందుకు రెండురోజుల క్రితం చెన్నై చేరుకున్న చిదంబరం ఆ పార్టీ కోశాధికారి స్టాలిన్‌తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. తొలిరోజునే ఛేదు అనుభవాలను ఎదురుచూసిన చిదంబరం మలిరోజున స్టాలిన్‌ను బుజ్జగించారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని స్టాలిన్ సున్నితంగా తిరస్కరించారు. యూపీఏ ప్రభుత్వ వైఖరి వల్ల శ్రీలంక తమిళుల సమస్య జఠిలంగా మారిందని, కచ్చదీవుల వివాదం వల్ల తమిళ జాలర్ల సమస్య తీరనేలేదని పేర్కొన్నారు. వీటికి తోడు రాజీవ్ హత్యకేసులో ఏడుగురి విడుదలపై రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సవాల్ చేయడం వల్ల ప్రజలు కాంగ్రెస్‌ను ఈసడించుకుంటున్నారని స్టాలిన్ ఆయనకు వివరించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల డీఎంకే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వబోమని స్టాలిన్ హామీ ఇవ్వడంతో చిదంబరానికి కొంత సంతృప్తి మిగిల్చింది. కాంగ్రెస్‌లో అయోమయం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిపోరు దుస్సాహసమే అవుతుందని ఆ పార్టీ నేతలకు తెలుసు. అన్నాడీఎంకే, డీఎంకే ఒకవైపు, ప్రాంతీయ పార్టీలైన డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలతో బలమైన కూటమిగా ఏర్పాటైన బీజేపీని కాంగ్రెస్ ఎలా ఢీకొంటుందని డీలా పడిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ముందుకు వస్తాయా, అసలు పోటీ చేయాలా వద్దా అనే అనుమానం వారిలో నాటుకుపోయింది. రెండు రోజుల్లో డీఎంకే జాబితా రాష్ట్రంలో పొత్తులు కొలిక్కిరావడం, కాంగ్రెస్‌తో చెలిమి లేదని తేలిపోవడంతో కరుణానిధి అధ్యక్షతన శుక్రవారం డీఎంకే సమావేశమైంది. ఎన్నికల్లో పార్టీ వ్యూహం, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. మరో రెండు రోజుల్లో డీఎంకే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు సమావేశంలో ప్రకటించారు. గత ఎన్నికల్లో 22 స్థానాల్లో పోటీచేసి 18 స్థానాలు గెలుపొందగా ఈ సారి అంతకంటే ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్, కోశాధికారి స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. -
కమల వికాసం
సీట్ల పందేరం డీఎండీకేకు పద్నాలుగు పీఎంకే, బీజేపీలకు తలా ఎనిమిది ఎండీఎంకేకు ఏడు రెండు రోజుల్లో అధికారిక {పకటన బీజేపీలోకి ఎన్ఆర్ కాంగ్రెస్ సాక్షి, చెన్నై: రాష్ర్టంలో కమలం వికసించింది. మెగా కూటమికి పునాదులు పడడంతో సీట్ల పందేరంలో బీజేపీ మిత్రులు బిజీ బిజీగా ఉన్నారు. డీఎండీకేకు 14, పీఎంకేకు ఎనిమిది, బీజేపీకి ఎనిమిది, ఎండీఎంకేకు ఏడు, ఇతర మిత్రులకు మూడు సీట్లు కేటాయించేలా చర్చలు సాగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల ఎంపికలో పార్టీలు పట్టువీడడం లేదు. మరో రెండు రోజుల్లో అధికారికంగా కూటమిని ప్రకటించి, ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. పుదుచ్చేరిలోని ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో పొత్తుకు సిద్ధ పడింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు డీఎంకే, అన్నాడీఎంకేలు తమను అక్కున చేర్చుకునేనా...! అన్న ఎదురు చూపుల్లో బీజేపీ వర్గాలు ఉండే వారు. ఆ రెండు ప్రధాన పార్టీలు తిరస్కరించడంతో చివరకు ఒంటరిగా రాష్ట్రంలో మిగిలారు. గత లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఒంటరిగానే