అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో డీఎండీకే న్యాయవాది పిటిషన్ దాఖలు
టీనగర్: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో డీఎండీకే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత నిర్దోషిగా విడుదలయ్యారు. దీంతో మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జయలలిత పదవి చేపట్టనున్నారు. ఇలావుండగా డీఎండీకే న్యాయవాది జీఎస్ మణి సుప్రీంకోర్టు లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో కర్ణాటక హైకోర్టు జయలలితను విడుదల చేస్తూ అందజేసిన తీర్పులో లోపాలు ఉన్నాయని తెలిపా రు. కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదా? హైకోర్టు తీర్పు సరైనదా? అనే విషయాన్ని సుప్రీంకోర్టు ఖరారు చేయాల న్నారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు జయలలిత ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడానికి స్టే విధించాలని కోరారు. ఇదివరకే సంఘ సేవకుడు ట్రాఫిక్ రామసామి ఇదే తర హా పిటిషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేసివుండడం గమనార్హం.