ఎదుర్కొవాల్సి వచ్చింది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు తెరమీదకు రావడంతో రాష్ర్టంలోని కమలనాథుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే, డీఎం కేలకు ప్రత్యామ్నాయంగా తమ నేతృత్వంలో మెగా కూటమి లక్ష్యంగా ప్రయత్నాల్లో పడ్డారు. వైగో నేతృత్వంలోని ఎండీఎంకే, పచ్చముత్తు పారివేందన్ నేతృత్వంలోని ఐజేకేలతో పాటు కొంగు మక్కల్ కట్చి, కొంగు దేశీయ కట్చి, పుదియ నిధి కట్చి తదితర పార్టీలు బీజేపీ వెంట నడిచేందుకు సిద్ధపడ్డాయి. మరింత బలం చేకూరాలంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డీఎండీకేను, వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన పీఎంకేను తమ వెంట తిప్పుకోవడమే లక్ష్యంగా బీజేపీ వర్గాలు తీవ్రంగా కుస్తీలు పట్టారు. ఆ పార్టీ నాయకులు ఇళ్లు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చివరకు బీజేపీ అధిష్టానం పెద్ద రంగంలోకి దిగారు. ఫలించిన మంతనాలు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి పావులు కదిపారు. ఆయనతో పాటు పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సైతం డీఎండీకే నేత విజయకాంత్, పీఎంకే నేత రాందాసుతో వేర్వేరుగా మాట్లాడినట్టు సమాచారం. దీంతో రాష్ట్రంలోని బిజేపి ప్రధాన నేతలు పొన్ రాధాకృష్ణన్, ఇలగణేషన్ , మోహన్ రాజ్ తదితరులు గురువారం ఢిల్లీకి ఉరకలు తీశారు. ఢిల్లీ నుంచి ఎలాంటి రాయబారం సాగించారో ఏమోగానీ అదే రోజు రాత్రి తాము బీజేపీతో కూటమికి రెడీ అవుతూ, సీట్ల పందేరానికి సిద్ధమని డీఎండీకే, పీఎంకే అధినేతలు విజయకాంత్, రాందాసు ప్రకటించారు. సీట్ల పందేరం: డీఎండీకే, పీఎంకే బీజేపీలోకి చేరడంతో కమలనాథుల ఆనందానికి అవధులు లేకుండా పోయూరుు. ఇన్నాళ్లు అన్నాడీఎంకే, డీఎంకేల మోచేతి నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఉండడం, ఇప్పుడు ఆ రెండు ప్రధాన కూటముల్ని తాము ఢీకొట్టబోతోండడంతో బీజేపీ వర్గాలు ఆనందంలో మునిగి తేలుతున్నారు.పొత్తుకు రెడీ అని గురువారం రాత్రి ప్రకటించారో లేదో శుక్రవారం ఉదయం నుంచి సీట్ల పందేరం ప్రారంభమైంది. ఢిల్లీ వెళ్లిన నేతలు హుటాహుటిన చెన్నైకు ఉదయాన్నే చేరుకున్నారు. కమలాలయంలో సీట్ల పందేరం చర్చల్లో బిజీ బీజీ అయ్యారు. పీఎంకే అధ్యక్షుడు జీకే మణి నేతృత్వంలోని ఆ పార్టీ బృందం టీ నగర్‌లోని కమలాలయంలో రెండు గంటల పాటు సీట్ల పంపకాల చర్చల్లో మునిగారు. తమకు పది సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టగా, చివరకు ఎనిమిదికి సర్దుకున్నట్టు తెలిసింది. అలాగే సాయంత్రం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయూనికి చేరుకున్న బీజేపీ కమిటీ సభ్యులు సీట్ల పంపకాలపై చర్చించారు. తమకు 18 సీట్లు కావాలని డీఎండీకే డిమాండ్ చేయగా, 14 సీట్లకు ఒకే అయినట్టు తెలిసింది. కొన్ని స్థానాల్ని బీజేపీ, డీఎండీకే, పీఎంకే ఆశిస్తుండడంతో సీట్ల పందేరం కొలిక్కి రావాల్సి ఉంది. ఇవే సీట్లు ఇప్పటికే పీఎంకే పది స్థానాల బరిలో అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. వాటినే తమకు కేటారుుంచాలని పట్టుబడుతోంది. కూటమి ధర్మం మేరకు రెండు స్థానాల్ని వదులుకునేందుకు సిద్ధ పడుతున్నా, ధర్మపురి సీటును కేటారుుంచాల్సిందేనని కోరుతోంది. ఇక్కడి నుంచి ఆ పార్టీ యువజన నేత అన్భుమణి బరిలోకి దిగనున్నారు. డీఎండీకే కాంచీపురం, శ్రీ పెరంబదూరు, తిరువళ్లూరు, ధర్మపురి, ఆరణి, విల్లుపురం, కళ్లకురిచ్చి, సేలం, దిండుగల్, విరుదునగర్, కృష్ణగిరి, ఈరోడ్, కడలూరు, తిరునల్వేలి స్థానాల్ని ఆశిస్తోంది. ఇందులో ధర్మపురి కోసం పీఎంకే, శ్రీ పెరందూరు కోసం బీజేపీ, కాంచీపురం కోసం ఎండీఎంకేలు పట్టుబడుతున్నాయి. ఈ సీట్లను వదలు కోవాల్సి వస్తే, తమకు ప్రత్యామ్నాయంగా అరక్కోణం, తిరుప్పూర్, తిరువణ్ణామలై సీట్లను కేటాయించాలన్న డిమాండ్‌ను డీఎండీకే తెరపైకి తెచ్చింది. ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలన్న దానిపై మల్లగుల్లాలు ఎదురుకావడంతో త్వరితగతిన సీట్ల పందేరం ముగించేందుకు బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగనుంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల్లో చెన్నై రానున్నారని, ఆయన సమక్షంలో అధికార పూర్వకంగా కూటమి ప్రకటన వెలువడనున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్ఆర్ కాంగ్రెస్ పుదుచ్చేరిలోని ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీతో దోస్తీకి సిద్ధ పడింది. పుదుచ్చేరి సీటును ఆ పార్టీ ఆశిస్తుండడంతో బీజేపీ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఈ సీటును పీఎంకే సైతం కోరుతుండడం గమనార్హం. తాము బీజేపీతో దోస్తీ కట్టనున్నామని, ఈ నెల పన్నెండున అధికార పూర్వకంగా అభ్యర్థిని ప్రకటించనున్నామని ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత, సీఎం రంగస్వామి పేర్కొన్నారు. -
బీజేపీతోనే కెప్టెన్
సాక్షి, చెన్నై: రానున్న లోక్‌సభ ఎన్నికలను కూటమిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించినట్టు డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రకటించారు. బీజేపీతో కూటమి చర్చలు జరుపుతున్నామని గురువారం ప్రకటించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్న డీఎండీకే అధినేత విజయకాంత్‌తో పొత్తుకు పలు పార్టీలు తహతహలాడుతున్నాయి. ఆ పార్టీకి రాష్ర్టంలో పది శాతం ఓటు బ్యాంక్ ఉండటం తమకు కలసి వస్తుందన్న ఆశతో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేలు ప్రయత్నించాయి. పలు దఫాలుగా డీఎండీకే కార్యాలయం మెట్లను డీఎంకే ప్రతినిధులు ఎక్కినా ఫలితం శూన్యం. దీంతో ఆ పార్టీని ఇక ఆహ్వానించబోమంటూ డీఎంకే తేల్చిం ది. అదే సమయంలో రాష్ట్రంలో ఒంటరిగా మిగిలిన కాంగ్రెస్ విజయకాంత్‌ను అక్కున చేర్చుకునేందుకు కుస్తీలు చేస్తూ వస్తోంది. అలాగే, బీజేపీ సైతం తమ కూటమిలోకి విజయకాంత్‌ను ఆహ్వానించేందుకు తీవ్ర ప్రయత్నాల్లో నిమగ్నం అయింది. రోజుకో కథనం పత్రికల్లో వచ్చినా డీఎండీకే అధినేత విజయకాంత్ మాత్రం నోరు మెదపలేదు. మౌనంగానే అన్నింటినీ పరిశీలిస్తూ వచ్చారు. పలు దఫాలు మీడియా ముందుకు వచ్చిన విజయకాంత్‌ను ఆ కథనాల గురించి ప్రశ్నిస్తే, వాళ్లనే అడగండంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. బీజేపీతో పొత్తు ఖరారైనట్టు వార్తలొచ్చినా ఆయన పట్టించుకోలేదు. బుధవారం బీజేపీ కూటమి ప్రకటన వాయిదా పడడంతో కాంగ్రెస్ వైపు విజయకాంత్ దృష్టి పెట్టినట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఒంటరిగా ఆయన ఎన్నికల్లోకి వెళ్లనున్నారన్న వార్తలు ప్రచురితం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇంత వరకు తాను కూటమి గురించి ఏ ఒక్కరితోనూ చర్చించలేదని, ఏ పార్టీతోనూ ఇంత వరకు పొత్తు ఖరారు చేయలేదని గురువారం ప్రకటన విడుదల చేశారు. పొత్తుకు రెడీ: డీఎండీకే కార్యాలయం విడుదల చేసిన ప్రకటన మేరకు రానున్న లోక్‌సభ ఎన్నికలను కూటమిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించినట్టు ప్రకటించారు. బీజేపీతో కూటమిచర్చలు జరుపుతున్నామంటూ రెండు ముక్కల్లో ముగించడం గమనార్హం. అయితే, ఈ పొత్తుల చర్చ ఎన్ని మలుపులు తిరగనున్నదో వేచి చూడాల్సిందే. విజయకాంత్ డిమాండ్లకు ఇప్పటికే బీజేపీ తలొగ్గిన దృష్ట్యా, ఆ కూటమితో దోస్తీకట్టినట్టేనని డీఎండీకే వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ అధిష్టానంతో రాష్ర్ట పార్టీ శ్రేణులు గురువారం మంతనాలు జరపడం, డిమాండ్లు, సీట్ల పందేరం కొలిక్కి వచ్చినట్టుగా అక్కడి నుంచి వచ్చిన సంకేతాల మేరకు విజయకాంత్ ఈ ప్రకటన చేసినట్టు పేర్కొనడం గమనార్హం. -
బీజేపీకి ఝలక్!
సాక్షి, చెన్నై : తమ నేతృత్వంలోని కూటమి లక్ష్యంగా బీజేపీ కసరత్తుల్లో మునిగిన విషయం తెలిసిందే. ఆ కూటమిలోకి ఐజేకే, కొంగు మక్కల్ కట్చి, కొండు దేశీయ కట్చి, పుదియ నిధి తదితర పార్టీలు చేరాయి. విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే, రాందాసు నేతృత్వంలోని పీఎంకేలను తమ కూటమిలోకి చేర్చుకోవడం లక్ష్యంగా బీజేపీ వర్గాలు తీవ్ర కుస్తీలే పట్టాయి. విజయకాంత్, రాందాసు పెట్టిన డిమాండ్లకు తలొగ్గారు. అయితే, సీట్ల పందేరం కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు అన్నీ సజావుగా ముగిసినట్టేనని భావించిన బీజేపీ శ్రేణులు బుధవారం తమ కూటమి పార్టీలను ప్రకటించేందుకు సిద్ధం అయ్యాయి. కూటమిని బీజేపీ ప్రకటించబోతున్న సమాచారంతో కమలాలయంకు మీడియా ఉరకలు తీసింది. అయితే సాయంత్రానికి కూటమి పార్టీలను ప్రకటించేందుకు బీజేపీ సమయాత్తమైనా, చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. ఇందుకు కారణం సీట్ల పందేరం కొలిక్కి రాకపోవడమే. 18 సీట్లకు విజయకాంత్, పది సీట్లకు రాందాసు పట్టుబట్టడంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి కమలనాథులకు ఏర్పడింది. మంగళవారం రాత్రి హుటాహుటిన బీజేపీ శ్రేణులు అటు విజయకాంత్ వద్దకు, ఇటు రాందాసు వద్దకు పరుగులు తీసినట్టు సమాచారం. అయితే, సీట్ల పందేరంలో ఆ ఇద్దరు మెట్టు దిగనట్టు తెలిసింది. దీంతో కూటమి ప్రకటనను వాయిదా వేసుకున్న బీజేపీ వర్గాలు ఢిల్లీకి ఉరకలు తీశాయి. ఢిల్లీకి పరుగు కూటమిలో స్తబ్ధత నెలకొనడంతో కమలనాథులు ఆందోళనలో పడ్డారు. ఈ విషయాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటీన ఢిల్లీకి రావాలంటూ ఇక్కడి నేతలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఆహ్వానం వచ్చింది. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, సీనియర్ నేత ఇలగణే శన్, మరో నాయకుడు మోహన్ రాజు బుధవారం సాయంత్రం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. మీనంబాక్కం విమానాశ్రయంలో పొన్ రాధాకృష్ణన్‌ను మీడియా కదిలించగా, తమ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందన్నారు. గురువారం అధిష్టానంతో సమావేశం కానున్నామని, శుక్రవారం తమ కూటమిని ప్రకటిస్తామన్నారు. ఇప్పటి వరకు తమ వెంటే పార్టీలు ఉన్నాయని ఓ ప్రశ్నకు ధీమా వ్యక్తం చేశారు. -
కెప్టెన్‌కు ఆఫర్!
* చేతికి చిక్కేనా? * రెండు రోజుల్లో నిర్ణయం *చెన్నైకు విజయకాంత్ సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు సిద్ధం అయ్యారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్ డీఎండీకే యువజన నేత సుదీష్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. సింగపూర్ నుంచి విజయకాంత్ రాగానే, తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని డీఎండీకే వర్గాలు పేర్కొన్నాయి. డీఎండీకే అధినేత విజయకాంత్‌కు లోక్‌సభ ఎన్నికలు డిమాండ్‌ను పెంచాయి. ఆ పార్టీకి ఉన్న పది శాతం ఓటు బ్యాంక్ తమకు కలిసి రావాలన్న కాంక్షతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఉరకలు తీస్తున్నాయి. తొలుత కాంగ్రెస్, డీఎండీకే, డీఎంకేల నేతృత్వంలో కూటమి ఆవిర్భవిస్తుందని సర్వత్రా భావించారు. అయితే, ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. విజయకాంత్‌ను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ తీవ్రంగానే శ్రమించింది. ఆయన నిర్ణయాలకు అంగీకరించడంతో పాటుగా ఢిల్లీ వేదికగా మంతనాలు జరిగి ఉన్నాయి. బీజేపీ సీనియర్లతో డీఎండీకే యువజన నేత సుదీష్ చర్చలు సైతం జరపడంతో ఇక ఆ కూటమిలోకి డీఎండీకే వెళుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే, బీజేపీ వెంట డీఎండీకే వెళ్ల కుండా కాంగ్రెస్ ప్రయత్నాలు వేగవంతం చేసింది. కాంగ్రెస్ ఆఫర్: విజయకాంత్ వస్తే, ఎన్నికల అనంతరం ఆయన ఏ కోరిక కోరినా ఇచ్చే ఆఫర్‌ను కాంగ్రెస్ ప్రకటించినట్టు తెలిసింది. తన ప్రతినిధి రాజ్యసభలో అడుగు పెట్టాలన్న ఆశతో విజయకాంత్ ఉన్న విష యం తెలిసిందే. అదే సమయంలో ఎన్నికల బరిలో నిలబడే తమ అభ్యర్థుల ఖర్చును సైతం భరించేందు కు ముందుకు రావాలన్న డిమాండ్‌ను జాతీయ పార్టీలకు కెప్టెన్ చెప్పారు. విజయకాంత్ అనేక డిమాండ్లు పెట్టినా, అందులో కొన్నింటికి బీజేపీ తలొగ్గింది. అయి తే, సీట్ల పందేరం వద్ద వివాదం సాగుతుండడంతో పొత్తుల ప్రకటనపై జాప్యం నెలకొంది. దీన్ని పసిగట్టిన కాంగ్రెస్ అధిష్టానం విజయకాంత్ గాలం వేసింది. డీఎంకే తమతో కలసి వచ్చినా, రాకున్నా డీఎండీకే, కాంగ్రెస్‌లు కలసి కట్టుగా అభ్యర్థులు నిలబెట్టి సత్తాను చాటే రీతిలో వ్యూహ రచన చేస్తున్నారు. మంతనాలు: విజయకాంత్ తమ ముందు గతంలో ఉంచిన డిమాండ్లన్నింటికీ తలొగ్గేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు కాంగ్రెస్ నేతలు సుదీష్‌తో ఆదివారం భేటీ కావడంతో పాటుగా సోనియాగాంధీ సలహాదారుడు అహ్మద్ పటేల్‌తో ఫోన్లో మాట్లాడించినట్టు తెలిసింది. విజయకాంత్ చెన్నైకు రాగానే, తనతో మాట్లాడించాలని సుదీష్ దృష్టికి అహ్మద్ పటేల్ తీసుకెళ్లినట్టు సమాచారం. సుదీష్ చెంతకు వెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ పెద్దలు విజయకాంత్ చెన్నైకు రాగానే, ఆయన ఇంటి మెట్లు ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. డీఎండీకేకు రాజ్యసభ సీటుతో పాటుగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పక్షంలో మంత్రి పదవుల్ని సైతం ఆఫర్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. అయితే, ఈ ఆఫర్‌కు విజయకాంత్ తలొగ్గేనా? అన్నది రెండు రోజుల్లో తేలే అవకాశం ఉంది. సింగపూర్ వెళ్లిన విజయకాంత్ సోమవారం అర్ధరాత్రి లేదా, మంగళవారం చెన్నైకు చేరుకునే అవకాశం ఉందని, రెండు రోజుల్లో పొత్తులపై తన నిర్ణయాన్ని తమ నేత తప్పకుండా ప్రకటిస్తారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే వెంకటేషన్ పేర్కొనడం గమనార్హం. -
వలసలు షురూ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలోకి వలసలు మొదలయ్యూయిడీఎండీకే తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్ సుబ్రమణ్యం సీఎం జయలలితతో భేటీ అయ్యారు. డీఎండీకే రెబల్స్ జాబితాలో ఆయన కూడా చేరారు. పార్టీ నుంచి వలసలు మొదలవడంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష హోదాకు గండి పడనున్నది. ఆ పార్టీ మాజీ నేత బన్రూటి రామచంద్రన్ నేతృత్వంలో పలువురు నాయకులు గురువారం అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా డీఎండీకే అధినేత విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో అవతరించారు. అయితే, అన్నాడీఎంకేతో ఏర్పడిన వైరంతో ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అన్నాడీఎంకే పంచన చేరారు. డీఎండీకే రెబల్స్‌గా పార్టీ అధినేత విజయకాంత్‌కు ఆ ఏడుగురు చుక్కలు చూపిస్తున్నారు. ఇక, పార్టీ ప్రిసీడియం చైర్మన్ బన్రూటి రామచంద్రన్ అనారోగ్య కారణాలతో వైదొలిగారు. ఎమ్మెల్యే పదవికి , పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో డీఎండీకే సంఖ్యా బలం 29 నుంచి 21కు తగ్గింది. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న బన్రూటి రామచంద్రన్ ప్రస్తుతం అన్నాడిఎంకే పక్షాన చేరారు. ఆయన చేరికతో డీఎండీకే లో పెద్ద ఎత్తున వలసలు బయలుదేరడం తథ్యమన్న సంకేతాలు వెలువడ్డాయి. ఊహించినట్టుగానే వలసలు ప్రారంభమయ్యూయి.వ లసలు : బన్రూటి రామచంద్రన్ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు రామనాథన్, చిన్న స్వామి, అశోక్, తదితరులు పెద్ద ఎత్తున తమ మద్దతుదారులతో గురువారం అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో అధినేత్రి, సీఎం జయలలిత సమక్షంలో వీరంతా అన్నాడీఎంకేలో చేరారు. మరి కొందరు అన్నాడీఎంకేలో చేరడానికి సిద్ధం అవుతోండటంతో డీఎండీకేలో గుబులు మొదలైంది. పార్టీ జిల్లాల కార్యదర్శులు, ఇది వరకు బన్రూటితో సన్నిహితంగా ఉన్న నేతలందరూ అన్నాడీఎంకే బాట పట్టే పనిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ పార్టీ వర్గాలు బయటకు వెళుతుండటంతో వారిని అడ్డుకుని పార్టీని రక్షించుకునేందుకు విజయకాంత్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బృందాలు రంగంలోకి దిగాయి. పదవీ గండం: విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష హోదాకు గండి పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆ పార్టీ తిరుత్తణి శాసన సభ్యుడు అరుణ్ సుబ్రమణ్యం సీఎం జయలలికు జై కొట్టారు. దీంతో డీఎండీకే రెబల్స్ జాబితా ఎనిమిదికి చేరింది. సచివాలయంలో సీఎం జయలలితను నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అరుణ్ సుబ్రమణ్యం కలిశారు. నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని విన్నవించుకుంటూ, జయలలితకు ఆయన జై కొట్టారు. దీంతో విజయకాంత్ ఎమ్మెల్యేల సంఖ్య 20కు పడిపోయింది. ఈ దృష్ట్యా, ఆయన ప్రధాన ప్రతి పక్ష నేత పదవికి ఎసరు పెట్టేందుకు అన్నాడీఎంకే సిద్ధమవుతోంది. డీఎండీకేకన్నా, డీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతి పక్ష హోదా దక్కే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ నుంచి అధికార పూర్వక ఆదేశాలు వెలువడాల్సి ఉంది. అయితే, అదే జరిగిన పక్షంలో రాష్ట్ర ప్రధాన ప్రతి పక్ష నేతగా డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ కావడం తథ్యం. పీఎంకే ఎమ్మెల్యే మంతనాలు: అసెంబ్లీలో పీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అనైకట్టు ఎమ్మెల్యే కళైయరసు ఉదయం సచివాలయంలో సీఎం జయలలితను కలుసుకున్నారు. తన నియోజకవర్గంలో కుంటుపడ్డ అభివృద్ధిని సీఎం దృష్టికి తీసుకెళ్లి, ఆదుకోవాలని విన్నవించారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో కళైయరసు సీఎం జయలలితను కలవడంతో ఆయన ఇక ఆ పార్టీలోకి చేరినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈదృష్ట్యా, శాసన సభలో పీఎంకేకు రెబల్ ఎమ్మెల్యేగా కళైయరసు నిలవబోతున్నారు. అంతకు ముందుగా రాయపేటలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డీఎండీకే నాయకులతో పాటుగా నటి వెన్నిరాడై నిర్మల, గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్‌లకు చెందిన అక్కడి పార్టీల నాయకులు అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. -
డీఎండీకే ఎమ్మెల్యే ఇంటిపై దాడి
తిరువళ్లూరు, న్యూస్‌లైన్: డీఎండికే గుర్తుపై పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపు సాధించిన తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎండీకే పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి అన్నాడీఎంకేలో చేరడంపై ఆగ్రహం చెందిన కార్యకర్తలు మనవాలనగర్‌లోని ఆయన ఇంటిపై, కార్యాలయంపై రాళ్లు చెప్పులతో దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేయలేక నానాఇబ్బంది పడ్డారు. తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్‌సుబ్రమణ్యం గురువారం ఉదయం చెన్నైలో ముఖమంత్రి జయలలిత సమక్షంలో పార్ట్టీలో చేరారు. విషయం తెలుసుకున్న డీఎండీకే కార్యకర్తలు దాదాపు వంద మంది మనవాలనగర్‌కు చేరుకున్నారు. మొదట అరుణ్సుబ్రమణ్యంకు చెందిన కళాశాల, వ్యక్తిగత కార్యాలయంపై ఉన్న డీఎండీకే బ్యానర్లను చించేశారు. బాణసంచా కాల్చి సంబరాలు: డీఎండీకే పార్టీకి రాజీనామా చేసిన అరుణ్సుబ్రమణ్యంతో పార్టీకి పట్టిన శని వదలిందని పేర్కొంటూ భారీగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా రెండవ విడత అరుణ్ సుబ్రమణ్యం ఇంటి వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, డీఎండీకే కార్యకర్తలకు తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటి పోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు అయన ఇంటిపైకి రాళ్లు, చెప్పులు విసిరి ఆందోళన చేపట్టారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకముందే పోలీసులు ఆందోళనకారులను లాక్కెళ్లి దూరంగా పడేశారు. అనంతరం దిష్టిబొమ్మలను తయారు చేసి దహనం చేయడంతో పాటు చెప్పులతో కొట్టి ఊరేగించారు. మొదటి ఎమ్మెల్యే అవుట్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎండీకే, అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని 40 స్థానాలకు పోటీ చేసింది. వీటిలో 24 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి నుంచి అరుణ్‌సుబ్రమణ్యం, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే శేఖర్ దాదాపు 30 వేల ఓట్లతో విజయం సాధించారు. డీఎండీకే ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన సమయంలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్‌సుబ్రమణ్యం ప్రమాణం చేసి పార్టీ మొదటి ఎమ్మెల్యేగా ఘనతనూ సాధించారు. అయితే ప్రమాణం చేసిన మొదటి ఎమ్మె ల్యే పార్టీని వీడడం కార్యకర్తల్లో అసంతృప్తి నింపింది. ఫలించిన ఒత్తిడి: డీఎండీకేకు గుడ్‌బై చెప్పి అన్నాడీఎంకేలో చేరిన అరుణ్‌సుబ్రమణ్యంపై ఆయన వియ్యంకుడు, అన్నాడీఎంకే పార్టీ కీలక నేత ఢిల్లీ మాజీ ప్రతినిధి నరసింహన్ ఒత్తిడి ఫలించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. గతంలో కేబినెట్ హోదాలో వున్న నరసింహన్ పదవిని ఇటీవల ముఖ్యమంత్రి తొలగించారు. ఇందుకు ప్రదాన కారణం అరుణ్‌సుబ్రమణ్యం పార్ట్టీలో చేరుతాననీ గతంలో ఇచ్చిన హామీ మేరకు నడుచుకోకపోవడమేనని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. అరుణ్‌సుబ్రమణ్యం అన్నాడీఎంకేలో చేరకపోవడం, ఢిల్లీ ప్రతినిధి నరసింహన్ పదవి పోవడం లాంటి సంఘటనతో నరసింహన్ అరుణ్‌సుబ్రమణ్యంపై ఒత్తిడి పెంచి అన్నాడీఎంకేలో చేరేలా చేశారని డీఎండీకే వర్గాలు వ్యాఖ్యానించాయి. బీజేపీతో పొత్తు కోసం చర్చలు జరుపుతున్న సమయంలో పార్టీ ఎమ్మెల్యే పిరాయించడంతో ఇటు పార్టీ కార్యకర్తలలోనూ, అటుహైకమాండ్కు తలనొప్పిగా మారినట్టు పలువురు వ్యాఖ్యానించారు. డీఎండీకే కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తిరుత్తణికి చెందిన సీనియర్ నేత కృష్ణమూర్తికి పదవి దక్కే అవకాశం వుండగా, పదవి కోసం పలువురు పోటీ పడుతుండడంతో పోటాపోటీ నెలకొంది. -
బీజేపీతో కెప్టెన్ దోస్తీ
భారతీయ జనతా పార్టీతో డీఎండీకే అధినేత విజయకాంత్ దోస్తీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పొత్తు ఖరారుపై మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది . డీఎండీకేతో పొత్తుకోసం అన్ని ప్రయత్నాలు చేసి భంగపడిన బీజేపీ మళ్లీ చర్చలు ప్రారంభించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, ప్రధాన కార్యదర్శి ఎస్ మోహన్‌రాజు రెండు రోజులుగా విజయకాంత్, ఆయన భార్య ప్రేమలతతో మంతనాలు జరుపుతున్నారు. రెండు పార్టీల్లో నెలకొన్న పంతా లు పొత్తు చర్చల ప్రతిష్ఠంభనకు దారితీశాయి. అయితే విజయకాంత్ ఒక మెట్టుదిగివచ్చి తొలుత డిమాండ్ చేసిన 20 స్థానాలను వదిలి 14 స్థానాలను కోరుతున్నారు. అయితే 12 స్థానాలు కేటాయించేందుకు బీజేపీ సుముఖం గా ఉంది. బీజేపీ కూటమిలో ఇప్పటికే ఎండీఎంకే, పీఎంకే, కొంగునాడు, ఇండియ జననాయక కట్చి తదితర పార్టీలు ఉన్నాయి. ఎండీఎంకే 10 స్థానాలు, పీఎంకే 12, తన మిత్రపక్షానికి 2 కోరుతున్నారుు. ఈ పార్టీలన్నింటీకి పంపాలు జరపాల్సి ఉందని బీజేపీ నేతలు కెప్టెన్‌కు నచ్చజెప్పారు. చర్చలు దాదాపు ఒక కొలిక్కి వచ్చిన దశలో పొత్తుపై మరో రెండురోజుల్లో అధికారిక ప్రకటన వెలువడయ్యే అవకాశం ఉంది. అన్బుమణి ఆగ్రహం : డీఎండీకేతో పొత్తు కోసం తమకు కేటాయించాల్సిన స్థానాల్లో కోత విధించడంపై పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ కుమారుడు అన్బుమణి రాందాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమతో పొత్తు ఖరారై 20 రోజులు దాటుతున్నా కెప్టెన్ కోసం తమ అంశాన్ని పెండింగ్‌లో పెట్టారని ఆయన విమర్శిస్తున్నారు. తమ పార్టీతో పొత్తు చర్చలు జరిపినప్పటి సామరస్య ధోరణి నేడు కరువైందని అన్నారు. తమ పార్టీకి 10, తమ మిత్రపక్షాలకు కనీసం రెండు స్థానాలకు తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో పార్టీకోసం జరుపుతున్న పాకులాటలో తమను బలిపశువును చేయడం తగదని ఆయన వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేతో పొత్తు ఖరారుచేసుకున్న సీపీఐ తమ పార్టీ నేతలకు కేటాయించాల్సిన స్థానాలపై శనివారం మూడో దశ చర్చలను పూర్తిచేసింది. అయితే ఇంకా స్థానాలపై స్పష్టత రాలేదు.